విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు భారీ షాకిచ్చిన బీసీసీఐ | BCCI central contracts for 2025-26 season leaked. Rohit Sharma, Virat Kohli demoted | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు భారీ షాకిచ్చిన బీసీసీఐ

Feb 7 2026 1:40 PM | Updated on Feb 7 2026 1:47 PM

BCCI central contracts for 2025-26 season leaked. Rohit Sharma, Virat Kohli demoted

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) టీమిండియా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ల జాబితాలో వీరిద్దరూ డిమోషన్‌కు గురైనట్లు సమాచారం. 

గతంలో విరాట్‌, రోహిత్‌ ఏ ప్లస్‌ కేటగిరిలో ఉండేవారు. తాజాగా ఆ కేటగిరిని పూర్తిగా రద్దు చేస్తూ.. రో-కోను బి కేటగిరిలోకి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. రో-కో టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్ర​మే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న వారికే అత్యుత్తమ కేటగిరి (ఏ ప్లస్‌) లభిస్తుంది. రో-కో రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో వారు బి కేటగిరిలోకి పడిపోయారు.

అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. టీ20, టెస్ట్‌ల నుంచి తప్పుకున్న రో-కో ఏ ప్లస్‌ నుంచి బి కేటగిరికి పడిపోగా.. టీ20ల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. 

జడ్డూతో పాటు భారత వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, పేసు గుర్రం మరియు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌ జస్ప్రీత్‌ బుమ్రా మాత్రమే ఏ కేటగిరిలో ఉన్నారు. 

బుమ్రా, జడ్డూ 2024-25 సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో విరాట్‌, రోహిత్‌తో పాటు ఏ ప్లస్‌లో ఉండేవారు. ఇప్పుడు ఏ ప్లస్‌ రద్దు కావడంతో బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలోకి వచ్చారు.

ఇకపై సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో మూడు కేటగిరిలు (ఏ, బి, సి) మాత్రమే ఉంటాయని సమచారం. గిల్‌, బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలో ఉండగా.. రో-కోతో పాటు టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, వాషి​ంగ్టన్‌ సుందర్‌, హార్దిక్‌ పాండ్యా, సిరాజ్‌, పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జైస్వాల్‌, కుల్దీప్‌ యాదవ్‌ కేటగిరి బిలో ఉన్నారు.

సి కేటగిరిలో అక్షర్ పటేల్‌, తిలక్ వర్మ, రింకూ సింగ్‌, శివమ్‌ దుబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్‌ జురెల్‌, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్‌ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్‌, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్‌ ఉన్నట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement