
ఆ్రస్టేలియా స్పిన్నర్ మాథ్యూ కూనెమన్ బౌలింగ్ శైలి... నిబంధనలకు అనుగుణంగానే ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. గత నెలలో శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా కూనెమన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు అందగా... బ్రిస్బేన్ వేదికగా ఐసీసీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది.
వీటిలో అతడు నిబంధనలకు లోబడే బంతులు వేస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ కొనసాగించవచ్చని ఐసీసీ వెల్లడించింది. ‘కూనెమన్ బౌలింగ్ శైలి చట్టబద్ధంగానే ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయవచ్చు’ అని ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో 28 ఏళ్ల కూనెమన్ బౌలింగ్ యాక్షన్‌పై కమ్ముకున్న నీలినీడలు వీడిపోయాయి. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 16 వికెట్లు పడగొట్టిన కూనెమన్... ఆస్ట్రేలియా సిరీస్ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ పరీక్ష సమయంలో క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) కూనెమన్‌కు పూర్తి మద్దతుగా నిలిచింది. ఈ ఏడాది జూన్‌లో ఆ్రస్టేలియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుండగా... మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూనెమన్ అందుబాటులో ఉండనున్నాడు.
చదవండి: ఇదేమి సెక్యూరిటీరా బాబు.. మరోసారి మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్
Comments
Please login to add a commentAdd a comment