ICC WC 2023- Ban vs Ned: ‘‘మేము బాగానే బౌలింగ్ చేశామని భావించాను. నిజానికి వాళ్లను 160- 170 పరుగులకే కట్టడి చేయాల్సింది. ఇక టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటి వరకు బ్యాటింగ్ పరంగా మేము పూర్తిగా విఫలమయ్యాం.
టోర్నీ ఆసాంతం గెలుపు కోసం మేము తంటాలు పడుతూనే ఉన్నాం. ఈరోజు మా ప్రదర్శన మరింత చెత్తగా ఉంది. అసలు ఇది బంగ్లా జట్టేనా అనేలా మా ఆట తీరు ఉంది.
ఇక ముందు కూడా మాకు అన్నీ కఠిన సవాళ్లే ఎదురవుతాయి. అయితే, ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి ధైర్యంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంటుంది’’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు.
పటిష్టమైన దక్షిణాఫ్రికాను కంగుతినిపించి
కాగా ప్రపంచకప్-2023లో ఇదివరకే పటిష్టమైన దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన నెదర్లాండ్స్ తాజాగా బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. షకీబ్ బృందాన్ని ఏకంగా 87 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. డచ్ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (89 బంతుల్లో 68; 6 ఫోర్లు) రాణించాడు. వెస్లీ బారెసి (41 బంతుల్లో 41; 8 ఫోర్లు), సైబ్రాండ్ (61 బంతుల్లో 35; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు.
సులువైన లక్ష్యాన్ని ఛేదించలేక
ఈ క్రమంలో సులువైన లక్ష్యమే ఎదురైనా... బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. మెహిదీ హసన్ మిరాజ్ (40 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా మిగతావారంతా విఫలమయ్యారు. దీంతో బంగ్లాకు నెదర్లాండ్స్ చేతిలో పరాభవం తప్పలేదు.
ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బంగ్లాదేశ్ సారథి షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. మిగిలిన మ్యాచ్‌లలోనూ సవాళ్లు తప్పవని.. అయినా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు సాగుతామని తెలిపాడు.
ఏదేమైనా గెలుపోటముల్లో మాకు అండగా ఉన్న అభిమానులు ఇప్పటికీ తమకు మద్దతుగానే నిలుస్తున్నారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక శనివారం నాటి ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు నెదర్లాండ్స్ బౌలర్ పాల్ వాన్ మీకెరెన్ (4/23)కు దక్కింది.
స్కోరు వివరాలు
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జీత్ (సి) షకీబ్ (బి) తస్కీన్ 3; ఓ డౌడ్ (సి) తన్‌జీద్ (బి) షరీఫుల్ 0; వెస్లీ (సి) షకీబ్ (బి) ముస్తఫిజుర్ 41; అకెర్మన్ (సి) ముస్తఫిజుర్ (బి) షకీబ్ 15; ఎడ్వర్డ్స్ (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 68; లీడ్ (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 17; సైబ్రాండ్ (ఎల్బీ) మెహదీ హసన్ 35; వాన్ బిక్ నాటౌట్ 23; షారిజ్ రనౌట్ 6; ఆర్యన్ (సి) మిరాజ్ (బి) షరీఫుల్ 9; మీకెరెన్ (ఎల్బీ) (బి) మెహదీ హసన్ 0;
►ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 229.
►వికెట్ల పతనం: 1–3, 2–4, 3–63, 4–63, 5–107, 6–185, 7–185, 8–194, 9–212, 10–229. బౌలింగ్: షరీఫుల్ 10–0–51–2, తస్కీన్ 9–1–43–2, షకీబ్ 10–1– 37–1, మిరాజ్ 4–0–17–0, ముస్తఫిజుర్ 10–1–36–2, మెహదీ హసన్ 7–0–40–2.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ (సి) ఎడ్వర్ట్స్ (బి) ఆర్యన్ 3; తన్‌జీద్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బిక్ 15; మిరాజ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) లీడ్ 35; నజు్మల్ (సి) వాన్ బిక్ (బి) మీకెరెన్ 9; షకీబ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) మీకెరన్ 5; ముష్ఫికర్ (బి) మీకెరెన్ 1; మహ్ముదుల్లా (సి) ఆర్యన్ (బి) లీడ్ 20; మెహదీ హసన్ రనౌట్ 17; తస్కీన్ (సి) లీడ్ (బి) మీకెరెన్ 11; ముస్తఫిజుర్ (బి) అకెర్మన్ 20; షరీఫుల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6;
►మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 142.
►వికెట్ల పతనం: 1–19, 2–19, 3–45, 4–63, 5–69, 6–70, 7–108, 8–113, 9–142, 10–142. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–3–26–1, వాన్ బిక్ 9–1–30–1, అకెర్మన్ 7–1–25–1, మీకెరెన్ 7.2–0–23–4, లీడ్ 7–0–25–2, షారిజ్ అహ్మద్ 2–0–13–0.
చదవండి: WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా?
Comments
Please login to add a commentAdd a comment