ఆగ్రహానికి లోనైన రోహిత్ శర్మ- రవీంద్ర జడేజా (PC: BCCI/JIO cinema)
India vs England, 4th Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో.. తేడా వస్తే అంతే సీరియస్ అవుతాడు. కీలక సమయంలో ఆటగాళ్లు సరైన రీతిలో ఆడకపోతే ఫీల్డ్‌లోనే వాళ్లపై గట్టిగా అరవడానికి కూడా వెనుకాడడు హిట్‌మ్యాన్.
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తొలుత రోహిత్ శర్మ ఆగ్రహాన్ని చవిచూశాడు. ఓవైపు అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ చక్కగా వికెట్లు తీస్తుంటే.. సిరాజ్ మాత్రం అనుభవలేమి బౌలర్‌లా పేలవ ప్రదర్శన కనబరిచాడు.
తొలి సెషన్లో భాగంగా వేసిన తొలి ఆరు ఓవర్లలోనే ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ సాబ్‌కు కోపమొచ్చింది. ఇక శుక్రవారం నాటి మ్యాచ్‌లో సిరాజ్ తర్వాత.. అదే స్థాయిలో రోహిత్ ఆగ్రహానికి గురైంది ఎవరైనా ఉన్నారంటే కెమెరామెన్.
అవునండీ.. గంభీర వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో కెమెరామెన్ చేసిన పని వల్ల రోహిత్ తీవ్ర అసహానికి లోనయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 59.3వ ఓవర్లో వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ క్రీజులో ఉన్న సమయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ కోసం అప్పీలు చేశారు.
అయితే, ఇందుకు సంబంధించిన బాల్ ట్రాకింగ్ కాకుండా.. ఆ సమయంలో రోహిత్ శర్మ రియాక్షన్‌పై దృష్టి సారించిన కెమెరామెన్.. బిగ్‌స్క్రీన్‌పై రోహిత్ రూపాన్ని ప్రదర్శించాడు. దీంతో సహనం కోల్పోయిన రోహిత్.. ‘‘ఏయ్ నన్నెందుకు చూపిస్తున్నావు? ఏంటిది?’’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ రివ్యూను టీమిండియా కోల్పోవడంతో రోహిత్ కోపం రెట్టింపైంది. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ 106, ఓలీ రాబిన్సన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్ రెండు, అశ్విన్, జడేజా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
A reverse swing masterclass ft. Siraj 🔥
— JioCinema (@JioCinema) February 23, 2024
The 🇮🇳 pacer sends Tom Hartley 𝙥𝙖𝙘𝙠𝙞𝙣𝙜! 🤩#IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports#INDvENG pic.twitter.com/qQFpOlX0xn
చదవండి: Ind vs Eng: ‘బజ్‌బాల్ కాదు’.. జో రూట్ సరికొత్త చరిత్ర! ఒకే ఒక్కడు..
Captain Rohit Sharma is a pure entertainer 😄#INDvsENG #T20WorldCuppic.twitter.com/mo9Lp9T5Wt
— Ajmul Cap (@AjmulCap2) February 23, 2024
Rohit Sharma's reaction to camera man to focus on DRS not on me🤣🤣#INDvsENG #Rohitsharma #AkashDeep #Siraj #Pope #CricketTwitter #JoeRoot pic.twitter.com/Ikv2wZ68d1
— Shahid wani (@shayu9682) February 23, 2024
Comments
Please login to add a commentAdd a comment