ప్రధాన వార్తలు

బాబూ.. 9,000 కోట్ల అప్పు కోసం.. 1,91,000 కోట్ల గనుల తాకట్టు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని తెలిపారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి? అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు. రూ. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు.ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. రూ.9000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా APMDCపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి?. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేశారు’ అని చెప్పుకొచ్చారు.Andhra Pradesh Government’s lack of fiscal discipline and disregard for the Constitutional framework.It is learnt that, on 25th June, 2025, APMDC concluded the second tranche of its NCD (bond) issuance at a coupon (interest) rate of 9.30% and raised Rs. 5,526 crores, taking the… pic.twitter.com/wiJSs6q1lK— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025

Shubhanshu Shukla: ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు
సాక్షి,ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. #Ax4's @SpaceX Dragon spacecraft docked with the @Space_Station at 6:31am ET (1031 UTC). Next, the mission crew and our NASA astronauts will prepare to open the hatches. pic.twitter.com/Qj1sgy7RzC— NASA (@NASA) June 26, 2025అమెరికా టూ అంతరిక్షంభారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్‌ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్‌గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్‌గా శుభాంశు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. (Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’)అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అయ్యింది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. LIVE: @Axiom_Space's #Ax4 mission, with crew from four different countries, is about to launch to the @Space_Station! Liftoff from @NASAKennedy is targeted for 2:31am ET (0631 UTC). https://t.co/yBgO8bxb6Z— NASA (@NASA) June 25, 202514 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్‌లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.రాకేశ్ శర్మ తర్వాత శుభాంశు శుక్లారాకేశ్ శర్మ భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి. ఆయన 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన సోయుజ్ టి-11 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆయన మొత్తం 7 రోజులు 21 గంటలు 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన భారతదేశాన్ని అంతరిక్షం నుంచి పరిశీలించి, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.రాకేశ్ శర్మ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన రెండో భారతీయుడే ఈ శుభాంశు శుక్లా. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్న సందర్భంలో రాకేశ్ శర్మే తనకు స్పూర్తంటూ శుభాంశు శుక్లా పేర్కొన్నారు. 1984లో రాకేశ్ శర్మను చూసి ఎంతోమంది యువత అంతరిక్షం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పుడు శుభాంశు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ, తదుపరి తరం భారతీయులకు ప్రేరణగా నిలిచారు.

‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్‌కు అమ్మేశాడు!
ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్‌కు పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఫహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్‌కు భారత్‌కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్ ఆఫ్ ద డాక్‌యార్డ్‌లో అప్పర్ డివిజన్ క్లర్క్‌గా పని చేస్తేన్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి.. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్ యాదవ్,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్‌కు చెందిన ప్రియగా పరిచయమై..భారత్‌కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్ మీడియ ద్వారా విశాల్‌ను ఆకట్టుకుంది. తాను భారత్‌కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్‌కు చేరవేసిన విశాల్.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్.పోలీసులు ఏం చెబుతున్నారంటే..తొలుత ఫేస్బుక్లో విశాల్‌కు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్‌కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్‌కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ విష్ణు కాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్‌కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్ సింధూర్ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.

Bangui: స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి
బంగుయ్: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగుయ్‌లోని బార్తెలెమీ బోగాండా హై స్కూల్లో గురువారం ( జూన్ 26)న ఘోర ప్రమాదం జరిగింది.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా విద్యార్థులు భయంతో పరుగులు తీయగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 260 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో 16 మంది బాలికలు ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 5,000 మంది విద్యార్థులు పరీక్షల కోసం అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. గాయపడిన విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఆ దేశ విద్యా చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా నిలిచింది.#Breaking Une #bousculade suite à une explosion de transformateur fait une dizaine de morts cet après-midi au lycée Barthélémy #Boganda de #Bangui en #Centrafrique 🇨🇫. De nombreux blessés ont été transportés vers des hopitaux proches. pic.twitter.com/5loUFDnh5n— KOUAM JOEL HONORE (@honore123) June 25, 2025

షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
వాషింగ్టన్: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్ ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మాడ్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025 సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే నో వీసాఅమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్ల (సోషల్ మీడియా వెట్టింగ్) వివరాల్ని డీఎస్-160ఫారమ్‌లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్‌లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్‌లో అభ్యర్థులు వారి సోషల్ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోషల్ మీడియా అకౌంట్స్‌ను చెక్ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలాఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్‌లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్‌లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్‌లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

టీమిండియాతో రెండో టెస్ట్.. ప్రమాదకర బౌలర్‌ను జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్
జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (జూన్ 26) ప్రకటించారు. ఈ జట్టులో ప్రమాదకర ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చోటు దక్కించుకున్నాడు. 30 ఏళ్ల ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. Jofra Archer is back in Test cricket.#ENGvINDpic.twitter.com/vd4VVRQmM8— CricTracker (@Cricketracker) June 26, 2025ఆర్చర్ 2021 ఫిబ్రవరిలో చివరిసారి టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను టీమిండియాతోనే ఆడాడు. ఆతర్వాత అతను వరుస గాయాల కారణంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆర్చర్ గతేడాది మేలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి తిరిగి వచ్చాడు. తాజాగా అతను టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఇటీవల కౌంటీ ఛాంపియన్షిప్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ససెక్స్‌కు ఆడుతూ డర్హమ్ను ఎదుర్కొన్నాడు. తాజాగా ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో ఆర్చర్ అదనంగా జోడించబడ్డాడు. తొలి టెస్ట్ కోసం ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగింది. ఆర్చర్ తాజాగా ఆడిన కౌంటీ మ్యాచ్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ అవకాశం దక్కలేదు. రెండో టెస్ట్‌లో ఆర్చర్‌కు తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశం ఉంది. ఆర్చర్ చేరిక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుస్తుంది. ఇప్పటికే ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో గెలిచి భారత్‌పై ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో టెస్ట్‌లో ఆర్చర్ తుది జట్టులో చేరితే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఆర్చర్ తుది జట్టులో చేరితే ఏ పేసర్‌పై వేటు వేస్తారో చూడాలి. తొలి టెస్ట్‌లో పేసర్లు బ్రైడన్ కార్స్ (4 వికెట్లు), జోష్ టంగ్ (7), స్టోక్స్ (5)అద్బుతంగా రాణించారు. వీరు ముగ్గురే 16 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ నిరాశపరిచాడు. అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. దీంతో రెండో టెస్ట్‌లో వోక్స్‌ను పక్కన పెట్టి ఆర్చర్‌కు అవకాశం ఇవ్వొచ్చు. ఆర్చర్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. ఈ అర్హతలతో అతను రెండో టెస్ట్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్ట్‌ల్లో 3 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 42 వికెట్లు తీశాడు. కాగా, టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు సెంచరీలు నమోదైన ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా.. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

పదేళ్ల ప్రయాణం.. ‘కన్నప్ప’ గురించి 10 ఆసక్తికర విషయాలు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 2014లో ఈ చిత్రానికి బీజం పడితే.. పదేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఇప్పటికే చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. టీజర్, ట్రైలర్ మొదలు.. ప్రతి ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పది ఆసక్తికర విషయాలు మీకోసం..1) ఈ సినిమాను తొలుత సీనియర్ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి తీయాలని భావించాడు. తక్కువ బడ్జెట్లో రా అండ్ రస్టిక్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడట. కానీ ఆ స్క్రిప్ట్ మంచు విష్ణు దగ్గరకు వెళ్లాక.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తీయాలని భావించారట.2) 2014లో భరణి దగ్గర విష్ణు ఈ సినిమా కథ హక్కులను తీసుకున్నాడు. కొంతమంది దిగ్గజ రచయితలతో కలిసి స్క్రిప్ట్‌ని డెవలప్ చేసుకున్నారు. లొకేషన్స్ కోసం 2018లో విష్ణు పోలాండ్‌కి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రం రూపొందించారు.3) ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2023 సెప్టెంబర్‌లో ప్రారంభం అయింది. ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లోనే చిత్రీకరించారు. 2023 నవంబర్‌లో ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు.4) ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేం ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.5) 2024 మహాశివరాత్రి సందర్భంగా మంచు విష్ణు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అలాగే మోహన్ బాబు బర్త్‌డే సందర్బంగా 2024 మార్చి 19న కన్నప్ప కామిక్ బుక్‌ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.6) గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫెస్ట్వల్లో ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 14న ట్రైలర్‌ని విడుదల చేశారు.7) మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించారు. కన్నప్పగా విష్ణు, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు, చిన్నప్పటి తిన్నడుగా విష్ణు కొడుకు అవ్రామ్ నటించారు. అలాగే విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో నటించడంతో పాటు ‘శ్రీకాళహస్తి గాథ’ పాటను ఆలరించారు.8) ఇటీవల కాలంలో ఎక్కువమంది స్టార్స్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప అనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు.9) ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తూ 12 కట్స్ చెప్పిందట. దీంతో 195 నిమిషాల నిడివితో రూపొందిన చిత్రం.. చివరకు 182 (3:02 గంటలు)నిడివితో విడుదల కాబోతుంది.10) ఈ సినిమాకు దాదాపు రూ.200-250 కోట్ల వరకు ఖర్చు చేశారట. ప్రభాస్, మోహన్‌లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారని విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

రైల్వే ట్రాక్‌పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?
సాక్షి, హైదరాబాద్: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్పల్లి రైల్వే స్టేషన్‌కు తరలించారు.కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్ చాక్‌తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.🚨 Shocking in Shankarpalli, Vikarabad A woman was spotted driving her car on a railway track towards Hyderabad! Railway staff halted trains, including one from Bengaluru to Hyderabad. Despite efforts to stop her, the woman kept driving on the tracks. Authorities are… pic.twitter.com/BK1MfZDHb8— Sowmith Yakkati (@YakkatiSowmith) June 26, 2025కాగా, వోమిక సోనీ.. గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్‌తో దాడికి దిగింది.

ఇంటెల్‌లో ఉద్యోగాల కోత ప్రారంభం
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బు టాన్ నేతృత్వంలో కొనసాగుతున్న కంపెనీ వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కాలిఫోర్నియాలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభించారు. శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో ఉన్న 107 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇంటెల్ పేర్కొంది. 30 రోజుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినప్పుడు నోటిఫికేషన్ జారీ చేసేలా కాలిఫోర్నియా వార్న్ చట్టం నిర్దేషిస్తుంది. దీని ప్రకారం కంపెనీ సమర్పించిన ఫైలింగ్‌లో ఉద్యోగాల కోతలు ప్రారంభం కానున్నాయని తెలిసింది.జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆటోమోటివ్ చిప్ వ్యాపారాన్ని కూడా ఇంటెల్ మూసివేయనుంది. దాంతో ఇంటెల్ ఎక్స్పర్ట్ జాక్ వీస్ట్ నేతృత్వంలోని ఈ యూనిట్ ఉద్యోగుల్లో చాలా మంది కొలువులు కోల్పోయే అవకాశం ఉంది. బాధిత ఉద్యోగులకు 60 రోజుల నోటీసు లేదా నాలుగు వారాల నోటీసుతో పాటు తొమ్మిది వారాల పరిహారం, ఇతర వేతన ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు, జులై మధ్యలో ఇంటెల్ కాలిఫోర్నియాలోని గ్లోబల్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలు తీసుకోబోతుందని అధికారులు తెలిపారు. అప్పుడు కంపెనీ తన ఉద్యోగుల్లో మరో 20 శాతం మందిని తొలగిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపుతాజాగా ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఇంటెల్ చిప్ అభివృద్ధికి కీలకమైన పలు ఇంజినీరింగ్ ఉద్యోగులను తొలగించడం గమనార్హం. వీరిలో ఫిజికల్ డిజైన్ ఇంజినీర్లు, లాజిక్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్పెషలిస్టులు, క్లౌడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌లు ఉన్నారు. ఇంజినీరింగ్ మేనేజర్లు, బిజినెస్ లీడ్లు, ఐటీ వైస్ ప్రెసిడెంట్ వంటి అనేక సీనియర్ లీడర్షిప్ రోల్స్‌లో సేవలందిస్తున్న వారున్నారు. శాంటా క్లారా సైట్‌లోని ఉద్యోగులు సీపీయూ, జీపీయూ డిజైన్ ప్రాజెక్టుల్లో పనిచేస్తారని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ప్రధాన టెక్ కంపెనీల్లో 2025లో ఇప్పటివరకు 62,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రధాన సంస్థలు వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి.

కొత్త శకానికి నాంది పలికిన ఇషా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమార్తె, వ్యాపారవేత్త ఇషా అంబానీ (Isha Ambani ) మరో ఘనతను సాధించారు సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025 ((Serpentine Summer Party 2025)కి తొలి భారతీయ చైర్‌పర్సన్‌గా ఎంపికై కళా ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికారు.సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 25వ వార్షికోత్సవం సందరబంగా తొలి బారతీయ చైర్‌గా ఇషా ఎంపికయ్యారు. కళలు, సంస్కృతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లు, ప్రభావవంతమైన వ్యక్తులనుచేర్చుకోవడంలో మరింత మార్పువచ్చిందని నిరూపించిం దని, ప్రపంచ దేశాలకు, భారత్‌కు మధ్య ఇషా సాంస్కృతిక వారధి అంటూ ప్రశంసిస్తున్నారు ఫ్యాషన్ నిపుణులు. సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025లో ఇషా అంబానీ లక్ మెరీనా టబస్సమ్ రూపొందించిన 2019 నాటి వాలెంటినో, షాంపైన్ కలర్ పూసల దుస్తులను ధరించింది. ఉంగరాల జుట్టు, సహజమైన మేకప్ వేసుకుని, హీల్స్‌తో ఇషా ప్రతి ఫ్రేమ్‌లో అందమమైన లుక్‌లో అలరించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అంబానీ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇషా తనదైన వ్యాపార నైపుణ్యాలతో వ్యాపారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్‌కు ప్రపంచ రాయబారి , సోనమ్ కపూర్, సమ్మర్ పార్టీలో సందడి చేసింది. డియోర్ ఫాల్ 2025 కలెక్షన్ నుండి కిమోనో జాకెట్ ధరించింది అందర్నీ ఆకట్టుకుంది. జూన్ 24, 2025న లండన్‌లోని సెర్పెంటైన్ పెవిలియన్‌లో జరిగిన ఈ పార్టీలో ఈజా గొంజాలెజ్, అలిసియా వికాండర్, రెబెల్ విల్సన్, జార్జియా మే జాగర్, లేడీ అమేలియా స్పెన్సర్, లేడీ ఎలిజా స్పెన్సర్, లిల్లీ అలెన్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు.
టీమిండియాతో రెండో టెస్ట్.. ప్రమాదకర బౌలర్‌ను జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్
‘కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతాం’
జూబ్లీహిల్స్‌పై కమలదళం గురి..
కన్నప్ప నిర్మాణ సంస్థ వార్నింగ్.. అలా చేయడం వల్లేనన్న విష్ణు!
Bangui: స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి
‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్‌కు అమ్మేశాడు!
బంగారం కంటే వెండి ముద్దు
Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు
షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్.. మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
నటి ఊర్మిళను రెండో పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల సురేష్
అల్లు అర్జున్ 'ఐకాన్'.. ఇక లేదు
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్‌లు అప్పటికే..
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
అమ్మ ఓడి.. 'పోయింది'
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
పెరగనున్న రైలు చార్జీలు
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
టీమిండియాతో రెండో టెస్ట్.. ప్రమాదకర బౌలర్‌ను జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్
‘కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతాం’
జూబ్లీహిల్స్‌పై కమలదళం గురి..
కన్నప్ప నిర్మాణ సంస్థ వార్నింగ్.. అలా చేయడం వల్లేనన్న విష్ణు!
Bangui: స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి
‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్‌కు అమ్మేశాడు!
బంగారం కంటే వెండి ముద్దు
Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు
షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్.. మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్‌లు అప్పటికే..
అల్లు అర్జున్ 'ఐకాన్'.. ఇక లేదు
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
అమ్మ ఓడి.. 'పోయింది'
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
పెరగనున్న రైలు చార్జీలు
క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
సినిమా

కన్నప్ప కోసం వెయిటింగ్.. వారి కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్!
కన్నప్ప టీమ్‌కు మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ శుక్రవారం విడుదలయ్యే కన్నప్ప సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీమ్ ఎన్నో ఏళ్లు ఎంతో కష్టపడ్డారని రాసుకొచ్చారు. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను థియేటర్లో చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ ద్వారా మనోజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' కన్నప్ప చిత్రానికి, టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కోసం నాన్నతో పాటు ఆయన బృందం ఎంతో శ్రమించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే మా లిటిల్ ఛాంపియన్స్ అరియానా, వివియానా, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. తనికెళ్ల భరణిగారి జీవితకాల కల జీవం పోసుకుని.. ఈ శుక్రవారమే కన్నప్ప విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్, మోహన్‌లాల్ , అక్షయ్‌కుమార్, ప్రభుదేవాతో పాటు ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరు సినిమా కోసం చేసిన చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. మంచు మనోజ్ ఇటీవలే భైరవం మూవీతో అభిమానులను అలరించారు. అయితే ఈ ట్వీట్లో ఎక్కడూ కూడా తన సోదరుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. All the best to Team #Kannappa!My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025

ఐశ్వర్య రాయ్‌తో పెళ్లికి ముందు ఆ హీరోయిన్‌తో ఎంగేజ్మెంట్!
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారు అంటుంటారు. అందుకేనేమో.. పీకల్లోతు ప్రేమలో ఉన్న అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్.. ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయారు. మనసు నిండా ఒకరినొకరు నింపుకున్నారు కానీ, తలరాతల్లో మాత్రం లేకుండా పోయారు. జంటగా నడవాలనుకుంటే వేర్వేరుగా ప్రయాణించారు. అభిషేక్.. ఐశ్వర్యను, కరిష్మా.. సంజయ్‌ను పెళ్లాడారు. అసలు ఆనాడేం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం..అభిషేక్- కరిష్మా ప్రేమసినీరంగంలో సత్తా చాటుతున్న కపూర్ ఫ్యామిలీలో పుట్టింది కరిష్మా (Karisma Kapoor). 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో కొన్ని వైఫల్యాలు చూసిన కరిష్మా.. రాజా హిందుస్తానీ చిత్రంతో సక్సెస్ అందుకుంది. తర్వాత ఈ బ్యూటీ బిగ్‌బీ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)తో ప్రేమలో పడింది. అభిషేక్ సోదరి శ్వేత బచ్చన్ పెళ్లిలోనే వీరి చూపులు కలిశాయి. ఐదేళ్లపాటు ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. జయా బచ్చన్‌తో కరిష్మా కపూర్‌నా కోడలు: జయా బచ్చన్దీంతో 2002లో అమితాబ్ బచ్చన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో జయా బచ్చన్.. అభిషేక్, కరిష్మాల ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించింది. కరిష్మాను తన కోడలిగా చేసుకోనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్లో పెద్ద పండగే జరగబోతుందనుకున్నవారికి షాకిస్తూ వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అమితాబ్ తన సంపదలో కొంత భాగం అభిషేక్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాలని కరిష్మా తల్లి బబిత డిమాండ్ చేసిందట! ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లిఎంగేజ్మెంట్ ఆగిపోయిన కొద్ది నెలలకే బబిత.. తన కూతురికి మంచి వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసింది. 2003లో కరిష్మా, సంజయ్ కపూర్ల పెళ్లి జరిగింది. ఇతడికిది రెండో పెళ్లి కావడం గమనార్హం. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. పిల్లలు పుట్టిన కొంతకాలానికే కరిష్మా- సంజయ్ విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2016లో డివోర్స్ మంజూరయ్యాయి. కొద్దిరోజుల క్రితమే సంజయ్ కపూర్ కన్నుమూశాడు. ఇకపోతే అభిషేక్ బచ్చన్.. 2007లో ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అభిషేక్- ఐశ్వర్య అయినా సంతోషంగా ఉన్నారా? అంటే.. అప్పుడే దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు. అంతలోనే జంటగా కనిపిస్తారు. వీరి మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి! #KarismaKapoor and #AbhishekBachchan's #wedding announcement in the early 2000s was a highly anticipated union between two of #Bollywood's most prominent families. However, the engagement was abruptly called off, and the wedding never took place.#bollywood #aishwaryarai pic.twitter.com/U1dRUrmnT2— The Cheshire Cat (@C90284166) November 5, 2024 చదవండి: కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు

బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025

కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు
అడ్జస్ట్ అయితేనే అవకాశాలు ఇస్తామంటున్నారు అని ఎంతోమంది నటీమణులు మీడియా ముందు గోడు వెల్లబోసుకున్నారు. అయితే తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటున్నాడు బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాన్షు పాండే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నేను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఓ ప్రముఖ దర్శకనిర్మాత తను అడిగింది చేస్తే మంచి ఆఫర్ ఇస్తానన్నాడు.కాంప్రమైజ్ అయితేనే..ఇప్పుడాయన బతికి లేడు. గొప్ప ఫిలింమేకర్స్‌లో ఆయన ఒకరు. ఆయన అడిగినదానికి కాంప్రమైజ్ అయితేనే రోల్ ఇస్తానన్నాడు. ఆయనపై నాకెలాంటి కోపం, పగ లేదు. ఎందుకంటే వాళ్లు అడిగినదానికి ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆయన అడిగింది నా వల్ల కాదని సున్నితంగా తిరస్కరించాను. మర్యాదగా అడిగాడు కాబట్టి అంతే గౌరవంగా బదులిచ్చాను. బలవంతం చేస్తే నచ్చదుఅలా కాకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించుంటే లాగిపెట్టి కొట్టేవాడిని. ఎవరైనా నన్ను బలవంతం చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు నచ్చినపనే చేస్తాను. నచ్చినవాటివైపే నిలబడతాను. ఇష్టం లేకుండా ఏ పనీ చేయను అని చెప్పుకొచ్చాడు. సుధాన్షు పాండే.. ఖిలాడీ 420, ద మిత్, యాకీన్, మర్డర్ 2, రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి పలు చిత్రాలు చేశాడు. రోబో 2.0, మన్మథుడు 2 వంటి చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితుడే.. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్‌లో కనిపిస్తున్నాడు.చదవండి: లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో!
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

నేనే గనుక గంభీర్ అయితే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి..: అశ్విన్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు (Ind vs Eng)కు ముందు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలన్న ఈ స్పిన్ దిగ్గజం.. పరుగులు సాధించడం కంటే కూడా ఈ విషయం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించాడు. ఏదేమైనా.. ఐదో రోజు వరకు ఆటను పొడిగించాలని.. ప్రత్యర్థిని ఫీల్డింగ్‌లో అలసిపోయేలా చేయాలని పేర్కొన్నాడు.అతడిని తీసుకోండిఇక తుదిజట్టులో పెద్దగా మార్పులు అక్కర్లేదన్న అశ్.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఓటమికి భయపడాల్సిన పనిలేదు. వెనువెంటనే జట్టులో మార్పులూ చేయకూడదు.రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయగల సత్తా టీమిండియాకు ఉంది. అయితే, ఇంగ్లండ్ వ్యూహాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే సిరీస్ మన చేజారిపోవడానికి ఎక్కువ సమయం అక్కర్లేదు.ఒత్తిడి పెంచాలిఐదో రోజు వరకు కూడా బ్యాటింగ్ చేయాలి. లేదంటే కథ ముగిసిపోతుంది. ఐదో రోజు ఎంత పెద్ద టార్గెట్ అయినా తాము ఛేదిస్తామని ఇంగ్లండ్ బహిరంగంగానే చెప్పింది. ఈ విషయాన్ని మన బ్యాటింగ్ లైనప్ గుర్తు పెట్టుకోవాలి. ప్రత్యర్థికి తక్కువ సమయంలోనే.. ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించేలా ఒత్తిడి పెంచాలి.కనీసం 400- 450 పరుగుల మేర లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్ గెలవగలం. వికెట్‌ను బట్టి ఎప్పటికప్పుడు ఆటను మార్చుకుంటూ ఉండాలి’’ అశ్విన్ భారత జట్టుకు సూచించాడు.అద్భుతమైన ఆటగాడు అతడుఇక రిషభ్ పంత్ తొలి టెస్టులో రెండు శతకాలు బాదడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘విరాట్ కోహ్లితో పోల్చగల ఆటగాడు. ఒకవేళ నేనే గనుక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అయి ఉంటే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి.. ‘నువ్వు అద్భుతంగా, అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశావు. ఈసారి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చు.130 పరుగులు చేసినపుడు కూడా నువ్వొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన లోయర్ ఆర్డర్ అంతగా బ్యాటింగ్ చేయలేదు కాబట్టి.. నువ్వు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి’ అని చెప్పేవాడిని. వాహ్.. ఎంతటి అద్భుతమైన ఆటగాడు అతడు’’ అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. శతకం బాదిన తర్వాత ఫ్లిప్ కొట్టి సెలబ్రేట్ చేసుకోవద్దని అశూ ఈ సందర్భంగా పంత్‌కు సూచించాడు. ఐపీఎల్ ఆడేటపుడు శరీరం ఎక్కువగా అలసిపోదని.. అప్పుడు జంప్ కొట్టినా పర్లేదన్న అశూ.. టెస్టు క్రికెట్ అందుకు భిన్నమని సున్నితంగా హెచ్చరించాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లో జూలై 2-6 రెండో టెస్టు జరుగుతుంది. చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!

నిప్పులు చెరిగిన విండీస్ పేసర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
3 టెస్ట్‌లు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా నిన్న (జూన్ 25) తొలి టెస్ట్ మొదలైంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు పేసర్ల హవా కొనసాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను విండీస్ పేసర్లు జేడన్ సీల్స్ (15.5-1-60-5), షమార్ జోసఫ్ (16-3-46-4) వణికించారు. ఈ ఇద్దరి ధాటికి ఆస్ట్రేలియా 180 పరుగులకే కుప్పకూలింది. గడిచిన 30 ఏళ్లలో వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోర్. సీల్స్, షమార్తో పాటు జస్టిన్ గ్రీవ్స్ కూడా ఓ వికెట్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (59) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఉస్మాన్ ఖ్వాజా 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు కాక కెప్టెన్ కమిన్స్ (28), వెబ్‌స్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సామ్ కొన్‌స్టాస్ 3, కెమారూన్ గ్రీన్ 3, జోస్ ఇంగ్లిస్ 5, అలెక్స్ క్యారీ 8, మిచెల్ స్టార్క్ 0, హాజిల్‌వుడ్ 4 పరుగులకు ఔటయ్యారు. నాథన్ లియోన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కూడా ఆసీస్ తరహాలోనే త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్లు స్టార్క్ (7-1-35-2), హాజిల్‌వుడ్ (7-1-13-1), కమిన్స్ (6-2-8-1) ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 123 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ 4, జాన్ క్యాంప్‌బెల్ 7, కీసీ కార్టీ 20, జోమెల్ వార్రికన్ 0 పరుగులకు ఔట్ కాగా.. బ్రాండన్ కింగ్ (23), రోస్టన్ ఛేజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్రాత్‌వైట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రోస్టన్ ఛేజ్ విండీస్ టెస్ట్ జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా ఇదే అతనికి తొలి మ్యాచ్.దిగ్గజాలు సరసన సీల్స్ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ రైట్ ఆర్మ్ సీమర్ జేడన్ సీల్స్ దిగ్గజాల సరసన చేరాడు. బార్బడోస్ మైదానంలో (కెన్నింగ్స్టన్ ఓవల్) ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నాలుగో విండీస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సీల్స్కు ముందు కోట్నీ వాల్ష్ (5-39), మాల్కమ్ మార్షల్ (5-42), డెనిస్ అట్కిన్సన్ (5-56) మాత్రమే బార్బడోస్‌లో ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. మైఖేల్ హోల్డింగ్ లాంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్ వచ్చాడు. టీ20 ఫార్మాట్లో ఆ జట్టుకు రస్సీ వాన్ డెర్ డస్సెన్ సారధిగా నియమితుడయ్యాడు. జులైలో జింబాబ్వేలో జరుగనున్న పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా డస్సెన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ ట్రై సిరీస్‌లో జింబాబ్వే, సౌతాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ పాల్గొననుంది. రెగ్యులర్ టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సహా సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో డస్సెన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ట్రై సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా కొత్త ముఖాలు ఉన్నాయి.ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన విధ్వంసకర ఓపెనర్ లూహాన్ డ్రి ప్రిటోరియస్ తొలిసారి జాతీయ టీ20 జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇదివరకే వన్డే, టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన కార్బిన్ బాష్ కూడా తొలిసారి టీ20 బెర్త్ దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన రూబిన్ హెర్మన్.. ఇదివరకే మిగతా రెండు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ఆడిన సెనురన్ ముత్తుస్వామి మిగతా అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న పేసర్లు నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ ఈ ట్రై సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న బ్యాటింగ్ సంచనలం డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఈ సిరీస్ కోసం పిలుపునందుకున్నాడు. షుక్రీ కన్రాడ్ సౌతాఫ్రికా ఆల్ ఫార్మాట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అతనికి తొలి టీ20 అసైన్మెంట్. జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగే ఈ ట్రై సిరీస్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. జులై 26న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. కాగా, టెంబా బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఈ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి చాలాకాలం తర్వాత ఐసీసీ టోర్నీ గెలిచింది.జింబాబ్వేలో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..రస్సీ వాన్ డెర్ డస్సెన్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురన్ ముత్తుస్వామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్-డ్రి ప్రిటోరియస్, ఆండైల్ సైమ్లేన్జింబాబ్వే ట్రై సిరీస్ షెడ్యూల్..జులై 14- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికాజులై 16- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్జులై 18- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్జులై 20- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికాజులై 22- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాజులై 24- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్జులై 26- ఫైనల్అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి.

ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లు ఇవే.. ఐపీఎల్ తర్వాత అదే!
క్రికెట్లో ప్రస్తుతం టీ20 ఫార్మాట్ హవా నడుస్తోంది. పొట్టి క్రికెట్‌ను చూసేందుకు నవతరం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా ఆటగాళ్లు రెండు చేతులా సంపాదించుకుండగా.. ఆయా బోర్డులపై కూడా కనక వర్షం కురుస్తోంది.స్పాన్సర్‌షిప్‌లు. టీవీ ప్రసార హక్కులు, టికెట్ల విక్రయం తదితర మార్గాల ద్వారా బోర్డులు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ లీగ్‌లే ప్రపంచ క్రికెట్ మార్కెట్‌ను ఏలుతున్నాయి. మరి 2025 నాటికి పేరెన్నికగన్న ధనిక పొట్టి లీగ్‌లలో టాప్-10లో ఉన్న లీగ్‌లు ఏవో తెలుసా?!ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)సందేహమే అక్కర్లేదు.. అవును.. ప్రపంచ టీ20 మార్కెట్లో ఐపీఎల్‌దే అగ్రస్థానం. 2008లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీనిని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మేటి జట్ల ఆటగాళ్లంతా ఈ లీగ్‌లో భాగమవుతూ.. కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్నారు.ఎంతో మంది యువ క్రికెటర్లు కూడా వెలుగులోకి వచ్చి జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా పేరున్న ఐపీఎల్ కేవలం బ్రాడ్కాస్ట్ డీల్స్ ద్వారానే 6.2 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్ విలువ- 11 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపుగా 94, 220.5 కోట్ల రూపాయలు) వరకు ఉంటుందని అంచనా.రెండో స్థానంలో ఐఎల్టీ20 (ILt20)నెట్వర్త్పరంగా ఐపీఎల్ తర్వాతి స్థానం యూఏఈ వేదికగా సాగే ఇంటర్నేషనల్ లీగ్టీ20ది. మధ్య ప్రాచ్చ దేశాల పెట్టుబడి, ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎల్టీ20 విలువ 15 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 128.64 కోట్లు) అని తెలుస్తోంది. పన్ను లేని కాంట్రాక్టులు మేటి క్రికెటర్లను కూడా ఐఎల్టీ20 వైపు ఆకర్షిస్తున్నాయి.సౌతాఫ్రికా టీ20 లీగ్ (SAT20)2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్లన్నీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలవే. హైదరాబాద్ (సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్), లక్నో (డర్బన్ సూపర్ జెయింట్స్), రాజస్తాన్ (పర్ల్ రాయల్స్), ఢిల్లీ (ప్రిటోరియా క్యాపిటల్స్), చెన్నై (జొబర్గ్ సూపర్ కింగ్స్), ముంబై (ఎంఐ కేప్‌టౌన్)ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ లీగ్ విలువ 12 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ. 102.79 కోట్లు) అని అంచనా.బిగ్‌బాష్ లీగ్ (BBL)ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీ20 లీగ్ నికర విలువ పది మిలియన్ల డాలర్ల (దాదాపు రూ. 85. 65 కోట్లు)వరకు ఉంటుందని తెలుస్తోంది.ది హండ్రెడ్ఇంగ్లండ్ వేదికగా సాగే 100 బాల్ టోర్నీ ‘ది హండ్రెడ్ లీగ్’ వాల్యూ తొమ్మిది మిలియన్ డాలర్లు (సుమారు రూ. 77.08 కోట్లు) అని అంచనా.మేజర్ లీగ్ క్రికెట్ (MLC)అమెరికాకు చెందిన ఈ పొట్టి లీగ్ విలువ 6.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 59.09 కోట్లు) అని సమాచారం.పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)పాకిస్తాన్ సూపర్ లీగ్ నెట్‌వర్త్ 5.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 48.82 కోట్లు) అని అంచనా.బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వాల్యూ 4.8 మిలియన్ డాలర్లు (సుమారు 41.11 కోట్ల రూపాయలు) అని తెలుస్తోంది.కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)ఈ వెస్టిండీస్ టీ20 లీగ్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల పెట్టుబడులు ఉన్నాయి. దీని నెట్‌వర్త్ 4.6 మిలియన్ డాలర్లు (సుమారు 39.40 కోట్లు) అని అంచనా.లంక ప్రీమియర్ లీగ్ (LPL)శ్రీలంకకు చెందిన ఈ పొటి ఫార్మాట్ లీగ్ వాల్యూ 3.98 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 34.09 కోట్లు) అని తెలుస్తోంది.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!
బిజినెస్

దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపు
దేశంలో సంపద పెరుగుతోంది. సంపన్నులు రెట్టింపవుతన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజా నివేదిక ప్రకారం.. 2024-2029 మధ్య అంటే ఐదేళ్లలో మిలియనీర్ల జనాభా 55 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 21 శాతం కంటే రెట్టింపు.2023-2024 మధ్య కాలంలో భారత ఆర్థిక సంపద 10.8 శాతం పెరిగిందని, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) సగటు 7.3 శాతం దాటిందని బీసీజీ తెలిపింది. ఉత్తర అమెరికా (4%), పశ్చిమ ఐరోపా (5%) లను మించి ఎఆసియా-పసిఫిక్ ప్రాంతం 2029 నాటికి వార్షికంగా 9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.2024 నుంచి 2029 వరకు డాలర్ మిలియనీర్ల సంఖ్య 55 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ మయాంక్ ఝా తెలిపారు. తొలి తరం మొదటిసారి సంపద సృష్టికర్తలు, ముఖ్యంగా మిలీనియల్ (యువ) పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు పరిశ్రమను పునర్నిస్తున్నారని పేర్కొన్నారు.బలమైన ఈక్విటీ మార్కెట్ పనితీరు కారణంగా ఆర్థిక ఆస్తులు 8.1% పెరగడంతో 2024లో ఆర్థిక సంపద రికార్డు స్థాయిలో 305 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బీసీజీ గ్లోబల్ నివేదిక తెలిపింది. విలువైన క్లయింట్ల గుర్తింపు, ప్రాధాన్యంలో సంస్థలకు సహకారం అందిస్తూ ఉత్పాదక ఏఐ (GenAI) సంపద ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని వివరించింది. ఈ ఉత్పాదక ఏఐని త్వరగా అందిపుచ్చుకున్నవారు ఐదు రెట్లు అధికంగా పురోగమిస్తున్నారని వివరించింది.

యూనియన్ బ్యాంక్ ఈడీకి ఊహించని షాక్..
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పంకజ్ ద్వివేదికి ఊహించని అనుభవం ఎదురైంది. జనరల్ మేనేజర్‌గా ఆయన హోదాను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక సేవల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వపు హోదాలో జనరల్ మేనేజర్‌గా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు పంపించింది.ఢిల్లీ హైకోర్టులో ద్వివేదికి వ్యతిరేకంగా కేసు పెండింగ్‌లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూనియన్ బ్యాంక్ ఈడీగా ద్వివేది నియామకాన్ని సవాలు చూస్తే ఢిల్లీ హైకోర్టులో గతేడాది ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.విజిలెన్స్ క్లియరెన్స్ లేకుండా ఈడీగా నియమించడం నిబంధనల ఉల్లంఘనంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ విభాగం ఆమోదం లేకుండా నియామకం ఎలా చేశారని ప్రశ్నిస్తూ.. 2024 ఆగస్ట్‌లో కేంద్రం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.

హాట్రిక్ తర్వాత బంగారం ధరలు మళ్లీ ఇలా..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గి హాట్రిక్ కొట్టిన పసిడి ధరలకు నేడు (జూన్ 26) బ్రేక్ పడింది. దీంతో ఇంకాస్త తగ్గుతుందనుకున్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,100🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,850ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.👉 వెండి విషయంలో అమ్మో.. ఆయన మాటలు నిజమవుతాయా? 👈వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎటువంటి మార్పూ లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,18,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 1,08,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

1.41 కోట్ల మంది విమానమెక్కారు..
దేశీ విమానయాన రంగంలో ప్రయాణికుల సంఖ్య మే నెలలో 1.89 శాతం పెరిగి 1.41 కోట్లకు చేరినట్టు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. 2024 మే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 1.38 కోట్లుగా ఉంది. 64 శాతం మార్కెట్ వాటా ఇండిగో చేతుల్లోనే ఉంది. ఈ సంస్థ విమానాల్లో 93.09 లక్షల మంది ప్రయాణించారు.ఆ తర్వాత 37.22 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా 26.5 శాతం మార్కెట్ వాటా ఎయిర్ ఇండియా గ్రూపు సొంతం చేసుకుంది. ఇక ఆకాశ ఎయిర్ విమానాల్లో 7.48 లక్షల మంది, స్పైస్‌జెట్ విమానాల్లో 3.40 లక్షల మంది చొప్పున మే నెలలో ప్రయాణించారు. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 5.3 శాతంగా ఉంటే, స్పైస్ జెట్ మార్కెట్ వాటా 2.4 శాతానికి పరిమితమైంది.ఆరు ప్రధాన విమానాశ్రయాల నుంచి (హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా) 84 శాతం సరీ్వసులకు సకాలంలో సేవలు అందించి ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 79.7 శాతంతో ఎయిర్ ఇండియా గ్రూపు ద్వితీయ స్థానంలో ఉంది.
ఫ్యామిలీ

ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!
మనవాళ్లు ఎప్పుడో కళాత్మకంగా రూపొందించినవి కొన్ని రకా ఫ్యాషన్ బ్రాండ్లు కాపీ కొట్టేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ధర నిర్ణయిస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటాం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ కళ అని గుర్తుకు రాదు. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ అనగానే..డబ్బులు వెచ్చించేయడమే గానీ..అదేంటని నిశితంగా ఆలోచించేవారే కరువు. అందువల్లే కాబోలు ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు మన ఆర్ట్‌ని సులభంగా కాపీ కొట్టేస్తున్నాయి. అచ్చం అలానే ఓ దిగ్గజ ఇటలీ ఫ్యాషన్ బ్రాండ్ ఎంత పనిచేసిందో వింటే విస్తుపోతారు.కొల్హాపూర్ లెదర్ చెప్పులు చాలా ప్రసిద్ధిగాంచినవి. ముఖ్యంగా పెద్దవాళ్ల హుందాతనం ఉట్టిపడేలా చేసేలా ఉంటాయి ఆ చెప్పులు. కొల్హాపురి ఫ్లాట్ చెప్పులుగా బాగా ఫేమస్. అయితే వాటిని ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా సమ్మర్ 2026 56 రన్‌వే లుక్‌లలో అచ్చం మనలాంటి పాదరక్షలనే ప్రదర్శించింది. అచ్చం మన కొల్హాపురి చెప్పులు మాదిరిగా ఉన్నాయి. అయితే ఆ లగ్జరీబ్రాండ్ వాటి ధర ఏకంగా అక్షరాల రూ. 1.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. ఈ లగ్జరీ బ్రాండ్ మన వారసత్వానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తానే డిజైన్ చేసినట్లుగా ఫోజులు కొడుతూ..అంత ఖరీదు నిర్ణయించడంతో సర్వత్రా ఆగ్రహాం వ్యక్తమైంది. నెట్టింట అందుకు సంబధించిన ఫోటోలను ఆ బ్రాండ్ వైరల్ చేయడంతో నెటిజన్లు ఇది "చప్పల్ చోరి" అంటూ తింటూపోస్తున్నారు. PRADA is selling Kolhapuri chappals for ₹1.2 lakh — a design stolen from the Chamar community of India, who’ve handcrafted them for generations. No credit. No acknowledgment. Just pure cultural theft dressed in luxury branding. Shameful. #CulturalTheft #Kolhapuri pic.twitter.com/l3ITZlGSEG— The Dalit Voice (@ambedkariteIND) June 25, 2025ఫ్యాషన్ సంస్కృతికి తప్పుడు అర్థాన్నిచ్చేలా చేసిందంటూ మండిపడుతున్నారు. కనీసం భారతీయ వారసత్వ కళను ప్రశంసిస్తూ..వాటిని ప్రదర్శించినా..మా కళ మళ్లీ పునరుజ్జీవనం చేసుకుంటుందని సంతోషించేవాళ్లం అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. కొల్హాపురి చెప్పుల చరిత్ర...12వ శతాబ్దానికి చెందిన వారసత్వ కళ. ఇది సాంప్రదాయకంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని చెప్పులు కుట్టేవారి చేతిల్లో రూపుదిద్దుకున్న కళ ఇది. ఈ కొల్హాపురి చెప్పులకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఇది మన భారతీయ వారసత్వంలో భాగం. ఆ కాలంలోనే మన పూర్వీకులు ధరించిన చెప్పులివి. వీటిని తయారు చేయడానికి ఆరువారాలపైనే పడుతుందట. వీటి ధర రూ. 500 నుంచి రూ. 700ల మధ్య ఉంటుందట. కాగా, దీనిపై ప్రముఖ కాలమిస్ట్ శోభా దే కూడా మండిపడ్డారు. ఈ బ్రాండ్లు మన భారతదేశాన్ని ఒక మార్కెట్‌గా చూస్తున్నాయని విమర్శించారు. ఒకరంగా ఇది చేతిపనుల నైపుణ్యాలన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే మన మూలాలను మర్చిపోకుండా గుర్తు చేసింది. ఫ్యాషన్ ట్రెండ్‌గా పరిచయం చేసిన ఈ చెప్పులు మన కళా వారసత్వానికి ప్రతీకలని గొంతెత్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. View this post on Instagram A post shared by Mahrukh Dar (@fashionjournalbym) (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!)

మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!
జీవితం బుద్భుత ప్రాయం. ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కంటాం. కీర్తి, ఆస్తి, పిల్లలు, వారి భవిష్యత్తు అంటూ.. రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్ట పడతాం. కానీ కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నపుడు మాత్రం ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది.ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహార యాత్రలు విషాదంగా మారిపోయిన పహల్గాం ఉదంతం, బెంగళూరు తొక్కిసలాట, ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినపుడు మనసు మరింత భారమవుతుంది. దాదాపు ఇలాంటి గాథే వ్యాపార వేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం.జూన్ 13న ఇంగ్లాండ్‌లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై 53 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని అసలెవరైనా ఊహిస్తారా? 40వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్, చిన్న ప్రాణి తేనేటీగ మూలంగా కన్నుమూశాడు. ఆయన అకాల మరణం స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. అంతేకాదు రాబోయే పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కలలు కన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోవడం మరింత విషాదం. మూడు నెలల క్రితం, తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో పదేళ్ల తన జీవిత ప్రణాళికను ఒక సందర్భంలో పంచుకున్నాడు."నేను గొప్ప ప్రణాళికదారుడిని. అక్టోబర్‌లో, నేను నా కోసం పదేళ్ల ప్రణాళికను రాసుకున్నాను. ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకున్నా. నా గేమ్ నాకు చాలా ముఖ్యం, ఆరోగ్యం , ఫిట్నెస్ నాకు చాలా ముఖ్యం. నేను యాక్టివ్‌గా , వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను నా కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా..నేను ఉమ్మడికుటుంబం నుంచి వచ్చాను. ఉమ్మడి కుటుంబాల్లో జీవితం అంత ఈజీకాదు. కానీ అదృష్టవశాత్తూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం. ఇపుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలను కుంటున్నానని తెలిపారు. కానీ అంతలోనూ అనూహ్యంగా ఈ లోకాన్నించి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం.కాగా సంజయ్ నలుగురు పిల్లల తండ్రి. సమైరా, సఫీరా, కియాన్, అజారియాస్. మాజీ భార్య బాలీవుడ్ నటి కరిష్మాతో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. విడాకుల తరువాత కూడా కరిష్మా పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. మూడో భార్య, ప్రియా సచ్దేవ్ కుమారిడితో పాటు, మొదటిభర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు. సంజయ్ కపూర్ అంత్యక్రియలకు కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ హాజరైన సంగతి తెలిసిందే. నోట్ : జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి రోజూ వింటూనే ఉంటాం. నిట్టూరుస్తూనే ఉంటాం. ‘చివరికి మిగిలేది’ ఇదే కదా అని కూడా అనుకుంటాం. అలాగని జీవితం ఆగిపోదు. ‘జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అనుకుంటూ ముందుకు సాగాల్సిందే.

చెయ్యెత్తి మొక్కేలా షిరిడీ సాయిబాబా! అంతేనా..!
అతడు మలిచిన శిల్పాలు జీవం పోసుకున్నాయా అన్నట్లు కనిపిస్తాయి.. కాస్త దూరం నుంచి చూస్తే అరె అక్కడ ఎవరో ఉన్నారు అనే భావన కలుగుతుంది. చేతితో తాకి చూస్తే తప్ప శిల్పం అని తెలుసుకోలేం.. మనతో లేని వారు మనమధ్యే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. శిల్పం తయారు చేస్తున్నంత సేపు అతడు తపస్సులో ఉన్నాడా అనిపిస్తుంటుంది. అతడి పేరే రాజేష్ – విజయనగర్‌కాలనీ నగరంలో పుట్టిపెరిగిన అతడు 1993లో మాసబ్‌ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదివాడు. ఆ సమయం నుంచే విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాడు. 2021లో అతడు రూపొందించిన సాయిబాబా విగ్రహాన్ని మహారాష్ట్రలోని షిరిడీ సంస్థాన్‌కు అందజేయగా అక్కడ ధ్యాన మందిరంలో ఆ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సజీవ శిల్పాన్ని చూసి అబ్బురపడ్డ పలువురు మరో ఐదు విగ్రహాలు తయారు చేయాలని ఆర్డర్ ఇవ్వగా ఆయన మొదటి వారంలోనే విగ్రహాలను తయారు చేసి షిరిడీ సంస్థాన్‌కు అందజేశారు. అతడి చేతులమీదుగా దివంగత జి.పుల్లారెడ్డి దంపతులు, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు, మైకెల్ జాక్సన్, రాఘవేంద్రస్వామి, చంద్రశేఖర సరస్వతిజీ, సంత్‌సేవాలాల్ విగ్రహాలతో పాటు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర టూరిజం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎం తదితర సంస్థలకు రాజేష్ ప్రస్తుతం పెయింటింగ్, శిల్పాలు వారి ఆర్డర్ మేరకు తయారు చేసి ఇస్తున్నారు.

చినుకుల్లో హాయి..! జాగ్రత్తలు అవసరమోయి..
చిరుజల్లులలో ఏదైనా వేడి వేడి ఫుడ్ ఉంటే.. దానికి తోడు కమ్మటి వాసనతో హాట్ కాఫీ సిప్ చేస్తుంటే.. ఆ హాయి మరోలా ఉంటుంది. ఇలాంటి అనుభూతులు నగరవాసులకు ఎన్నెన్నో.. సిటీలో చినుకులు పడుతుంటే చాలు జనం ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లపై సందడి చేస్తుంటారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఆరోగ్యం, హైజీన్, డిజిటల్ టూల్స్ వంటి అంశాలను సైతం సమానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు నగరవాసులు. ఎందుకంటే ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలాన్ని సురక్షితంగా, అందంగా అనుభవించడానికి కొన్ని లైఫ్‌స్టైల్ హ్యాక్స్, గాడ్జెట్స్, యాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం అనేది సహజంగా ఆనందాన్ని కలిగించేది. కానీ అదే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని, గాడ్జెట్లను, ఇంటిని, ఫ్యాషన్‌ను సమానంగా వాడుకుంటే ఈ సీజన్‌ను ఎంతో ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. మోడ్రన్ లైఫ్స్టైల్లో టెక్నాలజీ సహకారంతో వర్షాకాలాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం. ఈ వానల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు పొందే ఆనందానికి బలం అవుతాయి.వర్షాకాలం హెల్త్‌కేర్ టిప్స్.. వానల సమయంలో నీటి కాలుష్యం, ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల జ్వరాలు, డైజెస్టివ్ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సీజన్లో ఇంట్లోనే వంట చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం, తులసి టీ, అల్లం–పెప్పర్ సూప్ వంటి బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాషన్‌తో పాటు ఫంక్షనాలిటీ.. వర్షాకాలం అంటే మడమ తొక్కినట్లుగా బురద, తడిగా మారే దుస్తులు.. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటర్ రిపెలెంట్ ఫ్యాబ్రిక్స్, సిలికాన్ షూ కవర్స్, ఫోల్డబుల్ రైనిక్స్ లాంటి ఉత్పత్తులతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా తడిసిపోకుండా ఉండొచ్చు. ట్రెండీ అంబ్రెల్లాస్: యాక్టివ్ కలర్స్, ఓపెన్–క్లోజ్ మెకానిజంతో అందంగా ఉండే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్స్: టెక్ లవర్స్ కోసం వర్షంలో కూడా ల్యాప్‌టాప్, గ్యాడ్జెట్లు భద్రంగా తీసుకెళ్లేందుకు ఉపయోగకరం. వాటర్‌ప్రూఫ్ ఫోన్ కవర్లు: ముఖ్యంగా రోడ్ల మీద లేదా బైక్ ప్రయాణాల్లో తప్పనిసరి. హెల్త్ మానిటరింగ్ యాప్‌లు, గాడ్జెట్స్.. ఫిట్ బిట్, ఎమ్ఐ బ్యాండ్ వంటి వేరబుల్స్ ద్వారా వాకింగ్ ట్రాక్ చేయవచ్చు. హెల్తీ ఫై మీ వంటి డైట్ యాప్‌లు మంచి ఆహార నియమాలు పాటించేందుకు దోహదపడుతున్నాయి. ప్రాక్టో, టాటా 1 ఎంజీ వంటి యాప్‌ల ద్వారా ఇంట్లో నుంచే డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు.టెక్నాలజీతో వర్షాన్ని అనుభవించండి.. వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుందో ముందే తెలిసిపోతే బాగుంటుందనే మాట వాస్తవమే. ఈ విషయంలో కొన్ని యాప్స్‌తో పాటు ప్రయాణించవచ్చు. ఆక్యూ వెదర్, స్కైమెట్ వెదర్, లైవ్ రడార్తో వర్ష సూచన. గూగుల్ మ్యాప్స్, మై గేట్ల టెక్నాలజీతో ట్రాఫిక్ అప్డేట్స్, లోకేషన్ ఆధారిత అలర్ట్స్. స్పాటీ ఫై, పాకెట్ ఎఫ్ఎఫ్: వానలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, లేదా ఇంట్లో కూర్చుని విండో వెనుకగా జల్లులు చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్. వర్షంలో ఇంటిని కాపాడండి డోర్ మ్యాట్స్, షూ స్టాండ్స్: వర్షపు నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు.. డీహ్యూమిడిఫైయర్స్: గదుల్లో తడిగా మారే వాతావరణం, మబ్బును నివారించేందుకు ఉపయోగపడతాయి. ఆరోమా డిఫ్యూజర్లు: తడి వాసనను తొలగించి ఫ్రెష్‌నెస్ కలిగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.విందుగా మార్చే చిట్కాలు వీకెండ్ విత్ రైన్ థీమ్: ఇంట్లో ఫ్రెండ్స్‌తో టీవీకి దగ్గరగా బీన్స్ బ్యాగ్స్, మసాలా టీ, బజ్జీలు.. ఇదే అసలైన హ్యాపీనెస్. రెయిన్ ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ: వర్షపు నీటి బిందువులు, బల్కనీ పూల మధ్య సెల్ఫీలు.. సోషల్ మీడియాకు మరిచిపోలేని అనుభూతులు. రెయిన్ ఫ్రెండ్లీ రైడ్స్: వర్షంలో బైక్ రైడ్స్, సైక్లింగ్ ట్రిప్స్ వంటి గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా వర్షాన్ని మరింత ఆస్వాదించవచ్చు. (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఉన్నందుకు అమెరికాలో ప్రవేశించనివ్వలేదు
న్యూయార్క్: ఫోన్లో జేడీ వాన్స్ బట్టతల మీమ్ ఫొటో ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అమెరికాలో ప్రవేశించనివ్వలేదని నార్వేకు చెందిన పర్యాటకుడు ఆరోపించారు. తనకు ఎలాంటి నేరచరిత్ర లేకపోయినా.. తాను నెవార్క్ విమానాశ్రయంలో దిగిన మరుసటి రోజు తిప్పి పంపారని తెలిపాడు. నార్వేకు చెందిన 21 ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ న్యూయార్క్, టెక్సాస్, ఆస్టిన్‌లలో స్నేహితులను కలవడానికి అమెరికాకు వెళ్లాడు. అలాగే తన తల్లితో కలిసి రోడ్ ట్రిప్‌లో జాతీయ ఉద్యానవనాలను సందర్శించాలనుకున్నాడు. కానీ నెవార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మికెల్సెన్ను అడ్డుకున్నారు. ‘నన్ను అనేక మంది సాయుధ గార్డులు ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ నా బూట్లు, మొబైల్ ఫోన్, బ్యాక్‌ప్యాక్‌ను తీసుకున్నారు. అధికారులు నా ఫోన్‌ను అన్‌లాక్ చేయమని ఒత్తిడి తెచ్చారు. నిరాకరిస్తే జైలు శిక్ష లేదా 5వేల డాలర్ల జరిమానా విధిస్తామని బెదిరించారు. సందర్భాన్ని వివరించిన తర్వాత కూడా, అధికారులు నా వస్తువులను తనిఖీ చేశారు. వేలిముద్రలను తీసుకున్నారు. రక్త నమూనాలను సేకరించారు. అమెరికాలో నేను కలవాలనుకున్న వారందరి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వృత్తుల వివరాలు అడిగారు. నేను పన్నెండు గంటలు ప్రయాణించాను. సరిగ్గా నిద్రపోలేదు. వారు ప్రశ్నించడం ప్రారంభించే ముందే శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయాను. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద కుట్రలు, మితవాద తీవ్రవాదంలో పాల్గొన్నట్లు అధికారులు నాపై ఆరోపణలు చేశారు. కానీ నిజానికి కారణం అది కాదు. నా ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఫొటో ఉంది. అందులో ఆయన బట్టతలతోఉన్నారు. అలాగే నేను చేతిలో ఒక చెక్క పైపుతో ఉన్న ఫొటో కూడా వారికి నచ్చలేదు. ఈ రెండు చిత్రాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నన్ను అడ్డుకుంటాయని అనుకోలేదు. మరునాడు నన్ను నార్వే వెళ్ళే విమానంలో ఎక్కించారు’అని మికెల్సెన్ ఆరోపించారు. ఈ వీడియో సామా జిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.

నిక్షేపంగా న్యూక్లియర్ సైట్లు
వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలు శెభాష్ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్‌కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ పెనిట్రేటర్ గైడెడ్ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. అమెరికా రక్షణశాఖ(పెంటగాన్)లోని నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్ఎన్ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్‌ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్‌లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. నివేదికలో ఏముంది? ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్‌ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్‌లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. అదంతా అబద్ధం: ట్రంప్ అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘అణురియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్‌లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్ఎన్పై ట్రంప్ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్ఎన్ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. స్పందించిన శ్వేతసౌధం నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్‌హౌస్.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్ సర్కార్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్‌ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్ చేశారు. ఇరాన్ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్‌వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్ చెప్పారు. లీక్‌కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. లీక్ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. నిజం దాస్తున్న ఇరాన్! శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భఘైల్ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్

రక్షణ వ్యయం పెంపుకు నాటో అంగీకారం
ద హేగ్: యుద్ధాల నేపథ్యంలో ‘నాటో’ సభ్యదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రక్షణ బడ్జెట్లను పెంచుకోవాల్సిందేనన్న ట్రంప్ ఒత్తిడికి తలొగ్గాయి. 2035 నుంచి తమ జీడీపీలో 5 శాతాన్ని రక్షణ బడ్జెట్ కోసం కేటాయించేందుకు అంగీకరించాయి. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరం వేదికగా జరుగుతున్న నాటో సదస్సు బుధవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా 32 దేశాల అగ్రనేతలు పాల్గొన్నారు. కూటమిలో ఏదైనా దేశంపై నాటోయేతర దేశం దాడికి దిగితే నాటో దేశాలన్నీ ఐక్యమై ఉమ్మడిగా దాడిచేయాలన్న తమ నిబద్దతను ‘ది హేగ్’ డిక్లరేషన్ పునరుద్ఘాటించింది. రక్షణ బడ్జెట్‌ను నాటో దేశాలు పెంచుకునేలా చేయడం అమెరికా సాధించిన ఘన విజయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను పెంచుకోవడం ద్వారా మా కూటమికి మరో ఒక ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థికదన్ను దక్కుతుందని ట్రంప్ అన్నారు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం తన తరం కాదని స్పెయిన్ ఇప్పటికే తెగేసి చెప్పింది. సదస్సుకు విచ్చేసిన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ విడిగా సమావేశమయ్యారు. నాటో బడ్జెట్ పరోక్షంగా రష్యా దురాక్రమణకు అడ్డుకట్టవేసేందుకు అక్కరకొస్తుంది జెలెన్స్కీతో ట్రంప్ అన్నారు.

శశి థరూర్... ఈసారి ఫ్రెంచ్‌లో!
కీవ్: తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు కానీ.. ఆయన ఫ్రెంచ్‌లోనూ అదరగొట్టగలరని మాత్రం తాజాగా స్పష్టమైంది. అది కూడా రష్యా దౌత్యవేత్తతో మాట్లాడుతూ! విషయం ఏమిటంటే...పహల్గామ్ దాడి తరువాత దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రపంచదేశాలకు వివరించే పార్లమెంటరీ బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా రష్యాలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు లియోనిడ్ స్లట్స్కీతో థరూర్ బృందం సమావేశమైంది. భారత్ హస్తకళల వైభవాన్ని చాటే ఒక జ్ఞాపికను రష్యా దౌత్యవేత్తకు అందించిన థరూర్.. ప్రతిగా ఆయన అందించిన అరుదైన పెన్నును స్వీకరించారు.‘‘రాతగాడికి పెన్ను బహుమానంగా ఇవ్వడం సంతోషాన్నిచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఇరువురి మధ్య చర్చలు ఉగ్రవాదం.. నివారణ చర్యలు.. రషా ఏం చేస్తోందన్న అంశాలపైకి మళ్లింది.. ఈ సందర్భంగా లియోనిడ్ స్లట్స్కీ మాట్లాడుతూ.. ‘‘రష్యా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఏటా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆరుసార్లు ఈ సమావేశాలు జరిగాయి. వచ్చే ఏడాది ఏడో సమావేశం నిర్వహిస్తున్నాం. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలను ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.పాకిస్థాన్ పేరు వినపడగానే స్పందించిన శశిథరూర్ భారత దౌత్యవేత్తల అంతర్జాతీయతను గుర్తు చేసేలా ఫ్రెంచ్‌లో స్లట్‌స్కీకి సమాధానమిచ్చారు. ‘‘పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిచ్చే దేశం’’ అని గుర్తు చేశారు. తద్వారా రష్యాతోపాటు యూరోపియన్ దేశాల దౌత్యవేత్తలకు భారత్ ఉద్దేశాలను స్పష్టం చేసినట్టు అయ్యింది. అయితే థరూర్ వ్యాఖ్యలను విన్న స్లట్స్కీ పాకిస్థాన్‌ను ఆహ్వానించడాన్ని సమర్థించుకున్నారు.అది వేరే విషయం!Shashi Tharoor takes on Pakistan in fluent French pic.twitter.com/2H7lbg1pxE— Shashank Mattoo (@MattooShashank) June 25, 2025
జాతీయం

బిహార్ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్‌లో
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాది అక్టోబర్ తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి తుది ఓటరు జాబితాను ప్రకటించిన వెంటనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది. ప్రస్తుతం బిహార్‌లో వచ్చే నాలుగు నెలల్లోగా ఓటర్ల జాబితా ఖరారుపై ఒక షెడ్యూల్‌ను కేంద్రం విడుదల చేసింది.

మరో 25 మంది తెలంగాణ వాసులు ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, ఇరాన్ నుంచి మరో 25 మంది తెలంగాణవాసులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయిల్ నుంచి 18 మంది ఢిల్లీకి చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నుంచి వారంతా స్వస్థలాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణభవన్ సిబ్బంది ఎయిర్‌పోర్టులో తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ కారణంగా ఇప్పటివరకు ఇజ్రాయిల్, ఇరాన్‌ల నుంచి మొత్తం 48 మంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపింది.

ఘనంగా రెండో అడుగు
న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తున్న చరిత్రాత్మక క్షణాలు ఎట్టకేలకు రానే వచ్చాయి. యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్‌ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్‌గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. మర్చిపోలేని ఆ క్షణాలను రోదసి నుంచే దేశవాసులందరితో పంచుకుని మురిసిపోయారు. ‘ప్రియమైన నా దేశవాసులారా! నమస్తే’ అంటూ భుజాన త్రివర్ణ పతాకం ధరించి భావోద్వేగానికి లోనయ్యారు. అంతరిక్ష ప్రవేశ యాత్ర అద్భుతంగా సాగిందంటూ సంభ్రమాశ్చర్యాల నడుమ పేర్కొన్నారు. జైహింద్, జై భారత్ అంటూ రోదసి సాక్షిగా నినదించారు. శుభాన్షు స్వస్థలం లఖ్‌నవూ నుంచి ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించిన ఆయన తల్లిదండ్రులు ఆనందాశ్రువులు రాల్చారు. తమ కుమారుడు చరిత్ర సృష్టించాడంటూ పరవశించిపోయారు. కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమై శుభాన్షు ఘనతను ప్రస్తుతించింది. దేశపతాకను ఆయన అత్యున్నత స్థాయిలో రెపరెపలాడించారంటూ ప్రశంసించింది. రాజకీయ తదితర రంగాల ప్రముఖులు తదితరుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అవనుంది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. యాగ్జియం–4 ఇస్రో, నాసా సంయుక్త మద్దతుతో రూపొందిన వాణిజ్య అంతరిక్ష యాత్ర.మిషన్ గ్రేస్ మిస్టర్ శుక్స్ ఐఎస్ఎస్లో ఉన్నంతకాలం శుభాన్షును శుక్స్ అనే సంకేత నామంతో పిలవనున్నారు. అలాగే తమ యాగ్జియం–4 వ్యోమనౌకకు కూడా వ్యోమగాములు నలుగురూ గ్రేస్ అని పేరు పెట్టుకున్నారు. విజయవంతంగా అంతరిక్షంలో చేరిన అనంతరం వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘ఓపికతో వేచి చూసేవారికి అంతా మంచే జరుగుతుంది. గ్రేస్ సిబ్బంది తొలి యాత్రను దేవుడు అన్నివిధాలా వెంట ఉండి నడిపించు గాక’’ అంటూ యాగ్జియం–4 బృందానికి స్పేస్ ఎక్స్ శుభాకాంక్షలు తెలిపింది.వందేమాతరం నుంచి... ‘యూ హి చలా చల్’ దాకా అంతరిక్ష యాత్రకు బయల్దేరే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి వ్యోమగాములు తమకు నచి్చన సంగీతాన్ని, పాటలను ఆస్వాదించడం ఆనవాయితీ. అలా యాగ్జియం–4 యాత్రకు బయల్దేరే ముందు శుభాన్షు హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ సినిమాలోని తనకెంతో ఇష్టమైన వందేమాతరం పాటను విన్నారు. ఐఎస్ఎస్లో ఆస్వాదించేందుకు వీలుగా పలు పాటలతో కూడిన ప్లే లిస్ట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులో షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని సూపర్‌హిట్ రోడ్డు పాట ‘యూ హి చలా చల్ రాహీ, కిత్నీ హసీఁ హై ఏ దునియా (అలా సాగిపో యాత్రికా, ఈ ప్రపంచమెంత అందమైనదో!) తదితర పాటలు అందులో ఉన్నాయి. ప్రయోగానికి ముందు శుభాన్షు ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించారు. యాదృచి్చకంగా స్వదేశ్ సినిమాలో షారుక్ కూడా నాసా సైంటిస్టు కావడం విశేషం.చిన్ననాటి కల సాకారం! గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టబోతున్న ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన ఏడాదికి, అంటే 1985లో ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో శుభాన్షు జని్మంచారు. బాల్యంలో ఒక ఎయిర్ షో చూసినప్పటి నుంచే ఆకాశంపై మనసు పారేసుకున్నారు. విమానాలు, వాటి వేగం, వాటి శబ్దాలు తన బుల్లి మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకుపోయాయి. పైలట్ కావాలని అప్పుడే తీర్మానించుకున్నారాయన. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చేరి తన కల నిజం చేసుకున్నారు. 2006లో భారత వాయుసేనలో చేరారు. పదేళ్ల పై చిలుకు కెరీర్లో 2 వేల గంటల పైచిలుకు ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఆయన సొంతం. సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29తో పాటు జాగ్వార్, డోర్నియర్–228 వంటి పలు యుద్ధ విమానాలు నడిపారు. ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్‌గా చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్లో ఎంటెక్ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్‌యాన్ మిషన్ కోసం 2019లో కేంద్రం ఎంపిక చేసిన నలుగురు ఆస్ట్రొనాట్ల బృందంలో శుభాన్షు ఒకరు. అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో కఠోరమైన శిక్షణ పొందారు. యాగ్జియం–4 మిషన్‌కు పైలట్‌గా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏకాగ్రత, సునిశిత బుద్ధి తిరుగులేనివని సహచర వ్యోమగాములు కూడా కితాబిచ్చారు. ...అలా ఎన్డీఏలోకి శుభాన్షు పేరు ఇప్పుడిలా దేశమంతా మారుమోగుతోందంటే ఆయన ఎన్డీఏలో చేరి వాయుసేన పైలట్ కావడమే ప్రధాన కారణం. అయితే ఎన్డీఏలో శుభాన్షు ప్రవేశం అనుకోకుండా జరిగిందని ఆయన తండ్రి గుర్తు చేసుకున్నారు. ‘‘శుభాన్షు స్కూల్‌మేట్స్ ఎన్డీఏ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ఒకరికి వయోపరిమితి దాటిపోయింది. దాంతో శుభాన్షును రాస్తావా అని అడిగాడు. మావాడు వెంటనే సరేనన్నాడు. అలా పరీక్ష రాసి ఎన్డీఏకు సెలక్టయ్యాడు’’ అంటూ వివరించారు. తమకైతే శుభాన్షు సివిల్స్ రాసి కలెక్టర్ కావాలని ఉండేదని వెల్లడించారు. తల్లిదండ్రుల ఆనంద నృత్యం శుభాన్షు అంతరిక్షయాత్రను వీక్షించి ఆయన తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. యాగ్జియం–4 ప్రయోగాన్ని లఖ్‌నవూలో శుభాన్షు విద్యాభ్యాసం చేసిన సిటీ మాంటెసొరీ స్కూల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వారు వీక్షించారు. యాత్ర విజయవంతం కాగానే తోటివారందరితో కలిసి భాంగ్రా నృత్యం చేస్తూ ఆనందం పంచుకున్నారు. ప్రాంగణమంతా చప్పట్లతో, ‘హిప్ హిప్ హుర్రే’, ‘భారత్‌మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోయింది. తమకివి మరపురాని క్షణాలని శుభాన్షు తండ్రి శంభూ శుక్లా అన్నారు. ‘‘ఇవి ఆనందాశ్రువులు. ఇంతకన్నా మాట్లాడేందుకు నాకు మాటలే రావడం లేదు’’ అని తల్లి ఆశా చెప్పారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధిస్తాడని ముందే తెలుసన్నారు. యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రయోగానికి ముందు కుమారునికి ఆమె వర్చువల్‌గా చక్కెర కలిపిన పెరుగు తినిపించి నోరు తీపి చేశారు. తమ విద్యార్థి భారత కీర్తిని అంతరిక్షం దాకా చేర్చాడంటూ స్కూలు టీచర్లు తదితరులు కూడా హర్షం వెలిబుచ్చారు.నాడు ‘సారే జహా సే అచ్చా’ స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు శుక్లా నిలిచారు. సోవియట్ యూనియన్ సల్యూట్–7 స్పేస్ మిషన్‌లో భాగంగా రాకేశ్ శర్మ 1984లో 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేయడం తెలిసిందే. అక్కడినుంచి భూమి ఎలా కన్పిస్తోందన్న అప్పటి ప్రధాని ఇందిర ప్రశ్నకు బదులుగా ‘సారే జహా సే అచ్చా’ అంటూ రాకేశ్ శర్మ ఇచ్చిన భావోద్వేగపూరిత సమాధానంతో జాతి యావత్తూ ఉప్పొంగిపోయింది.ప్రయోగానికి ముందూ సమస్యలే యాగ్జియం–4 ప్రయోగ వేళ సమీపించగానే సహచర వ్యోమగాములతో కలిసి శుభాన్షు నెల రోజుల క్వారెంటైన్ నుంచి బయటికొచ్చారు. ఒక్కొక్కరుగా వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్ తాలూకు ఒక తీగ వేలాడుతుండటంతో పాటు పలు సమస్యలను గమనించి అప్పటికప్పుడు సరిచేశారు. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం రాకెట్ సమస్యలతో పదేపదే వాయిదా పడుతూ వచ్చింది.14 రోజులు, 60 ప్రయోగాలు శుభాన్షు తన ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 14 రోజుల పాటు గడుపుతారు. ఈ సందర్భంగా భారరహిత స్థితిలో వారు దాదాపు 60 ప్రయోగాలు నిర్వహిస్తారు. వాటిలో ఆహారం, పౌష్టికత సంబంధిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటిని నాసో మద్దతుతో ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ రూపొందించాయి. శుభాన్షు కోసం ఇస్రో ఏడు ప్రయోగాలను సిద్ధం చేసి ఉంచింది. సూక్షభార స్థితిలో మెంతులు, పెసలు ఎలా మొలకెత్తుతాయో ఆయన పరీక్షించి చూడనున్నారు. ప్రధానితో, పిల్లలతో మాటామంతి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ప్రధాని మోదీతో శుభాన్షు మాటామంతి జరపనున్నారు. అలాగే పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులతో పాటు అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థల సీఈఓలు, దిగ్గజాలతో కూడా ఆయన తన అనుభవాలను పంచుకుంటారు.క్యారెట్ హల్వా, మామిడి రసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భారతీయ వంటకాల ఘుమఘుమలాడనుంది. భారత పాక ప్రావీణ్యానికి అద్దం పట్టే కూరలు, అన్నం, మామిడి రసం వంటివాటిని శుభాన్షు ఐఎస్ఎస్కు వెంట తీసుకెళ్లారు. ‘‘తనకు క్యారెట్, పెసరపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వాటితోపాటు మరెన్నో మా ఇంటి రుచులను వెంట తీసుకెళ్లాడు. తోటి వ్యోమగాములకు కూడా రుచి చూపిస్తానని చెప్పాడు’’ అని శుభాన్షు సోదరి శుచి తెలిపా రు. ఇతర వ్యోమగాములు పప్రికా పేస్ట్ (హంగరీ), ఫ్రీజ్–ఫ్రైడ్ పైరోజీస్ (పోలండ్) వంటి వంటకాలను తమతో పాటు తీసుకెళ్లారు.నింగిని నెగ్గి, తారలు తాకి శుభాన్షుకు వాయుసేన అభినందనలు యాగ్జియం–4 మిషన్‌ను భారత్‌కు ఓ అది్వతీయానుభూతిగా వాయుసేన అభివరి్ణంచింది. ‘‘వాయుసేన యోధుడు గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా చరిత్రాత్మక అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టారు. నింగిని నెగ్గుతూ తారల్ని తాకుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను తనతోపాటు సగర్వంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లారు’’ అంటూ అభినందించింది. ఆయన ప్రొఫైల్ ఫొటోను షేర్ చేసింది. ‘నీలిదుస్తుల్లో (వాయుసేన యూనిఫాంను ఉద్దేశించి) శిక్షణ, చుక్కలకేసి పయనం’ అంటూ అందమైన క్యాప్షన్ జోడించింది. ‘ఈ అద్భుత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం’ జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన అక్షరాలతో మరో సందేశాన్ని పోస్టు చేసింది. కేంద్ర మంత్రివర్గం అభినందనలు దేశ ఆకాంక్షలను మోసుకెళ్లారు: మోదీ యాగ్జియం–4 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాన్షు తనతో పాటు అంతరిక్షంలోకి మోసుకెళ్లారన్నారు. ‘‘ఐఎస్ఎస్లో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా నిలవనున్న గ్రూప్ కెప్టెన్ శుక్లాకు, ఇతర వ్యోమగాములకు శుభాభినందనలు’’ అంటూ ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై శుభాన్షుకు అభినందనలు తెలిపింది. యాగ్జియం–4 యాత్ర దిగి్వజయం కావాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ చదివి విని్పంచారు.సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారు: ఖర్గేశుభాన్షు సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఆయన యాత్ర సఫలమవాలన్నారు.

ఆ ఐదింటిలో... టాప్–10లో భారత్
సాక్షి, స్పెషల్ డెస్క్ : కీలకమైన ఐదు ప్రధాన సాంకేతిక రంగాల్లో భారత్ టాప్–10లో చోటు సంపాదించింది. ఈ రంగాల్లో ప్రపంచంలోని 25 ప్రధాన దేశాల సామర్థ్యాలను తెలియజేస్తూ హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌కు చెందిన బెల్ఫర్ సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్’ అనే సూచీని రూపొందించింది. ఏఐ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్స్, అంతరిక్షం, క్వాంటమ్ టెక్నాలజీ విభాగాల్లో దేశాల తయారీ సామర్థ్యం, సాంకేతిక పురోగతి, ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరుల వంటి అంశాల ఆధారంగా దేశాలకు స్థానాలు కేటాయించారు.ఏఐలో దూసుకుపోతూ..కృత్రిమ మేధ విభాగంలో భారత్ దూసుకుపోతోందని చెప్పాలి. దేశంలో ఏఐ వినియోగం.. అమెరికా, యూకేలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 90% మంది ఏదో ఒక విధంగా ఏఐని వాడుతున్నారు. దేశంలో ఏఐ యూజర్ల సంఖ్య 72 కోట్లు దాటింది. ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్’ ఏఐ విభాగంలో జపాన్ , తైవాన్ , దక్షిణ కొరియా కంటే మనం ముందున్నాం. బయో టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారత్ అగ్రదేశాల సరసన చోటు దక్కించుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మనమే ప్రపంచంలో నంబర్ వన్. ఈ సూచీలోని బయోటెక్నాలజీ విభాగంలో ఫ్రాన్స్, తైవాన్ , దక్షిణ కొరియాలను మనం అధిగమించాంసిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో.. సెమీకండక్టర్ల తయారీలో వాడే సిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం మూడో స్థానంలో ఉన్నాం. ప్రపంచ చిప్ వినియోగంలో 10 శాతం వాటా భారత్ కైవసం చేసుకుంది. చిప్ డిజైన్ సౌకర్యాలలో ప్రపంచంలో 7% మాత్రమే భారత్ కలిగి ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని డిజైన్ ఇంజనీర్లలో దాదాపు 20% మంది భారత్‌లోనే ఉన్నారు. వీరిలో అత్యధికులు యూఎస్, యూరప్ సంస్థల కోసం పనిచేస్తున్నారు. ఈ సూచీలో సెమీకండక్టర్స్ విభాగంలో మనం ఫ్రాన్స్కంటే ముందున్నాం. 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రోఅంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రో చోటు సంపాదించింది. ప్రపంచంలో మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ‘మంగళ్యాన్’ ప్రాజెక్టు ద్వారా అంగారకుడిపైకి అడుగుపెట్టిన దేశం భారత్. ఈ సూచీలో అంతరిక్ష విభాగంలో జపాన్ , దక్షిణ కొరియా, తైవాన్ కంటే మనదేశం ముందుంది. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అత్యధిక పేటెంట్లకు దరఖాస్తు చేసిన దేశాల్లో మనదేశం 9వ స్థానంలో ఉంది. ఈ సూచీలో క్వాంటమ్ టెక్నాలజీలో తైవాన్, దక్షిణ కొరియాలను భారత్ మించిపోవడం గమనార్హం.ఏయే అంశాల ఆధారంగా స్కోర్‌ను నిర్ణయించారంటే...ఏఐటాప్ మోడల్స్ కచ్చితత్వం, డేటా, ఆల్గరిధమ్స్, కంప్యూటింగ్ పవర్, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు.బయోటెక్నాలజీ జన్యు ఇంజనీరింగ్, ఔషధాల తయారీ, వ్యాక్సిన్ పరిశోధన, వ్యవసాయ సాంకేతికత, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు.సెమీకండక్టర్స్అసెంబ్లింగ్, టెస్టింగ్, ఎక్విప్మెంట్, తయారీ–ఫ్యాబ్రికేషన్ , చిప్ డిజైన్ – టూల్స్, ప్రత్యేక ముడిపదార్థాలు–వేఫర్స్, నియంత్రణ, అంతర్జాతీయంగాస్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు. స్పేస్రిమోట్ సెన్సింగ్, టెలికమ్యూనికేషన్ ్స, పొజిషనింగ్–నావిగేషన్ –టైమింగ్, సైన్ ్స– అంతరిక్ష పరిశోధన, దేశీయంగా అంతరిక్ష ప్రయోగ సామర్థ్యం, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు క్వాంటమ్క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ , సెన్సింగ్,ప్రభుత్వ విధానాలు, అంతర్జా తీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో ఎమ్మెస్ టాపర్‌గా తెలుగమ్మాయి
అమలాపురం టౌన్: అమెరికా దేశం వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం అమ్మాయి చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్‌గా నిలిచింది. ఆమె కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ మనమరాలు. అమెరికాలోని ఆ స్కూల్లో శనివారం జరిగిన కాన్వగేషన్లో శ్రీకావ్యకు ఎమ్మెస్ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రదానం చేశారు. శ్రీకావ్య ఇప్పటికే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసింది.హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంటెక్, స్వీడన్ బ్లెకింజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి టెలీ కమ్యూనికేషన్స్ సిస్టమ్‌లో ఎమ్మెస్ డిగ్రీ చేసింది. కోచ్ కోడ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ చేసింది. ఈ ఇనిస్టిట్యూట్‌లో శ్రీకావ్య ఆటోమేషన్ ఆఫ్ క్లౌడ్ హాస్టెడ్ అప్లికేషన్స్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. ఈమె స్పోర్ట్స్‌లో కూడా విజేతే. జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్‌గా, తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత పది మీటర్ల మహిళా షూటింగ్ చాంపియన్ షిప్ గెలుచుకుంది. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్‌లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్‌లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్‌లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది.

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్‌లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్‌లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్‌కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
క్రైమ్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమీర్‌పేట లాడ్జ్‌కి తీసుకెళ్లి..
హైదరాబాద్: యువతిని మోసం చేసి బాబు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై మధురానగర్ పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి షాద్‌నగర్ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో సీనియర్ ద్వారా అయిన భరత్‌రెడ్డి పరిచయమయ్యాడు. గత ఏడాది యువతిని అమీర్‌పేట ఓయో రూంలో బలవంతంగా కలిశాడు.గర్భవతినని ఆమె భరత్‌రెడ్డికి చెప్పగా పెళ్ళి చేసుకుందామని చెప్పాడు.ఆ తరువాత ఆమెకు బాబు పుట్టాడు. దీంతో బాధితురాలుషాద్నగర్లోని భరత్‌రెడ్డి ఇంటికి వెళ్ళగా దుర్బాషలాడి పంపారు. తనను మోసం చేసిన భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు.

మద్యం తాగించి ఈవెంట్ డ్యాన్సర్‌పై లైంగిక దాడి
గచ్చిబౌలి: వైన్ షాపు ముందు పరిచయమైన ఓ యువకుడు అతిగా మద్యం తాగించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం..సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈవెంట్లలో డ్యాన్సర్‌గా పని చేసే ఓ యువతి (23) గచ్చిబౌలి జంక్షన్‌లోని వైన్ షాపు వద్ద మద్యం తాగుతోంది. కుక్‌గా పనిచేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రకాష్ (32) అదే వైన్ షాపు వద్దకు వచ్చాడు. మద్యం తాగుతున్న యువతిని పరిచయం చేసుకొని..ఇలా రోడ్డుపై తాగితే మంచిది కాదని చెప్పాడు. దగ్గర్లోనే తన రూమ్ ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెళకువ రావడంతో లేవగా..ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంది. దీంతో ఆ యువతి మోసం చేశావంటూ ప్రకాష్ తో గొడవకు దిగింది. తెల్లవారే వరకు అక్కడే ఉండాలని ప్రకాశ్ తన మొబైల్లో తీసిన యువతి న్యూడ్ ఫొటోలు చూపించాడు. ఎవరికి చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ ఫొటోలు అందరికి పంపిస్తానని బెదిరించాడు. అయినా యువతి మాత్రం తాను ఇక్కడ ఉండనని గొడవ పడి ఫ్రెండ్‌కు ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతిగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ఫోన్ సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు. మరో పోలీసులకు గాయాలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్ను కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు. ఇదిలా ఉండగా.. అంతకుముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆపినట్టు క్షతగాత్రులు తెలిపారు. అనంతరం, బయలుదేరిన పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

భర్తను కాదని భార్య వేరే యువకుడితో..
కర్ణాటక: ఓ యువకుడు తమ ప్రియురాలిని చంపి తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన జిల్లాలోని కరోటి గ్రామంలో జరిగింది. హాసన జిల్లా హొసకొప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి హత్యకు గురైంది. పునీత్ అనే యువకుడే హత్య చేసిన నిందితుడు. ప్రీతికి వివాహమై పిల్లలున్నా పునీత్ వెంటపడింది. గత ఆదివారం మండ్య, మైసూరులకు ట్రిప్ వెళ్లిన ఇద్దరూ జాలీ జాలీగా సమయాన్ని గడిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కేఆర్ పేటె కత్తరఘట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పునీత్ ఆమెను చంపి బంగారు ఆభరణాలను దోచుకుని ఆమె మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పునీత్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రీతి పెళ్లయి పిల్లలు ఉన్నా పునీత్ వెంటపడి తనువు చాలించగా తల్లిని కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు.