అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిగివచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో ఎట్టకేలకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకొన్నప్పటికీ కొన్ని షరతులు విధించినట్లుగా సమాచారం.
కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని పాక్ భావించింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలిసి టోర్నమెంట్ బరిలో దిగాలని ఉవ్విళ్లూరింది.
పీసీబీకి ఐసీసీ అల్టిమేటం
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ విషయం గురించి పీసీబీకి చెప్పగా.. ఇందుకు పాక్ బోర్డు ససేమిరా అంది.
మరోవైపు.. భారత్ కూడా ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని ఐసీసీకి గట్టిగానే చెప్పింది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ పెద్దలు పాక్‌తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు మొండివైఖరి ప్రదర్శించగా.. ఐసీసీ కఠినంగా వ్యవహరించకతప్పలేదు.
టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు వీలుగా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకుంటే.. టోర్నీ మొత్తాన్ని పాక్‌ను తరలిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో దిగివచ్చిన పాక్ బోర్డు.. ఐసీసీ ప్రపోజల్‌కు సరేనందని.. అయితే, మూడు షరతులు కూడా విధించిందని ఇండియా టుడే కథనం పేర్కొంది.
ఆ మూడు కండిషన్లు ఏమిటంటే?..
👉టీమిండియా గ్రూప్ దశలో, సెమీ ఫైనల్స్, ఫైనల్‌లో(ఒకవేళ అర్హత సాధిస్తే) ఆడేమ్యాచ్‌లను దుబాయ్‌లోనే నిర్వహించాలి.
👉ఒకవేళ టీమిండియా గనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించేందుకు పాకిస్తాన్‌కు అనుమతినివ్వాలి.
👉ఇక భవిష్యత్తులో భారత్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లు ఆడేందుకు పాకిస్తాన్ అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించాలి.
చదవండి: IND Vs AUS PM XI Test: టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు!
Comments
Please login to add a commentAdd a comment