
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన లక్నో.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ లక్నో వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన సంచలన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
17 ఓవర్ వేసిన అభిషేక్ శర్మ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను లక్నోవైపు తిప్పాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్ 4 సిక్సర్లు, 3 ఫోర్లుతో 44 పరుగులు చేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పూరన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు.
ఐపీఎల్‌లో చరిత్రలోనే తను ఎదుర్కొన్న మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. ఐపీఎల్-2021లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో డ్యానియల్ క్రిస్టయన్ బౌలింగ్‌లో వరుసగా తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను సిక్సర్లగా మలిచాడు.
చదవండి: IPL 2023: అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్! భారీ జరిమానా
Pooran box-office 🍿pic.twitter.com/dBu4G2P2U7
— CricTracker (@Cricketracker) May 13, 2023
Comments
Please login to add a commentAdd a comment