Breakup
-
సచిన్ కూతురుకి హ్యాండ్ ఇచ్చిన గిల్..!
-
పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్
మిల్కీ బ్యూటీ, హీరోయిన్ తమన్నాకి బ్రేకప్ అయిందట. గత కొన్నేళ్లుగా సహనటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని రహస్యంగా ఏం ఉంచలేదు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారని తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.ముంబై ముద్దుగుమ్మ తమన్నా.. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా హిందీలోనూ మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)అలా 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా-విజయ్ వర్మ మధ్య ఏదో ఉందనే రూమర్స్ వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూఇయర్ పార్టీలో వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయింది.ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల్లా తమన్నా-విజయ్ వర్మ ఎక్కడపడితే అక్కడ కనిపించారు. అలాంటిది కొన్నివారాల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడేమో బ్రేకప్ అని షాకిచ్చారు. రీసెంట్ టైంలో తమన్నా బయట ఒంటరిగానే కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం వస్తోంది. అలానే విడిపోవడానికి కారణం కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు) -
అమ్మాయిలు మిమ్మల్ని బకరాలను చేసి వాడుకుంటారు!: నటుడు
బ్రేకప్ బాధ నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదంటున్నాడు ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi). అయితే మనసు ముక్కలైనప్పుడే స్థిరంగా ఉండాలని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. బ్రేకప్ అవగానే అబ్బాయిలు మోసపోయామని బాధపడుతుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను నోటికొచ్చినట్లు తిడుతుంటారు. దీనివల్ల వారి మనసు కాస్త కుదుటపడుతుందని భావిస్తారు. ఈ మూడూ తప్పే!మరికొందరేమో ఇక జీవితంలో ఎవర్నీ నమ్మకూడదనుకుంటారు. ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇంకొందరు విచిత్రంగా ఉంటారు. కనిపించిన ప్రతి అమ్మాయితో డేటింగ్ చేస్తారు, వదిలేస్తారు తప్ప ఎవ్వరితోనూ ఎక్కువ కనెక్షన్ పెట్టుకోరు. నా దృష్టిలో ఈ మూడూ తప్పే! ఒకమ్మాయి నిన్ను కాదనుకున్నంత మాత్రాన నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటావ్? నీపై నువ్వు ఫోకస్ చేయ్.. నీవైపు ఏమైనా పొరపాట్లు జరిగాయా? అన్నది పరిశీలించు.ఆ అమ్మాయి నిన్ను బకరా చేసి..నీ తప్పు లేదంటే మాత్రం ఆ అమ్మాయి నిన్ను అమాయకుడిని చేసి వాడుకుందనో, వేధించిందనో అర్థం. కాబట్టి ముందు నీకోసం నువ్వు ఆలోచించు. అవతలి వ్యక్తికి మరీ ఎక్కువ దాసోహమైపోకు. బ్రేకప్ అవగానే దాన్నుంచి ఎలా బయటపడాలన్నదానికి బదులుగా దాన్నే తల్చుకుని కుమిలిపోతుంటాం. ఇది అందరూ చేసే తప్పు. గతంలో నాకు బ్రేకప్ జరిగినప్పుడు కూడా 4-5 ఏళ్లపాటు మానసికంగా కుంగిపోయాను. అన్నీ నెగెటివ్‌గా ఆలోచించేవాడిని. భార్య ప్రియాంకతో వివేక్ ఒబెరాయ్ఒంటరిగానే ఉండిపోవాలనుకున్నా..జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలనుకున్నాను. నన్ను నేనే మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే ప్రియాంకను కలిశానో అప్పటి నుంచి నాలో నెమ్మదిగా మార్పు మొదలైంది. నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నించాను అని చెప్పుకొచ్చాడు. కాగా వివేక్- ప్రియాంక 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో వీరు దుబాయ్‌లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. ఇకపోతే వివేక్.. లూసిఫర్, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, కంపెనీ, ఓంకార, క్రిష్ 3, సాతియా, యువ, పీఎమ్ నరేంద్రమోదీ, వివేగం(తమిళం), వినయ విధేయ రామ(తెలుగు) వంటి చిత్రాలతో అలరించాడు.చదవండి: కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్ -
దే..వుడా!
జాన్వీ కపూర్ స్నేహితురాలికి ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిందట. ఆ అమ్మాయి శోక సముద్రంలో మునగడం జాన్వీని కదిలించింది. దాంతో తన ఫ్రెండ్ బీఎఫ్‌ని ఉడికించాలని.. తను స్విట్జర్లండ్లో వింటర్ జాకెట్‌తో బ్యాక్ నుంచి తీసుకున్న ఓ ఫొటోను తన ఫ్రెండ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందట.. విత్ మై బాయ్‌ఫ్రెండ్ ఇన్ స్విట్జర్లండ్ అనే రైటప్‌తో! ఆ పోస్ట్ చూసి ‘అబ్బా.. తన ఎక్స్‌కి స్విట్జర్లండ్ తీసుకెళ్లే రిచ్ బాయ్‌ఫ్రెండ్ దొరికాడా!’ అని ఆమె బీఎఫ్ కుళ్లుకుంటాడని ఆశపడిందట జాన్వీ! కానీ ఆప్పటికే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇన్‌స్టా అకౌంట్‌ని అన్‌ఫాలో చేసేశాడట. ఆ నిజాన్ని ఆలస్యంగా గ్రహించిన జాన్వీ ‘దే..వుడా!’ అంటూ తల పట్టుకుందట. -
Raashi Khanna: లవ్ బ్రేకప్...
-
మన జీవితంలో ఆ ఒక్క సెకన్ చాలు : మలైకా అరోరా
బాలీవుడ్ భామ మలైకా అరోరా బీటౌన్‌లో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆమె తండ్రి మరణం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్, బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఆమెను పరామర్శించేందుకు వచ్చారు. అంతకుముందే 2018 నుంచి అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత తమ రిలేషన్‌పై వీరిద్దరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.అయితే తాజాగా ముంబయిలోని దివాళీ బాష్‌కు అర్జున్ కపూర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మలైకా అరోరా గురించి కొందరు ఆరా తీశారు. దీంతో తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. అర్జున్ కామెంట్స్‌తో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. అతని మాటలు విన్న మలైకా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హృదయం, ఆత్మ అంటూ మలైకా రాసుకొచ్చారు. మన హృదయాన్ని ఒక్క సెకను తాకడం వల్ల.. జీవితాంతం మన ఆత్మను తాకవచ్చంటూ మనసులో మాటను బయటపెట్టింది.బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో
ప్రేమలో పడటం, రిలేషన్షిప్లో ఉండటం, కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పడం.. ఇలాంటివి బాలీవుడ్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని బయటపడతాయి. కొన్ని బయటపడవ్ అంతే! తాజాగా హీరో అర్జున్ కపూర్ తన బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మలైకా అరోరాతో విడిపోవడం గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. ఆయా ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఇద్దరూ ఎవరికీ వాళ్లు దూరం పాటించారు. దీంతో బ్రేకప్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం మలైకా తండ్రి చనిపోతే ఆమెకు అర్జున్ అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే మళ్లీ కలిసిపోయారని అందరూ అనుకున్నారు. తాజాగా దీపావళి ఈవెంట్లో పాల్గొన్న అర్జున్ కపూర్.. మైక్‌లో మాట్లాడుతున్న టైంలో 'మలైకా ఎలా ఉంది?' అని ఒకరు అడిగారు. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని బదులిచ్చాడు. అంటే బ్రేకప్‌ని కన్ఫర్మ్ చేసినట్లే.(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Movie Talkies (@movietalkies) -
ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్
వయసొచ్చిన తర్వాత చాలామంది ప్రేమలో పడుతుంటారు. ఇది సాధారణమైన విషయమే. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులేం కాదు. అయితే ప్రేమ ఎల్లకాలం ఉండదన్నట్లు బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని ఎవరూ పెద్దగా బయటపెట్టరు. కానీ 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ మాత్రం తనకు ఏడు నెలల క్రితం బ్రేకప్ జరిగిన విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన లవ్ స్టోరీస్ గురించి చెప్పింది.'సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చేవరకు వచ్చివెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. మీకు ఎవరు సూట్ అవుతారనేది మీకే తెలుస్తుంది. అంతెందుకు నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నా. కానీ నటితో డేటింగ్ అతడికి ఎందుకో ఇష్టం లేదు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దీంతో బ్రేకప్ చెప్పేసుకున్నాం. ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ అయింది. అయితే నన్ను చేసుకునేవాడికి లుక్స్ లేకపోయినా పర్లేదు కానీ మంచి మనిషి అయ్యిండాలి' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ఇప్పటివరకు తన జీవితంలో బ్రేకప్స్ జరిగాయి కానీ మరీ బాధపడిపోయేంతలా ఏం కాలేదని మృణాల్ చెప్పింది. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని పేర్కొంది. మరి మృణాల్ ఠాకుర్ మనసు గెలుచుకునేవాడు ఎక్కడున్నాడో ఏమో చూడాలి?సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకుర్.. హిందీలో పలు సినిమాలు చేసింది. 'సీతారామం' మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఫోకస్ అంతా హిందీపైనే ఉంది. తెలుగులో ఇప్పుడప్పుడే మూవీ చేస్తుందో లేదో డౌటే?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం) -
హీరోతో లైగర్ భామ బ్రేకప్.. అప్పుడే బాయ్‌ఫ్రెండ్ దొరికేశాడా?
బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండే చివరిసారిగా ఖో గయే హమ్ కహాన్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన తొలి వెబ్ సిరీస్ కాల్ మీ బేలో కనిపించనుంది. తాజాగా అనన్య ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ బారాత్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.అయితే గతంలో హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగమ్మ ఆదిత్య రాయ్ కపూర్‌తో మార్చి 2024లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. కానీ మార్చి నుంచి ఈ జంట దూరంగానే ఉంటున్నారు.తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో మరొకరితో అనన్యపాండే కనిపించింది. దీంతో అందరిదృష్టి అతనిపైనే పడింది. ఎవరా మిస్టరీ మ్యాన్? అంటూ తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. తీరా చూస్తే అతని పేరు వాకర్ బ్లాంకో అని.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంతో అనన్య అతనితో డేటింగ్లో ఉందా? అంటూ ఫ్యాన్స్ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా?
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ ప్రకాశ్ బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న నటి హిందీలో పలు సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమె ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్- 6లో నటిస్తోంది. అంతేకాదు తేజస్వి ప్రకాష్ బిగ్‌బాస్-15 సీజన్ విజేతగా నిలిచింది. అయితే బిగ్‌బాస్ షోలో ఉన్న సమయంలోనే నటుడు కరణ్ కుంద్రాను ప్రేమించింది. గత మూడేళ్లుగా ఈ జంట డేటింగ్లో ఉన్నారు.తాజాగా వీరిద్దరు తమ ప్రేమ బంధానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కరణ్, తేజస్వీ దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్ చెప్పుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా వీరి మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తాయని.. దీంతో బ్రేకప్ నిర్ణయానికి వచ్చారని వారి సన్నిహితులు తెలిపారు. అయితే విడిపోయినట్లు వస్తున్న వార్తలపై తేజస్వీ ప్రకాశ్, కరణ్ కుంద్రా ఇప్పటివరకు స్పందించలేదు.అయితే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే కరణ్, తేజస్వి ముంబయిలోని జంటగా కనిపించారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ వెలుపల ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. బ్రేకప్ రూమర్స్ నేపథ్యంలో ఇద్దరు జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము విడిపోతున్నట్లు వార్తలు రావడంతో వాటికి చెక్ పెట్టేందుకే జంటగా కనిపించారా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
మరో జంట బ్రేకప్..విడిపోయిన మలైకా, అర్జున్ కపూర్ ?
-
స్టార్ హీరోయిన్‌కు అలాంటి సమస్య.. షాకింగ్ న్యూస్ చెప్పిన భామ!
కోలీవుడ్ భామ శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అంతే కాదు క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఇక అన్నింటీకీ మించి లోకనాయకుడు కమలహాసన్ కూతురనే బ్రాండ్ కూడా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో సక్సెస్‌పుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈమె త్వరలో సలార్–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈమె ప్రేమలోనూ మూడు సార్లు ఫెయిలయ్యారు ముద్దుగుమ్మ. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే శృతిహాసన్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. నటికి పీసీఓఎస్ అనే సమస్య ఉందన్న విషయం షాకింగ్‌కు గురిచేస్తోంది. తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది భామ. మొదటి పీరియడ్ సమయం నుంచే అది పెద్ద పోరాటంగా మారిందన్నారు. ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని చెప్పారు. బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగా చేయలేకపోతున్నానని చెప్పారు. ఈ కారణంగా చాలా విషయాలను కోల్పోయానని చెప్పారు.కోట్ల రూపాయల ఖర్చుతో చిత్రాలు చేస్తున్న దర్శకులకు తనకు పీరియడ్స్ సమస్య ఉంది షూటింగ్‌ను మరో రోజు పెట్టుకోండి అని చెప్పగలనా? అని శృతిహాసన్ ప్రశ్నించారు. పలువురు నటీనటుల కాల్షీట్స్తో, భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో నటించడం వల్ల బాధను భరిస్తూ.. పాటల సన్నివేశాల్లో డాన్స్ చేస్తూ.. కామెడీ సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తున్నానని చెప్పారు.పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువనిజానికి ఇలాంటి సమస్య చాలా మంది స్త్రీలలో ఉంటుంది. వారంతా జీవితంలో సాధిస్తున్నారు. పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ ( పీసీఒఎస్) వ్యాధి కారణంగా స్త్రీలు అధిక రక్త స్రావానికి గురవుతుంటారంటారు. ఈ వ్యాధి కలిగిన వారితో చా లామందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదంటారు. ఏదేమైన ఇలాంటి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు నటి శృతిహాసన్ చెప్పిన విషయం ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది. -
బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజరికాతో బంధానికి గుడ్ బై చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ రూమర్స్‌కు మరింత బల చేకూరింది. అయితే ఈ విషయాన్ని శృతిహాసన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.అయితే తాజాగా శృతిహాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓ నెటిజన్ శృతి రిలేషన్షిప్ గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు సింగిలా? లేదా కమిట్ అయ్యారా? అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి శృతి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది.శృతి హాసన్ స్పందిస్తూ.. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషం అనిపించదు. కానీ నేను ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నా. మింగిల్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నా. అందులోనే నేను ఆనందంగా ఉన్నా. ప్రస్తుతానికి నాకు ఇది చాలు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో శాంతను హజరికాతో బ్రేకప్ అయినట్లు క్లారిటీ ఇచ్చేసింది. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలొచ్చాక తొలిసారి శృతిహాసన్ స్పందించింది.కాగా.. శృతిహాసన్, శాంతను కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరూ ముంబయిలోనే సహజీవనం చేశారు. గతంలో ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. ప్రస్తుతం ఈ జంట విడివిడాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. శృతిహాసన్ ప్రస్తుతం అడివి శేష్ సరసన డకాయిట్ చిత్రంలో కనిపించనుంది. ఆ తర్వాత చెన్నై స్టోరీ, సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వంలోనూ నటించనుంది. -
ఆమెతో బ్రేకప్‌కు కారణం అదే.. హీరామండి నటుడు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ నెల 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పాక్‌లోని లాహోర్‌లో స్వాతంత్య్రానికి ముందు జరిగిన చారిత్రాత్మక కథనంతో ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. హీరామండి ప్రాంతంలో ఉండే వేశ్యల ఇతివృత్తమే ప్రధానంగా చూపించారు.అయితే ఈ సిరీస్‌లో బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన నటుడు జాసన్ షా. ఈ వెబ్ సిరీస్‌లో కార్ట్‌రైట్ పాత్రలో మెప్పించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ షా.. నటి అనూషా దండేకర్‌తో బ్రేకప్ గురించి మాట్లాడారు. ఆమెతో విడిపోవడానికి గల కారణాలను జాసన్ షా పంచుకున్నారు. అనూషతో విడిపోవడం పెద్ద ఆధ్యాత్మిక మార్పునకు దారితీసిందని జాసన్ చెప్పుకొచ్చారు. ఆమె తనను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. నన్ను తన నియంత్రణలో పెట్టుకునేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అది జరగని పని కావడంతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒకరి మాట మరొకరు వినకపోవడమే బ్రేకప్‌కు కారణమని జాసన్ షా తెలిపారు. అవతలి వ్యక్తి చెప్పేది.. మీరు వింటే మీ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుందని సూచించారు. తనను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే తమ బంధం విచ్ఛిన్నానికి కారణమని తెలిపారు. కాగా.. హీరామండి కంటే ముందు జాన్సీకి రాణి, బిగ్ బాస్ వంటి టీవీ షోలలో జాసన్ కనిపించాడు. అతను 2021లో అనూషా దండేకర్‌తో విడిపోయారు. -
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
బాలీవుడ్లో మరో స్టార్ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో లవ్ బర్డ్స్‌గా ముద్ర వేసుకున్న జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. కొద్ది రోజులుగా వీరిద్దరు త్వరలోనే విడితునట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యం షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఈ జంట దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్ చేసుకున్నట్లు వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.గతంలో జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వీరిద్దరు హాజరయ్యారు. ఈ వేడుకల తర్వాత ఎక్కడా కూడా జంటగా కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని ముంబయికి తిరిగి వచ్చాక తమ రిలేషన్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతని తెలిపిన వివరాలప్రకారం మార్చిలోనే ఆదిత్య, అనన్య విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత అనన్య పాండే తన కొత్త పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. కాగా.. అనన్య పాండే టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ జంట రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. -
బిగ్ బాస్ హౌస్‌లో డేటింగ్.. అప్పుడే బ్రేకప్ చెప్పేసుకున్నారా?
బిగ్ బాస్ సీజన్- 17తో ఫేమస్ అయిన జంట సమర్థ్ జురెల్- ఇషా మాల్వియా. గతేడాది జరిగిన షోలో వీరిద్దరు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ఓకే బెడ్‌పై నిద్రించిన వీడియో అప్పట్లో తెగ వైరలైంది. హౌస్‌లో సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇది బిగ్‌బాస్ షోనా.. అడల్ట్ షోగా మార్చేశారా అంటూ మండిపడ్డారు. అదే హౌస్‌లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఈ జంటపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్లో నటించే సమయంలో వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా తమ రిలేషన్ నిజమేనని ధృవీకరించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలకనున్నట్లు టాక్ వినిపించింది. ఈ జంట త్వరలోనే బ్రేకప్ కానుందని నెట్టింట తెగ వైరలైంది. కానీ ఈ రూమర్స్‌పై ఇషా కానీ, సమర్థ్ కానీ స్పందించలేదు. (ఇది చదవండి: 'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!) తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాను జంట బ్రేకప్ కావడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఈ జంట బ్రేకప్‌కు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై మాత్రం బుల్లితెర జంట నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇషా మాల్వియా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. -
బిగ్‌బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీవనం.. ఇంతలో!
వాలంటైన్స్ డేకు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు (ఫిబ్రవరి 14న) ప్రేమికులు తమ స్పెషల్ డేను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోతారు. వన్‌సైడ్ లవర్స్.. తమ ప్రేమను ఈసారైనా బయటపెట్టాల్సిందే, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే అన్న విధంగా ప్లాన్లు చేసుకుంటున్నారు. అంతా ప్రేమ మైకంలో ముగిని తేలుతున్న ఈ సమయంలో బుల్లితెర జంట మాత్రం విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఒకే ఇంట్లో ఉంటూ.. నటీనటులు ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా.. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అన్నీ కలిసొస్తే.. అదే ఏడాది పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు వస్తున్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇదే నిజమని తేలిపోయింది. బ్రేకప్ నిజమని అంగీకరించారు. మొన్నటివరకు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. ఎక్స్పైరీ అయిపోయింది బ్రేకప్ గురించి పవిత్ర మాట్లాడుతూ.. 'ప్రతిదానికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏదీ శాశ్వతంగా ఉండిపోదు. ప్రేమ బంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. రిలేషన్స్ కూడా కలకాలం ఉండిపోవు. కొన్ని నెలల క్రితమే ఇజాజ్, నేను విడిపోయాం. అప్పటికి, ఇప్పటికి అతడిని గౌరవిస్తూనే ఉన్నాను. తన క్షేమమే కోరుకుంటున్నాను. కానీ మా మధ్య ప్రేమబంధం మాత్రం ముగిసిపోయింది' అని చెప్పుకొచ్చింది. బ్రేకప్ నిజమే.. అటు ఇజాజ్ కూడా బ్రేకప్ నిజమేనని ఒప్పుకున్నాడు. పవిత్ర తన కెరీర్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. కాగా పవిత్ర చివరగా నాగమణి అనే సీరియల్లో కనిపించింది. ఇజాజ్.. జవాన్ సినిమాలో కనిపించాడు. బిగ్‌బాస్ షో ద్వారా ఒక్కటైన ఈ జంట పలు ఈవెంట్లకు, షోలకు కలిసే వెళ్లేవారు. ఎంతో ముచ్చటగా కనిపించే ఈ లవ్ బర్డ్స్ విడిపోతున్నారని తెలిసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ధనుష్ పాటపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ భార్య -
ఇండస్ట్రీలో ముగ్గురమ్మాయిలను ప్రేమించా.. వర్కవుట్ కాలే!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా హీరోగా నటించిన మైఖేల్ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయగా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈసారి హారర్, థ్రిల్లర్ కాన్సెప్టును ఎంచుకున్నాడు. అలా అతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ బాధను పంచుకున్నాడు. నా లైఫ్‌లో మూడు బ్రేకప్స్.. 'నా జీవితంలో ఇప్పటివరకు ముగ్గురమ్మాయిలను ప్రేమించాను. ఎంతో సీరియస్‌గా లవ్ చేశా.. ఒకరితో నాలుగేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాను. మరో అమ్మాయితో రెండేళ్లు, మరొకరితో రెండున్నరేళ్లు సీరియస్ లవ్‌లో ఉన్నాను. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఈ రోజు నేనున్న పొజిషన్లో ఒక్కసారి ఆలోచిస్తే.. అవేవీ నా జీవితంలో అంత ప్రాముఖ్యం కావనిపిస్తున్నాయి. అయితే నేను ప్రేమించిన ముగ్గురూ కూడా ఇండస్ట్రీకి చెందినవారే! నేను ఏళ్ల తరబడి ప్రేమలో ఉన్నా వారెవరు? అనేది బయటకు రానివ్వలేదు. మా లవ్ మ్యాటర్‌ను అంత సీక్రెట్‌గా ఉంచాను. ఇకపోతే రెజీనా, నేను లవ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుంటాయి. కానీ.. తనకు, నాకు మధ్య అలాంటి లవ్ ట్రాక్ ఏం లేదు. తను నాకు బెస్ట్ ఫ్రెండ్. పెళ్లంటేనే భయమేస్తోంది కాలేజీ చదువుకునే రోజుల నుంచీ తను నా స్నేహితురాలు. నా బ్రేకప్స్, కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు.. అన్నీ చూసింది. తనకు, నాకు మధ్య ఏమీ లేదు. ఇక పెళ్లెప్పుడంటారా? ఈ వైవాహిక బంధాన్ని నమ్మడం ఈ మధ్యే ప్రారంభించాను. అదే సమయంలో బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక వ్యక్తితో జీవితం పంచుకోవాలంటే చాలా ఆలోచించాలి. ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని ఎవరూ పోరు పెట్టడం లేదు. కాబట్టి దానికింకా టైముంది.' అని చెప్పాడు. చదవండి: Aishwarya Rajinikanth: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది! -
అదే నా ఫస్ట్ బ్రేకప్.. కోలుకోవడానికి నాలుగైదేళ్లు పట్టింది!
బేబి సినిమాలో హీరోయిన్ను గాఢంగా ప్రేమిస్తాడు హీరో ఆనంద్ దేవరకొండ. బ్రేకప్ తర్వాత ఆమెను మర్చిపోలేక నరకం అనుభవిస్తాడు. నిజ జీవితంలోనూ అలాంటి నరకం చూశానంటున్నాడీ యంగ్ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ బాధను బయటపెట్టాడు. చికాగో వెళ్లాక తనతో జాలీగా ఉండొచ్చనుకున్నా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. నేను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లింది. నేను కూడా అమెరికా వెళ్దామని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాను. కాబట్టి చికాగో చుట్టుపక్కలే ఏదైనా ఒక యూనివర్సిటీలో ఉందామనుకున్నాను. అమెరికాలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీకి అప్లై చేస్తే సీటు దొరికింది. షాకయ్యాను. ఇంక చికాగోకు వెళ్లిపోయాక ఇద్దరికీ స్వేచ్ఛ దొరుకుతుంది. కలిసి ఉండొచ్చు, మా ప్రేమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకున్నాను. కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! అక్కడికి వెళ్లాక వ్యవహారం బెడిసికొట్టింది. బ్రేకప్ బాధ.. నా గుండె పగిలినంత పనైంది. ఆ బ్రేకప్ బాధలో నుంచి బయటపడటానికి నాలుగైదేళ్లు పట్టింది. ఎంతో నిజాయితీగా ప్రేమించాను. కానీ వర్కవుట్ కాలేదు. చాలా బాధపడ్డాను' అని చెప్పుకొచ్చాడు. అమెరికాలో చదువుకుని అక్కడ కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు ఆనంద్. ఆ సమయంలో ఏడాదికి రూ.40 లక్షల జీతం తీసుకున్నాడు. కానీ సినిమాల మీద ఆసక్తితో జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చాడు. దొరసాని సినిమాతో హీరోగా మారాడు. మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, హైవే ఇలా భిన్న ప్రాజెక్టులు చేసుకుంటూ పోయాడు. గతేడాది బేబి చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు! -
మాజీ భర్త రెండో పెళ్లి.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ బ్రేకప్!
సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్‌లు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. బాలీవుడ్లో అయితే కాస్తా ఎక్కువగానే ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ యంగ్ హీరోకు స్టార్ హీరోయిన్ దూరంగా ఉంటున్నట్లు లేటెస్ట్ టాక్. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రస్తుతం ఈ టాపిక్ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న మలైకా.. ఇప్పటికే తన మొదటి భర్తతో అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ కొనసాగిస్తోంది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న భామ.. 2019లో తమ రిలేషన్‌ను బయటపెట్టారు. గతంలో చాలాసార్లు ఈవెంట్లలో ఈ జంట కనిపించి సందడి చేశారు. తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లోనూ అర్జున్ కపూర్, మలైకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై బాలీవుడ్ భామ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఇటీవలే మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్, మలైకా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. -
ప్రియురాలికి బ్రేకప్ చెప్పేసిన యంగ్ హీరో!
బాలీవుడ్ స్టార్, నిర్మాత సునీల్ శెట్టి పరిచయం అక్కర్లేని పేరు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అహన్ శెట్టి. 2021లో తడప్(ఆర్ఎక్స్ 100 రీమేక్) అనే ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ తారా సుతారియా హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం అహన్ శెట్టి తన ప్రియురాలితో బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 11 ఏళ్లపాటు మోడల్ తానియా ష్రాఫ్‌తో రిలేషన్షిప్లో ఉన్న అహాన్ వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ఈ విషయంపై వారి సన్నిహితుడు మాట్లాడుతూ.. 'అహన్‌కు, తానియా చిన్నప్పటి నుంచి తెలుసు. వారిద్దరు ఓకే పాఠశాలలో చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు పదకొండేళ్ల బంధానికి గత నెలలో ముగింపు పలికారు. ప్రస్తుతం ఈ జంట తమ జీవితంలో ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని' తెలిపారు. అయితే వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. తానియా ష్రాఫ్ పారిశ్రామికవేత్త జైదేవ్, రొమిలా ష్రాఫ్‌ల కుమార్తె. అయితే గతంలో అహాన్, తానియా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. View this post on Instagram A post shared by Ahan Shetty (@ahan.shetty) View this post on Instagram A post shared by Tania Shroff (@tania_shroff) -
నాలుగేళ్లుగా డేటింగ్.. నటుడికి బ్రేకప్ చెప్పిన నటి.. ఎందుకంటే?
హీరోయిన్, ఐటం సాంగ్ డ్యాన్సర్.. మలైకా అరోరా ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది. అయితే ఇతడి కంటే ముందు ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారు. అతడే నటుడు అర్బాజ్ ఖాన్. 1998లో అర్బాజ్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ 2017లో అతడికి విడాకులిచ్చేసింది. తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. మలైకా.. అర్జున్‌తో ప్రేమలో పడగా, అర్బాజ్ నటి జియార్జియా ఆండ్రియానిని ప్రేమించాడు. నాలుగేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న అర్బాజ్- జియార్జియా తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారు. ద్వేషపూరిత రిలేషన్ ఈ బ్రేకప్ గురించి జియార్జియా మాట్లాడుతూ.. 'అతడు (అర్బాజ్) నాతో బాగానే ఉన్నాడు. నేను బాధలో ఉన్నప్పుడు కూడా నాకు అండగా నిలబడ్డాడు. అతడి గురించి ఎప్పటికీ నేను చెడుగా అనుకోను. విడిపోయినంత మాత్రాన మొత్తానికే మాట్లాడకుండా ఉండిపోను. విద్వేషపూరిత బంధం(టాక్సిక్ రిలేషన్షిప్)లో ఉన్నప్పుడే అవతలి వ్యక్తిని దూరం పెట్టాలనుకుంటాం. అతడి నీడని కూడా ద్వేషిస్తాం. అతడితో నా రిలేషన్ మరీ అంత ద్వేషపూరితమైనది కాదు. కాబట్టి అతడితో పూర్తిగా సంబంధాలు తెంచేసుకోను. మేము ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం. అది చాలా కష్టమైన ప్రక్రియ. చివరకు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు మాకు బాధగా ఉంది' అని చెప్పుకొచ్చింది. స్వేచ్ఛ హరించుకుపోయింది! బ్రేకప్‌కు గల కారణాల గురించి మాట్లాడుతూ.. అతడు ఏదీ దాచుకోడు. తనకు ఏమనిపిస్తే అదే చేస్తాడు. అది కాదు సమస్య.. నేను బయటకు వెళ్దామని ప్లాన్ చేస్తాను.. అతడు మరేదో ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ మొదలువుతుంది. ఆ సమయంలో నాకు స్వేచ్ఛ కావాలనిపిస్తుంది. మనసుకు నచ్చింది చేయకపోయినా, నచ్చిన చోటకు వెళ్లలేకపోయినా మన స్వేచ్ఛ హరించుకుపోయినట్లే అనిపిస్తుంది. బ్రేకప్ తర్వాత నేను చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నాను. నాకు నచ్చినట్లు ఉండగలుగుతున్నాను' అని పేర్కొంది జియార్జియా. చదవండి: గొడవలు- విడాకులు.. మూడుసార్లు చనిపోయేందుకు ప్రయత్నించా.. సీనియర్ హీరోయిన్ -
ప్రియుడు ఖరీదైన గిఫ్ట్ ఇస్తే బ్రేకప్ చెప్పింది.. ట్విస్ట్ ఇదే!
తాజాగా ఇంటర్నెట్లో ఒక విచిత్ర ఉదంతం వైరల్‌గా మారింది. ఇటువంటి విషయాన్ని ఎవరూ ఎప్పుడూ వినివుండరు. ఒక యువకుడు తన ప్రియురాలికి ఆమె పుట్టినరోజు సందర్భంగా అత్యంత ఖరీదైన క్రూయిజ్ టికెట్ ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయి ఆనందంతో ఎగిరి గంతులేసేందుకు బదులు, ఆగ్రహంతో అతనికి బ్రేకప్ చెప్పింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యువతి ఇటీవల తాను తన ప్రియుడి నుంచి విడిపోయానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ యువతి పోస్ట్‌లో ఇలా రాసింది.. ‘సముద్రాన్ని చూసినప్పుడు నాకు అనారోగ్యం వస్తుందని తెలిసి కూడా ఎందుకు నా కోసం క్రూయిజ్ టిక్కెట్ కొన్నావని నేను అతనిని అడిగాను. నేను కొన్ని నెలలుగా రెయిన్ఫేర్ ఫెస్టివల్ కోసం సిద్ధమవుతున్నానని కూడా అతనికి తెలుసు. తనకు క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నాతో చెప్పాడు. నాకు క్రూయిజ్ టిక్కెట్ కొన్నాడని తెలిశాక అతను ఎంత నీచమైనవాడో నేను గ్రహించాను. నా పుట్టినరోజున నేను ఎంత అనారోగ్యానికి గురైనా అతనికి అవసరం లేదు. అతనికి క్రూయిజ్ ప్రయాణం ఇష్టమని నేను కూడా అతనితో రావాలని అతను కోరుకున్నాడు. ఇది నాకు నచ్చక అతని నుంచి విడిపోయాను. అయితే నేను చెప్పిన బ్రేకప్ను అతను అంగీకరించడం లేదు. కొద్ది రోజుల్లో విబేధాలు సమసిపోతాయి’ అని ఆమె పేర్కొంది. ఆ యువతి రెడ్డిట్‌లో u/Helpful-Minimum8496 అనే ఖాతాతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది వేగంగా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది ఆ యువతి అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. అలాగే తమ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు..‘ఆ యువకుడు ఆమె ఆరోగ్యాన్ని గుర్తించి ఉంటే ఇలా జరిగేదికాదు. ఆ కుర్రాడి తీరు నీచమనిపిస్తోంది’ అని రాశారు. మరొక యూజర్ ఇలా రాశారు.. ‘అతను మీ అభిరుచులను పట్టించుకోకుండా, తన కోరికలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే మీరు అతనిని వదిలివేయడం ఉత్తమం’ అని రాశారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? -
రతిక-రాహుల్ సిప్లిగంజ్ బ్రేకప్ అవ్వడానికి కారణమిదే..
-
తొలిప్రేమ- బ్రేకప్ గురించి చెబుతూ బాధపడిన జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. 'దఢక్' సినిమాతో హీరయిన్ అయిపోయింది. కానీ ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటీ లేదు. అయితే కెరీర్ ప్రారంభంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించే ఛాన్స్ ఈమెకు దక్కింది. నటిగా పక్కనబెడితే గ్లామరస్ ఫొటోలతోనూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!) మరోవైపు బాయ్‌ఫ్రెండ్‌తోనూ షికారు చేస్తూ చాలాసార్లు కెమెరాకి చిక్కింది. అయితే ఈమెకు ఇదివరకే ఒక బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. కాకపోతే అతడితో బ్రేకప్ అయ్యింది. దీని గురించి నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయటపెట్టింది. తన ఫస్ట్ లవ్ కొన్ని రోజుల్లోనే ముగిసిపోయిందని చెబుతూ బాధపడింది. 'పరిణితి లేని వయసు కారణంగా ఇద్దరం ఓ రకమైన అయోమయానికి గురయ్యాం. దీంతో మా మధ్య ప్రేమలో నిజాయితీ లోపించింది. అబద్దాలతోనే మా లవ్, రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో నా తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా హెచ్చరించారు. వారి మాటలు వింటే భవిష్యత్తు బాగుంటుందని అర్థమైంది. దీంతో నా తొలిప్రేమకు ముగింపు పలికాను' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర'లో హీరోయిన్గా చేస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
హీరోయిన్‌పై బ్రేకప్ రూమర్స్.. ఆ ఒక్క వీడియోతో !
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె తన ప్రియుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. బ్రేకప్ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మలైకా ఆరోరా గట్టి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్జున్ కపూర్‌తో లంచ్ డేట్‌కు వెళ్లి మలైకా ఆరోరా రూమర్స్‌కు చెక్ పెట్టారు. తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి ఈ జంట బయటకు వస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో సోదరీమణులు అన్షులా కపూర్, జాన్వీ కపూర్లతో సహా అర్జున్ కుటుంబాన్ని మలైకా అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరి రిలేషన్‌పై రూమర్స్ వచ్చాయి. కాగా.. ఇటీవలే తన భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో విడాకులు తీసుకున్న నటి కుషా కపిలాతో అర్జున్‌కి రిలేషన్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ విషయాన్ని కుషా కపిలా తీవ్రంగా ఖండించింది. కాగా.. గతంలో తామిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని.. తమ బంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు మలైకా వెల్లడించింది. మలైకా అరోరా బాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించింది. అయితే 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది. ఆ తర్వాత 2017తో తన భర్తతో విడాకులు తీసుకున్న మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో రిలేషన్లో ఉంది. (ఇది చదవండి: అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి! ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ
యాంకర్ రష్మీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీళ్లు ఏ క్షణాన కలిశారో గానీ జంటగా హాట్ టాపిక్ అయిపోయారు. దాదాపు 6-7 ఏళ్ల నుంచి టీవీ స్క్రీన్‌పై వీళ్ల జోడీని కొట్టే కాంబో రాలేదని చెప్పొచ్చు. అలాంటిది కొన్నాళ్లుగా సుధీర్-రష్మీ కలిసి కనిపించలేదు. దీంతో చాలామంది ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి టైంలో తాజాగా రష్మీ.. తన బ్రేకప్స్ గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు యాంకరింగ్ చేస్తూ రష్మీ బిజీగా ఉంటుంది. వీటితోపాటు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఈ మధ్యే భోళా శంకర్ మూవీలో చిరుతో కలిసి ఓ పాటలో స్టెప్పులేసింది. తాజాగా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి, తెలుగులో ఆగస్టు 25న రిలీజ్ కాబోతున్న 'బాయ్స్ హాస్టల్' చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. ఇక ఈ ఈవెంట్లో రష్మీ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్ట్ బ్రేక్స్ గురించి చెబుతూ.. 'ప్రతి ఒక్కరి జీవితంలో హార్ట్ బ్రేక్, రిలేషన్స్ చాలా ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు చాలామంది ఇవన్నీ చూస్తూనే ఉంటారు. నా బ్రేకప్స్ గురించి కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి చూస్తుంటే యాంకర్ రష్మీ మనసు కూడా ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ అయిందనమాట. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) -
నా జీవితంలో చేసిన చెత్త పని అదే: స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
మాన్సూన్ వెడ్డింగ్ హాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నటుడు రణదీప్ హుడా. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ రోజు రణ్‌దీప్ 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే అప్పట్లో మాజీ మిస్ యూనివర్స్, సుస్మితాసేన్‌తో డేటింగ్లో ఉండడం అందరినీ దృష్టని ఆకర్షించింది. బాలీవుడ్లో వీరిద్దరి రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 2006 నుంచి దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ ఈ జంట వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రణదీప్ హుడా సుస్మితాసేన్‌తో రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమెతో బ్రేకప్ కావడంపై రణ్‌దీప్ స్పందించారు. (ఇది చదవండి: మూడేళ్ల గ్యాప్, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్ డబుల్..) రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ..' నేను 'మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో రిలేషన్లో లేను. అంతే కాదు ఆమెపై నాకు ఏ విధంగానూ ఫీలింగ్స్ లేవు. సుస్మిత సేన్ జీవితంలోకి నేను వెళ్లకూడదని కోరుకున్నందున.. నా జీవితంలో కేవలం ఒక థియేటర్ రిహార్సల్‌ను మాత్రమే కోల్పోయాను. నా విలువల పరంగా ఇది నేను చేసిన చెత్త పని అని భావించా. కానీ ఆమెతో బ్రేకప్ కావడం నాకు మంచే జరిగింది. ఎందుకంటే నేను పెద్ద స్టార్‌ను కూడా కాదు. కొన్నిసార్లు తాము అనుకున్న సొంత మార్గాల్లోనే వెళ్లడం ఉత్తమమైన పని. ఆ తర్వాతే నేనేంటో నాకు తెలుసొచ్చింది.' అని అన్నారు. అయితే సుస్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత కెరీర్లో బిజీగా మారిపోయారు. రణదీప్ హుడా ప్రస్తుతం 'స్వతంత్ర వీర్ సావర్కర్', 'లాల్ రంగ్ 2' చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు, సుస్మితా సేన్ ఇటీవలే విడుదలైన 'తాలీ' వెబ్ సిరీస్‌తో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సిరీస్‌లో ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడే పాత్రలో కనిపించింది. (ఇది చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
ఐదేళ్లుగా సహజీవనం.. బిగ్ బాస్ జంట షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్ బిగ్ బాస్ జోడీ తమ అభిమానులకు షాకిచ్చింది. బిగ్ బాస్-11 సీజన్లో పాల్గొన్న బంద్గీ కల్రా, పునీశ్ శర్మ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లోనే ప్రేమలో పడిన ఈ జంట అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బంద్గీ కల్రా తన ఇన్‌స్టాలో ఓ నోట్ రాసుకొచ్చంది. 2018 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట బ్రేకప్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది. (ఇది చదవండి: ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న వర్ష, త్వరలో బిగ్‌బాస్‌లోకి! ) కల్రా తన ఇన్‌స్టాలో రాస్తూ..' పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పునీష్, నేను విడిపోయాం. మేమిద్దరం కలిసి ఉన్న సమయం ఎల్లప్పుడూ మా జీవితంలో విలువైనదే. లైఫ్‌లో మనం ఏమి చేయాలని నిర్ణయించుకున్నా సరే ఒకరికి ఒకరి పట్ల ప్రేమ, మద్దతు మాత్రమే ఉంటుంది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నా. ఈ విషయంపై అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా." అంటూ రాసుకొచ్చింది బాలీవుడ్ భామ. కాగా.. పునీష్ బ్రేకప్‌పై తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ నిర్ణయం ఏదైనా నిర్దిష్ట కారణాలు లేవని.. ఇద్దరం ఆలోచించాకే బ్రేకప్ అయిందని వెల్లడించారు. బంద్గీ కల్రా, పునీష్ కథ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్ నుంచి బయటికొచ్చాక తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించారు. గతంలో బంద్గీ వారి బంధంపై మాట్లాడుతూ అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేసింది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి సమయం వెచ్చిస్తున్నట్లు తెలిపింది. కాగా.. 2018 నుంచి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: 9 రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా.. మీ అందరికీ రుణపడి ఉంటా: హీరోయిన్) View this post on Instagram A post shared by Bandgee Kallra 🧿 (@bandgeekallra) -
వీడియో: మెహ్రీన్‌కు భవ్య బిష్ణోయ్ షాక్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి!
-
'అనితా ఓ అనితా' సింగర్ గుర్తున్నాడా?.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
‘ నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగ నీకుమా.. పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనితా ఓ అనితా నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద.' ఈ పాట వినని వారు ఉండరేమో. అంతలా యువతను ఊపేసింది ఆ సాంగ్. ఎక్కడ చూసినా ఆ సాంగ్ మార్మోగిపోయింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరినీ ఊర్రూతలూగించింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అప్పట్లో ఓ రేంజ్లో ఫేమస్ అయినా ఈ సాంగ్ రాసిన యువకుడు పేరు నాగరాజు. ఒక్క పాటతో సంచలనం సృష్టించిన నాగరాజు గురించి తెలుసుకుందాం. నాగరాజు మాట్లాడుతూ..'ఒక వీడియో సాంగ్ పాటకు అనితా పాటను అటాచ్ చేశారు. నిజంగా నేను చనిపోయానని అప్పుడు రూమర్స్ వచ్చాయి. అప్పుడు నాకు చాలా బాధనిపించింది. హైదరాబాద్ అంటే కొత్త కొత్తగా ఉంటుంది. భయంతో నేను మా ఊరికి వెళ్లిపోయా. ఇప్పుడు అనితకు పెళ్లి అయిపోయింది. నాకు కూడా పెళ్లి జరిగింది. నిజంగా అనితకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె వల్లే నేను ఈ పాట రాయగలిగాను. అమ్మాయి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడం వల్ల మా లవ్ బ్రేకప్ అయింది.' అని అన్నారు. నా ప్రేమను ఓ పాట రూపంలో చెబుదామని ప్రయత్నించానని నాగరాజు తెలిపారు. ఇప్పుడు నాకు మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని ఆయన అన్నారు. పెద్దబ్బాయికి మూగ, చెవుడు తన కుటుంబం గురించి నాగరాజు మాట్లాడుతూ.. 'ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయికి మూగ, చెవిటి. మాటలు రావు. చిన్నబ్బాయి కూడా అన్నతో పాటే సైగలే చేస్తుంటాడు. ఇంతకుముందు ఒక చిన్న పాన్‌షాపు పెట్టుకుని జీవనం కొనసాగించా. ఎవరన్నా పిలిస్తే వెళ్లి పాటలు పాడేవాన్ని. నా తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనితో పాటే ప్రస్తుతం నేను హైదారాబాద్‌లోనే ఉన్నానని' తెలిపారు. కాగా ప్రస్తుతం అనితా పాటకు సీక్వెల్‌గా అనిత-2 సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు నాగరాజు వెల్లడించారు. 'నా ప్రాణమా నిను మరిచిపోనులే.. ఊపిరి ఆగినా నీ మీద ప్రేమ చావదే'. అంటూ సాగే సాంగ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. -
అంతా బిల్డప్.. అందుకే బ్రేకప్!: తొలి ఏడాదిలోనే 70 శాతం జంటలు కటీఫ్
ఏడాది తర్వాత దాపరికాలు బహిర్గతమవుతాయి. వారి అలవాట్లు బయటపడతాయి. ప్రేమికులు వాస్తవ ప్రపంచంలోకి వస్తారు. తమ పాత అలవాట్లు వెల్లడవుతాయి. దాంతో వారు ఇంతకు ముందు సహించిన విషయాలతో విభేదించడం ప్రారంభిస్తారు. ప్రేమలో ఉన్నప్పుడు వ్యక్తి ఎంత నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒకటీ రెండు పుట్టిన రోజుల తర్వాత తన పట్ల ఉదారంగా లేరని గ్రహించి ప్రేమికులు బ్రేకప్‌లు చెప్పుకొంటున్నారు.. – డేవిడ్ మెక్క్యాండ్లెస్, సామాజిక శాస్త్రవేత్త సాక్షి, అమరావతి: రోజ్– జాక్ ప్రేమించుకున్నారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉండేవారు. కాలేజీలో, బయట ఆ జంట గురించే చర్చ. ప్రేమికులంటే అలా ఉండాలని అందరూ చెప్పుకొనేవారు. ఏడాది గడిచింది. అదే జాక్– రోజ్.. జాక్ ఎదురుపడితే రోజ్ మొహం తిప్పుకొంటోంది. అతడూ తక్కువేం కాదు. ఆమెను చూడగానే గుడ్లురిమి చూస్తున్నాడు. ఒకరి కోసం ఒకరుగా ఉన్న జంట.. ఇప్పుడు ఉప్పు–నిప్పులా మారిపోయింది. ఎందుకిలా జరిగిందని అడిగితే ‘నిజం తెలిసింది’ అన్నది ఇద్దరి సమాధానం. యూఎస్, యూరప్ దేశాల్లోని ప్రేమ జంటల్లో 75 శాతం మొదటి సంవత్సరంలోనే విడిపోతున్నాయి. 20–25 శాతం మంది మాత్రం తమ ప్రేమను నాలుగైదేళ్ల పాటు కాపాడుకుంటున్నారు. పదేళ్ల పాటు కలిసున్న జంటలు చాలా అరుదు అని సామాజిక, మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నవారు ఒకటి లేదా రెండేళ్లలోనే ఎందుకు విడిపోతున్నారు? కారణాలేంటి? అన్న అంశాలపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సోషియాలజిస్ట్ మైఖేల్ రోసెన్ఫెల్డ్, మానసిక చికిత్స నిపుణుడు డాక్టర్ బార్టన్ గ్లాడ్స్మిత్లు వేర్వేరుగా సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. వీరు 2009 నుంచి 2022 వరకు దాదాపు 3000 జంటలపై చేసిన పరిశోధనల్లో విడిపోయేందుకు కీలకంగా మారిన అంశాలను గుర్తించారు. మొదట్లో భాగస్వామి కోరుకున్నట్టుగా.. ప్రేమలో పడినప్పుడు తమ వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరూ చూపరు. తన భాగస్వామి ఏం చూడాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చూపిస్తారు. ఒక విధంగా ఇది ‘నటన’తో కూడి ఉంటుందని మైఖేల్ పేర్కొన్నారు. ‘ప్రేమ భావాలు మెదడులోని క్లిష్టమైన ఆలోచనలను నియంత్రిస్తాయి కాబట్టి.. మనం ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు వారి ప్రవర్తన లేదా వ్యక్తిత్వాన్ని లోతుగా అంచనా వేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ప్రేమికుల మెదడు నిర్ణయిస్తుంది. అందువల్ల తొలినాళ్లల్లో ప్రేమికుల వ్యక్తిత్వం వాస్తవానికి భిన్నంగా ఉంటుందంటున్నారు. ఏడాది గడిచాక దాచిపెట్టిన వ్యక్తిత్వం బయటపడుతుంది.. ఆ సమయంలోనే విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రేమికుల రోజు, వసంతకాలం, ఏప్రిల్ ఫూల్స్ డే, వేసవి సెలవులు, క్రిస్మస్, క్రిస్మస్ రోజుకు రెండు వారాల ముందు, సోమవారాల్లో బ్రేకప్‌లు తరచుగా జరుగుతున్నాయని మరో సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ మెక్క్యాండ్లెస్ తేల్చారు. 5 నుంచి 10 శాతం జంటలే పెళ్లివరకూ.. ప్రేమపై భారతీయ యువతీ యువకుల అభిప్రాయాలు తెలు సుకునేందుకు సోషల్ నెట్వర్క్ యాప్ ‘బంబుల్’ సర్వే చేపట్టింది. దీనిప్రకారం వయసు, విద్య, సామాజిక నేపథ్యం, సాంస్కృతిక వ్యత్యాసాలు, ఆరి్థక స్థిరత్వం వంటి అంశాలకు యువత అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించింది. వీటిని దాటుకుని ముందుకు సాగడం తమవల్ల కాదని 35 శాతం మంది యువకులు గర్ల్‌ఫ్రెండ్ అనే మాటకు దూరంగా ఉన్నారు. దాదాపు 50–55 శాతం మంది ‘జస్ట్ ఫ్రెండ్స్’గానే ఉన్నామని వెల్లడించారు. ప్రేమించుకున్న జంటల్లో కేవలం 5 నుంచి 10 శాతం మాత్ర మే పెళ్లి వరకూ వెళుతున్నట్టు వెల్లడైంది. దాచాలన్నా దాగవులే.. ప్రేమించిన తొలినాళ్లల్లో తమలో ఉన్న చెడు ప్రవర్తనలు దాచిపెట్టి ఎదుటి వారు కోరుకున్నట్టు ఉన్న వ్యక్తులు.. ఏడాది లోపే బయటపడిపోతున్నారట. పాత ప్రవర్తనలు ధూమపానం, మద్యపానం, పొగాకు నమలడం వంటివి ఎదుటి వారికి ఇబ్బందిగా మారడం.. వాటిని మానుకోమని చెప్పడంతో మొదలయ్యే ఘర్షణ బ్రేకప్‌కు దారితీస్తుందని గుర్తించారు. ముఖ్యంగా చెడు ప్రవర్తనతో పాటు, మోసం, అధిక కోపం, ఎదుటివారికి అవసరంలో అండగా ఉండకపోవడం, చెడు సావాసాలు, భాగస్వామి పట్ల నిర్లక్ష్యం, అబద్ధాలు చెప్పడం, కష్టంలో ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు వదిలేసి పోవడం, ఏదైనా విషయాన్ని సరిగా చెప్పకపోవడం వంటివి జంటల మధ్య బీటలుగా మారుతున్నాయని తేల్చారు. వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా జంటల మధ్య మంట తప్పదని స్పష్టం చేశారు. -
సినిమాని తలపించే సీన్..ప్రియురాలి కోసం ఏకంగా 21 గంటలు..
సినిమాల్లో ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాల్లో హీరో మోకాళ్లపై కూర్చోవడం చూసే ఉంటాం. రియల్ లైఫ్‌లో అలా కుదరదు. అంతగా అవసరమైతే నాలుగైదు సార్లు బతిమాలడం లేదా పెద్దవాళ్లను ఎవరినైనా పిలిపించి మాట్లాడించటం వంటివి చేస్తారు చాలామంది. కానీ ఇక్కడొక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి బ్రేక్అప్ చెప్పి వెళ్లొద్దు అంటూ ఎంతగా వేడుకున్నాడంటే సినిమాలోని సీన్లను మించిపోయేలా చేశాడు. ఏకంగా ఆమె కోసం వర్షంలో 21 గంటల పాటు మెకాళ్ల పైనే ఉండిపోయాడు. ఎవరూ ఎంతగా చెప్పినా వినకుండా అలానే ఆమె కోసం వర్షంలో తడుస్తూ ఉండిపోయాడు. అసలేం జరిగిందంటే.. చైనాలోని ఓ వ్యక్తికి ప్రియురాలు బ్రేక్ అప్ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి నిన్ను వదులుకోలేనంటూ ఆమెను ఎంతగానో బతిమాలుకున్నాడు. ఆమె ప్రేమను ఎలాగైనా తిరిగి పొందాలనుకుని ఆమె పనిచేసే కార్యాలయానికి వెళ్లి.. చేతిలో పూల బొకేతో లవ్ ప్రపోజ్ చేసే భంగిమలో (మోకాళ్లపై) నుంచొని ఆమె కోసం ఆత్రంగా ఎదురు చూశాడు. ఇలా అతను మార్చి 28 మధ్యాహ్నం 1 గంటకు అనగా నిలబడ్డ వ్యక్తి ఆ మరుసటి రోజు ఉదయ 10 గంటల వరకు జోరు వానలో అలానే మోకాళ్లపై ఉండిపోయాడు. ఎవరూ ఎంత చెప్పినా ససేమిరా అన్నాడు. ఆఖరికి పోలీసులు రంగంలోకి దిగినా.. విరమించి లేవడానికి అస్సలు ఒప్పుకోకపోగా, ఇది చట్ట విరుద్ధం కాకపోతే నన్ను వదిలేయండి అని పోలీసులను అభ్యర్థించాడు. తన మాజీ ప్రియురాలు తనతో విడిపోయిందని, క్షమాపణలు కోరుతూ ఇలా ఉన్నాని వారికి చెప్పాడు. అతడు ఇంత హంగామా చేసినా.. అక్కడ ఎక్కడా ఆమె జాడ కనిపించకపోవడం విచిత్రం. పాపం ఆ వ్యక్తి ప్రేమ ఫలించిందా? లేదా అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉండిపోయింది. అందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీరు ఆమె కోసం మోకరిల్లి ఉండాల్సిన అవసరం లేదని కొందరూ అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు, మరికొందరు ఆమెకు నీ ప్రేమను పొందే అర్హత లేదు అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: తీరు మార్చుకోని చైనా! అది మా సార్వభౌమాధికారం అంటూ మంకుపట్టు) -
లవ్ బ్రేకప్‌కి ఓ ఇన్సూరెన్స్..మోసపోయిన వాళ్లు క్లయిమ్ చేసుకోవచ్చంట?
కోవిడ్-19తో ప్రపంచ వ్యాప్తంగా ఇన్సూరెన్స్ రంగం గణనీయమైన వృద్దిని సాధించింది. ఆపత్కాలంలో ఆర్ధిక చేయూత అందించేందుకు భీమా రంగ సంస్థలు ఇన్సూరెన్స్ పథకాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. వాటిల్లో హోమ్ ఇన్సూరెన్స్, మోటార్స్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా రకరకాల ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. కానీ లవ్‌లో బ్రేకప్ అయితే ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ అనే పథకం ఉంది. ఆ స్కీమ్ గురించి మీకు తెలుసా? అవును! ప్రేమికుడు, ప్రేమికురాలు కొన్ని అన్వేక కారణాలతో విడిపోతున్న ఘటనలు చూసే ఉంటాం. ఇలా విడిపోయిన తర్వాత డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు పలు ఇన్సూరెన్స్ సంస్థలు పథకాల్ని అందిస్తున్నాయి. వాటిల్లో ఈ హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఒకటి. ఇటీవల ప్రతీక్ ఆర్యన్ అనే ట్విటర్ యూజర్ ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రియురాలితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగా.. ప్రేమించుకునే సమయంలో పొరపాటున విడిపోతే.. ఎవరికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేలా ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ పేరుతో ప్రేమలో మోసపోయిన వాళ్లు డబ్బులు తీసుకోవాలనే నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతీక్ అతని ప్రియురాలు కలిసి ఓ బ్యాంక్‌లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ప్రతి నెల ఆ అకౌంట్లో రూ.1000 డిపాజిట్ చేశారు. ఈ తరుణంలో ప్రియురాలు తనని మోసం చేయడంతో రూ.25వేలు నగదు పొందినట్లు ప్రతీక్ ట్వీట్లో తెలిపారు. I got Rs 25000 because my girlfriend cheated on me .When Our relationship started we deposited a monthly Rs 500 each into a joint account during relationship and made a policy that whoever gets cheated on ,will walk away with all money. That is Heartbreak Insurance Fund ( HIF ). — Prateekaaryan (@Prateek_Aaryan) March 15, 2023 ప్రతీక్ ట్వీట్లపై ఈ తరహా ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ గురించి పూర్తి వివరాలు చెబితే తాము సైతం పాలసీలు తీసుకుంటామని రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. లోరెంజో చాన్ ఏం చెబుతున్నారంటే ప్రేమ విఫలమై డిప్రెషన్, అనారోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే వారిని ఆదుకునేందుకు పయనీర్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు ప్రేమలో విఫలమైన వారి కోసం ఇన్సూరెన్స్ స్కీంలను అందిస్తున్నాయి. ఈ పాలసీలు తీసుకున్న వాళ్లు ప్రేమలో విఫలమైన తర్వాత క్లయిమ్ చేసుకొని నగదు పొందే అవకాశం కల్పిస్తున్నాయి. అలా లబ్ధి పొందాలంటే తాము విధించిన నిబంధనలు లోబడి ఇన్సూరెన్స్ తీసుకోవాలని పయనీర్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రెసిడెంట్ లోరెంజో చాన్ తెలిపారు. You may not be able to save your family and loved ones from a heartbreak but you can help them start the healing process. Get insured through Heartbreak PH 💜https://t.co/GFH6OkKVxi — Pioneer Insurance (@PioneerPH) February 14, 2020 చదవండి👉 ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని -
బాయ్‌ఫ్రెండ్‌తో ప్రముఖ నటి బ్రేకప్.. క్లారిటీ ఇదే..!
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఆమె ప్రియుడితో బ్రేకప్ చేసుకుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది. సోషల్ మీడియాలో అభిమానులు పెద్దఎత్తున కామెంట్స్ చేయడంతో రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ప్రియుడు రాకీతో బ్రేకప్‌పై హీనా ఖాన్ స్పందిస్తూ.. ' బ్రేకప్ గురించి కొన్ని కథనాలు విన్నా. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మేం ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడు మా పట్ల దయతో ఉన్నారు. కానీ ఇది విని నా స్నేహితులు చాలా భయపడ్డారు. రాకీ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఇలాంటి వాటిని పట్టించుకోడు. నా స్నేహితులు చాలామంది ఈ విషయంపై ఆరా తీశారు.' అని అన్నారు. హీనా ఖాన్, చిత్రనిర్మాత రాకీ చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 'శడ్యంత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ షో ప్రమోషన్లలో భాగంగా ఇదంతా ప్రచారంలో వ్యూహమని నటి తెలిపింది. వీరిద్దరు యే రిష్తా క్యా కెహ్లతా హై షూటింగ్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. -
నిహారికతో బ్రేకప్.. ప్రముఖ సింగర్ క్లారిటీ
ప్రముఖ బాలీవుడ్ సింగర్, గేయ రచయిత ప్రతీక్ కుహద్ ప్రియురాలితో బ్రేకప్ అయినట్లు స్పష్టం చేశారు. నిహారిక ఠాకూర్‌తో బంధం తెంచుకున్నట్లు వివరించారు. కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న సింగర్ కొద్ది రోజుల క్రితమే తాము విడిపోయామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రతీక్ కుహాద్కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీసంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. అతని స్నేహితురాలు నిహారిక ఠాకూర్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. అయితే నిహారికతో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు ప్రతీక్. ప్రతీక్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ఎవరితో రిలేషన్లో లేను. కొంత కాలంగా దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. కొంతమంది ఇప్పటికీ రిలేషన్లో ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే చెబుతున్నా నేను ఎలాంటి రిలేషన్లో లేను. కొంతకాలం క్రితమే మా బంధం ముగిసింది. తాను ఇప్పుడిప్పుడే సంగీతంపై దృష్టి పెట్టానని చెప్పాడు. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నా. చాలా షోలు జరుగుతున్నాయి. ఇప్పుడే మ్యూజిక్ చేస్తున్నా.' అని అన్నారు. ప్రతీక్ కుహద్ ‘కోల్డ్/మెస్’ పాటకు బాగా పేరు సంపాదించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, బరాక్ ఒబామా తన 'ఫేవరేట్ మ్యూజిక్ ఆఫ్ 2019' జాబితాలో అతనికి 'కోల్డ్/మెస్' అని పేరు పెట్టారు. అతను బార్ బార్ దేఖో చిత్రంలోని 'ఖో గయే హమ్ కహాన్', కార్వాన్ చిత్రంలోని సాన్సేన్ అనే సాంగ్ కూడా ఆలపించారు. -
వైరల్: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. ఏకంగా 70 కిలోలు తగ్గి
బాగా లావుగా ఉన్నాడని ఓ వ్యక్తిని అతని గర్ల్‌ఫ్రెండ్ వదిలేసి వెళ్లింది. ప్రియురాలు బ్రేకప్ చేప్పడంతో చాలా కుంగిపోయాడు. అయితే ఆమెకు తన మాటలతో కాకుండా చర్యలతో తగిన సమాధానం చెప్పాడు. ఉబకాయం నుంచి కండల వీరుడిగా తయారయ్యాడు. ఏకంగా 70 కిలోలు బరువు తగ్గి వావ్ అనిపించాడు. స్ఠూలకాయం నుంచి ఫిట్‌గా మారిన అతడు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. తన వెయిట్ లాస్ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆన్లైన్ స్టార్‌గా మారాడు. అధిక బరువుతో బాధపడుతున్న పువి అనే యువకుడిని అదే కారణంతో అతడి ప్రియురాలు విడిచిపెట్టింది. దీంతో తన శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని చాలెంజ్‌గా స్వీకరించాడు. అనుకున్నట్లుగానే జిమ్‌కు వెళ్లి వర్కౌట్ చేయడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా అతని శరీరంలో మార్పును చూడటం ప్రారంభించాడు. ప్రియురాలు బ్రేకప్ చెప్పిన 139 కిలోల బరువు ఉన్న పువి.. 18 నెలలు కఠిన వ్యాయామం చేసి బరువు తగ్గాడు. ఎంతలా తగ్గాడంటే 70 కిలోల కొవ్వును కరిగించి 74 కిలోలకు చేరాడు. చదవండి: Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే.. View this post on Instagram A post shared by 🅿️uvi (gram_du_insta) (@npuvi96) గతంలో ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి నుంచి ఇప్పుడు స్మాల్ సైజ్‌కు మారిపోయాడు. టిక్‌టాక్ యూజర్ పువి తన వర్కవుట్ వీడియోలను తరచూ షేర్ చేస్తుండే వాడు. దీంతో అతడి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కండలు తీరిన దేహంతో పువి ట్రాన్స్ఫర్మేషన్.. పలువురిలో స్పూర్తి నింపుతోంది. అతడి కృషి, పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by 🅿️uvi (gram_du_insta) (@npuvi96) View this post on Instagram A post shared by Bodybuilding.com (@bodybuildingcom) -
ప్రియుడితో బ్రేకప్!.. హీరోయిన్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
బాలీవుడ్ క్రేజీ కపుల్ టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ బ్రేకప్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇప్పుడు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఈ జోడీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కలిసి పార్టీలు, వెకేషన్లతో బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ జోడీగా పేరు తెచ్చుకున్న టైగర్-దిశా పటానీ మధ్య ఏమైందో తెలియదు గానీ కొంతకాలంగా వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయట. దీంతో రీసెంట్గా ఎవరి దారులు వాళ్లు చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట. కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్. దీంతో అతడితో దిశా బ్రేకప్ చేసుకుందట. ఇక టైగర్‌తో బ్రేకప్ రూమర్స్ మధ్య తాజాగా దిశా పటానీ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఏముందంటే.. "మీకు తెలిసిన ప్రతిదానిపై మీరు నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది అని ఎవరూ చెప్పకపోయినా సరే మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోకండి'' అంటూ దిశా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రియుడు టైగర్‌తో బ్రేకప్ నడుమ దిశా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
మరో బ్రేకప్.. షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన లవ్‌బర్డ్స్!
Kim Kardashian Pete Davidson Break Up After 9 Months Dating: సినీ ఇండస్ట్రీలో మరో బ్రేకప్ చోటుచేసుకుంది. రియాలిటీ స్టార్‌గా పేరు తెచ్చుకుంది కిమ్ కర్దాషియన్. పలు కామెడీ షోలతో, స్టాండప్ కమెడియిన్‌గా పాపులరయ్యాడు పీట్ డేవిడ్సన్. వీరిద్దరూ తొమ్మిది నెలలుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కిమ్-పీట్ బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారని హాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్సన్ విపరీతమైన షెడ్యూల్స్ కారణంగా సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నారు. షెడ్యూల్స్ ద్వారా రిలేషన్‌షిప్‌ను కొనసాగించడం సవాలుగా మారింది. అందుకే విడిపోయి స్నేహితులుగా మారాలని నిర్ణయించుకున్నారు' అని మీడియా సంస్థలు పేర్కొన్నట్లు సమాచారం. కాగా 2021 అక్టోబర్‌లో నిర్వహించిన సాటర్డే నైట్ లైవ్‌లో కిమ్ కర్దాషియన్ అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో కిమ్‌కు పీట్ డేవిడ్సన్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఈ సంవత్సరం జరిగిన మెట్ గాలా ఈవెంట్లో వీరిద్దరూ రెడ్ కార్పెట్‌పై నడిచి తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతంగా వ్యక్తపరిచారు. తాజాగా వీరు 9 నెలల డేటింగ్‌కు స్వస్తి పలికి బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం పీట్ డేవిట్సన్ ఆస్ట్రేలియాలో 'విజార్డ్స్' షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. చదవండి: సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇది చాలా అవసరం: మంచు మనోజ్ హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్? ప్రమాదం నుంచి బయటపడిన నేచురల్ స్టార్ నాని! -
గోవా: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. బీచ్‌కు తీసుకెళ్లి..
ప్రేమలో పడటం, ఏదో ఒక కారణంతో విడిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇక బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిపై కక్షసాధింపు చర్చలకు పాల్పడటం కూడా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. తనకు కాదని వెళ్లిపోయిందనే భాధ, కోపం తట్టుకోలేక కొందరు ప్రాణాలను తీసేస్తున్నారు. ప్రేమలో పడితే లోకాన్నే మరిచిపోయే జంటలు.. అదే ప్రేమ వద్దని చెబితే ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తున్నారు. తాజాగా తనకు బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిని కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. కిషన్ కలంట్కర్(26) అనే యువకుడు కలేజీలో చదువుతున్న19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. కొనాళ్లపాటు వీరి లవ్ ట్రాక్ బాగానే సాగింది. అయితే మనస్పర్థల కారణంగా రిలేషన్షిప్ కొనసాగించడం ఇష్టం లేదని, విడిపోదామని యువతి చెప్పింది. దీంతో యువకుడు మనస్తానికి గుయ్యాడు. బ్రేకప్ను తట్టుకోలేక యువతితో కలిసి బుధవారం సౌత్‌గోవాలోని వెల్సాన్ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ కూడా తనను విడిచి వెళ్లొద్దంటూ ప్రాదేయపడ్డాడు. ఎంతకూ యువతీ ఒప్పుకోకపోవడంతో కోపోద్రిక్తుడై అప్పటికే తనవెంట తెచ్చుకున్న కత్తితో యువతిని పొడిచి చంపాడు. యువతి చనిపోవడంతో మృతదేహాన్ని బీచ్ పక్కనే ఉన్న పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే బీచ్ సమీపంలోని పొదల్లో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. చదవండి: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని షాక్ -
బ్రేకప్ కాదు.. బ్రేక్ ఇచ్చారంతే.. జంటగా కియారా-సిద్ధార్థ్.. వీడియో వైరల్
Sidharth Malhotra Kiara Advani Back Together After A Break: బీటౌన్‌లో అప్పటిదాగా జంటగా కలిసి కనిపించిన లవ్ బర్డ్స్, దంపతులు ఒక్కసారిగా విడిపోతున్నారని రూమర్స్ రావడం పరిపాటే. ఇలాంటి సంఘటన ఇటీవల బీటౌన్‌లో జరిగింది. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు స్పందించలేదు. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కియారా-సిద్ధార్థ్ విడిపోయారని వార్తలు వచ్చి ఫ్యాన్స్‌ను షాక్ గురి చేయగా వారు కలిసి చెట్టాపట్టాలేసుకుని కనిపించిన వీడియో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నిర్వహించిన ఓ వేడుకలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియరా అద్వానీ తళుక్కుమన్నారు. ఒకరొకరు నవ్వుకుంటూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇది చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఒకవైపు రొహిత్ శెట్టి పోలీస్ సిరీస్ కోసం సిద్ధార్థ్ ఇస్తాంబుల్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు భూల్ భులయా 2 ప్రమోషన్లలో కియరా బిజీగా మారింది. ఈ టైట్ షెడ్యూల్స్ వల్ల వారి మధ్య కొంత బ్రేక్ వచ్చినట్లయింది. ఈ బ్రేక్ వల్లే వారు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయని వారి సన్నిహితులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియోతో వారు చెప్పిందే నిజమని తెలుస్తోంది. చదవండి: సౌత్ ఇండస్ట్రీపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ షేర్షాలో కలిసి నటించారు. ప్రమోషన్ల సమయంలో వారి మధ్య సన్నిహిత్యం చూసి వారు లవ్‌లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్. తర్వాత వచ్చిన బ్రేకప్ పుకార్లు అభిమానులను అసంతృప్తికి గురిచేశాయి. చదవండి: ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బిగ్‌బాస్ విన్నర్.. షాక్‌లో అభిమానులు
టెలివిజన్ నటి, మోడల్, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విజేత దివ్య అగర్వాల్ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ప్రియుడు వరుణ్ సూద్‌తో 4 ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఫోటోను షేర్ చేస్తూ ఆదివారం ఎమోషనల్ పోస్టు పెట్టింది. ‘జీవితం సర్కస్ లాంటిది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరి నుంచి ఏదీ ఆశించొద్దు. అదే నిజం. సెల్ఫ్ లవ్ తగ్గిపోవడం మొదలైనప్పుడు ఏమి జరుగుతుంది ? నా జీవితంలో జరుగుతున్న దేనికి నేను ఎవరినీ నిందించను. అదే మంచిది. నా కోసం నేను బతకాలనుకుంటున్నాను. నేను కోరుకున్న విధంగా సొంతంగా జీవించాడానికి సమయం వెచ్చించాలనుకుంటున్నాను అని అధికారికంగా ప్రకటిస్తున్నాను. చదవండి: ప్రభాస్ సినిమాకి టైటిల్ మారనుందా? త్వరలోనే అప్డేట్ ఒక నిర్ణయం తీసుకోడానికి పెద్ద పెద్ద కారణాలు, సాకులు అవసరం లేదు. దీని నుంచి బయటపడటానికి ఇది నేను తీసుకున్న నిర్ణయమే. తనతో గడిపిన క్షణాలన్నీ సంతోషకరమైనవే. అతను గొప్ప వ్యక్తి. తనెప్పుడూ నాకు మంచి స్నేహితుడే. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి.’ అంటూ ప్రియుడు వరుణ్‌తో బ్రేకప్ గురించి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) కాగా టెలివిజన్ సిరీస్ ఏస్ ఆఫ్ స్పేస్‌లో పాల్గొనడానికి ముందే వరుణ్, దివ్య స్నేహితులు. అక్కడి నుంచి వీరి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వరుణ్ దివ్యకు ప్రపోజ్ చేయడంతో వీరిద్దరి లవ్ ట్రాక్ ఆఫీషల్ అయ్యింది. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. అయితే ఇలా అనుకోకుండా వరుణ్, దివ్య విడిపోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. చదవండి: చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ -
మై లవ్ ఈజ్ గాన్, అయినా పోతే పోనీ అంటున్న షణ్ముక్
Anchor Ravi Comments On Shannu Break Up Song: బిగ్‌బాస్ సీజన్-5 రేపిన చిచ్చు ఈ షో తర్వాత కూడా కొనసాగింది. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న రెండు జంటల మధ్య బిగ్‌బాస్ అగాధం సృష్టించింది. అయితే దాన్నుంచి సిరి-శ్రీహాన్ బయటపడితే, దీప్తి సునయన- షణ్నూల మధ్య మాత్రం బ్రేకప్ వ్యవహారం కొనసాగింది. ఈ షో అయిన వెంటనే న్యూ ఇయర్‌కి ఒకరోజు ముందుగా షణ్నూతో దీప్తి తెగదెంపులు చేసుకుంది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా స్టార్‌మాలో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో కలిసి ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనిలో షణ్నూ అదిరిపోయే పర్ఫామెన్స్తో అలరించాడు. ప్రస్తుతం తను ఉన్న సిచ్చువేషన్కి తగ్గట్లుగానే మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఎమోషన్‌తో డ్యాన్సులేశాడు. అనంతరం హోస్ట్ యాంకర్ రవి మాట్లాడుతూ.. మై లవ్ ఈజ్ గాన్ అంటున్నావ్ నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? ఒక వేళ ప్రేమలో సారీ, థ్యాంక్స్, బాయ్ అని ఎవరికి చెబుతావ్ అంటూ అందరి ముందు ఇరికించేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలకు షణ్నూ ఎలాంటి ఆన్సర్లు ఇచ్చాడన్నది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన బాలీవుడ్ జంట!
బాలీవుడ్ జంట సుష్మితా సేన్, రోహ్మన్ షా డిసెంబర్ నెలలో విడిపోయిన విషయం తెలిసిందే! తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిశారట! బ్రేకప్ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలుసుకోవడమే కాకుండా ఒకే కారులో వెళ్లారంటూ బాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఇద్దరికీ పరిచయమున్న ఒక ఫ్రెండ్‌ను కలవడానికే వీళ్లు సిద్ధం అయ్యారట. ఇందుకోసం రోహ్మన్.. సుష్మిత ఇంటికి చేరుకోగా అక్కడ అరగంట పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారని, ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో బయలు దేరి వారి కామన్ ఫ్రెండ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. కాగా సుష్మిత పిల్లలతో రోహ్మన్కు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. వారిని ఆడిస్తూ, ఆలనాపాలనా చూస్తూ తండ్రిలా అండగా ఉండేవాడు. బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ రోహ్మన్కు మాత్రం పిల్లలపై ప్రీతి ఏమాత్రం తగ్గలేదు. ఇదిలా వుంటే సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్తో మూడేళ్లపాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ 'ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్షిప్ ముగిసింది' అంటూ డిసెంబర్లో వారు విడిపోతున్నట్లు ప్రకటించింది. -
బ్రేకప్‌కు సిద్ధమైన మరో స్టార్ జంట!
Keith Powers And Ryan Destiny Breakup: ప్రేమ పుట్టడానికి క్షణం చాలంటారు.. కానీ ఆ ప్రేమను కలకాలం నిలుపుకోవడం కష్టమేనంటున్నారు పలువురు సెలబ్రిటీలు. అందుకే కొందరు ప్రేమలో ఉండగానే బ్రేకప్ చెప్పుకుంటుంటే మరికొందరు పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా మరో స్టార్ జంట బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అమెరికన్ నటుడు కెత్ పవర్స్, ర్యాన్ డెస్టినీ విడిపోవడానికి నిశ్చయించుకున్నట్లు వారి సన్నిహితులు మీడియాతో వెల్లడించారట. నాలుగేళ్ల లవ్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టడానికి రెడీ అయ్యారట. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని భావించిన ఆ ఇద్దరూ.. ప్రేమికులుగా విడిపోయి స్నేహితులుగా కలిసుందామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా పవర్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న 'ద అగ్లీస్', 'పర్ఫెక్ట్ ఫైండ్' సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు. సింగర్, నటి ర్యాన్ డెస్టినీ ప్రస్తుతం బారీ జెన్కిన్స్ దర్శకత్వం వహిస్తున్న 'ఫ్లింట్ స్ట్రాంగ్' సినిమాలో నటిస్తోంది. -
చెప్పుకోలేను, అలాగని సర్దుకుపోలేను: బ్రేకప్ చెప్పిన బుల్లితెర నటి
Palak Purswani Breakup With Avinash Sachdev: సంక్రాంతి పండగ పూట విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చిందో బుల్లితెర జంట. పెళ్లి చేసుకుని ఒకటవుదామనుకున్న పాలక్ పురస్వాని, అభినవ్ సచ్దేవ్ తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని పాలక్ జాతీయ మీడియాకు వెల్లడించింది. 'ప్రతి బంధంలోను ఎత్తుపల్లాలు ఉంటాయి. సమస్యలూ ఉంటాయి, అవన్నీ సర్వసాధారణం. అయితే కొన్ని విషయాలు మాత్రం బయటకు చెప్పుకోలేము, అలాగని సర్దుకుపోలేము. నా విషయానికి వస్తే జీవితంలో ప్రేమ కన్నా నిజాయితీ, గౌరవమే నాకు ముఖ్యమైనవి' అని చెప్పుకొచ్చింది. 'మేము నాలుగేళ్లు కలిసి ప్రయాణించాము. ఆ జర్నీ మీదున్న గౌరవంతో అన్ని విషయాలు చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుతం నేను బాగున్నాను. అతడు నాకు సారీ చెప్పకపోయినప్పటికీ నేను మాత్రం అతడిని క్షమించాను. నేనిక నన్ను నేను ప్రేమించడంపైనే దష్టి పెడతాను. నా ఫ్యామిలీని చూసుకోవడంతోపాటు నా కెరీర్‌పై ఫోకస్ పెడతాను' అని పేర్కొంది. కాగా గతేడాది జనవరిలో రోకా ఫంక్షన్ జరుపుకున్న పాలక్, అభినవ్‌లు కరోనా వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాదైనా పెళ్లి పీటలెక్కుతారేమోనని ఎదురు చూస్తున్న సమయంలో ఏకంగా బ్రేకప్ చెప్పుకోవడం గమనార్హం. వీళ్లిద్దరూ 'నాచ్ బలియే' తొమ్మిదవ సీజన్లో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by 𝐏𝐚𝐥𝐚𝐤 𝐏𝐮𝐫𝐬𝐰𝐚𝐧𝐢 (@palak.purswani) -
25 ఏళ్లకే జీవితం అయిపోదు: రూమర్స్‌పై మలైకా ఘాటు రిప్లై
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అర్జున్ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే గత కొంత కాలంగా అర్జున్ కపూర్ మలైకా అరోరా విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తమ నాలుగేళ్ల ప్రేమ బంధానికి త్వరలోనే స్వస్తి పలకనున్నట్లు బీటౌన్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై ఇప్పటికే అర్జున్ కపూర్ స్పందించిన విషయం తెలిసిందే. మలైకాతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తాము విడిపోతున్నట్లు వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు. చదవండి: వైరల్ వీడియో: అభిమానుల కోసం బయటకొచ్చిన సూపర్‌స్టార్ తాజాగా మలైకా కూడా తమ రిలేషన్‌షిప్‌పై స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘40 ఏళ్ల వయసులో ప్రేమలో పడటం సాధారణం విషయంగా భావించండి.. మీ 30 ఏళ్ల వయసులో కొత్త కలలను కనుగొని సాధించడాన్ని అంగీకరించండి.. మీ 50 ఏళ్ల వయసులో మిమ్మల్ని, మీ లక్ష్యాన్ని గుర్తుంచడాన్ని అంగీకరించండి. జీవితం 20 ఏళ్లను దాటేసింది. 25 ఏళ్లతో జీవితం ముగియదు. అలా నటించడం మానేద్దాం’ అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఇద్దరి మధ్య వయసు అంతరంపై ప్రశ్నిస్తున్న వారందరికీ గట్టి సమాధానం ఇచ్చినట్లైంది. చదవండి: ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో -
బ్రేకప్ చెప్పుకున్న స్టార్ దంపతులు
హాలీవుడ్ నటుడు, ఆక్వామెన్ స్టార్ జాసన్ మొమోవా భార్య లీసా బోనెట్‌తో తెగతెంపులు చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ విడిపోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా గురువారం వెల్లడించారు. 'కాలంతో పాటు వస్తున్న మార్పులను మనమంతా అనుభవిస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురుచూశాం. అందుకు నా కుటుంబం అతీతమేమీ కాదు. మేమిద్దరం విడిపోతున్నాం. కానీ మా మధ్య ప్రేమ అలాగే కొనసాగుతుంది. అది వివిధ మార్గాల్లో అభివృద్ధి చెందుతుంది. పిల్లల బాధ్యతను ఇద్దరమూ చూసుకుంటాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. కాగా జాసన్, లీసా 2005 నుంచి డేటింగ్లో ఉన్నారు. వీరికి 2007లో లోలా, 2008లో నకోకా వోల్ఫ్ అని ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత 2017 అక్టోబర్‌లో జాసన్, లీసా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా వుంటే జాసన్ మొమోవా.. ఆక్వామెన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, డ్యూన్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం అతడు జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన 'ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్' సినిమాతో బిజీగా ఉన్నాడు. లీసా పలు టీవీ షోలలో కనిపించింది. View this post on Instagram A post shared by Jason Momoa (@prideofgypsies) -
నాకు తండ్రి ప్రేమ ఉంది.. దీప్తి సునయన ఎమోషనల్ వీడియో
Deepthi Sunaina Shares Emotional Video With Her Father After Breakup With Shannu : దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరి ఇప్పటికీ నెట్టింట హాట్ టాపిక్‌గానే ఉంది. చూడచక్కనైన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. బిగ్‌బాస్ షోలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా షణ్నూకు చివరిదాకా అండగా నిలబడ్డ దీప్తి.. అతని జీవితంలో మాత్రం చివరివరకు ఉండలేకపోయింది. బిగ్‌బాస్ షో అయిన వెంటనే షణ్నూకి బ్రేకప్ చెప్పేసి సైడయిపోయింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల రిలేషన్ షిప్‌కు గుడ్‌బై చెప్పేసింది. అయితే షణ్నూతో బ్రేకప్ తర్వాత ఆ బాధలోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దీప్తి సునయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సైతం తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంది. తాజాగా తన తండ్రితో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ... 'ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం అత్యంత కష్టవంతమైన పరిస్థితులు ఎదురైనా తన తండ్రి ప్రేమతో దాన్ని జయిస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. చదవండి: సిరి ఫోటోలు డిలీట్ చేసిన ప్రియుడు.. బ్రేకప్‌కు సంకేతమా? View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) -
సిరి ఫోటోలు డిలీట్ చేసిన ప్రియుడు.. బ్రేకప్‌కు సంకేతమా?
After Shanmkh And Deepthi Breakup, Shrihan Deleting Siri Pics In Instagram: బిగ్‌బాస్ సీజన్-5 రెండు జంటల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. ఇప్పుడు దీప్తి సునయన బాటలోనే సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సిరిని దూరం పెడుతూ వస్తున్న శ్రీహాన్.. త్వరలోనే ఆమెకు గుడ్‌బై చెప్పనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తైనా వీరిద్దరూ జంటగా కనిపించలేదు. అయితే తాజాగా సిరితో తెగదెంపులు చేసుకునేందుకు శ్రీహాన్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చాడు. కేవలం ఇద్దరూ కలిసి చేసిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్డేట్స్ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్నుంచి తొలగించాడు. బిగ్‌బాస్ షోలో అనేక సార్లు షణ్నూతో కనెక్షన్ వస్తుందంటూ సిరి చెప్పిన మాటలతో శ్రీహాన్ గుండె బద్దలయ్యిందని, ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి షణ్నూతో చేసిన రొమాన్స్ భరించలేక శ్రీహాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై వారిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఇటీవలె సిరి బర్త్‌డేకు సైతం శ్రీహాన్ విషెస్ చెప్పడం విశేషం. -
మీది ఫేక్ రిలేషన్, ఐదేళ్ల ప్రేమబంధాన్ని ఒక్క షో తెంచేసిందా?
బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల ఆదరణ ఎంతగానో ఉంది. అందుకే పలు భాషలతో పాటు తెలుగులోనూ ఇది విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. అయితే బిగ్‌బాస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఈ షోను విమర్శించేవాళ్లు కూడా లేకపోలేరు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ వల్ల అవకాశాలు, ఆదరణ దక్కిందని కొందరు, ఇమేజ్ డ్యామేజ్ అవడం తప్ప పైసా కూడా ఉపయోగం లేదని మరికొందరు ఇలా రకరకాలుగా మాట్లాడారు. నిజానికి హౌస్‌లో జరిగినదాంట్లో ఒక గంట ఎపిసోడ్ మాత్రమే ప్రసారం చేస్తారు. అసలు 24 గంటలు ఏం జరిగిందనేది కేవలం కంటెస్టెంట్లకు మాత్రమే తెలుస్తుంది. ఏ గొడవల్ని హైలైట్ చేయాలి? ఎవరిని నెగెటివ్‌గా చూపించాలి? ఎవరి రిలేషన్‌ను ఫోకస్ చేయాలి? అనేది బిగ్‌బాస్ టీమ్ చేతిలో ఉంటుంది. దీంతో ప్రేక్షకులు గంట ఎపిసోడ్ చూసి ఎవరేంటని ఓ నిర్దారణకు వస్తారు. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ముఖ్ జశ్వంత్‌ను బ్రహ్మగా భావించారు. అతడి మైండ్ గేమ్ చూసి గేమర్ అని పొగిడారు. అన్నీ బాగానే ఉన్నా సిరితో ఫ్రెండ్షిప్ మాత్రం మొదటికే మోసం తెచ్చింది. ఎందుకంటే షణ్నుకు ఆల్రెడీ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన ఉంది. అటు సిరికి శ్రీహాన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాక ఆ విషయాలను మర్చిపోయినట్లు ప్రవర్తించారు. ఓ పక్క ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నామని పశ్చాత్తాపపడుతూనే మరోపక్క హగ్గులిస్తూ, ఒకరి ఒడిలో ఒకరు నిద్రిస్తూ అతి చేశారు. హగ్గులు నచ్చడం లేదని సిరి తల్లి వచ్చి చెప్పినప్పటికీ ఇద్దరూ తీరు మార్చుకోలేదు. నన్ను వదిలేస్తున్నవా? అని శ్రీహాన్ అడిగినప్పుడు సైతం వాళ్ల ప్రవర్తనలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఎప్పటిలాగే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. వీళ్ల వైఖరితో విసుగెత్తిపోయిన నెటిజన్లు ఫ్రెండ్షిప్ పేరుతో ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతున్నారేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట మీకోసం ఒకరున్నారన్న విషయం మర్చిపోయి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎంత ట్రోలింగ్ జరిగినా షణ్నుకు అండగా దీప్తి, సిరికి అండగా శ్రీహాన్ నిలబడ్డారు. వారి గెలుపుకు అడ్డు కావద్దనో ఏమో కానీ దీప్తి తన బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తనతో మనసు కకావికలం అయిపోయినప్పటికీ బయటకు మాత్రం మౌనంగానే ఉండిపోయింది. షో ముగిసాక సరైన సమయం చూసుకుని అతడికి బ్రేకప్ చెప్పింది. ఇద్దరం బాగా ఆలోచించి విడిపోదామని నిర్ణయించుకున్నామని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఇద్దరూ దూరమవ్వడానికి సిద్ధపడితే మరి షణ్ముఖ్ ఎందుకు బ్రేకప్ పోస్ట్ పెట్టలేదని ఆరా తీస్తున్నారు. కేవలం గంట సేపు ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో చూసి విడిపోవాలనుకోవడం మూర్ఖత్వమని మండిపడుతున్నారు. ఐదేళ్ల ప్రేమను ఒక్క షో తెంచివేయగలిగిందంటే మీ బంధం ఎంత గట్టిదో అర్థమవుతుందని, అసలు మీది ఫేక్ రిలేషన్ అని విమర్శిస్తున్నారు. సిరి-శ్రీహాన్ బాగానే ఉనప్పుడు మీ జంట మాత్రం ఎందుకు విడిపోతున్నారో అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. -
మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి
వేములవాడ అర్బన్: రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని.. ఇప్పుడు మోసం చేశాడని యువతి మేనబావ ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌కు చెందిన తన మేనబావ ఎదురుగట్ల రాము అదేకాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. రెండేళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి వాపోయింది. తన తల్లిమాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని గౌతమి ఆవేదన చెందింది. చదవండి: హుజురాబాద్.. తుపాకులు అప్పగించాలె.. లేదంటే ఈ విషయమై నాలుగు రోజుల కిందట గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్ ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపింది. అయినప్పటికీ రాము మారకపోవడంతో బుధవారం ఉదయం ఈ విషయమై గౌతమి అడిగేందుకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తల్లికుమారుడు వెళ్లిపోయారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు మేనబావ ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట -
భారత్‌తో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న స్టోక్స్
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. మానసిక ఆందోళనకు గురవుతున్న తాను, కొంత సాంత్వన పొందేందుకు క్రికెట్‌కు ‘నిరవధిక విరామం’ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో భారత్‌తో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో అతను ఆడబోవడం లేదు. గత ఏడాది కాలంలో ‘బయో బబుల్’ల కారణంగా స్టోక్స్ ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉన్నాడు. స్టోక్స్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ను ఇంగ్లండ్ జట్టులోకి ఎంపిక చేశారు. -
కొడుకు పుట్టిన రెండేళ్లకు ప్రియుడితో హీరోయిన్ బ్రేకప్!
Amy Jackson: హీరోయిన్ అమీ జాక్సన్ తన ప్రియుడితో తెగదెంపులు చేసుకుందట. అతడితో ఏడడుగులు నడవకముందే వారి మధ్య ఉన్న బంధాన్ని తెంచేసుకుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటీష్ నటి, మోడల్ అమీ జాక్సన్.. జార్జ్ పనాయిటోను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకున్న ఈ భామ జార్జ్‌ను పెళ్లాడాలనుకుంది. ఈ మేరకు 2019 మేలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది. అయితే వీరి ప్రేమకు ప్రతీకగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది అమీ జాక్సన్. పెళ్లి కాకముందే తల్లైన అమీ జాక్సన్ తన కొడుకుతో పాటు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునేది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ హీరోయిన్ సడన్‌గా తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ తొలగించింది. దీంతో అమీ జాక్సన్ పెళ్లికి ముందే కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఉన్నట్లుండి ఇలా పిక్స్ డిలీట్ చేయడం చూస్తుంటే వీరు విడిపోయారని, ఇక వీరి పెళ్లి జరగడం కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 2010లో 'మద్రాసుపట్నం' సినిమాతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన అమీ జాక్సన్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించింది. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. -
గాఢంగా ప్రేమించాను.. కానీ బ్రేకప్ అయ్యింది : అనుపమ
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇక మీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా అంటూ ఓ నెటిజన్ అడగ్గా అనుపమ ఓపెన్ అయ్యింది. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని, అయితే అతనితో బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. గతంలో క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమాయణంలో ఉందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా వివాహానికి కొద్ది రోజుల ముందే ఇది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యాంగా బుమ్రా టీవీ యాంకర్ సంజనను పెళ్లాడటం, ఆ తర్వాత అనుపమ స్యాడ్ సాంగ్స్‌తో వీడియోలు చేయడం అప్పట్లో నెట్టింట హల్చల్ చేశాయి. ఇప్పుడు అనుపమ బ్రేకప్ విషయం బయటపెట్టడంతో మరోసారి బుమ్రా పేరు తెరపైకి వచ్చింది. ఇక సినీ హీరోల్లో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిన అనుపమ..తన తల్లి చేసే అన్ని వంటలు చాలా ఇష్టమని పేర్కొంది. పెయింటిగ్స్ వేస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని, ఈ మధ్యే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
అత్యంత ప్రమాదకరమైన స్త్రీ ఆ పని చేయదు.. మెహ్రీన్ ఆసక్తికర పోస్ట్
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నాళ్ల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహ్రీన్.. ఇటీవల బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చింది. పెళ్లి రద్దు విషయం తన పర్సనల్ అని, ఇకపై దీని గురించి చర్చ జరగకుండా ఉంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈ అంశం మీద స్పందించిన భవ్య కూడా తాను ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మెహరీన్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది’అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. కొటేషన్ కాస్త గందరగోళంగా ఉన్నా... తాను అత్యంత ప్రమాదకరమైన స్త్రీని అని, రక్షణ కోసం ఇతరులపై ఆధారపడబోనని చెప్పుకోవడానికే ఈ పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
లవ్ ఫెయిల్యూర్, చాలా బాధపడ్డా: అంజలి
బొద్దుగుమ్మలా ఉండే అంజలి ఈ మధ్య మరీ సన్నజాజిలా తయారైంది. ఒకప్పుడు తెలుగులోని స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె ఇప్పుడు ఇతర భాషా చిత్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. 'నిశ్శబ్దం' తర్వాత ఈ భామ తెలుగులో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఆమె ప్రేమ, పెళ్లి గురించి స్పందించింది. కొన్నాళ్ల క్రితం తాను కూడా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింంది. అయితే ప్రేమలో పడిన మాట వాస్తవమని అంగీకరిస్తూనే కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు అని చెప్పుకొచ్చింది. హీరోయిన్ అయినంత మాత్రాన తన మనసేమీ బండరాయి కాదని, ప్రేమ విఫలమైన బాధను భరించడం చాలా కష్టమని తెలిపింది. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డానంటే అందుకు తనే తల్లే కారణమని చెప్పింది. ఎన్నో కష్టనష్టాలను భరించిన తల్లిని ఆదర్శంగా తీసుకునే దాన్ని అధిగమించానంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఏమీ ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. కాగా అంజలి ఇప్పటివరకు సుమారు 48 సినిమాల్లో నటించింది. తాజాగా వకీల్‌సాబ్‌తో పాటు తెలుగులో 'ఆనంద భైరవి' సినిమాలోనూ నటిస్తోంది. వీటితోపాటు మలయాళంలో 'భీష్మ పర్వం', కన్నడలో 'శివప్ప', తమిళంలో 'పూచండి' చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం : దిల్ రాజు సోషల్ హల్ చల్ : కన్నుగీటుతో కుర్రకారును కట్టిపడేస్తున్న మోనాల్ -
షాకింగ్: బ్రేకప్ చెప్పేసిన స్టార్ సింగర్
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికన్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ (51)కు సంబంధించి మరో వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియుడు, ప్రముఖ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగెజ్(45)తో తెగదెంపులు చేసుకుందిట. గతకొన్ని రోజులుగా వీరిద్దరి బ్రేక్‌పై పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేయడంతోపాటు, ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి. గతవారమే వీరిద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు యూఎస్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను జేఎల్ఓగానీ, అలెక్స్గానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. జెన్నిఫర్,అలెక్స్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మయామిలో 40 మిలియన్ డాలర్ల ఇంటిని కూడా కొనుక్కున్నారు. లోపెజ్ డొమినికన్ రిపబ్లిక్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. రెండేళ్లకు పైగా డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా పెళ్లిని రెండుసార్లు వాయిదా వేసుకున్నామని స్వయంగా జెన్నిఫర్ గత డిసెంబర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. చార్మ్ స్టార్ మాడిసన్ లెక్రోయ్తో అలెక్స్ చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నాడన్నకారణంగానే జెలో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) -
వైరల్: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి
వాషింగ్టన్ : వివాహం అంటే స్త్రీ, పురుషలు మధ్య జరిగే వేడుక. అయితే ఈ మధ్య కాలంలో సేమ్ సెక్స్ వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు తప్పని సరి. కానీ కొన్ని నెలల కిత్రం ఓ వ్యక్తి తనను తానే పెళ్లి చేసుకున్న సంఘటన గురించి ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ యువతి తనను తానే వివాహం చేసుకుంది. ఇందుకు ఆమె ఓ సరికొత్త సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చింది. తన సంతోషం కోసం తనను తానే వివాహం చేసుకున్నానని వెల్లడించింది అమెరికా అట్లాంటాకు చెందిన మెగ్ టేలర్ మోరిసన్. ఈ సందర్భంగా మెగ్ మాట్లాడుతూ.. ‘‘అందరి ఆడపిల్లలాగే నేను మంచి వ్యక్తిని వివాహం చేసుకుని సంతోషంగా జీవించాలనుకున్నాను. కానీ అన్ని మనం అనుకున్నట్లే జరగవు కదా. నేను, నా బాయ్‌ఫ్రెండ్ గతేడాది జూన్‌లో విడిపోయాం. బ్రేకప్ నన్ను కుంగదీసింది. చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు ఓ ఆలోచన వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన నేను నా కలల్ని, సంతోషాలని ఎందుకు చంపుకోవాలి అని అనిపించింది. అలా అని మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనిపించలేదు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని తెలిపింది మెగ్. ఇక వివాహం కోసం సంప్రదాయం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకుంది మెగ్. కస్టమ్ మేడ్ కేక్, డ్రెస్‌ను ఆమె ఆర్డర్ చేసింది. పెళ్లి కోసం ప్రత్యేకంగా ఒక డైమండ్ రింగ్ కూడా కొనుగోలు చేసింది. వివాహ వేడుకలో ఉంగరం పెట్టుకొని, అద్దంలో తన రూపాన్ని ముద్దు పెట్టుకుంది. తన సొంత లక్ష్యాలు, కోరికల కోసం పాటుపడతానని పెళ్లిలో ప్రమాణం చేసింది. తన ఆలోచనల ప్రకారమే నడచుకుంటానని చెప్పింది. ఇలా అన్ని పెళ్లి తంతులను ఒక్కతే పూర్తి చేసింది. అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగ్కు సన్నిహితంగా ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంతేకాదు.. పెళ్లి కోసం మెగ్ 1,000 పౌండ్లు (రూ.1.02 లక్షలు) ఖర్చు చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరలవుతున్నాయి. మరో పెళ్లికి సిద్ధం మంచి వ్యక్తి దొరికితే రిలేషన్షిప్లో ఉండటానికి తనకు అభ్యంతరాలు లేవన్నది మెగ్. అతడిని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని ప్రకటించింది. ‘పెళ్లి సందర్భంగా నాకు నేనొక వాగ్దానం చేసుకున్నాను. నా మ్యారేజ్ రింగ్‌ను చూసిన ప్రతిసారీ నా కోసం నేను పెళ్లి చేసుకున్నాననే విషయం గుర్తొస్తోంది. పెళ్లి నా జీవితాన్ని ప్రశాంతంగా, అందంగా తీర్చిదిద్దింది’ అన్నది మెడ్. కరోనా మహమ్మారి కారణంగా హనీమూన్‌కు వెళ్లలేదని చెప్పింది. కోవిడ్ ముగిసిన తరువాత హనీమూన్‌కు వెళ్లి ప్రశాంతంగా గడుపుతానని వివరించింది. చదవండి: బ్రేకప్: తనను తానే పెళ్లి చేసుకున్నాడు సింగిల్ లైఫే బాగుంది: ష్రాఫ్ -
మీది లవ్ బ్రేకపా? అయితే ఇక్కడకు వెళ్లండి
డెహ్రాడూన్: నలుగురూ బాగుండాలి, అందులో నేనుండాలి... అనుకున్నాడు డెహ్రాడూన్‌కు చెందిన ఓ వ్యక్తి. అందుకే పగిలిన హృదయాలను అతికించలేకపోయినా కనీసం వారి మనసుకు స్వాంతన చేకూర్చాలనుకున్నాడు. అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదివేయండి.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన దివ్యాన్షు బాత్రాకు 21 ఏళ్లుంటాయి. అతడు ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. కానీ లాక్డౌన్లో అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిసి ఈ ప్రేమజంటను విడదీశారు. నెచ్చెలి దూరం కావడంతో కుంగిపోయాడు. హైస్కూల్ నుంచి ప్రేమిస్తున్న అమ్మాయిని హఠాత్తుగా మర్చిపోలేక నరకం అనుభవించాడు. ఆరు నెలలు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. పబ్జీకి బానిసగా మారాడు. ఈ మనోవేదనలోనే కొట్టుమిట్టాడుతున్న అతడికి హఠాత్తుగా ఓ రోజు ఇలా ఎంకెంతకాలం ఆమెను గుర్తు చేసుకుంటూ పిచ్చివాన్నైపోవాలి అన్న ఆలోచన వచ్చింది. అంతే, ఆమె జ్ఞాపకాలకు తాళం వేసి ఓ కెఫేను ప్రారంభించాడు. దానికి దిల్ తుట ఆషికి-చాయ్‌వాలా అన్న పేరును ఖరారు చేశాడు. ఇక్కడ లవ్‌లో ఫెయిలయిన వాళ్లు వారి బాధను మనసారా చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడిది బ్రేకప్ అయిన ఎంతోమందికి ఆశాదీపంగా కనిపిస్తోంది. (చదవండి: ఈ అగ్నిప్రమాదం గచ్చిబౌలిలో జరిగిందా?) ఈ కెఫే గురించి దివ్యాన్షు మాట్లాడుతూ.. "నాలానే చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. వాళ్ల మనసులోని బాధనంతా కక్కేస్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బ్రేకప్ అయినవాళ్లను నా కెఫెకు వచ్చి వాళ్ల కథలను చెప్పమంటాను. అలా వారి భారాన్ని ఇక్కడే దించేసుకుని జీవితంలో ముందుకెళ్లేందుకు సహాయం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కెఫే ఐడియా విని దివ్యాన్షు తండ్రి కోప్పడ్డాడట. దీని గురించి అతడు మాట్లాడుతూ... "ఒక అమ్మాయి కోసం నేను పిచ్చోడిలా అయిపోయాను. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి నా కాళ్ల మీద నేను నిలబడతాను అన్నప్పుడు అమ్మ నాకు సపోర్ట్ చేసింది. కానీ కెఫే పేరు చెప్పగానే నాన్న ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు నాన్న స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చి కెఫె గురించి, దాని ప్రాముఖ్యతను గూర్చి మెచ్చుకున్నాడు. అప్పుడు కానీ మా నాన్న నేనో మంచి పని చేస్తున్నానని అంగీకరించలేకపోయాడు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన తమ్ముడు రాహుల్ బాత్రాతో కలిసి కెఫెను నడిపిస్తున్న దివ్యాన్షు త్వరలోనే హరిద్వార్‌లో కూడా ఈ కెఫెను ప్రారంభించాలనుకుంటున్నాడు. (చదవండి: బైక్, వ్యాన్ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!) -
సింగిల్ లైఫే బాగుంది: ష్రాఫ్
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు, హీరో టైగర్ ష్రాఫ్ సోదరి క్రిష్ణ ఇప్పుడిప్పుడే పాత జ్ఞాపకాలను మరిచిపోయే ప్రయత్నం చేస్తోంది. బాయ్‌ఫ్రెండ్ ఇబాన్ హయమ్స్కు దూరమైన తర్వాత తన జీవితం ఎలా సాగుతుందో చెప్తూ.. సింగిల్‌గా ఉండటమే అద్భుతంగా ఉందన్నారు. రిలేషన్షిప్లో లేకపోతేనే ఎలాంటి బాదరబంధీలు లేకుండా నాకోసం, నా బిజినెస్ కోసం ఫోకస్‌గా ఆలోచించగలుగుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇబాన్‌తో తెంచుకున్న బంధం గురించి మాట్లాడుతూ తమ దారులు వేరని అర్థమయ్యాయని, అందుకే ఇంకా రిలేషన్లో ఉండటం కన్నా స్నేహితుల్లా ఉందామని నిర్ణయించుకుని విడిపోయినట్లు తెలిపారు. మాజీ ప్రియుడితో టచ్‌లో ఉన్నానని, అతడితో మాట్లాడటానికి తనకేమీ ఇబ్బంది లేదని చెప్పారు. (చదవండి: బిగ్‌బాస్ : హారిక నా చెల్లి.. అభిజిత్ షాకింగ్ కామెంట్స్) కాగా క్రిష్ణ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటో వైరల్‌గా మారింది. అందులో ఆమె టర్కిష్ చెఫ్ సాల్ట్ బేను ముద్దాడింది. ఇది చూసి షాకైన ఇబాన్ 'ఇంత త్వరగా మూవ్ ఆన్ అయ్యావా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇప్పుడప్పుడే తనకు మళ్లీ డేటింగ్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని తనకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తున్నానన్నారు. కాగా క్రిష్ణ, ఇబాన్ గతేడాది ప్రేమలో పడ్డారు. కొంతకాలంపాటు డేటింగ్ చేసిన ఈ జంట గత నెలలో విడిపోయారు. అతడితో కలిసి దిగిన ఫొటోలను అన్నింటినీ క్రిష్ణ ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించారు. అభిమానులు కూడా తాము కలిసున్న ఫొటోలను షేర్ చేయొద్దని ఆమె అభ్యర్థించారు. (చదవండి: మరీ ఇంత త్వరగానా.. నాకైతే అంత తొందరేం లేదు!) -
బ్రేకప్: తనను తానే పెళ్లి చేసుకున్నాడు
బ్రెజీలియా: బ్రేకప్ ఎన్నిరకాలో తెలీదు కానీ విడిపోయిన తర్వాత చేసుకునే పార్టీలు మాత్రం రెండే రకాలు. నచ్చిన అమ్మాయి ఇక కన్నెత్తి చూడదని తెలిసి కుమిలి కుంగి కృశించి చెడు వ్యసనాలకు బానిసయ్యేవారు కొందరైతే, పోతే పోయిందీ... అని లైట్ తీసుకుని ఇంకోదారి చూసుకునేవారు మరికొందరు. కానీ ఇక్కడో ఆదర్శ పురుషుడు మాత్రం చిత్రంగా మూడో కేటగిరీకి చెందినవాడు. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అవగానే మరో ఆలోచనే లేకుండా తనను తానే వివాహం చేసుకున్నాడు. అదెలాగంటారా.. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.. బ్రెజిల్‌కు చెందిన ముప్పై మూడేళ్ల డియోగో రాబెలో గతేడాది నవంబర్‌లో విటర్ బ్యూనోతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఊరంతా జాతరలా పెళ్లి చేసుకుందామని కలలు కన్నాడు. సెప్టెంబర్‌లో నెచ్చెలితో ఏడడుగులు నడుద్దామనుకున్నాడు. కానీ అంతలోపే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి తీవ్ర స్థాయికి చేరుకోవడంతో జూలైలో విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. అయినా సరే డియోగో మనసులో నుంచి పెళ్లి ఆలోచన పోలేదు. అనుకున్న దాని కన్నా నెల ఆలస్యంగా అక్టోబర్ 17న పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. అతడి ఆహ్వానం మేరకు చుట్టాలు, స్నేహితులు బహియాలోని ఇటాకేర్లో రిసార్ట్‌కు వచ్చేశారు. పెళ్లికూతురు మాత్రం రాలేదు, రాదని అక్కడున్న వారికికి కూడా తెలుసు. కుడి చేతికి రింగు తొడుక్కున్నాడు. తనను తానే వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు!) View this post on Instagram "Essa será uma cerimônia um tanto diferente do que nós estamos acostumados a presenciar. Geralmente se espera encontrar aqui na frente um par. E aqui você está. Por ocupar esse lugar nada convencional, alguns podem achar tudo isso estranho ou até mesmo questionar a necessidade. Mas outras pessoas, talvez por serem mais sensíveis, ou mesmo por curiosidade, aproveitam um momento como esse para refletir e pensar sobre nosso próprio percurso. Em muitas culturas humanas, a pessoa, o herói da sua própria estória, precisa de um momento para se encontrar. Para os espartanos era chamado agoge. Os aborígenes australianos adotaram o termo inglês: walkabout, que significa, literalmente, vagar sem rumo até o momento de uma revelação. Fazer uma jornada. Então, essa cerimônia é na verdade, uma forma de expressão de duas necessidades humanas: o auto-conhecimento e a comunhão. Quando conversei com sua avó e tias, Diogo, elas me disseram que uma vez que você disse uma frase para elas que as marcou muito. Numa viagem, a sua tia, Simone, te agradeceu pelos momentos que você havia proporcionada à família em uma viagem e você respondeu: “Tia, a felicidade só é real quando compartilhada”. A descrição dessa cena também me marcou. Porque essa frase que você disse, Diogo, foi citado num livro e filme que descrevem uma jornada solitária de um jovem em busca do auto- conhecimento. Ao se lançar no mundo, abandonando tudo pra entender o que seria de fato essencial ao ser humano, a conclusão que aquele jovem chega é essa: “A felicidade só é real quando compartilhada”. Sozinhos somos muito menos do que podemos ser. Precisamos das pessoas certas do nosso lado. E as pessoas certas não são aquelas que nos completam, a nossa outra metade. As pessoas certas são aquelas que nos amam tanto que nos permitem que nós nos amemos. Ao nosso lado, faz bem aquela pessoa saudável. Que sabe se cuidar, que se conhece, que não despeja em nós suas frustações, suas expectativas. É isso que estamos celebrando hoje: O seu amor-próprio. Seu caminho e aprendizado até aqui. Seu encontro consigo mesmo. Hoje vamos celebrar como todo casamento deveria começar: pela promessa de amar, cuidar e respeitar a si próprio" A post shared by Dr Diogo Rabelo CRMSP 161208 (@drdiogorabelo) on Oct 28, 2020 at 4:29pm PDT View this post on Instagram Ao meu último amor: Nós sonhamos com este momento, era para ser o grande dia de nossas vidas. Até brincamos como se fosse o nosso “lugar secreto” (aquele lugar na praia, debaixo dos coqueiros), mas no meio do caminho você preferiu ficar e me deixar ir sozinho. Cá estou, honrando minha palavra. E mesmo assim eu ainda o respeito porque quero que você seja livre para ir aonde quiser e para ficar onde quiser. Como eu te amei! Amei muito e continuo te amando porque você é um cara incrível! E levo comigo todas as lembranças, tanto as boas quanto as pouquíssimas más, dos momentos em que estivemos juntos. Você foi um grande professor na minha vida. Com você aprendi o valor de uma pessoa. Você me mostrou o quanto sou especial e o quanto tenho de potencial para realizar meus sonhos, inclusive este: assumir o meu compromisso em me amar primeiro. Onde quer que você esteja, eu oro para que a felicidade esteja sempre contigo e a mão de Deus te carregue na mais profunda paz e segurança, que só Ele pode conceder. 🖤 A post shared by Dr Diogo Rabelo CRMSP 161208 (@drdiogorabelo) on Oct 28, 2020 at 12:15pm PDT -
సుశాంత్ అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి
నటి అంకిత లోఖండే, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ సందర్భంగా ప్రారంభమైన వీరి బంధం ఆ తర్వాత విబేధాలు రావడంతో ముగిసిపోయింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా వెబ్సైట్ సుశాంత్‌తో విడిపోయిన తర్వాత అంకిత, కుశాల్ టాండన్ అనే నటుడితో కొన్నాళ్లు డేటింగ్ చేసిందంటూ కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్తా హాట్ టాపిక్‌గా మారడంతో కుశాల్ టాండన్ దీనిపై స్పందించారు. సదరు వెబ్‌సైట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ తనకు అన్నలాంటి వాడని.. అంకిత మంచి స్నేహితురాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కుశాల్ ట్వీట్ చేశారు. (చదవండి: ట్విన్స్ రాకతో సంతోషం: అంకిత) This is a shame journalism, like really , I was a friend of both ,Sushanth was a brother and @anky1912 a friend , at this time who so ever z team is trying to get my name in this blame game ... plz keep me out of this ....... 😡😡😡😡😡shocking how we live in a world of news 🙏 pic.twitter.com/B65xy737KR — KUSHAL TANDON (@KushalT2803) August 27, 2020 ‘నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇది జర్నలిజమా.. నేను.. సుశాంత్, అంకితలకు మంచి స్నేహితుడిని. తను నాకు సోదరుడిలాంటివాడు. అంకిత నాకు మంచి స్నేహితురాలు. దయచేసి మీ బ్లేమ్ గేమ్‌లో నన్ను చేర్చకండి. ఇలాంటి వార్తా ప్రపంచంలో ఉన్నందుకు షాక్ అవుతున్నాను’ అంటూ కుశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే సుశాంత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలపై కూడా స్పందించారు. సుశాంత్ మృతిని సర్కస్‌లా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుశాల్ టాండన్. ‘ప్రపంచమా.. దయచేసి తన ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వు. ఇక్కడ జరుగుతున్న సర్కస్ని చూసి స్వర్గంలో ఉన్న ఆ వజ్రం గట్టిగా నవ్వుతుంది. సుశీ. ఎప్పటిలానే వీటన్నింటిని లైట్ తీసుకో. చిల్ అవ్వు’ అంటూ మరో ట్వీట్ చేశారు కుశాల్ టాండన్. (చదవండి: సుశాంత్ ఇంటి ముందు ఆ ‘మిస్టరీ గర్ల్’ ఎవరంటే!) And for the world plz let his soul rest in peace 🙏it’s a circus 🎪 out here and the diamond must be laughing out loud from heaven ..... sushi take lite like u always did ❤️u chil it’s only caos down here 😇you angel 😇 — KUSHAL TANDON (@KushalT2803) August 27, 2020 ఇక కుశాల్‌తో డేటింగ్ వార్తలపై అంకిత స్పందించారు. ‘ఒక అమ్మాయి ఒంటరిగా ఉందంటే చాలు తను ఎవరితో డేటింగ్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ అందరికి ఒక్కటి స్పష్టంగా చెప్తున్నాను. ఎవరితోనే డేటింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. సమయం అంతకన్నా లేదు. నా పని నాకు ముఖ్యం. ఇలాంటి వార్తలు చదివి.. స్పందించి.. వివరణ ఇవ్వడం కూడా దండగ’ అన్నారు అంకిత. -
అది అన్ని వేళలా మంచిది కాదు
కొన్ని సందర్భాల్లో మనం చెడు అనుకున్నది కూడా మంచి చేస్తుంది. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన విషయాల్లో. ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు రావటం, విడిపోవటం సాధారణంగా జరుగుతుంటుంది. అలాంటి సమయాల్లో కొంతమంది జీవితమే పోయినట్లుగా బాధపడుతూ ఉంటారు. ప్రేమలో విఫలమవ్వడమంటే అది విషాదమైనది కాదు. బ్రేకప్ మనకు ప్రేమ, సంబంధాల గురించి ఎన్నో నేర్పుతుంది! విలువైన గుణపాఠాలను చెబుతుంది. ప్రేమ చేసిన గాయంతో మనసు తీవ్రమైన బాధకు గురవుతుంది. దీంతో మనం ఆ బాధనుంచి బయటపడలేమన్న భ్రమ కలుగుతుంది. ప్రేమ వల్ల అయిన గాయానికి కాలమే మందు రాస్తుంది. అనుభవం నేర్పిన పాఠాలే గుణపాఠాలై భవిష్యత్తులో తప్పటడుగులు వేయకుండా హెచ్చరిస్తాయి. 1) ఎదుటి వ్యక్తి తప్పొప్పులు కూరిమి గల దినములలో నేరము లెన్నడు గలుగ నేరవు.. అన్నట్లు మనం లోతైన ప్రేమలో ఉన్నపుడు ఎదుటి వ్యక్తిలోని మంచి మాత్రమే మనకు కన్పిస్తుంది. అతడి తప్పులు కూడా ప్రేమ కారణంగా మనకు ఒప్పులుగానే కన్పిస్తాయి. ఆ వ్యక్తితో బ్రేకప్ అయినపుడు మాత్రమే అతడిలోని చెడు కోణం మన కంటికి కన్పిస్తుంది. అందుకే మన ప్రేమ ఎదుటి వ్యక్తి తాలూకు చెడు కోణాన్ని కప్పిపెట్టేలా ఉండకూడదు. అలా అని అదే పనిగా వారి చెడు లక్షణాలకు ఎత్తి చూపకూడదు. 2) సంకోచం పనికి రాదు అన్ని ప్రేమ సంబంధాలు కలకాలం కలతలు లేకుండా సాగాలని రూలేమీ లేదు. తరుచూ భేదాభిప్రాయాలతో గొడవలు పడుతూ సర్దుకుపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. పరిస్థితి మన చెయ్యి దాటి పోయినపుడు ప్రేమకు స్వప్తి పలకటం మన చేతిలో పని అని గుర్తించాలి. 3) అనుకూలత అన్ని వేళలా మంచిది కాదు బంధాలు దీర్ఘకాలం కొనసాగాలంటే వ్యక్తులు ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని అనుకుంటాం. వ్యక్తుల మధ్య అనుకూలతలు అన్ని వేళలా మంచిది కాదని గుర్తించాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరంటేఒకరికి ఇష్టం ఉండి ఒకే రకమైన అలవాట్లు కూడా ఉన్నంత మాత్రాన బంధాలు కలకాలం నిలువవు. వ్యక్తిత్వాలలోని తేడాలు బంధాన్ని నాశనం చేయోచ్చు. రెండు వేరువేరు వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు కలిసుండటమన్నది కష్టతరమైన పని. ఒకరు ఇంట్రావర్ట్, మరొకరు ఎక్స్ట్రావర్ట్ అయితే ఆ బంధాన్ని నిలుపుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. 4) బంధంలో మూడో వ్యక్తి బంధంలో మూడో వ్యక్తి ప్రస్తావన ఎప్పుడైతే మొదలవుతుందో ఆ బంధం మెల్లమెల్లగా బీటలు బారుతుంది. ఉదాహరణకు: రాజేష్, లతలు ప్రేమించుకుంటున్నారని అనుకుందాం. కొద్ది రోజుల తర్వాత రాజేష్ మరో అమ్మాయితో ప్రేమలో పడితే! ఆ బంధం పరిస్థితి ఊహాతీతం. బంధంలో ఉన్నపుడు తరుచు మూడో వ్యక్తి ప్రస్తావన రావటం కలహాలకు దారి తీస్తుంది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’
మాజీ ప్రియురాలు నేహా కక్కర్ని ఇప్పటికి గౌరవిస్తున్నానని.. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపాడు నటుడు హిమాన్ష్ కోహ్లీ. వీరిద్దరూ విడిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ క్రమంలో తాజాగా తమ బంధం గురించి మీడియాతో మాట్లాడారు హిమాన్ష్. హిందూస్తాన్ టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను దీని గురించి మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. జరిగింది ఏదో జరిగి పోయింది. నేను దాన్ని మార్చలేను. కానీ నేహా అంటే నాకు ఇప్పటికి గౌరవమే. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటాను. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేం ఒకరికి ఒకరం మర్యాద ఇచ్చుకుంటాం. తనో గొప్ప వ్యక్తి. నేహా కోరుకున్న ప్రతీది ఆమెకు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె పూర్తి ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని దేవుడిని వేడుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ క్రమంలో వీరిద్దరు గత ఏడాది వచ్చిన ఓహ్ హమ్‌సఫర్ పాటలో కలిసి నటించారు. దీని గురించి ప్రస్తావిస్తూ.. ‘మళ్లీ నేహాతో కలిసి పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా’ అని హిమాన్ష్‌ను ప్రశ్నించగా.. ‘ఎందుకు లేను. మంచి అవకాశాలను ఎందుకు జారవిడుచుకోవాలి. ఆసక్తికర ప్రాజెక్ట్స్ వస్తే.. తప్పకుండా నేహాతో కలిసి పని చేస్తాను. నా పనే నటించడం కదా’ అన్నారు హిమాన్ష్. గత ఏడాది ఇండియన్ ఐడిల్ రియాలిటీ షోలో వీరిద్దరు తాము రిలేషన్లో ఉన్నామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తమ మధ్య బంధం ముగిసిపోయిందని తెలిపారు. తొలత నేహానే ఇన్స్టాగ్రామ్ వేదికగా తాము విడిపోయినట్లు వెల్లడించారు. తన హృదయం ముక్కలైందని.. నిరాశలో కూరుకుపోయానని తెలిపారు నేహా. దాంతో హిమాన్ష్, నేహాను మోసం చేశాడంటూ నెటిజన్లు తనను విమర్శించడం ప్రారంభించారు. అయితే ఈ విమర్శలపై నేహా స్పందించారు. హిమాన్ష్‌కు మద్దతివ్వడమే కాక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో హిమాన్ష్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు నేహా. ‘నేను ఆన్లైన్లో కొన్ని వార్తలు చదివాను. అవి పూర్తిగా అవాస్తవం. అవును నేను బాధపడుతున్న మాట వాస్తవమే.. కానీ నేను మోసపోలేదు. నిజాయతీగా చెప్పాలంటే హిమాన్ష్ చాలా ఉత్తముడు. తనను విమర్శించడం.. అతనిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానండి. వాస్తవాలు తెలియకుండా మేం ఎవరి పేరు చెడగొట్టలేదు’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక తన వ్యక్తిగత జీవితం గురించి బయట ప్రపంచానికి వెల్లడించడం పట్ల నేహా బాధపడ్డారు. ‘నాకు భావోద్వేగాలు ఎక్కువ. అందుకే నా వ్యక్తిగత జీవితం గురించి ప్రపంచానికి వెల్లడించాను కానీ నేను అలా చేసి ఉండకూడదు’ అన్నారు నేహా. I read some article online which was Fake & Disturbing. Yes I said I’m hurt but I NEVER said I got betrayed. When it comes to being Loyal, He’s TheBest! So plz Stop blaming him & putting Wrong Allegations. We just can’t spoil anybody’s reputation without even knowing the facts!🙏🏼 — Neha Kakkar (@iAmNehaKakkar) February 26, 2019 -
వారిద్దరు విడిపోయారా?!
‘ఐ వానా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు’.. అంటూ ఇన్ని రోజులు ఒకరినొకరు ఫాలో అయ్యారు హీరోయిన్ ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్. చేతిలో చేతులు వేసుకుని ఇన్ని రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట తాజాగా చేతులు దులుపుకుని విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తొలగించారు ఇలియానా. అలాగే ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో ఆమెకు, ఆండ్రూకు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు నిజమేనని ఊహించుకోవచ్చు. ఇలియానా ఓ సందర్భంలో ఆండ్రూని ‘హబ్బీ’ (భర్త) అంటూ ఇన్‌స్టాలో క్యాప్షన్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి... ఈ బ్రేకప్ ప్రచారం గురించి ఇలియానా స్పందిస్తే కానీ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడదు. ఇక సినిమాల విషయానికి వస్తే... హిందీలో ఇలియానా కథానాయికగా నటించిన ‘పాగల్ పాంతీ’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. -
విజయ్ దేవరకొండ ‘బ్రేకప్’!
వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తిచేసిన విజయ్, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో హీరో చిత్రాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న కాంత్రి మాధవ్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అనేకసార్లు ప్రేమ విఫలమైన బాధితుడిగా కనిపించనున్నాడట. అందుకే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బ్రేకప్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
బ్రేకప్‌కి కారణం అదేనా?
‘‘జీవితం మనల్ని భూమి మీద చెరోవైపు ఉంచింది. అందుకే ఇకపై విడిగా నడవాలేమో?’’ అంటూ తమ బ్రేకప్ను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రెండు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తమ బంధానికి ఇరువురు ఇష్టప్రకారమే వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ బ్రేకప్‌కి కారణం ఇదే అంటూ తమిళనాడులో ఓ వార్త తిరుగుతోంది. దాని సారాంశం ఏంటంటే ... మైఖేల్ కోర్సలే నిర్లక్ష్యమే ఈ బ్రేకప్‌కి ప్రధాన కారణమట. లండన్‌లోని థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్. ఇప్పటికీ తన కాళ్ల మీద తాను నిలబడకుండా తల్లిదండ్రులపైనే ఆధారపడ్డాడట అతను. నీ వైఖరిని మార్చుకోవాలి, నీ అంతట నువ్వు నిలబడాలి, సొంతంగా ఏదైనా చేయమంటూ శ్రుతీ చాలాసార్లు మైఖేల్‌కు చెప్ప డం జరిగిందట. కానీ శ్రుతీహాసన్ చెప్పిన మాటలను మైఖేల్ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఇది శ్రుతీకి కష్టంగా అనిపించిందట. జంటగా తడబడుతూ నడిచే బదులు, విడివిడిగా సవ్యంగా నడు ద్దాం అని భావించి ఇష్టప్రకారమే ఈ రిలేషన్‌షిప్‌కు బై బై చెప్పారట. -
ఇకపై విడిగా నడుద్దాం
కొంతకాలంగా శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. చెట్టా పట్టాలేసుకుని తిరగడం, ఒకరి బర్త్‌డేను మరొకరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం, సెల్ఫీలతో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం... ఇలా చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది దృష్టిలో పడ్డారు. వీరి ప్రేమకు శ్రుతీ తండ్రి కమల్ కూడా అంగీకారం తెలిపారు, త్వరలోనే శ్రుతీ, మైఖేల్ ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్నారని వినిపించింది. అయితే కహానీలో ట్విస్ట్ వచ్చింది. శ్రుతీ, మైఖేల్ విడిపోతున్నారు. ఎవరో కల్పించిన వార్తలు కాదు. మైఖేలే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా బ్రేకప్ విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘జీవితం మమ్మల్ని (శ్రుతీ–మైఖేల్) అనుకోకుండా భూమికి చెరో వైపు (తాను లండన్, శ్రుతి ఇండియన్ అనే అర్థంతో) ఉంచింది. బహుశా అందుకే మేమిద్దరం విడివిడిగా నడవాలనుకుంటా. విడిపోయినప్పటికీ శ్రుతీహాసన్ నా బెస్ట్ ఫ్రెండ్‌లానే ఉంటుంది. తను నా ఫ్రెండ్‌గా దొరకడం నా అదృష్టం’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు కోర్సలే. పరస్పర అంగీకారం ప్రకారమే ఈ ఇద్దరూ విడిపోయారని, విడిపోయినప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌లానే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటారు అని శ్రుతీ–మైఖేల్‌ల కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. -
ప్రియురాలి కోసం కొట్టుకున్నారు..
బంజారాహిల్స్: తన ప్రియురాలిని గత రెండు నెలలుగా మాయ మాటలు చెప్పి తన వద్ద ఉంచుకున్నాడంటూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడటమే కాకుండా ఆమెకు ఆశ్రయం ఇచ్చిన యువకుడిపై తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్ బీటెక్ చదివే సమయంలో తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల రేవంత్ ప్రవర్తన నచ్చని యువతి అతడితో బ్రేకప్ చేసుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.3 అరోరాకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు అఖిల్(26) వద్దకు వచ్చింది. కన్సల్టెంట్‌గా పని చేస్తున్న అఖిల్ తన గదిలో ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది జీర్ణించుకోలేని రేవంత్ కొద్దిరోజులుగా ఆమెను హెచ్చరిస్తున్నాడు. అక్కడి నుంచి రాకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. ఆమెను తన ఇంటికి పంపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శనివారం రాత్రి అఖిల్‌ను ఫోన్లో బెదిరించాడు. ఆదివారం 30 మంది అనుచరులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్ద గొడవ చేశాడు. అఖిల్‌కు రేవంత్‌కు మధ్య ఘర్షణ జరగడంతో అఖిల్ అతడి స్నేహితులకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రేవంత్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నితీష్ తీరుతో బీజేపీ బెంబేలు..
సాక్షి, పాట్నా : ఎన్డీఏకు బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) దూరం కానుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. నోట్లరద్దుపై యూటర్న్ తీసుకున్న నితీష్ ఇటీవల పలు సందర్భాల్లో ఎన్డీఏను ఇరకాటంలో పెట్టే చర్యలు తీసుకోవడం ఇవే సందేహాలను ముందుకుతెస్తున్నాయి. తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీకి ఒక్కరోజు ముందు నితీష్ కేంద్రానికి షాక్ ఇచ్చారు. పంట నష్టం వాటిల్లితే రైతులకు పరిహారం చెల్లించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) స్ధానంలో బిహార్ ప్రభుత్వం బిహార్ రాష్ట్ర ఫసల్ సహత్య యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు రాష్ట్ర సహకార శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అతుల్ ప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకం రైతుల కంటే బీమా కంపెనీలకే మేలు చేసేలా ఉందని ఆయన ఆరోపించారు. గత పథకంలో రైతులు బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, ఈ పథకంలో రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం వాటిల్లితే రైతులు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై జూన్ 7న జరగనున్న కీలక భేటీకి ముందు నితీష్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. జేడీ(యూ) ఎన్డీఏకు దూరమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ-జేడీయూ మధ్య సంబంధాలు దెబ్బతినలేదని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీలో తమ బలం ఆధారంగా సీట్ల సర్ధుబాటు ఉండాలని జేడీయూ డిమాండ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
బీజేపీతో నితీష్ కటీఫ్..?
సాక్షి, పట్నా : బీజేపీతో మరోసారి తెగదెంపులకు బిహార్ సీఎం నితీష్ కుమార్ సంసిద్ధమవుతున్నారా అనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీతో నితీష్ అసౌకర్యంగా ఉన్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. జేడీ(యూ)-బీజేపీ మధ్య సంబంధాలు గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలతో బెడిసికొట్టాయనే ప్రచారం సాగుతోంది. బీజేపీ పెద్దన్న తీరుతో నితీష్ విసిగిపోయారని, ఇటీవల నాలుగు సందర్భాల్లో బీజేపీ వ్యవహరశైలిపై ఆయన గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. నోట్ల రద్దుపై నితీష్ యూటర్న్ సైతం ఇవే సంకేతాలు పంపుతోంది. పట్నాలో జరిగిన ఓ బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న నితీష్ నోట్ల రద్దును తాను గట్టిగా సమర్ధించానని, అయితే దీనివల్ల ఎంతమంది ప్రజలు లబ్ధిపొందారని ఆయన ప్రశ్నించారు. పలుకుబడి కలిగిన కొందరు సంపన్నులు పెద్దమొత్తంలో సొమ్మును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారని, పేదలు మాత్రం నగదు అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. విపక్షాలు సైతం ఇదే తరహాలో మోదీ సర్కార్ నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టాయి. మరోవైపు వరద సాయంపై బిహార్‌కు రూ 7,363 కోట్లు ప్రకటించిన కేంద్రం తాజాగా కేవలం రూ 1750 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకోవడం సైతం నితీష్‌కు ఆగ్రహం తెప్పించినట్టు చెబుతున్నారు. అసమ్మతి బాహాటంగా వ్యక్తం చేసే క్రమంలోనే నితీష్ కుమార్ బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజ్ డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న నేపథ్యంలో నితీష్ వైఖరి ఆసక్తికరంగా మారింది. -
శబ్ధ కాలుష్యం ఆపలేదని బ్రేకప్..
సాక్షి, పాట్నా : చిన్న కారణాలకే పెళ్లిళ్లు పెటాకులవుతున్న రోజుల్లో బీహార్‌లో ఓ మహిళ విడాకులకు సిద్ధపడిన కారణం వింటే ఎవరైనా విస్తుపోతారు. ఇంటి చుట్టుపక్కల శబ్ధకాలుష్యాన్ని నివారించడంలో విఫలమయ్యాడని భర్తకు విడాకులు ఇవ్వాలని స్నేహ సింగ్ అనే మహిళ నిర్ణయించుకుంది. హజీపూర్, రోడ్‌నెంబర్ 3లోని ఆమె నివాసం పొరుగునే ప్రార్ధనా మందిరాల నుంచి లౌడ్‌స్పీకర్లతో సమస్యలు ఎదురవడంతో స్నేహ సింగ్ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. స్ధానికులకు అసౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతోనే మతం పేరిట కొందరు ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అధికారుల తీరుతో విసుగెత్తిన స్నేహ ప్రదాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లకు లేఖలు రాశారు. వీటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో భర్త రాకేష్ సింగ్ నుంచి విడాకుల కోసం ఆమె డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట స్నేహ, రాకేష్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. తనకు అవసరమైన భద్రతను కల్పించలేని వ్యక్తితో తాను కలిసి జీవించలేనని ఆమె తేల్చిచెప్పారు. దివ్యాంగుడైన రాకేష్ గతంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు కావడం గమనార్హం. శబ్ధ కాలుష్యంపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, పొరుగు వారితో తలపడే పరిస్థితిలో తాను లేనని రాకేష్ నిరాసక్తత వ్యక్తం చేశాడు. మరోవైపు స్నేహను ఒప్పించేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. దుండగులు వారి ఇంటిపై రాళ్లు విసురుతున్నారని పోలీసుల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మనసు మాట
జాగింగ్ చేసి అలా పార్క్‌లో బెంచ్‌పై కూర్చున్నాను. ‘‘ఏమండీ రామంగారూ జాగింగ్ అయిపోయిందా?’’ పలకరించాడు పక్కింటి జగన్నాథం. అవునన్నట్లు నవ్వాను. నా ధ్యాసంతా బెంచ్ కింద చుట్టిపడేసిన ఓ పింక్ పేపర్ మీదే ఉంది. మెల్లగా దాన్ని అందుకొని చూస్తే ముత్యాల్లాంటి అక్షరాలు. నిస్సహాయతను తెలుపుతున్నట్లున్న ఓ కవిత. ఆ కవిత రాసిన అమ్మాయి పేరు కూడా కవితే. కింద సంతకం చూస్తే అర్థమైంది.నేను వెన్నెలనై నిన్ను సేదతీర్చాలనుకుంటాను కానీ, ఆ సమయంలో నువ్వు నులువెచ్చని కిరణాలనే కోరుకుంటావ్..సరేనని సర్దిచెప్పుకుని.. నువ్వు కోరుకునే వెచ్చని కిరణమై నిన్ను తాకేలోపే.. సంధ్యకాలపు చల్లదనాన్ని ఆస్వాదిస్తుంటావ్..నాదొక ఊహ.. నీదొక స్వప్నం. నాదొక శ్వాస.. నీదొక ఊపిరి. నాదొక పరుగు.. నీదొక తీరం. నన్ను నీలో వెతికి వెతికి అలసిపోతున్నా. ప్రతీసారి ఓడిపోతున్నా. గెలవాలనిపిస్తోంది. నిదానంగా నీ హృదయపు సవ్వడి వినాలనిపిస్తోంది. వినిపించగలవా!? ‘ఎంత పెయిన్ ఉందీ కవితలో? తన గుండెతడి నా మనసును తాకింది. పాపం బ్రేకప్ అనుకుంటా. రాస్కెల్ మోసం చేసి పోయాడేమో. చిట్టితల్లి ఎంత బాధపడుతోందో!?’ అనుకుంటూ ఎదురుగా ఉన్న పెద్ద పార్క్ వైపు చూశా. వేగంగా కదులుతున్న నా చూపు.. చేతిలో పుస్తకంతో నిలబడున్న ఓ అమ్మాయి మీద పడింది. చెట్టుకు ఆనుకున్న ఓ అబ్బాయితో ఏదో గొడవ పడుతోంది. నిజానికి నా చూపు ఆగింది ఆమె చేతిలోని పుస్తకంపైనే! అందులోని పేపర్స్ అచ్చు నా చేతిలోని నలిగిన పేపర్లానే ఉన్నాయి. ‘తనే కాబోలు కవిత’ అనుకుంటూ కళ్లజోడు సర్దుకుని కాస్త వంగి చూశాను. అమాయకమైన ఆమె కళ్లు అతగాడిని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. వాణ్ని చూడ్డానికి ప్రయత్నించా కానీ, ఏపుగా పెరిగిన గుబురైన పొదల్లోంచి సరిగా కనిపించడం లేదు. ఆ అమ్మాయెందుకో బాగా ఏడుస్తోంది. అబ్బాయి విసుగ్గా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తను మాత్రం తన్నుకొచ్చే కన్నీళ్లను ఆపే ప్రయత్నం చేస్తో్తంది. సరిగ్గా ఐదు నిమిషాలకు ఆ అబ్బాయి తిరిగొచ్చాడు. ఈసారి కూడా సరిగా కనిపించలేదు రాస్కెల్. తనను ఓదార్చి సారీ చెప్పాడనుకుంటా. కోటి కాంతులను నింపుకుని కళ్లతోనే నవ్వుతోంది. ‘ఒక బంధం నిలబడాలంటే రెండు మనసులు నిస్వార్థంగా కలవాలిగానీ, ఆ క్షణం సంతోషం కోసం కాదని’ ఈ తరానికి ఎప్పుడు అర్థమవుతుందో అనుకుంటూ పైకి లేచా, చేతిలోని పింక్ లెటర్‌ను డస్ట్‌బిన్ వైపు విసిరేస్తూ. చేతికర్రనందుకుంటూ అప్రయత్నంగానే మళ్లీ కవితవైపు చూశా. కవితకు ఎదురుగా నిలబడిన ఆ కుర్రాడిని చూసి.. తిరిగి ఆ పింక్ లెటర్ అందుకుని, మడతపెట్టి జేబులో పెట్టుకుని, ముందుకు నడిచా. ఆ రాస్కెల్ కూడా నన్ను చూశాడు. ‘‘తాతయ్యా.. తాతయ్యా..’’ వెనకే పరుగున వచ్చాడు సమీర్. నేను కోపంగా నడుస్తున్నానని వాడికి అర్థమైంది. జేబులోని పింక్ లెటర్ తీసి వాడి చేతిలో పెట్టాను.అది చూడగానే.. ‘‘ఐ నో తాతయ్యా! నువ్వు నన్నూ కవితని చూడ్డం నేను చూశా’’ అన్నాడు. వాడు చెప్పేదంతా వింటూ నడుస్తున్నాను. ‘‘సారీ తాతయ్యా! నీ దగ్గర ఏ విషయం దాచనుగానీ, ఇదంత ఇంపార్టెంట్ అనిపించలేదు. తనో నసలే తాతయ్యా, తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం’’ అన్నాడు చాలా సింపుల్‌గా. వీడేనా ఇలా మాట్లాడుతోంది? కోపం తన్నుకొచ్చింది. తప్పు ఈ తరానిదేనేమో! ‘ఒక బంధాన్ని ఇంత తేలిగ్గా, ఇంత అవహేళనగా చూస్తుంటే మనుషుల మధ్య బంధం ఎలా నిలబడుతుంది?’ ఆలోచనలతో పోటీపడుతూ నడిచే వయసు ఏనాడో దాటిపోయిందన్న విషయం కూడా మరిచిపోయి, నడకలో వేగం పెంచాను. మనసుపడే ఆందోళనకు గుండె వేగం తోడైంది. నేను మరిచిపోయినా నా శరీరం గుర్తు చేస్తుందిగా, అందుకే ఆయాసం ఊపేసింది. నిలబడే ఓపిక లేక కాస్త వరిగానంతే. సమీర్ తీసుకెళ్తున్న విషయం తెలుస్తూనే ఉంది.సమీర్ నా కొడుకు కొడుకు. కొడుకూకోడలు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు కానీ, సమీర్ పుట్టిన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. కోర్టు నిబంధనలు పక్కన పెడితే.. వాడు ఇద్దరికీ భారమయ్యాడు.బంధాన్ని భారమనుకునేంత స్వార్థం వాళ్ల నాన్నదైతే, భారాన్ని బంధంగా పులుముకోరాదనేంత స్వార్థం వాళ్ల అమ్మది. అదిగో ఆరోజే సమీర్ శాశ్వతంగా మా దగ్గరకు వచ్చేశాడు. లేదు మేమే తెచ్చేసుకున్నాం. ఎంతైనా రక్తం కదా. ‘‘ఇప్పుడెలా ఉంది తాతయ్యా!’’ సమీర్ నా పక్కకొచ్చి కూర్చున్నాడు. బాగానే ఉందన్నట్లు తలూపాను, తలదిండు గోడకు ఆన్చి కూర్చుంటూ. నా రూమ్‌లో అలికిడిని గమనించిన జానకి పరుగున వచ్చి నా తలపై చెయ్యివేసి ‘‘మీరు బాగానే ఉన్నారుగా?’’ అంది పెద్ద డాక్టర్ అయినట్లు. నాకు నవ్వొచ్చింది. తనకేమైనా తక్కువా? షుగర్, బీపీ, మోకాళ్లనొప్పులు.. చాలానే ఉన్నాయి. కానీ నాకు చిన్న జ్వరమొచ్చినా సేవ చెయ్యడానికి ఎక్కడలేని ఓపిక తెచ్చేసుకుంటుంది.‘‘నానమ్మా! నువ్వెళ్లి రెస్ట్ తీస్కో.. తాతయ్య దగ్గర నేనుంటాలే’’‘‘కాసేపు ఉండి వెళ్తాలేరా! మీ తాతయ్యకి ఏమైనా కావలిస్తే..’’‘‘అరే నానమ్మా! నేను చూసుకుంటాలే. నీకసలే బాగోలేదుగా, అత్తొస్తే నన్ను తిడుతుంది. వెళ్లి పడుకో’’ అని నచ్చజెప్పి జానకిని పక్కరూమ్‌కి పంపి మళ్లీ వచ్చి కూర్చున్నాడు. చాలాసేపు మౌనం రాజ్యమేలింది. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. తన చేతిపై నా చెయ్యేశా, కాస్త ధైర్యమిద్దామని.‘‘తాతయ్యా! నాకోడౌట్.. ఏ రక్త సంబంధం లేకుండా ఒక మనిషి తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, తన కోరికలనీ మరిచిపోయేంతలా మరో మనిషిని ప్రేమించడం ఎలా సాధ్యం?’’ అడిగాడు చాలా ఆశ్చర్యంగా. వాడి ప్రశ్న అర్థంకాలేదు కాసేపు. మళ్లీ మాట్లాడం మొదలుపెట్టాడు.. ‘‘నాకసలు ఏం అర్థం కావడం లేదు తాతయ్యా! ఇప్పటిదాకా కవితలానే నా జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, అభిప్రాయాలు కలవక చాలా కొద్ది నెలల్లోనే బ్రేకప్ అనుకునేవాళ్లం. కానీ, కవిత నాకు పరిచయం అయ్యి మూడేళ్లు కావస్తోంది. తను డెఫ్ అండ్ డంబ్ ట్రైనింగ్ క్లాసుల్లో పరిచయమైంది. కొద్దిరోజులకే మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ప్రపోజ్ చేస్తే ఓకే అంది. తనెప్పుడూ నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నించలేదు. నా ప్రతి అవసరం తనకు బాగా తెలుసు. నా ప్రతి ఆశను తను ప్రేమిస్తుంది. తను కూడా నానుంచి అదే కోరుకుంటుంది కానీ, నేను ఏరోజూ తన ఊహలని నిజం చేసే ప్రయత్నం చెయ్యలేదు. అదే కారణంతో మా ఇద్దరి మధ్య చాలా గొడవలు అయ్యాయి. ‘నీతో నావల్ల కాదు’ అని చాలాసార్లు తెగేసి చెప్పా. ఆ వెంటనే బాధ పడుతుందేమో, ఏడుస్తుందేమో అని దగ్గరైపోతా. మళ్లీ సేమ్ సీన్. నన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే.. కోపగించి వెళ్లిపోయినా తనకోసం కచ్చితంగా తిరిగి వస్తానని తన నమ్మకం. అదే జరుగుతుంది కూడా! ‘నువ్వు వస్తావని నాకు తెలుసు’ అంటోంది చాలా సింపుల్‌గా. నా ఆలోచన లేకుండా కవిత ఒక పూట కూడా ఉండటం కష్టం తాతయ్యా! ఒక మనిషిని అంతలా ఎలా ప్రేమించాలి తాతయ్యా? నాకు బంధాల విలువ తెలీకకాదు. మన కుటుంబంలో ఎవరికైనా చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేను. బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి అది సహజమే కానీ...’’‘‘ఏంట్రా! తాతయ్యని రెస్ట్ తీసుకోనివ్వకుండా బుర్ర తింటున్నావ్’’ అంది వాళ్లత్త. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సమీర్.. ‘ఏంలేదత్తా’ అంటూ పైకి లేచాడు అసహనంగా. వాడి నిరుత్సాహం నాకు అర్థమైంది. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కానీ నాకు తెలుసు వాడికి ఏం కావాలో..!? సొరుగులోని ఒక తెల్లని కాగితం తీసుకుని రాయడం మొదలుపెట్టా. ‘‘రేయ్ చిన్నూ! నువ్వు కవితని ప్రేమిస్తున్నావ్. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటావ్. తనని మరిచిపోవడం అసాధ్యం. ఇంత కచ్చితంగా ఎందుకు చెబుతున్నానంటే.. ఒక మనిషి ఎలా ఉందో, ఎలా ఉంటుందో, అని ఆలోచించడం తల్లిప్రేమ లాంటిది. ఊపిరి ఆగేంతవరకూ ఆ ప్రేమ స్వచ్ఛంగానే ఉంటుంది.జీవితంలో మనం కొన్ని బంధాలను మార్చలేం. మార్చుకోవడానికి ఇష్టపడం. అవి అలానే ఉండాలని, అలా ఉంటేనే బాగుంటాయని నమ్మి అలానే ప్రేమిస్తాం. వాటి స్థానాలను మార్చడానికి కూడా ప్రయత్నించం. ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్లని శాశ్వతంగా కోల్పోయినా.. ఓ అందమైన జ్ఞాపకంగా మార్చుకుని గుండెల్లో నింపుకుంటాం. అలాంటి బంధానికి అసలైన ఉదాహరణ పేగుబంధం. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికీ వెగటు కారు. నీ జీవితంలో ఆ స్థానంలో నేను, నానమ్మా ఉన్నాం కదా. అలానే వారివారి జీవితాల్లో ఎవరో ఒకరు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. లైఫ్ పార్ట్నర్నీ అలానే ప్రేమిస్తుంటారు కొందరు. మనసుకి, మనిషికి విలువిచ్చే ప్రతి మనిషికీ కలిగే భావాలివి. మీ నానమ్మ మీ నాన్నని గారాం చేసి కష్టం తెలీకుండా పెంచింది. కానీ వాడికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మేము గుర్తొచ్చేవాళ్లం. మీ నాన్న పెంపకంలో జరిగిన తప్పులు నీ పెంపకంలో జరగకూడదనే.. కుండ చూసి అన్నం తినడం నేర్పించా. వెనక ఉన్న వాళ్లకి ఉందో లేదో చూసి తినడంలోనే బంధం ముడిపడుతుందని నేను నమ్ముతా. అదే నమ్మకాన్ని నీకు పంచా. అందుకే మా పట్ల అంత అనురాగాన్ని చూపించగలుగుతున్నావు. ఏ బంధమైనా అనుకరణతోనే బలపడుతుంది. కవితని నువ్వు ఎందుకు వదులుకోలేకపోతున్నావో తెలుసా? తను నీకు పంచింది అమ్మ ప్రేమని. ఒక తల్లి తన బిడ్డ విషయంలో ఎలా ఆలోచిస్తుందో తను నీ విషయంలో అలా ఆలోచించింది. పాతికేళ్ల క్రితం మీ అత్త.. ‘నేనో అనాథని ప్రేమించా. తననే పెళ్లి చేసుకుంటా’ అని మాతో వాదించినప్పుడు మీ అమ్మానాన్నల్లాంటి ప్రేమేలే అనుకున్నాం. నచ్చకపోయినా వాళ్లకి పెళ్లిచేశాం. ఏడేళ్లకి మాకో నిజం తెలిసింది. మీ అత్తకి ఎప్పటికీ పిల్లలు పుట్టరని. ఇది తెలిస్తే మీ మావయ్య మీ అత్తని వదిలేస్తాడేమోనని మేం చాలా భయపడ్డాం. మా ఇబ్బందిని గుర్తించిన మీ మావయ్య మా దగ్గరికొచ్చి.. ‘మీ అమ్మాయికి పిల్లలు పుట్టరన్న విషయం మా పెళ్లికి ముందే తెలుసు’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు మీ అత్తకు కడుపునొప్పి వచ్చి కళ్లు తిరిగిపడిపోయిందట. అప్పుడే తనకీ విషయం తెలిసిందని చెప్పాడు. అది తెలిస్తే మీ అత్త తట్టుకోలేదని చెప్పలేదట. పెళ్లయ్యాక లోపం తనలో ఉందని మీ అత్తను నమ్మించాడట. దాంతో మీ అత్త మమ్మల్ని మభ్యపెట్టేందుకు గుళ్లూ గోపురాలని తిరిగేది. దురదృష్టవశాత్తు మీ అత్త స్నేహితురాలు అమెరికా నుంచి రావడం, ఆమే తనకు పరీక్షలు చెయ్యడంతో విషయం తెలిసిపోయింది. ‘మా అనుకి పిల్లలు పుట్టరని తెలిసీ..?’ అని మీ నాన్నమ్మ అడగబోతే.. ‘కారణాలతో బంధాలు విడిపోతే విలువేముంది? ఈ విషయం ముందే తెలిసినా, తరువాత తెలిసినా ఒక్కటే. నేను అనూని ప్రాణంగా ప్రేమించాను. రోజులు.. సంవత్సరాలు.. కాదు. జీవితం చివరిఅంకం వరకూ ఊహిస్తూ ప్రేమించా’ అన్నాడు. చిన్నవాడైనా చేతులెత్తి మొక్కాలనిపించింది. ‘అయినా పిల్లలు లేరని బాధపడ్డం దేనికి? మన సమీర్ ఉన్నాడుగా!’ అన్నాడు ఎంతో నిస్వార్థంగా. బంధాన్ని కలుపుకోవడమంటే అదే. ముందు కవిత నీకోసం పుట్టిందని నమ్ము. సాధారణంగా భార్యాభర్తలు ‘ఈ కష్టం నీ వల్లే వచ్చిందనో, ఈ నష్టం నీ వల్లే జరిగిందనో’ నిందించుకుంటూ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు కాకుండా నీ స్థానంలో వేరే వాళ్లైతే నా జీవితం ఇంకా గొప్పగా ఉండేదని అంచనా వేస్తూ, ప్రస్తుతాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అంతకు మించిన పొరబాటు మరోటుండదు. నీకు అన్ని భాషలు, భావాలు తెలుసు. ఇదంతా నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకుని నా తీరులో చెప్పొచ్చు. కానీ, రాతలోని భావం మనసుకు చేరుతుంది. ఒక్కసారి చెప్పిన మాటకంటే ఒక్కసారి రాసిన రాత శాశ్వతంగా నిలుస్తుంది. అందుకే ఇది రాస్తున్నా. నీ కవిత నీకోసం రాసిన కవితలతో పాటు ఈ లేఖనూ జీవితాంతం నీ వెంటే ఉంచుకో. ఎప్పుడైనా మనసు చెదిరినప్పుడు ఒక్కసారి తీసి చదువుకో. గాడ్ బ్లెస్ యు రా చిన్నూ!’’. ∙∙ నెల దాటింది. హాల్లో ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి పక్కున నవ్వులు. రూమ్‌లోంచి తొంగి చూశా. ఎవరినో చుట్టు ముట్టారంతా. దగ్గరకెళ్లి చూస్తే కవిత. ‘తాతయ్య!’ అని కవితకు పరిచయం చేశాడు సమీర్. కవిత పలకరించింది. నేను నవ్వా. మళ్లీ మాటల సంగ్రామం. కవిత కళ్లనే గమనించా. స్వచ్ఛంగా నవ్వుతున్నాయి. అదే మెరుపు సమీర్లోనూ చూశా. మనసుకి సంతృప్తిగా అనిపించింది. ఇంట్లో వాళ్లంతా ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే నవ్వుతూ చూస్తున్నా.కవిత నా దగ్గరకు వచ్చి ‘‘ఏం తాతయ్యా! మీరేం మాట్లాడరూ?’’ అని అడిగింది.‘‘తను మాట్లాడలేడు. హీ ఈజ్ డంబ్!’’ అన్నాడు సమీర్. నేను మరోసారి చిన్నగా నవ్వాను. - సంహిత నిమ్మన -
విషాదం: భార్యతో బ్రేకప్.. లైవ్‌లో పాముకాటుతో..
మాస్కో: ప్రేమించిన భార్య వదిలేసి వెళితే ఎవరికైనా బాధే. యవ్వనంలో ఉంటే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి బాధను తట్టుకోవడం అందరి వల్లా కాదు. బాధతో తల్లడిల్లుతూ జీవితాంతం కుంగిపోతూ కృషించిపోయే వాళ్లు కొందరైతే, జీవితానికి ఎదురీది భార్యకన్నా బతుకు ముఖ్యమనుకొని జీవితంలో మరింతగా రాణించేవారు మరికొందరు. భార్యలేని జీవితం తనకెందుకని అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకునే పిరికివారు కూడా ఉంటారు. కానీ రష్యాలోని పీటర్స్బర్గ్కు చెందిన 31 ఏళ్ల ఆర్సే వలీవ్ ఈ కోవల్లో దేనికి చెందిన వాడు కాదు. 20 ఏళ్లుగా భయంకర విషపూరిత పాములతోని, మనుషులను తినే అడవి పిల్లులతోని ఆడుకునే వాడు. వాటి పట్ల ఉన్న ప్రేమతోనే ఆయన కొంతకాలం జంతుప్రదర్శన శాలలో పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి యూట్యూబ్‌లో పలు ఛానళ్ల నిర్వహించడం ద్వారా లక్షలాది అభిమానులను కూడగట్టుకున్నాడు. ఆయనకు భార్య ఏక్తరీనా కాత్యా అంటే కూడా చాలా ఇష్టమే. ఇద్దరూ యూట్యూబ్ ఛానళ్లలో తమ పెంపుడు పాములు, పిల్లులతో కనిపిస్తూ అల్లరిచేసే వారు. పాములతో ఆడుకోవడమూ, వాటికి సంబంధించిన విశేషాలు చెప్పడం ఇద్దరికీ ఇష్టమే. వారి మధ్య ఈ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య తనతో సరిగ్గా ఉండడం లేదని, అందుకు మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించడమే కారణమని వలీవ్కు అనుమానం వచ్చింది. ఆగస్టు 4వ తేదీన భార్య తలపై కొట్టాడు. ఆమె అప్పుడు స్పహతప్పి పడిపోయింది. జూలై నుంచి తమ మధ్య సెక్స్ లేదని, అందుకు కారణం ఆమె తనను పట్టించుకోకపోవడమే కారణమని వలీవ్ కెమేరా లైవ్‌లో తన బాధను పంచుకున్నారు. భార్యను కొట్టినందుకు సెప్టెంబర్ 21వ తేదీన ప్రజాముఖంగా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. అయినప్పటికీ భార్యతో ఆయనకు సఖ్యత కుదరలేదు. ఇటీవల ఓ రోజున తనకు అత్యంత ఇష్టమైన ‘బ్లాక్ మాంబ’తో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చూపిస్తానని చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బ్లాక్ మాంబ. అది కరిస్తే కొన్ని నిమిషాల్లోనే మనిషి చనిపోతాడు. ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించిన మరుసటి రోజే వలీవ్ కెమేరా ముందుకు వచ్చి. తాను తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని, తెల్లారే నిద్ర లేచేసరికి పక్కన ఎవరూ లేకపోవడం ఎంతో వెలితిగా ఉందని అన్నారు. ఇలాంటి జీవితం అవసరమా ? అని ప్రేక్షకులను ప్రశ్నించారు. ఒక్క క్షణం అంటూ కెమేరా నుంచి పక్కకు వెళ్లాడు. కాసేపటికీ మత్తుగా ఉన్న కళ్లతో కెమేరా ముందుకు వచ్చాడు. ‘ఇదిగో చూడండి! నా కిష్టమైన బ్లాక్ మాంబతో కరిపించుకున్నా’ అని చెప్పాడు. ఆయన వేళ్లపైన పాము కరచినట్లు రెండు రక్తం చుక్కలు కనిపించాయి. ఇంతలో ఆయన కళ్లు మూసుకుపోతుండగా అటూఇటూ తూగుతూ మత్తుగా మాట్లాడాడు. చివరి నిమిషంలో తనకు భార్యను చూడాలని ఉందని, ఎవరైనా తన భార్యకు ఫోన్‌చేసి పరిస్థితి చెప్పండంటూ ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ బయటకు చదివారు. ఆ తర్వాత లేచి బాత్రూమ్ వైపు వెళుతూ కనిపించాడు. కాసేపటికి కెమేరా ఆగిపోయింది. వలీవ్ బాత్రూమ్లోకి కాకుండా ఇంటిముందుకు వెళ్లి తనను కాపాడాల్సిందిగా బాటసారులను కోరారట. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వారిలో కొందరు సమీపంలోని ఆస్పత్రికి ఫోన్లు చేయడంతో అంబులెన్స్ వచ్చి వలీవ్ను ఎక్కించుకొని వెళ్లిందట. ఆస్పత్రికి వెళ్లేలోగానే వలీవ్ కన్నుమూశాడు. ఆయన భార్య కాత్య ఈ వీడియోను చూసిందీ లేనిదీ తెలియదు. ఎలా స్పందించారో కూడా తెలియదు. -
ఎంత కఠినం
సోషల్ మీడియాలో పుడుతున్న లవ్ అపనమ్మకం, మనస్పర్థలతో బ్రేకప్ బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న కొందరు యువకులు సోషల్ మీడియా.. భావాలను పంచుకునేందుకు అత్యంత వేగవంతమైన ‘ఈ’ టెక్నాలజీ. ఇప్పటి ఫాస్ట్ జనరేషన్‌కు తగ్గట్టుగా వచ్చిన ఫేస్బుక్, ట్విట్టర్, హైక్, వాట్సప్ వంటి వాటిలో రిలేషన్షిప్స్, బ్రేకప్స్ కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. తొలినాళ్లలో మనస్తత్వం నచ్చి తిరిగిన యువతీ యువకులు.. ఆ తర్వాత ఏదో కారణంతో బ్రేకప్ చేప్పేసుకుంటున్నారు. కొంతమంది తమ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొందరు అబ్బాయిలు సైకోలుగా మారి అమ్మాయిని పీడించి బలవన్మరణానికి పాల్పడేలా చేస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని..– సాక్షి, సిటీబ్యూరో మోసాన్ని తట్టుకోలేక.. ఉష ప్రముఖ చానల్లో యాంకర్. సోషల్ వెబ్సైట్ ఫేస్బుక్లో ఆమెను వేలాది మంది ఫ్యాన్స్ అనుకరిస్తున్నారు. ఫొటోలకు లక్షల్లో లైక్స్.. అందులో కొంత మంది ఫ్యాన్స్ పెట్టిన కామెంట్లకు రెస్పాన్స్ ఇచ్చింది. అలా రమేశ్ పరిచయమయ్యాడు. డైరెక్ట్ కలవకుండానే ఓ సంవత్సరం పాటు ఫేస్బుక్, వాట్సప్‌లో చాటింగ్ చేసుకుంటూ ఒకరికొకరు స్నేహితులుగా మారారు. ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారి చివరకు సహజీవనానికి దారితీసింది. ఇలా నాలుగేళ్లు బాగానే సాగింది. అమ్మాయి వివాహం ప్రస్తావన ఎత్తేసరికి అబ్బాయి ప్లేట్ ఫిరాయించాడు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ‘నన్ను అభిమానించే ఫ్యాన్స్ అందరికీ బై, నన్ను ఇన్నాళ్లు అభిమానించిన నా ఫ్యాన్స్‌ను మిస్సైతున్నా’ అని ఫేస్బుక్లో చివరి పోస్టు చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ‘లొంగలేదని’ దారుణం ఉద్యోగ కోసం వరంగల్ నుంచి వచ్చిన రణధీర్, కరీంనగర్ నుంచి వచ్చిన లావణ్యకు జాబ్ కన్సల్టెన్సీలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరికి వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వారి పరిచయాన్ని వాట్సప్ స్నేహంగా మార్చింది. ఇలా కొన్ని నెలల్లోనే ప్రేమపక్షుల్లాగా మారి సిటీలోని అన్ని ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ కలిసి ఫొటోలు దిగారు. ఆ తర్వాత అబ్బాయి తీరు నచ్చని అమ్మాయి వాట్సప్‌ను బ్లాక్ చేసింది. దీంతో ఆమెను వశం చేసుకోవాలనుకున్న రణధీర్.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను, సన్నిహితంగా ఉన్న వీడియోలను ఫేస్బుక్లో పోస్టు చేస్తానని తరచూ అమ్మాయికి మెసేజ్‌లు పంపేవాడు. ఈ బెదిరింపులకు లావణ్య భయపడలేదు. అయితే రోజుకో ఫొటో ఫేస్బుక్లో పోస్టు చేసేసరికి అమ్మాయి స్నేహితులు, కుటుంబ సభ్యులు వాటిని చూశారు. దీంతో తనకు నలుగురిలో అవమానం జరిగిందని లావణ్య.. రణధీర్‌కు ఫోన్ చేసి ఆ పోస్టును, ఫొటోలు డిలీట్ చేయాలని కోరింది. అయితే, తాను కోరినప్పుడు కలవాలని, లక్షల్లో డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. దీన్ని తట్టుకోలేక మనస్థాపం చెందిన లావణ్య హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రేమను నమ్మలేదని.. అబ్బాయి పేరు అభిలాష్, అమ్మాయి పేరు నేహ. నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇద్దరూ ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. అభిలాష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. నేహ హైదరాబాద్‌లోనే చదువు కొనసాగించింది. మనుషులు దూరమైనా ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాట్సప్, ఫేస్బుక్ చాట్‌లో ప్రతి విషయం షేర్ చేసుకునేవారు. అలా ఏడాది గడిచాక అబ్బాయి అమెరికాలో ఇతర అమ్మాయిలతో కలిసి దిగిన ఫొటోలు ఫేస్బుక్ పేజీలో కనిపించడంతో నేహ ఆవేదనకు గురై ‘లవ్ బ్రేకప్’ విషయం అబ్బాయికి తెలియచేసింది. రెండు నెలలు పాటు నేహకు నచ్చజెప్పేందుకు అభిలాష్ ప్రయత్నించాడు. ఆమె ఎంతకీ స్పందించలేదు. నేహ వేరే యువకుడితో పెళ్లికి సిద్ధమైందన్న వార్త తెలిసి అభిలాష్ స్నేహితుల సహాయంతో నేహతో ఓసారి ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడేందుకు ఒప్పించాడు. తన ప్రేమను నేహ ఎంతటికీ నమ్మకపోవడంతో ఫేస్బుక్ లైవ్‌లో ఆమె చూస్తుండగానే అభిలాష్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
నస.. బుస..!
రైట్ టైమ్ లేవండి.. బ్రేకప్ పార్టీకి రెడీ అవ్వండి అతడు మీ పాస్వర్డ్ అడుగుతున్నాడా? ఆమె మీ ‘వాట్సప్ లాస్ట్ సీన్’ కోసం పట్టు పడుతోందా? మీరు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు అతడు అదే పనిగా మీకు ఫోన్ చేస్తూ మిమ్మల్ని ‘డ్రిల్’ చేస్తున్నాడా? అయితే, బ్రేకప్ గురించి ఆలోచించవలసిన టైమ్ వచ్చేసిందనే! శుభమా అంటూ వాలెంటైన్స్ డే దగ్గరపడుతుంటే.. ఈ బ్రేకప్ ప్రీచింగ్ ఏంటి అంటారా?! ప్రీచింగ్ కాదు.. టీచింగ్ కాదు. ప్రేమకు వేళయినట్లే... సమ్‌టైమ్స్.. బ్రేకప్కీ వేళవుతుందని చెప్పడం. ప్రేమలో పడినప్పుడు అన్నీ వదులుకుంటాం. మన టైమ్, మన మనీ, మన ఇష్టాలు.. ఆఖరికి మన వ్యక్తిత్వం కూడా! నిజానికి అది మన తప్పు కాదు. పవర్ ఆఫ్ లవ్! ప్రేమలో ఉన్నప్పుడు మన పార్ట్నర్లోని లోపాలను కూడా ప్రేమిస్తాం. కోపాలనూ భరిస్తాం. ఉట్టి పుణ్యానికి తిట్లు తింటున్నా, నిందలు పడుతున్నా చిరునవ్వుతో స్వీకరిస్తాం. కానీ అన్నిసార్లూ అలా సాధ్యం కాదు. మాటలు పడీపడీ సడెన్‌గా చికాకు పడిపోతాం. ‘ఈ లైఫ్ నాది కదా’ అనుకునేంతగా ప్రేమ నుంచి వేరైపోతాం! దీనికి కారణం ప్రేమ తగ్గిపోవడం కాదు. నస ఎక్కువవడం! అది మన ఫస్ట్ లవ్ కావచ్చు. మన ఫస్ట్ రిలేషన్షిప్ కావచ్చు. కానీ అంతకంటే ముందే మనతో మనకు లవ్, రిలేషన్షిప్ ఏర్పడి ఉంటాయి! అందుకే.. ఆ లవ్‌కి, ఆ రిలేషన్‌షిప్‌కి భంగం కలిగించే బయటి లవ్‌ని, బయటి రిలేషన్‌షిప్‌ని వదిలేసుకోడానికి సిద్ధమైపోతాం. అది మన ప్రేమ తప్పు కాదు. మన పార్ట్నర్ తప్పు. ఏమైనా జీవితానికి సంతోషం ముఖ్యం. అది ప్రేమలో దొరికితే మరీ సంతోషం. బ్రేకప్‌తో మాత్రమే దొరుకుతుందనిపిస్తే.. ప్రేమ కోసం చూసుకోనక్కర్లేదు. బ్రేకప్ పార్టీ ఇచ్చేయడమే! బ్రేకప్‌కి టైమ్ దగ్గర పడిందనడానికి పది సంకేతాలు 1 మీ పార్ట్నర్ మీ ఫోన్‌ని ప్రతి రోజూ జల్లెడ పట్టేస్తున్నారా? 2 మనిద్దరికీ ఒకే పాస్వర్డ్ ఉండాలని మీ పార్ట్నర్ సతాయిస్తున్నారా?. 3 మీ ఇద్దరి మధ్యా గొడవ జరిగిన ప్రతిసారీ మీ పార్ట్నర్ మీ ‘ఎక్స్’ పార్ట్నర్ ఊసెత్తుతున్నారా? 4 మీకు ఇష్టం లేని పనులను తన ఇష్టం కోసం చెయ్యమని తరచు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా? 5 ఎంతో కాలంగా అడుగుతున్నా మీకు తన ఫ్రెండ్స్‌ను పరిచయం చేయడానికి తటపటాయిస్తున్నారా? 6 మీ పార్ట్నర్ చుట్టూతే మీ పర్సనల్ లైఫ్ అంతా తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తోందా? 7 మీరు వేసుకునే బట్టల గురించి మీ పార్ట్నర్ పదే పదే నెగటివ్‌గా మాట్లాడుతున్నారా? లైక్... నా పక్కన వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, అలాంటి బట్టలు వేసుకోవద్దు... అని! 8 మీరు మాట్లాడే ప్రతి ఒక్కరితో మిమ్మల్ని కలిపి, మీ పార్ట్నర్ మీ గురించి అనుమానంగా మాట్లాడుతున్నారా? అసూయ పడుతున్నారా? 9 మీరు తనకే దక్కాలనీ, మీ అటెన్షన్ అంతా తన మీదే ఉండాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారా? 10 చిన్న వాదులాటకు కూడా మన విడిపోదాం అని మీ పార్ట్నర్ అంటున్నారా? ఈ ‘సుగుణాలలో’ ఏ ఒక్క సుగుణం మీ పార్ట్నర్లో కనిపించినా.. మీరు మీ రిలేషన్‌షిప్‌కి ‘థమ్స్‌డౌన్’ ఇచ్చే ఆలోచన చేయడం మంచిది. ఇప్పటికే ప్రేమతో చాలా ఇచ్చేసి ఉంటారు. వాటిల్లో థమ్స్‌డౌన్ కూడా ఒకటి అనుకుని ఇచ్చేయండి. -
ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్?
అటు తమిళంలో, ఇటు తెలుగులో (డబ్బింగ్) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న కథానాయకుడు విశాల్. నటుడు శరత్‌కుమార్ కుమార్తెగానే కాకుండా హీరోయిన్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని గుసగుసలు వినిపించాయి. ‘‘తమిళ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం కడుతున్నాం. అది పూర్తి కాగానే అందులో జరిగే మొదటి పెళ్లి నాదే’ అని విశాల్ చెబుతూ వచ్చారు. ఆయన పెళ్లాడనున్నది వరలక్ష్మీనే అని చాలామంది ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ప్రేమ ఇటీవల పరిహాసంగా మారుతోంది. ఓ వ్యక్తి ఏడేళ్ల బంధాన్ని తేలిగ్గా వద్దనుకున్నాడు. అది కూడా తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయికి ఆ విషయం తెలియజేశాడు. ప్రపంచంలో ప్రేమ ఏమైపోతోందో? ఎక్కడుందో?’’ అంటూ ఆమె ఆవేదనగా ట్వీట్ చేశారు. విశాల్‌ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. విశాల్‌ను వరలక్ష్మి ప్రేమించడం ఆమె తండ్రి శరత్‌కుమార్‌కి నచ్చలేదని, పెళ్లికి ఆయన సమ్మతం వ్యక్తం చేయలేదని ఓ టాక్ ఉంది. దానికి తోడు నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్, శరత్‌కుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయి కూడా. ఒకవేళ విశాల్-వరలక్ష్మి బ్రేకప్ వెనక శరత్‌కుమార్ హస్తం ఉండి ఉంటుందేమోనన్నది కొందరి ఊహ. ఇంతకీ వరలక్ష్మి ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుక. -
దేవదాసు... నాకొద్దు బాసూ!
‘‘మాది అంతులేని కథ. ఫుల్స్టాప్ పెట్టకుండా మీడియా డిస్కస్ చేస్తూనే ఉంటే.. మా కథ ఎప్పటికీ ఆగదు. రణ్‌బీర్ ఓ మాట అన్నాడు. బదులుగా నేనేదో అన్నాననుకోండి.. మూడో వ్యక్తి ఇంకేదో అంటాడు. ప్లీజ్.. బ్రేకప్‌కి కారణం ఏంటి? వంటి ప్రశ్నలు అడగొద్దు. ఆ డిస్కషన్ మా ఇద్దరి మధ్యే ఉండాలి’’ అని కత్రినా కైఫ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందాల సుందరి ఇంతలా విజ్ఞప్తి చేసుకున్నా బీ-టౌన్ మీడియా మాత్రం వదలడంలేదు. కూపీలు లాగే పనిలో పడింది. రణ్‌బీర్, కత్రినాల బ్రేకప్ గురించి ఇప్పటికే బాలీవుడ్ జనాలు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘కత్రినా నాకు చాలా స్పెషల్. అమ్మానాన్నల తర్వాత నా జీవితంలో అంత ముఖ్యమైన వ్యక్తి. బ్రేకప్ తనను అప్సెట్ చేసింది. నేను బాగా తాగుతాను. నా ప్రేయసి కోసం తాగుడు మానేయాలనుకుంటున్నాను’’ అని రణ్‌బీర్ వ్యాఖ్యానించడంతో కొత్త చర్చ మొదలైంది. రణ్‌బీర్ వాలకం చూస్తుంటే.. కత్రినాకు దగ్గరయ్యేలా అతని మాటలు ఉన్నాయి. కత్రినా మాత్రం ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదట. ఎందుకంటే... షూటింగ్ లేకపోతే రణ్‌బీర్ నోట్లో చుక్క పడాల్సిందేనట. మామూలుగా ప్రేమలో విఫలమైనవాళ్లు దేవదాసులా మద్యానికి బానిసలవుతారు. కానీ, రణ్‌బీర్ మాత్రం ప్రేమలో ఉన్నప్పటికీ సీసా పట్టుకోకుండా ఉండలేడట. ఇది కత్రినాకు నచ్చలేదట. అందుకే రణ్‌బీర్ నుంచి విడిపోవాలనుకుందని బీ-టౌన్ మీడియా ఇన్వెస్టిగేషన్ తేల్చింది. ఇదిలా ఉంటే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు కత్రినా దగ్గరైందని కొందరు అంటున్నారు. అందుకే రణ్‌బీర్‌కు దూరం కావాలనుకుందని చెప్పుకుంటారు. మరి.. బ్రేకప్‌కి అదే కారణమా? లేక నిజంగానే రణ్‌బీర్ మద్యానికి బానిస కావడంవల్లే కత్రినా అతనికి దూరమైందా? నిజమేంటో రణ్‌బీర్, కత్రినాలకే ఎరుక. -
బ్రేకప్ను నేను ఎలా ఎదుర్కొన్నానంటే?
'నా కళ్లకు నువ్వే అలవాటు.. నువ్వు కనిపించకుంటే అవి వెతుక్కుంటాయి' (ఆంఖోంకో తేరి ఆదాత్ హై.. తునా దిఖే తో షికాయత్ హై).. తాజా సినిమా 'బార్ బార్ దేఖో'లోని ఈ పాట కత్రిన ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. గత ఏడాది వరకు ఆమె ఓ నటుడితో సన్నిహితంగా తిరిగింది. ప్రేమలో మునిగితేలింది. ఇద్దరూ ఒకే ప్లాటులో ఉండి సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ అకస్మాత్తుగా వారిద్దరూ వేరయ్యారు. ఒకరికొకరు ఎదురుపడలేనంత దూరమయ్యారు. బాలీవుడ్ ప్రేమపక్షులు పేరొందిన కత్రినాకైఫ్-రణ్‌బీర్ కపూర్ గత ఏడాది చివర్లో బ్రేకప్ జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి, రణబీర్‌తో వేరయిన తర్వాత కత్రిన ఎలా గడిపింది? ఈ బ్రేకప్ అనంతర పరిణామాలను ఎలా ఎదుర్కొంది? ఆ డిప్రెషన్ నుంచి ఎలా కోలుకుంది? తదితర విషయాలపై కత్రిన స్పందించింది. 'నేను తరచూగా జిమ్‌కు వెళ్లి వ్యాయమాలను చేశాను. తద్వారా దానిని (బ్రేకప్ను) ఎదుర్కొన్నారు' అని ఆమె ఓ మీడియా సంస్థకు తెలిపింది. బ్రేకప్ అనంతరం కత్రిన చేసిన ఈ కసరత్తు ఊరికే పోలేదు. తన తాజా సినిమా "బార్ బార్ దేఖో'లో మరింతగా బ్యూటీఫుల్‌గా దర్శనమిచ్చింది ఈ సుందరి. తనకంటే వయస్సులో చిన్నవాడైన సిద్ధార్థ్ కపూర్‌తో జత కట్టిన ఈ అమ్మడు.. అతనికి ఈడు-జోడుగా అలరించింది. హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల కనులవిందు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్-కత్రిన జోడీ కలిసి ఆడిపాడిన 'కాలాచష్' పాట ఆన్లైన్లో దుమ్మురేపుతుండగా.. తాజాగా బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా హల్చల్ చేస్తోంది. వయస్సు పెరుగుతున్నా హీరోయిన్గా తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా ట్రైలర్‌తో కత్రిన మరోసారి చాటింది. -
అతనితో మళ్లీ మొదలైంది!
‘అంతా అయిపోయింది.. ఇక ఆ ఇద్దరూ కలవడం కష్టం’ అని క్రికెటర్ విరాట్ కోహ్లి, నటి అనుష్కా శర్మల బంధం గురించి హిందీ రంగంలో చాలామంది ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే అందరికీ ఈ జంట ఓ ట్విస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం వరకూ ప్రేమికులుగా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత చిన్నపాటి మనస్పర్థలతో విడిపోయారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. బ్రేకప్ అయ్యి, ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమైనప్పటికీ తోడు లేని కొరత బాగా తెలుస్తోందట. ముఖ్యంగా అనుష్కా శర్మ తన జీవితానికి చాలా ముఖ్యమని విరాట్ అనుకుంటున్నారని వినికిడి. అందుకే, ఆమె సోదరుడి ద్వారా మంతనాలు జరుపుతున్నారట. ఇలాంటిది ఏదో జరిగితే బాగుంటుందనుకున్నారో ఏమో.. అనుష్కా శర్మ కూడా మళ్లీ విరాట్‌తో మింగిల్ కావడానికి రెడీ అవుతున్నారని బోగట్టా. ఆ మధ్య విరాట్ ఓ క్రికెట్ మ్యాచ్‌లో పరుగుల మీద పరుగులు తీసిన వైనాన్ని ప్రశంసిస్తూ, ఆమె ఫోన్ చేసి, అభినందించారట. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. మరోసారి మనసులు కలవడం ఎంతసేపు? అని వీళ్ల వ్యవహారం తెలిసినవాళ్లు అనుకుంటున్నారు. మళ్లీ కలిస్తే మాత్రం ఈ ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏదో ఉందని ఫిక్స్ అయిపోవచ్చు. -
మా బ్రేకప్ కలలో కూడా జరగదు!
షారుక్ ఖాన్ అంటే దీపికా పదుకొనేకి ప్రత్యేకమైన అభిమానం. ఆయన హీరోగా రూపొందిన ‘ఓం శాంతి ఓం’ ద్వారానే కథానాయికగా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు దీపిక. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘హ్యాపీ న్యూయర్’ చిత్రాల్లో నటించారు. ఆ విధంగా వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. కానీ, ఇప్పుడా స్నేహం బ్రేకప్ కావడం ఖాయమని బాలీవుడ్‌వారు అంటున్నారు. దానికి కారణం షారుక్ నటించిన ‘దిల్వాలే’, దీపిక నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ ఒకే రోజున విడుదల కానుండటమే. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. దాంతో షారుక్, దీపిక మధ్య పోటీ ఉంటుందని, ఇప్పటికే ఈ బ్యూటీ మీద షారుక్ కోపంగా ఉన్నారని వార్త ప్రచారమవుతోంది. ఈ వార్తకు దీపిక స్పందిస్తూ - ‘‘షారుక్‌కి నాపై కోపమా? వినడానికే హాస్యాస్పదంగా ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. మా బ్రేకప్‌ని ఎవరైనా చూడాలంటే అది కలలో కూడా సాధ్యం కాదు. నేను నటించిన సినిమా విడుదల తేదీ నా చేతుల్లో ఉండదు. నిర్మాత ఎప్పుడనుకుంటే అప్పుడు విడుదలవుతుంది. అది షారుక్‌కి కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు నాపైన ఆయనకు కోపం ఎందుకు ఉంటుంది? మా గురించి లేనిపోని వార్తలు ఎన్ని కల్పించినా, మా ఈక్వేషన్ని ఏమీ చేయలేరు’’ అన్నారు. -
పవన్‌తో తెగదెంపులకు టీడీపీ సిద్దం..!
-
'మోదీతో తెగతెంపులు చేసేసుకున్నా'
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న బంధాన్నిఇకముందు తెంచుకుంటున్నట్టు మాజీమంత్రి, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, రామ్ జెఠ్మలానీ ప్రకటించారు. కీలకమైన విజిలెన్స్ శాఖలో అవినీతి చరిత్ర ఉన్న కేవీ చౌదరిని సీవీసీగా (చీఫ్ విజిలెన్స్ కమిషనర్) నియమించడంతో ప్రభుత్వం మీద తనకున్న గౌరవం పోయిందని ఆయన తెలిపారు. కేవీ చౌదరి పరపతి ఏమంత గొప్పగా లేదని, ఆయన మీద అనేక ఆరోపణలున్నాయని రాం జెఠ్మలానీ అంటున్నారు. ఈ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తాను పోరాడనున్నానని తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లో మోదీకి ఒక సందేశాన్ని పంపారు. మోదీతో తనకున్న సంబంధాలను తెంచుకున్నట్టుగా ఒక ఉత్తరాన్ని పోస్ట్ చేశారు. బీజేపీలో సీనియర్ నేతలంతా మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో మోదీని చాలా గట్టిగా సమర్ధించిన జెఠ్మలానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ తాజా పరిణామంతో ఇప్పటికే కేవీ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న మరో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది, ఆప్ బహిష్కృత నేత ప్రశాంత్ భూషణ్ కు, రాజ్యసభ మాజీసభ్యుడు జెఠ్మలానీ మద్దతు లభించినట్టయింది. కాగా కేవీ చౌదరి నియామకాన్ని ఖండించిన ప్రశాంత్ భూషణ్... ఈ అంశంపై ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఇప్పటికే లేఖ రాశారు. ఇది అవమానకర, దురదృష్టకర ఘటన అని , దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ప్రకటించారు. -
లేటెస్ట్ బ్రేకప్ జంట సిద్ధార్థ్, సమంత
రీల్ లైఫ్‌ను రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేసిన లేటెస్ట్ బ్రేకప్ జంట సిద్ధార్థ్, సమంత... రియల్ లైఫ్‌ను రీల్ లైఫ్‌లోనూ కొనసాగిస్తున్నారు! కన్ఫ్యూజన్గా ఉందా..! అయితే డీటైల్‌గా చెప్పాల్సిందే! చాన్నాళ్లు సీక్రెట్‌గా సహజీవనం చేసిన తమిళ తారలు సమంత, సిద్ధార్థ్‌లు... ఇటీవల అంతే గుట్టుగా విడిపోయారు. ఈ బ్రేకప్‌పై నర్మగర్భంగా ఆ మధ్య సమంత ‘నేను విక్టమ్ను కాదు’ అంటూ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందనుకోండి! తాజాగా... వీరిద్దరూ కలసి ‘బెంగళూరు డేస్’ మూవీలో నటించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి తారలిద్దరూ దాని నుంచి తప్పుకున్నారు. ‘బెంగళూరు డేస్‌లో నేను చేయడం లేదు’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేస్తే... ‘ఆ సినిమాలో నటించడం లేదు’ అంటూ శామ్ కూడా పోస్ట్ చేసింది..! పాపం నిర్మాత! -
బిపాసా కోసమేనా!
క్యూట్ గాల్ త్రిషాకు రానా కట్ చెప్పడానికి కారణం... మనోడి మనసులో మరొకరు ఉండటమేనట. అదీ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ బిపాసాబసు అని ఇండస్ట్రీలో టాక్. ఆమెకు దగ్గరయ్యేందుకే ఈమెను దూరం పెట్టాడట. ఓ పక్క త్రిషా కూడా ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిందనేది శాండల్‌వుడ్‌లో రూమర్. ఏది ఏమైనా... అలా బ్రేకప్ అవగానే ఇద్దరూ ఇలా ఎవరికి వారు ఎంగేజ్ అయిపోయారు. మరోవైపు ఇప్పటి వరకు హర్మాన్ బవేచాతో రొమాన్స్‌లో మునిగితేలిన బిపాసా కూడా.. అతడిని వదులుకోగానే ఈ టాలీవుడ్ కండల కుర్రాడిని పట్టేసి బిజీ అయిపోయింది. -
హన్సికతో సంబంధం లేదు!
కొందరి ప్రేమలు మూణ్ణాల ముచ్చటగా మిగిలిపోతాయి. శింబు, హన్సికల ప్రేమాయణం కూడా ఈ జాబితాలోకే వస్తుంది. ‘మేం ప్రేమలో పడ్డాం’ అని ఒకేరోజున ఇద్దరూ ట్విట్టర్లో ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే విడిపోయారు. ఆ మధ్య హన్సిక ‘సాక్షి’తో మాట్లాడుతూ.. శింబూ నుంచి తను విడిపోయిన విషయాన్ని స్పష్టం చేశారు. బుధవారం శింబు ట్విట్టర్ ద్వారా తమ బ్రేకప్‌ని నిర్ధారించారు. ‘‘ఈ బంధం చాలనిపించింది. బాగా ఆలోచించుకున్న తర్వాత ఇక సింగిల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. హన్సికతో, ఆమెకు సంబంధించిన విషయాలతో నాకెలాంటి సంబంధం లేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాల గురించి చర్చించాలనుకోవడంలేదు. నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు స్పష్టం చేయాలనే ఈ ప్రకటన చేశాను. గతం గతః. గతాన్ని తల్చుకుని ఎప్పుడూ బాధపడను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను’’ అని శింబు వెల్లడించారు. -
పవన్‌కల్యాణ్ ప్రేమలో పడ్డాడు!
చూపులు కలవడం...ప్రేమించడం... పార్కులు... షికార్లు... ఐస్‌క్రీములు.. చాకొలేట్లు... గంటల తరబడి ఫోన్ చాటింగ్‌లు... కొన్నిరోజులకి బ్రేకప్‌లు... మరో ప్రయత్నం... మరో బ్రేకప్... మరో ప్రయత్నం... మరో బ్రేకప్... ఇదంతా యువజంటలకు సర్వసాధారణం! ఈ అంశాన్ని ఎంతో హాస్యంగా ‘పవన్‌కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ చిత్రం ద్వారా చిట్టి తెరమీద చూపాడు వెంకట్ కర్నాటి. డెరైక్టర్స్ వాయిస్: మాది నల్గొండ జిల్లా చౌటుప్పల్ గ్రామం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బాగా సినిమాలు చూసేవాడిని. ఒకలా చెప్పాలంటే నాకు సినిమాలంటే చాలా పిచ్చి. ఇంటర్ పూర్తి కాగానే ఉద్యోగం రావడంతో అక్కడితో చదువు ఆపేశాను. ఆ తరవాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తిచేశాను. సినిమాల మీద ఉండే ఆసక్తి కొద్దీ, యానిమేషన్ కోర్సు పూర్తి చేశాను. డీక్యూ ఎంటర్‌టెయిన్‌మెంట్‌లో త్రీడీ యానిమేటర్‌గా పనిచేశాను. ఆ తరవాత ఉద్యోగం మానేసి, ‘ఉయ్యాలజంపాల’ చిత్రం తీస్తున్న విరించివర్మ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాను. ఈ రంగంలో నేనింత చురుకుగా పాల్గొనడానికి మా తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తున్నారు. నా ఫ్రెండ్ ‘నానీ’ వల్ల నాకు ఈ ప్రాజెక్టు చేసే అవకాశం వచ్చింది. కథ ప్రకారం ఇందులోని క్యారెక్టర్లకి రెండు పేర్లు ఉండాలి. అందువల్ల మిత్రులంతా... పవన్‌కల్యాణ్ అనే పేరు సూచించడంతో, వెంటనే నేను ఆ పాత్రకు అనిరుధ్‌ని సెలక్ట్ చేసుకున్నాను. ‘ఐ క్లిక్ మూవీస్ (iqlik movies) వారి సహకారంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించాను. అజయ్ అరసాడ సంగీతం చేశాడు. ఈ ప్రాజెక్టు వల్ల నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా చూసి వెన్నెల కిశోర్‌గారు నన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘సల్మాన్‌ఖాన్ షాదీ’ పేరుతో ఈ చిత్రాన్ని హిందీలోకి రీ మేక్ చేస్తున్నాం. షార్ట్ స్టోరీ: పవన్ కల్యాణ్ అనే కుర్రవాడు, పవన్ పేరుతో కొందరు అమ్మాయిలకు, కల్యాణ్ పేరుతో మరి కొందరు అమ్మాయిలకు లైన్ వేస్తుంటాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమకబుర్లు చెబుతుంటాడు. ఇలా ఎందరో అమ్మాయిలతో ప్రేమలో పడడం, విషయం బయటపడటంతో బ్రేకప్ చెప్పడం అతనికి ఒక అలవాటుగా మారిపోతుంది. ఈ అలవాటు వల్ల అతనికి ఊహించని షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏమిటో చిట్టి తెర మీద చూడవలసిందే. కామెంట్: ‘పవన్‌కల్యాణ్’ పేరు పెట్టాడే కాని కథకు పవన్‌కు సంబంధం లేదని ముందుమాటలోనే వివరించాడు దర్శకుడు. కథను మంచి క్వాలిటీతో చిట్టితెరకు ఎక్కించారు ఐక్లిక్ మూవీస్. ప్రేమించడంలోనూ, బ్రేకప్ చెప్పడంలోనూ ఎంతో సునిశిత హాస్యం చూపాడు దర్శకుడు. హీరోగా అనిరుధ్, ఫ్రెండ్‌గా పడమటిలంక నవీన్ చాలా బాగా చేశారు. హీరోయిన్లుగా నటించిన అమ్మాయిలు బాగున్నారు కాని, వాయిస్‌లో మాత్రం పట్టు లేదు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవలసిందే. మంచి గొంతు ఉన్నవారితో డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది. సంభాషణలు సరదాగా ఉన్నాయి. ‘పువ్వుల్లో పెట్టి దాచుకుంటే తుమ్మెదలు వచ్చి వాలతాయని, గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాడు’ ‘అబద్ధాన్ని గొప్పగా చెప్పచ్చు, కాని నిజాన్ని నిజం కంటె గొప్పగా చెప్పలేం కదా’ ‘హృదయానికి నాలుగ్గదులుంటాయి, ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరుంటారు’ ‘ఫ్రెండనుకున్నాడా, ఏటిఎం అనుకున్నాడా’ వంటి సంభాషణలు కథకు అందం తీసుకువచ్చాయి. దర్శకుడు వెంకటే స్వయంగా సంభాషణలు రచించాడు. పాటల చిత్రీకరణ, ట్యూన్స్, లొకేషన్స్, కెమెరా, టేకింగ్... అన్ని విషయాలలోనూ మంచి క్వాలిటీ చూపారు. ఈ లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన మూడురోజుల్లోనే రెండు లక్షల మంది చూశారు. ఈ దర్శకుడు చిన్నచిన్న లోపాలను సరిచేసుకుంటే ఇతనికి నూటికినూరు మార్కులు ఇచ్చేయవచ్చు. మీరు స్టూడెంటా! యూట్యూబ్‌లో మీ షార్ట్‌ఫిల్మ్‌లు పెట్టారా! అయితే మీ లఘుచిత్రాలకు సంబంధించిన వివరాలను, మీ ఫోన్ నంబర్లను ఈ కింద ఇచ్చిన మెయిల్‌కు పంపండి. మంచివాటిని పరిశీలించి ‘యూట్యూబ్ స్టార్’ లో పరిచయం చేస్తాం. sakshiutube@gmail.com - డా. వైజయంతి -
బ్రేక్అప్ ఓ ఈవెంట్
‘‘నేడు సీరియస్ ప్రేమలు అరుదు. త్వరగా ప్రేమలో పడినట్లే, విడి పోవడం కూడా త్వరగానే జరుగుతోంది. బ్రేక్అప్ని కూడా ఓ ఈవెంట్‌గా భావించే ట్రెండ్ నడుస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటున్నారు అమర్ కామేపల్లి. రణధీర్, స్వాతీదీక్షిత్ జంటగా ఆయన దర్శకత్వంలో ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన చిత్రం ‘బ్రేక్అప్’. రేపు ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రవిశేషాలను ఇంకా దర్శకుడు చెబుతూ - ‘‘కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది రొమాంటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్. ప్రేమలోని పలు మలుపులను చూపించే చిత్రం’’ అని చెప్పారు.