rohit sharma
-
అశ్విన్ రిటైర్మెంట్పై భార్య ప్రీతి తొలి రియాక్షన్.. వైరల్
‘‘గత రెండు రోజులుగా నాకు అంతా గందరగోళంగా ఉంది. అసలు ఏం చెప్పాలో.. ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్‌కు నీరాజనం సమర్పించాలా?... లేదంటే.. జీవిత భాగస్వామి కోణంలో ఆలోచించాలా? లేదంటే.. ఫ్యాన్ గర్ల్‌లా ఓ ప్రేమ లేఖను రాయాలా?.. లేదా ఈ భావోద్వేగాల సమాహారాన్ని పూసగుచ్చాలా?!అశ్విన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినపుడు చిన్నా, పెద్దా.. అన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. గత 13- 14 ఏళ్లుగా ఎన్నో అనుభవాలు చవిచూశాం. అతిపెద్ద విజయాలు, ఎన్నెన్నో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, ఓటమి ఎదురైనపుడు గదిలో నిశ్శబ్దాలు, మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ బోర్డు మీద రాసే రాతలు.. ఇలాంటి జ్ఞాపకాలెన్నో గుర్తుకువస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో విజయం, సిడ్నీ డ్రా, గబ్బా గెలుపు... టీ20లలో పునరాగమనం.. వీటన్నింటి వల్ల మేము పొందిన ఆనందం అనిర్వచనీయం. అదే సమయంలో ఓటముల వల్ల మా హృదయం ముక్కలైనపుడు ఉండే భయంకర నిశ్శబ్దం కూడా నాకు గుర్తే.ప్రియమైన అశ్విన్.. నాకైతే మొదట్లో క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా సర్దాలో కూడా తెలిసేదే కాదు. నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నాకు క్రికెట్ ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే. ఆట పట్ల కూడా ప్రేమను కలిగించావు. నీ ప్యాషన్, క్రమశిక్షణ, కఠిన శ్రమ.. వీటన్నింటికి మరేదీ సాటిరాదు.అత్యుత్తమ గణాంకాలు, అరుదైన రికార్డులు, లెక్కలేనన్ని అవార్డులు.. అయినా సరే ప్రతిసారి మ్యాచ్‌కు ముందు నువ్వు సన్నద్ధమయ్యే తీరు, నీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దే విధానం గురించి ఎలా వర్ణించను?..నీ అంతర్జాతీయ కెరీర్ అత్యద్భుతంగా సాగింది. ఇక నీ మీద ఉన్న భారాన్ని దించుకునే సమయం వచ్చింది. నీకు ఇష్టమైన రీతిలో కొత్త జీవితాన్ని గడుపు. నచ్చిన భోజనం తిను. కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించు. మన పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకో’’.... అంటూ ప్రీతి నారాయణన్ భావోద్వేగానికి లోనయ్యారు. టీమిండియా తాజా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణే ప్రీతి.తొలి స్పందన.. ఉద్వేగపూరిత నోట్ వైరల్అంతర్జాతీయ క్రికెట్‌కు తన భర్త రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రీతి ఈ మేర ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. అశూ ఇకపై తమకు మరింత దగ్గరగా ఉంటాడని భార్యగా ఆనందపడుతూనే.. మరోవైపు అభిమానిగా విచారం వ్యక్తం చేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.అయితే, టెస్టు క్రికెట్ రారాజుగా వెలుగొందిన అశూ అన్నకు సరైన వీడ్కోలు లభించలేదన్నది వాస్తవం. బ్రిస్బేన్‌లో టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన అశూ తన నిర్ణయాన్ని చెప్పి నిష్క్రమించాడు.ఎందుకింత అకస్మాత్తుగా?ఈ నేపథ్యంలో.. అశ్విన్ ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మేనేజ్మెంట్ పట్ల అసంతృప్తితోనే అతడు గుడ్‌బై చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు తీసిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్.. ఆయా ఫార్మాట్లలో 3503, 707, 184 పరుగులు సాధించాడు.ఇక అశ్విన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2011, నవంబరు 13న చిరకాల ప్రేయసి ప్రీతి నారాయణన్‌ను చెన్నైలో వివాహమాడాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు అఖీరా అశ్విన్(2015), ఆద్యా అశ్విన్(2016).చదవండి: 'అశ్విన్‌ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు' -
అశ్విన్ బాటలో రోహిత్ శర్మ?!.. హిట్‌మ్యాన్ సమాధానం ఇదే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడి సారథ్యంలో భారత జట్టు 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇప్పటికి మిశ్రమ ఫలితాలే వచ్చాయి.పితృత్వ సెలవుల కారణంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ దూరం కాగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ నేతృత్వంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అడిలైడ్‌లో కంగారూలతో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా.. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. లేదంటే.. పరిస్థితి ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.ఇక అడిలైడ్, బ్రిస్బేన్‌లో రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా.. ఆరో ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్ ఆడి అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 3, 6, 10. దీంతో కెప్టెన్‌గా రోహిత్ తప్పుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. బుమ్రాకు పగ్గాలు అప్పగించాలని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో బ్రిస్బేన్ టెస్టు ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అనుకున్న ఫలితం రాకపోతే రోహిత్ కూడా గుడ్‌బై చెబుతాడనే వదంతులు వ్యాపించాయి.అయితే, రోహిత్ శర్మ మాత్రం వాటిని కొట్టిపడేశాడు. ‘‘నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయానన్నది వాస్తవం. ఈ విషయాన్ని అంగీకరించడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఎల్లవేళలా మెరుగ్గా ఆడేందుకు నన్ను నేను సన్నద్ధం చేసుకుంటాను. అనుకున్న లక్ష్యాలలో దాదాపుగా అన్నిటినీ చేరుకున్నాను.క్రీజులో మరింత ఎక్కువ సేపు నిలబడేందుకు ప్రయత్నిస్తా. ఇక నా శరీరం, నా మనసు సహకరించినంత కాలం.. నేను ముందుకు కొనసాగుతూనే ఉంటా. ఈ ప్రయాణంలో విధి నాకోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసినా వాటిని సంతోషంగా స్వీకరిస్తా’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా చెరో విజయం సాధించి.. మూడో టెస్టును డ్రా చేసుకున్నాయి. ఫలితంగా సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.తదుపరి డిసెంబరు 26- 30 మధ్య బాక్సింగ్ డే టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్‌తో పాటు.. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులోనూ గెలిస్తేనే.. భారత్ ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే వీలుంటుంది. చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు -
‘అప్పుడే డిసైడ్ అయ్యాను’.. రోహిత్ అలా.. అశ్విన్ ఇలా!
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. అశూ అన్న చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న సమయంలో సమయంలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు మేళతాళాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.టీమిండియా క్రికెటర్‌గా మాత్రమేబ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగానే తాను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు అశ్విన్ తెలిపాడు. ఏదేమైనా క్రికెటర్ అశ్విన్‌గా తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని.. టీమిండియా క్రికెటర్‌గా మాత్రమే తన ప్రస్థానం ముగిసిందని పేర్కొన్నాడు. వీలైనంత కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తానని అశూ తెలిపాడు.‘‘చాలా మందికి ఇదొక భావోద్వేగ సమయం. బహుశా నా మనఃస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. అయితే, నేను ఇప్పుడు పూర్తి సంతృప్తితో ఉన్నాను. రిటైర్మెంట్ విషయం చాలా రోజులుగా నా మదిలో తిరుగుతూనే ఉంది. అయితే, బ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట జరుగుతున్నపుడు నేను నిర్ణయం తీసుకున్నా.జీరో రిగ్రెట్స్ఇదేమీ నా జీవితంలో అతిపెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను ఇకపై కొత్త దారిలో ప్రయాణిస్తాను’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా ఒక్కసారి కూడా అవకాశం రానందుకు బాధపడుతున్నారా అని విలేకరులుగా అడగా.. ‘‘నాకు ఎలాంటి విచారం లేదు. జీరో రిగ్రెట్స్.జీవితం, కెరీర్ పట్ల విచారంతో ఉండే వ్యక్తులను నేను దూరంగా ఉండి చూశాను. కానీ నా లైఫ్‌లో అలాంటివేమీ లేవు’’ అని అశ్విని తమ మనసులోని భావాలను వెల్లడించాడు. ఇక 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచినపుడు తనకు ఘన స్వాగతం లభించిందని.. ఇప్పుడు మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారంటూ అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.రోహిత్ అలా.. అశూ ఇలాకాగా తాను పెర్త్‌కు చేరుకున్నపుడే అశూ రిటైర్మెంట్ విషయం తెలిసిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పగా.. అశూ మాత్రం బ్రిస్బేన్‌లోనే తాను డిసైడ్ అయ్యానని చెప్పడం గమనార్హం.కాగా 2010లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు అశ్విన్. తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం.సీఎస్కే తరఫునఇదిలా ఉంటే.. వన్డేల్లో 707 పరుగులు సాధించిన అశ్విన్.. టీ20లలో 184 రన్స్ రాబట్టాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు(బ్రిస్బేన్) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇకపై అశూ క్లబ్ క్రికెట్‌కే పరిమితం కానున్నాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తరఫున అతడు ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలం-2025లో చెన్నై ఫ్రాంఛైజీ.. అశూను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్ శర్మతో అశ్విన్The countless battles on the field are memorable ❤️But it's also moments like these that Ashwin will reminisce from his international career 😃👌 Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc— BCCI (@BCCI) December 19, 2024 -
ఈ ఏడాది రిటైరైన స్టార్ క్రికెటర్లు వీరే..!
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్తో అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకం ముగిసినట్లనిపిస్తుంది. ఈ ఏడాది భారత్ సహా చాలా దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు రిటైరయ్యారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే వీడ్కోలు పలుకగా.. డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ లాంటి దిగ్గజ ప్లేయర్లు అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. 2024లో ఇప్పటివరకు (డిసెంబర్ 18) 32 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్లకు వీడ్కోలు పలికారు.ఈ ఏడాది తొలి వారంలోనే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్, ఆసీస్ దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పారు. మధ్యలో శిఖర్ ధవన్.. జేమ్స్ ఆండర్సన్.. తాజాగా అశ్విన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు..1. సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)2. వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)3. దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)4. కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)5. విరాట్ కోహ్లి (టీ20లు)6. రోహిత్ శర్మ (టీ20లు)7. రవీంద్ర జడేజా (టీ20లు)8. శిఖర్ ధవన్ (అన్ని ఫార్మాట్లు)9. బరిందర్ స్రాన్ (అన్ని ఫార్మాట్లు)10. వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)11. సిద్దార్థ్ కౌల్ (భారత క్రికెట్)12. రవిచంద్రన్ అశ్విన్ (అంతర్జాతీయ క్రికెట్)ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెటర్లు..1. డీన్ ఎల్గర్ (సౌతాఫ్రికా, అన్ని ఫార్మాట్లు)2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)3. హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా, టెస్ట్‌లు)4. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)5. కొలిన్ మున్రో (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)6. డేవిడ్ వీస్ (నమీబియా, అన్ని ఫార్మాట్లు)7. సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ (నెదర్లాండ్స్, అన్ని ఫార్మాట్లు)8. బ్రియాస్ మసాబా (ఉగాండ, టీ20లు)9. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)10. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)11. షాన్నోన్ గాబ్రియెల్ (వెస్టిండీస్, అన్ని ఫార్మాట్లు)12. విల్ పుకోవ్స్కీ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)13. మొయిన్ అలీ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)14. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్, టెస్ట్‌లు, టీ20లు)15. మహ్మదుల్లా (బంగ్లాదేశ్, టీ20లు)16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)17. టిమ్ సౌథీ (న్యూజిలాండ్, టెస్ట్ క్రికెట్)18. మహ్మద్ అమీర్ (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)19. ఇమాద్ వసీం (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)20. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు) -
నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్‌తో అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పెర్త్ టెస్టు సమయంలోనే అశూ ఈ నిర్ణయం తీసుకున్నాడని.. అయితే, తాను నచ్చచెప్పడం వల్ల ఇప్పటిదాకా ఆగాడని తెలిపాడు. అశ్విన్‌ను మ్యాచ్ విన్నర్‌గా అభివర్ణించిన రోహిత్.. ఇకపై అతడు జట్టులో లేని స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నాడు.తొలి టెస్టులో దక్కని చోటుటీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. తొలి టెస్టు పెర్త్‌లో జరుగగా.. రెండో టెస్టుకు అడిలైడ్ వేదికైంది. ఇక తొలి టెస్టులో అశూను పక్కనపెట్టిన టీమిండియా మేనేజ్మెంట్.. స్పిన్నర్ కోటాలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించింది.మూడో టెస్టులోనూ మొండిచేయిఇక రెండో టెస్టు తుదిజట్టులో ఈ చెన్నై ప్లేయర్‌కు చోటు దక్కినా.. పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో అశ్విన్ 18 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో అశూ స్థానాన్ని రవీంద్ర జడేజాతో భర్తీ చేశారు.అశ్విన్ స్పష్టతతో ఉన్నాడుగబ్బా ఆతిథ్యమిచ్చిన ఈ టెస్టు డ్రాగా ముగియగా.. మ్యాచ్ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రెస్మీట్లో కూర్చున్న అశూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘అశ్విన్ తన నిర్ణయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నాడు.పెర్త్ టెస్టు తర్వాతే రిటైర్ అవ్వాలని భావించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుందో అతడికి తెలుసు. కాంబినేషన్లపై కూడా అతడికి అవగాహన ఉంది. నిజానికి మేము ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే సమయానికి అసలు స్పిన్నర్‌ను ఆడిస్తామో లేదో తెలియని పరిస్థితి.పరిస్థితులకు తగ్గట్లుగా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకోవాలని భావించాం. అయితే, నేను పెర్త్‌కు చేరుకున్నపుడే అశూ నాతో రిటైర్మెంట్ గురించి చర్చించాడు. అయితే, కనీసం పింక్ బాల్ టెస్టు వరకైనా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరాను.నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?‘ఒకవేళ ఈ సిరీస్‌లో నా అవసరం లేకపోతే.. నేను జట్టుతో కొనసాగడం కూడా దండగ. గుడ్ బై చెప్పడమే సరైంది’ అని అశూ అన్నాడు. ఇక మెల్బోర్న్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.స్పిన్నర్‌ను ఆడించే విషయంపై స్పష్టత లేదు. అందుకే తన నిర్ణయాన్ని గౌరవించాలని భావించాం’’ అని పేర్కొన్నాడు. అశ్విన్ బిగ్ మ్యాచ్ విన్నర్ అన్న రోహిత్ శర్మ.. అతడితో కలిసి ఆడిన క్షణాలు తనకు గుర్తుండిపోతాయని తెలిపాడు.చెరో విజయంతోకాగా ఆసీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ స్థానంలో బుమ్రా సారథ్యం వహించగా.. రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. ఇక బుమ్రా కెప్టెన్సీలో పెర్త్‌లో గెలిచిన భారత జట్టు.. రోహిత్ నాయకత్వంలో పింక్ బాల్ టెస్టు ఓడిపోయింది. మూడో టెస్టు డ్రా కావడంతో ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టులు మెల్బోర్న్, సిడ్నీలలో జరుగుతాయి.చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్#Ashwin has announced his retirement from all forms of international cricket! With 765 wickets across formats, he bows out as one of the greatest spinners of all time. Go well, @ashwinravi99 ! 🙌 pic.twitter.com/alfjOj4IDm— Star Sports (@StarSportsIndia) December 18, 2024 -
‘కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై చెబుతాడు’
గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ ఈ ముంబైకర్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ సేన వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే.వరుస వైఫల్యాలుకివీస్తో సిరీస్‌లో బ్యాటర్‌గానూ రోహిత్ విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు 2, 52, 0, 8, 18, 11. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ హిట్‌మ్యాన్ బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్.. అడిలైడ్‌లో తేలిపోయాడు. ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో అతడు మొత్తంగా కేవలం తొమ్మిది (3, 6) పరుగులే చేశాడు.ఇక కీలకమైన మూడో టెస్టులోనూ రోహిత్ శర్మ విఫలయ్యాడు. బ్రిస్బేన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం పది పరుగులే చేశాడు. కాగా ఆసీస్‌తో ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా కాకుండా ఆరోస్థానంలో రోహిత్ బ్యాటింగ్‌కు దిగడం గమనార్హం. దీంతో మిడిలార్డర్లో ఆడటం కూడా రోహిత్ ప్రదర్శనపై ప్రభావం పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. సారథిగా, బ్యాటర్‌గా వైఫల్యం చెందుతున్న రోహిత్ శర్మపై వేటు వేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో రోహిత్ పరుగులు రాబట్టేందుకు కచ్చితంగా ప్రయత్నం చేస్తాడు.అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై!ఒకవేళ అలా జరగనట్లయితే.. తనను తానుగా తప్పుకొంటాడు. అతడు నిస్వార్థ గుణం ఉన్న కెప్టెన్. జట్టుకు భారంగా ఉండాలని కోరుకోడు. భారత క్రికెట్ ప్రయోజనాల పట్ల అతడి అంకితభావం అమోఘం. కాబట్టి వచ్చే రెండు మ్యాచ్‌లలోనూ ఇదే పునరావృతం అయితే, కచ్చితంగా కెప్టెన్‌గా తప్పుకొంటాడు’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. తొలి టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించగా భారత్ 295 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టెస్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా తిరిగి రాగా.. ఆసీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. తదుపరి ఇరుజట్ల మధ్య మెల్బోర్న్, సిడ్నీ వేదికగా నాలుగు, ఐదు టెస్టులు జరుగుతాయి.చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్ -
అతడు అత్యద్భుతం.. వారిద్దరి వల్లే గేమ్‌లో నిలిచాం: రోహిత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రాముగిసింది. ఈ టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు మొదలైన వర్షం.. ఆఖరి రోజు వరకు వెంటాడింది. వర్షం కారణంగా చివరి రోజు కేవలం 24 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 252/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వర్షం మొదలు కావడంతో దాదాపు గంట సేపు ఆట తుడిచిపెట్టుకుపోయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌కు భారత పేసర్లు ఊహించని షాకిచ్చారు.87 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కంగారులు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ ఉంచింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్. 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది.ఆ సమయంలో వెలుతురు సరిగా లేకపోవడం, తర్వాత వర్షం కురవడంతో ఇక ఆట సాధ్యం కాలేదు. దీంతో అంపైర్లు డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ డ్రా అవ్వడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన బుమ్రాపై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్ డ్రా ముగియడం పట్ల సంతృప్తిగా ఉన్నాము. సహజంగా పదే పదే వర్షం అంతరాయం కలిగించడం ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాతావరణ పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కదా. ఏదేమైనప్పటికీ సిరీస్ సమం(1-1) సమంగా ఉండడం మాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.ఇదే కాన్ఫడెన్స్‌తో మెల్బోర్న్కు వెళ్తాము. అక్కడ మెరుగ్గా రాణించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. కాగా బ్రిస్బేన్‌లో వాతావరణ పరిస్థితులు బట్టి పూర్తి ఆట సాధ్యం కాదని మాకు తెలుసు. దీంతో నాలుగో రోజు ఆటలో ఫాలో ఆన్ దాటడానికి ఎవరో ఒకరు జట్టు కోసం నిలబడితే బాగున్ను అనుకున్నాము. ఆ సమయంలో జడేజా అద్భుతంగా ఆడాడు. అంతకంటే ముందు టాపర్డర్‌లో రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో బుమ్రా, ఆకాష్ పోరాడిన తీరు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వారిద్దరూ నెట్స్‌లో ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అది ఈ మ్యాచ్‌లో కన్పించింది.ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. బంతితో కూడా మా బాయ్స్ రాణించారు. ముఖ్యంగా బుమ్రా అత్యద్భుతం. అదే విధంగా ఆకాష్ దీప్ అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్త అయినప్పటికి ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లా ప్రదర్శన చేస్తున్నాడు. ఆకాష్ లాంటి క్రికెటర్లు భారత జట్టుకు చాలా అవసరమని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. -
రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన రోహిత్...
-
‘వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం’
టీమిండియాతో మూడో టెస్టు డ్రాగా ముగియడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. వర్షం అడ్డుపడకపోయి ఉంటే తాము తప్పక గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా.. తమ జట్టు సమిష్టిగా రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు కృషి చేయడం ఎంతో బాగుందని సహచర ఆటగాళ్లను కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆసీస్.. భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.పదే పదే అడ్డుపడ్డ వరుణుడుఅయితే, సిరీస్‌లో ఎంతో కీలకమైన మూడో టెస్టు మాత్రం డ్రాగా ముగిసిపోయింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ టెస్టుకు తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. మరోవైపు.. వెలుతురులేమి వల్ల కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.ఆది నుంచి పటిష్ట స్థితిలోనే ఆసీస్ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటలో కూడా ఇలాంటి అవాంతరాలు ఎదురుకావడంతో.. అంపైర్ల సూచన మేరకు ఆసీస్- భారత కెప్టెన్లు కమిన్స్, రోహిత్ శర్మ డ్రాకు అంగీకరించారు. నిజానికి గబ్బా టెస్టులో ఆది నుంచి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాల కారణంగా పైచేయి సాధించింది.భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పిందిభారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగి 445 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన చోట.. టీమిండియా మాత్రం తడబడింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77)తో పాటు ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా(10*), ఆకాశ్ దీప్(31) విలువైన ఇన్నింగ్స్ కారణంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది.ఐదోరోజూ ఆటంకాలుఈ క్రమంలో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్.. 89/7 వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. తద్వారా భారత్ ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పదే పదే వర్షం రావడంతో పాటు.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేసి.. ఇరుజట్ల కెప్టెన్లను సంప్రదించారు. భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా.. ఇరువురూ డ్రాకు అంగీకరించారు. నిజానికి ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడపకపోయి ఉంటే ఫలితం వచ్చేదే.2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వర్షం పదే పదే అడుడ్డుపడింది. లేదంటే 2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లం. అయినా, మన చేతుల్లో లేని విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఏదేమైనా ఈ టెస్టులో మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది.మేము భారీ స్కోరు సాధించడంతో పాటు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. స్టార్క్, నేను బాగానే రాణించాం. కానీ దురదృష్టవశాత్తూ మేము జోష్ హాజిల్‌వుడ్ సేవలు కోల్పోయాం. ఇక ఐదో రోజు ఆటలో కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ ఇద్దరు అద్భుతంకొత్త బంతిని ఎదుర్కోవడం సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో హెడ్, స్మిత్ అద్భుతంగా ఆడారు. అలెక్స్ క్యారీ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. నాథన్ లియోన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. స్టార్క్ వికెట్లు తీశాడు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు.బాక్సింగ్ డే టెస్టుకు ముందు మాకు ఇలా ఎన్నో సానుకూలాంశాలు ఉండటం సంతోషం’’ అని పేర్కొన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి టెస్టు బరిలో దిగుతామని కమిన్స్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్బోర్న్లో నాలుగో టెస్టు మొదలుకానుంది.చదవండి: Kohli- Gambhir: వారికి మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ మాత్రం అలా.. వీడియో -
Kohli- Gambhir: మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ సైతం..
గబ్బా టెస్టులో నాలుగో రోజు టీమిండియాకు అనుకూలించింది. ఓవర్ నైట్ స్కోరు 51/4తో మంగళవారం నాటి ఆట మొదలుపెట్టిన భారత్‌ను ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఆటతో ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(10) విఫలమైనా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడిన ఈ కర్ణాటక బ్యాటర్.. విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో రాణించాడు.రాహుల్, జడేజా విలువైన అర్ధ శతకాలుఇక కేఎల్ రాహుల్‌తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అదరగొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన జడ్డూ 123 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే.. జడ్డూ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగే సమయానికి భారత్ ఇంకా ముప్పై మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ ఆకాశ్ దీప్ బ్యాట్‌తో అదరగొట్టాడు.గట్టెక్కించిన పేసర్లుమరో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించుకుంది. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి.మ్యాచ్ గెలిచినంత సంబరంహెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సంతోషం పట్టలేకపోయారు. గంభీర్ అయితే ఒక్కసారిగా తన సీట్లో నుంచి లేచి కోహ్లికి హై ఫైవ్ ఇచ్చాడు. ఇక కోహ్లి కూడా మ్యాచ్ గెలిచామన్నంత రీతిలో ఆనందంతో పొంగిపోయాడు. రోహిత్‌ను చీర్ చేస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ కూడా చిరునవ్వులు చిందించాడు. అవును మరి.. టెస్టుల్లో ఇలాంటి మూమెంట్లే సిరీస్ ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. గబ్బా టెస్టును కనీసం డ్రాగా ముగించిన భారత్‌కు సానుకూలాంశమే. ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా 10(27 బంతుల్లో ఒక సిక్స్), ఆకాశ్ దీప్27 (31 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్)తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడం ఆఖర్లో హైలైట్‌గా నిలిచింది.గబ్బాలో కనీసం డ్రా కోసంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ గెలిచాయి. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.ఈ క్రమంలో బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బౌలింగ్ చేయగా.. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక గబ్బా టెస్టుకు ఆరంభం నుంచే వర్షం అంతరాయం కలిగించడం టీమిండియాకు కాస్త అనుకూలించిందని చెప్పవచ్చు.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం Moment hai bhai, moment hai ft. #ViratKohli! 😂#AUSvINDOnStar 👉 3rd Test, Day 5 | 18th DEC, WED, 5:15 AM! #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/3s0EOlDacC— Star Sports (@StarSportsIndia) December 17, 2024Read the lips of Gambhir and Kohli, follow-on bach gaya bc 😂 pic.twitter.com/ibIRSQTwEK— Prayag (@theprayagtiwari) December 17, 2024THE MOMENT AKASH DEEP & BUMRAH SAVED FOLLOW ON..!!!! 🇮🇳- The celebrations and Happiness of Virat Kohli, Rohit Sharma & Gautam Gambhir was priceless. ❤️ pic.twitter.com/i0w0zRyNPa— Tanuj Singh (@ImTanujSingh) December 17, 2024 -
IND vs AUS: టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామను కొనసాగిస్తున్నాడు. పింక్ బాల్ టెస్టులో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ.. ఇప్పుడు గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 27 బంతులు ఆడిన రోహిత్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. అస్సలు మనం చూస్తుంది రోహిత్ శర్మనేనే అన్నట్లగా అతడి ఇన్నింగ్స్ కొనసాగింది. చివరికి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్‌కు చేరాడు.దీంతో తీవ్ర నిరాశకు గురైన హిట్‌మ్యాన్ తన గ్లౌవ్స్‌ను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.ఒకే ఒక హాఫ్ సెంచరీ..కాగా రోహిత్ శర్మ గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్ కేవలం అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అందులో ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే రోహిత్ పరిమితమయ్యాడు.చివరి 10 ఇన్నింగ్స్‌లలో రోహిత్ చేసిన 10, 6, 3, 18, 11, 8, 0, 2, 52, 23, 8 స్కోర్లు ఇవి. రోహిత్ సెంచరీ చేసిన దాదాపు ఏడాది అవుతోంది. చివరగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై రోహిత్ తన టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అప్పటి నుంచి తరుచుగా రోహిత్ విఫలమవుతానే వస్తున్నాడు. ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రోహిత్ టెస్టుల నుంచి కూడా తప్పుకోవాలని పలువరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించకపోతే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.చదవండి: కెప్టెన్‌గా రింకూ సింగ్ -
రోహిత్ నా సోదరుడు.. మరింత ఎనర్జీతో ఆడాలి: హేడన్
బ్రిస్బేన్ వేదికగా జరుగుతన్న మూడో టెస్టులో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(33), రోహిత్ శర్మ (0)ఉన్నారు. నాలుగో రోజు ఆటలో భారత్ భవితవ్యం వీరిద్దరిపైనే ఆధారపడి ఉంది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆటలో రోహిత్ తనదైన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేయాలని హేడెన్ సూచించాడు. కాగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు."రోహిత్ శర్మ ఫార్మాట్ ఏదైనా స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు సాధిస్తాడు. వన్డే క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు, పొట్టి ఫార్మాట్లలో అతడు రికార్డులే అందుకు నిదర్శనం. కానీ ఇప్పుడు అతడు ఏంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. బ్రిస్బేన్‌లో రోహిత్ తన కోసమైనా ఫుల్ ఎఫెక్ట్‌తో ఆడాలి. అతడు కొన్ని రోజుల విరామం తర్వాత అడిలైడ్‌లో ఆడాడు. బహుశా అందుకే రోహిత్ కాస్త నిదానంగా ఆడాడు. నేనే అతడితో పాటు క్రీజులో ఉండి ఉంటే, డిఫెన్స్ ఆడటం ఇష్టం లేదని చెప్పేవాడిని. రోహిత్ తన స్టైల్లో దూకుడుగా ఆడాలి. అతడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. శక్తి, బాగా ఆడాలనే సంకల్పం అతడిని ముందుకు నడిపిస్తాయి. రోహిత్ నా సోదరుడు.. గొప్ప సంకల్పం, పూర్తి ఎనర్జీతో ఆడాలని కోరుకుంటున్నాను" అని హేడన్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: అదొక చెత్త క్రికెట్ బోర్డు.. అందుకే రాజీనామా: ఆసీస్ దిగ్గజం -
‘గంభీర్‌తో రోహిత్‌కు విభేదాలు?.. ద్రవిడ్‌తో చక్కగా ఉండేవాడు.. కానీ’
ఆస్ట్రేలియా పర్యటనలో శుభారంభం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించలేకపోతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక మూడో టెస్టులోనూ రోహిత్ సేన పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది.బ్రిస్బేన్‌లో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాలో కూరుకుపోయింది. గబ్బా మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్‌కు ఆసీస్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక బ్యాటింగ్‌లోనూ టీమిండియా తేలిపోతోంది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 51 పరుగులు చేసింది. వర్షం గనుక అడ్డుపడకపోయి ఉంటే.. పరిస్థితి ఇంకాస్త దిగజారేదే! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.గంభీర్‌తో రోహిత్‌కు విభేదాలు?టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య అవగాహన లేదని బసిత్ అన్నాడు. వీరిద్దరి భిన్నాభిప్రాయాల కారణంగానే భారత జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్‌తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన రోహిత్‌కు.. గౌతీతో అంతటి కో ఆర్డినేషన్ ఉన్నట్లు కనిపించడం లేదన్నాడు.‘‘రోహిత్ శర్మ, గౌతం గంభీర్ ఆలోచనలు ఒకే విధంగా లేవని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో భారత్ పరాభవం ఎదుర్కొంది. బంగ్లాదేశ్ వంటి పసికూనపై మాత్రం గెలవగలిగింది.ద్రవిడ్‌తో చక్కగా ఉండేవాడుఇక ఆస్ట్రేలియాలో రెండో టెస్టులో ఓడిన భారత్.. మూడో టెస్టులోనూ ఇబ్బందులు పడుతోంది. ఇక్కడ కూడా రోహిత్- గౌతీ మధ్య ఏకాభిప్రాయం లేదని తుదిజట్టును ఎంపికను చూస్తే అర్థమైపోతుంది. ఎందుకో ద్రవిడ్ మాదిరి గౌతీతో రోహిత్ ఇమడలేకపోతున్నాడని అనిపిస్తోంది.వారిని ఎందుకు తీసుకోలేదు?బ్రిస్బేన్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎందుకు చేసినట్లు? ఇక ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురి దాకా లెఫ్టాండర్ బ్యాటర్లు ఉన్నారు. అయినా.. మీరెందుకు వాషింగ్టన్ సుందర్ లేదంటే రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోలేదు? క్రికెట్ గురించి జ్ఞానం ఉన్నవాళ్లకు ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఆస్ట్రేలియాలో టీమిండియా ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడుతోంది. జట్టులో ఒక్కరు కూడా లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ లేరు. అదే టీమిండియాకు ఉన్న అతిపెద్ద బలహీనత. ఈ మ్యాచ్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా, ట్రవిస్ హెడ్ వర్సెస్ టీమిండియా అన్నట్లుగా అనిపించింది’’ అంటూ బసిత్ అలీ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ -
‘నీకసలు మెదడు ఉందా?’.. భారత పేసర్‌పై రోహిత్ ఫైర్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. యువ పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నీకసలు బుర్ర(మెదడు) ఉందా?’’ అంటూ ఆకాశ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడో టెస్టులో పటిష్ట స్థితిలో ఆసీస్బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య శనివారం మొదలైన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేనకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రోజు నుంచే మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... రెండోరోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో 445ఈ క్రమంలో 405/7(101 ఓవర్లు) ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టి.. మరో 40 పరుగులు జతచేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మొత్తంగా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఇక ఆసీస్ ఇన్నింగ్స్‌లో సోమవారం 114వ ఓవర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆకాశ్ దీప్ చేతికి బంతినిచ్చాడు. అయితే, 28 ఏళ్ల ఈ పేసర్.. ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్న సమయంలో వైడ్ బాల్ వేశాడు.సర్ మే కుచ్ హై?వేగంగా వచ్చిన ఈ బంతిని ఆపేందుకు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన ప్రయత్నం వృథాగా పోయింది ఫలితంగా ఆసీస్ ఖాతాలో అదనపు పరుగులు(2) చేరగా.. సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. ఆకాశ్‌ను ఉద్దేశించి..‘‘అబ్బే సర్ మే కుచ్ హై?(బుర్రలో ఏమైనా ఉందా?)’’ అంటూ కామెంట్స్ చేయగా.. స్టంప్ మైకులో రికార్డయ్యాయి.ఇక మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రా మరో వికెట్ తీయగా.. ఆకాశ్ దీప్(క్యారీ వికెట్), మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఆరు, సిరాజ్‌కు రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలకు ఒక్కో వికెట్ దక్కింది. వర్షం వల్ల మూడో రోజు ఆటకు అంతరాయంకాగా ఆకాశ్‌కు విదేశీ గడ్డపై ఇదే తొలి మ్యాచ్. అడిలైడ్‌లో ఆడిన హర్షిత్ రాణాపై వేటు పడగా.. అతడి స్థానాన్ని బ్రిస్బేన్‌లో ఆకాశ్ భర్తీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం వల్ల మూడో రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. అప్పటికి భారత్ 17 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 394 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’Rohit Sharma & Stump-mic Gold - the story continues... 😅#AUSvINDOnStar 👉 3rd Test, Day 3 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vCW0rURX5q— Star Sports (@StarSportsIndia) December 16, 2024 -
‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. బ్రిస్బేన్‌లో శనివారం మొదలైన ఈ టెస్టులో భారత జట్టు పేలవంగా ఆడుతోంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేన.. ఆసీస్‌ను కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 445 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.పెవిలియన్‌కు క్యూఅయితే, ఆసీస్ స్టార్లు ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాలతో చెలరేగిన గబ్బా మైదానంలో.. టీమిండియా బ్యాటర్లు మాత్రం తేలిపోతున్నారు. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచారు.48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. సోమవారం నాటి మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే సమయానికి కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 30 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ సున్నా పరుగులతో ఆడుతున్నాడు. కేవలం 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గబ్బాలో టాస్ గెలిచిన రోహిత్.. తొలుత బౌలింగ్ ఎంచుకోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు తప్పుబట్టారు. చెత్త సెటప్ అంటూ విమర్శలుమరోవైపు.. ఆదివారం నాటి రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ సెట్ చేసిన తీరుపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి రోహిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చెత్త సెటప్’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఇక ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ వార్నర్ సైతం రోహిత్ తీరును విమర్శించాడు. హెడ్, స్మిత్‌లను షార్ట్ బాల్స్‌తో అటాక్ చేయాల్సిందిపోయి.. వారికి బ్యాట్ ఝులిపించే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రోహిత్ తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి‘‘ఇప్పుడు కూడా రోహిత్ శర్మను సమర్థిస్తే అంతకంటే ఘోర తప్పిదం మరొకటి ఉండదు. ఇంత డిఫెన్సివ్‌గా కెప్టెన్సీ చేస్తారా? ఇప్పటికైనా అతడు వాస్తవాలు అంగీకరించాలి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే రోహిత్ తప్పుకోవాలి. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు కోసం మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలి. బుమ్రాను టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమించాలి’’ అని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్.బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్ గడ్డపై భారత్‌కు భారీ విజయంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. పితృత్వ సెలవుల కారణంగా అతడు అందుబాటులో లేకపోవడంతో.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో కంగారూ జట్టును చిత్తు చేసింది. అయితే, అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ తిరిగి రాగా.. ఆతిథ్య జట్టు చేతిలో భారత్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అడిలైడ్ టెస్టులో రోహిత్ బ్యాటింగ్ పరంగా(3, 6)నూ నిరాశపరిచాడు. రోహిత్ కెప్టెన్సీలో చెత్త రికార్డుఇక ఆసీస్ టూర్ కంటే ముందు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. భారత క్రికెట్ చరిత్రలో పర్యాటక జట్టు చేతిలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం అదే తొలిసారి. చదవండి: ‘నా వేలు విరగ్గొట్టేశావు పో’.. సిరాజ్‌పై మండిపడ్డ జడేజా! -
IND vs AUS 3rd Test Day 2: హెడ్, స్మిత్ సెంచరీలు.. ఆసీస్ భారీ స్కోరు
Ind vs Aus 3rd Test Day 2 Summary: బ్రిస్బేన్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రెండో రోజు ముగిసింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన ఆసీస్ టీమిండియాపై పైచేయి సాధించింది. ఆరంభంలో ఆకట్టుకున్న భారత పేసర్లు ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.అంతా తలకిందులుట్రవిస్ రాకతో అంతా తలకిందులైంది. ఆసీస్ స్కోరు 75/3 వద్ద ఉన్న సమయంలో స్టీవ్ స్మిత్‌తో కలిసిన హెడ్ ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు .. మొత్తంగా 152 పరుగులు సాధించాడు. మరోవైపు.. స్మిత్ సైతం శతకం(101)తో మెరిశాడు.ఈ జంటను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేయడంతో టీమిండియా కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే, అలెక్స్ క్యారీ(47 బంతుల్లో 45*) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ నాలుగు వందల పరుగుల మార్కు దాటింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 101 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. భారత బౌలర్లలో పేసర్లు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.Updatesఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్భారత పేసర్ సిరాజ్‌కు ఎట్టకేలకు వికెట్ దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 98వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో కమిన్స్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోగా.. సిరాజ్‌కు ఈ మ్యాచ్‌లో తొలి వికెట్ దక్కింది. మిచెల్ స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 387-7(98). 96 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 377/6.96 ఓవర్లకు ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ కమ్మిన్స్(17), అలెక్స్ క్యారీ(33) ఉన్నారు. 96 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 377/6.ఆసీస్ ఆరో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఎట్టకేలకు ఔటయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. హెడ్ 152 బంతుల్లో 18 ఫోర్లతో 152 పరుగులు చేసి ఔటయ్యాడు. 88 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 330/6ఆసీస్ ఐదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్(5).. విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్బుమ్రా బౌలింగ్‌లో స్మిత్ అవుటయ్యాడు. శతకం పూర్తి చేసుకున్న ఈ వెటరన్ బ్యాటర్ 101 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ క్రీజులోకి వచ్చాడు. హెడ్ 149 పరుగులతో ఆడుతున్నాడు. ఆసీస్ స్కోరు: 318/4 (84)స్మిత్ సెంచరీ..ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్మిత్ ప్రస్తుతం 100 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. స్మిత్‌కు ఇది 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. భారత్‌పై ఇది స్మిత్‌కు 10వ టెస్టు సెంచరీ. 82 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 313/3టీ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోరు: 234/3 (70).హెడ్ 103, స్మిత్ 65 పరుగులతో ఆడుతున్నారుట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ..బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 115 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను హెడ్ అందుకున్నాడు. హెడ్‌కు ఇది తొమ్మిదవ టెస్టు సెంచరీ. భారత్‌పై మూడో టెస్టు సెంచరీ. ప్రస్తుతం 101 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 69 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 231/3.స్మిత్ హాఫ్ సెంచరీ..ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. స్మిత్ 50 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 64 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 196/3.హెడ్ హాఫ్ సెంచరీ.. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 52 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 56 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 158/3. క్రీజులో హెడ్‌తో పాటు స్మిత్(44) ఉన్నాడు.భారత్‌కు మరోసారి హెడ్ 'ఎక్'ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరోసారి భారత్‌కు తలనొప్పిగా మారాడు. లబుషేన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెడ్ తనదైన స్టైల్లో ఆడుతున్నాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్ క్రీజులో పాతుకుపోయారు. 50 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెడ్(36), స్మిత్(35) ఉన్నారు.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోర్: 104/3రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(20), స్టీవ్ స్మిత్(25) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా..లబుషేన్ ఔటైన అనంతరం ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 42 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(24), ట్రావిస్ హెడ్(17) ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్..75 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్లిప్‌లో విరాట్ కోహ్లి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్రీజులోకి ట్రావిస్ హెడ్ వచ్చాడు. 34 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 75/3నిలకడగా ఆడుతున్న ఆసీస్..ఆస్ట్రేలియా బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్మిత్ నిలకడగా ఆడుతున్నారు. 27 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(10), లబుషేన్(8) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. మెక్‌స్వీనీ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయిది. 9 పరుగులు చేసిన మెక్‌స్వీనీ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 19 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/2బుమ్ బుమ్ బుమ్రా..తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ తమ మొదటి వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(21) వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు.రెండో రోజు ఆట ప్రారంభం..బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ అటాక్‌ను ఆకాష్ దీప్ ఆరంభించాడు. కాగా తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 13. 2 ఓవర్లలో ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్. -
‘రోహిత్ శర్మ నిర్ణయం తప్పు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ సారథి, కామెంటేటర్ మైకేల్ వాన్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని తప్పుబట్టాడు. రోహిత్ నిర్ణయం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సంతోషాన్ని మిగిల్చి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.సిరీస్ 1-1తో సమంగాకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేయడం సులువవుతుందనేఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. వికెట్‌పై కాస్త పచ్చిక ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పిచ్ పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం సులువవుతుందనే ఉద్దేశంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. ఇక ఆసీస్ సారథి కమిన్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కమిన్స్దీ అదే మాటతాను కూడా టాస్ గెలిచి ఉంటే.. తొలుత బౌలింగ్ ఎంచుకునే వాడినన్నాడు. అయితే, ఈ ఇద్దరు కెప్టెన్ల వ్యాఖ్యలకు విరుద్ధంగా మైకేల్ వాన్ కామెంట్ చేయడం విశేషం.రోహిత్ శర్మ నిర్ణయం తప్పు‘‘రోహిత్ శర్మ నిర్ణయంతో ప్యాట్ కమిన్స్ మనసులో గంతులేస్తూ ఉంటాడు. తాను టాస్ ఓడిపోయినందుకు సంతోషపడి ఉంటాడు. గత చరిత్ర ఆధారంగా అతడు బ్యాటింగే ఎంచుకుని ఉండేవాడు. ఏదేమైనా రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని తప్పుచేశాడు’’ అని మైకేల్ వాన్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.కొత్త బంతితో నో మ్యాజిక్!కాగా గబ్బా పిచ్‌పై కొత్త బంతితో భారత పేసర్లు పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లు కూడా రంగంలోకి దిగారు. బుమ్రా ఆరు ఓవర్ల బౌలింగ్‌లో 8, సిరాజ్ నాలుగు ఓవర్లలో 13, ఆకాశ్ దీప్ 3.2 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చారు. ఇక ఆసీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్ల వద్ద ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి కంగారూ జట్టు వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. అయితే, ఆ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో తొలిరోజు ఆటను అంతటితో ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. -
Ind vs Aus 3rd Test Day 1: అభిమానులకు బ్యాడ్‌న్యూస్
క్రికెట్ ప్రేమికులకు చేదు వార్త!.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. వరణుడి కారణంగా బ్రిస్బేన్‌లో తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రెండో రోజు ఆట మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.20 నిమిషాలకు మొదలై.. కనీసం 98 ఓవర్లపాటు మ్యాచ్ సాగనుంది. నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనేబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. ఇందులో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో విజయంతో సిరీస్ మొదలుపెట్టిన భారత్.. అడిలైడ్‌లో మాత్రం ఆసీస్ ముందు తలవంచింది. పింక్ బాల్ టెస్టులో మరోసారి కంగారూ జట్టు చేతిలో ఓడిపోయింది.టాస్ ఆలస్యంఫలితంగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. తర్వాత కాస్త తెరిపినివ్వడంతో ఆట మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.మరోసారి వరణుడి అడ్డంకిఈ క్రమంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త బంతితో బరిలోకి దిగాడు. మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా వరుస ఓవర్లలో బౌలింగ్ చేశారు. అయితే, ఆసీస్ ఇన్నింగ్స్‌లో 13.2 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామం వరకు ఆటను వాయిదా వేశారు.తొలిరోజు ఆట ముగిసిందిలాకానీ.. వర్షం మాత్రం తగ్గలేదు. ఫలితంగా రెండో సెషన్ రద్దైపోయింది. అయితే, ఆ తర్వాత కూడా ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. వర్షం వల్ల మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేనందువల్ల అంతటితో తొలిరోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 19, నాథన్ మెక్‌స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మూడో టెస్టు(డిసెంబరు 14-18)వేదిక: ది గబ్బా స్టేడియం, బ్రిస్బేన్టాస్: టీమిండియా.. తొలుత బౌలింగ్వర్షం వల్ల 13.2 ఓవర్లకే ముగిసిపోయిన ఆటఆసీస్ స్కోరు: 28/0ప్లేయింగ్ ఎలెవన్భారత తుది జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియా తుది జట్టుఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: IND Vs AUS 3rd Test: బ్రిస్బేన్ టెస్టులో మహ్మద్ సిరాజ్‌కు చేదు అనుభవంUsman Khawaja puts away his first boundary of the day with this cracking shot off Siraj 👌#AUSvIND pic.twitter.com/xHJlbrFF8o— cricket.com.au (@cricketcomau) December 14, 2024 -
Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ముగిసిపోయిన తొలిరోజు ఆట
Ind vs Aus 3rd Test Day 1 Updates: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య శనివారం మూడో టెస్టు మొదలైంది. బ్రిస్బేన్లోన గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, వర్షం కారణంగా 13.2 ఓవర్ల తర్వాత ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా వాన పడటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారుఆటకు వర్షం ఆటంకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మొదలైన తొలిరోజు ఆటకు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఆసీస్ స్కోరు: 28/0 (13.2). ఖవాజా 19, మెక్‌స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 26-0ఖవాజా 18, మెక్‌స్వీనీ మూడు పరుగులతో ఆడుతున్నారు.ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరుభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. ఇక రోహిత్ సేన ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 17, నాథన్ మెక్‌స్వీనీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వాళ్లిద్దరిపై వేటుటాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్‌ను తీసుకున్నట్లు తెలిపాడు. ఒక మార్పుతో ఆసీస్మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి రావడంతో.. స్కాట్ బోలాండ్‌పై వేటు పడింది.తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్. -
Rohit Sharma: టీమిండియా కొంప కొల్లేరు చేస్తున్న రోహిత్
-
IND Vs AUS: హైలైట్‌గా కోహ్లి.. వెనుక నిలబడ్డ రోహిత్! గంభీర్ సైతం..
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నేపథ్యంలో టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిష్టాత్మక గాబా మైదానంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో భారత క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు.. తమ నైపుణ్యాలకు పదునుపెడుతూ పోటాపోటీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు హైలైట్‌గా నిలిచింది.తన ఫుట్‌వర్క్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన కోహ్లి.. ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతుల్ని ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డాడు. అయితే, తన అనుభవాన్ని ఉపయోగించి ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రయత్నించాడు. అదే విధంగా.. కోహ్లి యువ ఆటగాళ్లను ఉద్దేశించి సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో స్ఫూర్తిని రగిల్చాడు.ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించిన కోహ్లిముఖ్యంగా ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డితో చాలా సేపు ముచ్చటించిన కోహ్లి.. వారిలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లతో కలిస చేతులు కట్టుకుని వెనుక నిలబడటం గమనార్హం. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు.. ఆసీస్ గడ్డపై అనుభవం ఉన్న కోహ్లిని కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.గంభీర్ సైతంఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం ఆటగాళ్లను ఉద్దేశించి కాసేపు ప్రసంగించాడు. అడిలైడ్ ఓటమి నుంచి త్వరగా కోలుకుని.. బ్రిస్బేన్ టెస్టుపై దృష్టి పెట్టేలా గౌతీ ఆటగాళ్లను సన్నద్ధం చేశాడు. ఇక రోహిత్ శర్మ సైతం నెట్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటూ చాలాసేపు బ్యాటింగ్ చేశాడు.కాగా ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు.రెండో టెస్టులో రోహిత్ విఫలంఇక రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. కేఎల్ రాహుల్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. అయితే, మిడిలార్డర్లో బరిలో దిగిన రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి తొమ్మిది పరుగులే చేశాడు. ఇక అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు మొదలుకానుంది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు!It is time to look ahead. Preparations for the Brisbane Test starts right here in Adelaide.#TeamIndia #AUSvIND pic.twitter.com/VfWphBK6pe— BCCI (@BCCI) December 10, 2024 -
యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఫైర్
టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా అతడి తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.మూడో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్కుఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.ఫలితంగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్- భారత్ మధ్య శనివారం(డిసెంబరు 14) నుంచి మూడో టెస్టు జరుగనుంది. ఇందుకోసం టీమిండియా అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ చేరుకునే క్రమంలో జైస్వాల్ చేసిన పొరపాటు రోహిత్ ఆగ్రహానికి కారణమైనట్లు వార్తలు వచ్చాయి.అతడు లేకుండానే వెళ్లిపోయిన బస్!అడిలైడ్‌లో తాము బస చేసిన హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరేటపుడు యశస్వి జైస్వాల్ ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. సహచర ఆటగాళ్లు, హెడ్ కోచ్ గౌతం గంభీర్ తదితరులు అతడి కోసం సుమారు 20 నిమిషాల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందట. అయినప్పటికీ యశస్వి రాకపోవడంతో టీమ్ బస్ అతడు లేకుండానే నిష్క్రమించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో టీమిండియా భద్రతా అధికారి.. హోటల్‌కు చెందిన కారులో యశస్వి జైస్వాల్ ఒక్కడిని ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు కోపమొచ్చినట్లు తెలుస్తోంది.కోహ్లి, బుమ్రా కుటుంబాలు ప్రత్యేక విమానంలోఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తమ కుటుంబాలను కూడా ఆస్ట్రేలియాకు తీసుకువచ్చారు. కోహ్లి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌లతో పాటు బుమ్రా సతీమణి సంజనా గణేషన్, కుమారుడు అంగద్.. అంతా కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో బ్రిస్బేన్ చేరుకున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో జైస్వాల్‌ది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. భారీ శతకం(161) బాది అతడు జట్టు గెలుపులో భాగమయ్యాడు.చదవండి: IND vs AUS: 'రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ ఉన్నాడు.. టెస్టు క్రికెట్‌కు పనికిరాడు'Adelaide ✅Hello Brisbane 👋#TeamIndia | #AUSvIND pic.twitter.com/V3QJc3fgfL— BCCI (@BCCI) December 11, 2024 -
'రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ ఉన్నాడు.. టెస్టు క్రికెట్‌కు పనికిరాడు'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లలో విఫలమైన హిట్‌మ్యాన్.. ఇప్పుడు ఆసీస్ పర్యటనలోనూ అదే తీరును కనబరుస్తున్నాడు. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో రోహిత్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ చేరారు. రోహిత్ శర్మ స్వదేశంలో హీరో అని, విదేశాల్లో మాత్రం జీరో అని కల్లినన్ అన్నారు."రోహిత్ శర్మ కేవలం ఫ్లాట్ ట్రాక్‌లలో మాత్రమే ఆడగలడు. అందుకే అతడికి స్వదేశంలో మంచి రికార్డు ఉంది. కానీ విదేశీ గడ్డపై రోహిత్ ప్రదర్శన అంతంతమాత్రమే. అతడు బౌన్సర్లను ఎదుర్కొవడంలో ఎక్కువగా ఇబ్బంది పడతాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో అయితే చాలా సందర్భాల్లో ఆ బౌన్సర్లకే అతడు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. రోహిత్ ఫిట్నెస్ పరంగా కూడా అంత మెరుగ్గా కనిపించడం లేదు. విరాట్ కోహ్లి ఫిట్నెస్తో పోలిస్తే రోహిత్ చాలా వెనకబడి ఉన్నాడు. రోహిత్ అధిక బరువు ఉన్నాడు. అతడు నాలుగు లేదు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు సరిపోడు" అని ఇన్సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్లినన్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది. -
కెప్టెన్ ఫామ్‌లో లేకుంటే కష్టమే.. రోహిత్ ఇకనైనా..: ఛతేశ్వర్ పుజారా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలనే.. లేదంటే ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా ఆసీస్‌పై 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోని వచ్చినా.. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడింది.బ్యాటర్‌గానూ విఫలంఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతడు చేసిన పరుగులు తొమ్మిది. ఈ నేపథ్యంలో ఛతేశ్వర్ పుజారా స్టార్ రోహిత్ గురించి మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌ను కేవలం కెప్టెన్గానో.. ఆటగాడిగానో చూడలేం. నా దృష్టిలో అతడు రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించలగడు.అయితే, ప్రస్తుతం అతడు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వీలైనంత త్వరగా ఫామ్‌లోకి వస్తేనే అన్ని విధాలా బాగుంటుంది. కెప్టెనే ఫామ్‌లో లేకపోతే.. ఆ ప్రభావం జట్టుపై పడుతుంది. రోహిత్ స్కోరు చేస్తేనే జట్టుకు కూడా సానుకూలంగా ఉంటుంది.20 -30 పరుగులు చేశాడంటే.. రోహిత్ శర్మ అనుభవజ్ఞుడైన ఆటగాడు. బ్యాటింగ్ చేస్తున్నపుడు పరుగులు ఎలా రాబట్టాలో అతడికి తెలుసు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగా లేకపోవచ్చు. అయితే, ఒక్కసారి క్రీజులో కుదురుకుని 20 -30 పరుగులు చేశాడంటే.. తన ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మలచగలడు.ఒకవేళ బ్యాటర్‌గా రోహిత్ విఫలమైతే..కాబట్టి మూడో టెస్టు ఆరంభంలోనే అతడు ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నా. అలా అయితేనే టీమిండియాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ బ్యాటర్‌గా రోహిత్ విఫలమైతే.. ఆ ప్రభావం కెప్టెన్సీపై కూడా పడుతుంది’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు పుజారా స్పోర్ట్స్ షోలో రోహిత్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయంతో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.చదవండి: మా కెప్టెన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం: రిజ్వాన్‌పై పాక్ ఫ్యాన్స్ ఫైర్ -
గాయం రేపిన చిచ్చు.. రోహిత్-షమీ మధ్య విభేదాలు..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ షమీ మధ్య విభేదాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలకు షమీ గాయం కారణమని తెలుస్తుంది. దైనిక్ జాగారణ్ నివేదిక మేరకు.. రోహిత్-షమీ మధ్య విభేదాలకు భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ సందర్భంగా బీజం పడింది. ఆ సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు ముందు షమీ గురించి రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ ఫిట్‌గా లేడని, అతడి మోకాలి భాగంలో వాపు వస్తుందని రోహిత్ మీడియాకు వివరణ ఇచ్చాడు. మరోవైపు షమీ మాత్రం తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు. ఇదే విషయమై రోహిత్-షమీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడు తప్పుడు స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నావని షమీ రోహిత్‌ను నిలదీశాడట.తాజాగా మరోసారి అదే స్టేట్మెంట్అడిలైడ్ టెస్ట్‌లో టీమిండియా పరాజయం అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. షమీ మోకాలు మళ్లీ వాచిందని, గాయాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పాడు. షమీ కోసం టీమిండియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నాడు. అయితే గాయం పూర్తిగా తగ్గకముందే బరిలోకి దింపి షమీని ఒత్తిడిలోకి నెట్టదలచుకోవడం లేదని అన్నాడు. రోహిత్ గతంలోనూ షమీపై ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ వ్యాఖ్యలకు భిన్నంగా..ఓ పక్క రోహిత్ శర్మనేమో షమీ పూర్తిగా ఫిట్‌గా లేడని స్టేట్మెంట్లు ఇస్తుంటే షమీ మాత్రం మైదానంలో అదరగొడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో షమీ దుమ్మురేపుతున్నాడు. అంతకుముందు రంజీ ట్రోఫీలోనూ షమీ సత్తా చాటాడు. తాను ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో కూడా ఉన్నట్లు షమీ మెసేజ్ పంపుతున్నాడు. తాజాగా చండీఘడ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో షమీ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేయడటమే కాకుండా బౌలింగ్‌లో 13 డాట్ బాల్స్ వేసి ఓ వికెట్ తీశాడు. రోహిత్ చెబుతున్నట్టు షమీకి గాయం తిరగబెడితే అతను విశ్రాంతి తీసుకోవాలి కాని, బరిలోకి దిగి ఇంత మెరుగ్గా ఎలా ఆడగలడు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.