Ravindra Jadeja
-
జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్ ఇవ్వాల్సింది: ఆకాష్ చోప్రా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చానీయంశమైంది. అతడి స్ధానంలో యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.దీంతో సెలక్టర్ల నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. జడేజా స్ధానంలో సిరాజ్‌కు ఛాన్స్ ఇచ్చి ఉంటే జట్టు బౌలింగ్ యూనిట్ బలంగా ఉండేది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన బలమైన పేస్ బౌలింగ్ ఎటాక్‌ను కలిగింది. అయినప్పటికి గత రెండేళ్ల నుంచి వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత 43 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 24.04 యావరేజ్‌తో 71 వికెట్లు తీశాడు మహ్మద్ సిరాజ్. 5.18 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. కొన్నాళ్లపాటు వన్డే నెం1 బౌలర్‌గా కూడా సిరాజ్ కొనసాగాడు."చాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టులో మహ్మద్ సిరాజ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా రూపంలో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. వారిలో ఒకరిని పక్కన పెట్టాల్సింది. నా వరకు అయితే రవీంద్ర జడేజా స్ధానంలో సిరాజ్‌ను ఎంపిక చేయాల్సింది. సిరాజ్ జట్టులో ఉండి ఉంటే కొత్త బంతితో అద్బుతంగా బౌలింగ్ చేసేవాడు. నిజం చెప్పాలంటే జడేజాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. అటువంటి అతడిని ఎంపిక చేయడం ఎటువంటి లాభం ఉండదు. అదే సిరాజ్‌ను తీసుకుని ఉంటే ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారేవాడు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ఛాన్స్: సిరాజ్ కీలక నిర్ణయం!? -
రంజీ బాటలో జడేజా
న్యూఢిల్లీ: జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... దేశవాళీల్లో తప్పక ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన హెచ్చరికలు ఫలితాన్నిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ షెడ్యూల్ లేని సమయంలో కూడా దేశవాళీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు... రంజీ ట్రోఫీలో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేయగా... ఇప్పుడు ఆ జాబితాలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు. చివరిసారిగా రెండేళ్ల క్రితం సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా... ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఆదివారం రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర జట్టు సభ్యులతో కలిసి జడేజా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ‘జడేజా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడు’ అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయ్‌దేవ్ షా తెలిపారు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్... చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని వెల్లడించగా... రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తమ తమ జట్ల తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడనున్నారు. దీంతో ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున రిషబ్ పంత్, సౌరాష్ట్ర తరఫున జడేజా ఆడనున్నారు. విదర్భతో పోరుకు సిరాజ్ భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్‌లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వర్గాలు వెల్లడించాయి. ‘వర్క్‌లోడ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో సిరాజ్ ఆడటం లేదు. విదర్భతో పోరులో మాత్రం అతడు జట్టులో ఉంటాడు’ అని ఓ హెచ్‌సీఏ అధికారి తెలిపారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడనే నమ్మకంతో సెలెక్టర్లు సిరాజ్‌ను కాదని అర్‡్షదీప్ సింగ్‌ను ఎంపిక చేశారు. -
రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే అవును అనే సమాధనమే ఎక్కువ విన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడిన టెస్టే తన చివరి మ్యాచ్, త్వరలోనే జడ్డూ రెడ్ బాల్ క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జడేజా పెట్టిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో మూడో ధరించిన జెర్సీ ఫొటోను ఈ సౌరాష్ట్ర క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం మరింత ఊపందుకుంది.ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా క్రికెటర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు.అదే విధంగా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 80 టెస్ట్‌లు ఆడిన జడేజా 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టాడు. కాగా సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సిరీస్ మధ్యలోనే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. వన్డేల్లో డౌటే..ఇక ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజా.. వన్డేల్లో ఆడేది కూడా అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల దృష్టా భారత వన్డే జట్టులో జడేజా చోటు ప్రశ్నర్ధాకంగా మారింది. జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్‌తో వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీకి అతడి స్దానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పేర్లను సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకున్నారు. ఇంగ్లీష్ జట్టుతో సిరీస్‌కు, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఒకవేళ ఈ జట్టులో జడ్డూ చోటు దక్కకపోతే పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 197 వన్డేలు ఆడిన జడేజా 2756 పరుగులతో పాటు 220 వికెట్లు తీసుకున్నాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్.. -
గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించలేదు. తొలిరోజు అద్భుత ఆట తీరు కనబరిచిన ఆతిథ్య ఆసీస్ పైచేయి సాధించింది. ఆది నుంచి భారత జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడానికి టీమిండియా బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది.భారత బౌలర్ల సహనానికి పరీక్షముఖ్యంగా అరంగేట్ర ఓపెనర్, 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కొరకరాని కొయ్యగా మారి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ అనుభవజ్ఞుడిలా దూకుడు ప్రదర్శించాడు. అయితే, ఎట్టకేలకు రవీంద్ర జడేజా కొన్‌స్టాస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) కూడా అర్ధ శతకాలతో రాణించగా.. ట్రవిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(4) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(31) కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక స్టీవ్ స్మిత్ సైతం బ్యాట్ ఝులిపించాడు. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి స్మిత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు.సహనం కోల్పోయిన రోహిత్ఈ నేపథ్యంలో చిరాకెత్తిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మైదానంలోనే చాలాసార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ విషయంలో నిర్లక్ష్యంగా కనిపించిన యశస్వి జైస్వాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డూ బౌలింగ్‌లో స్మిత్ డిఫెన్సివ్ షాట్ ఆడగా.. సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్(Yashasvi Jaiswal) బంతిని ఆపాల్సింది పోయి.. జంప్ చేశాడు.ఏయ్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?అంతేకాదు.. అక్కడి నుంచి కొంచెం కూడా కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. ఇక జడ్డూ అప్పటికే బంతిని ఆపేందుకు పరుగెత్తాడు. ఈ ఘటన నేపథ్యంలో అసహనానికి గురైన రోహిత్ శర్మ.. ‘‘ఏయ్ జైసూ.. ఇక్కడ ఏమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బ్యాటర్ బంతిని టచ్ చేసేంత వరకు నీ పొజిషన్లోనే ఉండు. కింద కూర్చున్నట్లుగానే ఉండు. అంతేగానీ.. నిలబడేందుకు ప్రయత్నించకు’’ అంటూ చివాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.తొలిరోజు కంగారూలదేకాగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మొదటిరోజే మెరుగైన స్కోరు సాధించింది. బాక్సింగ్ డే(క్రిస్మస్ తెల్లవారి) మ్యాచ్‌లో టాపార్డర్ దంచికొట్టడంతో మూడు వందల పైచిలుకు స్కోరు సాధించింది. 86 ఓవర్ల ఆటలో ఆరు వికెట్లు నష్టపోయి 311 రన్స్ చేసింది. ఇక స్టీవ్ స్మిత్ 68, ప్యాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి: IND vs AUS: బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియోStump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a— Star Sports (@StarSportsIndia) December 26, 2024 -
ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో శనివారం ప్రాక్టీస్ అనంతరం టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.మెల్బోర్న్ టెస్టులో భారత టాపార్డర్నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నట్లు జడేజా అన్నాడు. ఆరంభంలో పరుగులు రాకపోతే ఆ తర్వాత ఒత్తిడి పెరిగిపోతుందని అతను అభిప్రాయ పడ్డాడు.‘ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలాంటి చోట టాపార్డర్ పరుగులు కీలకంగా మారతాయి. వారు పరుగులు చేయకపోతే లోయర్ ఆర్డర్‌పై చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ టెస్టులో అలా జరగదని ఆశిస్తున్నా. జట్టుగా చూస్తే బ్యాటింగ్‌లో అందరూ రాణిస్తేనే భారీ స్కోరుకు అవకాశం ఉన్నా టాపార్డర్, మిడిలార్డర్ పరుగులు ప్రధానం’ అని జడేజా వ్యాఖ్యానించాడు.గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జడేజా... ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన దగ్గరినుంచి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూ సాధన చేసినట్లు వెల్లడించాడు.‘మూడు టెస్టుల తర్వాత 1–1తో సమంగా ముందుకు వెళ్లడం మంచి స్థితిగా భావిస్తున్నా. తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతాయి. మేం ఒకటి గెలిచినా చాలు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటాం. ఇందులో సత్తా చాటితే చివరి టెస్టు గురించి ఆలోచన లేకుండా ఫలితం సాధించవచ్చు. గత పర్యాయాలు ఇక్కడ భారత్ సిరీస్ గెలిచింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశాము" అని జడ్డూ పేర్కొన్నాడు. -
IND vs AUS 3rd Test: ఫాలో ఆన్ గండం గట్టెక్కిన భారత్
IND vs AUS 3rd Test Day 4 live updates and highlights: బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.ఫాలో ఆన్ గండం గట్టెక్కిన భారత్బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. టెయిలాండర్లు ఆకాష్ దీప్(27 బ్యాటింగ్), జస్ప్రీత్ బుమ్రా(10 బ్యాటింగ్) అద్బుతమైన పోరాటంతో భారత్‌ను మ్యాచ్‌లో నిలిపారు. పదో వికెట్‌కు వీరిద్దరూ 39 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వెలుతురు లేమి కారణంగా నాలుగో రోజు ఆటను 14 ఓవర్ల ముందే అంపైర్లు నిలిపేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులుచేసింది. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులు వెనకంజలో ఉంది. భారత ఫాలో ఆన్ తప్పించుకోవడంలో వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్(84), జడేజా(10) కీలక పాత్ర పోషించారు.జడ్డూ అవుట్కేఎల్ రాహుల్(84) మినహా స్పెషలిస్టు బ్యాటర్లంతా విఫలమైన వేళ టీమిండియాను ఆదుకున్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌కు తెరపడింది. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి జడ్డూ వెనుదిరిగాడు. దీంతో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా స్కోరు: 215/9 (66.2). ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 30 రన్స్ చేయాలి.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్సిరాజ్ (1) రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి సిరాజ్ పెవిలియన్ చేరాడు. బుమ్రాక్రీజులోకి వచ్చాడు.భారత్ ఏడో వికెట్ డౌన్‌నితీశ్ రెడ్డి రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన నితీశ్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 52 పరుగులు కావాలి. ప్రస్తుతం భారత్ స్కోర్: 194/710:45 AM: మొదలైన ఆటవర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.09:53 AM: వర్షం వల్ల మరోసారి ఆగిన ఆటటీమిండియా స్కోరు: 180/6 (51.5)జడేజా 52, నితీశ్ రెడ్డి 9 పరుగులతో ఉన్నారు జడేజా హాఫ్ సెంచరీ..బ్రిస్బేన్ టెస్టులో రవీంద్ర జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(50)తో పాటు నితీశ్(8) పరుగులతో ఉన్నారు.వరుణుడు ఎంట్రీ.. నిలిచిన పోయిన ఆటబ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట నిలిచిపోయింది. లంచ్ విరామం తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో ఆట ఇంకా ప్రారంభం కాలేదు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్‌కు భారత్ స్కోర్: 167/6లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫాల్ ఆన్ గండం దాటాలంటే భారత్ ఇంకా 79 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా(41), నితీశ్ కుమార్(7) పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్ ఔట్..కేఎల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 84 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. నాథన్ లియోన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు.సెంచరీ దిశగా కేఎల్ రాహుల్..42 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(26) నిలకడగా ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న రాహుల్, జడేజా..34 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(76), రవీంద్ర జడేజా(10) నిలకడగా ఆడుతున్నారు. భారత్ ఇంకా 328 పరుగులు వెనకబడి ఉంది.రోహిత్ శర్మ ఔట్...నాలుగో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(10) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు.మూడో రోజు ఆట ఆరంభం..బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(34), రోహిత్ శర్మ(0) ఉన్నారు. -
సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!.. నీకు ఎందుకంత దూకుడు?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు బ్రిస్బేన్‌లో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మూడో టెస్టు సందర్భంగా ఈ హైదరాబాదీ బౌలర్‌ను ఆస్ట్రేలియా అభిమానులు పరుష పదజాలం వాడుతూ హేళన చేశారు. అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో ట్రవిస్ హెడ్‌కు సిరాజ్ సెండాఫ్ ఇచ్చిన తీరును విమర్శిస్తూ.. అవమానించేలా గట్టిగా అరిచారు.ఆస్ట్రేలియా- భారత్ మధ్య శనివారం గబ్బా మైదానంలో మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా సిరాజ్‌ను కించపరిచేలా ఆసీస్ ఫ్యాన్స్ ప్రవర్తించారు. తాజాగా ఆదివారం నాటి రెండో రోజు ఆటలోనూ సిరాజ్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా.. ఈ స్పీడ్‌స్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి.ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల శనివారం నాటి తొలిరోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆసీస్.. 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.బుమ్రాకు ఐదుఈ క్రమంలో ఆదివారం రెండో రోజు ఆట మాత్రం సజావుగా సాగింది. ట్రవిస్ హెడ్ భారీ శతకం(152), స్టీవ్ స్మిత్(101) సెంచరీ కారణంగా ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లు నష్టపోయి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.జడ్డూ కోపానికి కారణం అదేఇక మూడో టెస్టుతో భారత తుదిజట్టులోకి వచ్చిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఆదివారం బంతితో బరిలో దిగాడు. పదహారు ఓవర్ల పాటు బౌల్ చేసి 76 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, లంచ్ తర్వాత తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డర్ సిరాజ్ వ్యవహరించిన తీరు జడ్డూ కోపం తెప్పించింది.జడేజా బౌలింగ్‌లో ట్రవిస్ హెడ్ ఆఫ్‌సైడ్ దిశగా బంతిని తరలించి.. సింగిల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో బాల్‌ను అందుకున్న సిరాజ్ కాస్త నిర్లక్ష్య రీతిలో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసిరినట్లు కనిపించింది. హెడ్ తలమీదుగా వచ్చిన ఆ బంతిని అందుకునే క్రమంలో జడ్డూ చేతి వేళ్లకు బలంగా తగిలింది.దీంతో జడేజా కోపంతో సిరాజ్ వైపు చూస్తూ ఏదో అన్నట్లుగా కనిపించింది. అంత దూకుడు అవసరమా అన్నట్లు అసహనం ప్రదర్శించాడు. ఇందుకు చిన్నబుచ్చుకున్న సిరాజ్.. సారీ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.నా వేలును విరగ్గొట్టేశావు పో..ఈ నేపథ్యంలో కామెంటేటర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ స్పందిస్తూ.. సిరాజ్ అత్యుత్సాహం జడేజాతో మాటల యుద్ధానికి దారి తీసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిజానికి జడ్డూ చేసింది సరైందేనని.. ‘‘నా వేలును విరగ్గొట్టేశావు పో.. ఏంటిది ఫ్రెండ్.. కాస్త సంయమనం పాటించు’’ అన్నట్లుగా అతడు లుక్ ఇచ్చాడని నికోలస్ పేర్కొన్నాడు.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రpic.twitter.com/iJC2zadOh7— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024pic.twitter.com/oCw1kXmsYl— The Game Changer (@TheGame_26) December 15, 2024 -
వారిద్దరూ చాలా సీనియర్ ఆటగాళ్లు.. కానీ పక్కన పెట్టాల్సి వచ్చింది: రోహిత్
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టుకు సమయం అసన్నమైంది. శుక్రవారం(డిసెంబర్ 6) నుంచి ఆడిలైడ్ ఓవల్ వేదికగా ఈ డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి.ఈ అడిలైడ్ టెస్టులో ఎలాగైనా గెలిచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆతిథ్య ఆసీస్ భావిస్తుంటే.. భారత్ మాత్రం తమ జోరును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా స్టార్ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో చోటుపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.జడ్డూ, అశ్విన్ ఇద్దరూ చాలా సీనియర్ ప్లేయర్లు అని, వారిద్దరూ ఈ సిరీస్‌లో భారత్‌కు కీలకంగా మారనున్నారని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఈ కానీ ఈ స్పిన్ దయం రెండో టెస్టులో ఆడుతారా లేదా అన్నది భారత కెప్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వీరిద్దిరికి తుది జట్టులో చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. భారత్ కేవలం ఒక స్పిన్నర్‌తో ఆడింది. ఈ క్రమంలో రెండో టెస్టుకు ఈ స్పిన్ మాంత్రకులకు చోటు లభిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ రోహిత్ వ్యాఖ్యలు చూస్తుంటే రెండో టెస్టుకూ వీరిద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి."అశ్విన్, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు తుది జట్టులో చోటు ఇవ్వకుండా వదిలివేయడం ఎల్లప్పుడూ కష్టమే. కానీ కొన్ని సమయాల్లో జట్టుకు ఏదో ఉత్తమమో అదే చేయాలి. అందుకే వారికి తొలి టెస్టులో ఆడే అవకాశం లభించలేదు.కానీ ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో వారిద్దరూ భారత్‌కు కీలకంగా మారుతారని భావిస్తున్నాను అని రోహిత్ పేర్కొన్నాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఓపెననర్గానే కొనసాగనున్నాడని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో టీమిండియా ఇద్దరు స్ట్రయిట్ స్పిన్నర్లు లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి అనుభవజ్ఞులను పక్కన పెట్టి అంతంతమాత్రం అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. మ్యాచ్ ముందు వరకు ఆ ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అని అంతా అనుకున్నారు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ ఆఖరి నిమిషంలో సుందర్వైపు మొగ్గు చూపింది. అశ్విన్‌తో పోలిస్తే సుందర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడన్న కారణంగా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడమైంది. మరి టీమిండియా అవళభించిన ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా లేక బెడిసికొడుతుందా అన్నది వేచి చూడాలి.ఎందుకంటే అశ్విన్, జడేజా ఇద్దరికి కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ సుందర్‌నే ఎంచుకుని పెద్ద సాహసమే చేసింది. ఇటీవలికాలంలో అశ్విన్, జడేజా లేకుండా టీమిండియా బరిలోకి దిగిందే లేదు. వీరిద్దరు లేకుండా 2021 గబ్బా టెస్ట్‌లో భారత్ చివరిసారిగా బరిలోకి దిగింది.మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఒకరు నితీశ్ కుమార్ రెడ్డి కాగా.. రెండో ఆటగాడు హర్షిత్ రాణా. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. హర్షిత్ రాణా రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పెర్త్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించనుండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగింది. బుమ్రా భారత పేస్ అటాక్‌ను లీడ్ చేయనుండగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ మరో ఇద్దరు పేసర్లుగా ఉన్నారు. నితీశ్ కుమార్ నాలుగో పేస్ బౌలింగ్ ఆప్షన్‌గా ఉంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. జైస్వాల్‌ను స్టార్క్ పెవిలియన్‌కు పంపగా.. పడిక్కల్‌ను హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. 14 ఓవర్ల అనంతరం భారత స్కోర్ 20/2గా ఉంది. కేఎల్ రాహుల్ (14), విరాట్ కోహ్లి (0) క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. జడేజాకు నో ప్లేస్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తుది జట్టు కూర్పు సమస్యగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం.. శుభ్‌మన్ గిల్ గాయపడటంతో టీమిండియా ప్రత్యామ్నాయ ఆటగాళ్లను వెతుక్కునే పనిలో పడింది.రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్న టీమిండియా మేనేజ్మెంట్.. శుభ్‌మన్ గిల్ స్థానంలో (వన్‌డౌన్‌లో) ఎవరిని ఆడించాలో అర్దం కాక తలలు పట్టుకుని కూర్చుంది. జట్టులో లేని దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడించాలని కొందరంటుంటే.. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని మరికొందరంటున్నారు. మొత్తానికి ఎలా చూసినా టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో విరాట్, రిషబ్ పంత్ మినహా పెద్ద అనుభవజ్ఞులు లేరు.ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగాలని భావిస్తుంది. స్పెషలిస్ట్ పేసర్ల కోటాలో బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ తుది జట్టులో చోటు దక్కించుకోనుండగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. పెర్త్ పిచ్ పేసర్లకు సహకరించనుండటంతో భారత్ తప్పకుండా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది.జడేజాకు నో ప్లేస్ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒకే ఒక స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టి అశ్విన్‌ను తుది జట్టులో ఆడించనుంది. ఆసీస్ జట్టులో ఎక్కువగా లెఫ్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో కోచ్ గంభీర్ సైతం ఇదే నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్ట్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా -
IND VS NZ 3rd Test: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్ర ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు నాలుగు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్‌లో ఇది జరిగింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా.. అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్ 3 వికెట్లతో తీశాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(64) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
చరిత్రకెక్కిన జడేజా.. రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
-
ముంబై టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సత్తాచాటిన భారత స్పిన్నర్లు.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదరగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలానికి బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ చెరో మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు పేసర్ ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. ప్రస్తుతం క్రీజులో మాట్ హెన్రీ(10), ఓ రూర్కే ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(51) హాఫ్ సెంచరీ సాధించాడు.263కు భారత్ ఆలౌట్..అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్(60) హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్ల ఘనత సాధించాడు. అతడితో పాటు హెన్రీ, ఫిలిప్స్, సోధీ ఒక్క వికెట్ సాధించారు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి -
పంత్ అవుట్.. గిల్ సెంచరీ మిస్.. భారత్ స్కోరెంతంటే?
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల వద్ద నిలిచింది. కాగా కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన ఇప్పటికే 0-2తో చేజార్చుకుంది.ఈ క్రమంలో ముంబై వేదికగా శుక్రవారం మొదలైన మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలన్నా.. కివీస్ చేతిలో వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలన్నా భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.తొలిరోజు కివీస్ 235 పరుగులకు ఆలౌట్ ఇక వాంఖడే వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయగలిగింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు తొలి రోజే.. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.రోహిత్, కోహ్లి ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(18) మరోసారి విఫలమయ్యాడు. ఇక జైస్వాల్ వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లి(4) రనౌట్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు.గిల్‌కు టెస్టుల్లో ఏడో ఫిఫ్టీగిల్ 66 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఇష్ సోధి బౌలింగ్‌లో పంత్(60) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 𝐒𝐡𝐚𝐚𝐧𝐝𝐚𝐫 𝐉𝐚𝐛𝐚𝐫𝐝𝐚𝐬𝐭 𝐙𝐢𝐧𝐝𝐚𝐛𝐚𝐝 🙌 #INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #ShubmanGill pic.twitter.com/SujiHXhlOw— JioCinema (@JioCinema) November 2, 2024 ఇక శనివారం భోజన విరామ సమయానికి టీమిండియా 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే టీమిండియా ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది. గిల్ సెంచరీ మిస్‌అయితే, లంచ్ తర్వాత గిల్ 90 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుయ్యాడు. అంతకంటే ముందు రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్ ఖాన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది. 53.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 227 పరుగులు చేసింది.టీమిండియా-న్యూజిలాండ్ మూడో టెస్టుప్లేయింగ్ ఎలెవన్ టీమిండియారోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు? -
ఆసక్తికరంగా భారత-న్యూజిలాండ్‌ల మూడో టెస్టు.. పడగొట్టి... ఆపై తడబడి!
వాంఖెడే మైదానంలో తొలి రోజు 84.4 ఓవర్లు పడ్డాయి. 82.5 ఓవర్ల వరకు భారత్‌దే పైచేయి... కానీ తర్వాతి 8 బంతుల వ్యవధిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీమిండియా అనూహ్యంగా 3 వికెట్లు చేజార్చుకొని వెనుకంజ వేసింది. అప్పటి వరకు చక్కగా ఆడిన యశస్వి జైస్వాల్‌తో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి రనౌట్ ఇందులో ఉండగా, ఒక కీలక రివ్యూ కూడా కోల్పోవడంతో భారత్ నిరాశగా ఆటను ముగించింది. అంతకుముందు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ధాటికి 235 పరుగులకే పరిమితమై నిరాశ చెందిన న్యూజిలాండ్ ఆ తర్వాత 4 వికెట్లు కూడా పడగొట్టి పైచేయి సాధించింది. రెండో రోజు మన బ్యాటర్లు ఎంత వరకు స్కోరును తీసుకెళ్లి ఆధిక్యం అందించగలరనే అంశంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. బౌలర్లు తొలి రోజు నేలకూల్చిన 14 వికెట్లు మ్యాచ్‌లో తర్వాతి రోజులు ఎలా సాగనున్నాయనే దానికి సంకేతంగా నిలిచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. డరైల్ మిచెల్ (129 బంతుల్లో 82; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ యంగ్ (138 బంతుల్లో 71; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (5/65) ఐదు వికెట్లతో సత్తా చాటగా... వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ మరో 149 పరుగులు వెనుకబడి ఉంది. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్‌ను ఆడించగా... న్యూజిలాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్ హీరో సాంట్నర్ పక్కటెముకల గాయంతో టెస్టుకు దూరం కాగా... అతని స్థానంలో సోధి వచ్చాడు. పేసర్ టీమ్ సౌతీకి బదులుగా హెన్రీని కివీస్ ఎంచుకుంది. భారీ భాగస్వామ్యం... కివీస్ ఇన్నింగ్స్ మూడు భిన్న దశలుగా సాగింది. ఫామ్‌లో ఉన్న కాన్వే (4) ఆరంభంలోనే వెనుదిరగ్గా... కెపె్టన్ టామ్ లాథమ్ (44 బంతుల్లో 28; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే లాథమ్‌తో పాటు రచిన్ రవీంద్ర (5)లను సుందర్ క్లీన్»ౌల్డ్ చేయడంతో 72/3 వద్ద కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్, మిచెల్ భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వీరిద్దరు తర్వాతి 25 ఓవర్ల పాటు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 87 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యంతో స్కోరును 159/3 వరకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే ఆట మళ్లీ మలుపు తిరిగింది. జడేజా వేసిన ఈ ఓవర్లో యంగ్, బ్లన్‌డెల్ (0) వెనుదిరిగారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు వికెట్లు కూడా అతని ఖాతాలోనే చేరాయి. సుందర్ మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్ చొప్పున బాది జోరు ప్రదర్శించిన మిచెల్ ఎట్టకేలకు సుందర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరగా... మరో మూడు బంతుల తర్వాత కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి రనౌట్... రోహిత్ శర్మ (18) ఎప్పటిలాగే ధాటిగా మొదలు పెట్టినా, మరోసారి అతను తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 30; 4 ఫోర్లు), గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. 6 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ బ్లన్‌డెల్ అందుకోలేకపోయాడు. వీరిద్దరి భాగస్వామ్యం 53 పరుగులకు చేరింది. మరో రెండు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో అంతా మారిపోయింది. ఎజాజ్ బౌలింగ్‌లో అనవసరపు రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి జైస్వాల్ బౌల్డ్ కాగా... నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన సిరాజ్ (0) తర్వాతి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. అయితే దీనికి కూడా అతని ‘రివ్యూ’ తీసుకొని దానిని వృథా చేశాడు! భారత్‌కు మరో షాక్ చివరి ఓవర్లో తగిలింది. డిఫెన్స్ ఆడి రోజును ముగించాల్సిన సమయంలో కోహ్లి (4) సాహసం చేశాడు. రచిన్ బౌలింగ్‌లో మిడాన్ దిశగా ఆడిన అతను అతి విశ్వాసంతో సింగిల్‌కు ప్రయత్నించాడు. హెన్రీ డైరెక్ట్ త్రో వికెట్లను పడగొట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి) సుందర్ 28; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 4; యంగ్ (సి) రోహిత్ (బి) జడేజా 71; రచిన్ (బి) సుందర్ 5; మిచెల్ (సి) రోహిత్ (బి) సుందర్ 82; బ్లన్‌డెల్ (బి) జడేజా 0; ఫిలిప్స్ (బి) జడేజా 17; సోధి (ఎల్బీ) (బి) జడేజా 7; హెన్రీ (బి) జడేజా 0; ఎజాజ్ (ఎల్బీ) (బి) సుందర్ 7; రూర్కే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (65.4 ఓవర్లలో ఆలౌట్) 235. వికెట్ల పతనం: 1–15, 2–59, 3–72, 4–159, 5–159, 6–187, 7–210, 8–210, 9–228, 10–235. బౌలింగ్: సిరాజ్ 6–0–16–0, ఆకాశ్‌దీప్ 5–0–22–1, అశ్విన్ 14–0–47–0, వాషింగ్టన్ సుందర్ 18.4–2– 81–4, జడేజా 22–1–65–5. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (బ్యాటింగ్) 31; సిరాజ్ (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; కోహ్లి (రనౌట్) 4; పంత్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 86. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84. బౌలింగ్: హెన్రీ 5–1–15–1, రూర్కే 2–1–5–0, ఎజాజ్ 7–1–33–2, ఫిలిప్స్ 4–0–25–0, రచిన్ 1–0–8–0. -
జడేజా సూపర్ డెలివరీ.. కివీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో కలిపి ఆరు వికెట్లే తీసిన జడ్డూ.. మూడో టెస్టులో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముంబై మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.క్రీజులో పాతుకుపోయిన న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్(71)ను అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపిన జడ్డూ.. టామ్ బ్లండెల్(0), గ్లెన్ ఫిలిప్స్(17)ల వికెట్లు కూడా తానే దక్కించుకున్నాడు. అదే విధంగా టెయిలెండర్లు ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0)లను అవుట్ చేసి ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేసుకున్నాడు.అయితే, వీరందరిలోకెల్లా బ్లండెల్‌ను జడేజా అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్‌ను జడ్డూ వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతికి విల్ యంగ్‌ను పెవిలియన్‌కు పంపిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఐదో బంతిని అద్భుత రీతిలో సంధించాడు.ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్లండెల్ జడేజా సూపర్ డెలివరీకి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో జడ్డూ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌తో డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించి బ్లండెల్ విఫలమయ్యాడు. రెప్పపాటులో బంతి స్టంప్‌ను ఎగురగొట్టడంతో బిక్కముఖం వేశాడు. నిజానికి బ్లండెల్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా ఇలాగే జరిగేది.. జడ్డూ వేసిన బంతి అలాంటిది మరి! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కివీస్‌తో బెంగళూరు, పుణెలలో జరిగిన టెస్టుల్లో జడ్డూ మూడేసి వికెట్లు తీశాడు. ఇక ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ముంబైలో జరుగుతున్న తాజా టెస్టులో గెలిస్తేనే క్లీన్‌స్వీప్ పరాభవం నుంచి తప్పించుకోవడంతో పాటు.. రోహిత్ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్ లైన్ ఈజీగా క్లియర్ అవుతుంది.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు కట్టడి చేసింది. తొలిరోజే న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జడేజాకు ఐదు, వాషింగ్టన్ సుందర్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే, బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(18), యశస్వి జైస్వాల్(30) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరగా.. నాలుగో స్థానంలో వచ్చిన పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లి(4) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 19 ఓవర్లలో 86 పరుగులు చేసిన టీమిండియా.. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.చదవండి: IND A vs AUS A: సెంచరీకి చేరువైన సాయి సుదర్శన్Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 -
టీమిండియా స్పిన్నర్ల ప్రతాపం.. తొలిరోజే కివీస్ ఆలౌట్
న్యూజిలాండ్‌తో మూడో టెస్టును టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలిరోజే కివీస్‌ను ఆలౌట్ చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. అయితే, బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. పుణె మ్యాచ్‌లోనూ ఘోర పరాభవం పాలైంది. కివీస్ చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయితద్వారా సొంతగడ్డపై పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సాఫీగా చేరాలన్నా.. వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకోవాలన్నా ఈ మ్యాచ్‌లో గెలవడం రోహిత్ సేనకు అత్యంత ముఖ్యం. లంచ్‌కు ముందు ఇలాఈ నేపథ్యంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటింగ్ మొదలుపెట్టిన కాసేపటికే ప్రమాదకర ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందించగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్నాడు.జడేజా విశ్వరూపంలంచ్ బ్రేక్‌కు ముందు వీరిద్దరు కలిసి మూడు వికెట్లు తీయగా.. భోజన విరామం సమయం తర్వాత మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. విల్ యంగ్(71) రూపంలో తొలి వికెట్ దక్కించుకన్న జడ్డూ.. ఆ తర్వాత టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ల పనిపట్టాడు.Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 అదే విధంగా ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. వాషీ డారిల్ మిచెల్(82), అజాజ్ పటేల్(7)లను కూడా అవుట్ చేసి మొత్తంగా తన వికెట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) మినహా భారత స్పిన్నర్ల ప్రతాపం ముందు కివీస్ బ్యాటర్లంతా తలవంచారు. దీంతో 65.4 ఓవర్లలో న్యూజిలాండ్ 235 పరుగులు(తొలి ఇన్నింగ్స్) చేసి తొలిరోజే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడ్డూ ఐదు, వాషీ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాకూ ఆదిలోనే ఎదురుదెబ్బఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దూకుడుగా ఆడిన రోహిత్ 18 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్.చదవండి: చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు -
చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను జడ్డూ అధిగమించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.ముంబై వేదికగా మూడో టెస్టు ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెంగళూరు, పుణె వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ముంబై వేదికగా శుక్రవారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇప్పటికే భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్ బృందం విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆకాశ్ దీప్ శుభారంభం.. అదరగొట్టిన వాషీస్పిన్కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ప్రభావం చూపుతున్నారు. ఆట తొలిరోజు భోజన విరామ సమయానికి ముందు వాషీ.. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. మరోవైపు.. పేసర్ ఆకాశ్ దీప్ డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు.లంచ్ తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టిన జడ్డూఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అయితే, భోజన విరామం తర్వాత జడ్డూ తన బౌలింగ్ పదునుపెంచాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న విల్ యంగ్(71)ను తొలుత పెవిలియన్‌కు పంపిన జడేజా.. అనంతరం టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ను అవుట్ చేశాడు. తద్వారా జడ్డూ టెస్టుల్లో 312 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.టీ బ్రేక్ సమయానికి కివీస్స్కోరు ఎంతంటే?ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను జడ్డూ అధిగమించాడు. వీరిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ టాప్-5లో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు1. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- 619 వికెట్లు2. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- 533 వికెట్లు3. కపిల్ దేవ్(పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్)- 434 వికెట్లు4. హర్భజన్ సింగ్(స్పిన్నర్)- 417 వికెట్లు5. రవీంద్ర జడేజా(స్పిన్నర్)- 312 వికెట్లు.చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..! -
IPL 2025: సీఎస్కే సంచలన నిర్ణయం!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను వేలంలోకి విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని నిశ్చయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆ ముగ్గురిని రిటైన్ చేసుకుని...కాగా తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంఛైజీలకు గురువారం వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అట్టిపెట్టుకోనుందట.ధోని వారసుడి కోసంఅయితే, లెజెండరీ వికెట్ కీపర్ ధోనికి సరైన వారసుడిని ఎంపిక చేసే క్రమంలో జడేజా విషయంలో రిస్క్ తీసుకునేందుకు సీఎస్కే సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రిషభ్ పంత్ తెగదెంపులు చేసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. అతడు వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే ఎలా?ఒకవేళ అదే జరిగితే పంత్ భారీ ధర పలకడం ఖాయం. అతడి ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నల నేపథ్యంలో సీఎస్కే తన రిటెన్షన్ లిస్టు మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పంత్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన సీఎస్కే.. రవీంద్ర జడేజాను వేలంలోకి వదిలి.. రైట్ టు మ్యాచ్(RTM) కార్డు ద్వారా అతడిని మళ్లీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.వరల్డ్ కప్ విన్నర్.. కానీకాగా జడ్డూ ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అంతేకాదు ఇటీవలి కాలంలో అతడి టీ20 గణాంకాలు ముఖ్యంగా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో జడ్డూను విడిచిపెట్టినా.. మళ్లీ ఆర్టీఎమ్ కార్డుతో కొనవచ్చని సీఎస్కే భావిస్తోందట.అంటే.. జడ్డూకి డిమాండ్ లేకపోతే.. వేరే ఫ్రాంఛైజీ అతడిని తక్కువ ధరకు కొన్నట్లయితే.. అంతే మొత్తం చెల్లించి అతడిని తిరిగి తాము సొంతం చేసుకునేందుకు ఆర్టీఎమ్ కార్డును వాడుకోనుందన్న మాట. అలా కాకుండా ఒకవేళ జడ్డూను రిటైన్ చేసుకుంటే అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.అందుకే రిలీజ్ చేయాలనే యోచనలోఅలా అయితే, వేలంలో పంత్‌ను కొనుక్కునేందుకు తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అందుకే పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని సీఎస్కే నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమ రిటెన్షన్‌లో భాగంగా రుతుకు రూ. 18 కోట్లు, పతిరణకు రూ. 14 కోట్లు, ధోనికి రూ. 4 కోట్లు చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుందట!! కెప్టెన్‌గా నియమించినా..కాగా జడ్డూకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. జట్టును చాంపియన్‌గా నిలపడంలో అతడి పాత్ర కీలకం. కాగా 2012లో జట్టులో చేరిన జడ్డూ.. తర్వాత గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. అనంతరం మళ్లీ 2018లో చెన్నైతో జట్టు కట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటికీ అదే టీమ్‌లో ఉన్నాడు. అయితే, 2022లో కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో జడ్డూ 240 మ్యాచ్‌లు ఆడి 2959 రన్స్ చేయడంతో పాటు 160 వికెట్లు తీశాడు.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం -
IND VS NZ 2nd Test: ధోని తరహాలో రనౌట్ చేసిన జడ్డూ
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని తరహాలో ఓ రనౌట్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ బంతిని నాన్ స్టయికర్ వైపు విసిరాడు. వికెట్ల వద్ద బాల్‌ను కలెక్ట్ చేసుకున్న జడేజా చూడకుండా బంతిని వికెట్లపైకి విసిరాడు. ఈ లోపు నాన్ స్ట్రయికర్ వైపు పరుగు తీస్తున్న విలియమ్ ఓరూర్కీ క్రీజ్‌ను చేరుకోలేకపోయాడు. జడేజా డౌట్ ఫుల్‌గా అప్పీల్ చేయగా.. రీప్లేలో అది ఔట్‌గా తేలింది. గతంలో ధోని చాలా సార్లు ఇలా ఫీల్డర్లు విసిరిన బంతిని చూడకుండానే వికెట్లపైకి నెట్టి రనౌట్స్ చేశాడు. జడ్డూ రనౌట్ చేసిన విధానాన్ని చూసిన నెటిజన్లు ధోని శిష్యుడివి అనిపించుకున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.The Thala effect in Ravindra Jadeja's run out. 😄pic.twitter.com/tBoXdr27O6— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2024కాగా, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ టీమిండియా ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో నెగ్గిన విషయం తెలిసిందే. -
IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) రిటెన్షన్స్‌కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.కాగా ఐపీఎల్ పాలక మండలి రిటెన్షన్ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్టీఎమ్) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్ స్లాబ్‌లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్‌కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్క్యాప్డ్) చెల్లించాల్సి ఉంటుంది.సీఎస్కే రిటైన్ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లుఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్కే తమ టాప్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్క్యాప్డ్ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.సీఎస్కే అంటే ధోనినిజానికి ధోని అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోని. ధోని బ్రాండ్ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.PC: BCCIఇద్దరు శిష్యులుచెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ 2019లో సీఎస్కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్‌క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్కే పగ్గాలు చేపట్టాడు.ఇక రవీంద్ర జడేజాకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన
న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. కివీస్‌తో పుణె, ముంబై మ్యాచ్‌లకు అతడిని ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు(462) చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి పిలిపించడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు టెస్టులో విఫలమైన రవీంద్ర జడేజా నేపథ్యంలో ఈ తమిళనాడు క్రికెటర్‌పై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భారీ సెంచరీతో మెరిసిన వాషీకాగా రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా తమిళనాడు తరఫున వాషింగ్టన్ సుందర్ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ(269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్)తో సత్తా చాటాడు.తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు(674/6 డిక్లేర్డ్) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు మూడేళ్ల తర్వాత టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వాషింగ్టన్ సుందర్ 2021లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు.‘పెద్దోడి’కి తోడుగా చిన్నోడు!ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కివీస్‌తో సిరీస్‌లో చెన్నై దిగ్గజ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ‘పెద్దోడి’కి చిన్నోడు జతకావడం విశేషం. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 24- 28 వరకు పుణె వేదికగా రెండో టెస్టు, నవంబరు 1-5 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో రెండు, మూడో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్ 🚨 News 🚨Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBankDetails 🔽— BCCI (@BCCI) October 20, 2024 -
రాక్‌స్టార్ రవీంద్ర జడేజా
భారత క్రికెట్ జట్టులోకి తొలిసారి అడుగు పెట్టినప్పుడు రవీంద్ర జడేజా వయసు 21 ఏళ్లు. అతని ఆట మెరుగ్గానే ఉన్నా అతని వ్యవహారశైలిపై అందరికీ సందేహాలు ఉండేవి. ఐపీఎల్లో మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకొని జట్టులోకి వచ్చిన జడేజాలోని ‘యూత్’ లక్షణాలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా మందికి కొత్తగా అనిపించాయి. కానీ పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత అతను భారత అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కనిపించసాగాడు. ‘రాక్‌స్టార్’ అనే ముద్దు పేరుతో మొదలైన అతని ప్రస్థానం టీమిండియా అద్భుత విజయాలకు చుక్కానిగా నిలిచింది. కెరీర్ ఆరంభంలో వన్డే, టి20 ఆటగాడిగానే ముద్ర పడినా కఠోర శ్రమ, పట్టుదలతో ఎరుపు బంతిపై పట్టు సాధించిన జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్లో కూడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 92 ఏళ్ల చరిత్ర ఉన్న భారత టెస్టు క్రికెట్లో 300కు పైగా వికెట్లు తీసిన ఏడుగురు ఆటగాళ్లలో ఒకడిగా తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా 3 వేల పరుగులు సాధించి, 300 వికెట్లు తీసిన 11 మందిలో ఒకడిగా ఉన్నాడు. ప్రతికూలతలను అధిగమించి..సెంచరీ లేదా హాఫ్ సెంచరీ సాధించినప్పుడు కత్తిసాము తరహాలో తన బ్యాట్‌ను తిప్పుతూ జడేజా చేసే విన్యాసం భారత అభిమానులందరికీ సుపరిచితమే. రాజపుత్రుల కుటుంబానికి చెందిన అతను తన సంబరాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే పేరుకు అలాంటి నేపథ్యం ఉన్నా జడేజా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అవి అతనిలో పోరాట పటిమను పెంచి, మానసికంగా దృఢంగా మార్చాయి. అతి సాధారణ కుటుంబం అతనిది. వాచ్‌మన్‌గా పనిచేసే తండ్రి తన కుమారుడు తొందరగా ఆర్మీలో ఒక సిపాయి ఉద్యోగంలో చేరితే చాలు.. ఆర్థికంగా గట్టెక్కుతామనే ఆలోచనతో ఉండేవాడు. కానీ జడేజా మాత్రం భిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్లోనే ఏదైనా చేసి చూపిస్తాననే పట్టుదల కనబరచి తండ్రిని ఒప్పించగలిగాడు. అతనికి తల్లి కూడా మద్దతు పలికింది. అయితే ఆటలో జడేజా ఎదుగుతున్న సమయంలోనే ఒక ప్రమాదంలో తల్లి చనిపోయింది. అప్పుడు అతని వయసు 16 ఏళ్లు. ఆ బాధలో క్రికెట్‌కు గుడ్‌బై చెబుదామనుకున్నాడు. కానీ తండ్రి అండగా నిలవడంతో క్రికెట్‌పై మళ్లీ శ్రద్ధపెట్టాడు. దేశవాళీలో చెలరేగి..యూత్ క్రికెట్లో సౌరాష్ట్ర జట్టు తరఫున చెలరేగిన జడేజా ఆట అతనికి భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. 2006లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో భాగంగా ఉన్న జడేజా.. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో టైటిల్ నెగ్గిన టీమ్‌లో కీలక సభ్యుడిగా సత్తా చాటాడు. ఆరు మ్యాచ్‌లలో అతను తీసిన 10 వికెట్లు జట్టుకు విజయాలను అందించాయి. ఫలితంగా 2008లో జరిగిన తొలి ఐపీఎల్లో ప్రతిభ గల వర్ధమాన ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్ ఐపీఎల్ విజేతగా నిలవడంతో జడేజాకు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక్కడే షేన్‌వార్న్ అతనికి రాక్‌స్టార్ అంటూ పేరు పెట్టాడు. అయితే ఉడుకు రక్తం ఉప్పొంగే 20 ఏళ్ల వయసులో సరైన మార్గనిర్దేశనం లేకుండా అతను చేసిన తప్పుతో వివాదానికి కేంద్రంగా నిలిచాడు. ఒక జట్టుతో కాంట్రాక్ట్‌లో ఉండగానే ఎక్కువ మొత్తం కోసం మరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. దాంతో ఏడాది నిషేధం విధించడంతో 2009 ఐపీఎల్‌కు అతను దూరమయ్యాడు. ఐపీఎల్‌కు రెండు నెలల ముందే కేవలం ప్రతిభ కారణంగా భారత జట్టు తరఫున తొలి వన్డే, తొలి టి20 అవకాశం రావడం అతనికి కలిగిన ఊరట. అయితే ఆ నిషేధం వ్యక్తిగా కూడా అతను మెరుగుపడే అవకాశాన్నిచ్చింది. 2012 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చేరడం జడేజా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. చెన్నై టీమ్ మూల స్తంభాల్లో ఒకడిగా నిలిచాడు. టీమ్ తరఫున మూడు టైటిల్స్ విజయాల్లో భాగంగా ఉన్నాడు. దశాబ్దంన్నర కాలంలో భారత్ తరఫున ఆడిన 197 వన్డేలు, 74 టి20 మ్యాచ్‌లు పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని విలువను చూపించాయి. టెస్టుల్లో సూపర్ హీరోగా..వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు క్రికెట్లో జడేజా సాధించిన ఘనతలు అసాధారణమైనవి. రంజీ ట్రోఫీలో ఏకంగా మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా అతను రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లో అతనికి ముందు మరో ఏడుగురు మాత్రమే ఇలాంటి ఫీట్‌ను సాధించారు. ఆ జోరులో 2012లో జడేజా భారత టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. ఈ పుష్కర కాలంలో జడేజా ఒంటి చేత్తో జట్టుకు అందించిన విజయాలు ఎన్నో. తన లెఫ్టార్మ్ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేసి చకచకా వికెట్లు పడగొట్టడం.. లేదంటే లోయర్ ఆర్డర్లో తన బ్యాటింగ్‌తో కీలక పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించడం.. ఇలా ఏదో రూపంలో అతని భాగస్వామ్యం లేని టెస్టులు దాదాపుగా లేవంటే అతిశయోక్తి కాదు. జట్టులో మరో సహచరుడు, అగ్రశ్రేణి స్పిన్నర్‌గా అశ్విన్‌ను దాటి కూడా కొన్నిసార్లు ఏకైక స్పిన్నర్‌గా టీమ్‌లో అవకాశాన్ని దక్కించుకోగలిగాడంటే జడేజా సత్తాపై టీమ్ మేనేజ్మెంట్కున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాపై వరుసగా రెండు సిరీస్‌లలో 24, 25 చొప్పున, దక్షిణాఫ్రికాపై 23, ఇంగ్లండ్‌పై 26.. ఇలా సొంతగడ్డపై సిరీస్ ఏదైనా ప్రత్యర్థిని కుప్పకూల్చడం జడేజాకు మంచినీళ్లప్రాయంలా మారింది. అనిల్ కుంబ్లే (1993) తర్వాత ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా తొలి భారత బౌలర్‌గా జడేజా గుర్తింపు తెచ్చుకున్నాడు.∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
జడేజా మ్యాజిక్ డెలివరీ.. గ్లెన్ ఫిలిప్స్ మైండ్ బ్లాంక్(వీడియో)
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దుమ్ములేపుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగుల భారీ సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్లాక్ క్యాప్స్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర(134) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కాన్వే(91), టిమ్ సౌథీ(65) ఆర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు సిరాజ్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.జడ్డూ మ్యాజిక్..ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సంచలన బంతితో మెరిశాడు. కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను జడ్డూ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్. జడేజా అద్భుతమైన బంతితో ఫిలిప్స్‌ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్లో మూడో బంతిని మిడిల్ స్టంప్ దిశగా లెంగ్త్ డెలివరీని జడ్డూ సంధించాడు. ఆ బంతిని ఫిలిప్స్ బ్యాక్ ఫుట్ నుండి డిఫెన్సివ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌ను మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అది చూసిన ఫిలిప్స్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Phillips' bright start has a dim end thanks to Ravindra Jadeja 👌#IDFCFirstBankTestTrophy #JioCinemaSports #INDvNZ pic.twitter.com/sjjrzLnGxX— JioCinema (@JioCinema) October 18, 2024 -
IND vs NZ: కివీస్ 402 ఆలౌట్.. భారీ ఆధిక్యం
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా 180/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టింది కివీస్.రచిన్ రవీంద్ర సెంచరీమిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. టెయిలెండర్ టిమ్ సౌతీ అతడికి సహకారం అందించాడు. రచిన్ 157 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు.. సౌతీ 73 బంతుల్లో 65 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లలో మూడో రోజు గ్లెన్ ఫిలిప్స్(14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు.ఇక గురువారం ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఫలితంగా న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉తొలి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్