sun risers hyderabad
-
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్..
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్, ఎస్ఆర్హెచ్ సారథి ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins).. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభసమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది.ఈ గాయం కారణంగానే కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం కమ్మిన్స్ దూరమయ్యాడు. అయితే త్వరలోనే తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్మిన్స్ స్పష్టం చేశాడు."చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇదేమి మరీ అంత పెద్ద గాయమేమి కాదు. నా గాయం గురించి బయట వినిపిస్తున్న వార్తలు ఏవీ నిజం కాదు. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి ఆరు వారాల సమయం అవసరం లేదు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కాస్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాను. త్వరలోనే బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెడతాను. ఐపీఎల్ సమయానికి సిద్దంగా ఉంటాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్ లకు ఐపీఎల్ చాలా మంచి సన్నాహకంగా ఉంటుంది అని కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది.తొలి సీజన్లోనే అదుర్స్..కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో కమ్మిన్స్‌ను రూ. 20.5 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం కమ్మిన్స్ చేశాడు. గతేడాది సీజన్లో అతడి సారథ్యంలోని ఎస్ఆర్హెచ్ రన్నరప్‌గా నిలిచింది. కమ్మిన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రాణించాడు.దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, ఫ్రాంచైజీ కమ్మిన్స్‌ను రూ.18 కోట్లకు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న హైదరబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.ఐపీఎల్-2025కు ఎస్ఆర్హెచ్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీచదవండి: గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..! -
ఎస్ఆర్హెచ్కు గుడ్‌న్యూస్.. చెపాక్‌లో దుమ్ములేపిన ఆల్‌రౌండర్
చెన్నై వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్(Brydon Carse) తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ దుమ్ములేపాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన కార్స్.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్త్తో 31 పరుగులు చేశాడు. 29 ఏళ్ల కార్స్ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. లేదంటే ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించిండేది. కార్స్ బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్కు గుడ్‌న్యూస్..కాగా బ్రైడన్ కార్స్ భారత గడ్డపై ఈ తరహా ప్రదర్శన చేయడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్-2025 మెగా వేలంలో కార్స్‌ను ఎస్ఆర్హెచ్ కేవలం రూ. కోటిరూపయాలకే సొంతం చేసుకుంది. భారత్ పిచ్‌లపై తొలిసారి ఆడినప్పటికి ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అందరిని కార్స్ మెప్పించాడు. కార్స్ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు.మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడిన అనుభవం మాత్రం అతడికి ఉంది. సౌతాఫ్రికా టీ20, ది హండ్రెడ్, వైటాలిటీ బ్లాస్ట్‌లో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆడాడు. కాగా ఎస్ఆర్హెచ్లో ఇప్పటికే నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ వంటి అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇప్పుడు కార్స్ రాకతో ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.ఐపీఎల్-2025కు ఎస్ఆర్హెచ్ జట్టు: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ , రాహుల్ చాహర్, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్ , అనికేత్ వర్మ , ఎషాన్ మలింగ , సచిన్ బేబీ.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ..కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. -
సన్‌రైజర్స్ వదిలేసింది. . కట్ చేస్తే! అక్కడ సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో జమ్మూ కాశ్మీర్ శుభరంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో జమ్మూ కాశ్మీర్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 9 వికెట్లు కోల్పోయి 199 పరుగుల మాత్రమే చేయగల్గింది.జమ్మూ బౌలర్లలో అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రషీక్ ధార్ సలీం, మురగన్ అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించారు. జార్ఖండ్ బ్యాటర్లలో ఉత్క్రాష్ సింగ్(54), పంకజ్ కిషోర్ కుమార్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే మిగితా ఆటగాళ్లు రాణించకపోవడంతో జార్ఖండ్ ఓటమి చవిచూసింది.అబ్దుల్ సమద్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. జమ్మూ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్ విధ్వంసం సృష్టించాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమద్ అద్బుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కమ్రాన్ ఇక్బాల్(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.సమద్‌ను వదిలేసిన సన్‌రైజర్స్..కాగా ఐపీఎల్లో అబ్దుల్ సమద్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉండడంతో వేలంలో భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కర్లలేదు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం.. ఎస్ఆర్హెచ్కు గుడ్ బై
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ పదవికి దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్టెయిన్ ప్రకటించాడు. అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్హెచ్ సిస్టర్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలింగ్ కోచ్‌గా మాత్రం కొనసాగనున్నట్లు స్టెయిన్ తెలిపాడు.ఐపీఎల్లో రెండేళ్ల పాటు బౌలింగ్ కోచ్‌గా పనిచేసే అవకాశమిచ్చినందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. ఇక ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్తో నా ప్రయాణం ముగించాలని నిర్ణయించుకున్నాను. అయితే దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఎ20లో మాత్రం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో కలిసి పని చేయనున్నాను ఎక్స్‌లో స్టెయిన్ గన్ రాసుకొచ్చాడు.బౌలింగ్ కోచ్‌గా ఫ్రాంక్లిన్..కాగా డేల్ స్టెయిన్ ఐపీఎల్-2024 సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా మాజీ న్యూజిలాండ్ ఆల్-రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను ఎస్ఆర్హెచ్ నియమించింది.ఫ్రాంక్లిన్ హెడ్‌కోచ్ డేనియల్ వెట్టోరితో కలిసి పని చేశాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్‌ను ఈ న్యూజిలాండ్ దిగ్గజాలు ఫైనల్‌కు చేర్చారు. అయితే ఇప్పుడు స్టెయిన్ పూర్తిగా తన బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో ఫ్రాంక్లిను రెగ్యూలర్ బౌలింగ్ కోచ్‌గా ఎస్ఆర్హెచ్ నియమించే అవకాశముంది.చదవండి: LLC 2024: యూసఫ్ పఠాన్ ఊచకోత.. అయినా పాపం?(వీడియో) -
మార్క్రమ్కు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఖారారు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. మెగా వేలానికి ముందు మొత్తం ఆరుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కల్పించింది.ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని రిటైన్ చేసుకోవాలనకుంటే తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని మొత్తం 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంచైజీలు ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను దాదాపు ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.మార్క్రమ్కు నో ఛాన్స్?ఇక ఐపీఎల్-2024 సీజన్లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తాము అంటిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను ఖారారు చేసినట్లు సమాచారం. రెండు సీజన్లలో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రోటీస్ స్టార్ ప్లేయర్ ఐడైన్ మార్క్రమ్ను వేలంలోకి విడిచిపెట్టాలని ఎస్ఆర్హెచ్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఇక ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(రూ.18 కోట్లు) తొలి ఆటగాటిగా రిటెన్షన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్ ఈ ఏడాది సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలో కూడా ప్యాట్ అదరగొట్టాడు.కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడిని ఏకంగా రూ.20.50 కోట్ల భారీ ధరకు అతడిని ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం ఈ ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ చేశాడు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్(రూ.14 కోట్లు) రెండో ప్లేయర్‌గా, మూడో ఆటగాడిగా అభిషేక్ శర్మ(రూ.11 కోట్లు)లను ఎస్ఆర్హెచ్ అంటిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా నాలుగో ఆటగాడిగా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్(రూ.18 కోట్లు), ఐదో ప్లేయర్‌గా హెన్రిస్ క్లాసెన్(రూ.11 కోట్లు)ను రిటైన్ చేసుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుందంట. ఇక ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకోవాలని కావ్యా మారన్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
విధ్వంసం.. టీ20ల్లో 308 పరుగులు! సన్‌రైజర్స్ రికార్డు బద్దలు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సిక్సర్ల మోత మోత మోగింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ బ్యాటర్లు ఆయుష్ బదోని, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి విధ్వంసానికి అరుణ్ జైట్లీ స్టేడియం దద్దరిల్లిపోయింది.ఈ ఇద్దరూ యువ ఆటగాళ్లు మెరుపు సెంచరీలతో చెలరేగారు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశారు. ఆయుష్ బదోని 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో 165 పరుగులు చేయగా.. ప్రియాన్ష్ ఆర్య 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరి సంచలన ఇన్నింగ్స్‌ల ఫలితంగా సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీస్కోరు చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో జట్టుగా సౌత్ ఢిల్లీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. తాజా మ్యాచ్‌లో 308 పరుగులు చేసిన సౌత్ ఢిల్లీ.. సన్‌రైజర్స్ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ జాబితాలో నేపాల్ అగ్రస్ధానంలో ఉంది. 2023లో మంగోలియాపై నేపాల్ 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. 6️⃣ 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 🤩There’s nothing Priyansh Arya can’t do 🔥#AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @JioCinema @Sports18 pic.twitter.com/lr7YloC58D— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024 -
మమ్మల్ని గర్వపడేలా చేశారు.. అందరికి ధన్యవాదాలు: కావ్య మారన్
ఐపీఎల్-2024 సీజన్ రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. మరోవైపు కేకేఆర్ ముచ్చటగా మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. కావ్య స్టాండ్స్‌లో తమ ఆటగాళ్ల పోరాటాన్ని అభినందిస్తూ కన్నీటి పర్యంతమైంది.ఆటగాళ్లను ఓదార్చిన కావ్య..అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కావ్య అంతటి బాధలోనూ సన్‌రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించింది. తమ జట్టు ఆటగాళ్లకు కావ్య ధైర్యం చెప్పి ఓదార్చింది. "మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీ ఆటతో టీ20 క్రికెట్‌కు కొత్త ఆర్ధం చెప్పారు. అందరూ మన గురించి మాట్లాడేలా చేశారు. ఈ రోజు మనం ఓడిపోవాలని రాసి పెట్టింది. కాబట్టి మనం ఓడిపోయాం. కానీ మన బాయ్స్ అంతా అద్బుతంగా ఆడారు.బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో బాగా రాణించారు. అందరికి ధన్యవాదాలు. అదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు స్టేడియం వచ్చిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చిన స్పీచ్‌లో కావ్య పేర్కొంది. -
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కేకేఆర్.. ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్-2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది.తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక విజేతగా నిలిచిన కేకేఆర్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎన్ని కోట్లంటే?ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్కు రూ.13 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి .రూ. 6.5కోట్లు అందాయి.⇒ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన విరాట్ కోహ్లికి రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు.⇒పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్‌కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు.⇒ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డికి, ప్లేయర్ ఆఫ్‌ది సీజన్ అవార్డు విన్నర్ సునీల్ నరైన్‌కు చెరో రూ. 10లక్షల ప్రైజ్‌మనీ లభించింది.⇒అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన సునీల్ నరైన్ రూ.12 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో16 మ్యాచ్‌లు నరైన్.. 488 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. -
ఎస్ఆర్హెచ్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024 రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. దీంతో ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ముద్దాడాలన్న హైదరాబాద్ కల నేరవేరలేదు. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా తీవ్ర నిరాశపరిచింది. బౌలింగ్ విషయం పక్కన పెడితే బ్యాటింగ్‌లో అయితే మరింత దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కనీసం ఏ ఒక్క ఆటగాడైనా జట్టు కోసం ఆడినట్లు అన్పించలేదు. వచ్చామా వెళ్లామా అన్నట్లు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఈ క్రమంలో 113 పరుగులకే ఎస్ఆర్హెచ్ కుప్పకూలింది. తద్వారా ఓ చెత్త రికార్డును ఎస్ఆర్హెచ్ తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. సీఎస్కే 2013 ఫైనల్లో ముంబైపై 125 రన్స్ చేసింది. తాజా మ్యాచ్‌తో ముంబైను ఎస్ఆర్హెచ్ను అధిగమించింది. -
ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈ ఏడాది సీజన్ ఆద్యంతం ఎస్ఆర్హెచ్ అదరగొట్టనప్పటికి ఫైనల్లో మాత్రం తేలిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్లలో దాటికి సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సన్‌రైజర్స్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 10. 3 ఓవర్లలో ఊదిపడేసింది. నరైన్ (6) రెండో ఓవర్లోనే ఔట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (39), వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి తమ జట్టుకు మూడో టైటిల్‌ను అందించారు.కన్నీళ్లు పెట్టుకున్న కావ్య..ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. సీజన్ మొత్తం ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచ్‌లకు హాజరై తన జట్టును సపోర్ట్ చేసిన కావ్యకు ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ ఎదురైంది. సీజన్ అసాంతం ఎంతో సందడి చేసిన కావ్య పాపం.. ఫైనల్లో తమ జట్టు ఓడిపోయాక కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలుత స్టాండ్స్‌లో నిలబడి తమ జట్టు పోరాటాన్ని చప్పట్లు కొడుతూ అభినందించిన కావ్య.. వెంటనే వెనక్కి తిరిగి వెక్కివెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A season to be proud of 🧡#KKRvSRH #IPLonJioCinema #IPLFinalonJioCinema pic.twitter.com/rmgo2nU2JM— JioCinema (@JioCinema) May 26, 2024 -
ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. ఐపీఎల్ 2024 విజేతగా కేకేఆర్
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.కుప్పకూలిన ఎస్ఆర్హెచ్..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.అయ్యర్, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్యాట్ కమ్మిన్స్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో తలా వికెట్ సాధించారు. -
#SRH: లీగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్‌లో తుస్సుమన్పించారు
ఐపీఎల్-2024 లీగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కీలకమైన ప్లే ఆఫ్స్‌లో చేతులెత్తేశారు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2లో నిరాశపరిచిన ఈ విధ్వంసకర జోడీ.. ఇప్పుడు చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తస్సుమన్పించారు.ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రెండు పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ అయితే ఏకంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కేకేఆర్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. అద్భుతమైన బంతితో అభిషేక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు హెడ్‌ను వైభవ్ ఆరోరా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు.హెడ్ విషయానికి వస్తే.. ఆఖరి 4 మ్యాచ్‌ల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సార్లు హెడ్ డకౌటయ్యాడు.అదే విధంగా అభిషేక్ కూడా ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు వీరిద్దరిని ట్రోలు చేస్తున్నారు. -
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్
IPL 2024 SRH vs KKR Final Live Updates: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్‌ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.కుప్పకూలిన ఎస్ఆర్హెచ్..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.అయ్యర్, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..గుర్బాజ్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన గుర్భాజ్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి ఇంకా 8 పరుగులు కావాలి.విజయం దిశగా కేకేఆర్..114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు మగిసే సరికి వికెట్ నష్టానికి కేకేఆర్ 72 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(21), వెంకటేశ్ అయ్యర్(40) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్..114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.113 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. కేకేఆర్ బౌలర్ల దాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇదే లోయెస్ట్ టార్గెట్ కావడం గమనార్హం.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 98/8ఎస్ఆర్హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో ఉనద్కట్ వచ్చాడు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 98/8పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 77 పరుగులకే 7 వికెట్లుఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 77 పరుగులకే సన్‌రైజర్స్ 7 వికెట్లు కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్ ఔట్ కాగా.. రస్సెల్ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమద్ సైతం ఔటయ్యాడు. క్రీజులో క్లాసెన్(13), కమ్మిన్స్ 4 పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 82/7పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 62 పరుగులకే 5 వికెట్లు62 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన మార్క్రమ్.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షాబాజ్ అహ్మద్ వచ్చాడు.నాలుగో వికెట్ డౌన్నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నితీష్ కుమార్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 21 పరుగులకే 3 వికెట్లుటాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. 21 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.హెడ్ ఔట్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డక్‌గా వెనదిరిగాడు. వైబవ్ ఆరోరా బౌలింగ్‌లో హెడ్.. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్లు నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్కు బిగ్ షాక్.. అభిషేక్ ఔట్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్‌ను ఎస్ఆర్హెచ్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మార్పు చేసింది. తుది జట్టులోకి సమద్ స్ధానంలో ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిసన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
ఎస్ఆర్హెచ్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు: భారత మాజీ ఓపెనర్
ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు మరి కొన్ని తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టైటిల్ విజేతను ఎంచుకున్నాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని చోప్రా జోస్యం చెప్పాడు. అయితే ఎస్ఆర్హెచ్ను తక్కువ అంచనా వేయద్దని, ఆ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లలేదని చోప్రా చెప్పుకొచ్చాడు."ఎస్ఆర్హెచ్-కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ వన్‌సైడ్ గేమ్ అయితే కాదు. కేకేఆర్‌కు గెలిచే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ గట్టీ పోటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ సన్‌రైజర్స్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఎస్ఆర్హెచ్కు ఇది మూడో ఫైనల్ కాగా.. కేకేఆర్‌కు నాలుగో ఫైనల్. ఇరు జట్లు టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో హెడ్ కంటే అభిషేక్ శర్మ కీలకంగా మారనున్నాడు. ఎందుకంటే ప్రత్యర్ధి జట్టులో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉండడంతో హెడ్‌కు మరోసారి కష్టాలు తప్పవు.బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ చెలరేగితే కేకేఆర్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి ఫామ్‌ల ఉండడం సన్‌రైజర్స్ కలిసొచ్చే ఆంశం. కానీ అతడు రిస్క్‌తో కూడిన షాట్లు ఆడుతున్నాడు. అది అన్ని సమయాల్లో జట్టుకు మంచిది కాదు. ఎస్ఆర్హెచ్ సమిష్టిగా రాణిస్తే మరోటైటిల్ను తమ ఖాతాలో వేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు -
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2024 ఫైనల్ పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం(మే 26) చెపాక్ స్టేడియం వేదికగా ఈ టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్.. ఫైనల్‌కు పోరు అర్హత సాధించింది.ఈ క్రమంలో కేకేఆర్ మూడో టైటిల్‌పై కన్నుయేగా.. ఎస్ఆర్హెచ్ రెండో సారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో పలు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆఖరి 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది.ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.ఫైనల్‌కు రిజర్వ్ డే..ఇక బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం(మే 26) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడనైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న కేకేఆర్‌ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది. -
IPL 2024 Final: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు!?
క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్-2024 తుది దశకు చేరుకుంది. ఆదివారం(మే 26) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ట్రోఫీని ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హైవోల్ట్‌జ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌కు తమ ప్లేయింగ్ ఎల్వెన్లో ఒకే మార్పు చేయాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ స్దానంలో కివీ స్టార్ గ్లెన్ ఫిలిప్స్‌ను అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఛాన్స్ ఇవ్వలేదు. క్వాలిఫయర్-2కు అయినా ఫిలిప్స్‌కు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ అతడిని కాదని మార్క్రమ్ ఛాన్స్ ఇచ్చింది. మార్క్రమ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలోనే మార్క్రమ్పై వేటు వేసి ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నట్ల వినికిడి.సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్ -
ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం..
ఐపీఎల్-2024లో తుది పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శనివారం తమ ప్రాక్టీస్ సెషన్‌ను ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ రద్దు చేసింది. చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎస్ఆర్హెచ్ ఫైనల్ పోరులో కేకేఆర్‌తో అమీతుమీ తెల్చుకోనుంది.కాగా శుక్రవారం చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించి.. ఫైనల్ పోరకు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే? -
సన్‌రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్‌దే: ఆసీస్ లెజెండ్
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మే26) చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. క్వాలిఫయర్ 1లో ఎస్ఆర్హెచ్పై విజయం సాధించి కేకేఆర్ తుది పోరుకు అర్హత సాధించగా.. సన్‌రైజర్స్ క్వాలిఫయర్-2లో రాజస్తాన్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ విజేతను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అంచనా వేశాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని హేడెన్ జోస్యం చెప్పాడు. "ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఫైనల్‌కు ముందు కేకేఆర్‌కు మూడు రోజుల విశ్రాంతి లభించింది. ఈ వ్యవధిలో ఎస్ఆర్హెచ్ బలాలు, బలహీనతలపై కేకేఆర్ స్పెషల్ ఫోకస్ చేసింటుంది.అంతేకాకుండా క్వాలిఫయర్-1లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన కాన్ఫిడెన్స్ కూడా కేకేఆర్‌కు కలిసిస్తోందని నేను భావిస్తున్నాను.అంతేకాకుండా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై నరైన్,వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నావరకు అయితే కేకేఆర్‌దే ట్రోఫీ అని" స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో హేడన్ పేర్కొన్నాడు. -
RR Vs SRH: రాజస్తాన్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. తిప్పేసిన షాబాజ్..అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..యశస్వీ జైశ్వాల్(42) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే లక్ష్య చేధనలో రాజస్తాన్‌ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశాడు. 3 వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అభిషేక్ రెండు.. నటరాజన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. -
RR Vs SRH: చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును చాహల్ నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్-2లో రెండు సిక్స్‌లు ఇచ్చిన చాహల్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటివరకు 224 సిక్స్‌లు ఇచ్చాడు. ఇంతుకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా(222) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చావ్లాను చాహల్ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్‌లో చాహల్ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. -
#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వచ్చాడా.. ? కనీసం ఒక్క ఛాన్స్ కూడా
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఐడైన్ మార్క్రమ్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మార్క్రమ్ తీవ్రనిరాశ పరిచాడు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి తుది జట్టుకు దూరంగా ఉంటున్న మార్క్రమ్కు ఈ మ్యాచ్‌లో అనుహ్యంగా చోటుదక్కింది.అయితే మెనెజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మార్క్రమ్ వమ్ము చేశాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మార్క్రమ్తో పాటు జట్టు మెనెజ్మెంట్పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వరుసగా విఫలమైన ఆటగాడికి కీలక మ్యాచ్‌లో ఎందుకు ఛాన్స్ ఇచ్చారని మండిపడుతున్నారు. అతడికి బదులుగా కివీస్ సూపర్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ ఛాన్స్ ఇవ్వల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది అయితే ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వచ్చాడా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో ఎక్స్‌లో #గ్లెన్ ఫిలిప్స్ అనే కీవర్డ్ ట్రెండ్ అవుతోంది. -
రాజస్తాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన ఎస్ఆర్హెచ్
Rajasthan Royals and Sunrisers Hyderabad Qualifier 2 Live Updatesరాజస్తాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన ఎస్ఆర్హెచ్ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..యశస్వీ జైశ్వాల్(42) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే లక్ష్య చేధనలో రాజస్తాన్‌ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశాడు. 3 వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అభిషేక్ రెండు.. నటరాజన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది.కష్టాల్లో రాజస్తాన్.. విజయం దిశగా ఎస్ఆర్హెచ్రాజస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హెట్‌మైర్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 102/6. క్రీజులో జురెల్(24), పావెల్(2) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 30 బంతుల్లో 74 పరుగులు కావాలి.శెభాష్ షాబాజ్.. రాజస్తాన్ విలవిల రాజస్తాన్ రాయల్స్‌ను షాబాజ్ అహ్మద్ దెబ్బ తీశాడు. అతడి స్పిన్ దాటికి రాజస్తాన్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్ వేసిన షాబాజ్ బౌలింగ్‌లో తొలి బంతికి పరాగ్ ఔట్ కాగా.. ఐదో బంతికి అశ్విన్ పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 90/5మూడో వికెట్ డౌన్..సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శాంసన్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్..65 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 66/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కాడ్మోర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కాడ్మోర్(6), యశస్వీ జైశ్వాల్(13) పరుగులతో ఉన్నారు.రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు.19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 169/7హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన క్లాసెన్ సందీప్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 169/716 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 136/616 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(37), షాబాజ్ అహ్మద్(5) పరుగులతో ఉన్నారు.ఆరో వికెట్ డౌన్..ఎస్ఆర్హెచ్ మరోసారి వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 14 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఐదో బంతికి నితీష్ రెడ్డి(5) ఔట్ కాగా.. ఆరో బంతికి అబ్దుల్ సమద్ క్లీన్ బౌల్డయ్యాడు.నాలుగో వికెట్ డౌన్.. హెడ్ ఔట్99 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ ఎంతంటే?9 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(12), ట్రావిస్ హెడ్(33) పరుగులతో ఉన్నారు.వారెవ్వా బౌల్ట్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుసన్రైజర్స్ హైదరాబాద్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 5వ ఓవర్ వేసిన బౌల్ట్ బౌలింగ్‌లో తొలుత రాహుల్ త్రిపాఠి(37), అనంతరం మార్క్రమ్(1) పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 12 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), ట్రావిస్ హెడ్(3) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు ముగిసే సరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది.ఐపీఎల్-2024లో క్వాలిఫయర్-2కు రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. రాజస్తాన్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఎస్ఆర్హెచ్ జట్టులోకి మార్క్రమ్, జయదేవ్ ఉనద్కత్ వచ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/ కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేకేఆర్.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను సారథిగా శ్రేయస్ ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంచైజీ వదులుకోవడంతో కేకేఆర్ జట్టుతో జత కట్టిన అయ్యర్.. మరోసారి తన కెప్టెన్సీ మార్క్ చూపించి ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దీంతో ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఏ కెప్టెన్‌కు ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా ఈ ఏడాది సీజన్లో కేకేఆర్‌ను అయ్యర్ అద్భుతంగా నడిపించాడు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ను అగ్రస్ధానంలో నిలిపాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో శ్రేయస్ కెప్టెన్సీ పరంగా మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపాడు.చదవండి: USA vs BAN: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. యూఎస్ఏ సంచలన విజయం -
అదే మా కొంపముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్
హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఊదిపడేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫయర్1లో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. మే 24న జరగనున్న క్వాలిఫయర్-2లో ఆర్సీబీ లేదా రాజస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మాకు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్ ఉంది. సెకెండ్ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.ప్రస్తుత టీ20 క్రికెట్లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్ ఇచ్చాం. కానీ మా ప్లాన్ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ప్రారంభంలో పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
SRH Vs KKR: స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్
ఐపీఎల్-2024 సీజన్ మొత్తం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్.. కీలక మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో హెడ్ డకౌటయ్యాడు.కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్ రెండో బంతిని మిడిల్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ గుడ్‌లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని హెడ్ ఆఫ్‌సైడ్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ప్యాడ్, బ్యాట్ గ్యాప్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన హెడ్‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతేకాకుండా హెడ్ ఔట్‌కాగానే కేకేఆర్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Starc sets the tone for Qualifier 1 with a ripper! 🔥#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #IPLinBengali pic.twitter.com/3AJG5BvZwT— JioCinema (@JioCinema) May 21, 2024 -
సన్‌రైజర్స్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్
IPL 2024: KKR vs SRH ipl qualifier 1 live updates:సన్‌రైజర్స్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్‌ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్.. 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు.రెండో వికెట్ డౌన్... నరైన్ ఔట్67 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రెహ్మతుల్లా గుర్భాజ్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(12), నరైన్(12) పరుగులతో రాణించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(12), సునీల్ నరైన్(9) పరుగులతో ఉన్నారు.నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఎస్ఆర్హెచ్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు.14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 123/7సన్‌రైజర్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 14వ ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలుత రాహల్ త్రిపాఠి(55) రనౌట్ కాగా.. ఆ తర్వాతి బంతికే సన్వీర్ సింగ్ ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.ఐదో వికెట్ డౌన్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో సన్‌రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 115/5నిలకడగా ఆడుతున్న క్లాసెన్, త్రిపాఠి10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(30), రాహుల్ త్రిపాఠి(45) పరుగులతో ఉన్నారు.నిప్పులు చెరుగుతున్న స్టార్క్.. కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ దాటికి కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(24), హెన్రిచ్ క్లాసెన్(5) ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్‌అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అబిషేక్.. ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. 4 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(220, నితీష్ కుమార్(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. తొలి ఓవర్ ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.ఐపీఎల్-2024లో తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కేకేఆర్ జట్టులోకి ఫిల్ సాల్ట్ స్ధానంలో గుర్భాజ్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో విజయంలో సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిసన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్ -
IPL 2024 Playoffs: ప్లే ఆఫ్స్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. పరిస్థితి ఏంటి?
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ సమరానికి రంగం సిద్దమైంది. మంగళవారం(మే 21)తో ప్లే ఆఫ్స్‌కు తెరలేవనుంది. పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్-1లో టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. అనంతరం మే 22న క్వాలిఫియర్-2లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే గత 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే ఏంటి పరిస్థితి అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.ప్లే ఆఫ్స్‌కు రిజర్వ్ డే..ఐపీఎల్-2024 సీజన్లో క్వాలిఫియర్-1, ఎలిమినేటర్, క్వాలిఫియర్-2 మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు. మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్ట్రా టైమ్ కూడా ఉంటుంది. ఫలితం తేలాలంటేఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫలితం తేలాలంటే 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఉదహరణకు క్వాలిఫియర్-1లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో ఉన్న కేకేఆర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. -
అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ సునాయసంగా చేధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్ధానంలో నిలిచింది. దీంతో మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇక పంజాబ్‌పై విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."మా హోం గ్రౌండ్లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టును సపోర్ట్ చేసేందుకు మైదానంకు వచ్చిన అభిమానులందరికి ధన్యవాదాలు. ఇంత ఫ్యాన్ కలిగి ఉన్న టీమ్‌ను ఎక్కడ నేను చూడలేదు. మేము మా సొంత మైదానంలో 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించాము. ఈ సీజన్లో ఇప్పటివరకు మా కుర్రాళ్లు అద్బుతంగా రాణించారు. ప్రతీ ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసానికి ప్రతీ ఒక్క బౌలర్ భయపడాల్సిందే. నేను కూడా అభిషేక్‌కు బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. పేసర్లకే కాదు స్పిన్నర్లపై కూడా అతడు స్వేచ్ఛగా ఆడుతాడు. ఇక నితీష్ ఒక యువ సంచలనం. అతడొక ఒక క్లాస్ ప్లేయర్. అతడి తన అనుభవానికి మించి ఆడుతున్నాడు. అతను మా టాప్-ఆర్డర్లో కీలక ఆటగాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
IPL 2024 Playoffs: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
ఐపీఎల్-2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ పడినప్పటకి మరోసారి వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఇక లీగ్ స్టేజీ ముగియడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లపై ఓ లూక్కేద్దం. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల టేబుల్లో కేకేఆర్(19) పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ 17(నెట్ రన్‌రేట్ +0.414), రాజస్తాన్ 17(నెట్ రన్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్లతో వరసగా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి. ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అనంతరం మే 24 క్వాలిఫియర్-2లో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫియర్-1లో ఓడిన జట్టు తలపడనున్నాయి. మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
KKR Vs RR: రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
ఐపీఎల్-2024లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. గౌహతిలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. అయితే మధ్యలో వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించారు. టాస్ కూడా పడింది. కానీ మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానాన్ని సుస్ధిరం చేసుకుంది. అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉన్నప్పటకి.. ఆ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే రాజస్తాన్ జట్టు ఎస్ఆర్హెచ్ను పాయింట్ల పట్టికలో అధిగమించలేకపోయింది.మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్‌కు కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ చేరాయి. మే 21న జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. -
SRH Vs PBKS: చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.215 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 209.42 స్ట్రైక్ రేటుతో 467 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ 41 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016 సీజన్లో కోహ్లి 38 సిక్స్‌లు బాదాడు. తాజా సీజన్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. -
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఐపీఎల్-2024లో గౌహతి వేదికగా చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడేందుకు రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బర్సపరా క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. రాజస్తాన్ 16 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్‌పై తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్తాన్- కేకేఆర్ మ్యాచ్ రద్దవ్వాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దు అయితే రాజస్తాన్, కేకేఆర్‌కు తలో పాయింట్ లభిస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ 17 పాయింట్లతో తమ రెండో స్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దు అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్తాన్ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ సెకెండ్ ప్లేస్‌కు ఎటువంటి ఢోకా లేదు. -
SRH Vs PBKS: పంజాబ్‌పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్‌కు ఎస్ఆర్హెచ్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి సన్‌రైజర్స్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రూసో(49), అథర్వ తైదే(46), జితేష్ శర్మ(32) అదరగొట్టారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో టి నటరాజన్ రెండు వికెట్లు, కమ్మిన్స్, వియస్కాంత్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్..19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(66) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు హెన్రిచ్ క్లాసెన్(42), నితీష్ కుమార్ రెడ్డి(37), రాహుల్ త్రిపాఠి(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించి తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఢిల్లీకు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది.ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకోవడంతో ఢిల్లీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఒక ఈ మ్యాచ్ జరిగి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలై ఉంటే మాథ్యమేటికల్‌గా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో పంత్ సేన ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఏడింట విజయాలు, ఏడింట ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 5వ స్ధానంతో సరిపెట్టుకుంది. -
SRH vs GT: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. హెచ్‌సీఏ కీలక ప్రకటన
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు.అయితే ఇంకా చిన్నపాటి జల్లు కురుస్తుండడంతో సెంట్రల్ పిచ్‌ను మాత్రం కవర్స్‌తో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది. ఇక ఈ మ్యాచ్ నిర్వహణపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మైదానాన్ని సిద్దం చేసుందుకు 100 మందికి పైగా గ్రౌండ్ స్టాప్ శ్రమిస్తున్నారని జగన్ మోహన్ రావు తెలిపారు. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో ఉన్న ఎస్ఆర్హెచ్.. మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 16న ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు దాదాపు వారం రోజుల విరామం లభించడంతో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దుబాయ్ వెకేషన్‌కు వెళ్లాడు. లక్నోతో మ్యాచ్ అనంతరం కమ్మిన్స్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు పయనమయ్యాడు. అక్కడ కమ్మిన్స్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో ఎస్ఆర్హెచ్ అద్బుతాలు సృష్టిస్తోంది.ఐపీఎల్లో చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఏడింట విజయం సాధించింది. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా కమ్మిన్స్ ఆకట్టుకుంటున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. Pat Cummins enjoying His Vacation in Dubai! pic.twitter.com/xgSbabtyYF— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 10, 2024 -
నేను అతడికి బిగ్ ఫ్యాన్.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ఊచకోత ఫలితంగా సన్‌రైజర్స్ ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 9.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 205 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 401 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సపోర్ట్ కారణంగానే ఈ తరహా ప్రదర్శన చేయగల్గుతున్నానని అభిషేక్ తెలిపాడు. "మా కోచింగ్ స్టాప్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆటగాళ్లందరకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. ఎటువంటి కెప్టెన్‌ను, సపోర్ట్ స్టాప్‌ను ఇప్పటివరకు చూడలేదు. స్వేచ్చగా ఆడి మమ్మల్ని మేము వ్యక్తిపరిచేందుకు ఫుల్ సపోర్ట్ వారి నుంచి మాకు ఉంటుంది. ఇటువంటి వాతావరణం మా జట్టులో ఉండడం చాలా సంతోషం. ఈ తరహా బ్యాటింగ్‌ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చేశాను. భారీ షాట్లు ఆడి బౌలర్‌ను ఒత్తడిలోకి నెట్టేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. ఇక ట్రావిస్ హెడ్‌కు నేను వీరాభిమానిని. అతడితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ట్రావిస్ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో అతడి ఆడిన షాట్లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే" అని జియోసినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ పేర్కొన్నాడు. -
HBD Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2024లో వరుస ఓటములను చవిచూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్ వర్మ(37నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జానెసన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ముంబై ఇండియన్స్ తరపున అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ తుది జట్టులోకి మయాంక్ అగర్వాల్ వచ్చాడు.ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. ఈమ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార -
వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పరాగ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు పరాగ్ చుక్కలు చూపించాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను పరాగ్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో నిలిపాడు. పరాగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 135 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేయలేదన్న కసి మొత్తం ఈ మ్యాచ్‌లో చూపించాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పరాగ్ అద్బుత ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 409 పరుగులు చేశాడు.ఎస్ఆర్హెచ్ చేతిలో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. If you are one of those who trolled Riyan Parag during his tough time then you need to say sorry to him.He is slapping all of us with his exceptional performance.He is the finisher along with Rinku Singh who will bring the ICC trophy in future for Indiapic.twitter.com/Mk0IRvtfhJ— Sujeet Suman (@sujeetsuman1991) May 2, 2024 -
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్-2024లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. రాజస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రావ్‌మెన్ పావెల్, అశ్విన్ ఉండగా.. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కమ్మిన్స్ భువీ అప్పగించాడు. చివరి ఓవర్ తొలి బంతికి అశ్విన్ సింగిల్ తీసి పావెల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. పావెల్ రెండో బంతికి డబుల్, మూడో బంతిని బౌండరీగా మలిచాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రాజస్తాన్ విజయసమీకరణం 6 పరుగులుగా మారింది. ఆ తర్వాత వరుస రెండు బంతుల్లో పావెల్ రెండేసి పరుగులు తీయడంతో ఆఖరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 2 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో భువనేశ్వర్ ఆఖరి డెలివరీని అద్బుతంగా బౌలింగ్ చేసి పావెల్‌ను ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ సంచలన విజయం నమోదు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు. -
నితీష్ ఊచకోత.. 8 సిక్స్‌లతో వీర విహారం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో నితీష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో సెటిల్ అయ్యాక బౌండరీల వర్షం కురిపించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్‌కు అయితే నితీష్ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే నితీష్ కుమార్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డితో పాటు ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(28) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు.pic.twitter.com/mTZPleUfH5— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 2, 2024 -
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగారు. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు. -
రాజస్తాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒకే మార్పుతో బరిలోకి దిగింది. స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ స్ధానంలో ఆల్‌రౌండర్ మార్కో జానెసన్ తుది జట్టులో వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. కాగా ఈ మ్యాచ్ రాజస్తాన్ కంటే ఎస్ఆర్హెచ్కు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకోగా.. సన్‌రైజర్స్ మాత్రం పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో నిలిచింది.తుది జట్లురాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మసన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ -
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్‌రైజర్స్ ఘోర ఓటమి
ఐపీఎల్-2024లో వరుస ఓటుమల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. సీఎస్కే బౌలర్ల దాటికి 134 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మార్క్రమ్(32) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా అందరూ విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముస్తఫిజుర్ రెహ్మాన్, పతిరనా తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు జడేజా, శార్ధూల్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘనత సాధించింది. టీ20ల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్కే రికార్డులకెక్కింది. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన సీఎస్కే..ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. టీ20 క్రికెట్లో చెన్నై ఇప్పటివరకు 35 సార్లు 200పైగా పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ కౌంటీ జట్టు సోమర్సెట్ పేరిట ఉండేది. సోమర్సెట్ టీ20ల్లో 34 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించింది. తాజా మ్యాచ్‌తో సోమర్సెట్ వరల్డ్ రికార్డును సీఎస్కే బ్రేక్ చేసింది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అయితే ఈ రికార్డు టీమిండియా పేరిట ఉంది. భారత జట్టు 32 సార్లు 200పైగా పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్ ఔటయ్యాడు. -
రుతురాజ్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్ ఔటయ్యాడు.ఇక సీఎస్కే బ్యాటర్లలో గైక్వాడ్‌తో పాటు మిచెల్(52), శివమ్ దూబే(39 నాటౌట్) పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అందరూ పూర్తిగా తేలిపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కట్ తలా వికెట్ సాధించారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్,నటరాజన్ ఇద్దరి కలిసి ఏకంగా 92 పరుగులు సమర్పించుకున్నారు. -
సీఎస్కేతో ఎస్ఆర్హెచ్ పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. కాగా ఈ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాయి. సీఎస్కే లక్నో సూపర్ జెయింట్స్‌తో చేతిలో పరాజయం పాలవ్వగా.. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ మూడో స్ధానంలో కొనసాగుతుండగా.. సీఎస్కే ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానాసన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
IPL 2024: ఢిల్లీ, లక్నో, గుజరాత్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే?
ఐపీఎల్-2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ ఏడాది ఎడిషన్‌లో సగం పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గత సీజన్లో నిరాశపరిచిన రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ ఏడాది సీజన్లో దుమ్ములేపుతున్నాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టిక టాప్-4లో రాజస్తాన్ రాయల్స్ 14 పాయింట్లతో అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత స్ధానాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐదో స్ధానంలో నిలిచింది.అయితే 7 విజయాలతో తొలి స్ధానంలో ఉన్న రాజస్తాన్ మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్నట్లే. మిగిలిన మూడు స్ధానాలు కోసం మిగితా 9 జట్లు పోటీపడనున్నాయి. అందులో ఆఖరి స్ధానంలో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే.ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే అద్బుతాలు జరిగాలి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అంచనా వేశాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయని సిద్దూ జోస్యం చెప్పాడు.నాలుగో స్ధానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడతాయని సిద్దూ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దూ పేర్కొన్నాడు. అయితే పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో లక్నో సూపర్ జెయింట్స్‌ను సిద్దూ ఎంపిక చేయకపోవడం గమనార్హం. కాగా ముంబై ఇండియన్స్ పాయింట్ల టేబుల్లో ప్రస్తుతం 8వ స్ధానంలో ఉంది. అటువంటిది ముంబై ఇండియన్స్‌ను సిద్దూ ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఓటమి చవిచూసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఎస్హెర్హెచ్ విఫలమైంది.తొలుత బౌలింగ్‌లో 206 పరుగులు సమర్పించుకున్న సన్‌రైజర్స్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ చెతెలేస్తేఇసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ మరోసారి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తొలుత బౌలింగ్‌లో ఆర్సీబీ వికెట్లు పడినప్పుడు ఎగిరి గెంతులేసిన కావ్యా.. తమ బ్యాటింగ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కడుతున్న సమయంలో కావ్య మారన్ ముఖం చిన్నబోయింది. ముఖ్యంగా అబ్దుల్ సమద్ ఔటైన తర్వాత కావ్య పాప షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఏంటి రా ఏ బ్యాటింగ్ అన్నట్లు కావ్య ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. #RCB Rocked 😎Kavya Maran Shocked 😮💨Congratulations RCB 😍#RCBvsSRH #SRHvRCB#ViratKohli𓃵pic.twitter.com/xISW2H2cWG— Mohammed Aziz (@itsmeaziz07) April 25, 2024 -
ఇదేమి చెత్త బ్యాటింగ్‌రా బాబు.. ఫుల్ టాస్ బాల్‌కు కూడా! వీడియో
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ తన పేలవ ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో మార్క్రమ్ నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 8 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో ఫుల్ టాస్ బంతికి వికెట్ల ముందు మార్క్రమ్ దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నప్పటికి క్లియర్ ప్లంబ్(ఎల్బీ)గా తేలింది. ఈ క్రమంలో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఫుల్ టాస్ బాల్ కూడా ఆడలేవా అంటూ పోస్టులు పెడుతున్నారు.మరి కొంతమంది వరుసగా విఫలమవతున్నప్పటికి మార్క్రమ్కు ఛాన్స్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. అతడి స్ధానంలో గ్లెన్ ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన మార్క్రమ్.. 27.83 సగటుతో 167 పరుగులు చేశాడు. SRH fans reaction watching Aiden markram batting in this season pic.twitter.com/b6vx0pgeZr— Abhi (@Ragnarfreak) April 25, 2024pic.twitter.com/4klNQt9XoJ— Cricket Videos (@cricketvid123) April 25, 2024 -
రజిత్ పాటిదార్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 4 సిక్స్‌లు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్ మరో అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పాటిదార్ అదరగొట్టాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విల్ జాక్స్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పాటిదార్.. ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేశాడు. స్పిన్నర్ మార్కండే వేసిన 11 ఓవర్లో పాటిదార్ వరుసుగా 4 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే పాటిదార్ తన హాప్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన రజిత్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50)తో పాటు విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు. Patidar ka 𝑹𝒂𝒋 🤌🫡#SRHvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/v1dzhJjKxZ— JioCinema (@JioCinema) April 25, 2024 -
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్
IPL 2024 RCB vs SRH Live Updates: ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం..ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్యాట్ కమ్మిన్స్(31), అభిషేక్ శర్మ(31) పర్వాలేదన్పించారు.ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కామెరాన్ గ్రీన్,కరణ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్..124 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాబాజ్ అహ్మద్(13), ప్యాట్ కమ్మిన్స్(3) పరుగులతో ఉన్నారు.56 పరుగులకే 4 వికెట్లు..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్ వేసిన స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో తొలుత మార్క్రమ్(7) ఔట్ కాగా.. తర్వాత క్లాసెన్(7) ఔటయ్యారు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 62/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(10),షాబాజ్ అహ్మద్(3) ఉన్నారు.రెండో వికెట్ డౌన్..37 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 37/2. క్రీజులో మార్క్రమ్(3), నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ట్రావిస్ హెడ్.. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దంచి కొట్టిన ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 207 పరుగులుటాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ అదరగొట్టింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 179/518 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(27), కార్తీక్(7) ఉన్నారు.విరాట్ కోహ్లి ఔట్..ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 142/4మూడో వికెట్ డౌన్..పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన పాటిదార్.. ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 132/312 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 126/212 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), రజిత్ పాటిదార్(49) పరుగులతో ఉన్నారు. పాటిదార్ దూకుడుగా ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.రెండో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన విల్ జాక్స్.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 73/2. క్రీజులో విరాట్ కోహ్లి(34), పాటిదార్(6) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..48 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 49/1. క్రీజులో విరాట్ కోహ్లి(23), విల్ జాక్స్(1) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫాప్ డుప్లెసిస్(15) పరుగులతో ఉన్నారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ..ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక మార్పు చేసింది.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. హైదరాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పిస్తున్న ఆర్సీబీ.. బౌలింగ్ పరంగా మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. వరుస పరాజయాలతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి కూడా దాదాపు నిష్క్రమించినట్లే. అయితే కనీసం మిగిలిన మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో మరో కీలక పోరుకు ఆర్సీబీ సిద్దమైంది. ఏప్రిల్ 25న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్ చేరుకున్నాడు. జట్టు కంటే ముందే విరాట్ భాగ్యనగరంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లూక్లో విరాట్ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ నిరాశపరుస్తున్నప్పటికి.. కోహ్లి మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 379 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. #ViratKohli arrived in Hyderabad for the upcoming IPL match, #SRHvsRCB on Thursday. pic.twitter.com/ljkoyENfmy — Gulte (@GulteOfficial) April 23, 2024 -
మహేష్‌బాబుతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. (ఫోటోలు)
-
టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 549 పరుగులు! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టీ20 క్రికెట్ మజాను అందించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇరు జట్లు కలపి ఏకంగా 549 పరుగులు సాధించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ కూడా ధీటుగా బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆర్సీబీ తమ విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది. SRH might’ve won the match but Dinesh Karthik definitely deserved that standing ovation ❤️#RCBvSRH pic.twitter.com/sMWNSC2ptj — UrMiL07™ (@urmilpatel30) April 15, 2024 అత్యధిక సిక్స్‌లు.. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు కలిపి ఏకంగా 38 సిక్స్‌లు బాదేశారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన రెండు మ్యాచ్‌గా ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ పోరు నిలిచింది. అంతకముందు ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా 38 సిక్స్‌లే నమోదయ్యాయి. That's a Book 🔥 Innings from Travis head! pic.twitter.com/lsiLinLU1M — SunRisers OrangeArmy Official (@srhfansofficial) April 15, 2024 -
మా కుర్రాళ్లు బాగా పోరాడారు.. అదే మా కొంపముంచింది: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమి చవచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. మరోసారి బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్‌ను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్(102) ,హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని ఫాప్ చెప్పుకొచ్చాడు. "ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో మా నుంచి వచ్చిన మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇదే. చిన్నస్వామి వికెట్ సరిగ్గా టీ20 క్రికెట్‌కు సరిపోతుంది. 280 పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ మేము దగ్గరికి వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేశాము. కొత్తగా కొన్ని విషయాలను ప్రయత్నించాం. ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌పై పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్ పరంగా మేము బలంగానే ఉన్నాము. మేము ఇంకా కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి. అదే విధంగా బ్యాటింగ్‌లో కూడా పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. ఈ హైస్కోరింగ్ రన్ ఛేజ్‌లో మా బాయ్స్ ఆఖరి వరకు మ్యాచ్‌ను విడిచిపెట్టలేదు. తొలుత బౌలింగ్‌లో 30-40 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. అదే మా కొంపముంచింది. కానీ ఆటలో గెలుపుటములు సహజం. ఓడిపోయినందుకు కచ్చితంగా బాధ ఉంటుంది. కానీ మా మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మా తర్వాతి మ్యాచ్‌ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలి కదా" అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
లేటు వయస్సులో తుపాన్ ఇన్నింగ్స్‌లు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్?
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మాత్రం అద్బుతమైన పోరాట పటిమతో అందరని ఆకట్టుకున్నాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో కార్తీక్ ఒంటరి పోరాటం చేశాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో కార్తీక్ అలరించాడు. అతడికి బౌలింగ్‌లో ఎలా చేయాలో ఆర్ధం కాక ఎస్ఆర్హెచ్ బౌలర్లు తలలపట్టుకున్నారు. భువనేశ్వర్, ప్యాట్ కమ్మిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్కు గట్టిపోటీ ఇవ్వగల్గింది. డికే ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్ వచ్చి తన జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచి ఉండవచ్చు.. డీకే మాత్రం మా మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలంటూ అభిప్రాయపడుతున్నారు. pic.twitter.com/jqOIaCZAgL — Cricket Videos (@cricketvid123) April 15, 2024 -
క్లాసెన్ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఉర మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే క్లాసెన్ ఇన్నింగ్స్‌లోని ఓ సిక్స్ దెబ్బకు స్టేడియం పైకప్పు దాటి వెళ్లింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన ఫెర్గూసన్ రెండో బంతిని క్లాసెన్‌కు లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ అద్బుతమైన లాఫ్టెడ్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. దెబ్బకు బంతి చిన్నస్వామి స్టేడియం బయట పడింది. అతడు కొట్టిన సిక్స్ ఏకంగా 106 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. Got an update from #Chandrayaan, the ball is still travelling at the speed of light 😉#TATAIPL #RCBvSRH #IPLonJioCinema #HeinrichKlaasen #IPLinTelugu pic.twitter.com/fmVeijmSlk — JioCinema (@JioCinema) April 15, 2024 -
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ?
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో హెడ్ కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్ 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన హెడ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(30 బంతులు) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. యూసఫ్ పఠాన్(37 బంతులు), డేవిడ్ మిల్లర్(38 బంతులు) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులకెక్కింది. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో 22 సిక్స్‌లు బాదిన ఎస్ఆర్హెచ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.ఇంతకుముందు ఈ రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉండేది. ఐపీఎల్-2013 సీజన్లో ఆర్సీబీ ఒకే ఇన్నింగ్స్‌లో 21 సిక్స్‌లు కొట్టి టాప్ ప్లేస్‌లో కొనసాగింది. అయితే తాజా మ్యాచ్‌తో 11 ఏళ్ల ఆర్సీబీ రికార్డును సన్‌రైజర్స్ బ్రేక్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో సంచలనం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన తన రికార్డునే తనే బ్రేక్ చేసింది. .ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అంతకుముందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ20 హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్.. అదే విధంగా మరో రికార్డును కూడా ఎస్ఆర్హెచ్ తమ ఖాతాలో వేసుకుంది. టీ20(అంతర్జాతీయ, లీగ్‌లు) చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. నేపాల్ గతేడాది ఏషియన్ గేమ్స్ టోర్నీలో మంగోలియాపై 314 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్(287) పరుగులతో రెండో స్ధానంలో నిలిచింది. -
క్లాసెన్ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 31 బంతులు మాత్రమే ఎదుర్కొన్న క్లాసెన్.. 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 -
IPL 2024: సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో సంచలనం సృష్టించింది. ఐపీఎల్లో చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో బాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆర్సీబీ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్లో తాను సృష్టించిన అత్యధిక పరుగుల రికార్డును.. 20 రోజుల్లో తానే తిరగరాసింది. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. -
ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మతో స్కోర్‌ను బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హెడ్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా ఐపీఎల్ సన్‌రైజర్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన తర్వాత లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హెడ్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. TRAVIS HEAD - FASTEST HUNDRED BY SRH BATTER IN IPL HISTORY 🤯pic.twitter.com/GvWCPFpRkd — Johns. (@CricCrazyJohns) April 15, 2024 -
IPL2024 RCB vs SRH: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి..
IPL2024 RCB vs SRH Live Updates: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి.. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఆఖరివరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కండే రెండు, నటరాజన్ ఒక్క వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ 181 పరుగులు వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో దినేష్ కార్తీక్(36), రావత్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 128 పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్(16), లామ్రోర్(18) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్ వేసిన మార్కండే బౌలింగ్‌లో పాటిదార్ ఔట్ కాగా.. అనంతరం కమ్మిన్స్ బౌలింగ్‌లో డుప్లెసిస్(62), సౌరవ్ చౌహన్ పెవిలియన్‌కు చేరారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. జాక్స్ ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కట్ బౌలింగ్‌లో విల్ జాక్స్ రనౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఫాప్ డుప్లెసిస్(51), పాటిదార్ ఉన్నారు. ఆర్సీబీ తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. చెలరేగి ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు.. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(25), ఫాప్ డుప్లెసిస్(31) పరుగులతో ఉన్నారు. సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుమందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో తన రికార్డును తానే తిరగరాసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్స్‌లు బాదారు. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ 233 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67, 7 సిక్స్‌లు, 4 ఫోర్లు).. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 217/2 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్క్రమ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. హెడ్ ఔట్ ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిస్ క్లాసెన్(39), మార్క్రమ్(2) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. ట్రావిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 38 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. 102 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి1 57 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 108 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఆభిషేక్ శర్మ.. టాప్లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(79), క్లాసెన్(1) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచికొడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(33), ట్రావిస్ హెడ్(71) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ట్రావిస్ హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ట్రావిస్ హెడ్(52) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(14), ట్రావిస్ హెడ్(13) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ మాక్స్వెల్, సిరాజ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఆర్సీబీ తుది జట్టులోకి కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ వచ్చాడు. సన్‌రైజర్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్ -
గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి.. వికెట్ కీపింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. అద్బుతమైన స్టంపింగ్‌తో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను క్లాసెన్ పెవిలియన్‌కు పంపాడు. మెరుపు వేగంతో స్టంప్ చేసిన క్లాసెన్.. భారత లెజెండ్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడింది. ఎస్ఆర్హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్‌ను ఎదుర్కోవడానికి పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో భువీ స్వింగ్‌ను కట్ చేసేందుకు ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన భువీ బౌలింగ్‌లో ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి అద్బుతమైన షాట్ ఆడాడు. ఇది చూసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. వికెట్ కీపర్ క్లాసెన్‌ను స్టంప్స్‌కు దగ్గరగా తీసుకువచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు స్టంప్స్‌కు దగ్గరగా వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది. భువీ వేసిన అదే ఓవర్లో నాలుగో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి.. వికెట్ల వెనకు క్లాసెన్‌కు చిక్కాడు. గంటకు 140 కి.మీ వేగంతో వచ్చిన బంతిని అందుకున్న క్లాసెన్ మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 𝗤𝘂𝗶𝗰𝗸 𝗛𝗮𝗻𝗱𝘀 𝘅 𝗦𝘂𝗽𝗲𝗿𝗯 𝗥𝗲𝗳𝗹𝗲𝘅𝗲𝘀 ⚡️ Relive Heinrich Klaasen's brilliant piece of stumping 😍👐 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/sRCc0zM9df — IndianPremierLeague (@IPL) April 9, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడొక అద్బుతం.. నాకు మాటలు రావడం లేదు! భువీ కూడా: కమ్మిన్స్
ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. . 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.ఆఖరి ఓవర్లో విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఏకంగా 27 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్ హీరోలు అశుతోష్ శర్మ(33; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్(46; 25 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, నటరాజన్, నితీష్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 64 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ విజయంపై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు."మరోసారి క్లోజ్ మ్యాచ్‌ను చూడాల్సి వచ్చింది. తొలి 10 ఓవర్లలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము మా బోర్డులో 180 పరుగుల స్కోర్‌ను ఉంచడానికి చాలా కష్టపడ్డాము. అనంతరం బౌలింగ్‌లో కూడా మేము మంచి ఆరంభాన్ని పొందాము. భువనేశ్వర్ కొత్త బంతితో అద్బుతం చేశాడు.180 పరుగులు అనేది నా దృష్టిలో మంచి స్కోర్. 150 పైగా పరుగులు చేసి ఓడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ 180 ప్లస్ స్కోర్ సాధించి ఓడిపోవడం చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. కొత్త బంతితో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం. భువీ నేను కొత్త బంతితో బౌలింగ్ చేసి వికెట్లు తీయాలన్నదే మా ప్లాన్.మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం. మా జట్టులో లెఫ్ట్ ఆర్మర్లు, రైట్ ఆర్మ్ పేసర్లు చాలా మంది ఉన్నారు. బ్యాటింగ్ పరంగా మేము పటిష్టంగానే ఉన్నాం. కాబట్టి పాజిటివ్ మైండ్‌తో ఆడి విజయాలు సాధించడమే మా లక్ష్యం. ఇక నితీష్ కుమార్ ఒక అద్బుతం. అతడి కోసం ఏమి మాట్లాడాలో కూడా నాకు ఆర్దం కావడం లేదు. సీఎస్కేతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్‌ను చూశాం.అందుకే ఈ రోజు మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందు పంపించాం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. మేము 180 పైగా పరుగులు సాధించమంటే కారణం అతడే. అదేవిధంగా ఫీల్డ్, బౌలింగ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని పోస్ట్‌మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు.. ఎవరీ నితీష్ రెడ్డి?
ఐపీఎల్లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు కుర్రాడు తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్లాసెన్, మార్క్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర ఆటగాడు సత్తాచాటాడు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో కాస్త సెట్ అయ్యాక భీబత్సం సృష్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి నితీష్ మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టుకు 182 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. కాగా నితీష్ కుమార్‌కు తన ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా నితీష్ ఓ వికెట్ పడగొట్టాడు. ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి..? 20 ఏళ్ల కాకి నితీష్ కుమార్ రెడ్డి 2003, మే 26న విశాఖపట్నంలో జన్మించాడు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నితీష్‌కు 14 ఏళ్ల వయస్సులో విజయ్ మర్చంట్ ట్రోఫీ(2017-18)లో ఆంద్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని నితీష్ సద్వినియోగ పరుచుకున్నాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో 176.41 యావరేజ్‌తో 1237 పరుగులు, బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు. బీసీసీఐ నుంచి 2017-18 ఏడాదికి గాను ‘బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16’ జగన్మోహియా దాల్మియా అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2020 రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2021లో లిస్ట్-ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20ల్లో కూడా నితీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన రెడ్డి.. 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించారు. కాగా టీ20ల విషయానికి వస్తే.. ఆంధ్రా జట్టు తరపున 8 మ్యాచ్‌లు ఆడిన నితీష్ 106 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో నితీశ్ రెడ్డిని ఐపీఎల్ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో నితీష్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్లో హాఫ్ సెంచరీ నాలుగో ఆంధ్రా క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాల రావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 5️⃣0️⃣ up for Nitish Reddy 💪 The local lad is turning it up 🔥#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/GguSBFYiFc — JioCinema (@JioCinema) April 9, 2024 -
శెభాష్ నితీష్ కుమార్.. తెలుగోడి సత్తా చూపించావు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ తన అద్భుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్ మిడిల్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి మన తెలుగు బిడ్డ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15 ఓవర్ వేసిన పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను నితీష్ ఊచకోత కోశాడు. ఆ ఓవర్లో ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ నితీష్ కుమార్.. తెలుగోడి సత్తా చూపించావు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక నితీష్ విధ్వంసకర ఫలితంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. A special counter attacking innings from Nitish Kumar Reddy 🙌 He is leading #SRH's fightback with some glorious shots 👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/6SFysFcqKz — IndianPremierLeague (@IPL) April 9, 2024 -
PBKS vs SRH: ఉత్కంఠపోరులో ఎస్ఆర్హెచ్ గెలుపు..
IPL 2024 PBKS vs SRH Live Updates: పంజాబ్ కింగ్స్‌తో ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర్లో తమ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా పంజాబ్ బ్యాటర్లు అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ 26 పరుగులు సాధించారు. ఆఖరి వరకు పోరాడనప్పటికి తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(46) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అశుతోష్ శర్మ(15 బంతుల్లో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, నటరాజన్, నితీష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 64 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 18 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ : 154/6. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాలి. పంజాబ్ ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ రూపంలో పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది.19 పరుగులు చేసిన జితేష్.. నితీష్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 116/6 ఐదో వికెట్ డౌన్.. 91 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సికిందర్ రజా.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 97/5 నాలుగో వికెట్ డౌన్ 58 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శశాంక్ సింగ్ వచ్చాడు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 58/3 9 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో సామ్ కుర్రాన్(29), సికిందర్ రజా(10) పరుగులతో ఉన్నారు. కష్టాల్లో పంజాబ్.. 20 పరుగులకే 3 వికెట్లు 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శిఖర్ ధావన్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధావన్ ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో డకౌటయ్యాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 2/1 పంజాబ్ టార్గెట్ 183 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు అబ్దుల్ సమాద్(25), షాబాజ్ ఆహ్మద్(14) ఆఖరిలో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు సామ్ కుర్రాన్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ డౌన్.. నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 64 పరుగులు చేసిన నితీష్ కుమార్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 156/8 ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ డౌన్.. అబ్దుల్ సమాద్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అబ్దుల్ సమాద్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16.4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 133/6 నితీష్ కుమార్ ఫిప్టీ.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందున్నాడు. 63 పరుగులతో నితీష్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 15 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 133/5 ఐదో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 111/5. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(41), సమాద్(9) పరుగులతో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్.. త్రిపాఠి ఔట్ 64 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 90/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(33), క్లాసెన్(6) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 61/3 10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(11), రాహుల్ త్రిపాఠి(10) ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. 39 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 40/3 వారెవ్వా అర్ష్‌దీప్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆర్ష్‌దీప్ సింగ్ బిగ్ షాకిచ్చాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లలో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ట్రావిస్ హెడ్(21), తర్వాత మార్క్రమ్ డకౌటయ్యాడు. క్రీజులో అభిషేక్ శర్మ నితీష్ శర్మ ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
ఒకప్పుడు నెట్ బౌలర్.. ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టులోకి ఎంట్రీ
ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా హసరంగా స్ధానాన్ని ఎస్ఆర్హెచ్ మెన్జ్మెంట్ భర్తీ చేసింది. అతడి స్ధానంలో మరో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్తో సర్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50 లక్షల కనీస ధరకు ఎస్ఆర్హెచ్ అతడిని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్లో ఆర్సీబీకి నెట్‌బౌలర్‌గా విజయకాంత్ పనిచేశాడు. ఇక అతడు శ్రీలంక తరపున ఇప్పటివరకు కేవలం ఒకే టీ20 మ్యాచ్ ఆడాడు. కానీ విజయకాంత్‌కు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికి.. డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన కెరీర్లో 33 టీ20లు ఆడిన విజయకాంత్ 6.76 ఏకానమీ రేటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో సరైన మణికట్టు స్పిన్నర్లు లేరు. ఈ నేపథ్యంలో విజయకాంత్‌ను సొంతం చేసుకోవడం ఎస్ఆర్హెచ్ కలిసిశ్చే ఆంశం. కాగా ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు 4మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్ధానంలో సన్‌రైజర్స్ కొనసాగుతోంది. -
SRH: అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. సంతోషంగా ఉంది
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో అద్బుత విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సీఎస్కేను ఆరెంజ్ ఆర్మీ చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన ఎస్ఆర్హెచ్.. అనంతరం బ్యాటింగ్‌లో దుమ్ములేపింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు.. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, పాట్ కమ్మిన్స్, జయ్‌దేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(37), ట్రావిస్ హెడ్(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. తమ హోం గ్రౌండ్లో మరో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమ్మిన్స్ తెలిపాడు. "హోం గ్రౌండ్లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరాయి. ఈ రోజు పిచ్ కాస్త భిన్నంగా ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ కొంచెం నెమ్మదించింది. శివమ్ దూబే మాత్రం స్పిన్నర్లను ఎటాక్ చేశాడు. అందుకే స్పిన్నర్లతో తమ ఫుల్ ఓవర్ల కోటా వేయించలేదు. వికెట్ నెమ్మదిగా ఉంది కాబట్టి ఆఫ్కట్టర్లతో ప్రత్యర్ది బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాము. మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. అదే విధంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మాకు మంచి ఆరంభం ఇచ్చారు. అభిషేక్ కోసం ఎంత చెప్పిన తక్కుదే. ఆ తర్వాత మార్క్రమ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రోజు స్టేడియం హౌస్ ఫుల్ అయిపోయింది. ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయిందని" కమ్మిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
అదరగొట్టిన అభిషేక్ శర్మ.. ఒకే ఓవర్లో 27 పరుగులు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు అభిషేక్ శర్మ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్.. సీఎస్కే పేసర్లను ఊచకోత కోశాడు. క్రీజులో ఉన్నంత సేపు అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సీఎస్కే యువ పేసర్ ముఖేష్ చౌదరికి అభిషేక్ చుక్కలు చూపించాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో అభిషేక్.. 3 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 27 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Abhishek Sharma departs for 37 but he's got @SunRisers off to a stunning start 🔥🚀 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvCSK pic.twitter.com/yHyUrnHsiO — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
శివమ్ దూబే మెరుపులు.. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాల్సిందే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే మరోసారి మెరుపులు మెరిపించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దూబే అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దూబే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా స్పిన్నర్లను దూబే టార్గెట్ చేశాడు. దూబే కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దూబేను కచ్చితంగా టీ20 వరల్డ్ కప్‌నకు ఎంపిక చేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, పాట్ కమ్మిన్స్, జయ్‌దేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. DUBE goes 𝘄𝗵𝗮𝗺-𝗯𝗮𝗺! 💥💥#ShivamDube's 45 (24) gave #CSK the momentum they needed! How many more runs will Chennai post on the board tonight? Tune in to #SRHvCSK in #IPLOnStar LIVE NOW only on Star Sportspic.twitter.com/iVf1H5VASW — Star Sports (@StarSportsIndia) April 5, 2024 -
IPL 2024 SRH vs CSK : సీఎస్కేను చిత్తు చేసిన సన్‌రైజర్స్..
IPL 2024 SRH vs CSK Live Updates: సీఎస్కేను చిత్తు చేసిన సన్‌రైజర్స్.. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(37), ట్రావిస్ హెడ్(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్కే బౌలర్లలో మొయిన్ అలీ రెండు వికెట్లు, దీపక్ చాహర్, థీక్షణ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు.. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, పాట్ కమ్మిన్స్, జయ్‌దేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్.. ఆహ్మద్ ఔట్ షాబాజ్ అహ్మద్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన అహ్మద్.. మొయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ రెడ్డి వచ్చాడు. మూడో వికెట్ డౌన్.. మార్క్రమ్ ఔట్ ఐడైన్ మార్క్రమ్ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన మార్క్రమ్.. మొయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 132/3 ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. మహేష్ థీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 112/2 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 78/1 6 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(24), ఐడైన్ మార్క్రమ్(15) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులతో మంచి టచ్‌లో కన్పించిన అభిషేక్ శర్మ.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. 3 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 46/1 ఎస్ఆర్హెచ్ టార్గెట్ 166 పరుగులు హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు.. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, పాట్ కమ్మిన్స్, జయ్‌దేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్.. 127 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన అజింక్య రహానే.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సీఎస్కే మూడో వికెట్ డౌన్.. 118 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన శివమ్ దూబే.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 14 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 120/3 11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 90/2 11 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే(21), శివమ్ దూబే(29) పరుగులతో ఉన్నారు. సీఎస్కే రెండో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్ 54 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 25 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అజింక్య రహానే వచ్చాడు. 4 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 26/1 2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 13/0 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(6), రచిన్ రవీంద్ర(7) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఏకంగా 3 మార్పులతో బరిలోకి దిగింది. ముస్తఫిజర్ రెహ్మన్, మతీషా పతిరాన,సమీర్ రిజ్వీ దూరమయ్యారు. వీరి స్ధానంలో థీక్షణ, ముఖేష్ చౌదరి, మొయిన్ అలీ వచ్చాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా రెండు మార్పులు చేసింది. జట్టులోకి ఆంధ్ర ఆటగాడు నితీష్ రెడ్డి వచ్చాడు. అతడితో పాటు నటరాజన్‌కు చోటు దక్కింది. తుది జట్లు చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్ -
అదే మా కొంపముంచింది.. లేదంటేనా మాదే విజయం: కమ్మిన్స్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవి చూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్,బౌలింగ్ రెండింటిలోనూ సన్‌రైజర్స్ విఫలమైంది. 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఇది ఎస్ఆర్హెచ్కు రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ పరంగా తాము విఫలమయ్యామని కమ్మిన్స్ తెలిపాడు. "ఆటలో గెలుపుటములు సహజం. ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడాం. మేము తొలుత బ్యాటింగ్‌లో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్ధితి మరో విధంగా ఉండేది. కానీ గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మేము వరుస క్రమంలో వికెట్ల కోల్పోయాం. కనీసంలో మాలో ఎవరో ఒకరైనా ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధించింటే బాగుండేది. తొలి రెండు మ్యాచ్‌ల్లో మేము బాగా బ్యాటింగ్ చేశాము. కానీ ఈ మ్యాచ్‌లో మా ప్రణాళిలకను అమలు చేయడంలో విఫలమయ్యాం. ఈ రోజు పిచ్ కూడా బాగానే ఉంది. తొలుత వికెట్ కొంచెం స్లోగా ఉంటుందని భావించాము. కానీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ ఒకేలా ఉంది. మా తర్వాతి మ్యాచ్‌ల్లో తిరిగి పుంజుకుంటామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఎస్ఆర్హెచ్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. -
SRH Vs GT: రషీద్ ఖాన్ సూపర్ డెలివరీ.. క్లాసెన్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో 24 పరుగులు చేశాడు. అయితే తనకు వచ్చిన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్గామలచడంలో క్లాసెన్ విఫలమయ్యాడు. గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్బుతమైన బంతితో క్లాసెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో మూడో బంతిని రషీద్ ఫ్లాట్‌గా సంధించాడు. బంతి టర్న్ అవుతుందని భావించిన క్లాసెన్.. ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఫ్లాట్‌గా వచ్చిన బంతి క్లాసెన్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ క్లాసెన్ మాత్రం నిరాశతో తన బ్యాట్‌కు పంచ్‌లు ఇస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. pic.twitter.com/J6y5BOQ5IE — Sitaraman (@Sitaraman112971) March 31, 2024 -
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్..
ఐపీఎల్-2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. హసరంగ ప్రస్తుతం ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకుని త్వరలోనే సన్‌రైజర్స్ జట్టుతో చేరుతాడని అంతా భావించారు. కానీ హసరంగా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలిగనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా ధ్రువీకరించారు. "పాడియాట్రిస్ట్‌ను కలిసిన హసరంగా వారి సలహా మేరకు మరి కొన్ని రోజుల పాటు పునరావాసంలో ఉండనున్నాడు. దీంతో అతడు ఐపీఎల్లో పాల్గొనడం లేదు. అతడి మడమలో వాపు ఉంది. వనిందు ప్రస్తుతం ఇంజెక్షన్లను తీసుకుంటున్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు పూర్తి ఫిట్నెస్ సాధించాలని హసరంగా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలన్న తన నిర్ణయాన్ని మాకు తెలియజేశాడని" డి సిల్వా సండే టైమ్స్ అనే వార్తా పత్రికతో పేర్కొన్నాడు. ఐపీఎల్-2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హసరంగను రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.