Horoscope
-
Horoscope Today: ఈ రాశివారికి సన్నిహితుల నుంచి కీలక సమాచారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, కార్తీక మాసం; తిథి: శు.విదియ రా.8.06 వరకు, తదుపరి తదియ; నక్షత్రం: అనూరాధ పూర్తి(24 గంటలు); వర్జ్యం: ఉ.9.46 నుండి 11.26 వరకు’ దుర్ముహూర్తం: సా.3.57 నుండి 4.45 వరకు; అమృత ఘడియలు: రా.7.51 నుండి 9.34 వరకు; రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు; యమగండం : ప.12.00 నుండి 1.30 వరకు; సూర్యోదయం : 6.02; సూర్యాస్తమయం : 5.26; భగినీ హస్త భోజనం. మేషం: దూరప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు.వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. విందువినోదాలు.మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. యత్నకార్యసిద్ధి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.సింహం: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.కన్య: ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. కార్యజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.తుల: కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆస్తి వివాదాలు. సోదరులు, మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.వృశ్చికం: యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.మకరం: కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. వాహనసౌఖ్యం.కుంభం: సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. గత సంఘటనలు గుర్తుకువస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.మీనం: కుటుంబంలో చికాకులు. అరోగ్య సమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. -
ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో విజయం, ఆకస్మిక ధనలాభం
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.తదియ రా.1.41 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: రేవతి ఉ.9.37 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: తె.4.16, నుండి 5.46 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.08 వరకు, అమృత ఘడియలు: ఉ.7.35 నుండి 8.54 వరకు, తదుపరి రా.1.15 నుండి 2.56 వరకు.సూర్యోదయం : 5.51సూర్యాస్తమయం : 5.58రాహుకాలం : ఉ.10.30నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టించినా ఫలితం ఉండదు. రుణయత్నాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.వృషభం: కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.మిథునం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.సింహం: అనుకున్న పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చిక్కులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.కన్య: ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమఫలిస్తుంది..తుల: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.వృశ్చికం: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు తథ్యం.ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.మకరం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కుంభం: కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.మీనం: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. రాబడికి మించి ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. -
Weekly Horoscope: కొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తారు
మేషంకొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆశించిన రాబడి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషదాయకంగా గడుస్తుంది. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. నలుపు, లేత గులాబీ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.వృషభంఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే ఆశాజనకంగా ఉంటాయి. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఊహించని కొన్ని సంఘటనలు ఎదురై ఆకట్టుకుంటాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. మీ అభిప్రాయాలను మిత్రులతో పంచుకుని సలహాలు స్వీకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుస్తుంది. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దగ్గరకు వస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు, గణేశాష్టకం పఠించండి.మిథునంఆర్థికంగా మరింత బలపడతారు. రుణగ్రస్తుల బాధలు తొలగుతాయి. మీ మాట నెగ్గించుకునేందుకు మరింత శ్రమిస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో సానుకూల వాతావరణం. పారిశ్రామికవర్గాల యత్నాలు మరింత వేగవంతంగా కాగలవు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, బంగారు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కర్కాటకంముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి మొత్తానికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. చిరకాల శత్రువులు కూడా మిత్రులుగా అనుకూలంగా మారతారు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వాక్చాతుర్యం మీకు వరంగా మారనుంది. వ్యాపార లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో స్వల్ప వివాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. ఎరుపు, గులాబీ రంగులు, శివాష్టకం పఠించండి.సింహంపనులలో ప్రతిబంధకాలు రావచ్చు. ఆలోచనలు నిలకడగా సాగక ఎటూ పాలుపోదు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల సలహాల కోసం యత్నిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు అతి సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధులు గందరగోళంగా ఉండవచ్చు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు, దుర్గాదేవిని స్మరించండి.కన్యఆర్థిక లావాదేవీలను క్రమపద్ధతిలో నిర్వహిస్తూ అప్పులు లేకుండా గడిపేస్తారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలను వేగవంతంగా చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పట్టుదలతో నిర్వహించి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.తులవ్యవహారాలను పూర్తి చేయడంలో సఫలమవుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలకు స్వస్తి చెబుతారు. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.వృశ్చికంఎంతటి వారినైనా ఆకట్టుకునేలా మాట్లాడతారు. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. వాహనయోగం. కుటుంబంలో వేడుకల కోసం సన్నాహాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.ధనుస్సుఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖులతో సమావేశమవుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి.. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు రావచ్చు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, దేవీస్తోత్రాలు పఠించండి.మకరంఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.కుంభంకొన్ని ఇబ్బందులను అధిగమించి కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగి సమస్యలను అధిగమిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. ఎరుపు, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.మీనంసంఘంలో పరపతి పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. గతంలో మీకు దూరమైన కొందరు ఆప్తులు తిరిగి దగ్గరవుతారు.. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో మరింత దూసుకువెళతారు. ఉద్యోగులకు కీలక సందేశం. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం మధ్యలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. -
ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త అందుతుంది, వ్యాపారంలో ధనలాభం
మేషం..ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.వృషభం..ఇబ్బందులు, సమస్యలు చాకచక్యంగా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. పర పతి కలిగిన వారితో పరిచయాలు. కుటుంబసభ్యులు మీ ప్రతిపాదనలు అంగీకరిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.మిథునం..ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త రుణాల అన్వేషణ. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక సతమతమవుతారు. విద్యార్థుల కృషి వృథాగా మారుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలాభం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కర్కాటకం..నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.సింహం..చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో మీహోదాలు కొంత పెరుగుతాయి. కళారంగం వారికి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో «లేనిపోని ఖర్చులు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. పసుపు, తెలుపు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.కన్య..ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అధిగమిస్తారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.తుల..కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల పరిష్కారం. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉంటాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో కొన్ని వివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆకుపచ్చ, నీలం రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.వృశ్చికం..ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన పనుల్లో విజయం సాదిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత వరకూ పరిష్కారం. విద్యార్థుల యత్నాలు సఫలం. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకోని సంఘటనలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు..సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు రాగలవు. రాజకీయవర్గాలకు పదవులు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, నీలం రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.మకరం..కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ముఖ్యమైన పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో వృథా ధనవ్యయం. బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.కుంభం..అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో సోదరులతో వివాదాలు. విలువైన పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.మీనం..కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. ఆరోగ్యసమస్యలు తీరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. సన్నిహితులతో మాటపట్టింపులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. గణేశ్ స్తోత్రాలు పఠించండి. -
జూన్ 20 నేటి దినఫలం.. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం
మేషం: ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.వృషభం: గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయ ప్రయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.మిథునం: కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.కర్కాటకం: శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. అద్భుతమైన అవకాశాలను పొందుతారు.సింహం: స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. దైవదర్శనం చేసుకుంటారు. కన్య: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.తుల: నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.వృశ్చికం: మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ధనుస్సు: విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.మకరం: ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబకలహాలు దూరమవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.కుంభం: నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.మీనం: ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. -
ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలం.. ధనలాభం
మేషం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభం. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.వృషభం: రుణదాతల ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువిరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.మిథునం: దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి. సంఘంలో ఆదరణ. ఆభరణాలు, వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.సింహం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.కన్య: అనుకున్న పనుల్లో పురోగతి. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది.తుల: కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. ధనవ్యయం. మిత్రుల నుంచి సమస్యలు. దైవచింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.ధనుస్సు: మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న మార్పులు సంభవం.మకరం: రుణాలు చేస్తారు. పనుల్లో ప్రతిష్ఠంభన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.మీనం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి. -
ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.పాడ్యమి సా.6.55 వరకు, తదుపరి విదియ నక్షత్రం: అనూరాధ ఉ.9.58 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: ప.3.43 నుండి 5.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.51 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.11 వరకు అమృతఘడియలు: రా.1.32 నుండి 3.13 వరకు.సూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.23రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం: శ్రమానంతరం పనులు పూర్తి. మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.వృషభం: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.మిథునం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.కర్కాటకం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.కన్య: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. తుల: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.మకరం: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.కుంభం: శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులు, సోదరీలతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.మీనం: ఆదాయానికి మించి ఖర్చులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. -
Horoscope today: ఈ రాశుల వారు ఈ రోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.దశమి రా.6.54 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.9.37 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.10.45 నుండి 12.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ఉ.7.54 నుండి 9.35 వరకు సూర్యోదయం : 5.47 సూర్యాస్తమయం : 6.11 రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. చర్చల్లో ప్రతిష్ఠంభన. సోదరులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. వృషభం: పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. మిథునం: వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. అనారోగ్యం. కర్కాటకం: ఇంటాబయటా అనుకూలం. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు. సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో వివాదాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే. కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృశ్చికం: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. ధనుస్సు: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు. మకరం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. మీనం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం. -
Horoscope Today: ఈ రాశి వారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.నవమి సా.5.27 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పుష్యమి ఉ.7.41 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.30 నుండి 11.14 వరకు, దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.24 వరకు, అమృత ఘడియలు: లేవు, శ్రీరామనవమి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.47, సూర్యాస్తమయం: 6.11. మేషం: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు. వృషభం: ప్రముఖులు సహాయపడతారు. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష రాణింపు. మిథునం: ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. కర్కాటకం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు. సింహం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.. కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు. తుల: ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో పురోభివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం. ధనుస్సు: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు. మకరం: బాకీలు వసూలవుతాయి. ఆప్తులు, బంధువులతో వివాదాలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. -
Today Telugu Horoscope: ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు, వస్తులాభాలు
మేషం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. విందువినోదాలు. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మిథునం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.. కర్కాటకం: గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.. సింహం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విద్యార్థులకు కృషి చేసినా ఆశించిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. కన్య: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక పోస్టులు. తుల: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు. దేవాలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. బంధువిరోధాలు. మానసిక అశాంతి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. కళాకారులకు నిరాశ తప్పదు. ధనుస్సు: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలునత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కుంభం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం.. మీనం: బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం. -
Horoscope today: ఈ రాశి వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.సప్తమి ప.3.50 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పునర్వసు పూర్తి (24గంటలు), వర్జ్యం: సా.5.44 నుండి 7.24 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృతఘడియలు: రా.3.22 నుండి 5.56 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.11 మేషం: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. వృషభం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. బంధువుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. సింహం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. నిర్ణయాలలో పొరపాట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. కన్య: వివాహయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. తుల: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా మీదే పైచేయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వృశ్చికం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కుంభం: స్థిరాస్తి వృద్ధి. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో కలహాలు. దైవదర్శనాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులకు సిద్ధపడాలి. -
Horoscope today: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.షష్ఠి ప.3.46 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: ఆరుద్ర లె .5.17 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి పునర్వసు, వర్జ్యం: ప.1.23 నుండి 3.01 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.20 వరకు, అమృతఘడియలు: రా.7.07 నుండి 8.06 వరకు. సూర్యోదయం : 5.49 సూర్యాస్తమయం : 6.11 రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం. దైవచింతన. వృషభం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. మిథునం: నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలత. విచిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమా«ధిక్యం. సింహం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కన్య: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల:శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ. వృశ్చికం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకరం: మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. మీనం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. -
Horoscope today: ఈ రాశి వారు శత్రువులను సైతం ఆకట్టుకుంటారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.పంచమి సా.4.14 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మృగశిర తె.4.50 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.10.24 నుండి 12.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.26 వరకు, అమృతఘడియలు: రా.8.02 నుండి 9.43 వరకు, శ్రీ పంచమి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10. మేషం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. అదనపు రాబడి. కొత్త పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారులకు మరింత వెసులుబాటు. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి. వృషభం: అప్పులు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. అనారోగ్యం. ఆలయాల దర్శనాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు లేనిపోని చికాకులు. రాజకీయవేత్తలకు ఒత్తిళ్లు. మిథునం: చిన్ననాటలు మిత్రుల కలయిక. శుభవార్తా శ్రవణం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఊహించని అభివృద్ధి. కళాకారులకు అవార్డులు. కర్కాటకం: కృషి చేసినా ఫలితం కనిపించదు. కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తల పర్యటనలు వాయిదా. సింహం: వ్యాపారుల ప్రయత్నాలలో పురోగతి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం. యత్నకార్యసిద్ధి. ఇంటిలో శుభకార్యాలు. నూతన పరిచయాలు. వాహన, గృహయోగాలు. కళాకారులకు సన్మానాలు. దైవదర్శనాలు. కన్య: కుటుంబసమస్యలు తీరతాయి. కార్యక్రమాలలో విజయం. దూరపు బంధువుల నుంచి ధనలాభం. ఉద్యోగయోగం. వ్యాపారులకు అధిక మొత్తంలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. తుల: కొన్ని పనులలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. మిత్రులతో తగాదాలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. శ్రమ మరింత పెరుగుతుంది. వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారులు మరింత కష్టపడాలి. ఉద్యోగులకు ఒత్తిళ్లు. విద్యార్థుల కృషికి తగ్గ ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మందగిస్తాయి. ధనుస్సు: ధైర్యంతో ముందడుగు వేసి పనులు పూర్తి చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. నూతన పరిచయాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. విందువినోదాలు.. మకరం: పనుల్లో విజయం. విలువైన సమాచారం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కుంభం: ఇంటాబయటా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయం కొంత తగ్గి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలోఅదనపు బాధ్యతలు. కళాకారుల యత్నాలలో అవరోధాలు. మీనం: ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు చికాకులు. -
ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తి, ఆకస్మిక ధనలాభం
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చవితి సా.5.09 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రోహిణి తె.4.48 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి మృగశిర, వర్జ్యం: రా.8.56 నుండి 9.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.12 వరకు, అమృతఘడియలు: రా.1.40 నుండి 3.14 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10. మేషం: రుణఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగమార్పులు. వృషభం: నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిథునం: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. కర్కాటకం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వాహనయోగం. సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహన,గృహయోగాలు. వృత్తి,వ్యాపారాలలో అనుకూలత. దైవదర్శనాలు. కన్య: ఆప్తులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆప్తులతో వివాదాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వృశ్చికం: సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. దైవదర్శనాలు. ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తిలాభం. మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. కుంభం: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాల పరిష్కారం. మీనం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. -
Horoscope today: ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.తదియ సా.6.31 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: భరణి ఉ.6.05 వరకు, తదుపరి కృత్తిక తె.5.16 వరకు (తెల్లవారితే శుక్రవారం), వర్జ్యం: సా.5.40 నుండి 7.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: రా.2.55 నుండి 4.28 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.50, సూర్యాస్తమయం: 6.10. మేషం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో కొత్త ఆశలు. వృషభం: రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. మిథునం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కర్కాటకం: ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. సింహం: వ్యయప్రయాసలు. మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. రాబడికి మించి ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. కన్య: కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు. తుల: ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. వృశ్చికం: అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ తగ్గుతుంది.. ధనుస్సు: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బ«ంధువులతో తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. మకరం: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో విరోధాలు. ఆలోచనలు కలసిరావు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు. కుంభం: శుభవార్తలు అందుతాయి. కార్యజయం. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. మీనం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. -
Horoscope today: ఈ రాశి వారికి వారికి ఆకస్మిక ధనలబ్ధి
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.విదియ రా.8.15 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: అశ్విని ఉ.7.11 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: సా.4.20 నుండి 5.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.25 వరకు, అమృత ఘడియలు: రా.1.31 నుండి 3.01 వరకు సూర్యోదయం : 5.51 సూర్యాస్తమయం : 6.10 రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృషభం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. మిథునం: సన్నిహితుల నుంచి ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. శుభవార్తలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కన్య: ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు. తుల: ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. సమస్యలు కొన్ని తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం. వృశ్చికం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. శుభవార్తలు వింటారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మకరం: సన్నీహి తులతో కలహాలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం. కుంభం: పనులలో ముందుకు సాగుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి.శు¿¶ వార్తలు వింటారు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత. మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. -
Horoscope Today: ఈ రాశివారికి ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.పాడ్యమి రా.10.06 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: రేవతి ఉ.8.32 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: రా.2.56 నుండి 3.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.07 వరకు తదుపరి రా.10.53 నుండి 11.41 వరకు, అమృతఘడియలు: ఉ.6.20 నుండి 7.55 వరకు, ఉగాది పండగ. సూర్యోదయం : 5.52 సూర్యాస్తమయం : 6.10 రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. వృషభం: ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభాలు. మిత్రులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశంసలు. మిథునం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు ,ఉద్యోగాలు కొంత ఊరటనిస్తాయి. కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. దూరపు బంధువులతో చర్చలు. కీలక నిర్ణయాలు.. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.. దైవదర్శనాలు. సింహం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. కన్య: మిత్రులతో కొంత సఖ్యత. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. తుల: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ముఖ్య నిర్ణయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత. వృశ్చికం: నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. ధనుస్సు: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులు, మిత్రుల కలయిక. అత్యంత ముఖ్య సమాచారం. వ్యాపారాలలో కొంత నిరుత్సాహం. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు.. మకరం: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. ఆస్తిలాభం. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కుంభం: కొన్ని పనులలో జాప్యం. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ఆలస్యం. ఆరోగ్యం కుదుటపడుతుంది. శ్రమ పడినా ఫలితం కనిపిస్తుంది.. బంధువుల నుండి శుభవార్తలు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఉత్సాహం -
ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు
వృషభ రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3. కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు. వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు. ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి. కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం. కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు. శాంతి మార్గం: తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ, గురు జపం, దానం చేయించండి. ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం. మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు. ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు. జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి. ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి. -
ఈ నూతన సంవత్సరాన ఈ రాశి వారికి ఋణ విషయాలలో విచిత్ర స్థితి
మిథున రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–3, అవమానం–6. మృగశిర 3,4 పాదములు (కా, కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా) గురువు మే 1 వరకు మేషం (లాభం)లోను తదుపరి వృషభం (వ్యయం)లోను సంచరిస్తారు. శని కుంభం (భాగ్యం)లోను రాహువు మీనం (దశమం)లోను కేతువు (చతుర్థం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలిసీ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరినీ నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ పరిథిలో ఉన్న పనులు మాత్రమే చేయండి. వీలైనంత వరకు కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. మీకు కొన్ని సందర్భాలలో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు. ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించనివారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు. కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా జాగ్రత్తలు పాటించాలి. మితభాషణ చాలా అవసరం. తోటివారు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వర్కర్స్తో బహుజాగ్రత్తలు పాటించడం, వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాలలోనూ గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు అందరితోనూ కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధనవ్యయం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అధిక ధనలాభం చేకూరుతుంది. అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి. ఋణ విషయాలలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త ఋణాలు ఆలస్యంగా అందుతాయి. భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు చేయుట వలన ధనవ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడుపగలుగుతారు. అందరి నుంచి సహకారం ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయసంచారం దృష్ట్యా మే నుంచి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ, నష్టాలు మాత్రం ఉండవు. మంచికాలమే. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి అనుకూలత తక్కువ. ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురువు వ్యయస్థితి సంచార ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా, నష్టం మాత్రం ఉండదు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేక సూచన. మితభాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర ఘటనలు, అధిక ధనవ్యయం చికాకు పెడతాయి. వాహన లాభం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా నష్టం జరుగుతుంది. ఋణ, ఆరోగ్య విషయాలు ద్వితీయార్ధంలో చికాకు కలిగిస్తాయి. శాంతి మార్గం: మే నెలలో గురుశాంతి చేయించండి. తెల్లజిల్లేడు, మారేడు, గరికలతో గణపతి అర్చన, ప్రాతఃకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజూ ‘గజేంద్ర మోక్షం’ పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్ష ధరించండి. ఏప్రిల్: ఈనెల శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో రాణిస్తారు. అధికారలాభం, అనుకూల స్థానచలనం. రాజకీయరంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కలుగుతాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా, లాభం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యో గులు ఇబ్బంది పడతారు. స్వబుద్ధితో చేసే పనులన్నీ లాభిస్తాయి. రైతులకు చికాకులు ఉంటాయి. మే: అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నిత్య శివదర్శనం, తీర్థస్నానాలు మంచివి. షేర్ వ్యాపారులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. విద్యార్థులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడతారు. జూన్: ప్రయాణాలవల్ల శారీరక అలసట. లాభాలు ఉన్నా, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మంచిది. కోర్టు, ఋణ వ్యవహారాల్లో పరిష్కారమార్గం దొరుకుతుంది. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి. నిత్యం శివ, సుబ్రహ్మణ్య ధ్యానం మంచిది. అధికారులు ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియని పరిస్థితి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, విద్యార్థులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెలలో అన్నివిధాలా బాగుంటుంది. ఆర్థికపుష్టి కలుగును, శుభవార్తలు వింటారు. పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నెలాఖరున కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. 15వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. కొత్త ఋణాలు సమయానికి అందుతాయి. పాతవి తీర్చగలుగుతారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల దర్శనం చేస్తారు. సెప్టెంబర్: కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. çసంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్రా నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ, స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది. అక్టోబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉంది. బంధువర్గంతో సమస్యలు, పనుల్లో ఆలస్యం, శారీరక శ్రమ ఉంటాయి. తరచు వివాదాలు ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు, పనిముట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాలక్షేపం ప్రమాదకరం కాగలదు. నవంబర్: కుటుంబ ఖర్చులు పెరిగినా, అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మంచిది. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు కొంచెం అనుకూల స్థితి తక్కువ. డిసెంబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలం. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులను ఇతరుల సహాయంతో అధిగమిస్తారు. వ్యర్థ ప్రయాణాలు, వృథా ఖర్చులు, లాభాలు అంతంత మాత్రం. నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఋణ బాధల వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు చికాకులు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత. జనవరి: ఉద్వేగపూరిత ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. బంధువర్గం అనుకూలత, మిత్ర సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక చికాకులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులకు శ్రమ ఎక్కువ. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు శుభసూచకం. ఆర్ద్రా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు. ఫిబ్రవరి: కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పనికీ అధిక ప్రయత్నం అవసరం. విష్ణు ఆరాధన శుభప్రదం. ఆర్ద్రానక్షత్రం వారికి లాభదాయకం. «శ్రమ ఎక్కువైనా కార్య సాఫల్యావకాశాలు బాగున్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. మార్చి : ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు. మీ మాటకు విలువ పెరుగుతుంది. -
ఉగాది ఆరంభంతో ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి అవకాశం
కర్కాటక రాశి ఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6 పునర్వసు 4వ పాదము (హి) పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా) ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ) గురువు మే 1 వరకు మేషం (దశమం)లోను తదుపరి వృషభం (లాభం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (అష్టమం)లోను రాహువు మీనం (నవమం)లోను కేతువు (తృతీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో ఏ పనీ కూడా చేయరు. పుణ్యకార్యాలలో ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. అన్న, వస్త్ర, స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. కొన్ని పనులను దాటవేసే ఆలోచనలు చేస్తారు. కొన్ని పనులను ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తరచుగా ‘నరఘోష’కు గురి అవుతుంటారు. తద్వారా చికాకు పడతారు. అష్టమ శని వల్ల అన్ని రంగాలలోనూ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కలహాలు తలెత్తుతాయి. జాగ్రత్తపడండి. ఉద్యోగ విషయాలు చాలా శ్రమాధిక్యం అవుతుంటాయి. మీకు గురుబలం దృష్ట్యా అన్ని పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినా, అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమోషన్కు తగిన అర్హతలు ఉన్నప్పటికీ అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేవారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉన్నా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందుతాయి. కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాలలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ బంధువులు బాగా సహకారం చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. తరచుగా ప్రయాణములు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య, ఆర్థిక చికాకులు పొందడం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుంచి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఆదాయం బాగా ఉన్నా, ఖర్చులు మీ ఇష్టానుసారం ఉండవు. పాత ఋణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త ఋణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలం అవుతారు. కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందు జాగ్రత్తలతో దాటవేయగలరు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతారు. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది. కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి. మానసిక ఆందోళన ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలమైన సమయం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కానీ నష్టపడే కాలం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలçహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్నా, వస్తు నిర్ణయం విషయంలో శ్రమ ఎక్కువ. విద్యార్థులు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర, అనవసర విషయాలు తరచుగా ఇబ్బంది కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారుతుంది. పునర్వసు నక్షత్రం 4 వారికి బంధు మిత్రులు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి, వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక అసహనం చెందుతారు. స్వయంగా పర్యవేక్షించే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి తరచు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అధిక వ్యయంతో సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్లు అనుకూలం, కొన్నాళ్లు ప్రతికూలంగా సంవత్సరం అంతా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలలో నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరగవచ్చు. శాంతి మార్గం: శని, రాహువులకు జపం, దానం చేయించండి. ఆంజనేయస్వామి దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. ఏప్రిల్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ– వాహనాల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మౌనం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితం అందుకుంటారు. మే: వృత్తి వ్యాపారాలలో ఊహించని అనుకూలత. ఆర్థిక లాభాలున్నా, ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. అవరోధాలను అధిగమిస్తారు. ఋణాల విషయంలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. రైతులకు అనుకూలం. జూన్: స్థానమార్పులు ఉంటాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలలో కిందిస్థాయి వారితో చికాకులు తప్పవు. అధికారుల అండదండలు ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలం. జులై: పనులు లాభదాయకంగా ఉంటాయి. ధనం నిల్వ చేయగలరు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బందులు. శుభవార్తలు వింటారు. భూ–గృహలాభం ఉంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. రైతులు, విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: ఈ నెల ఏ పని చేపట్టినా అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ విషయమై డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపిస్తుంది. 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆశ్లేషా నక్షత్రం వారికి కుటుంబ సభ్యులతో సయోధ్య కుదరని సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు అనుకూలం. సెప్టెంబర్: మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులు రాబోవు ఆరు మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, ఋణ వ్యవహారాలలో రాబోవు ఆరు మాసాలు ప్రతికూల స్థితి. శని కుజ గ్రహముల శాంతి చేయించండి. అక్టోబర్: పనుల్లో ఆలస్యం, శారీరక రుగ్మతల బాధ పెరుగుతాయి. మనోధైర్యం తగ్గుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీకు లేదా మీ కుటుంబ పెద్దలకు వైద్యం అత్యావశ్యకం అవుతుంది. అతి శ్రమ చేస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులు తెలివి, ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు. నవంబర్: రానున్న 5 నెలలు అనేక సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇతరులపై ఆధారపడకుండా వ్యవహరించాలి. మనస్పర్ధలు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు ఆలస్యం కావడం వల్ల కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలతలు లేవు. షేర్ వ్యాపారులు నష్టపడకుండా బయటకు రావడం కష్టసాధ్యం. శుభకార్య ప్రయత్నాలు, అభివృద్ధి ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దని సూచన. డిసెంబర్: వృత్తిలో విశేష గుర్తింపు లభిస్తుంది. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల సందర్శనం, అనుకూల బదిలీలు ఉంటాయి. ఋణ సమస్యలు తగ్గుతాయి. దాంపత్యంలో ఇబ్బందులు, పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. స్థిరాస్తి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలలో వాయిదాలు శ్రేయస్కరం. జనవరి: శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థల వలన మనస్తాపం. బంధువర్గం సహకరిస్తారు. ఋణవిముక్తి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వసు నక్షత్రంవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండవచ్చు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలం. ఫిబ్రవరి: మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. పనులు ఆలస్యమైనా, సహనంతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన మంచిది. బంధు మిత్రులకు సేవ చేయవలసిన పరిస్థితి వలన మీ దైనందిన కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు ఫలితాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: కుటుంబ పెద్దలకు స్వల్ప ఆరోగ్య సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మందగమనం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు. -
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
సింహ రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–2, అవమానం–2. మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1వ పాదము (టే) గురువు మే 1 వరకు మేషం (నవమం)లోను తదుపరి వృషభం (దశమం)లోను సంచరిస్తారు. శని కుంభం (సప్తమం)లోను రాహువు మీనం (అష్టమం)లోను కేతువు (ద్వితీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన లేకపోవడం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా వెళతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే కాలం. ఇబ్బందులు పోగొట్టుకోవడం మీ ప్రయత్నాలలోనే ఉన్నది. వృథా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని వల్ల అన్ని పనులూ ఆలస్యం అవుతుంటాయి. అయితే స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదు. ఉద్యోగ విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరగగలదు. మే నుంచి సంవత్సరాంతం వరకు మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా సహకారం తగ్గగలదు. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్లాలో కూడా సానుకూలత ఉంటుంది. అష్టమ రాహువు వలన మీరు అందరినీ అనుమానించడం, మీరు తరచుగా అవమానాలకు గురికావడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు. అది ఇబ్బందికరం అవుతుంది. మీకు, కుటుంబ సభ్యులకు మధ్య కార్య నిర్వహణ విషయంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్తాపం పెరుగుతుంది. బంధువులతో తరచుగా ఇబ్బంది ఉంటుంది. జ్ఞాతివైరం ఉన్నవారికి ఈ సంవత్సరం ఆ వైరం పెరగగలదు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఖర్చులను నియంత్రించలేని స్థితిలో ఉంటారు. ఋణ సౌకర్యం కూడా ఆలస్యంగా ఉంటుంది. పాత కొత్త ఋణాలు ప్రారంభంలో ఇబ్బందులు సృష్టించినా, క్రమంగా సానుకూలం అవుతుంటాయి. వృథాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యా విజ్ఞాన విహార యాత్రల విషయంగా ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. తీసుకుంటారు కూడా. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. గమనించండి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ అవుతుంటుంది. ఉద్యోగం, కుటుంబం విషయాలలో సమన్యాయంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఉండవు. ప్రతి పనీ ఆలస్యం అవుతుండటం వలన మీకు ఆగ్రహావేశాలు పెరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం అనే చెప్పాలి. వైద్య సలహాలు జాగ్రత్తగా పాటించండి. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నెల తరువాత మీరు వేరే వారితో పోలిక లేకుండా ముందుకు సాగండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ఏ పనీ సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేయండి. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. పనులు వ్యతిరేకం కాకుండా జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి దారి తప్పించేవారు ఎక్కువ అవుతారు. అవకాశం ఉంటే కొనుగోలు వాయిదా వేయండి. విద్యార్థులకు మానసిక వ్యవస్థ విద్యా వ్యాసంగముల కంటే ఇతర అంశాల మీదకు ఎక్కువగా ప్రసరిస్తుంది. రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఆశించిన ఫలితాలు అందవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. మఘ నక్షత్రం వారు పనులు వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. షేర్వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తించక గడ్డు పరిస్థితులు తెచ్చుకుంటారు. అవసరానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పుబ్బ నక్షత్రం వారు వృథా కాలక్షేపం చేస్తారు. విద్యా, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ధైర్యంగా అనేక విజయాలు సాధిస్తారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు పుణ్య, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. శాంతి మార్గం: శని, రాహు గ్రహశాంతి చాలా అవసరం. ప్రాతఃకాలంలో నిత్యం ఆంజనేయస్వామి వారి దేవాలయంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఈ నెల ప్రతివిషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇతరులపై పనిభారం మోపి, నిద్రావస్థలో ఉంటే నష్టపోతారు. అహంభావంతో ఇబ్బందుల్లో పడతారు. ఖర్చులు, ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు జాగ్రత్త కనబరచాలి. విద్యార్థు్థలకు, రైతులకు ఆశించిన ఫలితాలు అందవు. మే: ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూస్తారు. ఋణబాధల నుంచి విముక్తి. ఉన్నత పదవులు చేపడతారు. అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. కుజశాంతి శుభప్రదం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం శూన్యం. రైతులకు అనుచిత సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు పనులు వాయిదా వేయడం శ్రేయస్కరం. జూన్: వృత్తిలో రాణిస్తారు. విశేష ధనలాభం. బదిలీలు అనుకూలం. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నెలాఖరున ఒక శుభవార్త అనందం కలిగిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ఈ నెల రోజులు అనుకూలం. పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు. జులై: నేర్పుతో పనులన్నీ సునాయాసంగా పూర్తిచేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫైనాన్స్, వ్యాపారులు, షేర్ వ్యాపారులకు 16వ తేదీ తరువాత చికాకులు ఉంటాయి. ఆగస్ట్: పనిఒత్తిడి పెరిగినా, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. 18వ తేదీ నుంచి మఘ నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు రాగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. రైతులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది. 13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రంవారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి ఋణాలు అందుతాయి. అక్టోబర్: ఉన్నతాధికారులను సందర్శిస్తారు. విశిష్ట బాధ్యతలు చేపడతారు. శత్రుబాధల నుంచి విముక్తి. ఈనెల నుంచి ఊహించని ఖర్చులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దాంపత్యసౌఖ్యం లోపించడం జరుగుతాయి. కుజశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. çసంతానం రాణింపు ఆనందం కలిగిస్తుంది. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు ఆలస్యం అవుతుంటాయి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. డిసెంబర్: ఈ నెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నది. మీ తప్పు లేకున్నా నిందలు పడవలసి వస్తుంది. స్త్రీ విరోధం, దాంపత్య విభేదాలు కలుగుతాయి. మౌనం మంచిది. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. షేర్ వ్యాపారులు ఇబ్బందికి గురవుతారు. కోర్టులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. జనవరి: ఇతరుల విషయాలలో జోక్యం లేకుండా, మీ పనులలో శ్రద్ధవహిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారు. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటుతనం తగ్గించాలి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఫిబ్రవరి: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు. వృత్తిలో ఊహించని మార్పులు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పుబ్బ నక్షత్రం వారు విశేష లాభాలు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులు, రైతులు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు. పనులు నత్తనడకన సాగుతాయి. స్థిరాస్తుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. -
కన్యా రాశి వారికి ఈ ఉగాది సంవత్సరాన మంచి శుభవార్త
కన్యా రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–5, అవమానం–2. ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో) గురువు మే 1 వరకు మేషం (అష్టమం)లోను తదుపరి వృషభం (నవమం)లోను సంచరిస్తారు. శని కుంభం (షష్ఠ)లోను రాహువు మీనం (సప్తమం)లోను కేతువు (జన్మ)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభ కార్యాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు. మే తరువాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి. అయితే మే తరువాత ఇంకా అనుకూలం. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకుపడటం వంటివి జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యవృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుంచి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త ఋణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి. తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు చేతులు వాటి వేళ్ళు అనేక సందర్భా లలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవ్వద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమవుతారు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యా, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. శాంతి మార్గం: రాహు కేతువులకు జప దానాలు అవసరం. ప్రతిరోజూ గణపతిని, దుర్గను అర్చించిన తరువాత మిగిలిన పనులు చేయండి. ‘దుర్గాసప్తశ్లోకి’ స్తోత్రం రోజూ 11సార్లు పారాయణ చేయాలి. ఏప్రిల్: ఈనెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ. శ్రమకు తగిన లాభం లేకపోవటం, ఖర్చులు పెరగటం జరుగుతాయి. వృత్తిలో మాటపడవలసి వస్తుంది. కుజ శాంతి, నవగ్రహారాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు ఆందోళనకర ఘటనలు ఎదుర్కొంటారు. మే: ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లోపించటం, పని ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. రాబోవు మూడు మాసాలలో ఆరోగ్య ఋణ విషయాలలో శ్రద్ధ అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు పెరిగే కాలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం. జూన్: ఉద్యోగంలో రాణిస్తారు. అనుకూలంగా స్థానచలనం, అభివృద్ధి జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఋణ సమస్యలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. గురువులను దర్శించుకుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు. జులై: ఈనెల అంతా అనుకూలమే. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది. 16వ తేదీ తరువాత పాత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. ఆగస్ట్: శ్రమతో కార్యజయం. నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తరువాత జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. సెప్టెంబర్: పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయుట మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. అక్టోబర్: వ్యాపారంలో పెను మార్పులు, ఊహించని లాభాలు. రానున్న 6 నెలలు అత్యంత అనుకూలం. సమస్యలు, శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు. వేగంగా పనులు పూర్తి చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ప్రయాణ సౌఖ్యం, సాంఘిక గౌరవం. నవంబర్: ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తొలగుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలం. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం విద్యలో రాణించటం వలన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అనుకున్న దాని కంటే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఉంటుంది. షేర్ వ్యాపారులు మంచి ఆదాయం పొందుతారు. జనవరి: ఈ నెల ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, శత్రుబాధలు, పని ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఆర్ధిక బలం పెరుగుతుంది. çఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు కూడా అనుకూలమే. ఫిబ్రవరి: గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహిం చని విధంగా అందరి సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆర్ధిక స్థిరత్వం, ఋణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండును. చిత్త నక్షత్రం వారికి కార్యలాభం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం. రైతులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం.ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. మార్చి: ఈ నెల ప్రతికూలత ఎక్కువ. వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన చేయుట శుభకరం. -
తులారాశి వారికి ఈ సంవత్సరం ఇలా జరగవచ్చు
తులా రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–1, అవమానం–5. చిత్త 3,4 పాదములు (రా, రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే) గురువు మే 1 వరకు మేషం (సప్తమ)లోను తదుపరి వృషభం (అష్టమం)లోను సంచరిస్తారు. శని కుంభం (పంచమం)లోను రాహువు మీనం (షష్ఠం)లోను కేతువు (వ్యయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాకాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అయింది. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృథా చేయవద్దని సూచన. ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే, మీకు విజయం దక్కుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలం. రాహు ప్రభావంగా అన్ని విషయాలలోను చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు. ఇది ప్రత్యేక వరము అనే చెప్పాలి. ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమకొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు. జాగ్రత్తపడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే, అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత ఋణాలు, కొత్త ఋణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి. తరచుగా శుభ కార్యాలలో పాల్గొనడానికి, అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యవిషయంగా బహు శ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి లాభదాయక కాలము. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అయినా, పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ. మంచి సలహాలు అందుతాయి. లాభాలు బాగా అందుతాయి. చిత్త నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు. స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 వారికి సకాలంలో ఋణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్ట్లు చేపడతారు. యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. శాంతి మార్గం: తెలుపురంగు పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి మూడు మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి. రోజూ భువనేశ్వరీ సహస్రనామ పారాయణ చేయండి. ఏప్రిల్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వ్యాపారలాభం, ప్రయాణ లాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. భూ– ఆభరణ కొనుగోలు చేస్తారు. షేర్ వ్యాపారులు మంచి నిర్ణయాలతో లాభిస్తారు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది. విద్యార్థులకు అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. గురువులను పూజ్యులను దర్శిస్తారు. శుభకార్య, సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మే: ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగరూకతతో ఉండాలి. అధికారయోగం ఉంది. స్త్రీలతో వివాదాలు వద్దు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత తక్కువ. జూన్: వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి పనులు కొంత ఆలస్యమవుతాయి. స్వాతీ నక్షత్రం వారికి తరచు ఆరోగ్య సమస్యలు, కలహాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు, షేర్ వ్యాపారులకు మంచి సూచనలు అందవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జులై: ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం, లాభాలు ఉంటాయి. అధికారయోగం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. 3వ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రోజువారీ కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి. స్వాతీ నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: వృత్తిలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన కొనుగోలుకు అనుకూలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. సెప్టెంబర్: దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్రాభరణ లాభం ఉంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం సరిగా ఉండదు. ఖర్చులు, ఋణాలలో యిబ్బందులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరో«ధాలు ఎక్కువ. అక్టోబర్: మీ పనితీరులో మార్పులు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. కుటుంబాభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచికాలం. నవంబర్: ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు. అధికార యోగం ఉంది. బదిలీలు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది. షేర్ వ్యాపారులకు అధిక లాభములు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలం. డిసెంబర్: ఈ నెల అత్యంత అనుకూలం. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలం. స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జనవరి: ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు. భూ– గృహ– వాహన కొనుగోలుకు అనుకూలం. అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడండి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: ఈనెల అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్నా, మీ జాగ్రత్తలో మీరుండాలి. పెట్టు బడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు. ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మంచిది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతుంటాయి. విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలం. రైతులకు శ్రమాధిక్యం. ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. మార్చి: కార్యజయం. ఆరోగ్య, ఋణ సమస్యలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రాజకీయరంగంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీవిరోధం వద్దు. లక్ష్మీస్తోత్ర పారాయణ మంచిది. -
ఈ రాశి వారికి ఈ ఉగాది నూతన సంవత్సరంతో ఫలితం ఎలా ఉందంటే?
వృశ్చిక రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–5. విశాఖ 4 వ పాదము (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ) గురువు మే 1 వరకు మేషం (షష్ఠం)లోను తదుపరి వృషభం (సప్తమం)లోను సంచరిస్తారు. శని కుంభం (చతుర్థం)లోను రాహువు మీనం (పంచమం)లోను కేతువు (లాభం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన నాలుగు గ్రహాల సంచారం సరిగాలేదు. అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండటం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది. అప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి. ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంటుంది. మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే విచిత్రం ఏమిటంటే వృత్తి రీత్యా ఈ సంవత్సరం మే నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకొని, ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయితో ఉంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా, డబ్బు లేదని ఏ పనీ ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది. కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులూ, పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ధనవ్యయం అవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పనీ మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అనే చెప్పాలి. దూకుడువద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు. నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు. పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శాంతి మార్గం: శని, గురు, రాహువులకు శాంతి చేయించండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ ధ్యానం చేయండి. రోజూ గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఏప్రిల్: ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలం. తరచు శుభవార్తలు వింటారు. మే: ఈనెల ప్రతికూలత ఎక్కువ. నిందలు పడవలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. నవగ్రహ శాంతి మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. స్థిరాస్తి, కోర్టు విషయాలు బాగా అనుకూలం. జూన్: తెలియని ఆందోళన ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది. ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు అనుకూలం. జులై: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఉద్యోగంలో మార్పులు. ఉన్నత పదవులు చేపడతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య, ఋణ సమస్యలు పెరుగుతాయి. కుజ శాంతి చేయాలి. సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. రైతులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సెప్టెంబర్: రాజకీయవేత్తలకు అనుకూలం. ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపారలబ్ధి. బదిలీలు అనుకూలం. ప్రయాణ లాభం. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు. అక్టోబర్: ఈనెల అనుకూలత తక్కువ. శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవసరాలకు తగిన ఆదాయం అందదు. వృత్తి ఉద్యోగాల్లోను, ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్: ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మందగిస్తుంది. కొత్త పనులు ఆలస్యమవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. నిరుత్సాçహానికి లోనవుతారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. డిసెంబర్: కుటుంబ, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి ప్రయత్నిస్తారు. పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఋణ సమస్యలు పెరుగుతాయి. విష్ణు ఆరా ధన శ్రేయస్కరం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. జనవరి: ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. బదిలీలు అనుకూలం. భోజన సౌఖ్యం. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన మంచిది. అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. షేర్ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు. ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం మంచిది. విద్యార్థులు, రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఫిబ్రవరి: రవి–కుజ–బుధుల సంచారం ప్రతికూలముగా ఉన్నది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆలస్యం, కుటుంబ ఖర్చులు పెరగటం, శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి. పెద్దల, గురువుల సహకారంతో పనులు పూరవుతాయి. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. నవగ్రహారాధన చేయడం మంచిది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు. ప్రతి పనీ స్వయంగా చూసుకోవాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పెద్దలకు, పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలుంటాయి. మార్చి: ఈనెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇతరులతో కొంత మితంగా వ్యవహరించుట మంచిది. వ్యర్థప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనులు ఆలస్యమవుతాయి. ఉద్యోగంలో తోటివారితోను, అధికారులతోను విభేదాలు పెరుగును. పెద్దల సహాయం లభిస్తుంది. దైవారాధన మానవద్దు. -
ఈ రాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే..
ధనూ రాశి ఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–5 మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ) పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా) ఉత్తరాషాఢ 1వ పాదము (బే) గురువు మే 1 వరకు మేషం (పంచమం)లోను తదుపరి వృషభం (షష్ఠం)లోను సంచరిస్తారు. శని కుంభం (తృతీయం)లోను రాహువు మీనం (చతుర్థం)లోను కేతువు (దశమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడతారు. అన్ని విషయాలలోనూ స్వతంత్ర నిర్ణయాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సందర్భాలలో మీకు శుభవార్తలు అందుతాయి. మీ వ్యవహారాలలో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహార యాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకులు సృష్టించి, తద్వారా విభేదాలు తీసుకురాగలదు. వాగ్ధోరణిని నియంత్రించండి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి కానీ, అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తుంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం లేదా అనుకూల స్థలం చేరుకోగలరు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలం అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడకు అయినా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తుంది. తరచుగా శుభకార్య, పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనవ్యయం బాగా అధికం అవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురౌతాయి. మీ అందరితోనూ మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు. కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తరువాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా, తగిన లాభాలు అందని పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా, సానుకూలం అవుతుంటాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి మే నెల నుంచి ధనవ్యయం అధికం అవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి కావలసిన వనరులు తేలికగా లభ్యం అవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్ష. మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. తరచు విహార యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నియమబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. అభివృద్ధి ఉన్నా, తగిన ఫలితాలు రావు. కుటుంబంలో సానుకూలత సాధిస్తారు. శాంతి మార్గం: సంవత్సర ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకు జపం చేయించండి. ప్రాతఃకాలంలో రోజూ తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పని మీద దృష్టి పెట్టలేరు. ఇతర కార్యకలాపాలపై ఆసక్తి వలన ఇబ్బందులు కలుగుతాయి. అశ్రద్ధ, అకాలభోజనం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహస్తోత్రం పఠించాలి. ఉద్యోగ వ్యాపారాలలో కోరిన విధంగా ముందుకు వెడతారు. కుటుంబ సమస్యలకు, ఋణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు మంచి పరిష్కారాలు పొందుతారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. మే: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం గతంలోకన్నా లాభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. దుర్జన సాంగత్యం వలన ఊహించని సమస్యలు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ వ్యాపారుల ప్రణాళికలు సరిగా సాగవు. రైతులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. జూన్: తరచు ఊహించని ప్రయాణాలు. దాంపత్య జీవితంలో మనస్పర్థలు కలుగుతాయి. పనిఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శివకుటుంబ ఆరాధన మంచిది. మూలనక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు విచిత్ర సమస్యలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. జులై: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారంలో విభేదాలు, శత్రుబాధలు తొలగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం. భూమి కొనుగోలు చేస్తారు. శివ–విష్ణు స్తోత్ర పారాయణ మేలు. క్రమంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్ వ్యాపారులకు అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థులకు రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెల అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యలు. వృథా కాలక్షేపం వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శాంతి చేయడం మేలు. పుణ్యకార్య శుభకార్య, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఆర్థిక వెసులుబాటు తక్కువ. వస్తువులు చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. షేర్ వ్యాపారులకు దూకుడు తగదు. రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం. ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభింస్తుంది. రాబోవు ఆరుమాసాలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులకు, రైతులకు కూడా ఇబ్బందికరమైన కాలమే. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం కాదు. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి. రాజకీయవేత్తలు ఉన్నత పదవులు చేపడతారు. ఇప్పటి నుంచి 6 నెలలు పనులలో జాప్యం, తరచు ఆరోగ్య సమస్యలు, ఇతరులతో వివాదాలు ఉంటాయి. కుజ, సుబ్రహ్మణ్య శాంతి చేయాలి. వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం. నవంబర్: స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టంలేని బదిలీలు, ప్రయాణాలు వలన శ్రమాధిక్యం, అకాల భోజనం, పనుల్లో జాప్యం జరుగుతాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. డిసెంబర్: పనులన్నీ నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. శివ–విష్ణు ఆరాధన శుభప్రదం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. తెలివి ఉన్నా, ధైర్యం చేయలేక చాలా పనులు ఆపివేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. జనవరి: ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. పనుల నిమిత్తం ఎక్కువగా తిరగవలసి రావటం, శ్రమాధిక్యం ఉంటాయి. కార్యజయం ఉన్నది. విష్ణుస్తోత్ర పారాయణ శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల సమతుల్యత సాధించలేరు. దైనందిన జీవనం సరిగా సాగదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు అతి శ్రమ, స్వల్ప ఫలితం ఉంటాయి. ఫిబ్రవరి: నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి కోర్టు విషయాలు సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. çఅభివృద్ధి కోసం చేసే ప్రతి పనీ ఇబ్బందికరం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మార్చి: విశేష వ్యాపారలబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్త ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నవగ్రహారాధన చేయుట మంచిది.