కోల్‌కతా: ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ముందున్న సమయంలో భారత పేసర్ మొహమ్మద్ షమీకి షాక్! కుటుంబ సమస్యలనుంచి ఇటీవలే కొంత వరకు బయటపడి భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అతడిని మళ్లీ అవే కష్టాలు చుట్టుముట్టాయి. అతని భార్య హసీన్ జహాన్ గత ఏడాది మార్చిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు షమీపై గురువారం చార్జ్‌షీట్ నమోదు చేశారు. వరకట్నం కోసం వేధించడం, లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ అతనిపై సంవత్సరం తర్వాత ఈ చార్జ్‌షీట్ నమోదైంది. దీంతో పాటు తనకు శారీరకంగా, మానసికంగా కూడా టార్చర్ పెట్టాడని, అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడని అప్పట్లో హసీన్ ఆరోపించింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో ముందుగా షమీకి కాంట్రాక్ట్ నిరాకరించిన బీసీసీఐ...అనంతరం అతనికి క్లీ¯Œ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత తన ఆటలో మరింత రాటుదేలిన షమీ టీమిండియా వరుస విజయాల్లో భాగమయ్యాడు. మరో వైపు షమీ సోదరుడు తనను రేప్ చేశాడంటూ కూడా జహాన్ చేసిన ఇతర ఫిర్యాదులపై మాత్రం పోలీసులు చార్జ్‌షీట్ నమోదు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment