నెదర్లాండ్స్‌పై 25 పరుగులతో గెలుపు
రాణించిన షకీబ్, రిషాద్
కింగ్స్‌టౌన్: టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గెలిచి నిలిచింది. సూపర్–8 అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు గురువారం జరిగిన పోరులో బంగ్లా 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ గెలుపుతో గ్రూప్ ‘డి’లోని మరో జట్టు శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన డచ్ జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గుచూపగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
మిడిలార్డర్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (46 బంతుల్లో 64 నాటౌట్; 9 ఫోర్లు) రాణించాడు. టాపార్డర్‌లో కెపె్టన్ నజ్ముల్ హోస్సేన్ (1), లిటన్ దాస్ (1)ల వైఫల్యంతో 23 పరుగులకే బంగ్లా 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ తంజిద్ హసన్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షకీబ్ మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.
ఆఖర్లో మహ్మూదుల్లా (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాకిర్ అలీ (7 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది.
సైబ్రాండ్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), విక్రమ్‌జీత్ సింగ్ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (23 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ కీలకమైన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. రిషాద్ హోస్సేన్ 3, టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.
టి20 ప్రపంచకప్‌లో నేడు
అఫ్గానిస్తాన్ X పాపువా న్యూగినీ
వేదిక: ట్రినిడాడ్; ఉదయం గం. 6 నుంచి
అమెరికా X ఐర్లాండ్
వేదిక: లాడెర్‌హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment