WC 2023: నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్‌ విజయం | CWC 2023 2nd Match Pakistan vs Netherlands Updates Highlights | Sakshi
Sakshi News home page

WC 2023 Pak Vs Ned: నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్‌ విజయం

Published Fri, Oct 6 2023 2:18 PM | Last Updated on Sat, Oct 7 2023 10:44 AM

CWC 2023 2nd Match Pakistan vs Netherlands Updates Highlights - Sakshi

ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands Updates:
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 81 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో పాక్‌.. వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీని ఘన విజయంతో ఆరంభించింది. హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం డచ్‌ జట్టుతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, నెదర్లాండ్స్‌ ఆరంభం నుంచే పాక్‌కు చెమటలు పట్టించింది.

ఈ నేపథ్యంలో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పాక్‌ కష్టాల్లో ఉన్నవేళ మహ్మద్‌ రిజ్వాన్‌, సౌద్‌ షకీల్‌ చెరో 68 పరుగులతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసి కష్టాల నుంచి గట్టెక్కించారు.  ఆ తర్వాత మహ్మద్‌ నవాజ్‌ 38, షాదాబ్‌ ఖాన్‌ 32 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో 49 ఓవర్లలో పాక్‌ 286 పరుగులు స్కోరు చేసింది.

ఓడినా భళా అనిపించారు
లక్ష్య ఛేదనలో ఆరంభంలో అదరగొట్టినప్పటికీ నెదర్లాండ్స్‌ కీలక సమయంలో కీలక వికెట్లు కోల్పోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే.. పాక్‌కు మాత్రం గట్టి పోటీనివ్వడంలో సఫలమైంది. అద్భుత ఆట తీరుతో అభిమానుల మనసు గెలుచుకుంది.

37.1: తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
హసన్‌ అలీ బౌలింగ్‌లో ఆర్యన్‌ దత్‌ బౌల్డ్‌(1). స్కోరు: 186/9 (38)

35.6: ఎనిమిదో వికెట్‌ డౌన్‌
నవాజ్‌ బౌలింగ్‌లో మెర్వే(4) వెనుదిరిగాడు. 

33.2: కీలక వికెట్‌ డౌన్‌
బాస్‌ డి లిడే 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నవాజ్‌ బౌలింగ్లో బౌల్డ్‌ అయ్యాడు. దీంతో నెదర్లాండ్స్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 164/7 (33.2)

32.1: ఆరో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
సాకిబ్‌ జుల్ఫికర్‌(10) రూపంలో డచ్‌ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. స్కోరు.. 159/6 (32.3). లిడే 63, మెర్వే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

26.4: కెప్టెన్‌ డకౌట్‌
హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 133-5(27). లిడే(50), జుల్ఫికర్‌ క్రీజులో ఉన్నారు.

26.2: తేజ నిడమనూరు అవుట్‌
పాక్‌ బౌలర్‌ హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో తేజ నిడమనూరు అవుటయ్యాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో నెదర్లాండ్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 133/4 (26.3). లిడే(49), ఎడ్‌వర్డ్స్‌ క్రీజులో ఉన్నారు.

23.5: మూడో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
హాఫ్‌ సెంచరీ హీరో విక్రంజిత్‌ సింగ్‌(52) షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. స్కోరు 125/3 (24.5). బాస్‌ డి లిడే 46, తేజ నిడమనూరు క్రీజులో ఉన్నారు.


21 ఓవర్లలో నెదర్లాండ్స్‌ స్కోరు: 104-2
విక్రంజిత్‌ సింగ్‌ 43, బాస్‌ డి లిడే 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.

11.1: రెండో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
ఇఫ్తికర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అకెర్మాన్‌(17) బౌల్డ్‌. 12 ఓవర్లలో స్కోరు:  52-2

5.5: పాక్‌తో మ్యాచ్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
హసన్‌ అలీ బౌలింగ్‌లో మాక్స్‌ ఒడౌడ్‌(5) అవుట్‌. ఆరు ఓవర్లలో స్కోరు: 28-1.

పాకిస్తాన్‌ ఆలౌట్‌
వన్డే వరల్డ్‌కప్‌-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతున్న పాకిస్తాన్‌ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన పాక్‌
46.2: అకెర్మాన్‌ బౌలింగ్‌లో నవాజ్‌(38) రనౌట్‌. ఆఫ్రిది 11, రవూఫ్‌ క్రీజులో ఉన్నారు. స్కోరు: 268/9 (47)  


43.5: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
బాస్‌డి లిడే బౌలింగ్‌లో హసన్‌ అలీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పాక్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 252/8 (43.5)

43.4: బాస్‌ డి లిడే బౌలింగ్‌లో షాదాబ్‌ ఖాన్‌ బౌల్డ్‌(32) అయ్యాడు. పాక్‌ స్కోరు: 252/7 (43.4)

40 ఓవర్లలో పాక్‌ స్కోరు: 227-6

31.6: ఒకే ఓవర్లో రెండు వికెట్లు
బాస్‌ డి లిడే అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో రిజ్వాన్‌(68)ను బౌల్డ్‌ చేయడం సహా ఇఫ్తికర్‌ అహ్మద్‌(9)ను అవుట్‌ చేశాడు. 32 ఓవర్లలో పాక్‌ స్కోరు: 188-6. మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ క్రీజులో ఉన్నారు.

31.3: మహ్మద్‌ రిజ్వాన్‌ బౌల్డ్‌
68 పరుగులతో జోరు మీదున్న మహ్మద్‌ రిజ్వాన్‌ను బాస్‌ డి లిడే పెవిలియన్‌కు పంపాడు. దీంతో పాక్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది.

28.1: నాలుగో వికెట్‌ కోల్పోయిన పాక్‌
ఆర్యన్‌ దత్‌ బౌలింగ్‌లో సౌద్‌ షకీల్‌ అవుటయ్యాడు. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాకిబ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రిజ్వాన్‌ 53 పరుగులతో, ఇఫ్తికర్‌ అహ్మద్‌ క్రీజులో ఉన్నారు.

25 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 143/3. 

22.6: హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సౌద్‌ షకీల్‌
ఆరంభంలో తడబడిన పాకిస్తాన్‌ రిజ్వాన్‌, షకీల్‌ ఇన్నింగ్స్‌తో కోలుకుంది. 32 బంతుల్లో షకీల్‌ అర్ధ శతకం సాధించగా.. రిజ్వాన్‌ సైతం హాఫ్‌ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. ఎట్టకేలకు సెంచరీ కొట్టిన పాక్‌


►20 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 101-3

రిజ్వాన్‌ 38, షకీల్‌ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

►16 ఓవర్లలో పాక్‌ స్కోరు: 81/3


►నిలకడగా ఆడుతున్న రిజ్వాన్‌, షకీల్‌

పాక్‌ బ్యాటర్లు మహ్మద్‌ రిజ్వాన్‌(21), సౌద్‌ షకీల్‌(23) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దుతున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంతో పాకిస్తాన్‌ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.

►10 ఓవర్లలో పాక్‌ స్కోరు: 43/3


►9.1: మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌

పాకిస్తాన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కెప్టెన్‌ బాబర్‌ ఆజం అవుటైన మరుసటి ఓవర్లోనే ఇమామ్‌ ఉల్‌ హక్‌ అవుటయ్యాడు. 15 పరుగులో నిలకడగా ఆడుతున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ను డచ్‌ బౌలర్‌ వాన్ మీకెరెన్ అద్భుతమైన బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు.

షాట్‌కు యత్నించిన ఇమామ్‌ ఆర్యన్‌ దత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మహ్మద్‌ రిజ్వాన్‌, సౌద్‌ షకీల్‌ క్రీజులో ఉన్నారు.

8.3: రెండో వికెట్‌ డౌన్‌
డచ్‌ జట్టుతో మ్యాచ్‌లో కెప్టెన్‌ బాబర్‌ ఆజం(5) రూపంలో పాకిస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అకెర్మాన్ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా బంతిని తరలించబోయిన బాబర్‌ సాకిబ్‌ కు క్యాచ్‌ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. ఈ వన్డే వరల్డ్‌ నంబర్‌ బ్యాటర్‌ను అకెర్మాన్‌ అవుట్‌ చేయగానే నెదర్లాండ్స్‌ శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. 

5 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 18-1
బాబర్‌ ఆజం 2, ఇమామ్‌ ఉల్‌ హక్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌
3.4: వాన్‌ బీక్‌ బౌలింగ్‌లో పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ అవుటయ్యాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. 

నెదర్లాండ్స్‌తో పాక్‌ తొలిపోరు
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌ తమ ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్లు శుక్రవారం పోటీకి దిగాయి. టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని బాబర్‌ ఆజం బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

తుది జట్లు
నెదర్లాండ్స్‌
విక్రమ్‌జిత్‌ సింగ్, మాక్స్ ఒడౌడ్, కొలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్& వికెట్ కీపర్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.

పాకిస్తాన్‌
ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్‌.

చదవండి: పాక్‌, ప్రోటీస్‌ కాదు.. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు చెరే జట్లు ఇవే: సచిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement