ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్‌కు శుక్రవారం(నవంబర్ 29 ) తెరపడే అవకాశముంది. ఆ రోజున అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కీలక బోర్డు సమావేశం జరగనుంది.
ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వర్చవల్‌గా జరగనున్న ఈ భేటిలో మొత్తం 12 సభ్య దేశాల క్రికెట్ బోర్డు ప్రతినిధులు పాల్గోనున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది.
కాగా వాస్తవానికి ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. ఆతిథ్య హోదాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పంపింది. కానీ పాక్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించడంతో షెడ్యూల్ ఖరారులో ఆలస్యం జరుగుతోంది.
అయితే ఈ మెగా ఈవెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది. పీసీబీ మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని మొండి పట్టుతో ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 29న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఏదో ఒక విషయం తెలిపోనుంది.
కాగా హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒప్పుకుంటే అదనంగా గ్రాంట్స్ మంజూరు చేసేందుకు ఐసీసీ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అప్పటికి హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించకపోతే పాకిస్తాన్ నుంచి టోర్నీని వేరే చోటకు ఐసీసీ తరలించే అవకాశముంది. కాగా డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించే ముందు ఈ సమావేశం జరగనుండడం గమనార్హం.
చదవండి: 'కోహ్లిలా నిన్ను నువ్వు నమ్ముకో'.. ఆసీస్ స్టార్ ప్లేయర్‌కు మెంటార్ సలహా
Comments
Please login to add a commentAdd a comment