Ind Vs Aus 3rd Test Indore Day 1: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బుధవారం (మార్చి 1) ఆరంభమైన మూడో టెస్టులో ఆది నుంచే బంతి స్పిన్‌కు టర్న్ అవుతోంది. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ సమయానికి 84 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు.
చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు
తర్వాతి రెండో ఓవర్లో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(21)ను అవుట్ చేశాడు. తర్వాత వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ రంగంలోకి దిగి ఛతేశ్వర్ పుజారా(1), రవీంద్ర జడేజా(4) వికెట్లు కూల్చగా.. కుహ్నెమన్ శ్రేయస్ అయ్యర్(0)ను డకౌట్ చేశాడు.
వీరికి తోడు మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లి(22)ని ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత లియోన్ శ్రీకర్ భరత్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా.
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగవు
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఇండోర్ పిచ్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో కామెంట్రీలో భాగంగా.. ‘‘ప్రపంచంలో ఎక్కడా కూడా టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో స్పిన్నర్ ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కు రానేరాడు.
ప్రస్తుతం ఇంత జరుగుతున్న భారత శిబిరంలో మరీ అంత చిరాకు లేకపోవడానికి కారణం వాళ్లు తొలి రెండు టెస్టుల్లో గెలవడమే! కానీ ఇక్కడ బంతి ఎలా టర్న్ అవుతోందో చూడండి. అందుకే నాకు ఈ పిచ్‌లపై కంప్లెట్స్ ఉన్నాయి.
ఇప్పుడేమంటావు రవి?
ముందుగా చెప్పినట్లు ప్రపంచంలో ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఆరో ఓవర్ స్పిన్నర్‌తో వేయించరు. అస్సలు ఆ అవకాశమే లేదు. ఇండోర్‌లో మూడో రోజు నుంచి బంతి టర్న్ అవుతుందని అంచనా వేశాం. బ్యాటర్లకు కూడా అవకాశం రావాలి కదా రవి.
ఒక్క మాటతో అదుర్స్ అనిపించిన రవి!
ఇప్పుడు మీ ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఏం చెబుతావో చెప్పు! మొదటి, రెండో రోజు బ్యాటింగ్‌కు కాస్త అనుకూలించాలి కదా!’’ అని బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హెడెన్ వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా రవిశాస్త్రి ఒక్క మాటతో.. ‘‘హోం కండిషన్స్’’ అంటూ హెడెన్‌కు అదిరిపోయే రీతిలో జవాబు ఇచ్చాడు.
‘‘స్వదేశంలో మ్యాచ్ అంటే మామూలుగా జరిగేదే ఇది! కానీ ఇక్కడ ఇంకాస్త కఠినంగా ఉంది పరిస్థితి. ఒక్కటంటే ఒక్క మెరుగైన భాగస్వామ్యం నమోదైతేనే కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది’’అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై జట్లకు కాస్త అనుకూలమైన పిచ్‌లే రూపొందిస్తారని, అందుకు ఎవరూ అతీతులు కారన్న అర్థంలో హెడెన్‌కు కౌంటర్ ఇచ్చాడు.
చదవండి: Ind Vs Aus 3rd Test: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో..
Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం
Comments
Please login to add a commentAdd a comment