IPL 2025
-
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. HAT-TRICK FOR BHUVNESHWAR KUMAR IN SYED MUSHTAQ ALI 🦁- Great news for RCB in IPL 2025...!!! pic.twitter.com/mDw13DhRM4— Johns. (@CricCrazyJohns) December 5, 2024ఈ మ్యాచ్‌లో భువీతో పాటు నితీశ్ రాణా (4-0-19-2), మొహిసిన్ ఖాన్ (2.5-0-38-2), వినీత్ పన్వార్ (4-0-39-1), విప్రాజ్ నిగమ్ (2-0-18-1), శివమ్ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్‌పై ఉత్తర్ ప్రదేశ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియమ్ గార్గ్ 31, సమీర్ రిజ్వి 24, నితీశ్ రాణా 16, శివమ్ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్ తివారి 2, వికాస్ కుమార్, వికాశ్ సింగ్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ (44 బంతుల్లో 91) జార్ఖండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. విరాట్ సింగ్ (23), రాబిన్ మింజ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు.ఆర్సీబీలో చేరిన భువీఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. -
జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ ప్లేయర్
ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బేతెల్ జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ కాంట్రాక్ట్‌లో ఉన్న బేతెల్.. తాజాగా ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్ జాబితాలో జో రూట్,జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తాజాగా బేతెల్ వీరి సరసన చేరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పేస్ త్రయం జోఫ్రా ఆర్చర్, మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తమ కాంట్రాక్ట్‌ను 2026 వరకు పొడిగించుకున్నారు. దీంతో ఈ ముగ్గురు కూడా రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేరిపోయారు.కాగా, 21 ఏళ్ల బేతెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బేతెల్ టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. బేతెల్ మూడు ఫార్మాట్లకు తగ్గ ప్లేయర్. అందుకే అతనికి రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. బేతెల్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్‌తో తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 8 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. -
IPL 2025: ఆ యువ ఆటగాడి విషయంలో సీఎస్కే తప్పు చేసిందా..?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే పేరు క్రికెట్ సర్కిల్స్‌లో బాగా నానింది. మాత్రే టాలెంట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ముగ్దుడయ్యాడని బాగా ప్రచారం జరిగింది. మెగా వేలానికి ముందు సీఎస్కే మాత్రేను ట్రయిల్స్‌కు కూడా పిలిచిందని సోషల్‌మీడియా కోడై కూసింది. అయితే చివరకు మాత్రేను మెగా వేలంలో సీఎస్కే కాని మరే ఇతర ఫ్రాంచైజీ కాని పట్టించుకోలేదు. ఈ 17 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు.ఇదంతా సరే, ఇప్పుడు మాత్రే ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా..? సీఎస్కే ఆశ చూపించి పట్టించుకోకుండా వదిలిపెట్టిన మాత్రే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో మాత్రే ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసి 3 వికెట్లు తీశాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మాత్రే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (67 నాటౌట్; 1/19) ఇరగదీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మాత్రే తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఇతన్ని ఎందుకు వదులుకున్నామా అని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుండవచ్చు. మాత్రే వద్ద బంతిని బలంగా బాదే సామర్థ్యం ఉండటంతో పాటు మాంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. ఇతను సీఎస్కేలో ఉంటే ఓపెనర్‌గా అద్భుతాలు చేసే ఆస్కారం ఉండేది. ఏది ఏమైనా సీఎస్కే మాత్రేను దక్కించుకోలేకపోవడం అన్ లక్కీనే అని చెప్పాలి. మరోవైపు మాత్రే సహచరుడు, ఓపెనింగ్ పార్ట్నర్ వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సూర్యవంశీని ఆర్ఆర్ 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా (13) సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మాత్రేలానే సూర్యవంశీ కూడా మంచి హిట్టర్. ఇంకా చెప్పాలంటే మాత్రే కంటే బలమైన హిట్టర్. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ మాత్రేతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేస్తాడు. -
హ్యాట్రిక్ తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. డకౌటైన పాండ్యా బ్రదర్స్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్ ఈ ఘనత సాధించాడు. గోపాల్ సాధించిన హ్యాట్రిక్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వికెట్లు ఉన్నాయి. పాండ్యా సోదరులను గోపాల్ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్.. హార్దిక్, కృనాల్ వికెట్లతో పాటు శాశ్వత్ రావత్ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓటమిపాలైంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్ రవిచంద్రన్ (38), కృష్ణణ్ శ్రీజిత్ (22), శ్రేయస్ గోపాల్ (18), మనీశ్ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, అతీత్ సేథ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్ మేరీవాలా, ఆకాశ్ మహారాజ్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్ గోపాల్ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్), అతీత్ సేథ్ (6 నాటౌట్) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్‌లో శాశ్వత్ రావత్ (63), భాను పూనియా (42) రాణించారు.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ గోపాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్‌కు ఐపీఎల్‌లోనూ హ్యాట్రిక్ తీసిన ఘనత ఉంది. -
IPL 2025: పంత్ ఒక్కడే కాదు.. ఆ ముగ్గురూ కెప్టెన్ ఆప్షన్లు: సంజీవ్ గోయెంకా
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు?!.. ఇంకెవరు రిషభ్ పంత్ అంటారా?!.. ఆగండాగండి.. ఇప్పుడే అలా డిసైడ్ చేసేయకండి.. ఈ మాట అంటున్నది స్వయానా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా. తమ జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రూ. 27 కోట్లకు కొనుగోలుకాగా మెగా వేలానికి ముందు లక్నో.. వెస్టిండీస్ స్టార్ నికోలసన్ పూరన్ కోసం ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చుచేసిన విషయం తెలిసిందే. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది. అయితే, వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో పంత్ ధర రూ. 20 కోట్లకు చేరగా.. లక్నో ఒక్కసారిగా ఏడు కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్‌గా పంత్ నియామకం లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషభేనా లేదంటే మాకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అని చోప్రా ప్రశ్నించాడు.నలుగురు ఉన్నారుఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నా వరకైతే సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే, మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తాం. మా జట్టులో రిషభ్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్ష్ రూపంలో నలుగురు నాయకులు అందుబాటులో ఉన్నారు’’ అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి.. నికోలస్ పూరన్‌కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.వారే డిసైడ్ చేస్తారుఇక పంత్ ఓపెనర్‌గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయెంకా సమాధానమిస్తూ.. ‘‘మా మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్(గుజరాత్ రూ, 15.75 కోట్లు) కోసం ప్రయత్నించాం. కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్ జోడీపై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, మా కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు.కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంఛైజీకి మూడు సీజన్లపాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. అయితే, ఈ ఏడాది మాత్రం టాప్-4లో నిలపలేకపోయాడు. ఈ క్రమంలో రిటెన్షన్‌కు ముందు లక్నో రాహుల్‌ను వదిలేయగా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుక్కుంది.చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! -
'23 ఏళ్లకే రూ. 40 కోట్లు సంపాదన.. అదే అతడి కెరీర్‌ను దెబ్బతీసింది'
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసేకునేందుకు ఆసక్తి చూపలేదు.వీటికి తోడు ఈ ముంబై ఆటగాడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ క్రమంలోనే 25 ఏళ్ల పృథ్వీషా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన షా.. తొలిసారి ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.రంజీ జట్టులో కూడా అతడి చోటు ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షాను ఉద్దేశించి ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ హెడ్ కోచ్ ప్రవీణ్ అమ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు. చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చని అమ్రే అభిప్రాయపడ్డాడు."పృథ్వీ షా లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడు చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంటుండటం బాధ కలిగిస్తోంది. ఇప్పటికీ అతడికి ఐపీఎల్లో 30 బంతుల్లో ఫిఫ్టీ కొట్టే సత్తా ఉంది. బహుశా చిన్న వయస్సులోనే తనకు వచ్చిన కీర్తీ, డబ్బును సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చు.భారత క్రికెట్లో అతడి జీవితం ఒక కేస్ స్టడీగా ఉపయోగపడవచ్చు. ప్రతిభ ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లదు. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావం ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలము. అతడికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదు. మూడేళ్ల క్రితమే పృథ్వీకి వినోద్ కాంబ్లీ కోసం ఉదాహరణగా చెప్పాను. కాంబ్లీ పతనాన్ని నేను దగ్గరి నుంచి చూశాను. ఈ తరం కుర్రాళ్లకు కొన్ని విషయాలు నేర్పించడం సులువు కాదు. అతడు 23 ఏళ్ల వయస్సులోనే సుమారుగా రూ. 30-40 కోట్లు సంపాదించి ఉండవచ్చు. ఐఐఎమ్ గ్రాడ్యుయేట్ కూడా అంత సంపాదించరేమో!.అందుకు అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ధన్యవాదాలు తెలపాలి. అయితే చిన్నవయస్సులో అంత మొత్తం సంపాందించినప్పుడు, కచ్చితంగా దృష్టి మళ్లే అవకాశముంటుంది. అతడు ఈ ఐపీఎల్ వేలాన్ని సానుకూలంగా తీసుకుంటాడని ఆశిస్తున్నాను.ఇది అతడికి ఒక కనువిప్పు లాంటిది. షాకు ఇంకా చాలా వయస్సు ఉంది. అతడికి ప్రస్తుతం కేవలం 25 ఏళ్ల మాత్రమే అని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా పేర్కొన్నాడు.చదవండి: ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్ -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ..కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. -
సంపాదనలో టాప్.. విరాట్ కోహ్లిని దాటేసిన రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలం భారత క్రికెటర్లను ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులగా మార్చేసింది. ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఈ క్యాష్‌రిచ్ మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.ఈ వేలంలో రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. పంత్ తర్వాత అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు), వెంకటేష్ అయ్యర్(రూ.23.75) నిలిచారు. మరోవైపు రిటెన్షన్ జాబితాలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది.కోహ్లిని దాటేసిన పంత్.. అయితే ఆటగాళ్ల ఐపీఎల్ జీతాలు ఖారారు కావడంతో రిషబ్ పంత్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ ఒప్పందాల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని పంత్ అధిగమించాడు. ఇండియన్ ప్లేయర్లకు బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల ద్వారా వార్షిక అదాయం లభిస్తోంది. పంత్ క్రికెట్ కమిట్మెంట్లతో ఇప్పుడు ఏడాదికి రూ. 32 కోట్లు అందుకోన్నాడు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ కేటగిరీలో ఉన్నాడు.బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రిషబ్ ఏడాదికి రూ. 5 కోట్లు అందుకుంటున్నాడు. అదేవిధంగా ఈ ఏడాది నుంచి అతడికి ఐపీఎల్ కాంట్రక్ట్ ద్వారా రూ.27 కోట్లు లభించనున్నాయి. మొత్తంగా ఏడాదికి రూ. 32 కోట్లను ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందుకోనున్నాడు.మరోవైపు విరాట్ కోహ్లి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ వల్ల కోహ్లికి ఏడాదికి రూ. 7 కోట్లు అందుతున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ రిటెన్షన్తోతో కోహ్లికి రూ. 21 కోట్లు అందనున్నాయి. మొత్తంగా కోహ్లి ఏడాదికి రూ.28 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే పంత్ కంటే రూ. 4 కోట్లు కోహ్లి వెనకబడి ఉన్నాడు.చదవండి: -
వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. ఆ కసి అక్కడ చూపించేశాడు!
అబుదాబి టీ20 లీగ్-2024లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిస్టో విధ్వంసం సృష్టించాడు. ఈ ధానాధన్ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం వహిస్తున్న బెయిర్ స్టో.. శుక్రవారం మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ఊచకోత కోశాడు. కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో టీమ్ అబుదాబి కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. అబుదాబి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. చివరి నాలుగు బంతుల్లో జానీ నాన్‌స్ట్రైక్‌లో ఉండకపోవడంతో అబుదాబి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ అబుదాబి .. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9.4 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది.వేలంలో అమ్ముడుపోని జానీ..ఇక మ్యాచ్‌లో దుమ్ము లేపిన జానీ బెయిర్ స్టో.. ఐపీఎల్-2025 వేలంలో మాత్రం అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌లకు బెయిర్‌స్టో ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే!
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆక్షన్‌లో ఫ్రాంఛైజీలు తాము కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్లో టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తరువాయి. సారథులు వీరేనా?అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తదితర జట్లు రిటెన్షన్‌కు ముందే తమ కెప్టెన్లను వదిలేశాయి. ఈ క్రమంలో... వేలం ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథుల నియామకంపై విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, లక్నోకు రిషభ్ పంత్, కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్సీబీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా?ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. కెప్టెన్సీ అనుభవం ఉన్న రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్‌లలో ఒకరికి సారథ్య బాధ్యతలు ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇంగ్లండ్ స్టార్లు సాల్ట్, లివింగ్‌స్టోన్‌లకు ది హండ్రెడ్, ఇంగ్లండ్ లిస్ట్-ఎ టోర్నీల్లో నాయకులుగా వ్యవహరించారు.మరోవైపు.. భారత క్రికెటర్లలో రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉండగా.. భువీ ఉత్తరప్రదేశ్ సారథిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై సౌతాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ అతడే!‘‘ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో ఖరారు కాలేదు. అయితే, కోహ్లినే తిరిగి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్న జట్టును బట్టి చూస్తే ఇదే జరుగుతుందని అనిపిస్తోంది’’ అని ఏబీడీ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది.ఫామ్‌లో ఉంటే అతడిని ఎవరూ ఆపలేరుఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం గురించి డివిలియర్స్ ప్రస్తావిస్తూ.. ‘‘భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ జట్టులోకి రావడం సానుకూలాంశం. రబడ లేడు.. గానీ.. లుంగి ఎంగిడిని దక్కించుకోగలిగారు. స్లో బాల్‌తో అతడు అద్భుతాలు చేయగలడు. ఒకవేళ ఎంగిడి ఫిట్‌గా ఉండి ఫామ్ కొనసాగిస్తే అతడిని ఎవరూ ఆపలేరు’’ అని పేర్కొన్నాడు. కాగా వచ్చే మార్చి 14- మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, నువాన్ తుషార 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. 2024 సీజన్లో ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం. ఐపీఎల్ 2025 వేలంలో సెకెండ్ హైయ్యెస్ట్ పేమెంట్ శ్రేయస్ అయ్యర్‌కు దక్కింది. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు దక్కింది. వెంకటేశ్‌ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. -
వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా వెటరన్ పేసర్ సిద్దార్థ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిద్దార్డ్ కౌల్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అమ్ముడుపోని తర్వాత కౌల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కౌల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత క్రికెట్ తరపున ఆడేందుకు అవకాశమిచ్చిన బీసీసీఐకి, తను ప్రాతినిథ్యం వహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సిద్దార్ద్ ధన్యవాదాలు తెలిపాడు.ఐర్లాండ్‌పై అరంగేట్రం..కాగా పంజాబ్‌కు చెందిన సిద్దార్థ్ కౌల్ 2018లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో ఇంగ్లండ్‌పై వన్డే డెబ్యూ చేశాడు. కౌల్ చివరగా టీమిండియా తరపున 2019లో ఆడాడు. భారత్ తరపున మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన కౌల్.. 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబీ పేసర్.. 29.98 సగటుతో 58 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. -
'నేను చూసిన టాలెంటెడ్ ప్లేయర్లలో అతడొకడు.. మళ్లీ తిరిగి వస్తాడు'
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. క్రమశిక్షణరాహిత్యం,ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న పృథ్వీ షా.. ఇప్పుడు ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా కోల్పోయాడు.ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.తన కెరీర్ ఆరంభంలో జానియర్ సచిన్ టెండూల్కర్ పేరొందిన పృథ్వీ షాకు ఇప్పుడు కనీసం ఫ్రాంచైజీ క్రికెట్లో కూడా ఆడే ఛాన్స్ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే వేలంలో అమ్ముడుపోకపోవడంతో పృథ్వీ షాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మహ్మద్ కైఫ్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం పృథ్వీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాటింగ్ మాత్రం ఈ ముంబై ఆటగాడికి మద్దతుగా నిలిచాడు."ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలడం నిజంగా చాలా బాధాకరం. నా కోచింగ్ కెరీర్లో ఇప్పటివరకు నేను పనిచేసిన టాలెంటెడ్ క్రికెటర్లలో పృథ్వీ ఒకడు. కనీసం అతడు యాక్సిలరేటర్ రౌండ్‌లోనైనా అమ్ముడుపోతాడని నేను భావించాను. కానీ అది కూడా జరగలేదు.అయితే వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలినప్పటికీ అన్ని ఫ్రాంచైజీల కళ్లు అతడిపైనే ఉన్నాయి. అతడి నుంచి ఆటను ఎవరూ దూరంగా ఉంచలేరు. కచ్చితంగా పృథ్వీ మళ్లీ తిరిగివస్తాడని నేను భావిస్తున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.కాగా రికీ పాటింగ్తో పృథ్వీషాకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఆరేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కలిసి పనిచేశారు. ఐపీఎల్-2018 సీజన్ నుంచి ఈ ఏడాది సీజన్ వరకు ఢిల్లీ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ పనిచేయగా.. పృథ్వీ షా ఆటగాడిగా కొనసాగాడు.చదవండి: IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్ వైరల్ -
CSK లెజెండ్ సురేష్ రైనా ఫ్యామిలీ ఫొటోస్..మీరు ఒక్క లుక్ వేయండి
-
అందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాను: స్టోక్స్
క్రైస్ట్‌చర్చ్: జాతీయ జట్టు తరఫున సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని తాను కోరుకుంటున్నానని... ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాంటి ఇతర టోర్నీలకు దూరంగా ఉంటున్నానని ఇంగ్లండ్ టెస్టు కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకోకుండా స్టోక్స్ ముందే తప్పుకున్నాడు. గతంలో పుణే, చెన్నై, రాజస్తాన్ జట్ల తరఫున ఆడిన స్టోక్స్‌కు లీగ్‌లో మంచి విలువే పలికింది. అయితే ప్రస్తుత స్థితిలో ఇంగ్లండ్ జట్టు తరఫున కెరీర్‌ను పొడిగించుకోవడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అతను స్పష్టం చేశాడు. ఐపీఎల్ తాజా నిబంధన ప్రకారం 2026 వరకు కూడా అతని లీగ్‌లో ఆడే అవకాశం లేదు. ‘నా కెరీర్లో ఇప్పుడు చివరి దశకు చేరుకుంటున్నాననేది వాస్తవం. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడేందుకు నేను ప్రయత్నిస్తా. నా ఫిట్నెస్ను చూసుకోవడం కూడా చాలా కీలకం. ఈ దశలో ఎప్పుడు ఆడాలనే అంశంపై నా ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కెరీర్ పొడిగించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్వేరు చోట్ల వరుసగా క్రికెట్ సాగుతున్న ప్రస్తుత దశలో ఇంగ్లండ్ తరఫున ఎక్కువ కాలం ఆడాలనేది నా కోరిక. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నా’ అని స్టోక్స్ వెల్లడించాడు. సుదీర్ఘ మోకాలి గాయం నుంచి ఇటీవలే కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన స్టోక్స్‌కు అక్టోబర్ 2026 వరకు ఇంగ్లండ్ బోర్డు కాంట్రాక్ట్ ఉంది. నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టోక్స్‌కు వచ్చే ఏడాది స్వదేశంలో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆపై యాషెస్ సిరీస్ కీలకం కానున్నాయి. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు దూరంగా ఉంటున్న స్టోక్స్ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ వన్డేలు ఆడే అవకాశం ఉంది. -
'ఏమి తప్పుచేశానో అర్ధం కావడం లేదు.. చాలా బాధగా ఉంది'
టీమిండియా తరుపున అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాళ్లలో పృథ్వీ షా ఒకరు. తొలుత అతడి ఆట తీరును చూసి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. కానీ ఆ తర్వాత క్రమశిక్షణారాహిత్యం, ఫిట్నెస్ ఫామ్ లేమి కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు. క్రమంగా తన ఫిట్నెస్ను కూడా కోల్పోయిన పృథ్వీ షా ముంబై రంజీ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఈ ముంబై ప్లేయర్ కోల్పోయాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలోనూ పృథ్వీ షాను ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన షా.. అప్పటి నుంచి గత సీజన్ వరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.దీంతో పృథ్వీ షాను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రోల్స్‌పై పృథ్వీ షా మాట్లాడిన ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియా ఒకటి వైరలవుతోంది. తన కెరీర్ ఆసాంతం ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు షా చెప్పుకొచ్చాడు.ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ఫాలో కాకపోతే.. నన్ను మీరేలా ఎలా ట్రోల్ చేస్తారు? అంటే అతడి కళ్లన్నీ నా మీదే ఉన్నాయని ఆర్దం. ట్రోలింగ్ చేయడం మంచిది కాదు, కానీ అది అంత చెడ్డ విషయం కూడా కాదు. అయితే దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి వారిని టార్గెట్ చేయడం మంచిది కాదు. క్రికెటర్లతో పాటు ఇతర వ్యక్తులను ట్రోల్ చేయడం నేను చాలా సందర్బాల్లో చూశాను. నాపై చేస్తున్న ట్రోలింగ్లు, మీమ్‌లు అన్నీ చూస్తున్నాను. అటువంటి చూసి నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి.నేను బయట కన్పిస్తే చాలు ప్రాక్టీస్ చేయకుండా తిరుగుకుంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. నా పుట్టిన రోజున కూడా నేను బయటకు వెళ్లకూడదా? నేను ఏమి తప్పుచేశానో కూడా నాకే అర్ధం కావడం లేదు. కానీ మనం ఏమి చేసినా తప్పుబట్టేవాళ్లు ఉంటారని మాత్రం ఆర్ధం చేసుకున్నా అని ఆ వీడియోలో పృథ్వీ షా పేర్కొన్నాడు.చదవండి: ICC Rankings: సత్తాచాటిన జైశ్వాల్.. నెం1 ర్యాంక్‌కు ఒక్క అడుగు దూరంలో -
కేకేఆర్ ఆటగాడి విధ్వంసం.. ధనాధన్ వీరుల జట్టు ఓటమి
అబుదాబీ టీ10 లీగ్‌లో కేకేఆర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్ వీరులు టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (22), రిలీ రొస్సో (10), నికోలస్ పూరన్ (8), జోస్ బట్లర్ (30), మార్కస్ స్టోయినిస్ (0), డేవిడ్ వీస్ (29), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. నవాబ్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్ మిల్స్ 2, అఖిలేశ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్ 7, డేవిడ్ మలాన్ 6, ఓడియన్ స్మిత్ 8 పరుగులు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, స్టోయినిస్, ఇబ్రార్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుత ఎడిషన్‌లో నవాబ్స్కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్‌కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ గుర్బాజ్‌ను 2 కోట్ల బేస్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. -
కేకేఆర్ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అందమైన భార్య (ఫోటోలు)
-
'నిజంగా నేను ఆశ్చర్యపోయాను.. థాంక్యూ ముంబై ఇండియన్స్'
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా జరిగిన ఈ వేలంలో అన్క్యాప్డ్ న్యూజిలాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌ను కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ అందరిరని ఆశ్చర్యపరిచింది. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే వంటి కివీస్ స్టార్ క్రికెటర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిన చోట.. జాకబ్స్ అమ్ముడుపోవడంతో అందరూ విస్తుతపోయారు. 21 ఏళ్ల జాకబ్‌ను రూ.30 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ముంబై తనను దక్కించుకోవడాన్ని బెవాన్ జాకబ్స్ సైతం నమ్మలేకపోతున్నాడు."ఉదయం మేల్కొన్నవెంటనే వేలంలో నేను అమ్ముడుపోయానన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా నాకు ఇది చాలా పెద్ద అవకాశం. నన్ను కొనుగోలు చేసినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు.నాకు అక్కడ ఆడే అవకాశం లభిస్తే ఇంకా ఎక్కువగా సంతోషపడతాను. ముంబై ఇండియన్స్ వంటి అద్బుత ఫ్రాంచైజీలో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. అదేవిధంగా ప్రపంచంలోని అత్యుత్తమమైన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకబ్ పేర్కొన్నాడు.ఇప్పటివరకు ఆరు టీ20లు ఆడిన జాకబ్.. 33.50 సగటుతో 134 పరుగులు చేశాడు. సూపర్ స్మాష్ 2024-25 సీజన్‌పై జాకబ్ దృష్టిపెట్టాడు. సూపర్ స్మాష్ సీజన్‌ను ఐపీఎల్‌కు ముందు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని జాకబ్ భావిస్తున్నాడు.ఈ టోర్నీలో అతడు ఆక్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే డెవాల్డ్ బ్రెవిస్, క్రిష్మార్ సాంటోకీ వంటి విదేశీ ఆటగాళ్లు తమ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు'
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షాకు తీవ్ర నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి అడుగుపెట్టిన పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ముంబై ఓపెనర్.. అప్పటి నుంచి ఆ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. కానీ ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు షాను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని కనీసం వేరే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందని భావించారు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.అందుకు కారణాలు లేకపోలేవు. పృథ్వీ షా ప్రస్తుతం పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా అతడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ కారణాల చేతనే షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదని జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కనీస ధరకు కూడా వేలంలో అమ్ముడుపోనుందన పృథ్వీ సిగ్గుపడాలంటూ కైఫ్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.పృథ్వీ సిగ్గు పడాలి: కైఫ్"ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పృథ్వీ షాకు చాలా సపోర్ట్ చేసింది. అతడు పవర్ ప్లేలో అద్బుతంగా ఆడుతాడని, ఒకే ఓవర్లో 6 బౌండరీలు కొట్టగలిగే సత్తా ఉందని ఢిల్లీ నమ్మింది. కొన్ని సీజన్లలో ఢిల్లీ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.ఢిల్లీ ఫ్రాంచైజీ ఆశించినట్టే ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టి చూపించాడు. అతడికి చాలా అతడు బాగా ఆడితేనే మేము గెలుస్తామని భావించేవాళ్లం. కాబట్టి అతడికి ప్రతీ మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చాము. కొన్ని సార్లు వరుసగా విఫలమైనా కూడా మేము సపోర్ట్ చేస్తూనే వచ్చాం. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి అతడికి జట్టులో అవకాశమివ్వకూడదని చాలా సందర్భాల్లో నిర్ణయించుకున్నాం.కానీ ఆ తర్వాత మ్యాచ్ రోజున మా మా నిర్ణయాన్ని మార్చుకుని అతడికి ఛాన్స్ ఇచ్చేవాళ్లం. ఎందుకంటే అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడితే గెలుస్తామన్న నమ్మకం మాకు ఉండేది. కానీ అతడు మాత్రం తనకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు.దీంతో అతడిని ఢిల్లీ కూడా విడిచిపెట్టింది. కనీస ధర 75 లక్షలతో వేలంలోకి వచ్చిన అతడు అమ్ముడుపోకపోవడం నిజంగా సిగ్గుచేటు. పృథ్వీ షా తిరిగి వెనక్కి వెళ్లి బేసిక్స్ నేర్చుకోవాలి అంటూ జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!? -
వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!?
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ఈ మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా కెప్టెన్లు రిటైన్ చేసుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశముండగా.. పంజాబ్ కింగ్స్ సారథిగా శ్రేయస్ అయ్యర్ ఎంపిక కావడం దాదాపు ఖారారైంది. అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ కేకేఆర్, ఆర్సీబీ పరిస్థితులు వేరు. తొలుత ఆర్సీబీ రాహుల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని అంత భావించారు. మరోవైపు కేకేఆర్ రిషబ్ పంత్‌పై కన్నేసిందని వార్తలు వినిపించాయి. కానీ వేలంలో ఈ రెండూ జరగలేదు. దీంతో ఈ రెండు ఫ్రాంచైజీల కెప్టెన్లగా ఎవరు ఎంపిక అవుతారని అభిమానుల ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కేకేఆర్ కెప్టెన్‌గా రహానే..!అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వెటరన్ అజింక్య రహానే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు పగ్గాలను రహానే అప్పగించాలని కేకేఆర్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వేలంలో ఆఖరి నిమిషంలో అజింక్య రహానేను కోల్‌కతా కొనుగోలు చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి రోజు వేలంలోకి వచ్చిన రహానేను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ రెండో రోజు వేలంలో ఆఖరి రౌండ్లో కనీస ధర రూ.1.75 కోట్లకు నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. కాగా కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ వంటి ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిద్దరూ గత కొన్ని సీజన్లగా కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటకి కేకేఆర్ ఫ్రాంచైజీ మాత్రం రహానే వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరి తిరిగి కేకేఆర్ సొంతం చేసుకుంది.దీంతో అతడికే కేకేఆర్ తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అతడి కెప్టెన్‌గా అనువభవం లేనుందన కేవలం ఆల్‌రౌండర్‌గానే కొనసాగనున్నట్లు సమాచారం. కాగా రహానే గతంలో కేకేఆర్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్ -
IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, పృథ్వీ షా, ఆదిల్ రషీద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సికందర్ రజా లాంటి చాలా మంది స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. విదేశీ ప్లేయర్ల కోటా(తుదిజట్టు)కు సంబంధించిన నిబంధనలను కాసేపు పక్కన పెడితే.. అన్ సోల్డ్ ప్లేయర్లతో ఓ పటిష్టమైన జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.ఈ జట్టుకు ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఉంటారు. వీరిద్దరు గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కలిసి ఆడారు. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అయినా ఈసారి ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు. వయసు పైబడటం, పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు.పృథ్వీ షా విషయానికొస్తే.. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 147.5 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు చేశాడు. అయితే షా గత కొన్ని సీజన్లుగా పెద్దగా పెర్ఫార్మ్ చేయడం లేదు. అందుకే అతన్ని ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. పైగా షా ఓవర్ వెయిట్ అయ్యాడు. అతనిపై ఫ్రాంచైజీలు అనాసక్తి చూపడానికి ఇదీ ఒక కారణం అయ్యి ఉండవచ్చు.వన్‌డౌన్ విషయానికొస్తే.. ఈ స్థానంలో విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్‌ను ఆడిస్తే బాగుంటుంది. మేయర్స్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. మేయర్స్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడానికి పెద్ద కారణాలేమీ లేవు. నాలుగో స్థానం విషయానికొస్తే.. ఈ స్థానంలో స్టీవ్ స్మిత్ ఆడితే బాగుంటుంది. స్టీవ్‌కు పొట్టి ఫార్మాట్లో సరైన ట్రాక్ రికార్డు లేకపోవడం వల్ల అతను అమ్ముడుపోలేదు.ఐదో స్థానంలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వస్తే బాగుటుంది. బెయిర్‌స్టో ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్‌లో లేకపోవడం వల్ల అతన్ని ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. ఆరో స్థానంలో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆడితే బాగుంటుంది. ఏడో స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్.. ఎనిమిదో స్థానంలో విండీస్ ఆటగాడు అకీల్ హొసేన్ బరిలోకి దిగితే బాగుంటుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఆదిల్ రషీద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. స్పెషలిస్ట్ పేసర్లుగా ఉమేశ్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బరిలోకి దిగితే ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లతో పటిష్టమైన జట్టు రూపుదిద్దుకుంటుంది.ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లతో జట్టు..డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, కైల్ మేయర్స్, స్టీవ్ స్మిత్, డెవాల్డ్ బ్రెవిస్, సికందర్ రజా, అకీల్ హొసేన్, ఆదిల్ రషీద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఉమేశ్ యాదవ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు.. మరుసటి రోజే..!
ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ ఈ మధ్యకాలంలో వరుసగా లక్కీ ఛాన్స్‌లు కొట్టేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీ20, వన్డే అరంగేట్రం చేసిన బేతెల్.. నిన్ననే (నవంబర్ 25) ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో బేతెల్‌ను ఆర్సీబీ 2.6 కోట్లకు సొంతం చేసుకున్నాడు. తాజాగా బేతెల్ మరో లక్కీ ఛాన్స్ కొట్టాడు. బేతెల్‌కు ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ నెల 28 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. వరుస అవకాశాల నేపథ్యంలో బేతెల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 21 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన బేతెల్‌కు దేశవాలీ క్రికెట్లో పెద్దగా ట్రాక్ రికార్డు లేనప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి. బేతెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వార్విక్షైర్ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 25.44 సగటున 738 పరుగులు చేశాడు. 7 వికెట్లు తీశాడు. ఇటీవల జరిగిన హండ్రెడ్ లీగ్‌లో బేతెల్ బర్మింగ్హమ్ ఫీనిక్స్ తరఫున 7 మ్యాచ్‌లు ఆడి 165 పరుగులు చేశాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున 8 వన్డేలు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 167 పరుగులు చేశాడు. 7 టీ20ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 173 పరుగులు చేశాడు. వన్డేల్లో బేతెల్ నాలుగు వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ జట్టు ప్రకటనఈ నెల 28 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (నవంబర్ 26) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో బేతెల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనుండగా.. రెగ్యులర్‌గా ఆ స్థానంలో బ్యాటింగ్ చేసే ఓలీ పోప్ ఆరో స్థానానికి డిమోట్ అయ్యాడు. వికెట్‌కీపర్ జోర్డన్ కాక్స్ గాయపడటంతో పోప్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ రానుండగా.. బేతెల్ మూడో స్థానంలో, జో రూట్ నాలుగులో, హ్యారీ బ్రూక్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నారు. అనంతరం ఆరో స్థానంలో ఓలీ పోప్, ఆతర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ బరిలోకి దిగనున్నారు.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లను, స్పిన్నర్‌ను బరిలోకి దించనుంది. పేసర్లుగా క్రిస్ వోక్స్, గస్ట్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ బరిలోకి దిగనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ ఎంపికయ్యాడు.న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్ (WK), బెన్ స్టోక్స్ (C), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ -
IPL 2025 Teams: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం
-
ఆర్సీబీ బ్యాటర్ ఊచకోత
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో అజేయమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్‌స్టోన్ ఊచకోత కారణంగా బంగ్లా టైగర్స్.. ఢిల్లీ బుల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నిఖిల్ చౌదరీ 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిత్ (1), టామ్ బాంటన్ (8), టిమ్ డేవిడ్ (1), ఫేబియన్ అలెన్ (6) విఫలం కాగా.. జేమ్స్ విన్స్ (27), రోవ్‌మన్ పావెల్ (17), షాదాబ్ ఖాన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్.. లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించడంతో 9.4 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. లివింగ్‌స్టోన్‌తో పాటు దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అబుదాబీ టీ10 లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది తొలి విజయం. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కాగా, నిన్న (నవంబర్ 25) ముగిసిన ఐపీఎల్ వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ 8.75 కోట్లకు సొంతం చేసుకుంది.