Central Contract
-
జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ ప్లేయర్
ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బేతెల్ జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ కాంట్రాక్ట్‌లో ఉన్న బేతెల్.. తాజాగా ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్ జాబితాలో జో రూట్,జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తాజాగా బేతెల్ వీరి సరసన చేరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పేస్ త్రయం జోఫ్రా ఆర్చర్, మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తమ కాంట్రాక్ట్‌ను 2026 వరకు పొడిగించుకున్నారు. దీంతో ఈ ముగ్గురు కూడా రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేరిపోయారు.కాగా, 21 ఏళ్ల బేతెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బేతెల్ టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. బేతెల్ మూడు ఫార్మాట్లకు తగ్గ ప్లేయర్. అందుకే అతనికి రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. బేతెల్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్‌తో తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 8 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. -
సౌతాఫ్రికా క్రికెటర్ షంసీ కీలక నిర్ణయం
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ తబ్రేజ్ షంసీ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్లో భాగమయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, జాతీయ జట్టుకు తన సేవలు అవసరమైన వేళ తప్పకుండా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది.అందుకే ఈ నిర్ణయం‘‘సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దేశవాళీ క్రికెట్ సీజన్ సమయంలో కాస్త విరామంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ మ్యాచ్‌లు ఆడాలని కోరుటుకుంటున్నాను. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలని భావిస్తున్నాను.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ప్రొటిస్ జట్టుకు నా అవసరం ఉందనుకున్న సమయంలో బోర్డు పిలిస్తే కచ్చితంగా దేశానికి ఆడతా’’ అని తబ్రేజ్ షంసీ పేర్కొన్నాడు. కాగా 2016లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తబ్రేజ్ షంసీ.. వన్డే, టీ20 జట్టలో ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా ఎదిగాడు.ఇప్పటి వరకు సౌతాఫ్రికా తరఫున 51 వన్డేలు, 70 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 72, 89 వికెట్లు పడగొట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం షంసీ నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీయగలిగాడు.సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినాఇక షంసీ నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఎనోచ్ తెలిపాడు. సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లలో షంసీ కీలక సభ్యుడని.. సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పడం అతడి నిజాయితీకి నిదర్శనమని ప్రశంసించాడు. కాగా షంసీ ఐపీఎల్‌తో పాటు మరెన్నో టీ20లలో భాగమవుతున్నాడు. చివరగా.. ఈ ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం -
క్రికెట్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల
2024-25 సీజన్‌కు గానూ క్రికెట్ న్యూజిలాండ్ తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 20 మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోగా.. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే సాధారణ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్నారు. ఆల్‌రౌండర్లు నాథన్ స్మిత్, జోష్ క్లార్క్సన్ సైతం తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ బెర్తులు దక్కించుకున్నారు.న్యూజిలాండ్ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా: టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. -
టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది: పాక్ మాజీ క్రికెటర్
పొట్టి ఫార్మాట్ వల్ల క్రికెట్ నాశనమవడం ఖాయమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల మెదళ్లలో టీ20 అనే విషం నిండిపోవడం వల్ల సంప్రదాయ క్రికెట్‌కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. లీగ్ క్రికెట్ వల్ల ఆయా బోర్డులు, ఆటగాళ్లకు డబ్బులు వస్తాయని.. అయితే, ఆటకు మాత్రం నష్టం చేకూరుతుందని పేర్కొన్నాడు.కాగా ఇటీవలి కాలంలో లీగ్ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ప్లేయర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే కాంట్రాక్టును వదులుకోగా.. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ సైతం గురువారం ఇందుకు సంబంధించి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.కాసుల వర్షం వల్లేఫ్రాంఛైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాంట్రాక్ట్ రెన్యువల్‌పై సంతకం చేసేందుకు వీరిద్దరు నిరాకరించారని కివీస్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘శ్రీలంకతో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో ఉండబోనని కాన్వే చెప్పాడు.మరో క్రికెటర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఇది కేవలం న్యూజిలాండ్ బోర్డు సమస్య మాత్రమే కాదు. క్రమక్రమంగా అన్ని దేశాల బోర్డులకు ఇలాంటి తలనొప్పులు వస్తాయి. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇదే బాటలో నడిచినా ఆశ్చర్యం లేదు. ఫ్రాంఛైజీ క్రికెట్ కురిపించే కాసుల వర్షం వల్లే ఆటగాళ్లు అటువైపు ఆకర్షితులవుతున్నారు.ఇండియా లక్కీనిజానికి ఈ విషయంలో ఇండియా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా ఇతర టీ20 టోర్నమెంట్లు ఆడరు. ఏదేమైనా టీ20 పిచ్చి.. ఇక్కడితో ఆగదు. క్రికెట్‌ను.. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుంది. గంటల తరబడి క్రీజులో నిలబడే బ్యాటర్ల పాలిట ఇదొక విషం లాంటిది. ఇండియా మినహా దాదాపు అన్ని దేశాల జట్లు టీ20 క్రికెట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డబ్బు వస్తోంది.. కానీ సంప్రదాయ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు -
శ్రేయస్, ఇషాన్‌ల వేటు పడటానికి కారణం అతడే: జై షా
టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు.మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్నెస్ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.ఆ తర్వాత అయ్యర్ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్‌కప్-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.అతడి నిర్ణయం ప్రకారమేఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్ మీటింగ్‌లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్‌ను మాత్రమే నేను.ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.అయ్యర్ అదుర్స్... ఇషాన్ ఫెయిల్‌కాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్‌గా వస్తున్న ఇషాన్ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం 11 ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్లో జట్టును ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
స్టోయినిస్‌కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్‌కు జాక్ పాట్.. కేవలం మూడు మ్యాచ్‌లకే
టెస్టు క్రికెట్ అరంగేట్రంలోనే సత్తాచాటిన టీమిండియా ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ జాక్ పాట్ తగిలింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. వీరిద్దరికి గ్రేడ్-సీ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం (మార్చి 18) జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బీసీసీఐ కాంట్రాక్టు పొందాలంటే ప్రస్తుత సీజన్ లో కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ ఇంగ్లండ్ తో చెరో మూడు టెస్టులు ఆడిన కారణంగా నేరుగా సీ-గ్రేడు జాబితాలో బీసీసీఐ చేర్చింది. సీ-గ్రేడ్ కేటగీరీ కింద వీరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ అదరగొట్టాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం సత్తాచాటాడు. రాంచీ టెస్టులో 90, 39 స్కోర్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ధ్రువ్ నిలిచాడు. వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగానే కేవలం మూడు మ్యాచ్‌లకే బీసీసీఐ కాంట్రాక్ట్‌లు అప్పగించింది. కాగా 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అనూహ్యంగా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. -
BCCI: వాళ్లపై వేటు.. 30 ఏళ్ల వయసులో వీళ్లకు ఛాన్స్! రూ. కోటి..
ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి వరాల జల్లు కురిపించింది. ప్రతిభను నిరూపించుకునే వారికి సముచిత స్థానం కల్పిస్తూ తాజా వార్షిక కాంట్రాక్ట్‌ల(2023-24)లో పెద్దపీట వేసింది. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించిన ఆటగాళ్లను సహించేది లేదంటూ కొరడా ఝులిపించింది. ‘వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించడం ఇందుకు నిదర్శనం. రంజీల్లో ఆడమని ఆదేశించినా వీరిద్దరు బేఖాతరు చేసినందుకు వల్లే ఇలా వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సంగతి ఇలా ఉంటే.. యువ సంచలనం, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ డబుల్ ప్రమోషన్ పొంది నేరుగా ‘బి’ గ్రేడ్ క్రాంటాక్ట్ దక్కించుకున్నాడు. అతడితో పాటు మరో పది మంది కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. వీరంతా ‘సి’ గ్రేడ్‌లో ఉండటం గమనార్హం. అంటే మ్యాచ్ ఫీజులతో పాటు రూ. కోటి వార్షిక వేతనం అందుకుంటారన్నమాట..! ఆ పది మంది ఎవరు? వారి ప్రదర్శన ఎలా ఉంది?! రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటిన ఉత్తరప్రదేశ్ బ్యాటర్ రింకూ సింగ్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక రింకూ ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు ఆడి 176.23 స్ట్రైక్‌రేటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 20 సిక్స్‌లు, 31 ఫోర్లు బాదాడు. ఇక వన్డేల్లోనూ అడుగుపెట్టిన 26 ఏళ్ల లెఫ్టాండర్ రింకూ సింగ్ రెండు మ్యాచ్‌లలో కలిపి 55 పరుగులు సాధించాడు. నంబూరి తిలక్ వర్మ హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అండర్19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. రెండు సీజన్లలో కలిసి 740 పరుగులు చేసి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు ఆడి 336, నాలుగు వన్డేలు ఆడి 68 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్‌గా పేరొందిన మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. టీమిండియా తరఫున ఆరు వన్డేలు ఆడి 115, 19 టీ20లు ఆడి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా క్రీడల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన 27 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ గోల్డ్ మెడల్ అందించాడు. శివం దూబే సీఎస్కే స్టార్ క్రికెటర్, ముంబై పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే 2019లోనే టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అయితే, చాలాకాలం పాటు మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో ఈ ఏడాది అఫ్గనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేసిన 30 ఏళ్ల దూబే.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 21 టీ20లు ఆడి 276 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు తీశాడు. రవి బిష్ణోయి రాజస్తాన్‌కు చెందిన రవి బిష్ణోయి 2022లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్.. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 24 టీ20లు, ఒక వన్డే ఆడి ఆయా ఫార్మాట్లలో 36, 1 వికెట్ పడగొట్టాడీ 23 ఏళ్ల బౌలర్. ముకేశ్ కుమార్ బెంగాల్ పేసర్, 30 ఏళ్ల ముకేశ్ కుమార్ గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 6 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఈ రైటార్మ్ బౌలర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 5, 12 వికెట్లు తీశాడు. ప్రసిద్ కృష్ణ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ ప్రసిద్ కృష్ణ. 28 ఏళ్ల ఈ కర్ణాటక బౌలర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో రెండు టెస్టుల్లో రెండు వికెట్లు తీసిన 28 ఏళ్ల ప్రసిద్.. 17 వన్డేలు, 5 టీ20లలో 29, 8 వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్. 27 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 8 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడి 9, 19 వికెట్లు తీశాడు. రజత్ పాటిదార్ లేటు వయసులో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటిదార్. 1993లో ఇండోర్‌లో జన్మించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2023లో తొలిసారి టీమిండియా(వన్డే)కు ఆడాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఒక వన్డేలో 22, మూడు టెస్టుల్లో కలిపి 63 పరుగులు సాధించాడు. జితేశ్ శర్మ విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్ ఇప్పటి వరకు 9 టీ20లు ఆడి 100 పరుగులు చేశాడు. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు -
BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్‌గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్‌లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. -
Yashasvi Jaiswal: ప్రతిభకు దక్కిన గౌరవం
2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. 30 మంది పేర్లు గల ఈ జాబితాలో అందరూ ఊహించిన విధంగానే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను వీరిపై వేటు పడినట్లు తెలుస్తుంది. వీరితో పాటు చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధవన్ లాంటి వెటరన్లను బీసీసీఐ పక్కకు పెట్టింది. సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా వేటు పడింది. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్‌లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. ప్రతిభకు దక్కిన గౌరవం.. సహజంగా తొలిసారి కాంట్రాక్ట్ లభించే ఆటగాళ్లకు బీసీసీఐ తొలుత సి గ్రేడ్‌లో అవకాశం ఇస్తుంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ పొంది జాక్‌పాట్ కొట్టాడు. ఈ కాంట్రాక్ట్ అనేది అతనికి ఆషామాషీగా లభించింది కాదు. ఈ యువ కెరటం ఆడిన 8 టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 971 పరుగులు చేశాడు. ఇందులో ఇటీవల ఇంగ్లండ్‌పై చేసిన వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో అతను రికార్డు స్థాయిలో 4 మ్యాచ్‌ల్లో 655 పరుగులు చేసి కోహ్లి పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. యశస్వి మెరుపులు టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ యువ ఆటగాడు టీ20ల్లో సైతం సత్తా చాటాడు. ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో సెంచరీ, 4 అర్దసెంచరీల సాయంతో 161 స్ట్రయిక్‌రేట్‌తో 502 పరుగులు చేశాడు. ఈ స్థాయిలో రాణించిన కారణంగానే అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. -
సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్‌లకు జాక్‌పాట్
టీమిండియా బ్యాటింగ్ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్‌లకు జాక్‌పాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్‌తో జరుగబోయే తదుపరి టెస్ట్‌లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లే ఆడారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్‌ల అనంతరం వీరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్‌కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్ సి కింద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్‌లను కోల్పోగా.. రింకూ సింగ్ (సి), తిలక్ వర్మ (సి), ప్రసిద్ద్ కృష్ణ (సి), అవేశ్ ఖాన్ (సి), రజత్ పాటిదార్ (సి), జితేశ్ శర్మ (సి), ముకేశ్ కుమార్ (సి), రవి బిష్ణోయ్‌కు (సి) కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ (బి), ఇషాన్‌లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
అనుకున్నదే అయ్యింది.. బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్, శ్రేయస్
భారత క్రికెట్ అభిమానులు ఊహించిందే నిజమైంది. రంజీల్లో ఆడమని ఎంత చెప్పినా వినకుండా విర్రవీగిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. తాజాగా ప్రకటించిన బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి పేర్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన ఆటగాళ్లలో రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా ఏ ప్లస్ స్థానాలను నిలుపుకోగా.. బి కేటగిరి నుంచి శ్రేయస్, సి కేటగిరి నుంచి ఇషాన్ తొలగించబడ్డారు. గతకొంతకాలంగా జట్టులో లేనప్పటికీ హార్దిక్ పాండ్యా ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను నిలుపుకోగా.. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు ప్రమోషన్ (బి నుంచి ఏ కేటగిరి) దక్కింది. యశస్వికి జాక్‌పాట్.. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. కాంట్రాక్ట్ కోల్పోయిన వారు వీరే.. బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో చాలా మంది పేర్లు కనపడలేదు. యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. అక్షర్, పంత్‌లకు డిమోషన్ (ఏ నుంచి బి) కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్న తిలక్ వర్మ, రింకూ సింగ్ కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కనున్న మొత్తం.. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. 2023-24 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు.. ఏ ప్లస్ కేటగిరి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ కేటగిరి: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా బి కేటగిరి: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ సి కేటగిరి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్ చదవండి: రంజీల్లో ఆడాల్సిందే.... ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ -
యశస్వి, శివమ్ దూబేలకు బంపర్ ఆఫర్..!
టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలకు బంపర్ ఆఫర్ తగిలేలా ఉంది. ఈ ఇద్దరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతకొంతకాలంగా పొట్టి క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న వీరిరువురికి సెంట్రల్ కాంట్రాక్ట్‌తో గుర్తింపునివ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరు శుభవార్త వినే అవకాశం ఉందని భారత క్రికెట్ సర్కిల్స్ కోడైకూస్తున్నాయి. బీసీసీఐ గతేడాది (2022-23) మొత్తం 26 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ అందించింది. 2023-24 బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో కొత్తగా యశస్వి, దూబే చేరవచ్చు. కాగా, ప్రస్తుతం స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో యశస్వి, దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా శివమ్ దూబే తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో అతను రెండు అజేయ అర్ధశతకాలతో (60, 63) పాటు మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గతేడాది ఐర్లాండ్ టూర్‌తో మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి (టీ20 జట్టు) రీఎంట్రీ ఇచ్చిన దూబే అప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్నాడు (20 టీ20ల్లో 45.83 సగటున 275 పరుగులు, 8 వికెట్లు). అంతకముందు ఐపీఎల్ 2023లో దూబే సీఎస్కే తరఫున విశ్వరూపమే ప్రదర్శించాడు. ఆ సీజన్లో అతను 16 మ్యాచ్‌ల్లో 158.33 స్ట్రయిక్‌రేట్‌తో 418 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, 35 సిక్సర్లు ఉన్నాయి. దూబే బౌలింగ్‌లో ఇంకాస్త మెరుగై, బ్యాటింగ్ ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జైస్వాల్ అరంగేట్రం నాటి నుంచి టెస్ట్, టీ20ల్లో చెలరేగిపోతున్నాడు. గతేడాది వెస్టిండీస్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్.. నాటి నుంచి 4 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడి 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు చేశాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో జైస్వాల్ (68).. దూబేతో కలిసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. -
ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం.. మొయిన్ అలీ బాటలోనే..!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం న్యూజిలాండ్ జట్టులో చేరేందుకు అంగీకరించాడు. గతేడాది ఆగస్ట్‌లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్.. బోర్డు విజ్ఞప్తి మేరకుతో మళ్లీ కివీస్ తరఫున బరిలోకి దిగేందుకు ఓకే చెప్పాడు. న్యూజిలాండ్ ప్రజలు బోల్ట్‌ను వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులోకి తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తేవడంతో NZC ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ బోర్డు 20 మంది ఆటగాళ్లకు 2023-24 సీజన్ సెంట్రల్ కాంట్రక్ట్ ఇచ్చిన రోజే (జూన్ 8) ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, బౌల్ట్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు, అలాగే కుటుంబంతో గడిపేందుకు గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌల్ట్.. 2023 వరల్డ్‌కప్‌లో కూడా న్యూజిలాండ్ జట్టులో భాగం కావాలని ఆ దేశ ప్రజలు కోరుకున్నారు. చివరి రెండు వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరడంలో బౌల్ట్ కీలకపాత్ర పోషించాడు. 2015లో ఆసీస్ మిచెల్ స్టార్క్‌తో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా (22).. 2019లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) నిలిచాడు. ఓవరాల్‌గా బౌల్ట్ వరల్డ్‌కప్‌లలో 21.79 సగటున 39 వికెట్లు పడగొట్టి, ఆ దేశం తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 7) ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సైతం తన దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ ప్రకటించాక కూడా టెస్ట్‌ల్లో ఆడేందుకు ఒప్పుకున్నాడు. ఈసీబీ మొయిన్ అలీని యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో మొయిన్ దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మొయిన్ 2021లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం -
బంపర్ ఆఫర్ కొట్టిన సంజూ శాంసన్
టీమిండియాలో సమీకరణలు, ఇతరత్రా కారణాల చేత సరైన అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయిన టాలెంటెడ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఎట్టకేలకు ఓ విషయంలో న్యాయం చేసింది. జట్టుకు ఎంపికైనా రకరకాల కారణాల చేత తుది జట్టులో అడే అవకాశాలను కోల్పోతున్న సంజూకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి తగిన గుర్తింపునిచ్చింది. సంజూకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. గ్రేడ్ సి కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో చోటు కల్పించింది. ఈ ఒప్పందం మేరకు సంజూకు రూ. కోటి వార్షిక వేతనం లభించనుంది. సంజూతో పాటు దీపక్ హుడా, కేఎస్ భరత్, అర్షదీప్ సింగ్‌లకు బీసీసీఐ తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వీరిని కూడా బీసీసీఐ గ్రేడ్ సి కేటగిరిలో చేర్చింది. వీరికి కూడా ఏటా కోటి రూపాయల వేతనం లభించనుంది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో చాలా మార్పులు చేసిన బీసీసీఐ.. ఏ గ్రేడ్‌లో ఉన్న రవీంద్ర జడేజాను ఏ ప్లస్ (7 కోట్లు) గ్రేడ్‌కు ప్రమోట్ చేయగా.. వరుస వైఫల్యాల బాట పట్టిన కేఎల్ రాహుల్‌ను ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌కు డిమోట్ చేసింది. ఇటీవల ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్‌ను బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోట్ చేసిన బీసీసీఐ.. వెటరన్ ఆటగాళ్లు ఆజింక్య రహానే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లను పూర్తిగా కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించింది. ఆశ్చర్యకరంగా ఏ ఫార్మాట్లో కూడా అవకాశాలు దక్కని మరో వెటరన్ ప్లేయర్ శిఖర్ ధవన్ బీసీసీఐతో సి గ్రేడ్ కాంట్రక్ట్‌ను నిలబెట్టుకున్నాడు. కాంట్రాక్ట్ జాబితా (మొత్తం 26 మంది) ►‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. ►‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్. ►‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్. ►‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్. -
భువనేశ్వర్‌కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే!
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బిగ్ షాకిచ్చింది. తమ వార్షిక కాంట్రాక్ట్ జాబితా నుంచి భువనేశ్వర్‌ను బీసీసీఐ తొలిగించింది. బీసీసీఐ తాజగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్ట్‌లో భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కలేదు. భువీతో పాటు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మకు కూడా తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు. కాగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భువీని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. గతేడాది ఆసియాకప్ నుంచి భువీ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఆసియాకప్-2022లో ఆప్గానిస్తాన్‌పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ కూడా భువనేశ్వర్ విఫలమయ్యాడు. అనంతరం టీ20 ప్రపంచకప్‌లో కూడా తన చెత్త ఫామ్‌ను భువీ కొనసాగించాడు. ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కేవలం 4వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అయితే రెండు ఓవర్లు వేసిన భువనేశ్వర్ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ నుంచి భువీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ తన వార్షిక కాంట్రాక్ట్ కూడా కోల్పోవడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భువీ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్నద్దం అవుతున్నాడు. అతడు ఇప్పటికే ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతున్నాడు. బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా (మొత్తం 26 మంది) ►‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. ►‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్. ►‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్. ►‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్‌దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్ చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు -
బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు
BCCI Central Contract 2022-2023- ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గత ఏడాది ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రమోషన్ సాధించి ‘ఎ ప్లస్’ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉండగా, ఇప్పుడు ‘బి’కి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న అక్షర్ పటేల్‌కు ‘ఎ’ గ్రేడ్‌లోకి ప్రమోషన్ లభించింది. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు తొలిసారి బోర్డు కాంట్రాక్ట్ (సి గ్రేడ్) దక్కడం విశేషం. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లు తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. కాంట్రాక్ట్ జాబితా (మొత్తం 26 మంది) ►‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. ►‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్. ►‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్. ►‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్‌దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్. చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. -
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్.. హార్ధిక్‌తో పాటు ఆ ఇద్దరిపై కనక వర్షం..!
బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ఎన్నికల కారణంగా ఆలస్యమైన సెంట్రల్ కాంట్రాక్ట్స్ కొత్త జాబితా ప్రకటనకు మార్గం సుగమమైంది. వచ్చే నెలలో కొత్త జాబితా ప్రకటించేందుకు బీసీసీఐ ఇప్పటికే సన్నాహకాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈసారి ప్రకటించబోయే జాబితాలో అనూహ్య మార్పులు జరిగే అవకాశం ఉందని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు ఉప్పందించారు. టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువ స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌లకు భారీ ప్రమోషన్ దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురికి గ్రేడ్-ఏ జాబితాలో చోటు ఖాయమైందని సమాచారం. వీరితో పాటు ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్‌లకు కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరికి గ్రేడ్-సి జాబితాలో చోటు దక్కడం దాదాపుగా ఖరారైనట్లు వినికిడి. గ్రేడ్-ఏ+ జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో అలాగే కొనసాగుతారని తెలుస్తోంది. ఇక, సెంట్రల్ కాంట్రాక్ట్స్ కోల్పోయే ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శిఖర్ ధవన్, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్దిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురు వచ్చే సెంటల్ర్ కాంట్రాక్ట్స్‌లో చోటు కోల్పోవడం దాదాపుగా ఖరారైందని సమాచారం. ఇదిలా ఉంటే, డిసెంబర్లో జరిగిన బీసీసీఐ ఏపెక్స్ కమిటీ సమావేశంలో ఆటగాళ్ల వేతన సవరణ అంశంపై కూడా డిస్కషన్ జరిగినట్లు బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఏ+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లుకు 7 నుంచి 10 కోట్లు, ఏ కేటగిరీలో ఉన్నవారికి 5 నుంచి 7, బి కేటగిరీలో ఉన్న ప్లేయర్స్‌కు 3 నుంచి 5, సి కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు కోటి నుంచి 3 కోట్లకు వార్షిక వేతనం పెరుగనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. ప్రస్తుత బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్ట్స్.. ఏ+ గ్రేడ్ (7 కోట్లు): విరాట్ కోహ్లి, బుమ్రా, రోహిత్ శర్మ ఏ గ్రేడ్ (5 కోట్లు): రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ బి గ్రేడ్ (3 కోట్లు): చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా సి గ్రేడ్ (కోటి): శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, యుజ్వేంద్ర చహల్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్ -
ప్రైవేట్ లీగ్స్ మోజులో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. న్యూజిలాండ్ జట్టులోని టాప్ ఆటగాళ్లకు బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తుంది. విదేశీ లీగ్స్‌తో జరిగిన ముందస్తుగా ఒప్పందం జరగడంతోనే కివీస్ బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నట్లు నీషమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే నీషమ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడని బోర్డు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని జేమ్స్ నీషమ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చాడు. ''సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకొని దేశం తరపున కాకుండా డబ్బు కోసం విదేశీ లీగ్స్ ఆడడంపై అందరూ నన్ను తప్పుబడతారని ఊహించగలను. కానీ జూలై వరకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా వదులుకునేవాడిని కాదు. అదే సమయంలో విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం నాకు శాపంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న నిర్ణయంతో బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్టు వదులుకోవాల్సి వచ్చింది. బ్లాక్‌క్యాప్స్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా. అయితే భవిష్యత్తులో మాత్రం తోటి ఆటగాళ్లతో కలిసి దేశం తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నా'' అంటూ తెలిపాడు. ఇక జేమ్స్ నీషమ్ న్యూజిలాండ్ తరపున 12 టెస్టుల్లో 709 పరుగులు.. 14 వికెట్లు, 71 వన్డేల్లో 1409 పరుగులు.. 69 వికెట్లు, 48 టి20ల్లో 607 పరుగులు.. 25 వికెట్లు పడగొట్టాడు. నీషమ్ ఖాతాలో రెండు టెస్టు సెంచరీలు ఉండడం విశేషం. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు -
న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్.. వైదొలిగిన స్టార్ బౌలర్
న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆ దేశ సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) బుధవారం ధృవీకరించింది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకు బౌల్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌జెడ్‌సీ వెల్లడించింది. బౌల్ట్ నిర్ణయంతో జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటామని (అతని సమ్మతం మేరకు) ఎన్‌జెడ్‌సీ పేర్కొంది. బౌల్ట్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకునే అవకాశం ఉందని తెలిపింది. తమ దేశ స్టార్ బౌలర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం బాధాకరమని, అతని భవిష్యత్తు మరింత బాగుండాలని విష్ చేసింది. ఇప్పటివరకు అతను జట్టుకు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటారు. బౌల్ట్ తాజాగా నిర్ణయంతో అతను అనధికారికంగా న్యూజిలాండ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనట్లే అవుతుంది. 33 ఏళ్ల బౌల్ట్ 2011లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ సహకారాన్నందించాడు. అతని జట్టులో ఉండగా కివీస్ అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా కొనసాగింది. కివీస్ తరఫున 78 టెస్ట్‌లు, 93 వన్డేలు, 44 టీ20 ఆడిన బౌల్ట్.. మొత్తం 548 వికెట్లు (టెస్ట్‌ల్లో 317, వన్డేల్లో 169, టీ20ల్లో 62) పడగొట్టాడు. చదవండి: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్!
టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో ప్రమోషన్ లభించనున్నట్లు సమాచారం. తాజాగా ప్రకటించనున్న సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరికి ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2021 వార్షిక ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్‌లో వీరిద్దరు గ్రేడ్-ఏలో ఉన్నారు. కొంతకాలంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోయారు. తమకు ఇచ్చిన అవకాశాలను వృథా చేసుకోకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతుండడంతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తోంది.ఇప్పటివరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. చదవండి: కేఎల్ రాహుల్ ఏ కోశాన్నైనా కెప్టెన్లా అనిపిస్తున్నాడా: బీసీసీఐ అధికారి అదే సమయంలో టీమిండియా సీనియర్ క్రికెటర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలకు కాంట్రాక్ట్‌లో డిమోషన్ లభించనుందని వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా ఈ ఇద్దరు క్రికెటర్లు సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న రహానే, పుజారాలను గ్రేడ్-బి కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 28 మంది ఆటగాళ్లతో జాబితా తయారు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటించేందుకు ముగ్గురు ఆఫీస్ బేరర్స్‌తో పాటు.. ఐదుగురు సెలక్టర్లు... జాతీయస్థాయి కోచ్‌లతో కమిటీ సిద్ధమైంది. త్వరలోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించనున్నారు. ఇక ఏడాది కాలంగా బౌలర్‌గా మంచి ప్రదర్శన ఇస్తున్న మహ్మద్ సిరాజ్‌ను గ్రేడ్ సి నుంచి గ్రేడ్ బికి మార్చే అవకాశం ఉంది. టెస్టుల్లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్‌తో పాటు హనుమ విహారిలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఇక ఉమేశ్ యాదవ్, ఇషాంత్శర్మలకు డిమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీసీసీఐ ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ నాలుగు కేటగిరీలు. అవి ఏ ప్లస్, ఏ , బి, సిలుగా ఉన్నాయి. ►ఏ ప్లస్ కేటగిరి కింద ఒక్కో ఆటగానికి వార్షిక కాంట్రాక్ట్‌పై రూ.7 కోట్లు చెల్లిస్తారు ►ఏ కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.5 కోట్లు చెల్లిస్తారు. ►బి కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.3 కోట్లు చెల్లిస్తారు ►సి కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి చెల్లిస్తారు. గత సీజన్ (2021) బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా: ►గ్రేడ్ ఏ ప్లస్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ►గ్రేడ్ ఏ: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ►గ్రేడ్ బి: వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ ►గ్రేడ్ సి: కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, శుబ్‌మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్ -
ఆసీస్ క్రికెటర్లకు పేరంటల్ లీవ్స్
సిడ్నీ: క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) కొత్తగా పేరంటల్ లీవ్స్‌ను ప్రవేశపెట్టింది. సీఏ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు ఇకపై ఈ సెలవుల్ని తీసుకోవచ్చని సీఏ తెలిపింది. ఇందులో భాగంగా మహిళా క్రికెటర్ తల్లయితే గరిష్టంగా 12 నెలలు సెలవులో ఉండొచ్చు. కాంట్రాక్టులో భాగంగా ఆమెకు రావాల్సిన ఆరి్థక ప్రయోజనాలి్న, వేతనంతో కూడిన సెలవుల్ని మంజూరు చేస్తారు. ప్రాథమికంగా మహిళా క్రికెటర్లకే ఇవ్వాలనుకున్నప్పటికీ పురుష క్రికెటర్లు తండ్రి అయినా కూడా సెలవులు ఇవ్వాలని సీఏ నిర్ణయించింది. అయితే వీరికి గరిష్టంగా మూడు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఈ జూలై 1 నుంచే ఇది అమల్లోకి వచి్చందని సీఏ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టు వ్యవధి మేరకు సెలవులు పూర్తయ్యాక గ్యారంటీగా కాంట్రాక్టు పొడిగింపు ఉంటుందని సీఏ భరోసా ఇచి్చంది. చిన్నారుల్ని దత్తత తీసుకున్నా సెలవులు తీసుకోవచ్చని సీఏ తెలిపింది. -
భారత రెజ్లర్లకూ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు
న్యూఢిల్లీ: వివిధ వేదికలపై పతకాలతో సత్తా చాటుతూ, భారత కీర్తి పతాకను ఎగురేస్తున్న రెజర్లకు తీపి కబురు. ఇప్పటి వరకు క్రికెట్ వంటి క్రీడల్లోనే ఉన్న వార్షిక సెంట్రల్ కాంట్రాక్టును త్వరలో వీరికీ వర్తింపజేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 150 మంది రెజ్లర్లు ఈ కాంట్రాక్టు పరిధిలోకి రానున్నారు. ‘ఎ’ నుంచి ‘ఐ’ వరకు కేటగిరీలుగా విభజించి వర్తింపజేయనున్న కాంట్రాక్టులో రెజ్లర్లకు ఏడాదికి గరిష్ఠంగా రూ.30 లక్షలు, కనిష్టంగా రూ.30 వేలు ఇస్తారు. మంగళవారం ఢిల్లీలో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2తో ముగియనున్న జాతీయ సీనియర్ పోటీల అనంతరం కాంట్రాక్టు అమలు చేయనున్నారు. రెజ్లర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మున్ముందు మరికొందరు ఈ క్రీడ పట్ల మొగ్గుచూపేందుకు ఇది ఉప యోగపడుతుందని సమాఖ్య భావిస్తోంది. -
ఏసీయూ నివేదిక తర్వాతే!
న్యూఢిల్లీ: పీకల్లోతు కేసుల్లో ఇరుక్కున్న పేసర్ మొహమ్మద్ షమీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి సెంట్రల్ కాంట్రాక్టు రావాలన్నా, ఈ సీజన్లో ఐపీఎల్ ఆడాలన్నా అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నుంచి క్లీన్చిట్ కావాల్సిందేనని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ నియమావళిలోని క్రికెటర్ల ఎథిక్స్ కోడ్ ప్రకారం కేవలం అవినీతి, అనుచిత ఆర్థిక వ్యవహారాల్లో మాత్రమే బోర్డు జోక్యం చేసుకుంటుంది. వ్యక్తిగత, వైవాహిక అంశాలు బోర్డు పరిధిలోకి రావని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏసీయూ చీఫ్ నీరజ్ కుమార్... షమీ భార్య హసీన్ జహాన్ పేర్కొన్న ఆర్థిక లావాదేవీపైనే విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. తన భర్త పాకిస్తానీ ప్రియురాలికి, మొహమ్మద్ భాయ్‌కి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని హసీన్ ఆరోపించింది. బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని ఏసీయూ హెడ్ నీరజ్ కుమార్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏసీయూ షమీకి క్లీన్చిట్ ఇస్తే సెంట్రల్ కాంట్రాక్టుతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడే అవకాశమిస్తామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా చెప్పారు. -
టి20 స్టార్లకు కాంట్రాక్ట్ లేదు
♦ వెస్టిండీస్ బోర్డు జాబితాలో ♦ లేని బ్రేవో, స్యామీ, రస్సెల్ సెయింట్ జాన్స్ (అంటిగ్వా): వెస్టిండీస్ టి20 కెప్టెన్ డారెన్ స్యామీ, ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రస్సెల్ తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. ఈమేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) నిర్ణయం తీసుకుంది. 2015-16 సీజన్‌కు ప్రకటించిన జాబితాలో వీరితో పాటు స్పిన్నర్ సులేమాన్ బెన్, శివనారాయణ్ చందర్‌పాల్‌కు కూడా చోటు దక్కలేదు. అక్టోబర్ 1, 2015 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండే ఈ కాంట్రాక్ట్‌లో ఆటగాళ్లను 12 నుంచి 15 మందికి పెంచారు. క్రిస్‌గేల్, నరైన్ గతేడాది కూడా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో లేరు. కాంట్రాక్టుల్లో ఉంటే బోర్డు చెప్పినట్లు వినాలి. అన్ని లీగ్‌లలో ఆడటం కుదరదు.