Shakib Al Hasan
-
షకీబ్‌కు బిగ్ రిలీఫ్.. బౌలింగ్‌కు లైన్ క్లియర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మేటి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది. అతని బౌలింగ్ శైలితీరు నియమాలకు లోబడే ఉందని, సందేహాస్పదంగా లేదని సమీక్ష అనంతరం తేలింది. అయితే తన బౌలింగ్ యాక్షన్‌ను ఎక్కడ సమీక్షించారనే విషయాన్ని షకీబ్ వెల్లడించలేదు.ఇప్పటికే టెస్టులకు, అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్ వన్డే ఫార్మాట్లో, ఫ్రాంచైజీ లీగ్‌లలో బౌలింగ్ చేసేందుకు మార్గం సుగమం అయింది. గత ఏడాది అక్టోబర్ కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టు తర్వాత షకీబ్ మళ్లీ బరిలోకి దిగలేదు. గత డిసెంబర్లో ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో సర్రే జట్టు తరఫున మ్యాచ్ ఆడిన సమయంలో షకీబ్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉండటంతో అతడు బౌలింగ్‌పై నిషేధం విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన షకీబ్ త్వరలో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశముంది.చదవండి: ఐపీఎల్లో ‘సలైవా’ వాడవచ్చు! -
స్టార్ క్రికెటర్‌పై అరెస్టు వారెంట్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ అయింది. అవామీ లీగ్ ఎంపీగానూ వ్యవహరించిన షకీబ్‌పై చెక్ బౌన్స్‌కు సంబంధించిన కేసులో ఢాకా న్యాయస్థానం చర్యలు తీసుకుంది. ‘అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జైదుర్ రహమాన్.. షకీబ్ అల్ హసన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేశారు. మార్చి 24 నాటి ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశించారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా... ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడారు. ఆ సమయంలో జరిగిన గొడవల్లో షకీబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా... అప్పటి నుంచి షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి రాకుండా విదేశాల్లో ఉంటున్నాడు. స్వదేశంలో చివరి టెస్టు ఆడాలని షకీబ్ ఆశించినా... భద్రత ఏర్పాట్ల విషయంలో హామీ లభించకపోవడంతో అతడు వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్ ఎదుర్కొంటున్న షకీబ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాంపియన్స్ ట్రోఫీకి పరిగణించలేదు. -
అందుకే నాపై వేటు వేశారు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ప్లేస్!
స్టార్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ప్రకటించిన బంగ్లాదేశ్ జట్టులో వీరికి చోటు దక్కలేదు. షకీబ్ విషయానికొస్తే.. సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్‌కు గురైన అతడిని సెలెక్టర్లు ఈ ఐసీసీ టోర్నీకి పరిగణించలేదు. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన 37 ఏళ్ల షకీబ్... చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకొంటానని ఇదివరకే వెల్లడించాడు.అయితే, తాజాగా బంగ్లాదేశ్ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంతో షకీబ్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. షకీబ్‌తో పాటు ఫామ్‌లేక తంటాలు పడుతున్న సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు కూడా నిరాశే ఎదురైంది. గత 13 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా సాధించని లిటన్ దాస్... గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 1, 0, 0, 2, 4, 0 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు.అందుకే నాపై వేటు వేశారుఈ విషయంపై స్పందించిన లిటన్ దాస్ తనపై వేటు పడటానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘గతంలో నేను ఎన్నెన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాను. అయితే, ఇప్పుడు జీరో నుంచి మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఇకపై మరింత కఠినంగా శ్రమించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.అయినా, చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికకు ముందే నాకొక స్పష్టమైన సందేశం వచ్చింది. అయితే, సెలక్టర్ల నుంచి నేరుగా రాలేదు. కానీ.. ఈ జట్టులో చోటు దక్కదని తెలుసు. నేను బాగా ఆడటం లేదు కాబట్లే నన్ను టీమ్ నుంచి తప్పించారు. ఇందులో దాచాల్సింది, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అందరి విషయంలోనూ సాధారణంగా జరిగేదే ఇది.కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తాఏదేమైనా నేను నా ఆటను మెరుగుపరచుకోవాల్సి ఉంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు గానీ.. నేను మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయను. అయినా... నేను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నిలకడైనా ఆట తీరుతో కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తా’’ అని 30 ఏళ్ల లిటన్ దాస్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా గతనెల(డిసెంబరు 2024)లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు చివరగా ఆడాడు.ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకాగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు నజ్ముల్ హుసేన్ షాంటో సారథ్యం వహిస్తుండగా... ముష్ఫికర్ రహీం, మహ్ముదుల్లా, ముస్తాఫిజుర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-‘బి’లో ఉంది. మరోవైపు.. టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది.తదుపరి.. రావల్పిండి వేదికగా ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌తో, ఫిబ్రవరి 27న అదే వేదికపై పాకిస్తాన్‌తోనూ బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ టోర్నీలో మార్చి 4న తొలి సెమీఫైనల్ దుబాయ్‌లో జరుగనుండగా.. మార్చి 5న రెండో సెమీ ఫైనల్‌కు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 9న ఫైనల్ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు కాగా.. మార్చి 10 రిజర్వ్ డేగా ఖరారు చేశారు..బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుసేన్ షాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, మహ్ముదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్, తస్కీన్ అహ్మద్, ముస్తఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్, నసుమ్ అహ్మద్, తన్జిమ్ హసన్, నహిద్ రాణా.చదవండి: ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..? -
షకీబ్ అల్ హసన్‌పై నిషేధం
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిషేధం విధించింది. షకీబ్ దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ పోటీలలో బౌలింగ్ చేయకూడదని బీసీబీ ప్రకటించింది. షకీబ్ బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈసీబీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఐసీసీ కూడా షకీబ్‌పై బ్యాన్ విధించింది. షకీబ్ బౌలింగ్ శైలిని త్వరలో ఐసీసీ టెస్టింగ్ సెంటర్లో పరిశీలించబోతున్నారు. ఈ పరీక్షలో షకీబ్ పాస్ అయితే అతనిపై నిషేధం ఎత్తి వేస్తారు.కాగా, షకీబ్ ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్షిప్ పోటీల్లో సర్రే తరఫున బరిలోకి దిగి సోమర్సెట్ కౌంటీపై 9 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం షకీబ్ బౌలింగ్ శైలిపై అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో షకీబ్ బౌలింగ్ శైలిపై ఈ నెల ప్రారంభంలో పరీక్ష నిర్వహించారు. ఇందులో షకీబ్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది. షకీబ్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని ఈసీబీ ప్రకటించింది. -
సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్.. ఐదు వికెట్లు తీసిన బంగ్లా బౌలర్.. అరుదైన క్లబ్లో చేరిక
ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో తైజుల్ 13 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో తైజుల్ అరుదైన 200 వికెట్ల క్లబ్లో చేరాడు. తైజుల్ 85 ఇన్నింగ్స్‌ల్లో 201 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా తరఫున 200 వికెట్ల క్లబ్లో చేరిన రెండో బౌలర్ తైజుల్. తైజుల్‌కు ముందు షకీబ్ అల్ హసన్ (121 ఇన్నింగ్స్‌ల్లో 246 వికెట్లు) ఈ ఘనత సాధించాడు.బంగ్లాదేశ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..షకీబ్ అల్ హసన్-121 ఇన్నింగ్స్‌ల్లో 246 వికెట్లుతైజుల్ ఇస్లాం- 85 ఇన్నింగ్స్‌ల్లో 201 వికెట్లుమెహిది హసన్ మిరాజ్- 83 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లుమొహమ్మద్ రఫీక్- 48 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లుముషరఫే మొర్తజా- 51 ఇన్నింగ్స్‌ల్లో 78 వికెట్లుషహాదత్ హొసేన్- 60 ఇన్నింగ్స్‌ల్లో 72 వికెట్లుమ్యాచ్ విషయానికొస్తే.. ఇవాళే మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలింది. కగిసో రబాడ (3/26), వియాన్ ముల్దర్(3/22), కేశవ్ మహారాజ్ (3/34), డేన్ పీడెట్ (1/19) బంగ్లా పతనాన్ని శాశించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ జాయ్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఐదు, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (6), టోనీ డి జోర్జీ (30), ట్రిస్టన్ స్టబ్స్ (23), డేవిడ్ బెడింగ్హమ్ (11), ర్యాన్ రికెల్టన్ (27), మాథ్యూ బ్రీట్జ్కీ (0) ఔట్ కాగా.. కైల్ వెర్రిన్ (18), వియాన్ ముల్దర్ (17) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 34 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: రెచ్చిపోయిన లంక బ్యాటర్లు.. విండీస్ ఖాతాలో మరో పరాజయం -
స్వదేశంలోనే షకీబ్ వీడ్కోలు
ఢాకా: సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు సొంతగడ్డపై వీడ్కోలు పలకాలనుకున్న బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కోరిక నెరవేరనుంది. ఇటీవల భారత్‌తో రెండో టెస్టు సందర్భంగా స్వదేశంలో చివరి మ్యాచ్ ఆడి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని షకీబ్ ప్రకటించాడు. అయితే బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై అనుమానాలు రేకెత్తగా... ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో షెడ్యూల్ ప్రకారం సిరీస్ జరగనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈనెల 21 నుంచి మొదలయ్యే తొలి టెస్టు కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బుధవారం జట్టును ప్రకటించింది. అందులో సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు చోటు దక్కింది. బంగ్లాదేశ్‌లో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటున్న షకీబ్... చివరి మ్యాచ్ కోసం స్వదేశానికి రావాలనుకుంటున్నట్లు గతంలోనే వెల్లడించగా... భద్రత కల్పంచలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. షకీబ్ రాజకీయ వైఖరి వెల్లడిస్తే భద్రత కలి ్పస్తామని... తాత్కాలిక ప్రభుత్వంలో క్రీడా సలహాదారుడిగా పనిచేస్తున్న ఆసిఫ్ మహమూద్ ప్రకటించగా... స్వదేశంలో హింస తలెత్తిన సమయంలో నోరు మెదపకుండా ఉన్నందుకు షకీబ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ‘అల్లర్లలో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతున్నా. హింస ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించరాదు. అయినవాళ్లను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. మీ మనోభావాలను గౌరవిస్తూ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. త్వరలో స్వదేశంలో చివరి టెస్టు మ్యాచ్ ఆడాలనుకుంటున్నా. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలుస్తూ... నేను బాగా ఆడినప్పుడు కేరింతలు కొట్టి, బాగా ఆడనప్పుడు కళ్ల నీళ్లు పెట్టుకున్న అందరి ముందు ఆఖరి ఆట ఆడాలనుకుంటున్నా. మీ ప్రేమాభిమానులు కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని షకీబ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. దీంతో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం షకీబ్‌కు భద్రత కల్పించేందుకు ముందుకు రాగా... తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బోర్డు అతడిని ఎంపిక చేసింది. ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్... వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పనున్నాడు. తాజాగా భారత్‌లో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన బంగ్లాదేశ్... సఫారీలపై సత్తా చాటాలని చూస్తోంది. టీమిండియాతో ఆడిన జట్టు నుంచి ఖాలెద్ అహ్మద్‌ను తప్పించడం తప్ప మిగిలిన జట్టులో మార్పులు చేయలేదు. తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ షంటో (కెపె్టన్), షాద్మన్ ఇస్లామ్, మహ్ముదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, జాకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, నయీమ్ హసన్, తస్కీన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
షకీబ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి..
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలతో సత్తాచాటిన యశస్వీ జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలవగా.. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.షకీబ్‌కు గిఫ్ట్ ఇచ్చిన విరాట్..త్వరలో రిటైరవుతున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబుల్ హసన్‌కు భారత స్టార్ విరాట్ కోహ్లి తన బ్యాట్‌ను కానుకగా అందజేశాడు. షకీబ్ టెస్టు ఫార్మాట్‌పై ఇది వరకే తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ తర్వాత టెస్టులకు గుడ్‌బై చెబుతానన్నాడు. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పే యోచన లో ఉన్నాడు.రెండో టెస్టు ముగిసిన తర్వాత కోహ్లి స్వయంగా బంగ్లాదేశ్ జట్టు వద్దకు వెళ్లి తన గుర్తుగా బంగ్లా మేటి క్రికెటర్ అయిన షకీబ్‌కు బ్యాట్‌ను బహూకరించాడు. ఈ సందర్భంగా ఇరు జట్ల హేమాహేమీలు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. షకీబ్ స్టార్ ఆల్‌రౌండర్. బంగ్లాదేశ్‌కే కాదు... మన ఐపీఎల్ అభిమానులకు చిరపరిచితుడు. అతను కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున 71 మ్యాచ్‌లాడాడు. చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం.. -
Ind vs Ban: షకీబ్ అల్ హసన్ సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. టీమిండియతో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ షకీబ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్టు సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు.ఈ మేరకు షకీబ్ కాన్పూర్‌లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్లో మిర్పూర్లో సౌతాఫ్రికాతో ఆడబోయే మ్యాచ్ నా కెరీర్లో ఆఖరిది. సొంతగడ్డపై నా అభిమానుల మధ్య టెస్టు కెరీర్ ముగించడం సంతోషకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ నాకెంతో చేసింది. పేరు, ప్రతిష్ట అన్నీ ఇచ్చింది. అందుకే నా ఆఖరి టెస్టు స్వదేశంలోనే ఆడాలని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నాడు.అక్కడకు వెళ్తే బయటకు రాకపోవచ్చుఇక బంగ్లాదేశ్‌లో తన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘బంగ్లాదేశీ పౌరుడిగా.. ఇండియా నుంచి అక్కడికి వెళ్లేందుకు నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాకపోవచ్చు. అయితే, ఒక్కసారి అక్కడకు వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల గురించి ఎప్పటికపుడు నాకు చెబుతూనే ఉన్నారు. నేను కూడా ప్రస్తుతం సందిగ్దావస్థలోనే ఉన్నాను’’ అని షకీబ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎంపీ పదవి పోయిందికాగా బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా చెలరేగిన అల్లర్లు రాజకీయ సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన అవామీ లీగ్ హెడ్షేక్ హసీనా భారత్‌లో తలదాచుకున్నారు. ఆమె ప్రభుత్వం రద్దు కావడంతో.. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన షకీబ్ పదవి కూడా ఊడిపోయింది.హత్య కేసు నమోదుఆ సమయంలో కెనడా లీగ్‌తో బిజీగా ఉన్న షకీబ్.. నేరుగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే, షకీబ్ బంగ్లాదేశ్‌లో లేని సమయంలో అతడిపై హత్య కేసు నమోదైంది. దేశంలో చెలరేగిన అల్లర్లలో తన కుమారుడు చనిపోవడానికి కారణం ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ సభ్యులు కారణమంటూ ఓ వ్యక్తి షకీబ్పైకూడా కేసు పెట్టాడు. దీంతో అతడిని అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు మాత్రం ఆటగాడిగా షకీబ్ దేశానికి ఎంతో సేవ చేశాడని.. అతడిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జట్టుతో కలిసి షకీబ్ పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆడాడు. బంగ్లా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీబంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన గొప్ప ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్. ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. బంగ్లా తరఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లు ఆడి 4600 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. అదే విధంగా.. టెస్టుల్లో 242 వికెట్లు పడగొట్టాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా తన చివరి అంతర్జాతీయ టీ2మ్యాచ్ ఆడిన షకీబ్ అల్ హసన్.. దేశం తరఫున 129 పొట్టి మ్యాచ్‌లలో 2551 రన్స్ చేయడంతో పాటు.. 149 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 247 వన్డేల్లో 7570 పరుగుల సాధించి.. 317 వికెట్లు కూల్చాడు. చదవండి: IND Vs BAN: ఇలా అయితే కష్టం కోహ్లి!.. 15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్! -
టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు అదిరిపోయే గుడ్ న్యూస్
కాన్పూర్ వేదికగా భారత్‌తో రెండో టెస్టులో తలపడేందుకు బంగ్లాదేశ్తలపడేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కాన్పూర్ చేరుకున్న బంగ్లా జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు పర్యాటక బంగ్లా జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయమైంది. స్పిన్‌కు స్వర్గధామమైన చెపాక్ లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను కేవలం 21 ఓవర్లే వేయగలిగాడు. షకీబ్ నొప్పితో బాధపడూతూనే మ్యాచ్‌లో కొనసాగాడు. అయితే తన గాయం నుంచి షకీబ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని బంగ్లా హెడ్ కోచ్ హతురుసింఘే ధ్రువీకరించారు. "రెండో టెస్టుకు షకీబ్ అందుబాటులో ఉంటాడు. అతడి ఫిట్‌నెస్‌పై ఏ బెంగా లేదన్నాడు. తొలిటెస్టులో మా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేకపోయారు. అందుకే ఓడిపోయాం. ఇప్పుడు కాన్పూర్ టెస్టులో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉందని" హతురుసింఘే పేర్కొన్నారు. -
టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు ఊహించని ఎదురు దెబ్బ!
భారత్ చేతిలో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన బంగ్లాదేశ్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న కాన్పూర్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు సమాచారం.చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా బౌలింగ్‌లో బంతి బలంగా షకీబ్ కూడి చేతికి వేలికి తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే అతడికి ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ తర్వాత షకీబ్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించినప్పటికి నొప్పితో బాధపడుతున్నట్లు మైదానంలో కన్పించాడు. మ్యాచ్ అనంతరం అతడిని స్కానింగ్‌కు తరలించగా ఎటువంటి పగులు లేనిట్లు తేలినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ వారం రోజుల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాన్పూర్ టెస్టుకు షకీబ్ దూరమైతే బంగ్లాకు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే షకీబ్ తొలి టెస్టులో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సత్తాచాటలేకపోయాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
'మలింగలా బౌలింగ్ చేస్తున్నావు'.. విరాట్ కామెంట్స్‌కు లసిత్ రిప్లే
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు బ్యాటింగ్‌లో నైనా, ఇటు ఫీల్డింగ్‌లోనైనా ప్రత్యర్ధి ఆటగాళ్లను ఆటపట్టిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు తన దూకుడు స్వభావంతో ప్రత్యర్ధులను స్లెడ్జ్ కూడా చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా కింగ్ కోహ్లి మరోసారి తన సరదా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు.ఇంతకీ ఏమి జరిగిందంటే?చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత కోహ్లి క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన కోహ్లికి బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ షకీబ్ అల్హసన్ వరుసగా యార్కర్లు సంధించాడు. దీంతో అతడిని స్లెడ్జ్ చేయాలని కోహ్లి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్ వైపు చూస్తూ.. "మలింగలా వరుసగా యార్కర్లు బౌలింగ్ చేస్తున్నావు" అంటూ అన్నాడు. కోహ్లి మాటలు విన్న షకీబ్ కాస్త దగ్గరకు వచ్చి నవ్వుతూ తన ఫీల్డింగ్ పొజిషేన్కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ వీడియాపై శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ స్పందించాడు. "గ్రేట్ బ్రదర్" అంటూ మలింగ రిప్లే ఇచ్చాడు.పట్టు బిగించిన భారత్..ఇక చెపాక్‌లో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది. బంగ్లా జట్టు విజయం సాధించాలంటే ఇంకా 357 పరుగులు అవసరం.చదవండి: IND vs BAN: బుమ్రా అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లోనే? Niyamai malli🤣🫶 https://t.co/heeEK48QRP— Lasith Malinga (@malinga_ninety9) September 21, 2024 -
పాక్‌ను చిత్తు చేశాం.. భారత్‌తో సిరీస్‌కు సిద్ధం: బంగ్లా కెప్టెన్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌ను సొంతగడ్డపై ఓడించి తొలిసారి.. ఆ జట్టుపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. స్వదేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ పర్యటన సాగుతుందా లేదోనన్న సందేహాల నడుమ.. అక్కడికి వెళ్లడమే కాదు ఏకంగా ట్రోఫీ గెలిచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఆరు వికెట్ల తేడాతో ఓడించికాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 సీజన్లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. మంగళవారం ముగిసిన రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.మాటలు రావడం లేదుఈ క్రమంలో చారిత్మక విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో మాట్లాడుతూ.. ‘‘ఈ గెలుపు మాకెంతో కీలకమైనది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. చాలా చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాం. అందుకు తగ్గట్లుగానే జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రను చక్కగా పోషించి ఈ గెలుపునకు కారణమయ్యారు.మా జట్టు అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా రెండో టెస్టులో మా పేసర్లు అత్యుత్తమంగా రాణించడం వల్లే అనుకున్న ఫలితం రాబట్టగలిగాం. గెలవాలన్న కసి, పట్టుదల మమ్మల్ని ఈస్థాయిలో నిలిపాయి. తదుపరి టీమిండియాతో తలపడబోతున్నాం. ఆ సిరీస్ కూడా ఎంతో ముఖ్యమైనది. టీమిండియాతో సిరీస్‌కు సిద్ధంఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెడతాం. టీమిండియాతో సిరీస్‌లో ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ అత్యంత కీలకం కానున్నారు. ఇక మిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడు ఐదు వికెట్లు పడగొట్టిన తీరు అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం చేస్తాడని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేయడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని నజ్ముల్ షాంటో తెలిపాడు.కాగా సెప్టెంబరు 19 నుంచి రోహిత్ సేనతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు స్కోర్లువేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 274 ఆలౌట్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 262 ఆలౌట్పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 172 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 185/4ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై బంగ్లా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లిటన్ దాస్ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: మెహదీ హసన్ మిరాజ్చదవండి: సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ -
Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. పాక్ క్రికెటర్ చర్య వైరల్
పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. పాక్ టెయిలెండర్ అబ్రార్ అహ్మద్ మైదానంలోకి పరిగెత్తుకు వచ్చిన తీరు బంగ్లా శిబిరంలో నవ్వులు పూయించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ అబ్రార్ చర్యకు స్పందించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అసలేం జరిగిందంటే..తొలి టెస్టులో ఘన విజయంరెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్ వెళ్లిన బంగ్లాదేశ్.. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. పది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి పాక్‌పై టెస్టుల్లో విజయం సాధించింది. ఇదే జోరులో రెండో మ్యాచ్‌ను మొదలుపెట్టిన పర్యాటక జట్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసి.. ఆ దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు పాక్‌ను ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే పరిమితం చేసింది.రెండో మ్యాచ్‌లోనూ అదరగొడుతూసోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నషీద్ రాణా నాలుగు వికెట్లతో చెలరేగి.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచారు. ఈ క్రమంలో.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే క్రమంలో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేగంగా పరిగెత్తుకు వచ్చాడు. ఆ హడావుడిలో అతడి చేతి గ్లౌజ్ కిందపడగా.. వెంటనే దానిని తీసుకుని మరింత వేగంగా క్రీజు వైపునకు పరిగుతీశాడు.ఆలస్యమైతే అవుటే.. షకీబ్ నవ్వులుఆ సమయంలో బౌలింగ్ చేస్తున్నది మరెవరో కాదు బంగ్లా మాజీ కెప్టెన్ షకీబల్ హసన్. అబ్రార్ హడావుడికి అదే కారణం. ఏమాత్రం ఆలస్యం చేసినా టైమ్డ్ అవుట్ కింద అవుట్ అయ్యే ప్రమాదం ఉందని పసిగట్టిన అబ్రార్.. అలా పరిగెత్తగానే.. షకీబల్ నవ్వడం గమనార్హం. కాగా వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్ సమయంలో షకీబ్.. టైమ్డ్ అవుట్ కింద అప్పీలు చేసి ఏంజెలో మాథ్యూస్‌ను పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే.నాడు లంక బ్యాటర్‌కు చేదు అనుభవంఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ అవుటైనా.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చే ఆటగాడు.. మూడు నిమిషాల్లోపే క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవాలి. లేదంటే.. టైమ్డ్ అవుట్ రూల్ కింద అవుటైనట్లుగా ప్రకటిస్తారు. నాడు మాథ్యూస్ షకీబ్ కారణంగా ఇలా అవుటై.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అది దృష్టిలో పెట్టుకునే అబ్రార్ కూడా షకీబ్‌కు భయపడి ఉంటాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: 'పాకిస్తాన్ జట్టుకు క్యాన్సర్.. ఆ నలుగురు చాలా డేంజరస్'unreal fear of abrar ahmed being get timed out when Shakib is bowling 😂Everyone remembered what happened with sir angelo Mathews 😜#PAKvBAN pic.twitter.com/bXiijoNBKb— Afrid Mahmud Rifat 🇧🇩 (@rifat0015) September 2, 2024 -
ఆల్‌టైమ్ ఫేవరెట్ వన్డే జట్టు.. రోహిత్‌కు నో ప్లేస్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ వన్డే జట్టు వివరాలను వెల్లడించాడు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని నియమించాడు. జట్టులో రెండో ఆల్‌రౌండర్‌గా తన ప్లేస్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. తన ఫేవరెట్ జట్టులో వన్డే క్రికెట్లోని స్టార్లందరికీ చోటు కల్పించిన షకీబ్.. ఒక్క రోహిత్ శర్మను మాత్రం పక్కన పెట్టాడు. షకీబ్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్టులోకి రోహిత్‌ను తీసుకోలేదు. ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్‌లకు అవకాశం ఇచ్చిన షకీబ్.. వన్‌డౌన్‌లో ఆశ్చర్యకరంగా క్రిస్ గేల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. నాలుగో స్థానం కోసం విరాట్‌ను ఎంపిక చేసిన షకీబ్.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జాక్ కల్లిస్కు ఛాన్స్ ఇచ్చాడు. ఆరో స్థానం కోసం ధోని ఎంపిక చేసిన షకీబ్.. ఏడో స్థానంలో తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా షేన్ వార్న్, ముత్తయ్య మురళీథరన్లను ఎంపిక చేసిన షకీబ్.. ఫాస్ట్ బౌలర్లుగా వసీం అక్రమ్, గ్లెన్ మెక్గ్రాత్లకు ఛాన్స్ ఇచ్చాడు.కాగా, కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న షకీబ్.. స్వదేశంలో జరిగిన ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. షకీబ్‌పై బంగ్లాదేశ్‌లో మర్డర్ కేసు నమోదైంది. ఈ కేసులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. షకీబ్ విషయంలో బాధితుడి తరఫు లాయర్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు. షకీబ్‌ను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో బీసీబీ మాత్రం పట్టీపట్టనట్లు ఉంది. షకీబ్‌పై నేరం రుజువైతే అప్పుడు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అప్పటివరకు అతను జట్టుతో కొనసాగుతాడని పేర్కొంది. షకీబ్ తాజాగా పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి పాక్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. షకీబ్‌పై ఎన్ని వివాదాలు ఉన్నా ఆట పరంగా అతను బంగ్లాదేశ్‌కు లభించిన ఆణిముత్యమనే చెప్పాలి. -
షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నోటీసులు
బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ ఆగస్టు 7న తమ కుమారుడు రూబెల్ హత్యకు గురయ్యాడని రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి ఢాకాలోని అడబోర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. నిందితుల జాబితాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేరు కూడా ఉంది. ఈ కేసులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు అందాయి. బాధితుల తరఫు లాయర్లు షకీబ్‌ను తక్షణమే జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. షకీబ్‌పై కేసు విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ తెలిపాడు. ప్రస్తుతం షకీబ్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌పై బంగ్లాదేశ్ సాధించిన సంచలన విజయంలో షకీబ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షకీబ్ నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి దోహదపడ్డాడు.కాగా, రావల్పిండి వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మైదానంలో మరోసారి దురుసుగా ప్రవర్తించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా షకీబ్.. పాక్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ముఖంపైకి ఉద్దేశపూర్వకంగా బంతిని విసిరాడు. దీని కారణంగా ఐసీసీ షకీబ్ మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది. అలాగే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద ఓ డీ మెరిట్ పాయింట్ పొందాడు. 😲😲pic.twitter.com/5fybTO3j1h— CricTracker (@Cricketracker) August 25, 2024ఈ ఘటన ఆట చివరి రోజు (ఆదివారం) పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ సందర్భంగా జరిగింది. షకీబ్ బంతి వేయడానికి సిద్దం కాగా.. రిజ్వాన్ చివరి నిమిషంలో స్ట్రయిక్ నుంచి వెనక్కు తగ్గాడు. దీంతో చిర్రెత్తిపోయిన షకీబ్ కోపంగా బంతిని రిజ్వాన్వైపు విసిరాడు. ఇది గమనించిన ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో షకీబ్‌ను వెంటనే మందలించాడు. అంతటితో విషయం సద్దుమణిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి లేదా ఇతరత్రా వస్తువులను ఆటగాళ్లపై కానీ, వారి సమీపంలో కానీ విసిరడం లెవెల్ 1 ఉల్లంఘన కింద పరిగణిస్తారు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.9 కింద షకీబ్‌కు పెనాల్టీ విధించారు.కాగా, ఇదే మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు పూర్తి చేయనందుకు పాక్, బంగ్లాదేశ్ జట్లకు ఐసీసీ షాకిచ్చింది. పాక్‌కు ఆరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు, బంగ్లాదేశ్‌కు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడింది. ఈ పాయింట్ల కోత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలపై ప్రభావం చూపించింది. మూడు పాయింట్లు కోల్పోయినందుకు బంగ్లాదేశ్ ఏడో స్థానానికి పడిపోగా.. పాక్ పాయింట్లు మరింత తగ్గిపోయి ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.ఇదిలా ఉంటే, రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
WTC: పాకిస్తాన్‌కు భారీ షాకులిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆరు పాయింట్లను కోల్పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున పాక్ జట్టుకు ఆరు పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.బంగ్లా చేతిలో పాకిస్తాన్ చిత్తుకాగా డబ్ల్యూటీసీలో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య రీతిలో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమిని చేతులారా ఆహ్వానించింది. తద్వారా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఓడిన తొలి పాక్ జట్టుగా షాన్ మసూద్ బృందం చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది.బంగ్లాకు సైతం ఎదురుదెబ్బఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ఇలా బాంబు పేల్చడం గమనార్హం. బంగ్లాతో మొదటి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ.. పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతతో పాటు ఆరు పాయింట్లు కట్ చేసినట్లు ఐసీసీ పేర్కొంది. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు కూడా స్లో ఓవర్ రేటు సెగ తగిలింది.ఫలితంగా నజ్ముల్ షాంటో బృందం మూడు డబ్ల్యూటీసీ పాయింట్లతో పాటు 15 శాతం మేర మ్యాచ్ ఫీజు కోల్పోయింది. అంతేగాక.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు పనిష్మెంట్ ఇచ్చింది ఐసీసీ. పాక్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌పైకి బంతిని విసిరినందుకు గానూ.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేసింది. అదే విధంగా.. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్ 1 ప్రకారం.. ఒక డిమెరిట్ పాయింట్( దురుసుగా ప్రవర్తించినందుకుగానూ) ఇచ్చింది.టాప్‌లోనే టీమిండియా.. బంగ్లా, పాక్ ఏ స్థానంలో?ఈ పరిణామాల అనంతరం డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాదేశ్ ఏడు, పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మరోవైపు.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.PC: insidesportపాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
చరిత్ర సృష్టించిన షకీబ్
బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించిన అనంతరం షకీబ్ ఖాతాలో వరల్డ్ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన షకీబ్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో షకీబ్ న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీని అధిగమించాడు. షకీబ్ 482 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 707 వికెట్లు తీయగా.. వెటోరీ 498 ఇన్నింగ్స్‌ల్లో 705 వికెట్లు పడగొట్టాడు. ఈ విభాగంలో షకీబ్, వెటోరీ తర్వాత రవీంద్ర జడేజా (568 వికెట్లు), రంగన హెరాత్ (525), సనత్ జయసూర్య (440) టాప్-5లో ఉన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షకీబ్ 16వ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో మురళీథరన్ (1347) టాప్‌లో ఉన్నాడు.పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
‘పాకిస్తాన్ నుంచి వెనక్కి రప్పించండి’.. బీసీబీకి నోటీసులు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఆల్‌రౌండర్ జట్టు నుంచి తక్షణమే తొలగించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఓ లాయర్ లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న షకీబ్‌ను బంగ్లాదేశ్‌కు రప్పించి.. అతడిని విచారించాల్సిందిగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా షకీబ్‌పై హత్య కేసు నమోదైన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గద్దె దిగిన షేక్ హసీనా ప్రభుత్వంలో 37 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ ఎంపీగా ఉన్నారు. షేక్ హసీనా ప్రభుత్వం రద్దు కావడంతో అతని ఎంపీ పదవి కూడా ఊడింది. అయితే మూక దాడులు, పేట్రేగిన ఆందోళనకారుల వల్ల అమాయకులెందరో ప్రాణాలొదిలారు.ఈ నేపథ్యంలో రఫీఖుల్ ఇస్లామ్ అనే వ్యక్తి మాజీ ప్రధాని, సహచర మంత్రులు, ఎంపీలపై కేసు పెట్టారు. ఈ నెల 7న జరిగిన హింసాత్మక ఘటనలో ఇస్లామ్ కుమారుడు రుబెల్ మృతి చెందాడు. దీంతో తన కుమారుడి మరణానికి గత ప్రభుత్వానిదే బాధ్యతని ఇస్లామ్ ఢాకాలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన పోలీసులు ప్రధాని సహా పదుల సంఖ్యలో పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.ఇందులో షకీబ్‌ను 28వ నిందితుడిగా చేర్చుతూ హత్య కేసు నమోదు చేశారు. నిజానికి ఈ ఆల్‌రౌండర్ ఆగస్టు 5కు ముందు, తర్వాత దేశంలో లేడు. గ్లోబల్ టీ20 లీగ్ ఆడేందుకు కెనడా వెళ్లాడు. జూలై 26 నుంచి ఆగస్టు 9 వరకు జరిగిన ఆ లీగ్‌లో ఆడి... అక్కడి నుంచి నేరుగా పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్ జట్టుతో జతకలిశాడు. ఆగష్టు 21న మొదలైన తొలి టెస్టులో ఆడుతున్న షకీబ్.. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.అయితే, తాజా సమాచారం ప్రకారం హత్య కేసులో నిందితుడిగా ఉన్న షకీబ్‌ను జాతీయ జట్టులో ఆడించవద్దని బంగ్లా సుప్రీం కోర్టు లాయర్ షాజీబ్ మహమూద్ ఆలం.. తన సహచర లాయర్ ఎండీ రఫినూర్ రహ్మాన్ తరఫున బీసీబీకి నోటీసులు పంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఈ విషయం గురించి షాజీబ్ బంగ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఐసీసీ నిబంధనల ప్రకారం షకీబ్‌కు జట్టులో ఉండే హక్కు లేదని నోటీసులో స్పష్టం చేసినట్లు తెలిపాడు. అయితే, అతడిని వెంటనే వెనక్కి తీసుకురావాల్సిందిగా తాము కోరలేదని.. బీసీబీ కొత్త టీమ్ ఇప్పుడే ఏర్పడిందని.. వారికి తగినంత సమయం ఇస్తామని పేర్కొన్నాడు.చదవండి: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి రాజీనామా.. కొత్త చీఫ్‌గా మాజీ క్రికెటర్ -
హత్య కేసులో చిక్కుకున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్..?
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఓ హత్యకు సంబంధించి షకీబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలలో ఆగస్టు 7న గార్మెంట్ వర్కర్ ఎండీ రూబెల్ మరణించాడు. అయితే తాజాగా తన కుమారుడని ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం ఢాకాలోని అడాబోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే షకీబ్‌తో పాటు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సహా మొత్తం 500 మందిపై పోలీసులు కేసు ఫైల్ చేసినట్లు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ కేసులో షకీబ్‌ను 28వ నిందితుడిగా పేర్కొనగా.. ప్రముఖ బంగ్లాదేశ్ నటుడు ఫెర్దౌస్ అహ్మద్ 55వ నిందితుడిగా ఉన్నాడు. కాగా వీరిద్దరూ బంగ్లా పార్లమెంట్లో మాజీ అవామీ లీగ్ ఎంపీలు కావడం గమనార్హం. ఇక షకీబ్ అల్హసన్ ప్రస్తుతం పాకిస్తాన్లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ టెస్టు జట్టులో ఉన్నాడు.అయితే కేసు నమోదు కావడంతో అతడు స్వదేశానికి తిరిగి వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు పాక్‌తో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో హింసత్మాక సంఘటనలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికి పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. -
నా భర్త నన్ను మోసం చేయలేదు.. షకీబ్ భార్య క్లారిటీ (ఫోటోలు)
-
Pak Vs Ban: పదవి పోయినా.. పాక్‌తో టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండర్!
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు చేరుకుంది. బంగ్లాలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సిరీస్‌పై సందిగ్దం నెలకొనగా.. తాత్కాలిక ప్రభుత్వం ఎట్టకేలకు ఇందుకు అనుమతినివ్వడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే, ఈ జట్టులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఆ దేశ మాజీ ఎంపీ, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు కూడా చోటునివ్వడం విశేషం.అందుకే అతడికి అనుమతిఈ విషయం గురించి బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘మా దేశ తాత్కాలిక క్రీడా శాఖ మంత్రితో మాట్లాడాము. షకీబ్‌ను జట్టులో చేర్చడానికి ఆయన ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక ఉండాలని.. పక్షపాతం చూపకూడదని స్పష్టం చేశారు. అందుకే షకీబ్ కూడా పాక్‌తో సిరీస్ ఆడనున్న జట్టులో స్థానం సంపాదించగలిగాడు’’ అని తెలిపాడు.కాగా షేక్ హసీనా పాలనను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. నిరసనకారుల భారీ ఆందోళనలకు తలొగ్గిన షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్(పార్టీ)తో సంబంధం ఉన్న ప్రముఖుల ఇళ్లపైనా దాడులు చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మష్రాఫే మొర్తజా ఇంటికి నిప్పు అంటించారు.అతడి అవసరం జట్టుకు ఉందిఅతడు అధికార అవామీ లీగ్ ఎంపీ( నరేల్-2 డిస్ట్రిక్ట్ పార్లమెంట్ నియోజకవర్గం) కావడమే ఇందుకు కారణం. ఈ ప్రభావం.. మరో ఎంపీ షకీబ్ అల్ హసన్‌పై కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ఆల్‌రౌండర్ కెరీర్ ఇక ముగిసిపోతుందని విశ్లేషకులు భావించారు. అయితే, తాత్కాలిక ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న 26 ఏళ్ల ఆసిఫ్ మహమూద్ షకీబ్ ఎంపిక విషయంలో చొరవ చూపినట్లు తెలుస్తోంది.చట్ట సభ ప్రతినిధిగా అతడు ఏ పార్టీకి చెందినవాడైనా.. ఆటగాడిగా జట్టుకు అతడి అవసరం ఉంది గనుక పాక్ సిరీస్‌కు ఎంపిక చేసేందుకు అనుమతినిచ్చినట్లు బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ తాజాగా వెల్లడించాడు. కాగా షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ పార్లమెంటు రద్దు నేపథ్యంలో మగురా ఎంపీగా ఉన్న షకీబ్ పదవి కోల్పోయాడు.ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అతడు లక్షా యాభై వేలకు పైగా మెజారిటీతో గెలుపొందాడు. ప్రతిపక్షం ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన నేపథ్యంలో అతడికి ఏకపక్ష విజయం సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21-25(రావల్పిండి), ఆగష్టు 30-సెప్టెంబరు 3(కరాచీ) మధ్య పాక్- బంగ్లా టెస్టు సిరీస్ జరుగనుంది.బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్పాకిస్తాన్ జట్టు..షాన్ మసూద్ (కెప్టెన్), సైమ్ అయూబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, అబ్రార్ అహ్మద్, ఖుర్రమ్ షెహజాద్, షాహీన్ అఫ్రిది. -
సెహ్వాగా?.. అతడెవరు? షకీబ్ అల్ హసన్ కామెంట్స్ వైరల్
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు సెహ్వాగ్ ఎవరో తనకు తెలియదంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆడే బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికైన షకీబ్ అల్ హసన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ కప్ ఆరంభ ఎడిషన్ నుంచి ఇప్పటిదాకా కొనసాగిన ఆటగాడిగా రోహిత్‌తో పాటు అతడు నిలిచాడు.అయితే, గ్రూప్ దశలోని తొలి రెండు మ్యాచ్‌లలో ఈ వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీలంక, సౌతాఫ్రికా మ్యాచ్‌లలో వరుసగా ఎనిమిది, మూడు పరుగులు చేసిన షకీబ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతడు అవుటైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. అనవసర షాట్లకు అవుట్ కావడం ఏమిటని, ఎప్పుడో రిటైర్ అవ్వాల్సిన క్రికెటర్ ఇంకా ఆడితే ఇలాగే ఉంటుందని విమర్శించాడు.అంతేకాకుండా నువ్వేమీ మాథ్యూ హెడ్న్, ఆడం గిల్‌క్రిస్ట్ కాదని.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి అని వీరూ భాయ్ షకీబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొంది సూపర్-8కు చేరువైంది.ఈ విజయంలో షకీబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించాడు. 46 బంతుల్లో 64 పరుగులతో రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. కీలక సమయంలో రాణించి.. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా సెహ్వాగ్ విమర్శల గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘సెహ్వాగ్? అతడెవరు?’’ అంటూ షకీబ్ అల్ హసన్ ఎదురు ప్రశ్నించాడు. ‘‘విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.జట్టుకు ఏ విధంగా ఉపయోగపడగలం అని మాత్రమే మనం ఆలోచించాలి. అలా ఆలోచించని వాళ్లే అనవసరపు విషయాల గురించి పట్టించుకుంటారు.బ్యాటర్ బ్యాటింగ్ గురించి.. బౌలర్ బౌలింగ్ గురించి.. ఫీల్డింగ్ చేసే సమయంలో క్యాచ్‌లు లేదంటే పరుగులు సేవ్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంతేగానీ ఇలాంటి వాటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఆటగాళ్లకు ఏమాత్రం ఉండదు’’ అని షకీబ్ అల్ హసన్ సెహ్వాగ్‌ను ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.చదవండి: అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలుShakib Al Hasan, the most arrogant cricketer in the his history.Journalist: There has been lot of discussions about your performance especially criticize by Virendra Sehwag"Shakib: Who is Sehwag?pic.twitter.com/wtqlGrdeX3— Farrago Abdullah Parody (@abdullah_0mar) June 14, 2024 -
T20 WC 2024: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్
కింగ్స్టౌన్: టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గెలిచి నిలిచింది. సూపర్–8 అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు గురువారం జరిగిన పోరులో బంగ్లా 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ గెలుపుతో గ్రూప్ ‘డి’లోని మరో జట్టు శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన డచ్ జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గుచూపగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (46 బంతుల్లో 64 నాటౌట్; 9 ఫోర్లు) రాణించాడు. టాపార్డర్‌లో కెపె్టన్ నజ్ముల్ హోస్సేన్ (1), లిటన్ దాస్ (1)ల వైఫల్యంతో 23 పరుగులకే బంగ్లా 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ తంజిద్ హసన్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షకీబ్ మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.ఆఖర్లో మహ్మూదుల్లా (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాకిర్ అలీ (7 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. సైబ్రాండ్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), విక్రమ్‌జీత్ సింగ్ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (23 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ కీలకమైన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. రిషాద్ హోస్సేన్ 3, టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. టి20 ప్రపంచకప్‌లో నేడుఅఫ్గానిస్తాన్ X పాపువా న్యూగినీ వేదిక: ట్రినిడాడ్; ఉదయం గం. 6 నుంచిఅమెరికా X ఐర్లాండ్ వేదిక: లాడెర్‌హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నువ్వేమీ హెడెన్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి: సెహ్వాగ్
‘‘అనుభవమే ప్రాతిపదికగా అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే మాత్రం.. అతడు అందుకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. కనీసం కొంతసేపైనా క్రీజులో నిలబడాలి కదా.షార్ట్ బాల్‌ను కూడా పుల్ షాట్ ఆడటానికి నువ్వేమీ మాథ్యూ హెడెన్వో లేదంటే ఆడం గిల్క్రిస్ట్వో కాదు. కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆటగాడివి అంతే. నీ స్థాయి, ప్రమాణాలకు తగ్గట్లు ఆడాలి.హుక్ లేదంటే పుల్ షాట్ ఆడే నైపుణ్యం నీకు లేనట్లయితే.. నీకు తెలిసిన షాట్లు మాత్రమే ఆడవచ్చు కదా!’’ అంటూ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో షకీబ్ పూర్తిగా విఫలం కావడంతో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా గ్రూప్-డిలో భాగమైన బంగ్లాదేశ్ సోమవారం నాటి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలుపునకు దూరమైంది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 113 పరుగులు చేసింది.స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా ఆది నుంచే తడబడింది. టాపార్డర్ చేతులెత్తేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ అల్ హసన్ కేవలం మూడు పరుగులే చేశాడు. అనవసరపు షాట్‌కు యత్నించి అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.జట్టులో సీనియర్ ఆటగాడైన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇలా పూర్తిగా నిరాశపరచడంతో సెహ్వాగ్ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్, ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేర్లు ప్రస్తావిస్తూ విమర్శించాడు. తెలిసిన షాట్లు మాత్రమే ఆడుతూ తెలివిగా వ్యవహరించే బాగుండి ఉండేదని క్రిక్‌బజ్ షోలో షకీబ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.కాగా ఈ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 ప్రపంచకప్ మొదటి ఎడిషన్(2007) నుంచి ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మాత్రమే! ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024 గ్రూప్-డిలో ఉన్న బంగ్లాదేశ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి.. ఒకటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు.. బంగ్లాపై విజయంతో మూడో గెలుపు నమోదు చేసిన సౌతాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది.చదవండి: SA vs Ban: నరాలు తెగే ఉత్కంఠ: ఆ క్యాచ్ గనుక వదిలేసి ఉంటే.. -
'రోహిత్ అద్భుతమైన కెప్టెన్.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు'
టీ20 వరల్డ్‌కప్-2024కు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా శనివారం(జూన్ 1న) బంగ్లాదేశ్‌తో వార్మాప్ మ్యాచ్ ఆడనుంది.ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన కెప్టెన్ అని, ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉందని షకీబ్ కొనియాడాడు. "రోహిత్ శర్మ భారత జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి కెప్టెన్సీ స్కిల్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కెప్టెన్‌గా అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. రోహిత్ జట్టులో ఆటగాళ్లందరని సమానంగా చూస్తాడు. తన సహచర ఆటగాళ్లు కూడా రోహిత్‌ను అంతే గౌరవిస్తారు. రోహిత్ ఒక వరల్డ్ క్లాస్ బ్యాటర్. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా రోహిత్‌కు ఉందని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీబ్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రోహిత్‌కు బంగ్లాదేశ్‌పై వన్డేలు, టీ20లు రెండింటిలోనూ అద్భుతమైన రికార్డు ఉంది. బంగ్లాపై 12 టీ20 ఇన్నింగ్స్‌లలో 37.83 సగటుతో 454 పరుగులు చేశాడు. అదే విధంగా 17 వన్డే ఇన్నింగ్స్‌లలో 56.14 సగటుతో 786 పరుగులు సాధించాడు. కాగా షకీబ్, రోహిత్ ఇద్దరే 2007 అరంగేట్ర టీ20 వరల్డ్‌కప్ నుంచి కొనసాగుతున్నారు. -
ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
ప్రపంచ క్రికెట్లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌ల్లో పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ ఇద్దరు జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే తొమ్మిదో ఎడిషన్‌లోనూ పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 2007 నుంచి వరుసగా 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలో పాల్గొని ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. పొట్టి ప్రపంచకప్‌లో వీరిద్దరి ప్రస్తానం 17 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది.ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్ అరంగేట్రం ఎడిషన్ (2007) సమయానికి క్రికెట్లో ఒనమాలు దిద్దుతుండేవాడు. ఇప్పుడు అదే హిట్‌మ్యాన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు. రోహిత్ ఇప్పటివరకు జరిగిన ఎనిమిది వరల్డ్‌కప్ ఎడిషన్లలో 39 మ్యాచ్‌లు ఆడి 34.39 సగటున, 127.88 స్ట్రయిక్‌రేట్‌తో 963 పరుగలు సాధించాడు. రోహిత్ ఖాతాలో తొమ్మిది ప్రపంచకప్ హాఫ్ సెంచరీలు ఉన్నాయి.షకీబ్ విషయానికొస్తే.. ఈ బంగ్లాదేశీ వెటరన్ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడి 23.93 సగటున 122.44 స్ట్రయిక్‌రేట్‌తో 742 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన షకీబ్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. షకీబ్ 36 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టి, టీ20 వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వయసు పైబడిన రిత్యా రోహిత్, షకీబ్‌లకు ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్ కావచ్చు. రోహిత్ తొలి ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉండగా.. షకీబ్‌కు టీ20 ప్రపంచకప్ కలగా మిగిలిపోవచ్చు.2024 ఎడిషన్ విషయానికొస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. భారత్ గ్రూప్-ఏలో పాకిస్తాన్‌తో పాటు మరో మూడు జట్లతో పోటీపడనుంది. బంగ్లాదేశ్ గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంకతో పాటు మరో రెండు చిన్న జట్లతో తలపడనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న (ఐర్లాండ్) ఆడనుండగా.. బంగ్లాదేశ్ జూన్ 7న (శ్రీలంక) తమ వరల్డ్‌కప్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనుంది. -
చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) 14000 పరుగులు చేయడంతో పాటు 700 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూఎస్ఏతో నిన్న (మే 25) జరిగిన టీ20లో ఆండ్రియస్ గౌస్ వికెట్ పడగొట్టడం ద్వారా షకీబ్ 700 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని తాకాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్లో 14000 పరుగుల మైలురాయిని తాకిన షకీబ్.. తాజాగా 700 వికెట్ల క్లబ్లో చేరిన 17వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.బంగ్లాదేశ్ క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏలో పర్యటిస్తుంది. ఈ జట్టుకు ఆతిథ్య దేశం, క్రికెట్ పసికూన అయిన యూఎస్ఏ నుంచి ఊహించని పరాభవం ఎదురైంది. ఈ సిరీస్‌ను యూఎస్ఏ 2-1 తేడాతో కైవసం చేసుకుని బంగ్లా పులులకు ఊహించని షాకిచ్చింది. నిన్న జరిగిన మూడో టీ20లో గెలుపొంది బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ ఆరు వికెట్లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 11.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. -
T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పసికూన యూఎస్ఏ చేతిలో షాంటో బృందానికి ఘోర పరాభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో ఆతిథ్య దేశానికి సమర్పించుకుంది బంగ్లాదేశ్.కాగా వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా యూఎస్ఏ- బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం యూఎస్ఏ పర్యటనకు వెళ్లింది బంగ్లాదేశ్.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఈ క్రమంలో తొలి టీ20లో అనూహ్య రీతిలో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది యూఎస్ఏ జట్టు. ఇక తాజాగా రెండో టీ20లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.యూఎస్ఏ స్కోరు ఎంతంటే?హోస్టన్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌కే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(31), కెప్టెన్ మొనాక్ పటేల్(42) శుభారంభం అందించారు.అయితే, వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ డకౌట్ కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఇరవై పరుగుల మార్కు అందుకోలేకపోయారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో యూఎస్ఏ ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగుల నామమాత్రపు స్కోరు సాధించింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ సులువుగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.బంగ్లా బ్యాటర్లకు చుక్కలుకానీ యూఎస్ బౌలర్లు బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 19.3 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రమే చేసి బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ షాంటో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తౌహీద్ హృదయ్ 25, షకీబ్ అల్ హసన్ 30 పరుగులు చేశారు.ఇక లోయర్ ఆర్డర్లో మహ్మదుల్లా 3, జకీర్ అలీ 4, రషీద్ హొసేన్ 9, తాంజిమ్ హసన్ సకీబ్ 0, షోరిఫుల్ ఇస్లాం 1, ముస్తాఫిజుర్ రహ్మాన్ 1 పరుగు చేసి దారుణంగా విఫలమయ్యారు.అలీ ఖాన్ చెలరేగడంతోఇక యూఎస్ఏ బౌలర్లలో పాకిస్తాన్ మూలాలున్న 33 ఏళ్ల పేసర్ అలీ ఖాన్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టగా.. సౌరభ్ నట్రావల్కర్ రెండు, షాడ్లే వాన్ రెండు, కోరే ఆండర్సన్, జస్దీప్ సింగ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన మొనాక్ పటేల్ బృందం సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అలీ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చరిత్ర సృష్టించిన యూఎస్ఏకాగా ఐసీసీ అసోసియేట్ దేశమైన యూఎస్ఏ.. టెస్టు హోదా ఉన్న దేశంపై టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. తద్వారా యూఎస్ఏ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించగా.. బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇరు జట్ల మధ్య మే 25న నామమాత్రపు మూడో టీ20 జరుగనుంది.చదవండి: IPL 2024 SRH Vs RR: ‘ఫైనల్’ వేటలో... -
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
బంగ్లాదేశ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా తొమ్మిదోసారి టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షకీబ్ కంటే ముందుగానే తన పేరును లిఖించుకున్నాడు.కాగా జూన్ 1 నుంచి వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న భారత క్రికెట్ నియంత్రణ మండలి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించింది.కాగా 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభించగా రోహిత్ శర్మ అప్పటి నుంచి ఈ మెగా టోర్నీ ఒక్కసారి కూడా మిస్ కాలేదు. వరుసగా తొమ్మిదో ఎడిషన్‌లోనూ ఆడేందుకు హిట్‌మ్యాన్ సిద్దమయ్యాడు. ఈసారి.. రెండో దఫా కెప్టెన్ హోదాలో అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడనుంది.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ కోసం మంగళవారం తమ జట్టును ప్రకటించింది. ఇందులో షకీబ్ అల్ హసన్‌కు స్థానం దక్కింది. ఇక జూన్ 7 న బంగ్లాదేశ్ శ్రీలంకతో మ్యాచ్‌తో ప్రపంచకప్ జర్నీ ఆరంభించనుంది.ఈ నేపథ్యంలో పొట్టి క్రికెట్ ప్రపంచకప్‌లో వరుసగా ఆడుతున్న క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ ముందంజలో నిలవగా.. షకీబ్ రెండోస్థానం ఆక్రమించాడు. కాగా ఇప్పటి వరకు ప్రపంచకప్‌లలో 36 మ్యాచ్‌లు ఆడిన షకీబ్ 742 పరుగులు చేయడంతోపాటు 47 వికెట్లు పడగొట్టాడు.టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు అత్యధికసార్లు పాల్గొన్న/పాల్గొనబోతున్న ఆటగాళ్లు👉రోహిత్ శర్మ- 9- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉షకీబ్ అల్ హసన్- 9- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉మహ్మదుల్లా- 8- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2024.👉డేవిడ్ వార్నర్- 8- 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉క్రిస్ గేల్- 7- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021.👉డ్వేన్ బ్రావో- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ (కెపె్టన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్, షకీబ్, తౌహిద్, మహ్ముదుల్లా, జాకీర్ అలీ, తన్వీర్ ఇస్లామ్, మెహదీ హసన్, రిషాద్, ముస్తఫిజుర్, షోరిఫుల్, తన్జీమ్ హసన్. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
వరల్డ్ కప్‌నకు బంగ్లా జట్టు ప్రకటన.. అనూహ్యంగా అతడికి చోటు!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హొసేన్ కెప్టెన్సీలో వరల్డ్ కప్‌లో ఆడబోయే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. సీనియర్లు, ఇటీవల పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.అయితే, గాయంతో బాధపడుతున్న మరో పేసర్ టస్కిన్ అహ్మద్ అనూహ్య రీతిలో జట్టులో చోటు సంపాదించడంతో పాటు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫామ్‌లేమితో బాధపడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ లిటన్ దాస్ సైతం చోటు దక్కించుకున్నాడు.కాగా 29 ఏళ్ల ఈ పేస్ బౌలర్ గతవారం జింబాబ్వేతో సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే, ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మాత్రం అదరగొట్టాడు. 4.56 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. షకీబ్ అల్ హసన్ 2007 నుంచి టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌ను ఒక్కసారి కూడా మిస్ కాలేదు.ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. ఇందులో భాగంగా డల్లాస్‌లోని టెక్సాస్ వేదికగా జూన్ 7న బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో మ్యాచ్‌తో మెగా ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్- 2024కు బంగ్లాదేశ్ జట్టు:నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ కుమర్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తవ్హిద్ హృదోయ్, మహమూద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్. -
అభిమాని పట్ల షకీబ్ దురుస ప్రవర్తన.. వీడియో వైరల్
షకీబ్ అల్ హసన్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్ సమకాలీన క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగతున్న షకీబ్.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. ఈ బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న షకీబ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబ్ మైదానంలో ఉండగా.. గ్రౌండ్ స్టాప్ ఒకరు అతడి దగ్గరకు వచ్చి సెల్పీ అడిగాడు.దానికే చిరెత్తుకుపోయిన షకీబ్ అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రౌండ్స్‌మన్ బాధపడుతూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షకీబ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి అంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతుకుముందు చాలా సందర్భాల్లో అభిమానులపై షకీబ్ చేయిచేసుకున్నాడు కూడా. Shakib… when a groundsman tried tontake a selfie with him 🤨 pic.twitter.com/BWbDX4LAsK— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2024 -
బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ పునరాగమనం
రాజకీయ నాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాక బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. శ్రీలంక జట్టుతో చట్టోగ్రామ్‌లో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో షకీబ్ ఆడనున్నాడు. గత ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్ మధ్యలో షకీబ్ గాయంతో వైదొలిగాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 37 ఏళ్ల షకీబ్ అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా నియోజకవర్గం నుంచి పోటీచేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకీబ్ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్‌లు తారుమారయ్యాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీతో పాటు వికెట్ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన లంక ఆటగాడు పథుమ్ నిస్సంక 10 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి చేరగా.. మూడో వన్డేలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన నిస్సంక సహచరుడు అసలంక 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, కుల్దీప్ నాలుగు, ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కేన్ విలియమ్సన్ టాప్ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకోగా.. భారత ఆటగాళ్లు విరాట్ ఏడులో, పంత్, రోహిత్ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో బుమ్రా టాప్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్ 3, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. సిరాజ్, షమీ 19, 20 స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్ ఆరో ప్లేస్‌లో నిలిచాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. -
చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు
New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన షాహిన్ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డారిల్ మిచెల్(27 బంతుల్లో 61- నాటౌట్), కెప్టెన్ విలియమ్సన్ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏకైక బౌలర్‌గా రికార్డు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టిమ్ సౌతీ.. మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) రూపంలో రెండు బిగ్ వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిదిని అవుట్ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఇక అబ్బాస్ తర్వాత హ్యారిస్ రవూఫ్‌ను పెవిలియన్‌కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. నంబర్ 2 ఎవరంటే ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్ నుంచి ఇష్ సోధి(127), మిచెల్ సాంట్నర్(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం. చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్ శర్మ -
అభిమాని చెంప చెల్లుమనిపించిన బంగ్లాదేశ్ కెప్టెన్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ అన్న తేడా లేకుండా తరుచూ గొడవలకు దిగే షకీబ్.. తాజాగా ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. ఇటీవలే రాజకీయాల్లోకి దిగి అవామీ లీగ్ అనే పార్టీ తరఫున మగుర 1 నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన షకీబ్.. పోలింగ్ రోజున సొంత అభిమానిపై చేయి చేసుకున్నాడు. Shakib Al Hasan slapped a fan..!pic.twitter.com/KaUbabgkCX — Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024 ఓ పోలింగ్ స్టేషన్ సందర్శనకు వెళ్లిన షకీబ్‌ను సదరు అభిమాని వెనక నుంచి నెట్టడంతో సహనం కోల్పోయి కొట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ ఎంపీగా గెలిచాడు. షకీబ్ తన సమీప ప్రత్యర్ధి ఖాజీ రేజౌల్ హొస్సేన్‌పై 1,50,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఎన్నికల్లో షకీబ్ పార్టీ అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ మీడియా అంటుంది. అవామీ లీగ్ 300 సీట్లలో 200 పై చిలుకు సీట్లు గెలిచినట్లు అక్కడి మీడియా చెబుతుంది. పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది. అవామీ లీగ్ అనే పార్టీ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ. అవామీ లీగ్ మరో సారి పూర్తి మెజార్టీ సాధించడంతో షేక్ హసీనానే మళ్లీ ప్రధాన పదవి చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, షకీబ్ ఎన్నికల కోసం క్రికెట్ నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు. -
పార్లమెంట్ ఎన్నికల బరిలో షకీబ్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. త్వరలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అతను పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున అతను బరిలోకి దిగుతాడు. తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గానికి సంబంధించి షకీబ్‌కు టికెట్ ఖరారైంది. జనవరి 7న బంగ్లాలో ఎన్నికలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో వేలికి గాయమైన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న షకీబ్ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనేదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే నేపథ్యంలో త్వరలో న్యూజిలాండ్‌తో ఇంటా, బయటా జరిగే వరుస సిరీస్‌లకు అతను అందుబాటులో ఉంటాడా అనేది చెప్పలేదు. షకీబ్‌కు ముందు అతని సహచర ఆటగాడు, మాజీ కెపె్టన్ మష్రఫ్ మొర్తజా గత ఎన్నికల్లో నరైల్ స్థానంనుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈ సారి కూడా అతను మళ్లీ బరిలో నిలిచాడు. మూడు ఫార్మాట్లో కలిపి బంగ్లా తరఫున 430 మ్యాచ్‌లు ఆడిన 14,406 పరుగులు చేయడంతో పాటు 690 వికెట్లు తీసిన షకీబ్ ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
రాజకీయాల్లోకి షకీబ్.. బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ!
బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన షకీబ్.. రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు షకీబ్ సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బీఏఎల్ నుంచి ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్ పత్రాలను తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీఏఎల్ సంయుక్త కార్యదర్శి బహుద్దిన్ నసీమ్ ధృవీకరించారు. "షకీబ్ ఒక సెలబ్రిటీ, అతడు బంగ్లా యువతలో మంచి పాపులారిటీని కలిగి ఉన్నాడు. మా పార్టీ నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు" అని నసీమ్ ఓ స్దానిక న్యూస్ ఛానల్‌తో పేర్కొన్నారు. ఇప్పటికే అధికార పార్టీ తరఫున షకిబ్ అభ్యర్థిత్వాన్ని బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ధ్రువీకరించారు. చదవండి: CWC Final: వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్ -
అతడికి తగిన శాస్తే జరిగింది.. కానీ ఇకపై అలా చేయొద్దు! బదులుగా..
Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్ అవుట్’ విషయంలో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఘాటు విమర్శలు చేశాడు. చేసిన తప్పునకు అతడికి తగిన శాస్తే జరిగిందంటూ కుండబద్దలు కొట్టాడు. అయితే, ఇలాంటి నిబంధన మాత్రం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. క్రీజులోకి వచ్చిన తర్వాత నిర్ణీత సమయం(2 నిమిషాల్లో)లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి ఆటగాడిగా హెల్మెట్ విషయంలో జరిగిన పొరపాటును సరిచేసుకునే క్రమంలో మాథ్యూస్ మైదానాన్ని వీడక తప్పలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలుతో ఏకీభవించిన అంపైర్లు అతడిని టైమ్డ్ అవుట్‌గా ప్రకటించారు. దీంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ విషయంపై క్రికెట్ వర్గాలు రెండు చీలిపోయి చర్చలు సాగిస్తున్నాయి. మాథ్యూస్ పట్ల షకీబ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాల్సిందని కొంతమంది అంటుండగా.. నిబంధనల ప్రకారం షకీబ్ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్‌ను తప్పుబడుతున్నారు. అందుకు సంసిద్ధంగా లేరనే అర్థం ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సైతం ఈ విషయంలో షకీబ్ వైపే నిలిచాడు. ‘‘బ్యాటర్లుకు సమయం చాలా ముఖ్యమైంది. ఒకవేళ టైమ్‌కి రాకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఏంజెలో మాథ్యూస్ దేనికైతే అర్హుడో అదే జరిగింది. మీకు రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి వికెట్ పడిన వెంటనే క్రీజులోకి వెళ్లి రెండు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. ఒకవేళ మీరలా చేయలేదంటే బ్యాటింగ్‌కు చేసేందుకు మీరు సంసిద్ధులు కాలేదనే అర్థం కదా!’’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. 12 పరుగులు పెనాల్టీ విధించాలి మాథ్యూస్ విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు అంపైర్లు నిబంధనల ప్రకారమే వ్యవహరించాని బ్రాడ్ హాగ్ పరోక్షంగా వారిని సమర్థించాడు. అయితే, ఇలా బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్ చేయడం తనకు నచ్చలేదన్న ఈ మాజీ బౌలర్ ఓ పరిష్కారాన్ని సూచించాడు. ‘‘నాకు ఇలాంటి డిస్మిసల్ నచ్చలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే, మళ్లీ ఇలాంటివి జరగాలని నేను కోరుకోవడం లేదు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించే బదులు.. బ్యాటింగ్ జట్టుకు 12 పరుగుల మేర కోత విధిస్తే బాగుంటుంది. అపుడైనా ఇలా ఆలస్యం చేసేవాళ్లు కాస్త తొందరగా రెడీ అవుతారు. వికెట్ పడగానే క్రీజులోకి పరిగెత్తుకుని వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Brad Hogg (@brad_hogg) -
అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్
Angelo Mathews- Shakib Al Hasan- Timed Out: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘టైమ్డ్ అవుట్’ విషయంలో షకీబ్ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. క్రీడాస్ఫూర్తిని మరిచిన అతడు శ్రీలంకలో అడుగుపెడితే అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రెవిన్ పేర్కొన్నాడు. షకీబ్‌కు రాళ్లతో సన్మానం ఖాయమంటూ తీవ్ర విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్య, అరుదైన రీతిలో అవుటైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) ఆలస్యం చేశాడు.. అనుభవించకతప్పలేదు న్యూఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ అవుటయ్యాడు. నిబంధనల ప్రకారం తర్వాతి బ్యాటర్ 2 నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. క్రీజ్‌లోకి మాథ్యూస్ సరైన సమయానికే వచ్చినా బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడు. తన హెల్మెట్‌ను సరి చేసుకుంటుండగా దాని స్ట్రాప్ తెగింది. దాంతో మరో హెల్మెట్ కోసం సైగ చేయగా, చమిక మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సమయం మించిపోవడంతో బౌలర్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ‘టైమ్డ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు చర్చించి నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను ‘అవుట్’గా ప్రకటించారు. ఈ క్రమంలో తన హెల్మెట్ సమస్యను మాథ్యూస్ అంపైర్లకు వివరించినా వారు స్పందించలేదు. బతిమిలాడినా మనసు కరగలేదు ఆ తర్వాత అప్పీల్ వెనక్కి తీసుకోమని షకీబ్‌ను కూడా కోరినా అతను ససేమిరా అనడంతో మాథ్యూస్ వెనుదిరగక తప్పలేదు. దీంతో.. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో ‘టైమ్డ్ అవుట్’ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ నేపథ్యంలో జెంటిల్మన్ గేమ్‌లో షకీబ్ క్రీడాస్ఫూర్తిని విస్మరించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాళ్లు విసరడం ఖాయం దక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. ‘‘మేము నిరాశకు గురయ్యాం. బంగ్లాదేశీ కెప్టెన్‌కు క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో తెలిసినట్లు లేదు. జెంటిల్మన్ గేమ్‌లో అతడు మానవతా దృక్పథం కనబరచకలేకపోయాడు. ఇకపై అతడికి శ్రీలంకలో ఎవరూ స్వాగతం పలకరు. ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్ లేదంటే లంక ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఇక్కడికి వస్తే.. అతడిపై రాళ్లు విసురుతారు. అభిమానుల నుంచి అతడు ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ట్రెవిన్ మాథ్యూస్ షకీబ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా బంగ్లాదేశ్ 2025లో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అప్పటికి షకీబ్- మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదం సమసిపోతుందో లేదో చూడాలి!! View this post on Instagram A post shared by ICC (@icc) ఫోర్త్ అంపైర్ చెప్పిందిదే లంక ఇన్నింగ్స్ అనంతరం.. మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై ఫోర్త్ అంపైర్ ఏడ్రియన్ హోల్డ్‌స్టాక్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. ‘మాథ్యూస్‌కు హెల్మెట్ సమస్య కూడా రెండు నిమిషాల తర్వాత వచ్చింది. అప్పటికీ అతను బంతిని ఎదుర్కోకుండా ఆలస్యం చేశాడు. క్రీజ్‌లోకి వచ్చే ముందు ఎక్విప్‌మెంట్‌లో అన్నింటినీ సరిగ్గా చూసుకోవడం కూడా బ్యాటర్‌దే బాధ్యత’ అని ఆయన చెప్పారు. దాంతో షకీబ్ క్రీడా స్ఫూర్తి అంశాన్ని పక్కన పెడితే నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించడం సరైందే కదా అని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా షకీబ్‌ను అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ కూడా వాచీ చూసుకుంటున్నట్లుగా అభినయిస్తూ నీ టైమ్ అయిపోయిందిక అన్నట్లు సైగ చేయడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంకపై తొలి విజయం నమోదు చేసింది. చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... అభిమానులకు బ్యాడ్‌న్యూస్! ఎక్కడ తగ్గాలో.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లు! ఇలాంటి ఆటగాళ్లు ఉంటే.. -
WC 2023: ‘టైమ్డ్ అవుట్’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
ICC WC 2023- Shakib Al Hasan: ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి శ్రీలంకపై గెలిచి జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. ఢిల్లీ వేదికగా సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లో తొలిసారి లంకపై పైచేయి సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే కూడా ‘టైమ్డ్ అవుట్’కు అప్పీలు చేసిన కారణంగానే బంగ్లా జట్టు వార్తల్లో నిలిచింది. టైమ్డ్ అవుట్ అప్పీలుతో చరిత్రకెక్కిన షకీబ్ లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడనే కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలు చేశాడు. ఐసీసీ వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం అతడు రెండు నిమిషాల్లోపు బాల్‌ను ఫేస్ చేయలేదన్న విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకువెళ్లి తన పంతం నెగ్గించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా మాథ్యూస్ చరిత్రకెక్కగా.. షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. క్రీడా వర్గాల్లో ఈ ఘటనకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉండగానే.. బంగ్లాదేశ్‌కు ఓ షాక్ తగిలింది. చేతివేలికి గాయం శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మధ్యవేలుకు తగిలిన గాయం తీవ్రతరం కావడంతో ఎక్స్‌రే తీయించగా.. ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవాలంటే షకీబ్‌కు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరావాసం కోసం షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ జట్టు ఫిజియో బేజెదుల్ ఇస్లాం ఖాన్ తెలిపినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ‘అవుట్’ కాగా శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో మాథ్యూస్ విషయంలో అప్పీలుతో మరోసారి వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డ షకీబ్.. లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు 2 వికెట్లు కూడా కూల్చిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో షకీబ్ వికెట్‌ను మాథ్యూస్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అయితే, మాథ్యూస్ విషయంలో బంగ్లా జట్టుకు వికెట్ దక్కినప్పటికీ.. అప్పటికి ఓవర్ కంటిన్యూ చేస్తున్న బౌలర్(షకీబ్ అల్ హసన్) ఖాతాలో మాత్రం జమకాదు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ చేరకున్నా.. ఆ టోర్నీకి అర్హత సాధించేందుకు కాగా ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించినా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశాలు బంగ్లాకు సజీవంగా ఉంటాయి. చదవండి: అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..! View this post on Instagram A post shared by ICC (@icc) -
టైమ్డ్ ఔట్ కాకుండా మరో విచిత్ర పద్దతిలో ఔట్.. అది కూడా ఈ ఏడాదిలోనే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఔటైన ఆటగాడు మాథ్యూసే కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఎక్కువగా ప్రచారం లేని మరో విధానంలో ఓ బ్యాటర్ ఇదే ఏడాది ఔటయ్యాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం బ్యాటర్లు మొత్తం పది విధాలుగా ఔట్‌గా ప్రకటించబడతారు. వాటిలో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. WATCH the only Hitting The Ball Twice dismissal in international cricket --- when Malta's Fanyan Mughal got out against Romania in the 2023 Men's Continental Cup on 20 August 2023 pic.twitter.com/PFerZJOM4u — Dhaarmik (@DhaarmikAi) November 6, 2023 అయితే పది విధానాల్లో మిగిలిన రెండు విధాల ఔట్లను మాత్రం క్రికెట్ ప్రపంచం ఈ ఏడాదికి ముందు చూసి ఎరుగదు. ఆ రెండు విధాల ఔట్లు ఏవంటే.. టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం). ఈ రెంటిలో టైమ్డ్ ఔట్‌ను నిన్నటి వరల్డ్‌కప్ మ్యాచ్‌లో తొలిసారిగా చూశాం. ఇందులో రెండోదైన హిట్ ట్వైస్ ఔట్ ఘటన కూడా ఇదే ఏడాది తొలిసారి జరిగిందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. పురుషుల కాంటినెంటల్ కప్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్ 20న రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో మాల్టా ఆటగాడు ఫన్యాన్ ముఘల్ ఓసారి బంతిని స్ట్రయిక్ చేసిన అనంతరం ఫీల్డర్ పట్టుకోకముందే మరోసారి బ్యాట్‌తో కొట్టి హిట్ ట్వైస్గా ఔటయ్యాడు. మాథ్యూస్ టైమ్డ్ ఔట్ విషయం వైరలైన నేపథ్యంలో హిట్ ట్వైస్కు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో సైతం ప్రస్తుతం వైరలవుతుంది. ఏ ఆటగాడు, ఎప్పుడు తొలిసారి ఔట్‌గా ప్రకటించబడ్డాడంటే.. క్యాచ్ ఔట్ (టామ్ హోరన్, 1877), బౌల్డ్ (నాట్ థామ్సన్, 1877), ఎల్బీడబ్ల్యూ (హ్యారీ జప్, 1877), రనౌట్ (డేవ్ గ్రెగరీ, 1877), స్టంపౌట్ (ఆల్ఫ్రెడ్ షా, 1877), హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం, జార్జ్ బొన్నర్, 1884), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం, రసెల్ ఎండీన్, 1957), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం, లెన్ హటన్, 1951), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం, ఫన్యాన్ ముఘల్, 2023), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం, ఏంజెలో మాథ్యూస్, 2023) -
క్రికెట్లో ఔట్లు ఎన్ని విధంబులు అనిన...???
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా ప్రకటించబడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అసలు క్రికెట్లో ఓ బ్యాటర్ ఎన్ని రకాలుగా ఔట్‌గా ప్రకటించబడతారని అభిమానులు గూగుల్ చేయడం ప్రారంభించారు. దీనికి సమాధానం పది. ఇందులో క్యాచ్ ఔట్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్,స్టంపౌట్ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్లు కాగా.. హిట్ వికెట్ (బ్యాటర్ వికెట్లను తగలడం), హిట్ ట్వైస్ (బ్యాటర్ రెండుసార్లు బంతిని కొట్టడం), టైమ్డ్ ఔట్ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హ్యాండిల్డ్ బాల్ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. వీటిలో బ్యాటర్లు దాదాపు అన్ని విధాల్లో ఒకటి అంత కంటే ఎక్కువసార్లు ఔట్ కాగా.. నిన్నటి మ్యాచ్‌లో (శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్) ఓ బ్యాటర్ (ఏంజెలో మాథ్యూస్) తొలిసారి టైమ్డ్ ఔట్‌గా ప్రకటించబడ్డాడు. మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించే విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏదిఏమైనా రూల్ కాబట్టి, అంతిమంగా ఫలితం అతనికి అనుకూలంగానే వచ్చింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి ఎలిమినేట్ (సెమీస్‌కు అర్హత సాధించలేదు) అయ్యింది. తాజా ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌తో పాటు ఎలిమినేషన్‌కు గురైంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్ -
మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్
ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించే విషయంలో క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని విమర్శలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఈ విషయమై మ్యాచ్ అనంతరం స్పందించాడు. మాథ్యూస్ టైమ్ ఔట్ కోసం అప్పీల్ చేసినందుకు నాకు ఎలాంటి బాధలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. మా ఫీల్డర్లలో ఒకరు నా దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తే మాథ్యూస్ ఔట్ అవుతాడని తెలిపాడు. అలాగే చేశాను. అంపైర్లు నేను సీరియస్‌గా అప్పీల్ చేస్తున్నానా లేదా అని అడిగారు. అవునని చెప్పాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. రూల్స్‌లో ఉంది కాబట్టి అప్పీల్ చేశాను. యుద్ధంలో ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది. అందుకు నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనంటూ కామెంట్స్ చేశాడు. పైగా మాథ్యూస్‌తో వాగ్వాదం తమ గెలుపుకు కలిసొచ్చిందని అన్నాడు. కాగా, వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్'.. క్లారిటీ ఇచ్చిన అంపైర్ -
ప్రపంచ క్రికెట్‌కు చీకటి రోజు.. అది బంగ్లాదేశ్ కాబట్టే అలా జరిగింది..!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్ చేసేందుకు వచ్చి టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. Even Aasif Sheikh from Nepal has a 1000 time better Sportsmanship then Shakib Al Hasan. Today, Cricket 🏏 has seen a Dark Day that too in a World Cup Match😞 Follow 🙏#BANvsSL #AngeloMatthews #ShakibAlHasan #CWC23 #AngeloMathews #ThugLife #timedout pic.twitter.com/EHL9X3lsW6 — Richard Kettleborough (@RichKettle07) November 6, 2023 మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. నెటిజన్లు సోషల్మీడియామ వేదికగా షకీబ్‌ను ఏకి పారేస్తున్నారు. Angelo Mathews speaks in Press conference and is whole fired up 🤣🔥#SLvBAN pic.twitter.com/GKXg8kf8UH— Div🦁 (@div_yumm) November 6, 2023 మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మాథ్యూస్ స్వయంగా స్పందించాడు. షకీబ్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ కాబట్టి అలా జరిగింది, మరే ఇతర జట్టు ఇలా స్పందిస్తుందని అనుకోను అంటూ కామెంట్స్ చేశాడు. మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించడంపై ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో కూడా స్పందించాడు. Angelo Mathews said, "it was Bangladesh that's why it happened, I don't think any other team would've done it". pic.twitter.com/cTzI9UM9SL — Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023 ప్రపంచ క్రికెట్‌కు ఇది చీకటి రోజు. ఇలాంటి ఘటన ప్రపంచకప్‌లో జరగడం విచారకరం అంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు ఓ వీడియోను జోడిస్తూ.. క్రీడాస్పూర్తిని చాటుకోవడంలో నేపాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్ షకీబ్ కంటే వెయ్యి రెట్లు నయమని కామెంట్ జోడించాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ఓ ఆటగాడు టైమ్ ఔట్ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించి మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తీసుకురావడాన్ని యావత్ క్రీడా ప్రపంచం వ్యతిరేస్తుంది. ఈ విషయంలో షకీబ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సందర్భంలో ప్రత్యర్ధి కెప్టెన్ క్రీడాస్పూర్తిని చాటుకుని, బ్యాటర్ టైమ్ ఔట్ కాకుండా కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. 2007 జనవరి 5న భారత్-సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆరు నిమిషాలు ఆలస్యంగా క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ టైమ్ ఔట్ నిబంధనను అమలు చేయకూడదని అంపైర్‌ను కోరి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) టైమ్ ఔట్ విషయంలో బ్యాటర్ ఆలస్యానికి సరైన కారణాలు ఉన్నాయని విశ్వసిస్తే, టైమ్ ఔట్ నిబంధనను విస్మరించమని అంపైర్‌ను అభ్యర్థించే విచక్షణ ప్రత్యర్థి కెప్టెన్ ఉంటుంది. ఆ సందర్భంలో గ్రేమ్ స్మిత్ తన విచక్షణను ఉపయోగించి, క్రీడాస్పూర్తిని చాటుతూ గంగూలీ ఔట్ కాకుండా సాయపడ్డాడు. నాడు గ్రేమ్ స్మిత్ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం జేజేలు కొట్టింది. అయితే నిన్నటి మ్యాచ్‌లో షకీబ్.. అందుకు భిన్నంగా వ్యవహరించి జనాల చీత్కారాలకు గురవుతున్నాడు. ఒకవేళ ఆ రోజు గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లాగే పట్టుబట్టి గంగూలీని టైమ్ ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తెచ్చి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో టైమ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా గంగూలీ రికార్డుల్లోకి ఎక్కి ఉండేవాడు. On January 5, 2007, Indian cricketer Sourav Ganguly nearly made history by being the first player to be declared 'timed out' in international cricket. He took six minutes to reach the batting crease. However, Graeme Smith, the opposing team's captain, chose not to enforce this… pic.twitter.com/JMhhs5Yaa5 — Anjula Hettige (@AnjulaHettige) November 6, 2023 నిన్నటి మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..? శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్‌ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌వైపు కొత్త హెల్మెట్ కోసం సైగలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వెంటనే సబ్‌స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్‌ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్ ఔట్‌కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదివరకే ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్‌కు ఇది కంటితుడుపు విజయం. ఈ మ్యాచ్‌లో ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌లా సెమీస్‌కు చేరకుండానే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్ -
శ్రీలంకపై బంగ్లాదేశ్ ఘన విజయం
వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(90), షకీబుల్ హసన్(82) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. బంగ్లా బౌలర్లలో మధుషంక మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ, మాథ్యూస్ రెండు వికెట్లు సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో అసలంక(108) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నిస్సాంక(41), సమరవిక్రమ(41) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్, షోర్ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ ఓటమితో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: #Timed Out: కనీవినీ ఎరుగని రీతిలో! మాథ్యూస్‌ను చూసి నవ్వుకున్న షకీబ్.. అలా అనుకున్న వాళ్లదే తప్పు! -
WC 2023: అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు! మరి రూల్స్?
#BanvsSL- #Angelo Mathews- #ShakibAlHasan: వన్డే వరల్డ్‌కప్-2023.. ఢిల్లీ.. అరుణ్‌జైట్లీ స్టేడియం.. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్.. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన రెండు జట్ల మధ్య పోటీ.. ఇందులో గెలిచినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం లేదు.. కానీ.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించాలంటే మాత్రం ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యవసరం... పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచి చాంపియన్స్ ట్రోఫీ బరిలో నిలవాంటే... అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పైచేయి సాధించాల్సిందేనన్న పట్టుదలతో బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను 4 పరుగులకే పెవిలియన్‌కు పంపి బంగ్లాకు శుభారంభం అందించాడు పేసర్ షోరిఫుల్ ఇస్లాం. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(19)ను షకీబ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(41), సదీర సమరవిక్రమతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నిసాంక అవుటైన తర్వాత చరిత్ అసలంక సమరవిక్రమకు తోడయ్యాడు. అయితే.. లంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి.. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు.. సమరవిక్రమ షకీబ్ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. హైడ్రామా మొదలైంది అప్పుడే దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక వ్యూహాత్మకంగా ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను బరిలోకి దింపింది. కానీ దురదృష్టవశాత్తూ మాథ్యూస్ రాంగ్ హెల్మెట్ వెంట తెచ్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్ పొజిషన్ తీసుకోకముందే ఈ విషయాన్ని గమనించిన అతడు.. వేరే హెల్మెట్ కావాలంటూ డ్రెస్సింగ్‌రూం వైపు సైగ చేశాడు. సబ్‌స్టిట్యూట్ కరుణరత్నె వెంటనే హెల్మెట్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు. షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది! ఇదంతా జరగడానికి రెండు నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పుడే షకీబ్ బుర్ర పాదరసంలా పనిచేసింది. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు అనుగుణంగా.. మాథ్యూస్ విషయంలో ‘టైమ్డ్ అవుట్’కి అప్పీలు చేశాడు. అంతేకాదు ఈ నిబంధన అమలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ప్రయత్నం చేయకుండానే వికెట్ దీంతో అంపైర్లు ఏంజెలో మాథ్యూస్ అవుటైనట్లు ప్రకటించారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వికెట్ దొరికిన సంబరంలో బంగ్లాదేశ్ మునిగిపోగా.. ఈ అనూహ్య ఘటనతో శ్రీలంక శిబిరంలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. బంగ్లా సంబరం.. శ్రీలంక అయోమయం ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఓ బ్యాటర్ ‘టైమ్డ్ అవుట్’గా వెనుదిరగడం ఇదే తొలిసారి. అలా.. నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమైనందున ఏంజెలో మాథ్యూస్ ఈ ‘శిక్ష’ అనుభవించకతప్పలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) బతిమిలాడినా కరుణించలేదు హెల్మెట్ కారణంగా జరిగిన తాత్సారం మూలంగా అతడు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంపైర్లు, షకీబ్ దగ్గరికి వెళ్లి మరీ విషయం ఏమిటో వివరించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మాథ్యూస్ బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నట్లు షకీబ్ నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పీలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగిపోయాడు. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ సైతం బంగ్లాదేశ్ కోచ్ చండిక హతుర్సింఘతో ఈ విషయం గురించి చర్చించాడు. ఫోర్త్ అంపైర్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లారు. తప్పు ఎవరిది? కానీ అప్పటికే కొత్త బ్యాటర్ క్రీజులోకి రావడం బ్యాటింగ్ మొదలుపెట్టడం జరిగిపోయింది. అంతగా ఆసక్తి కలిగించదనుకున్న మ్యాచ్ కాస్తా ఈ అనూహ్య ఘటన మూలంగా.. క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి ఈ ఘటనపై చర్చిస్తున్నారు నెటిజన్లు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌లో క్రీడాస్ఫూర్తి కొరవడిందని చాలా మంది ట్రోల్ చేస్తుంటే.. ఇదంతా నిబంధనలకు అనుగుణమే కదా అని మరికొందరు వాదిస్తున్నారు. నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎంసీసీ నిబంధన ప్రకారం.. ఓ జట్టు బ్యాటింగ్ చేస్తున్నపుడు వికెట్ పడిన తర్వాత లేదంటే.. బ్యాటర్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే... సదరు ప్లేయర్ స్థానంలో వచ్చే ఆటగాడు.. మైదానంలోకి వచ్చిన మూడు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కోవాలి. లేదంటే బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్‌గా పరిగణిస్తారు. ఇక ఐసీసీ వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం.. రెండు నిమిషాల్లోపే బ్యాటర్ బాల్‌ను ఫేస్ చేయాలి. ఈ నిబంధనను ఆధారం చేసుకునే షకీబ్ అల్ హసన్ ఏంజెలో మాథ్యూస్ విషయంలో అప్పీలుకు వెళ్లి సఫలమయ్యాడు. అతడి విషయంలో అలా అనుకున్న వాళ్లదే తప్పు అయితే, దీని మూలంగా.. జెంటిల్మన్గేమ్లో క్రీడాస్ఫూర్తిని మరచిన ఆటగాడిగా అతడు చరిత్రలో మిగిలిపోతాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి గతంలో.. తమకు(స్థానిక లీగ్ మ్యాచ్) ప్రతికూల ఫలితం వచ్చినపుడు అంపైర్ల పట్ల షకీబ్ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి వ్యక్తి నుంచి స్పోర్ట్స్‌మెన్‌షిప్ ఆశించినవాళ్లదే తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. షకీబ్ తీరే అంత అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టైమ్బ్యాడ్ అని సరిపెట్టుకోకతప్పదంటూ మాథ్యూస్‌కు హితవు పలుకుతున్నారు. సమయం వృథా చేయడం వల్ల మూల్యం చెల్లించావంటూనే సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో.. మాథ్యూస్లాగే మహ్మద్ రిజ్వాన్ టైమ్ వేస్ట్ చేసినపుడు విరాట్ కోహ్లి చేతిగడియారం చూసుకుంటున్నట్లు అభినయించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎటువైపు ఉంటారు?! చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! #BANvSL "Angelo Mathews" what is this? pic.twitter.com/JIsQo6cPut — Ankur Jain 🇮🇳 (@aankjain) November 6, 2023 Angelo Mathews becomes the first cricketer in history to be out on 'timed out' If you Expect sportsmanship from Shakib-al-hasan then it's your Mistake He didn't even respect Umpires 🤮#SLvBAN #ODIWorldCup2023 #ICCWorldCup2023 #SLvsBAN pic.twitter.com/PGqQfM9HFQ — Troll Mafia (@offl_trollmafia) November 6, 2023 -
CWC 2023: పాక్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 31) పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం పాక్ మూడు మార్పులు చేయగా.. బంగ్లాదేశ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హోస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్‌కీపర్), మహ్మదుల్లా, మెహిది హసన్ మిరాజ్, తౌమిద్ హ్రిదోయ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హారీస్ రౌఫ్ -
ప్రపంచకప్‌లో నేడు మరో ఆసక్తికర సమరం
వన్డే ప్రపంచకప్ 2023లో ఇవాళ (అక్టోబర్ 31) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లకు సెమీస్ అవకాశాలు లేకపోవడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ ఎడిషన్‌లో బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్ మినహా అన్ని జట్ల చేతుల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్) ఓడగా.. పాకిస్తాన్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, శ్రీలంకలపై మాత్రమే గెలిచి భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా చేతుల్లో వరుస మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఏడు, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాయి. పాక్‌కు మరో షాక్ తగిలేనా..? పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాభవంతో పాటు నాలుగు వరుస పరాజయాలతో సెమీస్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకున్న పాక్.. బంగ్లాదేశ్‌పై గెలిచి ఊరట పొందాలని భావిస్తుంది. అయితే పాక్ ఇది అంత ఈజీ కాకపోవచ్చు. పాక్ కంటే బంగ్లాదేశ్ బలహీనమైన జట్టే అయినప్పటికీ.. గతంలో (1999 వరల్డ్‌కప్‌లో) పాక్‌కు షాకిచ్చిన అనుభవం బంగ్లా ఉండటంతో క్రికెట్ అభిమానులు మరో సంచలనాన్ని ఆశిస్తున్నారు. ఓవరాల్‌గా పాక్‌దే పైచేయి.. ఓవరాల్‌గా చూస్తే వన్డేల్లో బంగ్లాదేశ్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 38 సందర్భాల్లో ఎదురెదురుపడగా.. పాక్ 33, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. -
నెదర్లాండ్స్ చేతిలో బంగ్లా ఓటమి.. షూతో కొట్టుకున్న ఫ్యాన్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్‌కు ఘోర పరాభావం ఎదురైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం కోల్‌కతా వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ విఫలమైంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షకీబ్ సేన కేవలం 142 పరుగులకే కుప్పకూలింది. డచ్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లతో బంగ్లా టైగర్స్ పతనాన్ని శాసించాడు. బంగ్లా బ్యాటర్లలో మెహాదీ హసన్ మీరాజ్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షూతో కొట్టుకున్న ఫ్యాన్.. కాగా నెదర్లాండ్స్ వంటి పసికూన చేతిలో తమ జట్టు ఓటమి పాలవ్వడం బంగ్లా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంగ్లా జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో స్టేడియంకు వచ్చిన ఓ బంగ్లా అభిమాని ఆటగాళ్లు ప్రదర్శరను విమర్శిస్తూ షూతో తనను తాను కొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా కెప్టెన్ షకీబుల్ హసన్‌ను కూడా దారుణంగా ట్రోలు చేస్తున్నారు. షకీబ్ ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్! రోహిత్‌కు గాయం! #BANvNED This Is Really Really Sad Bangladesh Fans Lost Cool At Eden After Shameful Performance . Slap Themselves With Shoe. Some Are Saying " We Dont Mind Loosing To Big Teams. But How Can U Lose To Netherlands? Shakib, Mushfiq And All Should Be Sl*** Shoes. On Behalf Im… pic.twitter.com/RZLGLaWqiK — বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) October 28, 2023 -
WC 2023: రోజురోజుకీ మరింత చెత్తగా.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్
ICC WC 2023- Ban vs Ned: ‘‘మేము బాగానే బౌలింగ్ చేశామని భావించాను. నిజానికి వాళ్లను 160- 170 పరుగులకే కట్టడి చేయాల్సింది. ఇక టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటి వరకు బ్యాటింగ్ పరంగా మేము పూర్తిగా విఫలమయ్యాం. టోర్నీ ఆసాంతం గెలుపు కోసం మేము తంటాలు పడుతూనే ఉన్నాం. ఈరోజు మా ప్రదర్శన మరింత చెత్తగా ఉంది. అసలు ఇది బంగ్లా జట్టేనా అనేలా మా ఆట తీరు ఉంది. ఇక ముందు కూడా మాకు అన్నీ కఠిన సవాళ్లే ఎదురవుతాయి. అయితే, ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి ధైర్యంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంటుంది’’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. పటిష్టమైన దక్షిణాఫ్రికాను కంగుతినిపించి కాగా ప్రపంచకప్-2023లో ఇదివరకే పటిష్టమైన దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన నెదర్లాండ్స్ తాజాగా బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. షకీబ్ బృందాన్ని ఏకంగా 87 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. డచ్ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (89 బంతుల్లో 68; 6 ఫోర్లు) రాణించాడు. వెస్లీ బారెసి (41 బంతుల్లో 41; 8 ఫోర్లు), సైబ్రాండ్ (61 బంతుల్లో 35; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. సులువైన లక్ష్యాన్ని ఛేదించలేక ఈ క్రమంలో సులువైన లక్ష్యమే ఎదురైనా... బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. మెహిదీ హసన్ మిరాజ్ (40 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా మిగతావారంతా విఫలమయ్యారు. దీంతో బంగ్లాకు నెదర్లాండ్స్ చేతిలో పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బంగ్లాదేశ్ సారథి షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. మిగిలిన మ్యాచ్‌లలోనూ సవాళ్లు తప్పవని.. అయినా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు సాగుతామని తెలిపాడు. ఏదేమైనా గెలుపోటముల్లో మాకు అండగా ఉన్న అభిమానులు ఇప్పటికీ తమకు మద్దతుగానే నిలుస్తున్నారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక శనివారం నాటి ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు నెదర్లాండ్స్ బౌలర్ పాల్ వాన్ మీకెరెన్ (4/23)కు దక్కింది. స్కోరు వివరాలు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జీత్ (సి) షకీబ్ (బి) తస్కీన్ 3; ఓ డౌడ్ (సి) తన్జీద్ (బి) షరీఫుల్ 0; వెస్లీ (సి) షకీబ్ (బి) ముస్తఫిజుర్ 41; అకెర్మన్ (సి) ముస్తఫిజుర్ (బి) షకీబ్ 15; ఎడ్వర్డ్స్ (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 68; లీడ్ (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 17; సైబ్రాండ్ (ఎల్బీ) మెహదీ హసన్ 35; వాన్ బిక్ నాటౌట్ 23; షారిజ్ రనౌట్ 6; ఆర్యన్ (సి) మిరాజ్ (బి) షరీఫుల్ 9; మీకెరెన్ (ఎల్బీ) (బి) మెహదీ హసన్ 0; ►ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 229. ►వికెట్ల పతనం: 1–3, 2–4, 3–63, 4–63, 5–107, 6–185, 7–185, 8–194, 9–212, 10–229. బౌలింగ్: షరీఫుల్ 10–0–51–2, తస్కీన్ 9–1–43–2, షకీబ్ 10–1– 37–1, మిరాజ్ 4–0–17–0, ముస్తఫిజుర్ 10–1–36–2, మెహదీ హసన్ 7–0–40–2. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ (సి) ఎడ్వర్ట్స్ (బి) ఆర్యన్ 3; తన్జీద్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బిక్ 15; మిరాజ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) లీడ్ 35; నజు్మల్ (సి) వాన్ బిక్ (బి) మీకెరెన్ 9; షకీబ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) మీకెరన్ 5; ముష్ఫికర్ (బి) మీకెరెన్ 1; మహ్ముదుల్లా (సి) ఆర్యన్ (బి) లీడ్ 20; మెహదీ హసన్ రనౌట్ 17; తస్కీన్ (సి) లీడ్ (బి) మీకెరెన్ 11; ముస్తఫిజుర్ (బి) అకెర్మన్ 20; షరీఫుల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; ►మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 142. ►వికెట్ల పతనం: 1–19, 2–19, 3–45, 4–63, 5–69, 6–70, 7–108, 8–113, 9–142, 10–142. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–3–26–1, వాన్ బిక్ 9–1–30–1, అకెర్మన్ 7–1–25–1, మీకెరెన్ 7.2–0–23–4, లీడ్ 7–0–25–2, షారిజ్ అహ్మద్ 2–0–13–0. చదవండి: WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా? View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: నాకు మరీ ఎక్కువ రెస్ట్ ఇచ్చేశారు.. సెలక్టర్లపై సెంచరీ ‘హీరో’ విసుర్లు
‘‘ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చెప్పలేను. చాలా చాలా మాట్లాడాలని ఉంది కానీ.. ఆ విషయాల గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. ఏం జరుగుతుందో తెలియలేదు. బహుశా.. నేనిలా ముందుకు సాగాలనే ఆ అల్లా నాకు ధైర్యాన్నిచ్చాడేమో! ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూ మరింత కఠిన శ్రమకోరుస్తున్నాను. నేను చేయగలిగింది అంతే కదా! జట్టు విజయాల్లో నా పాత్ర ఉండాలని కోరుకుంటాను. నిజానికి నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే విశ్రాంతినిచ్చారు. అయినా నా చేతుల్లో ఏమీలేదు. అంతా మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ నేను నా పనిని నిజాయితీగా పూర్తి చేస్తే నాతో పాటు జట్టుకు కూడా మేలు జరుగుతుంది’’ అని బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అన్నాడు. విశ్రాంతి పేరిట తనను చాలా కాలం పాటు బెంచ్‌కే పరిమితం చేశారంటూ సెలక్టర్లకు పరోక్షంగా చురకలు అంటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాను ప్రొటిస్ జట్టు 149 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయినప్పటికీ మహ్మదుల్లా పోరాటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. సౌతాఫ్రికా విధించిన 383 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కనీసం రెండంకెల స్కోరు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ షాంటో సున్నాకే పరిమితమయ్యాడు. ఇక మిడిలార్డర్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహ్మదుల్లా సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 111 బంతులు ఎదుర్కొని 111 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు సహా 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే, మిగతా ఆటగాళ్ల నుంచి ఏమాత్రం సహకారం లభించకపోవడంతో మహ్మదుల్లా ఒంటరి పోరాటం వృథాగా పోయింది. సౌతాఫ్రికా చేతిలో బంగ్లాదేశ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా మాట్లాడుతూ.. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పనిలో పనిగా సెలక్టర్లతో పాటు తనను విమర్శించిన వాళ్లకు ఆటతోనే బదులిస్తానంటూ 37 ఏళ్ల మహ్మదుల్లా కౌంటర్లు వేశాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు మహ్మదుల్లాను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. దాదాపు ఆర్నెళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అతడికి తిరిగి జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023 టీమ్‌లో స్థానం సంపాదించిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 3 శతకాలు చేసి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: బేకరీ వ్యాపారం.. అడుగడుగునా అవమానాలు.. దోషిలా విచారణ! 800వ వికెట్ అతడే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్‌కప్ హిస్టరీలో..
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్- టీమిండియాతో పుణె వేదికగా మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 27.4 ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఓపెనర్ లిటన్ దాస్(66) అవుట్ కాగా.. ముష్ఫికర్ రహీం క్రీజులోకి వచ్చాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. 29.4 ఓవర్ వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రెండు పరుగులు తీశాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా ముష్ఫికర్ రహీం కంటే ముందు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు షకీబ్ వరల్డ్‌కప్ చరిత్రలో 1201 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. 42.3 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ముష్ఫికర్ రహీం 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్(42.3)లో అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు ఆక్టోబర్ 19న పుణే వేదికగా టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. షకీబ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. చెన్నై వేదికగా న్యూజిలాండ్ మ్యాచ్‌లో కూడా షకీబ్ తీవ్రమైన నొప్పితో ఆడాడు. షకీబ్ నొప్పితో బాధపడుతున్నప్పటికీ మైదానాన్ని మాత్రం వీడలేదు. ఇక ఇదే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అతడు మా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే అతడు ప్రస్తుతం తొడ కండరాల నొప్పితో బాధపడతున్నాడు. అతడు ప్రస్తుతం మా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఒక వేళ భారత్‌తో మ్యాచ్‌కు షకీబ్ దూరమైతే లిటన్ దాస్ సారథ్యం వహించే అవకాశం ఉంది. కాగా ఈ మెగా టోర్నీ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. చదవండి: #Shahid Afridi: షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం -
WC 2023: ముష్ఫికర్- షకీబ్ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్- సచిన్ రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023- New Zealand vs Bangladesh: బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ జోడీ వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్.. తమ మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్(ఎంఏ చిదంబరం స్టేడియం) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సెంచరీ భాగస్వామ్యంతో.. ఈ క్రమంలో తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఓపెనర్ లిటన్ దాస్ డకౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్ 30 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నజ్ముల్ హొసేన్ షాంటో(7) పూర్తిగా నిరాశపరిచాడు. ఇలా 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కెప్టెన్ షకీబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఆదుకున్నారు. అద్భుత భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు బాటలు వేశారు. షకీబ్ 51 బంతుల్లో 40 రన్స్ తీయగా.. ముష్ఫికర్ రహీం 75 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. అత్యధిక పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా.. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అరుదైన భాగస్వామ్య రికార్డు నెలకొల్పారు. ఇద్దరూ కలిపి 19 ఇన్నింగ్స్‌లో 972 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. తద్వారా సెహ్వాగ్- సచిన్‌ల రికార్డును అధిగమించారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ కలిపి 20 ఇన్నింగ్స్‌లో 971 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ జాబితాలో 20 ఇన్నింగ్స్‌లో 1220 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా మాజీ స్టార్లు ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లా, టీమిండియా జోడీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరో రికార్డు.. ఇది సమంగా.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక 50+ పార్ట్నర్షిప్స్ నమోదు చేసిన జోడీలు ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్- 12 వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్- 8 ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్- 8. కాగా కివీస్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు స్కోరు చేసింది. చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్
ధర్మశాలలో నిన్న ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి బంగ్లాదేశ్ తమ కోటా ఓవర్ల కంటే ఓ ఓవర్ వెనుపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్ విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం బంగ్లాదేశ్ సభ్యులందరికీ ఈ ఫైన్ వర్తిస్తుంది. ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఎహసాన్ రజా, పాల్ విల్సన్, థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్, ఫోర్త్ అంపైర్ కుమార ధర్మసేన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఛార్జ్ తీసుకున్నారు. ఐసీసీ విధించిన ఈ జరిమానాను బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అంగీకరించాడు. దీంతో ఐసీసీ ప్యానెల్ ముందు హాజరుకు అతనికి మినహాయింపు లభించింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. డేవిడ్ మలాన్ (140) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. రీస్ టాప్లే (10-1-43-4) బంగ్లా పతనాన్ని శాశించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ మరో పది బంతులు మిగిలుండగానే ఛేదించి, ప్రపంచకప్‌లో 300 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను ఛేదించిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. -
1987లో జన్మించిన కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే!
ICC World Cup 2023 Winner Prediction: మరో రెండు రోజుల్లో వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబరు 5న ఈ మెగా క్రికెట్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాప్-4 జట్లు, విజేతపై విశ్లేషకులు సహా అభిమానులు సైతం తమ అంచనాలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ గ్రీన్‌స్టోన్ లోబో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అతడే వరల్డ్‌కప్ గెలుస్తాడు లోబో అంచనా ప్రకారం.. 1987వ సంవత్సరంలో జన్మించి.. ఇప్పుడు ఓ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుస్తాడట. ఇందుకు ఉదాహరణలు చెబుతూ.. 1986, 1987లో జన్మించిన ప్లేయర్లు, క్రీడా జట్లకు నాయకులుగా ఉన్న వాళ్లు మేజర్ స్పోర్ట్ ఈవెంట్లలో విజేతలుగా నిలుస్తున్నారని లోబో పేర్కొన్నాడు. జొకోవిచ్, మెస్సీ అలాగే.. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. 1987లో పుట్టిన టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ హ్యూగో లోరిస్(1986), 2022లో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ(1987)ల పేర్లను లోబో ఉటంకించాడు. మోర్గాన్ కూడా అంతే ఇక క్రికెట్లో ఇందుకు ఉదాహరణగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరును అతడు ప్రస్తావించాడు. 1986లో జన్మించిన మోర్గాన్ 2019లో ఆ జట్టును జగజ్జేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ ప్రకారం.. ఈసారి 1987లో జన్మించిన వ్యక్తి కప్ గెలుస్తాడంటూ లోబో జోస్యం చెప్పాడు. షకీబ్ 1987లో జన్మించాడు.. అయితే.. ఈ మేరకు.. ‘‘ షకీబ్ అల్ హసన్ 1987లో జన్మించాడు. అయితే, బంగ్లాదేశ్ జట్టు మరీ అంత గొప్పగా ఏమీ లేదు. కాబట్టి 1987లో జన్మించిన మరో కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ టైటిల్’’ అంటూ టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరును చెప్పకనే చెప్పాడు లోబో. కాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ మార్చి 24, 1987లో జన్మించగా.. రోహిత్ శర్మ ఏప్రిల్ 30, 1987లో పుట్టాడు. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక అక్టోబరు 8న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. చదవండి: టీమిండియా స్టార్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి! -
వరల్డ్‌కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్
2023 వన్డే ప్రపంచకప్ ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా వార్మప్ మ్యాచ్‌లతో పాటు అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే తమ తొలి వరల్డ్‌కప్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. గౌహతిలో శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న తమ తొలి వార్మప్ మ్యాచ్‌కు ముందు షకీబ్ ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడ్డాడని తెలుస్తుంది. అతను కోలుకునేందుకు కనీసం వారం రోజుల సమయం పడుతుందని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ తెలిపింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ న్యూస్ వైరలవుతుంది. వరల్డ్‌కప్ ప్రారంభంకాకుండానే బంగ్లాదేశ్‌ది ఓ వికెట్ పడింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, బంగ్లాదేశ్ ఇదివరకే తమ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ సేవలను కోల్పోయిన విషయం తెలిసిందే. షకీబ్‌తో విబేధాల కారణంగా బంగ్లా సెలెక్టర్లు తమీమ్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయలేదు. బ్యాటింగ్ ఆర్డర్, గాయాల విషయంలో షకీబ్, తమీమ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తుంది. తమీమ్‌ను తప్పించి పంతాన్ని నెగ్గించుకున్న షకీబ్ ఇప్పుడు తాను కూడా గాయం బారిన పడి జట్టుకు దూరం కావడంతో బంగ్లా టీమ్ కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ ఇవాళ (సెప్టెంబర్ 29) తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మరో మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాయి. 17 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 76/2గా ఉండగా.. 14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 103/0గా ఉంది. కివీస్‌తో మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు బాబర్ ఆజమ్ (34), మొహమ్మద్ రిజ్వాన్ (18) క్రీజ్‌లో ఉండగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ (22), పథుమ్ నిస్సంక (46) క్రీజ్‌లో ఉన్నారు. -
WC 2023: వరల్డ్‌కప్ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్ అప్పుడే!
WC 2023- I Won't Lead In ODIs After That: Shakib al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ సారథిగా వైదొలుగుతానని స్పష్టం చేశాడు. మేనేజ్మెంట్ కోరినందు వల్లే వన్డే జట్టు పగ్గాలు చేపట్టానని.. ఇది కేవలం టీమ్ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నాడు. తన స్వార్థం కోసం సారథిగా రాలేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ వన్డే కెప్టెన్సీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్-2023లో జట్టును ముందుండి నడిపిన షకీబ్ అల్ హసన్.. ప్రపంచకప్ టోర్నీలోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. వరల్డ్‌కప్ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్ అప్పుడే ఈ నేపథ్యంలో టీ- స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వన్డే కెప్టెన్సీ, రిటైర్మెంట్ గురించి తన ప్రణాళికలు వెల్లడించాడు. ‘‘అంతర్జాతీయస్థాయిలో నేను 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్ చాంపియన్స్ ట్రోఫీలో భాగమవ్వాలనుకుంటున్నాను. ఇక టీ20 ఫార్మాట్లో టీ20 ప్రపంచకప్-2024 వరకు జట్టుతో ఉండాలనుకుంటున్నా. టెస్టుల విషయంలోనూ వరల్డ్‌కప్ తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. బహుశా ఒకేసారి అన్ని ఫార్మాట్లకు ఒకేసారి వీడ్కోలు పలుకుతానేమో. భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు కదా! ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ విషయంలో నా ఆలోచన ఇదీ’’ అని 36 ఏళ్ల షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 11 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు 600 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు': తమీమ్ ఇక్బాల్ -
వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడికి దక్కని చోటు
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 కోసం బంగ్లాదేశ్ సెలెక్టర్లు తమ జట్టును ఇవాళ ప్రకటించారు. షకీబ్ అల్ హసన్ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో స్టార్ ఆటగాడు, బంగ్లాదేశ్ లెజెండరీ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్‌కు చోటు దక్కలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా తమీమ్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోలేదని తెలుస్తుంది. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా గాయం కారణంగా అసౌకర్యంగా ఫీలైన తమీమ్ అప్పుడే సెలెక్టర్లతో వరల్డ్‌కప్‌లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపాడు. తమీమ్ వర్షన్‌ను పరిగణలోకి తీసుకున్న ఆ దేశ సెలెక్షన్ కమిటీ మొత్తానికే అతన్ని వరల్డ్‌కప్ జట్టు నుంచి తొలగించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాగా, తమీమ్ ఇటీవల వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఆతర్వాత ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పిలుపు మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే తమీమ్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటివ్వకుండా సెలక్టర్లు అవమానించారు. తమీమ్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోకపోవడానికి బంగ్లా ప్రస్తుత కెప్టెన్ షకీబ్‌తో ఉన్న విభేదాలే కారణమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని దేశాలు తమమత జట్లను ప్రకటించిన అనంతరం బంగ్లాదేశ్ ఆఖర్లో తమ జట్టును ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో బంగ్లా టీమ్.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొంటుంది. దీనికి ముందు ఆ జట్టు సెప్టెంబర్ 29న శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం అక్టోబర్ 2న ఇంగ్లండ్‌తో మరో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. మెగా టోర్నీలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబర్ 19న పూణేలో జరుగనుంది. బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిది హసన్ మీరజ్, తౌహిద్ హ్రిదోయ్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్, తంజిమ్ షకీబ్, తంజిద్ తమీమ్, మహ్మదుల్లా రియాద్ భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), విక్రమ్‌జీత్ సింగ్, సకీబ్ జుల్ఫికర్, సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్, కొలిన్ అకెర్‌మ్యాన్, బాస్ డీ లీడ్, తేజ నిడమనూరు, షరీజ్ అహ్మద్, మ్యాక్స్ ఔడౌడ్, రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్, వెస్లీ బర్రెసీ, లొగన్ వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్ శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక -
Ind vs Ban: అరంగేట్ర బౌలర్ చేతిలో అవుట్.. రోహిత్ శర్మ చెత్త రికార్డు
Asia Cup 2023- India Vs Bangladesh: ఆసియా కప్-2023 సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో టీమిండియాకు అనూహ్య రీతిలో ఓటమి ఎదురైంది. పాకిస్తాన్‌ను ఏకంగా 228 పరుగులతో చిత్తు చేసి.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన రోహిత్ సేన బంగ్లాదేశ్ చేతిలో భంగపడింది. ఫైనల్‌కు ప్రాక్టీస్ అనుకున్న మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. అదరగొట్టిన బంగ్లా కెప్టెన్ కొలంబోలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. షకీబ్ అల్ హసన్ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్ షకీబ్ 80, తౌహిద్ హృదయ్ 54, నసైమ అహ్మద్ 44 పరుగులతో రాణించారు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు స్కోరు చేసింది. రోహిత్ డకౌట్ అయితే, లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఊహించని షాకిచ్చాడు బంగ్లా అరంగేట్ర బౌలర్ తంజీమ్ హసన్ సకీబ్. రెండు బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఈ రైట్ఆర్మ్ పేసర్ బౌలింగ్‌లో అనాముల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. గిల్ సెంచరీ, అక్షర్ ఇన్నింగ్స్ వృథా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 121, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించినా.. భారత్ గెలుపునకు ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా.. రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రోహిత్ శర్మ చెత్త రికార్డు ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధిక సార్లు(3) డకౌట్ అయిన తొలి భారత బ్యాటర్, కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ టోర్నీలో పరుగుల ఖాతా తెరవకుండానే మూడుసార్లు పెవిలియన్ చేరిన ఐదో క్రికెటర్‌గా చెత్త రికార్డు జాబితాలోకెక్కాడు.ఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో రోహిత్ డకౌట్ కావడం ఇది ఏకంగా పదిహేనోసారి కావడం గమనార్హం. ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్లు ►రూబెల్ హసన్(బంగ్లాదేశ్)-3 ►సల్మాన్ భట్(పాకిస్తాన్)-3 ►అమీనుల్ ఇస్లాం(బంగ్లాదేశ్)-3 ►మహేళ జయవర్ధనే(శ్రీలంక)-3 ►రోహిత్ శర్మ(ఇండియా)-3. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ Super11 Asia Cup 2023 | Super 4 | India vs Bangladesh | Highlightshttps://t.co/hEYw3GY8qd#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023 -
Ind vs Ban: పసికూనపై భారత్ ఘోర పరాజయం..గిల్ సెంచరీ వృధా..
Asia Cup, 2023- India Vs Bangladesh Updates: ఆసియా కప్‌లో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన సూపర్ ఫొర్ దశలోని చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్ పై 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన భారత జట్టు 259 పరుగులకే ఆలౌటై 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తడబడిన టెయిలెండర్లు.. అక్షర్ పటేల్ శార్దూల్ ఠాకూర్ ఎనిమిదో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. అంతలోనే ఒకరి తర్వాత ఒకరు బంగ్లా బౌలర్లకు దాసోహం అంటూ కేవలం 10 పరుగుల వ్యవధిలో మిగిలిన మూడు వికెట్లనూ కోల్పోయారు. తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయిన భారత్.. అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి అవుటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత జట్టు లక్ష్యానికి చేరువైన దశలో శార్ధూల్ ఠాకూర్(11) ముస్తఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో మెహదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. శుభ్‌మన్ గిల్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న గిల్ భారత జట్టును సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడని భావిస్తున్నంతలో మహెడీ భారత జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. మహెడీ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన గిల్ లాంగాఫ్ వైపుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి హ్రిదోయ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గిల్ మొత్తం 133 బంతులను ఎదుర్కొని 90.98 స్ట్రైక్ రేటుతో 121 పరుగులు చేశాడు. జడేజా క్లీన్‌బౌల్డ్.. గిల్ సెంచరీ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (7) క్లీన్‌బౌల్డయ్యాడు. మరోవైపు గిల్ 117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 174/6గా ఉంది. గిల్‌కు జతగా అక్షర్ క్రీజ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (26) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 94 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. మెహిది హసన్ బౌలింగ్‌లో ఇషాన్‌కిషన్ (5) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. గిల్ (57), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్.. కేఎల్ రాహుల్ ఔట్ 74 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. మెహిది హసన్ బౌలింగ్‌లో షమీమ్‌కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (19) ఔటయ్యాడు. 42 పరుగులతో గిల్ క్రీజ్‌లో ఉన్నాడు. టార్గెట్ 266.. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2 ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆతర్వాత ఆచితూచి ఆడుతుంది. గిల్ (36), కేఎల్ రాహుల్ (15) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2. టార్గెట్ 266.. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మను (0) ఔట్ చేసిన తంజిమ్.. మూడో ఓవర్లో అరంగేట్రం ఆటగాడు తిలక్ వర్మను (5) క్లీన్ బౌల్డ్ చేశాడు. టార్గెట్ 266.. రోహిత్ శర్మ డకౌట్ 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ (0) వికెట్ కోల్పోయింది. తంజిమ్ బౌలింగ్‌లో అనాముల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ డకౌటయ్యాడు. 50 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోర్ 265/8 టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ (80), తౌహిద్ హ్రిదోయ్ (54) అర్ధ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో నసుమ్ అహ్మద్ (44), మెహిది హసన్ (29 నాటౌట్) బంగ్లాదేశ్ ఓ మోస్తరు స్కోర్ చేసేందుకు తోడ్పడ్డారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13), షమీమ్ హొస్సేన్ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 2, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 238 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో నసుమ్ అహ్మద్ (44) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 193 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో తిలక్‌వర్మకు క్యాచ్ ఇచ్చి తౌహిద్ హ్రిదోయ్ (54) ఔటయ్యాడు. నసుమ్ అహ్మద్ (18), మెహిది హసన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 161 పరుగుల వద్ద (34.1 ఓవర్) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా.. షమీమ్ హొస్సేన్‌ను (1) ఎల్బీడబ్ల్యూ చేశాడు. జడేజాకు ఇది వన్డేల్లో 200వ వికెట్. ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్. షకీబ్ (80) ఔట్ 160 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో షకీబ్ అల్ హసన్ (80) క్లీన్ బౌల్డయ్యాడు. 33.1 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 160/5. తౌహిద్ హ్రిదోయ్ (40), షమీమ్ హొస్సేన్ క్రీజ్‌లో ఉన్నారు. 26 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 124/4 26 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 124/4గా ఉంది. షకీబ్ అల్ హసన్ (60), తౌహిద్ హ్రిదోయ్ (25) క్రీజ్‌లో ఉన్నారు. 5.4: మూడో వికెట్ కోల్పోయిన బంగ్లా టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి మెరిశాడు. ఓపెనర్ తాంజిద్ హసన్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ అనాముల్ హక్(4) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 3.1: రెండో వికెట్ డౌన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తాంజిద్ హసన్(13) అవుట్. అనాముల్ హక్, షకీబల్ హసన్ క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్ ముగిసే సరికి బంగ్లా స్కోరు: 20/2 2.1: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ షమీ బౌలింగ్‌లో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ బౌల్డ్. డకౌట్‌గా వెనుదిరిగిన లిటన్ దాస్. తిలక్ వర్మ అరంగేట్రం ఇప్పటికే ఆసియా కప్-2023 ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియా.. బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌కు సిద్ధమైంది. శ్రీలంకతో తుది పోరుకు ముందు సన్నాహకంగా సాగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వాళ్లందరికీ విశ్రాంతి ఇక బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా హైదరాబాదీ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. కాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్ వెల్లడించాడు. వీరి స్థానాల్లో తిలక్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ తరఫున తంజీమ్ హసన్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తుది జట్లు ఇవే టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ కృష్ణ. బంగ్లాదేశ్ లిటన్ దాస్(వికెట్ కీపర్), తాంజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షమీమ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహది హసన్, నసూమ్ అహ్మద్, తన్జిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్. చదవండి: Ind vs SL: టీమిండియాతో ఫైనల్‌కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ -
Asia Cup 2023: శతకాల మోత మోగించిన బంగ్లాదేశ్ బ్యాటర్లు.. భారీ స్కోర్
ఆసియా కప్-2023లో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. మెహిది హసన్ మీరజ్ (119 బంతుల్లో 112; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హసన్ షాంటో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. మీరజ్, షాంటోలు తమతమ వన్డే కెరీర్లలో రెండో సెంచరీలు నమోదు చేసి, తమ జట్టు భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. 112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మీరజ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. 104 పరుగులు చేసి షాంటో రనౌటయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నైమ్ (28), ముష్ఫికర్ రహీం (25), షకీబ్ అల్ హసన్ (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. తౌహిద్ హ్రిదోయ్ డకౌటై నిరాశపరిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టగా.. షాంటో, ముష్ఫికర్, షమీమ్ (11) రనౌట్లయ్యారు. కాగా, ఈ టోర్నీలో నిలబడాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఆ జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు సైతం ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలిస్తే.. తదుపరి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సంబంధం లేకుండా సూపర్-4కు చేరుకుంటుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక సూపర్-4 బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్ ఇదివరకే సూపర్-4కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై నెగ్గిన ఆ జట్టు.. నిన్న (సెప్టెంబర్ 2) టీమిండియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ (మొత్తంగా 3 పాయింట్లు) ఖాతాలో వేసుకుని తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. పాక్‌తో మ్యాచ్ రద్దు కావడంతో భారత్‌కు సైతం ఓ పాయింట్ దక్కింది. రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్.. నేపాల్‌పై గెలిస్తే సూపర్-4కు చేరుకుంటుంది. -
ఆఫ్గానిస్తాన్‌తో బంగ్లాదేశ్ కీలక పోరు.. ఓడితే ఇంటికే!
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆదివారం అఫ్గానిస్తాన్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘బి’ నుంచి సూపర్–4కు ముందంజ వేయాలంటే బంగ్లాదేశ్ ఇందులో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో శ్రీలంక చేతిలో బోల్తా పడిన షకీబుల్ బృందం అఫ్గాన్‌తో జరిగే పోరులో పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమిపాలైతే టోర్నీ నుంచే నిష్కమ్రించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు యేటికేడు రాటుదేలుతున్న అఫ్గానిస్తాన్ తమదైన రోజున ఎంతటి ప్రత్యర్ధినైనా కంగుతినిపించగలదు. ఇదే నమ్మకంతో ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో శుభారంభం ఇవ్వాలనే లక్ష్యంతో అఫ్గాన్ బరిలోకి దిగనుంది. కాగా ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. సిరీస్ ఓటమితో ఆసియాకప్ టోర్నీలోకి ఆఫ్గాన్ అడుగుపెట్టింది. తుది జట్లు(అంచనా) బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, అనాముల్ హక్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆఫ్గానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూకీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, గుల్బాదిన్ నాయబ్/కరీం జనత్, మహ్మద్ సలీమ్ సఫీ చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌథీ రికార్డులకెక్కాడు. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేసిన సౌథీ.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీస్ వెటరన్ 8.13 ఏకనామీతో 141 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(140) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షకీబ్ రికార్డును సౌథీ బ్రేక్ చేశాడు. కాగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరం కావడంతో ఇంగ్లండ్ పర్యటనలో కివీస్ జట్టును సౌథీ నడిపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్, కార్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్,మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 140 లక్ష్యాన్ని కేవలం 14 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఊదిపడేసింది. గ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(54), హ్యారీ బ్రూక్(43 నాటౌట్) పరుగులతో మ్యాచ్‌ను మగించారు. చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
శ్రీలంక లయన్స్ వర్సెస్ బంగ్లా టైగర్స్.. గెలుపెవరిది?
ఆసియాకప్-2023లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా క్యాండీ వేదికగా గురువారం శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓ లూక్కేద్దం శ్రీలంక.. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు ఆతిథ్య శ్రీలంక వరుస షాక్‌లు తగిలాయి. దుష్మంత చమీర, లహిరు కుమార, దిల్షన్ మధుశంక, వనిందు హసరంగ, అవిష్క ఫెర్నాండో వంటి స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. బ్యాటింగ్ పరంగా లంక పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పేలవంగా ఉంది. లహురు కుమారా,థీక్షణ మినహా పెద్దగా అనుభవం ఉన్న బౌలర్లు లేరు. యువ సంచలనంచ,పేసర్ మతీషా పతిరానా అద్బుతమైన ఫామ్‌లో ఉండడం లంకకు కలిసిచ్చే ఆంశం. అదే విధంగా స్వదేశంలో శ్రీలంకకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా ఆడిన 5 వన్డేల్లోనూ లంక విజయం సాధించింది. సొంత గడ్డపై ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న లంక.. వన్డే ప్రపంచకప్ క్వాలిఫియర్స్లోనూ దుమ్మురేపింది. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్‌ను శ్రీలంకనే సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బంగ్లా జట్టు తమ ఆఖరి రెండు వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లా జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్ కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో అనముల్ హక్కు అవకాశం ఇచ్చారు. లిట్టన్ దాస్ దూరమైనప్పటికీ అఫీఫ్ హొస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, తోవిద్ హృదయ్ రూపంలో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా బౌలింగ్‌లో కూడా టాస్కిన్ అహ్మద్, ముస్తిఫిజర్ రెహ్మన్, షకీబ్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. వీరి చెలరేగితే లంక బ్యాటర్లకు కష్టాలు తప్పవు. తుది జట్లు(అంచనా) బంగ్లాదేశ్ అఫీఫ్ హొస్సేన్, నయీమ్ షేక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తోవిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్ శ్రీలంక పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, మతీశ పతిరణ చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
Asia Cup 2023: టీమిండియా స్టార్లను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఆసియా కప్-2023 ప్రారంభానికి ముందు పలువురు స్టార్ క్రికెటర్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మెగా టోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డులు ఏవంటే.. విరాట్ కోహ్లి: ఆసియా కప్-2023లో విరాట్ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఫార్మాట్లో 13000 పరుగుల మార్కును అందుకున్న ఐదో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12898 పరుగులు ఉండగా.. అతనికి ముందు సచిన్ (18426), సంగక్కర (14234), పాంటింగ్ (13734), జయసూర్య (13430) ఈ ఘనత సాధించారు. ఈ రికార్డుతో పాటు విరాట్ మరో భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్‌లో అతను 13000 పరుగుల మార్కును అందుకుంటే, వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు సాధించిన రికార్డు సచిన్ (321 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా.. విరాట్ (265 ఇన్నింగ్స్‌లు) సచిన్ కంటే చాలా ముందే ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. విరాట్ పై పేర్కొన్న రెండు భారీ రికార్డులతో పాటు మరో అత్యంత భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్-2023లో అతను మరో 4 సెంచరీలు చేస్తే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (49) రికార్డును బద్దలు కొట్టి, సెంచరీల హాఫ్ సెంచరీని పూర్తి చేస్తాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 46 వన్డే సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ: ఆసియా కప్ 2023లో రోహిత్ మరో 163 పరుగులు చేస్తే వన్డేల్లో 10000 పరుగుల మార్కును అందుకుంటాడు. తద్వారా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 15వ క్రికెటర్‌గా.. ఆరో భారత క్రికెటర్ రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 9837 పరుగులు ఉన్నాయి. ప్రస్తుత టోర్నీలో రోహిత్ మరో 255 పరుగులు చేస్తే, ఆసియా కప్‌లో (వన్డే ఫార్మాట్) 1000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. భారత క్రికెటర్లలో సచిన్ అత్యధికంగా ఆసియా కప్ వన్డే టోర్నీల్లో 971 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జయసూర్య, సంగక్కర మాత్రమే 1000 పరుగుల మైలురాయిని దాటారు. రవీంద్ర జడేజా: ఆసియా కప్ 2023లో జడేజా (194) మరో 6 వికెట్లు తీస్తే, వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఐదో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ విభాగంలో జయసూర్య అత్యధికంగా 323 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్: ప్రస్తుత ఆసియా కప్‌లో షకీబ్ మరో 168 పరుగులు చేస్తే, విదేశాల్లో 4000 పరుగుల మార్కును రెండో బంగ్లాదేశీగా రికార్డు సృష్టిస్తాడు. షకీబ్‌కు ముందు తమీమ్ ఇక్బాల్ (4323) ఈ ఘనత సాధించాడు. అలాగే ప్రస్తుత టోర్నీలో షకీబ్ (305) మరో వికెట్ తీస్తే, అత్యధిక వికెట్లు సాధించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో డేనియల్ వెటోరీని (305) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకతాడు. ఇమామ్ ఉల్ హాక్: ఇమామ్ ఈ ఆసియా కప్‌లో తదుపరి 4 మ్యాచ్‌ల్లో మరో 116 పరుగులు చేస్తే, వన్డేల్లో హషీమ్ ఆమ్లా ఝ(61) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఇమామ్ ఖాతాలో ప్రస్తుతం 62 ఇన్నింగ్స్‌ల్లో 2884 పరుగులు ఉన్నాయి. -
Ind Vs WI: భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. అదే జరిగితే
West Indies vs India, 4th T20I: వెస్టిండీస్‌తో నాలుగో టీ20 నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ భారీ రికార్డుపై కన్నేశాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యంత అరుదైన ఫీట్ ముంగిట నిలిచాడు. కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్.. అదే ఏడాది జింబాబ్వేతో మ్యాచ్‌తో టీ20లలో అడుగుపెట్టాడు. హరారే స్పోర్ట్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన చహల్.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా కీలక స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేయగలిగాడు. ఊరిస్తున్న భారీ రికార్డు టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్న ఈ హర్యానా బౌలర్.. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లలో 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న యజువేంద్ర చహల్‌ను భారీ రికార్డు ఊరిస్తోంది. సెంచరీ వికెట్ల క్లబ్లో చేరేందుకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చహల్ ఇప్పటి వరకు 95 వికెట్లు పడగొట్టాడు. మరో ఐదు వికెట్లు సాధిస్తే.. సెంచరీ వికెట్ల క్లబ్లో అతడు చేరతాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టీమిండియా బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో బౌలర్‌గా నిలుస్తాడు. పిచ్ సంగతి అలా.. మరి చహల్ ఎలా? కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ ఇప్పటికే 2-1తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం నాటి నాలుగో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. అయితే, బ్యాటర్లకు స్వర్గధామమైన, పేసర్లకు కాస్త అనుకూలమైన ఫ్లోరిడా పిచ్‌పై చహల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి! ఇక విండీస్‌తో మూడు మ్యాచ్‌లలో కలిపి చహల్ ఇప్పటి వరకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. భారత్, విండీస్ మధ్య ఈ మైదానంలో 6 టి20లు జరగ్గా, భారత్ నాలుగింటిలో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత రెండు మ్యాచ్‌లలో భారత్ 191, 188 స్కోర్లు చేసింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లలో 100కు పైగా వికెట్లు సాధించిన బౌలర్లు వీరే షకీబల్ హసన్- బంగ్లాదేశ్-140 టిమ్ సౌథీ- న్యూజిలాండ్- 134 రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 130 ఇష్ సోధి- న్యూజిలాండ్-118 లసిత్ మలింగ- శ్రీలంక- 107 షాదాబ్ ఖాన్- పాకిస్తాన్- 104 ముస్తాఫిజుర్ రహమాన్- బంగ్లాదేశ్- 103. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు -
ఆసియాకప్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. యువ సంచలనం ఎంట్రీ! స్టార్ ఆటగాడిపై వేటు
ఆసియాకప్-2023కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు బంగ్లా కెప్టెన్సీ నుంచి తమీమ్ ఇక్భాల్ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను షకీబ్‌కు సెలక్షన్ కమిటీ అప్పగించింది. అదే విధంగా దేశవాళీ క్రికెట్లో అద్భుంగా రాణిస్తున్న 22 ఏళ్ల తాంజిద్ హసన్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. తాంజిద్ విషయానికి వస్తే.. ఇటీవల ముగిసిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఈ యువ ఆటగాడు మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ గత ఏడిషన్‌లో కూడా దుమ్ము రేపాడు. మరోవైపు ఈ జట్టులో వెటరన్ బ్యాటర్ మహ్ముదుల్లాకు చోటు దక్కలేదు. అతడు చివరగా ఈ ఏడాది మార్చిలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్ శ్రీలంక, పాకిస్తాన్ల వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది. ఆసియాకప్‌కు బంగ్లా జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, షమీ అహ్మద్, షమీ అహ్మద్, ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్ చదవండి: అవన్నీ నిజం కాదు.. దయచేసి అర్ధం చేసుకోండి: విరాట్ కోహ్లి -
వన్డే ప్రపంచకప్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి ఆ జట్టు స్టార్ఆటగాడు తమీమ్ ఇక్భాల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో జరిగే ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు సారధిగా స్టార్ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ధృవీకరించింది. అదే విధంగా ఈ రెండు మెగా ఈవెంట్లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపారు. "ఆసియా కప్, ప్రపంచకప్‌లో మా జట్టు కెప్టెన్‌గా షకీబ్‌ను నియమించాము. రేపు(ఆగస్టు 12)న ఈ రెండు ఈవెంట్లకు మా జట్టును ప్రకటిస్తాము. సెలక్టర్లు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు" అని విలేకురల సమావేశంలో నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. కాగా షకీబ్ ప్రస్తుతం టీ20ల్లో బంగ్లా జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు 2011లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బంగ్లా కెప్టెన్‌గా షకీబ్ అల్ హసనే వ్యవహరించాడు. ఇక ఆసియాకప్-2023లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది. అదే విధంగా ఆక్టోబర్ 7న ఆఫ్గానిస్తాన్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని బంగ్లా ప్రారంభించనుంది. చదవండి: CPL 2023: అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు -
కోహ్లి తర్వాతి స్థానంలో షకీబ్.. మూడో స్థానంలో రోహిత్ శర్మ
బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల విషయంలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో షకీబ్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 42వ సారి మ్యాన్ ఆఫ్్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒక్కడే ఈ విభాగంలో షకీబ్ కంటే ముందున్నాడు. కోహ్లి అత్యధికంగా 63 మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటే, షకీబ్ 42 సార్లు, ఆతర్వాత రోహిత్ (37), వార్నర్ (37), గప్తిల్ (34), కేన్ విలియమ్సన్ (28), స్టీవ్ స్మిత్ (26), డికాక్ (25), రూట్ (25), జడేజా (24) వరుసలో ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే.. క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు అందుకున్న ఘనత దిగ్గజ క్రికెటర్ సచిన్ సొంతం చేసుకున్నాడు. సచిన్ అత్యధికంగా 76 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాత విరాట్, జయసూర్య (58), కలిస్ (57), సంగక్కర (50), పాంటింగ్ (49), అఫ్రిది (43) వరుసలో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 17 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (22), అజ్మతుల్లా (25), కరీం జనత్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, ముస్తాఫిజుర్, షకీబ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. లిటన్ దాస్ (35), ఆఫీఫ్ హొస్సేన్ (24), షకీబ్ (18 నాటౌట్) రాణించడంతో 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, ఓమర్జాయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌తో తొలి మ్యాచ్‌లోనూ నెగ్గిన బంగ్లాదేశ్ 2-0తో ఆఫ్ఘనిస్తాన్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ (2-1), ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్ గెలుచుకున్నాయి. -
ఆఖరి టీ20లో ఆఫ్గానిస్తాన్ చిత్తు.. బంగ్లాదేశ్‌దే సిరీస్
షెల్లాట్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) బంగ్లాదేశ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 17 ఓవర్లకు కుదించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఆజ్ముతుల్లా జాజాయ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తిఫిజర్ రెహ్మాన్, షకీబ్ అల్హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ టార్గెట్‌ను 119 పరుగులగా నిర్ణయించారు. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా ఛేజింగ్‌లో లిటన్ దాస్(35), షకీబ్(18 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఇక సిరీస్ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చకున్నట్లైంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. చదవండి: SL VS PAK 1st Test: కళ్లు చెదిరే క్యాచ్..! -
ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు
ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో ఏ జట్టైనా ఈజీగా విజయం సాధిస్తుందని అందరం అనుకుంటాం. కానీ బంగ్లాదేశ్ జట్టు విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఒత్తిడికి లోనయ్యి చచ్చీ చెడీ ఎలాగోలా నెగ్గింది. ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడంతో పాటు ఓటమి చేరువగా వచ్చి మళ్లీ గెలుపు రుచి చూసిన బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మహ్మద్ నబీ 40 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా 18 బంతుల్లో 33, నజీబుల్లా 23 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీయగా.. నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిపుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. తౌహిద్ చౌదరీ 47 పరుగులు చేయగా.. షమీమ్ హొసెన్ 33 పరుగులు చేశాడు. ఆఫ్గన్ బౌలర్లలో కరీమ్ జనత్ మూడు వికెట్లు తీశాడు. 19 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విజయానికి కేవలం ఆరు పరుగులు మాత్రమే అవసరం. ఈ నేపథ్యంలోనే ఆఖరి ఓవర్ వేసిన ఆఫ్గన్ బౌలర్ కరీమ్ జనత్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని మిరాజ్ ఫోర్ బాదడంతో చివరి ఐదు బంతుల్లో రెండు పరుగులు వస్తే చాలు. కానీ తర్వాతి మూడు బంతులకు వరుసగా మిరాజ్, తస్కిన్ అహ్మద్ నసుమ్ అహ్మద్‌లను ఔట్ చేసి కరీమ్ జనత్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. అయితే ఓవర్ ఐదో బంతికి ఫోర్ బాది బంగ్లాకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు షోరిపుల్ ఇస్లామ్. ఈ విజయంతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. This over had more drama than a daily soap 🎢 pic.twitter.com/jxM2zt1CfP — FanCode (@FanCode) July 14, 2023 చదవండి: #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి IND Vs WI 2023: ఏంటి కిషన్.. తొలి మ్యాచ్‌లోనే ఇలా అయితే ఎలా? తెల్లముఖం వేశావుగా -
అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయిని దాటిన షకీబ్
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయిని దాటాడు. షకీబ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14000 పరుగుల మార్కును అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జులై 11) జరిగిన మూడో వన్డేలో షకీబ్ ఈ రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్ క్రికెట్లో 14000 పరుగుల మార్కును దాటిన మూడో క్రికెటర్‌గా షకీబ్ రికార్డుల్లోకెక్కాడు. 416 మ్యాచ్‌ల్లో షకీబ్ ఈ మార్కును దాటాడు. షకీబ్‌కు ముందు తమీమ్ ఇక్బాల్ (389 మ్యాచ్‌ల్లో 15205), ముష్ఫికర్ రహీమ్ (438 మ్యాచ్‌ల్లో 14310 పరుగులు) బంగ్లాదేశ్ తరఫున ఈ రికార్డు సాధించారు. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచ క్రికెట్లో షకీబ్‌కు ముందు 47 మంది 14000 పరుగుల మార్కును దాటారు. వీరిలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌ల్లో 34357 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. సంగక్కర (28016), రికీ పాంటింగ్ (27483) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో షకీబ్ కంటే ముందుగా విరాట్ కోహ్లి (25385), జో రూట్ (18336), డేవిడ్ వార్నర్ (17267), కేన్ విలియమ్సన్ (17142), రోహిత్ శర్మ (17115), స్టీవ్ స్మిత్ (15084), ఏంజెలో మాథ్యూస్ (14231) అంతర్జాతీయ క్రికెట్లో 14000 పరుగుల మార్కును దాటారు. బంగ్లా-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. స్వదేశంలో అఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్‌వాష్ అయ్యే ప్రమాదాన్ని బంగ్లాదేశ్ తప్పించుకుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-2తో వెనుకపడిన బంగ్లా జట్టు.. ఇవాళ (జులై 11) జరిగిన మూడో వన్డేలో గెలుపొందడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి, ఘోర పరాభవం ఎదుర్కోకుండా బయటపడగలిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 45.2 ఓవర్లలో 126 పరుగులకే చాపచుట్టేయగా, బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఐపీఎల్లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావాలని ప్రపంచంలో ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా ఎంతోమంది అనామకులను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఐపీఎల్‌కు ఉంది. ఇటువంటి క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశాన్ని ఏ ఆటగాడు వదులుకోవడానికి ఇష్టపడడు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కంటే తమ జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్ ఆఫర్‌ను వదులుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్హసన్, లిటన్ దాస్, టాస్కిన్ అహ్మద్‌లకు ఆ దేశ క్రికెట్ రివార్డు ప్రకటించింది. ఈ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (దాదాపు 53 లక్షలు) బీసీబీ రివార్డుగా ఇవ్వనుంది. కాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్ కారణంగా షకీబ్ అల్హసన్ ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అదే విధంగా లిటన్ దాస్ కూడా ఐర్లాండ్ సిరీస్ కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడిని రూ.50 లక్షలకు కేకేఆరే సొంతం చేసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్‌కు దూరమైన లక్నో ఫాస్ట్ బౌలర్ స్ధానంలో టాస్కిన్ అహ్మద్‌కు ఆ ఫ్రాంచైజీ నుంచి పిలుపు వచ్చిందంట. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లక్నో ఆఫర్‌ను టస్కిన్ అహ్మద్ తిరష్కరించినట్లు సమాచారం. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్‌ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యారు. చదవండి: ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. వరల్డ్ కప్ టీమిండియాదే: సునీల్ గవాస్కర్ -
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ధోని శిష్యుడు ఒకే టీమ్‌లో..!
లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ (2023)కు సంబంధించి, లీగ్‌లో పాల్గొనే 5 జట్లు తమ ఐకాన్ (లోకల్, ఓవర్సీస్), ప్లాటినం (లోకల్, ఓవర్సీస్) ప్లేయర్లతో ఒప్పందం చేసుకున్నాయి. ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌కు నిర్ధేశిత తేదీ జూన్ 11 అయినప్పటికీ.. ఆయా జట్లకు ముందుగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగింది. ఎల్పీఎల్లో తొలిసారి ఆడుతున్న కొలొంబో స్ట్రయికర్స్.. తమ ఐకాన్ ప్లేయర్‌గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను, మిగతా సభ్యులుగా పాక్ స్పీడ్‌స్టర్ నసీం షా, లోకల్ టీ20 స్టార్ చమిక కరుణరత్నే, ఐపీఎల్-2023తో ధోని శిష్యుడిగా మారిపోయిన జూనియర్ మలింగ మతీష పతిరణను ఎంపిక చేసుకుంది. గాలే గ్లాడియేటర్స్.. బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను.. డంబుల్లా ఔరా మాథ్యూ వేడ్‌ను.. క్యాండీ ఫాల్కన్స్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను.. జాఫ్నా కింగ్స్ డేవిడ్ మిల్లర్‌ను తమ ఓవర్సీస్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాయి. ఎల్పీఎల్-2023 కోసం ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చదవండి: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల -
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
ICC Player Of The Month: 2023, మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 12) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుచుకున్నాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనకు గాను షకీబ్‌ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉండినప్పటికీ, అంతిమంగా జ్యూరీ షకీబ్వైపే మొగ్గుచూపింది. మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన షకీబ్.. తన జట్టు 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ తాను మాత్రం ఆ సిరీస్‌లో టాప్ రన్ స్కోరర్‌గా (బంగ్లా తరఫున), హూయ్యెస్ట్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 సిరీస్‌లోనూ కొనసాగించిన షకీబ్.. బంగ్లాదేశ్ జగజ్జేత ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్.. మొత్తంగా మార్చి నెలలో 12 మ్యాచ్‌లు ఆడి 353 పరుగులు తీసి 15 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలవడం ఇది రెండోసారి. 2021 జులైలో షకీబ్ ఈ అవార్డును తొలిసారి గెలుచుకున్నాడు. -
సరిపోని ఐర్లాండ్ పోరాటం.. బంగ్లాదేశ్ ఖాతాలో మరో సిరీస్
ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్.. ప్రస్తుత పర్యటనలో ఐర్లాండ్‌ను మూడు ఫార్మాట్లలో మట్టికరిపించి, సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో జగజ్జేత ఇంగ్లండ్‌ను సైతం ఓ ఆట ఆడుకున్న (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్) బంగ్లా టైగర్స్.. తాజాగా పసికూన ఐర్లాండ్‌పై అదే స్థాయిలో రెచ్చిపోయారు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో, టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 286/8 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. మరో 6 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ముందు ఫైటింగ్ టార్గెట్ ఉంచుతుందని భావించిన ఐర్లాండ్ ఆఖరి 2 వికెట్లు వెంటవెంటనే కోల్పోయి ఓటమిని అప్పుడే పరోక్షంగా అంగీకరించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన (126) ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొమినుల్ హాక్ 20 పరుగులతో అజేయంగా నిలువగా.. తమీమ్ ఇక్బాల్ (31), లిటన్ దాస్ (23) జట్టు విజయంలో తలో చేయి వేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ వికెట్‌కీపర్ టకెర్ (108) సెంచరీ పోరాటం వృధా అయ్యింది. స్కోర్ వివరాలు.. ఐర్లాండ్: 214 & 292 బంగ్లాదేశ్: 369 & 138/3 -
లేటు వయసులో ఇరగదీస్తున్న బంగ్లా బ్యాటర్.. వరుస సెంచరీలు
BAN VS IRE Test Match: బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ 35 ఏళ్ల ముష్ఫికర్ రహీం లేటు వయసులో కుర్రాళ్లకు మించి రెచ్చిపోతున్నాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన రహీం (తొలి ఇన్నింగ్స్‌లో 126) వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో చివరిసారిగా బ్యాటింగ్ (ఐర్లాండ్‌తో మూడో వన్డేలో రహీంకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రహీం ఆడలేదు) చేసిన రహీం.. ఫలితం తేలకుండా ముగిసిన ఆ మ్యాచ్‌లో 60 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది శభాష్ అనిపించకున్నాడు. తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో 10వ సెంచరీ నమోదు చేసిన రహీం.. తన జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు చాపచుట్టేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్ చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో రహీంతో పాటు షకీబ్ అల్ హసన్ (87), మెహిది హసన్ (55) రాణించగా.. ఐరిష్ బౌలర్ ఆండీ మెక్‌బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు మూడో సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. పరుగులేమీ చేయకుండానే నాలుగో బంతికే వికెట్ కోల్పోయింది. జేమ్స్ మెక్కొల్లమ్ను షకీబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. -
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరమై, సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలై నానా తంటాలు పడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇవాళ (ఏప్రిల్ 5) ఓ గుడ్‌న్యూస్ మరో బ్యాడ్‌న్యూస్ తెలిసింది. విధ్వంసకర బ్యాటర్, ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది కేకేఆర్ యాజమాన్యం. బేస్‌ప్రైజ్ రూ. 1.5 కోట్లకు అదనంగా మరో 1.3 కోట్లు (2.8 కోట్లు) చెల్లించి రాయ్‌ను సొంతం చేసుకుంది కేకేఆర్ మేనేజ్మెంట్. ఐపీఎల్లో 2017, 2018, 2021 సీజన్లు ఆడిన రాయ్.. చివరిసారిగా 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 129 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. గత కొన్ని సీజన్లుగా ఏదీ కలిసి రాక, ప్లేఆఫ్స్‌కు చేరేందకు కూడా అష్టకష్టాలు పడుతున్న కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికే దూరంగా కానున్నాడని తెలిసే లోపే మరో కీలక ఆటగాడు షకీబ్ అల్ హసన్ బాంబు పేల్చాడు. షకీబ్ కూడా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదని ప్రకటించాడు. అంతర్జాతీయంగా ఉన్న కమిట్మెంట్లు, వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్-2023కు అందుబాటులో ఉండటం కుదరదని షకీబ్ పేర్కొన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌కే చెందిన లిటన్ దాస్ కూడా ఏప్రిల్ 10 వరకు ఉండటం లేదు. ఐర్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా లిటన్ 10వ తేదీ వరకు ఫ్రాంచైజీని గడువు కోరినట్లు సమాచారం. కాగా, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్న విషయం తెలిసిందే. రాణా సారథ్యంలో పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్.. డవ్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. -
KKRకి దిమ్మ తిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్ క్రికేటర్.. మామాలు కష్టం కాదు
-
IPL 2023: కేకేఆర్‌కు షాకిచ్చిన బంగ్లా బోర్డు! తప్పుకొన్న షకీబ్.. ఆ స్టార్ బ్యాటర్ కూడా
IPL 2023- KKR- Shakib Al Hasan- ఢాకా: బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఐపీఎల్‌నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు షకీబ్ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఐర్లాండ్‌తో మార్చి 31న టి20 సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ తమ జట్టుతో కలుస్తాడని కేకేఆర్ యాజమాన్యం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అయితే మంగళవారం నుంచి ఐర్లాండ్‌తో బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ ఆడనుండగా... మే 9–14 మధ్య కెమ్స్ఫోర్డ్లో మూడు వన్డేల్లో బంగ్లా, ఐర్లాండ్ తలపడతాయి. ఇదే కారణంతో మరో బంగ్లా ఆటగాడు, కేకేఆర్ సభ్యుడే అయిన లిటన్ దాస్ కూడా ఐపీఎల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వేలం సమయంలో తమ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని బంగ్లా బోర్డు ప్రకటించగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షకీబ్ దూరమైతే కోల్‌కతా టీమ్‌లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లే ఉంటారు. ఇక ఐపీఎల్-2023లో పంజాబ్‌తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చదవండి: ధోనితో అట్లుంటది మరి.. 20వ ఓవర్ అంటే పూనకాలే! వీడియో వైరల్ వరుసగా రెండు సిక్సర్లు.. ఐపీఎల్లో ధోని అరుదైన రికార్డు -
బంగ్లాదేశ్‌కు బిగ్ షాకిచ్చిన ఐర్లాండ్.. 14 ఏళ్ల తర్వాత!
చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 7వికెట్ల తేడాతో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న బంగ్లా ఆశలకు ఐరీష్ జట్టు కళ్లెం వేసింది. 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. మూడు వికెట్లు కోల్పోయి కేవలం 14 ఓవర్లలోనే చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో పాల్ స్టిర్లింగ్ విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న స్టిర్లింగ్ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 124 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో షమీమ్ హొస్సేన్(51) మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. మాథ్యూ హంఫ్రీస్ రెండు, హాండ్, హ్యారీ టెక్టర్, వైట్, డెలానీ తలా వికెట్ సాధించారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఐర్లాండ్‌కు బంగ్లాదేశ్‌పై 14 ఏళ్ల తర్వాత ఇదే తొలి టీ20 మ్యాచ్ విజయం. బంగ్లాదేశ్‌పై చివరగా 2009 టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ విజయం సాధించింది. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు ఊహించని షాక్.. కీలక ఆటగాడు దూరం -
అంతర్జాతీయ టీ20లలో మొనగాడు.. అత్యధిక వికెట్లు తీసి..
Bangladesh vs Ireland, 2nd T20I - Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీని వెనక్కినెట్టి ముందుకు దూసుకువచ్చాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో రెండో టీ20 సందర్భంగా ఐదు వికెట్లు కూల్చిన షకీబ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. టపాటపా.. ఐదు వికెట్లు చట్టోగ్రామ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐరిష్ ఓపెనర్ రాస్ అడేర్(6), వికెట్ కీపర్, వన్‌డౌన్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్(5), నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ టెక్టార్(22), ఐదో స్థానంలో దిగిన గరేత్ డెలనీ(6), ఆరో స్థానంలో వచ్చిన జార్జ్ డాక్రెల్(2) వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. వీరందరినీ తక్కువ స్కోరుకు కట్టడి చేసి ఐర్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అటు బ్యాట్(38 నాటౌట్)తోనూ ఇటు బంతితోనూ మ్యాజిక్ చేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడీ స్పిన్ ఆల్‌రౌండర్. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి.. బంగ్లాకు మరో సిరీస్ విజయం అందించాడు. ఇప్పటి దాకా అన్ని వరల్డ్‌కప్‌లలో కాగా అంతర్జాతీయ టీ20లలో వికెట్ల విషయంలో ఇప్పటివరకు టిమ్ సౌతీ ముందంజలో ఉండగా.. షకీబ్ అతడిని అధిగమించాడు. తద్వారా నంబర్1 గా అవతరించాడు. 2006లో జింబాబ్వేతో మ్యాచ్‌తో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టిన షకీబ్ ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ పాల్గొనడం విశేషం. ఇప్పటి వరకు అతడు బంగ్లా తరఫున 114 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే! 1. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- 136 వికెట్లు 2. టిమ్ సౌతీ- న్యూజిలాండ్- 134 వికెట్లు 3. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 129 వికెట్లు 4. ఇష్ సోధి- న్యూజిలాండ్- 114 వికెట్లు 5. లసిత్ మలింగ- శ్రీలంక -107 వికెట్లు చదవండి: BAN Vs IRE: చరిత్ర సృష్టించిన లిటన్ దాస్.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డు బద్దలు David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి.. -
దుమ్ములేపిన లిటన్ దాస్! ఐదేసిన షకీబ్.. మరో సిరీస్ కూడా..
Bangladesh vs Ireland, 2nd T20I: ఐర్లాండ్‌తో రెండో టీ20లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. చట్టోగ్రామ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా బంగ్లాదేశ్- ఐర్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్(83), రోనీ తాలుక్దార్(44) అద్భుతంగా రాణించారు. వీరికి తోడు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 17 ఓవర్లలో ఆతిథ్య బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు బంగ్లా కెప్టెన్ షకీబ్ చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. షకీబ్ దెబ్బకు ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. పేసర్ టస్కిన్ అహ్మద్ సైతం అద్భుతంగా రాణించాడు. ఐరిష్ స్టార్ ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ వికెట్‌తో శుభారంభం అందించిన అతడు మొత్తంగా 3 వికెట్లతో సత్తా చాటాడు. బంగ్లా బౌలర్ల విజృంభణతో నిర్ణీత 17 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ఐర్లాండ్ కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్ అల్ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా బంగ్లా గెలుచుకున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20 స్కోర్లు బంగ్లాదేశ్- 202/3 (17) ఐర్లాండ్- 125/9 (17) చదవండి: David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి.. ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్ జట్టులో సూర్యకు చోటు ఖాయం! ఒక్క సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన.. -
అరుదైన ఫీట్‌తో చరిత్రకెక్కిన బంగ్లా కెప్టెన్
బంగ్లాదేశ్ కెప్టెన్.. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఏడువేల పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన మూడో క్రికెట్‌ర్‌గా రికార్డులకెక్కాడు. శనివారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్ ఈ ఫీట్ అందుకున్నాడు. లంక దిగ్గజం సనత్ జయసూర్య, పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తర్వాత ఆల్‌రౌండర్‌గా షకీబ్ వన్డేల్లో ఏడు వేల పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో షకీబ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 8146 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా షకీబ్ వన్డేల్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. రియాన్ అహ్మద్ వికెట్ ద్వారా ఈ ఫీట్ సాధించిన షకీబ్.. జయసూర్య, వెటోరి తర్వాత 300 వికెట్ల మార్క్ అందుకున్న మూడో లెఫ్టార్మ్ బౌలర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తరపున వన్డేలు, టెస్టులు, టి20లు కలిపి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. షకీబ్ వన్డేల్లో 300 వికెట్లు, టెస్టుల్లో 231 వికెట్లు, టి20ల్లో 128 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ ఐర్లాండ్‌పై 183 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. షకీబ్ 93, తౌఫిర్ హృదోయ్ 92 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 155 పరుగులకే కుప్పకూలింది. Only the second batter to go past 7000 ODI runs for Bangladesh 👏 It's another landmark for Shakib Al Hasan 🏆 #BANvIRE #CricketTwitter pic.twitter.com/RT0XElPQCN — ESPNcricinfo (@ESPNcricinfo) March 18, 2023 చదవండి: బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం -
బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం
ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదున్న బంగ్లాదేశ్ ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ తమ హవా కొనసాగిస్తుంది. తాజాగా శనివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 183 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తమ వన్డే క్రికెట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ బంగ్లా బౌలర్ల దాటికి 30.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో జార్జ్ డాక్రెల్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎబాదత్ హొసెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నసూమ్ అహ్మద్ మూడు, తస్కిన్ అహ్మద్ రెండు, షకీబ్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్(89 బంతుల్లో 93), తౌహిద్ హృదోయ్ (85 బంతుల్లో 92) మెరుపులు మెరిపించగా.. ముష్పికర్ రహీమ్ 44 పరుగులు చేశాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో హ్యూమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కర్టిస్ కాంపెర్, ఆండీ మెక్‌బ్రిన్, మార్క్ అడైర్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో బంగ్లా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 20న జరగనుంది. త్రౌహిద్ హృదోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: All Eng Open: సంచలనాలకు సెమీస్‌లో ముగింపు.. -
కేకేఆర్‌కు మరో బిగ్‌షాక్.. స్టార్ ఆటగాళ్లు దూరం!
ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్‌లు దూరం కానున్నారు. స్వదేశంలో ఐర్లాండ్ సిరీస్ నేపథ్యంలో.. ఐపీఎల్లో పాల్గొనేందుకు షకీబ్, లిటన్ దాస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయలేదు. ఐర్లాండ్ బంగ్లా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ సుదీర్ఘ సిరీస్ మార్చి 18 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. అనంతరం బంగ్లా ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో కలిసే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే కేకేఆర్ తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సేవలను కోల్పోగా.. ఇప్పడు షకీబ్, లిటన్ దాస్ దూరం కావడం నిజంగా బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. అదే విధంగా గాయపడిన శ్రేయస్ స్థానంలో షకీబ్‌ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని కేకేఆర్ మెనెజెమెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో షకీబ్ కూడా దూరం కావడంతో కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడాతరన్నది వేచి చూడాలి. కాగా ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చదవండి: IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ -
బంగ్లాదేశ్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. కాలర్ పట్టి లాగి! వీడియో వైరల్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్, టీ20 కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ జువెలరీ షాపు ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లిన షకీబ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. అతడిని కొంచెం కూడా ముందుకు కదలనివ్వలేదు. తమ ఆరాధ్య క్రికెటర్‌తో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కొంత మంది అతన్ని కాలర్ పట్టి లాగారు. అయితే తనను తాను బ్యాలెన్స్ చేసుకుని షకీబ్ కింద పడకుండా ముందుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే షకీబ్ వంటి స్టార్ క్రికెటర్ షాపు ఓపెనింగ్‌కు వచ్చినప్పుడు.. నిర్వహకులు ఎటువంటి భద్రత కల్పించకపోవడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే విధంగా చిన్న చిన్న విషయాలపై అభిమానులపై కోపంతో ఊగిపోయే షకీబ్.. ఇంత జరిగినా అభిమానులపై కొంచెం సీరియస్ కాకపోవడం గమానార్హం. ఇక ఇది ఇది ఇలా ఉండగా.. అతడి సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం షకీబ్ దుబాయ్ టూర్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. చదవండి: IPL 2023: ఆర్సీబీలోకి విధ్వంసకర ఆల్‌రౌండర్.. ఇక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలే -
ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లా
టి20 ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు టి20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ ముచ్చటగా మూడో టి20 మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. మంగళవారం ఢాకా వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమికి బంగ్లా బదులు తీర్చుకున్నట్లయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లిటన్‌దాస్(57 బంతుల్లో 73, 10 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. షాంటో 47 పరుగులు, రోనీ తలుక్దర్ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్లు చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మలాన్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్ 40 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరు మినహా మిగతవారు రాణించడంలో విఫలం కావడం.. బంగ్లా బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తన్విర్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌లు తలా ఒక వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో రాణించిన లిటన్‌దాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. నజ్ముల్ హొసెన్ షాంటో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. Modhumoti Bank Limited T20i Series: Bangladesh vs England: 3rd T20i A Glimpse of Bangladesh's Bowling ✨#BCB | #Cricket | #BANvENG pic.twitter.com/VhGahbohNe — Bangladesh Cricket (@BCBtigers) March 14, 2023 Congratulation 3.0 Bangladesh #Bangladesh vs #England pic.twitter.com/ftK5pxEQVN — Tayyab Qureshi (@TayyabQ37980603) March 14, 2023 చదవండి: 'ఐపీఎల్ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపిస్తాం' -
జగజ్జేత ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. పసికూనల చేతిలో దారుణ ఓటమి
టీ20 వరల్డ్ ఛాంపియన్, 2022 పొట్టి ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్‌కు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (మార్చి 12) జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో జగజ్జేతను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) ప్రతీకారం తీర్చుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన బంగ్లా పులులు.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఆఖరి వన్డేలో, తొలి రెండు టీ20ల్లో వరుస విజయాలు సాధించారు. సొంతగడ్డపై ప్రత్యర్ధి ఎంతటి వారైనా తిరుగులేని ఆధిప్యతం ప్రదర్శించే బంగ్లా టైగర్స్..అండర్ డాగ్స్‌గా తమపై ఉన్న ముద్రను కొనసాగించారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఇంగ్లండ్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. ఒక్కో పరుగు రాబట్టేందుకు నానా తంటాలు పడింది. బంగ్లా సంచలన స్పిన్నర్ మెహిది హసన్ మీరజ్ (4-0-12-4) ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. తస్కిన్ అహ్మద్ (1/27), ముస్తాఫిజుర్ (1/19), షకీబ్ అల్ హసన్ (1/13), హసన్ మహమూద్ (1/10) తలో చేయి వేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (25), మొయిన్ అలీ (15), బెన్ డక్కెట్ (28), సామ్ కర్రన్ (12), రెహాన్ అహ్మద్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నజ్ముల్ షాంటో (46 నాటౌట్), తౌహిద్ హ్రిదోయ్ (17), మెహిది హసన్ (20) రాణించడంతో సునాయాసంగా విజయతీరాలకు (18.5 ఓవర్లలో 120/6) చేరింది. స్వల్ప లక్ష్యంగా కావడంతో బంగ్లా టైగర్స్ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడారు. ఫలితంగా మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, మొయిన్ అలీ, రెహాన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన మెహిది హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన బంగ్లా..
టి20 క్రికెట్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన నజ్ముల్ హొసెన్ షాంటోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వన్డే సిరీస్‌ను ఓడిపోయామన్న బాధను మనుసులో పెట్టుకున్న బంగ్లా ఇంగ్లండ్‌ను తొలి టి20లో ఓడించి చావుదెబ్బ కొట్టింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ జాస్ బట్లర్(42 బంతుల్లో 67, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్(35 బంతుల్లో 38) మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్ముద్ రెండు వికెట్లు తీయగా.. షకీబ్, నసూమ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. నజ్ముల్ హొసెన్ షాంటో(30 బంతుల్లో 51, 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. తౌహిద్ హృదోయ్ 24 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (24 బంతుల్లో 34 నాటౌట్), అఫిఫ్ హొసెన్ (13 బంతుల్లో 15 నాటౌట్) జట్టున విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఆదివారం(మార్చి 12న) ఢాకా వేదికగా జరగనుంది. Winning moment of 1st T20i match#BCB | #Cricket | #BANvENG pic.twitter.com/bOQIY0sPew — Bangladesh Cricket (@BCBtigers) March 9, 2023 చదవండి: విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా? పరిచయం లేని యువతికి ముద్దులు.. పరువు తీసుకున్న ఫుట్‌బాలర్ -
చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్
వైట్ బాల్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా చలామణి అవుతున్న బంగ్లాదేశ్ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ మరో అరుదైన రికార్డు సాధించాడు. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (మార్చి 6) వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శన ((71 బంతుల్లో 75; 7 ఫోర్లు), (10-0-35-4))తో అదరగొట్టిన షకీబ్.. రెహాన్ అహ్మద్ వికెట్ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా, ఓవరాల్‌గా 14వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో షకీబ్‌కు ముందు కేవలం ఇద్దరు మాత్రమే 200 వన్డే వికెట్ల మైలురాయిని అధిగమించారు. ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు, అబ్దుర్ రజాక్ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టగా.. షకీబ్ 227 వన్డేల్లో 4.45 ఎకానమీ రేట్‌తో 300 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో స్పిన్ దిగ్గజం, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీథరన్ (534) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వసీం అక్రమ్ (502), వకార్ యూనిస్ (416), చమిందా వాస్ (400), షాహిద్ అఫ్రిది (395), షాన్ పొలాక్ (393), గ్లెన్ మెక్‌గ్రాత్ (381), బ్రెట్ లీ (380), లసిత్ మలింగ (338), అనిల్ కుంబ్లే (337), సనత్ జయసూర్య (323), జవగల్ శ్రీనాథ్ (315), డేనియల్ వెటోరీ (305), షకీబ్ అల్ హసన్ (300), షేన్ వార్న్ (293) వరుసగా 2 నుంచి 15 స్థానాల్లో ఉన్నారు. బంగ్లా-ఇంగ్లండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ తొలి రెండు వన్డేల్లో గెలుపొందడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. షాంటో (50), ముష్ఫికర్ రహీమ్ (70), షకీబ్ (75) అర్ధసెంచరీలతో రాణించారు. జోప్రా ఆర్చర్ 3, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు, క్రిస్ వోక్స్, రెహాన్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ఇంగ్లండ్.. షకీబ్ (4/35) విజృంబించడంతో 43.1 ఓవర్లలో 196 పరగులకు ఆలౌటై 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా పర్యటనలో ఇంగ్లండ్ తదుపరి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మార్చి 9, 12, 14 తేదీల్లో 3 టీ20లు జరుగనున్నాయి. -
షకీబ్ ఆల్‌రౌండ్ షో.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఛటోగ్రామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తద్వారా వైట్‌వాష్ నుంచి బంగ్లా తప్పించుకుంది. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. తైజుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్హసన్(75), రహీం(70), షాంటో హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు, సామ్ కుర్రాన్, రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా.. ఈ సిరీస్ అసాంతం అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. చదవండి: SA vs WI: దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్.. బవుమాపై వేటు! -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత
Bangladesh Premier League 2023: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. రంగ్‌పూర్ రైడర్స్‌తో ఇవాళ (జనవరి 19) జరుగుతున్న మ్యాచ్‌లో ఫార్చూన్ బారిషల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతని జతగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (43 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో ఫార్చూన్ బారిషల్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది బీపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక టీమ్ టోటల్‌గా రికార్డుల్లోకెక్కింది. 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జత కట్టిన ఇఫ్తికార్-షకీబ్ ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో అజేయమైన 192 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇఫ్తికార్-షకీబ్ జోడీ ఇన్నింగ్స్ ఆఖరి 3 ఓవర్లలో (18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 24, 20వ ఓవర్లో 27) నమ్మశక్యం కాని రీతిలో 73 పరుగులు జోడించి బీపీఎల్‌లో చరిత్ర సృష్టించింది. ఇఫ్తికార్-షకీబ్ జోడీ.. ప్రత్యర్ధి స్పిన్నర్లను ఊచకోత కోసింది. కాగా, బీపీఎల్ ప్రస్తుత సీజన్లో షకీబ్ సారధ్యంలోని ఫార్చూన్ బారిషల్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. టాప్ ప్లేస్‌లో సిల్హెట్ స్ట్రయికర్స్ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు) టీమ్ ఉంది. కొమిల్లా విక్టోరియన్స్, రంగ్‌పూర్ రైడర్స్, చట్టోగ్రామ్ ఛాలెంజర్స్, ఖుల్నా టైగర్స్, ఢాకా డామినేటర్స్ వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఈ లీగ్‌లో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు కొందరు భారత ఆటగాళ్లు (బీసీసీఐతో సంబంధం లేని వాళ్లు) కూడా పాల్గొంటున్నారు. -
వైడ్ ఇవ్వలేదని అంపైర్ మీదకు వెళ్లిన షకీబ్.. ఇదేమి బుద్దిరా బాబు!
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షకీబ్ దురుసు ప్రవర్తను ప్రదర్శించాడు. వైడ్‌బాల్ విషయంలో అంపైర్‌తో వాగ్వాదానికి షకీబ్ దిగాడు. బీపీఎల్-2023లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? బీపీఎల్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌కు షకీబ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఫార్చ్యూన్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో రెహమాన్ రాజా వేసిన ఒక షార్ట్ బాల్ షకీబ్ పై నుంచి వెళ్లింది. అయితే అంపైర్ దాన్ని తొలి బౌన్సర్‌గా సిగ్నిల్ ఇచ్చాడు. షకీబ్ మాత్రం అది ఎలా బౌన్సర్ అవుతుందని లెగ్ అంపైర్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతడు లెగ్ అంపైర్‌పై గట్టిగా అరుస్తూ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సరైన వివరణ ఇవ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ క్రీజులోకి వెళ్లిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకు ముందు 2021లో ఢాకా ప్రీమియర్‌లో కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు. అప్పటిల్లో అది తీవ్ర వివాదాస్పదకావడంతో షకీబ్ క్షమాపణలు కూడా తెలిపాడు. Shakib Al Hasan - the man the myth the umpire’s nightmare pic.twitter.com/wKQnb3wNUH — adi ✨🇧🇩 (@notanotheradi) January 7, 2023 చదవండి: Rishabh Pant: బీసీసీఐ మంచి మనసు.. పంత్ క్రికెట్ ఆడకపోయినా ఫుల్ సాలరీ! -
45 పరుగులకే నాలుగు వికెట్లు.. టీమిండియా గెలిచేనా!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికి టీమిండియా 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా టాపార్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. కేఎల్ రాహుల్ 2 పరుగులు చేసి ఔటవ్వగా.. శుబ్‌మన్ గిల్ ఏడు పరుగులు, పుజారా ఆరు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నారు. ఇక కోహ్లి 22 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నప్పటికి పిచ్ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తుండడంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్షర్ పటేల్(22 పరుగులు బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన జయదేవ్ ఉనాద్కట్ 3 పరుగులుతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా విజయానికి మరో 100 పరుగుల దూరంలో ఉంది. అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 71 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. జాకీర్ హసన్ 51 పరుగులు చేశాడు. ఇక నురుల్ హసన్, తస్కిన్ అహ్మద్‌లు తలా 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
విజయం దిశగా.. టీమిండియా టార్గెట్ 145
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా విజయం దిశగా పయనిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా టార్గెట్ 145 పరుగులుగా ఉంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 71 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. జాకీర్ హసన్ 51 పరుగులు చేశాడు. ఇక నురుల్ హసన్, తస్కిన్ అహ్మద్‌లు తలా 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వికెట్ నష్టానికి మూడు పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో నురుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉండడం.. టార్గెట్ చిన్నది కావడంతో టీమిండియా విజయం దాదాపు ఖరారైనట్లే. -
టాపార్డర్ విఫలం.. మెరిసిన పంత్, అయ్యర్.. భారత్ స్కోరెంతంటే!
Ind vs Ban- 2nd Test- Day 2- Rishabh Pant- Shreyas Iyer: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 80 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మిడిలార్డర్ బ్యాటర్లు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ పంత్, అయ్యర్ తమ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. ఆదిలోనే వికెట్లు.. దెబ్బకొట్టిన తైజుల్ 19 పరుగుల వద్ద రెండో రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాను ఆదిలోనే దెబ్బకొట్టాడు బంగ్లా స్పిన్నర్ తైజుల్ అస్లాం. కెప్టెన్ కేఎల్ రాహుల్(10) సహా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(20)ను ఎల్బీడబ్ల్యూ చేసి భారత్‌కు షాకిచ్చాడు. తర్వాత పుజారా(24) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఐదో స్థానంలో వచ్చిన రిషభ్ పంత్.. విరాట్ కోహ్లికి సహకారం అందించాడు. అయితే, మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో కోహ్లి 24 పరుగుల వద్ద నిష్క్రమించాడు. దీంతో పంత్‌పై బాధ్యత పెరిగింది. పంత్, అయ్యర్ అర్ధ శతకాలు అందుకు తగ్గట్టుగానే మరో ఎండ్ నుంచి సహకారం అందడంతో పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. సెంచరీ చేజారినప్పటికీ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ 105 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టీమిండియా త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. అయ్యర్ సహా అక్షర్ పటేల్(4), అశ్విన్(12), సిరాజ్ (7 ) వికెట్లను బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్నర్లు హిట్ ఉమేశ్ యాదవ్(14)ను తైజుల్ అస్లాం పెవిలియన్‌కు పంపగా.. ఉనాద్కట్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 314 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై షకీబ్, తైజుల్ నాలుగేసి వికెట్లు తీయగా.. పేసర్ టస్కిన్ అహ్మద్ 1, స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక మిర్పూర్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 80 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: Ben Stokes: చెన్నై తదుపరి కెప్టెన్‌గా స్టోక్స్!? ఏకంగా 16 కోట్లకు..! ఛాన్స్ మిస్ చేశారంటున్న ఆరెంజ్ ఆర్మీ! Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే.. -
బౌలర్ల విజృంభణ.. తొలి రోజు టీమిండియా ఆధిపత్యం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు (డిసెంబర్ 22) టీమిండియా ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) కట్టడి చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు (8 ఓవర్లలో) చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్), కేఎల్ రాహుల్ (30 బంతుల్లో 3 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. -
చెలరేగిన ఉమేశ్, సత్తా చాటిన అశ్విన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన బంగ్లాదేశ్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) ఆలౌట్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అలాగే, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్‌ను చాలా సిరీయస్‌గా తీసుకుంది. -
Ind VS Ban: బంగ్లాతో టెస్టు.. టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి..
Bangladesh vs India, 2nd Test- Playing XI: సిరీస్ గెలవడమే లక్ష్యంగా రెండో టెస్టు బరిలోకి దిగిన భారత తుది జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో 8 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌ను తప్పించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ చైనామన్ స్పిన్నర్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనాద్కట్ జట్టులోకి వచ్చాడు. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌తో పాటు ఈ లెఫ్టార్మ్ పేసర్ కూడా బంగ్లాతో రెండో టెస్టులో భాగమయ్యాడు. మరోవైపు తొలి టెస్టులో రాణించిన స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌ను కొనసాగించారు. దీంతో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగినట్లయింది. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్ నేపథ్యంలో 12 ఏళ్ల తర్వాత జయదేవ్ టెస్టు జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మొమినుల్ స్థానంలో మోమినుల్ , ఇబాదత్ హొసేన్ స్థానంలో టస్కిన్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. అందుకే కుల్దీప్ అవుట్: రాహుల్ టాస్ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్‌ను తప్పించడం దురదృష్టకర నిర్ణయమని అయితే, జయదేవ్‌కు అవకాశం ఇవ్వడానికే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తాము టాస్ గెలిచినా ముందు బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ రెండో టెస్టు- తుది జట్లు ఇవే భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనాద్కట్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్. బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, జాకీర్ హసన్, మోమినుల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), నూరుల్ హసన్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, టస్కిన్ అహ్మద్. చదవండి: BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
IND VS BAN 2nd Test: కెప్టెన్ ఆడతాడు.. క్లారిటీ ఇచ్చిన కోచ్
Shakib Available For Dhaka Test: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టీమిండియాతో రేపటి (డిసెంబర్ 22) నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ ఇవాళ (డిసెంబర్ 21) స్పందించాడు. షకీబ్ రెండో టెస్ట్‌లో తప్పక బరిలోకి దిగుతాడని, అతను బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని క్లారిటీ ఇచ్చాడు. పక్కటెముకలు, భుజం నొప్పితో బాధపడిన షకీబ్ ప్రస్తుతం కోలుకున్నాడని, రెండో టెస్ట్ కోసం అతను సెలెక్టర్లకు అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాడు. ఒకవేళ షకీబ్ బౌలింగ్ చేయలేకపోతే తుది జట్టు కూర్పులో చాలా సమస్యలు వస్తాయని, అలా జరిగితే అదనంగా స్పిన్నర్‌కు తీసుకోవాల్సి వస్తుందని, ఈ సమస్యకు తావు లేకుండానే షకీబ్ కోలుకోవడం ఆతిధ్య జట్టుకు ఊరట కలిగించే అంశమని డొనాల్డ్ వివరణ ఇచ్చాడు. కాగా, టీమిండియాతో రెండో వన్డే సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో గాయపడిన షకీబ్.. గాయం పూర్తిగా మానకపోయినా తొలి టెస్ట్ బరిలోదిగాడు. కేవలం బ్యాటర్‌గానే తొలి టెస్ట్ ఆడిన షకీబ్.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దీంతో గాయం తీవ్రత మరింత పెరిగిందని తొలి టెస్ట్ అనంతరం వైద్యులు తెలిపారు. అయితే షకీబ్.. ఈ మధ్యలో దొరికిన గ్యాప్‌లో పూర్తిగా కోలుకున్నాడని, రెండు టెస్ట్‌లో అతను ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తాడని ఆ జట్టు బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే, చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది. రెండో టెస్ట్‌కు భారత జట్టు.. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్ జట్టు.. మహ్ముదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, మోమినుల్ హాక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, జకీర్ హసన్, రెజౌర్ రహ్మాన్ రజా -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. కెప్టెన్ సహా కీలక బౌలర్ ఔట్
టీమిండియాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ ఓడిపోయి బాధలో ఉన్న బంగ్లాదేశ్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఢాకాలోని మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ నుంచి ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సహా కీలక బౌలర్ ఎబాదత్ హొస్సేన్ తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. గాయాల కారణంగా వీరిద్దరు తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేకపోయారు. టీమిండియాతో రెండో వన్డే సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో గాయపడిన షకీబ్.. గాయం పూర్తిగా మానకపోయినా తొలి టెస్ట్ బరిలోదిగాడు. పక్కటెముకలు, భుజం నొప్పితో బాధపడుతున్న షకీబ్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి టెస్ట్ అనంతరం గాయం తీవ్రత పెరగడంతో షకీబ్ రెండో టెస్ట్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్ కూడా చేయలేనని షకీబ్ తేల్చిచెప్పడంతో బీసీబీ అతన్ని తప్పించక తప్పట్లేదు. మరోవైపు వెన్నునొప్పితో బాధపడుతున్న ఎబాదత్ హొస్సేన్ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో అతన్ని తప్పిస్తున్నట్లు బంగ్లా కోచ్ రస్సెల్ డొమింగో తొలి టెస్ట్ అనంతరమే ప్రకటించాడు. షకీబ్, ఎబాదత్ గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నసుమ్ అహ్మద్‌ను 15 మంది సభ్యుల జట్టులోకి ఇంక్లూడ్ చేసింది. జట్టులోకి మాజీ టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హాక్ కూడా చేరాడు. షకీబ్ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు లిట్టన్ దాస్ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది. రెండో టెస్ట్‌కు భారత జట్టు.. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్ జట్టు.. మహ్ముదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, మోమినుల్ హాక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, జకీర్ హసన్, రెజౌర్ రహ్మాన్ రజా -
టీమిండియాతో తొలి టెస్టు.. బంగ్లాదేశ్ టార్గెట్ 512
తొలి టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ ముందు 512 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా(102 నాటౌట్)తో పాటు ఓపెనర్ శుబ్‌మన్ గిల్(110 పరుగులు) సెంచరీలతో చెలరేగారు. అంతకముందు టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ముష్పికర్ రహీమ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్ 3, ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్‌లు చెరొక వికెట్ తీశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. -
ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ .. 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
ఛాటోగ్రామ్ వేదికగా భారత్‌తో జరుగతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక 133-8 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్.. ఆదనంగా మరో 17 పరుగులు చేసి ఆలౌటైంది. భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు కీలక వికెట్ల పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. ఇక బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముషిఫికర్ రహీం 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లో ఛతేశ్వర్ పుజారా(90), శ్రేయస్ అయ్యర్(86) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: తొలి మ్యాచ్‌లోనే కొడుకు సెంచరీ.. సచిన్ టెండూల్కర్ ఎమన్నాడంటే? -
టెస్టు క్రికెట్ రూల్ బ్రేక్ చేసిన టీమిండియా.. మార్పు గమనించారా!?
సంప్రదాయమైన టెస్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఏ జట్టైనా పూర్తి తెలుపు జెర్సీతోనే బరిలోకి దిగడం ఆనవాయితీ. అయితే తాజాగా టీమిండియా టెస్టు క్రికెట్ రూల్‌ను బ్రేక్ చేసింది. టెస్టుల్లో ఎప్పుడు తెల్ల జెర్సీతోనే ఆడిన టీమిండియా బంగ్లాదేశ్‌తో తొలిటెస్టులో మాత్రం సగం వైట్ జెర్సీతో(ముదురు గోదుమ రంగు) బరిలోకి దిగింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే భారత అభిమానులు ఈ విషయాన్ని గుర్తించి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అయితే బీసీసీఐ జెర్సీ రంగును ఎందుకు మార్చిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ టీమిండియా ఫ్యాన్స్ మాత్రం.. టీమిండియాను పాత వైట్ జెర్సీల్లోనే చూడాలని ఉందని.. ఇలా రంగు మారిస్తే మిగతా జట్లకు.. మనకు తేడా కనిపిస్తుందని.. కొత్త జెర్సీ స్థానంలో పాతవాటినే తిరిగి తేవాలని డిమాండ్ చేయడం కొసమెరుపు. ఇక బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో అజేయంగా ఆడుతున్నాడు. పుజరా 90 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రిషబ్ పంత్(46), శ్రేయాస్ అయ్యర్(82 నాటౌట్)తో కలిసి పుజారా మంచి భాగస్వామ్యాలు నిర్మించాడు. ముఖ్యంగా అయ్యర్, పుజారాలు కలిసి ఏదో వికెట్‌కు 149 పరుగులు జోడించారు. వీరిద్దరి ఇన్నింగ్స్‌తోనే టీమిండియా తొలిరోజు ఆట సవ్యంగా సాగింది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు. India's jersey has changed from pure white to off-white? 🤔 — Naman Agarwal (@CoverDrivenFor4) December 14, 2022 చదవండి: FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్.. పర్వాలేదనిపించిన పంత్ -
Ind Vs Ban: బంగ్లాతో భారత్ టెస్టు మ్యాచ్.. తుది జట్టులో ఎవరెవరంటే!
India tour of Bangladesh, 2022 - Bangladesh vs India, 1st Test: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్- టీమిండియా మధ్య బుధవారం(డిసెంబరు 14) తొలి టెస్టు ఆరంభమైంది. ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఛతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్. ఇక ఈ మ్యాచ్‌లో నెగ్గి శుభారంభం చేస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ దిశగా వెళ్లేందుకు టీమిండియాకు మార్గం సుగమమవుతుంది. బంగ్లాతో మొదటి టెస్టులో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కగా... స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, అక్షర్ పటేల్ స్థానం దక్కించుకున్నారు. రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగడంతో తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు పేసర్లు ఉమేశ్ యాదవ్, సిరాజ్‌తో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్‌తో కలిసి రాహుల్ ఓపెనింగ్‌కు వచ్చాడు. తుది జట్లు ఇవే టీమిండియా: శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్ జాకిర్ హసన్, నజ్ముల్ హొసేన్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీం, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఇబాదత్ హొసేన్. చదవండి: Lionel Messi: ఫైనల్లో అర్జెంటీనా.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ! వారెవ్వా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో FIFA World Cup Qatar 2022 Semi-Final: అందరి కళ్లు మొరాకో పైనే... అలా అయితేనే ముందుకు.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించేందుకు భారత్‌కు ఆరు టెస్టు మ్యాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కనీసం ఐదు గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా ముందంజ వేస్తుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల్లో తలపడటానికి ముందు బలహీన బంగ్లాదేశ్‌పై చెలరేగి సాధ్యమైనన్ని ఎక్కువ పాయింట్లు ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే సొంతగడ్డపై ఇటీవలే మన జట్టును వన్డే సిరీస్‌లో ఓడించి ఊపు మీదున్న బంగ్లాదేశ్ ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో నేటి నుంచి తొలి టెస్టుకు రంగం సిద్ధమైంది. రోహిత్ శర్మ అనూహ్యంగా గాయంతో దూరం... బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలాంటి సీనియర్ బౌలర్లు అందుబాటులో లేరు... ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో తడబడుతున్న కేఎల్ రాహుల్ ఇప్పుడు బ్యాటింగ్‌తో పాటు కెపె్టన్సీలో రాణించాల్సిన అవసరం... ఇలాంటి పరిస్థితుల మధ్య భారత జట్టు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో తలపడుతోంది. వన్డే సిరీస్ ఫలితం చూసిన తర్వాత బంగ్లాను తేలిగ్గా తీసుకోరాదనే విషయం స్పష్టమైంది. ప్రధానంగా సీనియర్ ఆటగాళ్లను నమ్ముకున్న బంగ్లా టెస్టుల్లో భారత్‌ను ఇప్పటి వరకు ఓడించకపోయినా... సంచలనానికి సై అంటోంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆట సాగుతున్న కొద్దీ స్పిన్ ప్రభావం చూపిస్తుంది. సీనియర్లపైనే భారం... వన్డేలు, టి20ల్లో సొంతగడ్డపై ఘనమైన రికార్డు ఉన్నా... గత కొంత కాలంగా బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపై టెస్టులు మాత్రం అచ్చి రాలేదు. 2021 జనవరి నుంచి ఆరు టెస్టులు ఆడిన ఆ జట్టు 5 ఓడిపోయి, ఒకటి ‘డ్రా’ చేసుకోగలిగింది. అయితే ఇటీవల పరిమిత ఓవర్ల ప్రదర్శన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేయలేని పరిమిత బౌలింగ్ వనరులు ఉన్నా, బ్యాటింగ్ బలంతో జట్టు కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. షకీబ్, దాస్‌తో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా, బంగ్లా దేశవాళీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన జాకీర్ హసన్ ఓపెనర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. ఇబాదత్, ఖాలెద్, షరీఫుల్ పేస్ బౌలింగ్ భారం మోస్తుండగా, ప్రధాన స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ భారత్‌ను ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఇక భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 11 టెస్టులు జరిగాయి. భారత్ 9 టెస్టుల్లో గెలుపొందగా... రెండు ‘డ్రా’గా ముగిశాయి. -
టీమిండియాతో తొలి టెస్ట్.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్
2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఆతిధ్య బంగ్లాదేశ్ ఉరకలేస్తుండగా.. ఎలాగైనా టెస్ట్ సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్ నేతృత్వంలో బరిలోకి దిగుతుండగా, బంగ్లాదేశ్.. షకీబ్ అల్ హసన్ సారధ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా బంగ్లా కెప్టెన్ గాయపడినప్పటికీ, అతని గాయం అంత తీవ్రమైందని కాదని తేలడంతో బంగ్లా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. షకీబ్ గాయంపై క్షేమ సమాచారం అందుకున్న బంగ్లా అభిమానులకు ఈ వార్త తెలిసే లోపే మరో షాకింగ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ టస్కిన్ అహ్మద్ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని ఆ జట్టు కోచ్ రస్సెల్ డొమింగో స్పష్టం చేశాడు. టీమిండియాతో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన టస్కిన్ పూర్తిగా కోలుకోలేదని, ఈ పరిస్థితుల్లో అతన్ని బరిలోకి దించే రిస్క్ చేయలేమని డొమింగో తెలిపాడు. ఇటీవలి కాలంలో టస్కిన్.. బంగ్లాదేశ్ కీలక బౌలర్‌గా ఎదిగాడు. బంగ్లా తరఫున 11 టెస్ట్‌లు, 52 వన్డేలు, 46 టీ20లు ఆడిన టస్కిన్.. మొత్తం 130 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దెబ్బకు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆసుపత్రి బాట పట్టాడు. ప్రాక్టీస్‌లో భాగంగా ఉమ్రాన్ వేసిన ఓ బంతి షకీబ్ ఛాతికి బలంగా తాకడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయానికి స్టేడియంకి సంబంధించిన ఎలాంటి వాహనాలు లేకపోవడంతో షకీబ్‌ను ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. భారత్: శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ బంగ్లాదేశ్: మహ్మదుల్ హసన్ జాయ్, మొమినుల్ హాక్, నజ్ముల్ హొసేన్ షాంటో, యాసిర్ అలీ, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, నురుల్ హసన్, జాకీర్ హసన్, మెహిది హసన్ మీరజ్, అనాముల్ హాక్, తైజుల్ ఇస్లాం, టస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, ఎబాదత్ హొస్సేన్, రహ్మాన్ రజా -
బంగ్లాదేశ్ కెప్టెన్‌కు ఏమైంది? స్టేడియంలోకి అంబులెన్స్! ఆసుపత్రికి తరలింపు
టీమిండియాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్.. ఇప్పుడు టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఛాటోగ్రామ్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో భాగంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా షకీబ్ తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. కాగా స్టేడియం దగ్గరలో ఇతర వాహనాలు ఏవీ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. దీంతో బంగ్లా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. "షకీబ్ గాయం అంత తీవ్రమైనది కాదు. ఇతర ఇతర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేనందున అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపాల్సి వచ్చింది. అతడికి కండరాలు పట్టేశాయి. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. షకీబ్ తిరిగి ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌కు జట్టుతో చేరుతాడు" అని బీసీబీ అధికారి పేర్కొన్నారు. కాగా టీమిండియాతో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ సొంతం చేసుకోవడంలో షకీబ్ కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్ట్‌కు బంగ్లాదేశ్ జట్టు: షకీబుల్ హసన్ (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హసన్ షాంటో, మోమినుల్ హక్, యాసిర్ అలీ చౌదరీ, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, నురుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, జాకిర్ హసన్, రెజావుర్ రెహమాన్, అనాముల్ హక్ బిజోయ్ చదవండి: ENG vs PAK: పాపం బాబర్ ఆజం.. ఇంగ్లండ్ బౌలర్ దెబ్బకు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ -
WTC Final: పాక్ అవుట్.. మరి టీమిండియా? ఫైనల్ రేసులో నిలవాలంటే అదొక్కటే దారి!
Bangladesh vs India, 1st Test- World Test Championship 2021-23- చటోగ్రామ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనలే లక్ష్యంగా పెట్టుకున్న తమకు ప్రతీ టెస్టు మ్యాచ్ కీలకమని భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు 14 నుంచి ఇక్కడే జరుగుతుంది. సోమవారం టెస్టు సిరీస్ ట్రోఫీని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, భారత సారథి కేఎల్ రాహుల్ ఆవిష్కరించారు. రేసులో నిలవాలంటే.. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే మేం దూకుడు కొనసాగించాలి. ప్రతీ మ్యాచే కాదు... మ్యాచ్‌లోని ప్రతీ రోజు, ప్రతీ సెషన్‌పై బేరీజు వేసుకొని ముందుకు సాగుతాము’ అని రాహుల్ అన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ గాయంతో దూరం కావడంపై రాహుల్ స్పందిస్తూ... ‘కెప్టెన్ రోహిత్ జట్టులో కీలకమే కాదు... ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడు. తొలి టెస్టుకు అతడు లేకపోవడం లోటే! అయితే రెండో టెస్టుకల్లా అతను కోలుకుంటాడని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. పాక్ అవుట్... మరి టీమిండియా? వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో ప్రస్తుతం భారత్ 52.08 శాతం పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (75 శాతం), దక్షిణాఫ్రికా (60 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఫైనల్ రేసులో నిలవాలంటే బంగ్లాదేశ్ పర్యటన సహా స్వదేశంలో వచ్చే ఏడాది జరుగనున్న ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరచాలి. వరుస విజయాలు సాధిస్తే గనుక ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్-2కు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు.. స్వదేశంలో రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్ గెలిచిన స్టోక్స్ బృందం 22 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఈ ఫీట్ నమోదు చేసింది. చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ, అతడి స్థానంలో..! IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం -
టీమిండియాతో తొలి టెస్టు.. బంగ్లా జట్టు ఇదే
టీమిండియతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. శనివారం(డిసెంబర్ 10న) మూడో వన్డే జరగనుండగా.. టీమిండియా మాత్రం విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇక బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) వన్డే సిరీస్ తర్వాత జరగనున్న టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించింది. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ జట్టును నడిపించనుండగా.. సీనియర్ ప్లేయర్స్ ముష్పికర్ రహీమ్, తస్కిన్ అహ్మద్‌లు తుది జట్టులోకి తిరిగి వచ్చారు. గాయం కారణంగా తస్కిన్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ సమయానికి తస్కిన్ పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేడో తెలియకపోయినా అతన్ని ఎంపిక చేశారు. ఇక శనివారం మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబర్ 14 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకూ చట్టోగ్రామ్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 22 నుంచి 26 వరకూ రెండో టెస్ట్ మీర్పూర్లో జరగనుంది. తొలి టెస్ట్‌కు బంగ్లాదేశ్ జట్టు: షకీబుల్ హసన్ (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హసన్ షాంటో, మోమినుల్ హక్, యాసిర్ అలీ చౌదరీ, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, నురుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, జాకిర్ హసన్, రెజావుర్ రెహమాన్, అనాముల్ హక్ బిజోయ్ The Bangladesh Cricket Board (BCB) announces the squad for the first Test against India starting at ZACS, Chattogram on 14 December 2022.#BCB | #Cricket | #BANvIND pic.twitter.com/inCCqvH0NM — Bangladesh Cricket (@BCBtigers) December 8, 2022 -
షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం..
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అదే విధంగా కేఎల్ రాహుల్ కీలక సమయంలో క్యాచ్ జారవిడిచడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. అయితే బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టుపై ఓటమిని అభిమానులతో పాటు మాజీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కొంత మంది టీమిండియాకు మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంత మంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌ను అర్ధం చేసుకోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన షకీబ్ బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. "షకీబ్ అల్ హసన్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించాడు. అయితే అతడు చాలా ఏళ్లుగా జట్టుతో ఉన్నాడు. ఐపీఎల్ కూడా ఆడుతున్నాడు. అయినప్పటికీ అతడి బౌలింగ్ ఎలా ఉంటుందో, అతడిని ఎలా ఎదుర్కోవాలో భారత బ్యాటర్లకు ఇంకా అర్థం కాలేదా? వాళ్లెందుకిలా చేశారో తెలియదు. ఇలాంటి సమయంలో బంతి పిచ్‌పై పడిన వెంటనే టర్న్ అవుతుందన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. కానీ టీమిండియా క్రికెటర్లు ఆ విషయం తెలుసుకో లేకపోయారు" అంటూ తన యూట్యూబ్ ఛానల్లో కనేరియా పేర్కొన్నాడు. చదవండి: PAK vs ENG: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్.. -
టీమిండియాపై షకీబ్ సరి కొత్త చరిత్ర.. తొలి స్పిన్నర్‌గా
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా జట్టు 9 వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా బంగ్లాదేశ్ విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తన స్పిన్ మాయాజాలంతో షకీబ్ ముప్పుతిప్పులు పెట్టాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 36 పరుగులు ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా లక్ష్య చేధనలో కూడా షకీబ్ 29 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. టీమిండియాపై అరుదైన ఘనత ఇక ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టిన షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో భారత్‌పై ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబ్ రికార్డులకెక్కాడు. అదే విధంగా ఓవరాల్‌గా టీమిండియాపై వన్డే మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించిన ఎనిమిదో స్పిన్నర్‌గా షకీబ్ నిలిచాడు. గతంలో ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్, యాష్లే గైల్స్, అజంతా మొండిస్, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో మరో రికార్డును షకీబ్ తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేలో భారత్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి లెఫ్ట్మ్ ఆర్మ్ స్పిన్నర్‌గా షకీబ్ అల్ హసన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ యాష్లే గైల్స్ పేరిట ఉండేది. 2002లో ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన వన్డేలో గైల్స్ 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. చదవండి: మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ -
ఫ్లయింగ్ కింగ్ 'కోహ్లి'.. కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్
Virat Kohli: పరుగుల యంత్రం, బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి.. ఫీల్డింగ్‌లోనూ కింగ్ అనిపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఓ అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్ 3వ బంతికి కళ్లు చెదిరే ఫ్లయింగ్ క్యాచ్ అందుకున్న కోహ్లి.. అప్పటికే సెట్ అయిన కీలక ప్లేయర్ షకీబ్ అల్ హసన్ (29)ను పెవిలియన్‌కు సాగనంపాడు. విరాట్ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కింగేనని అభిమానులు అభినందిస్తున్నారు. Brilliant by #ViratKohli 🦅#INDvsBAN #BANvIND #CricketTwitter pic.twitter.com/LLfKEBUfq5 — Rohit Yadav (@rohityadav1098) December 4, 2022 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. బంగ్లా గెలవాలంటే 70 బంతుల్లో మరో 53 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో కొత్త బ్యాటర్లు మెహిది హసన్ (0), ఎబాదత్ హొస్సేన్ (0) ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
టీమిండియాను తిప్పేసిన షకీబ్.. దెబ్బకొట్టిన ఎబాదత్
3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చెందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టాడు. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన షకీబ్.. 2 మెయిడిన్లు వేసి కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కెరీర్లో 2వ వన్డే ఆడుతున్న పేసర్ ఎబాదత్ హొస్సేన్ 8.2 ఓవర్లు వేసి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌లను పెవిలియన్‌కు పంపాడు. శిఖర్ ధవన్ వికెట్ హసన్ మిరాజ్‌కు దక్కింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహముద్ సైతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 7 ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హసన్ మహముద్ 7 ఓవర్లలో మెయిడిన్ వేసి 40 పరుగులు సమర్పించుకున్నాడు. -
భారత్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు
స్వదేశంలో భారత్‌తో వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ పేసర్ షోరిఫుల్ ఇస్లాంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మొసద్దెక్ హొస్సేన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. గత మరోవైపు జింబాబ్వేతో వైట్ బాల్ సిరీస్‌కు దూరమైన షకీబ్ ఆల్ హసన్ తిరిగి భారత్ సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఇక హోం సిరీస్‌లో భాగంగా బంగ్లా జట్టు టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: IND vs NZ 1st ODI:తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. యువ బౌలర్లు ఎంట్రీ! సంజూకి ఛాన్స్ -
థర్డ్ అంపైర్ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌కు శాపం
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో ఒకపక్క వరుణుడు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో బ్యాటర్లు బలవుతున్నారు. తాజాగా ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నాలుగో బంతికి షకీబ్ ఎల్బీగా వెనుదిరిగాడు. స్పిన్నర్ షాదాబ్ వేసిన ఈ ఓవర్లో మొదట సౌమ్యా సర్కార్ ఔట్ అవగా తర్వాతి బంతికే షకీబ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో పాక్ ఆటగాళ్లు అప్పీ్ల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా షకీబ్ రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో బంతికి ముందుగా బ్యాట్ ను తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టంగా స్పైక్ కనిపించింది. ఆ తర్వాతే బంతి షకీబ్ ప్యాడ్లను తాకింది. కానీ, ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చినట్టు పేర్కొన్నాడు. కానీ, స్పైక్ వచ్చిన సమయంలో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ టీవీ రీప్లేల్లో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లా కెప్టెన్ షకీబ్ షాకయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి ఏం చేయలేక నిరాశతో మైదానం వీడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. దీంతో బంగ్లాదేశ్ పెద్దగా స్కోరు చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో పాకిస్తా్న్ అనూహ్యంగా సెమీస్‌లో అడుగుపెట్టగా.. బంగ్లాదేశ్ ఓటమితో ఇంటిబాట పట్టింది. Shakib’s bat didn’t touch the ground at all. Just focus on bat’s shadow. There was a spike. It couldn’t have been anything else except the ball hitting the bat. Bangladesh at the receiving end of a poor umpiring decision. #PakvBan #T20WorldCup — Aakash Chopra (@cricketaakash) November 6, 2022 Big moment in the match. Looked like Shakib Al Hasan edged it. The umpiring in this tournament hasn't been great#T20WorldCup #PAKvBAN pic.twitter.com/4zoJcVVPkm — Saj Sadiq (@SajSadiqCricket) November 6, 2022 చదవండి: ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh: ‘‘ఒక వికెట్ నష్టానికి 70 పరుగులతో పటిష్టంగానే కనిపించాం. ఈ పిచ్‌పై 145- 150 వరకు స్కోరు చేయగలం అనుకున్నాం. రాను రాను పిచ్ ప్రతికూలంగా మారుతుందనిపించడంతో పట్టుదలగా నిలబడాలనుకున్నాం. కానీ త్వరత్వరగా వికెట్లు పడ్డాయి’’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి నేపథ్యంలో సెమీస్‌పై ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ చేతిలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో ఆదివారం నాటి ఈ కీలక మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొంది సెమీస్ చేరగా.. షకీబ్ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే అత్యుత్తమం ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. మిగతా వరల్డ్‌కప్ టోర్నీలతో పోలిస్తే ఈ ఎడిషన్‌లో తాము అత్యుత్తమ ప్రదర్శన కనబరిచామన్నాడు. అయితే, ఇంకాస్త మెరుగ్గా ఆడితే సెమీస్‌కు చేరే వాళ్లమని, కానీ అలా జరుగలేదని విచారం వ్యక్తం చేశాడు. వ్యక్తిగతంగా తన ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేనన్న ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఫిట్‌గా ఉన్నంత కాలం క్రికెట్ ఆడుతూనే ఉంటానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షాంటో 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ వివాదస్పద రీతిలో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక బౌలింగ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన అతడు.. 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. కాగా గ్రూప్-2 నుంచి భారత్- పాకిస్తాన్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. చదవండి: Temba Bavuma: ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం! ప్రధాన కారణం అదే View this post on Instagram A post shared by ICC (@icc) -
బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీస్‌లో పాకిస్తాన్ (ఫొటోలు)
-
Pak Vs Ban: బంగ్లాదేశ్ ఇంటికి.. సెమీస్‌లో టీమిండియా, పాకిస్తాన్
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh: అనూహ్య పరిస్థితుల నడుమ పాకిస్తాన్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్‌కప్-2022 సూపర్-12లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బంగ్లాపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్-2 నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఒక్కడు మాత్రమే సెమీస్ రేసులో భాగంగా అడిలైడ్ వేదికగా ఆదివారం పాకిస్తాన్- బంగ్లాదేశ్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఓపెనర్ షాంటో శుభారంభం అందించాడు. 48 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేయగలిగాడు. కానీ మరో ఓపెనర్, భారత్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన లిటన్ దాస్ 10 పరుగులకే పరిమితమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సౌమ్య సర్కార్ 20 పరుగులు చేయగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వివాదస్పద రీతిలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిగతా బ్యాటర్లలో అఫిఫ్ హొసేన్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది బంగ్లాదేశ్. తప్పని ఓటమి పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ 32, బాబర్ ఆజం 25 పరుగులతో శుభారంభం అందించారు. మహ్మద్ హారిస్ 31 పరుగులు చేయగా.. షాన్ మసూద్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ధారాళంగా పరుగులు(35) సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించి సెమీస్ చేరుకుంది. షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా నెదర్లాండ్స్ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో సౌతాఫ్రికా ఇంటిబాట పట్టగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ టోర్నీలో ముందడుగు వేశాయి. మ్యాచ్ స్కోర్లు: టాస్: బంగ్లాదేశ్ బంగ్లాదేశ్: 127/8 (20) పాకిస్తాన్: 128/5 (18.1) చదవండి: WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ! View this post on Instagram A post shared by ICC (@icc) -
Pak Vs Ban: బంగ్లాదేశ్‌పై పాక్ ఘన విజయం.. సెమీస్‌లో అడుగు
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh Updates In Telugu: బంగ్లాదేశ్‌పై గెలిచిన పాకిస్తాన్ గ్రూప్-2 నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. టీమిండియాతో పాటు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అడిలైడ్ వేదికగా ఆదివారం చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన బాబర్ ఆజం బృందం.. లక్ష్య ఛేదనలో భాగంగా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ స్కోర్లు: టాస్: బంగ్లాదేశ్ బంగ్లాదేశ్: 127/8 (20) పాకిస్తాన్: 128/5 (18.1) మహ్మద్ హారిస్ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 121-4(17) 15 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు 94-3 నవాజ్ రనౌట్‌గా వెనుదిరగగా.. హారిస్, మసూద్ క్రీజులో ఉన్నారు. రిజ్వాన్ అవుట్ పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌ను ఇబాదత్ హొసేన్ పెవిలియన్‌కు పంపాడు. 12వ ఓవర్ రెండో బంతికి షాంటోకు క్యాచ్ ఇచ్చి అతడు 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. హారిస్, నవాజ్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 67/2 (11.5) తొలి వికెట్ కోల్పోయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(25) రూపంలో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. పదకొండో ఓవర్ మూడో బంతికి నాసూమ్ అహ్మద్ బాబర్‌ను అవుట్ చేశాడు. స్కోరు: 58/1 (10.3). రిజ్వాన్, నవాజ్ క్రీజులో ఉన్నారు. పవర్ ప్లే ముగిసే సరికి పాక్ స్కోరు: 35-0 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగింది. షాహిన్ ఆఫ్రిది 4 వికెట్లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఏడో వికెట్ డౌన్ టస్కిన్ అహ్మద్ రూపంలో బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లలో స్కోరు : 116-7 ఒకే ఓవర్లో రెండు వికెట్లు 17వ ఓవర్లో బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆఫ్రిది బౌలింగ్‌లో మొసద్దెక్ హొసేన్(5), నూరుల్ హసన్(0) అవుటయ్యారు. స్కోరు: 107/6 (17). అఫిఫ్, టస్కిన్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. బంగ్లాకు ఎదురుదెబ్బ అర్ధ శతకంతో జోరు మీదున్న షాంటో(54) అవుటయ్యాడు. 14వ ఓవర్ రెండో బంతికి ఇఫ్తికర్ అహ్మద్.. షాంటోను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. పద్నాలుగు ఓవర్లలో స్కోరు: 92-4 షకీబ్ డకౌట్ బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బంగ్లా మూడో వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా సౌమ్య సర్కార్(20) రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. షాదాబ్ బౌలింగ్‌లో మసూద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 73/2 (10.4) అర్ధ శతకానికి చేరువలో షాంటో ► 10 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 70/1. షాంటో 41, సౌమ్య సర్కార్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►7 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి బంగ్లా 49 పరుగులు చేసింది. షాంటో, సౌమ్య సర్కార్ క్రీజ్‌లో ఉన్నారు. పవర్‌ప్లేలో బంగ్లా స్కోరు: 40-1 తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లిటన్ దాస్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లొ మసూద్‌కు క్యాచ్ ఇచ్చి దాస్ ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ వికెట్ నష్టానికి 34 పరుగులు. షాంటో (18), సౌమ్య సర్కార్ (6) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. గెలిచిన వాళ్లు సెమీస్‌కు! ఓడినవాళ్లు ఇంటికి టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్- బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గ్రూప్-2లో భాగమైన నెదర్లాండ్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి.. ఇరు జట్లకు మార్గం సుగమం చేసింది. ఇక బంగ్లాపై గెలిస్తే బాబర్ ఆజం బృందం.. టీమిండియాతో పాటు సెమీస్‌కు చేరడం లాంఛనమే కానుంది. మరి ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పాక్‌ను నిలువరిస్తే దర్జాగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. తుది జట్లు: పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్) బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హారీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది. బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫిఫ్ హొస్సేన్, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, నసుమ్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్. చదవండి: టీ20 ప్రపంచ కప్‌లో పెను సంచలనం.. దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకు షాక్.. అత్యాచారం కేసులో క్రికెటర్ అరెస్ట్ -
అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్?
ICC Mens T20 World Cup 2022 : టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాము టైటిల్ గెలవడానికి రాలేదని, టీమిండియాను మాత్రం ఓడించితీరతామని అని షకీబ్ కామెంట్ చేశాడు. అయితే బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో షకీబ్ బాల్‌తో పర్వాలేదనిపించినప్పటికీ.. బ్యాట్‌తో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన షకీబ్ 12 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్‌ను భారత అభిమానులు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. సోషల్‌మీడియాలో షకీబ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "అంత అన్నావు.. ఇంత అన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్? అంటూ పోస్టులు పెడుతున్నారు. We are here for Nagin Dance. ~ Shakib Al Hasan https://t.co/0stm61pgO6 — your time's up.🪔 (@TakeTheJab) November 1, 2022 ఓ యూజర్ స్పందిస్తూ.. " ఇప్పుడు నాగిన్ డ్యాన్స్ ఆడు షకీబ్" అంటూ కామెంట్ చేశాడు. అదే విధంగా గతంలో ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అంపైర్‌పై షకీబ్ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియోను కూడా నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో షకీబ్ పేరు ట్రెండ్ అవుతోంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shakib Al Hasan in post match press conference: pic.twitter.com/qBLbtxK9Mx — Avinash Aryan (@AvinashArya09) November 2, 2022 Shakib should have done it today, erasmus deserves it https://t.co/cEypko9ky0 — Rameen (@thebigone56) November 2, 2022 చదవండి: T20 WC 2022: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి సరి కొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు -
మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయుంటే విజయం మాదే: షకీబ్
అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. ఇక కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైన బంగ్లాదేశ్ తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఓ దశలో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్ల కంటే ముందే లక్ష్యాన్ని చేధించేట్లు కనిపించింది. అయితే బంగ్లా జోరుకు 7 ఓవర్ల వద్ద వరుణుడు బ్రేక్ వేశాడు. అనంతరం మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాక బౌలర్లు చెలరేగడంతో అఖరికి విజయం టీమిండియాను వరించింది. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ స్పందించాడు. షకీబ్ మాట్లాడూతూ.. "భారత్‌తో మళ్లీ మాది పాత కథే. గెలుపునకు బాగా దగ్గరగా రావడం, ఆపై ఓడిపోవడం. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లు మేం ఎక్కువగా ఆడలేదు. అందుకే అలాంటి సమయంలో ఎలా గెలవాలో తెలీదు. అనుభవం లేకపోవడం కూడా ఒక కారణం. 185 అయినా 151 అయినా సాధించదగ్గ లక్ష్యమే. కానీ దురదృష్టవశాత్తూ మేం గెలవలేకపోయాం. చివరి 2 ఓవర్లలో 30 కూడా సాధ్యమే కానీ అది జరగలేదు. వాన ఆగిన తర్వాత మైదానం తడిగా ఉంది. కాబట్టి కాస్త ఆలస్యంగా ఆటను ప్రారంభించమని అంపైర్లను అడిగే స్థాయి నాకు లేదు. వర్షంతో మా జోరుకు అడ్డుకట్ట పడిందనేది వాస్తవం. అయితే సాధారణంగా మైదానం, బంతి తడిగా ఉన్నప్పుడు బౌలింగ్ జట్టుకే సమస్య. బ్యాటింగ్‌లో పరుగులు చేయడం సులువే కాబట్టి దానిని ఓటమికి సాకుగా చెప్పను" అని పేర్కొన్నాడు. చదవండి: Rohit Sharma: 'మ్యాచ్ హీరో అర్ష్‌దీప్.. బుమ్రా లోటును తీరుస్తున్నాడు' -
మరో ఉత్కంఠ సమరం.. బంగ్లా పులుల మెడలు వంచిన టీమిండియా
మరో ఉత్కంఠ సమరం.. బంగ్లా పులుల మెడలు వంచిన టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఉత్కంఠ సమరం జరిగింది. చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-2లో అగ్రస్థానానికి ఎగబాకడంతో పాటు సెమీస్ అవకాశాలను దాదాపుగా ఖరారు చేసుకుంది. 108 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తుండటంతో బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. 13వ ఓవర్లో హార్ధిక్ రెండు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 108 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. షకీబ్ ఔట్ వర్షం తర్వాత ఆట మొదలయ్యాక టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. వరుస వికెట్లు పడగొడుతూ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అర్షదీప్ 12వ ఓవర్లో రెండో వికెట్ తీశాడు. హుడా అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో షకీబ్ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 100 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్ డౌన్ బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో అఫీఫ్ హొసేన్ (3) పెవిలియన్ బాట పట్టాడు. 11.1 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 99/3గా ఉంది. రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ వేగంగా పరుగులు సాధించే క్రమంలో బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. 10వ ఓవర్లో బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది షమీ బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి షాంటో (21) ఔటయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 84 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ వర్షం తగ్గాక మ్యాచ్ మొదలైన రెండో బంతికే బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న లిటన్ దాస్ (27 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రనౌటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 74/1. శాంతించిన వరుణుడు.. మొదలైన మ్యాచ్.. బంగ్లా టార్గెట్ 151 వరుణుడు కరుణించడంతో భారత్-బంగ్లా మ్యాచ్ తిరిగి మొదలైంది. బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లలో 151 పరుగులుగా నిర్ధేశించారు. అంటే బంగ్లా గెలవాలంటే మరో 54 బంతుల్లో 85 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. మ్యాచ్‌కు వర్షం అంతరాయం దాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 59, హొస్సేస్ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్ 17 పరుగులు ముందంజలో ఉంది. ఇప్పటికే బంగ్లా ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్ల ఆట ముగియడంతో వర్షం ఎంతకు తగ్గకపోతే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను ప్రకటించనున్నారు. లిటన్ దాస్ విధ్వంసం.. 6 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 60/0 185 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టిస్తున్నాడు. 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 60/0గా ఉంది. మరోసారి రెచ్చిపోయిన కోహ్లి.. టీమిండియా భారీ స్కోర్ భీకరమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి మరోసారి రెచ్చిపోయాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాలాకాలం తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా వేగంగా పరుగులు సాధిద్దామన్న తొందరలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. 19వ ఓవర్లో అక్షర్ పటేల్ (7) ఔటయ్యాడు. హసన్ మహమూద్ బౌలింగ్‌లో షకీబ్‌కు క్యాచ్ ఇచ్చి అక్షర్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లి హాఫ్ సెంచరీ.. డీకే రనౌట్ సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి మరో హాఫ్ సెంచరీ సాధించాడు. 37 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆతర్వాతి బంతికే దినేశ్ కార్తీక్ (7) రనౌటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 150/5. విరాట్ కోహ్లి (50), అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 16వ ఓవర్లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హసన్ మహమూద్ బౌలింగ్‌లో యాసిర్ అలీకి క్యాచ్ ఇచ్చి హార్ధిక్ పాండ్యా (5) ఔటయ్యాడు. 15.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 131/4. విరాట్ కోహ్లి (44), దినేశ్ కార్తీక్ క్రీజ్‌లో ఉన్నారు. క్లీన్ బౌల్డ్ అయిన సూర్యకుమార్ 14వ ఓవర్లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (30) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 116/3. విరాట్ కోహ్లి (31), హార్దిక్ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. ఫిఫ్టి కొట్టిన వెంటనే ఔటైన కేఎల్ రాహుల్ చాన్నాళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే ఆతర్వాతి బంతికే షకీబ్ బౌలింగ్‌లొ ముస్తాఫిజుర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 78/2. క్రీజ్‌లో కోహ్లి (23) ఉన్నాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 37/1 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(13), కేఎల్ రాహుల్(21) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా టాస ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 4వ ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ (2) ఔటయ్యాడు. హసన్ మహమూద్ బౌలింగ్‌లో యాసిర్ అలీకు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ వెనుదిరిగాడు. టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో ఇవాళ (నవంబర్ 2) భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అడిలైడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్ చేరాలంటే ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా కీలక మార్పు చేసింది. గత మ్యాచ్‌లో (సౌతాఫ్రికా) ఆడిన దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ బంగ్లాదేశ్: నజ్ముల్ హొసేన్ షాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్, అఫీఫ్ హోస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, షొరీఫుల్ ఇస్లాం, నురుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, తిస్కన్ అహ్మద్ -
ఇండియా వరల్డ్‌కప్ గెలిచేందుకు వచ్చింది.. మేము వారిని ఓడించేందుకే వచ్చాం..!
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా రేపు (నవంబర్ 2) టీమిండియా-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ ఇరు జట్లు చెరి 3 మ్యాచ్‌లు ఆడి తలో రెండేసి విజయాలతో (4 పాయింట్లు) పాయింట్ల పట్టికలో సమంగా నిలిచాయి. సెమీస్‌కు రేసులో నిలవాలంటే రేపు అడిలైడ్ వేదికగా జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, టీమిండియాతో కీలక సమరానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ మారాయి. ఇవాళ (నవంబర్ 1) జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్‌మీట్ సందర్భంగా షకీబ్ మాట్లాడుతూ.. రేపటి మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్ అని.. అయితే ఆ జట్టును ఓడించేందుకు తాము వంద శాతం కృషి చేస్తామని పేర్కొన్నాడు. తాము ఆస్ట్రేలియాకు వచ్చింది వరల్డ్‌కప్ గెలిచేందుకు కాదన్న పరిస్థితుల నడుమ.. భారత్‌ను ఓడిస్తే అదే తమకు వరల్డ్‌కప్‌తో సమానమని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వరల్డ్‌కప్‌లో ఇకపై తమకు ప్రతి మ్యాచ్ కీలకమేనని, ప్రత్యర్ధి ఎవరనదే తాము పట్టించుకోమని, జట్టుగా వంద శాతం పెర్ఫార్మ్ చేయడంపైనే దృష్టి సారించామని అన్నాడు. ఐర్లాండ్, జింబాబ్వే లాంటి జట్లు ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి పెద్ద జట్లకు షాకివ్వగా లేనిది, తాము భారత్, పాకిస్తాన్లలో ఏదో ఒక జట్టును అప్సెట్ చేయలేమా అని ధీమా వ్యక్తం చేశాడు. పేపర్‌పై రెండు జట్లు తమ కంటే బలమైన జట్లే అయినప్పటికీ, తమను తక్కువ అంచనా వేస్తే మాత్రం ఫలితం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. టీమిండియా ఇక్కడికి వరల్డ్‌కప్ గెలిచేందుకు వచ్చింది, అలాంటి జట్టును ఓడిస్తే అదే తమకు పదివేలని, ఇందు కోసం తాము సర్వ శక్తులు ఒడ్డుతామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా షకీబ్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, అతనో వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని, అతన్ని కంట్రోల్ చేయగలిగితే తమ పని సులువవుతుందని అభిప్రాయపడ్డాడు. -
మ్యాచ్‌ను మలుపు తిప్పిన రనౌట్.. పాపం జింబాబ్వే
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో ఆదివారం జింబాబ్వేతో జరిగిన పోరులో బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయం సాధించింది. గెలుపు కోసం చివరి దాకా పోరాడినప్పటికి ఒత్తిడిలో జింబాబ్వే కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే జింబాబ్వే పోరాడి ఓడినప్పటికి వారి ఆటతీరు మాత్రం సగటు అభిమానిని ఆకట్టుకుంది. ఒక దశలో జింబాబ్వే విజయానికి చేరువగా వచ్చింది. అయితే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేసిన రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ 64 పరుగులతో టాప్ స్కోరర్. 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో రియాన్ బర్ల్తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన సీన్ విలియమ్స్ 63 పరుగులు జోడించాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో షకీబ్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతిని విలియమ్స్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎక్కువ దూరం పోనప్పటికి అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. అప్పటికే బంతి వేసి అక్కడే ఉన్న షకీబ్ మెరుపువేగంతో పరిగెత్తి నాన్స్టై్రక్ ఎండ్‌వైపు బంతిని విసిరాడు. నేరుగా వికెట్లను గిరాటేయడంతో సీన్ విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలం కావడంతో జింబాబ్వే ఓటమి పాలయ్యింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: క్రికెట్ చరిత్రలో ఇలా తొలిసారి.. నాటకీయంగా నో బాల్ ప్రకటన -
పాక్‌ను హడలెత్తించిన బంగ్లా.. కానీ!
-
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌కు చెమటలు పట్టించిన బంగ్లా!
New Zealand T20I Tri-Series 2022 - Pakistan vs Bangladesh, 6th Match: న్యూజిలాండ్‌తో టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఆఖరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం (అక్టోబరు 13) జరిగిన పోరులో చివరికి పాకిస్తాన్ పైచేయి సాధించింది. మరో బంతి మిగిలి ఉండగానే మహ్మద్ నవాజ్ ఫోర్ బాది పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ ఓటమితో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ట్రై సిరీస్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా జరిగిన సిరీస్‌లో చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం (అక్టోబరు 14) నాటి ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. మరోసారి విజృంభించిన కెప్టెన్.. కానీ.. పాక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. ఓపెనర్లు షాంటో(12), సౌమ్య సర్కార్(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన లిటన్ దాస్, ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. లిటన్ దాస్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 69 పరుగులు చేయగా.. షకీబ్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించి మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మిగతా ఆటగాళ్లకు నామమాత్రపు స్కోరుకే పరిమితం కాగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 173 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ అర్ధ శతకాలు లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనింగ్ జోడీ మహ్మద్ రిజ్వాన్(56 బంతుల్లో 69 పరుగులు), బాబర్ ఆజం(40 బంతుల్లో 55 పరుగులు) అర్ధ శతకాలతో కదం తొక్కింది. హైదర్ అలీ విఫలం(0) కాగా.. మహ్మద్ నవాజ్ 45 పరుగులతో అజేయంగా నిలిచి పాక్‌ను విజేతగా నిలిపాడు. 19.5 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: T20 WC- Semi Finalists Prediction: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ BCCI Next Boss Roger Binny: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు -
అరుదైన రికార్డు నెలకొల్పనున్న రోహిత్ శర్మ
వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్-2022లో పాల్గొనడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పనున్నాడు. 2007 నుంచి 2022 వరకు అన్ని పొట్టి ప్రపంచ కప్‌లలో ఆడిన/ఆడనున్న ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించనున్నాడు. రోహిత్‌తో పాటు ఈ రికార్డును బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా షేర్ చేసుకోనున్నాడు. షకీబ్ కూడా రోహిత్ లాగే అన్ని టీ20 ప్రపంచ కప్‌లలో ఆడాడు/ఆడనున్నాడు. Rohit Sharma and Shakib Al Hasan are the only two players to participate in each and every T20 World Cup from 2007 to 2022. — Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2022 ఈ ఇద్దరే కాకుండా మరో ఆరుగురు 2007 నుంచి 2021 వరకు వరుసగా ఏడు ఎడిషన్లలో ఆడారు. విండీస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, పాకిస్తాన్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021 టీ20 ప్రపంచ కప్‌లలో పాల్గొన్నారు. అయితే వీరంతా రిటైర్మెంట్ లేదా వయసు పైబడిన కారణం చేత 2022 వరల్డ్ కప్‌లో ఆడటం లేదు. రోహిత్, షకీబ్‌లు ఇద్దరు ఆక్టోబర్ 16 నుంచి ప్రారంభంకానున్న 8వ ఎడిషన్ ప్రపంచ కప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లకు నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు జరిగిన ఏడు పొట్టి ప్రపంచకప్‌లలో వెస్టిండీస్ జట్టు అత్యధికంగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. విండీస్ టీమ్ శ్రీలంకలో జరిగిన 2012 వరల్డ్ కప్, భారత్‌లో జరిగిన 2016 ప్రపంచ కప్‌లలో జగజ్జేతగా నిలిచింది. మిగిలిన ఐదు సందర్భాల్లో వివిధ జట్లు విజేతలుగా నిలిచాయి. సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొట్టతొలి పొట్టి ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ఎడిషన్‌లో పాకిస్తాన్, విండీస్ వేదికగా జరిగిన 2010 ఎడిషన్‌లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 ఎడిషన్‌లో శ్రీలంక, యూఏఈ వేదికగా జరిగిన 2021 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్లుగా నిలిచాయి. -
T20 WC 2022: ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. మాజీ కెప్టెన్‌పై వేటు
ICC Men's T20 World Cup 2022- Bangladesh Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ మహ్మదుల్లా రియాద్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఇక మూడేళ్ల తర్వాత.. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా జట్టులోకి వచ్చిన సబీర్ రెహమాన్ మాత్రం తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఈవెంట్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతడికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం విశేషం. మహ్మదుల్లా అదే విధంగా గాయాల నుంచి కోలుకున్న నూరుల్ హసన్ సోహన్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, హసన్ మహ్మూద్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక ఆసియా కప్‌లో ఆడిన ఆల్‌రౌండర్ మెహెదీ హసన్‌కు మాత్రం ప్రధాన జట్టులో చోటుదక్కకపోవడం గమనార్హం. అతడిని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఆసియా కప్-2022లో బంగ్లాదేశ్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దారుణమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్-2022కు బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్(కెప్టెన్), సబీర్ రెహమాన్, మెహెదీ హసన్ మిరాజ్, అఫిఫ్ హొసేన్ ధ్రూబో, మొసద్దెక్ హొసేన్ సైకత్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, నూరుల్ హసన్ సోహన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మద్ సైఫుద్దీన్, నసూమ్ అహ్మద్, హసన్ మహ్మూద్, నజ్మల్ హొసేన్ షాంటో, ఇబాదత్ హొసేన్, టస్కిన్ అహ్మద్. స్టాండ్ బై ప్లేయర్లు: షోరిఫుల్ ఇస్లాం, రిషద్ హొసేన్, మెహెదీ హసన్, సౌమ్య సర్కార్. చదవండి: Ind Vs Aus: భారత్‌తో సిరీస్.. ఆసీస్‌కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్! Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే! -
Asia Cup 2022: లంక చేతిలో మా ఓటమికి ప్రధాన కారణం అదే: బంగ్లా కెప్టెన్
Asia Cup 2022 SL Vs Ban- Bangladesh Knocked Out Of Tourney: ఆసియా కప్-2022 టోర్నీలో బంగ్లాదేశ్ ప్రయాణం ముగిసింది. దుబాయ్ వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బృందం ఓటమి పాలైంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మెగా ఈవెంట్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఇక గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్‌తో పాటు లంక సూపర్-4కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఓటమిపై స్పందించాడు. డెత్ ఓవర్లలో తమ బౌలర్లు చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో పరాజయంతో ఇంటిబాట పట్టినందుకు చింతిస్తున్నామంటూ అభిమానులను క్షమాపణ కోరాడు. అదరగొట్టిన కుశాల్, దసున్ గురువారం(సెప్టెంబరు 1) నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆఫిఫ్ హొసేన్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుత ఆరంభం అందించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 60 పరుగులు చేశాడు. అయితే, మిడిలార్డర్ విఫలం కావడంతో లంక కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ దసున్ షనక 33 బంతుల్లో 45 పరుగులు చేసి లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కొంప ముంచిన ఇబాదత్! కానీ.. ఆ తర్వాత వనిందు హసరంగ 2 పరుగులకే నిష్క్రమించాడు. ఈ క్రమంలో గెలుపు కోసం చివరి 2 ఓవర్లలో లంకకు 25 పరుగులు అవసరమయ్యాయి. దీంతో బంగ్లా విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. అయితే 19వ ఓవర్ వేసిన బంగ్లా బౌలర్ ఇబాదత్ 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో లంక గెలుపు సమీకరణం 8 పరుగులకు చేరగా.. అసిత ఫెర్నాండో లాంఛనం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 వైడ్లు, 4 నోబాల్‌లు వేసిన బంగ్లాకు చేదు అనుభవం తప్పలేదు. మా ఓటమికి కారణం అదే! ఈ నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. ‘‘చెత్త బౌలింగ్ కారణంగా ముఖ్యంగా డెత్ ఓవర్లలో విఫలమైనందున భారీ మూల్యం చెల్లించాం. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి చేతిలో నాలుగు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మా బౌలింగ్ అధ్వాన్నంగా సాగింది. నిజానికి, శ్రీలంక బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దసున్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మేము వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలని అనుకున్నాం. కానీ.. మా బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. గత ఆర్నెళ్లుగా మా జట్టు ప్రదర్శన అస్సలు బాగుండటం లేదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో బాగానే ఆడాం. ఏదేమైనా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పకతప్పదు. ఎక్కడివెళ్లినా మా మీద మీ ప్రేమ తగ్గడం లేదు. అయితే, మేము మిమ్మల్ని నిరాశ పరుస్తున్నాం. సారీ’’ అని పేర్కొన్నాడు. చదవండి: Asia cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు' -
Asia Cup 2022: బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం
బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకను చిత్తు చేసి ఆఫ్ఘనిస్థాన్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులు చేయడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 9 బంతులు మిగిలి ఉండగానే.. 128 రన్స్ టార్గెట్‌ను 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ గెలుపొందింది. రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్ 10వ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మొసద్దెక్ హొసేన్ బౌలింగ్‌లో హజ్రతుల్లా జజాయ్ (23) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 9.2 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 45/2. ఆచితూచి ఆడుతున్న ఆఫ్ఘాన్ స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల ముగిసే సమాయానిఆ జట్టు స్కోర్ 37/1గా ఉంది. హజ్రతుల్లా జజాయ్ (17), ఇబ్రహీమ్ జద్రాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘానిస్తాన్ 128 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘానిస్తాన్ ఐదో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. షకీబ్ బౌలింగ్‌లో ఓపెనర్ గుర్బాజ్ (11) స్టంప్ అవుటయ్యాడు. 4.1 ఓవర్ల తర్వాత ఆఫ్ఘానిస్తాన్ స్కోర్ 15/1. బంగ్లాను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసిన ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు బంగ్లాదేశ్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేశారు. ముజీబ్, రషీద్ ఖాన్లు తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచారు. వీరిద్దరి ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే పరిమితమైంది. మొసద్దెక్ హొసేన్ (48 నాటౌట్) రాణించడంతో బంగ్లా జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రషీద్ ఖాతాలో మరో వికెట్ ఆఫ్ఘన్ స్పిన్నర్లలో తొలుత ముజీబ్.. ఆతర్వాత రషీద్ ఖాన్ రెచ్చిపోయారు. 16వ ఓవర్లో రషీద్.. మహ్మదుల్లాను (25) ఔట్ చేయడం ద్వారా 3 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 16 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 95/6. 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆఫ్ఘన్ స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు విలవిలలాడుతుంది. ఆ జట్టు 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను దాదాపు ఆఫ్ఘనిస్తాన్ చేతికి అప్పగించింది. 11వ ఓవర్లో రషీద్ ఖాన్.. అఫీఫ్ హొసేన్‌ను (12) ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ముచ్చెమటలు పట్టిస్తున్న ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆఫ్ఘన్ స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్లు బంగ్లాదేశ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వీరిద్దరు బంగ్లా ఆటగాళ్లను కుదురుకోనీయకుండా వరుస క్రమంలో వికెట్లు పడగొడుతున్నారు. తొలుత ముజీబ్ రెచ్చిపోగా.. తాజాగా రషీద్ చెలరేగుతున్నాడు. 7వ ఓవర్లో రషీద్.. అద్భుతమైన గూగ్లీతో ముష్ఫికర్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెచ్చిపోతున్న ముజీబ్.. ఈసారి కెప్టెన్ బలి ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ బంగ్లా ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నాడు. తాను వేసిన మూడు ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచాడు. ఆరో ఓవర్లో ముజీబ్.. బంగ్లా కెప్టెన్ షకీబ్ (11)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 6 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 28/3. క్రీజ్‌లో ముష్ఫికర్ (1), అఫీఫ్ హొసేన్ (2) ఉన్నారు. బంగ్లాను మరో దెబ్బకొట్టిన ముజీబ్ రెండో ఓవర్లోనే ఓపెనర్ మహ్మద్ నయీమ్ (8)ను క్లీన్ బౌల్డ్ చేసిన ముజీబుర్ రెహ్మాన్.. నాలుగో ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. ముజీబ్.. అనాముల్ హాక్ (5)ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 13 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో షకీబ్, ముష్ఫికర్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయింది. ముజీబుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో మహ్మద్ నయీమ్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో అనాముల్ హాక్ (1), కెప్టెన్ షకీబ్ ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆసియా కప్ 2022 గ్రూప్-బిలో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 30) బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకకు షాకిచ్చిన విషయం తెలిసిందే. తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం (వికెట్‌కీపర్), మహ్మదుల్లా, మెహిది హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఫీఫ్ హొసేన్, మహ్మద్ నయీం, అనాముల్ హాక్, మొసద్దెక్ హొసేన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్ -
అఫ్గన్‌తో మ్యాచ్.. అరుదైన ఘనత అందుకోనున్న బంగ్లా కెప్టెన్
ఆసియా కప్‌లో భాగంగా గ్రూఫ్-బిలో మంగళవారం అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే శ్రీలంకపై 8 వికెట్లతో విజయం సాధించి జోరు మీదున్న అఫ్గనిస్తాన్‌ను బంగ్లా కట్టడి చేస్తుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇటీవలే బంగ్లా ఫామ్ చూసుకుంటే దారుణంగా ఉంది. జింబాబ్వేతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్ ఆటతీరు నాసిరకంగా తయారైంది. ఇక జింబాబ్వేతో సిరీస్ ఓటమి అనంతరం మహ్మదుల్లా కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్‌గా బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌ను ఎంపిక చేసింది బీసీబీ(బంగ్లా క్రికెట్ బోర్డు). షకీబ్‌కు తోడూ ముష్ఫికర్ రహీమ్ కూడా జట్టులోకి రావడంతో బంగ్లాదేశ్ జట్టు కాస్త పటిష్టంగా కనిపిస్తోంది. కానీ తొలి మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న అఫ్గనిస్తాన్‌ను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బంగ్లాదేశ్ స్టార్.. కెప్టెన్ కమ్ ఆల్‌రౌండర్ షకీబ్ హల్ హసన్ వందో టి20 మ్యాచ్ ఆడనున్నాడు. బంగ్లా తరపున వందో టి20 ఆడనున్న మూడో క్రికెటర్‌గా షకీబ్ నిలవనున్నాడు. షకీబ్ కంటే ముందు ముష్పికర్ రహీమ్, మహ్మదుల్లా ఈ ఘనత సాధించారు. మరోవైపు అఫ్గనిస్తాన్ మాత్రం లంకపై గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. టాస్ గెలిస్తే మాత్రం అఫ్గన్ మరోసారి కచ్చితంగా బౌలింగ్‌ను ఎంచుకోవడం ఖాయం. రషీద్ ఖాన్, షజల్లా ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, మహ్మద్ నబీలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తుండగా.. బ్యాటింగ్‌లో హజరతుల్లా జజాయి, రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహం జర్దాన్, నజీబుల్లా జర్దాన్లతో బలంగా కనిపిస్తోంది. చదవండి: Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్ Ban Vs Afg: ఆ జట్టు అసలు గెలిచే అవకాశమే లేదు: టీమిండియా మాజీ క్రికెటర్ -
కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న శ్రీశాంత్
టీమిండియా మాజీ బౌలర్, వివాదాస్పద ఆటగాడు శాంతకుమరన్ శ్రీశాంత్ త్వరలో మరో కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది చివర్లో (నవంబర్) ప్రారంభమయ్యే అబుదాబీ టీ10 లీగ్ నుంచి మెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సారధ్యం వహించనున్న బంగ్లా టైగర్స్‌కు శ్రీశాంత్ తన సేవలందించనున్నాడు. ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా బంగ్లా మాజీ ఆల్‌రౌండర్ ఆఫ్తాబ్ అహ్మద్ వ్యవహరించనుండగా.. అదే దేశానికే చెందిన నజ్ముల్ అబెదిన్ ఫహీమ్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేయనున్నాడు. ఈ ఇద్దరితో కలిసి శ్రీశాంత్ కోచింగ్ టీమ్‌లో ఉంటాడని బంగ్లా టైగర్స్ యాజమాన్యం శనివారం వెల్లడించింది. కాగా, అబుదాబీ ఐదో సీజన్ కోసం బంగ్లా టైగర్స్ కీలక మార్పులు చేసింది. ఐకాన్ ప్లేయర్ కోటాలో షకీబ్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడంతో పాటు విధ్వంసకర ఆటగాళ్లు ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కొలిన్ మన్రో (న్యూజిలాండ్).. స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ (పాకిస్థాన్), శ్రీలంక యువ సంచలనం మతీశ పతిరణను జట్టులో చేర్చుకుంది. సఫారీ స్టార్ ఆటగాడు డుప్లెసిస్ సారధ్యంలో గత సీజన్ బరిలో నిలిచిన బంగ్లా టైగర్స్ మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది మార్చిలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీశాంత్.. తొలిసారి కోచింగ్ డిపార్ట్మెంట్లో చేరాడు. గతంలో టీమిండియా క్రికెటర్‌గా, సినిమాల్లో హీరోగా నటించిన ఈ కేరళ స్పీడ్‌స్టర్.. త్వరలో సరికొత్త అవతారంలో క్రికెట్ ఫ్యాన్స్ ముందుకు రానున్నాడు. ఐపీఎల్ (2013 సీజన్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో శ్రీశాంత్ కెరీర్‌కు అర్థంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. 2022 ఐపీఎల్ వేలంలో కనీస ధర యాభై లక్షలకు తన పేరును నమోదు చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న బుడ్డోళ్లు -
ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. స్టార్ ఆటగాడు దూరం!
ఆసియా కప్-2022 కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు బంగ్లా జట్టు కెప్టెన్‌గా షకీబ్ కొనసాగనున్నాడు.ఇక జింబాబ్వే సిరీస్‌లో గాయపడిన వికెట్ నూరల్ హసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక అదే సిరీస్‌లో గాయపడిన మరో వికెట్ కీపర్ లిటన్ దాస్ మాత్రం ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఆసియాకప్‌కు దూరమయ్యాడు. కాగా ఆసియా కప్‌కు జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆగస్టు 8న ప్రకటించాల్సి ఉండగా.. షకీబ్ స్పాన్సర్షిప్ వివాదం వల్ల ఆలస్యమైంది. ఇక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. 2012, 2016, 2018లో ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయింది. కాగా ఆసియకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరనగుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్తాన్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్, సబ్బీర్ రహ్మాన్,మెహిదీ హసన్ మిరాజ్,ఎబాడోత్ హుస్సేన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నూరుల్ హసన్ సోహన్, టాస్కిన్ అహ్మద్ చదవండి: Asia Cup 2022: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ ఆల్ హసన్.. -
Asia Cup 2022: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ ఆల్ హసన్..
బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు బంగ్లా జట్టు కెప్టెన్‌గా షకీబ్ వ్యవహరించనున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. కాగా జింబాబ్వే పర్యటనకు ముందు బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహ్మదుల్లా తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా వికెట్ కీపర్ నూరల్ హసన్‌ను బీసిబీ నియమించింది. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో నూరల్ హసన్ చేతి వేలికి గాయమైంది. అనంతరం అతడికి సింగపూర్‌లో సర్జరీ నిర్వహించారు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టనున్నట్లు బీసిబీ వైద్య బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు త్వరలో జరగనున్న ఆసియాకప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే షకీబ్‌ను తమ కెప్టెన్‌గా నియమిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా షకీబ్ అల్ హసన్ 'బెట్విన్నర్ న్యూస్’ అనే బెట్టింగ్ సంస్థతో ఒప్పందం కుదర్చుకుని వివాదంలో చిక్కున్నాడు. ఈ క్రమంలో ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని షకీబ్‌ను బంగ్లా క్రికెట్ బోర్డు హెచ్చరించింది. దీంతో అతడు వెనుక్కి తగ్గి ఒప్పందం రద్దు చేసుకున్నాడు. దీంతో అతడిపై బంగ్లా క్రికెట్ బోర్డు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చదవండి: IND vs PAK: మ్యాచ్‌కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్ -
వెనక్కి తగ్గిన షకీబ్.. బెట్విన్నర్ న్యూస్‌తో ఒప్పందం రద్దు!
ఢాకా: బంగ్లాదేశ్ టాప్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు వివాదాలు కొత్త కాదు. తాజాగా ఒక స్పాన్సర్షిప్ ఒప్పందానికి సంబంధించి షకీబ్ చర్య వివాదంగా మారింది. అయితే చివరి నిమిషంలో షకీబ్ దానిని సరిదిద్దుకోవడంతో అతను వేటు తప్పించుకున్నాడు. పది రోజుల క్రితం ‘బెట్విన్నర్ న్యూస్’తో తాను ఒప్పందం చేసుకున్న విషయాన్ని షకీబ్ ఇన్‌స్టగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అయితే బెట్విన్నర్ అనేది బెట్టింగ్‌కు సంబంధించిన సంస్థ కావడంతో అతను ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏ బంగ్లా క్రికెటర్ అయినా బెట్టింగ్ సంస్థతో ఒప్పందాలు చేసుకోరాదు. దాంతో షకీబ్‌పై చర్య తీసుకునేందుకు బీసీబీ సిద్ధమైంది. చివరి హెచ్చరికగా గురువారంలోగా దానిని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దాంతో షకీబ్ వెనక్కి తగ్గాడు. తన ఒప్పందాన్నివదిలేస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: AFG vs IRE: ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం! -
చిక్కుల్లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్..
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ చిక్కుల్లో పడ్డాడు. బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇటీవలే ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఒక బెట్టింగ్ వెబ్‌సైట్‌తో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని షకీబ్.. ''బెట్ విన్నర్ న్యూస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నా'' అంటూ ఫేస్బుక్ వేదికగా ఫోటోను షేర్ చేశాడు. తన కాంట్రాక్ట్ ఒప్పందం విషయమై షకీబ్ బీసీబీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడతన్ని కష్టాల్లోకి నెట్టింది. షకీబ్ మమ్మల్ని సంప్రదించకుండా ఒక బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. బెట్టింగ్ అనేది ఒక అనైతిక చర్య అని.. బెట్టింగ్తో సంబంధమున్న ఏ కంపెనీతోనూ ఆటగాళ్లు ఒప్పందం కుదుర్చుకోరాదని నిబంధనల్లో ఉందని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. షకీబ్ ఒప్పంద విషయమై బోర్డు మీటింగ్ అనంతరం అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ''గురువారం జరిగిన మీటింగ్‌లో షకీబ్ తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్షిప్ గురించి ప్రస్తావనకు వచ్చింది. అతను ఒక బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని నిబంధన ఉల్లఘించాడు. ఒప్పంద విషయమై బోర్డుకు కనీస సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై వివరణ కోరుతూ షకీబ్‌కు నోటీసులు పంపించాం. ఒకవేళ షకీబ్ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు బెట్టింగ్ మాఫియాతో సంబంధముందని తెలిస్తే ఉపేక్షించబోయేది లేదు. దీనిపై ఇన్వెస్టిగేషన్(విచారణ) ప్రారంభించబోతున్నాం. మా అనుమతి తీసుకోకుండా ఒప్పందం కుదుర్చుకున్న షకీబ్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది విచారణ అనంతరమే తెలుస్తోంది. కానీ షకీబ్ చేసింది బీసీబీ బోర్డుకు విరుద్దంగా ఉంది. బెట్టింగ్ అనే అంశానికి (బీసీబీ-లా) పూర్తి వ్యతిరేకం'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఎన్ని వివాదాలు ఉన్నా షకీబ్ అల్ హసన్ ప్రస్తుత తరంలో ఉన్న గొప్ప ఆల్రౌండర్లలో ఒకడు. మైదానం వెలుపల.. బయట ఎంతో అగ్రెసివ్‌గా కనిపించే షకీబ్ ఆల్‌రౌండర్‌గా లెక్కలేనన్ని రికార్డులు తన సొంతం. బంగ్లాదేశ్ క్రికెటర్లలో ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న ఆటగాడు షకీబ్ అల్ హసన్. దాదాపు 15.6 మంది మిలియన్ ఫాలోవర్స్ అతని సొంతం. టి20లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో షకీబ్ అల్ హషన్ నెంబర్ వన్‌లో ఉన్నాడు. 99 టి20ల్లో 121 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక టి20 వరల్డ్‌కప్‌లోనూ అత్యధిక వికెట్లు షకీబ్(41 వికెట్లు) పేరిటే ఉండడం విశేషం. ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో షకీబ్ అల్ హసన్ ఎక్కువకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో నెంబర్-2లో ఉన్నాడు షకీబ్. బంగ్లాదేశ్ తరపున షకీబ్ 63 టెస్టులు, 221 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి బ్యాటింగ్‌లో 12వేలకు పైగా పరుగులు.. బౌలింగ్‌లో 621 వికెట్లు పడగొట్టాడు. చదవండి: NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్.. Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ దూరం..!
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌తో పాటు జింబాబ్వే పర్యటనకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ధృవీకరించింది. కాగా ప్రస్తుతం జరుగుతోన్న టీ20 సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ విండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే బంగ్లాదేశ్-వెస్టిండీస్ ద్వైపాక్షిక సిరీస్ వన్డే సూపర్ లీగ్ నుంచి మినహాయించబడింది. ఈ సిరీస్ వన్డే సూపర్ లీగ్‌లో భాగం కాకపోవడంతో షకీబ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. "జింబాబ్వే టూర్, విండీస్‌తో వన్డే సిరీస్‌లకు షకీబ్ అందుబాటులో ఉండడు. ఈ విషయం మాకు ముందే అతడు తెలియజేశాడు. ఈ సిరీస్‌లకు జట్టు ఎంపిక గురించి సెలక్షన్ ప్యానెల్‌తో చర్చించాం. అయితే ఇతర సీనియర్ ఆటగాళ్లు చాలా మంది అందుబాటులో ఉండనున్నారు" అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నారు. చదవండి: Wasim Jaffers India Playing XI: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. ఉమ్రాన్ మాలిక్‌కు నో ఛాన్స్..! -
మొమినల్ గుడ్ బై.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా వెటరన్ ఆల్‌రౌండర్!
Bangladesh New Test Captain: వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి డిప్యూటీగా లిటన్ దాస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ మొమినల్ హక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షకీబ్ మరోసారి బంగ్లాదేశ్ టెస్టు పగ్గాలు చేపట్టాడు. కాగా 2019లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించినా ఆ విషయాన్ని అతడు దాచిపెట్టాడు. అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో అతడిపై రెండేళ్ల పాటు వేటు పడింది. కాగా గతంలో షకీబ్ రెండుసార్లు బంగ్లా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2009లొ వెస్టిండీస్ పర్యటనలో మొర్తజా గాయపడగా.. షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత 2017లో సారథిగా ముష్ఫికర్ రహీమ్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక మొమినల్ సారథ్యంలో బంగ్లాదేశ్ మూడు టెస్టుల్లో మూడు విజయాలు సాధించగా.. రెండింటిని డ్రా చేసుకుంది. ఏకంగా 12 మ్యాచ్‌లలో పరాజయం చవిచూసింది. కాగా కెప్టెన్సీ భారాన్ని దించుకున్న మొమినల్ ఇకపై బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. చదవండి 👇 Eng Vs NZ 1st Test: మాథ్యూ పాట్స్ అరంగేట్రం.. ఇంగ్లండ్ తరఫున 704వ ఆటగాడిగా! IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! -
శ్రీలంకతో తొలి టెస్టు.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్..!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హాసన్ కరోనా బారిన పడ్డాడు. దీంతో మే 15 న చిట్టగాంగ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు షకీబ్ ఆల్ హాసన్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. షకీబ్ ఆల్ హాసన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. మళ్లీ అతడికి కొన్ని రోజులు తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తాం. అయితే అతడు తొలి టెస్టుకు దూరం కానున్నాడు అని బీసీబీ అధికారి పేర్కొన్నారు. చదవండి: ENG vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్! -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ఏ ఫార్మాట్లోనైనా ఇదే తొలి విజయం
సొంత మైదానంలో ఏ జట్టైనా బలంగా ఉంటుంది. ప్రత్యర్థి జట్లకు అవకావం ఇవ్వకుండా మ్యాచ్‌లను సొంతం చేసుకోవడం చూస్తుంటాం. కానీ టీమిండియాను మట్టికరిపించిన సౌతాఫ్రికాకు వారి సొంతగడ్డపైనే బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. సెంచురియన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రొటిస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఏ ఫార్మాట్లోనైనా ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు భారీ స్కోరు చేసింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 77 పరుగులు ఇన్నింగ్స్‌తో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించగా.. ఓపెనర్లు లిటన్ దాస్ 50, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 41 పరుగులతో రాణించగా.. చివర్లో యాసిర్ అలీ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బంగ్లాదేశ్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు 48.5 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వాండర్ డసెన్ (86), డేవిడ్ మిల్లర్(79).. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికి మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 4, తస్కిన్ అహ్మద్ 3, షోరిఫుల్ ఇస్లామ్ 2, మహ్మదుల్లా ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే వాండరర్స్ వేదికగా మార్చి 20న జరగనుంది. మూడు వన్డేల సిరీస్ అనంతరం బంగ్లాదేశ్.. సౌతాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. చదవండి: IPL 2022: ధోనిని క్లీన్‌బౌల్డ్ చేశా.. ఇప్పుడు నా టార్గెట్ కోహ్లి భాయ్' Cricketers Holy Celebrations: రోహిత్‌ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో -
IPL 2022 Auction: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య
ఐపీఎల్ 2022 మెగా వేలంలో వయసు మీద పడ్డ వెటరన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చని సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్, పుజారా, అమిత్ మిశ్రా, ఆదిల్ రషీద్, ఇమ్రాన్ తాహిర్, షకీబ్ అల్ హసన్.. ఇలా చాలా మంది వెటరన్ స్టార్లను దాదాపు అన్ని ఫ్రాంచైజీలు చూసిచూడనట్లు వ్యవహరించాయి. వేలం అనంతరం వీరిలో కొందరు ఆటగాళ్లను ఎంపిక చేసుకోకపోవడంపై పలు ఫ్రాంచైజీలు వివరణ కూడా ఇచ్చాయి. తాజాగా, స్టార్ ఆల్‌రౌండర్, బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్ మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంపై అతడి భార్య ఉమ్మే అహ్మద్ శిశిర్ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా షకీబ్ అన్ సోల్డ్‌గా మిగిలిపోవడానికి గల కారణాలను వివరించింది. మెగా వేలానికి ముందు కొన్ని ఫ్రాంచైజీలు షకీబ్‌ను సంప్రదించాయని, సీజన్ మొత్తానికి అతను అందుబాటులో ఉంటాడా.. లేదా.. అని ఆరా తీశాయని, శ్రీలంకతో సిరీస్ ఉన్నందున షకీబ్ వారికి నో చెప్పాడని, ఈ కారణంగానే అతన్ని ఏ జట్టూ తీసుకోలేదని శిశిర్ వివరణ ఇచ్చింది. వేలంలో అమ్ముడుపోకపోవడం పెద్ద పొరపాటేం కాదని, షకీబ్‌కి ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని భర్తను వెనకేసుకొచ్చింది. షకీబ్ ఐపీఎల్ ఆడాలనుకుంటే శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకునైనా ఆ పని చేయవచ్చని, కాని అతను డబ్బుల కంటే దేశానికి ఆడటాన్నే గౌరవంగా భావిస్తాడని శిశిర్ తన భర్తను ఆకాశానికెత్తింది. కాగా, శిశిర్ తన పోస్ట్‌లో శ్రీలంక సిరీస్ అని రాసుకొచ్చినప్పటికీ, వాస్తవానికి బంగ్లాదేశ్ మార్చి చివరన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. మార్చి 18న మొదలయ్యే ఈ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే, 2021 ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన షకీబ్.. ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. దీంతో అతడిపై ఈ ఏడాది మెగా వేలంలో ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. చదవండి: IND Vs WI: టీ20 సిరీస్‌కు ముందు అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. -
'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్‌రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్.. డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రావో, సురేశ్ రైనాల సరసన చేరాడు. అయితే క్రికెట్ రికార్డులు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే షకీబ్ జాయిన్ అయింది.. పుష్ప సినిమా క్లబ్లో. ఏ ముహుర్తానా పుష్ప సినిమా మొదలైందో గాని..థియేటర్ల నుంచి సినిమా వెళ్లిపోయినప్పటికి.. దాని ప్రభావం మాత్రం జనాలను విడవడం లేదు. పాటలు, డైలాగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాలా విశేషాలున్నాయి. ఇప్పటికే డేవిడ్ వార్నర్ నుంచి డ్వేన్ బ్రావో దాకా.. రవీంద్ర జడేజా నుంచి సురేశ్ రైనా వరకు పుష్ప సినిమాలో నుంచి ఏదో ఒక దానిపై వీడియోలు చేసి జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో మరోసారి పుష్ప స్టెప్పులతో మెరిశాడు. అయితే చివర్లో షకీబ్ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరింది. చదవండి: Dwayne Bravo: వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య మ్యాచ్ జరిగింది. కొమిల్లా విక్టోరియన్స్ ఇన్నింగ్స్ సమయంలో డుప్లెసిస్‌ను ఔట్ చేసిన తర్వాత.. షకీబ్ అల్లు అర్జున్ ''తగ్గేదే లే'' మేనరిజమ్‌కు శ్రీవల్లీ పాటను జత చేసి డ్యాన్స్ చేశాడు. శ్రీవల్లీ పాటలో లెగ్ మూమెంట్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అయితే షకీబ్ మాత్రం లెగ్ మూమెంట్ కాకుండా.. తన చేతులతోనే.. ఒకవైపు తగ్గేదే లే అంటూనే.. మరోవైపు శ్రీవల్లీ పాట డ్యాన్స్ చూపించాడు. షకీబ్ చేసిన కొత్త స్టెప్‌ను ట్విటర్లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది. ఇక మ్యాచ్‌లో షకీబ్ సారధ్యంలోని ఫార్చూన్ బారీషల్ 63 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ బారిషల్ 95 పరుగులకే కుప్పకూలింది. చదవండి: తలకు బలమైన గాయం.. అనుకున్నది సాధించాడు After Nazmul Islam, then @DJBravo47, and now the Bangladeshi 🐐 @Sah75official displaying the #Pushpa move! 🥳 The @alluarjun movie has really taken over the #BBPL2022. 🔥 📺 Catch these antics for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/lr5xUr0sLW#BPLonFanCode #alluarjun pic.twitter.com/9TAn8xqksr — FanCode (@FanCode) January 26, 2022 -
అందుకే టెస్టు సిరీస్‌కు దూరం.. 3 ఫార్మాట్లు ఆడటం కష్టం.. త్వరలోనే గుడ్‌బై!
Shakib Al Hasan Comments: ‘‘ఏ ఫార్మాట్ ఆడటం ముఖ్యమైనదో... దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నాకు తెలుసు. టెస్టు క్రికెట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. టెస్టులు ఆడతానో లేదో తెలియదు. ఒకవేళ ఆడినా.. ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు. వన్డేల్లో భాగం అవ్వాలో లేదో కూడా నిర్ణయించుకోవాలి. వేరే ఆప్షన్ లేదు కాబట్టి వన్డేలు ఆడాల్సిందే’’అని బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. త్వరలోనే టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో వ్యక్తిగత కారణాల వల్ల టీమ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు షకీబ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో జట్టుకు దూరం కావడం వివాదానికి దారి తీసినా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం అతడికి సెలవులు మంజూరు చేసింది. ఈ క్రమంలో స్థానిక టీవీ చానెల్ల్తో మాట్లాడిన షకీబ్ టెస్టులకు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. ఏదో ఒక ఫార్మాట్‌ను ఎంచుకోవాల్సి వస్తే మాత్రం వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘‘నేను ఇప్పటికిప్పుడు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని చెప్పడం లేదు. టీ20 వరల్డ్‌కప్-2022 తర్వాత పొట్టి ఫార్మాట్లో కూడా ఆడకపోవచ్చు. టెస్టులు, వన్డేలు ఆడతాను. అయితే.. మూడు ఫార్మాట్లు ఆడటం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమే. రెండు టెస్టులకోసం నెలలపాటు కష్టపడటంలో అర్థం లేదనిపిస్తోంది. బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత సరైన ప్రణాళికతోనే ముందుకు వెళ్తాను. స్మార్ట్‌గా ఆలోచించాలి కదా. జనవరిలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాను’’ అని షకీబ్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా బయో బబుల్ జీవితం జైలులా ఉందన్న ఈ ఆల్‌రౌండర్... ‘‘నచ్చిన చోటుకు వెళ్లకుండా ఒకే చోట ఉండటం మనసుకు కష్టంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్ జట్టు చూడండి ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచించిందో... కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాళ్ల అండర్-19 జట్టును ప్రపంచకప్ టోర్నీకే పంపలేదు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇలా కుటుంబాలకు దూరంగా ఉంటూ... ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండటం కష్టంగా ఉంటుంది. వారి పెంపకంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్నాళ్ల పాటు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నా’’ అని షకీబ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు వెల్లడించాడు. చదవండి: IND vs SA: 'మనోళ్లనే ముప్పతిప్పలు పెట్టాడు.. ఆ బౌలర్‌కు అవకాశమిస్తే' -
Ban Vs Pak: ఇప్పటికే వైట్‌వాష్.. బంగ్లాదేశ్‌కు వరుస షాకులు.. ఈసారి
Ban Vs Pak: Shakib Al Hasan To Miss 1st Test Tamim Iqbal Ruled Out Of NZ Series: పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ సందర్భంగా గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో అతడు మొదటి టెస్టుకు దూరం కానుండగా.. రెండో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్‌తో స్వదేశంలో 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురై టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్... పర్యాటక జట్టుకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక నవంబరు 26 నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తుండగా.. షకీబ్ వంటి స్టార్ ఆటగాడు దూరం కావడం లోటుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్ మిన్హాజుల్ అబెదిన్ మాట్లాడుతూ... ‘‘తొలి టెస్టులో షకీబ్ ఆడటం లేదు. గాయం(తొడ కండరాల నొప్పి) నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఫిజియోథెరపిస్ట్ రిపోర్టు ఇచ్చిన తర్వాతే... తను రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయంపై స్పష్టత ఇవ్వగలము’’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. మరో సీనియర్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ సైతం బొటనవేలి గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఎవరెస్టు ప్రీమియర్ లీగ్(సెప్టెంబరు- అక్టోబరు) సందర్భంగా అతడు గాయపడ్డాడు. ఇక పాకిస్తాన్‌తో పాటు... న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సైతం అతడు అందుబాటులో ఉండటం లేదు. ఇక ఇప్పుడు పాక్‌తో సిరీస్‌కు షకీబ్ దూరం కావడంతో వరుస షాకులు తగినట్లయింది. పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు బంగ్లాదేశ్ ప్రకటించిన జట్టు ఇదే: మొమినుల్ హక్(కెప్టెన్). షాద్మన్ ఇస్లాం, సైఫ్ హసన, నజ్ముల్ హుసేన్ షాంటో, ముష్పికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, నురుల్ హసన్ సొహాన్, మెహది హసన్ మిరాజ్, నయీం హసన్, తైజుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్ చౌదరి, అబు జాయేద్ చౌదరి రహీ, యాసిర్ అలీ రబ్బీ, మహ్మదుల్ హసన్ జాయ్, రేజూర్ రహమాన రాజా. చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్ Bangladesh all-rounder Shakib Al Hasan will not be available for the first Test against Pakistan, starting from November 26 at the Zahur Ahmed Chowdhury Stadium in Chattogram due to a hamstring strain #BANvPAK #Cricket — Saj Sadiq (@SajSadiqCricket) November 23, 2021 -
Wanindu Hasaranga: అదరగొట్టిన హసరంగ.. టీమిండియా బౌలర్లు ఒక్కరూ లేరు!
ICC T20 Rankings: Wanindu Hasaranga Tops No Indian Bowlers In Top 10: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో ఆకట్టుకున్న శ్రీలంక యువ సంచలనం వనిందు హసరంగ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. బౌలర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న హసరంగ.. ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-3లో నిలిచాడు. ఒక స్థానం మెరుగుపరచుకుని 173 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక అఫ్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ ఆల్‌రౌండర్ల జాబితాలో 265 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ మధ్యలోనే జట్టుకు దూరమైన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(260) ఒక స్థానం కోల్పోయి రెండో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. వనిందు హసరంగ(శ్రీలంక- 173), గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా- 165), ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సూద్(160) పాయింట్లతో మొదటి 5 ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా బౌలర్లు ఒక్కరూ లేరు ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్ జాబితాలో వనిందు హసరంగా(797) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2021లో మొత్తంగా(క్వాలిఫయర్స్, సూపర్ 12) 16 వికెట్లు పడగొట్టిన అతడు.. తన ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత తబ్రేజ్ షంసీ(దక్షిణాఫ్రికా- 784), ఆదిల్ రషీద్(ఇంగ్లండ్- 727), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్- 710), ఆడం జంపా(ఆస్ట్రేలియా- 709) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్, బౌలర్ల జాబితాలో ఒక్క టీమిండియా ప్లేయర్ కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. కాగా పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో పరాజయాల నేపథ్యంలో.. తర్వాతి మ్యాచ్‌లలో ఆకట్టుకున్నా కోహ్లి సేన సెమీస్ చేరలేక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli: అగ్రస్థానంలో బాబర్ ఆజమ్.. 4 స్థానాలు దిగజారిన కోహ్లి.. ఏకంగా.. After a strong #T20WorldCup campaign, Aiden Markram continues his climb 🧗♂️ Plenty of movement in the @MRFWorldwide T20I player rankings 👉 https://t.co/vJD0IY4JPU pic.twitter.com/Y7tTwgdvPM — ICC (@ICC) November 10, 2021 -
Shakib Al Hasan: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినీల జాబితా ఇదే!
ICC player of the month nominations for October: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుల నామినీలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అక్టోబరు నెలకు గానూ ఈ పురస్కారానికి తమ పరిశీలనలో ఉన్న క్రికెటర్ల పేర్లను గురువారం వెల్లడించింది. పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పాకిస్తాన్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ, నమీబియా బ్యాటర్ డేవిడ్ వీజ్ ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. అయితే, టీ20 వరల్డ్‌కప్ ఆరంభంలో దారుణంగా విఫలమైన నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో ఒక్కరి పేరు కూడా ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇక మహిళల విభాగంలో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ లారా డెలాని, బ్యాటర్ గాబీ లూయీస్, జింబాబ్వే కెప్టెన్ మేరీ అన్నే ముసొండ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. కాగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఐసీసీ ఈ ఏడాది ఆరంభంలో సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అత్యుత్తమంగా రాణించిన క్రికెటర్లను ప్రతి నెలా సత్కరించనుంది. షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్... అక్టోబరులో ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో మొత్తంగా 131 పరుగులు చేయడం సహా.. 11 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో రెండోసారి ఈ పురస్కారానికి నామినేట్ అయ్యాడు. ఆసిఫ్ అలీ(పాకిస్తాన్- Asif Ali) పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఆసిఫ్ అలీ టీ20 ప్రపంచకప్-2021లో ఇప్పటి వరకు 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 52 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. అంతేగాక అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్లో 4 సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. డేవిడ్ వీజ్(నమీబియా- David Wiese) ఈ ఏడాది(2021) తొలిసారిగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధించింది నమీబియా. అద్బుత ప్రదర్శనతో సంచలన విజయాలు సాధించి సూపర్- 12 రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇక నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో 162 పరుగులు చేయడం సహా... ఏడు వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 66 పరుగులతో అజేయంగా నిలిచి సూపర్-12కు తమ జట్టు దూసుకువెళ్లేలా చేశాడు. లారా డెలాని(Laura Delany) ఐర్లాండ్ ఆల్‌రౌండర్ లారా డెలాని అక్టోబరులో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 189 పరుగులు సాధించింది. 4 వికెట్లు కూడా తీసింది. సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించింది. గాబీ లూయీస్(Gaby Lewis) ఐర్లాండ్ బ్యాటర్ గాబీ లూయీస్ జింబాబ్వే సిరీస్‌లో 263 పరుగులు సాధించింది. వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. 3-1 తేడాతో ఐర్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. మేరీ- అన్నే ముసొండ(Mary-Anne Musonda) జింబాబ్వే కెప్టెన్ మేరీ- అన్నే ముసొండ ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మెరుగ్గా రాణించింది. 4 మ్యాచ్‌లలో మొత్తంగా 169 పరుగులు సాధించింది. ఐర్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించడంలో సెంచరీతో మెరిసి.. అజేయంగా నిలిచి.. తన సత్తా చాటింది. చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగాళ్లం అయిపోము కదా.. ఇప్పుడు..