జడ్డూ ఎల్బీడబ్ల్యూపై నెట్టింట రచ్చ (PC: JIO Cinema/BCCI)
#INDvENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అవుటైన తీరుపై నెట్టింట చర్చ నడుస్తోంది. జడ్డూను అన్యాయంగా పెవిలియన్‌కు పంపారని.. థర్డ్ అంపైర్ జో రూట్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
కాగా హైదరాబాద్ టెస్టులో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలుత ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు కూల్చిన జడ్డూ.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆట మొదలయ్యాక కాపేసటికే అవుట్
శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో పట్టుదలగా నిలబడి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన జడేజా.. మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే పెవిలియన్ చేరాడు.
81 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు మరో ఆరు పరుగులు మాత్రమే జతచేసి అవుటయ్యాడు. 119.3 ఓవర్ వద్ద ఇంగ్లండ్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయినట్లు కన్పించింది.
ఎటూ తేల్చలేక అవుట్ ఇచ్చాడు
దీంతో రూట్ గట్టిగా అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ జడ్డూను అవుట్‌గా ప్రకటించాడు. అయితే, ఈ నిర్ణయంతో ఏకీభవించని జడేజా రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో వివిధ కోణాల్లో బంతిని పరీక్షించిన థర్డ్ అంపైర్.. బాల్ ముందుగా బ్యాట్‌ను తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా నిర్ధారించలేకపోయాడు. దీంతో అంపైర్స్ కాల్‌కే కట్టుబడి జడ్డూను అవుట్‌గా తేల్చగా.. అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు.
సరైందేనన్న రవిశాస్త్రి
ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా జడేజా అవుటైన తీరును విమర్శిస్తూ అంపైర్లను ట్రోల్ చేస్తున్నారు. బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్ కింద జడ్డూను నాటౌట్‌గా ప్రకటించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
Ravindra Jadeja is unlucky here. - Out or Not out?
— bhavishya aneja (@AnejaBhavi55798) January 27, 2024
#INDvsENG #Bigboss17finale #MonkeyMan #Fighter #Djokovic #श्रीराम pic.twitter.com/fK6uiae7En
Jadeja that was brutally unlucky
— Shreya (@shreyamatsharma) January 27, 2024
Inside edge could not be determined
Umpire's call on line
Umpire's call on height
Basically DRS could not determine anything #INDvsENG
ఈ క్రమంలో టీమిండియా- ఇంగ్లండ్ కామెంటేటర్, భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో తాను ఏకీభవిస్తానని స్పష్టం చేశాడు. ఒకవేళ అంపైర్స్ కాల్ నాటౌట్ అయి ఉంటే బ్యాటర్ అయిన జడేజాకు అనుకూల ఫలితం వచ్చేదని... కానీ అతడు అవుట్ ఇచ్చాడు కాబట్టే జడ్డూ మైదానాన్ని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
చదవండి: Ind vs Eng: జో రూట్ మాయాజాలం.. టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే..
Comments
Please login to add a commentAdd a comment