ICC
-
షాకింగ్.. టీ20 ఫార్మాట్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ!?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాలి. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాత్రం ఇప్పటివరకు ఇంకా అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు.అందుకు కారణం బీసీసీఐ-పీసీబీ మధ్య నెలకొన్న విభేదాలే. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు పంపేంచేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇప్పటికే ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది.అందుకు అన్ని క్రికెట్ బోర్డులు అంగీకరించినా, పీసీబీ మాత్రం ససేమీరా అంటుంది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహణకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఒకవేళ అందుకు ఒప్పుకోపోతే టోర్నీని పాక్ నుంచి వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీబీ ఓ మెట్టు దిగి వచ్చి హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేందుకు సిద్దమైనట్లు సమాచారం.మరో కొత్త ట్విస్ట్..తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంలో మరో కొత్త ఆంశం తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్‌కు బదులగా టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం..ఐసీసీ షెడ్యూల్‌ను ఇంకా ఖారారు చేయకపోవడంతో మార్కెటింగ్ చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని పెట్టబడుదారులు అవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి కొన్ని రోజులు ఇదే తంతు కొనసాగితే ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్లలో నిర్వహించాలని సదరు స్టేక్‌హోల్డర్స్ సూచించినట్లు తెలుస్తోంది. అందుకు ఐసీసీ కూడా సముఖంగా ఉన్నట్లు క్రిక్‌బజ్‌తో పాటు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే ఫార్మాట్ కంటే టీ20లను ఈజీగా నిర్వహించవచ్చని ఐసీసీ భావిస్తున్నట్లు వినికిడి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై గురువారం(డిసెంబర్ 12)ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.చదవండి: IND vs AUS: 'ధోని లాంటి కెప్టెన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్' -
విండీస్ పేసర్‌కు షాకిచ్చిన ఐసీసీ
వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది. డిసెంబర్ 8న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు ముందు ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గానూ జోసఫ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అదనంగా జోసఫ్ యొక్క క్రమశిక్షణా రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడింది. ఐసీసీ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు జోసఫ్ స్పైక్‌లతో పిచ్‌పై అడుగు పెట్టకుండా ఉండమని ఫోర్త్ అంపైర్ సూచించాడు. అయితే ఇది పట్టించుకోని జోసఫ్ స్పైక్‌లతో పిచ్‌పై అడుగుపెట్టడంతో పాటు అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ చర్య ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని ఉల్లంఘణ కిందకు వస్తుంది. జోసఫ్ తన నేరాన్ని అంగీకరించినట్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో తెలిపాడు. జోసఫ్ గత 24 నెలల వ్యవధిలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇది రెండో సారి.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (113) మెరుపు శతకం బాది విండీస్‌ను గెలిపించాడు. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇవాళ (డిసెంబర్ 10) జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది. తంజిద్ హసన్(30), లిటన్ దాస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు ఐసీసీ షాక్!?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం కన్న స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలెట్ అయింది.రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్(140)ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్‌ను పెవీలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్‌ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు.బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నాని, అతడు తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాడు. ఏదమైనప్పటికి వీరిద్దరూ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఐసీసీ సీరియస్..!ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం.అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.చదవండి: జట్టులో బుమ్రా ఒక్కడే లేడు కదా.. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి: రోహిత్ -
ఆటను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తా: జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్‌గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జై షా క్రికెట్‌ను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తానని అన్నారు. గురువారం చైర్మన్‌గా తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ కొత్త బాధ్యతలు ఉత్తేజంగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.‘నేను దేన్నయితే ఆసక్తిగా చూసేవాడినో (క్రికెట్)... అదే ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తుంది. మంచి గుర్తింపును ఇస్తుంది. అయితే నాకిది ఆరంభం మాత్రమే! క్రికెట్ క్రీడకు మరింత సొబగులద్దాలి. ఆట కొత్త శిఖరాలు అధిరోహించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటి నుంచే కష్టపడతాను. మేమంతా స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తాం’ అని అన్నారు. కార్యాలయ సందర్శన వల్ల సహచరులతో కలిసి పనిచేసేందుకు చక్కని సమన్వయం కుదురుతుందని, ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. రోడ్‌మ్యాప్‌కు అవసరమైన వ్యూహాలు ఇక్కడే మొదలవుతాయన్నారు. అంకితభావంతో పనిచేసే ఐసీసీ బృందంతో ఇలా పనిచేయడం మంచి అనుభూతి ఇస్తుందని పేర్కొన్నారు. జై షాకు సాదర స్వాగతం పలికిన డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఐసీసీ కొత్త చైర్మన్ పదవీ కాలంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో జస్ప్రీత్ బుమ్రా
నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ గురువారం (డిసెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఉన్నారు. వీరి ముగ్గురూ నవంబర్ మంత్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.జస్ప్రీత్ బుమ్రా..గత నెలలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బుమ్రా అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కివీస్‌తో సిరీస్ కోల్పోయినప్పటికి బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు బుమ్రా నామినేట్ అయ్యాడు.హ్యారీస్ రవూఫ్..ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాక్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి సిరీస్‌ను పాక్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కంగారులతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అతడు 5 వికెట్లు పడగొట్టాడు.మార్కో జాన్సెన్..భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సఫారీ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ తన ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను చూపించాడు. బ్యాట్‌తోనూ బంతితోనూ అదరగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి ప్రోటీస్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ
బీసీసీఐ డిమాండ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు తలొగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది.టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పీసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్స్ ప్రకారం.. గురువారం(డిసెంబర్ 5) సాయంత్రం బోర్డు మీటింగ్ అనంతరం ఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.ఐసీసీ కొత్త చైర్మెన్‌గా ఎన్నికైన జైషా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లోఎ మొత్తం 15 దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు పాల్గోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినప్పటికి బీసీసీఐకి కొన్ని షరతులు విధించింది.రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరింది. కానీ బీసీసీఐ మాత్రం అందుకు సున్నితంగా తిరష్కరించింది.అదేవిధంగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోతే టోర్నీని వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
విండీస్ ఆటగాళ్లకు జరిమానా
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వెస్టిండీస్ ఆటగాళ్లు జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్లకు జరిమానా పడింది. సీల్స్ వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించినందుకు గాను అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు. అలాగే అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.ఆల్‌రౌండర్ కెవిన్ సింక్లెయిర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా వచ్చి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. సింక్లెయిర్, సీల్స్ అంపైర్లు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సీల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15.5 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి టెస్ట్‌లో నెగ్గగా.. బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమంగా ముగిసింది. -
WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ
ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి.ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌కు పెద్దగా నష్టమేమీ లేనప్పటికీ.. న్యూజిలాండ్‌కు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉండింది.న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ 47.92గా ఉంది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు ఇది సరిపోదు. కాబట్టి ఐసీసీ తాజాగా విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. మరోవైపు న్యూజిలాండ్‌తో పాటు పాయింట్ల కోత విధించబడ్డ ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇదివరకే అనధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 40.75 శాతం పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.ఇదిలా ఉంటే, క్రైస్ట్‌చర్చ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) సత్తా చాటి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలవుతుంది. -
పాకిస్తాన్ తలవంచినట్లే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ–2025 నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు గట్టిగా పట్టుదల కనబర్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పనిసరి పరిస్థితుల్లో మెత్తపడింది. ‘హైబ్రిడ్’ మోడల్‌కు అంగీకరించేది లేదని, మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహిస్తామని చెబుతూ వచి్చన పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆ ఆశలు వదిలేసుకున్నారు. శనివారం ఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మేం ఏం చేసినా క్రికెట్ మేలు కోసమే’ అంటూ ఐసీసీ షరతులకు తలవంచారు. ఐసీసీ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా... నఖ్వీ మాటలను బట్టి చేస్తూ ‘హైబ్రిడ్’ మోడల్ ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు దేశాల ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఐసీసీ త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్‌కు తాము వెళ్లమని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. దాంతో ఐసీసీ ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది.. ‘హైబ్రిడ్’ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే జరుగుతాయి. భారత్ మాత్రం మరో వేదికలో ఆడుతుంది. ప్రస్తుతానికి అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అయ్యే అవకాశం ఉంది. అయితే చివరి ప్రయత్నంగా పీసీబీ కొన్ని డిమాండ్లు చేసినట్లు సమాచారం. ఐసీసీ టోరీ్నల విషయంలో తాము ‘సమానత్వం’ కోరుకుంటున్నట్లు నఖ్వీ వెల్లడించారు. దీని ప్రకారం మున్ముందు భారత్‌లో జరిగే ఐసీసీ టోరీ్నలకు కూడా ‘హైబ్రిడ్’ మోడల్ అమలు చేయాలని పీసీబీ కోరింది. అంటే తాము కూడా ఇకపై భారత్‌కు వెళ్లి మ్యాచ్‌లు ఆడమని...తమ కోసం ప్రత్యామ్నాయ వేదికను చూడాలని పీసీబీ డిమాండ్ చేసింది. 2026లో టి20 వరల్డ్ కప్, 2029లో చాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఆసియా కప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరో వైపు ఐసీసీ నుంచే తమకు లభించే ఆదాయాన్ని కూడా కొంత శాతం పెంచాలని, ‘హైబ్రిడ్’కు అంగీకరించినందుకు కొంత అదనపు మొత్తాన్ని ఇవ్వాలని కూడా పీసీబీ కోరినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చిలో జరగనుంది. పాక్‌లో వేదికలుగా లాహోర్, కరాచీ, రావల్పిండలను నిర్ణయించారు. -
ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ..
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిగివచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో ఎట్టకేలకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకొన్నప్పటికీ కొన్ని షరతులు విధించినట్లుగా సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని పాక్ భావించింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలిసి టోర్నమెంట్ బరిలో దిగాలని ఉవ్విళ్లూరింది.పీసీబీకి ఐసీసీ అల్టిమేటంఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ విషయం గురించి పీసీబీకి చెప్పగా.. ఇందుకు పాక్ బోర్డు ససేమిరా అంది.మరోవైపు.. భారత్ కూడా ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని ఐసీసీకి గట్టిగానే చెప్పింది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ పెద్దలు పాక్‌తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు మొండివైఖరి ప్రదర్శించగా.. ఐసీసీ కఠినంగా వ్యవహరించకతప్పలేదు.టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు వీలుగా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకుంటే.. టోర్నీ మొత్తాన్ని పాక్‌ను తరలిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో దిగివచ్చిన పాక్ బోర్డు.. ఐసీసీ ప్రపోజల్‌కు సరేనందని.. అయితే, మూడు షరతులు కూడా విధించిందని ఇండియా టుడే కథనం పేర్కొంది.ఆ మూడు కండిషన్లు ఏమిటంటే?..👉టీమిండియా గ్రూప్ దశలో, సెమీ ఫైనల్స్, ఫైనల్లో(ఒకవేళ అర్హత సాధిస్తే) ఆడేమ్యాచ్లను దుబాయ్‌లోనే నిర్వహించాలి.👉ఒకవేళ టీమిండియా గనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించేందుకు పాకిస్తాన్‌కు అనుమతినివ్వాలి.👉ఇక భవిష్యత్తులో భారత్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లు ఆడేందుకు పాకిస్తాన్ అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించాలి. చదవండి: IND Vs AUS PM XI Test: టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
‘హైబ్రిడ్’ మోడల్‌కు అంగీకరించాల్సిందే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ‘హైబ్రిడ్ మోడల్’కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని... లేదంటే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఆడకుండా టోర్నీని జరుపుతామని కూడా తేల్చేసింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్‌గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది! ఇందులో ఎలాంటి ఫలితం రాకపోయినా, తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్‌కు చెప్పేసింది. దుబాయ్‌లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. భారత్ మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరిపేలా ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్’ మోడల్‌ను పీసీబీ ఇక్కడా తిరస్కరించింది. దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా... ప్రస్తుత స్థితిలో ‘హైబ్రిడ్’ మోడల్‌కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించారు. దీనిని అమలు చేస్తే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ యూఏఈలో జరుగుతాయి. ‘భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఈ విషయం పాక్‌కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడవచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న సభ్యుడొకరు వెల్లడించారు. టోర్నీ పాక్ దాటి వెళితే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే 6 మిలియన్ డాలర్లతోపాటు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. -
‘పాక్‌కు మోదీ వెళ్లొచ్చు.. టీమిండియా వెళ్లకూడదా?’
పాట్నా : వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. ఈ నిర్ణయంపై రాజకీయం వివాదం రాజుకుంది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తప్పుబట్టారు. బిర్యానీ తినేందుకు ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లొచ్చు. కానీ భారత క్రికెర్లు అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడకూడదా? అని ప్రశ్నించారు. క్రీడలకు రాజకీయాలను ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ‘క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. వాళ్లు (పాకిస్తాన్) మన దేశానికి రావాలి. మన ఆటగాళ్లు పాకిస్థాన్‌కి వెళ్లాలి. క్రీడలతో సమస్య ఏంటి? దాయాది దేశాల మధ్య క్రీడలు జరుగుతుంటే యుద్ధం జరుగుతున్నట్లు కాదుగా అని అన్నారు. మోదీ బిర్యానీ తినేందుకు పాక్‌కు వెళితే మంచి విషయం. కానీ భారత క్రికెట్ టీమ్ వెళితే తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి క్రికెట్లో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించిన తేజస్వి ప్రధాని హోదాలో ప్రధాని మోదీ 2015లో పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానితో కలిసి మోడీ విందు చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ తేజస్వీ యాదవ్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇక అప్పటి నుండి టీమిండియా మళ్లీ పాక్‌కు వెళ్లలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడారు. -
‘హైబ్రిడ్’ మోడల్‌పైనే చర్చ!
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెట్ జట్టు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో వేదిక విషయంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీ ప్రసారకర్తలతో ఒప్పందం ప్రకారం కనీసం 90 రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అది జరగనేలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశం కానున్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారు. లేదంటే ఓటింగ్ కూడా జరపాల్సి రావచ్చు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ వన్డే టోర్నీ కి సంబంధించి ఐసీసీ వద్ద చర్చ కోసం మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది హైబ్రిడ్ మోడల్. దీని ప్రకారం దాదాపు అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనే నిర్వహించి భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం మరో దేశంలో ప్రత్యామ్నాయ వేదికను చూడటం. భారత్ నాకౌట్ దశకు చేరితే కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుత స్థితిలో ఇది సరైందిగా ఐసీసీ భావిస్తోంది. గత ఏడాది ఆసియా కప్‌ను కూడా ఇలాగే నిర్వహించారు. అయితే దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీపీ) ససేమిరా అంటోంది. దీనికి ఒప్పుకునేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి సమాచారం అందించింది. రెండో ప్రతిపాదనతో పూర్తిగా టోరీ్నలో మరో దేశంలో (యూఏఈ కావచ్చు) నిర్వహించి ఆతిథ్య హక్కులు మాత్రం పాకిస్తాన్ వద్దే ఉంచడం. అయితే ఇప్పటికే టోర్నీ కోసం లాహోర్, కరాచీ స్టేడియాలను ఆధునీకరించి సిద్ధమవుతున్న పాకిస్తాన్ దీనికి ఎలాగూ అంగీకరించదు. పైగా 1996 వరల్డ్ కప్ తర్వాత అక్కడ ఒక్క ఐసీసీ టోర్నీ జరగలేదు. టోర్నీ దేశం దాటిపోతే ఆర్థికపరంగా బాగా నష్టం కూడా. మూడోది భారత్ లేకుండా టోర్నీని జరపడం. వాణిజ్యపరమైన అంశాలను చూసుకుంటే ఇది అసాధ్యమైన ప్రతిపాదన. మరోవైపు లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ను ఎక్కడ జరపాలనే అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. హైబ్రిడ్ మోడల్‌కు తాము అంగీకరించాలంటే భారత్‌లో రాబోయే ఐదేళ్లలో జరిగే నాలుగు టోర్నీలకు కూడా దీనిని వర్తింపజేస్తామని హామీని ఇవ్వాలని... తామూ భారత్‌కు వెళ్లమని పాక్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్‌కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్‌తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్‌లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్‌లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
నేను చేసిన తప్పేంటో నాకు అర్ధం కావడం లేదు యువరానర్!!
-
తిలక్ @3
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్‌కు చేరాడు.నాలుగు నెలల తర్వాత... ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు.అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. -
Champions Trophy: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ మరింత వివాదాస్పదం కాకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే.. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.ఎనిమిది జట్లువన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆతిథ్య పాకిస్తాన్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి. అయితే, పాక్‌లో నిర్వహించే ఈ ఐసీసీ ఈవెంట్‌కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది.హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోము అంటున్న పాక్అదే విధంగా.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఐసీసీ ఇందుకు సానుకూలంగానే ఉన్నా.. పీసీబీ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. కావాలంటే ఆతిథ్యమైనా వదులుకుంటాంగానీ.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోమని చెబుతోంది.అత్యుత్సాహం ప్రదర్శించిన పీసీబీఅంతేకాదు.. తమ ప్రభుత్వానిది కూడా ఈ విషయంలో ఇదే వైఖరి అని ఐసీసీకి తేల్చిచెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో పీసీబీ భారత్‌ను కవ్వించేలా మరో చర్యకు దిగింది. చాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా ఉన్న ప్రాంతంలో చేస్తామని శుక్రవారం ప్రకటించింది.ముకుతాడు వేసిన ఐసీసీస్కర్దు, హంజా, మజఫర్బాద్లలో ట్రోఫీ టూర్ చేస్తామని అధికారికంగా పీసీబీ వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారగా.. ఐసీసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ట్రోఫీ టూర్‌ను రద్దు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా నవంబరు 16- 24 వరకు చాంపియన్స్ ట్రోఫీ-2025 టూర్ జరుగనుంది. ఇందులో భాగంగా ట్రోఫీని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో అభిమానుల సందర్శనకు ఉంచుతారు. చదవండి: టచ్‌లోకి వచ్చిన విరాట్.. మరోసారి క్లీన్ బౌల్డ్ అయిన పంత్ -
పాకిస్తాన్ బోర్డు కవ్వింపు చర్యలు.. చాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రకటన
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఐసీసీ టోర్నీ ట్రోఫీ టూర్‌ను నిర్వహించే ప్రదేశాల పేర్లను పీసీబీ శుక్రవారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.నవంబరు 16న ఇస్లామాబాద్‌లో‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025.. ట్రోఫీ టూర్ నవంబరు 16న ఇస్లామాబాద్‌లో మొదలవుతుంది. అదే విధంగా.. స్కర్దు, ముర్రే, హంజా, మజఫర్బాద్లోనూ జరుగుతుంది. సర్ఫరాజ్ అహ్మద్ 2017లో ది ఓవల్ మైదానంలో ట్రోఫీని పట్టుకున్న దృశ్యాలను చూడండి. ఈ ట్రోఫీ టూర్ నవంబరు 16- 24 వరకు జరుగుతుంది’’ అని పీసీబీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.ఇందులో ప్రస్తావించిన స్కర్దు, హంజా, మజఫర్బాద్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రాంతాలు అని.. పాక్ బోర్డు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదుఈ మెగా టోర్నీకి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అర్హత సాధించాయి. అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐసీసీకి తేల్చిచెప్పింది.టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని సూచించింది. ఐసీసీ కూడా ఇందుకు సానుకూలంగానే ఉందనే వార్తలు వినిపించాయి. అయితే, పాకిస్తాన్ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది.ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ దేశానికి వచ్చాయని.. టీమిండియా కూడా రావాలని పట్టుబడుతోంది. తమ ప్రభుత్వం కూడా ప్రతీ మ్యాచ్‌ను దేశంలోనే నిర్వహించాలని సూచించిందని..పంతానికి పోతోంది.తటస్థ వేదికపై నిర్వహిస్తారా?ఈ మేరకు ఇలా ఇరు బోర్డుల మధ్య చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయమై విభేదాలు తలెత్తిన వేళ.. పీసీబీ రెచ్చగొట్టే చర్యలకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీసీ అంతిమంగా తీసుకునే నిర్ణయంపైనే టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తారా? లేదంటే.. బీసీసీఐ ఈ టోర్నీని బహిష్కరిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీమిండియా గనుక ఈ ఈవెంట్లో ఆడకపోతే పాకిస్తాన్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా భారీగా ఆర్థిక నష్టం తప్పదు.చదవండి: కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో పంత్ క్లీన్‌బౌల్డ్! జైస్వాల్ కూడా..Get ready, Pakistan!The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024 -
ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ ఇక్కడే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వేదిక విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వైఖరిని మార్చుకోవడం లేదు. ఆతిథ్యాన్ని అయినా వదులుకుంటాం కానీ హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహించబోమని పట్టుదలకు పోతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కూడా పీసీబీకి మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక్క మ్యాచ్ కూడా దేశం వెలుపల నిర్వహించేందుకు అంగీకరించవద్దని బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పీసీబీ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నీ అంశంలో మా ప్రభుత్వం మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మ్యాచ్ మా దేశంలోనే నిర్వహించాలని చెప్పింది.ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ ఇక్కడేఏ జట్టుకు సంబంధించి అయినా.. ఒక్క మ్యాచ్ కూడా తటస్థ వేదికపై నిర్వహించేందుకు వీలులేదని.. ఇదే తమ వైఖరి అని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి.. బీసీసీఐ పాకిస్తాన్‌కు తమ జట్టును పంపలేమన్న విషయాన్ని మాత్రమే ఐసీసీ మాకు తెలియజేసింది.చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను మేము దక్కించుకున్న మాట వాస్తవం. కాబట్టి పాకిస్తాన్ వెలుపల ఒక్క మ్యాచ్ నిర్వహించడానికి మేము ఒప్పుకోము’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఒప్పుకోవద్దని పాక్ ప్రభుత్వం పీసీబీకి చెప్పిందని తన యూట్యూబ్ చానెల్‌గా వెల్లడించాడు.ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యంకాగా వచ్చే ఏడాది పాక్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో.. హైబ్రిడ్ మోడల్ అయితేనే ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంటే.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తేనే ఆడతామని ఐసీసీకి స్పష్టమైన సమాచారమిచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని పీసీబీ పేర్కొన్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.మరోవైపు.. బీసీసీఐ సైతం ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టి పాక్‌లో టోర్నీ ఆడలేమని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఈ టోర్నీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఒకవేళ.. పాకిస్తాన్ గనుక ఆతిథ్య హక్కులు వదులుకుంటే ఈ మెగా టోర్నీ వేదికను... దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తోంది.పాకిస్తాన్‌లోనే అంధుల టీ20 ప్రపంచకప్ఇదిలా ఉంటే.. అంధుల టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా ఈసారి పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ టోర్నీ ఆడేందుకు అనుమతించాలని డిఫెండింగ్ చాంపియన్ భారత అంధుల క్రికెట్ జట్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం కేంద్ర క్రీడా శాఖ, హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు దరఖాస్తు చేసుకుంది.లాహోర్, ముల్తాన్ వేదికలపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 3 వరకు అంధుల ప్రపంచకప్ టోర్నీ జరుగుతుంది. 17 సభ్యులు గల భారత జట్టుకు క్రీడాశాఖ తమ ఆమోదం తెలుపుతూ ఎన్ఓసీని జారీ చేసింది. అయితే హోం, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఆమోదం రాకపోవడంతో జట్టు నిరీక్షిస్తోంది. భారత ప్రభుత్వం అనుమతించి, అంతా అనుకున్నట్లు జరిగితే వాఘా సరిహద్దు గుండా భారత అంధుల క్రికెట్ జట్టు ఈ నెల 21న పాకిస్తాన్‌కు బయల్దేరనుంది. చదవండి: టీమిండియాతో సిరీస్.. 3-1తో సౌతాఫ్రికా గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్ -
భారత్ రాదు... నిర్ణయం మీదే!
కరాచీ: వచ్చే ఏడాది పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది. అయితే పాక్‌లో ఆడేందుకు భారత్ ససేమిరా అంటోంది. మరోవైపు హైబ్రిడ్ మోడల్ (భారత్ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహణ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో తమ దేశంలో భారత్ మెగా టోర్నీ ఆడే విషయమై ఐసీసీని మరింత స్పష్టత కోరాలని పీసీబీ భావిస్తుండగా... ఐసీసీ నాన్చకుండా తేల్చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో... ఫైనల్ పోరు దుబాయ్‌లో నిర్వహించే హైబ్రిడ్ పద్ధతికే తాము అంగీకరిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమకు స్పష్టం చేసిందని పాక్ బోర్డుకు ఐసీసీ తేల్చిచెప్పింది. భారత్ ఆడే మ్యాచ్‌లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచి్చంది. ఇక కాదు... కూడదంటే... మీ ఇష్టమని పాక్ బోర్డుకు స్పష్టం చేయడంతో పీసీబీ కినుక వహించింది. నిరసనగా ఆతిథ్య హక్కులు వదిలేసుకోవాలని బోర్డు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది. టోర్నీ ఆతిథ్యం నుంచి ఒకవేళ పాక్ తప్పుకుంటే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించాలని ఐసీసీ భావిస్తోంది. ఎలాగైనా పాక్‌లో భారత క్రికెట్ జట్టు అడుగుపెట్టాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ విముఖత వ్యక్తం చేస్తోంది. ‘హైబ్రిడ్ పద్ధతిలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే ఆలోచన పీసీబీకి లేదు. ప్రస్తుత పరిస్థితిని బోర్డు అంచనా వేస్తోంది. (పాక్) ప్రభుత్వాన్ని సంప్రదించాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుంది’ అని పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. కాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య గడిచిన 16 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీసే జరగడం లేదు. 2008లో ముంబైపై పాక్ ఉగ్రదాడి అనంతరం రాజకీయ, క్రికెట్ బంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి భారత్, పాక్ జట్లు కేవలం ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నల్లో, చాంపియన్స్ ట్రోఫీల్లోనే తలపడుతున్నాయి. -
ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఈ- మెయిల్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదివారం ధ్రువీకరించింది.పాక్ ప్రభుత్వానికి లేఖబీసీసీఐ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తూ ఐసీసీ మెయిల్ పంపిందని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం గురించి తాము పాక్ ప్రభుత్వానికి లేఖ పంపామని.. ప్రభుత్వ సూచనలు, సలహా మేరకు అంతిమ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, అంతకంటే ముందే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. టీమిండియా తమ దేశానికి తప్పక రావాలని.. ఐసీసీ టోర్నీ విషయంలో హైబ్రిడ్ విధానం కుదరదని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో పాక్, భారత మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పీసీబీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదాయానికి భారీగా గండి‘‘అవును.. ఇది ఐసీసీ ఈవెంటే! బ్రాడ్కాస్టర్లు అందుకే డబ్బు కూడా చెల్లించారు. అయితే, ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనకపోతే.. మ్యాచ్ ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.ఆర్థికంగా ఒకరకమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో ఆడకపోతే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్-2023 కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చేటపుడు పీసీబీ చీఫ్ మేము శత్రు ప్రదేశంలో అడుగుపెట్టబోతున్నామని అన్నారు.టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ లేనట్లేఒకవేళ పాకిస్తాన్ గనుక భవిష్యత్తులో టీమిండియాతో ఆడొద్దని అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే ప్రభావం ఉంటుంది. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌తో ఆడకపోతే ఆ ప్రభావం మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది.పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదన్నది చేదు నిజం. ఒకవేళ టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండదు. పాకిస్తాన్‌తో సహా ప్రతీ జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రరి- మార్చి నెలలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుండగా.. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన టీమిండియా, చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు.. ఐసీసీ రద్దు చేయనుందా!?
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీని రద్దు చేసే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఐసీసీ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.కాగా ఇప్పటికే మెగా టోర్నీలో పాల్గోనేందుకు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌తో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుపడుతోంది.దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడం ఐసీసీకి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి నవంబర్ 11న లహోర్‌లో జరగాల్సిన ఓ మేజర్ ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేసింది. ఈ ఈవెంట్లో టోర్నీలో పాల్గోనే జట్ల జాతీయ జెండాలతో పాటు షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయాలని భావించింది. కానీ రద్దు చేయకాగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వంద రోజుల కౌంట్‌డౌన్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఇవన్నీ చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఐసీసీ అధికారి ఒకరూ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖారారు కాలేదు."ఈ టోర్నీలో పాల్గోనే జట్లతో పాటు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్‌తో కూడా చర్చలు జరుపుతున్నాము. షెడ్యూల్ ఖారారైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాము. ట్రోఫీ టూర్ ఫ్లాగ్, ట్రోఫీని లాంఛ్ చేసేందుకు లహోర్‌లో ఓ ఈవెంట్ నిర్వహించాలని భావించాము. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.చదవండి: PAK vs AUS: నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్ -
‘పాకిస్తాన్లో ఆడేదే లేదు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భారత్ పాల్గొనే విషయంపై స్పష్టత వచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టు వెళ్లడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తేల్చి చెప్పింది. పాక్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చిలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ అక్కడికి వెళ్లే విషయంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిని నిజం చేస్తూ బీసీసీఐ తమ నిర్ణయాన్ని ఖరాఖండీగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ గడ్డపై తాము క్రికెట్ ఆడలేమని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా లేఖ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి తెలియజేసింది. తాము పాకిస్తాన్‌కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా భారత బోర్డు సమాచారం అందించింది. తాజా పరిణామంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యామ్నాయ వేదికలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌తో పాటు భారత్‌కు ప్రత్యరి్థగా ఉండే జట్లు కూడా పాక్ వెలుపల ఉండే వేదికలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుది. పాక్‌తో పాటు దేశం బయట మరో వేదికను ఎంచుకొని ‘హైబ్రిడ్ మోడల్’లో టోర్నీని నిర్వహించే ఆలోచనే లేదని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ శుక్రవారం కూడా చెప్పారు. అయితే ఒక్కరోజులో పరిస్థితి అంతా మారిపోయింది. భారత మ్యాచ్‌లకు యూఏఈ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. తాము సిద్ధమంటూ శ్రీలంక బోర్డు చెబుతున్నా... పాక్ కోణంలో వారికి అనుకూల, సౌకర్యవంతమైన వేదిక కాబట్టి యూఏఈకే మొగ్గు చూపవచ్చు. 2023లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు వచ్చి ఆడినా... భారత్ మాత్రం అలాంటిదేమీ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడింది. నేటి నుంచి సరిగ్గా 100 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. -
పాకిస్తాన్‌కు వస్తారా? లేదా?.. ఏదో ఒకటి చెప్పండి! రాకపోతే మాత్రం..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు దాయాది దేశానికి వెళ్లకుంటే.. ఏం చేయాలన్న విషయంపై కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ పర్యటన విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ఐసీసీతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐ నుంచి రాతపూర్వక సమాధానం కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భద్రతా కారణాల దృష్ట్యాకాగా 2008 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోగా.. మెగా టోర్నీల్లో మాత్రం దాయాదులు ముఖాముఖి తలపడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు కలుగుతోంది.అప్పుడు శ్రీలంకలోఅయితే, ఆసియా వన్డే కప్-2023 హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. బీసీసీఐ మాత్రం రోహిత్ సేనను అక్కడికి పంపలేదు. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని కోరగా.. ఆసియా క్రికెట్ మండలి అందుకు అంగీకరించింది. దీంతో టీమిండియా మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి.ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 భారత్‌లో జరుగగా.. పాక్ జట్టు ఇక్కడికి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో ఘోర ఓటమితో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు తమవే గనుక.. టీమిండియా తమ దేశానికి రావాలని పీసీబీ కోరుతోంది. అయితే, బీసీసీఐ నేరుగా ఈ విషయాన్ని ఖండించలేదు. భారత ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తాము అడుగులు వేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశాడు.రాతపూర్వక సమాధానం ఇవ్వండిఅయితే, వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీకి సిద్ధమవుతున్న పీసీబీ.. టీమిండియా తమ దేశానికి వస్తుందో? రాదో అన్న అంశంపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ సైతం ఈ విషయం గురించి బీసీసీఐని అడిగిందని.. ఒకవేళ భారత బోర్డు నుంచి సమాధానం రాకపోతే వచ్చే వారం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఒకవేళ టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోతే మాత్రంఇక టీమిండియా మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహిస్తామని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఇప్పటికే చెప్పాడు. ఇదిలా ఉంటే.. బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యామ్నాయ వేదిక కోసం ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ నుంచి కొంతమొత్తం పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక ఐసీసీ చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా డిసెంబరు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
మంచి రోజులు వస్తున్నాయి...
దుబాయ్: మన మహిళల క్రికెట్‌కు మంచి రోజులు వస్తున్నాయి. గట్టి ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇకపై క్రమం తప్పకుండా భారత్‌లో పర్యటించనున్నాయి. 2025–29 సైకిల్‌కు సంబంధించిన మహిళల భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా భారత జట్టు కీలక ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడనుంది. ఈ నాలుగేళ్ల కాలంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికాల్లోనూ టీమిండియా పర్యటించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లోని ప్రతి సభ్య దేశం ఇంటా బయటా నాలుగు సిరీస్‌ల చొప్పున పాల్గొనేలా కొత్త ఎఫ్‌టీపీని రూపొందించారు. భారత్ మేటి ప్రత్యర్థులతో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్, 11వ సభ్య దేశంగా ఉన్న జింబాబ్వేతోనూ తలపడుతుంది. ఎప్పుడో అరకొరగా జరిగే టెస్టులను ఈ నాలుగేళ్ల సైకిల్లో పెంచారు. సభ్యదేశాలన్నీ మూడు ఫార్మాట్ల సిరీస్‌లో పాల్గొనేందుకు సమ్మతించాయని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీమ్ ఖాన్ తెలిపారు. దీంతో గత ఎఫ్టీపీతో పోల్చితే తదుపరి సైకిల్లో మహిళల మ్యాచ్‌లు మూడు ఫార్మాట్లలోనూ గణనీయంగా పెరగనున్నాయి. » కొత్త ఎఫ్టీపీ వచ్చే ఏడాది మేలో మొదలై 2029 ఏప్రిల్‌తో ముగుస్తుంది. ప్రతి దేశం పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చాయి. దీంతో 2025–29 సైకిల్లో 400 పైచిలుకు అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో జరిగే 44 వన్డే సిరీస్‌లలో ఒక్కో సభ్యదేశం మిగతా పది జట్లతో మూడు వన్డేల చొప్పున ఆడుతుంది. అలా 132 వన్డేలు జరుగుతాయి. » మహిళల ఎఫ్‌టీపీని 2029లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు అనుగుణంగా రూపొందించారు. ఇప్పుడున్న 10 జట్లతో పరిమితం కాకుండా ఆ మెగా టోర్నీ 11 జట్లతో జరుగనుంది. 11వ దేశంగా జింబాబ్వే బరిలోకి దిగుతుంది. ఇటీవల జింబాబ్వే మహిళల జట్టుకు శాశ్వత సభ్యదేశం హోదా ఇచ్చారు. » 2026లో ఇంగ్లండ్‌లో జరగబోయే టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ అక్కడ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో కలిసి ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది. » ఐర్లాండ్‌లోనూ జరిగే సన్నాహక ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లు తలపడతాయి. అలాగే భారత ఉపఖండంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్, మరో జట్టుతో కలిసి ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంటుంది. » ఐసీసీ మహిళల చాంపియన్íÙప్లో భాగమైన జింబాబ్వే... వచ్చే నాలుగేళ్ల పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంకలతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆతిథ్యమిస్తుంది. దీంతో పాటు భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో పర్యటిస్తుంది. » అందరికంటే ఆ్రస్టేలియా గరిష్టంగా ద్వైపాక్షిక సిరీస్‌లలో భాగమవుతుంది. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లాంటి గట్టి ప్రత్యర్థులతో ఇంటా బయటా సిరీస్‌లు ఆడుతుంది.