test series
-
ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్..
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు తమ పరువు కాపాడుకునేందుకు సిద్దమైంది. డిసెంబర్ 14 నుంచి హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టులో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని కివీస్ భావిస్తోంది.అయితే ఈ ఆఖరి టెస్టుకు ముందు బ్లాక్‌క్యాప్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే మూడో టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కాన్వే కివీస్ జట్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధృవీకరించింది. కాన్వే స్ధానాన్ని మార్క్ చాప్మన్తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. కాగా ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు బుధవారం(డిసెంబర్ 12) హామిల్టన్‌కు చేరుకోనుంది. ఇక మూడో టెస్టులో కివీస్ ఓపెనర్‌గా విల్ యంగ్ బరిలోకి దిగనున్నాడు.గత నెలలో భారత పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యంగ్.. ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పడు కాన్వే దూరం కావడంతో తుది జట్టులోకి యంగ్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. కాగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ చేతిలో కివీస్ ఘోర ఓటములను చవిచూసింది.చదవండి: IND vs AUS: 'మీరేమి టూర్‌కు వెళ్లలేదు.. దయచేసి హోటల్ గదులలో కూర్చోవద్దు' -
SL Vs SA: రసవత్తరంగా దక్షిణాఫ్రికా-శ్రీలంక రెండో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక టెస్టు రెండో మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో దోబూచులాడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక లక్ష్యానికి 143 పరుగుల దూరంలో నిలవగా... దక్షిణాఫ్రికా గెలుపునకు 5 వికెట్లు కావాల్సి ఉంది.ఓవర్‌నైట్ స్కోరు 191/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 86 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (116 బంతుల్లో 66; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... ట్రిస్టన్ స్టబ్స్ (47; 2 ఫోర్లు), బెడింగ్హమ్ (35; 3 ఫోర్లు) రాణించారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 348 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆదివారం ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.కమిందు మెండిస్ (35; 4 ఫోర్లు, 1 సిక్స్), ఏంజెలో మాథ్యూస్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ చండీమల్ (29; 5 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (64 బంతుల్లో 39 బ్యాటింగ్? 7 ఫోర్లు), కుశాల్ మెండిస్ (56 బంతుల్లో 39 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడుతున్నారు.దక్షిణాప్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ప్యాటర్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో ఐదు వికెట్లు ఉన్న శ్రీలంక విజయానికి 143 పరుగుల దూరంలో ఉంది.చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాకంటే మెర్గుగా ఆడారు: రోహిత్ -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 16 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం
న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.కాగా న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 583 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ 259 పరుగులకు ఆలౌటైంది.న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ బ్లండెల్(115) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు.హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ.. అంతకుముందు ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(106) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అదే విధంగా బెన్ డకెట్(92), జాకెబ్ బెతల్(96) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.మ్యాచ్ స్కోర్లు..ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 280/10న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 125/10ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 424/6 డిక్లేర్కివీస్ రెండో ఇన్నింగ్స్: 259/10ఫలితం: 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయంప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్: హ్యారీ బ్రూక్ -
శ్రీలంకతో రెండో టెస్టు.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.ఎయిడెన్ మార్క్రమ్ (75 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవగా... కెప్టెన్ తెంబా బవుమా (48 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (36 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. వీరిద్దరూ అజేయమైన నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం 221 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 242/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 99.2 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (44; 6 ఫోర్లు), కమిందు మెండిస్ (48; 4 ఫోర్లు) కాస్త పోరాడారు. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (14), కుశాల్ మెండిస్ (16), ప్రభాత్ జయసూర్య (24) మరికొన్ని పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లలో ప్యాటర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. యాన్సెన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
‘ఇక్కడి నుంచి వెళ్లిపో’.. సెంచరీ వీరుడిపై కోపంతో ఊగిపోయిన సిరాజ్!
టీమిండియాతో పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భారత్‌ను 180 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. 86/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆటను మొదలుపెట్టిన కమిన్స్ బృందం మరో 251 పరుగులు జమ చేసి ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(64) అర్ధ శతకంతో మెరవగా.. ఐదో నంబర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(140) భారీ శతకం బాదాడు. టీమిండియా బౌలర్లకు కొరకాని కొయ్యగా మారి.. 141 బంతుల్లోనే 140 పరుగులు స్కోరు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.అద్భుత యార్కర్‌తో హెడ్‌కు చెక్అయితే, ప్రమాదకారిగా మారిన హెడ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు భారత బౌలర్లు కఠినంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సిరాజ్‌కు అతడి వికెట్ దక్కించుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ 82వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన సిరాజ్.. అద్భుత యార్కర్‌తో హెడ్‌ను బౌల్డ్ చేశాడు.‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ ఇక కీలక వికెట్ దక్కిన ఆనందంలో సిరాజ్.. హెడ్‌ను ఉద్దేశించి ‘‘ఇక వెళ్లు’’ అన్నట్లుగా సైగ చేస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా హెడ్ సైతం అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మరింతగా కోపం తెచ్చుకున్న సిరాజ్.. ‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ అన్నట్లు ఉగ్రరూపం ప్రదర్శించాడు. అయితే, హెడ్ మాత్రం తన సెంచరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు.డీఎస్పీ సర్‌కు కోపం వచ్చిందిఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘డీఎస్పీ సర్‌కు కోపం వచ్చింది. శతకం బాదిన ఆటగాడికి తనదైన స్టైల్లో సెండాఫ్ ఇచ్చాడు’’ అంటూ అభిమానులు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అతి చేయవద్దు సిరాజ్.. కాస్త సంయమనం పాటించు’’ అని హితవు పలుకుతున్నారు.కాగా భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లతో చెలరేగగా..నితీశ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో 295 పరుగులతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. రెండో టెస్టులో కాస్త తడబడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి కమిన్స్ బృందం.. రోహిత్ సేనపై 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్The end of a sensational innings! 🗣️#AUSvIND pic.twitter.com/kEIlHmgNwT— cricket.com.au (@cricketcomau) December 7, 2024 -
సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్
అడిలైడ్ వేదికగా భారత్‌తో మొదలైన పింక్‌బాల్ టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత బౌలింగ్‌లో టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతోంది.మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఆసీస్ జట్టు 88 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆఖరి క్షణంలో తప్పుకున్నాడన్న కోపంతో సహనం కోల్పోయిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌పై బంతిని విసిరాడు.అసలేం జరిగిందంటే?ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో 5వ బంతిని వేసేందుకు సిరాజ్ సిద్దమయ్యాడు. స్ట్రైక్‌లో మార్నస్ లబుషేన్ ఉన్నాడు. అయితే సైట్ స్క్రీన్ వద్ద ప్రేక్షకుడు బీర్ స్నేక్(ఖాళీ బీర్ ప్లాస్టిక్ కప్పులు) తీసుకుని నడవడంతో ఏకాగ్రత కోల్పోయిన లబుషేన్ ఆఖరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు.దీంతో బంతిని వేసేందుకు రనప్‌తో వేగంగా వచ్చిన సిరాజ్ కూడా మధ్యలో ఆగిపోయాడు. అయితే సిరాజ్ తన బౌలింగ్‌ను ఆఖరి నిమిషంలో అపినప్పటికి.. ప్రత్యర్ధి బ్యాటర్‌పై కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సహానం కోల్పోయిన సిరాజ్ బంతిని లబుషేన్ వైపు త్రో చేశాడు. లబుషేన్ అలా చూస్తూ ఉండిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిని ఆసీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. భారత అభిమానులు సైతం అతడి చర్యలను తప్పుబడుతున్నారు. సిరాజ్ మియా అంత దూకుడెందుకు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ Mohammed Siraj was not too pleased with this 😂#AUSvIND pic.twitter.com/1QQEI5NE2g— cricket.com.au (@cricketcomau) December 6, 2024 -
హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ.. తొలి రోజు ఇంగ్లండ్‌దే
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దమ్ములేపాడు.క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న సెకెండ్ టెస్టులో బ్రూక్ సూపర్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బ్రూక్ కేవలం 91 పరుగుల్లోనే తన 8వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 115 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 123 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఇక అతడి అద్భుత ప్రదర్శన ఫలితంగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది.ఇంగ్లండ్ అతడితో పాటు ఓలీ పోప్(66) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. విలియం ఓ రూర్క్ 3, మాట్ హెన్రీ రెండు వికెట్లు సాధించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కివీస్ ప్రస్తుతం 194 పరుగుల వెనకంజలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే రెండు వికెట్లు సాధించగా.. వోక్స్, అట్కిన్సన్, స్టోక్స్ తలా వికెట్ పడగొట్టారు. -
ఆసీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘పింక్ బాల్’ టెస్టులో భారత ఓపెనింగ్ జోడీపై స్పష్టతనిచ్చాడు. యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.ఇక.. తాను మిడిలార్డర్లో బరిలోకి దిగుతానని చెప్పిన రోహిత్ శర్మ.. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తనకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమేనని.. అయినా జట్టు కోసం ఓపెనింగ్ స్థానం త్యాగం చేయక తప్పలేదని పేర్కొన్నాడు.పితృత్వ సెలవులుకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. తన భార్య రితికా సజ్దే కుమారుడు అహాన్‌కు జన్మనివ్వడంతో పితృత్వ సెలవులు తీసుకున్నాడు. అయితే, మొదటి టెస్టు మధ్యలోనే ముంబై నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు హిట్‌మ్యాన్.జైస్వాల్‌తో కలిసి రాణించిన రాహుల్ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులో రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం(161) బాదాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్(26, 77) సైతం మెరుగ్గా రాణించాడు.అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్ జోడీని మారుస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. రాహుల్‌ను మిడిలార్డర్‌లోకి పంపి రోహిత్ ఓపెనర్‌గా వస్తాడేమోనని అంతా భావించారు. అయితే, తానే మిడిలార్డర్లో వస్తానని రోహిత్ శర్మ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పింక్ బాల్తోకాగా అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్. దీనిని పింక్ బాల్‌తో నిర్వహిస్తారు. ఇక ఇందుకోసం రోహిత్ సేన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ(3) విఫలం కాగా.. ఓపెనర్లు జైస్వాల్ 45, రాహుల్ 27(రిటైర్డ్ హర్ట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్
‘పింక్ బాల్’తో మ్యాచ్ అంత ఈజీ కాదంటున్నాడు టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్. క్రీజులోకి వెళ్లిన తర్వాతే దాని సంగతేమిటో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్రస్తుతం భారత జట్టులో ఎనిమిది మందికి మాత్రమే డే అండ్ నైట్(పింక్ బాల్) టెస్టు ఆడిన అనుభవం ఉంది. అందులోనూ విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్‌తో ఆడారు.ఇక కేఎల్ రాహుల్‌కు ఇదే తొలి ‘పింక్ బాల్ టెస్టు’ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎర్ర బంతికి, గులాబీ మధ్య తేడా తనకు స్పష్టంగా కనిపిస్తోందని... డే అండ్ నైట్ టెస్టులో ‘పింక్ బాల్’ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రాహుల్ వ్యాఖ్యానించాడు. నాకు ఇది కొత్త అనుభవం‘బౌలర్ చేతినుంచి బంతి విడుదలయ్యే సమయంలో దానిని గుర్తించడం కష్టంగా ఉంది. ఎర్ర బంతితో పోలిస్తే చాలా గట్టిగా ఉండటంతో పాటు వేగంగా కూడా దూసుకొస్తోంది. ఫీల్డింగ్‌లో క్యాచ్ పట్టే సమయంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వింగ్ కూడా భిన్నంగా అవుతోంది కాబట్టి అదే మాకు పెద్ద సవాల్ కానుంది. నాకు ఇది కొత్త అనుభవం. క్రీజ్‌లోకి వెళ్లాకే దాని సంగతేమిటో చూస్తాను. ఎలాంటి స్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ చెప్పాడు.అయితే ప్రాక్టీస్ ద్వారా అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నామని కేఎల్ రాహుల్ అన్నాడు. ‘గులాబీ బంతి ఎలా స్పందిస్తోందో, ఆడటం ఎంత కష్టమో తెలుసుకునేందుకే మాకు కొంత సమయం పట్టింది. బౌలర్ చేతి నుంచి వచ్చే బంతిని గుర్తించడమే తొలి అడుగు. అప్పుడే సరైన షాట్ ఆడేందుకు తగిన అవకాశం ఉంటుంది. అందుకే మేమంతా ఎక్కువ బంతులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాం’ అని రాహుల్ వెల్లడించాడు. కాగా రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పింక్ బాల్ టెస్టుకు వేదికైన అడిలైడ్ చేరుకున్న టీమ్ రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది.ఓపెనర్‌గా ఆడిస్తారా?ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టు కోసం రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో అతని ఓపెనింగ్ స్థానంపై సందిగ్ధత నెలకొంది. అతను ఓపెనర్‌గా కొనసాగాలా లేక మిడిలార్డర్లో ఆడాలా అనేదానిపై చర్చ మొదలైంది. దీనిపై రాహుల్ స్పందించాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశంపై అతడు మాట్లాడాడు. ‘అడిలైడ్ టెస్టులో నా బ్యాటింగ్ స్థానం ఏమిటనేది నాకు ఇప్పటికే చెప్పేశారు. అయితే మ్యాచ్ జరిగే వరకు దాని గురించి మాట్లాడవద్దని కూడా చెప్పారు. నేను దేనికైనా సిద్ధమే. ఏ స్థానమైనా తుది జట్టులో ఉండటమే నాకు అన్నింటికంటే ముఖ్యం. అవకాశం రాగానే బరిలోకి దిగి జట్టు కోసం ఆడటమే ప్రధానం. నేను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను.ఆరంభంలో తొలి 20–25 బంతులు కొంత ఇబ్బందిగా అనేపించేవి. డిఫెన్స్ ఆడాలా లేక అటాక్ చేయాలనే అని సందేహ పడేవాడిని. అయితే ఇన్నేళ్ల అనుభవం తర్వాత నా ఇన్నింగ్స్‌ను ఎలా నడిపించాలో స్పష్టత వచి్చంది. తొలి 30–40 బంతులు సమర్థంగా ఎదుర్కోగలిగితే అది ఓపెనింగ్ అయినా మిడిలార్డర్ అయినా అంతా ఒకేలా అనిపిస్తుంది. దానిపైనే నేను దృష్టి పెడతా’ అని రాహుల్ వెల్లడించాడు. ముందే చెప్పారుఇక టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ చేయాల్సి రావచ్చని తనకు ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందే టీమ్ మేనేజ్మెంట్ చెప్పిందని... అందుకే అన్ని రకాలుగా సన్నద్ధమయ్యానని రాహుల్ చెప్పాడు. సరిగ్గా పదేళ్ల క్రితం రాహుల్ ఇదే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ పదేళ్ల కెరీర్లో అతను 54 టెస్టులు ఆడాడు. ఈ క్రమంలో పలు గాయాలను అధిగమించిన అతడు... మానసికంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ‘పదేళ్లు కాదు...25 ఏళ్లు గడిచినట్లుగా అనిపిస్తోంది. ఇన్నేళ్లలో నాకు ఎదురైన గాయాలు, ఆటకు దూరమైన రోజులు అలా అనిపించేలా చేస్తున్నాయి. అయితే ఈ దశాబ్దపు కెరీర్‌ను ఆస్వాదించాననేది వాస్తవం. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నాచిన్నప్పుడు నాన్నతో కలిసి ఉదయమే టీవీలో టెస్టులు చూసిన రోజులను దాటి అదే ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఆడే సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. ఆ సమయంలో నా బ్యాటింగ్, చేయాల్సిన పరుగుల గురించి ఆలోచనే రాలేదు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. గుర్తుంచుకునే క్షణాలతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా. ఇన్నేళ్లలో ఏ స్థానంలో అయిన ఆడగలిగేలా మానసికంగా దృఢంగా తయారయ్యా. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నా’ అని రాహుల్ వివరించాడు.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
టీమిండియాకు చేదు అనుభవం.. ఇకపై వారికి అనుమతి లేదు!
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా తొలి టెస్టు గెలిచి టీమిండియా జోరు మీదుండగా... ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ‘పింక్ బాల్’ టెస్టు ప్రారంభం కానుంది. ఇకపై వారికి అనుమతి లేదుఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు గులాబీ బంతితో ముమ్మర సాధన చేస్తుండగా... ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరైన కొందరు ఆసీస్ అభిమానులు టీమిండియా ప్లేయర్లను ఎగతాళి చేశారు.ఈ నేపథ్యంలో.. ఈ సిరీస్‌లో ఇకపై భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో అభిమానులను అనుమతించబోవడం లేదు. కాగా మంగళవారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా... వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. పరుష పదజాలంతో దూషణలుఅడిలైడ్ మైదానంలో నెట్స్‌కు చాలా సమీపం వరకు అభిమానులు వచ్చే వీలుండటంతో... అక్కడికి చేరుకున్న పలువురు పరుష పదజాలంతో భారత ఆటగాళ్లను తూలనాడారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఫిర్యాదు చేసింది. ఇకపై టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌కు అభిమానులను అనుమతించబోమని తేల్చి చెప్పింది.చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
Ind vs Aus: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు
‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. పింక్ బాల్‌తో నిర్వహించనున్న ఈ డే అండ్ నైట్ మ్యాచ్ శుక్రవారం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ పిచ్ గురించి ప్రధాన క్యూరేటర్ డామియన్ హగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడి పిచ్ స్పిన్ బౌలింగ్‌కు సహకరించనుందని వెల్లడించాడు పిచ్‌పై 6 మిల్లీ మీటర్ల పచ్చిక ఉంటుందని పేర్కొన్నాడు.ఆరంభంలో పేస్‌కు సహకరించినా...అయితే, ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబీ బంతిని ఎదుర్కోవడం కొంచెం కష్టమే అని... అయితే పిచ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు సహకరిస్తుందని హగ్ వెల్లడించాడు. ‘రికార్డులు పరిశీలిస్తే అడిలైడ్‌లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడం కష్టమనేది సుస్పష్టం. పిచ్‌పై పచ్చిక ఉండనుంది. ఆరంభంలో పేస్‌కు సహకరించినా... మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.బంతి పాతబడే వరకు కుదురుకుంటే పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదు. అడిలైడ్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించడం పరిపాటి. ఇక్కడ ఆడేటప్పుడు ప్రధాన స్పిన్నర్ తుది జట్టులో ఉండాల్సిందే. మ్యాచ్ ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపితే... రాత్రి పూట స్పిన్నర్లు ప్రమాదకరం’ అని హగ్ తెలిపాడు. గతంలొ 36 పరుగులకే ఆలౌట్‌కాగా పెర్త్‌లో జరిగిన టెస్టులో భారత్ ఆసీస్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టును ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది బుమ్రా సేన. ఇక అడిలైడ్ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. కాగా 2020లో ఇదే వేదికపై భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డును మూటగట్టుకుంది.చదవండి: ‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’ -
సౌతాఫ్రికా టూర్‌కు పాక్ జట్టు ప్రకటన: బాబర్ రీ ఎంట్రీ! అతడికి నో ఛాన్స్
సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు టీమ్‌లలోనూ చోటు దక్కించుకోగా.. టెస్టు జట్టులో ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిది పేరు మాత్రం లేదు.కాగా మూడు వన్డే, మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబరు 10న తొలి టీ20తో ఈ టూర్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పీసీబీ బుధవారం ఈ సిరీస్‌లకు సంబంధించి మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.టెస్టులలో బాబర్ పునరాగమనం.. అతడికి మాత్రం చోటు లేదుటెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మూడు జట్లలో స్థానం సంపాదించాడు. కాగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై తొలి టెస్టులో విఫలమైన తర్వాత.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండా బాబర్‌పై వేటు పడింది. అతడితో పాటు షాహిన్నూ తప్పించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. యువ పేసర్ నసీం షా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది టీ20, వన్డేలు మాత్రమే ఆడి.. టెస్టులకు దూరంగా ఉండనున్నాడు.తప్పించారా? రెస్ట్ ఇచ్చారా?వచ్చే ఏడాది సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షాహిన్‌కు పీసీబీ ఈ మేర పనిభారం తగ్గించి.. విశ్రాంతినివ్వాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల క్వైద్-ఇ-ఆజం ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 31 వికెట్లతో సత్తా చాటిన రైటార్మ్ సీమర్ మహ్మద్ అబ్బాస్ దాదాపు మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.తొలిసారి వన్డే జట్టుకు సూఫియాన్ ఎంపికఅదే విధంగా.. ఖుర్రం షెహజాద్, మీర్ హంజా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. షాజిద్ ఖాన్ మాత్రం మిస్సయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌గా నొమన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ సూఫియాన్ మోకీం తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య డిసెంబరు 10, 13, 14 తేదీల్లో టీ20... డిసెంబరు 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అదే విధంగా.. డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికాతో టెస్టులకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.సౌతాఫ్రికాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).సౌతాఫ్రికాతో టీ20లకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సూఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
పదిహేనేళ్ల కరువు తీరింది: వెస్టిండీస్‌కు ఊహించని షాక్.. పట్టికలోనూ తారుమారు
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌ను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా కరేబియన్ గడ్డపై పదిహేనేళ్లలో తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్‌ను వెనక్కినెట్టింది.కరేబియన్ పర్యటనలో బంగ్లాదేశ్కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ కరేబియన్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగగా.. ఆతిథ్య వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.జమైకాలో రెండో టెస్టుఅయితే, రెండో టెస్టులో మాత్రం బంగ్లాదేశ్ వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. జాకర్ అలీ బ్యాట్‌తో, తైజుల్ ఇస్లాం బాల్‌తో చెలరేగడంతో బ్రాత్‌వైట్ బృందాన్ని మట్టికరిపించింది. జమైకా వేదికగా శనివారం నుంచి మంగళవారం (నవంబరు 30- డిసెంబరు 3) వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసింది.బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(64), కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(36) రాణించడంతో ఈ మేర స్కోరు సాధించింది. నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగడంతోఇందుకు బదులిచ్చేందుకు రంగంలోకి దిగిన విండీస్ జట్టు.. 146 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా యువ పేసర్ నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగి వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఈ క్రమంలో.. 18 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 268 పరుగులు సాధించింది. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 42 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జాకర్ అలీ 91 పరుగులతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పర్యాటక బంగ్లాదేశ్ విండీస్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఈసారి ఐదేసిన తైజుల్ ఇస్లాంఅయితే, టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ను ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఓపెనర్లలో మైకైల్ లాయీస్(6)తో పాటు.. కెప్టెన్ బ్రాత్‌వైట్(43)లను అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలకగా.. పేసర్లు టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా అతడికి సహకారం అందించారు.సిరీస్ సమం.. ఇక విండీస్ బ్యాటర్లలో కేవం హోడ్జ్(55) అర్ధ శతకంతో కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. తైజుల్ ఇస్లాం అతడిని పెవిలియన్‌కు పంపి మరోసారి దెబ్బ కొట్టాడు. ఇక నహీద్ రాణా షమార్ జోసెఫ్(8)ను పదో వికెట్‌గా వెనక్కి పంపడంతో విండీస్ కథ ముగిసిపోయింది. 185 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కాగా.. బంగ్లా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక బంగ్లా బౌలర్లలో ప్లేయర్ ‘ఆఫ్ ది మ్యాచ్’ తైజుల్ ఇస్లాం ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్ తలా రెండు, నహీద్ రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పాయింట్ల పట్టికలోనూ తారుమారుఇక విండీస్‌పై విజయంతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరగా.. వెస్టిండీస్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ టాప్-5లో ఉన్నాయి.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
రోహిత్ వచ్చాడు!.. మరి మీ పరిస్థితి ఏంటి?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న పింక్ బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక ఈ టెస్టు కోసం రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరడంతో.. భారత తుదిజట్టు కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి.రాణించిన రాహుల్కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ గైర్హాజరైన నేపథ్యంలో.. పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. ఈ పేస్ బౌలర్ కెప్టెన్సీల్లో భారత్ కంగారూలను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ విజయంలో.. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(161), కేఎల్ రాహుల్(77)లతో పాటు విరాట్ కోహ్లి(100 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రాకతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అడిలైడ్ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్ ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తుదిజట్టులో చోటు ఉండాలి కదా!‘‘ముందుగా నాకు తుదిజట్టులో చోటు దక్కడమే ముఖ్యం. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడతా. ఓపెనర్‌గా అయినా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా అయినా జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా.మొదట్లో కాస్త కష్టంగా ఉండేది..ఇప్పటి వరకు నా కెరీర్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. అయితే, అది కూడా టెక్నిక్ పరంగా కాకుండా.. మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉండేది. తొలి 20 -25 బంతుల పాటు కఠినంగా తోచేది.ఇక ఇప్పటికి చాలాసార్లు నేను టెస్టుల్లో, వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో ఆడాను కాబట్టి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ఆడాలో నాకు స్పష్టత ఉంది. తొలి 30- 40 బంతుల పాటు నిలదొక్కుకోగలిగితే.. ఆ తర్వాత నా రెగ్యులర్ స్టైల్లో ముందుకు సాగడం తేలికవుతుంది’’ అని స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.విదేశీ గడ్డపై ఐదుకాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 54 టెస్టులు ఆడి 3084 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు ఉండగా.. వీటిలో రెండు సౌతాఫ్రికా, రెండు ఇంగ్లండ్, ఒకటి ఆస్ట్రేలియాలో సాధించినవి. ఇక పెర్త్ టెస్టులోనూ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధ శతకం(77)తో రాణించాడు.శుబ్‌మన్ గిల్ కూడా వచ్చేశాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మారటంతో పాటు.. ధ్రువ్ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
ఆసీస్ జట్టులో విభేదాలు?.. పింక్ బాల్ టెస్టు మాకూ సవాలేనన్న బ్యాటర్!
టీమిండియాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం విదితమే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు.. కంగారూలను 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది. ముఖ్యంగా బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో కమిన్స్ బృందానికి ఈ మేర ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో మొదటి టెస్టు ఫలితం తర్వాత ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు వినిపించాయి.పెర్త్‌లో పరాజయం తర్వాత బ్యాటర్లదే తప్పు అన్నట్లుగా ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ఇవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేశాడు. విభేదాలనే మాటకు తావు లేదు‘ఏ జట్టులోనైనా గెలుపోటముల్లో బ్యాటర్లు, బౌలర్లందరి సమాన బాధ్యత ఉంటుంది. ఏ ఆటగాడైనా విజయం కోసం తాను వ్యక్తిగతంగా కూడా కీలకపాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తాడు.మేం భారీ స్కోరు చేస్తే బౌలర్ల పని సులువవుతుందని తెలుసు. కాబట్టి సమష్టిగా ఉండటం తప్ప విభేదాలనే మాటకు తావు లేదు. మేం 0–1తో వెనుకబడి ఉన్నామనేది వాస్తవం. కానీ మాకు ఇంకా చాలా అవకాశం ఉంది. ఎన్నో సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కోలుకొని చెలరేగిన సత్తా మా సొంతం’ అని హెడ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. బుమ్రా సూపర్.. ‘బుమ్రా బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మాకు అనుభవంలోకి వస్తోంది. అతను విసిరే సవాల్‌ను ఎదుర్కొంటూ పోటీ పడటం ప్రత్యేకంగా అనిపిస్తోంది. కెరీర్ ముగిసిన తర్వాత నేనూ బుమ్రాను ఎదుర్కొన్నాను అని మా మనవలకు చెప్పుకోగలను. ఈ సిరీస్‌లో మరికొన్నిసార్లు అతడితో తలపడే అవకాశం ఎలాగూ వస్తుంది. నా దృష్టిలో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోయాడు’ అని హెడ్ వ్యాఖ్యానించాడు.పెర్త్ టెస్టులో హెడ్ ఒక్కడే కాస్త బుమ్రాను సమర్థంగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించగా... స్మిత్, లబుషేన్, ఖాజా పూర్తిగా విఫలమయ్యారు. ‘బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. అయితే ఏ బౌలర్‌నైనా ఎదుర్కొనేందుకు ప్రతీ బ్యాటర్‌కు తనదైన శైలి ఉంటుంది. వారు ఎలా ఆడగలరనేది వారికి మాత్రమే తెలుసు. నేను కాస్త మెరుగ్గా ఆడినంత మాత్రాన నా సహచరులు సలహాలు, సూచనల కోసం నా వద్దకు రాలేదు కదా’ అని బుమ్రా బౌలింగ్ గురించి హెడ్ అభిప్రాయపడ్డాడు.‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందినాలుగేళ్ల క్రితం ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ 36 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తనకు గుర్తుందని, అయితే ఈసారి అలాంటిది జరగకపోవచ్చని అతను అన్నాడు. తాము కూడా ‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందని... పరిస్థితులకు తగినట్లుగా మన ఆటను మార్చుకోవడమే ఇరు జట్లకు కీలకమని హెడ్ చెప్పాడు. కాగా భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.చదవండి: ‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’ -
టీమిండియాతో ‘పింక్ బాల్ టెస్టు’కు ముందు ఆసీస్‌కు మరో షాక్!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది.అయితే, ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్‌వుడ్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోపింక్ బాల్ టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్మిత్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్ లబుషేన్ త్రోడౌన్స్ వేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్‌లోకి వచ్చి స్మిత్ పరిస్థితిని పర్యవేక్షించాడు. అనంతరం స్మిత్ నెట్స్ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్ బ్యాటింగ్ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు సమాచారం.తొలి టెస్టులో విఫలంఈ నేపథ్యంలో అడిలైడ్ టెస్టుకు స్మిత్ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్ స్మిత్ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ఈ వెటరన్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుటయ్యాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో స్మిత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆసీస్ బుమ్రా సేన చేతిలో 295 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య అడిలైడ్‌లో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన టీమిండియాపింక్ బాల్‌తో జరుగనున్న ఈ టెస్టుకు ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. కాగా రెండో టెస్టుకు హాజిల్‌వుడ్ దూరమైన నేపథ్యంలో ఆసీస్ మేనేజ్మెంట్ స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్ మార్ష్‌కు కవర్‌గా బ్యూ వెబ్‌స్టర్‌ను పిలిపించింది.ఇది కూడా చదవండి: పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!🚨 Another injury scare for Australia!Steve Smith in pain after being hit on his fingers by a throwdown from Marnus Labuschagne. After being attended by a physio, Smith left the nets. @debasissen reporting from Adelaide #INDvsAUS #BGT2024 pic.twitter.com/jgEQO0BTuz— RevSportz Global (@RevSportzGlobal) December 3, 2024 -
‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను మరికొన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితం చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.గాయం వల్ల జట్టుకు దూరంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండగా.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో ఆడుతున్న గిల్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.రిషభ్ పంత్ ఉన్నప్పటికీఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు.. గిల్ లేకపోవడంతో.. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రావడంతో ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియా టుడేతో మాట్లాడాడు. ‘‘కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కోసం శుబ్‌మన్ గిల్ తన మూడోస్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో రాగా.. మిగతా స్థానాల్లో యథావిధిగా అందరూ కొనసాగాలి.గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలిగిల్ మరికొన్నాళ్లు వేచి చూడాలి. నిజానికి జురెల్‌కు తొలి టెస్టులో అవకాశం ఇచ్చారు. కానీ అతడు పరుగులేమీ రాబట్టలేకపోయాడు. కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. గిల్‌ను ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడా ఆడించలేము కదా!ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవడం మంచిదే. బెంచ్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. మేనేజ్మెంట్ గిల్ వైపు మొగ్గు చూపి జురెల్‌ను తప్పించవచ్చు. అయితే, నా అభిప్రాయం ప్రకారం జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలి’’ అని భజ్జీ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీకాగా ఆసీస్-‘ఎ’ జట్టుతో రాణించిన జురెల్.. తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచారడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 1 పరుగులు చేశాడు. మరోవైపు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పింక్ బాల్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీ(రిటైర్డ్ హర్ట్) సాధించాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు జరుగనుంది. దీనిని పింక్ బాల్‌తో నిర్వహించనున్నారు. ఇక పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
వాళ్లు కూడా స్లెడ్జ్ చేశారు.. ఈసారి గనుక ఛాన్స్ ఇస్తే: ఆసీస్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ప్యాట్ కమిన్స్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శల వర్షం కురిపించాడు. పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్ల చేతిలోనూ మానసికంగా ఓడిపోయారంటూ ఎద్దేవా చేశాడు. జట్టులో ఏ ఒక్కరిలోనూ పోరాటపటిమ కనబడలేదని.. ఇకనైనా కాస్త ఆటపై దృష్టి పెట్టి విజయాల బాటపట్టాలని సూచించాడు. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాషెస్ సిరీస్ మాదిరేఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మాదిరే కంగారూ జట్టుకు ఈ సిరీస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇక టీమిండియాతో టెస్టు అంటే కేవలం ఆటకే పరిమితం కాకుండా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడంలోనూ ముందే ఉంటారు. అందుకు తగ్గట్లుగా భారత ఆటగాళ్లూ బదులిచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.స్లోగా బౌల్ చేస్తున్నాడుఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులోనూ ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నా.. వాటి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది. అయితే, ఈ టీజింగ్ మూమెంట్లలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఉద్దేశించి చాలా స్లోగా బౌల్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించడం హైలైట్‌గా నిలిచింది.295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిమరోవైపు.. స్టార్క్.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాను ఉద్దేశించి.. ‘‘నీకంటే నేనే ఫాస్ట్‌గా బౌల్ చేస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, రాణా చిరునవ్వుతోనే స్టార్క్‌కు బదులిచ్చాడు. అయితే, అతడిని అవుట్ చేసి తన సత్తా చాటడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఆసీస్ 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?ఈ నేపథ్యంలో మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బయటి నుంచి ప్రేక్షకుడిగా మ్యాచ్ చూస్తున్న నాకు.. ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏమాత్రం పోరాటపటిమ కనిపించలేదు. ముఖ్యంగా ఓ అరంగేట్ర ఆటగాడు.. యువ ఓపెనర్.. మన సొంతగడ్డ మీద.. మిచెల్ స్టార్క్‌ను స్లెడ్జ్ చేస్తూ.. స్లోగా బౌలింగ్ చేస్తున్నావనడం.. అయినా మనలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.బ్యాట్‌తోనూ.. బాల్‌తోనూ మనం సమాధానం ఇవ్వలేకపోయాం. అసలు ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?’’ అని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో ఆసీస్ జట్టును విమర్శించాడు. ఇక టీమిండియాకు భయపడితే పనులు జరగవని.. అడిలైడ్‌లో మాత్రం తప్పక విజృంభించాలని కమిన్స్ బృందానికి మిచెల్ జాన్సన్ సూచించాడు.ఈసారి గనుక ఛాన్స్ ఇస్తేలేనిపక్షంలో వాళ్లను ఎదుర్కోవడం మరింత కష్టమవుతుందని టీమిండియా గురించి ఆసీస్‌కు మిచెల్ జాన్సన్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పింక్ బాల్‌తో జరిగే ఈ టెస్టులోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉన్న టీమిండియా.. అందుకు తగ్గట్లుగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో గులాబీ బంతితో సాధన చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పీఎం ఎలెవన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.ఇక తొలి టెస్టుకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుబ్‌మన్ గిల్ రెండో టెస్టు కోసం భారత జట్టుతో చేరారు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ గాయాల రూపంలో ఆసీస్‌కు షాక్ తగిలింది. కాగా ఆసీస్- భారత్ మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: వెళ్లు వెళ్లు.. వెనక్కి వెళ్లు: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! ఆఖరికి..
ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్(Prime Ministers XI)తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. తద్వారా భారత ఇన్నింగ్స్‌లో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. పీఎం ఎలెవన్‌తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్‌కు కోపమొచ్చింది.తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన ఆసీస్ పేసర్ జాక్ నిస్బెట్(Jack Nisbet)కు బ్యాట్‌తో పాటు.. నోటితోనూ గట్టిగానే సమాధానమిచ్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు ఆడనుంది.తొలిరోజు ఆట టాస్ పడకుంగానే అయితే, పింక్ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో.. ఆసీస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. రెండురోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా శనివారం నాటి తొలిరోజు ఆట టాస్ పడకుంగానే ముగిసిపోగా.. రెండో రోజు సవ్యంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు.కాన్స్టాస్ శతకంకాన్బెర్రా వేదికగా ఆదివారం టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పీఎం ఎలెవన్ జట్టు ఓపెనర్ సామ్ కాన్స్టాస్ శతకం(107)తో చెలరేగగా.. మిగతా వాళ్లలో హనో జాకబ్స్(61), జాక్ క్లేటన్(40) మెరుగ్గా రాణించారు. మిగతా వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పీఎం జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో పేసర్లు హర్షిత్ రాణా నాలుగు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజకు తలా ఒక వికెట్ దక్కింది. 42.5 ఓవర్లలోనే ఛేదించినాఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ శుభారంభం అందించగా.. కేఎల్ రాహుల్(27 రిటైర్డ్ హర్ట్), శుబ్‌మన్ గిల్(50- రిటైర్డ్ హర్ట్) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ(3) మాత్రం విఫలం కాగా.. నితీశ్ రెడ్డి(42), వాషింగ్టన్ సుందర్(42 నాటౌట్) అదరగొట్టారు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(27) ఫర్వాలేదనిపించగా.. సర్ఫరాజ్ ఖాన్(1) పూర్తిగా విఫలమయ్యాడు. దేవ్పడిక్కల్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిజానికి రోహిత్ సేన 42.5 ఓవర్లలోనే 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించినా... ప్రాక్టీస్ కోసం పూర్తి ఓవర్లు ఆడటం గమనార్హం.ఇదిలా ఉంటే.. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ను పీఎం ఎలెవన్ పేసర్ జాక్ నిస్బెట్ వేశాడు. అతడి బౌలింగ్‌లో తొలి రెండు బంతులను యశస్వి జైస్వాల్ బౌండరీకి తరలించగా.. నిస్బెట్ జైస్వాల్‌ను చూస్తూ ఏదో అన్నాడు. వెనక్కి వెళ్లు..ఇందుకు బదులుగా.. ‘‘వెనక్కి వెళ్లు.. వెళ్లి బౌలింగ్ చెయ్’’ అని జైస్వాల్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో చిరునవ్వుతోనే వెనక్కి వెళ్లిన నిస్బెట్ ఆఖరి వరకు రాకాసి బౌన్సర్లతో జైస్వాల్‌ను తిప్పలు పెట్టాడు.దీంతో ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఆఖరి వరకు తగ్గేదేలే అన్నట్లు తలపడ్డారు. ఇక నిస్బెట్ ఓవర్లో జైస్వాల్ ఎనిమిది పరుగులు రాబట్టగా.. అతడు మాత్రం వికెట్‌లెస్‌గా వెనుదిరిగాడు. జైస్వాల్‌ను అవుట్ చేయాలన్న అతడి కల నెరవేరలేదు. అంతే కాదు మ్యాచ్ మొత్తంలో ఆరు ఓవర్లు వేసిన 21 ఏళ్ల నిస్బెట్ 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఎనిమిదో ఓవర్లో మరోసారి బరిలోకి దిగిన నిస్బెట్ జైస్వాల్‌ను పరుగులు రాబట్టకుండా అడ్డుకోగలిగాడు.చదవండి: బీసీసీఐ మ్యాచ్.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం Yashasvi Jaiswal took it up to Jack Nisbet in Canberra but the fiery NSW quick wasn't backing down! 👀 #PMXIvIND pic.twitter.com/tX3O86wEv2— cricket.com.au (@cricketcomau) December 1, 2024 -
WTC: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 233 పరుగుల తేడాతో శనివారం జయభేరి మోగించింది. కాగా రెండు టెస్టులు ఆడే క్రమంలో శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. నాలుగో రోజుల్లోనే ముగిసిపోయింది. కింగ్స్‌మేడ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్టబ్స్, బవుమా శతకాలుఅనంతరం సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జి రెండు, కగిసో రబడ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా దుమ్ములేపింది.ట్రిస్టన్ స్టబ్స్(122), కెప్టెన్ బవుమా(113) శతకాలతో విరుచుకుపడటంతో భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 515 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అతడేఈ క్రమంలో 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 282 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రబడ, కోయెట్జి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పదకొండు వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.ఆస్ట్రేలియాకు భారీ షాక్ఇదిలా ఉంటే.. లంకపై భారీ గెలుపుతో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకువచ్చింది. ఐదో స్థానం నుంచి ఏకంగా రెండోస్థానానికి ఎగబాకి.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. మరోవైపు.. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్టులో ఓడించిన టీమిండియా మాత్రం అగ్రస్థానం నిలబెట్టుకుంది.PC: ICCఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో సౌతాఫ్రికాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో ఒకటి, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడూ సొంతగడ్డపైనే జరుగనుండటం సౌతాఫ్రికాకు సానుకూలాంశం. వీటన్నింటిలోనూ ప్రొటిస్ జట్టు గెలిచిందంటే.. ఫైనల్ రేసులో తానూ ముందు వరుసలో ఉంటుంది.టీమిండియా పరిస్థితి ఏంటి?ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆసీస్ గడ్డపై ఐదింటిలో కనీసం నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే ఒక విజయం సాధించింది కాబట్టి.. ఇంకో మూడు గెలిస్తే చాలు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన తదుపరి ఆసీస్‌తో అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో తలపడనుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
భారత్‌తో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్
టీమిండియాతో రెండో టెస్టు నేపథ్యంలో ఆస్ట్రేలియా తుదిజట్టు గురించి మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పింక్ బాల్ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్‌ను ఆడించవద్దని క్రికెట్ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేశాడు. అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు విమర్శలు చేశాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆసీస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సమిష్టి కృషితో ఆసీస్‌ను సొంతగడ్డపై చిత్తు చేసింది.రెండుసార్లూ విఫలంఇక ఈ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేశాడు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన లబుషేన్ ఐదు బంతుల్లో మూడు పరుగులకే వెనుదిరిగాడు. ఈసారి మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా అతడికి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లుఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడిన లబుషేన్ 245 పరుగులే చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉండగా.. ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బ్యాటింగ్‌లో వరుస వైఫల్యాలతో డీలా పడిన మార్నస్ లబుషేన్‌ను కచ్చితంగా జట్టు నుంచి తప్పించాల్సిందే. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టులో అతడి స్థానంలో వేరొకరిని ఆడించాలి. అతడిపై వేటు వేయండిలేదంటే.. పెర్త్ టెస్టు మాదిరి ఇక్కడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతడు షెఫీల్డ్ షీల్డ్, క్లబ్ క్రికెట్లో తిరిగి ఆడాల్సిన సమయం వచ్చింది. జాతీయ జట్టుకు ఆడినపుడు ఉండేంత ఒత్తిడి అక్కడ ఉండదు. కాస్త స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. అది అతడికే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ది నైట్లీకి రాసిన కాలమ్‌లో మిచెల్ జాన్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.చదవండి: మొదలుకాకుండానే ముగిసిపోయింది.. టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. పట్టు బిగించిన ఇంగ్లండ్
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో డార్లీ మిచెల్(31 బ్యాటింగ్), నాథన్ స్మిత్(1) ఉన్నారు.కివీస్ ప్రస్తుతం 4 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. డార్లీ మిచెల్ ఏదైనా అద్బుతం చేస్తే తప్ప కివీస్ ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించలేదు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(64) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే, క్రిస్ వోక్స్ తలా మూడు వికెట్లు సాధించారు.అంతకుముందు అదేవిధంగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(171) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్(80), ఓలీ పోప్(77) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 151 పరుగుల ఆధిక్యం లభించింది.చదవండి: IPL 2025: '23 ఏళ్లకే రూ. 40 కోట్లు సంపాదన.. అదే అతడిని దెబ్బతీసింది' -
స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక పరాజయానికి చేరువైంది. 516 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంక మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 103 పరుగులే చేసింది.కరుణరత్నే (4), నిసాంక (23), మాథ్యూస్ (25), కమిందు (10), ప్రభాత్ (1) ఇప్పటికే పెవిలియన్ చేరారు. దినేశ్ చండీమల్ (29 బ్యాటింగ్), ధనంజయ డిసిల్వ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక గెలుపు కోసం మరో 413 పరుగులు చేయాల్సి ఉంది. రబడ, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 132/3తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 366 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (221 బంతుల్లో 122; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (228 బంతుల్లో 113; 9 ఫోర్లు) సెంచరీలు నమోదు చేయడం విశేషం. స్టబ్స్ కెరీర్లో ఇది రెండో శతకం కాగా...బవుమాకు మూడోది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 249 పరుగులు జోడించారు.చదవండి: ‘గులాబీ’ బంతితో సాధనకు సిద్ధం -
శతక్కొట్టిన తెంబా బవుమా.. కెప్టెన్‌గా అరుదైన రికార్డు
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుత శతకంతో మెరిశాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డర్బన్ వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. కింగ్స్‌మెడ్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయింది. టాపార్డర్ కుదేలైన వేళ బవుమా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.తొలి ఇన్నింగ్స్‌లో బవుమానే ఆదుకున్నాడుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(9), టోనీ డి జోర్జి(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 16 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతను భుజాన వేసుకున్న బవుమా 117 బంతులాడి 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో టెయిలండర్ కేశవ్ మహరాజ్(24) ఒక్కడే 20 పరుగుల మార్కు దాటాడు.లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార మూడేసి వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, సౌతాఫ్రికాను 191 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం శ్రీలంకకు ఎక్కువ సేపు ఉండలేదు.42 పరుగులకే లంక ఆలౌట్ఆతిథ్య జట్టు పేసర్ల దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. కేవలం 42 పరుగులకే ధనంజయ డి సిల్వ బృందం కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ సాధించిన 13 పరుగులే టాప్ స్కోర్. ఐదుగురేమో డకౌట్.ఫలితంగా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్ టోనీ 17 పరుగులకే నిష్క్రమించినా.. మరో ఓపెనర్ మార్క్రమ్ 47 రన్స్‌తో రాణించాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 15 పరుగులకే అవుట్ కాగా.. స్టబ్స్, బవుమా మాత్రం విశ్వరూపం ప్రదర్శించారు.స్టబ్స్, బవుమా శతకాలు.. లంకకు భారీ టార్గెట్స్టబ్స్ 221 బంతుల్లో 122 పరుగులు సాధించగా.. బవుమా 228 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి శతకాల వల్ల సౌతాఫ్రికా భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా శ్రీలంక ముందు 516 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.ఇదిలా ఉంటే.. టెస్టుల్లో తెంబా బవుమాకు ఇది మూడో సెంచరీ. అంతేకాదు ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం తద్వారా అతడు ఓ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకపై సెంచరీ చేసిన సౌతాఫ్రికా మూడో కెప్టెన్‌గా నిలిచాడు. బవుమా కంటే ముందు షాన్ పొలాక్, హషీం ఆమ్లా మాత్రమే సారథి హోదాలో లంకపై శతకం సాధించారు.శ్రీలంకతో మ్యాచ్‌లో శతక్కొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్లు👉షాన్ పొలాక్- సెంచూరియన్- 2001- 111 పరుగులు👉హషీం ఆమ్లా- కొలంబో- 2014- 139 పరుగులు(నాటౌట్)👉తెంబా బవుమా- డర్బన్- 113 పరుగులు.చదవండి: ‘అతడిని లారా, సచిన్ అంటూ ఆకాశానికెత్తారు.. ఇలాంటి షాక్ తగిలితేనైనా.. కాస్త’ -
సౌతాఫ్రికా ప్లేయర్ వరల్డ్ రికార్డు.. 120 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
డర్బన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సంచలన బౌలింగ్‌తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి లంకేయులు విల్లవిల్లాడారు.తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జాన్సెన్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా పర్యాటక లంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌటైంది.చరిత్ర సృష్టించిన జాన్సెన్...ఇక సంచలన ప్రదర్శన చేసిన జాన్సెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 7 వికెట్ల ఘనత సాధించిన ఆసీస్ దిగ్గజం హ్యూ ట్రంబుల్ రికార్డును జాన్సెన్ సమం చేశాడు. మార్కో జాన్సెన్ 6.5 ఓవర్ల(41 బంతులు)లో ఈ ఫీట్ సాధించగా.. హ్యూ ట్రంబుల్ కూడా సరిగ్గా 6.5 ఓవర్ల(41 బంతులు)లోనే ఈ రికార్డును నమోదు చేశాడు.1902లో ఇంగ్లండ్‌పై హ్యూ ట్రంబుల్ ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇప్పుడు 120 ఏళ్ల తర్వాత జాన్సెన్ ఈ రేట్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దిరి తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా లెజెండ్ మాంటీ నోబెల్ ఉన్నారు. నోబెల్ ఈ రికార్డును 7.4 ఓవర్లలో క్రియేట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ప్రోటీస్ ప్రస్తుతం 406 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా?