
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.
ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కమిందు మెండిస్(32 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(19 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. కాగా చెపాక్‌లో సీఎస్‌కేపై ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ ఓటమితో సీఎస్‌కే ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే