22 పరుగులకే మూడు వికెట్లు | Early strikes leave Bangladesh in trouble | Sakshi

22 పరుగులకే మూడు వికెట్లు

Jan 27 2018 5:03 PM | Updated on Nov 9 2018 6:46 PM

 Early strikes leave Bangladesh in trouble - Sakshi

ఢాకా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ కష్టాల్లో పడింది. శ్రీలంక నిర్దేశించిన 222 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. బంగ్లా ఆటగాళ్లు తమీమ్‌ ఇక్బాల్‌(3), మొహ్మద్‌ మిథున్‌(10), షబ్బీర్‌ రెహ్మాన్‌(2)లు తీవ్రంగా నిరాశపరిచారు.

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓ‍వర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యారు. ఉపుల్‌ తరంగా(56), కుశాల్‌ మెండిస్‌(28), నిరోషన్‌ డిక్వెల్లా(42), దినేశ్‌ చండిమాల్‌(45)లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement