tri series
-
నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన కెనడా
నెదర్లాండ్స్ ముక్కోణపు టోర్నీలో ఆతిథ్య జట్టుకు షాక్ తగిలింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నెదర్లాండ్స్.. కెనడా చేతిలో 8 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో భాగంగా నిన్న (ఆగస్ట్ 26) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటంగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌కు ఇది తొలి పరాజయం కాగా.. కెనడాకు తొలి విజయం. ఈ టోర్నీలో పాల్గొంటున్న మరో జట్టు యూఎస్ఏ. ఆ జట్టు ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.రాణించిన శ్రేయస్, జాఫర్తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా శ్రేయస్ మొవ్వ (33), సాద్ బిన్ జాఫర్ (33) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. కెనడా ఇన్నింగ్స్‌లో ఆరోన్ జాన్సన్, పఠాన్, రవీంద్రపాల్ డకౌట్లు కాగా.. నికోలస్ కిర్టన్ 13, హర్ష్ థాకర్ 10, పర్వీన్ కుమార్ 4, అఖిల్ కుమార్ 9, డిల్లన్ హేలిగర్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. డచ్ బౌలర్లలో కైల్ క్లెయిన్, వాన్ మీకెరెన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. డొరామ్ 2, విక్రమ్‌జీత్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.సత్తా చాటిన కెనడా బౌలర్లు133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. కెనడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 124 పరుగులకే పరిమితమైంది.పర్వీన్ కుమార్, కలీమ్ సనా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హేలిగర్, సాద్ బిన్ జాఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో నోవహా క్రోయిస్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఉత్కంఠ సమరం.. నెదర్లాండ్స్ బ్యాటర్ల విధ్వంసం.. ముక్కోణపు సిరీస్ కైవసం
నేపాల్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. నేపాల్‌తో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో నెదర్లాండ్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాడు టిమ్ వాన్ డర్ గుగ్టెన్ చివరి ఓవర్ రెండు, మూడు బంతులను వరుసగా బౌండరీ, సిక్సర్‌గా మలిచి నెదర్లాండ్స్‌ను గెలిపించాడు. గుగ్టెన్ మొత్తం 5 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. The Nepal crowd is simply amazing in every manner! 🇳🇵pic.twitter.com/giCO1hA1oE— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 గుగ్టెన్ మెరుపు ఇన్నింగ్స్‌కు ముందు సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ సైతం బ్యాట్ ఝులిపించాడు. 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులకు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన సైబ్రాండ్.. మొత్తంగా 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి నెదర్లాండ్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. Netherlands' victory lap. - Nepal fans cheering and applauding them in numbers. 👏pic.twitter.com/uc8ch0XO52 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (47), గుల్సన్ ఝా (34), కుశాల్ మల్లా (26), రోహిత్ పౌడెల్ (25), కుశాల్ భుర్టెల్ (20) రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, గుగ్టెన్, మైఖేల్ లెవిట్, సైబ్రాండ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. లెవిట్ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సైబ్రాండ్ (48), గుగ్టెన్ (21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (22), విక్రమ్‌జిత్ సింగ్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ మల్లా 4 వికెట్లతో చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సిరీస్‌లో నేపాల్, నెదర్లాండ్స్‌తో పాటు నమీబియా పాల్గొంది. -
నమీబియాపై ప్రతీకారం తీర్చుకున్న నేపాల్
స్థానికంగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో నేపాల్ జట్టు బోణీ కొట్టింది. నమీబియాతో ఇవాళ (మార్చి 1) జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (55 నాటౌట్) మెరుపు అర్దసెంచరీతో రాణించాడు. ఆరిఫ్ షేక్ (31), అనిల్ షా (23), గుల్షన్ షా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నమీబియా బౌలర్లలో బెన్ షికోంగొ 3, జాక్ బ్రస్సెల్ 2, ట్రంపల్మెన్, లాఫ్టీ ఈటన్, బెర్నాల్డ్ తలో వికెట్ పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్మిట్ (50) అర్దసెంచరీతో చెలరేగినా నమీబియాను గెలిపించలేకపోయాడు. ఆఖర్లో జేన్ గ్రీన్ (23), బెర్నాల్డ్ (4 నాటౌట్) సైతం నమీబియాను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. నేపాల్ బౌలర్లలో కరణ్, సోమ్‌పాల్, దీపేంద్ర సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అభినాశ్ బొహారా ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
నేపాల్ బ్యాటర్ల వీరోచిత పోరాటం
నేపాల్ టీ20 ట్రై సిరీస్‌లో రసవత్తర సమరం జరిగింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా.. దీపేంద్ర సింగ్ (34 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కరణ్ (7 బంతుల్లో 11; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడి నేపాల్‌ను విజయానికి చేరువ చేశారు. అయితే చివరి ఓవర్ మూడు, నాలుగు బంతులకు కరణ్, దీపేంద్ర ఔట్ కావడంతో నేపాల్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. వీరిద్దరూ చెలరేగడంతో నేపాల్ 17వ ఓవర్లో 9 పరుగులు, 18వ ఓవర్లో 18, 19వ ఓవర్లో 15, 20వ ఓవర్లో 12 పరుగులు సాధించింది. చివరి ఓవర్లో దీపేంద్ర సింగ్ తొలి రెండు బంతులను బౌండరీ, సిక్సర్‌గా మలచి నేపాల్ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మైఖేల్ లెవిట్ (54), సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ట్ (49), ఎడ్వర్డ్స్ (33), తేజ నిడమనూరు (31) రాణించగా.. మ్యాక్స్ ఓడౌడ్ (4) తక్కువ స్కోర్‌కు ఔటయ్యాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, కుశాల్ మల్లా తలో వికెట్ పడగొట్టగా.. ఎడ్వర్డ్, తేజ రనౌట్ అయ్యారు. ఛేదనలో చివరి వరకు పోరాడిన నేపాల్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. దీపేంద్ర సింగ్, కరణ్‌తో పాటు ఆరంభంలో ఆసిఫ్ షేక్ (34), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (50) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్, సైబ్రాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వివియన్ కింగ్మా, వాన్ డర్ గుగ్టెన్, ఆర్యన్ దత్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో భాగంగా నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆటగాడు లాఫ్టీ ఈటన్ 33 బంతుల్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. -
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. విండీస్‌పై ఘన విజయం
Womens T20I Tri Series South Africa 2023: సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ముక్కోణపు మహిళల టీ20 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో (వర్షం కారణంగా ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న భారత్.. ఇవాళ (జనవరి 30) విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (4-2-11-3), పూజా వస్త్రాకర్ (4-1-19-2) గైక్వాడ్ (4-1-9-1) బౌలింగ్‌లో సత్తా చాటడంతో విండీస్‌ను 94 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) నియంత్రించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (34) విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచింది. 95 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. జెమీమా రోడ్రిగ్స్ (42 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (32 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌లతో రాణించడంతో 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి మంధన (5), హర్లీన్ డియోల్ (13) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. విండీస్ బౌలర్లలో షమీలియా కాన్నెల్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో సంబంధం లేకుండా ఇదివరకే ఫైనల్‌కు చేరిన భారత్.. ఫిబ్రవరి 2న టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. -
Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్ కోసమే ఇదంతా: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
NZ- Ban- Pak Tri Series- T20 World Cup 2022- India Vs Pakistan: క్రికెట్ ప్రేమికుల హాట్ ఫేవరెట్ మ్యాచ్‌లలో అన్నింటి కంటే ముందు వరుసలో ఉండేది ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా కేవలం ఐసీసీ సహా ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతుండటంతో దాయాదుల పోరుపై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రెండు సార్లు తలపడిన రోహిత్ సేన- బాబర్ ఆజం బృందం.. టీ20 వరల్డ్‌కప్-2022లో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. అక్టోబరు 23న టీమిండియా- పాక్ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఈ మెగా పోరుకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహా ఇతర ఆటగాళ్లు.. మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. టీమిండియాతో మ్యాచ్ కోసం ఇలా.. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్‌లో ట్రై సిరీస్ ఆడింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ కూడా భాగమైన ఈ సిరీస్‌లో కివీస్- పాక్ ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్-2022 కోసం ముఖ్యంగా ఇండియాతో మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలోనే తాము ఈ సిరీస్‌లో పాల్గొన్నట్లు వెల్లడించాడు. ‘‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. అయితే, ఇలాంటి మ్యాచ్‌లో ప్రశాంతమైన మైండ్‌సెట్‌తో ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మెరుగ్గా ఆడగలం. ఇండియాతో మ్యాచ్‌లో కచ్చితంగా పూర్తిస్థాయిలో.. వందకు వంద శాతం బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం’’ అని తమ ప్రణాళిక గురించి చెప్పాడు. ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహం అదే విధంగా న్యూజిలాండ్‌లో ట్రై సిరీస్‌లో ఆడటం వెనుక ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని.. ఈ సిరీస్ ద్వారా మెగా టోర్నీకి ముందు తమకు మంచి అవకాశం దొరికింది అని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. కాగా ట్రై సిరీస్‌లో భాగంగా శుక్రవారం (అక్టోబరు 14) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ప్రపంచకప్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ‘కోహ్లి సేన’ పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఏఈలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. చదవండి: Babar Azam: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ T20 WC 2022: మెగా టోర్నీలో అరుదైన ఘనతల ముంగిట రోహిత్ శర్మ! అదే జరిగితే రికార్డులన్నీ బద్దలే! -
జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక జర్నలిస్టు అడిగిన తిక్క ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇచ్చిన 173 పరగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలు అర్థసెంచరీలతో చెలరేగగా..మహ్మద్ నవాజ్ 45 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్ జట్టుకు ఈ మధ్య కాలంలో ఫైనల్ మ్యాచ్‌లు పెద్దగా కలిసిరావడం లేదు. ముందుగా ఆసియా కప్ చూసుకుంటే శ్రీలంకతో జరిగిన ఫైనల్లో బోల్తా కొట్టిన పాక్ చివరికి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 4-3తో కోల్పోయింది. అయితే తాజాగా టి20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరుగుతున్న ట్రై సిరీస్‌లో పాకిస్తాన్ మరోమారు ఫైనల్‌కు చేరింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం బాబర్ ఆజం ప్రెస్మీట్లో పాల్గొన్నాడు. ''మీరు ఒక కెప్టెన్‌గా అన్ని ఫైనల్స్ ఓడిపోతున్నారు.. మరి ఈసారి ఫైనల్ గెలుస్తారన్న నమ్మకం ఉందా'' అంటూ ఒక జర్నలిస్టు తిక్క ప్రశ్న వేశాడు. దీంతో మండిపోయిన బాబర్ ఆజం.. ''మీరు ఎవరు గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. మ్యాచ్‌లో గెలుపోటములు సహజం.. ఫైనల్ మ్యాచ్ గెలుస్తామా లేదా అన్నది ముందే ఎలా చెప్పగలం. ఆట ఆడడం మా నైతిక ధర్మం.. అంతేకానీ విజయం అనేది మా చేతుల్లో రాసిపెట్టిలేదు. వంద శాతం గెలిచేందుకే ప్రయత్నిస్తాం.. ఓడిపోతే మేం ఏం చేయగలం.. ప్రతీదాన్ని భూతద్దంలో చూడకండి'' అంటూ బదులిచ్చాడు. ఇక ట్రై సిరీస్ అనంతరం ఆస్ట్రేలియాకు చేరుకోనున్న పాకిస్తాన్ జట్టు అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియాను పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం!
న్యూజిలాండ్ ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్ ఆడడంలో బిజీగా ఉంది. టి20 ప్రపంచకప్‌కు మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతున్న ఈ ట్రై సిరీస్‌లో ఇప్పటికే బంగ్లాదేశ్ నిష్క్రమించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌లు అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా బంగ్లాదేశ్, కివీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్లో నజ్ముల్ షాంటో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు వదిలేశారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన గుడ్‌లెంగ్త్ బంతిని షాంటో గాల్లోకి లేపాడు. అంతే క్యాచ్ తీసుకోవడానికి ఏకకాలంలో నలుగురు ఫీల్డర్లు పరిగెత్తుకొచ్చారు. చూసినవాళ్లు కచ్చితంగా ఆ నలుగురిలో ఎవరో ఒకరు క్యాచ్ తీసుకుంటారని అనుకున్నారు. తీరా చూస్తే ఒక్కడు కూడా పట్టుకోలేదు. దీంతో బౌల్ట్.. ఏంటిది అన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ 48 పరుగులతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవన్ కాన్వే(40 బంతుల్లో 64 పరుగులు), గ్లెన్ పిలిప్స్(24 బంతుల్లో 60 పరుగులు) మెరుపులు మెరిపించారు. గుప్టిల్ 34, ఫిన్ అలెన్ 32 పరుగులతో రాణించారు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడిపోయింది. షకీబ్ అల్ హసన్ (44 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఈ టోర్నీలోని మూడో జట్టు పాకిస్తాన్ కూడా ఫైనల్ చేరింది. నేడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ ఉంది. No way 😂😭😂pic.twitter.com/UMIfm8zeMG — Out Of Context Cricket (@GemsOfCricket) October 12, 2022 చదవండి: తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్ మ్యాచ్.. వీడియో వైరల్ -
NZ Vs Ban: దంచి కొట్టిన ఫిలిప్స్.. బంగ్లా అవుట్! ఫైనల్లో న్యూజిలాండ్‌తో పాటు..
New Zealand T20I Tri-Series 2022- New Zealand vs Bangladesh, 5th Match: న్యూజిలాండ్- పాకిస్తాన్- బంగ్లాదేశ్ త్రైపాక్షిక టీ20 సిరీస్‌లో భాగంగా ఆతిథ్య కివీస్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా బుధవారం (అక్టోబరు 12) జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. 48 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన సౌథీ బృందం.. ఫైనల్లో పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా అక్టోబరు 7న కివీస్, పాక్, బంగ్లా జట్ల మధ్య ట్రై సిరీస్ ఆరంభమైంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో పాకిస్తాన్ రెండింట.. ఆతిథ్య న్యూజిలాండ్ మూడింట గెలుపొంది ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇక ఈ టూర్లో బంగ్లాదేశ్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తాజాగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దంచికొట్టిన గ్లెన్ ఫిలిప్స్ క్రైస్ట్‌చర్చ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది షకీబ్ అల్ హసన్ బృందం. బంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్(32), డెవాన్ కాన్వే(64) అదిరిపోయే ఆరంభం అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన మార్టిన్ గప్టిల్ సైతం 34 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 24 బంతుల్లో 2 బౌండరీలు, 5 సిక్స్‌లు బాది 60 పరుగులు సాధించాడు. 🔊 Well taken in the crowd! Glenn Phillips with back to back sixes in the 16th over. Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvBAN pic.twitter.com/dSnyIyvUVH — BLACKCAPS (@BLACKCAPS) October 12, 2022 షకీబ్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా ఈ మేరకు బ్యాటర్ల విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 5 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు మెరుగైన ఆరంభం లభించినా.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షకీబ్ అల్ హసన్ 44 బంతుల్లో 70 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా.. లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలైంది. దీంతో 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమిని మూటగట్టుకుంది బంగ్లాదేశ్. కివీస్ బౌలర్లలో కెప్టెన్ టిమ్ సౌథీకి రెండు, ఆడం మిల్నేకు మూడు, మైఖేల్ బ్రాస్‌వెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. Full and straight! Adam Milne strikes with his third ball LIVE in NZ on @sparknzsport 🔥 #NZvBAN pic.twitter.com/326Q4EQOuh — BLACKCAPS (@BLACKCAPS) October 12, 2022 ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ ఇక అద్భుత ఇన్నింగ్స్‌తో అదరొట్టిన కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్.. గురువారం పాకిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. మరోవైపు.. కివీస్, పాకిస్తాన్ శుక్రవారం (అక్టోబరు 14) ఫైనల్లో తలపడనున్నాయి. చదవండి: T20 World Cup 2022: ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్.. ఆస్ట్రేలియాకు షమీ Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ వసీం జాఫర్ ట్రోల్! -
ఎదురులేని రిజ్వాన్.. గెలుపుతో పాక్ బోణీ
క్రైస్ట్‌చర్చ్: టి20 ప్రపంచకప్‌కు జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ రిజ్వాన్ (50 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, షాన్ మసూద్ (22 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తస్కీన్ అహ్మద్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేయగలిగింది. యాసిర్ అలీ (21 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిటన్ దాస్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. వసీమ్ 3, నవాజ్ 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీలో భాగంగా నేడు జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ తలపడుతుంది. -
మెగా ఈవెంట్‌కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు.. పాక్- కివీస్- బంగ్లా సిరీస్!
T20 WC 2022- Pakistan New Zealand Bangladesh Tri Series: టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ మేరకు జరిగే సిరీస్‌కు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదిక కానుంది. కాగా విధంగా గతేడాది న్యూజిలాండ్ జట్టు అర్ధంతరంగా పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరులో అక్కడికి వెళ్లేందుకు కివీస్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అక్టోబరు 16న టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సుమారు వారం రోజుల ముందు జరుగనున్న ఈ ట్రై సిరీస్‌తో పాక్, కివీస్, బంగ్లా జట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరకనుంది. ఇక అక్టోబరు 8న న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచాయి. అయితే, సెమీస్‌లో పాక్ ఆస్ట్రేలియా చేతిలో ఓడగా.. ఫైనల్లో అదే ఆసీస్ జట్టు చేతిలో పరాజయం పాలై న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలిచింది. పాకిస్తాన్- న్యూజిలాండ్- బంగ్లాదేశ్: ట్రై సిరీస్ షెడ్యూల్-హాగ్లే ఓవల్ మైదానం, క్రైస్ట్‌చర్చ్ ►అక్టోబరు 8: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 9: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ►అక్టోబరు 10: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ►అక్టోబరు 11: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 12: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ►అక్టోబరు 13: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 14: ఫైనల్ చదవండి: నాన్న రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్ శర్మ కుమార్తె -
తొలి స్వదేశీ వన్డేలో ఓటమి
ఖాట్మండు; ముక్కోణపు సిరీస్‌లో భాగంగా తమ సొంత గడ్డపై ఆడిన అధికారిక తొలి వన్డేలోనే నేపాల్ ఓటమి పాలైంది. నేపాల్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహిస్తున్న ట్రై సిరీస్‌లో ఆ దేశంతో పాటు అమెరికా, ఒమన్‌లు తలపడుతున్నాయి. దీనిలో భాగంగా ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్ 18 పరుగుల తేడాతో పరాజయం చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా, నేపాల్ 179 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఒమన్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు మహ్మద్ నదీమ్ ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 96 బంతుల్లో అజేయంగా 69 పరుగులు సాధించాడు. ఇక నేపాల్ జట్టు శరద్ విశ్వాకర్ 55 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. కాగా, తమ దేశం తొలిసారి అధికారిక వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై నేపాల్ కెప్టెన్ జ్ఞానేంద్ర మల్లా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తమ దేశం మొత్తం గర్వించే క్షణమన్నాడు. తాము క్రికెట్ ఆడుతున్నప్పట్నుంచీ ప్రతీ ఒక్కరరూ వన్డే హోదా రావాలని కోరుకున్నారని, ఇప్పుడు అతి పెద్ద క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారన్నాడు. స్వదేశంలో జట్టుకు కెప్టెన్‌గా ఉండి మ్యాచ్ ఆడటం సరికొత్త అనుభూతిని తీసుకొచ్చిందన్నాడు. ఖాట్మాండు తమ ఫేవరెట్ గ్రౌండ్లలో ఒకటని తెలిపాడు. 2018లో నేపాల్‌కు వన్డే హోదా దక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన స్థానాల్లో నిలవడం ద్వారా నేపాల్‌తో పాటు స్కాట్లాండ్,యూఏఈలు వన్డే హోదా సాధించాయి. -
భారత మహిళల జట్టు ఓటమి
కాన్బెర్రా: ముక్కోణపు టి20 మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. స్మృతి (35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ (28; 4 ఫోర్లు) రాణించారు. ఎలీస్ పెర్రీ (4/13) భారత్‌ను కట్టడి చేసింది. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి నెగ్గింది. పెర్రీ (49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
క్రికెట్లో సింగపూర్ కొత్త చరిత్ర
సింగపూర్: అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని సింగపూర్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సింగపూర్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సభ్యత్వం గల దేశంపై తొలి విజయాన్ని అందుకుని నయా రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించడంతో 18 ఓవర్లకు కుదించారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన సింగపూర్ తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.(ఇక్కడ చదవండి: టీ20లో సరికొత్త రికార్డు) టిమ్ డేవిడ్(41), మన్‌ప్రీత్ సింగ్(41)లు రాణించడంతో చాలెంజింగ్ స్కోరును జింబాబ్వే ముందుంచుంది. కాగా, జింబాబ్వే 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది. జింబాబ్వే కెప్టెన్ సీమ్ విలియమ్స్(66), ముటోంబోడ్జి(32)లు రాణించినా ఆ జట్టును విజయం అందించలేకపోయారు. సింగపూర్ బౌలర్లలో మహబూబ్, జనక్ ప్రకాశ్ తలో రెండు వికెట్లు సాధించగా, విజయ్ కుమార్, గోపీనాథ్ ఆచర్లు చెరో వికెట్ తీశారు. సింగపూర్ తాజా విజయంతో రెండు పాయింట్లు సాధించింది. -
ఆసీస్‌పై పాక్ జయభేరి
అబుదాబి: బాబర్ ఆజమ్ (55 బంతుల్లో 68; 5 ఫోర్లు, 1 సిక్స్), ఇమాద్ వసీమ్ (3/20) రాణిం చడంతో పాకిస్తాన్ పొట్టి ఫార్మాట్లో ఆసీస్‌పై భారీ విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ జూలైలో హరారేలో 45 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును సవరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బాబర్‌తో పాటు వన్‌డౌన్‌లో దిగిన మొహమ్మద్ హఫీజ్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. 105 పరుగుల వరకు ఒకే వికెట్‌ను కోల్పోయిన పాక్ మరో 28 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లను కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో స్టాన్లేక్, ఆండ్రూ టై మూడేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆసీస్ 16.5 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు ఫించ్ (0), షార్ట్ (4)లను వసీమ్ ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా 22 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి ఓటమికి సిద్ధమైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కూల్టర్‌నీల్ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు) కాస్త ప్రతిఘటించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. -
ఆసీస్‌పై పాక్ గెలుపు : కైఫ్ ఒక దేశద్రోహి!
ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫఖర్ జమాన్ (46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించాడు. దీంతో ఆతిథ్య జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. అయితే ఫఖర్ జమాన్ అద్భుత ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాక్ జట్టు అద్భుత విజయం సాధించింది. గ్రేట్ ఇన్నింగ్స్‌తో పాక్ విజయానికి కారణమైన ఫఖర్ జమాన్ బిగ్ మ్యాచ్ ప్లేయర్.. కంగ్రాచ్యులేషన్స్’ అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు ‘దేశద్రోహి’ అంటూ కైఫ్‌పై విరుచుకుపడ్డారు. ‘పాకిస్తాన్ గెలిస్తే మీరు కూడా సంతోషపడతారా‘... ‘పాకిస్తాన్‌పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అయితే అక్కడే ఉండొచ్చుగా’ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. Well done to Pakistan on winning the T20 series final against Australia. Great innings from Fakhar Zaman , looks a big match player. Congratulations #PakvAus — Mohammad Kaif (@MohammadKaif) July 8, 2018 देशद्रोही 😞😞😞😞 @MohammadKaif — Deepika Padukone FC (@deepikapadukonz) July 8, 2018 -
ట్రై సిరీస్ విజేత పాకిస్తాన్
హరారే: ఆతిథ్య జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఆదివారం ఆసీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో షహిబ్జాదా ఫర్హాన్, హుస్సేన్ తలాట్‌లు డకౌట్లగా నిరాశపరిచినప్పటికీ, ఫకార్ జమాన్(91; 46 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి జతగా షోయబ్ మాలిక్(43 నాటౌట్), సర్ఫరాజ్ అహ్మద్(28)లు తలో చేయి వేయడంతో పాకిస్తాన్ సునాయాసంగా విజయాన్ని సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు డీఆర్సీ షార్ట్(76;53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), అరోన్ ఫించ్(47; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు. -
ఆసీస్‌దే ట్రై సిరీస్
ముంబై: మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. శనివారం ఇంగ్లండ్‌తో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆసీస్ 57 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇంగ్లండ్ క్రీడాకారిణుల్లో నటాలీ స్కీవర్(50) హాఫ్ సెంచరీతో రాణించగా, డానియెల్లీ వ్యాట్(34), ఎలెన్ జోన్స్(30)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ప్రధానంగా ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఇంగ్లండ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళలు 209 పరుగులు సాధించారు. ఫలితంగా మహిళల అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా పేరిట ఉన్న 205 పరుగుల రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. అలైస్సాహేలీ (33), గార్డనర్(33)లు మోస్తరుగా ఆకట్టుకోగా, కెప్టెన్ మెగ్ లాన్నింగ్(88 నాటౌట్;45 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్), విల్లానీ(51; 30 బంతుల్లో 8 ఫోర్లు) చెలరేగి ఆడారు. దాంతో ఆసీస్ రికార్డు స్కోరు సాధించింది. -
ఆసీస్ రికార్డు స్కోరు
ముంబై: మహిళల ముక్కోణపు టీ20 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రికార్డు స్కోరు సాధించింది. శనివారం ఇంగ్లండ్‌తో తుది పోరులో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఫలితంగా మహిళల అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా పేరిట ఉన్న 205 పరుగుల రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్ నాల్గో బంతికి ఓపెనర్ బెత్ మూనీ డకౌట్‌గా పెవిలియన్ చేరారు. ఆపై అలైస్సా హేలీ(33), గార్డనర్(33)లు కుదురుగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. అయితే వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆసీస్ తడబడినట్లు కనిపించింది.కాగా, కెప్టెన్ మెగ్ లాన్నింగ్(88 నాటౌట్;45 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్), విల్లానీ(51; 30 బంతుల్లో 8 ఫోర్లు)లు చెలరేగి ఆడారు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 139 పరుగులు జోడించడంతో ఆసీస్ రెండొందల మార్కును సునాయసంగా దాటడంతో పాటు రికార్డు స్కోరును నమోదు చేసింది. -
నువ్వా నేనా..?
ముంబై: భారతగడ్డపై వారంరోజులపాటు జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ తుదిదశకు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ మహిళాజట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. లీగ్దశలో తాను ఆడిన చివరిరెండు మ్యాచ్‌ల్లో దూకుడు ప్రదర్శించిన ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ టోర్నీలో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగానే రాణించింది. బేత్ మూనీ, అలీసా హీలీ, కెప్టెన్ మెగ్ ల్యానింగ్, ఎలీసా విలానీ, ఎలీసా పెర్రీలు బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. తమదైన రోజున ఏ బౌలింగ్ విభాగాన్నైనా వీరు సమర్థంగా ఎదుర్కొనగలరు. ముఖ్యంగా లీగ్ తొలిగేమ్‌లో విఫలమైన ల్యానింగ్ ప్రస్తుతం మంచి టచ్‌లో ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే మెగన్ ష్కట్ అద్భుతంగా రాణిస్తోంది. ఇంగ్లండ్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపాలంటే ష్కట్ స్థాయికి తగ్గట్లుగా రాణించాల్సి ఉంది. తనకు పేసర్ దిలీసా కిమిన్స్, స్పిన్నర్లు ఆష్లే గార్డెనర్, జోనాసెన్ల నుంచి సహకారం లభించాల్సి ఉంది. మరోవైపు ఫీల్డింగ్ విభాగం మెరుగుపడాలి. టోర్నీలో ఆసీస్ ప్లేయర్లు చాలా క్యాచ్‌ల్ని జారవిడిచారు. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే రెండు వరుస విజయాలతో టోర్నీలో శుభారంభం చేసింది. ఇందులో భారత్‌పై చేసిన 199 పరుగుల ఛేదన అద్భుతమనడంలో సందేహంలేదు. అయితే అనంతరం జోరు కొనసాగించడంలో ఇంగ్లిష్జట్టు విఫలమైంది. చివరిరెండు మ్యాచ్‌ల్లో ఆసీస్, భారత్ చేతిలో ఘోర పరాజయాలు పాలైంది. ముఖ్యంగా 97, 107 పరుగులకే ఇంగ్లిష్ జట్టు బోల్తాపడడం ఆ జట్టు యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో ఈ మ్యాచ్‌లో సత్తాచాటి విజేతగా నిలివాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. ఓపెనర్ డేనియెలి వ్యాట్‌పైనే బ్యాటింగ్ భారం ఉంది. తను ఈ మ్యాచ్‌లో సత్తాచాటాల్సిన అవసరముంది. తనతోపాటు నటాఈ స్కివర్, తమ్సిమ్ బీమంట్, కెప్టెన్ హీథర్ నైట్లు ఆకట్టుకోవాలి. కేటీ జార్జ్, టాష్ ఫర్రంట్, జేనీ గన్లపై ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం ఆధారపడి ఉంది. జట్లు ఆస్ట్రేలియా: ల్యానింగ్ (కెప్టెన్), రేచల్ హేన్స్, నికోలా కారే, గార్డెనర్, హీలీ, జోనాసెసన్, కిమిన్స్, సోఫీ మోలినెక్స్, మూనీ, పెర్రీ, ష్కట్, స్టేల్బర్గ్, విలానీ, వెల్లింగ్టన్. ఇంగ్లండ్: నైట్ (కెప్టెన్), బీమంట్, డేవిడ్సన్, ఎకిల్‌స్టోన్, ఫర్రంట్, కేటీ, గన్, హర్ట్లీ, హెల్, అమీ జోన్స్, ఆన్య ష్రబ్సోల్, స్కివర్, విల్సన్, వాయ్ట్. -
ఎట్టకేలకు గెలిచారు..
ముంబై: ఇప్పటికే ముక్కోణపు టీ 20 సిరీస్‌లో హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొని ఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత మహిళా క్రికెట్ జట్టు ఎట్టకేలకు విజయం దక్కింది. గురువారం ఇంగ్లండ్ మహిళలతో జరిగిన నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళలు 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి భారత జట్టు విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్ మిథాలీ రాజ్(6) మరోసారి నిరాశపరిచినా, స్మృతీ మంధాన(62 నాటౌట్; 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) రాణించి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆమెకు జతగా హర్మన్ ప్రీత్ కౌర్(20 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. డానియల్లీ వ్యాట్(31) మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, జోన్స్(15), బీమౌంట్(10), నటాల్లీ స్కీవర్(15), హీథర్ నైట్(11)లు నిరాశపరిచారు. ఐదుగురు ఇంగ్లండ్ మహిళా క్రీడాకారిణులు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత మహిళా బౌలర్లలో అనుజా పటిల్ మూడు వికెట్లు సాధించగా, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరిన తరుణంలో తాజా ఓటమి ఆ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. శనివారం ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. -
హ్యాట్రిక్ ఓటములు.. టీమిండియా ఔట్
సాక్షి, ముంబై : హ్యాట్రిక్ ఓటములతో టీమిండియా మహిళల జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి నిష్క్రమించింది. పేటీఎం కప్‌లో భాగంగా సోమవారం ముంబైలోని బ్రాబౌర్నే స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలబడ్డాయి. 187 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా జట్టు ఆస్టేలియాను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. ఎలిసే విలని 61 పరుగుల స్కోర్ సాధించటంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు నష్టపోయి 186 పరుగులు సాధించింది. ఇక 187 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచే తడబడింది. ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్ బౌలింగ్ ధాటికి రెండో ఓవర్లోనే ఓపెనర్ స్మృతి మంధాన(3), మిథాలీ రాజ్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ వికెట్‌ను కూడా దక్కించుకోవటంతో హ్యాట్రిక్ సాధించి.. టీ20లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియన్ బౌలర్‌గా(ఓవరాల్‌గా ఏడో బౌలర్) మెగాన్ స్కట్ నిలిచారు. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసిన టీమిండియా జట్టు 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనుజా పాటిల్ 38 పరుగులు, పూజా 19 పరుగులు సాధించారు. ఇక వరుసగా మూడు ఓటములతో ఈ ట్రై సిరీస్ ఫైనల్ బెర్త్‌కు దూరమైంది. అయితే ఇంగ్లాండ్‌తో మరో నామ మాత్రపు మ్యాచ్‌ను భారత్ ఆడనుండగా.. కప్ కోసం ఫైనల్లో ఇంగ్లాండ్-ఆసీస్‌లు తలపడనున్నాయి. -
మా ఫీల్డింగ్ బాగా మెరుగుపడాలి : హర్మన్ ప్రీత్
సాక్షి, స్పోర్ట్స్ : ఫీల్డింగ్ తప్పిదం వల్లనే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురికావాల్సి వచ్చిందని టీమిండియా మహిళా క్రికెట్ టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడ్డారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల ముక్కోణపు టీ20 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ మీడియాతో మాట్లాడారు. టీ20ల్లో అంతగా అనుభవం లేని భారత మహిళల జట్టు ఈ టోర్నీ ద్వారా బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను ఢీకొట్ట బోతుందన్నారు. బీగ్‌బాష్ లీగ్‌తో వారంతా టీ20ల్లో రాటుదేలారని, అయినప్పటికి భారత మహిళలం సాయశక్తులు పోరాడుతామని తెలిపారు. ప్రస్తుతం తమ జట్టు నేర్చుకునే దశలో ఉందని, టీ20 ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుందని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చారు. వారితో పోలిస్తే మా బలం చాలా తక్కువనే విషయం తమకి తెలుసన్నారు. తమ ఫీల్డింగ్ మెరుగుపడాల్సిన అవసరమెంతో ఉందని, వన్డే సిరీస్‌లో జరిగిన తప్పిదాలను సరిచేకుంటామన్నారు. దక్షిణాఫ్రికా పర్యటన విజయానంతరం భారత మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని , అదే ఉత్సాహంతో ఈ సిరీస్‌ను గెలుస్తామని హర్మన్ ప్రీత్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మహిళల క్రికెట్ పట్ల ఆదరణ పెంచేందుకు బీసీసీఐ ఈ టోర్నీ మ్యాచ్‌లను ప్రేక్షకులు ఉచితంగా వీక్షించే సౌకర్యం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. -
గెలిపించింది దినేశ్ కాదు.. ధోనీనే!
సాక్షి, స్పోర్ట్స్: ఆల్‌టైమ్ గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీ ఘనత గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. టీమ్‌లో ఉన్నా, లేకున్నా చర్చలోకి మహీని లాగాల్సిందే! నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తుచేసిన సందర్భంలోనూ ధోనీ ఉన్నాడు. అవును. కీపింగ్‌తోపాటు మ్యాచ్ ఫినిషింగ్ బాధ్యతలు కూడా తీసుకున్న దినేశ్లో ధోనీని చూసుకుంటున్నారు అభిమానులు. చిరునవ్వులు చిందిస్తోన్న దినేశ్‌ను కట్టేసి, ముసుగు తీస్తే ధోనీ కనిపిస్తాడనే అర్థంతో రూపొందిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అందుకు తగ్గట్లే కార్తీక్ కూడా ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బహుశా నాకీ శక్తి అతని నుంచే వచ్చి ఉండొచ్చు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా టెన్షన్ లేకుండా, కామ్‌గా ఉండగలగడం ఒక్క ధోనీకే సాధ్యమైంది. మ్యాచ్‌ను విజయవంతంగా ఫినిష్ చెయ్యడం ధోనీ నుంచే నేర్చుకున్నాను. నేనేకాదు ప్రతిఒక్కరూ ధోనీ నుంచి తెల్సుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది..’ అని డీకే చెప్పాడు. నాగిని డ్యాన్స్ ఎక్స్టెండ్ అయితే.. : మధ్యలో ఆసీస్-సఫారీల మధ్య మాటల యుద్ధాలు, గిల్లికజ్జాలను క్రీడాభిమానులు మర్చిపోకముందే నిదహాస్ టీ20 ట్రోఫీలోనూ ఉద్వేగ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆతిథ్య శ్రీలంకలో మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ ప్లేయర్లు చేసిన నాగిని డ్యాన్స్‌కు క్రీడాలోకం విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. నిన్నటి ఫైనల్స్‌లోనూ బంగ్లా వ్యతిరేకులు కొందరు.. పాములా బుసకొట్టడం చూశాం. ఇక మ్యాచ్ తర్వాతైతే సోషల్ మీడియా నిండా నాగిని ఫొటోలే! సరదాగా రూపొందించిన ఆ ఫొటోల్లో కొన్ని.. Take a bow, Dinesh Karthik👏👏👏 pic.twitter.com/O9gy8NTH6P — All India Bakchod (@AllIndiaBakchod) March 18, 2018 #INDvBAN pic.twitter.com/fNuH0anSLN — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 18, 2018 Pic 1: Before Match Pic 2: After Match#INDvBAN pic.twitter.com/zXwgWuwEUU — PhD in Bakchodi (@Atheist_Krishna) March 18, 2018 Rohit Sharma #INDvBAN pic.twitter.com/C7E9L6pSRF — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 18, 2018 Dinesh Karthik after saving Vijay Shankar's career. #INDvBAN pic.twitter.com/cd5Uj87qjx — SAGAR (@sagarcasm) March 18, 2018 Dear Bangladesh, never underestimate an Indian wicketkeeper on the last ball of a T20 match. #IndvBan #DineshKarthik pic.twitter.com/TIg9kkkoBH — Bollywood Gandu (@BollywoodGandu) March 18, 2018 -
దినేశ్ కార్తీక్‌కు క్షమాపణలు
కొలంబో/ముంబై: నరాలు తెగిపోయేంతటి ఉత్కంఠ పోరులో భారత్‌ను విజేతగా నిలిపిన దినేశ్ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఇదే చర్చ.. సోషల్‌మీడియాలోనూ ట్రెండింగ్ నేమ్ డీకేదే. ‘వాట్ ఏ గేమ్.. వాట్ ఏ ప్లేయర్..’ అంటూ కామెంట్లు..! అందరిలాగే సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ ఓ ట్వీట్ వదిలారు. కానీ అందులో సంఖ్యలు తప్పుగా రాయడంతో, దినేశ్ కార్తీక్‌కు క్షమాపణలు చెబుతూ ఇంకో ట్వీట్ చేశారు. అందుకే శంకర్‌ను ముందు పంపాం: రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం దినేశ్ కార్తిక్ నాలుగో డౌన్లో(98 పరుగుల వద్ద రోహిత్ ఔటైన తర్వాత) రావాల్సింది. కానీ అనూహ్యంగా శంకర్ క్రీజ్‌లోకి వచ్చాడు. అనుభవలేమితో సతమతమౌతూ వరుసగా బంతుల్ని మింగుతూ శంకర్.. అభిమానుల టెన్షన్‌ను మరింత పెంచాడు. ఆ నిర్ణయంపై కెప్టెన్ రోహిత్ వివరణ ఇచ్చుకున్నాడు. ‘కీలకమైన తరుణంతో అనుభవమున్న ఆటగాడి అవసం చాలా ఉంటుంది. మ్యాచ్‌ను విజయవంతంగా ముగించగల సత్తా కార్తీక్‌కు ఉందని నేను గట్టిగా నమ్మాను. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపాం. అనుకున్నట్లే డీకే తనదైన నైపుణ్యంతో రాణించాడు’’ అని రోహిత్ చెప్పాడు. 20 ఏళ్ల తర్వాత లంక గడ్డపై.. శ్రీలంక 50వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా 1998లో తొలిసారి నిదహాస్ ముక్కోణపు వన్డే ట్రోఫీని నిర్వహించారు. అప్పుడు శ్రీలంక-భారత్-న్యూజిలాండ్ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్‌లో సచిన్ టెండూల్కర్ సూపర్ సెచరీ(128)తో భారత్ 307 పరుగులు చేయగా, లంక 301 పరుగులకే ఆలౌటైంది. అలా తొలి ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత.. అంటే శ్రీలంక 70వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా రెండోసారి నిదహాస్ ట్రోఫీని నిర్వహించారు. వన్డేలకు బదులు టీ20లు ఆడించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 8 బంతుల్లో 29 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించగా, వాషింగ్టన్ సుందర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. (చదవండి : దినేశ్ కార్తీక్ సూపర్ హిట్) T 2747 - that should read 34 needed in 2 overs .. NOT 24 .. apologies to Dinesh Kartik .. pic.twitter.com/yH6rVjWzpk — Amitabh Bachchan (@SrBachchan) 18 March 2018