మొహమ్మద్ షమీ
న్యూఢిల్లీ: పీకల్లోతు కేసుల్లో ఇరుక్కున్న పేసర్ మొహమ్మద్ షమీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి సెంట్రల్ కాంట్రాక్టు రావాలన్నా, ఈ సీజన్‌లో ఐపీఎల్ ఆడాలన్నా అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నుంచి క్లీన్‌చిట్ కావాల్సిందేనని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ నియమావళిలోని క్రికెటర్ల ఎథిక్స్ కోడ్ ప్రకారం కేవలం అవినీతి, అనుచిత ఆర్థిక వ్యవహారాల్లో మాత్రమే బోర్డు జోక్యం చేసుకుంటుంది. వ్యక్తిగత, వైవాహిక అంశాలు బోర్డు పరిధిలోకి రావని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఏసీయూ చీఫ్ నీరజ్ కుమార్... షమీ భార్య హసీన్ జహాన్ పేర్కొన్న ఆర్థిక లావాదేవీపైనే విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. తన భర్త పాకిస్తానీ ప్రియురాలికి, మొహమ్మద్ భాయ్‌కి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని హసీన్ ఆరోపించింది. బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని ఏసీయూ హెడ్ నీరజ్ కుమార్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏసీయూ షమీకి క్లీన్‌చిట్ ఇస్తే సెంట్రల్ కాంట్రాక్టుతో పాటు ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడే అవకాశమిస్తామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment