Bigg Boss 11 Couple Bandgi Kalra and Puneesh Sharma Breakup After 5 Years - Sakshi
Sakshi News home page

Bandgee Kallra: ఐదేళ్లుగా సహజీవనం.. బ్రేకప్‌ చెప్పేసుకున్న బిగ్‌ బాస్‌ జంట!

Published Sun, Jul 23 2023 1:26 PM | Last Updated on Wed, Sep 6 2023 10:18 AM

Bigg Boss 11 couple Bandgee Kallra and Puneesh Sharma Breakup after 5 years - Sakshi

బాలీవుడ్ బిగ్ బాస్ జోడీ తమ అభిమానులకు షాకిచ్చింది. బిగ్‌ బాస్‌-11 సీజన్‌లో పాల్గొన్న బంద్‌గీ కల్రా, పునీశ్ శర్మ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. బిగ్‌ బాస్‌ హౌస్‌లోనే ప్రేమలో పడిన ఈ జంట అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బంద్‌గీ కల్రా తన ఇన్‌స్టాలో ఓ నోట్‌ రాసుకొచ్చంది. 2018 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట బ్రేకప్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది. 

(ఇది చదవండి: ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న వర్ష, త్వరలో బిగ్‌బాస్‌లోకి! )

కల్రా తన ఇన్‌స్టాలో రాస్తూ..'  పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పునీష్, నేను విడిపోయాం. మేమిద్దరం కలిసి ఉన్న సమయం ఎల్లప్పుడూ మా జీవితంలో విలువైనదే.  లైఫ్‌లో మనం ఏమి చేయాలని నిర్ణయించుకున్నా సరే ఒకరికి ఒకరి పట్ల ప్రేమ, మద్దతు మాత్రమే ఉంటుంది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నా. ఈ విషయంపై అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా." అంటూ రాసుకొచ్చింది బాలీవుడ్ భామ. 

కాగా.. పునీష్ బ్రేకప్‌పై తన అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ నిర్ణయం ఏదైనా నిర్దిష్ట కారణాలు లేవని.. ఇద్దరం ఆలోచించాకే బ్రేకప్‌ అయిందని వెల్లడించారు. బంద్‌గీ కల్రా, పునీష్ కథ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్‌ నుంచి బయటికొచ్చాక తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించారు. గతంలో బంద్‌గీ వారి బంధంపై మాట్లాడుతూ అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేసింది.   ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి సమయం వెచ్చిస్తున్నట్లు తెలిపింది. కాగా..   2018 నుంచి లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  

(ఇది చదవండి: 9 రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా.. మీ అందరికీ రుణపడి ఉంటా: హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement