వైభవ్ వీరవిహారం.. ట్రై సిరీస్ విజేతగా భారత్‌ | SL-A vs IND-A: Vaibhav Sooryavanshis Record Knock Leads India A Easy Win | Sakshi
Sakshi News home page

IND vs SL: వైభవ్ వీరవిహారం.. ట్రై సిరీస్ విజేతగా భారత్‌

Jun 21 2026 6:05 PM | Updated on Jun 21 2026 6:25 PM

SL-A vs IND-A: Vaibhav Sooryavanshis Record Knock Leads India A Easy Win

శ్రీలంక ఆతిథ్యమిచ్చిన అనాధికారిక ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్‌-ఎ జట్టు నిలిచింది. ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-ఎ జట్టును 66 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ తుది పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన  చేసిన ఇండియా 'ఎ' జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ బాస్ బేబీ కేవలం  11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. ఓవరాల్‌గా 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యవంశీ.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94 పరుగులు చేశాడు. 

అతడితో పాటు తిలక్‌ వర్మ(67), రుతురాజ్‌ గైక్వాడ్‌(40), అనుకుల్‌ రాయ్‌(15 బంతుల్లో 39), ప్రియాన్ష్‌ ఆర్య(39) రాణించారు. లంక బౌలర్లలో వనజా సహాన్‌, కుగదాస్ మతులన్, రవిందు ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టును భారత పేసర్ యశ్ ఠాకూర్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. అయితే మిడిల్ ఆర్డర్‌లో సదీర సమరవిక్రమ (52), సహన్ అరచ్చిగే(38) నిలకడగా ఆడడంతో లంక తిరిగి గేమ్‌లోకి వచ్చింది. రన్ రేట్ ఒత్తిడి పెరగడంతో శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 

ఆఖరిలో వనుజ సహన్ (62) దూకుడుగా ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో  47.1 ఓవర్లలో 311 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. రత బౌలర్లలో యశ్ ఠాకూర్‌, విప్రాజ్ నిగమ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు అనుకుల్ రాయ్ రెండు, తిలక్ వర్మ, ఆశోక్ శర్మ చెరో వికెట్ సాధించారు.
చదవండి: IND vs IRE: టీమిండియాకు భారీ షాక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement