ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్‌లో జరగనున్న సెకెండ్ టెస్టులో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పాక్ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెండో టెస్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ESPNCricinfo నివేదిక ప్రకారం.. అలీమ్ దార్, ఆకిబ్ జావేద్ ,అజహర్ అలీలతో కూడిన సెలక్షన్ కమిటీ ఆజం ప్రదర్శన పట్ల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు సమచాం. ఈ క్రమంలోనే అతనిని జట్టు నుండి తప్పించి యువ ఆటగాడు కమ్రాన్ గులాంకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నరట.
బాబర్ కథ ముగిసినట్లేనా?
బాబర్ గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసి సుమారు ఏడాది దాటింది. బాబర్ చివరగా గతేడాది ఆగస్టులో నేపాల్‌తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే బాబర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 17 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 355 పరుగులు మాత్రమే చేశాడు. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 35 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేయాలని పీసీబీ ఫిక్స్ అయినట్లు వినికిడి.
చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment