Hasin Jahan
-
కూతురితో షమీ వీడియో.. హసీన్ జహాన్ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపై హసీన్ జహాన్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కేవలం ప్రచార యావతోనే తన కుమార్తెను షాపింగ్‌మాల్‌కు తీసుకువెళ్లాడని.. అంతే తప్ప అతడికి కూతురిపై ప్రేమ లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా 2014లో షమీ హసీన్ జహాన్ అనే మోడల్‌ను పెళ్లి చేసుకున్నాడు.వీరికి 2015లో కూతురు జన్మించగా ఐరా అని నామకరణం చేశారు. అయితే, కొన్నాళ్లకు షమీ- హసీన్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో తన భర్త వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపించిన హసీన్.. మ్యాచ్ ఫిక్సింగ్, గృహహింసకు పాల్పడ్డాడంటూ అతడిని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానంలో షమీకి ఊరట దక్కింది.2018 నుంచి షమీ- హసీన్ విడివిడిగానేఈ నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడివిడిగానే ఉంటున్నారు. కుమార్తె ఐరా తల్లి వద్దనే పెరుగుతోంది. ఈ క్రమంలో షమీ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘‘సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తనను కలిసేంత వరకు కాలం ఇలాగే గడుస్తుంది. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను బెబో’’ అంటూ షమీ తన కుమార్తెను హత్తుకుని ఉన్న దృశ్యాలను షేర్ చేశాడు. ఇందులో అతడు ఐరాను షాపింగ్‌కు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. కూతురికి దూరంగా ఉండటం నరకమంటూ షమీ పట్ల నెటిజన్లు సానుభూతి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హసీన్ జహాన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ‘‘ఇదంతా కేవలం షో ఆఫ్ కోసమే. నా కూతురు పాస్ట్‌పోర్టు గడువు ముగిసింది.అందుకే ఐరాను అక్కడకు తీసుకువెళ్లాడుకొత్త పాస్‌పోర్టు కావాలంటే షమీ సంతకం అవసరం. అందుకే ఐరా తన తండ్రి దగ్గరకు వెళ్లింది. అయితే, అతడు మాత్రం సంతకం చేయనేలేదు. నా కూతురిని తీసుకుని షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. ఆ కంపెనీకే షమీ ప్రచారకర్తగా ఉన్నాడు.ఆ షాపులో నా కూతురికి షూస్, బట్టలు కొనిచ్చాడు. వాటికి అతడు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకే ఐరాను అక్కడకు తీసుకువెళ్లాడు. నా కూతురు తనకు గిటార్, కెమెరా కావాలని అడిగింది. కానీ.. అతడు వాటిని కొనివ్వనేలేదు.అతడు నా కూతురు గురించి ఎప్పుడూ ఆలోచించడు. గత నెలలో కూడా ఐరాను కలిశాడు. కానీ అప్పుడు ఇలాంటి వీడియోలేవీ షేర్ చేయలేదు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాడు’’ అని హసీన్ జహాన్ పేర్కొన్నట్లు ఆనంద్‌బజార్.కామ్ తెలిపింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పితో టీమిండియాకు దూరమైన షమీ ఇంకా రీఎంట్రీ ఇవ్వలేదు.చదవండి: IND VS BAN 1st T20: వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..! View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
రోజూ కేజీ మటన్ తింటాడు: షమీ ఫ్రెండ్
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న ఈ వెటరన్ పేసర్ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవలే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.ఇదిలా ఉంటే.. షమీ వ్యక్తిగత జీవితంలో పడ్డ కష్టాల గురించి అతడి ప్రాణ స్నేహితుడు ఉమేశ్ కుమార్ తాజాగా వెల్లడించాడు. ఈ ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.ఆరోజు తనని అలా చూడగానే భయం వేసింది‘‘షమీకి అది నిజంగా గడ్డుకాలం. ఆరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో నీళ్లు తాగేందుకు నేను నిద్రలేచాను. కిచెన్ వైపు వెళ్తూ.. బాల్కనీ వైపు చూశా. అప్పుడు షమీ వాళ్ల బాల్కనీ చివర నిల్చుని కిందకు చూస్తున్నాడు. మేము ఉండేది 19వ ఫ్లోర్. అతడి ఆలోచన ఏమిటో నేను పసిగట్టాను. నాకెంతోగానో భయం వేసింది’’ అని ఉమేశ్ కుమార్ చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.అయితే, అదృష్టవశాత్తూ షమీపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయాయని.. తిరిగి టీమిండియాకు ఆడి తానేంటో నిరూపించుకున్నాడని ఉమేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా షమీ మాజీ భార్య హసీన్ జహాన్ అప్పట్లో అతడిపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.స్త్రీలోలుడైన మహ్మద్ షమీ పాకిస్తానీల నుంచి డబ్బు తీసుకుని మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని బాంబు పేల్చింది. అంతేకాదు తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. ఈ క్రమంలో షమీ కెరీర్ ప్రమాదంలో పడగా.. లోతుగా దర్యాప్తు జరిపిన బీసీసీఐ విచారణ కమిటి అతడికి క్లీన్ చిట్ ఇచ్చింది.ఇక అనేక అవాంతరాల అనంతరం హసీన్ జహాన్ నుంచి షమీ పూర్తిగా విడిపోయాడు. అయితే, నాటి పరిస్థితుల్లో డిప్రెషన్‌కు లోనైన షమీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని ఉమేశ్ కుమార్ శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో తాజాగా వెల్లడించాడు. అదే విధంగా.. షమీ డైట్ గురించి ఓ సీక్రెట్ కూడా పంచుకున్నాడు.కేజీ మటన్ ఉండాల్సిందే‘‘షమీ రోజుకు కిలో మటన్ తింటాడు. డైట్లో ఏమైనా తేడాలు వస్తే సహిస్తాడేమో గానీ.. మటన్ లేకుంటే మాత్రం అతడికి కోపం వస్తుంది. ఒక్కరోజైతే మటన్ లేకుండా ఉంటాడు.. కానీ రెండో రోజు అస్సలు ఊరుకోడు. మూడో రోజు కూడా మటన్ పెట్టలేదంటే పిచ్చోడైపోతాడు.అంతేకాదు.. అతడి బౌలింగ్ స్పీడ్ గంటకు పదిహేను కిలోమీటర్ల మేర తగ్గినా తగ్గొచ్చు’’ అంటూ ఉమేశ్ కుమార్ సరదాగా చెప్పుకొచ్చాడు. షమీకి అన్నింటికంటే మటన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు. అదే విధంగా.. షమీకి షాపింగ్ చేయడం అంటే సరదా అని.. మ్యాచ్‌లు లేనపుడు తనను ఢిల్లీలో షాపింగ్‌కు తీసుకువెళ్తాడని ఉమేశ్ కుమార్ తమ స్నేహబంధం గురించి చెప్పాడు.చదవండి: Paris Olympics 2024: పూర్తి షెడ్యూల్, ఆరంభ సమయం.. అథ్లెట్ల వివరాలు -
షమీపై మరోసారి సంచలన ఆరోపణలు.. ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా స్టార్ పేసర్‌గా నీరాజనాలు అందుకుంటున్న మహ్మద్ షమీ కెరీర్లో ఉన్నతస్థితిలో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా లెక్కచేయక వన్డే వరల్డ్‌కప్-2023లో అదరగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఘనత అతడి సొంతం. అయితే, చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఆటకు దూరమైన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్-2024 మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు ఈ గుజరాత్ టైటాన్స్ బౌలర్. ఇదిలా ఉంటే.. కెరీర్‌పరంగా బాగానే ఉన్న షమీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కుదుపు వస్తూనే ఉంది. 2014లో హసీన్ జహానే అనే మహిళను పెళ్లాడాడు షమీ. ఈ జంటకు 2015లో కూతురు ఐరా జన్మించింది. కానీ.. కొంతకాలం తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా.. భర్తపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస అంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని సుప్రీంకోర్టు గడప తొక్కించింది. అరెస్టు చేయించాలని చూసింది. అయితే, విచారణ అనంతరం షమీకి ఊరట దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడిగా ఉంటున్నారు. అయితే, తాజాగా మరోసారి షమీని ఉద్దేశించి హసీన్ జహాన్ ఆరోపణలు గుప్పించింది. ‘‘స్టార్ అయిన నా భర్త, అతడి కుటుంబం కారణంగా నేను చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఆమ్రోహా పోలీసులు నన్ను, నా మూడేళ్ల కూతురిని టార్చర్ పెట్టారు. ప్రభుత్వం కూడా నా పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది’’ అని హసీన్ జహాన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరును విమర్శించింది. అంతేకాదు.. మహ్మద్ షమీ యూపీ ప్రభుత్వం, పోలీసులతో కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో షమీ అభిమానులు హసీన్ జహాన్ తీరుపై మండిపడుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడపటం మానుకుని.. కుమార్తెకు మంచి భవిష్యత్తున్నిచ్చే ఆలోచనలు చేయాలని హితవు పలుకుతున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని హసీన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
విభేదాలు ఉంటేనేం.. తనను చాలా మిస్సవుతున్నా: షమీ
తన కూతురు ఐరాను చాలా మిస్సవుతున్నానంటూ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. హసీన్ జహాన్ అనుమతించినపుడు మాత్రమే బిడ్డను చూసుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నాడు. ఐరా తల్లితో తనకు విభేదాలు ఉన్నా.. సొంత రక్తాన్ని మాత్రం వదులుకోలేనని ఎమోషనల్ అయ్యాడు. కాగా మోడల్ హసీన్ జహాన్‌ను 2014లో వివాహం చేసుకున్నాడు షమీ. ఈ దంపతులకు 2015లో కుమార్తె ఐరా జన్మించింది. అయితే, కొన్నేళ్ల క్రితం భర్త షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది. షమీ స్త్రీలోలుడని.. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అదే విధంగా గృహహింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా విడిగా ఉంటున్నారు. కుమార్తె ఐరాను హసీన్ తనతో పాటు తీసుకువెళ్లడంతో.. షమీ కూతురికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్18తో సంభాషణ సందర్భంగా.. కూతురి ప్రస్తావన రాగా షమీ స్పందించాడు. ‘‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని మిస్సవుతారు కదా! కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. నేను నా కూతుర్ని మిస్సవుతున్నా. ఎంతైనా తను నా రక్తం. వాళ్ల అమ్మతో విభేదాలున్నంత మాత్రాన నా కూతురిని నేను దూరం చేసుకోలేను. అయితే, నేను ఐరాతో మాట్లాడాలా? వద్దా అనేది వాళ్ల అమ్మ నిర్ణయానుసారమే ఉంటుంది. తను అనుమతిస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. అయితే, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనను నేరుగా కలవలేకపోయాను. తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటా’’ అని షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత.. గాయం కారణంగా మహ్మద్ షమీ.. టీమిండియాకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఇప్పట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ నుంచి విడిగా ఉంటున్న అతడి భార్య హసీన్ జహాన్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీన్ జహాన్ పిటిషన్‌పై విచారణ చేపట్టి నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఏళ్లకు ఏళ్లు ఈ కేసును సాగదీయడం సరికాదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాగా షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ గృహహింస కేసు పెట్టిన హసీన్ జహాన్.. అతడి అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టు గురువారం ఆమె పిటిషన్‌పై విచారణ జరిపింది. కేసును సాగదీయకుండా సత్వరమే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. కాగా షమీపై హసీన్ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో 2019, ఆగష్టు 29న అలీపూర్ అడిషినల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించిన షమీ సెప్టెంబరు 9న తన అరెస్టుపై స్టే విధించాల్సిందిగా కోరాడు. అదే విధంగా తనపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాత హసీన్ ఈ విషయమై హైకోర్టును సంప్రదించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదంతా జరిగి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ కేసు అపరిష్కృతంగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని.. ఒకవేళ అది వీలుపడకపోతే స్టే ఆర్డర్లో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్ కోర్టు జడ్జిని ఆదేశించింది. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ -
అత్యుత్తమ గణాంకాలు.. షమీపై సంచలన ఆరోపణలు! అరెస్టు చేయాలంటూ సుప్రీం కోర్టులో
Mohammed Shami- Hasin Jahan: ఐపీఎల్-2023లో అదరగొడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీని వ్యక్తిగత జీవితంలో మాత్రం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. షమీ అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాలంటూ అతడి నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జహాన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. కాగా స్త్రీ లోలుడు అంటూ మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్ తమ కుమార్తెతో కలిసి విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు నెలవారీ భరణంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలంటూ గతంలో కలకత్తా కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ ఊరట అయితే, న్యాయస్థానం మాత్రం షమీ ప్రతినెలా 1,30,000 రూపాయలు చెల్లిస్తే చాలంటూ క్రికెటర్‌కు ఊరటనిచ్చే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన హసీన్ జహాన్.. మరోసారి షమీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. లైంగిక అవసరాల కోసం యథేచ్ఛగా ‘‘మిస్టర్ షమీ దగ్గర వ్యక్తిగత అవసరాల కోసం +4........6 నంబర్‌తో సెకండ్ మొబైల్ ఫోన్ ఉండేది. ఈ డివైజ్‌ను ఉపయోగించి అతడు తన వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడు. పడుపు వృత్తి చేసుకుని బతికేవాళ్లతో టచ్‌లో ఉండేవాడు. ఈ ఫోన్‌ను కోల్‌కతాలోని లాల్ బజార్ పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే, షమీ ఇప్పుడు కూడా తన లైంగిక అవసరాల కోసం యథేచ్ఛగా సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు’’ అని హసీన్ జహాన్ పిటిషన్లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే విధంగా వరకట్నం కోసం షమీ తనను వేధించాడని హసీన్ ఆరోపించినట్లు సమాచారం. అతడిని అరెస్టు చేయాలి! అంతేగాక.. టీమిండియాతో విదేశీ పర్యటనల్లో ఉన్నపుడు సైతం షమీ అక్కడి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తి నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడని వెంటనే అతడిని అరెస్టు చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని ఆమె అత్యుత్తమ న్యాయస్థానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023లో అత్యుత్తమంగా ఈ మేరకు షమీ అరెస్టుకు వ్యతిరేకంగా కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా గతంలో షమీ అరెస్టుకై హసీన్ పిటిషన్ దాఖలు చేయగా వెస్ట్ బెంగాల్ సెషన్స్ కోర్టు అందుకు సానుకూలంగా స్పందించింది. అయితే, షమీ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు వారెంట్‌పై స్టే విధించింది. అయితే, ఇప్పుడు ఆ ఆదేశాలను సవాలు చేస్తూ హసీన్ సుప్రీంను ఆశ్రయించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు షమీ. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ క్రమంలో అదేరోజు అతడికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. చదవండి: ఐపీఎల్ 2023లో ఏం జరుగుతోంది..? ఆ రెండు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయి..! కోహ్లి, గంభీర్‌లను సస్పెండ్ చేసి పాడేయండి.. ఓవరాక్షన్ ఎక్కువైంది..! -
షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు
Mohammed Shami- Hasin Jahan: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టులో కాస్త ఊరట లభించింది. తన నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జహాన్‌కు షమీ ప్రతినెలా లక్షా ముప్పై వేల భరణం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఇందులో హసీన్ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం 50 వేలు, తమ కుమార్తె అవసరాల కోసం 80 వేలు వాడుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 10 లక్షలు కావాలి.. కాగా షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్ ప్రస్తుతం తమ కుమార్తెతో కలిసి.. అతడి నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు నెలవారీ భరణంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో తన అవసరాల కోసం 7 లక్షలు వాడుకొంటానని.. మిగిలి మొత్తం తమ కుమార్తె పోషణ, భవిష్యత్తుకై ఖర్చు చేస్తానని పేర్కొంది. ఏడు కోట్లు ఆర్జించాడు.. ఈ విషయం గురించి ఆమె తరఫు లాయర్ మ్రిగాంక మిస్త్రీ కోర్టుకు వివరిస్తూ.. బీసీసీఐ కాంట్రాక్ట్ ప్లేయర్ అయిన ఏడాదికి షమీ సుమారు ఏడు కోట్ల రూపాయల మేర ఆర్జించాడని.. కాబట్టి ఈ మాత్రం భరణం కోరడంలో తప్పులేదని న్యాయస్థానానికి విన్నవించారు. అయితే, ఇందుకు బదులుగా షమీ తరఫు న్యాయవాది సలీమ్ రెహ్మాన్.. హసీన్ ప్రొఫెషనల్ ఫ్యాషన్ మోడల్ అని, ఆమెకు ఇదొక ప్రధాన ఆదాయ వనరు అని పేర్కొన్నారు. కాబట్టి ఇంత భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేయడం అన్యాయమంటూ తన వాదనలు వినిపించారు. ఇకపై నెలనెలా ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలు విన్న కోల్‌కతా కోర్టు.. సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. షమీ నెలనెలా హసీన్‌కు 1.30 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు స్పందనగా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేసిన హసీన్.. తాను అనుకున్న మేర భరణం వస్తే తన జీవితం మరింత సాఫీగా సాగిపోయేదని వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇదిలా ఉంటే.. షమీ ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. షమీకి, హసీన్ జహాన్‌కు 2014లో పెళ్లయింది. వీరికి ఒక పాప కూడా ఉంది. మోడల్ అయిన హసీన్ వస్త్రధారణ వంటి విషయాల్లో అనేక సార్లు షమీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆమెకు మద్దతుగా నిలిచేవాడు. అయితే, షమీ కుటుంబం తనను హింసిస్తోందని, తన భర్త స్త్రీలోలుడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన హసీన్ ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటోంది. గ్రేడ్-ఎ జాబితాలో అయితే, హసీన్ ఆరోపణల నేపథ్యంలో 2018లో బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో షమీకి చోటు దక్కలేదు. చివరి నిమిషంలో అతని పేరును జాబితా నుంచి తప్పించినట్లు బోర్డు వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. అయితే, ఇక బీసీసీఐ కాంట్రాక్ట్- 2022 వివరాల ప్రకారం.. షమీ గ్రేడ్-ఎ జాబితాలో ఉన్నాడు. దీంతో అతడికి ఏడాదికి రూ. 5 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుతోంది. చదవండి: Rohit Sharma: రోహిత్ కెరీర్‌ను మలుపు తిప్పిన ధోని నిర్ణయం.. దశాబ్ద కాలంగా.. సూపర్ ‘హిట్టు’! KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. -
ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్థన
భారత స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సంబురాలు మిన్నంటిన వేళ.. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్‌మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భర్త షమీతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న జహాన్.. దేశం పేరు మార్చాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను అభ్యర్ధిస్తూ ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by hasin jahan (@hasinjahanofficial) వాడుకలో ఉన్న ఇండియా పేరుతో దేశానికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని, అంచేత దేశం పేరును ఇండియా అని కాకుండా ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని సంబోదించేలా తగు సవరణలు చేపట్టాలని మోదీ, షాలను కోరింది. జహాన్ నిన్న (ఆగస్ట్ 14) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మన దేశం పేరు ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి. ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘ఇండియా’ పేరు మార్చి ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని పెట్టండి. వీటితో మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది..’ అని రాసుకొచ్చింది. వీడియోలో జహాన్ మరో ఇద్దరితో కలిసి ప్రముఖ బాలీవుడ్ గీతం ‘దేశ్ రంగీలా’ పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తుంది. జహాన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. జహాన్ చేసిన ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. దేశం డైమండ్ జూబ్లీ స్వాతంత్రోత్సవ సంబురాలు చేసుకుంటున్న వేళ ఈ ప్రతిపాదన రావడం అందరిని ఆకర్షిస్తోంది. కాగా, జహాన్.. మహ్మద్ షమీపై లైంగిక వేధింపులతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. చదవండి: Independence Day: భారతీయుడినైనందుకు గర్విస్తున్నా.. జై హింద్: కోహ్లి -
బోల్డ్ ఫోటో షేర్ చేసిన షమీ భార్య.. దారుణమైన ట్రోలింగ్
న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక తాజాగా హసీన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన వారు కొందరు అందంగా ఉన్నావని పొగడగా.. చాలామంది మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హసీన్ జహాన్‌కు లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో హసీన్ బుధవారం ఇన్‌స్టాలో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేశారు. దీనిలో హసీన్ తెలుపు రంగు రగ్గడ్ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి ఉన్నారు. ఈ క్లోజప్ ఫోటోలో హసీన్ కాస్త బోల్డ్‌గా దర్శనిమిచ్చారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక ఈ ఫోటో చూసిన కొందరు హసీన్ చాలా అందంగా ఉన్నారు అని ప్రశంసించగా.. చాలా మంది మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్.. అయినా కూడా ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా అంటూ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by hasin jahan (@hasinjahanofficial) ఇక షమీ-హసీన్ చాలా కాలం నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా జీవిస్తున్నప్పటికి.. ఇంకా వీరు విడాకులు తీసుకోలేదు. కొన్నేళ్ల క్రితం హసీన్ షమీపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు వేరే మహిళతో సంబంధ ఉందని ఆరోపించారు. కానీ వాటిని నిరూపించలేకపోయారు. కోల్‌కతాకు చెందిన హసీన్ జహాన్, షమీ 2014, ఏప్రిల్ 7 న వివాహం చేసుకున్నారు. -
షమీకి భార్య హసీన్ జహాన్ మరో షాక్
ఢిల్లీ: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ క్రికెట్ కెరీర్ సాఫీగానే ఉన్నప్పటికి.. వైవాహిక జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2018లో షమీతో విభేదాలు రావడంతో అతని భార్య హసీన్ జహాన్ అప్పటినుంచి వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. షమీకి తన కూతురు ఐరా అంటే చాలా ఇష్టం. భార్య హసీన్‌తో దూరంగా ఉంటున్న షమీ కేవలం ఐరా కోసం అప్పుడప్పడు ఆమె ఇంటికి వెళుతుండేవాడు. తాజాగా షమీ గారాల పట్టి ఐరాను అతనికి దూరం చేసే పనిలో హసీన్ జహాన్ ఉన్నట్లు తెలుస్తుంది. చదవండి: వైరల్: షర్ట్ లేకుండా పరిగెత్తాడు.. చివరికి ఇటీవలే హసీన్ జహాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురు ఐరా ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఐరా పేరుకు షమీ సర్నేమ్ను తొలగించి 'ఐరా జహాన్' అంటూ క్యాప్షన్ జతచేసింది. షమీని కూతురుకు పూర్తిగా దూరం చేయాలనే ఆలోచనతోనే హసీన్ జహాన్ ఈ పనిచేసినట్లు తెలుస్తుంది. కాగా గతంలోనూ షమీపై గృహ హింస, లైంగిక వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఆరోపణలతో హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో షమీపై పోలీసులు గతంలో కేసు కూడా నమోదు చేశారు.అప్పట్లో ఈ విషయంపై సీరియస్ అయిన బీసీసీఐ షమీ సెంట్రల్ కాంట్రాక్టును కొన్ని రోజులపాటు హోల్డ్‌లో పెట్టింది. ఆ తర్వాత షమీ హసీన్‌తో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి కోర్టుకెక్కడంతో బీసీసీఐ అతని కాంట్రాక్టును తిరిగి పునరుద్దరించింది. కాగా షమీ ఆసీస్‌తో డిసెంబర్లో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన సంగతి తెలిసిందే.మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో చివరగా బ్యాటింగ్‌కు వచ్చిన షమీ మణికట్టు గాయంతో రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎక్స్-రేలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో మిగిలిన టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆరంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా షమీ దూరంగా ఉన్నాడు. టీమిండియా తరపున షమీ ఇప్పటివరకు 50 టెస్టుల్లో 180 వికెట్లు, 79 వన్డేల్లో 148 వికెట్లు, 12 టీ20ల్లో 12 వికెట్లు తీశాడు. చదవండి: ఒక్క టెస్ట్.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే View this post on Instagram A post shared by hasin jahan (@hasinjahanofficial) -
షమీ భార్య జహాన్‌కు వేధింపులు
కోల్‌కతా: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్ జహాన్‌ను వేధిస్తున్న ఓ వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ 25 ఏళ్ల వ్యక్తి జహాన్‌కు తరచు ఫోన్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆ క్రమంలోనే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీనిపై గతంలోనే పోలీసులకు జహాన్ ఫిర్యాదు చేయగా అతన్నిఅరెస్ట్ చేశారు. ‘ ఆ వ్యక్తి పదే పదే కాల్ చేయడంతో జహాన్ సాయం కోరింది. దానిలో భాగంగా అతనిపై ఫిర్యాదు చేసింది. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. (కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్ రికార్డు) ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు గురి చేశాడు. ఫోన్ చేసిన ప్రతీసారి ఆమెను తిట్టేవాడు. ఆ కాల్స్‌ను ఎత్తకపోతే ఫోన్లు చేస్తూనే ఉండేవాడు. ఆ వేధింపులు భరించలేక మమ్మల్ని ఆశ్రయించింది. మంగళవారం రాత్రి అతన్ని అరెస్ట్ చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం షమీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. (ఐసీసీ అవార్డుల నామినేషన్లో కోహ్లి డామినేషన్) -
'షమీ భార్యకు భద్రత కల్పించండి'
కోల్‌కత : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్ జహాన్‌కు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టు సిటీ పోలీసులను ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల రామ్ మందిర్ నిర్మాణానికి భూమి పూజ జరగ్గా.. హిందువులకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వివాదం రేపింది. దీనిపై సోషల్ మీడియా కొందరి నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని.. తన కూతురుకు,తనకు ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. (చదవండి : చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా) తాజాగా కలకత్తా హైకోర్టు మంగళవారం హసీన్ పిటీషన్‌ను పరీశీలించింది. హసీన్ తరపు లాయర్ ఆశిష్ చక్రవర్తి.. ఆమెకు సోషల్‌మీడియాలో వచ్చిన బెదిరింపులతో పాటు పోలీసులకు అందించిన ఫిర్యాదును రిపోర్టు రూపంలో కోర్టుకు సమర్పించారు. హసీన్ తనకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కాగా సీనియర్ న్యాయవాది అమితేష్ బెనర్జీ చక్రవర్తి వాదనలను తోసిపుచ్చుతూ.. హసీన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ దేబాంగ్సు బసక్.. హసీన్ జహాన్ ఆస్తికి, ఆమె జీవితానికి ఎటువంటి హాని జరగకుండా రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటూ మంగళవారం తెలిపారు. అంతేగాక హసీన్ ఫిర్యాదుతో తీసుకున్న చర్యలను రిపోర్టు రూపంలో కోర్టుకు అందించాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు అనంతరం జస్టిస్ పేర్కొన్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. షమీ ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ఆడేందుకు దుబాయ్‌లో ఉన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున షమీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. (చదవండి : మాకు రక్షణ కల్పించండి: షమీ భార్య) -
హైకోర్టును ఆశ్రయించిన షమీ భార్య
కోల్‌కతా: టీమిండియా పేసర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు తన కూతురికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రామ మందిర భూమి పూజ సందర్భంగా తనకు సోషల్ మీడియాలో ఎదురైన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అత్యాచార, హత్య బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ మేరకు హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కాగా షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్ ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కూతురితో కలిసి ఆమె కోల్‌కతాలో నివసిస్తున్నారు. (చదవండి: పోలీసులను ఆశ్రయించిన హసీన్ జహాన్) ఈ క్రమంలో అయోధ్యలో ఆగష్టు 5న రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా శుభాభినందనలు తెలిపినందుకు కొంతమంది తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు హసీన్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు.. హిందూ సోదర, సోదరీమణులను ఉద్దేశించి అభినందనలు తెలుపుతూ.. పోస్టు పెట్టగానే కొంతమంది తనను అసభ్యపదజాలంతో దూషించారని, మరికొంత మంది రేప్ చేసి చంపేస్తామని తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమని, అభద్రతాభావం వెంటాడుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా : షమీ) మానవతా దృక్పథంతో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులు తన ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక షమీ తనను హింసిస్తున్నాడని, హతమార్చేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా.. వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. హసీన్ జహాన్ మోడల్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు. -
భూమి పూజ విషెస్: ‘అత్యాచారం చేసి చంపేస్తాం’
కోల్‌కతా: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన అతడి భార్య, మోడల్ హసీన్ జహాన్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల గురించి ఆదివారం ఫిర్యాదు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా శుభాభినందనలు తెలిపినందుకు కొంతమంది తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆగష్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ భూమి పూజ శాస్త్రోక్తంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హసీన్ జహాన్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘‘హిందువులందరికీ శుభాకాంక్షలు’’ అంటూ విష్ చేశారు. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అత్యాచారం చేసి, చంపేస్తామంటూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేస్తూ బెదిరింపులకు దిగారు.('అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు') ఈ నేపథ్యంలో హసీన్ జహాన్ కోల్‌కతా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ఆగష్టు 5, 2020న హిందూ సోదర, సోదరీమణులను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టగానే కొంతమంది నన్ను అసభ్యపదజాలంతో దూషించారు. మరికొంత మంది రేప్ చేసి చంపేస్తామని తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రస్తుత పరిస్థితుల్లో నా రక్షణ, నా కూతురి భవిష్యత్ గందరగోళంలో పడిపోయింది. నేను నిస్సహాయురాలినై పోయాను. అభద్రతాభావం వెంటాడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. దినదినగండంగా బతుకుతున్నాను. కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్నా. మానవతా దృక్పథంతో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’అని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇక షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. హసీన్ జహాన్ మోడల్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు. -
డాడీ కంటే తనే బెటర్.. సో క్యూట్!
-
డాడీ కంటే తనే బెటర్.. సో క్యూట్!
మొన్న రహానే.. నిన్న ధోని.. ప్రస్తుతం షమీ.. ఇలా టీమిండియా క్రికెటర్ డాడీలు పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే అజింక్య రహానే భార్య రాధిక ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత భార్యా, బిడ్డలను మురిపెంగా చూస్తున్న ఫొటోను రహానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ధోని సైతం తన గారాల పట్టి జీవాకు సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తాడన్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ కూడా తన కూతురికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశాడు. ‘ మై డాల్. తన తండ్రి కంటే ఎంతో గొప్పగా డ్యాన్స్ చేసే నైపుణ్యం తనకు ఉంది’ అంటూ తన కూతురు ఓ స్టోర్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో షమీ అభిమానులు తనపై అభినందనలు కురిపిస్తున్నారు. ‘డాటరాఫ్ షమీ డ్యాన్స్ చాలా బాగుంది. సో క్యూట్’ అంటూ కాంప్లిమెంట్లు ఇస్తూనే.. ‘మీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది’ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా షమీ భార్య హసీన్ జహాన్ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ సంబంధాలు కలిగి ఉండటంతో పాటు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి వేరుగా జీవిస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో షమీ రాణిస్తున్న సంగతి తెలిసిందే. తొలి టస్టులో ఐదు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షమీ.. రెండో టెస్టులోనూ మెరుగ్గా రాణించాడు. -
అరెస్ట్ వారెంట్.. షమీ బెయిల్ ప్రయత్నాలు
న్యూఢిల్లీ : గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పై కోల్‌కతాలోని అలిఫోర్ కోర్టు గత సోమవారం అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా వెస్టిండీస్ టూర్ సందర్భంగా అమెరికా వెళ్లిన షమీ అక్కడి నుంచే బెయిల్ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. షమీ అమెరికాలో ఉండిపోవడంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. "వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న షమీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. సెప్టెంబర్ 12న షమీ భారత్‌కు తిరిగి రానున్నాడని, అంతవరకు తన లాయర్ సలీమ్ రెహమాన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని బోర్డు సభ్యుల్లో ఒక అధికారికి తెలిపినట్లు సమాచారం అందించాడు. కోర్టు షమీపై వేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు బీసీసీఐ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోదని" వెల్లడించారు. మహ్మద్ షమీ తనను వేదిస్తున్నాడంటూ గత ఏడాది మార్చిలో అతని భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో గతేడాది కొద్ది రోజుల పాటు బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ నిమిత్తం షమీ న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. షమీకి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం షమీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ సందర్భంగా షమీ భార్య హసీన్ జహాన్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాక్ష్యాలన్నీ తనకూ అనుకూలంగా ఉన్నాయని, ఈ కేసు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ షమీ తప్పించుకోలేడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
షమీ ‘పేద్ద’ క్రికెటర్లా ఫీలవుతాడు: భార్య
కోల్‌కత : టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అతని భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన గృహహింస పిటిషన్‌పై విచారణ చేపట్టిన అలీపూర్ కోర్టు షమీతో పాటు ఆయన సోదరుడు హసీద్ అహ్మద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హసీన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. ఏడాది కాలంగా న్యాయం కోసం వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మంచి నిర్ణయం వెలువడింది. (చదవండి : షమీపై అరెస్ట్ వారెంట్) తనంత బలవంతుడు లేడన్నట్టుగా షమీ మితిమీరి ప్రవర్తిస్తాడు. తానో పేద్ద క్రికెటర్లా ఫీలవుతాడు. నేను బెంగాల్‌కు చెందినదాన్ని కాకున్నా.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాకుండా వేరే ఎవరున్నా నేను క్షేమంగా ఉండేదాన్ని కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నప్పుడు అమ్రోహ పోలీసులు నన్నూ, నా కూతుర్ని వేధింపులకు గురిచేశారు. దేవుని దయవల్ల అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డాం’ అన్నారు. ఇక జసీన్ ఫిర్యాదు మేరకు షమీపై మార్చిలో వరకట్నం, లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. నెలకు రూ.7 లక్షలు భరణంగా ఇవ్వాలని జసీన్ డిమాండ్ చేసింది. వీరి వివాహం 2014లో జరిగింది. -
అపరిచిత మహిళకు షమీ మెసేజ్
న్యూఢిల్లీ : ఆఫ్‌ఫీల్డ్ కారణాలతో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే అతని భార్య హసీన్ జహాన్ షమీ స్త్రీలోలుడని, చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, అదనపు కట్నం కోసం తనను తీవ్రంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో షమీపై పోలీసులు చార్జ్‌షీట్ కూడా నమోదు చేశారు. అతని క్రికెట్ కెరీర్ నాశనం చేసేలా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని కూడా జహాన్ ఆరోపించింది. ముందుగా షమీకి కాంట్రాక్ట్ నిరాకరించిన బీసీసీఐ.. విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత తన ఆటలో మరింత రాటుదేలిన షమీ టీమిండియా వరుస విజయాల్లో భాగమయ్యాడు. (చదవండి: షమీపై చార్జ్‌షీట్ నమోదు) ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రాణిస్తున్న షమీపై తాజాగా ఆ రకమైన ఆరోపణలే వ్యక్తమయ్యాయి. ఏ మాత్రం పరిచయం లేని షమీ ఇన్స్టాగ్రామ్ వేదికగా తనకు పదేపదే మెసేజ్‌లు పంపిస్తున్నాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘1.4 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న గొప్ప క్రికెటర్ నాకే ఎందుకు మెసేజ్ చేస్తున్నాడో ఎవరైన చెప్పగలరా?’ అని మెసేజ్ స్క్రీన్ షాట్స్ జత చేసి ప్రశ్నించింది. అయితే షమీ సదరు మహిళకు ‘గుడ్ ఆఫ్టర్నూన్’ అని మెసేజ్ చేసినట్లు ఆ స్క్రీన్ షాట్స్‌లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అభిమానులు మాత్రం సోఫియా పోస్ట్‌పై భిన్నభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు షమీ చేసిన మెసేజ్‌లో తప్పేం ఉందని ప్రశ్నిస్తూ మద్దుతుగా నిలుస్తుండగా.. మరికొందరు అతను నిజంగా స్త్రీలోలుడేనని తప్పుబడుతున్నారు. ఒంటరిగా ఉండలేక మెసేజ్ చేసినట్లున్నాడని మరికొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. (చదవండి : ‘ముస్లిం కాబట్టే షమీని పక్కన పెట్టారు’) ఇక ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన షమీ 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికి షమీ 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. పాకిస్తాన్ మ్యాచ్‌లో భువనేశ్వర్ గాయపడటంతో తుది జట్టులోకి వచ్చిన షమీ.. తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గాయం నుంచి భువీ కోలుకోవడంతో శ్రీలంకతో ఆఖరి లీగ్ మ్యాచ్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే కీలక సెమీఫైనల్ మ్యాచ్‌కు షమీని పక్కన బెట్టడంపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. (చదవండి: ఇదేంటి.. జట్టులో షమీ లేడు? ) -
క్రికెటర్ షమీ భార్య అరెస్ట్
లక్నో : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ ఇంట్లో గొడవకు దిగిందన్న కారణంతో అతడి భార్య హసీన్ జహాన్‌ను అమ్రోహ పోలీసులు అరెస్టు చేశారు. తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టింది. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని సహాస్పూర్ అలీనగర్ గ్రామంలో ఉన్న షమీ ఇంటికి వెళ్లిన హసీన్.. అక్కడ అత్తింటి వాళ్లతో గొడవకు దిగింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందిగా వాళ్లు చెప్పడంతో కూతురితో సహా తనను తాను ఓ గదిలో బంధించుకుంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు షమీ ఇంటికి చేరుకుని హసీన్ జహాన్‌ను అరెస్టు చేశారు. అయితే కాసేపటి తర్వాత ఆమెను బెయిలుపై విడుదల చేశారు. ఈ విషయం గురించి హసీన్ మాట్లాడుతూ.. ‘ నేను నా భర్త ఇంటికి వచ్చాను. ఇక్కడ ఉండేందుకు నాకు సర్వహక్కులు ఉన్నాయి. కానీ మా అత్తింటివాళ్లు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. నన్ను పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. నిజానికి పోలీసులు అరెస్టు చేయాల్సింది నన్ను కాదు వాళ్లను’అని పేర్కొంది. కాగా ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా బౌలర్ షమీ ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ అనంతరం మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం అతడు సన్నద్ధం కావాల్సి ఉంది. -
షమీపై చార్జ్‌షీట్ నమోదు
కోల్‌కతా: ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ముందున్న సమయంలో భారత పేసర్ మొహమ్మద్ షమీకి షాక్! కుటుంబ సమస్యలనుంచి ఇటీవలే కొంత వరకు బయటపడి భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అతడిని మళ్లీ అవే కష్టాలు చుట్టుముట్టాయి. అతని భార్య హసీన్ జహాన్ గత ఏడాది మార్చిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు షమీపై గురువారం చార్జ్‌షీట్ నమోదు చేశారు. వరకట్నం కోసం వేధించడం, లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ అతనిపై సంవత్సరం తర్వాత ఈ చార్జ్‌షీట్ నమోదైంది. దీంతో పాటు తనకు శారీరకంగా, మానసికంగా కూడా టార్చర్ పెట్టాడని, అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడని అప్పట్లో హసీన్ ఆరోపించింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో ముందుగా షమీకి కాంట్రాక్ట్ నిరాకరించిన బీసీసీఐ...అనంతరం అతనికి క్లీ¯Œ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత తన ఆటలో మరింత రాటుదేలిన షమీ టీమిండియా వరుస విజయాల్లో భాగమయ్యాడు. మరో వైపు షమీ సోదరుడు తనను రేప్ చేశాడంటూ కూడా జహాన్ చేసిన ఇతర ఫిర్యాదులపై మాత్రం పోలీసులు చార్జ్‌షీట్ నమోదు చేయలేదు. -
షమీకి మరో షాకిచ్చిన భార్య
-
షమీకి మరో షాకిచ్చిన భార్య
కోల్‌కతా: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందు ఊహించని షాక్ తగిలింది. గతేడాది ఐపీఎల్‌కు ముందు షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్ జహాన్ తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రపంచకప్, ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్న షమీపై ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. (మహ్మద్ షమీ భావోద్వేగం..) ఇక మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడనే సంచలన ఆరోపణలతో హసీన్ జహాన్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. చివరకు షమీపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. హసీన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ దర్యాప్తు చేసి క్లీన్ ఛీట్ ఇచ్చింది. తనకు.. తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ కోర్టును కూడా ఆశ్రయించింది. దీనికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నవిషయం తెలిసిందే. (‘మరో పెళ్లి చేసుకోవడానికి పిచ్చోడినా’) జహాన్.. ఐ మిస్ యూ: షమీ -
షమీకి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాం..
కోల్‌కతా: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో భర్తపై కేసు పెట్టింది భార్య హసీన్ జహాన్. ఈ మేరకు విచారణకు షమీ వ్యక్తిగతీంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో కోల్‌కతా కోర్టు ఆగ్రహం చేసింది. దీనిపై జనవరి 15 లోపు షమీ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని నోటీసులు జారీ చేసింది. షమీ అతని భార్య హసీన్ మధ్య కొద్దికాలం కింద మనస్పర్థలు రావడం.. తన భర్తకు చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని.. అతనిపై గృహ హింస కేసు పెట్టడంతో వీరి బంధం బీటలు వారింది. ప్రస్తుతం విడిగా ఉంటున్న వీరిద్దరూ.. విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే హసీన్ వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం షమీ ప్రతినెల చెక్కు పంపిస్తున్నాడు. అయితే ఈ మధ్య ఇచ్చిన చెక్కు డ్రా అవ్వకుండా షమీ కావాలనే ఆపాడని హసీన్ ఎన్ఐ చట్టం కింద కోల్‌కతాలోని అలిపోర్ కోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణకు హాజరుకావాల్సిందిగా షమీకి న్యాయస్థానం నోటీసులు పంపింది. అయినప్పటికి అతను స్పందించలేదు. దీంతో బుధవారం జరిగిన విచారణకు రావాల్సిందిగా అక్టోబర్‌లో మరోసారి కోర్టు నోటీసులు జారీ చేసింది.. దీనికి షమీ హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి జనవరి 15లోపు ప్రత్యక్షంగా విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరిన షమీ భార్య
ముంబై: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్ జాహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లైంగిక ఆరోపణలు, కేసులతో మహ్మద్ షమీ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చిన ఈ మాజీ మోడల్ ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సమక్షంలో మంగళవారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడనే సంచలన ఆరోపణలతో హసీన్ జహాన్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. చివరకు షమీపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. హసీన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ దర్యాప్తు చేసి క్లీన్ ఛీట్ ఇచ్చింది. తనకు.. తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ కోర్టును కూడా ఆశ్రయించింది. దీనికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
నాకు గన్‌మన్‌తో భద్రత కల్పించండి: షమీ
న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ తనకు భద్రత కోసం గన్‌మన్‌ను నియమించాలని అమ్రోహ జిల్లా మేజిస్ట్రేట్‌ను కోరాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా తనకు భద్రత కల్పించాలని విన్నవించాడు. ప్రధానంగా తన భార్య హసిన్తో ప్రాణహాని ఉందని తెలిపాడు. ఈ మేరకు భార్య నుంచి ఇప్పటికే బెదిరింపులు వచ్చినట్లు మేజిస్ట్రేట్ కు తెలిపినట్లు సమాచారం. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది నెలల క్రితం భార్య హాసిన్ జహాన్‌తో మొదలైన వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని షమిపై జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీసీసీఐపై కూడా నిందలు వేయడం మొదలుపెట్టారు. అసలు షమీపై బీసీసీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. అయితే నిజాలు తేల్చుకునేందుకు బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టింది. షమీ నిర్దోషిగా తేలడంతో బీసీసీఐ అతనిపై క్లీన్ చిట్ విడుదల చేసింది. ఇక ఆ తర్వాత తనకు.. సంతానానికి పోషణ నిమిత్తం ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ మరోసారి షమీపై కేసు నమోదు చేసింది. దానికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకుముందు ఆమె చేసిన అప్పీలులో నెలకు రూ.10లక్షలు కావాలంటూ డిమాండ్ చేసింది. -
సంతోషించేలోపే.. టీమిండియా క్రికెటర్‌కి షాక్!
కోల్‌కతా : లైంగిక ఆరోపణలు, గృహ హింస చట్టం కేసులతో భర్త, టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని ఉక్కిరి బిక్కిరి చేసిన హసీన్ జహాన్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో టీమిండియా క్రికెటర్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్య హసీన్ జహాన్ చేసిన ఫిర్యాదుతో షమీకి కోల్‌కతా అలీపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 20వ తేదీన కోర్టుకు హాజరు కావాలని క్రికెటర్‌ను ఆదేశించింది. భార్య ఫిర్యాదు అనంతరం గత మార్చి నెలలో షమీ లక్ష రూపాయల చెక్కును ఇచ్చాడు. తనకు షమీ ఇచ్చిన లక్ష రూపాయల చెక్ (నెంబర్ 03718) బౌన్స్ అయిందని హసీన్ జహాన్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన అలీపూర్ కోర్ట్ సెప్టెంబర్ 20న విచారణకు హాజరు కావాలని క్రికెటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, నెలకు తనకు రూ.10 లక్షల భరణం ఇవ్వాలని షమీని భార్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కుటుంబ పోషణకు 7లక్షల రూపాయలు, తమ పాప కోసం 3 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. తన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం భార్య ఎప్పుడో ఖాళీ చేసిందని ఆరోపించిన షమీ.. ఈ నేపథ్యంలో ఇచ్చిన లక్ష రూపాయల చెక్ బౌన్స్ వ్యవహారం షమీకి తలనొప్పిగా మారింది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో పేసర్ షమీకి బీసీసీఐ చోటిచ్చింది. ఇటీవల నిర్వహించిన యోయో టెస్టులో విఫలమవడంతో ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో జరిగిన పొట్టి ఫార్మాట్ సిరీస్‌లకు దూరమైన షమీకి అలా గుడ్ న్యూస్ తెలిసి సంతోషించేలోపే.. ఈ బ్యాడ్ న్యూస్ తెలిసింది. గతంలోనూ భార్య ఆరోపణల నేపథ్యంలో షమీకి బీసీసీఐ తొలుత ఆటగాళ్ల కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ప్రాథమిక విచారణ అనంతరం షమీకి క్లీన్చిట్ రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో, భారత జట్టులో ఆడేందుకు పర్మిషన్ లభించింది. -
బాలీవుడ్‌కు షమీ భార్య హసీన్ జహాన్!
ముంబై : టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసి.. పలు కేసులు నమోదు చేసిన అతని భార్య హసీన్ జహాన్ బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు. ఐపీఎల్ చీర్ గర్ల్ అయిన ఈ మాజీ మోడల్.. అంజాద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఫత్వా’ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ‘ తన కూతురిని పోషించడానికి కొంత సంపాదించాలనే ఉద్దేశంతో సినిమాల్లో నటించాలనుకున్నాను. నాకు వేరే అవకాశం లేదు. దీంతోనే డైరెక్టర్ అంజాద్ ఖాన్ కలిసి సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇక న్యాయంగా షమీ నుంచి రావాల్సిన భరణం గురించి పోరాడుతాను’అని జహాన్ మీడియాకు తెలిపారు. ఈ చిత్రం కోసం ఫొటో షూట్ నిర్వహించగా.. ఆ ఫొటోలను ఈ మాజీ మోడల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Hasin jahan I m pic.twitter.com/mXumuTAJRs — Hasin Jahan (@HasinJahan4) July 7, 2018 -
షమీ కోసం ఎంతో చేశా, కానీ...
లైంగిక ఆరోపణలు, గృహ హింస చట్టం కేసులతో భర్త షమీని ఉక్కిరి బిక్కిరి చేసిన హసీన్ జహాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి ఆమె ప్రొఫెషనల్ ఫీల్డ్‌లోకి దిగిపోయారు. స్వతహాగా మోడల్ అయిన హసీన్.. కోల్‌కతాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. ‘షమీ కోసం నా కెరీర్‌ను, ఇష్టాలను వదిలేసుకున్నా. నా కలల్ని చంపుకున్నా. కానీ, అతని నుంచి నాకేం ఒరగలేదు. పైగా ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేశాడు. అందుకే నాకు గుర్తింపునిచ్చి.. తిండి పెట్టిన ఫీల్డ్‌లోకి తిరిగి వచ్చేశా. ప్రస్తుతం మోడలింగ్ కోసం కోల్‌కతాతోపాటు ముంబై, ఇతర నగరాల్లో అవకాశాలు వస్తున్నాయి’ అని జహాన్ తెలిపారు. మోడలింగ్ కోసం మొదట పాత పరిచస్తులకు, స్నేహితులకు ఫోన్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించిందని, కానీ, కూతురి కెరీర్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వారితో మాట్లాడి అవకాశాలు దక్కించుకున్నట్లు ఆమె తెలిపారు. తాను బయటకు వెళ్లినప్పుడు కూతురి బాగోలును తన తండ్రితోపాటు కూతురు(మొదటి భర్తతో కలిగిన సంతానం) చూసుకుంటున్నారని హసీన్ జహాన్ వెల్లడించారు. కాగా, భర్త షమీ ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నాడంటూ ఆరోపణలతో మొదలుపెట్టిన హసీన్.. లైంగిక ఆరోపణలు, ఫిక్సింగ్, గృహ హింస తదితర కేసులతో షమీకి ఉక్కిరి బిక్కిరి చేశారు. చివరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం కలిసి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఆపై కూతురి పోషణ కోసం రూ. 10 లక్షల భరణం ఇప్పించాలంటూ కోల్‌కతా కోర్టులో ఆమె ఓ కేసు దాఖలు చేయగా.. అది విచారణలో ఉంది. కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్ ట్విస్ట్: తెరపైకి షమీ భార్య మాజీ భర్త! -
మహ్మద్ షమీ భావోద్వేగం..
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన కుమార్తెని చూడగానే భావోద్వేగానికి గురయ్యాడు. మహ్మద్ షమీతో గొడవలు కారణంగా అతని భార్య హసీన్ జహన్ గత మూడు నెలల నుంచి పాపతో కలిసి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు మహ్మద్ షమీకి వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కి కూడా పాల్పడినట్లు హసీన్ జహన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షమీపై కోల్‌కతా పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో.. ఇద్దరూ విడిగా ఉంటున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే షమీకి రోడ్డు ప్రమాదం జరగగా.. అతడ్ని చూసేందుకు పాపతో కలిసి ఆసుపత్రికి వచ్చిన హసీన్ జహన్‌తో షమీ మాట్లాడలేదు. అయితే.. పాపతో మాత్రం కాసేపు మాట్లాడినట్లు అప్పట్లో హసీన్ వెల్లడించింది. ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ షమీకి క్లీన్చిట్ ఇస్తూ ఐపీఎల్ 2018 సీజన్ ఆడేందుకు అనుమతిచ్చింది. దీంతో.. బిజీగా మారిపోయిన క్రికెటర్ మళ్లీ పాపని కలవలేకపోయాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత.. అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుకి ఎంపికైనా యో-యో టెస్టులో ఫెయిలవడంతో.. జట్టుకి దూరమయ్యాడు. ఇటీవల కాలంలో కుటుంబానికి దూరమవడం, జట్టులో చోటు కోల్పోవడం వంటి సమస్యలతో మానసికంగా కుంగిపోయిన మహ్మద్ షమీ.. తన కూతురితో వీడియో కాల్లో మాట్లాడగానే భావోద్వేగానికి గురయ్యాడు. ‘ ఐ లవ్ యూ మై హార్ట్ బీట్.. నిన్న మూడు నెలల తర్వాత చూసినందుకు ఆనందంగా ఉంది’ అని కుమార్తెపై ప్రేమను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. I'm very happy to see you my heartbeat babo I love you 😭😭😭 after 3 month ..long time A post shared by Mohammad Shami (@mdshami.11) on Jun 19, 2018 at 2:40am PDT -
‘మరో పెళ్లి చేసుకోవడానికి పిచ్చోడినా’
ఆమ్రోహా: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ ఫాస్ట్ బౌలర్‌పై గతంలో తీవ్ర విమర్శలు ఎక్కుబెట్టిన జహన్.. ఇటీవల మరో బాంబు పేల్చింది. రంజాన్ తర్వాత అతడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపించింది. పండుగ అయిపోయిన ఐదు రోజుల తర్వాత షమీ నిఖా చేసుకోబోతున్నాడని వ్యాఖ్యానించింది. తాజా ఆరోపణల విషయమై షమీ ఘాటుగా స్పందించాడు. ‘ఒక్క పెళ్లి చేసుకొనే నానా ఇబ్బందులు పడుతుంటే.. రెండో పెళ్లా? మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా? అని షమీ బదులిచ్చాడు. ‘హసీన్ గత కొద్ది నెలలుగా నాపై బోలెడన్ని విమర్శలు చేసింది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనేది కూడా అందులో ఒకటి. నా రెండో పెళ్లికి ఆమెను ఆహ్వానిస్తా’నంటూ షమీ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇటీవల కుటుంబ సమస్యల కారణంగా తన ప్రదర్శన బాగోలేదని, ఇంగ్లండ్ పర్యటనలో పరిస్థితి మారుతుందని షమీ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ఈసారి షమీ సొంతూళ్లో...
ఆమ్రోహా: భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి పోలీసుల్ని ఆశ్రయించింది. షమీ సొంతూరైన ఉత్తరప్రదేశ్‌లోని సహస్ గ్రామానికి వెళ్లేందుకు తనకు రక్షణగా రావాలంటూ డిడౌలీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామ్‌సింగ్ కటారియాను కోరింది. సహస్ చేరిన అనంతరం షమీ ఇంటి తాళాన్ని పగులగొట్టాలని జహాన్ పోలీసుల్ని డిమాండ్ చేసింది. అయితే ఆమె డిమాండ్‌ను వారు తోసిపుచ్చారు. ఇంట్లో ఎవరూ లేనందున తాళం పగలగొట్టేందుకు నిరాకరించామని కటారియా స్పష్టం చేశారు. ఆమెతో పాటు తన రెండేళ్ల కూతురు, లాయర్ జాకీర్ హుస్సేన్ ఉన్నట్లు ఆయన చెప్పారు. జహాన్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ గ్రామానికి వచ్చిందని అక్కడే నివాసముంటున్న షమీ బంధువు మొహమ్మద్ జమీర్ తెలిపారు. ఆమెను తన ఇంట్లోకి ఆహ్వానించానని ఆయన చెప్పారు. కానీ షమీ సొంతూరు వెళ్లిన కారణాన్ని చెప్పేందుకు హసీన్ జహాన్ నిరాకరించింది. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని పేర్కొంది. -
‘షమీ బీసీసీఐని మోసం చేశాడు’
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్‌ల వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఇప్పటికే ఇతర మహిళలతో షమీకి సంబంధాలున్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తనని మానసికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన జహాన్ తాజాగా అతని పుట్టిన రోజు తేది తప్పంటూ మరో ఆరోపణతో వార్తల్లో నిలిచారు. షమీ పుట్టిన రోజు విషయంలో బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్)లను మోసం చేశాడని, నకిలీ బర్త్ డే సర్టిఫికేట్లతో వివిధ కెటగీరిల జాతీయ, రాష్ట్రీయ టోర్నీల్లో పాల్గొన్నాడని ఆరోపిస్తూ.. షమీ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోను రుజువుగా జోడిస్తూ తన ఫేస్బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. అయితే కొద్ది సేపటికే ఈ పోస్ట్‌ను తొలిగించారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల ప్రకారం షమీ పుట్టిన సంవత్సరం 1990గా ఉండగా జహాన్ షేర్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లో 1982గా ఉంది. జహాన్ చేసిన పోస్ట్.. ‘‘ఫ్రెండ్స్.. మహ్మద్ షమీ తన పుట్టిన రోజు తేదీ విషయంలో నకీలీ ధృవీకరణ పత్రాలతో 1990 గా చూపిస్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. అతను బీసీసీఐ, క్యాబ్‌తో పాటు ప్రజలను మోసం చేశాడు. ఈ తప్పుడు పత్రాలతో అండర్-22 క్రికెట్ టోర్నీలో ఆడాడు. ఈ చర్యతో నిజమైన 22 ఏళ్ల క్రికెటర్ నష్టపోయాడు’’ అని జహాన్ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే జహాన్.. షమీ, అతని కుటుంబ సభ్యులపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేశారు. దీంతో కోల్‌కతా పోలీసులు విచారణ కూడా చేపట్టారు. అంతేగాకుండా షమీ నుంచి భరణం ఇప్పించాలని జహాన్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక షమీ ఈ సీజన్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. హసీన్ జహాన్ షేర్ చేసిన షమీ డ్రైవింగ్ లైసెన్స్ -
కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ షాకింగ్ కామెంట్లు చేశారు. తన వ్యవహారాన్ని కథువా హత్యాచార ఘటనతో ఆమె పోల్చుకుంది. బుధవారం సాయంత్రం కథువా బాధిత చిన్నారి కోసం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో హసిన్ పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథువా కేసులో నిందితులు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. ఒక రకంగా నేను కూడా కథువా తరహా బాధితురాలినే. కానీ, ఆ చిన్నారి చనిపోతే.. నేనింకా బతికున్నా. కథువా ఘటనలో ఏవేం జరిగాయో.. నాక్కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. నన్ను అత్యాచారం చేయాలని షమీ కుటుంబ సభ్యులు యత్నించారు. ఆపై చంపి నా శవాన్ని చెత్తకుప్పలో పడేయాలని వారు ప్రయత్నించారు. రెండు నెలలపాటు షమీ కుటుంబ సభ్యులతో పోరాడి నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను’ అని జహాన్ మీడియాతో తెలిపింది. కాగా, గతంలో భర్త షమీపై సంచలన ఆరోపణలు చేసిన జహాన్.. ఇప్పుడు చేసిన ఈ కామెంట్లు అతన్ని మరిన్ని చిక్కుల్లోని నెట్టేసేలా కనిపిస్తున్నాయి. ఇక గృహ హింస చట్టం కింద కేసు నమోదు కావటంతో షమీని, అతని సోదరుడిని ప్రశ్నించిన కోల్‌కతా పోలీసులు.. వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. షమీతోపాటు అతని సోదరుడు, తల్లి కూడా తనని హింసించి చంపాలని చూశారంటూ ఆరోపించిన ఆమె.. తనకు-కూతురి పోషణ కోసం భరణం కోరుతూ షమీపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
క్రికెటర్ షమీకి నోటిసులు
-
గృహహింస కేసు.. షమీకి సమన్లు
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. తాజాగా షమీకి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీచేశారు. గృహహింస చట్టం 2005 కింద షమీ భార్య హసీన్ జహాన్ అలీపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ షమీకి పోలీసులు సమన్లు పంపారు. షమీతోపాటు అతని సోదరుడు హసీబ్ అహ్మద్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. హసీన్ జహాన్‌కు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కేసులు వేసిన తర్వాత రూ. లక్ష ఓ చెక్ ఇస్తే.. అది కూడా బౌన్స్ అయిందని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. హసీన్ ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం రూ. 7 లక్షలు, కుమార్తె ఐరా ఖర్చుల కోసం మరో రూ. 3 లక్షలు షమీ నుంచి భరణంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని కోల్‌కతా పోలీసులను అలీపూర్ కోర్టు ఆదేశించింది. షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేసింది విదితమే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం షమీ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
నెలకు రూ.10 లక్షలు ఇప్పించండి
కోల్‌కతా: భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన జీవనాధారం కోసం రూ. 10 లక్షల భరణం ఇప్పించాలని అలీపూర్ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఆమె పెట్టిన గృహహింస కేసును విచారిస్తున్న ఈ కోర్టు... షమీతో పాటు అతని కుటుంబసభ్యులంతా 15 రోజుల్లోగా కోర్టులో స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. హసీన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ‘హసీన్ జహాన్‌కు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసులు వేసిన తర్వాత రూ. లక్ష చెక్ ఇచ్చినా అది బౌన్స్ అయింది. దీంతో ఆమె వద్ద ఇప్పుడు చిల్లి గవ్వ లేదు’ అని అన్నారు. హసీన్ తన ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం రూ. 7 లక్షలు, కుమార్తె ఐరా ఖర్చుల కోసం మరో రూ. 3 లక్షలు భరణంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిందని లాయర్ చెప్పారు. -
షమీని డబ్బు డిమాండ్ చేస్తున్న జహాన్!
సాక్షి, కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భర్త షమీపై ఫిర్యాదు చేయగా మరో కేసు నమోదైంది. కుటుంబ పోషణ నిమిత్తం నెలవారీ ఖర్చుల కోసం లక్షల రూపాయలు, కుమార్తె అయిరాకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసేందుకు 5 లక్షల రూపాయాలు ఇవ్వాలని హసీన్ జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అలీపూర్ కోర్టులో గృహహింస చట్టం 2005 కింద మరో పిటిషన్ సైతం దాఖలు చేశారు జహాన్. 15 రోజుల్లోగా తాజా కేసుపై వివరణ ఇవ్వాలని భర్త షమీని, ఆయన కుటుంబ సభ్యులను కోర్టు ఆదేశించినట్లు సమాచారం. షమీ భార్య హసీన్ జహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను చాలా కష్టాల్లో ఉన్నాను. గత నెల చివరి వారంలో షమీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లాను. షమీ మాత్రం నన్ను కలిసేందుకు ఇష్టపడలేదు. ఆ సమయంలో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. నేను ఎంతో మానసిక వేదన అనుభవించాను. చేతిలో డబ్బు లేకున్నా భర్త కోసం అతికష్టమ్మీద ఢిల్లీలో వారం రోజులు ఉన్నాను. కుటుంబం, కూతురు, ఇతరత్రా ఖర్చుల కోసం ఓవరాల్‌గా ప్రతినెలా 15 లక్షల రూపాయాలు షమీ ఇవ్వాలని’ భార్య హసీన్ డిమాండ్ చేశారు. గతంలో లక్ష రూపాయల చెక్కు ఇచ్చినా బౌన్స్ అయిందని తెలిపారు. కోట్లలో సంపాదించే షమీకి కుటుంబ పోషణను భరించడం ఓ లెక్కకాదని, అందుకే జహాన్ ఆ డబ్బు కోసం మరోసారి న్యాయ పోరాటానికి దిగారని ఆమె తరఫు లాయర్ వివరించారు. -
షమీకి మరో షాకిచ్చిన జహాన్
కోల్‌కతా : ఓ వైపు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్యకోసం పరితపిస్తుంటే.. ఆమె మాత్రం అతన్ని మరింత ఇబ్బందుల్లో నెట్టడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా హసీన్ జహాన్ షమీపై మరో కేసు దాఖలు చేసింది. మంగళవారం కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో గృహహింస చట్టం 2005 కింద ఆమె పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లో తనకు, తన కూతురి పోషణకు.. షమీ భరణం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరింది. తమ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోకుండా షమీ బ్యాంకులకు సూచనలిచ్చాడని జహాన్ ఆరోపించింది. ఇటీవల తాను చెక్ సాయంతో డబ్బుతీసుకోవాలని ప్రయత్నించానని, కానీ డబ్బులు రాలేదని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భరణం కోసం కోర్టుకెక్కినట్లు తెలిపింది. గతంలో షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగని ఆమె షమీని ఐపీఎల్లో ఆడనివ్వద్దని బీసీసీఐ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసింది. తొలుత వార్షిక వేతనాల్లో కాంట్రాక్టు ఇవ్వని బీసీసీఐ ఫిక్సింగ్ ఆరోపణల విచారనంతరం గ్రేడ్ బీ కాంట్రాక్టును పునరుద్దరించింది. జహాన్ విన్నపాన్ని తోసిపుచ్చిన బీసీసీఐ షమీకి ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా కల్పించింది. ప్రస్తుతం షమీ ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిన విషయం తెలిసిందే. -
జహాన్.. ఐ మిస్ యూ: షమీ
మొహాలీ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి ఏ ఆరోపణలో లేకుంటే కేసుల విషయంలో కాదు. భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ తన మంచి మనసును చాటుకున్నాడు.తన వివాహమై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అతని భార్య హసీన్ జహాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఆ సమయాన జహాన్ తన దగ్గర లేనందుకు బాధపడుతూ.. ఆవేదన చేందాడు. ‘నాలుగో పెళ్లి రోజు సందర్భంగా నా భార్యకు ఈ కేకు.. మిస్ యూ జహన్’ అనే క్యాప్షన్‌తో కేకు ఫొటోను షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌పై షమీ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నీ నాశనం కోరుకున్న ఆమెను ఇంకా ఎలా కోరకుంటావ్ భాయ్ అంటూ కొందరు షమీని ప్రశ్నిస్తున్నారు. ఇంత మంచి మనసున్న వ్యక్తిని బాధపెట్టాలని ఎలా అనిపించింది వదినా అని జహాన్ ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనని మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని అతనిపై జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గృహ హింస కింద కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగని జహాన్ షమీని ఐపీఎల్లో ఆడనివ్వద్దని బీసీసీఐ అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. 4th Marriage anniversary cake for my bebo miss you 🎂💋💋 A post shared by Mohammad Shami (@mdshami.11) on Apr 7, 2018 at 6:43am PDT -
షమీని ఐపీఎల్లో ఆడించొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేసిన నేపథ్యంలో మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో తన భర్త షమీపై నిషేధం విధించాలని కోరిన హసీన్ జహాన్.. ఎలాగైనా సరే అతడిని ఆడకుండా చేయాలంటోంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువాను షమీ భార్య కలిసింది. అనంతరం జాతీయ మీడియాతో హసీన్ జహాన్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని హేమంత్ దువాని కలిశాను. నా భర్త షమీని ఈ ఐపీఎల్ సీజన్లో ఆడించవద్దని కోరాను. మా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు, షమీపై నమోదైన కేసుల వ్యవహారం తేలేంతవరకు షమీని ఢిల్లీ జట్టుకు దూరం చేయాలని' ఆ ఫ్రాంచైజీ సీఈఓను కోరినట్లు వివరించింది. ఇటీవల డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డ షమీని కలిసేందుకు హసీన్ జహాన్ వెళ్లగా ఆమెను కలిసేందుకు క్రికెటర్ నిరాకరించిన విషయం తెలిసిందే. షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పలు ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ ఫిర్యాదు చేయగా టీమిండియా పేసర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ యువతి నుంచి డబ్బులు తీసుకుని ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు షమీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. -
బీసీసీఐ జోక్యం చేసుకోదు
ముంబై: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. తనను కలిసిన పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్‌కు ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఇటీవల హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పలు కేసులు మోపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బోర్డు నుంచి కూడా ఒత్తిడి తేవాలని భావించిన ఆమె ఖన్నాను వ్యక్తిగతంగా కలిసింది. కానీ ఆయన మాత్రం వ్యక్తిగత వ్యవహారాల్లో బోర్డు ఎంతమాత్రం కలుగజేసుకోదని, కుటుంబ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. త్వరలో జరిగే ఐపీఎల్, అనంతరం జరిగే ఇంగ్లండ్ సిరీస్‌లో షమీ రాణించాలని ఆశిస్తున్నట్లు ఖన్నా తెలిపారు. -
షమీ రానివ్వలేదు: అతని భార్య
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కారు ప్రమాదంలో స్పల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. పరామర్శించడానికి వెళ్లిన తనని షమీ దగ్గరకు రానివ్వలేదని అతని భార్య హసీన్ జహాన్ బుధవారం మీడియాకు తెలిపారు. ‘షమీ గాయపడ్డాడని అతన్ని చూసేందుకు వచ్చా. కానీ కలిసేందుకు అతను నిరాకరించాడు. షమీ ప్రమాదంలో గాయపడ్డాడని తెలిసిప్పటి నుంచి తన కూతురు తండ్రి ఫొటోలు చూపిస్తూ నాన్న కావాలని ఏడ్చింది. వెంటనే నేను షమీని కలవడానికి వచ్చా. అంతకు ముందు అతనితో ఫోన్లో కూడా మాట్లాడాను. కానీ మా మధ్య సయోధ్య గురించి నేను అతన్నేం అడగలేదు.’ అని హసీన్ జహాన్ తెలిపారు. షమీకి చెడు జరగాలని తానెప్పుడూ కోరుకోలేదని, అతను తనకు శత్రువేమి కాదని, గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు ఆమె మంగళవారం మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా షమీ ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో షమీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, తనను తీవ్రంగా వేధించాడని హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సైతం పాల్పడ్డాడని ఆరోపణలు చేయడంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో షమీకి క్లీన్ చీట్ రావడంతో వార్షిక వేతన కాంట్రాక్టు పునరుద్దరించడంతో పాటు అతనికి ఐపీఎల్ ఆడే మార్గం సుగుమమైంది. -
షమీని కలిసిన అతని భార్య
కోల్‌కతా : రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని అతని భార్య హసీన్ జహాన్ కలిసారు. కూతురితో సహా షమీ నివాసానికి వెళ్లి గాయపడ్డ షమీని పరామర్శించారు. డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా షమీ ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో షమీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. జహాన్ షమీని కలిసిన విషయాన్ని ఆమె లాయర్ జాకీర్ హుస్సెన్ ధృవీకరించారు. కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు సమాచారమిచ్చి మరి కూతురితో సహా జహాన్ షమీని కలిసిందని ఆయన మీడియాకు తెలిపారు. షమీ త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు జహాన్ చెప్పారు. షమీకి చెడు జరగాలని తానెప్పుడూ కోరుకోలేదన్నారు. షమీ తనకు శత్రువేమి కాదని, అతను ఆరోగ్యంగా లేకపోతే తాను సంతోషంగా ఉండలేనని చెప్పుకొచ్చారు. ఇక షమీ బెంగాల్ మాజీ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ అకాడమీలో సాధన చేసి తిరిగి వస్తుండగా అతని కారు ప్రమాదానికి గురైంది. ఇక షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, తనను తీవ్రంగా వేధించాడని హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సైతం పాల్పడ్డాడని ఆరోపణలు చేయడంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో షమీకి క్లీన్ చీట్ రావడంతో వార్షిక వేతన కాంట్రాక్టు పునరుద్దరించడంతో పాటు ఐపీఎల్ ఆడే మార్గం సుగుమమైంది. -
షమీ భార్య మరో పోస్ట్.. మండిపడ్డ నెటిజన్లు
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చాటింగ్ వ్యవహారాలను అతని భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో మరోసారి పోస్ట్ చేసారు. ఓ అమ్మాయితో షమీ చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్‌లో ‘నా భర్త ఓ స్టార్‌గా ఏ ఒక్కరిని వదల్లేదు’ అనే సెటైరిక్ క్యాప్షన్‌తో పంచుకున్నారు. అయితే ఈ పోస్ట్‌పై జహాన్‌కు ఊహించని విధంగా నెటిజన్ల నుంచి విమర్శలొస్తున్నాయి. ఇది జహాన్ జాత్యాహంకార దాడి అని కొదరంటే.. డబ్బుల కోసమే ఇలా చేస్తుందని మరోకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు నిరూపించాలంటే న్యాయస్థానాల్లో పోరాడాలని, కానీ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడం ఏమిటని మండిపడుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్, ఇతర మహిళలతో సంబంధాలు, హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ షమీపై సంచనల ఆరోపణలు చేస్తూ పోలీసులకు జహాన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు బీసీసీఐ షమీకి వార్షిక కాంట్రాక్టులో స్థానం కల్పించలేదు. అయితే దర్యాప్తు తర్వాత షమీ ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేలడంతో బీసీసీఐ ‘బి’ గ్రేడ్ కాంట్రాక్టులో చోటు కల్పించింది. ఇక జహాన్ శుక్రవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసారు. దాదాపు పదినిమిషాలు మహ్మద్ షమీ భేటీ అయిన ఆమె షమీ కేసులకు సంబంధించిన మూడు పేజీల వివరాలను సీఎంకు సమర్పించారు. -
ఇది విచ్చిన్నం చేయాలనే కుట్ర : షమీ
సాక్షి, స్పోర్ట్స్: తన కుటుంబాన్ని విచిన్నం చేయడానికి ఎవరో కుట్ర పన్నుతున్నారని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆరోపించాడు. తన భార్య హసీన్ జహాన్ చేసిన గృహ హింస ఆరోపణలు, క్రిమినల్ కేసులు, కాంట్రాక్ట్ నిలిపివేతలతో పాటు ఫిక్సింగ్ తరహా వివాదంతో గత రెండు వారాలుగా షమీ ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. ఫిక్సింగ్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం (ఏసీయూ) షమీకి గురువారం క్లీన్‌చీట్ ఇచ్చింది. ఈ సందర్భంగా షమీ మీడియాతో మాట్లాడుతూ.. తనపై, తన కుంటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తూ తన కుటుంబాన్ని విచ్చిన్నం చేయాలని ఎవరో కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు. ఈ అసత్య ఆరోపణలపై న్యాయబద్దంగా పోరాటం చేస్తానన్నాడు. ఇక నుంచి క్రికెట్‌పై పూర్తిగా దృష్టి సారిస్తానని, నా కోపాన్నంతా సానుకూల ధోరణితో ఆటలో చూపిస్తానన్నాడు. ఇకపై తన బౌలింగ్ గురించే మాట్లాడుకునేలా చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తనే తప్పు చేయలేదని, బీసీసీఐకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని ఈ స్టార్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఏసీయూ రిపోర్ట్‌తో బీసీసీఐ షమీని వార్షిక వేతనాల కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించిది. అంతేగాకుండా షమీ ఐపీఎల్లో పాల్గొనడంపై కూడా మార్గం సుగుమమైంది. ఫిక్సింగ్ ఆరోపణల్లో క్లీన్‌చీట్ వచ్చినా షమీపై ఉన్న గృహహింస కేసులు, పలు ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక మరోవైపు హసీన్ జహాన్ మ్రాతం వెనక్కి తగ్గడం లేదు. ఫిక్సింగ్ ఆరోపణలు చేయలేదని, కేవలం డబ్బులు మాత్రమే తీసుకున్నాడని చెప్పానని తెలిపిన ఆమె షమీ విషయంలో తనకు న్యాయం చేయాలని శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసారు. -
షమీ క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు
-
క్రికెటర్ షమీకి భారీ ఊరట!
సాక్షి, ముంబై: భార్య హసీన్ జహాన్ ఆరోపణలతో గత కొన్ని రోజులుగా ఉక్కిరిబిక్కిరవుతున్న టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి భారీ ఊరట లభించింది. పేసర్ షమీ ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడలేదని తేలింది. ఈ మేరకు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం చీఫ్ నీరజ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ లో ఆడేందుకు షమీకి మార్గం సుగమమైంది. హసీన్ జహాన్ చేసిన ఫిక్సింగ్ ఆరోపణల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఒకటి కాగా, వారం రోజుల కిందట బీసీసీఐ నేతృత్వంలోని అవినీతి నిరోధక విభాగం షమీ కేసును దర్యాప్తు చేసింది. అయితే అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని నీరజ్ కుమార్ వివరించారు. తమ నివేదికలో షమీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో అతడి క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదని తేలింది. మరోవైపు బీసీసీఐ ఇటీవల పునరుద్ధరించిన వార్షిక కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాలో బౌలర్ షమీ పేరు చేర్చినట్లు సమాచారం. భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణల కారణంగా కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించని, బీసీసీఐ తాజాగా షమీ నిర్దోషి అని తేల్చుతూ.. అతడిని వార్షిక కాంట్రాక్టులో గ్రేడ్ 'బి'లో చేర్చింది. దీని ప్రకారం షమీ వార్షిక జీతభత్యాలు రూ.3 కోట్లు అందుకోనున్నాడు. ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లు రూ.7కోట్లు, ఏ గ్రేడ్ క్రికెటర్లు 5 కోట్ల వార్షిక వేతనం పొందనుండగా సి గ్రేడ్ ఆటగాళ్లు కోటి రూపాయలు బీసీసీఐ నుంచి అందుకుంటారు. కాగా, హసీన్ జహాన్ ఫిర్యాదు చేసిన హత్యాయత్నం, గృహ హింస, అత్యాచార యత్నం కేసుల విచారణ షమీపై ఇంకా కొనసాగుతోంది. -
షమీ వ్యవహారం: తెరపైకి మరో పేరు!
సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఓరోజు తగ్గినట్లు కనిపించినా.. ఆ మరుసటి రోజు మరిన్ని ఆరోపణలతో షమీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అతడి భార్య. వేధింపులు, అత్యాచార ఆరోపణలు, వివాహేతర సంబంధాలపై షమీపై ఫిర్యాదు చేసిన భార్య హసీన్ జహాన్ తాజాగా మంజు మిశ్రా అనే యువతితోనూ భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఆమె చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేసర్ షమీ తనకు తెలుసునని లండన్‌కు చెందిన మహ్మద్ బాయ్ అనే వ్యక్తి ఇటీవల స్పష్టం చేశాడు. కాగా, నగదు బదిలీలు మాత్రం జరగలేదని చెప్పాడు. తన భర్త షమీకి మహ్మద్ బాయ్ అనే వ్యక్తి అమ్మాయిలను పరిచయం చేస్తుంటాడని హసీన్ జహాన్ ఆరోపించారు. 'సిగ్గుగా లేదు, నాపై ఆరోపణలు చేయడం ఆపేయ్. నీకోసం, కూతురి కోసమైనా ఆరోపణలపై వెనక్కి తగ్గి, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ' షమీ తనకు సూచించాడని జహాన్ వివరించారు. షమీ నుంచి తనకు హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని భార్య కోరారు. భర్తపై చేసిన ఆరోపణలకు గాను తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు. ఒకవేశ తాను పోరాటం ఆపితే.. మహిళా వర్గం ఓడిపోయినట్లు అవుతుందన్నారు. అందుకే తాను భర్తపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని హసీన్ జహాన్ స్పష్టం చేశారు. తమ మధ్య మూడో వ్యక్తి ప్రవేశించి.. జహాన్‌తో ఇలా ఆడిస్తూ ఆరోపణలు చేపించారని షమీ అభిప్రాయపడ్డాడు. తన నుంచి డబ్బు రాబట్టేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని షమీ ఆరోపిస్తున్నాడు. షమీకి నగదు ఇచ్చిందని, సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ యువతి అలీష్బా మాత్రం క్రికెటర్‌కు తాను అభిమానిని మాత్రమేనని చెప్పారు. షమీకి తాను డబ్బు ఇవ్వలేదన్నారు. మరోవైపు షమీపై బీసీసీఐ ఏసీబీ ఇచ్చే రిపోర్ట్‌పై అతడి భవితవ్యం ఆధారపడి ఉంది. -
సీఎంను కలవనున్న షమీ భార్య
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలవనున్నారు. ఈ మేరకు ఆమె సీఎం అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈనెల 23న మమతా బెనర్జీని వ్యక్తిగతంగా కలిసి తన బాధలను తెలియజేయడంతో పాటు తనకు మద్దతివ్వాలని ఆమె సీఎంను కోరనున్నారు. ఇక అంతకముందు తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, షమీ అరెస్ట్ అయ్యేలా తనకు సహకరించాలని హసీన్ మీడియాను కోరారు. తన బాధను అర్థం చేసుకోవాలని, దయచేసి తనని పాయింట్ అవుట్ చేస్తూ వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. షమీ పలువురి యువతులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని, తనని మానసికంగా వేధించాడని, షమీ సోదరుడు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని, పాక్ యువతితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని హసీన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. అంతటితో ఆగని హసీన్ కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాన్ని విచారణ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది. ఈ రిపోర్ట్‌పైనే షమీ భవితవ్యం ఆధారపడి ఉందన్న విషయం తెలిసిందే. -
షమీని అరెస్ట్ చేసేలా సహకరించండి: హసీన్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీని అరెస్ట్ చేసేలా సహకరించాలని అతని భార్య హసీన్ జహాన్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె కోల్‌కతా మెజిస్ట్రేట్‌లో వాదనలు వినిపించే ముందు మీడియాతో మాట్లాడారు. ‘నా కీర్తి, మర్యాదలను ఈ కేసులో ఫణంగా పెట్టి మరి పోరాడుతున్నాను. షమీ, అతని సోదరుడు నా పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికి కుటుంబం కోసం ఇన్నాళ్లు ఓపిక పట్టాను. షమీపై పోరాటం మొదలు పెట్టినప్పటి నుంచి మీడియా నన్ను పాయింట్ అవుట్ చేస్తోంది. ఈ హింసను ఓ మహిళగా నేనెందుకు తట్టుకోవాలి? చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి ఈ కేసులో నాకు మద్దతివ్వండి. ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు. ఓ మహిళా గౌరవ, మర్యాదలపై జరుగుతున్న పోరాటం. షమీ నా గౌరవ, మర్యాదలను నాశనం చేశాడు. షమీ నేరాల గురించి నేనొక్కదాన్నే గళం విప్పుతున్నాను. కానీ అతని చేతిలో మోసపోయిన అమ్మాయిలందరూ బయటకి రావడం లేదు. ఓ సెలబ్రిటి ఇలా చేయడం సబబేనా? నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. తన పట్ల వ్యతిరేక వార్తలు ప్రచారం చేయవద్దు. షమీని అరెస్టు చేసేలా నాకు మద్దతివ్వండి. నేనిప్పటికే చాలా భరించాను. దయచేసి నాబాధను అర్థం చేసుకొండి. నేను షమీని పెళ్లి చేసుకోకపోయినా నా జీవితం అద్భుతంగా ఉండేది. కానీ నాకు కావాల్సింది అది కాదు. నేను షమీతో ప్రేమలో ఉన్నప్పుడు కనీసం అతను జాతీయ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకొని నన్ను పాయింట్ అవుట్ చేయడం ఆపండి’ అని హసీన్ జహాన్ మీడియాను కోరారు. ఇక షమీ గత నెలలో రెండు రోజుల పాటు దుబాయ్‌లో గడిపిన విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ధృవీకరించింది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులకు షమీ దక్షిణాఫ్రికా పర్యటన గురించి బీసీసీఐ వివరణ ఇస్తూ, అతను దుబాయ్‌లో గడిపిన విషయాన్ని స్పష్టం చేసింది. ఇక పాక్ యువతి అలీషబా సైతం స్పందించిన విషయం తెలిసిందే. షమీకి తాను కేవలం ఓ అభిమానిని మాత్రమేనన్నారు. -
‘షమీ దుబాయ్‌లో గడిపాడు'
న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గత నెలలో రెండు రోజుల పాటు దుబాయ్‌లో గడిపిన విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ధృవీకరించింది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులకు షమీ దక్షిణాఫ్రికా పర్యటన గురించి బీసీసీఐ వివరణ ఇస్తూ, అతను దుబాయ్‌లో గడిపిన విషయాన్ని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం షమి దుబాయ్ వెళ్లాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి అక్కడ పాకిస్థాన్‌కు చెందిన అలిష్బా అనే మహిళ నుంచి డబ్బులు తీసుకున్నాడని షమి భార్య హసీన్ జహాన్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోల్‌కతా పోలీసులు షమి పర్యటన గురించి వివరాలు ఇవ్వాల్సిందిగా బీసీసీఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు బీసీసీఐ జవాబులిచ్చింది. 'బీసీసీఐ నుంచి మాకు లేఖ అందింది. ఫిబ్రవరి 17, 18తేదీల్లో మహమ్మద్ షమి దుబాయ్‌లో ఉన్నట్లు లేఖలో బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. దీని ఆధారంగా తదుపరి విచారణ ఉంటుంది' అని జాయింట్ సీపీ ప్రవీణ్ త్రిపాఠి తెలిపారు. -
‘వివాహితుడితో ఏ మహిళైనా హోటల్‌కు వెళ్తుందా’
కోల్‌కతా: భారత క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ సోమవారం అలిపోర్ కోర్టు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త షమీపై వివాహేతర సంబంధాల కేసులో హసిన్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించిన వాంగ్మూలాన్ని ఆమె కోర్టులో ఇచ్చారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె నేరుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. కాళీఘాట్‌లోని సీఎం నివాసానికి వెళ్లి.. మమతను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అభ్యర్థనను అధికారులకు అందజేశారు. భర్తకు వ్యతిరేకంగా తాను జరుపుతున్న పోరాటానికి సీఎం మమత మద్దతుగా నిలువాలని ఆమె కోరారు. తన భర్తకు చాలా వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనను చంపాడానికి కూడా షమీ ప్రయత్నించాడని ఆమె మీడియాతో అన్నారు. పాకిస్థానీ యువతి అలీషబాతో తన షమీకి వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ‘అలీషబా షమీ స్నేహితురాలు కాదు. అభిమానీ కాదు. ఏ మహిళ అయినా వివాహమైన వ్యక్తితో హోటల్లో గడుపుతుందా? అతని గదికి వెళ్లి.. అతని పడకగదిని పంచుకుంటుందా? నా వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలనే కుట్రతోనే ఆమె హోటల్‌కు వచ్చింది’ అని హసిన్ మీడియాతో తెలిపింది. మరోవైపు పాక్ యువతి అలీషబా మాట్లాడుతూ.. షమీ ఒక క్రికెటర్‌గా తనకు తెలుసునని, ఒక అభిమానిగా ఆయనను కలిసేందుకు మాత్రమే హోటల్‌కు వెళ్లానని వివరణ ఇచ్చారు. -
అవును షమీ నాకు తెలుసు:పాక్ యువతి
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి పాకిస్తాన్ యువతి అలిషబాతో సంబంధమున్నట్లు ఆమె ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అతని భార్య హసీన్ జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా దక్షిణాఫ్రికా పర్యటనంతరం షమీ నేరుగా భారత్‌కు రాకుండా దుబాయ్‌లో అలిషబాను కలిసాడని జహాన్ మీడియాకు తెలిపారు. అయితే ఈ వివాదంలో కీలకంగా మారిన అలిషబా స్పందిస్తూ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. చాంపియన్స్ ట్రోఫీ నుంచే పరిచయం చాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌పై భారత్ ఓడిన మ్యాచ్ నుంచే షమీ తెలుసని అలిషబా చెప్పారు. ఆ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో అతని ఫేస్బుక్ ఫ్రోఫైల్ వెతికి మెసెజ్ పంపించానన్నారు. షమీ అంటే తనకు ఎంతో అభిమానమని, అభిమానులందరికీ ఇష్టపడే క్రికెటర్‌ను కలవాలనే కోరిక ఉంటుందని, అలానే తాను షమీని కలిసానన్నారు. అతనికుండే లక్షల ఫాలోవర్స్‌లో తాను ఒకరినని, ఓ సాధారణ అభిమానిగానే అతనికి మెసెజ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులం అయ్యామని, ఓ క్రికెటర్‌గా అతన్ని గౌరవిస్తానన్నారు. ఇక దక్షిణాఫ్రికా పర్యటననంతరం షమీని దుబాయ్‌లో కలిసింది వాస్తవేమనన్నారు. ఆ పర్యటన అనంతరం షమీ దుబాయ్ నుంచి భారత్‌కు వెళ్తున్నాడని అనుకోకుండా తెలిసిందని, ఆ సమయంలో తాను తన సోదరిల వద్దకు వెళ్తున్నానని తెలిపారు. తన సోదరిలు దుబాయ్‌లో నివసిస్తుండటంతో తరుచుగా అక్కడికి వెళ్తుంటానని దీనిలో భాగంగానే షమీని కలిసినట్లు అలిషబా చెప్పుకొచ్చారు. ఇక షమీతో హోటల్లో గడిపారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ రోజు తాను నేరుగా తన సోదరి నివాసానికి వెళ్లానని, మరుసటి రోజు షమీ బాయ్‌తో ఆ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే చేశానన్నారు. షమీ బాయ్ వ్యక్తిగత జీవితం, ఫిక్సింగ్ ఒప్పందాల గురించి తనకు తెలియదన్నారు. అబద్దాలు కూడా చెప్పని వ్యక్తి, తన దేశానికి నమ్మక ద్రోహం ఎలా చేస్తాడని ఆమె ప్రశ్నించారు. -
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన షమీ భార్య!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై వ్యక్తిగత ఆరోపణ (వివాహేతర సంబంధాలు, గృహహింస)లతో పాటు, కెరీర్‌కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్ జహాన్. కానీ బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమెను విచారణ చేపట్టిన నేపథ్యంలో క్రికెటర్ భార్య యూటర్న్ తీసుకున్నారు. విచారణలో భాగంగా హసీన్ జహాన్‌ను శనివారం సాయంత్రం అధికారులు పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో తడబాటుకు లోనవుతూ, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భర్త షమీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ తాను ఆరోపించినట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు హసీన్ జహాన్. ఇంగ్లండ్‌కు చెందిన మమ్మద్ బాయ్ అనే వ్యక్తి సాయంతో పాకిస్తాన్‌కు చెందిన అలిషబా అనే మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని మాత్రమే చెప్పానన్నది సారాంశం. తనకు అసలు క్రికెట్ ఆట గురించే ఎలాంటి అవగాహన లేదని, అలాంటప్పుడు భర్త షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎలా ఆరోపిస్తానని జహాన్ ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. షమీ కెరీర్ కు ఏ ఇబ్బంది లేదంటూ క్రికెటర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, నగదు అంశంపై షమీ, అతడి భార్య హసీన్ జహాన్ ఫోన్లో మాట్లాడుతూ గొడవపడ్డట్లు ఆడియో టేపుల్లో గుర్తించినట్లు బీసీసీఐ అవినీతీ నిరోధకశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు షమీని అధికారులు ఆదివారం విచారించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను బీసీసీఐకి ఇవ్వనున్నారు. షమీ క్రికెట్ భవితవ్యం ఆ నివేదికపై ఆధారపడి ఉంటుంది. -
క్రికెటర్ షమీని ప్రశ్నిస్తున్న పోలీసులు
సాక్షి, స్పోర్ట్స్: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం షమీ భార్యను ఈ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. నలుగురు అధికారులు షమీ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా.. ఆమె తడబడుతూ వారికి సమాధానమిచ్చారు. ఈ క్రమంలో తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం ఆదివారం అమ్రోహలోని పేసర్ షమీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం క్రికెటర్ ఇంటికి చేరుకున్న అవినీతిశాఖ అధికారులు షమీని, కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. షమీ ప్రవర్తన, అతడు ఎలా ఉండేవాడు అతడికి సంబంధించిన వ్యక్తిగత అంశాలపై కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. షమీకి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనపై వేధింపులకు పాల్పడ్డాడని హసీన్ జహాన్ ఆరోపించారు. దాంతో పాటుగా పాకిస్తాన్ మహిళతో నగదు తీసుకుని క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేశాడంటూ కీలకమైన ఆరోపణలు చేసిన ఆడియో టేపులను అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. హసీన్ నా మాజీ భార్య అంటూ, ఆమెతో తనకు ఇద్దరు పిల్లలు పుట్టారంటూ ఓ వ్యక్తి బయటకు రావడంతో షమీ భార్య కాస్త తగ్గినట్లు కనిపించారు. షమీ భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ ఆదేశానుసారం బీసీసీఐ అవినీతి నిరోధక విభాగ అధికారులు విచారణ చేపట్టారు. వారంలో రోజుల్లోగా దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని గడువు ఇచ్చారు. అధికారుల నివేదిక మీద షమీ క్రికెట్ కెరీర్ (భవిష్యత్తు) ఆధారపడి ఉంటుంది. మరోవైపు భార్య తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనకు మరణశిక్ష విధించాలంటూ షమీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
గంగూలీకి ముందే చెప్పా: షమీ భార్య హసీన్
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ లైంగిక వేధింపుల కేసు, అక్రమ సంబంధాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని బహిర్గతం చేసేముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పశ్చిమబెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చించానని హసీన్ స్పష్టం చేసింది. ‘నా భర్త షమీ వ్యవహారాన్ని బయటపెట్టేముందు గంగూలీకి చెప్పా. ప్రధానంగా ఫేస్బుక్లో పోస్ట్ చేసే ముందు నేను సౌరవ్ సార్‌కి ఫోన్ చేసిన నా సమస్యను వివరించాను. షమీ తప్పుదారిలో నడుస్తున్నాడని, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయనకు చెప్పాను. ఆ తర్వాత ఆయన నాకు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఆయన ఫోన్ కోసం నేను ఎదురుచూస్తున్నా. ఇది వ్యక్తిగత విషయమని.. దీని గురించి ఆయన పట్టించుకోవడం లేదని అనుకుంటున్నా’ అని హసీన్ తెలిపింది. -
ప్రశ్నలతో షమీ భార్య ఉక్కిరి బిక్కిరి
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్ జహాన్. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ ఆదేశాలానుసారం రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగ అధికారులు.. హసిన్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు. శనివారం సాయంత్రం కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న నలుగురు అధికారులు సుదీర్ఘంగా ఆమెను ప్రశ్నించారు. అంతకు ముందు ఆమె చేసిన ఆరోపణలపై ఆమెకు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక విచారణలో ఆమె చేసిన ప్రధాన ఆరోపణలు.. ఆమె ఆ విషయాలు ఎలా తెలుసన్న కోణంలోనే మూడు గంటలపాటు ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వాటిలో చాలా వరకు ఆమె తడబడటం, మౌనంగా ఉండటంతో మరోసారి ఆమెను ప్రశ్నించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన అలిషబా అనే యువతి నుంచి డబ్బులు తీసుకుని షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని. దీని వెనుక ఇంగ్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ భాయ్ ఉన్నాడంటూ జహాన్ ఆరోపించారు. ఇక ప్రస్తుత దర్యాప్తు అనంతరం అధికారులు ఇచ్చే రిపోర్ట్‌పైనే షమీ క్రికెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే హసీన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనను ఉరి తీయాలంటూ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకేం పాపం తెలీదని.. ఈ వ్యవహారంలో తనకు సాయం చేయాలని బీసీసీఐని షమీ వేడుకున్నాడు. సోదరుడితో షమీ రేప్ చేయించబోయాడు -
షమీ పెద్ద అబద్దాలకోరు
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇతర అమ్మాయిలతో అక్రమసంబంధాలు ఉన్నట్లు గతంలో ఆరోపణలు చేసిన జహాన్, తాజాగా తన భర్త పెద్ద అబధ్దాలకోరని, విలువలు లేని వ్యక్తి అని, తనని కాపాడుకోవడం కోసం అబద్దాలు ఆడుతూ తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక చివరి సారిగా షమీతో వాట్సాప్ కాల్ మాట్లాడానని అది కూడా షమీ ప్రణాళికలో భాగంగా చేసిందేనని ఆమె తెలిపారు. ఈ వీడియో కాల్లో వివాదం పరిష్కారం కావాలంటే ఏం చేయాలని అడిగాడని, చేసిన తప్పులు ఒప్పుకొని, క్షమాపణలు కోరాలని సూచించినట్లు ఆమె ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపారు. క్రికెట్ గురించి అంతగా తెలియని తనకు షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు ఎలా చేస్తానని జహాన్ ప్రశ్నించారు. ఆ మొబైల్ ఫోన్ తనకి దొరక్కుండా ఉంటే షమీ ఎప్పుడో విడాకులిచ్చేవాడన్నారు. రెండేళ్లుగా తన భర్త నుంచి వేధింపులు భరిస్తున్నానని, సరైన ఆధారాలు లేకే ఇన్ని రోజులు ఓపికగా ఎదురు చూశానన్నారు. ఇప్పటికీ అన్ని మరిచిపోయి నూతన జీవితం ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇక ఐపీఎల్లో షమీ ఆడేది బీసీసీఐ నిర్ణయంపై ఆధారడి ఉంది. వీలైనంత త్వరగా ఈ కేసు సమసి పోవాలని కోరుకుంటున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు రావటంతో బీసీసీఐ అవినీతి నిరోదక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే షమీ, తన భార్య జహాన్ కాల్ డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు. -
‘నా భార్యపై అత్యాచారం జరగలేదు’
కోల్‌కతా:తన భార్య హసీన్ జహాన్‌పై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ స్పష్టం చేశాడు. భార్య హసీన్‌ను తన సోదరుడు అత్యాచారం చేశాడనే వార్తలపై స్పందించిన షమీ.. అందులో ఎటువంటి నిజం లేదని పేర్కొన్నాడు. ‘హసీన్ చెబుతున్నట్టు డిసెంబర్ 7న నా సోదరుడు ఇక్కడ లేడు. ముర్దాబాద్లో ఉన్నాడు. డిసెంబర్ 6న భువనేశ్వర్ కుమార్ రిసెప్షన్‌కు నా భార్యతో కలిసి వెళ్లాను. అంతకుముందు డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకూ టెస్టు మ్యాచ్ ఆడా. ఆ తర్వాత భువీ రిసెప్షన్‌కు భార్యతో కలిసి హాజరయ్యా. డిసెంబర్ 7న మధ్యాహ్నం గం.3.30ని.లకు మా హోమ్ టౌన్‌కు వెళ్లాం. మరి అటువంటప్పుడు ఆమెపై మా సోదరుడు అత్యాచారం చేశాడని ఆరోపించడం అర్థం లేనిది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని పూర్తి విచారణ చేయండి. ఈ కేసుతో చాలా జీవితాలు ముడిపడి ఉన్నాయి’ అని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో షమీ తెలిపాడు. -
ఏసీయూ నివేదిక తర్వాతే!
న్యూఢిల్లీ: పీకల్లోతు కేసుల్లో ఇరుక్కున్న పేసర్ మొహమ్మద్ షమీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి సెంట్రల్ కాంట్రాక్టు రావాలన్నా, ఈ సీజన్లో ఐపీఎల్ ఆడాలన్నా అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నుంచి క్లీన్చిట్ కావాల్సిందేనని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ నియమావళిలోని క్రికెటర్ల ఎథిక్స్ కోడ్ ప్రకారం కేవలం అవినీతి, అనుచిత ఆర్థిక వ్యవహారాల్లో మాత్రమే బోర్డు జోక్యం చేసుకుంటుంది. వ్యక్తిగత, వైవాహిక అంశాలు బోర్డు పరిధిలోకి రావని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏసీయూ చీఫ్ నీరజ్ కుమార్... షమీ భార్య హసీన్ జహాన్ పేర్కొన్న ఆర్థిక లావాదేవీపైనే విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. తన భర్త పాకిస్తానీ ప్రియురాలికి, మొహమ్మద్ భాయ్‌కి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని హసీన్ ఆరోపించింది. బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని ఏసీయూ హెడ్ నీరజ్ కుమార్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏసీయూ షమీకి క్లీన్చిట్ ఇస్తే సెంట్రల్ కాంట్రాక్టుతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడే అవకాశమిస్తామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా చెప్పారు. -
‘ఆ రిపోర్ట్‌పైనే షమీ భవితవ్యం’
ముంబై:ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన మహ్మద్ షమీ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తన భర్త షమీ ఫిక్సింగ్‌కు పాల్పడి ఉండవచ్చని భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలు అతనికి సరికొత తలనొప్పిని తెచ్చిపెట్టాయి. దీనిపై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్) చీఫ్ నీరజ్ కుమార్‌ను సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ ఇప్పటికే ఆదేశించారు. దాంతో యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఇచ్చే రిపోర్ట్‌పైనే షమీ క్రికెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దీనిపై బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా మాట్లాడుతూ.. ' పాకిస్తాన్‌కు చెందిన మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నట్లు అతని భార్య జహాన్ ఆరోపించిన కేసులో విచారణ జరుగుతుంది. దీనిపై నీరజ్ కుమార్ నేతృత్వంలోని అవినీతి నిరోధక విభాగం ఏడు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ తర్వాత భారత క్రికెట్ పాలక మండలి(సీఓఏ) తీసుకునే నిర్ణయంపైనే షమీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలోనే రాబోవు ఐపీఎల్ సీజన్లో షమీ ఆడతాడా..లేదా అనేది తేలుతుంది. అప్పటివరకూ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోదలుచుకోలేదు' అని ఐపీఎల్ గవర్నింగ్ సమావేశాలకు హాజరైన సీకే ఖన్నా తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ షమీని రూ. 3 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
నన్ను ఉరి తీయండి: క్రికెటర్ షమీ
సాక్షి, న్యూఢిల్లీ: భార్య హసీన్ జహాన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనను ఉరి తీయాలంటూ టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై వస్తున్న ఫిక్సింగ్, గృహహింస ఇతరత్రా ఆరోపణలపై షమీ మరోసారి మీడియా ముందుకొచ్చాడు. నిన్నటివరకూ కేవలం గృహహింస కేసుతో సతమతమైన షమీకి నిన్నటి (బుధవారం) నుంచి కొత్త తలనొప్పి వచ్చి పడ్డ విషయం తెలిసిందే. హసీన్ చేసిన ఆరోపణల్లో ఒకటైన ‘టెలిఫోన్ సంభాషణ’పై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ నీరజ్ కుమార్‌ను సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ ఆదేశించారు. అయితే తనను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా దిగజార్చే యత్నం చేస్తున్న భార్య హసీన్ జహాన్ గురించి తాజాగా షమీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్య ఎప్పుడూ అబద్ధాలు చెప్పేదని, అభద్రతా భావంతో అనుమానించడం మొదలుపెట్టినట్లు తెలిపాడు. 'భర్తగా ఆమెకు చేయాల్సినవన్నీ చేశాను. కానీ అబద్ధాలు చెబుతూ నన్ను వివాదంలోకి లాగింది. ఆమె కోసం రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టాను. షాపింగ్‌ల పేరుతో భార్య నా డెబిట్ కార్డులు మొత్తం ఇష్టమున్నట్లుగా వాడేసింది. దుబాయ్ నుంచి తనకు వజ్రాలు, బంగారు తీసుకురావాలని ఎప్పుడూ అడిగేది. ఆమె చేసే ఆరోపణలు చూస్తుంటే మేం మళ్లీ కలిసి జీవించే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ నేను తప్పు చేసినట్లు రుజువైతే నన్ను ఉరి తీయండి. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను దేశానికి ఎప్పుడూ ద్రోహం చేసే వ్యక్తిని కాదని' షమీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నా భార్యకు పెళ్లయిన విషయం తెలియదు మహ్మద్ షమీ వివాహేతర సంబంధాల కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. షమీ భార్య హసీన్ జహాన్‌కు ఇదివరకే పెళ్లైనట్లు, ఆమెకు ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమె షమీని రెండోపెళ్లి చేసుకుందని తాజాగా కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై షమి స్పందించాడు. తన భార్య హసీన్‌కు ముందే మరో వ్యక్తితో పెళ్లి అయిన విషయం నిజమేనని, ఆ విషయాన్ని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకుందని అతను చెప్పుకొచ్చాడు. తాను హసీన్‌ను పెళ్లి చేసుకునేనాటికే ఆమెకు మరొకరితో పెళ్లి అయ్యిందని, అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారని షమీ చెప్పాడు. ఈ విషయం తన వద్ద దాచి పెట్టిందని, ఈ పిల్లలు ఎవరు అని అడిగితే.. చనిపోయిన తన సోదరి పిల్లలు అని హసీన్ చెప్పిందని వివరించాడు. గుడ్డిగా నమ్మి తాను హసీన్‌ను పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికి హసీన్ అసలు విషయం చెప్పిందని, అప్పటికే తనకు షఫీయుద్దీన్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, ఆ పిల్లలు తన పిల్లలేనని చెప్పడంతో షాక్‌కు గురయ్యానని చెప్పాడు. -
షమీ వివాదానికి కారణమిదే..
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భార్య హసీన్ ఆరోపణలతో షమీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అతని కెరీర్ సందిగ్దంలో పడింది. షమీ దంపతులు మధ్య వివాదం చెలరేగడానికి ‘ఫామ్ హౌజ్ కారణమ’ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో షమీ దంపతులకు ‘హసీన్ ఫామ్ హౌజ్’ ఉంది. దాని విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి 15 కోట్లు ఉంటుందని అంచనా. హసీన్ పేరుతో ఉన్నా ఈ ఫామ్ హౌజ్‌కు సంబంధించిన పత్రాలలో ఆమె పేరు ఎక్కడా లేదని, భవిష్యత్తులో ఇక్కడే షమీ క్రికెట్ అకాడమీ నిర్మించాలనుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు మొదలైనట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. షమీ మంచివాడే: హసీన్ తండ్రి వివాదంపై స్పందించాలని హసీన్ తండ్రిని మీడియా ప్రతినిధులు కోరగా.. ఈ విషయం గురించి తనకు ఏమాత్రం తెలియదన్నారు. షమీ, హసీన్లకే అసలు నిజం తెలుసన్నారు. మహ్మద్ షమీ ఎలాంటివాడని ప్రశ్నించగా అతడు ఒకప్పుడు మంచివాడేనని సమాధానమిచ్చారు. ఇక తన కూతురు చిన్ననాటి నుంచే ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేదని, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించేదన్నారు. -
క్రికెటర్ షమీ మెడకు మరో ఉచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాల కేసు వివాదం అతడి కెరీర్‌ను భారీ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీ మెడకు అవినీతి, ఫిక్సింగ్ కేసు చుట్టుకుంది. భార్య చేసిన ఆరోపణల్ని విశ్వసించిన బీసీసీఐ బౌలర్ షమీపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక-భద్రతా విభాగాన్ని (యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్)ఆదేశించింది. తన భర్త షమీ దుబాయ్ వెళ్లి అక్కడ కొందరు వ్యక్తుల నుంచి డబ్బు తీసుకున్నాడని హసీన్ జహాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్ బాయ్ అనే మధ్యవర్తి ద్వారా పాకిస్తాన్ మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని హసీన్ జహాన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఏసీఎస్‌యూ అధిపతి నీరజ్ కపూర్ షమీ కేసును విచారించి వారం రోజుల్లోగా నివేదిక అందించనున్నట్లు సమాచారం. మరోవైపు భార్యతో క్రికెటర్ షమీ ఫోన్ సంభాషణను సీఓఏ విన్న తర్వాత షమీపై విచారణ చేపట్టాలని నిర్ణయించుకుంది. పాక్ మహిళ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం డబ్బులు తీసుకున్నాడా.. లేక ఇతరత్రా విషయాల కోసమా అన్నది తమ విచారణలో తేలనుందని బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్ పేర్కొంది. -
ట్విస్ట్: తెరపైకి షమీ భార్య మాజీ భర్త!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. షమీ భార్య హసీన్ జహాన్‌కు ఇదివరకే పెళ్లైనట్లు వార్తలు రావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆమె మాజీ భర్తనంటూ షేకీ సైఫుద్దీన్ అనే పశ్చిమ బెంగాల్ వాసి ఒకరు మీడియా ముందుకు వచ్చారు. స్థానిక చానెల్ (జీ24 గంటా)తో మాట్లాడుతూ.. హసీన్ జహాన్ తన మాజీ భార్య అని, ఆమెను 2002లో పెళ్లి చేసుకున్నాని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్భమ్, సియూరిలో కొంత కాలం కాపురం చేసామన్నారు. అయితే తమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, హసీన్‌ను తొలిసారి 2000 సంవత్సరంలో కలిసానని, అనంతరం వివాహంతో ఇద్దరం ఒక్కటయ్యామన్నారు. ఆమె ఇద్దరి కూతుళ్లకు కూడా జన్మనిచ్చిందన్నారు. 2003లో ఒకరిని, 2006లో మరొకరికి జన్మనిచ్చినట్లు సైఫుద్దీన్ తెలిపారు. అనంతరం సమస్యలు మొదలయ్యాయని, ఆమె ఉన్నత చదువులు చదువుకొని స్వతంత్రంగా నిలబడాలని కోరుకుందని, మధ్య తరగతి కుటుంబం కావడంతో అది సాధ్యం కాలేదన్నారు. దీంతోనే 2010లో విడాకులు తీసుకున్నామని, ఇద్దరు పిల్లలు హసిన్ దగ్గరే ఉండాలని, ఆమె వివాహనంతరం తండ్రి దగ్గరకు వెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. షమీతో ఆమె వివాహనంతరం పిల్లలు తనవద్దకు వచ్చారన్నారు. షమీ, హసీన్ జహన్ల మధ్య వివాదం పరిష్కరమై ఒక్కటవ్వాలని సైఫుద్దీన్ కోరుకున్నారు. హసీన్ కూతుళ్లు మాట్లాడుతూ.. తన తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నారు. సెలవుల్లో తన తల్లిని కలుస్తామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు మీడియా ముందు ప్రశాంతంగా మాట్లాడిన హసీన్ మంగళవారం మీడియాపై అసహన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆమెకు ఇదివరకే పెళ్లైందా లేదనే విషయం అధికారికంగా తెలియరాలేదు. ఇక షమీ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని, తనను వేధించాడని హాసిన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో షమీ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. -
షమీ భార్య అసహనం..మీడియాపై దాడి
కోల్‌కతా: తన భర్త మహ్మద్ షమీపై చేసిన సంచలన ఆరోపణల తర్వాత తరచు వార్తల్లో నిలుస్తున్న హసీన్ జహాన్..తాజాగా మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు విలేకర్ల నుంచి ఎదురవుతున్న పలు ప్రశ్నల నేపథ్యంలో జహాన్ అతిగా ప్రవర్తించారు. ఈ మేరకు నగరంలోని సెయింట్ సెబాస్టియన్స్ స్కూల్ ఆవరణలో జర్నలిస్టులు ఆమెను వీడియో చిత్రీకరించే క్రమంలో కెమెరా లాక్కోని పగలగొట్టారు. అదే సమయంలో గట్టిగా అరుస్తూ తన కారులో వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా మీడియా ముందుకొచ్చి కూల్‌గా సమాధానాలిచ్చిన జహాన్.. ఈ రోజు మాత్రం సహనం కోల్పోయి ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంచితే, తనకు అండగా నిలుస్తున్న స్నేహితులకు షమీ ధన్యవాదాలు తెలియజేశాడు. ' కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలిచిన వారికీ కృతజ్ఞతలు' అంటూ షమీ ట్వీట్ చేశాడు. -
షమీ ఫోన్లు సీజ్
కోల్‌కతా: టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో కోల్‌కతా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ మేరకు మహ్మద్ షమీకి సంబంధించిన ఫోన్లను సీజ్ చేశారు. మరొకవైపు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నుంచి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్‌కు తిరిగొచ్చే క్రమంలో తన భర్త దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళ నుంచి నగదు తీసుకున్నాడనే భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐని పోలీసులు సంప్రదించినట్లు తెలుస్తోంది. అసలు షమీ దుబాయ్‌లో దిగాడానికి సంబంధించి ఏమైనా ఆధారాలున్నాయో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా షమీ ఫోన్లను సీజ్ చేసిన పోలీస్ అధికారులు.. విచారణను వేగవంతం చేశారు. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో ఇప్పటికే బీసీసీఐ ఇచ్చే వార్షిక వేతనాల కాంట్రాక్ట్‌ను షమీ కోల్పోయాడు. -
షమీ దుబాయి ఎందుకు వెళ్లాడు?
కోల్‌కతా : భారత క్రికెటర్ మహ్మద్ షమీ కేసు మరో మలుపు తిరిగింది. భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. షమీ దుబాయ్ ఎందుకు వెళ్లాడని ఆరా తీయడంతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఏమైనా సహకరించాడా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనిలోభాగంగా షమీ దుబాయ్‌కు వెళ్లిన సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా అని పోలీసులు బీసీసీఐ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో ఇప్పటికే బీసీసీఐ ఇచ్చే వార్షిక వేతనాల కాంట్రాక్ట్ కోల్పోయిన షమీ, ఐపీఎల్‌లోనూ ఆడటం అనుమానంగా మారింది. -
షమీ ఆఫర్‌కు స్పందించిన భార్య
సాక్షి, కోల్కత్తా : తన భార్యతో తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ చెప్పిన నేపథ్యంలో ఆయన భార్య హసీన్ జహాన్ మరోసారి స్పందించారు. తాను ఫిర్యాదు చేయడానికి మునుపే ఆయనతో ఎన్నోసార్లు చెప్పి చూసేందుకు ప్రయత్నించానని, విభేదాలకు కారణాలు కూడా స్పష్టంగా వివరించానని అన్నారు. తన కుటుంబాన్ని రక్షించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆయన తన తప్పులను సరిదిద్దుకుంటే మరోసారి కలిసి బతికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇది వరకే ఆమె స్పష్టం చేసిన విషయం విదితమే. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోల్కత్తా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తన క్రికెట్ కెరీర్‌కు కూడా స్వల్పకాలిక అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన షమీ.. ఈ వివాదాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా సామరస్యంగా చర్చించుకునేందుకు, తన భార్యతో మాట్లాడేందుకు సిద్ధం అని షమీ చెప్పారు. తన కుటుంబం, కూతురు, తన కెరీర్ ముఖ్యం అని అన్నారు. ప్రస్తుత పరిణామాల ప్రకారం వీరిద్దరి మధ్య వివాదం సమసిపోయేందుకు ఇంకెంతో సమయం పట్టదని తెలుస్తోంది. -
కోర్టు బయట పరిష్కరించుకుంటాం: షమీ
న్యూఢిల్లీ: తన భార్యతో తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ తెలిపాడు. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నం కింద షమీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ‘ఈ సమస్యపై చర్చించి పరిష్కరించుకోవడం మినహా చేసేదేమీ లేదు. కోర్టు వెలుపల పరిష్కారం కనుగొనడమే నాకు, నా పాపకు, నా కెరీర్‌కు ప్రయోజనకరం. కోల్‌కతాకు వెళ్లి నా భార్యతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని మీడియాతో షమీ అన్నాడు. మరోవైపు అతని భార్య కూడా వివాద పరిష్కారానికే మొగ్గుచూపుతోంది. ‘నేను అతని అనుచిత స్క్రీన్ షాట్స్, వాట్సాప్ మెసేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాకే షమీ నిజ స్వరూపమేంటో బయటపడింది. అయితే ఇప్పటికీ అతను నిజాయతీగా తన తప్పులను సరిదిద్దుకుంటానంటే మా అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సయోధ్యపై ఆలోచిస్తాను’ అని హసీన్ తెలిపింది. ‘అతని ఫోన్ నాకు దొరకడం, అందులో అభ్యంతరకర ఫొటోలు, చాటింగ్‌లు ఉండటం వల్లే షమీ మిన్నకుండిపోయాడు. లేదంటే ఇప్పటికే విడాకులిస్తానని కోర్టుకెక్కేవాడు’ అని ఆమె చెప్పింది. మరోవైపు ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయిన షమీకి ఐపీఎల్–11 సీజన్ కూడా చేజారే ప్రమాదముంది. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు షమీని ఆడించాలా వద్దా? అనే అంశంపై బోర్డు అనుమతి కోరింది. బీసీసీఐ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువా వెల్లడించారు. -
నాకు మరో ఆప్షన్ లేదు: షమీ
సాక్షి, న్యూఢిల్లీ : భార్య హసీన్ జహాన్ చేస్తున్న సంచలన ఆరోపణలతో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అతడి భవిష్యత్ ఏమౌతుందోనని క్రికెటర్ అభిమానులతో పాటు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ఆలోచిస్తున్నాయి. కాగా, భార్య చేస్తున్న ఆరోపణలు, వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలని షమీ భావిస్తున్నాడు. విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన షమీ ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి మీడియాతో పలు విషయాలు ప్రస్తావించాడు. ’రోజురోజుకు భార్య హసీన్ జహాన్ చేస్తున్న ఆరోపణలతో వివాదం ముదురుతోంది. చర్చించుకోవడం ద్వారానే ఈ సమస్య పరిష్కారమువుతుందని భావిస్తున్నా. ఇంతకుమించి నాకు మరో ఆప్షన్ ఉన్నట్లు కనిపించడం లేదు. కూతురు కోసం మేమిద్దరం కలిసి ఉండటమే సరైన నిర్ణయం. నా కుటుంబంతో హ్యాపీగా జీవించాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నేను కోల్‌కతాకు వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందంటే కచ్చితంగా వెళ్లి తీరుతా. భార్య ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ గొడవపై ఆమెను కలుసుకుని మాట్లాడి, పరిష్కార మార్గం వెతికేందుకు తాను సిద్దంగా ఉన్నానని’క్రికెటర్ షమీ వివరించారు. మరోవైపు ఈ కేసుల కారణంగా ఐపీఎల్ లో షమీ ఆడకపోతే అతడి స్థానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎవరికీ చోటు కల్పిస్తుందన్న దానిపై చర్చ మొదలైంది. షమీ విషయంలో బీసీసీఐని కలిసి మద్ధతు కోరుతానని జహాన్ అంటున్నారు. -
ఆ మొబైల్లోనే అన్ని ఆధారాలు: షమీ భార్య
సాక్షి, కోల్కత్తా : భార్య హసీన్ జహాన్ చేస్తున్న సంచలన ఆరోపణలతో టీమిండియా పేసర్ షమీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిన షమీ తేరుకునే అవకాశం లేకుండా రోజుకో విషయాన్ని బయటపెడుతున్నారు హసీన్. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ, అతను మ్యాచ్ ఫిక్సర్ అంటూ ఆరోపణలు చేసిన హసీన్ తాజాగా మరో బాంబు పేల్చారు. షమీ వద్ద ఉన్న సెల్‌ఫోన్ గనుక తాను తీసుకుని ఉండకపోతే అతను ఉత్తరప్రదేశ్‌కు పారిపోయి తప్పించుకునే మార్గాల కోసం అన్వేషించేవాడని ఆరోపించారు. ఆ మొబైల్లోనే తన భర్త దోషి అని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలున్నాయని, అందుకే షమీ నోరు విప్పటం లేదని తెలిపారు. తన నివాసంలో వుమన్ గ్రీవెన్స్ సెల్‌తో సమావేశమైన హసీన్ తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. షమీ, అతని కుటుంబ సభ్యులు తనని మానసికంగా, శారీరకంగా హింసించారని, షమీకి ఎంతో మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని వాంగ్మూలంలో ఆరోపించారు. ‘తన తప్పును ఒప్పుకొని ఇకనైనా మారాలని ఎన్నోసార్లు చెప్పి చూశాను. కానీ అతను మారలేదు. ఇప్పుడు కూడా తనకు సంబంధించిన మొబైల్ నా దగ్గర ఉందన్న ఒకే ఒక కారణం చేత విడాకులిచ్చే సాహసం చేయలేకపోయాడు’ అని విలేకరులతో తెలిపారు. తనపై వస్తున్నవన్నీ కేవలం ఆరోపణలేనని వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ మీడియా కూడా అతన్ని ఏమీచేయలేక పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాని, అతను తప్పులు అంగీకరించినట్లయితే మరో అవకాశం ఇస్తానని తెలిపారు. మరోవైపు షమీ ఎఎన్ఐతో మాట్లాడుతూ తనపై కుట్ర జరుగతోందని, తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాలనుకోవడంలేదని, విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విచారణను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై జహాన్ స్పందిస్తూ.. నిజానిజాలేమిటో విచారణలో నిగ్గు తేలతాయని పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణలతో పాటు ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నట్లు ఆమె మరోసారి స్పష్టం చేశారు. -
ఆ ఆరోపణలపై విచారణ చేపట్టండి: షమీ
-
ఆ ఆరోపణలపై విచారణ చేపట్టండి: షమీ
సాక్షి, స్పోర్ట్స్ : తన భార్య చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ డిమాండ్ చేశాడు. ఆదివారం ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘రోజు రోజుకి నాపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి వీటిపై మాట్లాడదలుచుకోలేదు. ఆ ఆరోపణలపై వెంటనే విచారణ చెపట్టాలని మాత్రమే కోరుతున్నాను. బీసీసీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసు విచారణ అనంతరం వారే నిర్ణయం తీసుకుంటారనే విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.’ అని షమీ తెలిపాడు. ఇక భార్య హసిన్ జహాన్ ఆరోపణలతో బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో షమీ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. షమీ వివాహేతర సంబంధాలను హసిన్ జహాన్ సోషల్ మీడియాలో బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం రోజు రోజుకో ఓ మలుపు తిరుగుతోంది. చివరకు శుక్రవారం ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ,అత్యాచార యత్నం, వేధింపులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఈ క్రికెటర్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే హసిన్ రోజుకో కొత్త ఆరోపణతో మీడియా ముందుకు వస్తున్నారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైన అనంతరం మీడియాకు దూరంగా ఉన్న షమీ తాజాగా ఎఎన్ఐతో మాట్లాడారు. -
షమీ ఐపీఎల్లో ఆడటంపై అనుమానాలు
-
సోదరుడితో షమీ రేప్ చేయించబోయాడు
సాక్షి, ముంబై : టీమిండియా పేసర్ షమీ వ్యవహారం పూట పూటకు కొత్త మలుపు తిరుగుతోంది. భార్య హసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలకు దిగారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని హసిన్ చెబుతున్నారు. ‘ఓరోజు హసీబ్(షమీ సోదరుడు) ఉన్న గదిలోకి షమీ నన్ను తోసేసి గదికి బయట గడి వేశాడు. లోపల హసిబ్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చెయ్యబోయాడు. నేను గట్టిగా కేకలు వేయటంతో షమీ కంగారుపడి తలుపులు తెరిచాడు’ అని జహాన్ మీడియాకు తెలిపారు. షమీ కుటుంబ సభ్యులంతా తనపై దాడులకు పాల్పడే వారని ఆమె అంటున్నారు. అంతేకాదు షమీతో జరిపిన ఫోన్ సంభాషణలను కూడా ఆమె మీడియాకు వినిపించారు. అందులో పలువురు మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు అతని నోటి నుంచే చెప్పటం ఉంది. షమీ వివాహేతర సంబంధాలు బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం శుక్రవారం ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ప్రకారం షమీపై కేసు నమోదు అయ్యింది. అత్యాచార యత్నం.. వేధింపులు... వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అయితే హసిన్ ఆరోపణలు చేస్తోందంటూ షమీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
అజ్ఞాతంలోకి మహ్మద్ షమీ!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతని భార్య హాసిన్ జహాన్ షమీ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, చంపడానికి ప్రయత్నించాడని, మానసికంగా ఎంతో వేధించినట్లు ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు గృహహింస, అత్యాచారం, హత్యాయత్నం కింద్ర షమీ, అతని కుటుంబ సభ్యులపై శుక్రవారం కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు అనంతరం ఈ స్టార్ క్రికెటర్ అందుబాటులో లేకుండా పోయాడు. షమీ తన మొబైల్ ఫోన్ స్విచ్చ్ ఆఫ్ చేసుకోని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతని మొబైల్ లోకెషన్ ప్రకారం చివరి సారిగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి అతని సోదరుడితో ఘజియాబాద్ ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తన కుటుంబ సభ్యుల్లో కొందరు కోల్‌కతాలోని తన భార్య కుటింబీకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. షమీ మాత్రం మీడియాకు దూరంగా ఉండమని తన కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షమీ, అతని సోదరుడు ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. -
ఐపీఎల్‌కు షమీ డౌటే.!
సాక్షి, స్పోర్ట్స్ : ‘మూలిగే నక్కమీద తాటి పండొచ్చి పడ్డట్లుంది’ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వ్యవహారం. ఇప్పటికే పలువురి యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న షమీ.. ఐపీఎల్లో ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఆరోపణలతో వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో బీసీసీఐ షమీకి చోటు కల్పించని విషయం తెలిసిందే. అయితే తాజాగా వివాదంలో చిక్కుకున్న షమీని ఐపీఎల్ క్యాంప్‌లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. ‘ సున్నితమైన ఈ అంశంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తొందరపాటు నిర్ణయం తీసుకోదు. ఇప్పటికే ఈ విషయంలో బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని’ ఓ సీనియర్ ఫ్రాంచైజీ అధికారి మీడియాకు తెలిపారు. మహ్మద్ షమీని వేలంలో ఢిల్లీ రూ. 3 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. షమీ అనేక మంది యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని అతని భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోల్‌కతా పోలీసులు షమీపై గృహ హింసా చట్టం, భార్య జహాన్‌ను వేధించటం.. రేప్ అటెంప్ట్.. హత్యాయత్నం, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదంతో షమీ ఐపీఎల్‌కు దూరమైతే షమీ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారనుంది. -
మరో మలుపు తిరిగిన షమీ వ్యవహారం
కోల్‌కతా : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సాయం తీసుకోవాలని షమీ భార్య హసిన్ జహాన్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘ప్రస్తుతం మా న్యాయవాది బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవహారం ఇక్కడితో తేలకపోతే రేపు భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేసే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఇది బోర్డు పరిధిలోనే జరిగి ఉంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే బీసీసీఐనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వ్యవహారానికి ముగింపు పలికే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందని.. ఈ మేరకు జహాన్‌కు రాజీ ప్రతిపాదన పంపిందన్న మరో కథనం వినిపిస్తోంది. మరోవైపు ఈ ఉదయం షమీపై కోల్‌కతా లో ఎఫ్ఐఆర్ నమోదు అయిన సంగతి తెలిసిందే. గృహ హింసా చట్టం కింద కేసు నమోదుకాగా.. భార్య జహాన్‌ను వేధించటం.. రేప్ అటెంప్ట్.. హత్యాయత్నం, వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణలు అతనిపై వినిపిస్తున్నాయి. -
షమీపై కేసు నమోదు
కోల్‌కతా: తన భర్త మహ్మద్ షమీకి వివాహేతర సంబంధాలున్నాయని, ఆ క్రమంలోనే తనను వేధింపులకు గురిచేస్తున్నారని భార్య హసీన్ జహాన్ ఇటీవల చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులు షమీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షమీకి వివాహేతర సంబంధాలు ఉండటమే కాకుండా, పెళ్లైనప్పటి నుంచి అత్తింటివారు గృహహింసకు పాల్పడుతున్నారని జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్లోనే గుర్తించినట్లు హాసిన్ జహన్ తెలిపారు. ఓ చానెల్ తో మాట్లాడుతూ.. ‘2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న వ్యవహారం తెలిసింది. నేను పోస్టు చేసిన ఫొటోలు కొన్ని మాత్రమే. షమీ చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. షమీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు నన్ను వేధిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు నాపై దుర్భాషలాడారు. ఉదయం రెండు గంటల నుంచి టార్చర్ మెదలెట్టారు. చంపాడానికి కూడా ప్రయత్నించారు' అని పేర్కొన్నారు. అయితే దీనిపై అధికారికంగా షమీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జహాన్. దాంతో శుక్రవారం షమీపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. షమితో పాటు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నా భర్త మ్యాచ్ ఫిక్సర్!
కోల్‌కతా: తన భర్తకు పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీమిండియా పేసర్ మహ్మద్ షమి భార్య హసీన్ జహాన్..గురువారం మరో బాంబు పేల్చింది. తన భర్త ఒక మ్యాచ్ ఫిక్సర్ అని వెల్లడించారు. పలు మ్యాచ్‌ల్లో షమీ ఫిక్సింగ్ పాల్పడ్డాడని జహార్ ఆరోపించింది. 'షమి నాతోపాటు దేశాన్నీ మోసగించగలడు. దుబాయ్‌లో అలీ సబా అనే పాకిస్థాన్ అమ్మాయి నుంచి డబ్బు తీసుకున్నాడు. అందుకు నా వద్ద ఆధారాలున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్ భాయ్ సూచన మేరకు అతడు ఆ సొమ్ము స్వీకరించాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే ఆ డబ్బు తీసుకున్నాడు. ఒకవేళ కాకపోతే ఆ డబ్బు ఎందుకు తీసుకున్నాడో షమి వెల్లడించాలి. మహ్మద్ భాయ్ ఎవరో షమీ చెప్పాలి. అతనితో షమీకి ఏమిటి సంబంధం. భాయ్ అనే వ్యక్తి ఏమి చేస్తాడో ప్రపంచానికి చెప్పు' అని జహాన్ డిమాండ్ చేసింది. గతనెల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జట్టు సభ్యులంతా భారత్ వచ్చేయగా షమి దుబాయ్‌లో ఆగిన విషయాన్ని జహాన్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఆ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌లో పాక్‌కు చెందిన మహిళను కలుసుకున్నాడుని, ఫిబ్రవరి 18న ఆమెతో కలిసి అతడు ఓ హోటల్లో చెక్ ఇన్ అయినట్లు తెలిపింది. వీటిపై తాను నిలదీస్తే ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడ్డాడని జహాన్ పేర్కొన్నారు. -
నా వాట్సాప్ మెసెంజర్‌ను చెక్ చేసుకోండి
కోల్‌కతా: పెను వివాదంలో చిక్కుకున్న భారత పేసర్ మొహమ్మద్ షమీ తన భార్య మోపిన ఆరోపణలన్నీ నిరాధారమన్నాడు. ఈ ఆరోపణల్ని రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నాడు. దోషినని తేలితే ముందుగా ఆమెకు, అభిమానులకు క్షమాపణలు చెబుతానన్నాడు. అతని భార్య హసీన్ జహాన్ పేసర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై ఓ మీడియా సంస్థతో షమీ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం బాగానే ఉంటున్నాం. సఫారీ టూర్ నుంచి వచ్చిన వెంటనే హోలీ వేడుక చేసుకున్నాం. కలిసి షాపింగ్‌కు వెళ్లాం. కానీ ఈ నిరాధార ఆరోపణలేంటో అర్థం కావడంలేదు. ఈ విషయం కనుక్కుందామని నా భార్యకు చాలాసార్లు ఫోన్ చేశా. ఆమె మాత్రం ఫోన్ ఎత్తడం లేదు. నా భార్య కాకుండా వేరేవాళ్లతో నేను తప్పు చేసుంటే వాళ్లే ముందుకొచ్చి చెప్పొచ్చు. ఫిర్యాదు చెయ్యొచ్చు. నా వాట్సాప్ మెసెంజర్‌ను చెక్ చేసుకోండి. నా భార్య మీడియాకు చూపించిన వాట్సాప్ మెస్సెజ్లన్నీ నా చాటింగ్ కాదు. నా నంబర్ నుంచి వచ్చినవీ కావు. ఒక వేళ నా భార్యవైపే న్యాయముంటే ఏ శిక్షకైనా సిద్ధం’ అని షమీ అన్నాడు. అతను తన మామ (భార్య తండ్రి)తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పాడు. తన మామ బాగానే మాట్లాడాడని, త్వరలోనే నిజానిజాలు తేలతాయని, సమస్య కూడా పరిష్కారమవుతుందని పేసర్ తెలిపాడు. హీరోయిన్ను పెళ్లాడాలనుకున్నాడు... షమీకి వివాహేతర సంబంధాలున్నాయని, పెళ్లైనప్పటి నుంచి అత్తింటివారు గృహహింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్ తాజాగా ఓ టీవీ చానెల్‌తో మరో విషయాన్ని వెల్లడించింది. కోహ్లి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను చేసుకున్నట్లే షమీ తను కూడా ఓ హీరోయిన్ను చేసుకోవాల్సిందని, పొరపాటుగా నిన్ను (హసీన్‌ను ఉద్దేశించి) కట్టుకున్నానని పదేపదే అనేవాడని ఆమె ఆరోపించింది. ‘గతేడాది శ్రీలంక పర్యటనకు తన బదులు పాకిస్తాన్‌కు చెందిన ప్రియురాలిని తీసుకెళ్దామనుకున్నాడు. షమీ నన్నెపుడు భార్యగా చూడలేదు. విందులకు, వేడుకలకు తన భార్యగా వెంట తీసుకెళ్లలేదు. ఎప్పుడూ విడాకులు కావాలనే అడిగేవాడు. గత ఐదేళ్లుగా అతనికి తుబా అనే మహిళతో వివాహేతర సంబంధముంది. అది దాచి నన్ను పెళ్లి చేసుకున్నాడు’ అని హసీన్ తెలిపింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ చీర్ లీడర్, మోడల్ అయిన హసీన్ జహాన్‌కు 2012 ఐపీఎల్ సందర్భంగా షమీ పరిచయమయ్యాడు. రెండేళ్లు ప్రేమించుకున్నాక షమీ, హసీన్ 2014లో వివాహం చేసుకున్నారు. -
'ఓసారి షమీ సూసైడ్‌కు యత్నించాడు'
న్యూఢిల్లీ: ఒకానొక సందర్బంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని అతని భార్య హసీన్ జహాన్ తాజాగా వెలుగులోకి తెచ్చారు. అదొక షాకింగ్ ఘటనగా పేర్కొన్న జహాన్..ఒక అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లి వద్దన్నందుకే షమీ అలా చేశాడని ఆమె పేర్కొన్నారు. షమీకి పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని తెలిపిన ఆమె బుధవారం సాయంత్రం కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షమీకి సంబంధించిన విషయాల్ని జహాన్ బయటపెట్టారు. 'మేమిద్దరం 2012లో తొలిసారి కలుసుకున్నాం. అంతకుముందు షమి సమీప బంధువుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో ఐదు సంవత్సరాల ప్రేమాయణాన్ని షమీ సాగించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఆ అమ్మాయి కుటుంబసభ్యులు షమితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షమి ఆత్మహత్యకు యత్నించాడు' అని జహాన్ తెలిపారు. 'షమి కోసం నేను అన్ని చేశా. నా మోడలింగ్ కెరీర్, ఉద్యోగం వదులుకున్నా. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు' అని జహాన్ పేర్కొన్నారు. -
భార్యతో పాటు బీసీసీఐ షాకిచ్చింది!
సాక్షి, న్యూఢిల్లీ: అసలే భార్య హసిన్ జహాన్ చేసిన తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి బీసీసీఐ సైతం భారీ షాకిచ్చింది. ఓ వైపు భారత క్రికెటర్ల కాంట్రాక్టు ప్యాకేజీలు భారీగా పెంచుతూ బీసీసీఐ ప్రకటన చేయగా.. షమీని మాత్రం తప్పించింది. తాజా కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాలో ఏ కేటగిరిలోనూ బౌలర్ షమీ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గాయాలబారిన పడుతున్నా నిలకడైన ప్రదర్శనతో కీలక సిరీస్‌లకు షమీ ఎంపికయ్యేవాడు. కానీ నేడు పునరుద్ధరించిన తాజా కాంట్రాక్టులో మాత్రం షమీకి మొండిచేయి లభించింది. వ్యక్తిగతంగానే కాదు, వృత్తిగతంగానూ షమీకి బుధవారం ఏమాత్రం కలిసిరాలేదు. తన భర్త షమీకి చాలామంది యువతులు, మహిళలతో వివాహాతేర సంబంధాలున్నాయంటూ ఆయన భార్య హసిన్ జహాన్ ఈ క్రికెటర్‌కు షాకిచ్చారు. అతడో శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం వేధిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ వైవాహిక బంధాన్ని తెంచుకునే ప్రసక్తే లేదని, భర్తను కోర్టుకు లాగుతానని జాతీయ మీడియాకు తెలిపారు. భర్త సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు యువుతులు, మహిళల వివరాలు, ఫోన్ నెంబర్లను ఆమె సోషల్ మీడియాలో సైతం పోస్టు చేయడం కలకలం రేపింది. కాగా, కెరీర్ పరంగా తనను దెబ్బతీసేందుకు కొందరు ఈ కుట్ర పన్నారని.. భార్య తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నాడు క్రికెటర్ షమీ. ‘షమీని ఏ దురుద్దేశంతోనూ కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించలేదు. క్రికెటర్ల కాంట్రాక్టులు రూపొందించిన రోజే షమీ భార్య అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే షమీ భార్య ఆరోపణలకు, షమీ కాంట్రాక్ట్ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదు. మా నిర్ణయం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉండొచ్చునని కూడా చర్చించుకున్నామని’ బీసీసీఐ సభ్యుడొకరు వివరించారు. -
మరో బాంబు పేల్చిన షమీ భార్య
కోల్‌కతా: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసినా జహాన్ మరోసారి బాంబు పేల్చారు. తన భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకోబోనని, అతడిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు. అతడిని మార్చేందుకు చాలా ప్రయత్నించానని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయారు. అతడో శృంగార పురుషుడని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన చివరిశ్వాస వరకు భర్తతో కలిసేవుంటానని, అతడికి విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని, వీటితో అతడిని కోర్టుకు లాగుతానని ప్రకటించారు. కాగా, చాలా మంది యువతులతో షమీకి వివాహేతర సంబంధాలున్నాయని అంతకుముందు జహాన్ ఆరోపించారు. తన భార్య చేసిన ఆరోపణలను షమీ తోసిపుచ్చాడు. -
షమీ అక్రమ సంబంధాలు బయట పెట్టిన భార్య
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్ జాహన్ బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్లోనే గుర్తించినట్లు హాసిన్ జాహన్ తెలిపారు. ఓ చానెల్ తో మాట్లాడుతూ.. ‘2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న వ్యవహారం తెలిసింది. నేను పోస్టు చేసిన ఫొటోలు కొన్ని మాత్రమే. షమీ చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. షమీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు నన్ను వేధిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు నాపై దుర్భాషలాడారు. ఉదయం రెండు గంటల నుంచి టార్చర్ మెదలెట్టారు. చంపాడానికి కూడా ప్రయత్నించారు. ఈ విషయంలో షమీ, అతని కుటుంబ సభ్యులపై ఇదివరకే పోలీసులకు సమాచారమిచ్చాను. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.’ అని హాసిన జాహన్ పేర్కొన్నారు. తన కుటుంబం, పాప కోసం ఇన్నిరోజులు వేచి చూసానని, కానీ షమీలో మార్పు రాలేదని ఆమె ఆవెదన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాల సహాయంతో షమీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక షమీ, జాహన్‌లకు 2014లో పెళ్లి కాగా వీరిద్దరికి ఒక పాప ఉంది. కాగా ఈ ఆరోపణలపై మహ్మద్ షమీ ట్విటర్ వేదికగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టి పారేశాడు. తనపై వచ్చిన అభియోగాలన్నీ అసత్యమని, ఆటపై దృష్టి సారించకుండా తన కెరీర్‌ను నాశనం చేయాలనే ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని షమీ పేర్కొన్నాడు. అయితే షమీ ట్వీట్ చేసిన కొద్ది క్షణాల్లోనే హాసిన జాహన్ పోస్ట్ చేసిన ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేట్ కావడం చర్చనీయాంశమైంది. Hi I'm Mohammad Shami. Ye jitna bhi news hamara personal life ke bare may chal raha hai, ye sab sarasar jhut hai, ye koi bahut bada humare khilap sajish hai or ye mujhe Badnam karne or mera game kharab karne ka kosis ki ja rahi hai. — Mohammad Shami (@MdShami11) 7 March 2018 -
క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని..
-
క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని..
భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. అందులో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. ఇంకే ముంది కొంతమంది నెటిజన్లు రెచ్చిపోయారు. షమీ నువ్వు అసలైన ముస్లింవేనా అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మరో వైపు మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నారు. 'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మొహమ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని మొహమ్మద్ కైఫ్ ట్విట్ చేశాడు. ఎవరి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారు మీ పని మీరు చూసుకోండంటూ దుస్తులపై కామెంట్లు చేసిన వారిపై నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు. ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలో ఫోటోలను షమీ పోస్ట్ చేసినా, రెండింట్లో విభిన్నంగా కామెంట్లు వచ్చాయి. ఫేస్ బుక్‌లో ఎక్కువగా దుస్తులకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తే ట్విట్టర్లో మాత్రం ఫోటోలు బాగున్నాయంటూ, ఇండియన్ ముస్లింలు మీలాగే ఉండాలని భావిస్తున్నామంటూ.. ఎక్కువగా కామెంట్లు రావడం గమనార్హం. The comments are really really Shameful. Support Mohammed Shami fully. There are much bigger issues in this country. Hope sense prevails. pic.twitter.com/dRJO5WfOgU — Mohammad Kaif (@MohammadKaif) 25 December 2016