ఈ రాశి వారికి భూయోగం.. ధనలాభ సూచనలు | Today Telugu Horoscope On May 21st, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి భూయోగం.. ధనలాభ సూచనలు

May 21 2026 3:55 AM | Updated on May 21 2026 8:37 AM

Rasi Phalalu: Daily Horoscope On 21-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.పంచమి ప.2.09 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పునర్వసు ఉ.9.44 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.5.19 నుండి 6.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.47 వరకు, అమృత ఘడియలు: ఉ.7.30 నుండి 8.58 వరకు.

సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.22
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం..  వ్యయప్రయాసలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం....  పనుల్లో అనుకూలత. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మిథునం....  పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యసమస్యలు. బంధువులు, మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం.....  యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ధనలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం....  వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు , ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

కన్య....  వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ది. సోదరులతో వివాదాలు పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహపరుస్తాయి.

తుల...  పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

వృశ్చికం......  ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు.....  వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మకరం...  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం....  కార్యజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం...  ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement