
ఢాకా: భారత్, శ్రీలంక జట్లతో ముక్కోణపు టీ20 సిరీస్‌లో తలపడబోయే బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ట్రై సిరీస్ నుంచి బంగ్లాదేశ్ ఆల్ రౌండర్, కీలక ఆటగాడు షకిబుల్ హసన్ గాయం కారణంగా వైదొలిగాడు. ప్రస్తుతం వేలి గాయంతో బాధపడుతున్న షకిబుల్.. ట్రై సిరీస్‌కు దూరం కానున్న విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది.
ఇటీవల ఢాకాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరస్‌లో గాయపడిన షకిబుల్.. ట్వంటీ 20 ట్రై సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తాడని తొలుత భావించారు. కానీ అతని గాయం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో షకిబుల్‌కు మరికొన్ని రోజులు విశ్రాంతినిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. షకిబుల్ గాయంపై డాక్టర్ల నిర్ణయం తర్వాతే అతనికి రెస్ట్ ఇవ్వడానికి టీమ్ మేనేజ్‌మెంట్ ముందుకొచ్చింది. మంగళవారం(మార్చి6వ తేదీ) నుంచి ముక్కోణపు టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment