Pakistan Cricket Board
-
అదొక చెత్త క్రికెట్ బోర్డు.. అందుకే రాజీనామా: ఆసీస్ దిగ్గజం
పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి ఆసీస్ దిగ్గజం జాసన్ గిల్లెస్పీ వైదొలిగిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు గిల్లెస్పీ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అయితే తాజాగా తన రాజీనామాపై గిల్లెస్పీ స్పందించాడు. అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను తన పదవి నుంచి పీసీబీ తప్పించడంతో తన కూడా వైదొలగాల్సి వచ్చిందని గిల్లెస్పీ చెప్పుకొచ్చాడు. అదే విధంగా ప్రపంచంలో పీసీబీ లాంటి క్రికెట్ బోర్డును తనకెక్కడా చూడలేదని గిల్లెస్పీ విమర్శలు గుప్పించాడు. కాగా హెడ్ కోచ్ గ్యారీ కిరెస్టన్ వైదొలిగిన అనంతరంహెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అతడి నేతృత్వంలోనే పాకిస్తాన్ క్రికెట్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. "పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి క్రికెట్ బోర్డును నేను ఇప్పటివరకు చూడలేదు. ఏ హెడ్ కోచ్ అయినా తమ బోర్డుతో మంచి సంబంధాలు కలిగిండాలని భావిస్తాడు. కానీ పీసీబీ తీరు మాత్రం అందుకు భిన్నం. వారికి నాకు సమన్వయ లోపం ఏర్పడింది. తుది జట్టు ఎంపిక విషయంలో కూడా నాకు పూర్తి స్వేఛ్చ లేదు. అందులో కూడా పీసీబీ జోక్యం చేసుకుంటుంది. సెలక్టర్లతో కూడా నాకు సరైన కమ్యూనికేషన్ లేదు. సీనియర్ అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తప్పించారు. ఇదొక్కటే కాదు గత కొన్ని నెలలగా వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయినప్పటికి వారితో కొనసాగాను. ఎప్పుడైతే నీల్స్‌ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా తొలిగించారో అప్పుడే నేను కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను" అని గిల్లెస్పీ పేర్కొన్నాడు. -
పాక్ క్రికెట్‌కు భారీ షాక్.. 24 గంటల్లోనే ఇద్దరి స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్
పాకిస్తాన్ క్రికెట్‌కు 24 గంటలు తిరగకముందే మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ శనివారం (డిసెంబర్ 14) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అమీర్ వెల్లండిచాడు."అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించిన తర్వాత ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. రాబోయో తరానికి అవకాశమిచ్చేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం.తన ప్రయాణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు"అని రిటైర్మెంట్ నోట్లో అమీర్ పేర్కొన్నాడు.కాగా అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండో సారి. బోర్డుతో విబేధాలు కారణంగా 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. మళ్లీ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. పాక్ తరపున అమీర్ తన కెరీర్లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఓవరాల్‌గా 158 మ్యాచ్‌లు ఆడిన అమీర్.. 271 వికెట్ల పాటు 1,179 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున అమీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అమీర్ కీలక పాత్ర పోషించాడు. కాగా మరో పాక్ ఆటగాడు ఇమాద్ వసీం రిటైర్మెంట్ ప్రకటించిన 24 గంటల తర్వాత అమీర్ తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిద్దరూ ఫ్రాంచైజీ క్రికెట్లో బిజీబిజీగా ఉన్నారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా -
పాకిస్తాన్ హెడ్‌కోచ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్..
పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి ముసలం నెలకొంది. పాక్ టెస్ట్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి జాసన్ గిలెస్పీ తప్పుకున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగానే ఆసీస్ దిగ్గజం ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గిలెస్పీ స్ధానాన్ని 24 గంటల వ్యవధిలోనే పాక్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది.తమ రెడ్ బాల్ క్రికెట్ జట్టు తత్కాలిక హెడ్ కోచ్‌గా జావేద్‌ను పీసీబీ నియమించింది. "దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి పాక్ రెడ్ బాల్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా జావెద్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటలో భాగంగా ఆతిథ్య జట్టుతో పాక్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.అదే కారణమా?కాగా హెడ్ కోచ్ గ్యారీ గ్యారీ కిరస్టెన్ వైదొలిగిన అనంతరం హెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో కోచింగ్ బృందం నుంచి అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను పీసీబీ తప్పించింది. అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు పీసీబీ సముఖత చూపలేదు.ఈ క్రమంలో పీసీబీ నిర్ణయంపై గిలెస్పీ అసహనం వ్యక్తం చేశాడని, అందుకే తన పదవికి రాజీనామా చేశాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గిలెస్పీ-నీల్సన్ నేతృత్వంలోనే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను పాక్ సొంతం చేసుకుంది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
పాకిస్తాన్లో ఆడేందుకు కోహ్లి ఉవ్విళ్ళూరుతున్నాడు: షోయబ్ అక్తర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగుతుందా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ మెగా ఈవెంట్లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బోర్డు మాత్రం ససేమేర అంటుంది. అయితే ఇటీవలే జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించిందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కానీ భారత క్రికెట్ బోర్డు ముందు బీసీసీఐ కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది.అయితే పీసీబీ కాండీషన్స్ను భారత బోర్డు తిరష్కరించినట్లు సమాచారం. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. కాగా పాక్ మాజీ క్రికెటర్లు సైతం భారత జట్టు తమ దేశానికి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు."ఇండియన్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. వారికి మా దేశంలో ఆడటమంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడటం మా జట్టు కంటే భారత జట్టుకే ఎక్కువ ఇష్టం. విరాట్ కోహ్లి సైతం పాక్‌లో ఆడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. భారత వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మా దేశంలో జరిగితే.. టీవీ రైట్స్, స్పాన్సర్‌షిప్‌లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి.కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పాక్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టు తరపున ఒక్కసారి కూడా పాక్ గడ్డపై ఆడలేదు. గతంలో భారత అండర్-19 జట్టు తరపున మాత్రం పాక్‌లో కోహ్లి ఆడాడు.చదవండి: ‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్ -
CT 2025: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. ముందే!
చాంపియన్స్ ట్రోఫీ -2025 నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య హక్కులను వేరే దేశంతో పంచుకునే క్రమంలో ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంలో తప్పులేదన్నాడు. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోయినా... పాక్ జట్టు మాత్రం భవిష్యత్తులో భారత్‌కు వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నాడు.కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీకి తెలిపింది.ఐసీసీ వార్నింగ్.. దిగి వచ్చిన పాక్అయితే, పీసీబీ మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబట్టింది. బీసీసీఐ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లను పాక్ వెలుపల ఆడేందుకు వీలుగా హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. అంతేకాదు.. రెవెన్యూపరంగానూ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.అయితే, పాక్ మాత్రం ఇందుకు కూడా అంగీకరించకుండా పంతానికి పోయింది. ఈ క్రమంలో ఐసీసీ హెచ్చరికలకు దిగకతప్పలేదు. ఒకవేళ పీసీబీ పట్టువీడకపోతే.. వేదిక మొత్తాన్ని తరలిస్తామని హెచ్చరించింది. దీంతో దిగి వచ్చిన పాక్.. ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినా.. మూడు షరతులు విధించినట్లు సమాచారం.టీమిండియా ఇక్కడికి రాకున్నా.. పాకిస్తాన్ భారత్‌కు వెళ్లాలిఅందులో ప్రధానంగా.. భవిష్యత్తులో భారత్‌లో ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే తాము కూడా అక్కడికి వెళ్లబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘‘ఆతిథ్య హక్కులు పంచుకునేందుకు ఒప్పుకొంటే.. అధిక ఆదాయం అడగటం న్యాయమే. అయినా పీసీబీ కనీసం దీనికోసమైనా పట్టుబట్టడంలో తప్పులేదు.అయితే, భవిష్యత్తులో భారత్‌లో ఈవెంట్లు నిర్వహిస్తే ఆడబోము అనడం మాత్రం సరికాదు. మనం వారికి స్నేహ హస్తం అందించాలి. మన జట్టు ఇండియాకు తప్పకుండా అక్కడికి వెళ్లాలి. అంతేకాదు.. అక్కడ వారిని ఓడించాలి. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ విధానం ముందుగానే ఫిక్సయినట్లు అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ..
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిగివచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో ఎట్టకేలకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకొన్నప్పటికీ కొన్ని షరతులు విధించినట్లుగా సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని పాక్ భావించింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలిసి టోర్నమెంట్ బరిలో దిగాలని ఉవ్విళ్లూరింది.పీసీబీకి ఐసీసీ అల్టిమేటంఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ విషయం గురించి పీసీబీకి చెప్పగా.. ఇందుకు పాక్ బోర్డు ససేమిరా అంది.మరోవైపు.. భారత్ కూడా ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని ఐసీసీకి గట్టిగానే చెప్పింది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ పెద్దలు పాక్‌తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు మొండివైఖరి ప్రదర్శించగా.. ఐసీసీ కఠినంగా వ్యవహరించకతప్పలేదు.టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు వీలుగా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకుంటే.. టోర్నీ మొత్తాన్ని పాక్‌ను తరలిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో దిగివచ్చిన పాక్ బోర్డు.. ఐసీసీ ప్రపోజల్‌కు సరేనందని.. అయితే, మూడు షరతులు కూడా విధించిందని ఇండియా టుడే కథనం పేర్కొంది.ఆ మూడు కండిషన్లు ఏమిటంటే?..👉టీమిండియా గ్రూప్ దశలో, సెమీ ఫైనల్స్, ఫైనల్లో(ఒకవేళ అర్హత సాధిస్తే) ఆడేమ్యాచ్లను దుబాయ్‌లోనే నిర్వహించాలి.👉ఒకవేళ టీమిండియా గనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించేందుకు పాకిస్తాన్‌కు అనుమతినివ్వాలి.👉ఇక భవిష్యత్తులో భారత్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లు ఆడేందుకు పాకిస్తాన్ అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించాలి. చదవండి: IND Vs AUS PM XI Test: టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్‌కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్‌తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్‌లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్‌లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై తుది నిర్ణయం ఆ రోజే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్‌కు శుక్రవారం(నవంబర్ 29 ) తెరపడే అవకాశముంది. ఆ రోజున అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కీలక బోర్డు సమావేశం జరగనుంది.ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వర్చవల్‌గా జరగనున్న ఈ భేటిలో మొత్తం 12 సభ్య దేశాల క్రికెట్ బోర్డు ప్రతినిధులు పాల్గోనున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది.కాగా వాస్తవానికి ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. ఆతిథ్య హోదాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పంపింది. కానీ పాక్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించడంతో షెడ్యూల్ ఖరారులో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ మెగా ఈవెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది. పీసీబీ మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని మొండి పట్టుతో ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 29న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఏదో ఒక విషయం తెలిపోనుంది.కాగా హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒప్పుకుంటే అదనంగా గ్రాంట్స్ మంజూరు చేసేందుకు ఐసీసీ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అప్పటికి హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించకపోతే పాకిస్తాన్ నుంచి టోర్నీని వేరే చోటకు ఐసీసీ తరలించే అవకాశముంది. కాగా డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించే ముందు ఈ సమావేశం జరగనుండడం గమనార్హం.చదవండి: 'కోహ్లిలా నిన్ను నువ్వు నమ్ముకో'.. ఆసీస్ స్టార్ ప్లేయర్‌కు మెంటార్ సలహా -
అవన్నీ రూమర్సే.. మా హెడ్‌కోచ్ అతడే: పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ టెస్టు టీమ్ పదవినుంచి జాసన్ గిలెస్పీని తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా ఖండించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా అర్థరహితమని స్పష్టం చేసింది. ‘గిలెస్పీని తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ అబద్ధం.గతంలోనే ప్రకటించిన విధంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టు సిరీస్‌ల వరకు కూడా గిలెస్పీని కోచ్‌గా కొనసాగుతాడు’ అని పీసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు ఆడిన పాక్ జట్టుకు గిలెస్పీ తాత్కాలిక కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అయితే ఈ రెండు ఫార్మాట్లతో పాటు టెస్టుల్లో కూడా అతని స్థానంలో పాక్ మాజీ పేసర్, ప్రస్తుత సెలక్షన్ కమిటీ కనీ్వనర్ ఆకిబ్ జావేద్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గిలెస్పీ కోచ్‌గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ చేతిలో 0–2తో ఓడిన పాక్...ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 2–1తో విజయం సాధించింది. ఆసీస్ సిరీస్ తర్వాత పాక్ జట్టు నేరుగా జింబాబ్వేకు వెళుతుంది.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
Champions Trophy: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ మరింత వివాదాస్పదం కాకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే.. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.ఎనిమిది జట్లువన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆతిథ్య పాకిస్తాన్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి. అయితే, పాక్‌లో నిర్వహించే ఈ ఐసీసీ ఈవెంట్‌కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది.హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోము అంటున్న పాక్అదే విధంగా.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఐసీసీ ఇందుకు సానుకూలంగానే ఉన్నా.. పీసీబీ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. కావాలంటే ఆతిథ్యమైనా వదులుకుంటాంగానీ.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోమని చెబుతోంది.అత్యుత్సాహం ప్రదర్శించిన పీసీబీఅంతేకాదు.. తమ ప్రభుత్వానిది కూడా ఈ విషయంలో ఇదే వైఖరి అని ఐసీసీకి తేల్చిచెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో పీసీబీ భారత్‌ను కవ్వించేలా మరో చర్యకు దిగింది. చాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా ఉన్న ప్రాంతంలో చేస్తామని శుక్రవారం ప్రకటించింది.ముకుతాడు వేసిన ఐసీసీస్కర్దు, హంజా, మజఫర్బాద్లలో ట్రోఫీ టూర్ చేస్తామని అధికారికంగా పీసీబీ వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారగా.. ఐసీసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ట్రోఫీ టూర్‌ను రద్దు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా నవంబరు 16- 24 వరకు చాంపియన్స్ ట్రోఫీ-2025 టూర్ జరుగనుంది. ఇందులో భాగంగా ట్రోఫీని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో అభిమానుల సందర్శనకు ఉంచుతారు. చదవండి: టచ్‌లోకి వచ్చిన విరాట్.. మరోసారి క్లీన్ బౌల్డ్ అయిన పంత్ -
పాకిస్తాన్ బోర్డు కవ్వింపు చర్యలు.. చాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రకటన
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఐసీసీ టోర్నీ ట్రోఫీ టూర్‌ను నిర్వహించే ప్రదేశాల పేర్లను పీసీబీ శుక్రవారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.నవంబరు 16న ఇస్లామాబాద్‌లో‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025.. ట్రోఫీ టూర్ నవంబరు 16న ఇస్లామాబాద్‌లో మొదలవుతుంది. అదే విధంగా.. స్కర్దు, ముర్రే, హంజా, మజఫర్బాద్లోనూ జరుగుతుంది. సర్ఫరాజ్ అహ్మద్ 2017లో ది ఓవల్ మైదానంలో ట్రోఫీని పట్టుకున్న దృశ్యాలను చూడండి. ఈ ట్రోఫీ టూర్ నవంబరు 16- 24 వరకు జరుగుతుంది’’ అని పీసీబీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.ఇందులో ప్రస్తావించిన స్కర్దు, హంజా, మజఫర్బాద్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రాంతాలు అని.. పాక్ బోర్డు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదుఈ మెగా టోర్నీకి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అర్హత సాధించాయి. అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐసీసీకి తేల్చిచెప్పింది.టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని సూచించింది. ఐసీసీ కూడా ఇందుకు సానుకూలంగానే ఉందనే వార్తలు వినిపించాయి. అయితే, పాకిస్తాన్ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది.ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ దేశానికి వచ్చాయని.. టీమిండియా కూడా రావాలని పట్టుబడుతోంది. తమ ప్రభుత్వం కూడా ప్రతీ మ్యాచ్‌ను దేశంలోనే నిర్వహించాలని సూచించిందని..పంతానికి పోతోంది.తటస్థ వేదికపై నిర్వహిస్తారా?ఈ మేరకు ఇలా ఇరు బోర్డుల మధ్య చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయమై విభేదాలు తలెత్తిన వేళ.. పీసీబీ రెచ్చగొట్టే చర్యలకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీసీ అంతిమంగా తీసుకునే నిర్ణయంపైనే టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తారా? లేదంటే.. బీసీసీఐ ఈ టోర్నీని బహిష్కరిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీమిండియా గనుక ఈ ఈవెంట్లో ఆడకపోతే పాకిస్తాన్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా భారీగా ఆర్థిక నష్టం తప్పదు.చదవండి: కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో పంత్ క్లీన్‌బౌల్డ్! జైస్వాల్ కూడా..Get ready, Pakistan!The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024 -
ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ ఇక్కడే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వేదిక విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వైఖరిని మార్చుకోవడం లేదు. ఆతిథ్యాన్ని అయినా వదులుకుంటాం కానీ హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహించబోమని పట్టుదలకు పోతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కూడా పీసీబీకి మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక్క మ్యాచ్ కూడా దేశం వెలుపల నిర్వహించేందుకు అంగీకరించవద్దని బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పీసీబీ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నీ అంశంలో మా ప్రభుత్వం మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మ్యాచ్ మా దేశంలోనే నిర్వహించాలని చెప్పింది.ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ ఇక్కడేఏ జట్టుకు సంబంధించి అయినా.. ఒక్క మ్యాచ్ కూడా తటస్థ వేదికపై నిర్వహించేందుకు వీలులేదని.. ఇదే తమ వైఖరి అని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి.. బీసీసీఐ పాకిస్తాన్‌కు తమ జట్టును పంపలేమన్న విషయాన్ని మాత్రమే ఐసీసీ మాకు తెలియజేసింది.చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను మేము దక్కించుకున్న మాట వాస్తవం. కాబట్టి పాకిస్తాన్ వెలుపల ఒక్క మ్యాచ్ నిర్వహించడానికి మేము ఒప్పుకోము’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఒప్పుకోవద్దని పాక్ ప్రభుత్వం పీసీబీకి చెప్పిందని తన యూట్యూబ్ చానెల్‌గా వెల్లడించాడు.ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యంకాగా వచ్చే ఏడాది పాక్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో.. హైబ్రిడ్ మోడల్ అయితేనే ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంటే.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తేనే ఆడతామని ఐసీసీకి స్పష్టమైన సమాచారమిచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని పీసీబీ పేర్కొన్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.మరోవైపు.. బీసీసీఐ సైతం ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టి పాక్‌లో టోర్నీ ఆడలేమని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఈ టోర్నీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఒకవేళ.. పాకిస్తాన్ గనుక ఆతిథ్య హక్కులు వదులుకుంటే ఈ మెగా టోర్నీ వేదికను... దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తోంది.పాకిస్తాన్‌లోనే అంధుల టీ20 ప్రపంచకప్ఇదిలా ఉంటే.. అంధుల టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా ఈసారి పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ టోర్నీ ఆడేందుకు అనుమతించాలని డిఫెండింగ్ చాంపియన్ భారత అంధుల క్రికెట్ జట్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం కేంద్ర క్రీడా శాఖ, హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు దరఖాస్తు చేసుకుంది.లాహోర్, ముల్తాన్ వేదికలపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 3 వరకు అంధుల ప్రపంచకప్ టోర్నీ జరుగుతుంది. 17 సభ్యులు గల భారత జట్టుకు క్రీడాశాఖ తమ ఆమోదం తెలుపుతూ ఎన్ఓసీని జారీ చేసింది. అయితే హోం, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఆమోదం రాకపోవడంతో జట్టు నిరీక్షిస్తోంది. భారత ప్రభుత్వం అనుమతించి, అంతా అనుకున్నట్లు జరిగితే వాఘా సరిహద్దు గుండా భారత అంధుల క్రికెట్ జట్టు ఈ నెల 21న పాకిస్తాన్‌కు బయల్దేరనుంది. చదవండి: టీమిండియాతో సిరీస్.. 3-1తో సౌతాఫ్రికా గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్ -
పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!?
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాల నేపథ్యంలో వేదిక మార్పు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని అభ్యర్దించింది. అందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా అంగీకరించింది. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మొడల్‌లో యూఏఈలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ కోరింది.సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..!స్పోర్ట్స్ టాక్ కథనం ప్రకారం.. ఐసీసీ డిమాండ్‌ను పీసీబీ అంగీకరించకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ తమకు ఉన్న విశిష్ట అధికారాలతో పాక్ హోస్టింగ్ రైట్స్‌ను లాక్ చేయనున్నట్లు సమాచారం.ఒక వేళ అదే జరిగితే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోందంట. మరోవైపు తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీ నుంచే వైదొలగాలని పాక్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఇకపై భారత్‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లకు తమ జట్టును పంపకూడదని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇదే విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా తెలియజేసింది.భారత్ ఆడే మ్యాచ్‌లని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు సుముఖంగా లేదు. కచ్చితంగా భారత జట్టు తమ దేశానికి రావల్సేందేనని పీసీబీ మొండి పట్టుతో ఉంది. అయితే టీమిండియా పాక్‌కు రాదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా పీసీబీకి తేల్చి చేప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మరో ఆఫర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ ఈ ఆఫర్‌ను అంగీకరించేందుకు పీసీబీ సిద్దంగా లేదని, అందుకు నిరసనగా ఆతిథ్య హక్కులు వదులు కోవాలని భావిస్తున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.అదొక పగటి కల..ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్‌కు రావాలనుకోవడం ఒక పగటి కల. ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్దం ఉంది.భద్రత పరంగా ఎటువంటి సమస్య లేదు. వరల్డ్‌లోని అన్ని క్రికెట్ దేశాలకు పాకిస్తాన్ స్వదేశంలో ఆతిథ్యం ఇస్తోంది. కానీ ఒక్క భారత్‌కే మాత్రం ఇక్కడ ఆడటం భద్రత కాదు. ఇందుకు బదులుగా మా ప్రభుత్వం, పీసీబీ నుంచి స్ట్రాంగ్ రిప్లై వస్తుంది అని ఆశిస్తున్నా" హాఫీజ్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. It was a day dream that India wil come to Pakistan to play #ChampionsTrophy2025. Pakistan is safe & ready to host the event. Pakistan hosting all cricket nations at home but somehow not *secure* for India 😇😇😇. Waiting for strong & surprised response from government & PCB.— Mohammad Hafeez (@MHafeez22) November 11, 2024చదవండి: IND vs AUS: 'బుమ్రా వరల్డ్‌లోనే బెస్ట్ బౌలర్.. అతడితో అంత ఈజీ కాదు' -
‘టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోతే.. మా వైఖరి వేరుగా ఉంటుంది.. ఇకపై’
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టును దాయాది దేశానికి పంపేందుకు సిద్ధంగా లేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి సంకేతాలు ఇచ్చింది.హైబ్రిడ్ విధానంలో ఈవెంట్‌ను నిర్వహించాలని..ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని.. హైబ్రిడ్ విధానంలో ఈవెంట్‌ను నిర్వహించాలని ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ దేశంలో జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియా తప్పక పాల్గొనాలని.. భారత జట్టు మ్యాచ్‌ల కోసం లాహోర్ స్టేడియాన్ని సిద్ధం చేశామని చెబుతోంది.సరేనన్న ఐసీసీ?ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ సైతం అప్పట్లో ఈ విషయం గురించి మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం అనుమతిస్తే తప్ప రోహిత్ సేనను పాక్‌కు పంపమని పేర్కొంది. అందుకు స్పందనగా ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.మా వైఖరి వేరుగా ఉంటుందిఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘మేము ఇటీవలి కాలంలో ప్రతి విషయంలో సానుకూలంగా స్పందించాం. అయితే, ప్రతిసారి మేము అలాగే చేస్తామని భావించవద్దు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సరైన కారణం చూపించాలి‘‘ఒకవేళ ఏదైనా జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలంటే సరైన కారణం చూపించాలి. టీమిండియా ఇక్కడికి రాకపోవడానికి భద్రతను కారణంగా చూపడం అనేది అసలు విషయమే కాదు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పాకిస్తాన్‌కు వస్తున్నాయి. ఆ జట్లు పాక్‌లో టోర్నీ ఆడాలనే తలంపుతో ఉన్నాయి.అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరునిజానికి ఐసీసీ మనుగడకు కారణమే పాకిస్తాన్, ఇండియా. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్‌లాగే మేము ఆడమని చెప్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరు. ఈసారి గనుక టీమిండియా ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంటుంది. ఈ టోర్నీని బహిష్కరిస్తుంది’’ అని రషీద్ లతీఫ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు.భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదుఇక అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. భారత ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ రాజీపడబోదని పేర్కొంటున్నారు. పాక్ ఆటగాళ్లు భారత్‌కు వచ్చి సురక్షితంగా వెళ్లగలిగారని.. కానీ టీమిండియా ఆటగాళ్లను పాక్‌కు పంపే పరిస్థితులు మీ దేశంలో లేవంటూ లతీఫ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు గతేడాది భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
పాకిస్తాన్‌కు వస్తారా? లేదా?.. ఏదో ఒకటి చెప్పండి! రాకపోతే మాత్రం..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు దాయాది దేశానికి వెళ్లకుంటే.. ఏం చేయాలన్న విషయంపై కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ పర్యటన విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ఐసీసీతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐ నుంచి రాతపూర్వక సమాధానం కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భద్రతా కారణాల దృష్ట్యాకాగా 2008 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోగా.. మెగా టోర్నీల్లో మాత్రం దాయాదులు ముఖాముఖి తలపడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు కలుగుతోంది.అప్పుడు శ్రీలంకలోఅయితే, ఆసియా వన్డే కప్-2023 హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. బీసీసీఐ మాత్రం రోహిత్ సేనను అక్కడికి పంపలేదు. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని కోరగా.. ఆసియా క్రికెట్ మండలి అందుకు అంగీకరించింది. దీంతో టీమిండియా మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి.ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 భారత్‌లో జరుగగా.. పాక్ జట్టు ఇక్కడికి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో ఘోర ఓటమితో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు తమవే గనుక.. టీమిండియా తమ దేశానికి రావాలని పీసీబీ కోరుతోంది. అయితే, బీసీసీఐ నేరుగా ఈ విషయాన్ని ఖండించలేదు. భారత ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తాము అడుగులు వేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశాడు.రాతపూర్వక సమాధానం ఇవ్వండిఅయితే, వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీకి సిద్ధమవుతున్న పీసీబీ.. టీమిండియా తమ దేశానికి వస్తుందో? రాదో అన్న అంశంపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ సైతం ఈ విషయం గురించి బీసీసీఐని అడిగిందని.. ఒకవేళ భారత బోర్డు నుంచి సమాధానం రాకపోతే వచ్చే వారం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఒకవేళ టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోతే మాత్రంఇక టీమిండియా మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహిస్తామని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఇప్పటికే చెప్పాడు. ఇదిలా ఉంటే.. బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యామ్నాయ వేదిక కోసం ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ నుంచి కొంతమొత్తం పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక ఐసీసీ చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా డిసెంబరు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
ఐదుగురిని సంప్రదించా.. త్వరలోనే కొత్త కోచ్ ఎంపిక: పీసీబీ చీఫ్
దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్‌స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్‌ను నియమిస్తామని తెలిపాడు.అందుకే రాజీనామా!కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్‌లో కిర్‌స్టెన్‌ను ప్రధాన కోచ్‌గా పీసీబీ నియమించింది. కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్‌గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్‌స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్‌స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్‌స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్‌స్టెన్‌కు పీసీబీ సూచించడం గమనార్హం. ఇక కిర్‌స్టెన్‌తో టెస్టు టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది. ఒక్క వన్డే ఆడకుండా... ఇదిలా ఉంటే.. కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిపిన రికార్డు ఉన్న కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్‌ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్‌ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలుమరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్‌గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్‌స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.ఐదుగురిని సంప్రదించాఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్‌గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే! -
బాబర్ ఆజంకు సపోర్ట్ .. కట్ చేస్తే! జట్టులో నో ఛాన్స్?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా పాక్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌తో తలపడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం పాక్ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో తమ జట్టును ప్రకటించే అవకాశముంది. నవంబర్ 4న మెల్బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో పాక్ పర్యటన ప్రారంభం కానుంది.ఫఖార్ జమాన్‌పై వేటు?ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌పై పాక్ సెలక్షన్ కమిటీ వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను నుంచి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను అర్ధంతరంగా తప్పించడాన్ని జమాన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్ల తీరుపై ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు.భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ అతడు హితువు పలికాడు. దీంతో అతడిపై పీసీబీ సీరియస్ అయింది. ఇప్పటికే అతడికి పాక్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అంతటితో ఆగకుండా ఆసీస్ టూర్‌కు జమాన్‌ను ఎంపిక చేయకూడని పాక్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా జమాన్ ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో కూడా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. మోకాలి సమస్యలతో బాధపడుతున్న 34 ఏళ్ల జమాన్.. ఎనిమిది నిమిషాల్లో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడంలో విఫలమైనట్లు సమాచారం. ఆసీస్ టూర్‌కు జమాన్ వెళ్తాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. -
బాబర్ ఆజంకు భారీ షాక్.. జట్టు నుంచి ఔట్?
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్‌లో జరగనున్న సెకెండ్ టెస్టులో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పాక్ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ESPNCricinfo నివేదిక ప్రకారం.. అలీమ్ దార్, ఆకిబ్ జావేద్ ,అజహర్ అలీలతో కూడిన సెలక్షన్ కమిటీ ఆజం ప్రదర్శన పట్ల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు సమచాం. ఈ క్రమంలోనే అతనిని జట్టు నుండి తప్పించి యువ ఆటగాడు కమ్రాన్ గులాంకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నరట.బాబర్ కథ ముగిసినట్లేనా?బాబర్ గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసి సుమారు ఏడాది దాటింది. బాబర్ చివరగా గతేడాది ఆగస్టులో నేపాల్‌తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే బాబర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 17 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 355 పరుగులు మాత్రమే చేశాడు. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 35 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేయాలని పీసీబీ ఫిక్స్ అయినట్లు వినికిడి.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
బాబర్ రాజీనామాకు కారణం అతడే!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా వెనుక హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరుకు నొచ్చుకున్న అతడు.. బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు తనొక్కడినే బాధ్యుడిని చేస్తూ.. తప్పంతా తన మీదకు వచ్చేలా కిర్‌స్టన్ నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.కాగా పాక్ క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలిగిన విషయం తెలిసిందే. తాను సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి, టీమ్ మేనేజ్మెంట్కు గతంలోనే సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు.ఈ రాజీనామా తర్వాత‘పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే అసలు బాధ్యత బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతోంది. నా ఆటను మరింతగా ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం కూడా అవసరం.ఈ రాజీనామా తర్వాత నా శక్తియుక్తులన్నీ బ్యాటింగ్‌పైనే కేంద్రీకరించగలను. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. జట్టుకు ఒక ఆటగాడిగా అన్ని విధాలా ఉపయోగపడేందుకు నేను సిద్ధం’ అని బాబర్ ఆజమ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ సెమీస్ కూడా చేరకపోవడంతో బాబర్ నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వదలుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అతడినే సారథిగా నియమించింది పీసీబీ. ఈసారి మరీఘోరమైన ప్రదర్శనతో బాబర్ బృందం విమర్శలు మూటగట్టుకుంది. పసికూన అమెరికా జట్టు చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది.అందుకే ఈ నిర్ణయంఈ నేపథ్యంలో కోచ్ కిర్‌స్టన్ పీసీబీకి ఇచ్చిన నివేదికలో బాబర్ ఆజంనే కారకుడిగా పేర్కొన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అసిస్టెంట్ కోచ్ అజర్ మహ్మూద్ సైతం బాబర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఇక తాను కెప్టెన్‌గా ఉండకూడదని బాబర్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక బాబర్ ఆజం రాజీనామాను ఆమోదించిన పీసీబీ త్వరలోనే కొత్త కెప్టెన్‌ను నియమించనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది పేర్లు వన్డే, టీ20 కెప్టెన్సీ రేసులో వినిపించగా.. బోర్డు అనూహ్యంగా సౌద్ షకీల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.రేసులోకి కొత్త పేరుఇక అక్టోబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 వన్డేలు, 3 టీ20ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడుతుంది. పాక్ టెస్టు జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. బాబర్ స్థానంలో పగ్గాలు చేపట్టిన అతడి సారథ్యంలో పాక్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చదవండి: కూతురితో షమీ వీడియో.. హసీన్ జహాన్ ఘాటు వ్యాఖ్యలు -
మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే?
పాకిస్తాన్ క్రికెట్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలు, పసికూనల చేతిలో ఓటములు, టెస్టుల్లో వైట్‌వాష్‌లు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, తరచూ సెలక్టర్లు, కెప్టెన్ల మార్పులు.. వెరసి తీవ్ర విమర్శలు. అసలు దీనంతటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరే కారణమంటూ మాజీ క్రికెటర్ల నుంచి ఆరోపణలు.తాజాగా పీసీబీ గురించి మరో విషయం తెరమీదకు వచ్చింది. గత మూడు నెలలుగా పురుష, మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలవారీ పేమెంట్లతో పాటు స్పాన్సర్షిప్ షేర్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పాక్ క్రికెట్ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ జాప్యంఅంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ బోర్డు జాప్యం చేయడం ఆటగాళ్లను మరింత చికాకు పెడుతోందని పేర్కొన్నాయి. ఇక వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం.. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు పీసీబీ ఉపయోగిస్తోందని తెలిపాయి.తీవ్ర అసంతృప్తిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికి ఈ మూడు మైదానాలను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై పీసీబీ శ్రద్ధ చూపుతోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వరుస సిరీస్‌లు ఆడుతున్నా..ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దాని ప్రభావం ఆటపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా బకాయిలన్నీ తీర్చేందుకు పీసీబీ కసరత్తు చేస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది వార్షిక కాంట్రాక్టుల విడుదలకు ముందు ఆటగాళ్లతో చర్చించిన పీసీబీ.. జీతాలను పెంచుతూ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఎ’ కేటగిరీలో ఉన్న బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది వంటి వాళ్లకు నెలవారీ 4.5 మిలియన్ల పాక్ రూపాయలతో(టాక్స్ చెల్లింపుల తర్వాత) పాటు.. అదనంగా లోగో స్పాన్సర్షిప్స్ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో మూడు శాతం మేర ఇవ్వనున్నట్లు డీల్ కుదిరింది. జీతాల చెల్లింపునకే గతిలేకఅయితే, ఇప్పుడు ఇలా జీతాల చెల్లింపునకే గతిలేక బోర్డు జాప్యం చేయడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడేందుకు వెళ్లిన పాక్ మహిళా క్రికెటర్లకు కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.చదవండి: ఇదేం బౌలింగ్?.. హార్దిక్ శైలిపై కోచ్ అసంతృప్తి!.. ఇకపై.. -
పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్.. సిరీస్ అక్కడే
పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణపై పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టతనిచ్చింది. తమ దేశంలోనే ఈ సిరీస్ జరుగుతుందని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముల్తాన్, రావల్పిండి ఇందుకు ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. అక్టోబరు 7 నుంచి 28 వరకు ఇరుజట్ల మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు వెల్లడించింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు తమ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ స్వయంగా పేర్కొన్నాడు. అందుకే భారీ మొత్తంలో నిధులు కేటాయించి స్టేడియాల్లో మెరుగైన వసతులతో పాటు.. పలు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపాడు.శ్రీలంక లేదంటే యూఏఈలో అంటూ వదంతులువచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నాటికి అంతా సిద్ధం చేస్తామని నక్వీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. స్టేడియాల ప్రక్షాళన నేపథ్యంలో పీసీబీ ఇంగ్లండ్‌తో సిరీస్ వేదికను మార్చే యోచనలో ఉందని.. శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి.అయితే, అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ పీసీబీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. తమ దేశంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబరు 7-11, 15-19 మధ్య జరుగనున్న తొలి రెండు మ్యాచ్‌లకు ముల్తాన్.. అక్టోబరు 24-28 వరకు జరుగనున్న ఆఖరి టెస్టుకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. నిజానికి కరాచీలో జరగాల్సిన ఈ చివరి టెస్టును అక్కడి నుంచి తరలించడానికి కారణం.. పునరుద్ధరణ కార్యక్రమాలే అని పేర్కొంది. అక్టోబరు 2న ఇంగ్లండ్ జట్టు ముల్తాన్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్తాన్ చివరగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడింది.ఘోర పరాభవం నుంచి కోలుకునేనా?ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగమైన ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓడటమే గాకుండా.. 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. ఫలితంగా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తదుపరి జరుగనున్న టెస్టు సిరీస్ షాన్ మసూద్ బృందానికి విషమ పరీక్షగా మారింది.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
పాక్ క్రికెట్ అంపశయ్య మీద ఉంది: మాజీ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం అంపశయ్య మీద ఉందని.. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు ప్రస్తుతం అత్యవసరమని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. బాబర్ ఆజం కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. బాబర్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అతడి పేలవ ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఏడాది కాలంగా పాక్ జట్టు తీవ్రంగా నిరాశపరుస్తోంది.వరుస పరాభవాలువన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడమే గాకుండా.. సూపర్-8కు కూడా చేరకుండానే ఇంటిబాటపట్టింది.ఐసీయూలో ఉందిఇక ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలిసారిగా టెస్టుల్లో ఓడిపోవమే గాక.. 0-2తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఫలితంగా పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. పరిస్థితిని చక్కదిద్దగల ప్రొఫెషనల్ డాక్టర్ కావాలి. ఆర్థికంగానూ బోర్డు బలపడాల్సిన ఆవశ్యకత ఉంది.సమస్యల సుడిగుండంలో పాక్ జట్టు సరైన కోచ్‌లు కూడా ముఖ్యమే. పాక్ జట్టు సమస్యల సుడిగండంలో కూరుకుపోయింది. మైదానం లోపల.. వెలుపలా పరిస్థితి ఒకేలా ఉంది’’ అని పేర్కొన్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోవడమే ఉత్తమమన్న రషీద్ లతీఫ్.. బ్యాటర్‌గా జట్టుకు అతడి అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా పాకిస్తాన్ తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడనుంది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌కు బాబర్, టెస్టులకు షాన్ మసూద్ ప్రస్తుతం సారథులుగా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు మరో బిగ్‌షాక్!? -
‘నా కుమారుడికి అవకాశాలు ఇవ్వలేదు.. నాశనం చేశారు’
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుమారుడు ఆజం ఖాన్ కెరీర్‌ను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని ఆరోపించాడు. రమీజ్ రాజా ఇష్టారీతిన వ్యవహరించి యువ ఆటగాళ్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాడని.. అతడి నిర్ణయాల వల్లే జట్టు పరిస్థితి ఇలా తయారైందని విమర్శించాడు.రాణించని ఆజం ఖాన్కాగా వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా పాకిస్తాన్ తరఫున అరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఆడి.. 135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆజం ఖాన్‌కు చోటు దక్కింది.ఈ క్రమంలో మెగా టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆజం ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా అమెరికా చేతిలో ఓడిన పాక్ జట్టు.. కనీసం సూపర్-8కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఫలితంగా తీవ్ర విమర్శలపాలైంది.బాడీ షేమింగ్.. విమర్శలుఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై చర్చ జరుగగా.. ఆజం ఖాన్‌ను బాడీ షేమింగ్ చేశారు చాలా మంది. మొయిన్ ఖాన్ కొడుకు కాబట్టే బంధుప్రీతితో అతడి లాంటి వాళ్లకు కూడా జాతీయ జట్టులో చోటు దక్కుతోందని మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన మొయిన్ ఖాన్ పీసీబీపైనే విమర్శలు చేయడం విశేషం.మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు?‘‘వరల్డ్‌కప్ 2024 మ్యాచ్‌లన్నీ నేను చూశాను. వికెట్ కీపర్ బ్యాటర్ కాబట్టి ఆజం ఖాన్‌కు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇస్తారనుకున్నా. కానీ ఒక్క మ్యాచ్‌లో విఫలం కాగానే పక్కనపెట్టారు. ఇలాంటి యువ ఆటగాళ్ల ఉత్సాహాన్ని ఆదిలోనే నీరుగారిస్తే.. ఎప్పుటికప్పుడు ప్లేయర్లను మార్చివేస్తూ ఉంటే.. పటిష్ట జట్టు ఎలా రూపుదిద్దుకుంటుంది.కనీస సంఖ్యలోనైనా అవకాశాలు ఇవ్వాలి. లేనిపక్షంలో మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు? గతంలో ప్రపంచకప్-2022 సమయంలో రమీజ్ రాజా నా కుమారుడు ఆజం ఖాన్‌ను జట్టు నుంచి తప్పించాడు.సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినా కావాలనే పక్కనపెట్టాడు. ఇలాంటి వాళ్ల జట్టు ఇలా తయారైంది’’ అని 52 ఏళ్ల మొయిన్ ఖాన్ పీసీబీ ప్రస్తుత, మాజీ యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. తన కుమారుడికి ప్రతిభ ఉన్నా అవకాశాలు రావడం లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: విఫలమైన సంజూ శాంసన్.. సింగిల్ డిజిట్ స్కోర్ -
'మా దేశానికి టీమిండియా రావద్దు'.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఎట్టిపరిస్ధితులలోనూ తమ జట్టును పాక్‌కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చేప్పగా..పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సందేనని మొండి పట్టుతో ఉంది.ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2023 ఆసియాకప్‌లో తలపడేందుకు కూడా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.మా దేశానికి రావద్దు..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్తాన్‌కు రావద్దని కనేరియా సూచించాడు. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలని అతడు తెలిపాడు."పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితిని చూడండి. నేను అయితే టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లొద్దని చెబుతాను. ఈ విషయం గురుంచి పాకిస్తాన్ ఆలోచించాలి. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప పీసీబీ ఎటువంటి డిమాండ్ చేయకూడాదు. నా వరకు అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశముంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే గౌరవం, ఇంకా ఏమైనా. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోంది. వారి నిర్ణయం ఏదైనా సరే, ఇతర దేశాలు కూడా అందుకు అంగీకరించాలి. టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరిగితే బెటర్" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు.కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. ఆ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి మార్చి 9 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌కు లాహోర్‌లోని గఢాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా స్టేడియాల్లో పునర్నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి ఇందుకు కోసం పీసీబీ రూ. 1,280 కోట్లు కేటాయించింది.