నా వాట్సాప్‌ మెసెంజర్‌ను చెక్‌ చేసుకోండి | Mohammed Shami on wife Hasin Jahan: I think she's lost her mental | Sakshi

దోషిగా తేలితే ఏ శిక్షకైనా సిద్ధం

Mar 9 2018 1:08 AM | Updated on Mar 9 2018 8:06 AM

Mohammed Shami on wife Hasin Jahan: I think she's lost her mental  - Sakshi

కోల్‌కతా: పెను వివాదంలో చిక్కుకున్న భారత పేసర్‌ మొహమ్మద్‌ షమీ తన భార్య మోపిన ఆరోపణలన్నీ నిరాధారమన్నాడు. ఈ ఆరోపణల్ని రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నాడు. దోషినని తేలితే ముందుగా ఆమెకు, అభిమానులకు క్షమాపణలు చెబుతానన్నాడు. అతని భార్య హసీన్‌ జహాన్‌ పేసర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

ఈ వివాదంపై ఓ మీడియా సంస్థతో షమీ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం బాగానే ఉంటున్నాం. సఫారీ టూర్‌ నుంచి వచ్చిన వెంటనే హోలీ వేడుక చేసుకున్నాం. కలిసి షాపింగ్‌కు వెళ్లాం. కానీ ఈ నిరాధార ఆరోపణలేంటో అర్థం కావడంలేదు. ఈ విషయం కనుక్కుందామని నా భార్యకు చాలాసార్లు ఫోన్‌ చేశా. ఆమె మాత్రం ఫోన్‌ ఎత్తడం లేదు. నా భార్య కాకుండా వేరేవాళ్లతో నేను తప్పు చేసుంటే వాళ్లే ముందుకొచ్చి చెప్పొచ్చు. ఫిర్యాదు చెయ్యొచ్చు. నా వాట్సాప్‌ మెసెంజర్‌ను చెక్‌ చేసుకోండి. నా భార్య మీడియాకు చూపించిన వాట్సాప్‌ మెస్సెజ్‌లన్నీ నా చాటింగ్‌ కాదు. నా నంబర్‌ నుంచి వచ్చినవీ కావు. ఒక వేళ నా భార్యవైపే న్యాయముంటే ఏ శిక్షకైనా సిద్ధం’ అని షమీ అన్నాడు. అతను తన మామ (భార్య తండ్రి)తో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పాడు. తన మామ బాగానే మాట్లాడాడని, త్వరలోనే నిజానిజాలు తేలతాయని, సమస్య కూడా పరిష్కారమవుతుందని పేసర్‌ తెలిపాడు.  

హీరోయిన్‌ను పెళ్లాడాలనుకున్నాడు... 
షమీకి వివాహేతర సంబంధాలున్నాయని, పెళ్లైనప్పటి నుంచి అత్తింటివారు గృహహింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్‌ తాజాగా ఓ టీవీ చానెల్‌తో మరో విషయాన్ని వెల్లడించింది. కోహ్లి బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను చేసుకున్నట్లే షమీ తను కూడా ఓ హీరోయిన్‌ను చేసుకోవాల్సిందని, పొరపాటుగా నిన్ను (హసీన్‌ను ఉద్దేశించి) కట్టుకున్నానని పదేపదే అనేవాడని ఆమె ఆరోపించింది.

‘గతేడాది శ్రీలంక పర్యటనకు తన బదులు పాకిస్తాన్‌కు చెందిన ప్రియురాలిని తీసుకెళ్దామనుకున్నాడు. షమీ నన్నెపుడు భార్యగా చూడలేదు. విందులకు, వేడుకలకు తన భార్యగా వెంట తీసుకెళ్లలేదు. ఎప్పుడూ విడాకులు కావాలనే అడిగేవాడు. గత ఐదేళ్లుగా అతనికి తుబా అనే మహిళతో వివాహేతర సంబంధముంది. అది దాచి నన్ను పెళ్లి చేసుకున్నాడు’ అని హసీన్‌ తెలిపింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చీర్‌ లీడర్, మోడల్‌ అయిన హసీన్‌ జహాన్‌కు 2012 ఐపీఎల్‌ సందర్భంగా షమీ పరిచయమయ్యాడు. రెండేళ్లు ప్రేమించుకున్నాక షమీ, హసీన్‌ 2014లో వివాహం చేసుకున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement