శ్రేయ‌స్ న‌న్ను చెంపదెబ్బ కొట్టాల్సింది: పంజాబ్‌ స్టార్‌ ప్లేయర్‌ | Iyer should have slapped me: Shashank Singh | Sakshi
Sakshi News home page

శ్రేయ‌స్ న‌న్ను చెంపదెబ్బ కొట్టాల్సింది: పంజాబ్‌ స్టార్‌ ప్లేయర్‌

Jun 8 2025 1:46 PM | Updated on Jun 8 2025 1:58 PM

Iyer should have slapped me: Shashank Singh

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025 సీజ‌న్ క్వాలిఫయర్‌-2లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు శ‌శాంక్ సింగ్‌పై సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. కీల‌క స‌మ‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి ర‌నౌట్ కావ‌డంతో శ‌శాంక్‌పై అయ్య‌ర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

మ్యాచ్ అనంత‌రం శ‌శాంక్ షేక్ హ్యాండ్ వ‌చ్చిన కూడా అయ్య‌ర్ ప‌ట్టించుకోలేదు. తాజాగా ఈ విష‌యపై శ‌శాంక్ సింగ్ స్పందించాడు.  ఆ మ్యాచ్‌లో త‌ను ఘోర త‌ప్పిదం చేశానని అత‌డు అంగీక‌రించాడు. అంతేకాకుండా ఆ స‌మ‌యంలో అయ్య‌ర్ త‌నను చెంప దెబ్బ కొట్టిండాల్సిందని శశాంక్ అభిప్రాయపడ్డాడు.

"నిర్లక్ష్యంగా పరిగెత్తి నేను తప్పు చేశాను. అయ్యర్‌ నన్ను చెంపదెబ్బ కొట్టి ఉండాల్సింది. మా నాన్న కూడా నాపై సీరియస్ అయ్యారు. ఫైనల్ వరకు నాతో మాట్లాడలేదు. నేను చాలా  క్యాజువల్‌గా పరిగెత్తాను. ఏదో బీచ్‌లో నడుస్తున్నట్లు పరుగుకు వెళ్లాను.

ఇది చాలా కీలకమైన సమయం, ఇది అస్సలు నీ నుంచి ఊహించలేదని అయ్యర్ నాతో అన్నాడు. అయితే గెలిచిన తర్వాత నన్ను అతడు డిన్నర్‌కు తీసుకువెళ్లాడని" తాజా ఇంటర్వ్యూలో శశాంక్ సింగ్ పేర్కొన్నాడు. కాగా 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన పంజాబ్ జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. తుది పోరులో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా పంజాబ్ నిలిచింది.


 

 

Advertisement
 
Advertisement
Advertisement