
PC: BCCI/IPL.com
Chennai Super Kings vs Punjab Kings Live Updates:
సీఎస్‌కే పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్‌తో పాటు అర్ష్‌దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..
అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్‌కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.
ప్రభ్‌సిమ్రాన్ ఫిప్టీ..
పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.
8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 102/1
8 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(28), శ్రేయస్ అయ్యర్(15) ఉన్నారు.
పంజాబ్ రెండో వికెట్ డౌన్..
ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఆర్య.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.
నిలకడగా ఆడుతున్న పంజాబ్..
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(15), ప్రభుసిమ్రాన్ సింగ్(8) ఉన్నారు.
చాహల్ హ్యాట్రిక్.. 190 పరుగులకు సీఎస్‌కే ఆలౌట్
చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. 19 ఓవర్ వేసిన చాహల్ నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్, ఆరో బంతికి నూర్ ఆహ్మద్ ఔటయ్యాడు.
దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ చేరింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్‌తో పాటు అర్ష్‌దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
పంజాబ్ ఐదో వికెట్ డౌన్..
సామ్ కుర్రాన్ రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 88 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన కుర్రాన్.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులో ధోని(5), శివమ్ దూబే(2) ఉన్నారు.
15 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 134/4
15 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 56 పరుగులతో కుర్రాన్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.
10 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 89/3
10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో బ్రెవిస్(20), సామ్ కుర్రాన్(29) ఉన్నారు.
సీఎస్‌కే మూడో వికెట్ డౌన్..
రవీంద్ర జడేజా రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన జడేజా.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.
సీఎస్‌కే రెండో వికెట్ డౌన్..
ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన మాత్రే.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో కుర్రాన్(8), రవీంద్ర జడేజా(5) ఉన్నారు.
సీఎస్‌కే తొలి వికెట్
షేక్ రషీద్ రూపంలో సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రషీద్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.
ఆచితూచి ఆడుతున్న సీఎస్‌కే..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(1), ఆయూష్ మాత్రే(6) ఉన్నారు.
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు గ్లెన్ మాక్స్‌వెల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో సూర్యాంష్ షెగ్దే పంజాబ్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ఎంఎస్ ధోని(కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంష్ షెగ్దే, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్