punjab kings
-
అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!
ఐపీఎల్-2025 మెగా వేలంలో రిషభ్ పంత్ భారీ ధర పలకడం ఖాయమని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ వికెట్ కీపర్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమని.. లీగ్ చరిత్రలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని అంచనా వేశాడు.రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడుపంజాబ్ కింగ్స్ పంత్‌ను సొంతం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించవచ్చన్న ఊతప్ప.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా పంత్ కోసం పోటీపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పంత్ వైపు మొగ్గుచూపుతాయని అంచనా వేసిన ఊతప్ప.. ఏదేమైనా ఈసారి అతడు వేలంలో రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడని జోస్యం చెప్పాడు.కాగా ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్.. కోలుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. సారథిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పంత్ కెప్టెన్సీ ఢిల్లీ ఈసారి పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ రిషభ్ పంత్‌ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ క్రీడా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భారత దిగ్గజం సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకునే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించాడు. ‘ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తిగా భిన్నమైంది. అది ఎలా సాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఊహించలేరు.కానీ నా అంచనా ప్రకారం పంత్‌ను ఢిల్లీ మళ్లీ తమ జట్టులోకి తీసుకోవచ్చు. ఆటగాళ్ల రిటెన్షన్ అనేది సదరు ప్లేయర్‌కు, ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారం. తాను ఆశించినంత ధర రాకపోతే ఆ ఆటగాడు... తాము చెల్లించే ధరకు ఆడకపోతే ఫ్రాంచైజీ నిర్ణయాలకు విభేదించే జట్లను వీడతారు. పంత్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నా. రిటెన్షన్ కుదరకపోయినా... పంత్‌లాంటి కెప్టెన్ అవసరం ఢిల్లీకే ఉంది. అతను లేకపోతే ఫ్రాంచైజీ కొత్త సారథి వేటలో పడాలి. నా అంచనా ప్రకారం ఢిల్లీ కచ్చితంగా పంత్‌ను తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డారు.అయితే, పంత్ మాత్రం గావస్కర్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఢిల్లీతో కొనసాగకపోవడానికి డబ్బు మాత్రం కారణం కానే కాదని పంత్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ మెగా వేలానికి అందుబాటులోకి రావడంతో ఫ్రాంచైజీలన్నీ అతడిపై కన్నేశాయి. రూ.24.75 కో ట్లతో రికార్డుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప సహా ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పంత్‌కు ఈసారి కళ్లు చెదిరే మొత్తం దక్కుతుందని.. పంజాబ్ కింగ్స్ పంత్‌ను దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో సీజన్ ఆరంభంలో నిరాశపరిచినా.. ఆ తర్వాత విజృంభించిన స్టార్క్.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయితే, మెగా వేలానికి ముందు కోల్‌కతా స్టార్క్‌తో పాటు తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను విడుదల చేసింది. ఇక పంత్‌తో పాటు అయ్యర్, కేఎల్ రాహుల్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో తమ పేరు నమోదు చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది. -
IPL 2025: మెగా వేలంలో అతడికి రూ. 30 కోట్లు!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్‌కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.వాళ్లకూ వికెట్ కీపర్ లేడుకేకేఆర్కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్‌ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్‌పై ఆసక్తి చూపవచ్చు.గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.ఈ ఏడాది రీ ఎంట్రీఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్‌గా రాణించాడు. వికెట్ కీపర్‌గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’ -
IPL 2025: భారీ మొత్తానికి డీల్.. ఆ జట్టుతోనే పంత్!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్‌గానూ రాణించాడు.పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్‌కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. దీంతో పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్‌తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరుఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్‌తో కలిసి పంజాబ్ కింగ్స్‌లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్‌బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
IPL 2025: పంజాబ్ కింగ్స్ రాత మారేనా!
అన్నట్లు’... మెరుగైన ప్లేయర్లు, అంతకుమించిన సహాయక సిబ్బంది, ప్రతి మ్యాచ్‌లో దగ్గరుండి ప్రోత్సహించే ఫ్రాంచైజీ యాజమాన్యం, అన్నీటికి మించి జట్టు ఎలాంటి ప్రదర్శన చేసినా వెన్నంటి నిలిచే అభిమాన గణం ఇలా అన్నీ ఉన్నా... పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. గత ఏడేళ్లుగా కనీసం టాప్–5లో కూడా నిలవలేకపోయింది. మరి ఇప్పుడు కొత్త హెడ్ కోచ్‌గా ఆ్రస్టేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రాకతోనైనా పంజాబ్ రాత మారుతుందా లేదా వేచి చూడాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్ ఒకటి. కొన్నేళ్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరుతో లీగ్‌లో ఆడింది. ఆ తర్వాత ఈ పేరును పంజాబ్ కింగ్స్‌గా మార్చుకుంది. అయితేనేం ఐపీఎల్ విన్నర్స్ ట్రోఫీ మాత్రం పంజాబ్ జట్టుకు అందని ద్రాక్షగానే ఉంది. క్రిస్ గేల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, షాన్ మార్‡్ష, డేవిడ్ మిల్లర్, మ్యాక్స్‌వెల్, శిఖర్ ధావన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ప్రాతినిధ్యం వహించినా... టామ్ మూడీ మొదలుకొని అనిల్ కుంబ్లే వరకు ఎందరో దిగ్గజాలు హెడ్ కోచ్‌లుగా పనిచేసినా పంజాబ్ రాత మాత్రం మారడంలేదు. చివరిసారిగా 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు... గత ఏడు సీజన్లలో కనీసం టాప్–5లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట ఓడి 10 పాయింట్లు మాత్రమే సాధించింది. గాయం కారణంగా ధావన్ కొన్ని మ్యాచ్‌లకే అందుబాటులో ఉండటం... భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్ పేస్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం పంజాబ్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఇలాంటి దశలో జట్టు ప్రక్షాళన చేపట్టిన పంజాబ్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. తన ముద్ర వేస్తాడా? గత పదేళ్లలో తరచూ ప్లేయర్లను మార్చడం... కెప్టెన్లను మార్చడం... కోచ్‌లను మార్చడం ఇలాంటి వాటితోనే వార్తల్లో నిలుస్తున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఆటగాడిగా, శిక్షకుడిగా అపార అనుభవం ఉన్న పాంటింగ్ మార్గనిర్దేశకత్వంలో పంజాబ్ ప్రదర్శన మారుతుందని యాజమాన్యం ధీమాగా ఉంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆటగాడిగా, కోచ్‌గా కొనసాగుతున్న రికీ పాంటింగ్... గత ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రతిభను గుర్తించి సానబెట్టడం, యువ ఆటగాళ్లకు అండగా నిలవడంలో తనదైన ముద్ర వేసిన పాంటింగ్... ఢిల్లీ జట్టును 2020 సీజన్లో ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్ వంటి స్టార్లతో కూడిన జట్టుకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న పాంటింగ్... పంజాబ్ జట్టును గాడిన పెడతాడని యాజమాన్యం బలంగా విశ్వసిస్తోంది. సుదీర్ఘ ప్రణాళికలో భాగంగానే పాంటింగ్‌ను నాలుగేళ్లకు కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ సీఈవో సతీశ్ మీనన్ పేర్కొన్నాడు. వారికి భిన్నంగా.. ఇప్పటి వరకు పంజాబ్ జట్టుకు టామ్ మూడీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, అనిల్ కుంబ్లే, ట్రెవర్ బేలిస్ కోచ్‌లుగా వ్యవహరించారు. వీరందరికీ భిన్నంగా పాంటింగ్ జట్టును నడిపిస్తాడని యాజమాన్యం ఆశిస్తోంది. అందుకు తగ్గట్లే పంజాబ్ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. ‘కొత్త సవాల్ స్వీకరించడం ఆనందంగా ఉంది. ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో ఏళ్లుగా జట్టుకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు... భిన్నమైన జట్టును చూపిస్తా’ అని పాంటింగ్ అన్నాడు. జట్టులో సమూల మార్పులు ఆశిస్తున్న పాంటింగ్... త్వరలోనే సహాయక బృందాన్ని ఎంపిక చేయనున్నాడు. ప్రస్తుతం బంగర్ పంజాబ్ ఫ్రాంచైజీ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్‌గా కొనసాగుతుండగా... లాంగ్‌వెల్ట్ ఫాస్ట్ బౌలింగ్, సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా ఉన్నారు. కోర్ గ్రూప్‌పై దృష్టి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ ఈ ఏడాది పంజాబ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అర్‡్షదీప్, జితేశ్ శర్మ, రబడ, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బెయిర్‌స్టో వంటి పలువురు నాణ్యమైన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వచ్చే ఐపీఎల్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టు కోవాలా లేదా అనే విషయంపై పాంటింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్... అదే తీవ్రతను చివరి వరకు కొనసాగించలేకపోయింది. ఈ సీజన్ ద్వారా పంజాబ్ జట్టుకు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు లభించినట్లైంది. తాజా సీజన్లో అతి క్లిష్ట పరిస్థితులను సైతం ఈ జోడీ సమర్థంగా ఎదుర్కొని భవిష్యత్తుపై భరోసా పెంచింది. ఇలాంటి వాళ్లను సానబెట్టడంలో సిద్ధహస్తుడైన పాంటింగ్ వేలం నుంచే తనదైన ముద్ర వేస్తాడనడంలో సందేహం లేదు. -
IPL 2025: కొత్త హెడ్‌కోచ్.. ప్రకటించిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ను తమ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌తో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల పాటు తమ జట్టుతో అతడు కొనసాగనున్నట్లు పేర్కొంది. అభిమానులకు ఇదే నా ప్రామిస్ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘హెడ్‌కోచ్‌గా నాకు అవకాశం ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. కొత్త సవాళ్లు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జట్టు యజమానులతో చర్చలు ఫలవంతంగా ముగిశాయి. టీమ్‌ను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. సుదీర్ఘకాలంగా జట్టుకు మద్దతుగా ఉన్న అభిమానులకు విజయంతో రుణం చెల్లించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇకపై సరికొత్త పంజాబ్ కింగ్స్‌ను చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా రిక్కీ పాంటింగ్ ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. 2018 నుంచి ఏడేళ్లపాటు ఢిల్లీ జట్టుకు సేవలు అందించాడు. ఢిల్లీతో తెగిన బంధం.. ఇకపై పంజాబ్‌తో ప్రయాణంఅయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా పాంటింగ్ మార్గదర్శనంలో ఢిల్లీకి పెద్దగా విజయాలు దక్కలేదు. అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్.. 2024 తర్వాత ఎట్టకేలకు పాంటింగ్‌తో బంధాన్ని తెంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ పాంటింగ్‌తో చర్చలు జరిపి తమ ప్రధాన కోచ్‌గా నియమించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. మరో ఆసీస్ మాజీ క్రికెటర్ ట్రెవర్ బైలిస్ స్థానాన్ని రిక్కీ పాంటింగ్‌తో భర్తీ చేసింది. కాగా ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదు గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగింట ఏడు గెలిచి ఆరో స్థానంలో నిలిచింది.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
‘రోహిత్ వేలంలోకి వస్తే.. మేమూ పోటీలో ఉంటాం’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకునేందుకు హిట్‌మ్యాన్ సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ గనుక వేలంలోకి వస్తే దక్కించుకునేందుకు మూడు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఫ్రాంఛైజీ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. కాగా ఐపీఎల్లో ఓ జట్టును అత్యధికసార్లు చాంపియన్‌గా నిలిపిన మొదటి కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు.ముంబై యాజమాన్యంతో విభేదాలు?ముంబై జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించి ఈ ఘనత సాధించాడు. అయితే, గతేడాది ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ ధరకు హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌గా నియమించింది.ఈ క్రమంలో ముంబై యాజమాన్యం- రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఇక మైదానంలో రోహిత్ పట్ల హార్దిక్ వ్యవహరించిన తీరు కూడా విమర్శలు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టును వీడేందుకు రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని ఐపీఎల్ వర్గాలు లీకులు ఇచ్చాయి. అతడు గనుక వేలంలోకి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడనున్నాయని వెల్లడించాయి.తగినంత డబ్బు ఉంటే కొనుక్కుంటాంఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు చెందిన సంజయ్ బంగర్ ఓ యూట్యూబ్ చానెల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ గనుక వేలంలోకి వస్తే మాత్రం.. అతడు భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయం. అయితే, మా పర్సులో ఎంత డబ్బు ఉందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. తమ దగ్గర తగినంత డబ్బు ఉంటే రోహిత్ శర్మను కచ్చితంగా సొంతం చేసుకుంటామని చెప్పకనే చెప్పాడు.సుదీర్ఘ అనుబంధంకాగా తొలుత దక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కు ఆడిన రోహిత్ శర్మ.. 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ తర్వాత రెండేళ్లకు రిక్కీ పాంటింగ్ స్థానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ ప్రయాణానికి హార్దిక్ రాకతో ఈ ఏడాది తెరపడింది. అయితే, ఇదే ఏడాది టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని రోహిత్ గెలవడం విశేషం. ఈ నేపథ్యంలో ముంబై అతడిని రిటైన్ చేసుకుంటుందా? ఒకవేళ ఆ ఆఫర్ ఇచ్చినా రోహిత్ శర్మ అందుకు సమ్మతిస్తాడా? అన్న సందేహాలకు వేలానికి ముందే సమాధానం దొరకనుంది. చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
పంజాబ్ కింగ్స్‌లో విభేదాలు.. కోర్టు మెట్లెక్కిన ప్రీతి జింటా?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఫాంచైజీలో ముసలం చోటు చేసుకుంది. ఆ జట్టు యజమానుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పారిశ్రామిక వేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా 48 శాతంతో బర్మన్ వాటాను కలిగి ఉన్నాడు. అదేవిధంగా ప్రీతీ జింటాకు 23 శాతం, నెస్ వాడియాకు 23 శాతం, మిగతా వాటా కరన్ పాల్ అనే వ్యాపారవేత్తకు ఉంది. అయితే అత్యధిక వాటా కలిగిన బర్మన్.. తన షేర్లను ఇతర భాగస్వాములకు తెలియకుండా అమ్మేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన వాటాలోని 11.5 శాతం కొత్త వ్యక్తికి విక్రయించేందుకు బర్మన్ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తన సహయాజమని అయిన బర్మన్ షేర్లను విక్రయించకుండా అడ్డుకోవాలని ప్రీతీ జింటా చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఈ కేసుపై ఆగస్టు 20న హైకోర్టులో విచారణ జరగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా అంతర్గత ఒప్పందాల ప్రకారం.. ఫ్రాంఛైజీలోని వాటాదారుల్లో ఎవరైన తమ షేర్‌ను విక్రయించాలని భావిస్తే తొలుత ఇతర యజమానులకు సమాచారం అందాల్సిందే. అయితే బర్మన్ ఈ ఒప్పందాన్ని ఇప్పుడు ఉల్లంఘించడంతో ప్రీతా జింటా కోర్టు మెట్లు ఎక్కినట్లు వినికిడి. కాగా ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ ప్రతినిథులు నుంచి మాత్రం ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వార్తలను మోహిత్ బర్మన్ మాత్రం కొట్టిపారేశాడు. "తన షేర్లను విక్రయించే ఆలోచన లేదు" అని క్రిక్‌బజ్‌తో బర్మన్ పేర్కొన్నాడు. -
పంజాబ్ కింగ్స్ ఓనర్‌తో షారుక్ ఖాన్ తీవ్ర వాగ్వాదం.. కారణమిదే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్లు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ప్రాంఛైలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని బుధవారం( జులై 31) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో ఆయా ప్రాంఛైజీల ఓనర్లు ప్రస్తావించారు. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా ముగ్గురు ఆన్ క్యాప్డడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఒకట్రెండు ఫ్రాంచైజీల ఓనర్ల మినహా దాదాపు అందరూ అంగీకరించినట్లు వినికిడి. అయితే ఇదే విషయంపై కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. షారుక్ ఖాన్ కచ్చితంగా రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పట్టు పట్టినట్లు సమాచారం. కానీ నెస్ వాడియా మాత్రం ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వీలు కల్పించవద్దని, మెగా వేలం వైపు మెగ్గు చూపినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్- నెస్ వాడియా మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రూల్ ప్రకారం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకునే అవకాశముంది. -
IPL 2025: మరో హెడ్ కోచ్‌పై వేటు..?
ఐపీఎల్ 2025 ప్రారంభానికి చాలా సమయం ఉండగానే అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొద్ది రోజుల కిందట ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు తప్పించగా.. తాజాగా మరో ఫ్రాంచైజీ తమ కోచ్‌పై వేటుకు రంగం సిద్దం చేసింది. ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవని పంజాబ్ కింగ్స్ తమ హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను తప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బేలిస్ స్థానంలో భారతీయ కోచ్‌ను నియమించుకోవాలని ఫ్రాంచైజీ పెద్దలు అనుకుంటున్నట్లు సమాచారం. కొత్త కోచ్ రేసులో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బాంగర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాంగర్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ప్రస్తుతం అతను అదే ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ డెవలెప్‌మెంట్‌గా వ్యవరిస్తున్నాడు.బేలిస్ విషయానికొస్తే.. ఇతనిపై పెద్దగా కంప్లెయింట్లు లేనప్పటికీ.. స్వదేశీ కోచ్ అనే నినాదం కారణంగా అతన్ని తప్పించాలని పంజాబ్ ఫ్రాంచైజీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన 61 ఏళ్లు బేలిస్ 2023 సీజన్‌కు ముందు పంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని ఆధ్వర్యంలో పంజాబ్ అశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. గత సీజన్‌ను ఆ జట్టు చివరి నుంచి రెండో స్థానంతో ముగించింది. 2023లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉండింది. ఆ సీజన్లో పంజాబ్ చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.కాగా, గౌతమ్ గంభీర్ (కేకేఆర్), ఆశిష్ నెహ్రా (గుజరాత్) హెడ్ కోచ్‌లుగా సక్సెస్ సాధించాక ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ స్వదేశీ కోచ్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో స్వదేశీ కోచ్‌లకు భారీ డిమాండ్ ఉంది. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లాంటి భారత మాజీల కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్లడంతో కేకేఆర్ హెడ్ కోచ్ పదవి కూడా ఖాళీ అయ్యింది. ఈ జట్టు కూడా మరో ఇండియన్ కోచ్‌తో గంభీర్ స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తుంది. మరోవైపు టీమిండియా మాజీ హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో రాజస్థాన్ రాయల్స్ డీల్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాబోయే సీజన్ కోసం ఆర్సీబీ దినేశ్ కార్తీక్‌కు తమ కోచింగ్ టీమ్‌లోకి తీసుకుంది. కోచింగ్ సిబ్బంది మార్పులు చేర్పుల అంశంపై ఈ ఏడాది చివర్లోగా క్లారిటీ వస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ సిబ్బందితో పాటు ఆటగాళ్ల మార్పు చేర్పులపై కూడా దృష్టి పెట్టాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు వచ్చే సీజన్లో ఫ్రాంచైజీ మారే అవకాశం ఉంది. -
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ ముగిసింది. ఈ ఏడాది సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా టీమిండియా స్టార్, ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి నిలవగా.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్‌ను అవార్డును సొంతం చేసుకున్న మూడో క్రికెటర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ జాబితాలో హర్షల్ పటేల్ భువనేశ్వర్ కుమార్, డ్వేన్ బ్రావో ఉన్నారు. భువనేశ్వర్ (2016, 2017), బ్రావో (2013, 2015) సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ అవార్డును గెలుచుకున్నారు. హర్షల్ పటేల్ అంతకుముందు 2021 సీజన్లో ఆర్సీబీ తరపున పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.అదే విధంగా మరో రికార్డును కూడా పటేల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లు తరపున పర్పుల్ క్యాప్ గెలిచిన తొలి ఆటగాడిగా హర్షల్ నిలిచాడు. -
SRH vs PBKS: రెండో స్థానంలో సన్ రైజర్స్
-
SRH Vs PBKS: విన్‌రైజర్స్...
సాక్షి, హైదరాబాద్: అద్భుత ప్రదర్శనలు, మెరుపు ఇన్నింగ్స్‌లతో సీజన్ ఆసాంతం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో విజయంతో లీగ్ దశను ముగించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్, రాజస్తాన్ 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్‌కు రెండో స్థానం ఖరారైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ పోరులో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), రిలీ రోసో (24 బంతుల్లో 49; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అథర్వ తైడే (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం సన్‌రైజర్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిõÙక్ శర్మ (28 బంతుల్లో 66; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (26 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (25 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... పంజాబ్ ఓపెనర్లు అథర్వ, ప్రభ్‌సిమ్రన్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు సాధించారు. ఎట్టకేలకు 10వ ఓవర్లో అథర్వను అవుట్ చేసిన నటరాజన్ ఈ జోడీని విడదీశాడు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు బ్యాటర్లు 55 బంతుల్లో 97 పరుగులు జోడించారు. ప్రభ్‌సిమ్రన్ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మూడో స్థానంలో వచ్చిన రోసో కూడా దూకుడు ప్రదర్శిస్తూ నితీశ్ కుమార్ రెడ్డి ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. ఆ తర్వాత పంజాబ్ తక్కువ వ్యవధిలో ప్రభ్‌సిమ్రన్, శశాంక్ సింగ్ (2), రోసో, అశుతోష్ శర్మ (2) వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో జితేశ్ శర్మ ధాటిగా ఆడటంతో పంజాబ్ స్కోరు 200 పరుగులు దాటింది. నితీశ్ వేసిన ఆఖరి ఓవర్లో జితేశ్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్ట డంతో 19 పరుగులు వచ్చాయి. హెడ్ విఫలం... ఛేదనలో రైజర్స్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. అర్‡్షదీప్ సింగ్ వేసిన చక్కటి బంతికి హెడ్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ తడబాటు లేకుండా విజయం దిశగా సాగింది. వరుసగా 72, 57, 47 పరుగుల భాగస్వామ్యాలు రైజర్స్ ఇన్నింగ్స్‌ను నడిపించాయి. ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు. రిషి ధావన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అభిషేక్ శర్మ...అర్‡్షదీప్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. హర్షల్ పటేల్ ఓవర్లో 22 పరుగులు రాబట్టిన రైజర్స్ 6 ఓవర్లలో 84 పరుగులు సాధించింది. 21 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అభిషేక్ అవుటయ్యాక అటు నితీశ్, ఇటు క్లాసెన్ జోరు ప్రదర్శించి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. అనంతరం వేగంగా మ్యాచ్‌ను ముగించే క్రమంలో రైజర్స్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (సి) సన్విర్ (బి) నటరాజన్ 46; ప్రభ్‌సిమ్రన్ (సి) క్లాసెన్ (బి) విజయకాంత్ 71; రోసో (సి) సమద్ (బి) కమిన్స్ 49; శశాంక్ (రనౌట్) 2; జితేశ్ (నాటౌట్) 32; అశుతోష్ (సి) సన్వీర్ (బి) నటరాజన్ 2; శివమ్ సింగ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–97, 2–151, 3–174, 4–181, 5–187. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–0, కమిన్స్ 4–0–36–1, నటరాజన్ 4–0–33–2, విజయకాంత్ 4–0–37–1 షహబాజ్ 1–0–13–0, నితీశ్ రెడ్డి 3–0–54–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) అర్‡్షదీప్ 0; అభిషేక్ (సి) శివమ్ (బి) శశాంక్ 66; రాహుల్ త్రిపాఠి (సి) అర్‡్షదీప్ (బి) హర్షల్ 33; నితీశ్ కుమార్ రెడ్డి (సి) శివమ్ (బి) హర్షల్ 37; క్లాసెన్ (బి) హర్‌ప్రీత్ 42; షహబాజ్ (సి) శశాంక్ (బి) అర్‡్షదీప్ 3; సమద్ (నాటౌట్) 11; సన్వీర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–0, 2–72, 3–129, 4–176, 5–197, 6–208. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–37–2, రిషి ధావన్ 3–0–35–0, హర్షల్ 4–0–49–2, చహర్ 4–0–43–0, హర్‌ప్రీత్ 3–0– 36–1, శశాంక్ 1–0–5–1, అథర్వ 0.1–0–4–0. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ మే 21: క్వాలిఫయర్–1కోల్‌కతా నైట్‌రైడర్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచిమే 22: ఎలిమినేటర్బెంగళూరు X రాజస్తాన్ రాయల్స్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7:30 నుంచి మే 24: క్వాలిఫయర్–2 క్వాలిఫయర్–1లో ఓడిన జట్టు X ఎలిమినేటర్ విజేత వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి మే 26: ఫైనల్ క్వాలిఫయర్–1 విజేత క్వాలిఫయర్–2 విజేత వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి -
SRH Vs PBKS: పంజాబ్‌పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్‌కు ఎస్ఆర్హెచ్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి సన్‌రైజర్స్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రూసో(49), అథర్వ తైదే(46), జితేష్ శర్మ(32) అదరగొట్టారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో టి నటరాజన్ రెండు వికెట్లు, కమ్మిన్స్, వియస్కాంత్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్..19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(66) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు హెన్రిచ్ క్లాసెన్(42), నితీష్ కుమార్ రెడ్డి(37), రాహుల్ త్రిపాఠి(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జితేష్ శర్మ..
ఐపీఎల్-2024 సీజన్లో తమ చివరి మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్కమ్రించిన పంజాబ్.. కనీసం తమ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజన్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు. పంజాబ్ తత్కాలిక కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కుర్రాన్ టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్దమయ్యేందుకు తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలోనే చివరి మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి జితేష్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. కాగా పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా సీజన్లో మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సామ్కుర్రాన్కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను పంజాబ్ అప్పగించింది. అయితే ఇప్పుడు సామ్ కుర్రాన్ కూడా స్వదేశానికి వెళ్లిపోవడంతో జితేష్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఐదింట విజయం సాధించింది. -
RR vs PBKS: రాజస్తాన్ ఇలా అయితే.. ఎలా?
-
PBKS Vs RR: మళ్లీ ఓడిన రాజస్తాన్
గువాహటి: పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండ్ ‘షో’ ధాటికి రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ఐపీఎల్ టోర్నీలో వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. కెప్టెన్ స్యామ్ కరన్ (2 వికెట్లు; 41 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. స్యామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. జితేశ్ శర్మ (20 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), అశుతోష్ శర్మ (11 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లతో స్యామ్ కరన్ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పరాగ్ నిలబడటంతో... ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన రాజస్తాన్ జట్టు బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. ఓపెనర్లు యశస్వి (3), కొహ్లెర్ (18), టాపార్డర్ బ్యాటర్ సామ్సన్ (18) వికెట్లు పారేసుకోవడంతో మెరుపులు కాదుకదా... పరుగుల్లో వేగమే కనిపించలేదు. పరాగ్, అశ్విన్ (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంత సేపు ఇన్నింగ్స్ మెరుగవుతుందనిపించింది. కానీ అశ్విన్ అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన ఐదుగురు బ్యాటర్లలో బౌల్ట్ (12) మినహా ఇంకెవరూ పది పరుగులైనా చేయలేదు. కెప్టెన్ ఇన్నింగ్స్ సులువైన లక్ష్యమే అయినా పంజాబ్ తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ (6)... అవేశ్ వేసిన ఐదో ఓవర్లో రోసో (13 బంతుల్లో 22; ఫోర్లు), శశాంక్ (0) అవుట్ కావడంతో 36 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. కాసేపటికే బెయిర్‌స్టో (14)ను చహల్ అవుట్ చేయడంతో రాజస్తాన్ సంబరాల్లో మునిగింది. 48/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్‌ను కెప్టెన్ స్యామ్ కరన్... జితేశ్ శర్మతో కలిసి ఆదుకున్నాడు. ఇద్దరు వికెట్‌ను కాపాడుకొని తర్వాత భారీషాట్లపై దృష్టి పెట్టారు. జట్టు స్కోరు 100 దాటాకా ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాక జితేశ్ ఆటను చహల్ ముగించాడు. ఈ దశలో స్యామ్ కరన్ పంజాబ్‌ను లక్ష్యంవైపు తీసుకెళ్లాడు. అశుతోష్‌తో కలిసి మరో వికెట్ పడకుండా 19వ ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) స్యామ్ కరన్ 4; టామ్ కోహ్లెర్ (సి) జితేశ్ (బి) చహర్ 18; సామ్సన్ (సి) చహర్ (బి) ఎలిస్ 18; పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 48; అశ్విన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 28; జురెల్ (సి) హర్‌ప్రీత్ (బి) స్యామ్ కరన్ 0; పావెల్ (సి అండ్ బి) చహర్ 4; ఫెరీరా (సి) రోసో (బి) హర్షల్ 7; బౌల్ట్ (రనౌట్) 12; అవేశ్ ఖాన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–42, 4–92, 5–97, 6–102, 7–125, 8–138, 9–144. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–24–2, అర్ష్ దీప్ 4–0–31–1, ఎలిస్ 4–0– 24–1, హర్షల్ 4–0–28–2, రాహుల్ చహర్ 4–0– 26–2, హర్‌ప్రీత్ 1–0–10–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి) చహల్ (బి) బౌల్ట్ 6; బెయిర్‌స్టో (సి) పరాగ్ (బి) చహల్ 14; రోసో (సి) యశస్వి (బి) అవేశ్ 22; శశాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 63; జితేశ్ (సి) పరాగ్ (బి) చహల్ 22; అశుతోష్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–6, 2–36, 3–36, 4–48, 5–111. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–1, సందీప్ 4–0–28–0, అవేశ్ ఖాన్ 3.5–0–28–2, అశ్విన్ 4–0–31–0, చహల్ 4–0–31–2. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X గుజరాత్ వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RR vs PBKS: పంజాబ్‌పై రాజస్తాన్ గెలిస్తే!
-
ఐపీఎల్ నుంచి స్వదేశానికి...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరగా... ఆయా జట్లకు కీలకమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు తిరుగుపయనమయ్యారు. జోస్ బట్లర్ (రాజస్తాన్), లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్, రీస్ టాప్లీ (బెంగళూరు)లు ఇంగ్లండ్‌కు బయలుదేరారు. వచ్చే నెల 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే టి20 ప్రపంచకప్‌కు తుది సన్నాహంగా సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్‌తో టి20 సిరీస్ ఆడనుంది.మే 22 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టి20ల సిరీస్ జరుగుతుంది. 22, 25, 28, 30 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా... ఈ ఐపీఎల్ సీజన్లో లివింగ్‌స్టోన్ ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రాజ స్టాన్ స్టార్ ఓపెనర్. ఈ సీజన్లో ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్‌ల్ని గెలిపించాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాక్స్, టాప్లీలలో జాక్స్ది కీలకపాత్ర. బెంగళూరు వరుస విజయాల్లో భాగమైన అతను లేకపోవడం జట్టుకు లోటే! చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు... చెన్నైతో ఈ నెల 18న తలపడుతుంది.ఇవి చదవండి: మళ్లీ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి?.. కొట్టిపారేయలేం! -
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్‌ను విమర్శించాడు.కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. ఇక పంజాబ్‌ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోచ్‌గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా -
కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్‌లోనూ అలా!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధావన్ కొడుకు జొరావర్‌కు కూడా దూరమయ్యాడు.జొరావర్ ప్రస్తుతం తన తల్లి దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంటున్న కారణంగా ధావన్ కనీసం అతడిని నేరుగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తలచుకుంటూ ధావన్ భావోద్వేగ పోస్టులు పెడుతూ ఉన్నాడు. మరోవైపు.. టీమిండియాలోనూ ధావన్‌కు చోటు కరువైంది.యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పోటీలో వెనుకబడ్డ ధావన్.. 2022లో ఆఖరిసారిగా బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు.ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత ఆసియా క్రీడలు- 2023 జట్టులో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహిస్తాడని విశ్లేషకులు భావించగా.. బీసీసీఐ మాత్రం మరోసారి ఈ ఢిల్లీ బ్యాటర్‌కు మొండిచేయి చూపింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతడి నేతృత్వంలో భారత్ స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే.. అసలే కొడుకుకు దూరమై.. టీమిండియాలో చోటు కరువైన శిఖర్ ధావన్‌కు ఐపీఎల్-2024లోనూ కష్టాలే ఎదురయ్యాయి.పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ తొలి ఐదు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండగలిగాడు. భుజం నొప్పి కారణంగా మిగతా మ్యాచ్‌లకు గబ్బర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ పంజాబ్‌ను ముందుకు నడిపించాడు.అయితే, ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉంటే.. గబ్బర్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘జీవితంలోని చిన్న సంతోషాలు ఇలా వీటితో కలిసి ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు.ఇది చూసిన గబ్బర్ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘పైకి నవ్వుతున్నా.. నీ మనసు లోతుల్లో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోగలం’’ అంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ధావన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి కామెంట్లు చేస్తున్నారు. -
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్‌ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024 -
కోహ్లి విజృంభణ.. పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపు
-
ఆర్సీబీ ఘన విజయం: కోహ్లి కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024 ఆరంభంలో కాస్త తడబడ్డా తిరిగి పుంజుకుని పరుగుల వరద పారిస్తున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే పెట్టుకున్నాడు.తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపిన ఈ ఆర్సీబీ ఓపెనర్ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో వింటేజ్ కోహ్లిని గుర్తుచేస్తూ 92 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగలిగాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024కోహ్లి స్ట్రైక్‌రేటుపై విమర్శలుఈ మ్యాచ్‌తో కలిపి ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి ఓ శతకం సాయంతో 634 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ రన్‌మెషీన్ స్ట్రైక్‌రేటు 153.51గా నమోదైంది.కాగా గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వార్థపూరిత ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు మేలు కంటే చేటే ఎక్కువ చేస్తున్నాడంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు.ఇందుకు కోహ్లి గట్టిగానే బదులివ్వగా.. సునిల్ గావస్కర్ వంటి వాళ్లు చూసిందే మాట్లాడుతున్నాం అంటూ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. లోపాలు సరిచేసుకుని ముందుకు ఎలా వెళ్లాలో నాకు తెలుసు. రోజురోజుకు ఆటను మెరుగుపరచుకోవడమే నా పని.స్పిన్నర్ల బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్ షాట్లు ఆడాను. నిజానికి నేను అలాంటివి గతంలో ప్రాక్టీస్ కూడా చేయలేదు. కానీ కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదని నాకు తెలుసు.స్ట్రైక్‌రేటు పెంచుకునే క్రమంలోనాకోసం, జట్టు ప్రయోజనాల కోసం స్ట్రైక్‌రేటు పెంచుకునే క్రమంలో ఇలాంటివి చేయాల్సిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ వరుస విజయాల పట్ల స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. మేము మొదటి అర్థ భాగంలో స్థాయికి తగ్గట్లు రాణించలేదు.అందుకే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు ఆత్మ గౌరవం కోసం ఆడాలని నిర్ణయించుకున్నాం. మా అభిమానులను గర్వపడేలా చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏడో స్థానానికి చేరుకోగలిగాం. మేము ఇదే పని కాస్త ముందు చేసి ఉంటే ఎంతో బాగుండేది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ నుంచి ఇప్పటికే ముంబై ఇండియన్స్ నిష్క్రమించగా.. ఆర్సీబీ చేతిలో గురువారం 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ కూడా ఆశలు కూడా గల్లంతయ్యాయి.చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024 -
RCB Vs PBKS Photos: చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
-
RCB Vs PBKS: బెంగళూరు జోరు...
ధర్మశాల: ఐపీఎల్లో ఆరు వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఎనిమిదో ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా పదో ఏడాది ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయింది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసి ఆర్సీబీ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రిలీ రోసో (27 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారీ భాగస్వామ్యాలు... కొత్త బౌలర్ కావేరప్ప తక్కువ వ్యవధిలో డుప్లెసిస్ (9), జాక్స్ (12)లను అవుట్ చేసి పంజాబ్‌కు తగిన ఆరంభం అందించాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి చెలరేగిపోగా, అతనికి పటిదార్ జత కలిశాక మరింత వేగంగా పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లో పటిదార్ 3 సిక్స్‌లు కొట్టాక జోరు పెరిగింది. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పటిదార్ వెనుదిరిగాడు. ఈ దశలో వర్షంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న కోహ్లి దూకుడు పెంచాడు. స్యామ్ కరన్ బౌలింగ్‌లో అతను కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లి, గ్రీన్ ఐదో వికెట్‌కు 46 బంతుల్లోనే 96 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. పంజాబ్ భారీ ఛేదనలో బెయిర్‌స్టో (27) కొంత ధాటిగా ఆడగా... రోసో ఇన్నింగ్స్ మాత్రమే కొద్దిసేపు ఆశలు రేపింది. అతను వెనుదిరిగిన తర్వాత శశాంక్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది.క్యాచ్‌లు వదిలేసి...పంజాబ్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వచ్చిన మంచి అవకాశాలను పంజాబ్ ఫీల్డర్లు వృథా చేశారు. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన కావేరప్ప మాత్రం తీవ్రంగా నిరాశ చెందాల్సి వచ్చింది. అతని బౌలింగ్‌లోనే కోహ్లి (0, 10 వద్ద) ఇచ్చిన క్యాచ్‌లను అశుతోష్, రోసో వదిలేయగా... పటిదార్ (0 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను హర్షల్ నేలపాలు చేశాడు. పటిదార్ 33 వద్ద ఉన్నప్పుడు చహర్ బౌలింగ్‌లో కొంత కష్టమైన క్యాచ్‌ను బెయిర్‌స్టో అందుకోలేకపోయాడు. ‘సున్నా’ వద్ద బతికిపోయిన కోహ్లి 92 వరకు చేరడం పంజాబ్‌ను అన్నింటికంటే బాగా దెబ్బ తీసింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రోసో (బి) అర్‡్షదీప్ 92; డుప్లెసిస్ (సి) శశాంక్ (బి) కావేరప్ప 9; జాక్స్ (సి) హర్షల్ (బి) కావేరప్ప 12; పటిదార్ (సి) బెయిర్‌స్టో (బి) స్యామ్ కరన్ 55; గ్రీన్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 46; దినేశ్ కార్తీక్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 18; లోమ్రోర్ (బి) హర్షల్ 0; స్వప్నిల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–19, 2–43, 3–119, 4–211, 5–238, 6–240, 7–241. బౌలింగ్: కావేరప్ప 4–0–36–2, అర్‡్షదీప్ 3–0–41–1, స్యామ్ కరన్ 3–0–50–1, హర్షల్ 4–0–38–3, రాహుల్ చహర్ 3–0–47–0, లివింగ్‌స్టోన్ 3–0–28–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 6; బెయిర్‌స్టో (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 27; రోసో (సి) జాక్స్ (బి) కరణ్ 61; శశాంక్ సింగ్ (రనౌట్) 37; జితేశ్ శర్మ (బి) కరణ్ 5; లివింగ్‌స్టోన్ (సి) కరణ్ (బి) స్వప్నిల్ 0; స్యామ్ కరన్ (బి) ఫెర్గూసన్ 22; అశుతోష్ శర్మ (ఎల్బీ) (బి) సిరాజ్ 8; హర్షల్ (సి) ఫెర్గూసన్ (బి) సిరాజ్ 0; చహర్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (సి) కరణ్ (బి) సిరాజ్ 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–6, 2–71, 3–107, 4–125, 5–126, 6–151, 7–164, 8–170, 9–174, 10–181. బౌలింగ్: స్వప్నిల్ 3–0–28–2, సిరాజ్ 4–0–43–3, యశ్ దయాళ్ 2–0–22–0, ఫెర్గూసన్ 3–0–29–2, జాక్స్ 1–0–5–0, గ్రీన్ 1–0–16–0, కరణ్ శర్మ 3–0–36–2.ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నై వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం