Babar Azam
-
‘చాంపియన్స్ ట్రోఫీలో కచ్చితంగా ఆడతా.. ఈసారి కూడా’
త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తాను పునరాగమనం చేస్తానని వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)లో భాగమమవుతానని తెలిపాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.కేవలం 33 పరుగులేకాగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా పాక్ తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు ఫఖర్ జమాన్(Fakhar Zaman). అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ పూర్తిగా తేలిపోయాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 33 పరుగులే చేశాడు. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో అమెరికా చేతిలో ఓడి పాకిస్తాన్ అవమాన భారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.బోర్డుతో విభేదాలుఇక అప్పటి నుంచి ఫఖర్ జమాన్ మరోసారి పాక్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. బాబర్ ఆజం(Babar Azam)నకు మద్దతుగా నిలిచిన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో సమయంలో బాబర్, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేస్తూ పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్ తప్పుబట్టాడు. ముఖ్యంగా బాబర్ విషయంలో ఇలా చేయడం సరికాదంటూ సెలక్టర్ల తీరును విమర్శించాడు.ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ.. ఫఖర్ జమాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ను ప్రశ్నించడం వెనుక కారణమేమిటో చెప్పాలంటూ బోర్డు తరఫున షోకాజ్ నోటీస్ జారీ చేశాడు. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే పీసీబీ.. ఫఖర్ జమాన్‌ను పక్కనపెట్టిందని.. అందుకే జట్టుకు ఎంపిక చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.అసలు కారణం ఇదీఈ విషయాలపై ఫఖర్ జమాన్ తాజాగా స్పందించాడు. ‘‘చాలా మందికి నేను జట్టుకు ఎందుకు దూరమయ్యానో తెలియదు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాను. నేను వందశాతం ఫిట్‌గా లేకపోవడం వల్లే జట్టుకు ఎంపిక చేయలేదు.అయితే, కచ్చితంగా నేను మళ్లీ పాక్ తరఫున బరిలోకి దిగుతాను. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. పాకిస్తాన్ తదుపరి ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొంటాను’’ అని ఫఖర్ జమాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీతో తనకు గుర్తింపు వచ్చిందన్న ఈ వెటరన్ ప్లేయర్.. ‘‘పాకిస్తాన్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో పర్యటించింది.ఆ జట్లలో నేను భాగం కాలేకపోయాను. కానీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం చాంపియన్స్ ట్రోఫీ మీదే ఉంది. 2017లో చాంపియన్స్ ట్రోఫీలో ప్రతిభ చూపినందు వల్లే నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఈసారి కూడా అదే తరహాలో రాణించాలని పట్టుదలగా ఉన్నాను. మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు.అందుకు రెడీగానే ఉన్నానుఇక ఇప్పటికే ఓపెనర్‌గా యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఫఖర్ జమాన్ స్పందిస్తూ.. ‘‘అతడు గొప్పగా ఆడుతున్నాడు. వచ్చే నాలుగైదేళ్లలో టాప్ బ్యాటర్‌గా ఎదుగుతాడు. ఇక మేనేజ్మెంట్ నన్ను నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా రెడీగానే ఉన్నాను. అన్నింటికంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం’’ అని పేర్కొన్నాడు.కాగా 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా సెంచరీతో చెలరేగి.. పాకిస్తాన్‌కు టైటిల్ అందించాడు ఫఖర్ జమాన్. ఇదిలా ఉంటే.. 2017 తర్వాత తొలిసారిగా జరిగే చాంపియన్స్ ట్రోఫీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.చదవండి: VHT: ఇంగ్లండ్‌తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి విశ్రాంతి! -
బాబర్పైకి బంతి విసిరిన ముల్దర్.. పాక్ బ్యాటర్ రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు సందర్భంగా వియాన్ ముల్దర్(Wiaan Mulder)- బాబర్ ఆజం(Babar Azam) మధ్య వాగ్వాదం జరిగింది. తన పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు బాబర్ వియాన్ ముల్దర్ వైపునకు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ముదరగా.. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మిశ్రమ ఫలితాలుకాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య జట్టు 2-0తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్‌లో మాత్రం పర్యాటక పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చరిత్రలోనూ ఎన్నడూ లేనివిధంగా.. సౌతాఫ్రికా గడ్డపై 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.అరుదైన ఘనతతద్వారా ప్రొటిస్ దేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జట్టుగా మహ్మద్ రిజ్వాన్ బృందం నిలిచింది. అయితే, టెస్టు సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో షాన్ మసూద్ బృందం ఓటమిపాలైంది. ఇక శుక్రవారం మొదలైన రెండో టెస్టులోనూ కష్టాల్లో కూరుకుపోయింది.రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీకేప్టౌన్లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీ(259)తో విరుచుకుపడగా.. కెప్టెన్ తెంబా బవుమా(106), వికెట్ కీపర్ బ్యాటర్ వెరియెన్నె(100) కూడా శతక్కొట్టారు. మార్కో జాన్సెన్(62) అర్ధ శతకంతో రాణించగా.. కేశవ్ మహరాజ్ తన వంతుగా 40 పరుగులు సాధించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఏకంగా 615 పరుగులు స్కోరు చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 194 పరుగులకే కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. ప్రొటిస్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీయగా.. క్వెనా మఫాకా, కేశవ్ మహరాజ్ చెరో రెండు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.షాన్ మసూద్ శతకం.. సెంచరీ మిస్ అయిన బాబర్ ఆజంఈ నేపథ్యంలో.. మొదటి ఇన్నింగ్స్‌లో 200కు పైగా ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను ఫాలో ఆన్ ఆడిస్తోంది. దీంతో వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు శుభారంభం చేయగలిగింది. కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ(145)తో చెలరేగగా.. బాబర్ ఆజం కూడా శతకం దిశగా పయనించాడు. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జాన్సెన్ బౌలింగ్‌లో బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, అంతకంటే ముందు అంటే.. ఆదివారం నాటి ఆటలో భాగంగా బాబర్ ఆజం- ప్రొటిస్ పేసర్ వియాన్ ముల్దర్ మధ్య గొడవ జరింది. తన బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి బాబర్ విఫలం కాగా.. ముల్దర్ బంతిని చేజిక్కించుకుని బ్యాటర్ వైపు బలంగా విసిరాడు.సౌతాఫ్రికా పేసర్ దూకుడు.. ఉరిమి చూసిన బాబర్ ఆజంఅప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన బాబర్ ఆజం వికెట్లకు కాస్త దూరంగానే ఉన్నా బంతి అతడికి తాకింది. దీంతో బాబర్ కోపోద్రిక్తుడై.. చూసుకోవా అన్నట్లుగా ముల్దర్వైపు ఉరిమి చూశాడు. అయితే, అతడు కూడా ఏమాత్రం తగ్గకుండా బాబర్‌ను చూస్తూ దూకుడుగా మాట్లాడాడు. దీంతో గొడవ పెద్దదయ్యే సూచన కనిపించగా అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 352 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది.Fight moment between Babar Azam and Wiaan Mulder. 🥵Wiaan Mulder unnecessary throws the ball at Babar Azam & showing him verbal aggression. #BabarAzam𓃵 #PAKvsSA #SAvPAK pic.twitter.com/PZnPNTWELZ— Ahtasham Riaz (@ahtashamriaz22) January 5, 2025 -
ఒకే రోజు రెండు హాఫ్ సెంచరీలు.. ఫామ్‌లోకి వచ్చిన బాబర్ ఆజమ్
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఒకే రోజు (మూడో రోజు) రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేసి బాబర్.. రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగలు చేసి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. చాలాకాలం పాటు పేలవ ఫామ్‌తో సతమతమైన బాబర్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. బాబర్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో (తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్) హాఫ్ సెంచరీలు చేశాడు.మ్యాచ్ మూడో రోజు బాబర్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలడంతో పాక్ ఇదే రోజు ఫాలో ఆడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లుమూడో రోజు మూడో సెషన్ సమయానికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, షాన్ మసూద్ (78) నిలకడగా ఆడుతున్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 269 పరుగులు వెనుకపడి ఉంది.ఫాలో ఆన్ ఆడుతున్న పాక్తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే చాపచుట్టేసిన పాక్ ఫాలో ఆన్ ఆడుతుంది. సఫారీ బౌలర్లు రబాడ (3/55), క్వేనా మఫాకా (2/43), కేశవ్ మహారాజ్ (2/14), మార్కో జన్సెన్ (1/36), వియాన్ ముల్దర్ (1/44) ధాటికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) పర్వాలేదనిపించాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు.సౌతాఫ్రికా భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (615 పరుగులు) చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
2024లో అత్యుత్తమ ప్రదర్శనలు వీరివే..!
2024లో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనల వివరాలను ఈ అర్టికల్‌లో చూద్దాం.టెస్ట్‌ల్లో..అత్యధిక పరుగులు-జో రూట్ (1556)అత్యధిక సెంచరీలు-జో రూట్ (6)అత్యధిక అర్ద సెంచరీలు-యశస్వి జైస్వాల్ (9)అత్యధిక సగటు-కమిందు మెండిస్ (74.92)అత్యధిక స్కోర్-హ్యారీ బ్రూక్ (317)అత్యధిక సిక్సర్లు-యశస్వి జైస్వాల్ (36)అత్యధిక వికెట్లు-జస్ప్రీత్ బుమ్రా (71)అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు-జస్ప్రీత్ బుమ్రా (5)అత్యధిక సగటు-జస్ప్రీత్ బుమ్రాఅత్యుత్తమ ఎకానమీ-జస్ప్రీత్ బుమ్రా (2.96)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (ఇన్నింగ్స్‌లో)-నౌమన్ అలీ (8/46)వన్డేల్లో..అత్యధిక పరుగులు-కమిందు మెండిస్ (742)అత్యధిక శతకాలు-సైమ్ అయూబ్ (3)అత్యధిక సగటు-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (106.25)అత్యధిక స్ట్రయిక్‌రేట్-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (120.05)అత్యధిక స్కోర్-పథుమ్ నిస్సంక (210 నాటౌట్)అత్యధిక సిక్సర్లు-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (23)అత్యధిక వికెట్లు- హసరంగ, హేలిగర్ (26)అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు-అల్లా ఘజన్ఫర్ (2)అత్యుత్తమ సగటు-ఎస్ అహ్మద్ (10.94)అత్యుత్తమ ఎకానమీ-బెర్నాల్డ్ స్కోల్జ్ (3.46)అత్యధిక స్ట్రయిక్‌రేట్-వనిందు హసరంగ (17.4)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-వనిందు హసరంగ (7/19)టీ20ల్లో..అత్యధిక పరుగులు-బాబర్ ఆజమ్ (738)అత్యధిక సెంచరీలు-సంజూ శాంసన్ (3)అత్యధిక సగటు-తిలక్ వర్మ (102)అత్యధిక అర్ద సెంచరీలు-బాబర్ ఆజమ్ (6)అత్యధిక స్కోర్-ఫిన్ అలెన్ (137)అత్యధిక సిక్సర్లు-నికోలస్ పూరన్ (39)అత్యధిక వికెట్లు-వనిందు హసరంగ (38)అత్యుత్తమ బౌలింగ్ సగటు-లోకీ ఫెర్గూసన్ (9.25)అత్యుత్తమ ఎకానమీ-రషీద్ ఖాన్ (5.60)అత్యధిక స్ట్రయిక్‌రేట్-రషీద్ ఖాన్ (10.2)అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6/10) -
చరిత్ర సృష్టించిన బాబర్.. ప్రపంచంలోనే మూడో ప్లేయర్‌గా..
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం(Babar Azam) పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఈ క్రమంలో పాక్ అభిమానులు సైతం బాబర్ ఆట తీరుపై మండిపడుతున్నారు. పునరాగమనంలోనూ పాత కథే పునరావృతం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విఫలమైనా.. ఓ అరుదైన రికార్డుఇలా ఓవైపు బాబర్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా.. అతడి ఫ్యాన్స్ మాత్రం బాబర్‌కు మరెవరూ సాటిరారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రొటిస్ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఓ అరుదైన రికార్డు సాధించడమే ఇందుకు కారణం.మూడు ఫార్మాట్లలోనూకాగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం చేసిన నాలుగు పరుగుల కారణంగా.. టెస్టుల్లో అతడు నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా పాక్ తరఫున.. టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.కోహ్లి, రోహిత్ తర్వాతఅంతేకాదు.. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగానూ బాబర్ ఆజం అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) మాత్రమే ఈ ఘనత సాధించారు.కాగా బాబర్ ఆజం ఇప్పటి వరకు 56 టెస్టుల్లో కలిపి 4001 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. 123 వన్డేల్లో 19 సెంచరీలు, 34 ఫిఫ్టీల సాయంతో బాబర్ 5957 రన్స్ పూర్తి చేసుకున్నాడు. కష్టాల్లో పాక్ జట్టుఅంతేకాదు.. 128 అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలు, 36 హాఫ్ సెంచరీ సాయంతో 4223 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సెంచూరియన్‌లో గురువారం మొదలైన తొలి టెస్టులో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ప్రొటిస్ బౌలర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలగా.. కమ్రాన్ గులామ్(54) అర్థ శతకంతో ఆదుకున్నాడు. ఇక మహ్మద్ రిజ్వాన్(27), అమీర్ జమాల్(28) మాత్రమే ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తుశారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 195 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది షాన్ మసూద్ బృందం. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో తొలి మ్యాచ్ తర్వాత బాబర్ ఆజంపై వేటు పడగా.. మళ్లీ సౌతాఫ్రికా గడ్డపై అతడు టెస్టుల్లో పునరాగమనం చేశాడు.చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్ -
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. తుది జట్టును ప్రకటించిన పాకిస్తాన్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అదే జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా గురువారం నుంచి మొదలు కానుంది.ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టు(క్రిస్ట్మస్ తర్వాతి రోజు జరిగే మ్యాచ్) కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ తుది జట్టును ప్రకటించింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అక్టోబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో బాబర్ చివరిసారిగా పాక్ తరపున ఆడాడు.ఆ తర్వాత సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు పీసీబీ బాబర్‌ను పక్కన పెట్టింది. ఇప్పుడు మరోసారి అతడికి పాక్ క్రికెట్ బోర్డు అవకాశమిచ్చింది. మరోవైపు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేసిన అబ్దుల్లా షఫీక్‌పై పీసీబీ వేటు వేసింది.అతడి స్దానంలోనే బాబర్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లతో పాక్ బరిలోకి దిగుతోంది. కాగా ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా జరుగుతోంది.తుది జట్లుపాకిస్థాన్: షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ముహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, అమీర్ జమాల్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, ముహమ్మద్ అబ్బాస్.దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రేన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
కోహ్లితో పోలికా?.. నవ్వకుండా ఉండలేను: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్, క్రికెట్ రారాజు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునికతరం ఆటగాళ్లలో కోహ్లికి సాటి వచ్చే క్రికెటర్ మరొకరు లేడన్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ రన్‌మెషీన్ అరుదైన ఘనతలు సాధించాడని పేర్కొన్నాడు.81 సెంచరీలుఅలాంటి గొప్ప ఆటగాడితో వేరే వాళ్లను పోలిస్తే తాను నవ్వకుండా ఉండలేనని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ తర్వాత వంద శతకాలకు చేరువైన ఏకైక ఆటగాడిగా కోహ్లి వెలుగొందుతున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో 30, అంతర్జాతీయ టీ20లలో ఒక శతకం బాదాడు.మొత్తంగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 81 సెంచరీలు చేసిన కోహ్లి ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కోహ్లి సాధించిన పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో చాలా మంది పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్‌ను కోహ్లితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమేఈ విషయంపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. కోహ్లికి మరెవరూ సాటిరారని.. ఇలాంటి పోలికలు హాస్యాస్పదంగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘నవతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యంత గొప్ప ఆటగాడు. అతడిని బాబర్ ఆజం.. లేదంటే స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పోలిస్తే నాకు నవ్వు వస్తుంది.కోహ్లిని ఎవరితో పోల్చలేము. అతడికి మరెవరూ సాటిరారు. ఎందుకంటే.. ఒంటిచేత్తో అతడు టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు. అది కూడా కేవలం ఏ ఒక్క ఫార్మాట్లోనూ కాదు.. మూడు ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.మిగతా ప్లేయర్లలో ఇలాంటి ఘనత వేరెవరికీ సాధ్యం కాదు. ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమే’’ అని మహ్మద్ ఆమిర్ కోహ్లి నైపుణ్యాలను కొనియాడాడు. కోహ్లికి కఠిన పరిస్థితుల ఎలా బయటపడాలో బాగా తెలుసునని.. ప్రత్యర్థి జట్ల పట్ల అతడొక సింహస్వప్నం అని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రెడిక్టా షోలో ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగాకాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో శతకం బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో మాత్రం తేలిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. మహ్మద్ ఆమిర్ మాత్రం కఠిన దశ నుంచి వేగంగా కోలుకోవడం కోహ్లికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత పదేళ్ల పాటు రాణించిన తీరే ఇందుకు నిదర్శనం అని తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత
సౌతాఫ్రికా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సౌతాఫ్రికా 2-0తో నెగ్గింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన పాకిస్తాన్.. తాజాగా మూడో వన్డేలోనూ విజయం సాధించింది. జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది.సయీమ్ అయూబ్ శతకంఇక వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ బృందం తొమ్మిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఓపెనర్ సయీమ్ అయూబ్(94 బంతుల్లో 101) శతకంతో చెలరేగగా.. బాబర్ ఆజం(52), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(53) హాఫ్ సెంచరీలు సాధించారు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(48), తయ్యబ్ తాహిర్(28) రాణించారు. టాపార్డర్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్(0)తో పాటు లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైంది. ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబడ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, క్వెనా మఫాకా, కార్బిన్ బాష్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. క్లాసెన్ ఒక్కడేఅయితే, లక్ష్య ఛేదనలో మాత్రం సౌతాఫ్రికా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఓపెనర్లలో టోనీ డి జోర్జి(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తెంబా బవుమా 8 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాసీ వాన్ డెర్ డసెన్ 35 రన్స్‌తో రాణించగా.. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్(19) నిరాశపరిచాడు.ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రొటిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేవలం 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. అయితే, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో తయ్యబ్ తాహిర్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ పెవిలియన్ చేరడంతో ప్రొటిస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.36 పరుగుల తేడాతో పాక్ గెలుపుమార్కో జాన్సెన్(26), కార్బిన్ బాష్(40 నాటౌట్) కాసేపు పోరాడగా.. జార్న్ ఫార్చూన్(8), కగిసో రబడ(14), మఫాకా(0) విఫలమయ్యారు. ఫలితంగా 42 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికాపై.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీం నాలుగు వికెట్లు కూల్చగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా చెరో రెండు.. మహ్మద్ హొస్నేన్, సయీమ్ ఆయుబ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాను వన్డేల్లో వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగాకాగా 1991లో అధికారికంగా తొలిసారి వన్డే సిరీస్ ఆడిన సౌతాఫ్రికా.. స్వదేశంలో క్లీన్‌స్వీప్ కావడం ఇదే మొదటిసారి. తద్వారా ప్రొటిస్ గడ్డపై సౌతాఫ్రికాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఫీట్ నమోదు చేసింది.అంతేకాదు.. సౌతాఫ్రికాపై పాకిస్తాన్‌కు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్ విజయం. ఈ ఘనత సాధించిన తొలి జట్టు కూడా పాకిస్తాన్ కావడం విశేషం. ఇక మూడో వన్డేలో సెంచరీ చేసిన సయీమ్ ఆయుబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.చదవండి: VHT 2024: అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక -
SA vs Pak: పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సౌతాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించి 81 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా టీ20, వన్డే, టెస్టులు ఆడేందుకు పాక్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య సౌతాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. పర్ల్ వేదికగా మంగళవారం నాటి తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రిజ్వాన్ బృందం.. కేప్‌టౌన్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది.ఓపెనర్లు విఫలంన్యూలాండ్స్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ 25 పరుగులకే వెనుదిరిగాడు.కమ్రాన్ గులామ్ మెరుపు అర్ధ శతకంఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(95 బంతుల్లో 73) మెరుగ్గా రాణించగా.. రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్(82 బంతుల్లో 80)తో మెరిశాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(33) ఫర్వాలేదనిపించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది.ప్రొటిస్ జట్టు బౌలర్లలో యువ పేసర్ క్వెనా మఫాకా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ మూడు, బిజోర్న్ ఫార్చూన్, పెహ్లూక్వాయో తలా ఒక వికెట్ తీశారు. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కెప్టెన్ తెంబా బవుమా(12), టోనీ డి జోర్జీ(34), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(23) విఫలమయ్యారు.హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌ఇక మిడిలార్డర్లో ఐడెన్ మార్క్రమ్(21) నిరాశపరచగా.. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో అతడు 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 97 పరుగులు సాధించి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక డేవిడ్ మిల్లర్(29) కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు.సిరీస్ పాక్ కైవసంఈ క్రమంలో 43.1 ఓవర్లకే సౌతాఫ్రికా కథ ముగిసిపోయింది. ఆతిథ్య ప్రొటిస్‌ను 248 పరుగులకే పరిమితం చేసిన పాకిస్తాన్.. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు, నసీం షా మూడు, అబ్రార్ అహ్మద్ రెండు, సల్మాన్ ఆఘా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జొహన్నస్‌బర్గ్‌లో జరుగుతుంది.చదవండి: IND W Vs WI W: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం -
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 19) రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌కు శుభారంభం లభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడో టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. పాక్ క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది.ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ రికార్డుపై కన్నేశాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో బాబర్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4732 పరుగులు చేశాడు. మరోవైపు ధోని SENA దేశాల్లో 38 హాఫ్ సెంచరీ సాయంతో 5273 పరుగులు చేశాడు. SENA దేశాల్లో ధోని, బాబర్ ప్రస్తుతం 38 యాభై ప్లస్ స్కోర్లు కలిగి ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డేలో బాబర్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. SENA దేశాల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని అధిగమిస్తాడు.తొలి వన్డేలో పాక్ ఘన విజయంతొలి వన్డేలో అఘా సల్మాన్ ఆల్‌రౌండర్ షో, సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలో బాబర్ ఆజమ్ 23 పరుగులు చేసి ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బాబర్‌కు శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. బాబర్ గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతను హాఫ్ సెంచరీ మార్కు తాకి కూడా చాన్నాళ్లవుతుంది. -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పాక్‌కు చేదు అనుభవంసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకగా.. పాక్‌కు చేదు అనుభవం ఎదురైంది.డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. సెంచూరియన్‌లో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పాక్.సయీమ్ ఆయుబ్ ధనాధన్ ఇన్నింగ్స్ వృథాఓపెనర్ సయీమ్ ఆయుబ్(57 బంతుల్లో 98 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు.. బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ సూపర్ సెంచరీ(63 బంతుల్లో 117), రాసీ వాన్ డెర్ డసెన్(38 బంతుల్లో 66) అద్భుత అర్ధ శతకం కారణంగా పాక్‌కు ఓటమి తప్పలేదు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్)నే ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.. దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.గేల్ ప్రపంచ రికార్డును బద్దలుసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం షార్టెస్ట్ క్రికెట్లో ఓవరాల్‌గా 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్‌కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ 298 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే, ఓవరాల్‌గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో గేల్ యూనివర్సల్ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 14562 టీ20 రన్స్ ఉన్నాయి.టీ20 క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు సాధించిన ఆటగాళ్లు1. బాబర్ ఆజం- 298 ఇన్నింగ్స్2. క్రిస్ గేల్- 314 ఇన్నింగ్స్3. డేవిడ్ వార్నర్- 330 ఇన్నింగ్స్4. విరాట్ కోహ్లి- 337 ఇన్నింగ్స్.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీ ఎంట్రీ
సౌతాఫ్రికాలో పాకిస్తాన్ పర్యటన ఇవాల్టి (డిసెంబర్ 10) నుంచి మొదలవుతుంది. డర్బన్ వేదికగా ఇరు జట్లు ఇవాళ తొలి టీ20లో తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును కాసేపటి కిందే ప్రకటించారు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.జింబాబ్వే టీ20 సిరీస్ పాక్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. గత కొన్ని సిరీస్‌లుగా అఘా దారుణంగా విఫలమవుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో రాణించిన తయ్యబ్ తాహిర్ మిడిలార్డర్లో కీలకపాత్ర పోషించనున్నాడు. మిడిలార్డర్లో ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది సందిగ్దంగా మారింది. జింబాబ్వే పర్యటనలో సత్తా చాటిన సైమ్ అయూబ్‌ను ఓపెనర్‌గా పంపిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తూ ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు.అబ్బాస్ అఫ్రిదితో పాటు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ పేస్ విభాగంలో ఉంటారు. స్పిన్నర్లు సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగనున్నారు. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. సౌతాఫ్రికాతో తొలి టీ20కి పాక్ తుది జట్టు..మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్‌కీపర్), బాబర్ ఆజమ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, తయ్యబ్ తాహిర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ -
సౌతాఫ్రికా టూర్‌కు పాక్ జట్టు ప్రకటన: బాబర్ రీ ఎంట్రీ! అతడికి నో ఛాన్స్
సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు టీమ్‌లలోనూ చోటు దక్కించుకోగా.. టెస్టు జట్టులో ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిది పేరు మాత్రం లేదు.కాగా మూడు వన్డే, మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబరు 10న తొలి టీ20తో ఈ టూర్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పీసీబీ బుధవారం ఈ సిరీస్‌లకు సంబంధించి మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.టెస్టులలో బాబర్ పునరాగమనం.. అతడికి మాత్రం చోటు లేదుటెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మూడు జట్లలో స్థానం సంపాదించాడు. కాగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై తొలి టెస్టులో విఫలమైన తర్వాత.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండా బాబర్‌పై వేటు పడింది. అతడితో పాటు షాహిన్నూ తప్పించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. యువ పేసర్ నసీం షా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది టీ20, వన్డేలు మాత్రమే ఆడి.. టెస్టులకు దూరంగా ఉండనున్నాడు.తప్పించారా? రెస్ట్ ఇచ్చారా?వచ్చే ఏడాది సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షాహిన్‌కు పీసీబీ ఈ మేర పనిభారం తగ్గించి.. విశ్రాంతినివ్వాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల క్వైద్-ఇ-ఆజం ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 31 వికెట్లతో సత్తా చాటిన రైటార్మ్ సీమర్ మహ్మద్ అబ్బాస్ దాదాపు మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.తొలిసారి వన్డే జట్టుకు సూఫియాన్ ఎంపికఅదే విధంగా.. ఖుర్రం షెహజాద్, మీర్ హంజా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. షాజిద్ ఖాన్ మాత్రం మిస్సయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌గా నొమన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ సూఫియాన్ మోకీం తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య డిసెంబరు 10, 13, 14 తేదీల్లో టీ20... డిసెంబరు 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అదే విధంగా.. డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికాతో టెస్టులకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.సౌతాఫ్రికాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).సౌతాఫ్రికాతో టీ20లకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సూఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
విరాట్ కోహ్లిని అధిగమించిన బాబర్ ఆజమ్
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 18) జరిగిన మూడో టీ20లో బాబర్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేసిన బాబర్.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లిని అధిగమించాడు. ప్రస్తుతం బాబర్ కంటే ముందు రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-4 ఆటగాళ్లు..1. రోహిత్ శర్మ- 4231 పరుగులు2. బాబర్ ఆజమ్- 41923. విరాట్ కోహ్లి- 41884. పాల్ స్టిర్లింగ్- 3655మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో పాక్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు ఆరోన్ హార్డీ మూడు.. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ తలో రెండు.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో కేవలం 11.2 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో జోస్ ఇంగ్లిస్ 27, జేక్ ఫ్రేజర్ 18, టిమ్ డేవిడ్ 7 (నాటౌట్), మాథ్యూ షార్ట్ 2 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, జహన్దాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదిలకు తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆస్ట్రేలియానే గెలుపొందింది. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించింది. -
చరిత్రకెక్కిన బాబర్ ఆజం.. తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా! మాలిక్ రికార్డు బ్రేక్
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ తరపున అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. గురువారం బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 బాబర్‌కు 124వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను బాబర్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు పాక్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(123) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మాలిక్ రికార్డును ఆజం బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు 124 టీ20లు ఆడిన బాబర్.. 40.67 సగటుతో 4148 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. వెలుతురు లేమి కారణంగా నిర్ణీత సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన తొలి టి20ని చివరకు 7 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్వెల్19 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టొయినిస్ (7 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 7 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 64 పరుగులకు పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో అబ్బాస్ అఫ్రిది (20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. -
అగ్రస్థానాల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అఫ్రిది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అఫ్రిది 12.62 సగటున ఎనిమిది వికెట్లు తీశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిది మూడు స్థానాలు ఎగబాకగా.. టాప్ ప్లేస్‌లో ఉండిన కేశవ్ మహారాజ్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిదితో పాటు అతని సహచరుడు హరీస్ రౌఫ్ కూడా భారీగా లబ్ది పొందాడు. ఆసీస్‌పై సంచలన ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు) అనంతరం రౌఫ్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్తానానికి ఎగబకాడు. అలాగే మరో పాక్ బౌలర్ నసీం షా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. నసీం 14 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (4), జస్ప్రీత్ బుమ్రా (6), మొహమ్మద్ సిరాజ్ (7) టాప్-10లో ఉన్నారు.బ్యాటింగ్ విషయానికొస్తే.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ 80 పరుగులు చేసి రెండు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్ అఫ్రిది టాప్ ప్లేస్‌కు చేరడంతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పాక్ ఆటగాళ్లే అగ్రస్థానాలను ఆక్రమించినట్లైంది. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 11 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 98 పరుగులు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 44వ స్థానానికి చేరాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. జింబాబ్వే సికందర్ రజా రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహిది హసన్ మీరాజ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా 14వ స్థానంలో ఉన్నాడు. -
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అవుట్.. జట్టులో నో ఛాన్స్! అయినా..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యవహారశైలి పట్ల ఆ దేశ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించారని.. తనకు మాత్రమే నిబంధనలు వర్తింపజేస్తూ వేటు వేశారని బోర్డు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనను ఎంతగా అణగదొక్కాలని చూసినా ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తి మాత్రం లేదని అతడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా 2024–25 ఏడాది కోసం పీసీబీ ఆదివారం వార్షిక కాంట్రాక్టు వివరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని ‘ఎ’ కేటగిరి నుంచి తొలగించి ‘బి’ కేటగిరీలో వేయడం సహా.. సీనియర్ ప్లేయర్లు ఫఖర్ జమాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, ఒసామా మీర్‌లను ఈ జాబితా నుంచి తొలగించింది. ఇక పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ‘బి’ కేటగిరీలోనే కొనసాగించింది. అంతేకాదు.. గత ఏడాది 27 మందికి వార్షిక కాంట్రాక్టు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్యను 25కు కుదించింది. ఇందులో ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి అవకాశం దక్కింది. కొత్త కెప్టెన్ రిజ్వాన్, మాజీ సారథి బాబర్ ఆజమ్‌లు ‘ఎ’ కేటగిరీలో ఉండగా... షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, షాన్ మసూద్‌లకు ‘బి’ కేటగిరీలో చోటు ఇచ్చింది. ఇక ‘సి’ కేటగిరీలో 9 మంది, ‘డి’ కేటగిరీలో 11 మంది ఉన్నారు. కేటగిరీలను బట్టి ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు అందనున్నాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న జట్టులోనూ ఫఖర్ జమాన్‌కు చోటు దక్కలేదు. బాబర్ ఆజం విషయంలో బోర్డును నిందించడం సహా ఫిట్నెస్ లేమి కారణంగా అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ ఆదివారం వెల్లడించాడు.ఈ పరిణామాల నేపథ్యంలో ఫఖర్ జమాన్ తీవ్ర నిరాశకు లోనైనట్లు అతడి సన్నిహిత వర్గాలు పాక్ మీడియాకు తెలిపాయి. ‘‘అతడు చాలా బాధపడుతున్నాడు. ఫిట్నెస్ టెస్టుల విషయంలో తన పట్ల వివక్ష చూపారని వాపోయాడు. క్లియరెన్స్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్ పాటించారన్నాడు. రెండు కిలోమీటర్ల పరుగు విషయంలో తనతో పాటు సరైన సమయంలో పూర్తి చేయనివాళ్లకు జట్టులో చోటిచ్చి.. తనను మాత్రం విస్మరించారని ఆవేదన చెందాడు.అసలు తన పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని సెలక్టర్లను కోరినా ఫలితం లేకుండా పోయింది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలి టెస్టు అనంతరం బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేసిన పీసీబీ.. రెండు, మూడో టెస్టు నుంచి వారిని తప్పించింది.ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఫఖర్ జమాన్ స్పందిస్తూ పీసీబీ తీరును సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని బోర్డు అతడిపై కన్నెర్రజేసింది. ఈ క్రమంలోనే అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడం సహా.. ఆసీస్ టూర్‌కు దూరం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పాక్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ ఫఖర్ జమాన్. ఇప్పటి వరకు 82 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3492 పరుగులు చేశాడు. ఇందులో పదకొండు శతకాలు ఉన్నాయి.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం: పాక్ కొత్త కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని మహ్మద్ రిజ్వాన్ హర్షం వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఆడాలన్న కోరికతో పాటు సారథిగా ఎదగాలన్న కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతామాజీ కెప్టెన్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తనదైన శైలిలో జట్టుకు ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతానంటూ రిజ్వాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం తర్వాత బాబర్ ఆజం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. షాన్ మసూద్ టెస్టులు, షాహిన్ ఆఫ్రిది టీ20 జట్టు కెప్టెన్లుగా నియమితులయ్యారు.అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలోనూ షాన్ మసూద్‌ను కొనసాగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ఆఫ్రిదిపై మాత్రం వేటువేసింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024కు ముందు బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఈసారి కూడా పాక్ మెగా టోర్నీలో విఫలం కావడంతో బాబర్ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించినట్లు పీసీబీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రిజ్వాన్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాంఈ నేపథ్యంలో రిజ్వాన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘గతంలో ఆస్ట్రేలియా గడ్డపై మేము ఇబ్బంది పడ్డామన్న మాట వాస్తవం. అయితే, ఈసారి మాత్రం అభిమానుల కలను నెరవేరుస్తాం. గత సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో చివరి వరకు విజయం మాదే అన్నట్లుగా పోరాటం సాగించాం. కానీ దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో ప్రతికూల ఫలితం వచ్చేది. నాడు చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్ చివరగా 2002లో ఆసీస్‌లో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నవంబరు 4- 18 వరకు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక వరుస వైఫల్యాల అనంతరం ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి 2-1తో గెలిచింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
బాబర్ ఆజంకు సపోర్ట్ .. కట్ చేస్తే! జట్టులో నో ఛాన్స్?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా పాక్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌తో తలపడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం పాక్ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో తమ జట్టును ప్రకటించే అవకాశముంది. నవంబర్ 4న మెల్బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో పాక్ పర్యటన ప్రారంభం కానుంది.ఫఖార్ జమాన్‌పై వేటు?ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌పై పాక్ సెలక్షన్ కమిటీ వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను నుంచి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను అర్ధంతరంగా తప్పించడాన్ని జమాన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్ల తీరుపై ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు.భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ అతడు హితువు పలికాడు. దీంతో అతడిపై పీసీబీ సీరియస్ అయింది. ఇప్పటికే అతడికి పాక్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అంతటితో ఆగకుండా ఆసీస్ టూర్‌కు జమాన్‌ను ఎంపిక చేయకూడని పాక్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా జమాన్ ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో కూడా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. మోకాలి సమస్యలతో బాధపడుతున్న 34 ఏళ్ల జమాన్.. ఎనిమిది నిమిషాల్లో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడంలో విఫలమైనట్లు సమాచారం. ఆసీస్ టూర్‌కు జమాన్ వెళ్తాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. -
అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్
‘‘అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను.. కానీ ఎప్పుడూ నిరాశ చెందలేదు. నాదైన రోజు వస్తుందని ఓపికగా వేచిచూశా’’.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ గులామ్ అన్న మాటలు ఇవి. 29 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు.అనూహ్య రీతిలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు పడగా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చి సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 224 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా కమ్రాన్ గులామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కమ్రాన్‌ను కొనియాడుతూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. శతకం బాదిన తర్వాత కమ్రాన్ నేలతల్లిని ముద్దాడుతూ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన బాబర్.. ‘‘చాలా బాగా ఆడావు కమ్రాన్’’ అంటూ అభినందించాడు. కాగా పాకిస్తాన్ తరఫున అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 13వ క్రికెటర్‌గా కమ్రాన్ గులామ్ రికార్డు సాధించాడు.తొలి ఆటగాడిగా మరో రికార్డుగతంలో పాక్ తరఫున ఖాలిద్ ఇబాదుల్లా (ఆస్ట్రేలియాపై 1966లో), జావేద్ మియాందాద్ (న్యూజిలాండ్‌పై 1976లో), సలీమ్ మాలిక్ (శ్రీలంకపై 1982లో), మొహమ్మద్ వసీమ్ (న్యూజిలాండ్‌పై 1996), అలీ నక్వీ (దక్షిణాఫ్రికాపై 1997లో), అజహర్ మహమూద్ (దక్షిణాఫ్రికాపై 1997లో), యూనిస్ ఖాన్ (శ్రీలంకపై 2000లో), తౌఫీక్ ఉమర్ (బంగ్లాదేశ్‌పై 2001లో), యాసిర్ హమీద్ (బంగ్లాదేశ్‌పై 2003లో), ఫవాద్ ఆలమ్ (శ్రీలంకపై 2009లో), ఉమర్ అక్మల్ (న్యూజిలాండ్‌పై 2009లో), ఆబిద్ అలీ (శ్రీలంకపై 2019లో) ఈ ఘనత సాధించారు. అయితే, ఇంగ్లండ్‌పై ఓ అరంగేట్ర పాకిస్తాన్ ఆటగాడు శతకం బాదడం ఇదే తొలిసారి.తొలిరోజు.. తడబడి.. నిలబడికమ్రాన్ గులామ్ (224 బంతుల్లో 118; 11 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం కారణంగా రెండో టెస్టులో పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ముల్తాన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కాగా తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం పలు మార్పులు చేసిన పాకిస్తాన్ జట్టు... కమ్రాన్ గులామ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ అయూబ్ (77; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (7), కెప్టెన్ షాన్ మసూద్ (3), సౌద్ షకీల్ (4) విఫలమయ్యారు. ఒకదశలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అయూబ్‌తో కలిసి కమ్రాన్ ఆదుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించడంతో జట్టు కోలుకుంది.మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 29 ఏళ్ల కమ్రాన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసి గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న అతడికి ఎట్టకేలకు అవకాశం దక్కగా... తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, జాక్ లీచ్, కార్స్, పాట్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ రిజ్వాన్ (37 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆఘా సల్మాన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.బాబర్ స్థానంలో ఆడితే ఏంటి?‘ఈ అవకాశం కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... దాన్నే ఇక్కడ కూడా కొనసాగించా. బాబర్ ఆజమ్ ఓ దిగ్గజం. అతడి స్థానంలో ఆడుతున్నా అనే విషయం పక్కనపెట్టి కేవలం అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా. క్రీజులోకి వచ్చిన సమయంలో జట్టు ఇబ్బందుల్లో ఉంది.దీంతో ఆచితూచి ఆడాలనుకున్నా. దేశవాళీ అనుభవం బాగా పనికొచ్చింది’ అని కమ్రాన్ అన్నాడు. కాగా కమ్రాన్ గులామ్ ఇప్పటి వరకు 59 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4377 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
అరంగేట్రంలోనే సెంచరీ చేసిన పాక్ ప్లేయర్
బాబర్ ఆజమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ పాక్ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన గులామ్.. 224 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన గులామ్.. చాలా బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. The Moments Kamran Ghulam completed his Hundred on Test Debut. 👏He came as Babar Azam's replacement and when came to bat Pakistan were 19/2 & then he smashed Hundred - THE FUTURE OF PAKISTAN. ⭐pic.twitter.com/Z33V23vVgV— Tanuj Singh (@ImTanujSingh) October 15, 2024అతడికి సైమ్ అయూబ్ (77) సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 86 ఓవర్ల అనంతరం ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (7), సైమ్ అయూబ్ (77), షాన్ మసూద్ (3), కమ్రాన్ గులామ్ (118), సౌద్ షకీల్ (4) ఔట్ కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (31), అఘా సల్మాన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌పై వేటు -
ఫకర్ జమాన్‌కు షోకాజ్ నోటీసు
పాకిస్తాన్ టాపార్డర్ బ్యాటర్ ఫకర్ జమాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు బాబర్ ఆజమ్‌ను తప్పిస్తూ సెలెక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఫకర్ జమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల కారణంగానే పీసీబీ జమాన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.ఇంతకీ ఫకర్ జమాన్ ఏమన్నాడంటే.. "మన ప్రీమియర్ బ్యాటర్‌ను (బాబర్ ఆజమ్) తొలగించడం జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. బోర్డు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి . 2020-23 మధ్యలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. అయితే అప్పుడు బీసీసీఐ అతన్ని తప్పించలేదు. బాబర్ పాకిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకరు. అతనిపై ఈ తరహా చర్యలు అవసరం లేదు. మన ఆటగాళ్లను వీలైనంత వరకు కాపాడుకోవడానికి చూడాలి" అంటూ ట్విటర్లో రాసుకొచ్చాడు. బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫకర్ చేసిన ఈ ట్వీట్‌పై పీసీబీ అసంతృప్తిగా ఉంది. ఈ వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పీసీబీ ఫకర్‌ను కోరింది. పీసీబీ-ఫకర్ జమాన్ మధ్య గత కొంతకాలంగా సఖ్యత లేదని తెలుస్తుంది. విదేశీ లీగ్‌లు ఆడేందుకు ఎన్ఓసీ జారీ చేయడంలో బోర్డు జాప్యం చేస్తుందని ఫకర్ గతంలో ఆరోపించాడు. తాజాగా బాబర్ ఎపిసోడ్ పీసీబీకి, ఫకర్‌కు మధ్య మరింత గ్యాప్ పెంచేలా ఉంది.కాగా, ముల్తాన్ టెస్ట్‌లో (తొలి టెస్ట్) ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో పాక్ సెలెక్టర్లు సీనియర్లైన బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలపై వేటు వేశారు. అలీం దార్, అజహర్ అలీ, ఆకిబ్ జావిద్ నేతృత్వంలోని కొత్త సెలెక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఇండియా-న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదల -
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్‌పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్‌లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్‌లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
కోహ్లితో బాబర్‌కు పోలికా? అసలేం మాట్లాడుతున్నారు?
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన బాబర్.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై అదే తీరును కనబరుస్తున్నాడు. ముల్తాన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో కేవలం 35 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.ఈ క్రమంలో పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ బాబర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు జట్టు నుంచి ఆజంను సెలక్టర్లు తప్పించారు. దీంతో పీసీబీ తీరుపై పలువరు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తారని సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది అయితే ఆజంను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు బీసీసీఐ అండగా ఉందని, పీసీబీ మాత్రం అలా చేయలేదని పాక్ స్టార్ క్రికెటర్ ఫఖార్ జమాన్ సైతం విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజంను విరాట్ కోహ్లితో పోల్చవద్దని హాగ్ అన్నాడు."ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టెస్టులకు పాక్ జట్టులో స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం చోటు కోల్పోయాడు. గత కొన్ని రోజులగా అందరూ ఊహించిందే జరిగింది. అయితే చాలా మంది బాబర్ ఆజం ఫామ్‌ను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. దయచేసి ఆజంను కోహ్లితో పోల్చవద్దు.కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు భారత్ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ జట్టుగా ఉంది. మరి బాబర్ ఫామ్ కోల్పోయినప్పుడు పాకిస్తాన్ ప్రపంచంలోనే రెండువ అత్యంత చెత్త జట్టుగా ఉంది. కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు" అని హాగ్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా బాబర్ గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు.చదవండి: ‘అతడినే తప్పిస్తారా?.. ఇంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు’ -
పాక్ క్రికెట్‌కు ఏమైంది? పిచ్చి నిర్ణయాలు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డాడు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సెలక్టర్ల తెలివితక్కువతనానికి అద్దం పడుతోందన్నాడు. పీసీబీ అర్థంపర్థంలేని నిర్ణయాలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బాబర్‌పై వేటుముఖ్యంగా టెస్టుల్లో దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. అతడి స్థానాన్ని షాన్ మసూద్‌తో భర్తీ చేసింది పీసీబీ. అయితే, అప్పటి నుంచి పరిస్థితి ఇంకా దిగజారింది. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్టు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ అయింది.ఫలితంగా మసూద్ కెప్టెన్సీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ పాక్ వైఫల్యం కొనసాగిస్తోంది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 15 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.పీసీబీ మూర్ఖత్వానికి ఇది పరాకాష్టఈ నేపథ్యంలో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టు నుంచి టాప్ బ్యాటర్ బాబర్ ఆజంను తప్పించింది. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్.. ‘‘చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడి ఉంది. అయినప్పటికీ అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజంను తప్పించింది. పాకిస్తాన్ క్రికెట్ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో ఇది పరాకాష్టలాంటిది. ఇంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం మరొకటి ఉండదు! ఒకవేళ అతడే స్వయంగా విరామం కావాలని గనుక అడిగి ఉండకపోతే!’’ అని ఎక్స్ వేదికగా పీసీబీ విధానాలను, సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.మూడు ఫార్మాట్లలోనూ ఆటగాడిగా, కెప్టెన్‌గా బాబర్ భేష్ తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో బాబర్ ఆజం పాకిస్తాన్ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో పలు కీలక విజయాలు అందించడంతో పాటు కెప్టెన్‌గా కూడా చెప్పుకోదగ్గ ఘనతలు సాధించాడు. అంతేకాదు.. సుదీర్ఘ కాలం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాటర్‌గా కూడా కొనసాగాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను టెస్టుల్లో పరుగులు చేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.గడ్డుకాలంచివరగా... డిసెంబర్ 2022లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్...గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ శతకం కూడా బాదలేకపోయాడు. ఇర 2023 నుంచి ఆడిన 9 టెస్టుల్లో అతడు సాధించిన పరుగుల సగటు 21 మాత్రమే. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన ముల్తాన్ పిచ్‌పై బాబర్ 30, 5 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. ముఖ్యంగా బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని వికెట్‌పై అతను పేలవంగా ఆడి నిష్క్రమించడం విమర్శలకు తావిచ్చింది.కొత్త సెలక్టర్లు వచ్చారు.. వేటు వేశారు!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో పాక్ ఓడిపోగానే... మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో పాక్ బోర్డు హడావిడిగా కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆటగాళ్లే బాబర్‌ను తప్పించాలని నిర్ణయించారు. అయితే, టాప్ బ్యాటర్ బాబర్‌పై వేటు పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలన చర్చకు కారణమైంది. ఇటీవల ఫామ్ కోల్పోయినా సరే...ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో అందరికంటే పెద్ద స్టార్ ఆటగాడు అతడేనన్నది వాస్తవం.ఇతరులలో మరో ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. జట్టు ప్రదర్శనతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బాబర్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఒక దశలో తన నిలకడైన ఆటతో ‘ఫ్యాబ్ 4’తో పోటీ పడుతూ ఐదో ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌పై వేటు నిజంగా అసాధారణమనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. కాగా బాబర్ 55 టెస్టుల్లో 43.92 సగటుతో 9 శతకాలు, 26 హాఫ్ సెంచరీలు సహా 3997 పరుగులు చేశాడు.చదవండి: India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ!