
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.విదియ రా.8.33 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: కృత్తిక రా.9.51 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: ప.10.39 నుండి 12.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు, అమృత ఘడియలు: రా.7.40 నుండి 9.07 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.40, సూర్యాస్తమయం: 6.14.
మేషం... పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం.
వృషభం... ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వస్తు,వస్త్రలాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు.
మిథునం.. రుణయత్నాలు సాగిస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. విందువినోదాలు.
కర్కాటకం... పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వాహనయోగం.
సింహం..... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య.... ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.
తుల... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
వృశ్చికం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వస్తులాభాలు.
ధనుస్సు... కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.
మకరం..... పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులతో విభేదాలు. కుటుంబ, ఆర్థిక సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవచింతన. విద్యార్థులకు ఒత్తిడులు.
కుంభం... వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలయదర్శనాలు.
మీనం... పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు.