
కర్ణాటక: కాళ్ల గోరింటాకు ఆరకముందే మూడుముళ్లు విడిపోయాయి. తల్లిదండ్రులను ఎదిరించి మతాంతర ప్రేమ వివాహం చేసుకున్న యువ జంట పెళ్లి రెండు వారాలకే పెటాకులైంది. ఈ సంఘటన చిక్కబళ్లాపురం తాలూకా మైలపనహళ్లిలో చోటుచేసుకుంది.
ఇదే గ్రామానికి చెందిన ఫసిహా (23), నాగార్జున (25) ఇద్దరూ మార్చి 23న పెద్దలను ఎదిరించి పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. యువకుని కుటుంబీకులు సమ్మతించినా, యువతి పెద్దలు ససేమిరా అన్నారు. ఇంతలో వధువు మనస్సు మారిపోయింది. తాను మతాంతర వివాహం చేసుకున్నందుకు తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ఇక పుట్టింటికి వెళ్లిపోతానని పోలీసులకు రాతపూర్వకంగా తెలిపి వెళ్లిపోయింది. దీంతో ప్రియుడు హతాశుడయ్యాడు.
నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను..