Nicholas Pooran
-
విధ్వంసకర వీరులు.. పంత్‌కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా?
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో 2022లో అరంగేట్రం చేసింది. వరుసగా రెండు (2022, 2023) సీజన్లలో మూడో స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్ చేరింది. అయితే, గతేడాది మాత్రం లక్నోకు ఎదురు దెబ్బతగిలింది. తొలిసారిగా ఐపీఎల్లో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో 14 పాయింట్లతో ఏడవ స్థానంతో ముగించింది.ఈ నేపథ్యంలో 2025 సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు చేపట్టింది. ఐపీఎల్ మెగా వేలం ఇందుకు అనువుగా ఉపయోగించుకుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (గురువారం)న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో లక్నో సూపర్ జెయింట్స్ తన ఐపీఎల్ టైటిల్ వేట ప్రారంభిస్తుంది.భారీ మార్పులతో కొత్త సీజన్లోకి ప్రారంభంలో నికోలస్ పూరన్ (Nicholas Pooran), రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్ వంటి ఆటగాళ్ళని రెటైన్ చేసుకుంది. అయితే అనూహ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను తప్పించాలని నిర్ణయించింది. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రూ. 27 కోట్ల భారీ బిడ్‌తో కొనుగోలుచేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో నే అత్యంత ఖరీదైన ఒప్పందంగా రికార్డ్ నెలకొల్పింది.ఇంకా వేలంలో డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ మరియు మిచెల్ మార్ష్ వంటి విదేశీ ఆటగాళ్ల ను జట్టులో చేర్చుకుంది. వీరు కాక అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్ వంటి వారిని కూడా తీసుకున్నారు. విధ్వంసకర ఆటగాళ్లు.. ఫైనల్ చేరేనా?రిషబ్ పంత్‌తో పటు విధ్వంసకర ఆటగాళ్లుగా పేరుపొందిన మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు ఉన్నందున లక్నో జట్టు బ్యాటింగ్ ఫైర్ పవర్ పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు.ఇంకా ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్ జట్టు కు సమతుల్యతను తెస్తారు. అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ఏ బ్యాటింగ్ లైనప్‌నైనా కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ మార్పులు తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ నాయకత్వంలో ఐపీఎల్ ఫైనల్‌కి చేరాలని లక్నో ఆశిస్తోంది.గంభీర్ వెళ్లిపోయిన తర్వాతఅలాగే, 2024 సీజన్ ప్రారంభంలో మెంటార్ గౌతమ్ గంభీర్ జట్టును విడిచిపెట్టి కోల్‌కతాలో చేరాడు. గంభీర్ రెండు సీజన్ లలో లక్నో జట్టుకు మెంటార్ గా పనిచేసాడు. ఇప్పుడు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా లెజెండ్ లాన్స్ క్లూసెనర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా చేర్చుకోవడం ద్వారా కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జస్టిన్ లాంగర్ నాయకత్వంలో క్లూసెనర్ నైపుణ్యం ఉండటంతో, లక్నో చివరి అడ్డంకులను అధిగమించి రాబోయే సీజన్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లురిషబ్ పంత్లక్నో సూపర్ జెయింట్స్ బిడ్డింగ్ పోరులో విజయం సాధించి, రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఈ చారిత్రాత్మక బిడ్‌లో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, పంత్‌ను టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిపింది. పంత్ చేరికతో లక్నో వ్యూహం, స్వరూపం పూర్తిగా మారే అవకాశముంది.నికోలస్ పూరన్ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ తన అసాధారణ ప్రతిభ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. అందుకే లక్నో ఈ ఆటగాడ్ని వేలానికి ముందే రెటైన్ చేసుకుంది. 76 ఐపీఎల్ మ్యాచ్ లలో పూరన్ 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 1,769 పరుగులు చేశాడు, తొమ్మిది అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతని అపార సామర్థ్యం కారణంగా జట్టులో కీలకమైన ఆటగాడనడంలో సందేహం లేదు.డేవిడ్ మిల్లర్మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే డేవిడ్ మిల్లర్ ఇప్పటికే మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 130 ఐపీఎల్ మ్యాచ్ లలో 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో దాదాపు 140 స్ట్రైక్ రేట్ తో 2,924 పరుగులు చేశాడు.మయాంక్ యాదవ్మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో లక్నోకి కీలకమైన ఆటగాడిగా ఉండే అవకాశముంది. లక్నో రూ. 11 కోట్లకు మయాంక్ యాదవ్ ను కొనుగోలు చేసింది. వేగం, వైవిధ్యం మయాంక్ సొత్తు. కొత్త బంతితో పాటు డెత్ బౌలింగ్‌లో కూడా మయాంక్ బాగా రాణించగలనని ఇప్పటికే నిరూపించాడు.ఆయుష్ బదోనిలక్నో జట్టుతో చేరినప్పటి నుంచి ఆయుష్ బదోని తన క్రికెట్ కెరీర్లో భారీ పురోగతి సాధించాడు. 25 ఏళ్ల ఈ స్టైలిష్ బ్యాటర్ 2022 సీజన్లో రెండు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం ద్వారా ఫ్రాంచైజీపై తనదైన ముద్ర వేశాడు. అయితే, టోర్నమెంట్ కొనసాగే కొద్దీ అతని ఫామ్ క్షీణించింది. కొద్దిగా నిలకడ తగ్గినప్పటికీ లక్నో అతన్ని రెటైన్ చేయాలని నిర్ణయించింది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టులక్నో సూపర్ జెయింట్స్ జట్టునికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొసిన్ ఖాన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్, హిమ్మత్ సింగ్, ఎం. సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, షెహబాజ్ అహ్మద్, షమార్ జోసెఫ్, అర్షిన్ కులకర్ణి, మాథ్యూ బ్రీట్జ్కే. చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా Never give up the superpower 👊 pic.twitter.com/NtahEerR2x— Lucknow Super Giants (@LucknowIPL) March 19, 2025 -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం చెపాక్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ పరాజయం పాలైంది. తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఇంగ్లండ్.. రెండో టీ20లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆఖరి ఓవర్ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ విరోచత పోరాటం వల్ల ఇంగ్లండ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేసి మరోసారి తృటిలో హాఫ్ సెంచరీ అవకాశాన్ని జోస్ కోల్పోయాడు. అయితే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించకపోయినప్పటికి ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.పూరన్ రికార్డు బద్దలు..భారత్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ కెప్టెన్ టీ20ల్లో భారత్‌పై ఇప్పటివరకు 611 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ పేరిట ఉండేది.పూరన్ టీ20ల్లో టీమిండియాపై 592 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో పూరన్ ఆల్‌టైమ్ రికార్డును బట్లర్ బ్రేక్ చేశాడు. అవేవిధంగా బట్లర టీ20ల్లో భారత్‌పై అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన రికార్డును నికోలస్ పూరన్‌తో కలిసి సంయుక్తంగా కలిగి ఉన్నాడు.టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..జోస్ బట్లర్- 611నికోలస్ పూరన్- 592గ్లెన్ మాక్స్వెల్- 574డేవిడ్ మిల్లర్- 524ఆరోన్ ఫించ్- 500చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సూర్య -
పూరన్ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. హోప్ సెంచరీ వృధా
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ బోణీ కొట్టింది. దుబాయ్ క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (52 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (29 బంతుల్లో 59; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ అర డజను సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పోలార్డ్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ వసీం (18) రెండంకెల స్కోర్లు చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓలీ స్టోన్ 2, చమీరా ఓ వికెట్ దక్కించుకున్నారు.హోప్ సెంచరీ వృధాఛేదనలో క్యాపిటల్స్ ఓపెనర్ షాయ్ హోప్ (59 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హోప్‌కు మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ డంక్ (10), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (16), గుల్బదిన్ నైబ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సికందర్ రజా (6), దుసన్ షనక (0) విఫలమయ్యారు. క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూఖీ, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్కిల్, అల్లా ఘజన్ఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. క్యాపిటల్స్ చేసిన స్కోర్‌లో హోప్ ఒక్కడే మూడొంతులు చేయడం విశేషం. 161 పరుగుల్లో హోప్ 101 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు, ఎక్స్‌ట్రాల రూపంలో 60 పరుగులు వచ్చాయి. -
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. పూరన్, పోలార్డ్ కూడా ఏమీ చేయలేకపోయారు..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్ పావెల్ (25), దసున్ షనక (13), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్ హోప్ 9, రొస్సింగ్టన్ 9, గుల్బదిన్ నైబ్ 2, ఫర్హాన్ ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్, జహూర్ ఖాన్‌కు తలో వికెట్ దక్కింది.స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్‌కు అకీల్ హొసేన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్లో కీరన్ పోలార్డ్ (15 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. దుబాయ్ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, అల్జరీ జోసఫ్ డకౌట్లు కాగా.. కుసాల్ పెరీరా 12, టామ్ బాంటన్ 7 పరుగులు చేశారు.గెలుపు దూరం చేసిన గుల్బదిన్ నైబ్, ఓల్లీ స్టోన్ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్ నైబ్ (4-0-13-3, ఓల్లీ స్టోన్ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్ వేసిన గుల్బదిన్ నైబ్ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్, అల్జరీ జోసఫ్) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్ వేసిన ఓల్లీ స్టోన్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్ ఖాన్ బౌలింగ్‌లో పోలార్డ్ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్ నైబ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
IPL 2025: పంత్ ఒక్కడే కాదు.. ఆ ముగ్గురూ కెప్టెన్ ఆప్షన్లు: సంజీవ్ గోయెంకా
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు?!.. ఇంకెవరు రిషభ్ పంత్ అంటారా?!.. ఆగండాగండి.. ఇప్పుడే అలా డిసైడ్ చేసేయకండి.. ఈ మాట అంటున్నది స్వయానా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా. తమ జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రూ. 27 కోట్లకు కొనుగోలుకాగా మెగా వేలానికి ముందు లక్నో.. వెస్టిండీస్ స్టార్ నికోలసన్ పూరన్ కోసం ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చుచేసిన విషయం తెలిసిందే. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది. అయితే, వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో పంత్ ధర రూ. 20 కోట్లకు చేరగా.. లక్నో ఒక్కసారిగా ఏడు కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్‌గా పంత్ నియామకం లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషభేనా లేదంటే మాకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అని చోప్రా ప్రశ్నించాడు.నలుగురు ఉన్నారుఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నా వరకైతే సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే, మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తాం. మా జట్టులో రిషభ్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్ష్ రూపంలో నలుగురు నాయకులు అందుబాటులో ఉన్నారు’’ అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి.. నికోలస్ పూరన్‌కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.వారే డిసైడ్ చేస్తారుఇక పంత్ ఓపెనర్‌గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయెంకా సమాధానమిస్తూ.. ‘‘మా మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్(గుజరాత్ రూ, 15.75 కోట్లు) కోసం ప్రయత్నించాం. కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్ జోడీపై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, మా కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు.కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంఛైజీకి మూడు సీజన్లపాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. అయితే, ఈ ఏడాది మాత్రం టాప్-4లో నిలపలేకపోయాడు. ఈ క్రమంలో రిటెన్షన్‌కు ముందు లక్నో రాహుల్‌ను వదిలేయగా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుక్కుంది.చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న వెస్టిండీస్.. ఇప్పుడు అదే జట్టుతో టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విండీస్ తలపడనుంది. బార్బోడస్ వేదికగా నవంబర్ 9 (శనివారం) నుంచి జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో మొదటి రెండు టీ20లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షిమ్రాన్ హెట్మెయర్లు తిరిగి జట్టులో చేరారు. వీరు ముగ్గురు గత నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు.మరోవైపు ఫాబియన్ అలెన్, అలిక్ అథానాజ్, ఆండ్రీ ఫ్లెచర్, షమర్ స్ప్రింగర్లు ఈ జట్టులో చోటు దక్కించలేకపోయారు. అదేవిధంగా స్టార్ పేసర్ జోషఫ్పై నిషేధం పడడటంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, టెరెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రోథర్ఫోర్డ్,వెస్టిండీస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
IPL 2025: నికోలస్ పూరన్‌కు 18 కోట్లు..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు తమతమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. అక్టోబర్ 31 రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి డెడ్ లైన్ అని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది.రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ తమ రిటైన్ లిస్ట్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. అన్ని ఫ్రాంచైజీల బాటలోనే లక్నో సూపర్ జెయింట్స్ కూడా నడుస్తుంది. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటైన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు సమాచారం.అయితే ఎల్ఎస్జీ ఈసారి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే రిటైన్ లిస్ట్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ చాయిస్ కింద నికోలస్ పూరన్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పూరన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు కూడా కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇదే కరెక్ట్ అయితే పూరన్‌కు పారితోషికం కింద రూ. 18 కోట్లు దక్కనున్నాయి.ఎల్ఎస్జీ.. పూరన్‌తో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్‌లను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీ మయాంక్ యాదవ్‌ను సెకెండ్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మయాంక్ యాదవ్‌కు రూ. 14 కోట్లు దక్కనున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన మయాంక్ కేవలం 4 మ్యాచ్‌లే ఆడాడు. ఇందులో 7 వికెట్లు పడగొట్టాడు. -
SL vs WI: విండీస్ హార్డ్ హిట్టర్స్ దూరం.. పదిహేడేళ్ల కుర్రాడికి చోటు
శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. రోవ్‌మన్ పావెల్ సారథ్యంలో టీ20 జట్టు.. షాయీ హోప్ కెప్టెన్సీలో వన్డే జట్టు లంక పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపింది. స్టార్ ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కానుండగా.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఈ జట్లలో చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది.కాగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్టోబరు 13- 26 మధ్య మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు శనివారం జట్లను ప్రకటించిగా.. టీ20 జట్టులో కొత్తగా టెర్రెన్స్ హిండ్స్, షామార్ స్ప్రింగర్ చోటు దక్కించుకున్నారు.కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటికరేబియన్ ప్రీమియర్ లీగ్-2024(సీపీఎల్)లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రైటార్మ్ పేసర్ హిండ్స్.. ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు తీశాడు. ఇక స్ప్రింగర్ కూడా కుడిచేతి వాటం పేసరే. 18 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు.వీరిద్దరితో పాటు.. పదిహేడేళ్ల వికెట్ కీపర్ జువెల్ ఆండ్రూకు కూడా విండీస్ సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. అయితే, అతడిని వన్డే జట్టుకు ఎంపిక చేయడం గమనార్హం. జువెల్ ఇప్పటి వరకు మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లలో కలిపి 165 పరుగులు సాధించాడు.స్టార్లు దూరం.. యువ ఆటగాళ్ల పాలిట వరంశ్రీలంకతో సిరీస్‌లకు విధ్వంసకర వీరులు నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, షిమ్రన్ హెట్మెయిర్, స్పిన్నర్ అకీల్ హొసేన్ దూరమయ్యారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో వీరంతా విశ్రాంతి కావాలని కోరగా.. అందుకు తాము సమ్మతించినట్లు వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ చెప్పాడు.శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, అలిక్ అథనేజ్, ఆండ్రీ ఫ్లెచర్, టెర్రెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షామార్ స్ప్రింగర్శ్రీలంకతో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుషాయీ హోప్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జువెల్ ఆండ్రూ, అలిక్ అథనేజ్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్.చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్ -
పూరన్ సుడిగాలి శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024 చివరి లీగ్ దశ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నికోలస్ పూరన్ సుడిగాలి శతకంతో (59 బంతుల్లో 101; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. HUNDRED FOR NICHOLAS POORAN IN CPL...!!!! 🙇- Pooran is a beast in T20s, What a remarkable consistency. pic.twitter.com/2gn9VaD5c6— Johns. (@CricCrazyJohns) September 30, 2024జేసన్ రాయ్ (26 బంతుల్లో 34), కీసీ కార్తీ (13 బంతుల్లో 27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. పోలార్డ్ 19, రసెల్ 9, టిమ్ డేవిడ్, పార్రిస్ డకౌట్ అయ్యారు. వారియర్స్ బౌలర్లలో షమార్ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ తాహిర్, ప్రిటోరియస్ తలో వికెట్ దక్కించుకున్నారు.137 పరుగులకే కుప్పకూలిన వారియర్స్212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ 137 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూలింది. టెర్రన్స్ హిండ్స్, వకార్ సలాంకీల్, నాథన్ ఎడ్వర్డ్స్ తలో మూడు వికెట్లు తీసి వారియర్స్‌ను దెబ్బకొట్టారు. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (36), షాయ్ హోప్ (28), గుడకేశ్ మోటీ (26 నాటౌట్), ఇమ్రాన్ తాహిర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెట్‌మైర్ (9), కీమో పాల్ (1), మొయిన్ అలీ (5), రొమారియో షెపర్డ్ (0), ప్రిటోరియస్ (0) విఫలమయ్యారు.ఈ మ్యాచ్ ఫలితంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-1లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. అక్టోబర్ 1న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ట్రిన్బ్రాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ తలపడనుండగా.. అక్టోబర్ 2న జరిగే క్వాలిఫయర్-1లో గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాక గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచాయి.చదవండి: చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం -
నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ టీ20 క్రికెట్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. తాజా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. శనివారం సీపీఎల్‌లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన పూరన్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్‌ల్లో 42.02 సగటుతో 2,059 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. కాగా ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో 45 టీ20 ఇన్నింగ్స్‌లలో 2,036 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో రిజ్వాన్ ఆల్‌టైమ్ రికార్డును ఈ కరేబియన్ విధ్వంసకర వీరుడు బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో టీ20ల్లో వెస్టిండీస్, డర్బన్ సూపర్ జెయింట్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్‌పూర్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్లకు పూరన్ ప్రాతినిథ్యం వహించాడు. -
చరిత్ర సృష్టించిన పూరన్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో ఓ అరుదైన సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న పూరన్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదిన పూరన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 63 ఇన్నింగ్స్‌లు ఆడి 151 సిక్సర్లు బాదాడు. పూరన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు 21 సిక్సర్లు బాదాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో పూరన్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 135.. 2012లో 121 సిక్సర్లు బాదాడు.పేట్రియాట్స్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసిన పూరన్.. మరో అరుదైన ఘనత కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పూరన్ ఈ ఏడాది టీ20ల్లో 2022 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 48 ఇన్నింగ్స్‌ల్లో 2036 పరుగులు చేశాడు. పూరన్ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్ ఉన్నాడు. హేల్స్ 2022లో 61 మ్యాచ్‌లు ఆడి 1946 పరుగులు చేశాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (పూరన్ జట్టు) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు.అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పూరన్‌తో పాటు జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.కాగా, ఈ మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
నికోలస్ పూరన్ ఊచకోత.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. రిలీ రొస్సో 20, మికైల్ లూయిస్ 10, ఎవిన్ లూయిస్ 2 పరుగులు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 2, జేడన్ సీల్స్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.THE NICHOLAS POORAN SHOW IN CPL.- 93* (43) with 6 fours and 7 sixes, the unreal dominance of Pooran. 🤯pic.twitter.com/k1f0CYfCaj— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2024అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కీసీ కార్టీ 13, టిమ్ డేవిడ్ 9, కీరన్ పోలార్డ్ 10 పరుగులు చేశారు. పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుత మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్.. సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసిన వెస్టిండీస్
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను అక్కడితో ఆపేశారు. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన విండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.రాణించిన షెపర్డ్తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రికెల్టన్ (27), మార్క్రమ్ (20), ట్రిస్టన్ స్టబ్స్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రాణించాడు. అకీల్ హొసేన్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ దుబారాగా బంతులు వేస్ట్ చేశాడు. హెండ్రిక్స్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్ వేగంగా పరుగులు చేయడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ తన కోటా రెండు ఓవర్లలో ఓ మెయిడిన్ వేశాడు.సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్109 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. నికోలస్ పూరన్ (13 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (17 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో అతను 205.17 స్ట్రయిక్‌రేట్‌తో 12 సిక్సర్లు బాదాడు. -
లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్‌బై!.. రేసులో ఆ ఇద్దరు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ స్థానంలో మరో సీనియర్ ప్లేయర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఫ్రాంఛైజీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వేలం నేపథ్యంలో రిటెన్షన్ విధివిధానాలపై బీసీసీఐ స్పష్టతనిచ్చిన తర్వాత ఇందుకు సంబంధించి లక్నో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.కెప్టెన్‌గా విఫలంకాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన లక్నో జట్టుకు ఆది నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండు సీజన్లలో టీమ్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన ఈ కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆటగాడిగా 520 పరుగులతో పర్వాలేదనపించినా కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. లక్నోతోనే రాహుల్.. కానీఈ క్రమంలో లక్నో ఈసారి పద్నాలుగింట కేవలం ఏడు మాత్రమే గెలిచి ఏడోస్థానానికి పరిమితమైంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంక బహిరంగంగానే రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు రాగా.. సోమవారం సంజీవ్ గోయెంకాతో భేటీ అయిన రాహుల్ తాను జట్టుతోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు. రేసులో ఆ ఇద్దరుఈ క్రమంలో లక్నో జట్టు సంబంధిత వర్గాలు వార్తా సంస్థ IANSతో ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘సీఈఓ సంజీవ్ గోయెంకాతో రాహుల్ అధికారికంగానే భేటీ అయ్యాడు. రిటెన్షన్ గురించి చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది కెప్టెన్‌గా ఉండటానికి రాహుల్ విముఖత చూపాడు. బ్యాటర్‌గా తాను మరింతగా రాణించేందుకు సారథ్య బాధ్యతలు వదులుకోవాలని భావిస్తున్నాడు. నిజానికి రాహుల్ కెప్టెన్సీ పట్ల గోయెంకాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే, తను మాత్రం అందుకు సిద్ధంగా లేడు.లక్నో రాహుల్‌ను రిటైన్ చేసుకోవడం ఖాయం. అయితే, కెప్టెన్‌గా ఉండడు. బీసీసీఐ విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత ఈ అంశంపై మేము నిర్ణయం తీసుకుంటాం. అయితే, ఇప్పటికి కెప్టెన్సీ రేసులో కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ ఉన్నారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీతో కేఎల్ రాహుల్ బిజీ కానున్నాడు.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటన -
సిక్సర్ల వర్షం.. సూర్యకుమార్ రికార్డు బ్రేక్ చేసిన పూరన్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 175 పరుగుల లక్ష్య చేధనలో సఫారీ బౌలర్లను పూరన్ ఊచకోత కోశాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా విండీస్ లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.సూర్యను అధిగమించిన పూరన్.. ఇక మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో పూరన్ మూడో స్ధానానికి ఎగబాకాడు. 96 టీ20ల్లో 139 సిక్స్‌లు బాదిన ఈ కరేబియన్ వీరుడు.. మోస్ట్ సిక్స్‌ల జాబితాలో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(137), టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(136)ను పూరన్ అధిగమించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ(205) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. -
నికోలస్ పూరన్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన వెస్టిండీస్
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని కరేబియన్లు ఊదిపడేశారు. 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విండీస్ ఛేదించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ ఓపెనర్లు అలిక్ అథ్నాజ్(40), షాయ్ హోప్(51) పరుగులతో అద్బుత ఆరంభాన్ని అందిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో బార్టమన్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.రాణించిన స్టబ్స్..అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో పట్రిక్ కుర్గర్(44) పర్వాలేదన్పించాడు. విండీస్ బౌలర్లలో ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్ రెండు, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 25న ట్రినిడాడ్ వేదికగానే జరగనుంది. -
113 మీటర్ల భారీ సిక్సర్! (వీడియో)
ది హాండ్రడ్ లీగ్-2024లో వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నికోలస్ పూరన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.ఆదివారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 153 పరుగుల లక్ష్య చేధనలో మాంచెస్టర్ బౌలర్లను ఈ కరేబియన్ బ్యాటర్ ఊచకోత కోశాడు. 33 బంతులలో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. నార్త్రన్ ఇన్నింగ్స్ 74వ బంతిని స్కాట్ క్యూరీ.. పూరన్‌కు సరిగ్గా స్లాట్‌లో సంధించాడు. ఈ క్రమంలో పూరన్ కాస్త క్రీజు నుంచి డీప్‌గా వెళ్లి మిడ్ వికెట్‌పై నుంచి 113 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.అతడి పవర్ బంతి ఏకంగా స్టేడియం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో మాంచెస్టర్‌పై నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ విజయం సాధించింది. 🤯 113-METRE 6️⃣ OUT THE GROUND! 🤯Oh, Nicholas Pooran! 🤩#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/LDayQyjKAT— The Hundred (@thehundred) August 11, 2024 -
విధ్వంసం సృష్టించిన పూరన్
హండ్రెడ్ లీగ్‌లో భాగంగా సథరన్ బ్రేవ్‌తో నిన్న (జులై 30) జరిగిన మ్యాచ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్ (28), జేమ్స్ కోల్స్ (26), కీరన్ పోలార్డ్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో పార్కిన్సన్ 2, జోర్డన్ క్లార్క్, పాట్స్, సాంట్నర్, ఆదిల్ రషీద్, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (34 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడటంతో 85 బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో అకీల్ హొసేన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్ తలో వికెట్ పడగొట్టారు.నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, సథరన్ బ్రేవ్ మధ్య నిన్న జరిగిన మహిళల హండ్రెడ్ లీగ్ మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు నిర్ణీత 100 బంతుల్లో 100 పరుగులు చేశారు. హండ్రెడ్ లీగ్‌లో సూపర్ ఓవర్ రూల్ లేకపోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. -
పూరన్ ఊచకోత.. తొలి మ్యాచ్‌లో ముంబై టీమ్ ఘన విజయం
మేజర్ లీగ్ క్రికెట్(MLC) 2024 సీజన్‌ను ఎంఐ న్యూయర్క్ ఘనంగా ఆరంభించింది. స్ట్రీట్ పార్క్ స్టేడియం వేదికగా సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయర్క్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ ఎంఐ బౌలర్ల దాటికి కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. న్యూయర్క్ బౌలర్లలో రషీద్ ఖాన్, బౌల్డ్ చెరో మూడు వికెట్ల పడగొట్టి.. సీటెల్ ఓర్కాస్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు పొలార్డ్ రెండు వికెట్లు, ఇషాన్ అదిల్, నోకియా తలా వికెట్ సాధించారు. సీటెల్ ఇన్నింగ్స్‌లో శుబమ్ రంజనే(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.విధ్వంసం సృష్టించిన పూరన్..ఇక 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ న్యూయర్క్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఎంఐ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేసిం ఆజేయంగా నిలిచాడు. సీటెల్ బౌలర్లలో గనూన్ రెండు వికెట్లు, బర్గర్, జహీర్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
టీ20 వరల్డ్‌కప్‌లో సిక్సర్ల సునామీ.. మనోళ్లు ఒక్కరూ లేరు!
అమెరికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు.కేవలం 39 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించాడు.ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్ అంటే పూనకం వచ్చినట్లుగా బ్యాట్‌తో రెచ్చిపోయే విండీస్ వీరుల జాబితాలో చేరాడు.ఇక బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అద్బుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్(3/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బ్యాటర్ల సిక్సర్ల హవాఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 11.. ఇంగ్లండ్ మీద👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 10.. సౌతాఫ్రికా మీద👉ఆరోన్ జోన్స్(అమెరికా)- 10.. కెనడా మీద👉రిలీ రొసోవ్(సౌతాఫ్రికా)-8.. బంగ్లాదేశ్ మీద👉నికోలస్ పూరన్(వెస్టిండీస్)-8.. అఫ్గనిస్తాన్ మీద👉షాయీ హోప్(వెస్టిండీస్)-8.. అమెరికా మీద..టీ20 వరల్డ్‌కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు👉నికోలసన్ పూరన్(వెస్టిండీస్)- 17(2024 ఇప్పటి వరకు)👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 16(2012)👉మార్లన్ సామ్యూల్స్- 15(2012)👉షేన్ వాట్సన్- 15(2012). చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి! View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: విండీస్ ఓపెనర్ విధ్వంసం.. అమెరికా చిత్తు
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది. సొంతగడ్డపై జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లలో.. గ్రూప్-2లో భాగమైన వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్ జట్టు.. అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్.. అమెరికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.చెలరేగిన బౌలర్లుఅయితే, విండీస్ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లలో స్టీవెన్ టేలర్(2) పూర్తిగా నిరాశపరచగా.. ఆండ్రీస్ గౌస్ 29 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఎన్ఆర్ కుమార్ 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు.మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు ఆండ్రీ రసెల్ మూడు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ చేజ్(3/19) పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా.. గుడకేశ్ మోటికి ఒక వికెట్ దక్కింది.ఆకాశమే హద్దుగా ఇక లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫక్షర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 15, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షాయీ హోప్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.విండీస్ సెమీస్ ఆశలు సజీవంషాయీ హోప్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ నెట్ రన్‌రేటు(+1.814)ను భారీగా పెంచుకుంది. గ్రూప్-2 టాపర్ సౌతాఫ్రికా(4 పాయింట్లు, నెట్ రన్టేరు +0.625), ఇంగ్లండ్(2 పాయింట్లు, నెట్ రన్‌రేటు +0.412)ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు.. అమెరికా ఆడిన రెండింట ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... View this post on Instagram A post shared by ICC (@icc) -
98 పరుగుల వద్ద.. రనౌట్ కావాలని కోరుకోరు కదా!
కఠిన శ్రమ, త్యాగాల ఫలితమే టీ20 ఫార్మాట్లో తన విజయానికి కారణమని వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అన్నాడు. పొట్టి ఫార్మాట్లో విండీస్ తరఫున దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పూరన్ దంచికొట్టిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా 53 బంతుల్లో 98 పరుగులు చేసిన పూరన్.. దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.అలా సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితే, క్రిస్ గేల్‌ను అధిగమించి విండీస్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ స్పందిస్తూ.. ‘‘98 పరుగుల వద్ద అవుటవ్వాలని ఎవరూ కోరుకోరు. గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయాలనే తొందరలో అలా జరిగిపోయింది.ఏదేమైనా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్రిస్ గేల్ మాదిరి ప్రేక్షకులకు వినోదం పంచడం నాకెంతో ఇష్టం. ఇక ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతాను’’ అని నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభంలో పూరన్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌పై 17, ఉగాండాపై 22, పపువా న్యూగినియాపై 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఆఖరి మ్యాచ్‌లో.. అసలైన మజాటీ20 ప్రపంచకప్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో క్రికెట్ ప్రేక్షకులకు అసలైన మజా లభించింది. నామమాత్రమైన మ్యాచ్‌లో కరీబియన్ హిట్టర్ నికోలస్ పూరన్ (53 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) అఫ్గానిస్తాన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అతని వీరవిహారంతో ఈ టి20 ప్రపంచకప్‌లోనే ఆతిథ్య వెస్టిండీస్ అత్యధిక స్కోరు నమోదు చేసింది.ఇప్పటికే ఇరుజట్లు తదుపరి ‘సూపర్–8’ దశకు అర్హత సంపాదించాయి. దీంతో గ్రూప్ ‘సి’లో ఎవరికీ ఫలితంతో పని లేని ఈ మ్యాచ్‌లో విండీస్ 104 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన అఫ్గాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఒకే ఓవర్లో 36 పరుగులు... విండీస్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) రెండో ఓవర్లో నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (27 బంతుల్లో 43; 8 ఫోర్లు)తో జతకట్టిన పూరన్... అఫ్గాన్‌పై విధ్వంసరచన చేశాడు. దీంతో జట్టు స్కోరు కేవలం 3.1 ఓవర్లలోనే 50 దాటింది.అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఈ నాలుగో ఓవర్లోనే ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను పూర్తిగా పూరనే ఎదుర్కొని 6, నోబ్+4, వైడ్+4, 0, లెగ్‌బై 4, 4, 6, 6లతో చుక్కలు చూపించాడు. ఈ మెరుపుల తుఫాన్‌తో కరీబియన్ జట్టు పవర్ ప్లే (6 ఓవర్లు)లో 92/1 స్కోరు చేసింది. 7.4 ఓవర్లలో జట్టు స్కోరు 100 దాటాక చార్లెస్ అవుటయ్యాడు. 37 బంతుల్లో 80 పరుగుల ధనాధన్ భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి షై హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) రావడంతో పూరన్ 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే హోప్ అవుట్ కావడంతో కెపె్టన్ రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ధాటిగానే ఆడాడు. ఆఖర్లో కెపె్టన్ రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్‌ను అసాంతం ఆడిన పూరన్ 0, 6, 4, 6, 2, 6లతో 24 పరుగులు సాధించాడు.ఈ వేగంలో విండీస్ 19వ ఓవర్లో 200 పరుగుల మైలురాయిని దాటింది. కానీ ఆఖరి ఓవర్లో సెంచరీకి 2 పరుగుల దూరంలో పూరన్ రనౌటయ్యాడు. గుల్బదిన్ నైబ్కు 2 వికెట్లు దక్కగా, అజ్మతులా ఒమర్జాయ్, నవీనుల్ హక్ చెరో వికెట్ తీశారు. అఫ్గాన్ టపటపా... అనంతరం అసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 16.2 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (28 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, నాలుగో వరుస బ్యాటర్ అజ్మతుల్లా (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారంతే!ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. విండీస్ బౌలర్లలో పేసర్ ఒబెద్ మెకాయ్ 3 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు గుడకేశ్ మోతీ, అకిల్ హోసీన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా ‘సూపర్–8’ పోరుకు సమాయత్తమైంది. చదవండి: పిచ్ ఎలా ఉంది బుమ్రా?.. అయినా మాకిదే అలవాటే: రోహిత్ శర్మ -
T20 World Cup 2024: ఆ మూడు టీమ్‌లు ఒకవైపు.. పూరన్ ఒక్కడు ఒకవైపు..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గ్రూప్-సిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై అదే గ్రూప్‌కు చెందిన ఉగాండ, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా చేసిన స్కోర్ల కంటే.. విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ఒక్కడు (ఆఫ్ఘనిస్తాన్పై) చేసిన స్కోరే అధికంగా ఉంది.ఆఫ్ఘనిస్తాన్పై ఉగాండ 58 పరుగులకు, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకు ఆలౌట్ కాగా.. అదే ఆఫ్ఘనిస్తాన్పై పూరన్ ఒక్కడు 98 పరుగులు చేశాడు. జట్టు మొత్తం చేయలేని పరుగులు పూరన్ ఒక్కడు చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్ బౌలర్లపై (ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో) ఏ ఒక్క జట్టు కనీసం 100 పరుగుల మార్కును కూడా తాక లేకపోగా.. విండీస్ మాత్రం ఏకంగా 218 పరుగులు చేసింది.విండీస్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (98), జాన్సన్ ఛార్లెస్ (43), హోప్ (25), పావెల్ (26) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. విండీస్ బౌలర్ల ధాటికి 114 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా విండీస్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గ్రూప్-సి నుంచి విండీస్, ఆఫ్ఘనిస్తాన్ ఇదివరకే సూపర్-8కు క్వాలిఫై కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది.గ్రూప్-ఏ నుంచి భారత్ (A1), యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించగా,, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
అఫ్గాన్‌ను చిత్తు చేసిన విండీస్.. 104 పరుగుల తేడాతో ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించింది. సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది.219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్.. కరేబియన్ బౌలర్ల దాటికి 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అకిల్ హుస్సేన్, మోటీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రస్సెల్, జోషఫ్ కూడా చెరో వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయ్యారు.పూరన్ ఊచకోత..అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. కాగా గ్రూపు సి నుంచి అఫ్గానిస్తాన్, విండీస్ ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
పూరన్ విధ్వంసం.. టీ20 వరల్డ్‌కప్-2024లో భారీ స్కోర్
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో జూలు విదిల్చింది. సెయింట్ లూసియా వేదికగా గ్రూపు-సిలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు అదరగొట్టారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని పూరన్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. -
నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు విండీస్ తరపున 91 టీ20లు ఆడి 1914 పరుగులు చేశాడు. పూరన్ కెరీర్లో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. విండీస్ తరపున 79 మ్యాచ్‌లు ఆడిన గేల్ 1899 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గేల్ అల్‌టైమ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై 13 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది.దీంతో సూపర్-8కు కరేబియన్ జట్టు అర్హత సాధించింది. అదే విధంగా విండీస్ చేతిలో ఓటమి చవిచూసిన కివీస్.. తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
వామ్మో.. ఇదేమి సిక్స్‌రా బాబు! దెబ్బకు స్టేడియం బయటకు బంతి
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఆదివారం గయనా వేదికగా పాపువా న్యూ గినియా (PNG)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం విండీస్ విజయం సాధించింది. అయితే పీఎన్జీ విధించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిడానికి వెస్టిండీస్ తీవ్రంగా శ్రమించింది. 137 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అలై నౌ బౌలింగ్ లో జాన్సన్ చార్లెస్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత పూరన్, కింగ్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోస్టన్ చేజ్ చివరివరకు క్రీజులో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కరేబియన్ జట్టును గెలిపించాడు. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ 27 పరుగులు, రోమ్ మన్ పావెల్ 15, ఆండ్రీ రస్సెల్ 15 పరుగులతో రాణించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.పూరన్ భారీ సిక్సర్.. ఇక ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. విండీస్ ఇన్నింగ్స్ 6 ఓవర్ వేసిన పీఎన్జీ స్పిన్నర్ బౌ.. తొలి బంతిని ఓవర్‌పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో పూరన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి భారీ సిక్సర్ కొట్టాడు. పూరన్ పవర్‌కు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చదవండి: మేజర్ లీగ్ క్రికెట్లో ఆడనున్న సన్‌రైజర్స్ కెప్టెన్.. The man-in-form! 💥After patiently biding his time, #NicholasPooran unleashes with a MAXIMUM and a boundary! 💪🏻📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/A4rWKKcCk7— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్‌తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్‌మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్‌మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్‌వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్‌కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్‌లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్జీ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించారు. ఇందులో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో చేలరేగాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన 15 ఓవర్లో వరుస బంతుల్లో నికోల పూరన్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నారు. కేవలం 29 బంతుల్లో 75 పరుగులు నికోలస్ పూరన్ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. చివరికీ నువాన్ తుషార బౌలింగ్‌లో ఔటై వెనుదిరిగారు. అయితే ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు లక్నో సూపర్ జైయింట్స్కు సైతం దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేనట్లే. ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న లక్నోకు రన్‌రేట్ లేకపోవడం వారి అవకాశాలు దెబ్బతీసింది. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదు. కాగా.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. మరో స్థానం కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడుతున్నాయి. "De chauka de chakka. Aaj ho jaye, ho jaye, Dhoom Dhadaka" pic.twitter.com/f0gZiT3kjz— Lucknow Super Giants (@LucknowIPL) May 17, 2024 -
LSG Vs DC: కుల్దీప్ మ్యాజిక్ డెలివరీ.. పూరన్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన బంతితో మెరిశాడు. కుల్దీప్ అద్బుతమైన బంతితో లక్నో విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లక్నో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన కుల్దీప్ మూడో బంతికి మార్కస్ స్టోయినిష్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి పూరన్‌కు కుల్దీప్ ఆఫ్ స్టంప్ దిశగా అద్బుతమైన గూగ్లీని సంధించాడు. అయితే బంతి టర్న్ అవుతుందని భావించిన పూరన్ ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. గానీ బంతి ఎటువంటి టర్న్ కాకుండా బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చేసిన పూరన్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. కుల్దీప్ దెబ్బకు పూరన్ ఖాతాతెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ 3 వికెట్లతో సత్తాచాటాడు. 𝗪𝗔𝗧𝗖𝗛 𝗢𝗡 𝗟𝗢𝗢𝗣! 🔄 😍 Kuldeep Yadav straight away unveiling his magic!👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
పూరన్ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో వెస్టిండీస్ ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూరన్ కేవలం 21 బంతుల్లో 5 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 40 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పూరన్ కొట్టిన ఓ సిక్సర్ అందరిని షాక్ గురిచేసింది. లక్నో ఇన్నింగ్స్ 19 ఓవర్లో రీస్ టాప్లీ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 106 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పూరన్ 146 పరుగులు చేశాడు. 106m monstrous six! 🤯 Nicholas Pooran smashes one out of the park 💥 💯 sixes in #TATAIPL for the @LucknowIPL batter 💪 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE #RCBvLSG pic.twitter.com/7X0Yg4VbTn — IndianPremierLeague (@IPL) April 2, 2024 -
పాండ్యాకు బిగ్ షాక్..!?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు వైస్ కెప్టెన్‌గా విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లక్నో వెల్లడించింది. పూరన్‌కు నెం 29తో కూడిన వైస్ కెప్టెన్ జెర్సీని లక్నో సారథి కేఎల్ రాహుల్ అందించాడు. కాగా గత రెండు సీజన్లలో రాహుల్ డిప్యూటీగా వ్యవహరించిన స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా స్ధానాన్ని పూరన్ భర్తీ చేయనున్నాడు. ఇక నికోలస్ పూరన్ ప్రస్తుతం టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన యూఏఈ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కాగా ఐపీఎల్-2023 వేలంలో పూరన్‌ను రూ.16 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: స్ట్రైక్‌రేటు ఏకంగా 600.. అంతర్జాతీయ టీ20లలో ఇదే తొలిసారి? 🚨BREAKING🚨: Lucknow Super Giants have appointed Nicholas Pooran as the vice-captain for IPL 2024. 📸: LSG#IPL2024 #LSG pic.twitter.com/ZYtiqVm0Eb — CricTracker (@Cricketracker) February 29, 2024 -
పూనకాలు తెప్పించిన పూరన్.. మరో టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కైవసం చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన ఫైనల్లో ఎమిరేట్స్ టీమ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెబర్ (37 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీం (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో సికందర్ రజా, ఓలీ స్టోన్, జహీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. MI won the T20 league in India.MI won the T20 league in America.MI won the T20 league in Dubai. - MI franchise is ruling everywhere 🏆🫡 pic.twitter.com/ORTEE65GD0— Johns. (@CricCrazyJohns) February 17, 2024 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన దుబాయ్ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-20-2), విజయ్‌కాంత్ వియాస్కాంత్ (4-0-24-2) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు (7 వికెట్ల నష్టానికి) మాత్రమే చేయగలిగింది. అకీల్ హొసేన్, రోహిద్ ఖాన్, సలాంకీల్ తలో వికెట్ పడగొట్టారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40), టామ్ బాంటన్ (35), జేసన్ హోల్డర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టార్ ఆటగాళ్లు సికందర్ రజా (10), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన ముంబై కెప్టెన్ పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఇది తొమ్మిదో టైటిల్. MI won CLT20 in 2011MI won IPL in 2013MI won CLT20 in 2013MI won IPL in 2015MI won IPL in 2017MI won IPL in 2019MI won IPL in 2020MI won WPL in 2023MINY won MLC in 2023MIE won ILT20 in 2024The Dominance of MI franchise. 🤯🔥 pic.twitter.com/GcGDcOqQ4I— Johns. (@CricCrazyJohns) February 17, 2024 -
నిన్న ప్రత్యర్దులు.. నేడు సహచరులు, ఒక్క రోజులో సీన్ రివర్స్
ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్ పూరన్ (వెస్టిండీస్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్‌లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌లో పూరన్, డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్ స్కోర్ 45/2గా ఉంది. ముహమ్మద్ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్ (0) ఔట్ కాగా.. పూరన్ (9), కుశాల్ పెరీర్ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్‌లో ఒకలా మరో, మరో లీగ్‌లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్‌ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్‌ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది. -
ఇదేమి సిక్స్‌రా బాబు.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్-2024లో ఎంఐ ఎమిరేట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఎమిరేట్స్ ఘన విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా.. ముంబై బౌలర్ల దాటికి 12.1 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. ఎంఐ బౌలర్లలో స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్, సలీమీఖాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కుశాల్ పెరీరా, ఫ్లెచర్ చెరో 42 పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. నికోలస్ పూరన్ భారీ సిక్సర్.. కాగా ఈ మ్యాచ్‌లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. ఎంఐ ఇన్నింగ్స్ 19 ఓవర్లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్‌ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 102 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో పూరన్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. The 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 show 🥵 Waah, kya maara hai 👌#SWvMIE | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/GwswS0vW0V — Zee Cricket (@ilt20onzee) January 26, 2024 -
చెలరేగిన పూరన్, స్మట్స్.. 48 బంతుల్లోనే శతక్కొట్టిన డస్సెన్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పరుగుల వరద పారుతుంది. నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పలువురు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఆటగాళ్లు వాన్ డర్ డస్సెన్, రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్బన్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, స్మట్స్ రెచ్చిపోయారు. డస్సెన్ విధ్వంసకర శతకం.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న రికెల్టన్ జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఓపెనర్ వాన్ డర్ డస్సెన్ కేవలం 48 బంతుల్లోనే శతక్కొట్టగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (49 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనకు చేతులెత్తేసిన సేపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై 98 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఎంఐ బౌలర్లు జార్జ్ లిండే, ఓలీ స్టోన్ చెరో 2 వికెట్లు.. హెండ్రిక్స్, రబాడ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డు ప్లూయ్ (48), రొమారియో షెపర్డ్ (34) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చెలరేగిన పూరన్, స్మట్స్.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో) నికోలస్ పూరన్ (31 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జెజె స్మట్స్ (38 బంతుల్లో 75; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బ్రీట్జ్కీ (29 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో టామ్ ఏబెల్ (65), ట్రిస్టన్ స్టబ్స్ (55), మార్క్రమ్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో స్మట్స్, ప్రిటోరియస్, గ్లీసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. టాప్లే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల కోసం తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ కేప్‌టౌన్‌కు (SA20 2024) కీరన్ పోలార్డ్, ఎంఐ ఎమిరేట్స్‌కు (ILT20 2024) నికోలస్ పూరన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని ముంబై యాజమాన్యం ఇవాళ వెల్లడించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఈ నెల 19 నుంచి మొదలవుతుంది. కాగా, కీరన్ పోలార్డ్ అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో కూడా ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ ఇటీవల తమ కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల తర్వాత మే నెలలో ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపర్చిన ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా పేస్ గన్ గెరాల్డ్ కోయెట్, లంక పేసర్ దిల్షాన్ మధుశంకను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు.. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్ 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్‌మన్ 8 కోట్లు ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మన్ 15.25 కోట్లు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్‌మన్ 3 కోట్లు తిలక్ వర్మ బ్యాట్స్‌మెన్ 1.7 కోట్లు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్) టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలర్ 75 లక్షలు ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు -
ఇంగ్లండ్ యువ బ్యాటర్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు
అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జోర్డన్ కాక్స్, పలువురు విండీస్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్న్ వారియర్స్ ఆటగాడు కెన్నార్ లెవిస్ (27 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ ఆటగాడు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 90 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఇదే మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ ఆటగాళ్లు నికోలస్ పూరన్(17 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (16 బంతుల్లో 40 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. కెన్నార్ లెవిస్‌తో పాటు హజ్రతుల్లా జజాయ్ (27 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టీమ్ అబుదాబీపై నార్త్ర్న్ వారియర్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్‌పై మోర్స్విల్లే ఆర్మీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. అసలంక (31), కోబ్ హెర్ఫ్ట్ (20) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఛేదనలో ఆండ్రీయస్ గౌస్ (43), ఫాఫ్ డుప్లెసిస్ (31) రాణించడంతో మోర్స్విల్లే 9.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ జోర్డన్ కాక్స్ విజృంభించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 143 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్.. పూరన్ , ఫేబియన్ అలెన్ చెలరేగినా లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
ICC: అద్భుత ఇన్నింగ్స్.. ఐసీసీ అవార్డు అతడికే! వరల్డ్‌కప్‌లో..
ICC Men's Player of the Month: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డు వరించింది. వన్డేల్లో నెంబర్.1 గా ఉన్న ఈ రికార్డుల వీరుడు ఆగష్టు నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. తనతో పోటీ పడిన సహచర ఆటగాడు షాదాబ్ ఖాన్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. గత నెలలో నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో రెండు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజంకు క్రికెట్ అభిమానులు పెద్దపీట వేశారు. కాగా శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన బాబర్.. తర్వాతి రెండు వన్డేల్లో వరుసగా ఫిఫ్టీలు సాధించాడు. నేపాల్‌పై శతక్కొట్టిన బాబర్ తద్వారా.. పాకిస్తాన్ అఫ్గన్ జట్టును 3-0తో వైట్‌వాష్ చేయడంలో బాబర్ ఆజం కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో 131 బంతుల్లో ఏకంగా 151 పరుగులు సాధించాడు. అరుదైన రికార్డు తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీల మార్కు అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆగష్టు నెలలో నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 264 పరుగులు రాబట్టిన బాబర్ ఈ మేరకు అవార్డు గెలుచుకున్నాడు. కాగా తన కెరీర్లో బాబర్ ఈ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి. వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటి ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన బాబర్ ఆజం.. ఆసియా కప్- వన్డే వరల్డ్‌కప్-2023లో గెలుపొంది పాకిస్తాన్ అభిమానులకు మరింత వినోదం పంచుతామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్ ఆజం విఫలమైన విషయం తెలిసిందే. రిజర్వ్ డే అయిన సోమవారం నాటి కొలంబొ మ్యాచ్‌లో అతడు 10 పరుగులకే నిష్క్రమించాడు. చదవండి: Asia Cup: షాహిద్ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్‌మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్‌మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్‌పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
IND VS WI 5th T20: విండీస్ గెలిచినా.. పూరన్‌కు కమిలిపోయింది..!
5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియాపై దాదాపు 17 ఏళ్ల తర్వాత లభించిన విజయం (సిరీస్) కావడంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విక్టరీని విండీస్ ప్లేయర్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవలి కాలంలో విండీస్‌కు ఈ స్థాయి విజయం దక్కడంతో ఆ దేశ మాజీలు సైతం రోవ్‌మన్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచిన నికోలస్ పూరన్‌ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సిరీస్‌లో పూరన్ 141.94 స్ట్రయిక్ రేట్‌తో 176 పరుగులు చేసి తన జట్టు సాధించిన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. The after effects 😂 thank you brandon king and arsdeep. pic.twitter.com/7jOHS46NSr — NickyP (@nicholas_47) August 14, 2023 అయితే ఇంత చేసి తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందించిన పూరన్‌కు మాత్రం శారీరక ప్రశాంతత లభించలేదు. ఐదో టీ20 సందర్భంగా పూరన్ సహచరుడు బ్రాండన్ కింగ్, ప్రత్యర్ధి అర్షదీప్ సింగ్ ధాటికి గాయాలపాలయ్యాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉండగా కింగ్ కొట్టిన ఓ షాట్ నేరుగా వచ్చి పూరన్ ఎడమ చేతిని బలంగా తాకగా.. అతని చేయి విరిగినంత పనైయ్యింది. అప్పటికప్పుడు ఆ నొప్పి తెలియలేదు కానీ, మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన భాగం పూర్తిగా కమిలిపోయి, బంతి అచ్చు కనిపించింది. పూరన్ ఇదే మ్యాచ్‌లో అర్షదీప్ బౌలింగ్‌లోనూ గాయపడ్డాడు. కింగ్ దెబ్బ మరువక ముందే అర్షదీప్ వేసిన ఓ వేగవంతమైన బంతి నేరుగా వచ్చి పూరన్ కడుపుపై బలంగా తాకింది. ఆ క్షణం పూరన్ నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే వెంటనే తేరుకుని తిరిగి బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే ఈ దెబ్బను సైతం మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన ప్రాంతం పూర్తిగా కమిలిపోయి ఉండి, బంతి అచ్చు స్పష్టంగా కనిపించింది. ఈ దెబ్బలకు సంబంధించిన ఫోటోను పూరన్ మ్యాచ్ అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి కింగ్, అర్షదీప్‌లను థ్యాంక్స్ చెప్పాడు. అనంతర ప్రభావాలు.. కింగ్, అర్షదీప్‌లను ధన్యవాదాలు అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 ఇదిలా ఉంటే, ఈ గాయాలు తగిలిన అనంతరం కూడా పూరన్ తన బ్యాటింగ్‌ను కొనసాగించి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కింగ్‌తో అతను రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పూరన్ 35 బంతులు ఎదుర్కొని బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు, 85 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్.. షాయ్ హోప్ (22) సహకారంతో విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. విండీస్ మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! నోర్ముయ్..
West Indies vs India, 5th T20I - Nicholas Pooran: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీమిండియాతో టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. మేజర్ క్రికెట్ లీగ్-2023 ఫామ్‌ను కొనసాగిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నిక్కీ వరుసగా 41, 67(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), 20, 1, 47 పరుగులు సాధించాడు. పాండ్యా బౌలింగ్‌లో.. ముఖ్యంగా నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో ఓపెనర్ బ్రాండన్ కింగ్(85- నాటౌట్)తో కలిసి విండీస్‌ను గెలుపుబాట పట్టించడంలో కీలకంగా వ్యవహరించాడు. 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇందులో రెండు సిక్స్‌లు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బాదినవే! చాలెంజ్‌కు ప్రతీకారంగా అయితే, ఆట తీరుతో ఆకట్టుకున్న నికోలస్ పూరన్.. హార్దిక్ పాండ్యాకు మించిన ఆటిట్యూడ్‌తో టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో టీ20 ముగిసిన తర్వాత హార్దిక్.. ‘‘నిక్కీ నా బౌలింగ్‌ను టార్గెట్ చేస్తాడేమో! మరేం పర్లేదు.. నాకిలాంటివి ఇష్టమే. అతడు నా మాటలు విని నన్ను లక్ష్యంగా చేసుకున్నా.. ఆఖర్లో నాకు వికెట్ సమర్పించుకోవాల్సిందే!’’ అని చాలెంజ్ విసిరాడు. నోరు మూసుకోండి అయితే, ఐదో టీ20లో ఇది బ్యాక్‌ఫైర్ అయింది. పాండ్యా బౌలింగ్‌లోనే పూరన్ మంచి షాట్లు ఆడాడు. కానీ.. తిలక్ వర్మ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్ 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. విజయానంతరం వెంటనే విండీస్‌కు బయల్దేరిన నికోలస్ పూరన్ షేర్ చేసిన రీల్ టీమిండియా ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. అకీల్ హొసేన్తో కలిసి.. ‘‘నోరు మూసుకోవాలి’’ అన్నట్లు అభినయించాడు. అక్కడ చూపించు నీ సత్తా ‘‘ఒకవేళ దీని గురించి మీకు తెలిస్తే.. తెలుసనే అనుకోండి’’ అని క్యాప్షన్ జతచేశాడు. దీంతో నిక్కీ హార్దిక్‌నే టార్గెట్ చేశాడని.. భారత జట్టును కూడా అవమానించే విధంగా వ్యవహరించాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మేజర్ ఈవెంట్లో నీ సత్తా చూపించు.. అప్పుడు నమ్ముతాం గొప్ప బ్యాటర్‌వి అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 View this post on Instagram A post shared by Nicholas Pooran (@nicholaspooran) -
Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో
West Indies vs India, 5th T20I: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడిపోయి ఘోర పరాభవం మూటగట్టుకుంది టీమిండియా. పసికూనలతో పోటీ పడి ఐసీసీ మెగా ఈవెంట్లకు అర్హత సాధించలేక చతికిలపడ్డ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఈ పర్యటన ద్వారా యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ రూపంలో ఇద్దరు యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. అరంగేట్రంలో అదరగొట్టి కేవలం ఐపీఎల్‌కు మాత్రమే తమ ఆట పరిమితం కాదని.. అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటగలమని నిరూపించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే విలువైన ఇన్నింగ్స్ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టారు. టెస్టులో సెంచరీతో యశస్వి మెరవగా.. తిలక్ తొలి టీ20లోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్ కూడా.. ఇక వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి ముందు భవిష్యత్తులో వీరిద్దరితో బౌలింగ్ కూడా చేయిస్తామంటూ టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొన్న విషయం తెలిసిందే. నైపుణ్యాలకు పదును పెడితే కచ్చితంగా బౌలర్లుగా కూడా రాణించలగరని విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి వికెట్‌గా బిగ్ హిట్టర్ అందుకు తగ్గట్లుగానే తిలక్ వర్మ ఐదో టీ20లో 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. నికోలస్ పూరన్ వంటి బిగ్ హిట్టర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాండన్ కింగ్‌తో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి కొరకరాని కొయ్యగా మారిన పూరన్ ఆట కట్టించాడు. 35 బంతుల్లో 47 పరుగులతో జోరు మీదున్న అతడిని బోల్తా కొట్టించాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్లో తిలక్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన పూరన్.. స్విచ్ హిట్‌కు యత్నించి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. అయితే, విండీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో పూరన్ పెవిలియన్ చేరాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నికోలస్ పూరన్ రూపంలో తిలక్ వర్మ తన తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్నాడు. బ్యాట్ ఝులిపించి.. బౌలింగ్‌లోనూ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆతిథ్య కరేబియన్ జట్టు 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిలక్ తొలి మూడు టీ20లలో వరుసగా 39,51,49 పరుగులు సాధించాడు. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో ఈ హైదరాబాదీ 27 పరుగులు చేయగలిగాడు. చదవండి: ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్‌ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్ Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్‌ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్
టీమిండియాపై టెస్టు, వన్డే సిరీస్‌ల ఓటమికి వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఫ్లోరిడా వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు కైవసం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ విజయంలో పేసర్ షెఫార్డ్, బ్యాటర్లు కింగ్, పూరన్ కీలక పాత్ర పోషించారు. హార్దిక్‌కు చుక్కలు చూపించిన పూరన్.. ఇక టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ బదులు తీర్చుకున్నాడు. నాలుగో టీ20కు ముందు హార్దిక్ పాండ్యా.. పూరన్‌కు ఓ సవాలు విసిరాడు. "పూరన్ కొడితే నా బౌలింగ్‌లోనే కొట్టాలి. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి. నాకు ఇటువంటి పోటీ అంటే చాలా ఇష్టం. నా మాటలు పూరన్ విని నాలుగో టీ20లో నన్ను టార్గెట్ చేస్తాడని" మూడో టీ20 అనంతరం హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నాలుగో టీ20లో పూరన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో హార్దిక్ బౌలింగ్‌ను ఎదుర్కొనే ఛాన్స్ పూరన్‌కు రాలేదు. కానీ నిర్ణయాత్మక ఐదో టీ20లో మాత్రం హార్దిక్ బౌలింగ్ ఆడే అవకాశం నిక్కీకి వచ్చింది. ఈ క్రమంలో హార్దిక్‌కు పూరన్ చుక్కలు చూపించి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. పూరన్ వచ్చిరాగానే మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అందులో రెండు సిక్సర్లు హార్దిక్ ఓవర్లో కొట్టినివే. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన హార్దిక్ బౌలింగ్‌లో ఆఖరి రెండు బంతులను పూరన్ సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్‌లో అయితే ఘోరప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ In 3rd T20I - Hardik pandya Gave an Overconfident Statement about Nicholas pooran. In 5th T20I - Nicholas Pooran Smashed him all over the park for 6 and 4. This is what I don't like About Hardik Pandya! pic.twitter.com/7XL2X97rn8 — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 13, 2023 Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 -
Ind vs WI 5th T20I: టి20 సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకున్న వెస్టిండీస్ (ఫొటోలు)
-
ఐదో టీ20లో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి
లాడెర్‌హిల్ (ఫ్లొరిడా): బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్‌తో భారత్ కరీబియన్ పర్యటనను నిరాశతో ముగించింది. టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు టి20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో చేజిక్కించుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరిపిస్తే... సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నడిపించాడు. విండీస్ సీమర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఆదుకున్న సూర్య టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ తీరా బ్యాటింగ్‌కు దిగగానే కష్టాలు ఎదురయ్యాయి. హోసీన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి (5), గిల్ (9) వికెట్లను పడేశాడు. ఈ దశలో సూర్యకుమార్‌కు జతయిన తిలక్ వర్మ ధనాధన్ ఆటాడాడు. కానీ కాసేపట్లోనే చేజ్ అతని మెరుపులకు రిటర్న్ క్యాచ్‌తో ముగింపు పలికాడు. సంజూ సామ్సన్ (13) నిరాశపరచగా, తనశైలి షాట్లతో సూర్యకుమార్ జట్టును ఆదుకున్నాడు. భారీ సిక్సర్‌తో సూర్య ఫిఫ్టీ 38 బంతుల్లో పూర్తయ్యింది. అయితే వానొచ్చి కాసేపు ఆటను ఆపేసింది. తర్వాత ఆట మొదలవగానే కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 14; 1 సిక్స్) షెఫర్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో హోల్డర్ చేతికి చిక్కాడు. తర్వాత సూర్యకుమార్‌ను హోల్డర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. యార్కర్ లెంత్ బాల్ నేరుగా వికెట్ల ముందున్న అతని ప్యాడ్లకు తగిలినా... ఫీల్డ్ అంపైర్ అప్పీల్‌ను తోసిపుచ్చాడు. బంతి గమనం ఇన్లైన్లో ఉండటంతో విండీస్ డీఆర్ఎస్కు వెళ్లి ఫలితాన్ని రాబట్టింది. సరిగ్గా ఇలాగే మరో రివ్యూ (డీఆర్ఎస్)తో కుల్దీప్ (0) వికెట్‌ను షెఫర్డ్ దక్కించుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఇంకో రెండు బంతులు ఉండగా మళ్లీ వర్షమొచ్చి ఆగినా... వెంటనే మొదలైంది. కానీ అక్షర్ పటేల్ (10 బంతుల్లో 13; 1 సిక్స్) అవుట్‌కాగా ఆఖరి బంతిని ముకేశ్ కీపర్ తలపైనుంచి బౌండరీకి తరలించాడు. కింగ్, పూరన్‌ల జోరుతో లక్ష్యఛేదనకు దిగగానే అర్ష్‌దీప్ సింగ్ ఓపెనర్ మేయర్స్ వికెట్‌ను పడగొట్టడంతో భారత్ సంబరమైతే చేసుకుంది. కానీ ఈ ఆనందం అంతటితోనే ఆవిరైంది. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ స్కోరు బోర్డును భారీ సిక్సర్లు, బౌండరీలతో పరుగు పెట్టించారు. పేస్, స్పిన్ ఇలా ఎవరు వేసినా రన్‌రేట్ మాత్రం ఓవర్‌కు 9 పరుగుల చొప్పున దూసుకెళ్లింది. హిట్టర్లు ఇద్దరూ పాతుకుపోవడంతో వికెట్ పడగొట్టడం భారత బౌలర్ల వల్ల కాలేకపోయింది. వర్షం మళ్లీ చికాకు పెట్టినా విరామం తర్వాత మొదలైంది. పూరన్‌ను తిలక్ వర్మ బోల్తా కొట్టించాడు. కానీ మిగతా లాంఛనాన్ని 38 బంతుల్లో అర్థసెంచరీ పూర్తిచేసుకున్న కింగ్, షై హోప్ (13 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పూర్తి చేశారు. పాండ్యా ఏకంగా 8 మందిని బౌలింగ్‌కు దించినా 2 వికెట్లనే పడగొట్టగలిగాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి అండ్ బి) హోసీన్ 5; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హోసీన్ 9; సూర్యకుమార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్ 61; తిలక్‌వర్మ (సి అండ్ బి) చేజ్ 27; సామ్సన్ (సి) పూరన్ (బి) షెఫర్డ్ 13; పాండ్యా (సి) హోల్డర్ (బి) షెఫర్డ్ 14; అక్షర్ (సి) షెఫర్డ్ (బి) హోల్డర్ 13; అర్ష్‌దీప్ (బి) షెఫర్డ్ 8; కుల్దీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షెఫర్డ్ 0; చహల్ (నాటౌట్) 0; ముకేశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 165. వికెట్ల పతనం: 1–6, 2–17, 3–66, 4–87, 5–130, 6–140, 7–149, 8–149, 9–161. బౌలింగ్: అకిల్ హోసీన్ 4–0–24–2, మేయర్స్ 1–0–4–0, హోల్డర్ 4–0–36–2, జోసెఫ్ 3–0–41–0, చేజ్ 4–0–25–1, షెఫర్డ్ 4–0–31–4. వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (నాటౌట్) 85; మేయర్స్ (సి) యశస్వి (బి) అర్ష్‌దీప్ 10; పూరన్ (సి) పాండ్యా (బి) తిలక్ వర్మ 47; షై హోప్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 7. మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–12, 2–119. బౌలింగ్: పాండ్యా 3–0–32–0, అర్ష్‌దీప్ 2–0–20–1, కుల్దీప్ 4–0–18–0, చహల్ 4–0–51–0, ముకేశ్ 1–0–10–0, తిలక్ వర్మ 2–0–17–1, అక్షర్ 1–0–8–0, యశస్వి 1–0–11–0 -
నికోలస్ పూరన్‌కు బిగ్‌షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా! ఎందుకంటే?
గయానా వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు ఐసీసీ బిగ్‌షాకిచ్చింది. అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత విధించింది. లెవెల్-1 ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పూరన్‌కు ఫైన్ విధించారు ఏం జరిగిందంటే? విండీస్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో నాలుగో బంతిని కైల్మైర్స్ లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటని వేలు పైకెత్తాడు. వెంటనే మైర్స్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న పూరన్‌తో చర్చించి రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో ఫలితం అంపైర్కాల్ తేలింది. దీంతో మైర్స్ పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. ఈ క్రమంలో పూరన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "మీరు ఔట్ ఇవ్వకపోయి ఉంటే అది కచ్చితంగా నాటౌట్" అంటూ బహిరంగంగా విమర్శించాడు. ఈనేపథ్యంలోనే ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదుతో మ్యాచ్ రిఫరీ పూరన్‌పై చర్యలు తీసుకున్నాడు. కాగా పూరన్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 గయనా వేదికగా ఆగస్టు 8న జరగనుంది. చదవండి:ODI WC 2023: 12 ఏళ్ల తర్వాత మళ్లీ.. ప్రపంచకప్‌లో విజయం మాదే: రోహిత్ శర్మ -
నికోలస్ పూరన్ ఊచకోత.. టీమిండియాపై సరికొత్త చరిత్ర!
టీమిండియాతో టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గయానా వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన విండీస్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూరన్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. ముఖ్యంగా 6వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో ఏకంగా 18 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 4 సిక్స్‌లు, 6 ఫోర్లు సాయంతో 67 పరుగులు చేశాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పూరన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ సాధించిన రికార్డులు ఇవే.. ►టీమిండియాపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఇప్పటివరకు భారత్‌పై 524 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(500) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఫింఛ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ►అదే విధంగా భారత్‌పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన మొదటి క్రికెటర్‌గా పూరన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు టీమిండియాపై 5 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు జోస్‌బట్లర్, మున్రో, డికాక్ పేరిట ఉండేది. వీరిముగ్గురు 4 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. చదవండి: World Cup 2023: ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ That's a Nicholas-ty Blow!#StreamingLiveOnFanCode #WIvIND pic.twitter.com/e9mZvCF4JU — FanCode (@FanCode) August 3, 2023 -
Ind Vs WI: విండీస్ విధ్వంసకర వీరుడు.. కోటీశ్వరుడు! ఖరీదైన కార్లు.. ఆస్తి?
Nicholas Pooran's Lavish Lifestyle: టెస్టు, వన్డే సిరీస్‌లలో టీమిండియా చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ట్రినిడాడ్‌లోని తరూబాలో గల బ్రియన్ లారా స్టేడియంలో గురువారం యువ భారత జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న విండీస్‌కు విధ్వంసర ఆటగాడు నికోలస్ పూరన్‌తో పాటు జేసన్ హోల్డర్ రాక బలంగా మారింది. కాగా వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్.. మేజర్ లీగ్ క్రికెట్-2023 ఫైనల్లో ఆడిన సునామీ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి చెందిన ఎంఐ న్యూయార్క్‌కు ప్రాతినిథ్య వహించిన పూరన్ ఏకంగా 10 ఫోర్లు, 13 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. కోటీశ్వరుడే! పూరన్ ఆట సంగతి ఇలా ఉంటే.. అతడి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. కరేబియన్ దీవికి చెందిన ధనవంతులైన క్రికెటర్లలో పూరన్కూ చోటుంది. ఈ ఏడాది హయ్యస్ట్ పెయిడ్ విండీస్ క్రికెటర్ల జాబితాలో అతడు స్థానం సంపాదించాడు. ఐపీఎల్ ద్వారా అధికాదాయం ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ 2023 వేలంలో భాగంగా అత్యధికంగా ఈ హిట్టర్ కోసం ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీపీఎల్, మేజర్ లీగ్ క్రికెట్ తదితర లీగ్‌లలో పూరన్ ఆడుతున్నాడు. అదే విధంగా.. పూమా, నైకీ తదితర ప్రముఖ బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నికోలస్ పూరన్ నెట్‌వర్త్ రూ. 25 కోట్లకు పైగానే ఉన్నట్లు వన్క్రికెట్ అంచనా వేసింది. చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడి బాల్య స్నేహితురాలు కాథెరినా మిగ్యూల్‌ను ప్రేమించిన నికోలస్ పూరన్ 2021 జూన్‌లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అలియారా అనే కూతురు ఉంది. కుటుంబాన్ని ప్రేమించే పూరన్ భార్యాబిడ్డలతో ఉన్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. ఖరీదైన కార్లు నికోలస్ పూరన్ వద్ద సుమారు రూ. 2.26 కోట్ల విలువైన BMW i8, 28 లక్షల ధర గల Hyundai Tucson కార్లు ఉన్నట్లు సమాచారం. ఫేవరెట్లు వీరే 27 ఏళ్ల నికోలస్ పూరన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిల్లియర్స్ రోల్‌మోడల్స్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్లను పూరన్ ఆదర్శంగా భావిస్తాడు. కాగా ఎంఎల్‌సీలో విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడిన పూరన్ టీమిండియాపై ఎలా ఆడతాడో చూడాలి! ఈ లెఫ్టాండర్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడతాడా లేదంటే భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేస్తాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! విండీస్‌తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర ఎంతంటే! ᵗʰᵉ ᵒⁿˡʸ ᵗʰⁱⁿᵍ ᵍᵒⁱⁿᵍ ʳⁱᵍʰᵗ ᶠᵒʳ ˢᵉᵃᵗᵗˡᵉ 1⃣3⃣7⃣/3⃣ (12.2) pic.twitter.com/BZP6bYtwoa — Major League Cricket (@MLCricket) July 31, 2023 -
టీమిండియాతో తొలి టీ20.. విండీస్ సిక్సర్ల కింగ్ వచ్చేశాడు! బౌలర్లూ జాగ్రత్త
స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన వెస్టిండీస్ మరో కీలకపోరుకు సిద్దమైంది. టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గురువారం ట్రినిడాడ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనుంది. కనీసం టీ20 సిరీస్‌లోనైనా నెగ్గి పరువునిలబెట్టుకోవాలనే పట్టుదలతో విండీస్ బరిలోకి దిగుతోంది. ఇక ఈ టీ20 సిరీస్‌కు విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్, స్టార్ ఆల్‌రౌండర్ తిరిగి జట్టులోకి రావడం విండీస్‌కు కాస్త ఊరటను కలిగించే ఆంశం. మెజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు పూరన్ దూరమైన సంగతి తెలిసిందే. అదే విధంగా హోల్డర్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ తిరిగి రావడం విండీస్ కొత్త జోష్‌లో కన్పిస్తోంది. వీరిద్దరికి తొలి టీ20లో చోటుదక్కడం ఖాయమన్పిస్తోంది. భారత బౌలర్లూ జాగ్రత్త.. ఇక పూరన్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించి సత్తాచాటాడు. ఓవరాల్‌గా ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా టోర్నీ టాప్ స్కోరర్‌గా పూరన్(388) నిలిచాడు. సంచలన ఫామ్‌లో ఉన్న పూరన్ చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. కాబట్టి అతడిని వీలైనంత వేగం పెవిలియన్‌కు పంపితే భారత జట్టుకు అంతమంచిది. హెట్‌మైర్ కూడా.. అదే విధంగా ఏడాది తర్వాత షెమ్రాన్ హెట్‌మైర్ కూడా తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు. అతడు విండీస్ జట్టుకు ఫినిషర్‌గా మారే అవకాశం ఉంది. ఐపీఎల్లో కూడా రాజస్తాన్ రాయల్స్‌కు అతడు ఫినిషర్‌గా ఎన్నో అద్భుతమైన విజయాలు అందిచాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పితే కొండంత లక్ష్యం చిన్నబోతోంది. అయితే భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం హెట్‌మైర్ తీవ్ర నిరాశ పరిచాడు. టీమిండియాదే పై చేయి.. ఇక టీ20ల్లో విండీస్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి 25 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 17 సార్లు విజయం సాధించగా, విండీస్ కేవలం 7 సార్లు మాత్రమే గెలుపొందింది. తొలి టీ20కు విండీస్ తుది జట్టు(అంచనా) కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, ఒషానే థామస్ చదవండి: #Rinku Singh: ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసే పని ఇంకా మానలేదు! ఆయన అంతే.. -
టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు
స్వదేశంలో టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యలతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్‌కు దూరమైన విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ టీ20లకు అందుబాటులోకి వచ్చింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో పూరన్‌కు చోటు దక్కింది. అమెరికా వేదికగా జరిగిన మెజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బీజీబీజీగా ఉన్న పూరన్.. భారత్‌తో వన్డేల నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ టోర్నీ సోమవారం(జూలై31)తో ముగియడంతో పూరన్ తన సొంత జట్టుతో కలవనున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో పూరన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. ఆ ముగ్గురు ఎంట్రీ.. అదే విధంగా దాదాపు ఏడాది నుంచి విండీస్ టీ20 జట్టుకు దూరంగా ఉన్న షెమ్రాన్ హెట్‌మైర్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్, బౌలర్ థామస్‌కు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. వీరు ముగ్గురు చివరగా గతేడాది న్యూజిలాండ్‌పై టీ20ల్లో ఆడారు. ఆగస్టు1న ట్రినిడాడ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం భారత్-విండీస్ మధ్య వన్డే సిరీస్ హోరాహోరీగా జరుగుతోంది. మంగళవారం ట్రినిడాడ్ వేదికగా జరగనున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రొమారియో షెఫెర్డ్ ఓడియన్ స్మిత్, ఒషానే థామస్. భారత టీ20 జట్టు: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: LPL 2023: మ్యాచ్ మధ్యలో పాము కలకలం.. ఉలిక్కిపడిన క్రికెటర్లు! వీడియో వైరల్ -
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్‌ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్.. సియాటిల్ ఆర్కాస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్సీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్ విజయాలతో టైటిల్‌ను నెగ్గింది. All the feels 🥰 💙 🤩 Congratulations to @MINYCricket for winning the inaugural #MajorLeagueCricket Championship Final 🏆 pic.twitter.com/Mk1agQmgo6 — Major League Cricket (@MLCricket) July 31, 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్ ఆర్కాస్పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్ చేరింది. ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్ టైటిల్‌ను, తాజాగా మేజర్ లీగ్ టీ20 టైటిల్‌ను నెగ్గాయి. MI are serial winners 🏆🏆🏆🏆🏆🏆🏆🏆 📸: IPL/BCCI pic.twitter.com/owVjc46r38 — CricTracker (@Cricketracker) July 31, 2023 ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్ మేజర్ లీగ్ టీ20 లీగ్ 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్సీ టైటిల్‌తో పోలార్డ్, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్ మాలిక్ (13), రోహిత్ శర్మ (10), ధోని (9), లసిత్ మలింగ (9) ఉన్నారు. RASHID WINS THE BATTLE!⚔️ Rashid Khan gets the last LAUGH 😄against Heinrich Klaasen! 9⃣1⃣/3⃣ (12.1) pic.twitter.com/cfgaAf5CRJ — Major League Cricket (@MLCricket) July 31, 2023 నిప్పులు చెరిగిన బౌల్డ్.. రషీద్ మాయాజాలం ఎంఎల్సీ 2023 ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. ట్రెంట్ బౌల్డ్ (4-0-34-3), రషీద్ ఖాన్ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 𝓞𝓷 𝓻𝓮𝓹𝓮𝓪𝓽 🔄 Can’t stop watching @nicholaspooran’s 1️⃣3️⃣ sixes he hit today‼️ #MLC2023 #MLCFINAL pic.twitter.com/OynKTi2xnD — Major League Cricket (@MLCricket) July 31, 2023 KHAN-TASTIC!🪄 Rashid Khan STRIKES FIRST💫 for the @MINYCricket! 2⃣5⃣/1⃣ (4.1) pic.twitter.com/ZPhVmSQhfA — Major League Cricket (@MLCricket) July 31, 2023 పూరన్ ఊచకోత.. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
MLC 2023: 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అరాచకం! కానీ పాపం పూరన్‌కు మాత్రం..
Major League Cricket 2023- Seattle Orcas vs MI New York, Final: మేజర్ లీగ్ క్రికెట్-2023 ఫైనల్లో ఎంఐ న్యూయార్క్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చెమటలు పట్టించాడు. సీటెల్ ఓర్కాస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. డల్లాస్‌లో జరిగిన లీగ్ తుదిపోరులో మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న పూరన్ అజేయ సెంచరీ(137)తో మెరిశాడు. పరుగుల సునామీ ఏకంగా.. 249.09 స్ట్రైక్‌రేటుతో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ వెస్టిండీస్ బ్యాటర్ అద్భుత ఆట తీరు కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు ఎంఐ న్యూయార్క్.. ఎంఎల్సీ(MLC) అరంగేట్ర ఎడిషన్ విజేతగా అవతరించింది. సీటెల్ ఓర్కాస్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి చాంపియన్‌గా నిలిచింది. అయితే, నికోలస్ పూరన్ ఇన్నింగ్స్.. అతడి రికార్డులకు జమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ టీ20 లీగ్‌ను యూఎస్ఏ నిర్వహిస్తోంది. ఇక యూఎస్ఏ అసోసియేట్ మెంబర్ మాత్రమే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. మేజర్ క్రికెట్ లీగ్‌కు అధికారిక (టీ20) హోదా ఉండదు. అయ్యో పాపం.. నామమాత్రం ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ అజేయ అద్భుత శతకాన్ని ఓ మరుపురాని ఇన్నింగ్స్‌గా గుర్తుపెట్టుకోవడమే తప్ప.. అతడి రికార్డుల్లో దీనికి ఎటువంటి స్థానం ఉండదు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు భాగమైన ఎంఎల్‌సీలో మొత్తంగా ఆరు జట్లు ఉన్నాయి. ఆరు జట్ల మధ్య పోటీ జూలై 13న మొదలైన ఈ టీ20 లీగ్‌లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, సీటెల్ ఓర్కాస్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం పేరిట ఆరు టీమ్‌లు పాల్గొన్నాయి. ఈ క్రమంలో జూలై 30 నాటి ఫైనల్లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ న్యూయార్క్ ఫైనల్లో సీటెల్‌ను ఓడించి తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఎంఐ జట్టుకు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నికోలస్ పూరన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! ᵗʰᵉ ᵒⁿˡʸ ᵗʰⁱⁿᵍ ᵍᵒⁱⁿᵍ ʳⁱᵍʰᵗ ᶠᵒʳ ˢᵉᵃᵗᵗˡᵉ 1⃣3⃣7⃣/3⃣ (12.2) pic.twitter.com/BZP6bYtwoa — Major League Cricket (@MLCricket) July 31, 2023 -
నికోలస్ పూరన్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ! 13 సిక్స్‌లతో
మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్ ఛాంపియన్స్‌గా ముంబై న్యూయర్క్ నిలిచింది. డల్లాస్ వేదికగా జరిగిన ఫైనల్లో సీటెల్ ఓర్కాస్‌ను 7 వికెట్ల తేడాతో న్యూయర్క్ చిత్తు చేసింది. 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై న్యూయర్క్ 3 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. నికోలస్ పూరన్ ఊచకోత.. ఇక ఫైనల్ పోరులో ముంబై న్యూయర్క్ ఆటగాడు నికోలస్ పూరన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన ఈ కరేబియన్ వీరుడు.. కేవలం 40 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 184 టార్గెట్‌లో 70 శాతం పైగా పరుగులు పూరన్ సాధించినవే కావడం గమానర్హం. కాగా ఈ టోర్నీ ఆసాంతం పూరన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. 8 మ్యాచ్‌లు ఆడిన పూరన్ 388 పరుగులు సాధించాడు. డికాక్ ఇన్నింగ్స్ వృధా.. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓర్కాస్ బ్యాటర్లలో డికాక్(87) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితోపాటు శుబమ్ రాజనే(29) పరుగుతో రాణించాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు సాధించగా.. టేలర్, డేవిడ్ వీసీ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: IND vs WI: బంతిని చూడకుండా భారీ సిక్సర్.. షాక్ తిన్న టీమిండియా బౌలర్! వీడియో వైరల్ -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన క్లాసెన్.. ప్లే ఆఫ్స్‌కు ముంబై
మేజర్ లీగ్ క్రికెట్లో తొలి సెంచరీ నమోదైంది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో నిన్న (జులై 25) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు, సీయాటిల్ ఆర్కాస్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 110 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఫలితంగా ఆర్కాస్ జట్టు.. ఎంఐ న్యూయార్క్‌పై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. A KLAAssic century and celebration 💯 🙌 💥 #MajorLeagueCricket's first-ever CENTURY. HISTORY. MADE. 💚 🐳 pic.twitter.com/Bq5MotMfYU — Major League Cricket (@MLCricket) July 26, 2023 తొలుత పూరన్, ఆఖర్లో బౌల్ట్.. ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తొలుత నికోలస్ పూరన్ (34 బంతుల్లో 68; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), మధ్యలో పోలార్డ్ (18 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రెచ్చిపోగా.. టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), డేవిడ్ వీస్ (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) తలో చేయి వేశారు. ఆర్కాస్ బౌలర్లలో ఇమాద్ వసీం, హర్మీత్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. గానన్, ఆండ్రూ టై తలో వికెట్ దక్కించుకున్నారు. NICKY P HAS COME TO PLAY!🏏 Nicholas Pooran has RACED🏇 to 23 RUNS off just 8 balls! 4⃣6⃣/2⃣ (5.0) pic.twitter.com/GBrY5XAYed — Major League Cricket (@MLCricket) July 25, 2023 RASHID KHAN TRAPS QDK IN FRONT!😱 Huge wicket for @MINYCricket! 2⃣5⃣/1⃣ (3.2) pic.twitter.com/u3NqqAusnr — Major League Cricket (@MLCricket) July 25, 2023 An innings that will go down in history 👏 Heinrich Klaasen wins the Player of the Match award for his outstanding 💯 #MLC2023 pic.twitter.com/LGYxguTdJf — Major League Cricket (@MLCricket) July 26, 2023 రాణించిన నౌమాన్.. శతక్కొట్టిన క్లాసెన్ 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లలో డికాక్ (9) విఫలం కాగా.. నౌమాన్ అన్వర్ (30 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ఆతర్వాత బరిలోకి దిగిన జయసూర్య డకౌట్ కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన క్లాసెస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. HEINRICH KLAASEN IS TAKING ON EVERYBODY! Heinrich Klaasen BLASTS 3 SIXES against Rashid Khan! 1⃣6⃣6⃣/4⃣ (15.5) pic.twitter.com/nYJQrnXh06 — Major League Cricket (@MLCricket) July 26, 2023 WELCOME TO THE KLAAS-ROOM!👨🏫 Heinrich Klaasen demonstrating a MASTERCLASS⚔️ in playing spin! 9⃣8⃣/2⃣ (10.2) pic.twitter.com/z6sTIYjdpx — Major League Cricket (@MLCricket) July 25, 2023 INNOVATION! 🧑🔬 Nauman Anwar brings out the SCOOP! 6⃣0⃣/2⃣ (8.0) pic.twitter.com/IemmlFecTY — Major League Cricket (@MLCricket) July 25, 2023 బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి అజేయ శతకంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓ పక్క బంతితో బౌల్డ్ (4-0-31-4), రషీద్ ఖాన్ (4-1-41-2) చెలరేగుతున్నా ఏమాత్రం తగ్గని క్లాసెన్.. ఆండ్రూ టై (4 నాటౌట్) సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడినా.. ఆర్కాస్, సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లతో పాటు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ లీగ్ నుంచి నిష్క్రమించాయి. WHAT A LAST OVER BY TRENT BOULT! 3 WICKETS, BUT FOUR ON THE NIGHT! pic.twitter.com/zt05U5A8el — Major League Cricket (@MLCricket) July 26, 2023 Where we stand at the end of the group stage 🤗 Onto playoffs at Grand Prairie Stadium!!! 🇺🇸 🏏 🏟️ #MajorLeagueCricket | Abound by the Times of India pic.twitter.com/ndYMAHsh5E — Major League Cricket (@MLCricket) July 26, 2023 -
పూరన్ ఊచకోత.. 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో! ముంబై ఘన విజయం
అమెరికా వేదికగా జరగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ న్యూయర్క్ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంది. అదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూయర్క్ విజయభేరి మోగించింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయర్క్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది. న్యూయర్క్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ది బౌలర్లను పూరన్ ఊచకోత కోశాడు. కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 62 పరుగులు సాధిచి ఆజేయంగా నిలిచాడు. ముఖ్యంగా వాషింగ్టన్ బౌలర్ ఓబుస్ పియెనార్కు పూరన్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన పియెనార్ బౌలింగ్‌లో పూరన్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. అందులో 3 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను మేజర్ లీగ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతడితో పాటు ముంబై ఓపెనర్ మునాక్ పటేల్(44) పరుగులతో రాణించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. వాషింగ్టన్ బ్యాటర్లలో ఫిలిప్స్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs WI: ఇషాన్ కిషన్ తుపాన్ ఇన్నింగ్స్.. ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు! THE BOUNDARIES ARE FLOWING!🌊🌊🌊 Nicholas Pooran JOINS THE PARTY🎉 with 3 SIXES in FOUR BALLS! 9⃣1⃣/1⃣ (8.5) pic.twitter.com/zDvMCbTcUr — Major League Cricket (@MLCricket) July 23, 2023 -
సత్తా చాటిన సికందర్ రజా, నికోలస్ పూరన్
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, విండీస్ వైట్‌బాల్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ సత్తా చాటారు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వీరు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. పూరన్ 13 స్థానాలు జంప్ చేసి టాప్ 20లోకి (19వ స్పాట్) ప్రవేశిస్తే.. సికందర్ రజా 7 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ ప్లేస్‌కు ఎగబాకాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బంతితోనూ సత్తా చాటిన సికందర్.. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు చేరాడు. బౌలింగ్‌లో 4 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో చెలరేగిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ 2 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకాడు. వీరితో పాటు క్వాలిఫయర్స్‌లో సత్తా చాటిన మరికొందరు బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. 3 ఫిఫ్టిలతో రాణించిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 24 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ ర్యాంక్‌కు, జింబాబ్వే సీన్ విలియమ్స్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ ప్లేస్‌కు చేరుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో టాప్-10 స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్ 10లో ఉండగా.. బౌలింగ్‌లో సిరాజ్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. -
ప్రపంచకప్‌లో సంచలనం, ఆంధ్ర ఆటగాడి విధ్వంసకర శతకం.. విండీస్‌కు ఘోర పరాభవం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మరో పెను సంచనలం నమోదైంది. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన నెదర్లాండ్స్ సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఈ టోర్నీలో తొలుత తమ కంటే చిన్న జట్టైన జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్న విండీస్.. నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న డచ్ జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. విండీస్ నిర్ధేశించిన 375 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలుత నెదర్లాండ్స్‌ను ఆంధ్ర (విజయవాడ) ఆటగాడు తేజ నిడమనూరు తన విధ్వంసకర శతకంతో (76 బంతుల్లో 111; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) గట్టెక్కించగా (స్కోర్లు సమం చేసేంత వరకు తీసుకెళ్లాడు), అనంతరం సూపర్ ఓవర్లో లోగన్ వాన్ బీక్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ (4,6,4,6,6,4) ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శతక్కొట్టిన పూరన్.. రాణించిన బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్ ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (65 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76), జాన్సన్ ఛార్లెస్ (54) అర్ధసెంచరీలతో రాణించారు. తేజ నిడమనూరు వీరోచిత శతకం.. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. తేజ నిడమనూరు వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్‌ను సమం (374/9) చేయగలిగింది. తేజకు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో లోగన్ వాన్ బీక్ ఊచకోత.. బంతితోనూ మ్యాజిక్ సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ ఆటగాడు లోగన్ వాన్ బీక్ ఊచకోత కోశాడు. జేసన్ హోల్డర్ వేసిన ఆ ఓవర్లో వాన్ బీక్ వరుసగా 4,6,4,6,6,4 బాదాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ చేతులెత్తేసింది. బ్యాట్‌తో మెరిసిన వాన్ బీక్ బంతితోనూ మాయ చేశాడు. తొలి బంతిని ఛార్లెస్ సిక్సర్ బాదగా.. రెండో బంతికి హోప్ ఓ పరుగు తీశాడు. అయితే ఆ మరుసటి రెండు బంతుల్లో వాన్ బీక్.. ఛార్లెస్, హోల్డర్లను ఔట్ చేయడంతో విండీస్ కథ ముగిసింది. నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. -
సెంచరీలతో కదం తొక్కిన హోప్, పూరన్.. విండీస్ ఖాతాలో భారీ విజయం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌తో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్‌లో విండీస్ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కి విండీస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జత కలిసిన హోప్, పూరన్ జోడీ నాలుగో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాని జోడించి తమ జట్టు భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశారు. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (29), జేసన్ హోల్డర్ (16 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్ (10-0-34-3), అల్జరీ జోసఫ్ (10-0-45-2), కీమో పాల్ (10-1-63-2), అకీల్ హొస్సేన్ (10-1-49-2), కైల్ మేయర్స్ (6.4-0-37-1) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకే అలౌటై ఓటమిపాలైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్ షేక్ (63) అర్ధసెంచరీ సాధించగా.. గుల్సన్ ఝా (42), రోహిత్ పౌడెల్ (30), ఆసిఫ్ షేక్ (28), కరణ్ (28), దీపేంద్ర సింగ్ (23) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో విండీస్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమిపాలైన నేపాల్ నాలుగో స్థానానికి పడిపోయింది.గ్రూప్-ఏలో ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్ఏను మట్టికరిపించిన నెదర్లాండ్స్ మూడో ప్లేస్‌కు చేరుకోగా.. ఆడిన 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన జాంబాబ్వే.. విండీస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన యూఎస్ఏ ఐదో స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఒమన్ (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
విండీస్ బ్యాటర్ల శతకాల మోత.. పూరన్ ఊచకోత
CWC Qualifiers 2023 WI VS NEP: వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 15వ శతకాన్ని నమోదు చేయగా.. టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) నేపాల్ బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకాన్ని బాదాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌కు ముందు యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద 39 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్.. పాయింట్ల పట్టికలో (గ్రూప్-ఏ) జింబాబ్వే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-బిలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఒమన్ టాపర్‌గా, శ్రీలంక, స్కాట్లాండ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2019 వరల్డ్‌కప్ తర్వాత హోప్‌ను మించినోడే లేడు.. విండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అతను పట్టపగ్గాలు లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో హోప్ ఏకంగా 9 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాది, అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్‌ల్లో 2153 పరుగులు) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హోప్‌కు కాస్త దగ్గరగా వచ్చిన బ్యాటర్ ఎవరైనా ఉన్నాడంటే అది బాబర్ ఆజమ్ అని చెప్పాలి. బాబర్ 28 ఇన్నింగ్స్‌ల్లో 1876 పరుగులు చేసి హోప్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
రాణించిన పూరన్, హోల్డర్.. పసికూనపై విండీస్ విజయం
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా ఇవాళ (జూన్ 18) జరిగిన రెండో మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ ఓ మోస్తరు విజయం సాధించింది. హరారేలోని తకషింగ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. విండీస్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించినప్పటికీ, వారికి విజయం అంత ఈజీగా దక్కలేదు. విండీస్‌తో పోల్చుకుంటే యూఎస్ఏ టీమ్ చాలా చిన్నదే అయినా అద్భుత పోరాటపటిమ కనబర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను వారు మరో 3 బంతులు మిగిలుండగానే అలౌట్ చేశారు. విండీస్ జట్టులో గుర్తింపు పొందిన ఆటగాళ్లు చాలామంది ఉన్నప్పటికీ.. యూఎస్ఏ బౌలర్లు వారిని కట్టడి చేశారు. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) ఆటలు యూఎస్ఏ బౌలర్ల ముందు సాగలేదు. స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించడంతో విండీస్ 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ ఆటగాళ్లు 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేశారు. గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకంతో పోరాడి విండీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయ లేదు. అతనికి ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) సహకరించారు. విండీస్ బౌలర్లలో కైల్ మేయర్స్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇవాళే జరిగిన మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-బిలో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడనున్నాయి. -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్లోనైనా..
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ అభిప్రాయడపడ్డాడు. అదే సమయంలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా వంటి దేశీ ప్లేయర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరోసారి ఈ విషయం నిరూపితమైందన్నాడు. ఆ ముగ్గురే అద్భుతంగా ఐపీఎల్-2023లో లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో 8 గెలిచిన లక్నో టాప్-3లో నిలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా కృనాల్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. అయితే, లక్నో గెలిచిన చాలా మ్యాచ్‌లలో విదేశీ ఆటగాళ్లు కైలీ మేయర్స్, నికోలసన్ పూరన్, మార్కస్ స్టొయినిస్లే కీలక పాత్ర పోషించారు. హుడా దారుణంగా మార్కస్ స్టొయినిస్ మొత్తంగా సీజన్లో 15 మ్యాచ్‌లలో 408 పరుగులతో లక్నో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 13 మ్యాచ్‌లు ఆడి 379 పరుగులు సాధించిన కైలీ మేయర్స్ అతడి తర్వాతి స్థానంలో ఉండగా.. పూరన్ 15 మ్యాచ్‌లలో 358 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. ఇలా లక్నో టాప్ స్కోరర్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. మరోవైపు.. తాత్కాలిక కెప్టెన్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా 188 పరుగులు చేయగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్ హుడా పూర్తిగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లలో అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 84. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో మేయర్స్ 18 పరుగులకే పెవిలియన్ చేరగా.. కృనాల్ 8 రన్స్ మాత్రమే చేశాడు. పాపం స్టొయినిస్ ఒంటరి పోరాటం చేస్తున్న స్టొయినిస్(27 బంతుల్లో 40 పరుగులు)ను అనవసరంగా రనౌట్‌కు బలైపోయేలా చేసిన దీపక్ హుడా(15) తాను కూడా రనౌట్ అయి కొంపముంచాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్ష్య ఛేదనలో తడబడ్డ లక్నో 101 పరుగులకే చేతులెత్తేసింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడి మరోసారి భంగపడింది. కనీసం వచ్చే సీజన్లో అయినా ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్ షోలో భారత మాజీ బౌలర్ మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘లక్నో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడింది. ఆ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో స్టొయినిస్ ఒక్కడే కాసేపు పోరాడాడు. వచ్చే సీజన్లోనైనా లక్నో ఈ లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్‌లో పూరన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. స్టొయినిస్ ఆడతాడు అనుకుంటే చెత్తగా రనౌట్ కావాల్సి వచ్చింది’’ అని లక్నో బ్యాటర్ల తీరును విమర్శించాడు. చదవండి: ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్.. వీడియో వైరల్ 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 -
కావాలనే యశ్ చేతికి బంతినిచ్చా! అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే!
IPL 2023 KKR Vs LSG- LSG qualify for the playoffs: ‘‘సంతృప్తిగా ఉంది. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలోనూ మా ఆటగాళ్లు రాణించారు. మేమెప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటాం. క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాట పటిమ కనబరుస్తాం. నిజానికి ఒక దశలో వాళ్ల స్కోరు 61/1. అయినప్పటికీ.. ఇంకో 2-3 ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మేము పోటీలో ఉంటామని భావించాను. అదే సమయంలో స్పిన్నర్లకు కాస్త పట్టు దొరికింది. అది మాకు అనుకూలించింది’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌లో లక్నో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం నాటి ఉత్కంఠ పోరులో లక్నో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది. వరుసగా రెండో ఏడాది టాప్-4లో నిలిచి సత్తా చాటింది. పూరన్ అర్ధ శతకంతో.. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లక్నో నికోలస్ పూరన్ అద్భుత అర్థ శతకం కారణంగా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్ జేసన్ రాయ్(45) శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (24) సైతం మెరుగ్గా రాణించాడు. రింకూ మరోసారి ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నితీశ్ రాణా (8), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన రహ్మనుల్లా గుర్బాజ్ (10) వెంట వెంటనే అవుటయ్యారు. మిగతా బ్యాటర్లు సైతం పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రింకూ సింగ్ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం బెరుకు లేకుండా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. రింకూ విజృంభణ చూస్తే కేకేఆర్ విజయం సాధ్యమే అనిపించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమైన తరుణంలో లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోయాడు. నరాలు తెగే ఉత్కంఠ అతడి బౌలింగ్‌లో తొలి బంతికి 1 పరుగు రాగా, రెండో బంతి వైడ్ వెళ్లగా ఆ తర్వాతి రెండు బంతుల్లో పరుగులు రాలేదు. కానీ యశ్ మరోసారి వైడ్ వేశాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకూ వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టాడు. కానీ కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో కేకేఆర్ నిలిచిపోగా.. లక్నో ప్లే ఆఫ్స్‌నకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో సారథి కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. రింకూను ప్రశంసించాడు. ‘‘ఈ ఏడాది రింకూకు స్పెషల్. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు అద్భుతంగా ఆడాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి అలర్ట్ కావాల్సిందే. కావాలనే అతడికి బంతినిచ్చా ఈరోజు కూడా రింకూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆఖరి ఓవరల్లో యశ్ ఠాకూర్‌కు బంతినివ్వడాన్ని సమర్థించుకున్న కృనాల్.. ‘‘డెత్ ఓవర్లలో మప ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలని ముందే బౌలర్లకు చెప్పాను. ప్రతీ బంతికి వాళ్లతో చర్చించాను. ఇక ఆఖర్లో యశ్ ఠాకూర్‌కు బంతినివ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. గత మ్యాచ్‌లో రివర్స్ సింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి మొహిసిన్‌ను రంగంలోకి దింపాను. కోల్‌కతా వికెట్ కాస్త స్లోగా ఉంది. అందుకే ఏదైతే అది అయిందని రిస్క్ చేసి మరీ యశ్‌కు బంతినిచ్చాను’’ అని తెలిపాడు. చదవండి: నిలకడకు నిలువుటద్దం.. ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్‌కు జడేజాపై సీరియస్ అయిన ధోని! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! A breathtaking finish to a sensational encounter! 🔥@LucknowIPL clinch a victory by just 1 run after Rinku Singh's remarkable knock 🙌 Scorecard ▶️ https://t.co/7X1uv1mCyL #TATAIPL | #KKRvLSG pic.twitter.com/umJAhcMzSQ — IndianPremierLeague (@IPL) May 20, 2023 -
నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన లక్నో.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ లక్నో వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన సంచలన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 17 ఓవర్ వేసిన అభిషేక్ శర్మ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను లక్నోవైపు తిప్పాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్ 4 సిక్సర్లు, 3 ఫోర్లుతో 44 పరుగులు చేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పూరన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. ఐపీఎల్లో చరిత్రలోనే తను ఎదుర్కొన్న మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. ఐపీఎల్-2021లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో డ్యానియల్ క్రిస్టయన్ బౌలింగ్‌లో వరుసగా తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను సిక్సర్లగా మలిచాడు. చదవండి: IPL 2023: అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్! భారీ జరిమానా Pooran box-office 🍿pic.twitter.com/dBu4G2P2U7 — CricTracker (@Cricketracker) May 13, 2023 -
మాపై నట్లు, బోల్ట్‌లు విసిరారు.. మిమ్మల్ని ప్లే ఆఫ్స్ చేరకుండా చేశాము..!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఇవాళ (మే 13) జరిగిన మ్యాచ్‌లో కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సందర్భంగా ఓ నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థర్డ్ అంపైర్‌ని దూషిస్తూ, లక్నో డగౌట్ వైపు నట్లు, బోల్ట్‌లు విసిరారు. దీంతో స్టేడియంలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. లక్నో శిబిరంలోని వారు మైదానంలోకి వచ్చారు. మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఎస్ఆర్హెచ్ అభిమానుల ప్రవర్తించిన తీరు పట్ల లక్నో బృందంతో పాటు ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే లక్నో శిబిరంలోని వారికి అంపైర్లు సర్ధిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. అనంతరం మ్యాచ్ సజావుగా సాగింది. నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనలో పూరన్ విధ్వంసం సృష్టించడంతో లక్నో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా, ఈ మ్యాచ్‌లో లక్నో విజయానంతరం ఆ జట్టు అభిమానులు ఎస్ఆర్హెచ్ను టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియా వేదికగా అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారు. కొందరు ఆకతాయిలు చేసిన పనికి (బోల్ట్‌లు, నట్లు విసిరినందుకు గాను) వారు మొత్తం ఎస్ఆర్హెచ్ టీమ్‌నే బ్లేమ్ చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఎస్ఆర్హెచ్ ఓడిన వైనాన్ని అవమానిస్తున్నారు. ఆకతాయిలు చేసిన చెత్త పనిని ప్రస్తావిస్తూ.. మీరు మాపై నట్లు, బోల్ట్‌లు విసిరారు.. మేము మిమ్మల్ని ప్లే ఆఫ్స్ చేరకుండా చేశామంటూ బలుపుతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సన్‌రైజర్స్ అభిమానులు సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. అలూ లేదు సూలు లేదు, కొడుకు పేరు సొమలింగం అన్నట్లుంది లక్నో పరిస్థితి అంటూ వ్యంగ్యమైన కౌంటర్లిస్తున్నారు. తాము ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాము సరే.. అదేదో వారు టైటిల్ సాధించినంత బిల్డప్ ఇస్తున్నారంటూ గట్టిగా బదులిస్తున్నారు. -
IPL 2023: పూరన్ ఊచకోత.. లక్నో గ్రాండ్ విక్టరీ.. సన్‌రైజర్స్ ఔట్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపు ఉన్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు. ఆ ఓవర్లో అభిషేక్ 31 పరుగులు (స్టోయినిస్ 2 సిక్సర్లు, పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్ (13 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (45 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేని పరిస్థితి. మరోవైపు ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించడంతో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్ (16), సీఎస్కే (15), ముంబై (14) పాయింట్ల పట్టికలో టాప్ త్రీలో ఉన్నాయి. -
SRH VS LSG: పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పూరన్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు..!
లక్నో మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటిదాకా సన్‌రైజర్స్‌కు ఫేవర్‌గా ఉన్న మ్యాచ్‌ను పూరన్.. మూడు బంతుల్లో మలుపు తిప్పాడు. Pooran box-office 🍿pic.twitter.com/dBu4G2P2U7— CricTracker (@Cricketracker) May 13, 2023 వివరాల్లోకి వెళితే.. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో బరిలోకి దిగిన పూరన్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను లక్నోవైపు తిప్పాడు. అభిషేక్ శర్మ వేసిన ఈ ఓవర్లో మొత్తం 31 పరుగులు వచ్చాయి. పూరన్‌కు ముందు స్టోయినిస్ సైతం రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే స్టోయినిస్ అదే ఓవర్లో అభిషేక్ ఉచ్చులో చిక్కి ఔటయ్యాడు. 16 ఓవర్ తర్వాత సమీకరణలు 24 బంతుల్లో 38 పరుగులుగా మారాయి. చేతిలో మరో 7 వికెట్లు ఉండటంతో లక్నో గెలుపుపై ధీమాగా ఉంది. అంతకుముందు ఇదే సీజన్లో పూరన్ ఇదే తరహాలో రెచ్చిపోయి, చేదాటిపోయిన మ్యాచ్‌ను గెలిపించాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో పూరన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే, లక్నోతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. -
#KLRahul: త్వరగా ఔటయ్యి జట్టుకు మేలు చేశావు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల రాహుల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినప్పటికి నెమ్మదిగా ఆడి లక్నో ఓటమికి కారణమయిన రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగులే చేసి ఔటైనప్పటికి రాహుల్‌ను విమర్శించడంతో పాటు కొంత మంది అభిమానులు మెచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. వాస్తవానికి తొలి బంతికే కేఎల్ రాహుల్ వెనుదిరగాల్సింది. అయితే తైదే క్యాచ్ అందుకోవడంలో విఫలం కావడంతో రాహుల్ బతికిపోయాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే రబాడ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo: IPL Twitter విమర్శించడం ఓకే.. మెచ్చుకోవడం ఏంటి? కేఎల్ రాహుల్‌ను మెచ్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. అతను త్వరగా వెనుదిరిగాడు కాబట్టే లక్నో.. పంజాబ్‌తో మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. కైల్ మేయర్స్ ఇచ్చిన అద్బుత ఆరంభాన్ని స్టోయినిస్, బదోని, నికోలస్ పూరన్‌లు కంటిన్యూ చేశారు. ఒకరిని మించి మరొకరు బ్యాటింగ్ చేసి ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ తొలిసారి భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఔట్ కాకపోయినా.. మరో ఆరేడు, ఓవర్లు బ్యాటింగ్ చేసేవాడు. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగా స్టోయినిస్, పూరన్‌ల అద్భుత ప్రదర్శన మిస్సయ్యేవాళ్లం. అందుకే రాహుల్ త్వరగా ఔటయ్యి ఒక రకంగా జట్టుకు మేలు చేశాడని అభిమానులు సోషల్‌మీడియాలో ట్రోల్ చేయడం విశేషం. KL Rahul dismissed for 12 runs in 9 balls. Advantage LSG now 🔥#PBKSvsLSG pic.twitter.com/yurToeXJ2t — Utsav 💔 (@utsav045) April 28, 2023 చదవండి: ఏమా విధ్వంసం.. ఇలా ఆడితే డికాక్‌కు కష్టమే! -
బులెట్ కన్నా వేగంగా.. అక్కడుంది శాంసన్ బ్రో!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మూడుఔట్లు నమోదు కాగా.. అన్నింటిలో శాంసన్ పాత్ర ఉండడం విశేషం. ఇందులో రెండు రనౌట్లు ఉంటే ఒకటి క్యాచ్ ఔట్. ఇక 29 పరుగులతో వేగంగా ఆడుతున్న నికోలస్ పూరన్‌ను సంజూ శాంసన్ ఔట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ ఓవర్ ఐదో బంతిని కృనాల్ స్వింగ్ ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు. అయితే క్విక్ సింగిల్ కోసం పూరన్ ముందుకు పరిగెత్తుకొచ్చాడు. కృనాల్ వద్దన్నా వినలేదు. ఇక కీపర్ శాంసన్ తన చేతిలోకి బంతి రావడమే ఆలస్యం.. డైరెక్ట్ త్రో వేశాడు. బులెట్ కన్నా వేగంతో వచ్చిన బంతి పూరన్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. రిప్లేలో పూరన్ రనౌట్ అని క్లియర్‌గా తెలుస్తోంది. పెవిలియన్ బాట పట్టిన పూరన్ తనను తాను తిట్టుకుంటూ వెళ్లడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Brilliant keeping by captain cool #SanjuSamson to get Pooran out. #RRvLSG #RajasthanRoyals pic.twitter.com/M8ofJci3YX — Roshmi 💗 (@CricketwithRosh) April 19, 2023 What a run-out by Captain Sanju Samson - A brilliant direct hit and even Sanju didn't take off his gloves.Captain Sanju leading by example! pic.twitter.com/xOLmTLRO5B— CricketMAN2 (@ImTanujSingh) April 19, 2023 చదవండి: 'డికాక్‌ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!' -
దుమ్ము రేపుతున్నాడు.. సన్‌రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే?
ఐపీఎల్-2023లో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిద్యం వహిస్తున్న పూరన్.. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అందరని అకట్టుకుంటున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్స్‌లు సాయంతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 15 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది సీజన్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్ రికార్డులకెక్కాడు. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న నికోలస్.. తన మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 36 పరుగులతో రాణించిన పూరన్.. అనంతరం చెన్నైపై 18 బంతుల్లో 32 పరుగులు చేసి మ్యాచ్‌ను చాలా దగ్గరగా తీసుకువెళ్లాడు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్‌లో లక్నో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఎస్ఆర్హెచ్పై కూడా కేవలం 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన పూరన్ 141 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టి తప్పు చేసిందా? ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో పూరన్‌ను రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇంత భారీ దక్కించుకున్న పూరన్.. తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. గతఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన పూరన్ 48.83 సగటుతో 263 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇక దారుణంగా విఫలమైన పూరన్‌ను ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో మినీవేలం లోకి వచ్చిన పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్లు వెచ్చించి మరి సొంతం చేసుకుంది. తన తీసుకున్న మొత్తానికి పూరన్ న్యాయం చేస్తున్నాడు. ఇక లక్నో తరపున అదరగొడుతున్న పూరన్‌ను ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ విడిచిపెట్టి పెద్ద తప్పు చేసింది అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. పూరన్ అద్భుతమైన ఆటగాడు అని, ఒక్క సీజన్‌కే విడిచిపెట్టడం సరికాదని సోషల్ మీడియాలో పోస్టు్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: కేకేఆర్‌తో మ్యాచ్.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే 𝙏𝙝𝙚 𝘾𝙡𝙖𝙨𝙨 𝙤𝙛 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 🥵@LucknowIPL's swashbuckling batter scores the fastest #TATAIPL2023 5️⃣0️⃣ 💥 #RCBvLSG #JioCinema #IPLonJioCinema pic.twitter.com/w62ZhrkROV — JioCinema (@JioCinema) April 10, 2023 -
Nicholas Pooran: ఫాస్టెస్ట్ ఫిఫ్టితో పాటు మరో రికార్డు
IPL 2023: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తాజా సంచలనం నికోలస్ పూరన్ ఐపీఎల్ సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి (15 బంతుల్లో) సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొత్తం 19 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 62 పరుగులు బాదాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్లో జాయింట్ సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి (సునీల్ నరైన్, యూసఫ్ పఠాన్‌తో కలిసి)తో పాటు మరో మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌తో కలిపి మొత్తం 51 మ్యాచ్‌లు ఆడిన పూరన్.. 157. 87 స్ట్రయిక్ రేట్‌తో 1000 పరుగుల మార్కును దాటాడు (1053). ఇదిలా ఉంటే, నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తొలుత స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో లక్నో విజయం సాధించింది. లక్నో గెలుపు పరుగు బై రూపంలో రావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన పూరన్.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్
ఐపీఎల్లో-2023లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలో తడబడింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్టోయినిష్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మెరుపు బ్యాటింగ్ సూపర్ జెయింట్స్ శిబిరంలో కాస్త ఆశలు రేపింది. అయితే స్టోయినిష్ ఔటయ్యక ఇక లక్నో గెలుపు కష్టమని భావించారు. పూరన్ విధ్వంసం ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 15 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2023లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా యూసప్ పఠాన్, సునీల్ నరైన్‌తో కలిసి నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కేల్ రాహుల్, ప్యాట్ కమ్మిన్స్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతులు ఎదుర్కొన్న పూరన్ 4 ఫోర్లు, 7 సిక్స్‌లు సాయంతో 62 పరుగులు చేశాడు. ఇక విజయానికి దగ్గరలో పూరన్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ వైపు మలుపు తిరిగింది. అయితే మరో ఎండ్‌లో ఉన్న ఆయుష్ బదోని సమయస్పూర్తిగా ఆడుతూ.. మ్యాచ్‌ను మరింత దగ్గరగా తీసుకువెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తూ బదోని 19 ఓవర్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో లక్నో శిబిరంలో ఉత్కంఠ మొదలైంది. ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే కావాలి. బంతిని డుప్లెసిస్.. హర్షల్ పటేల్ చేతికి ఇచ్చాడు. క్రీజులో ఉనద్కట్, వుడ్ ఉన్నారు. తొలి బంతికి ఉనద్కట్ సింగిల్ తీశాడు. అనంతరం రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో లక్నో విజయ సమీకరణం ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. నాలుగో బంతికి బిష్ణోయ్ సింగిల్ తీసి ఉనద్కట్ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఆర్సీబీ, లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. చదవండి: RCB VS LSG: 2023 ఐపీఎల్లో అత్యంత భారీ సిక్సర్.. కొడితే స్టేడియం దాటి బయట పడింది.. 𝙏𝙝𝙚 𝘾𝙡𝙖𝙨𝙨 𝙤𝙛 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 🥵@LucknowIPL's swashbuckling batter scores the fastest #TATAIPL2023 5️⃣0️⃣ 💥 #RCBvLSG #JioCinema #IPLonJioCinema pic.twitter.com/w62ZhrkROV — JioCinema (@JioCinema) April 10, 2023 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
సిక్సర్ల మోత మోగించిన పూరన్, ఫ్లెచర్.. దద్దరిల్లిన షార్జా స్టేడియం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్-2 బెర్తులతో (గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్) పాటు ఓ ఫైనల్ బెర్త్ (డెసర్ట్ వైపర్స్) ఖరారయ్యాయి. గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 10) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ విన్నర్ ఫిబ్రవరి 12న జరిగే లీగ్ తుది పోరులో డెసర్ట్ వైపర్స్‌తో తలపడుతుంది. ఇక, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్ మధ్య నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఎంఐ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇంటికి పంపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఎంఐ టీమ్.. దుబాయ్ క్యాపిటల్స్‌ను 151/5 స్కోర్‌కే పరిమితం చేసింది. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. డ్వేన్ బ్రావో ఓ వికెట్ దక్కించుకున్నాడు. దుబాయ్ ఇన్నింగ్స్‌లో మున్సే (43 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించగా.. సికందర్ రజా (34 బంతుల్లో 38; 4 ఫోర్లు), రోవ్‌మన్ పావెల్ (22 బంతుల్లో 30; 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. పేలిన పూరన్, ఫ్లెచర్.. .. దద్దరిల్లిన షార్జా స్టేడియం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ టీమ్.. కేవలం 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆండ్రీ ఫ్లెచర్ (45 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (36 బంతుల్లో 66 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన మెరుపు అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. దుబాయ్ బౌలర్లలో జేక్ బాల్, దసున్ శనకలకు తలో వికెట్ దక్కింది. ముహమ్మద్ వసీమ్ (2), లోర్కాన్ టక్కర్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఫ్లెచర్, పూరన్ జోడీ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి, తమ జట్టును క్వాలిఫయర్-2కు చేర్చారు. పూరన్, ఫ్లెచర్ మెరుపు విన్యాసాల ధాటికి షార్జా స్టేడియం దద్దరిల్లింది. -
IPL 2023: జాక్‌పాట్ కొట్టాడు.. అత్యధిక మొత్తం అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్‌కు అదృష్టం తలుపు తట్టింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో పూరన్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని సొంతం చేసుకుంది. తద్వారా వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పూరన్‌ను రూ. 10.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది 14 మ్యాచ్‌ల్లో 306 పరుగులు చేసిన పూరన్ పెద్దగా రాణించకపోవడంతో మినీ వేలానికి ముందు అతన్ని రిలీజ్ చేసింది. అలా రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చి రూ. 16 కోట్లకు అమ్ముడుపోవడం పూరన్‌కే సాధ్యమైంది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లోనూ విండీస్ దారుణంగా విఫలమైంది. అతని కెప్టెన్సీలోని వెస్టిండీస్ గ్రూప్ దశకే పరిమితమైంది. ఆ తర్వాత అతను వెస్టిండీస్ కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఇంత నెగెటివ్ ఉన్నప్పటికి పూరన్‌కు భారీ ధర పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ప్రైవేట్ లీగ్ టోర్నీల్లో పూరన్‌కు మంచి రికార్డు ఉంది. అబుదాబి టి10 లీగ్‌లోనూ పూరన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పూరన్ కోసం మొదట సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. రూ. 3 కోట్లు దాటగానే ఢిల్లీ క్యాపిటల్స్ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత రూ. 6 కోట్ల వరకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్స్ పోటీ పడ్డాయి. ఇక ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ పోటీలోకి వచ్చింది. రూ. 7.25 కోట్ల నుంచి ఒకేసారి రూ. 15 కోట్ల వరకు వెళ్లింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు పూరన్‌ను దక్కించుకుంది. చదవండి: Cameron Green: హాట్ ఫేవరెట్ కావొచ్చు.. కానీ అంత ధరెందుకు? ఛాంపియన్ అవ్వాలని వచ్చింది.. అనుమానాస్పద మృతి -
వరల్డ్ కప్‌లో తుస్సుమనిపించాడు.. అక్కడ మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నాడు!
అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ మరో సారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్‌కు పూరన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా నార్తర్న్ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పూరన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 32 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 80 పరుగులు సాధించాడు. పూరన్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 10 ఓవర్లలో గ్లాడియేటర్స్ మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అతడితో పాటు కోహ్లర్-కాడ్మోర్(32) పరుగులతో రాణించాడు. అనంతరం 139 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. వారియర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడమ్ లైత్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన పూరన్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పూరన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో వెస్టిండీస్‌కు సారథ్యం వహించిన పూరన్.. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన పూరన్ కేవలం 25 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మెగా టోర్నీలో వెస్టిండీస్.. స్కాట్లాండ్, ఐర్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి క్వాలిఫియర్ రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్ విండీస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. The Gladiators captain is named Player of the Match for his outstanding innings 💪 8️⃣0️⃣ runs 3️⃣2️⃣ balls 2️⃣5️⃣0️⃣ strike rate @nicholas_47 🤝 #AbuDhabiT10 #InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/lYIgKUTqwa — T10 League (@T10League) November 25, 2022 చదవండి: IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డే కష్టమే! -
కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో!
అబుదాబి టీ10 లీగ్‌లో దక్కన్ గ్లాడియేటర్స్ బోణీ కొట్టింది. టీమ్ అబుదాబితో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. అబుదాబి బ్యాటర్లలో జెమ్స్ విన్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక గ్లాడియేటర్స్ బౌలింగ్‌లో జహూర్ ఖాన్, హెల్మ్ తలా రెండు వికెట్లు సాధించగా.. షమ్సీ, లిటిల్ చెరో వికెట్ పడగొట్టారు. పూరన్ విధ్వంసం ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్కన్ గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గ్లాడియేటర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓడియన్ స్మిత్ 23 పరుగులతో రాణించాడు. టీమ్ అబుదాబి బౌలర్లలో పీటర్ హట్జోగ్లూ, అలెన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ టోర్నీ ఆరంభానికి ముందు రోజే వెస్టిండీస్ కెప్టెన్సీకి నికోలస్ పూరన్ రాజీనామా చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. The Grind is on. The Gladiators⚔️ are ready. It's gonna be EPIC💥!#CricketsFastestFormat @T10League 🏆#DeccanPhirJeetaga🏆 #AbuDhabiT10 #Season6 #InAbuDhabi #DeccanGladiators #HumHaiDakshin #deccanagain #heretowin pic.twitter.com/JNd1P9stIQ — Deccan Gladiators (@TeamDGladiators) November 23, 2022 చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం -
నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం.. విండీస్ కెప్టెన్సీకి గుడ్‌బై
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ విండీస్ కెప్టెన్సీ పూరన్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెళ్లడించాడు. కాగా ఈ ఏడాది కిరాన్ పోలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ విండీస్ సారధిగా ఎంపికయ్యాడు. కెప్టెన్‌గా ఎంపికైన పూరన్ జట్టును విజయ పథంలో నడిపించలేకపోయాడు. అంతేకాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా తీవ్ర నిరాశపరిచాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి విండీస్ నిష్క్రమించింది. " టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాను. ఆఖరికి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కాగా విండీస్ కెప్టెన్సీ బాధ్యతలను అంకితభావంతో స్వీకరించాను. నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనప్పటినుంచి జట్టుకు నా వంతు కృషిచేశాను. కానీ ప్రపంచకప్‌లో మాత్రం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. మాకు మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడేందుకు చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు మేము పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతాము" అని పూరన్ పేర్కొన్నాడు. అతడు 15 వన్డేలు, 15 టీ20ల్లో విండీస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20ల్లోనే కెప్టెన్‌గా పూరన్ విజయవంతమయ్యాడు. కాగా విండీస్ వైస్ కెప్టెన్‌గా ఉన్న పావెల్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. "I remain fully committed to West Indies cricket." - @nicholas_47 pic.twitter.com/n0OvM1v7yw — Windies Cricket (@windiescricket) November 21, 2022 చదవండి: IND vs NZ: గెలిస్తే... సిరీస్ మన చేతికి.. సంజూ సామ్సన్, యువ పేసర్‌కు అవకాశం? -
వెస్టిండీస్ జట్టుకు కొత్త సారధి.. పాత కెప్టెన్‌పై వేటు..?
టీ20 వరల్డ్‌కప్-2022లో ఘోర వైఫల్యం చెంది.. పసికూనలైన ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడి, క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటి బాట పట్టిన టూ టైమ్ టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో ప్రక్షాళన మొదలైంది. వరల్డ్‌కప్‌లోనే కాక కెప్టెన్‌గా ఎంపికైన నాటి నుంచి వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమైన నికోలస్ పూరన్‌పై వేటుకు సర్వం సిద్ధమైంది. పరిమిత ఓవర్లలో విండీస్ కొత్త కెప్టెన్‌పై అధికారిక ప్రకటనే తరువాయి అని ఆ దేశ క్రికెట్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పూరన్ తదుపరి కెప్టెన్‌గా వైస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఖరారైందని విండీస్ క్రికెట్ బోర్డులోని కీలక వ్యక్తి వెల్లడించారు. తాజాగా రోవ్‌మన్ పావెల్ సారధ్యంలోని జమైకా స్కార్పియన్స్ జట్టు 11 ఏళ్ల తర్వాత సూపర్-50 కప్ కైవసం చేసుకోవడంతో జాతీయ జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. శనివారం (నవంబర్ 19)జరిగిన సూపర్-50 కప్ ఫైనల్లో జమైకా స్కార్పియన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయింది. జమైకా స్కార్పియన్స్ టైటిల్ సాధించడంలో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, వరల్డ్‌కప్-2022లో విండస్ ఘోర వైఫల్యం తర్వాత.. జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు నిన్ననే (నవంబర్ 15) తమ రిటెన్షన్ లిస్ట్‌తో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో కొందరిని అవమానకర రితీలో వదిలించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రిలీజ్ చేసిన ఆటగాళ్ల గత రికార్డులు, వారి సామర్ధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఫ్రాంచైజీలు.. సదరు ఆటగాళ్ల గత సీజన్ ఫామ్, ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే కొలమానంగా తీసుకుని, కనీసం ముందస్తు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా తప్పించాయని సమాచారం. ఫ్రాంచైజీలు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా రిలీజ్ చేయడంపై చాలా మంది ఆటగాళ్లు తీవ్ర మనస్థాపానికి గరయ్యారని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. ముఖ్యంగా కొందరు స్టార్ ఆటగాళ్లు, మెగా వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు.. ఫ్రాంచైజీలు ఇలా అవమానకర రీతిలో తమతో వ్యవహరిస్తాయని ఊహించలేదని వాపోయినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (14 కోట్లు) పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (14 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: నికోలస్ పూరన్ (10.75 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్: జేసన్ హోల్డర్ (8.75 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: రొమారియో షెపర్డ్ (7.75 కోట్లు) ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా.. గుజరాత్ టైటాన్స్: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్. వీరిలో రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్‌లను కేకేఆర్ ట్రేడింగ్ చేసుకోగా, మిగిలిన ముగ్గురిని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం వేలానికి వదిలి పెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. వీరిలో శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ చేసుకోగా, ఢిల్లీ యాజమాన్యం మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. రాజస్తాన్ రాయల్స్: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. వీరిలో డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లను ఆర్ఆర్ యాజమాన్యం చిన్నచూపు చూసింది. కేకేఆర్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. వీరిలో పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్ వివిధ కారణాల చేత స్వతాహాగా లీగ్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించగా.. అలెక్స్ హేల్స్, అజింక్య రహానే, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే లాంటి స్టార్లకు అవమానకర ఉద్వాసన తప్పలేదు. పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. వీరలో కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్ అత్యంత దారుణ పరాభవం కాగా, ఒడియన్ స్మిత్ లాంటి విదేశీ ప్లేయర్‌ను ఫ్రాంచైజీ అస్సలు పట్టించుకోలేదు. ఆర్సీబీ: జేసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. వీరిలో జేసన్ బెహ్రెండార్ఫ్ను కేకేఆర్ ట్రేడ్ చేసుకోగా.. రూథర్‌ఫోర్డ్‌కు బలవంతపు ఉద్వాసన తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ఈ ఫ్రాంచైజీనే అత్యధికంగా స్టార్ ఆటగాళ్లను తప్పించింది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్ లాంటి విదేశీ స్టార్లు తీవ్రంగా మనసు నొచ్చుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్: వేలానికి ముందు అత్యధిక మంది ప్లేయర్లను వదిలిపెట్టిన ఫ్రాంచైజీ ఇదే. ఈ జట్టు కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది. ఎంపై మేనేజ్మెంట్.. వీరిలో పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుని తృప్తి పరచగా.. డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్ టైమల్ మిల్స్ లాంటి ఆటగాళ్లకు అవమానం తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. వీరిలో ఆండ్రూ టై, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే లాంటి పేరున్న ఆటగాళ్లను యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. వీరిలో డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. క్రిస్ జోర్డాన్‌పై వేటు పడింది. -
తొలి రౌండ్లోనే ఇంటికి.. వెస్టిండీస్ కెప్టెన్సీకి పూరన్ గుడ్‌బై!
టీ20 ప్రపంచకప్-2022లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్లోనే విండీస్ ఇంటిముఖం పట్టింది. ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూనలపై కూడా విండీస్ తమ ప్రతాపం చూపలేపోయంది. కాగాటీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష జరుపుతామని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రిక్కీ స్కెర్రిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విండీస్ జట్టు హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ తన హెడ్ కోచ్ పదవికి మంగళవారం రాజీనామా చేశాడు. ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది అని అతడు తెలిపాడు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సిమన్స్ పేర్కొన్నాడు. మరోవైపు విండీస్ వైట్‌బాల్ కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా పూరన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక కరీబియన్ జట్టు ద్వై పాక్షిక సిరీస్‌లలో కూడా ఘోర పరాజయాలను చవిచూసింది. అదే విధంగా కెప్టెన్సీ పరంగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా పూరన్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో పూరన్ స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న రావ్మన్ పావెల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది కిరాన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ విండీస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. చదవండి: T20 World Cup 2022: ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన.. వెస్టిండీస్ హెడ్ కోచ్ రాజీనామా -
విండీస్ జట్టుకు పోస్టుమార్టం జరగాల్సిందే..!
1970,80వ దశకంలో వెస్టిండీస్ జట్టు అంటేనే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అరవీర భయంకరంగా కనిపించే విండీస్ జట్టును చూస్తేనే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌లు ఓడిపోవాల్సిన దాఖలాలు కనిపించాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్ విధ్వంసక ఆటగాళ్లకు పెట్టింది పేరు. వన్డేల్లో రెండు వరల్డ్‌కప్‌లు.. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం. ఆ తర్వాత టి20 ఫార్మాట్‌కే కొత్త వినోదాన్ని అందించిన విండీస్ జట్టు కొన్ని దశాబ్దాల కిందట రారాజుగా వెలుగొంది చివరకు పాతాళానికి పడిపోయింది. ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించకపోవడమే ఒక వైఫల్యం కాగా, ఇప్పటి ప్రదర్శన వెస్టిండీస్ క్రికెట్‌కు మరో విషాదం! 90ల్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయి...2000ల్లో వన్డే క్రికెట్లో పూర్తి ఓవర్లు కూడా ఆడలేని స్థాయికి దిగజారి... ఈ రెండూ లేకపోయినా, 2010 తర్వాత టి20 దూకుడుకు చిరునామాగా మారి అద్భుతాలు చూపించిన వెస్టిండీస్ ఇప్పుడు ఈ ఫార్మాట్లో కూడా దిగజారడం క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే విషయం. -సాక్షి, వెబ్‌డెస్క్ వెస్టిండీస్ జ్టటులో తప్పు ఎక్కడ జరిగిందనేది పక్కనబెడితే.. వారి ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. ప్రపంచంలో ఎక్కడ టి20 లీగ్‌లు జరిగినా ముందుగా కనిపించేది వెస్టిండీస్ ఆటగాళ్లే. అలాంటి లీగ్స్‌లో వ్యక్తిగతంగా మెరుపులు మెరిపించే విండీస్ ఆటగాళ్లు టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో ఒక జట్టు తరపున సమిష్టిగా ఆడడంలో మాత్రం విఫలమయ్యారు. జట్టుగా చూస్తే హిట్టర్లకు కొదువ లేదు. నికోలస్ పూరన్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్ ఇలా ఎవరికి వారే పొట్టి క్రికెట్లో మెరిపించడంలో దిట్ట. ప్రపంచకప్‌లో విండీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ నికోలస్ పూరన్(5,7, 13 పరుగులు) అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఎప్పుడో జట్టుకు దూరమైన జాసన్ హోల్డర్ ఆల్‌రౌండర్ అంటూ జట్టులోకి తీసుకొచ్చారు. కానీ అతను ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా జట్టుకు భారమయ్యాడు. క్వాలిఫయింగ్ దశలో విండీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఎవరో ఒకరు రాణించారే తప్ప సమిష్టిగా ఆడిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. అసలు ఆడుతుంది వరల్డ్‌కప్ అన్న విషయం కూడా విండీస్ ఆటగాళ్లు మరిచినట్లున్నారు. సీరియస్‌గా మ్యాచ్‌ను కలిసి ఆడాల్సింది పోయి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. అసలు జట్టు కూర్పు కూడా సరిగ్గా లేదు. జట్టులో ఎంతమంది బ్యాటర్లు.. ఎంతమంది బౌలర్లు ఉండాలి.. ఏ సమయంలో ఎవరిని బ్యాటింగ్‌కు పంపాలి.. బౌలింగ్ ఎవరితో చేయించాలి అన్న కనీస పరిజ్ఞానం లేకుండా విండీస్ తమ ఆటను కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. 2012, 2016 టి20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా తుది జట్టులో లేకపోవడం పెద్ద మైనస్. రిటైర్ అయిన ఆటగాళ్ల సంగతి పక్కనబెడితే.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, హెట్‌మైర్, క్రిస్ గేల్ లాంటి కీలక ఆటగాళ్లను పక్కనబెట్టడం విండీస్ బోర్డు చేసిన పెద్ద తప్పు. వారు ఎలా ఆడతారన్నది ముఖ్యం కాదు. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉంటే సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ చిన్న లాజిక్‌ను విండీస్ బోర్డు ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు. పైగా హెట్‌మైర్ ఆఖరి నిమిషంలో విమానం ఎక్కకపోవడం అతని బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తుంది. దేశం కోసం ఒక మేజర్ టోర్నీ ఆడుతున్నామన్న కసి హెట్మైర్లో ఏ కోశానా కనిపించలేదు. ప్రైవేటు లీగ్స్ మోజులో పడి స్వంత దేశానికి ఆడడంలో నామోషీగా ఫీలవుతున్నారంటూ విండీస్ హెడ్‌కోచ్ గతంలో చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విండీస్ క్రికెట్ బోర్డును లేదా ఆటగాళ్లను తప్పుబట్టలేము. ఎందుకంటే బోర్డు సరిగ్గా ఉండి ఉంటే ఆటగాళ్లు ఇలా తయారయ్యేవారు కాదు. ప్రస్తుతం విండీస్ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే. ఆ సమయం ఆసన్నమైంది. ఇలాగే కొనసాగితే.. కొన్నేళ్ల పాటు క్రికెట్లో కనిపించకుండా పోయిన జింబాబ్వేలాగా తయారవ్వడం గ్యారంటీ. కాగా టి20 ప్రపంచకప్‌లో విండీస్ ప్రదర్శనపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రిక్కీ స్కెర్రిట్ సుదీర్ఘ లేఖ రాసుకొచ్చారు. జట్టు భవితవ్యంపై ఆందోళన చెందారు. ''టి20 ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శన నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేసింది. క్రికెట్లో ఎంతో గొప్ప పేరున్న వెస్టిండీస్ ఆసీస్ గడ్డ నుంచి ఇలా అవమానకరరీతిలో వెనుదిరిగి వస్తుందని ఎవరు ఊహించలేదు. జట్టు సెలక్షన్‌లోనే పెద్ద తప్పు జరిగింది. టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీకి ఎలాంటి జట్టును ఎంపిక చేయాలన్న విషయం పూర్తిగా విస్మరించాం. మా భవిష్యత్తుపై పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది. జట్టుకు పోస్టుమార్టం జరగాల్సిందే. వరల్డ్‌కప్‌లో మేం చేసిన తప్పులు ఏంటి.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాలపై చర్చిస్తాం. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు మునపటి వైభవం తీసుకొచ్చేలా ఆటగాళ్లను తయారు చేస్తాం. తక్షణ కర్తవ్యం జట్టు ప్రక్షాళన. ఇది చాలా అవసరం. ఇంత చెత్త ప్రదర్శనలోనూ మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. కచ్చితంగా మంచి కమ్‌బ్యాక్‌తో తిరిగి వస్తామని ఆశిస్తున్నా'' అంటూ ముగించాడు. 🚨 JUST IN 🚨 COMMENT BY CWI PRESIDENT RICKY SKERRITT. pic.twitter.com/fYVJSWy0mn — Windies Cricket (@windiescricket) October 21, 2022 చదవండి: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి' మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఇదో గుణపాఠం.. పూరన్ కన్నీటి పర్యంతం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఇదో గుణపాఠం.. పూరన్ కన్నీటి పర్యంతం!
ICC Mens T20 World Cup 2022 - West Indies vs Ireland- Nicholas Pooran: ‘‘ఈ ఓటమి తట్టుకోలేనిది. టోర్నమెంట్ ఆసాంతం మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై కూడా కేవలం 145- 146 పరుగులకే పరిమితం కావడంతో బౌలర్ల పని మరింత కష్టంగా మారింది. మా వల్ల వాళ్లు పెద్ద సవాలునే ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అంటూ వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ విచారం వ్యక్తం చేశాడు. తమపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12కు అర్హత సాధించిన ఐర్లాండ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. గ్రూప్-బిలో భాగమైన వెస్టిండీస్ సూపర్-12కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ మాజీ చాంపియన్. మాకిది గుణపాఠం ఈ నేపథ్యంలో విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమేనన్నాడు. ఐర్లాండ్ అద్బుతంగా బ్యాటింగ్ చేసిందని, బౌలర్లు కూడా రాణించారని ప్రత్యర్థి జట్టును అభినందించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా జేసన్ హోల్డర్ బాగానే బౌలింగ్ చేశాడని.. బ్రాండన్ బ్యాటింగ్‌లో అదరగొట్టడం సానుకూల అంశాలని పేర్కొన్నాడు. ఐర్లాండ్ చేతిలో ఓటమి తమకో గుణపాఠమన్న పూరన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచామని విచారం వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్‌ను వేదనకు గురిచేశామని.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా తన ప్రదర్శన పట్ల చింతిస్తున్నట్లు పూరన్ తెలిపాడు. ఈ సందర్భంగా అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. రెండుసార్లు చాంపియన్ అయిన తమ జట్టు ఇలా నిష్క్రమించడాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలం కాగా నెదర్లాండ్స్ పర్యటన నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నికోలస్ పూరన్ అటు బ్యాటర్‌గా.. ఇటు సారథిగా ఆకట్టుకోలేక పోతున్నాడు. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసినా.. బ్యాటర్‌గా మాత్రం పూరన్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ చేతిలో పలు సిరీస్‌లలోనూ ఇదే తరహాలో పరాభవం మూటగట్టుకున్నాడు. వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ స్కోర్లు: ►టాస్: వెస్టిండీస్- బ్యాటింగ్ ►వెస్టిండీస్ స్కోరు- 146/5 (20) ►ఐర్లాండ్ స్కోరు- 150/1 (17.3) ►ఫలితం: 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్ విజయం ►ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ స్కోరు: 11 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 13 పరుగులు ►విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ బ్రాండన్ కింగ్: 48 బంతుల్లో 62 పరుగులు నాటౌట్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గరెత్ డిలానీ(ఐర్లాండ్- 4 ఓవర్లలో 16 పరుగులు మూడు వికెట్లు) చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్' T20 WC 2022: పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. కీలక బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు View this post on Instagram A post shared by ICC (@icc) -
జింబాబ్వేపై గెలిస్తేనే.. లేకపోతే ఇంటికే
రెండుసార్లు టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌కు సంకట పరిస్థితి ఎదురైంది. గ్రూఫ్-బిలో క్వాలిఫయింగ్ పోరులో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ గెలిస్తేనే వెస్టిండీస్‌కు సూపర్-12 ఆశలు నిలుస్తాయి. ఒకవేళ మ్యాచ్ ఓడిందంటే మాత్రం విండీస్ ఇంటిబాట పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఏంచుకుంది. స్కాట్లాండ్ చేతిలో దారుణ పరాజయం చవిచూసిన విండీస్ జట్టు జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆ తప్పు చేయొద్దని భావిస్తోంది. జట్టుగా చూస్తే బలంగానే కనిపిస్తున్నప్పటికి అసలు మ్యాచ్‌లోకి వచ్చేటప్పటికి తుస్సుమనిపిస్తుంది. విడిగా చూస్తే విండీస్ జట్టులో హిట్టర్లకు కొదవ లేదు. నికోలస్ పూరన్, కైల్ మేయర్స్, షమ్రా బ్రూక్స్, ఎవిన్ లూయిస్, రోవ్‌మెన్ పావెల్ ఇలా ఎవరు చూసుకున్నా సరే పొట్టి క్రికెట్లో ఆరితేరిన వారే. అయితే జట్టుగా ఆడడంలో విఫలం అవుతున్న వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సూపర్-12 ఆశలు నిలుపుకుంటుందో లేదో చూడాలి. ఇక జింబాబ్వే మాత్రం ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ సికందర్ రజా సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. అతనికి తోడుగా మిగతా బ్యాటర్లు కూడా బ్యాట్ ఝులిపిస్తే జింబాబ్వానే ఆపడం విండీస్ బౌలర్ల తరం కాదు. ఇక బౌలింగ్‌లోనే జింబాబ్వే మంచి ప్రదర్శన కనబరుస్తుంది. కాగా జట్టు రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ అనారోగ్య కారణాలతో మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో చకబ్వా జట్టును నడిపించనున్నాడు. జింబాబ్వే: రెగిస్ చకబ్వా(కెప్టెన్), వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా,మిల్టన్ శుంబా,టోనీ మునియోంగా,ర్యాన్ బర్ల్,ల్యూక్ జోంగ్వే,టెండై చటారా, రిచర్డ్ నగరవ,బ్లెస్సింగ్ ముజారబానీ వెస్టిండీస్: నికోలస్ పూరన్(కెప్టెన్),కైల్ మేయర్స్,జాన్సన్ చార్లెస్, ఎవిన్ లూయిస్, షమ్రా బ్రూక్స్,రోవ్‌మెన్ పావెల్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్, ఒబెద్ మెక్కాయ్ చదవండి: ఐర్లాండ్ ఘన విజయం.. సూపర్ 12 ఆశలు సజీవం అఫ్రిది యార్కర్ దెబ్బ.. ఆస్పత్రి పాలైన ఆఫ్గన్ ఓపెనర్ -
T20 WC: మాకిది ఘోర పరాభవం.. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనైనా!
ICC Mens T20 World Cup 2022 - West Indies vs Scotland, 3rd Match, Group B: ‘‘నిజంగా మాకిది ఘోర పరాభవం. కోలుకోలేని దెబ్బ. నిరాశకు లోనయ్యాం. మేము మరింత కష్టపడాల్సి ఉంది. కచ్చితంగా రెండు మ్యాచ్‌లు గెలవాలి. ఈ ఓటమికి మేము బాధ్యత వహించాల్సిందే. జవాబుదారీగా ఉండాల్సిందే’’ అంటూ వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ భావోద్వేగానికి లోనయ్యాడు. పేరుకే రెండుసార్లు చాంపియన్! ఎవరికీ సాధ్యం కాని రీతిలో రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ పరిస్థితి గతేడాది కాలంగా దారుణంగా తయారైన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్-2021లో విఫలమైన విండీస్ ఈసారి పసికూనలతో క్వాలిఫైయర్స్ ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. అయితే, అందునా టీ20 వరల్డ్‌కప్-2022లో తమ మొదటి మ్యాచ్‌లోనే స్కాట్లాండ్ చేతిలో పరాజయం పాలైంది పూరన్ బృందం. ఏకంగా 42 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గనుక ఓడితే కనీసం సూపర్-12కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. బాధగానే ఉంది.. కానీ పర్లేదు ఈ నేపథ్యంలో కెప్టెన్ నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. ఈ ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశాడు. అయితే, ఒక్క పరాజయంతో కుంగిపోవాల్సిన పనిలేదని, అలా చేస్తే తదుపరి మ్యాచ్‌పై ప్రభావం పడుతుంది కాబట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామన్నాడు. కాగా స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సే 66 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు(160-5) చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ బ్యాటర్లను స్కాట్లాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో విజయం వారి సొంతమైంది. మున్సే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 19న వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. చదవండి: కొట్టాలనే మూడ్ లేదు.. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు T20 WC: వారెవ్వా.. ‘ఏడాది’ తర్వాత జట్టులోకి.. ఒక్క ఓవర్.. 4 పరుగులు.. 3 వికెట్లు! View this post on Instagram A post shared by ICC (@icc) -
పవర్ హిట్టర్ రీ ఎంట్రీ.. టి20 ప్రపంచకప్‌కు విండీస్ జట్టు
అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు విండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన విండీస్ జట్టులోకి పవర్ హిట్టర్ ఎవిన్ లూయిస్ రీ ఎంట్రీ ఇవ్వగా.. నికోలస్ పూరన్ కెప్టెన్ కాగా.. రోవ్‌మెన్ పావెల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కాగా హిట్టర్‌గా పేరు పొందిన ఎవిన్ లూయిస్ విండీస్ తరపున మ్యాచ్ ఆడి ఏడాది దాటిపోయింది. చివరగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లోనే విండీస్ తరపున ఆడాడు. పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు చాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టు ఈసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్-12కు క్వాలిఫై కాలేదు. దీంతో క్వాలిఫయింగ్ దశలో వెస్టిండీస్.. స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్‌లతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లు గెలిచి సూపర్-12లో చోటు దక్కించుకోవాలని విండీస్ ఆశిస్తోంది. ఇక విండీస్ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఎదుర్కోనుంది. టి20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, ఓడియన్ స్మిత్, జాన్సన్ చార్లెస్, షిమ్రాన్ హెట్‌మైర్, జాసన్ హోల్డర్, రేమాన్ రీఫర్, ఒబెద్ మెక్కాయ్, అల్జారీ జోసెఫ్, అకేల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్, యానిక్ కరియా -
WI Vs NZ: ఓ సెంచరీ, కెప్టెన్ స్కోరు 91, మరో అర్ధ శతకం.. అయినా పాపం విండీస్!
West Indies vs New Zealand, 3rd ODI- Nicholas Pooran Comments: నెదర్లాండ్స్ పర్యటనలో వన్డే సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్.. గెలుపు జోష్‌లో పాకిస్తాన్‌కు పయనం.. కానీ ఆతిథ్య జట్టు చేతిలో వైట్‌వాష్.. స్వదేశంలో వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ చేతిలో క్లీన్‌స్వీప్... సొంతగడ్డపై టీమిండియాతో వన్డే సిరీస్‌లోనూ ఇదే ఫలితం.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌లో కరేబియన్ గడ్డపై 2-1తో ఓటమి.. ఇలా వెస్టిండీస్ ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్లో ఘోర పరాజయాలు నమోదు చేసింది. నికోలస్ పూరన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెదర్లాండ్స్ పర్యటనలో విజయం, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లలో గెలుపు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఆఖరి వరకు పోరాడినా చిన్న చిన్న తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇక తాజాగా కివీస్‌తో నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో విండీస్ పరాజయం పాలైంది. దీంతో మరోసారి మరో పర్యాటక జట్టుకు సిరీస్‌ను సమర్పించుకుంది. ఓ సెంచరీ.. రెండు అర్ధశతకాలు! బార్బడోస్ వేదికగా వెస్టిండీస్- న్యూజిలాండ్ మధ్య ఆదివారం(ఆగష్టు 21) మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు షాయీ హోప్(51), కైల్ మేయర్స్(105) అద్బుత ఆరంభం అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం 55 బంతుల్లోనే 91 పరుగులు సాధించి సత్తా చాటాడు. పేకమేడలా కుప్పకూలిన మిడిలార్డర్! కానీ కివీస్ బౌలర్ల ధాటికి విండీస్ మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. పూరన్ తర్వాత రంగంలోకి దిగిన ఆటగాళ్లు నమోదు చేసిన స్కోర్లు వరుసగా 1,2,4,1,4,20(నాటౌట్),1(నాటౌట్). దీంతో నిర్ణీత 50 ఓవర్లలో పూరన్ బృందం 301 పరుగులు స్కోరు చేసింది. జిమ్మీ నీషమ్ మెరుపులు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ విజయానికి ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 57 పరుగులతో రాణించి బాటలు పరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ డెవాన్ కాన్వే 56, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ టామ్ లాథమ్ 69, డారిల్ మిచెల్ 63 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆఖర్లో జిమ్మీ నీషమ్ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పర్యాటక జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అదే మా కొంప ముంచింది.. భారీ మూల్యం చెల్లించాం! ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. తాము మెరుగైన స్కోరే చేశామన్నాడు. అయితే, నంబర్ వన్ జట్టు అయిన న్యూజిలాండ్‌ను ఇలాంటి పిచ్‌పై ఆపడం ఎవరితరం కాదని.. పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారని ప్రశంసించాడు. అదే విధంగా.. తమ జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువని.. ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైనా మళ్లీ పుంజుకుంటున్న తీరు ప్రశంసనీయమన్నాడు. రెండో వన్డే(బ్యాటర్ల వైఫల్యంతో 50 పరుగుల తేడాతో ఓటమి)లో చేసిన పొరపాటు వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా పొరపాట్లు సరిదిద్దుకుని మరింత ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. IND vs ZIM 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి A big fight to the end. Congratulations to @BLACKCAPS on the series win. #WIvNZ pic.twitter.com/qoA8WHugMY — Windies Cricket (@windiescricket) August 22, 2022 -
రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన విండీస్ జట్టు.. వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన విండీస్.. పేస్ బౌలర్లు రెచ్చిపోవడంతో ప్రత్యర్ధిని 190 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఛేదనలో బ్రూక్స్ (91 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) రాణించడంతో మరో 11 ఓవర్లు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేసిన 34 పరుగులకే అత్యధికం కాగా, విండీస్ పేసర్లు ఆకీల్ హొసేన్, అల్జరీ జెసఫ్ తలో 3 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు పడగొట్టాడు. విండీస్ కోల్పోయిన 5 వికెట్లను ట్రెంట్ బౌల్ట్ (2/49), టిమ్ సౌథీ (2/39), మిచెల్ సాంట్నర్ (1/25) పంచుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు (ఆగస్ట్ 19) ఇదే వేదికగా జరుగనుంది. చదవండి: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఆరేళ్ల తర్వాత విండీస్ ఆటగాడు రీ ఎంట్రీ! -
రాణించిన విలియమ్సన్.. తిప్పేసిన సాంట్నర్
కింగ్స్టన్ (జమైకా): స్వదేశంలో టీమిండియా చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను, 1-4 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయి పరువు పోగొట్టుకున్న వెస్టిండీస్ జట్టు.. వరుస పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (ఆగస్ట్ 10) జరిగిన తొలి టీ20లోనూ కరీబియన్ జట్టు ఓటమిపాలైంది. కేన్ విలియమ్సన్, మిచెల్ సాంట్నర్ రాణించడంతో పర్యాటక జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. విలియమ్సన్ (33 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డెవాన్ కాన్వే (29 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జిమ్మీ నీషమ్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా, ఛేదనలో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో రొమారియో షెపర్డ్(16 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), ఓడియన్ స్మిత్ (12 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్)లు భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. మిచెల్ సాంట్నర్ (3/19) తన స్పిన్ మాయాజాలంతో విండీస్‌ను దెబ్బకొట్టాడు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ మూడు వికెట్లతో పర్వాలేదనిపించాడు. చదవండి: బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం.. సిరీస్ జింబాబ్వే సొంతం -
పంత్ ప్రవర్తనపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. వెస్టిండీస్‌తో నాలుగో టి20లో బ్యాటింగ్‌లో 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన పంత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే పూరన్ రనౌట్ విషయంలో పంత్ ప్రవర్తన హిట్‌మ్యాన్‌కు కోపం తెప్పించింది. విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ 5వ ఓవర్లో నికోలస్ పూరన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ రనౌట్ చేసింది ఎవరో కాదు.. రిషబ్ పంత్. అయితే రనౌట్‌కు ముందు ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కవర్ పాయింట్ దిశగా ఆడిన పూరన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కైల్ మేయర్స్ వద్దని వారించిన వినకుండా ముందుకు పరిగెత్తాడు. అప్పటికే మిడ్‌ఫీల్డ్‌లో ఉన్న సంజూ శాంసన్ వేగంగా పరిగెత్తుకొచ్చి పంత్‌కు క్విక్ త్రో వేశాడు. బంతిని అందుకున్న పంత్.. వికెట్లను గిరాటేయకుండా సమయాన్ని వృథా చేశాడు. అయితే పూరన్ అప్పటికే సగం క్రీజు దాటి మళ్లీ వెనక్కి వచ్చినా తాను క్లియర్ రనౌట్ అవుతానని తెలిసి ఆగిపోయాడు. ఆ తర్వాత పంత్ బెయిల్స్ ఎగురగొట్టాడు. అయితే ఇదంతా గమనించిన రోహిత్.. పంత్ దగ్గరకు వచ్చి..''సమయం ఎందుకు వృథా చేస్తున్నావ్.. బంతి దొరికిన వెంటనే బెయిల్స్ పడగొట్టొచ్చుగా'' అంటూ కోపాన్ని ప్రదర్శించాడు. అయితే తర్వాత కూల్ అయిన రోహిత్.. నవ్వుతూ పంత్‌ను హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్రీజులోకి వచ్చిన వెంటనే మూడు భారీ సిక్సర్లతో విరుచుకుపడిన పూరన్ 8 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. అతను క్రీజులో నిలదొక్కుకుంటే ఎంత డేంజర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే పూరన్ రనౌట్ విషయంలో పంత్ ప్రవర్తనపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అభిమానులు కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా 55 పరుగుల తేడాతో విజయం అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం విండీస్ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్ (24), రావ్మన్ పావెల్ (24) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. Rishabh Pant 🤣🤣🤣@RishabhPant17 pic.twitter.com/mtXoIOqgYa — VISWANTH (@RisabPant17) August 7, 2022 చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో! -
మ్యాచ్ గెలవాలని.. ముందస్తు ప్లాన్ అయితే కాదుగా!
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అవకాశం దొరికిన ప్రతీసారి జాఫర్ ఏదో ఒక ఫన్నీ ట్వీట్‌తో అలరిస్తాడు. తాజాగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టి20పై జాఫర్ అదే తరహా ఫన్నీ ట్వీట్‌తో మెరిశాడు. కాగా మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఆటగాళ్ల లగేజీ సకాలంలో చేరుకోలేకపోవడమే.'' ట్రినిడాడ్ నుంచి సెంట్‌కిట్స్‌కు ఆటగాళ్ల లగేజీలు ఇంకా చేరుకోలేదు. అందుకే మ్యాచ్‌ను రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించనున్నాం'' అంటూ విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనపై జాఫర్ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ కెప్టెన్ నిలోలస్ పూరన్‌ను ఏదో విషయంలో ప్రశ్నిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ..'' ముందస్తు ప్లాన్ అయితే కాదు కదా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ''మ్యాచ్ గెలవడానికి.. లగేజీ లేట్ కావడానికి మీరే పక్కా ప్లాన్ చేయలేదు కదా అని రోహిత్ పూరన్ ప్రశ్నించడం జాఫర్ చేసిన క్యాప్షన్‌కు అర్థం. జాఫర్ ట్వీట్‌ను నిజం చేస్తూ టీమిండియా కూడా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండో టి20లో 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ విజయంతో విండీస్ ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే జాఫర్ ఫన్నీ ట్వీట్‌ను సాకుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇరుజట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది. View this post on Instagram A post shared by Wasim Jaffer (@wasimjaffer14) చదవండి: SuryaKumar Yadav: అయ్యో.. సూర్యకుమార్‌కు ఎంత కష్టం! Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా -
Ind Vs WI: వాళ్ల వల్లే ఇదంతా! మరీ చెత్తగా! ఇకపై: విండీస్ కెప్టెన్
West Indies vs India, 2nd T20I: వన్డే సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన వెస్టిండీస్.. మొదటి టీ20 మ్యాచ్‌లో పరాజయంతో మరింత కుంగిపోయింది. వన్డే మ్యాచ్‌లలో గట్టి పోటీనిచ్చినా తమకు కలిసి వచ్చిన టీ20 ఫార్మాట్లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో విండీస్ బౌలర్లు తేలిపోయారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆఖరి నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నారు. జేసన్ హోల్డర్ పందొమ్మిదో ఓవర్లో 21 పరుగులు ఇస్తే.. ఆఖరి ఓవర్లో ఒబెడ్ మెకాయ్ 15 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వరుసగా 1,0,6,4,0,4 బాదాడు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన 190 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 122 పరుగులకే ఆతిథ్య జట్టు కథ ముగిసింది. ఫలితంగా 68 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. వాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు! ఈ నేపథ్యంలో సోమవారం నాటి(ఆగష్టు 1) రెండో టీ20 ఆరంభానికి ముందు వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత కొంతకాలంగా మా తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎప్పటికప్పుడు మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా ప్రదర్శన బాగుండటం లేదు. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. లోపాలు సరిచేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మేలో నికోలస్ పూరన్.. కీరన్ పొలార్డ్ నుంచి వెస్టిండీస్ పరిమితో ఓవర్ల జట్టు పగ్గాలు అందుకున్నాడు. నెదర్లాండ్స్ పర్యటనలో 3-0తో వన్డే సిరీస్ గెలిచాడు. అయితే, పాకిస్తాన్ టూర్లో ఘోర పరాభవం ఎదురైంది. వన్డే సిరీస్‌లో పాక్ చేతిలో పూరన్ బృందం 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ గెలిచినా.. వన్డే సిరీస్‌లో బంగ్లా చేతిలో.. ఆ తర్వాత టీమిండియా చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. మొదటి రెండు వన్డేల్లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు -
రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్ కిట్స్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 1) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్ మరో 57 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 3443 పరుగులు (129 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. తాజా ఫామ్ (తొలి టీ20లో 64 పరుగులు) ప్రకారం చూస్తే.. రోహిత్ ఈ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ మరో రెండు రికార్డులపై కూడా కన్నేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 16000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 44 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 11 సిక్సర్లు బాదగలిగితే అంతర్జాతీయ టీ20ల్లో కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (169) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమిస్తాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ఇరు జట్లలోని పలువురు ఆటగాళ్లను కూడా పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏవంటే.. అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకునేందుకు రవీంద్ర జడేజా వికెట్ దూరంలో, హార్దిక్ పాండ్యా రెండు వికెట్ల దూరంలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్‌కు టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడానికి 69 పరుగులు కావాలి. అంతర్జాతీయ క్రికెట్లో 100 ఫోర్లు పూర్తి చేయడానికి సూర్యకుమార్ యాదవ్ (95)కు ఐదు ఫోర్లు అవసరం. నికోలస్ పూరన్ అంతర్జాతీయ టీ20ల్లో 100 ఫోర్ల మార్కుకు ఐదు ఫోర్ల దూరంలో ఉన్నాడు. షిమ్రోన్ హెట్‌మైర్‌కు మూడు ఫార్మాట్లలో 3000 పరుగులు పూర్తి చేసేందుకు 35 పరుగులు కావాలి. అంతర్జాతీయ క్రికెట్లో 100 ఫోర్ల మార్కుకు బ్రాండన్ కింగ్ (95) ఐదు ఫోర్ల దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 150 వికెట్లు సాధించడానికి ఆల్జారీ జోసెఫ్‌కు మరో 4 వికెట్లు కావాలి. ఇదిలా ఉంటే, విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 68పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా..? రెండో టీ20లో విండీస్‌తో 'ఢీ'కి రెడీ అయిన రోహిత్ సేన -
టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా..? రెండో టీ20లో విండీస్‌తో 'ఢీ'కి రెడీ అయిన రోహిత్ సేన
తొలి టీ20లో విండీస్‌పై 68 పరుగుల భారీ తేడా గెలుపొంది జోరుమీదున్న టీమిండియా.. నేడు జరిగే రెండో టీ20లోనూ గెలిచి మరో క్లీన్‌స్వీప్‌కు బాటలు వేయాలని పట్టుదలతో ఉంది. గెలిచిన జట్టును మార్చేందుకు సుముఖంగా లేని భారత టీమ్ మేనేజ్మెంట్ తొలి మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించనుంది. మరోవైపు వన్డే సిరీస్‌ను కోల్పోయిన కరీబియన్ జట్టు టీ20ల్లోనైనా సత్తా చాటుకోవాలని భావిస్తోంది. సెయింట్ కిట్స్ వేదికగా భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తుది జట్ల అంచనా.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ వెస్టిండీస్: కైల్ మేయర్స్, షమ్రా బ్రూక్స్, జేసన్ హోల్డర్, నిక్ పూరన్, రోవ్‌మన్ పావెల్, షిమ్రోన్ హెట్‌మైర్, అకీల్ హోసీన్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, అల్జరీ జోసెఫ్, ఓబెద్ మెక్కాయ్ -
చరిత్రలో నిలిచిపోయే చాన్స్ మిస్.. వైరల్‌గా శ్రేయాస్ అయ్యర్ విన్యాసం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దినేశ్ కార్తిక్ ఫినిషర్‌గా అదరగొడితే.. కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే వీటన్నింటిని మించి శ్రేయాస్ అయ్యర్ చేసిన ఫీల్డింగ్ విన్యాసం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒకవేళ ఇది గనుక క్యాచ్‌గా అందుకొని ఉంటే మాత్రం అయ్యర్ పేరు చరిత్రలో నిలిచిపోయేది. విషయంలోకి వెళితే.. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ తొలి బంతిని నికోలస్ పూరన్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా తరలించాడు. బంతి ఎక్కువ హైట్‌లో వెళ్లడంతో పూరన్ సహా అంతా సిక్స్ అని భావించారు. కానీ బౌండరీలైన్ వద్ద శ్రేయాస్ అయ్యర్ గాల్లోకి ఎగిరి శరీరాన్ని విల్లులా మార్చుకొని ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే అతని కుడి కాలు బౌండరీలైన్‌కు ఇంచు దూరంలో ఉండడం.. బ్యాలెన్స్ గాక క్యాచ్ అందుకోవడం కష్టమైంది. దీంతో బంతిని ఇవతలికి విసిరేసి తాను బౌండరీ లైన్ అవతలికి వెళ్లిపోయాడు. అలా క్యాచ్ మిస్ అయినా సిక్సర్‌ను తప్పించడంలో అయ్యర్ విజయవంతం అయ్యాడు. అయ్యర్ విన్యాసానికి సంబంధించిన వీడియోను ఫ్యాన్‌కోడ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో రోహిత్ శర్మ 64 పరుగులతో ఆకట్టుకోగా.. ఆఖర్లో దినేశ్ కార్తిక్ మరోసారి ఫినిషర్ పాత్ర పోషించడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ చేదనలో చతికిలపడింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయి, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, జడేజాలు చెరొక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ సోమవారం(ఆగస్టు 1న) జరగనుంది. Well, that's a SUPERMAN move by @ShreyasIyer15! Watch the India tour of West Indies, only on #FanCode👉https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket#WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/GuC3MbdwzV — FanCode (@FanCode) July 29, 2022 చదవండి: Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం.. Sourav Ganguly: మనసు మార్చుకున్న 'దాదా'.. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో -
Ind Vs WI 1st T20: అద్భుతంగా ముగించాం! చాలా హర్ట్ అయ్యాం! అయినా ఇది ఆరంభమే!
India Vs West Indies 1st T20- Rohit Sharma Comments: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో రోహిత్ సేన 68 పరుగులతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్(44 బంతుల్లో 64 పరుగులు)కు తోడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ అద్భుతంగా రాణించాడు. 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మేరకు వీరిద్దరు అద్భుతంగా రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యం విధించింది. విండీస్ బ్యాటర్ల విలవిల.. ఇక భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. విండీస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చేసిన స్కోర్లు వరుసగా 15, 20, 0, 18, 14, 14, 11,0,19(నాటౌట్),5(నాటౌట్). దీంతో 122 పరుగులకే నికోలస్ పూరన్ బృందం కథ ముగిసింది. 68 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Well played to @BCCI 🇮🇳 on 5 match series opener victory in the @goldmedalindia T20I Cup, powered by Kent Water Purifiers #WIvIND pic.twitter.com/eA7Wzfril1 — Windies Cricket (@windiescricket) July 29, 2022 కాగా విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ బ్రూక్స్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్‌కు ఒకటి, అర్ష్‌దీప్ సింగ్‌కు రెండు, రవీంద్ర జడేజాకు ఒకటి, అశ్విన్‌కు రెండు, రవి బిష్ణోయికి రెండు వికెట్లు దక్కాయి. ఇక తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన దినేశ్ కార్తిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సంతోషంగా ఉంది! ఈ విజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైందని పేర్కొన్నాడు. ‘‘మొదటి 10 ఓవర్లు ముగిసిన తర్వాత 190 స్కోరు చేయగలమని మేము అనుకోలేదు. అయితే, మా వాళ్లు అద్భుతంగా ఆడారు. ఘనంగా మ్యాచ్‌ను ముగించారు. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని సవరించుకుంటాం. నిజానికి ఇలాంటి పిచ్‌ను అంచనా వేయడం కష్టం. మా బలాలు, నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకుంటాం. వెస్టిండీస్‌లో ఆడటం నాకు ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన టీమిండియా అభిమానులు, స్థానికులు కూడా మాకు పూర్తి మద్దతుగా నిలిచారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. ఈ స్టేడియం ‘కొత్తది! వెస్టిండీస్- టీమిండియా మ్యాచ్ జరిగిన వేదిక ట్రినిడాడ్‌లోని టరౌబాలో గల బ్రియన్ లారా స్టేడియం. ఇక్కడ గతంలో మూడు మహిళా క్రికెట్ టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అదే విధంగా కరేబియన్ లీగ్‌లో భాగంగా కొన్ని మ్యాచ్‌లకు ఇది వేదికైంది. ఇక టీమిండియా ఇక్కడ ఆడటం ఇదే తొలిసారి. వెస్టిండీస్ జట్టుకు కూడా ఇదే మొదటి మ్యాచ్. మా వాళ్లు చాలా హర్ట్ అయ్యారు! ‘‘పూర్తిగా నిరాశ చెందాం. మా వాళ్లు చాలా బాధపడుతున్నారు. ఏదేమైనా సిరీస్‌లో ఇది మొదటి మ్యాచ్ కదా! లోపాలు సరిదిద్దుకుని పునరుత్తేజంతో మిగిలిన మ్యాచ్‌లు ఆడతాం. వాళ్లు 150 స్కోరుకు చేరువైనపుడే మా నుంచి మ్యాచ్ లాగేశారనిపించింది. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పే కాంబినేషన్లు మాకూ కావాలి. అప్పుడే అనుకున్న ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలం’’ అని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అన్నాడు. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా తొలి టీ20: ►వేదిక: బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 190/6 (20) ►వెస్టిండీస్ స్కోరు: 122/8 (20) ►విజేత: ఇండియా... 68 పరగుల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దినేశ్ కార్తిక్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు) చదవండి: NZ vs SCO: తమ టి20 చరిత్రలో అత్యధిక స్కోరు.. స్కాట్లాండ్పై భారీ విజయం Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం.. -
Ind Vs WI T20: ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేయగలరు.. అందుకే: రోహిత్ శర్మ
India VS West Indies T20 Series: ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో భాగంగా టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది వెస్టిండీస్. వన్డే, టీ20 సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక సొంతగడ్డపై కూడా వన్డే సిరీస్‌లో ఇదే తరహా పరాభవాన్ని ఎదుర్కొంది విండీస్. ధావన్ సేన చేతిలో 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ అయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం(29) నుంచి ఆరంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా వన్డే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో(3 పరుగులు, 2 వికెట్ల తేడాతో) ఆఖరి వరకు పోరాడి ఓడిన తాము.. తప్పులు సరిదిద్దుకుని ముందుకు సాగుతామని విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. గతంలో గెలిచాం కదా అని.. ఈ నేపథ్యంలో మొదటి టీ20 ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత మ్యాచ్‌లలోని ఫలితాలతో సంబంధం లేదు. ప్రస్తుతం ముందున్న లక్ష్యం ఏమిటన్న దానిపైనే మా దృష్టి ఉంటుంది. గతంలో ఓ జట్టు మీద మనం గెలిచామంటే అది ఇప్పుడు ఉపయోగపడుతుందనుకోవడం పొరపాటే. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడితేనే మెరుగైన ఫలితం పొందుతాం’’ అని పేర్కొన్నాడు. 💬 💬 Here's what captain @ImRo45 said as #TeamIndia gear up for the #WIvIND T20I series. 👍 👍 pic.twitter.com/eVZeUpNe4Y — BCCI (@BCCI) July 29, 2022 మ్యాచ్ విన్నర్లు ఉన్నారు! అదే విధంగా టీ20 ఫార్మాట్ అంటేనే సంచనాలకు మారుపేరని.. విండీస్ జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదువలేదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ‘‘పొట్టి ఫార్మాట్ ఎంత సరదాగా ఉంటుందో అంతే ఉత్కంఠగా ఉంటుంది. మెరుగైన ఇన్నింగ్స్‌తో ఒక్క ఆటగాడు సైతం మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటే పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలి. ఎందుకంటే.. ఆ జట్టులో ఎంతో మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మా నుంచి లాగేయగలరు. కాబట్టి వాళ్లను మేము ఏమాత్రం తేలికగా తీసుకోలేము. రోజురోజుకు మా ఆటను మెరుగుపరచుకుంటూ సన్నద్ధంగా ఉంటాము’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా సొంతగడ్డపై ఈ ఏడాది ఫిబ్రవరిలో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వన్డే సిరీస్‌లో విండీస్‌ను వరుసగా 6 వికెట్లు, 44 పరుగులు,96 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టీ20 సిరీస్‌లో 6 వికెట్లు, 8 పరుగులు, 17 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లను 2-0తేడాతో గెలిచి ఫుల్ జోష్‌లో ఉంది. అంతేకాదు విండీస్‌తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. చదవండి: Ind Vs WI T20I- Rohit Sharma: ధావన్‌పై ఓజా వ్యాఖ్యలు! తనదైన శైలిలో స్పందించిన రోహిత్ శర్మ -
భారత్‌తో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన... బంగ్లాను ఓడించిన అదే టీమ్‌తో!
India Vs West Indies 2022 T20 Series: టీమిండియా, న్యూజిలాండ్ జట్లతో వరుస టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్, కివీస్‌లతో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్.. జట్టు వివరాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ జట్టును ముందుండి నడిపించనుండగా.. రోవ్‌మన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా పూరన్ బృందం ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, టీమిండియాతో వన్డే సిరీస్‌లో ఘోర పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అదే జట్టుతో! అయితే, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం విండీస్ అదరగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. హెట్మెయిర్, హోల్డర్ మినహా బంగ్లాతో తలపడిన అదే జట్టుతో టీమిండియాతో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డ మీద వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. We take all the vibes to the Brian Lara Cricket Stadium for the 1st T20I tomorrow!🇹🇹 Get your tickets⬇️ https://t.co/J6lTYXHYtX pic.twitter.com/JMTGyqzgfl — Windies Cricket (@windiescricket) July 28, 2022 కాగా విండీస్ రోహిత్ సేనతో శుక్రవారం(జూలై 29) తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధం కానుంది. ఆగష్టు 10 నుంచి 14 వరకు కివీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక నికోలస్ పూరన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విండీస్ బిజీబిజీగా గడుపుతోంది. బిజీబిజీగా వెస్టిండీస్! నెదర్లాండ్స్ పర్యటనతో సారథిగా అతడి ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు టూర్‌కు వెళ్లిన వెస్టిండీస్.. తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. ఆ తర్వాత టీమిండియాతో వన్డే సిరీస్ ముగించుకుని.. టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. అనంతరం న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడబోయే వెస్టిండీస్ జట్టు ఇదే: నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), బ్రూక్స్, డొమినిక్ డ్రేక్స్, షిమ్రన్ హెట్మెయిర్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైలీ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, కీమో పాల్, రొమారియో షెఫర్డ్, ఒడియన్ స్మిత్, డెవాన్ థామస్, హైడెన్ వాల్ష్ జూనియర్. టీమిండియాతో విండీస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ ►మొదటి టీ20- జూలై 29- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్(West Indies Vs New Zealand T20 Series) ►మొదటి టీ20- ఆగష్టు 10- సబీనా పార్క్, జమైకా ►రెండో టీ20- ఆగష్టు 12- సబీనా పార్క్, జమైకా ►మూడో టీ20- ఆగష్టు 14- సబీనా పార్క్, జమైకా చదవండి: Gustav McKeon T20I Records: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్? Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?! -
విండీస్‌పై భారత్ ఘన విజయం సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
Ind Vs WI 3rd ODI: మా గుండె పగిలింది.. కానీ ఇప్పుడు! తుది జట్లు ఇవే!
India Tour Of West Indies 2022- ODI Series: వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి వన్డేకు సిద్ధమైంది. ట్రినిడాడ్ వేదికగా బుధవారం (జూలై 27) ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచాడు భారత తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చాడని గబ్బర్ తెలిపాడు. టాస్ ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందు బ్యాటింగ్ చేస్తాం. మంచి స్కోరు నమోదు చేయాలని భావిస్తున్నాం. మాకున్న సానుకూలాంశం ఏమిటంటే.. మా జట్టులోని ప్రతి ఆటగాడు రాణిస్తున్నాడు. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ద్రవిడ్ సర్ గొప్పగా జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ఆటగాళ్లు ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే అంతగా రాటుదేలుతారు. ఆయన మా చేత అదే చేయిస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. మా గుండె పగిలింది.. ఇప్పుడు ఇక విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ‘‘మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో మా గుండె పగిలింది. అయితే, ఈరోజు మేము మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతున్నాం. 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి. నిలకడ ప్రదర్శించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందగలం’’ అని చెప్పుకొచ్చాడు. తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడనున్నామన్న పూరన్.. అల్జారీ, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెఫర్డ్ స్థానాల్లో హోల్డర్, కీమో, కార్టీ తుది జట్టులో చోటు దక్కించుకున్నారని తెలిపాడు. కాగా స్వదేశంలో టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్ ఇప్పటికే సిరీస్‌ను 2-0తేడాతో కోల్పోయింది. ఇక నికోలస్ పూరన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత నెదర్లాండ్స్‌ను క్లీన్‌స్వీప్ చేసిన వెస్టిండీస్.. పాకిస్తాన్ టూర్లో ఘోర పరాభవం చవిచూసింది. పాక్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. అదే విధంగా స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన సిరీస్‌లోనూ ఇదే తరహాలో 3-0తేడాతో క్లీన్‌స్వీప్ అయింది. మరోవైపు టీమిండియా ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20, వన్డే సిరీస్‌లను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక వెస్టిండీస్‌లో ఆఖరి వన్డే గెలిచి ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. మొదటి వన్డేలో 3 పరుగులు, రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ధావన్ సేన గెలుపొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మూడో వన్డే: తుదిజట్లు: ఇండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ. వెస్టిండీస్: షాయీ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, కీసీ కార్టీ, బ్రూక్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), కైలీ మేయర్స్, జేసన్ హోల్డర్, కీమో పాల్, అకీల్ హొసేన్, హైడెన్ వాల్ష్, జేడెన్ సీల్స్. చదవండి: World Cup 2023: అందుకే గబ్బర్ కెప్టెన్ అయ్యాడు! రోహిత్ శర్మ కోరుకుంటున్నది అదే! T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్ గెలిస్తే.. The 3rd CG United ODI powered by @goldmedalindia surface for today.👀 #WIvIND pic.twitter.com/uLPs0Ufc17 — Windies Cricket (@windiescricket) July 27, 2022 TOSS🪙: West Indies Captain @nicholas_47 is second best in toss against @BCCI 🇮🇳 captain @SDhawan25. #MenInMaroon will bowl first in final game of the 3-match CG United ODI Series powered by @goldmedalindia at Queens Park Oval 🇹🇹 #WIvIND pic.twitter.com/wXZhKquyCb — Windies Cricket (@windiescricket) July 27, 2022 -
IND VS WI 3rd ODI: 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
పోర్ట్ ఆఫ్‌స్పెయిన్: విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ లక్ష్యం 35 ఓవర్లలో 257 పరుగులు వర్షం అంతరాయం కారణంగా వెస్టిండీస్- ఇండియా మూడో వన్డేలో 36 ఓవర్లలో 225/3 వికెట్ల వద్ద భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. డక్‌వర్త లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. టీమిండియా బ్యాట్స్మన్లలో శుభమన్ గిల్ 98 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్ నిలిచాడు. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్‌ను ముగించడంతో గిల్ తృటిలో సెంచరీని కోల్పోయాడు. అనుకున్నదే అయ్యింది.. వర్షం మొదలైంది వాతావరణ శాఖ హెచ్చరికలే నిజమయ్యాయి. వారు చెప్పినట్లుగానే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 24 ఓవర్లు పూర్తయ్యాక వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఈ సమయానికి టీమిండియా స్కోర్ 115/1. క్రీజ్‌లో గిల్ (51), శ్రేయస్ (2) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 23వ ఓవర్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి ధవన్ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 113/1. గిల్‌కు (51) జతగా శ్రేయస్ క్రీజ్‌లోకి వచ్చాడు. గిల్ హాఫ్ సెంచరీ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో గిల్ వన్డేల్లో ఈ ఫీట్‌ను రెండోసారి చేశాడు. 22 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0. ధవన్ 73 బంతుల్లో 58 పరుగలతో క్రీజ్‌లో ఉన్నాడు. ధవన్ ఫిఫ్టి.. 100 దాటిన టీమిండియా స్కోర్ ఓపెనర్లు ధవన్ (54), గిల్ (44)లు టీమిండియాకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 20 ఓవర్లలో అజేయమైన 101 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధవన్ వన్డేల్లో 37వ ఫిఫ్టి సాధించాడు. ఈ సిరీస్‌లో ధవన్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. డ్రింక్స్ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 87/0 తొలి 10 ఓవర్లు నిదానంగా ఆడిన భారత్.. ఆతర్వాత కాస్త వేగం పెంచింది. ఓపెనర్లు ధవన్ 57 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 48 పరుగులు, గిల్ 46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 36 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. డ్రింక్స్ విరామం సమయానికి (17 ఓవర్లు) భారత్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. గేర్ మార్చని ఓపెనర్లు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిదానంగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు 11 ఓవర్లు దాటినా గేర్ మార్చడం లేదు. ధవన్ 34 బంతులు ఆడి 23 పరుగులు చేయగా.. గిల్ 32 బంతులను ఎదుర్కొని అన్నే పరుగులు సాధించాడు. 11 ఓవర్లు దాటినా టీమిండియా 50 పరుగుల మార్కును (47/0) చేరుకోలేదు. ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 17/0 టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (8), శిఖర్ ధవన్ (9) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండయా స్కోర్ 17/0. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను టీమిండియా ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు విండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్ స్థానాల్లో జేసన్ హోల్డర్, కీమో పాల్, కీచీ క్యార్టీ జట్టులో చేరారు. భారత్: శిఖర్ ధవన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ వెస్టిండీస్: షెయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, కీచీ క్యార్టీ, షమ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, అకేల్ హోసేన్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్ -
IND VS WI: మూడో వన్డేకు పొంచి ఉన్న వాన గండం..!
విండీస్‌తో 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియాకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఇవాళ (జులై 27) ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే మూడో వన్డేకు వాన గండం పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచే మ్యాచ్‌కు వేదిక అయిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆకాశం మేఘావృతమైందని, మ్యాచ్ సమయానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ మ్యాచ్ మొదలైనా మధ్యమధ్యలో వరుణ ఆటంకాలు తప్పవని, 50 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు తప్పి, 50 ఓవర్ల పాటు సజావుగా సాగాలని టీమిండియా కోరుకుంటుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి కాన్ఫిడెంట్‌గా ఉన్న ధవన్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విండీస్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తుంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో చివరి వరకు పోరాడి ఓడిన విండీస్ సైతం ఈ మ్యాచ్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక జట్ల విషయానికొస్తే.. టీమిండియా ఈ మ్యాచ్‌లో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు విండీస్ రెండో వన్డేలో కొనసాగించిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ తప్పించాల్సి వస్తే గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అకీల్ హొసెన్పై వేటు వేసే ఆస్కారం ఉంది. చదవండి: Ind Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! -
Ind Vs WI: సిక్సర్‌తో ముగించి.. ఈ మ్యాచ్ ప్రత్యేకం.. దాదాపు ఐదేళ్ల తర్వాత!
India Tour Of West Indies 2022- Axar Patel Comments: ‘‘నిజంగా నాకు ఈ మ్యాచ్ ప్రత్యేకమైనది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టు సిరీస్ గెలవడంలో నా వంతు పాత్ర పోషించాను. ఐపీఎల్‌లోనూ ఇదే తరహాలో ఆడేవాళ్లం. అవసరమైన సమయంలో రాణించడం ముఖ్యం. దాదాపు ఐదేళ్ల తర్వాత నేను వన్డే మ్యాచ్ ఆడాను. ఇక ముందుకు కూడా ఇదే విధంగా మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో భాగం కావడానికి కృషి చేస్తాను’’ అని టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వన్డే జట్టులో పునరాగమనం చేశాడు బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. మొదటి వన్డేలో 21 పరుగులు చేశాడు. అయితే, వికెట్లేమీ తీయలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. .@akshar2026 takes #TeamIndia home! Finishes it in style. Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/WHjdscpzd9 — FanCode (@FanCode) July 24, 2022 సిక్సర్ కొట్టి.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విండీస్ బౌలర్ మేయర్స్ బౌలింగ్‌లో చివరి ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాది భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. భారీ షాట్‌తో అజేయంగా ఇన్నింగ్స్ ముగించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ఈ విజయం తనకు చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్, వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం అక్షర్ ఆడిన తీరును కొనియాడారు. అదే విధంగా ఫ్యాన్స్ సైతం అక్షర్ ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో విజయంతో వన్డే సిరీస్ టీమిండియా సొంతమైంది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తేడాతో విండీస్‌ను ఓడించి ధావన్ సేన ట్రోఫీ గెలిచింది. ఇక బుధవారం(జూలై 27) నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. ఇదిలా ఉంటే.. కాగా ఐపీఎల్-2022లో అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 13 ఇన్నింగ్స్ ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 ఇన్నింగ్స్‌లో 182 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 42 నాటౌట్. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ ►టాస్: వెస్టిండీస్- బ్యాటింగ్ ►వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) ►సెంచరీతో చెలరేగిన విండీస్ బ్యాటర్ షాయి హోప్(115 పరుగులు) ►భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) ►విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) ►శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) అర్ధ శతకాలు India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 -
Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్!
India Tour Of West Indies 2022- 1st ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉంది టీమిండియా. కాగా ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 3 పరుగులతో ధావన్ సేన గట్టెక్కగా.. రెండో వన్డేలో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తృటిలో ప్రమాదం నుంచి బయటపడి ఈ విజయాలు నమోదు చేసింది. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. Talent wins game but teamwork and intelligence wins championship! 🙌 Kudos to team for the amazing face-off! 😍👏 #IndvsWI pic.twitter.com/jMZOjWiTN6 — Shikhar Dhawan (@SDhawan25) July 25, 2022 తద్వారా పాకిస్తాన్‌ను వెనక్కినెట్టి.. ఒకే జట్టుపై వరుసగా 12 వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది కూడా! అయితే, అంతా బాగానే ఉన్నా మొదటి వన్డే తర్వాత టీమిండియాకు గట్టి ఎదురెబ్బ తగిలినట్లు సమాచారం. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ధావన్ సేన మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆటగాళ్లకు జరిమానా పడుతుంది. మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధించడం జరుగుతుంది’’ అని ఐసీసీ పేర్కొంది. ఇక బుధవారం(జూలై 27) ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్- భారత్ మధ్య నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. ఆ తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. జూలై 29 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్ సైతం! Ind Vs WI T20I: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! A slow over rate in the first ODI against West Indies in Port of Spain has seen India cop a fine. #WIvIND | Details 👇 https://t.co/a3sZLuZJT7 — ICC (@ICC) July 24, 2022 -
Ind Vs WI: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఐపీఎల్‌కు థాంక్స్!
India Tour Of West Indies 2022- 2nd ODI: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రెండో వన్డేలోనూ శిఖర్ ధావన్ సేన విజయం సాధించింది. ట్రినిడాడ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంపై స్పందించిన కెప్టెన్ శిఖర్ ధావన్.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లపై ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురు అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షాయీ హోప్ సెంచరీ చేసి.. తమ జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ పూరన్ సైతం 74 పరుగులతో రాణించడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ 13 పరుగులకే నిష్క్రమించగా.. గిల్ 43 పరుగులతో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శాంసన్ 54, దీపక్ హుడా 33 పరుగులు చేశారు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ 64 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. 2 బంతులు మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో రెండు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఇది అద్భుత విజయం.. కుర్రాళ్లు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆఖరి వరకు పోరాడిన తీరు అమోఘం. అయ్యర్, సంజూ, అక్షర్.. అందరూ అత్యద్భుతంగా రాణించారు. అరంగ్రేట మ్యాచ్ అయినప్పటికీ ఆవేశ్ కూడా జట్టుకు అవసరమైన సమయంలో 10 పరుగులు చేసి ఆదుకున్నాడు. నిజానికి ఐపీఎల్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాంటి మోగా టోర్నీలో ఆడినందు వల్ల భయం, బెరుకు లేకుండా ఇక్కడ కూడా ఆడగలుగుతున్నారు’’ అని పేర్కొన్నాడు. ఇక విండీస్ ఆటగాళ్లలో హోప్, పూరన్ అద్బుతంగా ఆడారన్న ధావన్.. తమ జట్టులో గిల్, అయ్యర్- శాంసన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశారని తెలిపాడు. ఇక సంజూ శాంసన్ రనౌట్ గురించి మాట్లాడుతూ.. ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయని, తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పుకొచ్చారు. తన లాగే వందో వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన వెస్టిండీస్ బ్యాటర్ హోప్‌నకు ధావన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. చదవండి: WI vs IND: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 -
IND Vs WI 2nd ODI: రెండు వికెట్ల తేడాతో భారత్ గెలుపు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అవే జట్లు.. అదే ఉత్కంఠ.. వెస్టిండీస్-టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ విజయం కోసం ఆఖరి ఓవర్ వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కాకపోతే మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు పోరాడితే.. నేడు టీమిండియా పోరాడింది. అయితే ఫలితం మాత్రం మారలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. టీమిండియా 2 బంతులు మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి చేధించింది. 3 బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్ పటేల్ సిక్సర్ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను దక్కించుకుంది. భారత బ్యాట్మన్లలో అక్షర్ పటేల్ 35 బంతుల్లో 64 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శామ్సన్ 54, శుభమన్ గిల్ 43, దీపక్ హుడా 33 పరుగులతో రాణించారు. టీమిండియా టార్గెట్ 312 ►టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చి అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న షెయ్ హోప్ 115 పరుగులతో టాప్ స్కోరర్ కాగా .. కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులు, కేల్ మేయర్స్ 39 పరుగులు, బ్రూక్స్ 35 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ హుడా, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చహల్ తలా ఒక వికెట్ తీశారు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన హోప్.. ►వెస్టిండీస్ ఓపెనర్ షెయ్ హోప్ రెండో వన్డేలో అద్భుత సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ వచ్చిన హోప్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం విండీస్ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. నిలకడగా సాగుతున్న వెస్టిండీస్ ఇన్నింగ్స్.. ►టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. 36 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షెయ్ హోప్ 82, పూరన్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌గా వచ్చిన హోప్ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 65 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది 27 ఓవర్లలో వెస్టిండీస్ 148/3 ►27 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. హోప్ 64, పూరన్ 8 క్రీజులో ఉన్నారు. హోప్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ 141/3 ►వెస్టిండీస్ ఓపెనర్ షెయ్ హోప్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరోపక్క చహల్ బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్ డకౌట్‌గా వెనుదిరగడంతో విండీస్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హోప్ 62, పూరన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ ►నిలకడగా సాగుతున్న విండీస్ ఇన్నింగ్స్‌కు అక్షర్ పటేల్ తెరదించాడు. 35 పరుగులు చేసిన షమ్రా బ్రూక్స్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. 19 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరెంతంటే? ►19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెయ్ హోప్ 41 పరుగులతో నిలకడగా ఆడుతుండగా.. అతనికి బ్రూక్స్(28 పరుగులు) నుంచి చక్కని సహకారం అందుతుంది. కైల్ మేయర్స్(39) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ ►రెండో వన్డేలో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన విండీస్‌కు దీపక్ హుడా షాక్ ఇచ్చాడు. 39 పరుగులు చేసిన కైల్ మేయర్స్ హుడా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి విండీస్ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. హోప్ 26, బ్రూక్స్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ధాటిగా ఆడుతున్న వెస్టిండీస్ ►టీమిండియాతో రెండో వన్డేలో వెస్టిండీస్ ధాటిగా ఆడుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 39, షెయ్ హోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. 4 ఓవర్లలో వెస్టిండీస్ 24/0 ►4 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 14, షెయ్ హోప్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ►టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి.. మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. విండీస్ మాత్రం గెలిచి నిలబడాలని ప్రయత్నిస్తోంది. ఇక టీమిండియా తరపున ఆవేశ్ ఖాన్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఐదుగురు స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్ పర్యటనలో వరుసగా రెండో సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్ మరో సిరీస్ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వెస్టిండీస్: షెయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్ భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ One change in the #TeamIndia Playing XI from the previous game. Avesh Khan makes his debut and Prasidh Krishna sits out for the game. Live - https://t.co/EbX5JUciYM #WIvIND pic.twitter.com/o3SGNrmQBd — BCCI (@BCCI) July 24, 2022 -
పూరన్ సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. భారత ఇన్నింగ్స్ 36 ఓవర్ వేసిన గుడాకేష్ మోటీ బౌలింగ్‌లో.. శ్రేయస్ అయ్యర్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పూరన్ జంప్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కాగా అప్పటికే 54 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న అయ్యర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు టీమిండియా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌ను కూడా అద్భుతమైన త్రోతో పూరన్ పెవిలియన్‌కు పంపాడు. ఇక తొలి వన్డేలో అఖరి వరకు పోరాడిన విండీస్ మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ జట్టులో కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్ (64) శ్రేయస్ అయ్యర్(54) పరుగులతో రాణించారు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ►టాస్: విండీస్- బౌలింగ్ ►భారత్ స్కోరు: 308/7 (50 ఓవర్లు) ►వెస్టిండీస్ స్కోరు: 305/6 (50 ఓవర్లు) ►విజేత: భారత్.. 3 పరుగుల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్ (97 పరుగులు) ►అర్ధ శతకాలతో రాణించిన గిల్(64), శ్రేయస్ అయ్యర్(54) చదవండి: IND vs WI: టీమిండియాతో వన్డే సిరీస్.. వెస్టిండీస్‌కు బిగ్ షాక్..! .@ShreyasIyer15 is gone, caught by @nicholas_47. So disappointing, his scuffed shot. Watch the India tour of West Indies LIVE, exclusively on #FanCode 👉https://t.co/RCdQk12YsM@windiescricket @BCCI#WIvIND #INDvsWIonFanCode pic.twitter.com/z6ZZquTTYZ — FanCode (@FanCode) July 22, 2022 -
Ind Vs WI: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే!
Ind vs WI 1st ODI- Terrific Effort From Sanju Samson: అకీల్ హొసేన్ (32 బంతుల్లో 32 పరుగులు- నాటౌట్).. రొమారియో షెఫర్డ్(25 బంతుల్లో 39 పరుగులు- నాటౌట్).. ఈ వెస్టిండీస్ బౌలర్లు ఇద్దరు.. తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించారు. సునాయాసంగానే గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను ఆఖరి ఓవర్.. ఆఖరి బంతి వరకు తీసుకువచ్చారు. వీరి అద్భుత పోరాటం విండీస్ అభిమానులకు ముచ్చటగొలుపగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ చివరి ఓవర్లో రాణించిన విధానం భారత ఫ్యాన్స్‌ను మురిపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం మొదటి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్ గెలిచిన విండీస్ ధావన్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. 309 పరుగుల లక్ష్యాన్ని విధించింది. సంజూ చేసెను అద్భుతం! టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నికోలస్ పూరన్ బృందం శాయశక్తులు ఒడ్డింది. ముఖ్యంగా.. బౌలర్లు అకీల్ హొసేన్, రొమారియో షెఫర్డ్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడ్డారు. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. మొదటి బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. రెండో బంతికి లెగ్‌బై రూపంలో ఒక రన్ వచ్చింది. మూడో బాల్‌ను షెఫర్డ్ బౌండరీకి తరలించాడు. దీంతో విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. ఇక నాలుగో బంతికి షెఫర్డ్ రెండు పరుగులు రాబట్టాడు. ఐదో బంతి వైడ్‌గా వెళ్లింది. ఒకవేళ సంజూ అద్భుతంగా డైవ్ చేసి బంతిని ఆపకపోతే బౌండరీని తాకేదే! ఇక తర్వాతి రెండు బంతుల్లో విండీస్‌కు వరుసగా రెండు, ఒక పరుగు మాత్రమే రావడంతో భారత్ విజయం ఖరారైంది. మూడు పరుగుల తేడాతో ధావన్ సేన గెలుపొందింది. ఈ క్రమంలో కీలక సమయంలో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్న సంజూ శాంసన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 ‘‘సంజూ గనుక డైవ్ చేసి ఆ బంతిని ఆపకపోయి ఉంటే ఏమయ్యేదో? ఆ బాల్ బౌండరీని తాకితే టీమిండియా కథ అప్పుడే ముగిసేది. ధావన్, గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌తో పాటు ఆఖరి ఓవర్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న సంజూ కూడా ప్రశంసలకు అర్హుడే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే! Sanju Samson's keeping was outstanding in this match - In the last over he saved Crucial 4 runs and must credit goes to him and even Mohammad Siraj was appreciated and clapping for his wicketkeeping when he saved. pic.twitter.com/UCLgj2guOR — CricketMAN2 (@ImTanujSingh) July 22, 2022 Love him Or hate him But you cannot Ignore him Sanju Samson saved India from losing the match #WIvIND #IndvsWI #SanjuSamson pic.twitter.com/p0lLcGC3Fq — Roshmi 💗 (@CricCrazyRoshmi) July 22, 2022 We all know Sanju Samson is a great fielder but sometimes we fail to appreciate Sanju Samson the wicketkeeper, have to save today he won us with the gloves #IndvsWI pic.twitter.com/GchlAv4VmT — Anurag (@RightGaps) July 22, 2022 The save from Sanju Samson made a huge impact on the victory of the Indian team, it was a certain 4 extra runs for West Indies & they could have won the game. pic.twitter.com/wxcDLVqY29 — Johns. (@CricCrazyJohns) July 22, 2022 -
Ind Vs WI: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే!
India Vs West Indies 1st ODI: ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన పోరులో ఎట్టకేలకు టీమిండియా వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ట్రినిడాడ్ వేదికగా శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో 3 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ధావన్ సేన 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. రాణించిన గబ్బర్, గిల్, అయ్యర్ ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 64 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ 54 పరుగులు చేశాడు. టెన్షన్ పెట్టేశారు! ఈ ముగ్గురి విజృంభణతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ సైతం గట్టిపోటీనిచ్చింది. ఓపెనర్ కైలీ మేయర్స్ 75, బ్రూక్స్ 46, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. ఇక ఆఖర్లో అకీల్ హొసేన్ 32, రొమారియో షెపర్డ్ 39 పరుగులతో అజేయంగా నిలిచి చివరి వరకు విజయం కోసం చేసిన పోరాటం వృథాగా పోయింది. మూడు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 బాధగా ఉంది! ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందిస్తూ.. సెంచరీ కొట్టే ఛాన్స్ మిస్ అయినందుకు తీవ్ర నిరాశకు లోనైనట్లు తెలిపాడు. అయితే, ఆఖరి వరకు మ్యాచ్ ఇంత హోరాహోరీగా సాగుతుందని ఊహించలేదన్నాడు. ‘‘శతకం బాదే అవకాశం చేజారినందుకు కాస్త బాధగా ఉంది. అయితే, జట్టుగా మేము సాధించిన విజయం పట్ల సంతోషపడుతున్నా. మేము మంచి స్కోరు నమోదు చేశాము. కానీ.. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ. ఈ స్థాయిలో టెన్షన్ పడాల్సి వస్తుందని ఊహించలేదు. ఏదేమైనా తదుపరి మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. మేము గెలిచినట్లే: పూరన్ ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసి ఓడిపోవడం పట్ల స్పందించిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ‘‘మేము గెలిచినట్లే భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో తీపి, చేదు జ్ఞాపకాలు.. అయితే, వన్డేల్లో మేము పుంజుకున్న విధానం సంతృప్తినిచ్చింది. మిగిలిన మ్యాచ్‌లలో సత్తా చాటుతాం. మా బ్యాటర్లు అద్బుతంగా ఆడారు. బౌలర్లు అంతే అద్భుతంగా ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. అయితే, ఓడినా కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. వాటిపై దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ►టాస్: విండీస్- బౌలింగ్ ►భారత్ స్కోరు: 308/7 (50 ఓవర్లు) ►వెస్టిండీస్ స్కోరు: 305/6 (50 ఓవర్లు) ►విజేత: భారత్.. 3 పరుగుల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్ (97 పరుగులు) ►అర్ధ శతకాలతో రాణించిన గిల్(64), శ్రేయస్ అయ్యర్(54) Brilliant catch from the Skipper takes our #MaastercardPricelessMoment of the 1st ODI. #WIvIND pic.twitter.com/7WrC0SyMhA — Windies Cricket (@windiescricket) July 22, 2022 చదవండి: IND Vs WI 1st ODI: శుభ్‌మన్ గిల్ అరుదైన ఫీట్.. సచిన్ రికార్డు బద్దలు..! -
IND Vs WI 1st ODI: ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: చివరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డేలో విండీస్ జట్టుపై భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్ కంగారు పెట్టించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. 309 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టులో కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు. గర్జించిన భారత్ బ్యాట్స్‌మెన్ సీనియర్లు లేని భారత టాపార్డర్ వెస్టిండీస్ బౌలింగ్‌పై గర్జించింది. ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మూడు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోగా... శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీశారు. ఓపెనర్ల శుభారంభం ధావన్, గిల్ జోడీ ఓపెనింగ్‌లో అదరగొట్టింది. ఇద్దరూ ఫోర్లు, సిక్స్‌లతో వేగంగా పరుగులు చేశారు. దీంతో తొలి 3 ఓవర్లయితే టి20ని తలపించింది. ఈ ధాటి కొనసాగడంతో 6.5 ఓవర్లలో భారత్ స్కోరు 50కి చేరింది. చూడచక్కని షాట్లతో గిల్ 36 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో 14 ఓవర్ల దాకా 7పైచిలుకు రన్‌రేట్‌తో భారత్ 100/0 స్కోరు చేసింది. తర్వాత 18వ ఓవర్లో ధావన్ 53 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ చేయగా, గిల్ నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధావన్ సెంచరీ మిస్ అనంతరం శ్రేయస్ అయ్యర్‌తో రెండో వికెట్ భాగస్వామ్యం కూడా సాఫీగా సాగడంతో కరీబియన్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో సెంచరీపై కన్నేసిన ధావన్... గుడకేశ్ మోతీ 34వ ఓవర్లో స్లాగ్‌స్వీప్ షాట్‌తో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. కానీ తర్వాతి బంతికే అతను పెవిలియన్ చేరడంతో 94 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న అయ్యర్, సూర్యకుమార్ (13) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. సంజూ సామ్సన్ (12) కూడా విఫలమవడంతో ఆఖర్లో ఆశించినంత వేగంగా పరుగులు రాలేదు. 48వ ఓవర్లో అక్షర్ పటేల్ (21; ఫోర్, సిక్స్) 6, 4 కొట్టగా, దీపక్ హుడా (27; ఫోర్, సిక్స్) 6 బాదడంతో ఏకంగా 20 పరుగులొచ్చాయి. అల్జారీ జోసెఫ్ 49వ ఓవర్లో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చగా, ఆఖరి ఓవర్లో భారత్ 300 మార్క్‌ను దాటింది. -
IND Vs WI 1st ODI: ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం
ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం చివరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డేలో వెస్టిండీస్‌పై భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. ఇక ఛేజింగ్‌లో విండీస్ బ్యాట్స్‌మన్ కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులు చేశారు. మ్యాచ్ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్ పోరాడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. విండీస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. వెస్టిండీస్ టార్గెట్ 309 ►వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. ఒక దశలో 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులతో పటిష్టంగా కనిపించిన టీమిండియా ఆ తర్వాత 20 ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో మోతీ, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షెపర్డ్, హొసెన్ తలా ఒక వికెట్ తీశారు. 45 ఓవర్లలోటీమిండియా 264/5 ►టీమిండియా 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. దీపక్ హుడా 12, అక్షర్ పటేల్ 4 పరుగులతో ఆడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్(54) ఔట్.. మూడో వికెట్ డౌన్ ►శ్రేయాస్ అయ్యర్(54) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మోతీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన అయ్యర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 2, సూర్యకుమార్ యాదవ్ 9 పరుగులతో ఆడుతున్నారు. ధావన్ సెంచరీ మిస్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా ►విండీస్‌తో తొలి వన్డేలో శిఖర్ ధావన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 97 పరుగుల వద్ద మోతీ బౌలింగ్‌లో షమ్రా బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 34 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అయ్యర్ 45, సూర్యకుమార్ ఒక పరుగుతో ఆడుతున్నారు. సెంచరీ దిశగా ధావన్.. టీమిండియా 193/1 ►వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 87 పరుగులు.. సెంచరీ వైపు పరుగులు తీస్తుండగా.. శ్రేయాస్ అయ్యర్ 42 పరుగులతో ఆడుతున్నాడు. గిల్ రనౌట్.. టీమిండియా 20 ఓవర్లలో 127/1 ►టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 57, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు శుబ్‌మన్ గిల్(64) రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరెంతంటే? ►10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. గిల్ 41, ధావన్ 28 పరుగులతో ఆడుతున్నారు. దాటిగా ఆడుతున్న ఓపెనర్లు.. టీమిండియా 50/0 ►వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 24, శుబ్‌మన్ గిల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ►ఇంగ్లండ్‌తో సిరీస్‌ను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్దమైంది. ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సహా సీనియర్ల గైర్హాజరీలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ భారత్ జట్టు విండీస్‌తో తలపడుతుండడంతో ఆసక్తిగా మారింది. ముందుగా అనుకున్నట్లే జడేజా గాయంతో ఈ వన్డేకు దూరం కాగా.. జాసన్ హోల్డర్ కరోనా కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉన్నాడు. A look at our Playing XI for the 1st ODI. Live - https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/WuwCljou75 — BCCI (@BCCI) July 22, 2022 భారత్: ధావన్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ,దీపక్ హుడా, సంజూ సామ్సన్, సూర్యకుమార్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్, చహల్, సిరాజ్. వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), షయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్ పిచ్, వాతావరణం వన్డేలకు తగిన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. గురువారం కొంత వర్షం కురిసి భారత జట్టు ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైనా...మ్యాచ్ రోజు మాత్రం వర్ష సూచన లేదు. -
Ind Vs WI 1st ODI: వెస్టిండీస్ చెత్త రికార్డు.. అప్పుడు వైట్‌వాష్.. మరి ఇప్పుడు!
India tour of West Indies, 2022: వెస్టిండీస్‌తో వన్డే పోరుకు టీమిండియా సిద్ధమైంది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం జరుగనుంది. విజయంతో ఈ సిరీస్‌ను ఆరంభించి విండీస్‌పై జైత్రయాత్రను కొనసాగించాలని భారత జట్టు భావిస్తుండగా.. సొంతగడ్డపై తమకున్న చెత్త రికార్డును చెరిపేసుకోవాలని పూరన్ బృందం పట్టుదలగా ఉంది. 'West Indies is a great opportunity for the youngsters to get exposure and play, says #TeamIndia ODI Captain @SDhawan25 ahead of #WIvIND series. pic.twitter.com/PBelvII28c — BCCI (@BCCI) July 21, 2022 ఈ నేపథ్యంలో ఇరు జట్ల రికార్డులు, పిచ్, వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ సమయం, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ అన్న వివరాలు పరిశీలిద్దాం. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా తొలి వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, వెస్టిండీస్ ►తేది: జూలై 22, శుక్రవారం ►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం ►ప్రసారాలు: వెస్టిండీస్ వర్సెస్ ఇండియా వన్డే, టీ20 సిరీస్‌కు అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ ఫ్యాన్ కోడ్. భారత వాసుల కోసం మ్యాచ్‌లు ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. ►అదే విధంగా.. డీడీ స్పోర్ట్స్‌లోనూ వీక్షించవచ్చు. ►కరేబియన్ల కోసం స్పోర్ట్స్మాక్స్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. పిచ్, వాతావరణం క్వీన్స్ పార్క్ ఓవల్ వన్డేలకు అనువైన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. ఇక గురువారం వర్షం కారణంగా ధావన్ సేన ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం మాత్రం వర్ష సూచన లేదు. Gearing up for ODI No.1 against the West Indies 💪 Here's @ShubmanGill giving a lowdown on #TeamIndia's 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI — BCCI (@BCCI) July 21, 2022 తుది జట్ల అంచనా: ఈ మ్యాచ్‌తో రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం మెండు. కుడి, ఎడమ చేతివాటం ఓపెనింగ్ జోడీతో ఆడాలని భారత్ భావిస్తే ధావన్‌తో కలిసి రుతు ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ఇక మోకాలి నొప్పి తిరగబెట్టిందన్న వార్తల నేపథ్యంలో జడేజా జట్టుకు దూరమైతే అక్షర్ పటేల్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్. వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, బ్రూక్స్, మేయర్స్, హోప్, రోవ్‌మన్ పావెల్, హోల్డర్, అకీల్ హొసీన్ , జోసెఫ్, గుడకేశ్ మోటీ, జేడెన్ సీల్స్. మీకు తెలుసా? ►2017 మార్చి నుంచి వెస్టిండీస్ సొంతగడ్డ మీద 12 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. ఇందులో కేవలం రెండు మాత్రమే విండీస్ గెలుచుకుంది. ఐర్లాండ్‌పై 2020లో.. శ్రీలంకపై 2021 మార్చిలో గెలుపు నమోదు చేసింది. ►ఇక వన్డేల విషయానికొస్తే.. 2006 మే తర్వాత వెస్టిండీస్ ఇంతవరకు టీమిండియాతో జరిగిన ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ కూడా గెలవలేదు. 11 సిరీస్‌లు గెలిచి టీమిండియా వెస్టిండీస్‌పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ►చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రోహిత్ సేన చేతిలో భారత్‌లో జరిగిన సిరీస్‌లో 3-0 తేడాతో వెస్టిండీస్ వైట్‌వాష్‌కు గురైంది. కాగా స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లనూ ఇదే తరహాలో క్లీన్‌స్వీప్‌కు గురైంది. చదవండి: విండీస్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్? Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
Ind Vs WI: ఆ ముగ్గురు చెలరేగితే ధావన్ సేనకు కష్టాలు తప్పవు!
India tour of West Indies, 2022: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా పలువురు టీమిండియా యువ బ్యాటర్లకు వన్డే జట్టులో చోటు దక్కింది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర కీలక బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా తదితరులకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో.. ఈ సిరీస్ ద్వారా తామేంటో నిరూపించుకునే అవకాశం దొరికింది. ఇక పాకిస్తాన్ పర్యటనలో, స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో చిత్తై డీలా పడిన విండీస్‌ను.. ఓడించడం శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. టీమిండియా యువ బాట్యర్లకు ఈ ముగ్గురు విండీస్ బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. Gearing up for ODI No.1 against the West Indies 💪 Here's @ShubmanGill giving a lowdown on #TeamIndia's 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI — BCCI (@BCCI) July 21, 2022 అకీల్ హొసేన్ గతేడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్. ఆరంభంలో కాస్త తడబడ్డా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన సిరీస్‌లో కేవలం ఒకే ఒక వికెట్ తీసినా.. ప్రస్తుత వన్డే సూపర్ లీగ్ భాగంగా ఆడిన 20 ఇన్నింగ్స్‌లో ఏకంగా 35 వికెట్లు పడగొట్టాడు. తద్వారా లీగ్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు 29 ఏళ్ల అకీల్. టీమిండియా బ్యాటర్లకు అకీల్ సవాల్ విసురుతాడనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అకీల్ ఫామ్‌లోకి వస్తే రైట్ హ్యాండ్ బ్యాటర్లకు అతడితో తలనొప్పి తప్పదు. గుడకేశ్ మోటీ బంగ్లాదేశ్‌తో స్వదేశంలో ముగిసిన వన్డే సిరీస్‌తో అరంగేట్రం చేశాడు గుడకేశ్ మోటీ. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తన లెఫ్టార్మ్ స్పిన్‌తో బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో నికోలస్ పూరన్ సారథ్యంలో ఆడిన మోటీకి టీమిండియాతో సిరీస్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండు. అదే జరిగితే 27 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు అంత సులువేమీ కాదు. జేడెన్ సీల్స్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ ఈ ఏడాది నెదర్లాండ్స్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న అతడికి కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ దక్కింది. అయితే బంతిని స్వింగ్ చేస్తూ జేడెన్ మంచి ఫలితాలు రాబట్టగలడు. ముఖ్యంగా ఈ 20 ఏళ్ల యువ పేసర్ డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బందిపెట్టగలడు. కరేబియన్, లంక ప్రీమియర్ లీగ్‌లో అతడు రాణించిన విధానమే ఇందుకు నిదర్శనం. ఆండర్సన్ ఫిలిప్‌తో పాటు రొమారియో షెఫర్డ్ వన్డే సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో జేడెన్కు తుదిజట్టులో అవకాశం రావడం ఖాయంగానే కనిపిస్తోంది.. కాబట్టి అతడి బౌలింగ్‌లో కాస్త ఆచితూచి ఆడకపోతే టీమిండియా యువ బ్యాటర్లు మూల్యం చెల్లించకతప్పదు. ఇక జూలై 22 నుంచి టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్ చదవండి: Ind Vs WI ODI Series: వన్డేల్లో అరంగేట్రం చేయాలి.. ఓపెనర్‌గా రావాలి! అతడికి ఆ అర్హత ఉంది! India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! -
Ind Vs WI: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం!
IND vs WI ODI Series: West Indies captain Nicholas Pooran Comments- కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఈ ఏడాది మేలో వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడయ్యాడు వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా తొలిసారిగా విండీస్ సారథిగా పగ్గాలు చేపట్టాడు. ఇందులో భాగంగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టును 3-0తో విండీస్ వైట్‌వాష్ చేసింది. ఆరంభంలో అదుర్స్.. ఆ తర్వాత.. దీంతో విజయంతో కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అయితే, ఆ సంతోషం కొన్నిరోజుల్లోనే ఆవిరైపోయింది.నెదర్లాండ్స్ టూర్ తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిన నికోలస్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ గెలిచినా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఇదే తరహాలో 3-0తేడాతో పర్యాటక జట్టు చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో టీమిండియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. టీమిండియాతో పోటీకి సన్నద్ధం! ఇప్పటికే ఇంగ్లండ్ టూర్లో టీ20, వన్డే సిరీస్‌లు గెలిచి జోష్‌లో ఉన్న పటిష్టమైన భారత జట్టుతో తలపడనుంది. ఇందుకోసం శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే జట్టు విండీస్‌కు చేరుకుంది కూడా! ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా సహా కొంత మంది కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో వన్డేల్లో తమ పని కాస్త సులువవుతుందని పేర్కొన్నాడు. Trinidad - WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq — BCCI (@BCCI) July 20, 2022 అయితే, టీమిండియాలో మ్యాచ్ విన్నర్లకు కొదువలేదని, వాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు అతడు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. ‘‘వాళ్లలో(భారత జట్టు) ఎంతో మంది అద్బుత ఆటగాళ్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బంతితోనూ... బ్యాట్‌తోనూ రాణించగలరు. మేము చేదు అనుభవాల నుంచి కోలుకుని.. వాళ్లకు సవాలు విసరగలం. ట్రినిడాడ్, ఫ్లోరిడాలో సత్తా చాటుతాం. క్రికెట్ ప్రపంచానికి మేమేంటో చూపిస్తాం. జట్టుగా ఇది మాకొక మంచి అవకాశం. వన్డే క్రికెట్లో లోపాలు సరిదిద్దుకుని.. ముందుకు సాగుతాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలకు శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనుండగా.. టీ20 సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుతో చేరనున్నాడు. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! -
Ind Vs Wi: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు
India tour of West Indies, 2022: ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా వెస్టిండీస్ టూర్‌తో బిజీ కానుంది. విండీస్‌లో పర్యటనలో భాగంగా మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వన్డే సిరీస్‌కు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు మాత్రం హిట్‌మ్యాన్ రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగమైన భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విండీస్ టూర్‌కు దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్- టీమిండియా పూర్తి షెడ్యూల్, మ్యాచ్ సమయం, వేదికలు, జట్ల వివరాలు గమనిద్దాం. ఇక ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లను 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. విండీస్ పర్యటనలోనూ ఇదే తరహాలో విజయం సాధించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. కాగా ఇటీవలే గాయం నుంచి కోలుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్ వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా! మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ►జూలై 22- మొదటి వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 24- రెండో వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 27- మూడో వన్డే-క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ►మొదటి టీ20- జూలై 29- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం చదవండి: Denesh Ramdin: టీమిండియాతో సిరీస్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..! KL Rahul-Jhulan Goswami: గోస్వామి బౌలింగ్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. వీడియో వైరల్! -
WI Vs Ban: విండీస్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఈ సిరీస్ వాళ్లదే!
WI Vs Ban 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌తో ఘన విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా 2-0తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్.. వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో టెస్టు, టీ20 సిరీస్‌లను విండీస్ కైవసం చేసుకుంది. ఇక ప్రపంచకప్-2023 నేపథ్యంలో సూపర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్ పర్యాటక బంగ్లా సొంతమైంది. కాగా గయానా వేదికగా బుధవారం(జూలై 13) వెస్టిండీస్- బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే జరిగింది. విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 108 పరుగులకే కుప్పకూలింది. కీమో పాల్(25- నాటౌట్) మినహా ఎవరూ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. కెప్టెన్ నికోలస్ పూరన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 35 ఓవర్లలోనే పూరన్ బృందం కథ ముగిసింది. TOSS🪙: Captain @nicholas_47 is second best at toss today. 🇧🇩 have sent West Indies in to 🏏 in this 2nd One-Day International at Providence stadium 🇬🇾. #WIvBAN pic.twitter.com/AyYdD0vxJR — Windies Cricket (@windiescricket) July 13, 2022 బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ 4 వికెట్లు తీయగా.. నాసుమ్ అహ్మద్ 10 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ శుభారంభం అందించాడు. అదరగొట్టిన బంగ్లా కెప్టెన్ అర్ధ శతకంతో రాణించి సత్తా చాటాడు. మరో ఓపెనర్ శాంటో 20 పరుగులు చేసి నిష్క్రమించగా.. లిటన్ దాస్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 20.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన బంగ్లాదేశ్ భారీ విజయం సాధించింది. నాసుమ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. Not the #MenInMaroon day at the office. Well played to 🇧🇩 @BCBtigers #WIvBAN pic.twitter.com/gj6rJ26tM0 — Windies Cricket (@windiescricket) July 13, 2022 చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం! ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు! Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! -
WI Vs Ban: చేదు అనుభవాల నుంచి కోలుకుని.. బంగ్లాదేశ్ ఘన విజయం
Bangladesh tour of West Indies, 2022- 1st ODI: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. మొదటి వన్డేలో ఆతిథ్య విండీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. కాగా బంగ్లాదేశ్ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్, టీ20 సిరీస్‌లను విండీస్ సొంతం చేసుకోవడంతో పర్యాటక బంగ్లాకు చేదు అనుభవం మిగిలింది. ఈ నేపథ్యంలో గయానా వేదికగా సాగిన మొదటి వన్డేలో గెలుపొంది ఊరట విజయాన్ని అందుకుంది బంగ్లాదేశ్. మ్యాచ్ సాగిందిలా... వరణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ బృందం.. 41 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో 33 పరుగులతో బ్రూక్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్ మాత్రమే పదికి పైగా పరుగులు చేశారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది వెస్టిండీస్ జట్టు. 6 వికెట్ల తేడాతో.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు.. కెప్టెన్, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 33 పరుగులతో రాణించి మంచి పునాది వేశాడు. మరో ఓపెనర్ లిటన్ దాస్ విఫలమైనా(1).. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన న్ముల్ హుసేన్ 37, నాలుగో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 41 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆఖర్లో నారుల్ హుసేన్ 20 పరుగులతో రాణించాడు. దీంతో 31. 5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. 9 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించిన బంగ్లా బౌలర్ మోహెదీ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన విండీస్ ఆటగాడు గుడకేశ్ మోటీ ఒక వికెట్ తీసి మధుర జ్ఞాపకం మిగుల్చుకున్నాడు. వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి వన్డే: టాస్: బంగ్లాదేశ్- బౌలింగ్ వెస్టిండీస్ స్కోరు: 149/9 (41) బంగ్లాదేశ్ స్కోరు: 151/4 (31.5) విజేత: బంగ్లాదేశ్.. 6 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మెహెదీ హసన్(3 వికెట్లు) చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే! IRE Vs NZ 1st ODI: భళా బ్రేస్‌వెల్.. ఐర్లాండ్‌పై కివీస్ విజయం Motie takes our #MastercardPricelessMoment of the match with his maiden International wicket! pic.twitter.com/47iHGOVUqB — Windies Cricket (@windiescricket) July 10, 2022 Motie takes his 1st International wicket! #WIvBAN #MenInMaroon Live Scorecard - https://t.co/pQMuJ0sNHj pic.twitter.com/iKOdfXOhY4 — Windies Cricket (@windiescricket) July 10, 2022 Congrats on your ODI debut Motie! All the best!👏🏿 #WIvBAN #MaroonMagic pic.twitter.com/ziGsRgSWFE — Windies Cricket (@windiescricket) July 10, 2022 -
WI Vs Ban: పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. టీ20 సిరీస్ కూడా విండీస్‌దే!
West Indies vs Bangladesh: బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అదరగొట్టాడు. గయానా వేదికగా సాగిన మూడో టీ20లో 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. పూరన్ మెరుపు ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో పర్యాటక బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌లో ఆతిథ్య విండీస్ వరుసగా 7, 10 వికెట్ల తేడాతో గెలుపొంది విజేతగా నిలిచింది. ఇక మొదటి టీ20లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు. రెండో టీ20లో 35 పరుగుల తేడాతో గెలుపొందిన పూరన్ బృందం... గురువారం నాటి మూడో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ కైవసం చేసుకుంది. వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20 ►టాస్: బంగ్లాదేశ్- బ్యాటింగ్ ►బంగ్లాదేశ్ స్కోరు: 163/5 (20) ►వెస్టిండీస్ స్కోరు: 169/5 (18.2) ►విజేత: వెస్టిండీస్(5 వికెట్ల తేడాతో విండీస్ గెలుపు) ►పూరన్, కైల్ మేయర్స్ అర్ధ శతకాలు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నికోలస్ పూరన్(39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు- నాటౌట్) ►బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్: ఆఫిఫ్ హొసేన్(50 పరుగులు) చదవండి: Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! BAN vs WI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ దూరం..! A big knock and a big moment to seal the series! Nicholas Pooran takes our #MastercardPricelessMoment of the 3rd T20I. #WIvBAN pic.twitter.com/Xo6nVibUwJ — Windies Cricket (@windiescricket) July 7, 2022 The power of Kyle Mayers!! #WIvBAN pic.twitter.com/xWKe5Jrf5W — Windies Cricket (@windiescricket) July 7, 2022 -
వెస్టిండీస్ కెప్టెన్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ వన్డేల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ ప్రధానంగా ఉండే కెప్టెన్.. ఒక వన్డేల్లో బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం చాలా తక్కువగా చూస్తుంటాం. ఒక కెప్టెన్ బౌలింగ్‌లో ఐదు వికెట్ల ఫీట్ నమోదు చేయడం కూడా అరుదుగానే కనిపిస్తోంది. రెగ్యులర్ బౌలర్ కెప్టెన్‌గా ఐదు వికెట్లు తీయడం కొత్త కాకపోవచ్చు.. కానీ ఒక బ్యాటర్ తొలిసారి బౌలింగ్‌లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అరుదు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో నికోలస్ పూరన్ అదే ఫీట్ నమోదు చేశాడు. బౌలింగ్‌లో సూపర్ ప్రదర్శన చేసి దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంతకముందు వన్డే కెప్టెన్‌గా ఉంటూ బౌలింగ్‌లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లు నలుగురు మాత్రమే. వారిలో సౌరవ్ గంగూలీ, మైక్ గాటింగ్, గ్రహం గూచ్, నవ్రోజ్ మంగల్లు మాత్రమే ఉన్నారు. పూరన్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 48 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పాకిస్తాన్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. ఇక పూరన్ పాక్‌తో మ్యాచ్‌కు ముందు వన్డేల్లో కేవలం మూడు బంతులు మాత్రమే వేశాడు. తాజాగా మాత్రం 10 ఓవర్ల కోటా బౌలింగ్ పూర్తి చేసి రెగ్యులర్ బౌలర్ తరహాలో నాలుగు వికెట్లు తీసి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక పూరన్ ప్రదర్శనను మెచ్చుకున్న ఐసీసీ.. గతంలో బ్యాటింగ్ కెప్టెన్ బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన చేసిన సందర్భాలను మరోసారి గుర్తుచేసుకొంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. సౌరవ్ గంగూలీ: టీమిండియా తరపున విజయవంతమైన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకడు. తన కెరీర్లో 311 వన్డేలు ఆడిన గంగూలీ సరిగ్గా వంద వికెట్లు తీయడం విశేషం. ఎక్కువగా పార్ట్‌టైమ్ బౌలర్‌గా బౌలింగ్ చేసిన గంగూలీ.. ఒక కెప్టెన్‌గా 25 వన్డేల్లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. ఇక 2000లో కాన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గంగూలీ 10 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ 68 బంతుల్లో 78 పరుగులు నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రహం గూచ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రహం గూచ్ 1989లో ఎంఆర్ఎఫ్ వరల్డ్ సిరీస్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బౌలింగ్‌లో చెలరేగాడు. 10 ఓవర్ల కోటా బౌలింగ్ పూర్తి చేసిన గ్రహం గూచ్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. జావెంద్ మియాందాద్, సలీమ్ యూసఫ్, వసీం అక్రమ్ల రూపంలో తన ఖాతాలో వేసుకున్నాడు. గ్రహం గూచ్ దెబ్బకు పాకిసతఆన్ 148 పరుగులు చేసింది. ఆ తర్వాత 44 ఓవర్లలో ఆసీస్ విజయం అందుకుంది. మైక్ గాటింగ్: మైక్ గాటింగ్ తన కెరరీలో 10 వికెట్లు తీయగా.. అందులో మూడు వికెట్లు 1987లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తీశాడు. 9 ఓవర్లు వేసిన గాటింగ్ 59 పరుగులిచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. నౌరోజ్ మంగల్: అఫ్గన్‌కు కెప్టెన్‌గా పనిచేసిన నౌరోజ్ మంగల్ 2009లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో మెరిశాడు. 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మంగల్ 35 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కాగా నెదర్లాండ్స్ ఓపెనర్లు టెన్ డెస్కటే,ఎరిక్ క్రిన్స్కిల 113 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసిన మంగల్ ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీశాడు. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. -
పాక్ పై ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది: పూరన్
ఆదివారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన అఖరి వన్డేలో 53 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి చెందింది. తద్వారా పాక్ చేతిలో 0-3 తేడాతో విండీస్ వైట్‌వాష్‌కు గురైంది. కాగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ఈ సిరీస్‌లో ఓటమి తమను తీవ్రంగా నిరాశ పరిచింది చెప్పాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్ కోసం తాను ఎదురు చూస్తున్నానని పూరన్ తెలిపాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేల్లో వెస్టిండీస్ తలపడనుంది. జూన్ 16 (గురువారం) నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. “అఖరి రెండు మ్యాచ్‌లు మాకు నిరాశ కలిగించాయి. తొలి వన్డేలో మేం బాగా రాణించాం. తర్వాతి మ్యాచ్‌ల్లో మేము పూర్తిగా విఫలమయ్యాం. దీని ఫలితంగా సిరీస్‌కు కోల్పోయాము. ఈ పరాజయం నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం. త్వరలో బంగ్లాదేశ్‌తో ఆడనున్నాం. ఈ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము" అని పూరన్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మూడో వన్డే: టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ పాక్ స్కోరు: 269/9 (48) వెస్టిండీస్ స్కోరు: 216 (37.2) విజేత: డీఎల్ఎస్ మెథడ్‌లో 53 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాదాబ్ ఖాన్(78 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, జియో! ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే! -
Pak Vs WI: విండీస్‌కు షాక్.. పాక్ చేతిలో పరాజయం
West Indies tour of Pakistan, 2021-22: 1st ODI- నెదర్లాండ్స్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి పాకిస్తాన్లో అడుగుపెట్టిన వెస్టిండీస్‌కు ఓటమి ఆహ్వానం పలికింది. మొదటి వన్డేలో పాకిస్తాన్ చేతిలో విండీస్ పరాజయం పాలైంది. నికోలస్ పూరన్ బృందంపై 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ వన్డే సిరీస్ ఆడేందుకు విండీస్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం(జూన్ 8) ముల్తాన్ వేదికగా పాక్- విండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్ షాయీ హోప్ 127 పరుగులతో విండీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రూక్స్ సైతం 70 పరుగులతో రాణించాడు. అయితే, నెదర్లాండ్స్ పర్యటనలో తీవ్రంగా నిరాశ పరిచిన కెప్టెన్ నికోలస్ పూరన్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోవ్‌మన్ పావెల్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక విండీస్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే ఓపెనర్ ఫఖార్ జమాన్(11 పరుగులు) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్(65) బ్యాట్ ఝులిపించడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ 103 పరుగుల భారీ స్కోరుతో పాక్ విజయానికి బాటలు వేశాడు. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అర్ధ శతకం(59పరుగులు) ఆకట్టుకోగా.. ఖుష్ దిల్ షా 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) ♦విజేత: పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్‌పై విజయం 🔥🔥🔥 🔊🔛 @KhushdilShah_ sends the ball sailing for THREE 6️⃣s in a row! 💪#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/JBRxSN5Ihi — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 .@KhushdilShah_ THE FINISHER 💥 Unbelievable striking from the southpaw! 😍#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/MDqnCK3abS — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 🏏 𝟒𝟏* (23) 💥 𝟒 massive sixes ⚡ 𝟏𝟕𝟖.𝟐𝟔 strike rate 🗣️ Player of the match @KhushdilShah_ reflects on his explosive knock and his power-hitting prowess 💪 #PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/bNqPo2v848 — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
PAK vs WI: ఐపీఎల్లో పర్లేదు.. అక్కడ మాత్రం తుస్.. కానీ పాక్‌తో మ్యాచ్‌లో!
Pakistan Vs West Indies 2022- ODI Series: నెదర్లాండ్స్ జట్టును క్లీన్‌స్వీప్ చేసి కెప్టెన్‌గా ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించాడు వెస్టిండీస్ పరిమిత ఓవర్ల సారథి నికోలస్ పూరన్. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్ పర్యటనలో ఆ జట్టును 3-0 తేడాతో మట్టికరిపించి శుభారంభం అందుకున్నాడు. కెప్టెన్‌గా సఫలమైనా బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో మూడు వన్డేల్లో పూరన్ సాధించిన స్కోర్లు వరుసగా.. 7,10,7. ఇక మూడుసార్లూ ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్‌తో సిరీస్ ముగియగానే విండీస్ జట్టు పాకిస్తాన్‌కు పయమనమైన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూన్ 8న ముల్తాన్ వేదికగా ఆతిథ్య పాక్ జుట్టతో తలపడనుంది. నాకు ఇదేం కొత్త కాదు! ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన పూరన్.. తన ఫామ్‌పై ఆందోళన అక్కర్లేదన్నాడు. ‘‘నేను బాగానే ఉన్నా! ఇలా పరుగులు చేయకపోవడం నాకేం కొత్త కాదు. ఒక్కసారి నా కెరీర్ గణాంకాలు చెక్ చేసుకోవాలి. ప్రతిసారి పరుగులు సాధిస్తూనే ఉన్నాను. కానీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. నెదర్లాండ్స్‌లో నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల నిరాశ చెందాను. ఆ సిరీస్‌లో నేను రన్స్ స్కోర్ చేసి ఉండాల్సిందని కొంతమంది అనొచ్చు. నిజానికి నేను స్పిన్ బాగా ఆడగల బ్యాటర్‌ను. నెదర్లాండ్స్‌లో వైఫల్యం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాలం కలిసి రావాలి అంతే! కచ్చితంగా నేను రాణిస్తాను’’ అంటూ నికోలస్ పూరన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక పాకిస్తాన్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయన్న పూరన్.. అదేమీ తమకు పెద్ద సమస్య కాకపోవచ్చని.. కచ్చితంగా మెరుగ్గా ఆడతామని పేర్కొన్నాడు. కాగా ముల్తాన్ వేదికగా పాక్, విండీస్ జట్ల మధ్య సిరీస్ జరుగనుంది. ఇక ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన పూరన్.. 13 ఇన్నింగ్స్‌లో కలిపి 306 పరుగులు చేశారు. The #MenInMaroon have arrived in Multan for the 3-match ODI series against @TheRealPCB starting on pic.twitter.com/uKFUDWEJkT — Windies Cricket (@windiescricket) June 6, 2022 Preparations completed 👊 Last day of activities for both teams before the first ODI tomorrow 👏#KhelAbhiBaqiHai | #PAKvWI pic.twitter.com/hHhZvdkgtG — Pakistan Cricket (@TheRealPCB) June 7, 2022 -
అందరూ చేతులెత్తేసినా.. ఆ ఒక్కడు నిలబడ్డాడు! సిరీస్ విండీస్‌దే!
ICC ODI Super League Netherlands Vs West Indies: ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకుంది. విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రాండన్ కింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అమ్స్టెల్వీన్లోని వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్(46), మాక్స్ ఒడౌడ్(51) రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ ఎడ్వర్డ్స్ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. ఇక మొదటి వన్డేలో అద్భుత అర్థ శతకంతో ఆకట్టుకున్న తేజ నిడమనూరు 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 214 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో రాణించిన షాయీ హోప్‌ను 18 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డీ లీడ్. ఇక బ్రూక్స్ సైతం కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. బానర్ (15), కెప్టెన్ నికోలస్ పూరన్ (10) పూర్తిగా నిరాశ పరిచారు. దీంతో విజయంపై నెదర్లాండ్స్‌కు ఆశలు చిగురించాయి. అయితే, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రాండన్ కింగ్ 90 బంతుల్లో 91 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు(వన్డేల్లో కింగ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం). కేసీ కార్టీ కూడా 43 పరుగులతో అతడికి సహాయంగా నిలబడ్డాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా విండీస్ మరో ఐదు వికెట్లు చేతిలో ఉండగానే విజయం సొంతం చేసుకుంది. సిరీస్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ పర్యటనతో వెస్టిండీస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నికోలస్ పూరన్ బ్యాటర్‌గా విఫలమైనా.. సారథిగా ఆకట్టుకున్నాడు. నెదర్లాండ్స్ వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే స్కోర్లు: నెదర్లాండ్స్: 214 (48.3) వెస్టిండీస్: 217/5 (45.3) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ కింగ్ ఇది చదవండి: ICC ODI Super League: చెలరేగిన తేజ నిడమనూరు.. అయినా వెస్టిండీస్ చేతిలో తప్పని ఓటమి! Who Is Teja Nidamanuru: అరంగేట్రంలోనే అర్థ శతకంతో మెరిసి.. ఎవరీ తేజ నిడమనూరు? Bringing up his highest ODI score and the win.👏🏿 #NEDvWI #MenInMaroon pic.twitter.com/qYv4Zs1IjU — Windies Cricket (@windiescricket) June 2, 2022 Netherlands win the toss & will bat first in the 2nd ODI. #NEDvWI #MenInMaroon pic.twitter.com/XGNBe5FUza — Windies Cricket (@windiescricket) June 2, 2022 -
నోబాల్ ఇచ్చుంటే ఎస్ఆర్హెచ్ గెలిచేదా!
ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్ ఆరంభంలో వరుసగా రెండు ఓటములు చవిచూసినప్పటికి మధ్యలో ఐదు వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఒక దశలో టాప్ ప్లేస్‌కు గురిపెట్టినట్లే కనిపించిన ఎస్ఆర్హెచ్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చతికిలపడింది. ఆ తర్వాత సీఎస్కే చేతిలో.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓటమి చవిచూసింది. దీంతో ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే ఎస్ఆర్హెచ్కు ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఈ విషయం పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ ప్రధాన బ్యాటర్స్ అంతా విఫలమైన వేళ మార్క్రమ్(42), నికోలస్ పూరన్(34 బంతుల్లో 62) గెలుపుపై ఆశలు కల్పించారు. పూరన్ ఉన్నంతవరకు ఎస్ఆర్హెచ్ గెలుపుపై కాస్త ధీమా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో పూరన్ వివాదాస్పద రీతిలో ఔట్ అయ్యాడు. శార్దూల్ ఆ ఓవర్ ఐదో బంతిని చాలా ఎత్తులో ఫుల్‌టాస్ వేశాడు. అయితే పూరన్ క్రీజు నుంచి బయటకు వచ్చి లాంగాన్ దిశగా షాట్ ఆడగా పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఔట్‌పై ఫీల్డ్ అంపైర్‌కు సందేహం ఉండడంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ పరిశీలనలో.. పూరన్ క్రీజుదాటి బయటకు రావడం.. ఫుల్‌టాస్ బంతి అయినప్పటికి బ్యాట్‌కు టచ్ అయ్యే సమయంలో తక్కువ ఎత్తులో ఉండడంతో ఔట్ సిగ్నల్ ఇచ్చాడు. అలా థర్డ్ అంపైర్ నిర్ణయం ఫీల్డింగ్ జట్టుకు అనుకూలంగా వచ్చింది. పూరన్ ఔట్ కావడంతో ఎస్ఆర్హెచ్ ఓటమి దాదాపు ఖరారైంది. ఒకవేళ అంపైర్ అది నోబాల్‌గా పరిగణించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. పూరన్ ఉండుంటే జట్టును గెలిపించేవాడేమో.. కానీ ఏం చేస్తాం అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: IPL 2022 DC Vs SRH: ఎస్ఆర్హెచ్పై వార్నర్ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు -
మళ్లీ ఓడిన హైదరాబాద్
ముంబై: ఈ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ వెనుకబడుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆల్‌రౌండ్ షోతో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 92 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (35 బంతుల్లో 67 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించాడు. ఖలీల్ అహ్మద్ 3, శార్దుల్ 2 వికెట్లు తీశారు. వార్నర్, పావెల్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగితే హైదరాబాద్ ఖాతా (వికెట్) తెరిచింది. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను మెయిడిన్ వికెట్‌గా తీశాడు. ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా ఢిల్లీ పుంజుకుంది. ఈ లీగ్‌లోనే ‘స్పీడ్‌స్టర్’గా గుర్తింపు తెచ్చుకున్న ఉమ్రాన్ మాలిక్‌ను తొలి ఓవర్ నుంచే ఉతికేశారు. 4వ ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో వార్నర్ 21 పరుగులు పిండుకున్నాడు. మార్‡్ష (10) అవుటైనా... కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), వార్నర్ ఇద్దరు ఇన్నింగ్స్‌ను మెరుపులతో దారిలో పెట్టారు. శ్రేయస్ గోపాల్ వేసిన 9వ ఓవర్లో పంత్ 6, 6, 6, 4లతో జూలు విదిల్చాడు. కానీ చివరి బంతినీ బాదేసే పనిలో పంత్ వికెట్ల మీదికి ఆడుకున్నాడు. వికెట్ పడ్డా... ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. తర్వాత పావెల్, వార్నర్‌తో కలిసి విధ్వంసకరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదట వార్నర్ 34 బంతుల్లో (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఓవర్లు దగ్గర పడుతుంటే పావెల్ బ్యాట్ మరింత రెచ్చిపోయింది. అతను 30 బంతుల్లోనే (6 సిక్సర్లు) ఫిఫ్టీ చేశాడు. ఉమ్రాన్ ఆఖరి ఓవర్లో (6, 0, 4, 4, 4, 1) పావెల్ వీరవిహారంతో వార్నర్ శతకం 8 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇద్దరు కలిసి 11 ఓవర్లలో అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. పూరన్ మెరిపించినా... కొండంత లక్ష్యం ఛేదించేందుకు దిగిన హైదరాబాద్ ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టాపార్డర్ బ్యాటర్స్ అభిషేక్ శర్మ (7), విలియమ్సన్ (4), రాహుల్ త్రిపాఠి (22) నిరాశపరిచారు. మార్క్రమ్ (25 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), పూరన్ కాసేపు భారీ సిక్సర్లతో అలరించా రు. అయితే ఢిల్లీ బౌలర్లు ఖలీల్, శార్దుల్ ఎక్కడికక్కడ కళ్లెం వేశారు. పూరన్ 29 బంతుల్లోనే (1 ఫోర్, 5 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీ సాధించగా... 18వ ఓవర్లో అతను కూడా ఔటవడంతో అక్కడే హైదరాబాద్ గెలుపుదారి మూసుకుపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మన్దీప్ సింగ్ (సి) పూరన్ (బి) భువనేశ్వర్ 0; వార్నర్ (నాటౌట్) 92; మార్‡్ష (సి అండ్ బి) అబాట్ 10; పంత్ (బి) గోపాల్ 26; పావెల్ (నాటౌట్) 67; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–85. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–25–1, అబాట్ 4–0–47–1, ఉమ్రాన్ మాలిక్ 4–0–52–0, కార్తీక్ త్యాగి 4–0–37–0, శ్రేయస్ గోపాల్ 3–0–34–1, మార్క్రమ్ 1–0–11–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 7; విలియమ్సన్ (సి) పంత్ (బి) నోర్జే 4; త్రిపాఠి (సి) శార్దుల్ (బి) మార్‡్ష 22; మార్క్రమ్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 42; పూరన్ (సి) పావెల్ (బి) శార్దుల్ 62; శశాంక్ (సి) నోర్జే (బి) శార్దుల్ 10; అబాట్ (సి) రిపాల్ (బి) ఖలీల్ 7; గోపాల్ (నాటౌట్) 9; త్యాగి (బి) కుల్దీప్ 7; భువనేశ్వర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–37, 4–97, 5–134, 6–153, 7–165, 8–181. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–44–2, ఖలీల్ అహ్మద్ 4–0–30–3, నోర్జే 4–0–35–1, మార్‡్ష 4–0–36–1, కుల్దీప్ యాదవ్ 4–0–40–1. -
వెస్టిండీస్ వన్డే, టి20 కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్
వెస్టిండీస్ వన్డే, టి20 కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పొలార్డ్ స్థానంలో పూరన్ విండీస్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇటీవలే కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కొత్త కెప్టెన్ ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై విండీస్ క్రికెట్ బోర్డు పలు దఫాలు చర్చలు జరిపింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ పూరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కాగా నికోలస్ పూరన్ ఐసీసీ టి20 ప్రపంచకప్ 2022తో పాటు, 2023 వన్డే ప్రపంచకప్ వరకు విండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడు. ఇక షెయ్ హోప్‌ను వన్డే వైస్‌కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక పూరన్ 2016లో విండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పూరన్ 37 వన్డేల్లో 1,121 పరుగులు, 57 టి20ల్లో 1193 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలు సాధించిన పూరన్.. టి20 క్రికెట్లో 8 అర్థసెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్న పూరన్ ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పూరన్‌ను ఎస్ఆర్హెచ్ మెగావేలంలో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన రేటుకు న్యాయం చేస్తున్న పూరన్ ఎస్ఆర్హెచ్ తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. చదవండి: Kohli-Viv Richards: విండీస్ దిగ్గజానికి క్లిష్ట పరిస్థితి.. కోహ్లి త్యాగం! -
అంతా అతని వల్లే జరిగిందన్న పూరన్.. ఆర్సీబీతో మ్యాచ్‌పై హస్సీ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 11) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి గుజరాత్ టైటాన్స్‌ను ఓటమిని పరిచయం చేసింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఫ్రాంచైజీ.. అరంగేట్రంలోనే హ్యాట్రిక్ విజయాలు సాధించి దూసుకుపోతుండగా, సన్‌రైజర్స్ జీటి విజయాల పరంపరకు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. భువీ (2/37), నటరాజన్ (2/34), మార్కో జన్సెన్ (1/27), ఉమ్రాన్ మాలిక్ (1/39) రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌ను 162 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభినవ్ శర్మ (42), కేన్ విలియమ్సన్ (57) శుభారంభాన్ని అందించగా, ఆఖర్లో పూరన్ (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (8 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్) చెలరేగి ఎస్ఆర్హెచ్ను విజయతీరాలకు చేర్చారు. Finishing in style ✅ The Brian Lara influence 🙌 2⃣ wins in a row 🔥 The player-coach duo of @nicholas_47 & the legendary @BrianLara chat after @SunRisers' successful run-chase against #GT. 👍 👍 - By @ameyatilak Full interview 📹 🔽 #TATAIPL | #SRHvGT https://t.co/VPyVK8aiKp pic.twitter.com/AGZmrGWjWk — IndianPremierLeague (@IPL) April 12, 2022 ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన పూరన్, మ్యాచ్ అనంతరం ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ ప్రస్థానంపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన జట్టు తిరిగి గాడిలో పడటానికి బ్యాటింగ్ కోచ్ లారానే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. A face-off with familiar faces! 📹 Once we cross the line, it's bat v ball challenge! Watch the match preview with Huss!#CSKvRCB #WhistlePodu #Yellove 🦁💛 @amazonpay pic.twitter.com/XmfVV5T03l — Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2022 ఈ వీడియోతో పాటు ఇవాళ (ఏప్రిల్ 12) ఆర్సీబీతో జరుగబోయే మ్యాచ్‌పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఏమన్నాడో (ప్రివ్యూ) చూడొచ్చు. ఇందులో సీఎస్కే ఆటగాళ్ల ప్రాక్టీస్, ఇతరత్రా దృశ్యాలు ప్రధానంగా ఆకట్టుకోగా, జట్టు మాజీ సభ్యుడు డుప్లెసిస్‌ను సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆప్యాయంగా కౌగిలించుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసిక్తికర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సీఎస్కే, ఆర్సీబీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్కే ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్‌రైజర్స్ బౌలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్‌ల హైలైట్స్
-
ఏం ఆడుతున్నార్రా బాబూ.. అంతా మీరే చేశారు.. ఇక ఇంతే!
IPL 2022 SRH Vs LSG: ఐపీఎల్ మెగా వేలం మొదలు సీజన్ ఆరంభమైనప్పటి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతూనే ఉంది. తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఏకంగా 61 పరుగుల తేడాతో ఓటమి.. కోట్లు పోసి ఏరికోరి కొన్న వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ ఆ మ్యాచ్‌లో డకౌట్. ఎయిడెన్ మార్కరమ్, వాషింగ్టన్ సుందర్ తప్ప ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో.. "ఎవరైనా గెలిచేందుకు సమష్టిగా పోరాడతారు.. కానీ మన వాళ్లు ఓటమిని మూటగట్టుకోవడంలో తమ వంతు పాత్ర పోషించడంలో పోటీ పడతారు" అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గుర్రుమన్నారు. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ జరిగిన తాజా మ్యాచ్ విషయానికొస్తే.. ఆరంభంలో ఆశలు రేపినా చివర్లో పరాజయం పాలై మాకిది షరా మామూలే అని నిరూపించారు సన్ రైజర్స్ ఆటగాళ్లు. రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ మినహా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా 12 పరుగుల తేడాతో సీజన్లో తమ రెండో మ్యాచ్ లోనూ ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా జట్టు సీఈఓ కావ్యా మారన్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. "మొత్తం మీరే చేశారు. ఒక్క సీజన్లో విఫలమైందుకు డేవిడ్ వార్నర్ భాయ్ ను అవమానకర రీతిలో బయటకు పంపించారు. రషీద్ ఖాన్ ను రిటైన్ చేసుకోలేదు. బెయిర్ స్టోను వదిలేశారు. జట్టును నాశనం పట్టించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మ్యాచ్ సందర్భంగా కావ్య హావభావాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ""ఈ సీజన్ మొత్తం మీ ఎక్స్ ప్రెషన్స్ ఇలాగే ఉండబోతున్నాయి. రాసి పెట్టుకోండి. హిట్టర్లు లేరు. ఎస్ఆర్ హెచ్ లో ఈ ఆటగాడిపై మనం ఆధారపడగలం అని నమ్మకంగా ఒక్క పేరు కూడా చెప్పలేం. ఏం ఆడుతున్నార్రా బాబూ.. సన్ రైజర్స్ కు గడ్డు పరిస్థితులు తప్పవు" అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Aakash Chopra-Chahal: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్..! #SRHvsLSG kavya Maran 💔 Srh fans In first innings in 2nd innings pic.twitter.com/197UXlNAUe — 👑🔔 (@superking1814) April 4, 2022 Whenever @SunRisers struggle to win the matches, I miss these guys 🤧#OrangeArmy #SRHvsLSG @IPL pic.twitter.com/1PNLWg5fke — Foresay sports தமிழ் (@ForesayThamizh) April 4, 2022 Future prediction. #Kavya's expression will be this for the whole season. Mark my words. #SRH is below par in all categories. No hitters, no dependable players. Looks like this will be "the end" of good time of #SunrisersHyderabad #SRHvsLSG pic.twitter.com/mfCZHz9x5W — Avis Indian☮️ (@ClanofGriffin) April 4, 2022 The Main Problem with SRH is there Team Management.. After Just One Year Failure they Drop David Warner... They Not Pick best Bowler Rashid Khan They pick N Pooran at 11 Cr Not J bairstow.. #SRHvsLSG pic.twitter.com/cxxrEGU0Tf — Vaibhav D (@Vaibhav04563161) April 4, 2022 Brilliant bowling performance by #LSG as they defend their total of 169/7 and win by 12 runs 👏👏 Scorecard - https://t.co/89IMzVls6f #SRHvLSG #TATAIPL pic.twitter.com/MY2ZhM3Mqe — IndianPremierLeague (@IPL) April 4, 2022 -
IPL 2022: తొలివారంలో అట్టర్ ఫ్లాప్ అయిన 11 మంది ఆటగాళ్లు వీరే!
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభమై వారం రోజులు దాటింది. ఏప్రిల్ 1 నాటికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో లో స్కోరింగ్ మ్యాచ్‌లతో పాటు.. ఆఖరి ఓవర్ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. వ్యక్తిగతంగా కొంతమంది ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. భారీ అంచనాలతో ఐపీఎల్-2022 బరిలో దిగిన వారు ఆరంభ మ్యాచ్‌లలో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు. ఆ ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2021 సీజన్లో అత్యధిక పరుగుల వీరుడు. ఈ చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ ఏకంగా 635 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. దేశవాళీ టోర్నీలు విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో భారీ అంచనాలతో ఐపీఎల్-2022లో అడుగుపెట్టాడు. కానీ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో డకౌట్ అయిన రుతురాజ్, లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున గత సీజన్ రెండో అంచెలో అదరగొట్టాడు ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు. తద్వారా టీమిండియాలో చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఐపీఎల్-2021 ప్రదర్శన నేపథ్యంలో కేకేఆర్ అతడిని 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అయితే, ఆరంభ మ్యాచ్‌లలో ఈ యువ ఆల్‌రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సీఎస్కేతో మొదటి మ్యాచ్‌లో ఈ ఓపెనర్ 16 పరుగులు చేశాడు. ఆర్సీబీపై 10, పంజాబ్‌పై కేవలం 3 పరుగులు మాత్రమే సాధించాడు. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేదు. అనూజ్ రావత్ ఆర్సీబీ యువ ఆటగాడు సైతం ఆరంభ మ్యాచ్‌లలో తేలిపోయాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఘనంగానే ఇన్నింగ్స్ ఆరంభించినా రాహుల్ చహర్‌కు దొరికిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి అనూజ్ రావత్ సగటు స్కోరు 10.5. మనీష్ పాండే లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాడు మనీశ్ పాండేకు ఈ సీజన్లో మంచి ఆరంభం దక్కలేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో మొత్తం కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో 5, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 6 పరుగులు సాధించాడు. నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎన్నో ఆశలతో నికోలస్ పూరన్‌ను మెగా వేలంలో కొనుగోలు చేసింది. గత సీజన్లో విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకుంది. ఇక ఇటీవల జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో రాణించిన ఈ విండీస్ వికెట్ కీపర్బ్యాటర్.. ఐపీఎల్-2022ను ఘనంగా ఆరంభించలేకపోయాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయిన పూరన్.. పూర్ పర్ఫామెన్స్తో అభిమానులను నిరాశపరిచాడు. లియామ్ లివింగ్‌స్టోన్ మెగా వేలం-2022లో భాగంగా 11.5 కోట్ల భారీ ధర చెల్లించి పంజాబ్ కింగ్స్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ ఇంగ్లండ్ క్రికెటర్ ఘనంగా తన ఆగమనాన్ని చాటలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులు చేశాడు. రాజ్ బవా భారత అండర్-19 వరల్డ్‌కప్ ప్లేయర్ రాజ్ బవా ఐసీసీ మెగా ఈవెంట్లో అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో భాగమైన ఈ యువ ఆటగాడు.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 14వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రాజ్ బవా విఫలమయ్యాడు. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులు సాధించగలిగాడు. డానియెల్ సామ్స్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలింగ్ ఆల్‌రౌండర్ డానియెల్ సామ్స్ 57 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్లు మొత్తంగా 24(6,1,6,4,1,6) పరుగులు సాధించి తమ జట్టుకు విజయం అందించారు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడని భావించిన ముంబై యాజమాన్యానికి ఆరంభ మ్యాచ్‌లో విఫలమై షాకిచ్చాడు డానియెల్ సామ్స్. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను 12 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. జట్టుకు ప్రధానమైన ఈ బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 3.2 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఆరంభం ఘనంగా లేకపోయినప్పటికీ ఈ అనువజ్ఞుడైన ఆటగాడు తప్పక రాణించగలడని విశ్లేషకుల అభిప్రాయం. నాథన్ కౌల్టర్‌నైల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. 61 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సత్తా చాటింది. అయితే, ఈ విజయంలో నాథన్ తన వంతు పాత్ర పోషించలేకపోయాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ బౌలర్ ఏకంగా 48 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. శివమ్ మావి కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు శివమ్ మావి. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న అతడు.. 4 ఓవర్లు బౌలింగ్ వేసి 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో జట్టులో స్థానం కోల్పోయిన శివమ్ మావి.. పంజాబ్‌తో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చాడు. అయితే, రెండు ఓవర్లలోనే 39 పరుగులు ఇచ్చుకుని విఫలమయ్యాడు. అయితే, ఒక వికెట్ మాత్రం తీయగలగడం గమనార్హం. అయితే, ఆరంభ మ్యాచ్‌లలో ఈ ఆటగాళ్లు విఫలమైనప్పటికీ రానున్న మ్యాచ్‌లలో తమదైన శైలిలో రాణించి అభిమానులను ఆకట్టుకోవాలని కోరుకుందాం. A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ స్టార్లు, ఇక్కడేమో కోట్లు కుమ్మరించారు.. అక్కడేమో..!
The Hundred League: ఐపీఎల్‌కు పోటీగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్ సీజన్ 2022 వేలం ఏప్రిల్ 5న జరుగనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. తొలి సీజన్‌తో పోలిస్తే.. ఈ ఏడాది లీగ్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ స్టార్లు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. లీగ్‌లో ఆడేందుకు 16 దేశాలకు చెందిన 534 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా.. వీరిలో 284 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. లీగ్‌కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ కూడా ఇటీవలే ముగిసింది. ఆయా జట్లు 42 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. వీరిలో 25 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు, 17 మంది ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు ఉన్నారు. కాగా, హండ్రెడ్ లీగ్ 2022 సీజన్లో పాల్గొనేందుకు ఆండ్రీ రసెల్, డేవిడ్ వార్నర్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, డ్వేన్ బ్రావో, హెట్‌మైర్, మార్క్రమ్, ఓడియన్ స్మిత్, వనిందు హసరంగ, భానుక రాజపక్స, దసున్ శనక, రొమారియో షెపర్డ్ వంటి ఐపీఎల్ స్టార్లు ఎగబడటం ఆసక్తి కలిగిస్తుంది. ఐపీఎల్‌తో పోలిస్తే.. ఈ ఆటగాళ్లకు హండ్రెడ్ లీగ్‌లో దక్కే పారితోషికం చాలా తక్కువ. ఐపీఎల్ 2022లో 10.75 కోట్ల భారీ మొత్తం దక్కించుకున్న విండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ హండ్రెడ్ లీగ్‌లో 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్ విభాగంలో (వేలంలో) పోటీపడుతుండగా, ఐపీఎల్లో 10 కోట్లు అందుకుంటున్న లంక మిస్టరీ స్పిన్నర్ హసరంగ 50 లక్షల రిజర్వ్ ప్రైస్ విభాగంలో, 8.5 కోట్లు అందుకుంటున్న హెట్‌మైర్, 7.75 కోట్లు అందుకుంటున్న రొమారియో షెఫర్డ్ 40 లక్షల రిజర్వ్ ప్రైస్ విభాగంలో పోటీపడుతుండటం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. హండ్రెడ్ లీగ్ 2022 వేలంలో స్లాబ్‌లు, విదేశీ ఆటగాళ్ల వివరాలు.. రూ. 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్: బాబర్ ఆజమ్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, షంషీ రూ. 99 లక్షల రిజర్వ్ ప్రైస్: షకిబ్ అల్ హసన్, క్వింటన్ డికాక్, జై రిచర్డ్సన్, ఆండ్రీ రసెల్ రూ. 75 లక్షల రిజర్వ్ ప్రైస్: మహ్మద్ అమీర్, డ్వేన్ బ్రావో, నాథన్ కౌల్టర్ నీల్, ఆరోన్ ఫించ్, షాదాబ్ ఖాన్, ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, హరిస్ రౌఫ్, ఇమ్రాన్ తాహిర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ రూ. 60 లక్షల రిజర్వ్ ప్రైస్: సీన్ అబోట్, ఫిన్ అలెన్, హిట్మైర్, మార్క్రమ్, ఫెహ్లుక్వాయో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ సాంట్నర్, ఓడియన్ స్మిత్, విల్ యంగ్, ఆడమ్ జంపా రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైస్: అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, మార్టిన్ గప్తిల్, వనిందు హసరంగ, హెన్రిక్స్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, షోయబ్ మాలిక్, డారిల్ మిచెల్ , కొలిన్ మున్రో, జేమ్స్ పాటిన్సన్, భానుక రాజపక్స, రూథర్‌ఫోర్డ్, మాథ్యూ వేడ్ రూ. 40 లక్షల రిజర్వ్ ప్రైస్: క్రిస్ లిన్, తిసారా పెరీరా, దసున్ శనక, రొమారియో షెపర్డ్, లెండిల్ సిమన్స్, ఇమాద్ వసీం చదవండి: ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఏప్రిల్ 6 నుంచి..! -
కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్ అయితే ఎలా?
ఐపీఎల్ 2022లో ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్ఆర్హెచ్ ఫేలవ ఆటతీరును కనబరుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ విధించిన 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి కొనితెచ్చుకుంది. కాగా ఈసారి మెగావేలంలో ఎస్ఆర్హెచ్ ఏరికోరి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క ఆటగాడు మినహా పెద్దగా పేరున్న ఆటగాళ్లు కూడా ఎవరు లేరు. ఎస్ఆర్హెచ్ పూరన్‌పై ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలియదు గాని అతను మాత్రం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చినప్పటికి నుంచి ఇబ్బందిగా కనిపించిన పూరన్ చివరకు 9 బంతులెదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక పూరన్ ఐపీఎల్లో డకౌట్ల విషయంలో మరో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు పూరన్ ఆడిన 32 ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు డకౌట్ అయ్యాడు. కాగా పూరన్ ఆటతీరుపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ''రూ. 10 కోట్లు దండగ.. ఎంతమంది వచ్చినా ఎస్ఆర్హెచ్ ఆటతీరు మారదు.. కోట్లు పెట్టి కొంటే డకౌట్ అయితే ఎలా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Sanju Samson: ఐపీఎల్ చరిత్రలో సంజూ శాంసన్ అరుదైన ఫీట్.. నికోలస్ పూరన్ ఔట్ వీడియో కోసం క్లిక్ చేయండి Nicholas Pooran registered his 6th IPL duck from the 32 innings he has played. — Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2022 When Hyderabad bats. #SRHvRR pic.twitter.com/Bt7XijdS5Y — Virender Sehwag (@virendersehwag) March 29, 2022 -
బెట్లో ఓడిపోయిన సన్‌రైజర్స్ బౌలర్.. బదులుగా ఏమి ఇచ్చాడంటే!
ఐపీఎల్-2022లో భాగంగా మార్చి 29న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో నెట్స్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా.. ఉమ్రాన్ మాలిక్ యార్కర్ వేస్తే ఫ్రీ ఢిన్నర్ ఇప్పిస్తానని పూరన్ ఛాలెంజ్ చేశాడు. "నీవు తరువాతి బంతిని యార్కర్ వేస్తే నీకు డిన్నర్ ఇప్పిస్తాను. ఒక వేళ నీవు యార్కర్ వేయకపోతే నీవు నాకు ఇప్పించాలి" అని పేర్కొన్నాడు. పూరన్ ఛాలెంజ్‌కు ఉమ్రాన్ మాలిక్ కూడా అంగీకరించాడు. అయితే దురదృష్టవశాత్తూ, ఉమ్రాన్ యార్కర్‌ను వేయలేకపోయాడు. దీంతో ఛాలెంజ్‌లో ఓడిపోయిన ఉమ్రాన్ మాలిక్.. పూరన్‌కు ఫ్రీ డిన్నర్ ఇప్పించాడు. దీనికి సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ రూ.4కోట్లకు రీటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కరిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో అబ్బోట్, రొమారియో అబ్బోట్ , ఆర్ సమర్థ్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ చదవండి: IPL2022: విజయానందంలో ఉన్న పంత్ సేనకు సాడ్ న్యూస్ Did Umran buy you dinner as promised, @nicholas_47? 🤣#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/LvDlzFwUMc — SunRisers Hyderabad (@SunRisers) March 28, 2022 -
బౌన్సర్లతో భయపెట్టిన సన్‌రైజర్స్ బౌలర్.. పాపం పూరన్!
ఐపీఎల్-2021 సెకెండ్ ఫేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అరంగేట్రం చేసిన జమ్మూ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తనదైన ముద్ర వేసుకున్నాడు. గత సీజన్లో ఆ జట్టు బౌలర్ టి.నటరాజన్ కరోనా బారిన పడడంతో ఉమ్రాన్‌కు అవకాశం దక్కింది. దీంతో అతడికి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. గతేడాది కేవలం మూడు మ్యాచ్‌లే ఆడిన ఉమ్రాన్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రూ. 4 కోట్లకు ఎస్ఆర్హెచ్ ఉమ్రాన్ మాలిక్‌ను రీటైన్ చేసుకుంది. ఇక ఐపీఎల్-2022 కు సమయం దగ్గర పడడంతో ఎస్ఆర్హెచ్ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్‌తో ‘ప్రత్యర్ధి’ జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను తన బౌన్సర్లతో ఉమ్రాన్ ఇబ్బంది పెట్టాడు. ఉమ్రాన్ వేసిన ఓ బౌన్సర్‌కు పూరన్ లెగ్‌సైడ్ ఈజీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా ఎస్ఆర్హెచ్ మార్చి 29న తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే! Umran Malik to Nicholas Pooran: Ball 1: A SCARY bouncer Ball 2: Another bouncer and OUT 📹: @SunRisers #IPL #IPL2022 #SunrisersHyderabad pic.twitter.com/yoVrItcA42 — Kashmir Sports Watch (@Ksportswatch) March 23, 2022 -
IPL 2022: ‘కతౌట్ చూసి కొన్ని కొన్ని నమేయాలి దూడ్’.. ఇదే రా మావా అరాచకం అంటే!
SRH Players Delivers Mirchi Telugu Dialogue Video: ఐపీఎల్-2022 సమరానికి సమయం ఆసన్నమైంది. మార్చి 26 నుంచి క్యాష్ రిచ్‌లీగ్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 10 జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్రాంఛైజీలు అభిమానులతో టచ్‌లో ఉంటున్నాయి. అంతేగాక.. ఆటగాళ్ల మధ్య ఫన్నీ చాలెంజ్‌లు నిర్వహిస్తూ పోటీలు పెడుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరెంజ్ ఆర్మీని ఆకట్టుకునేందుకు తెలుగు సినిమాల డైలాగ్స్‌తో ముందుకు వచ్చింది. కాగా జట్టులో హైదరాబాదీ ఆటగాళ్లు లేకపోవడంతో ఇప్పటికే సన్‌రైజర్స్ విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. రెండో చెన్నై జట్టు కొంతమంది ఘాటు కామెంట్లు చేశారూ కూడా! ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లోని పాటలకు తమ ఆటగాళ్లతో స్టెప్పులు వేయిస్తూ.. డైలాగ్స్ చెప్పిస్తూ వరుస పోస్టులు చేయడం గమనార్హం. ఇప్పటికే అభిషేక్ శర్మ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘కళావతి’ పాటకు కాలుకదపగా.. కెప్టెన్ కేన్ మామ(కేన్ విలియమ్సన్) సహా పలువురు ఆటగాళ్లు ‘పుష్ప’ తగ్గేదేలే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ మిర్చీ సినిమా డైలాగ్‌తో ముందుకు వచ్చారు మరికొంత మంది సన్‌రైజర్స్ ప్లేయర్లు. పంచ్ ఫలక్నామా చాలెంజ్‌లో భాగంగా ఈ మూవీలోని ఫేమస్ డైలాగ్ ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ అదరగొట్టారు. ఉమ్రాన్‌మాలిక్ , శ్రేయస్ గోపాల్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ దూబే, రొమారియో షెఫర్డ్, నికోలస్ పూరన్ ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇక ఆఖర్లో పూరన్.. ‘‘కతౌట్ చూసి కొన్ని కొన్ని నమేయాలి దూడ్..’’ అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఇదే రా మావా అరాచకం అంటే’ అంటూ సరదాగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. చదవండి: IPL 2022: మంబై ఇండియన్స్ ఓపెనర్ ఎవరో చెప్పేసిన రోహిత్ శర్మ #OrangeArmy, which team had the most #Mirchi in their dialogue?#OrangeQuaralympics #ReadyToRise #TATAIPL pic.twitter.com/PLfGEeVUAz — SunRisers Hyderabad (@SunRisers) March 24, 2022 pic.twitter.com/FLHqUtg18A — RAJ (@Raj__Prabhas) March 24, 2022 -
'ఒక్క సీజన్ మాత్రమే చెత్తగా ఆడాను.. నేనేంటో చూపిస్తా'
వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2022 సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే జరిగిన మెగావేలంలో పూరన్‌ను రూ. 10.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. గతేడాది ఇదే పూరన్ పంజాబ్ కింగ్స్ తరపున పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఒకటో రెండో మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి అవి జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో మెగావేలానికి ముందు పంజాబ్ పూరన్‌ను రిలీజ్ చేసింది. కట్‌చేస్తే మెగావేలంలో విండీస్ ప్లేయర్లలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. అసలు పూరన్‌కు ఇంత ధర ఎందుకని ఎస్ఆర్హెచ్ను విమర్శించినప్పటికి.. ఇటీవలే వెస్టిండీస్‌తో టీమిండియా టి20 సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో పూరన్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. ఈ దెబ్బతో ఎస్ఆర్హెచ్ తనను కొనుగోలు చేయడం సరైందేనని నిరూపించాడు. మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో పూరన్ ఈఎస్పీఎన్తో మాట్లాడాడు. ''ఒక సీజన్ చెత్తగా ఆడినంత మాత్రానా నా ఆటలో ఎలాంటి మార్పు రాదు. ప్రతీ ఆటగాడికి ఒక బ్యాడ్‌టైం నడుస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌తో పాటు టి20 ప్రపంచకప్ వరకు ఆ బ్యాడ్ టైం నడిచిందనుకుంటా. ఆ తర్వాత ఇంగ్లండ్, టీమిండియాలతో జరిగిన టి20 సిరీస్‌ల్లో రాణించి ఫామ్‌లోకి వచ్చాను. నాపై నమ్మకముంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్కు ఏదైనా చేయాలి. అది నా బ్యాటింగ్ రూపంలో వారికిస్తే సంతోషంగా ఉంటుంది. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. అందుకే ఇప్పుడు నా దృష్టంతా ఐపీఎల్ 2022 పైనే పెట్టా. గత ఐపీఎల్ సీజన్ నుంచి చాలా పాఠాలే నేర్చుకున్నా. ఆ సీజన్లో తొలి మ్యాచ్‌లో డకౌట్ కావడం.. ఆ తర్వాతి మ్యాచ్‌లో గోల్డెన్ రనౌట్ కావడం బాధించింది. వాటిని తిరిగి చూడకూడదని అనుకుంటున్నా. నా బ్యాటింగ్ టెక్నిక్స్‌లో పలు మార్పులు చేసుకున్నా. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంలో నాకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. మరి ఎస్ఆర్హెచ్లో నేను ఏ స్థానంలో వస్తాననేది చెప్పడం కష్టమే. కానీ మూడో స్థానంతో పోలిస్తే నాలుగు, ఐదు స్థానాలు నాకు కాస్త కష్టంగా ఉంటాయి. ఓపెనర్లు తొందరగా ఔటైతే.. ఆ బాధ్యత వన్‌డౌన్ బ్యాటర్‌పై పడుతుంది. దానిని నేను ఎక్కువగా ఇష్టపడుతాను.. ఎందుకంటే అప్పుడు బ్యాటింగ్‌లో రాణించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కచ్చితంగా అంచనాలను అందుకుంటా'' అని పూరన్ ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022: సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్‌కు వీసా సమస్య.. తొలి మ్యాచ్‌కు దూరం! Kraigg Brathwaite: ఏడు వందల నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్.. సాహో విండీస్ కెప్టెన్ -
37 బంతుల్లోనే శతకం.. ఎస్ఆర్హెచ్కు ఊరటనిచ్చే అంశం
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ టి10 బ్లాస్ట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లోనే 10 సిక్సర్లు.. ఆరు ఫోర్ల సాయంతో శతకం బాదాడు. టి10 బ్లాస్ట్‌లో భాగంగా లెథర్బాక్ జెయింట్స్, స్కార్లెట్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లెథర్బాక్ జెయింట్స్ పూరన్ దాటికి 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా నికోలస్ పూరన్‌కు ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్హెచ్ జట్టు ఏరికోరి పూరన్‌ను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అసలే వేలంలో తమ చెత్త నిర్ణయాలతో విమర్శలకు గురైన ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి ఇది కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. కోట్లు పెట్టు కొన్నందుకు పూరన్ ఇలాంటి ఇన్నింగ్స్ ఐపీఎల్లో ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్లెట్ స్కార్చర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్ టియోన్ వెబ్‌స్టర్ 54, ఎవార్ట్ నికోల్సన్ 42 పరుగులతో రాణించారు. ఆ తర్వాత నికోలస్ పూరన్(38 బంతుల్లో 101 నాటౌట్, 10 సిక్సర్లు, 6 ఫోర్లు) మెరుపులతో 8.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కాగా లెథర్బాక్ జెయింట్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. చదవండి: Mohammed Shami: 'నన్ను విమర్శించినోళ్లు భారతీయులే కాదు' SA Vs Nz 2nd Test: ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ ఘన విజయం Genius at work! 😱@nicholas_47 hit a ton off just 3️⃣7️⃣ balls including 6️⃣ fours and 1️⃣0️⃣ massive sixes to take the Leatherback Giants to a comfortable 9️⃣-wicket win! 👏 📺 Watch the best moments from this match on #FanCode 👉 https://t.co/c8dKvIy6GE pic.twitter.com/h5G2lrEo8s — FanCode (@FanCode) March 1, 2022 -
సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా
-
IND vs WI 2nd T20I Prediction: బ్యాటర్లు కూడా అంతంత మాత్రమే.. పాపం విండీస్‌ను గెలిపించేదెవరు?
వన్డే సిరీస్‌లో టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన వెస్టిండీస్ టీ20 సిరీస్‌ను కూడా పరాజయంతోనే ఆరంభించింది. మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో శుక్రవారం(ఫిబ్రవరి 18) నాటి రెండో టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. కాగా బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ వనరులు లేని విండీస్ కనీసం తమకు తెలిసిన విద్య దూకుడైన బ్యాటింగ్‌తోనైనా మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోక అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. నికోలస్ పూరన్ మాత్రమే గత మ్యాచ్‌లో బాగా ఆడగా, మిగతా వారంతా టి20 తరహా ప్రదర్శన చేయలేకపోయారు. ముఖ్యంగా ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ‘హిట్టర్’ పొలార్డ్ ఒక్క ఇన్నింగ్స్‌లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. కెప్టెన్ కూడా అయిన పొలార్డ్ గత మ్యాచ్‌లో మరీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇదిలా ఉంటే... వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరి విండీస్ ఓపెనర్లు బ్రండన్ కింగ్, మేయర్స్ శుభారంభం అందించడం సహా, పూరన్, పొలార్డ్ భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్ప పర్యాటక జట్టు నుంచి చెప్పుకోదగ్గ స్కోరు ఆశించలేం. ఇండియా వర్సెస్ వెస్టిండీస్- రెండో టీ20: ఎప్పుడు, ఎక్కడ.. తదితర వివరాలు తేదీ: ఫిబ్రవరి 18, 2002 వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా . సమయం: రాత్రి 7 గంటలకు ఆరంభం స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ముఖాముఖి రికార్డు: మొత్తం 18 మ్యాచ్‌లు జరుగగా భారత్ 11, విండీస్ 6 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. తుది జట్ల అంచనా: భారత్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్/ ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయి, యజువేంద్ర చహల్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫ్యాబియన్ అలెన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్/డొమినిక్ డ్రేక్స్. చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్‌కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి Ranji Trophy 2022: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే .@surya_14kumar and Venkatesh Iyer take #TeamIndia home with a 6-wicket win in the 1st T20I. Scorecard - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/jfrJo0fsR3 — BCCI (@BCCI) February 16, 2022 -
IPL 2022 Auction: 10 కోట్లు .. హోటల్లో పిజ్జా పార్టీ.. పాపం కరెంట్ షాక్ కొట్టడంతో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం... 11 ఇన్నింగ్స్‌లో మొత్తంగా 85 పరుగులు.. అత్యధిక స్కోరు 32.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2021లో 10 ఇన్నింగ్స్‌లో 263 పరుగులు... కట్‌చేస్తే... ఐపీఎల్ మెగా వేలం-2022లో ఏకంగా 10.75 కోట్లు పలికాడు. పంజాబ్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తం అతడి కోసం ఖర్చు చేసింది. అవును మీరు ఊహించింది నిజమే... ఈ ఉపోద్ఘాతం వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ గురించే! పెద్దగా ఫామ్‌లో లేనప్పటికీ మంచి ధరకు అమ్ముడు పోయాడు. తనదైన రోజున చెలరేగి ఆడే పూరన్ కోసం వేలంలో హైదరాబాద్ తగ్గేదేలే అంటూ పోటీపడి రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఏ ఆటగాడిగైనా ఇంతకంటే సంతోషం ఏముంటుంది! వేలంలో అమ్ముడుపోయానని తెలియగానే.. సహచర ఆటగాళ్లకు అహ్మదాబాద్‌లో పిజ్జా పార్టీ ఇచ్చాడట పూరన్. కాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో భారత్‌లో పూరన్ భారత్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే, బయో బబుల్‌లో ఉన్న కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి హోటల్ రూమ్‌కే పిజ్జాలు తెప్పించి ఆనందం పంచుకున్నాడట. పాపం.. కరెంట్ షాక్ కొట్టింది! ఈ విషయం గురించి హోటల్ మేనేజర్ మాట్లాడుతూ... ‘‘బయో బబుల్ కారణంగా బయటి నుంచి భోజనం తెప్పించే వీలు లేదు. మా చెఫ్తోనే 15 పిజ్జాలు తయారు చేయించాం. శుభ్రంగా ప్యాక్ చేసి, శానిటైజ్ చేసి అందించాం. అయితే దురదృష్టవశాత్తు పూరన్‌కు చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది. శానిటైజర్లో స్వల్పంగా ఆల్కహాల్ ఉంటుంది కదా! బహుశా శానిటైజ్ చేసినపుడు ఆరకపోవడంతో ప్లగ్ పెట్టగానే షాక్ కొట్టినట్లుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా అహ్మదాబాద్‌లో వన్డే సిరీస్ ముగించుకున్న విండీస్.. బుధవారం నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ కోసం కోల్‌కతా చేరుకుంది. చదవండి: IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! అప్పుడు అలా చేశాం కాబట్టే ఇలా! IPL 2022 Mega Auction: 23 మంది ఆటగాళ్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇదే.. We got him in the Nick of time, and we can't wait for him to wear the #OrangeArmour. 🧡#OrangeArmy, @nicholas_47 is #ReadyToRise. 🔥#IPLAuction pic.twitter.com/jWQLZ5efKz — SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022 -
Ind Vs Wi 1st T20: అలా అయితే రోహిత్ సేనకు సవాళ్లు తప్పవు మరి!
West Indies Tour Of India 2022- T20 Series: కోల్‌కతా వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య బుధవారం టీ20 సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయిన పొలార్డ్ బృందం టి20 సిరీస్‌లో ఎలాగైనా శుభారంభం చేయాలనే కసితో బరిలోకి దిగుతోంది. తద్వారా పరాజయాల పరంపరకు ఫుల్స్టాప్ పెట్టాలనే లక్ష్యంతో ఉంది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో భారీ మొత్తాలు పలికిన విండీస్ ఆటగాళ్లు ఆ ఉత్సాహాన్ని తమ ప్రదర్శనలో చూపాలని పట్టుదలతో ఉన్నారు. నిలకడలేమి సమస్యను ఆధిగమిస్తే నిజంగానే విండీస్ టి20ల్లో దీటైన ప్రత్యర్థి. పొలార్డ్, పూరన్, పావెల్, హోల్డర్లు తమ బ్యాట్లు ఝుళిపిస్తే రోహిత్ సేనకు సవాళ్లు తప్పవు. భారత్- విండీస్ ముఖాముఖి పోరు- రికార్డులు భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 17 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 10 మ్యాచ్‌ల్లో నెగ్గగా... విండీస్ 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా ఫిబ్రవరి 16(బుధవారం)- రాత్రి 7 గంటలకు ఆరంభం. అంచనా జట్లు: భారత్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్/శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చహల్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్/డొమినిక్ డ్రేక్స్. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్ A sneak peek into #TeamIndia's fielding drill at the Eden Gardens. 👀 👌#INDvWI | @Paytm pic.twitter.com/wSFH4keVTx — BCCI (@BCCI) February 15, 2022 Bull's-eye Bhuvi 🎯 Sharp Siraj ⚡ A snippet of how the #TeamIndia speedsters sweated it out in the practice session under the watchful eyes of the Bowling Coach Paras Mhambrey at the Eden Gardens. 👌 👌#INDvWI | @Paytm | @BhuviOfficial | @mdsirajofficial pic.twitter.com/hMhCdAY9VJ — BCCI (@BCCI) February 15, 2022 -
వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు
రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి కొందరు ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలితే.. కొందరిని అసలు పట్టించుకోకపోవడం విశేషం. మెగా వేలంలో అన్‌సోల్డ్ జాబితా కూడా పెద్దగానే ఉంది. టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా మొదలుకొని స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, తబ్రెయిజ్ షంసీ, కేదార్ జాదవ్, కొలిన్ గ్రాండ్‌హోమ్, గప్టిల్, కార్లోస్ బ్రాత్‌వైట్, పుజారా, హనుమ విహారి లాంటి కీలక ఆటగాళ్లవైపు కనీసం తొంగిచూడలేదు. సారీ సురేశ్ రైనా.. 205 మ్యాచ్‌లు... 5,528 పరుగులు... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర... ‘చిన్న తలా’ సురేశ్ రైనా సూపర్ కెరీర్ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్‌కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్‌ప్రైస్ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు. ►అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరున్న షకీబ్ అల్ హసన్వైపు కూడా ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. కారణం షకీబ్ ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడమే. నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరున్నప్పటికి షకీబ్ ఐపీఎల్లో పెద్దగా రాణించింది లేదు. ►ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పరిస్థితి మరొకటి. పరిమిత, టెస్టు క్రికెట్లో మంచి పేరున్న స్మిత్ టి20 క్రికెట్లో అంతగా రాణించలేడనే ముద్ర ఉంది. నిలబడితే మెరుపులు మెరిపించే స్మిత్.. ఆరంభంలో ఎక్కువ సమయం తీసుకుంటాడు. టి20లకు ఇలాంటి ఆట సరిపోదు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల్లో అస్సలు పనికిరాదు. గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి స్మిత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. ►గతేడాది ఐపీఎల్లో కేకేఆర్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికి.. బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ ఒక్కటే కాదు.. బ్యాటింగ్‌లోనూ మెరవాలి అన్న సంగతి మోర్గాన్ మరిచిపోయాడు. అందుకే ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అతన్ని మరిచిపోయాయి. ఏదైనా ఒక గొప్ప కెప్టెన్‌గా పేరున్న మోర్గాన్ ఐపీఎల్ కెరీర్ దాదాపు ఎండ్ అయినట్లే. ఆటగాళ్లకు జాక్‌పాట్.. విండీస్ ప్లేయర్లే ఎక్కువగా ఈసారి మెగావేలంలో అనూహ్య జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్ల సంఖ్య ఎక్కవే ఉంది. కాగా ఆ జాబితాలో విండీస్ ప్లేయర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ లాంటి స్టార్ ఆటగాళ్లను మినహాయిస్తే వేలంలో కొందరు ఆటగాళ్లకు పంట పండిందనే చెప్పొచ్చు. విండీస్ ఆటగాళ్లు.. నికోలస్ పూరన్(రూ. 10 కోట్లు), ఓడియన్ స్మిత్(రూ. 6 కోట్లు), రొమెరియో షెఫర్డ్(రూ. 7.75 కోట్లు), జాసన్ హోల్డర్(8.75 కోట్లు), హెట్మైర్లకు (రూ. 8.50 కోట్లు) అనుకున్నదానికంటే ఎక్కువే దక్కింది. ఇక సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ కూడా(రూ. 8 కోట్లు) ఊహించని ధరకు అమ్ముడుకావడం విశేషం. -
IPL 2022 Auction Day 1: పూరన్, సుందర్‌కు జాక్‌పాట్.. హైదరాబాద్ ప్లేయర్స్ వీళ్లే!
ఐపీఎల్ మెగా వేలం- 2022 తొలి రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అత్యధికంగా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. అదే విధంగా టీమిండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను సొంతం చేసుకుంది. అతడి కోసం రూ. 8 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది. ఇంకా పర్సులో 20.15 కోట్లు మిగిలి ఉన్నాయి. 10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల కోటాలో 6 స్థానాలు మిగిలి ఉన్నాయి. కాగా సన్‌రైజర్స్ రిటెన్షన్‌లో భాగంగా కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), అబ్దుల్ సమద్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మలిక్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు)ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు వేలంలో ఎస్ఆర్హెచ్ కొన్న ఆటగాళ్లు ఎవరంటే... ►నికోలస్ పూరన్- రూ. 10 కోట్ల 75 లక్షలు ►వాషింగ్టన్ సుందర్- రూ. 8 కోట్ల 75 లక్షలు ►రాహుల్ త్రిపాఠి- రూ. 8 కోట్ల 50 లక్షలు ►అభిషేక్ శర్మ - రూ. 6 కోట్ల 50 లక్షలు ►భువనేశ్వర్ కుమార్ - రూ. 4 కోట్ల 20 లక్షలు ►టి. నటరాజన్ - రూ. 4 కోట్లు ►కార్తీక్ త్యాగి - రూ. 4 కోట్లు ►శ్రేయస్ గోపాల్- రూ. 75 లక్షలు ►ప్రియమ్ గార్గ్ - రూ. 20 లక్షలు ►జగదీశ్ సుచిత్- రూ. 20 లక్షలు చదవండి: IPL 2022 Auction: సురేశ్ రైనా, స్మిత్, షకీబ్‌కు భారీ షాక్.. ఎందుకిలా? Here's looking forward to more Garg-eous shots from @priyamg03149099 #OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/1lr8YZVuAd — SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022 And we are glad to see you back in orange, @Suchithj27 🧡#OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/43XV5musHA — SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022 #OrangeArmy, new #Riser @ShreyasGopal19 has a special message for you 🧡#ReadyToRise #IPLAuction pic.twitter.com/Nqsdki8HHL — SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022 -
Ind Vs Wi 3rd ODI: టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
-
టీమిండియాతో టి20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన
Wi Squad For India 2022 T20: ఫిబ్రవరిలో టీమిండియా టూర్ రానున్న వెస్టిండీస్ జట్టు టి20 సిరీస్‌కు 16 మందితో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. కీరన్ పొలార్డ్ కెప్టెన్ కాగా.. నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడుతున్న విండీస్.. 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌తో ఆడుతున్న జట్టునే భారత్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే విండీస్ క్రికెట్ బోర్డు ఇదివరకే వన్డే జట్టును ప్రకటించింది. షామ్రా బ్రూక్స్, క్రుమ్హా బోనర్, కీమర్ రోచ్‌లను వన్డేలకే పరిమితం చేశారు. ఇక టి20 ప్రపంచకప్‌లో పొలార్డ్ కెప్టెన్సీలో విండీస్ జట్టు అంతగా రాణించకపోవడంతో సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌లో విండీస్ జట్టు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడి సూపర్-12 దశకు అర్హత సాధించాల్సి ఉంటుంది. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్‌కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షై హోప్, అకియెల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్, ఓడియన్ స్మిత్ షెపర్డ్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ -
T20 World Cup WI Vs BAN: వరుస పరాజయాలు... టోర్నీ నుంచి అవుట్!
వీరాభిమానుల ఆశలు ఆవిరి చేస్తూ... ఉత్కంఠ పోరులో తడబడిన బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్‌లో వరుసగా మూడో పరాజయం చవిచూసింది. కీలక సమయంలో బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ జట్టు మూల్యం చెల్లించుకుంది. వెస్టిండీస్ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్ ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. Bangladesh Lost To West Indies By 3 Runs Out Tourney: అత్యున్నత వేదికపై మంచి ఫలితాలు రావాలంటే ఆద్యంతం నిలకడగా రాణించాల్సి ఉంటుంది. లేదంటే ఎంతటి మేటి జట్టుకైనా భంగపాటు తప్పదు. వీరాభిమానులకు కొదువలేని బంగ్లాదేశ్ జట్టు అంచనాలను అందుకోవడంలో విఫలమై టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన చోట బంగ్లాదేశ్ చతికిలపడింది. ఈసారికి సూపర్–12తోనే సరిపెట్టుకోనుంది. చివరి బంతికి 4 పరుగులు అవసరం గ్రూప్–1 లో శుక్రవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ మూడు పరుగుల తేడా తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఎట్టకేలకు ఈ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ 9 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బంగ్లాదేశ్ గెలుపునకు చివరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. విండీస్ ఆల్‌రౌండర్ రసెల్ వేసిన బంతిపై క్రీజులో ఉన్న బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్ముదుల్లా ఒక్క పరుగూ తీయలేకపోయాడు. దాంతో విండీస్ విజయం, బంగ్లాదేశ్ ఓటమి ఖాయమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ దూకుడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... తొలి టి20 మ్యాచ్ ఆడిన రోస్టన్ చేజ్ (46 బంతుల్లో 39; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. లిటన్ దాస్ (43 బంతుల్లో 44; 4 ఫోర్లు), కెప్టెన్ మహ్ముదుల్లా (24 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా జట్టును విజయతీరానికి చేర్చలేకపోయారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) మెహదీ హసన్ 4; లూయిస్ (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 6; రోస్టన్ చేజ్ (బి) ఇస్లామ్ 39; హెట్‌మైర్ (సి) సౌమ్య సర్కార్ (బి) మెహదీ హసన్ 9; పొలార్డ్ (నాటౌట్) 14; రసెల్ (రనౌట్) 0; పూరన్ (సి) నైమ్ (బి) ఇస్లామ్ 40; బ్రావో (సి) సౌమ్య సర్కార్ (బి) ముస్తఫిజుర్ 1; హోల్డర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–12, 2–18, 3–32, 4–62, 5–119, 6–119, 7–123. బౌలింగ్: మెహదీ హసన్ 4–0–27–2, తస్కిన్ అహ్మద్ 4–0–17–0, ముస్తఫిజుర్ 4–0–43–2, షోరిఫుల్ 4–0–20–2, షకీబ్ 4–0–28–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నైమ్ (బి) హోల్డర్ 17; షకీబ్ (సి) హోల్డర్ (బి) రసెల్ 9; లిటన్ దాస్ (సి) హోల్డర్ (బి) బ్రావో 44; సౌమ్య సర్కార్ (సి) గేల్ (బి) హొసీన్ 17; ముష్ఫికర్ (బి) రాంపాల్ 8; మహ్ముదుల్లా (నాటౌట్) 31; అఫిఫ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–60, 4–90, 5–130. బౌలింగ్: రవి రాంపాల్ 4–0– 25–1, హోల్డర్ 4–0–22–1, రసెల్ 4–0– 29–1, హొసీన్ 4–0–24–1, బ్రావో 4–0– 36–1. -
సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో నికోలస్ పూరన్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. (39 బంతుల్లో 75 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లతో) రెచ్చిపోయిన పూరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గయానా అమెజాన్ వారియర్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. జమైకా తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవడంతో పాటు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక జమైకా తలైవాస్ వరుస ఓటములతో మరింత అట్టడుగుకు చేరింది. లీగ్‌లో నిలవాలంటే జమైకా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్, చంద్రపాల్, హెట్‌మైర్, షోయబ్ మాలిక్‌లు మంచి ఆరంభాలే ఇచ్చినప్పటికీ పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. అయితే ఫామ్‌లో ఉన్న పూరన్ మాత్రం తన విధ్వంసాన్ని కొనసాగించాడు. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న తరహాలో పూరన్ ఇన్నింగ్స్ సాగింది. 18వ ఓవర్ వరకు సాదాసీదాగా ఉన్న వారియర్స్ స్కోరు పూరన్ ధాటికి చివరి రెండు ఓవర్లలో 30 పరుగులతో 160కి పైగా పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తైలవాస్ 19.1 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై 46 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. కిర్క్ మెకెంజీ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గయానా బౌలర్లలో ఓడియన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. చదవండి: CPL 2021: వసీమ్, రసెల్ ఆల్‌రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం MASSIVE!!! Nicholas Pooran goes LARGE with the @OmegaXL hit from match 26, #CPL21 #JTvGAW #CricketPlayedLouder #OmegaXL pic.twitter.com/7fRnfIRBEA — CPL T20 (@CPL) September 11, 2021 -
పూరన్ సిక్సర్ల వర్షం; అయినా గెలిపించలేకపోయాడు
గయానా: పాకిస్తాన్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ పోరాడి ఓడిపోయింది. విండీస్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ (33 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్సర్ల)తో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. కేవలం 7 పరుగుల తేడాతో విండీస్ పరాజయం పాలవ్వగా.. పాకిస్తాన్ 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 51 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ రిజ్వాన్ 6 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ , బ్రావో 2 వికెట్లు తీశాడు. ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆరంభంలోనే ఫ్లెచర్ రూపంలో షాక్ తగిలింది. మహ్మద్ హఫీజ్ బౌలింగ్‌లో ఫ్లెచర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఎవిన్ లూయిస్ 35 పరుగులతో రిటైర్డ్హర్డ్గా వెనుదిరగ్గా.. క్రిస్ గేల్ 16 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ దాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. కానీ నికోలస్ మాత్రం ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒంటరిపోరాటం చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. 13 పరుగులు చేసిన కెప్టెన్ పొలార్డ్ రెండో బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత పూరన్ మూడు, నాలుగు బంతులకు పరుగులు తీయలేదు. ఐదో బంతిని ఫోర్‌గా మలిచిన పూరన్ ఆఖరి బంతిని సిక్స్ బాదినా విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 నేడు జరగనుంది. -
దెబ్బకు దెబ్బ తీసిన విండీస్; పూరన్ కెప్టెన్ ఇన్నింగ్స్
బ్రిడ్జ్‌టౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో వెస్డిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కరోనా కేసు నేపథ్యంలో ఒకరోజుకు వాయిదా పడిన మ్యాచ్ శనివారం జరిగింది. ఇక తొలి వన్డేలో దారుణ పరాజయం చవిచూసిన విండీస్ రెండో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. లోస్కోరింగ్గా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విండీస్ స్పిన్నర్లు దాటికి 47.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. 100 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను వేస్ అగర్ 41, ఆడమ్ జంపా 36 , మాధ్యూ వేడ్ 36 పరుగులతో ఆదుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ , అకియల్ హోసెన్ చెరో 3 వికెట్లు తీయగా.. కాట్రెల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో క్రీజ్‌లోకి దిగిన వెస్టిండీస్ టీమ్ తడబడింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ డారెన్ బ్రావో ఖాతా తెరవలేకపోయాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జేసన్ మహమ్మద్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. పించ్ హిట్టర్ కీరన్ పొల్లార్డ్ సైతం రెండు పరుగులకే అవుట్ కావడంతో సొంతగడ్డపై వెస్టిండీస్‌కు మరో పరాభవం తప్పదనిపించింది. అప్పటికే క్రీజ్‌లో ఉన్న నికొలస్ పూరన్ సమయస్ఫూర్తితో ఆడాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లతో 38 పరుగులు చేసిన హోప్ అవుటైన తరువాత మళ్లీ కష్టాల్లో పడినట్టు కనిపించినప్పటికీ.. జేసన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 69 బంతుల్లో 52 పరుగులు చేసిన హోల్డర్ స్టార్క్‌కు ఎల్బీగా వికెట్‌ను సమర్పించుకున్నాడు. అప్పటికే లక్ష్యానికి సమీపించడం, రిక్వైర్డ్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో విండీస్ నింపాదిగా లక్ష్యాన్ని అందుకుంది. 38 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 191 పరుగులు చేసింది. నికొలస్ పూరన్ 75 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు మిఛెల్ స్టార్క్ 3, ఆడమ్ జంపా 2, టర్నర్ ఒక వికెట్ తీసుకున్నారు. నికొలస్ పూరన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం జరగనుంది.