
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్‌లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.
👉ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
- తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందో
- సింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది
- ప్రభుత్వ నిర్లక్ష్యం చేతకాని తనంతో ప్రమాదం జరిగింది
- మూడు నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారు
- గోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు
- గోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారు
- కొండవాలులో కాంక్రీట్ వాల్ నిర్మించాలి
- ఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదు
- ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు
- చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి
- ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
- సంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
- కేజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు
- ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది
- కొండపై చాలా గోడలు ఉన్నాయి.. అవి ఎందుకు పడుపోలేదు
- నాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది
👉సింహాచలం దుర్ఘటన.. భక్తుల మృతిపై విచారణ కమిటీ
ముగ్గురు అధికారులతో కమిటి వేసిన ప్రభుత్వం
👉సింహాచలం ఘటన.. ప్రభుత్వ వైఫల్యంపై మల్లాది విష్ణు ఫైర్
- ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయింది
- ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది
- తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్ పై బురద చల్లాలని చూశారు
- చందనోత్సవంలో అపశ్రుతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే
- మంత్రులు, ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు
- చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా?
- రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి?
- ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్నారు
- వరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు
👉మరణించిన వారికి పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోని బంధువులు
- కోటి రూపాయల పరిహారం ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
- తమ డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే పోస్టుమార్టం చేయాలంటున్న బంధువులు
- పోస్టుమార్టానికి సహకరించాలని బంధువులపై పోలీసులు ఒత్తిడి
- పోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులు
- ఎల్జీ పాలిమర్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారు
- అదే తరహాలో నేడు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్..
👉కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే: కొట్టు సత్యనారాయణ
- తిరుపతి ఘటన మరవకముందే సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి దారుణం
- కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది
- లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు
- సింహాచలం ఘటన బాధాకరం
- ఘటన జరిగి కొన్ని గంటలు అవుతున్నా పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?
- క్యూలైన్ల దగ్గర ఎండోమెంట్,రెవెన్యూ అధికారులు ఎందుకు లేరు?
- గోదావరి పుష్కరాల్లో కూడా పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు.
👉విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
- మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్
- బాధిత కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
👉 సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం
- విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం
- గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరం
- మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
- గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి
- పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా
- మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం
- గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్
Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025
👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలు
- కేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులు
- కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...
- దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన
👉సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ ఆగ్రహం
సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు
నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగింది
సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది
ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త
భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని
హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి
పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది
చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు
👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.

👉వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం
- గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించింది
- వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
ఆంధ్ర ప్రదేశ్ లోని
సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి
భక్తులు మరణించిన ఘటన
తీవ్ర ఆవేదనను కలిగించింది.
వారి కుటుంబ సభ్యులకు
నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…
భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025