Ravi Shastri
-
‘నన్ను క్షమించు బుమ్రా.. నాకు దురుద్దేశం లేదు’
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ ఇషా గుహా(Isa Guha) క్షమాపణలు చెప్పారు. బుమ్రాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. దక్షిణ ఆసియా సంతతికి చెందిన తాను బుమ్రాను ప్రశంసించే క్రమంలో అలాంటి పదం వాడటం తప్పేనని అంగీకరించారు.బ్రిస్బేన్‌లో మూడో టెస్టుబోర్డర్- గావస్కర్ ట్రోఫీ 204-25లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో టీమిండియా, అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించాయి. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో శనివారం మూడో టెస్టు మొదలైంది.గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు తొలిరోజు వర్షం వల్ల ఆటంకం కలగగా.. రెండో రోజు పూర్తి ఆట కొనసాగింది. ఓవరాల్‌గా ఆదివారం ఆసీస్ పైచేయి సాధించినప్పటికీ.. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కామెంట్రీ ప్యానెల్లో ఉన్న ఇషా గుహ.. బుమ్రాను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అతడు మెస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్‘‘అతడు MVP కదా! మీరేమంటారు? నా దృష్టిలో అయితే అతడు మెస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్(Most valuable primate)’’ అంటూ సహచర కామెంటేటర్ బ్రెట్ లీతో ఇషా గుహ వ్యాఖ్యానించారు. నిజానికి క్రికెట్ పరిభాషలో అత్యంత విలువైన ఆటగాడు అని ప్రశంసించే సందర్భంలో MVP(Most Valuable Player) అని వాడతారు.కోతుల గురించి చెప్పేటపుడుఅయితే, ఇషా గుహ ఇక్కడ ప్రైమేట్(primate) అనే పదం వాడటంతో వివాదం చెలరేగింది. పాలిచ్చే జంతువులు(క్షీరదాలు).. ఎక్కువగా కోతుల గురించి చెప్పేటపుడు ఈ పదాన్ని వాడతారు. అయితే, బుమ్రాను ఉద్దేశించి ఇషా ఇలా అనడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ‘మంకీ గేట్’ వివాదాన్ని గుర్తుచేస్తూ ఇషాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.నాకు దురుద్దేశం లేదు.. స్పందించిన రవిశాస్త్రిఈ నేపథ్యంలో ఇషా గుహ స్పందిస్తూ.. బుమ్రాకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. తాను ఉపయోగించిన Primate అనే పదానికి మనుషులనే అర్థం కూడా ఉందని.. ఏదేమైనా తాను అలా అని ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు ఎవరినీ కించపరిచాలనే ఉద్దేశం లేదని.. నిజానికి బుమ్రా ఆట అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. తాను భేషరుతుగా క్షమాపణ చెబుతున్నానని ఇషా గుహ లైవ్ కామెంట్రీలో వివరణ ఇచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. ‘‘ధైర్యవంతురాలైన మహిళ’’ అంటూ ఇషా గుహను కొనియాడాడు.మంకీ గేట్ వివాదం?2007-08లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సిడ్నీలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ సందర్భంగా భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ను మంకీ అని సంబోధించాడనే ఆరోపణలు వచ్చాయి.ఈ విషయం గురించి నాటి కెప్టెన్ రిక్కీ పాంటింగ్ అంపైర్‌కు ఫిర్యాదు చేయగా.. భజ్జీపై తొలుత మూడు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అయితే, సచిన్ టెండుల్కర్ సహా ఇతర ఆటగాళ్లు భజ్జీ.. హిందీలో.. ‘‘మా...కీ’’ అన్నాడని.. మంకీ అనలేదంటూ విచారణలో తెలిపారు. దీంతో విచారణ కమిటీ హర్భజన్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ Isa Guha apologises on TV for calling Jasprit Bumrah a "primate" during commentary yesterday 🇮🇳#AUSvINDpic.twitter.com/DybT7Nmzzg— Digital Hunt 247 (@digitalhunt247) December 16, 2024 -
‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. బ్రిస్బేన్‌లో శనివారం మొదలైన ఈ టెస్టులో భారత జట్టు పేలవంగా ఆడుతోంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేన.. ఆసీస్‌ను కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 445 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.పెవిలియన్‌కు క్యూఅయితే, ఆసీస్ స్టార్లు ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాలతో చెలరేగిన గబ్బా మైదానంలో.. టీమిండియా బ్యాటర్లు మాత్రం తేలిపోతున్నారు. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచారు.48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. సోమవారం నాటి మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే సమయానికి కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 30 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ సున్నా పరుగులతో ఆడుతున్నాడు. కేవలం 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గబ్బాలో టాస్ గెలిచిన రోహిత్.. తొలుత బౌలింగ్ ఎంచుకోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు తప్పుబట్టారు. చెత్త సెటప్ అంటూ విమర్శలుమరోవైపు.. ఆదివారం నాటి రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ సెట్ చేసిన తీరుపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి రోహిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చెత్త సెటప్’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఇక ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ వార్నర్ సైతం రోహిత్ తీరును విమర్శించాడు. హెడ్, స్మిత్‌లను షార్ట్ బాల్స్‌తో అటాక్ చేయాల్సిందిపోయి.. వారికి బ్యాట్ ఝులిపించే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రోహిత్ తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి‘‘ఇప్పుడు కూడా రోహిత్ శర్మను సమర్థిస్తే అంతకంటే ఘోర తప్పిదం మరొకటి ఉండదు. ఇంత డిఫెన్సివ్‌గా కెప్టెన్సీ చేస్తారా? ఇప్పటికైనా అతడు వాస్తవాలు అంగీకరించాలి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే రోహిత్ తప్పుకోవాలి. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు కోసం మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలి. బుమ్రాను టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమించాలి’’ అని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్.బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్ గడ్డపై భారత్‌కు భారీ విజయంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. పితృత్వ సెలవుల కారణంగా అతడు అందుబాటులో లేకపోవడంతో.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో కంగారూ జట్టును చిత్తు చేసింది. అయితే, అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ తిరిగి రాగా.. ఆతిథ్య జట్టు చేతిలో భారత్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అడిలైడ్ టెస్టులో రోహిత్ బ్యాటింగ్ పరంగా(3, 6)నూ నిరాశపరిచాడు. రోహిత్ కెప్టెన్సీలో చెత్త రికార్డుఇక ఆసీస్ టూర్ కంటే ముందు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. భారత క్రికెట్ చరిత్రలో పర్యాటక జట్టు చేతిలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం అదే తొలిసారి. చదవండి: ‘నా వేలు విరగ్గొట్టేశావు పో’.. సిరాజ్‌పై మండిపడ్డ జడేజా! -
అశ్విన్, భజ్జీ కాదు!.. టీమిండియా ఆల్‌టైమ్ అత్యుత్తమ స్పిన్నర్లు వీరే!
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. భారత్- ఆసీస్ మధ్య జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో రవిశాస్త్రికి ఓ ప్రశ్న ఎదురైంది. భారత క్రికెట్ జట్టులోని ముగ్గురు అత్యుత్తమ స్పిన్నర్ల పేర్లు చెప్పాలని కోరగా.. రవిశాస్త్రి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.కాగా ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. మరోవైపు.. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టి లెజెండరీ బౌలర్‌గా పేరు సంపాదించాడు.ఇక అశ్విన్‌తో పాటు జట్టులో కొనసాగుతున్న మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా 319(77 టెస్టుల్లో) వికెట్లు పడగొట్టి సత్తా చాటుతున్నాడు.అనిల్ కుంబ్లే ప్రమాదకారిఅయితే, రవిశాస్త్రి ఈ ముగ్గురిలో ఒక్కరి పేరు కూడా చెప్పకపోవడం విశేషం. తన దృష్టిలో బిషన్ సింగ్ బేడి, ఎర్రాపల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే టీమిండియా అత్యుత్తమ స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫాక్స్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఉపఖండ పిచ్‌లపై అనిల్ కుంబ్లే ప్రమాదకారి. అత్యంత దూకుడుగా ఉంటాడు. అయితే, కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన స్పిన్నర్. 600కు పైగా టెస్టు వికెట్లు తీయడం అంటే మాటలు కాదు.అతడు బంతితో అద్భుతాలు చేయగలడుఇక ప్రసన్న. అతడి కెరీర్ చరమాంకంలో ఉన్నపటి పరిస్థితులను పరిశీలిస్తే.. అతడు జట్టు మేనేజర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాడు. నెట్స్‌లో బౌలింగ్ కూడా చేశాడు. అతడు బంతితో అద్భుతాలు చేయగలడు. బాల్‌ను రిలీజ్ చేసే విషయంలో ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు.ఆయన బౌలింగ్ యాక్షన్ సూపర్వీరిద్దరు నా లిస్టులో టాప్-3లో ఉంటే.. టాప్-1లో బిషన్ సింగ్ బేడి ఉంటాడు. ఆయన బౌలింగ్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తన అభిప్రాయం ప్రకారం బిషన్ బేడి, ప్రసన్న, కుంబ్లే అత్యుత్తమ భారత స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. కాగా బిషన్ బేడీ తన కెరీర్లో 67 టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టగా.. ప్రసన్న 49 టెస్టుల్లో 189 వికెట్లు తీశాడు. మరోవైపు.. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు కూల్చి టెస్టుల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక 536 వికెట్లతో అశూ రెండోస్థానంలో ఉన్నాడుచదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే! -
కేఎల్ రాహుల్ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(26) అవుటైన తీరుపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి.. రాహుల్ సందేహాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు.రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్‌గా ప్రకటించగా... క్యాచ్ అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్‌ను సమీపించిన సమయంలో అవుట్ సైడ్ ఎడ్జ్‌పై స్పైక్ కనిపించింది’ అని థర్డ్ అంపైర్ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్‌ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయంఅయితే, ఆసీస్ మాజీ సారథి మార్క్‌వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్ అంపైర్ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.స్టార్క్ స్పందన ఇదేఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
ఆసీస్ తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే! స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు మొదటి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత జట్టు ఆసీస్ పర్యటనను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. అయితే తొలి టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో పెర్త్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంచుకున్నాడు. తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రావాలని అతడు సూచించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్‌కు సైతం శాస్త్రి చోటిచ్చాడు."తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను ప్రమోట్ చేయాలి. అతడికి ఓపెనర్‌గా అనుభవం ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఒకవేళ గిల్ జట్టులో లేకపోయింటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉండేది. రోహిత్ బ్యాకప్‌గా ఎంపికైన ఈశ్వరన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన సిరీస్‌లో ఈశ్వరన్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు. అయితే నెట్స్‌లో ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో జట్టు మేనెజ్‌మెంట్‌కే తెలియాలి. తుది జట్టులో అశ్విన్ లేదా జడేజాకు చోటు ఇవ్వాలా అన్న చర్చ నడుస్తోంది. నేను అయితే జడేజాతోనే వెళ్తాను. ఎందుకంటే అతడు ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అశ్విన్‌కు ఓవర్సీస్లో పెద్దగా రికార్డు లేదు" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.రవిశాస్త్రి ఎంచుకున్న భారత తుది జట్టు ఇదేశుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.చదవండి: #Tilak Varma: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి విమర్శలు గుప్పించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఈ ముంబైకర్ కెప్టెన్సీ అస్సలు బాగాలేదంటూ పెదవి విరిచాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తున్నా ఫీల్డింగ్ సెట్ చేయడంలో రోహిత్ విఫలమయ్యాడని విమర్శించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో కివీస్ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం మొదలైన రెండో టెస్టులోనూ రోహిత్ సేన తడబడుతోంది.బ్యాటింగ్‌లో మాత్రం మరోసారి విఫలంటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా కివీస్‌ను 259 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, బ్యాటింగ్‌లో మాత్రం మరోసారి విఫలమైంది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్‌కు 103 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్‌కు ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ(86)తో శుభారంభం అందించాడు. ఇతర బ్యాటర్లు కూడా తమ వంతు సహకారం అందించడంతో మూడు వందలకు పైగా ఆధిక్యంతో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తోటి కామెంటేటర్ మురళీ కార్తిక్‌తో మాట్లాడుతూ.. ‘‘కాస్త వ్యూహాత్మకంగా ముందుడుగు వేయాలి కదా! న్యూజిలాండ్‌ను 120 పరుగులకే ఆలౌట్ చేయాలని భావిస్తున్నట్లయితే.. అందుకు తగ్గట్లుగానే ఆడాలి. వికెట్లు కావాలనుకుంటే అటాకింగ్ పొజిషన్లలో ఫీల్డింగ్ సెట్ చేయాలి.మూస పద్ధతిలో వెళ్తే ఎలా? ఒకవేళ ప్రత్యర్థి వికెట్ నష్టపోకుండానే 60 పరుగులు చేసినపుడు కూడా భిన్నంగా గాకుండా మూస పద్ధతిలో వెళ్తే ఎలా? ఫీల్డింగ్ ఇలా సెట్ చేయడం వల్ల మాత్రం మీకు ఎంతమాత్రం వికెట్లు లభించవు’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్సీని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గానూ రోహిత్ విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని టిమ్ సౌతీ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసే సరికి కివీస్ 53 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టీమిండియా కంటే 301 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్ -
కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ
టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లి, రవిశాస్త్రి తనకు పునర్జన్మను ప్రసాదించారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వారిద్దరి వల్లే తన రెండో ఇన్నింగ్స్ మొదలైందని.. తనను టాపార్డర్‌కు ప్రమోట్ చేసి ఓపెనర్‌గా అవకాశమిచ్చింది కూడా వారేనంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా 2013లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో అడుగుపెట్టాడు.అరంగేట్రంలోనే అద్భుత శతకంతొలి మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే అద్భుత శతకం(177)తో ఆకట్టుకున్నాడు. విండీస్‌తో నాటి సిరీస్‌లో జరిగిన ఈ తొలి టెస్టులో ధోని సేన ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తన రెండో టెస్టులోనూ శతక్కొట్టి వారెవ్వా అనిపించాడు. కానీ టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు.దాదాపు ఆరేళ్ల పాటు చోటే కరువుఅరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు భారత టెస్టు తుదిజట్టులో రోహిత్ శర్మకు స్థానమే కరువైంది. అయితే, 2018-19లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో రోహిత్ చోటు దక్కించుకోగలిగాడు. ఈ సిరీస్‌లోనూ అతడు ఆరో స్థానంలోనే బరిలోకి దిగాడు.అలా రీఎంట్రీఇక ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాదినా.. టెస్టుల్లో మాత్రం రోహిత్ రాత పెద్దగా మారలేదు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత వెస్టిండీస్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లో అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, నాడు ఓపెనర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో.. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్‌కోచ్ రవిశాస్త్రి రోహిత శర్మను ఓపెనర్‌గా బరిలోకి దించారు. ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్అప్పటి నుంచి రోహిత్‌కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా ఎదగడమే గాకుండా.. భారత్‌ను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)కు చేర్చిన సారథిగానూ ఘనత సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టీమిండియాను గెలిపించి.. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వేటలో జట్టును నిలిపాడు.వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారుఈ నేపథ్యంలో కామెంటేటర్ జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టెస్టు కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలకు నేను చాలా రుణపడిపోయాను. నన్ను టాపార్డర్‌కు ప్రమోట్ చేసింది వాళ్లే. టెస్టుల్లో నన్ను ఓపెనర్‌గా పంపడం అంత సులువు కాదు. అయినా, వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారు.తొలి బంతికే అవుటయ్యానునా ఆటను పరిశీలించేందుకు ఓ ప్రాక్టీస్‌మ్యాచ్ ఆడమని చెప్పారు. అయితే, అప్పుడు నేను తొలి బంతికే అవుటయ్యాను. ఇక నాకు ఓపెనర్‌గా ఎలాంటి అవకాశం లేదని నిరాశచెందాను. టెస్టుల్లో ఐదు లేదంటే ఆరో స్థానంలోనైనా.. లేదంటే లోయర్‌ఆర్డర్‌లోనైనా బ్యాటింగ్‌కు వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యాను.నమ్మకం నిలబెట్టుకుంటూకానీ రవి భాయ్ టెస్టుల్లో నన్ను ఓపెనర్‌గా పంపాలని భావించాడు. 2015లోనే నాకు ఈ అవకాశం వస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే, అప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ తర్వాత రవిభాయ్, కోహ్లి వల్ల టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లి పట్ల ఈ సందర్భంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా రోహిత్ తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీ కానున్నాడు. చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ While @ImRo45 Rohit’s legacy in test cricket is being discussed - Here’s a little story of his comeback into test cricket .. Also a sneak peek into how @RaviShastriOfc and @imVkohli planned India’s ascendancy in tests. pic.twitter.com/LO0jVtqP7O— Jatin Sapru (@jatinsapru) October 1, 2024 -
భారత జట్టును ఒక్క మాట అన్నా ఊరుకోం..
-
మళ్లీ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి?
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.అయితే, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్‌గా మారాడు.ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్‌కోచ్‌గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్‌గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.భారత్‌లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్‌గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్‌గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వామ్మో.. ఒక్క ఫొటోతో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న రవిశాస్త్రి!
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెటర్‌గా తనకంటూ గుర్తింపు పొందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ వ్యాఖ్యానం చేయడంలో రవిశాస్త్రి దిట్ట. ఇక సోషల్ మీడియాలో ఈ ‘61 ఏళ్ల కుర్రాడు’ చురుగ్గా ఉంటాడు. తాజాగా ఎక్స్.కామ్‌లో అతడు షేర్ చేసిన ఫొటో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. మిమ్మల్ని ఆకర్షించేలా ఉన్నానా? నావీ బ్లూ నైట్ సూట్లో స్టైలిష్ ఫోజులతో ఫొటోలు దిగిన రవిశాస్త్రి.. ‘‘నేను హాటీ.. నేను నాటీ.. నేను సిక్స్టీ’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. తీక్షణంగా చూస్తున్నట్లుగా ఉన్న మరో ఫొటోకు ‘‘మిమ్మల్ని నా వైపు ఆకర్షించేలా ఉన్నానా’’ అంటూ వేరే లెవల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘‘ఫిట్‌గా ఉండే టీమిండియా కుర్రాళ్లు కూడా ఒక్క ఫొటోతో ఇలాంటి మాయ చేయలేకపోయారు. కానీ అరవై ఏళ్ల రవిశాస్త్రి అయ్య బాబోయ్ అనిపిస్తున్నాడు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదైనా యాడ్ షూట్ కోసం ఇలా ఫోజులు ఇచ్చి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. లేదంటే రవిశాస్త్రి అకౌంట్ హ్యాక్ అయ్యిందేమో అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. 80లలో టీమిండియాలోకి వచ్చిన ముంబైకర్ మే 27, 1962లో ముంబైలో జన్మించిన రవిశాస్త్రి.. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్లో సత్తా చాటాడు. 17 ఏళ్ల వయసులో నాటి బాంబే రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు. తన నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ మరుసటి ఏడాది టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న రవిశాస్త్రి.. 1981లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దాదాపు పదకొండేళ్లపాటు కెరీర్ కొనసాగించి.. భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3830, 3108 పరుగులు సాధించాడు రవిశాస్త్రి. కోచ్‌గా ప్రస్థానం 2014లో టీమిండియా డైరెక్టర్‌గా నియమితుడైన రవిశాస్త్రి.. 2017లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. వీరిద్దరి నేతృత్వంలో ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ గెలిచింది. అదే విధంగా నంబర్ వన్ ర్యాంకు సాధించింది. వన్డే వరల్డ్‌కప్-2019లో సెమీ ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీ తర్వాత రెండేళ్ల పాటు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి 2021లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: ముంబైకి గుడ్‌బై.. ఎవరూ ఊహించని జట్టులో చేరనున్న రోహిత్ శర్మ?! I am hottie, I am naughty, I am sixtyyyy 🥵 pic.twitter.com/oHBQw3WoIf — Ravi Shastri (@RaviShastriOfc) April 10, 2024 -
ఇదేమీ చెత్త జట్టు కాదు.. అతడు కూడా మీలాంటి మనిషే!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు పెరుగుతోంది. అభిమానులు మైదానంలో అతడి పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఇప్పటికే హర్భజన్ సింగ్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఇక భజ్జీ అయితే.. ఫ్యాన్స్‌తో పాటు ముంబై ఆటగాళ్ల తీరును కూడా విమర్శించాడు. జట్టు అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను అంగీకరించాల్సిందేనని సూచించాడు. ఇదిలా ఉంటే.. సంజయ్ మంజ్రేకర్ సైతం వాంఖడే స్టేడియంలో పాండ్యాను హేళను చేస్తున్న వారిని ఉద్దేశించి.. ‘మర్యాద పాటించండి’ అని హెచ్చరించాడు. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) తాజాగా రవిశాస్త్రి సైతం హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. ముంబై జట్టు అభిమానులను ఉద్దేశించి.. ‘‘ ఈ జట్టుకు ఎన్నో ఏళ్లుగా మీరు మద్దతుగా నిలుస్తున్నారు. కేవలం 2-3 మ్యాచ్‌ల ఫలితాల వల్ల ఇదేమీ చెత్త జట్టు కాబోదు కదా! ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి టీమ్ ఇది. కాకపోతే ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కాస్త ఓపిక పట్టండి. పాపం.. తను కూడా మీలాంటి మనిషే కదా. రోజు ముగిసిన తర్వాత రాత్రి తను కూడా నిద్రపోవాలి కదా. తన స్థానంలో ఉండి ఆలోచించండి. కాస్త నిశ్శబ్దంగా ఉండండి’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అదే విధంగా.. హార్దిక్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘నువ్వు కూడా కాస్త ఓపిక పట్టు హార్దిక్. కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టు. ముంబై ఇండియన్స్ అద్భుతమైన జట్టు. 3-4 మ్యాచ్‌లు గెలిచిందంటే ఆ తర్వాత ఎవరూ ఆపలేరు. కథ మొత్తం మారిపోతుంది’’ అని రవిశాస్త్రి సలహాలు ఇచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్ తదుపరి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ముంబై వేదికగా ఏప్రిల్ 7న ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడూ ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: సన్‌రైజర్స్ కోచ్‌గా దూరం.. ఆ ‘టీమ్’లో స్పీడ్‌గన్!
ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి తరుణం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో 21 మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఓవైపు క్రికెటర్లు ఆటతో అలరిస్తుంటే.. వారి ఆటను విశ్లేషిస్తూ మాటల గారడితో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన కామెంటేటర్లు సిద్ధమవుతున్నారు. ఇందులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి, దిగ్గజం సునిల్ గావస్కర్ సహా భారత్ నుంచి తరలివెళ్లి అమెరికాకు ఆడుతున్న ఉన్ముక్త్ చాంద్ వరకు లిస్టు పెద్దదిగానే ఉంది. ఇక వ్యక్తిగత కారణాల దృష్ట్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా తప్పుకొన్న సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఇంటర్నేషనల్: స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్, టామ్ మూడీ, పాల్ కాలింగ్‌వుడ్. ఇంగ్లిష్ కామెంట్రీ: సునిల్ గావస్కర్, రవి శాస్త్రి, బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ క్లార్క్, సంజయ్ మంజ్రేకర్, ఆరోన్ ఫించ్, ఇయాన్ బిషప్, నిక్ నైట్, సైమన్ కటిచ్, డ్యారీ మోరిసన్, క్రిస్ మోరిస్, క్యాటీ మార్టిన్, సామ్యూల్ బద్రి, గ్రేమ్ స్వాన్, దీప్‌దాస్ గుప్తా, హర్షా భోగ్లే, పుమెలెలో ముబాంగ్వా, అంజుమ్ చోప్రా, మురళి కార్తిక్, డబ్ల్యూవీ రామన్, నటాలీ జెర్మనోస్, డారెన్ గంగ, మార్క్ హొవార్డ్, రోహన్ గావస్కర్. తెలుగు: మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్రావు, రాకేశ్ దేవా రెడ్డి, డానియల్ మనోహర్, రవి రాక్లే, శశికాంత్ ఆవులపల్లి, ఎం ఆనంత్ శ్రీక్రిష్ణ, వింధ్య మేడపాటి, గీతా భగత్, అంబటి రాయుడు. హిందీ: హర్భజన్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ అంబటి రాయుడు రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ వరుణ్ ఆరోన్ మిథాలీ రాజ్ మహ్మద్ కైఫ్ సంజయ్ మంజ్రేకర్ ఇమ్రాన్ తాహిర్ వసీం జాఫర్ గురుకీరత్ మన్ ఉన్ముక్త్ చంద్ వివేక్ రజ్దాన్ రజత్ భాటియా దీప్ దాస్‌గుప్తా రామన్ భానోట్ పదమ్జెట్ సెహ్రావత్ జతిన్ సప్రు. -
సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్!
టీమిండియా బౌలింగ్ విభాగం మాజీ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్ గావస్కర్ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్ మళ్లీ మురళీ విజయ్ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్ అని తెలిపాడు. కాగా 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కెరీర్లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా మురళీ విజయ్ గురించి క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్‌తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్ డివిజన్ జట్టుకు అతడి పేరును రికమెండ్ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు. సునిల్ గావస్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్ మురళీ విజయ్ అని చెప్పేవాడు. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మలను కాదని.. గావస్కర్ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్‌కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్, రాహుల్ భయ్యాకు థాంక్స్: అశూ భార్య -
పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: మాజీ కోచ్ వార్నింగ్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న ఈ కుర్ర బ్యాటర్.. ఇటీవల టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఇచ్చి.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పాతుకుపోగా.. గిల్ వన్‌డౌన్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్... మూడో స్థానంలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలోనూ శుబ్‌మన్ గిల్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలి టెస్టులో మొత్తంగా కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన గిల్.. వైజాగ్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి గిల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా పుజారా నుంచి వారి స్థానానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంటుంది. రంజీ ట్రోఫీలో అద్భుత ఫామ్‌తో సత్తా చాటుతున్న పుజారా ఎల్లప్పుడూ సెలక్టర్ల దృష్టిలోనే ఉంటాడన్న విషయం మర్చిపోవద్దు. టెస్టు మ్యాచ్ అంటేనే ఓపికగా ఆడాల్సి ఉంటుంది. సహనం లేకుంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఆండర్సన్ వంటి క్లాస్ బౌలర్ బౌలింగ్‌లో ఆడుతున్నపుడు చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి’’ అంటూ గిల్ పేరెత్తకుండానే.. అతడికి పుజారా రూపంలో పోటీ ఉందంటూ రవిశాస్త్రి హెచ్చరికలు జారీ చేశాడు. కాగా వైజాగ్ టెస్టులో శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో మూడో స్థానంలో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇటీవలే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇరవై వేల పరుగుల అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ద్విశతకంతోనూ చెలరేగి సత్తా చాటాడు. గత కొంతకాలంగా తనను పక్కన పెట్టిన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా ఆటతో సత్తా చాటుతున్నాడు ఈ నయావాల్. -
పోప్ సంగతి సరే.. వాళ్ల విషయంలోనూ అలా ఎందుకు?: డీకే విమర్శలు
India vs England, 1st Test : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉప్పల్‌లో గురువారం మొదలైన టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇంగ్లండ్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజే తలవంచి ఓటమిని ఆహ్వానించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. స్వదేశంలో టీమిండియా ఇలా ఊహించని రీతిలో ఓటమిపాలు కావడంతో రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. వాళ్ల విషయంలోనూ డిఫెన్సివ్‌గా ఎందుకు? తొలి టెస్టులో భారత్ ఆట తీరు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెటరన్, మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని విమర్శించాడు. ఒలి పోప్ వంటి బ్యాటర్ విషయంలో డిఫెన్సివ్‌గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదని డీకే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేసి ఉంటే బాగుండన్నాడు. ఈ మేరకు జియో సినిమా షోలో దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఇంత బేలగా చూడలేదు ఇక భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదన్నాడు. రోహిత్ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని వాపోయాడు. కాగా ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ ఈ మ్యాచ్‌లో 196 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు -
పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. సరైందేనన్న రవిశాస్త్రి
#INDvENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అవుటైన తీరుపై నెట్టింట చర్చ నడుస్తోంది. జడ్డూను అన్యాయంగా పెవిలియన్‌కు పంపారని.. థర్డ్ అంపైర్ జో రూట్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా హైదరాబాద్ టెస్టులో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలుత ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు కూల్చిన జడ్డూ.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆట మొదలయ్యాక కాపేసటికే అవుట్ శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో పట్టుదలగా నిలబడి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన జడేజా.. మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే పెవిలియన్ చేరాడు. 81 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు మరో ఆరు పరుగులు మాత్రమే జతచేసి అవుటయ్యాడు. 119.3 ఓవర్ వద్ద ఇంగ్లండ్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయినట్లు కన్పించింది. ఎటూ తేల్చలేక అవుట్ ఇచ్చాడు దీంతో రూట్ గట్టిగా అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ జడ్డూను అవుట్‌గా ప్రకటించాడు. అయితే, ఈ నిర్ణయంతో ఏకీభవించని జడేజా రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో వివిధ కోణాల్లో బంతిని పరీక్షించిన థర్డ్ అంపైర్.. బాల్ ముందుగా బ్యాట్‌ను తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా నిర్ధారించలేకపోయాడు. దీంతో అంపైర్స్ కాల్కే కట్టుబడి జడ్డూను అవుట్‌గా తేల్చగా.. అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. సరైందేనన్న రవిశాస్త్రి ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా జడేజా అవుటైన తీరును విమర్శిస్తూ అంపైర్లను ట్రోల్ చేస్తున్నారు. బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద జడ్డూను నాటౌట్‌గా ప్రకటించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. Ravindra Jadeja is unlucky here. - Out or Not out? #INDvsENG #Bigboss17finale #MonkeyMan #Fighter #Djokovic #श्रीराम pic.twitter.com/fK6uiae7En — bhavishya aneja (@AnejaBhavi55798) January 27, 2024 Jadeja that was brutally unlucky Inside edge could not be determined Umpire's call on line Umpire's call on height Basically DRS could not determine anything #INDvsENG — Shreya (@shreyamatsharma) January 27, 2024 ఈ క్రమంలో టీమిండియా- ఇంగ్లండ్ కామెంటేటర్, భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో తాను ఏకీభవిస్తానని స్పష్టం చేశాడు. ఒకవేళ అంపైర్స్ కాల్ నాటౌట్ అయి ఉంటే బ్యాటర్ అయిన జడేజాకు అనుకూల ఫలితం వచ్చేదని... కానీ అతడు అవుట్ ఇచ్చాడు కాబట్టే జడ్డూ మైదానాన్ని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. చదవండి: Ind vs Eng: జో రూట్ మాయాజాలం.. టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే.. -
హైదరాబాద్ బ్యాటర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ సంచలనం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 సిక్సర్లు ఉండటం విశేషం. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అరుణాచల్ ప్రదేశ్‌తో అద్భుత ఇన్నింగ్స్ మెరిసిన తన్మయ్ అగర్వాల్ సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో బోర్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో.. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. తన్మయ్ 147 బాల్స్‌లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. రవిశాస్త్రి పేరును చెరిపేసి.. ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లోనే అంతకుముందు తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును కూడా సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. తద్వారా 39 ఏళ్లుగా టీమిండియా మాజీ బ్యాటర్ రవిశాస్త్రి పేరిట చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 119 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకుని తన్మయ్ ఈ ఘనత సాధించాడు. కాగా ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ ఆరంభమైంది. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం
-
రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. 1983లో భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్ విజేత సభ్యుడైన రవిశాస్త్రి అంతర్జాతీయ కెరీర్ అనంతరం టీవీ వ్యాఖ్యతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. తదనంతరం భారత పురుషుల టీమ్ డైరెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా విజయవంతమయ్యారు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో జట్టును మరో దశకు తీసుకెళ్లారు. ఓ ఆటగాడిగా, కోచ్‌గా రవిశాస్త్రి దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన బీసీసీఐ 2019–20 సీజన్‌కుగాను ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ (జీవిత సాఫల్య) అవార్డుతో సత్కరించింది. ఆయనతో పాటు ఫరూఖ్ ఇంజినీర్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే ‘పాలీ ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల్ని 2019–20 సీజన్‌కుగాను షమీ, అశి్వన్ (2020–21), జస్ప్రీత్ బుమ్రా (2021–22), శుబ్‌మన్ గిల్ (2022–23) అందుకున్నారు. మహిళల కేటగిరీలో బెస్ట్ క్రికెటర్ అవార్డుల్ని దీప్తి శర్మ (2019–20, 2022–23), స్మృతి మంధాన (2020–21, 2021–22) గెలుచుకున్నారు. ఓపెనింగ్‌లో చిచ్చర పిడుగల్లే రాణిస్తున్న యశస్వి జైస్వాల్ 2022–23 సీజన్‌కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు చేజిక్కించుకున్నాడు. ఈ విభాగంలో మయాంక్ అగర్వాల్ (2019, 20), అక్షర్ పటేల్ (2020–21), శ్రేయస్ అయ్యర్ (2021–22)లకు అవార్దులు దక్కాయి. కరోనా మహమ్మారి వల్ల 2019–20, 2020–21, 2021–22, 2022–23 సీజన్లలో బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం చేయలేకపోయారు. దీంతో మంగళవారం ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన వేడుకలో నాలుగు సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళల, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు. -
బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం.. సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు
NAMAN AWARDS 2024: బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇవాళ (జనవరి 23) హైదరాబాద్‌లో కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పలువురు భారత మాజీలు కూడా హాజరయ్యారు. Ravi Shastri won the lifetime achievement award. - One of the greatest Indian coach ever. pic.twitter.com/D3oiLmMSCv — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Farokh Engineer said "This Indian team is the finest Indian team I have ever seen. Well done Rohit, Dravid & Ravi Shastri". pic.twitter.com/kSzpNToT0d — Johns. (@CricCrazyJohns) January 23, 2024 ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. గత నాలుగేళ్ల కాలంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన వారికి ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. అలాగే పలువురు మాజీ క్రికెటర్లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. Shubman Gill won the best Indian Men's cricketer for 2022-23 Season. pic.twitter.com/PkKUbnAyki — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Jasprit Bumrah won the Poly Umrigar Award for 2021-22 Season. pic.twitter.com/o0TF83przw — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Ravichandran Ashwin won the Poly Umrigar Award for 2020-21 Season. pic.twitter.com/yDI2Ja4Q43 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Mohammed Shami won the Poly Umrigar Award for 2019-20 Season. - The legend. 🫡 pic.twitter.com/h7XVrC2Qg9 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Jaiswal said "It's incredible to bat with Rohit Bhai - it's a proud moment to learn from him". pic.twitter.com/ecpVkELaGe — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Mumbai won the best performance in BCCI domestics in 2019-20. - Rohit Sharma received the award on behalf of Mumbai. pic.twitter.com/rKk2epWGtA — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అవార్డులు అందుకున్న వారి వివరాలు.. రవిశాస్త్రి: కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫారూక్ ఇంజనీర్: కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు (2019-20) శుభ్‌మన్ గిల్: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2022-23) జస్ప్రీత్ బుమ్రా: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2021-22) రవిచంద్రన్ అశ్విన్: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2020-21) మొహమ్మద్ షమీ: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2019-20) స్మృతి మంధన: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (2020-21, 2021-22) దీప్తి శర్మ: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (2019-20, 2022-23) Riyan Parag won the Lala Amarnath Award for best all-rounder in domestic limited overs. - Riyan recieved the award from Rohit Sharma. pic.twitter.com/Bap4wmooLo — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అంతర్జాతీయ క్రికెట్లో ఉత్తమ అరంగేట్రం (పురుషులు).. 2019-20: మయాంక్ అగర్వాల్ 2020-21: అక్షర్ పటేల్ 2021-22: శ్రేయస్ అయ్యర్ 2022-23: యశస్వి జైస్వాల్ Sarfaraz Khan's father recieved the award from Rahul Dravid behalf of his son for scoring highest run getter in Ranji Trophy 2021-22. pic.twitter.com/V5wVJfB0AV — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అంతర్జాతీయ క్రికెట్లో ఉత్తమ అరంగేట్రం అవార్డులు.. ప్రియా పూనియా: 2019-20 షఫాలీ వర్మ: 2020-21 సబ్బినేని మేఘన: 2021-22 అమన్‌జోత్ కౌర్: 2022-23 BCCI President said "I would like to congratulate Rohit & Rahul for the fantastic run in World Cup - you made us proud". pic.twitter.com/dq4zSjp6s7 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 దిలీప్ సర్దేశాయ్ అవార్డులు.. అశ్విన్ (2022-23 భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు) యశస్వి జైస్వాల్ (2022-23 భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్‌లో అత్యధిక పరుగులు) Indian team in BCCI awards. 🇮🇳 - Picture of the day. pic.twitter.com/e5fbz1VzR4 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్లు.. పూనమ్ యాదవ్: 2019-20 ఝులన్ గోస్వామి: 2020-21 రాజేశ్వరి గైక్వాడ్: 2021-22 దేవిక వైద్య: 2022-23 Captain Rohit Sharma has arrived in BCCI awards. pic.twitter.com/T4nt1HRA2i — Johns. (@CricCrazyJohns) January 23, 2024 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్లు.. పూనమ్ రౌత్: 2019-20 మిథాలీ రాజ్: 2020-21 హర్మన్‌ప్రీత్ కౌర్: 2021-22 జెమీమా రోడ్రిగెజ్: 2022-23 BCCI awards start at 6 pm IST today. - Live on Sports 18 & JioCinema...!!!! pic.twitter.com/9Ddmg8IICA — Johns. (@CricCrazyJohns) January 23, 2024 దేశవాలీ క్రికెట్లో ఉత్తమ అంపైర్లు.. అనంత పద్మనాభన్: 2019-20 వ్రిందా రతి: 2020-21 జయరామన్ మదన్ గోపాల్: 2021-22 రోహన్ పండిట్: 2022-23 దేశవాలీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు.. ముంబై: 2019-20 మధ్యప్రదేశ్: 2021-22 సౌరాష్ట్ర: 2022-23 లాలా అమర్నాథ్ అవార్డు (ఆల్‌రౌండర్ పరిమిత ఓవర్ల క్రికెట్).. బాబా అపరాజిత్: 2019-20 రిషి ధవన్: 2020-21, 2021-22 రియాన్ పరాగ్: 2022-23 లాలా అమర్నాథ్ అవార్డు (ఆల్‌రౌండర్ రంజీ ట్రోఫీ).. ముర సింగ్: 2019-20 షమ్స్ ములానీ: 2021-22 సరాన్ష్ జైన్: 2022-23 మాధవరావ్ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక వికెట్లు).. జయదేవ్ ఉనద్కత్: 2019-20 షమ్స్ ములానీ: 2021-22 జలజ్ సక్సేనా: 2022-23 మాధవరావ్ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక పరుగులు).. రాహుల్ దలాల్: 2019-20 సర్ఫరాజ్ ఖాన్: 2021-22 మయాంక్ అగర్వాల్: 2022-23 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
BCCI Awards 2024: రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు
రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కనుంది. భారత క్రికెట్‌కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆటగాడిగా, హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన శాస్త్రి ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. శాస్త్రి హయాంలో (2017-2021) అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా విరాజిల్లింది. భారత జట్టుకు దూకుడు నేర్పిన కోచ్‌గా శాస్త్రికి పేరుంది. 61 ఏళ్ల రవిశాస్త్రి 1981-92 మధ్యలో 80 టెస్ట్‌లు, 150 వన్డేలు ఆడి దాదాపు 7000 పరుగులు చేసి 280 వికెట్లు పడగొట్టాడు. రవిశాస్త్రి తన కెరీర్లో 15సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముంబైకు చెందిన యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు అవార్డులు దక్కనున్నాయి. -
‘ఆ రికార్డు’ కూడా కోహ్లికి సాధ్యమే.. మరో 10 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేస్తాడు..!
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డునూ బద్దలుకొట్టే సత్తా భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లికి ఉందని భారత దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ప్రస్తుతం విరాట్ 50వ శతకంతో వన్డేల్లో సచిన్ (49) సెంచరీల రికార్డును చెరిపేశాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టుల్లో 29, టి20ల్లో ఒక సెంచరీ కలుపుకుంటే 80 సెంచరీలతో ఉన్నాడు. విరాట్ 50వ వన్డే సెంచరీ పూర్తి చేసిన అనంతరం శాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సచిన్ వంద సెంచరీలు చేసినపుడు ఇంతటి గొప్ప మైలురాయి దరిదాపుల్లోనే ఎవరూ రారని అనుకున్నాం. ఇప్పుడు కోహ్లి 80 దాకా వచ్చాడు. విరాట్‌లాంటి బ్యాటర్‌కు ఏదీ అసాధ్యం కాదు. శతక్కొట్టడం మొదలు పెడితే కొడుతూనే ఉంటారు. చూడండి అతని తదుపరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు గ్యారంటీ! పైగా తను మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. ప్రతి ఫార్మాట్లోనూ అదే నిబద్ధత, అంకితభావాన్ని కనబరుస్తున్నాడు. అతని కెరీర్లో ఇంకా మూణ్నాలుగేళ్ల ఆట మిగిలుంది. ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం, పరిస్థితులకు అలవాటు పడే నైజం, అంతకుమించి పూర్తి ఫిట్నెస్ అతన్ని అసాధారణ క్రికెటర్‌గా నిలబెడుతోంది’ అని అన్నారు. జట్టుకు తనెంత కీలకమో కోహ్లికి బాగా తెలుసు: బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ భారత జట్టులో తన పాత్ర ఎంత కీలకమో... తన భుజాలపై ఎంతటి గురుతర బాధ్యతలున్నాయో కోహ్లికి బాగా తెలుసని కోచ్‌లెవరూ అతనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరించారు. ‘విరాట్ సన్నాహాలకు సాయమందిస్తాం. అంతేతప్ప కోచింగ్ పాఠాలు చెప్పాల్సిన పనేం రాదు. అతనికేమైనా కావాలంటే తనే వచ్చి అడుగుతాడు. ప్రాక్టీస్ అయినా... ఆటయినా అతనికే వదిలేస్తాం. ఎప్పుడు ఎలా ఆడాలో కోహ్లికే బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని మైలురాళ్లు దాటినా అతని పరుగుల ఆకలి తీరనే తీరదు. బౌలర్లలో షమీ పేస్ అద్భుతం. అందుకే అతను స్పెషల్ బౌలర్. అయినప్పటికీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు పక్కనబెట్టడానికి కారణం జట్టు కాంబినేషనే తప్ప అతని సమర్థతపై ఏ సంకోచం లేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్లు రెండో సారి వరల్డ్‌కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. నాటి ఫైనల్లో ఆసీస్.. టీమిండియాపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. మరి ఈ సారి ఏమవుతుందో తేలాలంటే నవంబర్ 19 రాత్రి వరకు వేచి చూడాలి. -
హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంది బాబర్.. ముసిముసి నవ్వులు నవ్వుకున్న పాక్ కెప్టెన్
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో యావత్ క్రికెట్ ప్రపంచం వరల్డ్‌కప్ మత్తులో ఊగిపోతుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లంతా వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కొత్త పెళ్లి కూతురులా ముస్తాబైంది. మరో పక్క అహ్మదాబాద్‌లో ఇవాళ జరిగిన కెప్టెన్ల మీటింగ్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత ఆనందాన్ని అందించింది. ఆధ్యాంతం ఆహ్లాద భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత రవిశాస్త్రి తనదైన శైలి చమత్కారంతో అందరి మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. ఈ కార్యక్రమంలో విలేకరుల సమావేశం సైతం నవ్వులు పూయించింది. తొలుత రోహిత్ శర్మను ఓ విలేఖరి గత వరల్డ్‌కప్ ఫైనల్లో బౌండరీల సంఖ్య ఆధారంగా విజేతను నిర్ణయించడం సబబా అని అడిగాడు. ఇందుకు హిట్‌మ్యాన్ తనదైన శైలిలో.. సర్ విజేతను నిర్ణయించడం నా పని కాదంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. Another Rohit Sharma's press conference moment 😂 pic.twitter.com/TEz0aT3YyW — CricTracker (@Cricketracker) October 4, 2023 ఇదే సమయంలో జర్నలిస్ట్-రోహిత్ మధ్య జరిగిన సంభాషణను పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పక్కనే ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు వివరిస్తూ కనిపించాడు. ఈ చిట్‌చాట్ జరుగుతుండగానే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ప్రయాణ బడలిక కారణంగా కునుకు తీస్తూ కనిపించాడు. Temba Bavuma during the Captain's Round Table Event. pic.twitter.com/xaxRHTzg4V — Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023 ప్రశ్నోత్తరాల సమయంలో పాక్ కెప్టెన్ వంతు రాగా.. మధ్యలో వ్యాఖ్యాత రవిశాస్త్రి కలుగజేసుకుని.. బాబర్.. హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉందంటూ ప్రశ్నించాడు. ఇందుకు ముసిముసి నవ్వులు నవ్వుకున్న పాక్ కెప్టెన్.. ఇప్పటికే 100 సార్లు చెప్పాను.. హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంది.. మా టీమ్ మొత్తానికి బాగా నచ్చింది.. అయితే కరాచీ బిర్యానీతో పోలిస్తే కాస్త స్పైసీగా ఉందని అన్నాడు. బాబర్ హైదరాబాద్ బిర్యానీ గురించి వివరిస్తుండగా అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు. Ravi Shastri asks "How is Biriyani". Babar Azam said "Hyderabad Biryani has been so good!!!😅#BabarAzam #icccricketworldcup#CWC23 #NaseemShah pic.twitter.com/blWyeJw1YM — Ahmar. (@Ahmarch84921398) October 4, 2023 కాగా, పాకిస్తాన్ ఏడేళ్ల తర్వాత వరల్డ్‌కప్ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్‌ల కోసం పాక్ టీమ్ హైదరాబాద్ నగరంలో బస చేసింది. పాక్ ఇక్కడే తమ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడి, వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్ కోసం కూడా సిద్దపడుతుంది. బాబర్ సేన నగరంలో స్టే చేస్తున్న క్రమంలో ఇక్కడున్న చాలా ప్రదేశాలను సందర్శించింది. ఈ క్రమంలో పాక్ క్రికెటర్లు పలుమార్లు హైదరాబాదీ బిర్యానీని ఆరగించారు. వారికి ఇక్కడి బిర్యానీతో పాటు హైదరాబాదీ ఆతిథ్యం కూడా బాగా నచ్చింది. ఇక్కడి జనాలు పాక్ క్రికెటర్లను చూసేందుకు ఎగబడటంతో వారు మురిసిపోతున్నారు. -
WC: జట్టు ఎంపిక అద్భుతం.. గెలిచినా.. ఓడినా! వెళ్లండి.. వెళ్లి! ఓవరాక్షన్ వద్దు..
India’s 15-member squad for 2023 ODI World Cup: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. సెలక్టర్ల ఎంపిక అద్భుతంగా ఉందంటూ కొనియాడాడు. కాగా ఆసియా కప్-2023 ముగిసిన తర్వాత మరో మెగా క్రికెట్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ జరుగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఏడుగురు బ్యాటర్లతో పాటు నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్రౌండర్లకు ఇందులో స్థానం కల్పించింది. అప్పుడు చోటు లేదు.. ఈసారి కెప్టెన్‌గా.. ఇక సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్-2011లో జట్టులో చోటు కూడా దక్కని రోహిత్ శర్మ ఈసారి ఏకంగా కెప్టెన్‌గా బరిలోకి దిగనుండగా.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. ఆసియా వన్డే టోర్నీ జట్టులో ఉన్న తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణలకు తప్ప ప్రధాన జట్టులోని మిగతా 15 మంది ఐసీసీ ఈవెంట్ ఆడనున్నారు. అతడు ఎందుకు? ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. కొత్తగా ఇషాన్ కిషన్ కూడా మిడిలార్డర్లో రాణిస్తుండగా.. వన్డేల్లో మెరుగైన రికార్డులేని సూర్యకుమార్ యాదవ్ ఎంపిక విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే విధంగా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను విస్మరించడం కూడా హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లకు అసహనం తెప్పిస్తోంది. అద్భుతమైన ఎంపిక ఈ క్రమంలో 1983 విజేత, మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాత్రం భిన్నంగా స్పందించాడు. జట్టు ఎంపిక సూపర్ అంటూ సెలక్టర్లను ఆకాశానికెత్తాడు. ఈ మేరకు.. ‘‘అద్భుతమైన టీమ్‌ను ఎంపిక చేశారు. వెళ్లండి... ప్రత్యర్థి జట్లను మట్టికరిపించండి. ఏదేమైనా.. గెలిచినా.. ఓడినా.. అనుభవం గడించడంలో ఇదంతా భాగమే. ఆటను పూర్తిగా ఆస్వాదించండి. మనసులు గెలుచుకోండి. దేశానికి గర్వకారణం కండి’’ అంటూ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇందుకు స్పందనగా.. ‘ఓవరాక్షన్ వద్దు రవిభాయ్.. ఈ జట్టుతో వరల్డ్‌కప్ గెలవడం కాదు కదా.. సెమీస్ చేరడం కూడా కష్టమే’’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్నపుడు కాగా వరల్డ్‌కప్-2019 సమయంలో రవిశాస్త్రి మార్గదర్శనంలో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాడు కివీస్‌తో.. ఫైనల్లో బెన్‌స్టోక్స్ అద్బుత ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. చదవండి: వన్డే వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా చిచ్చరపిడుగులు Excellent team picked. Come on Guys get out there and kick some butt. Win. Lose. Part and Parcel. Bottom line. ENJOY. Respect 🇮🇳 https://t.co/KOlNlVaXDN — Ravi Shastri (@RaviShastriOfc) September 5, 2023 -
ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు: రవిశాస్త్రిని ఏకిపారేసిన గంభీర్
Absolutely rubbish: Gautam Gambhir: మెగా టోర్నీలలో భారత తుది జట్టులో ముగ్గురు లెఫ్లాండర్లు ఉండాలన్న ఆలోచనను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కొట్టిపారేశాడు. ఇంతకంటే చెత్త సలహా మరొకటి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్‌ది ఎడమచేతి వాటమా, కుడిచేతి వాటమా అన్న అంశంతో సంబంధం లేదని.. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న వాళ్లనే ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించాడు. కనీసం ముగ్గురు లెఫ్టాండర్లు ఉండాలన్న రవిశాస్త్రి కాగా ఆసియా కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘తుది జట్టులో కనీసం ముగ్గురు లెఫ్టాండర్లు ఉంటే బాగుంటుంది. గత ఎనిమిది నెలలుగా ఇషాన్ కిషన్ ఆట తీరును గమనించండి. బ్యాటింగ్ చేయడంతో పాటు అతడు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. అతడితో పాటు మరో ఇద్దరు.. జడ్డూను కూడా కలిపితే టాప్-7లో మొత్తం ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవుతారు’’ అని పేర్కొన్నాడు. జట్టుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పుకొచ్చాడు. ఇషాన్ కిషన్ ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు అయితే, రవిశాస్త్రి ఐడియాపై పరోక్షంగా స్పందించిన గంభీర్.. ‘‘ఆటగాడు లెఫ్టాండరా లేదంటే రైట్ హ్యాండరా అన్న దానితో పనిలేదు. జట్టులో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండాలన్నది చెత్త ఆలోచన. జట్టులో ఎందరు లెఫ్టాండర్లు ఉండాలన్నది ముఖ్యం కాదు. ఎవరు ఎలా ఆడుతున్నారు? అతడు జట్టుకు ఉపయోగపడతాడా? అన్నదే చూడాలి. పరిస్థితులకు అనుకూలంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేవాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటగాళ్లకు అదే ముఖ్యం ప్లేయర్లు ఫామ్‌లో ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. సరిగ్గా ఆడకపోయినా సరే లెఫ్టాండర్లకు చోటివ్వాలి కాబట్టి సెలక్ట్ చేయాలనడం తప్పు’’ అని పేర్కొన్నాడు. రవిశాస్త్రికి దిమ్మతిరిగేలా ఈ మేరకు గౌతీ కౌంటర్ ఇచ్చాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ తిలక్ వర్మ కాగా ఆసియా కప్-2023 నేపథ్యంలో బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు లెఫ్టాండర్లు రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ వన్డే ఈవెంట్‌కు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. వీళ్ల నుంచే వరల్డ్‌కప్‌నకు ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్ జట్టు జాబితా నుంచే ప్రపంచకప్‌నకు ఆటగాళ్లను ఎంపిక చేస్తామని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా 2011 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో గౌతం గంభీర్ సభ్యుడన్న విషయం తెలిసిందే! ఆసియా వన్డే కప్-2023- భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. చదవండి: సచిన్ టెండుల్కర్‌కు కీలక బాధ్యతలు! ఇకపై.. వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. అందుకే తిలక్‌ను సెలక్ట్ చేశాం.. వరల్డ్ కప్ టీమ్‌లో: బీసీసీఐ చీఫ్ సెలక్టర్