Matthew Kuhnemann
-
శ్రీలంకలో విజృంభించిన ఆసీస్ స్పిన్నర్‌పై ఫిర్యాదు
సిడ్నీ: శ్రీలంక పర్యటనలో విజృంభించిన ఆ్రస్టేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ (Australia Left Arm Spinner) మ్యాట్ కునేమన్ (Matthew Kuhnemann) బౌలింగ్ శైలిపై (Bowling Action) సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సందర్భంగా కునేమన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడి లేదని అంపైర్లు సందేహాలు లేవనెత్తడంతో... ఆసీస్ స్పిన్నర్ బయోమెకానికల్ పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన రెండో టెస్టు తర్వాత మ్యాచ్ అధికారుల కునేమన్ బౌలింగ్ అంశాన్ని ఆ్రస్టేలియా జట్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో మా ప్లేయర్‌కు పూర్తి మద్దతు ఇస్తాం’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2017లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన కునేమన్... ఆ్రస్టేలియా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడి 25 వికెట్లు పడగొట్టాడు. తాజాగా శ్రీలంతో సిరీస్‌లో 28 ఏళ్ల కునేమన్ 17.18 సగటుతో 16 వికెట్లు తీశాడు. కునేమన్ బౌలింగ్‌పై ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అని సీఏ వెల్లడించింది. ఈ నెల ఆఖర్లో బ్రిస్బేన్‌లో కునేమన్ బయోమెట్రిక్ పరీక్ష చేయించుకోనున్నాడు. అనంతరం ఫలితాలను విశ్లేషణ కోసం ఐసీసీకి పంపనున్నారు. ఒకవేళ కునేమన్ ఈ పరీక్షలో విఫలమైతే అతడిపై సస్పెన్షన్ వేటు పడగనుంది. -
SL vs Aus: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్(Nathan Lyon) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియాలో టెస్టు ఫార్మాట్లో 150కి పైగా వికెట్లు తీసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ప్రస్తుతం శ్రీలంక(Sri Lanka vs Australia)లో పర్యటిస్తోంది.తొలిరోజే తొమ్మిది వికెట్లుఇందులో భాగంగా తొలుత గాలె(Galle) వేదికగా టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో లంకను ఆసీస్ మట్టికరిపించింది. ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అనంతరం ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో దినేశ్ చండిమాల్ (163 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (107 బంతుల్లో 59 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (83 బంతుల్లో 36; 3 ఫోర్లు) కాసేపు పోరాడినా... భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇతరులలో పతుమ్ నిశాంక (11), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (0) దారుణంగా విఫలమయ్యారు. చండిమాల్, కుశాల్ మెండిస్ కాస్త పోరాడటంతో లంక జట్టు ఆమాత్రం స్కోరు చేయగలిగింది.నాన్- ఆసియన్ బౌలర్‌గా చరిత్రఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్‌తో కలిసి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా ఖండంలో టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.అంతకు ముందు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆసియాలో 127 వికెట్లు తీయగా.. న్యూజిలాండ్ మాజీ స్టార్ డేనియల్ వెటోరి 98, ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 92 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాన్-ఆసియన్ బౌలర్లు👉నాథన్ లియోన్- 30 టెస్టుల్లో 150👉షేన్ వార్న్- 25 టెస్టుల్లో 127👉డేనియల్ వెటోరి- 21 టెస్టుల్లో 98👉జేమ్స్ ఆండర్సన్- 32 టెస్టుల్లో 92.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు స్టార్క్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ కూహ్నెమన్ రెండు, ట్రవిస్ హెడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 229/9 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 257 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
శ్రీలంకను మట్టికరిపించిన ఆస్ట్రేలియా.. లంకేయుల రికార్డు ఓటమి
శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, ఈ ఎడిషన్‌లో ఆఖరిగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది. ఈ టూర్లో భాగంగా రెండు వన్డేలు కూడా ఆడనుంది. ఈ క్రమంలో తొలుత గాలె వేదికగా బుధవారం లంక- ఆసీస్ జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది.ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) డబుల్ సెంచరీ(232)తో చెలరేగగా.. ట్రవిస్ హెడ్ మెరుపు అర్ధ శతకం(40 బంతుల్లో 57) బాదాడు. స్మిత్, ఇంగ్లిస్ శతకాలుమిగతా వాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం(141)తో దుమ్ములేపాడు. ఇక టెస్టు అరంగేట్రంలోనే జోస్ ఇంగ్లిష్ సెంచరీ(102)తో మెరిసి తన విలువను చాటుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(46 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. టెయిలెండర్లలో బ్యూ వెబ్‌స్టర్(23), మిచెల్ స్టార్క్(19 నాటౌట్) తమ శక్తిమేర పరుగులు రాబట్టారు.ఈ క్రమంలో 154 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఉన్న వేళ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో స్పిన్నర్లు ప్రబాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే శ్రీలంక తడబడింది.కంగారూ స్పిన్నర్ల ధాటికి కుదేలుఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె ఏడేసి పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండిమాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. అయితే, ఆసీస్ స్పిన్నర్ అద్భుత బంతితో చండిమాల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.మిగతా వాళ్లలో ఏంజెలో మాథ్యూస్(15), కెప్టెన్ ధనంజయ డి సిల్వ(22), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(21) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీంతో 165 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియాన్ మూడు వికెట్లు కూల్చాడు. పేసర్ మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి.ఫాలో ఆన్ గండం.. తప్పని ఓటమిఅయితే, తమ తొలి ఇన్నింగ్స్‌లో లంక కనీసం సగం కూడా స్కోరు చేయకపోవడంతో.. ఆస్ట్రేలియా ధనంజయ బృందాన్ని ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో వెంటనే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 247 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్ ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(6), దిముత్ కరుణరత్నె(0) మరోసారి విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు కాసేపు నిలబడ్డారు. చండిమాల్ 31, ఏంజెలో మాథ్యూస్ 41, కమిందు మెండిస్ 32, ధనంజయ డి సిల్వ 39, కుశాల్ మెండిస్ 34 పరుగులు చేశారు. ఇక ఆఖర్లో జెఫ్రీ వాండర్సే ఒక్కడే అర్ధ శతకం(53) చేయగలిగాడు.లంక క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమిఅయితే, ఆస్ట్రేలియా స్కోరుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన శ్రీలంక.. ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది. ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
IND VS AUS 4th Test Day 4: సువర్ణావకాశాలను చేజార్చుకున్న భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆట చివరి రోజైన రేపు (మార్యి 13) భారత బౌలర్లు ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసి, ఆ తర్వాత నిర్ధేశించబడిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలిగితే సిరీస్‌తో (3-1) పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు కూడా భారత్ వశమవుతుంది. నాలుగో రోజు చివర్లో టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాల కారణంగా, ఆసీస్‌పై ఇవాల్టి నుంచే పట్టుబిగించే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు తాత్కాలిక ఓపెనర్ మాథ్యూ కుహ్నేమన్ (0) ఇచ్చిన క్యాచ్‌లను తొలుత కేఎస్ భరత్, ఆతర్వాత పుజారా జారవిడిచారు. ఒకవేళ ఈ రెండు అవకాశాల్లో భారత్‌కు ఒక్క వికెట్ లభించినా ఆసీస్‌ను పూర్తిగా ఒత్తిడిలోని నెట్టే అవకాశం ఉండేది. అందులోనే ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఈ సమీకరణలన్నీ భారత్‌కు కలిసొచ్చి ఉండేవి. భరత్, పుజారాలు ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించి ఉండినా పరిస్థితి వేరేలా ఉండేది. భారత్‌కు గెలుపుపై ధీమా పెరిగేది. ఇప్పటికైన మించిపోయిందేమీ లేదు. ఆఖరి రోజు తొలి బంతిని నుంచి ప్రత్యర్ధిపై ఒత్తిడి తేగలిగితే, టీమిండియా గెలుపుకు ఢోకా ఉండదు. ఆసీస్‌ను 150 పరుగుల లోపు ఆలౌట్ చేసి, ఆతర్వాత 60, 70 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం టీమిండియాకు అంత కష్టం కాకపోవచ్చు. అయితే ఇదంతా సాధ్యపడాలంటే భారత స్పిన్నర్లు రేపు తొలి బంతి నుంచే చెలరేగాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇది అంత ఈజీ కూడా కాకపోవచ్చు. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (186)తో పాటు శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS AUS 4th Test Day 4: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
91 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (180) రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. భారత బ్యాటింగ్ సందర్భంగా అక్షర్ పటేల్ కొట్టిన సిక్సర్‌ను ఆపే ప్రయత్నంలో ఖ్వాజా గాయపడ్డాడని, అందుకే అతన్ని ఓపెనర్‌గా పంపలేదని ఆసీస్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. ఖ్వాజా గాయపడటంతో అతని స్థానంలో ట్రవిస్ హెడ్‌కు జోడీగా మాథ్యూ కుహ్నేమన్ బరిలోకి దిగాడు. ఖ్వాజా గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అతను చివరి రోజు ఆటలో బరిలోకి దిగుతాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ ఖ్వాజా గాయం పెద్దదై అతను బరిలోకి దిగలేకపోతే, ఆ ప్రభావం ఆసీస్‌పై భారీగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 మంది ఆటగాళ్లతో ఆసీస్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే అది ఆసీస్ విజయావకాశాలను భారీ దెబ్బకొడుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు కూడా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. 186 పరుగుల వద్ద కోహ్లి ఔటవ్వగానే టీమిండియా 571/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లితో పాటు శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 మ్యాచ్‌ల ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో మూడు మ్యాచ్‌ల అనంతరం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్ట్‌లో భారత్ గెలిస్తే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది. -
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు! అవునంటూ ఆసీస్ దిగ్గజానికి రవిశాస్త్రి కౌంటర్
Ind Vs Aus 3rd Test Indore Day 1: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బుధవారం (మార్చి 1) ఆరంభమైన మూడో టెస్టులో ఆది నుంచే బంతి స్పిన్‌కు టర్న్ అవుతోంది. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ సమయానికి 84 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు. చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు తర్వాతి రెండో ఓవర్లో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(21)ను అవుట్ చేశాడు. తర్వాత వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ రంగంలోకి దిగి ఛతేశ్వర్ పుజారా(1), రవీంద్ర జడేజా(4) వికెట్లు కూల్చగా.. కుహ్నెమన్ శ్రేయస్ అయ్యర్(0)ను డకౌట్ చేశాడు. వీరికి తోడు మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లి(22)ని ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత లియోన్ శ్రీకర్ భరత్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగవు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఇండోర్ పిచ్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో కామెంట్రీలో భాగంగా.. ‘‘ప్రపంచంలో ఎక్కడా కూడా టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో స్పిన్నర్ ఆరో ఓవర్లో బౌలింగ్‌కు రానేరాడు. ప్రస్తుతం ఇంత జరుగుతున్న భారత శిబిరంలో మరీ అంత చిరాకు లేకపోవడానికి కారణం వాళ్లు తొలి రెండు టెస్టుల్లో గెలవడమే! కానీ ఇక్కడ బంతి ఎలా టర్న్ అవుతోందో చూడండి. అందుకే నాకు ఈ పిచ్‌లపై కంప్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడేమంటావు రవి? ముందుగా చెప్పినట్లు ప్రపంచంలో ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఆరో ఓవర్ స్పిన్నర్‌తో వేయించరు. అస్సలు ఆ అవకాశమే లేదు. ఇండోర్‌లో మూడో రోజు నుంచి బంతి టర్న్ అవుతుందని అంచనా వేశాం. బ్యాటర్లకు కూడా అవకాశం రావాలి కదా రవి. ఒక్క మాటతో అదుర్స్ అనిపించిన రవి! ఇప్పుడు మీ ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఏం చెబుతావో చెప్పు! మొదటి, రెండో రోజు బ్యాటింగ్‌కు కాస్త అనుకూలించాలి కదా!’’ అని బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హెడెన్ వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా రవిశాస్త్రి ఒక్క మాటతో.. ‘‘హోం కండిషన్స్’’ అంటూ హెడెన్‌కు అదిరిపోయే రీతిలో జవాబు ఇచ్చాడు. ‘‘స్వదేశంలో మ్యాచ్ అంటే మామూలుగా జరిగేదే ఇది! కానీ ఇక్కడ ఇంకాస్త కఠినంగా ఉంది పరిస్థితి. ఒక్కటంటే ఒక్క మెరుగైన భాగస్వామ్యం నమోదైతేనే కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది’’అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై జట్లకు కాస్త అనుకూలమైన పిచ్లే రూపొందిస్తారని, అందుకు ఎవరూ అతీతులు కారన్న అర్థంలో హెడెన్‌కు కౌంటర్ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus 3rd Test: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో.. Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం