Bollywood Actress
-
ఏఐ మోనాలిసా.. బాలీవుడ్ హీరోయిన్ కంటే అందంగా!
ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అమ్మాయి మోనాలిసా. జీవవోపాధి కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు ఊహించని విధంగా ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియా వల్ల ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు ఏకంగా బాలీవుడ్లో మూవీ ఆఫర్ కూడా వరించింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కించనున్న సినిమాలో మోనాలిసా కనిపించనుంది.అయితే తాజాగా మోనాలిసాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాలో నటించేందుకు కోసం హీరోయిన్లా మేకప్ వేసుకుని కనిపించింది. అయితే ఈ వీడియోను ఏఐ సాయంతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఏఐ సాయంతో చేసినప్పటికీ మోనాలిసా మేకోవర్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అచ్చం హీరోయిన్ కటౌట్‌ను తలపిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Punjab Kesari (@punjabkesari_pk) -
భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న యానిమల్ బ్యూటీ.. డైరెక్టర్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో ఫేమస్ అయింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ తర్వాత త్రిప్తి డిమ్రికి ఆఫర్లు వెతక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్లో వరుసగా సినిమాలతో అలరించింది ముద్దుగుమ్మ.అయితే ఇటీవల త్రిప్తి డిమ్రీ రొమాంటిక్ హిట్ సిరీస్ ఆషికి-3లో ఆఫర్ కూడా దక్కించుకుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. కానీ ఊహించని విధంగా ఆమె ఈ ప్రాజెక్ట్ తప్పుకుంది. దీంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వదంతులు మొదలయ్యాయి. ఆమెకున్న బోల్డ్ ఇమేజ్ వల్లే నిర్మాతలు త్రిప్తి ఎంపికపై నిర్ణయాన్ని మార్చుకున్నారని ఊహగానాలొచ్చాయి.తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిప్తి డిమ్రీ తప్పుకోవడంపై ఈ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసు స్పందించారు. ఆమె ఎందుకు తప్పుకుందో తననే అడగాలని అన్నారు. నా సినిమాలో చేయకపోయినా ఎప్పటికీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అని.. నటిగా ఆమె అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం తేదీలే సమస్య అయి ఉండవచ్చని అన్నారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నామని.. త్రిప్తి ప్రస్తుతం దర్శకుడు విశాల్ భరద్వాజ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మా సినిమాకు టైటిల్ పేరేంటో నాకు తెలియదు.. మేము హీరోయిన్ను ఇంకా ఖరారు చేయలేదని.. వారం రోజుల్లో ప్రకటిస్తామని అనురాగ్ బసు పేర్కొన్నారు. కాగా.. అనురాగ్ బసు బాలీవుడ్లో గ్యాంగ్‌స్టర్, బర్ఫీ, లైఫ్ ఇన్ ఎ మెట్రో చిత్రాలకు ఫేమస్ అయ్యారు. -
సోదరుడికి పెళ్లి కూతురిని వెతికి పెట్టిన ప్రియాంక చోప్రా.. అదేలాగంటే?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటి వాడు కానున్నారు. తన ప్రియురాలైన నీలం ఉపాధ్యాయను ఆయన పెళ్లాడనున్నారు. ఈ పెళ్లి కోసమే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఇండియా చేరుకుంది. తాజాగా సోదరుడి పెళ్లికి హాజరైన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య నీలం ఉపాధ్యాయను ఓ డేటింగ్ యాప్‌లో కలిశాడని వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసిందని తెలిపింది. అయితే ఆ డేటింగ్లో యాప్‌లో ప్రియాంక చోప్రా పెట్టుబడి పెట్టడం మరో విశేషం. అంతేకాదు ఆమె యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.ఈ విషయంపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. "మేము యూఎస్‌కు చెందిన డేటింగ్ యాప్‌ను ఇండియాకు కూడా తీసుకొచ్చాం. నా సోదరుడు తన కాబోయే భార్యను మా యాప్ ద్వారానే కలిశాడు. అతనికి సరైన జోడీ దొరకడంతో నాకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అ తాను ఎప్పుడూ డేటింగ్ యాప్‌ను ఉపయోగించలేదని తెలిపింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కలవాలని అనుకున్నా. ఆ విధంగా నేను ఈ తరానికి చెందిన వ్యక్తిలా అనిపించకపోవచ్చు.' అని అన్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రియాంక చోప్రా..ప్రియాంక తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను ట్విటర్ ద్వారా కలుసుకుంది. ప్రియాంకకు మొదట నిక్ జోనాస్ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మనం కలవాలని కొంతమంది స్నేహితులు చెప్పారని ప్రియాంకకు సందేశం పంపించాడు. దీంతో ఒక రోజు తర్వాత ప్రియాంక స్పందించడంతో.. ఆ తర్వాత ఇద్దరూ ఆస్కార్ వేడుక తర్వాత ఓ పార్టీలో కలుసుకున్నారు. 2017లో ఇద్దరూ కలిసి మెట్ గాలాకు హాజరయ్యారు. అనంతరం 2018 ఏడాది చివర్లో ఇండియాలోనే వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
హీరోయిన్‌తో బ్రేకప్.. పెళ్లిపై స్పందించిన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రస్తుతం 'మేరే హస్బెండ్ కీ బీవీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు చూస్తే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు అర్జున్ కపూర్. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇందులో అర్జున్ కపూర్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో తన వివాహం ప్రణాళికల గురించి నోరు మాట్లాడారు.అర్జున్ కపూర్ మాట్లాడుతూ.."నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీ అందరికీ తెలియజేస్తా. ఈ రోజు, సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సినిమా గురించి మాట్లాడుకునే సమయం. నా వ్యక్తిగత జీవితం గురించి కబుర్లు చెప్పుకోవడానికి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సమయం వచ్చినప్పుడు మీ అందరితో చెప్పడానికి వెనుకాడను. ఒక వ్యక్తిగా ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు" అని అన్నారు.కాగా.. కొద్ది నెలల క్రితమే బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాతో బ్రేకప్ చేసుకున్నారు. దాదాపు కొన్నేళ్ల పాటు రిలేషన్లో వీరిద్దరు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. తాను సింగిల్‌గానే ఉన్నానని గతేడాది దీపావళి పార్టీలో అర్జున్ కపూర్ వెల్లడించాడు. ప్రస్తుతం అర్జున్ నటించిన మేరే హస్బెండ్ కీ బీవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో శక్తి కపూర్, అనితా రాజ్, డినో మోరియా, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు. -
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఆయనను గుర్తు చేసుకుని!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజీపై ర్యాంప్ వాక్ చేస్తున్న ఏడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫ్యాషన్ వేడుకను దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్‌కు నివాళిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ బల్‌ను గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. సోనమ్ కన్నీళ్లతో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఆమె మాట్లాడుతూ .. "రోహిత్ బల్ కోసం నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. అతని దుస్తులను చాలాసార్లు ధరించడం సంతోషం కలిగించింది. నా కోసం అతను చాలాసార్లు దుస్తులు డిజైన్ చేయించారు. బహుశా అతని కోసం చివరి ప్రదర్శన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వారసత్వ, హస్తకళ వేడుక ప్రతిదీ ఆనందంగా జరుపుకోవడమే. నేను అదే విధంగా దుస్తులు ధరించడం ఇష్టపడతాను.' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సోనమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.సోనమ్ తన ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. " లెజెండరీ రోహిత్ బల్కు నివాళిగా నడవడం గౌరవంగా భావిస్తున్నా. అతని కళాత్మకత, దృష్టి, వారసత్వం భారతీయ ఫ్యాషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అతని జ్ఞాపకార్థం ర్యాంప్ వాక్ చేయడం ఉద్వేగభరితంగా అనిపించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక రూపకర్తగా ఆయన ఒక ఐకాన్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. సోనమ్‌తో పాటు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ వాలయ, నటులు ఈషా గుప్తా, రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే కూడా రోహిత్ బల్కు నివాళులర్పించేందుకు ర్యాంప్ వాక్ చేశారు. View this post on Instagram A post shared by The Word. (@thewordmagazine) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
బాలీవుడ్ హీరోయిన్‌కు షాకిచ్చిన ట్విటర్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ట్విటర్ షాకిచ్చింది. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆమె ట్విటర్(ఖాతా)ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నేను చేసిన ట్వీట్స్‌లో రెండు ఫోటోలు కాపీ రైట్ ఉల్లంఘించినట్లుగా గుర్తించి నా ఖాతాను రద్దు చేశారని తెలిపింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని అని పోస్ట్ చేసింది. ఇలాంటి నిర్ణయాలు తనకు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపింది. అంతా కాకుండా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే..ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర భాస్కర్ పోస్ట్ ఈ ట్విటర్ అకౌంట్(ఎక్స్) సస్పెన్షన్‌కు ప్రధాన కారణం. ఒకటి హిందీ దేవనాగరి లిపిలో "గాంధీ హమ్ శర్మిందా హై, తేరే ఖాతిల్ జిందగీ హై" అనే నినాదం రాసిన ఫోటో కాగా.. మరొకటి తన కుమార్తె జాతీయ జెండా పట్టుకుని ఉండగా.. ఆ పిల్లాడి మొహన్ని కనిపించకుండా హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అంటూ పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్ట్‌లపై ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ స్వరభాస్కర్ అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా.. స్వర భాస్కర్ విషయానికొస్తే సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2023లో జనవరి 6న వీరి పెళ్లి జరిగింది. మొదట రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
కేఎల్ రాహుల్ సతీమణి బేబీ బంప్ ఫోటోలు.. అక్కినేని వారి కోడలు కామెంట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(Kl Rahul) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. 2023లో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిని(Athiya Shetty) కేఎల్ పెళ్లాడారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. బాలీవుడ్ భామ అతియా శెట్టి ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty) గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సన్‌ఫ్లవర్ సింబల్‌ను పోస్ట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీతారలు సైతం బ్యూటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫోటోలకు అక్కినేని కోడలు శోభిత ధూళిపాల, ఆదిరావు హైదరీ, సోనాక్షి సిన్హా, అమీ జాక్సన్ లాంటి అగ్ర సినీతారలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అతియా శెట్టి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్)కాగా.. ఈ ఏడాది జనవరి 23 తమ రెండో వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు కేఎల్ రాహుల్- అతియా జంట. 2023లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. చివరికీ పెద్దల అంగీకారంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన ముంబయిలోని తన ఫామ్‌హౌస్‌లోనే వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్‌స్టాలో స్టోరీస్ బర్త్ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్‌డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌కు ఇన్‌స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్ల బిజినెస్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు.ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. -
'మహిళల జీవితాల గురించి మీకేం తెలుసు?'.. హీరామండి హీరోయిన్ ఫైర్
బాలీవుడ్ భామ రిచా చద్దా చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్‌లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో మనీషా కొయిరాలా కీలక పాత్రలో కనిపించింది. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించడం విశేషం.అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రిచా చద్దా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, నైట్‌క్లబ్‌లకు వెళ్లే వారిని ప్రగతిశీల మహిళలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. తెరపై చూపించే స్త్రీల నిజ జీవితం గురించి మీకు తెలుసా అని చిత్రనిర్మాతలను ఆమె ప్రశ్నించారు.రిచా మాట్లాడుతూ..' 2010-2012 కాలంలో బాలీవుడ్లో మహిళలు స్మోకింగ్ చేసేవారని కొందరు చెడుగా చూపించారు. అంటే సిగరెట్ తాగి.. నైట్ క్లబ్ వెళ్లేవారని కొందరు దర్శకులు బ్యాడ్‌గా రాశారు. అంతేకాదు క్లబ్‌ల్లో డ్యాన్స్ చేసేవారి పాత్రలను చాలా చెడ్డగా చిత్రీకరించినట్లు గుర్తించా. నేను ఆ చిత్ర నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా.అసలు అలాంటి మహిళల గురించి మీకు తెలుసా?. మహిళల త్యాగం గురించి మీకేం తెలుసు. మా ఎముకల నుంచి ఒక బిడ్డను తయారు చేస్తాం. మా రక్తంతో వారికి పోషకాలు అందిస్తాం. పిల్లల కోసం మా జుట్టు, నిద్ర అన్ని దూరమవుతాయి. అంతకుమించిన త్యాగం ఉంటుందా? అంతకంటే ఎక్కువ ఎవరైనా చేయగలరా? ' అని ఆమె ప్రశ్నించారు.కాగా.. రిచా చద్దా చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: ది డైమండ్ బజార్లో కనిపించింది. ఇందులో సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, తాహా షా బాదుషా కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రిచా ఇటీవల గర్ల్స్ విల్ బి గర్ల్స్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇది ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న యువతి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
23 ఏళ్లు వయసు.. రూ 250 కోట్ల ఆస్తి.. ఎవరీ బుల్లితెర నటి?
చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిసే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువ. అయితే కొంతమంది హీరోయిన్లకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా నటీమణుల హవా కొనసాగుతుంది. సీరియల్స్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani) ఒకరు. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆస్తుల విలువ మాత్రం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా.. ఇది వాస్తవమే.షారుఖ్‌ని మించిన అభిమానం.. బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్‌కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్ల ఫాలోవర్స్‌తో షారుఖ్ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ జన్నత్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌లో షారుఖ్‌ని మించిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 23 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం గొప్ప విషయమే. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా బుల్లితెరపై నటించే అవకాశాలు వస్తున్నాయి.ఎపిసోడ్‌కి 18 లక్షలుజన్నత్ వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఆగస్ట్ 29, 2001లో ముంబైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొన్న జన్నత్.. ఒక్కో ఎపిసోడ్‌కి అత్యధికంగా రూ. 18 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుందట. అలాగే సోషల్ మీడియాలో ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఇలా ఏడాదికి 25 కోట్ల సంపాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది జన్నత్. అంతేకాదు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టిందట. మీడియా కథనాల ప్రకారం జన్నత్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. అందంలోనే కాను ఆస్తుల విషయంలోనూ ఈ బ్యూటీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. View this post on Instagram A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) -
'దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై దంగల్ నటి షాకింగ్ కామెంట్స్!
అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దంగల్ రికార్డ్ పదిలంగానే ఉంది. ఫాతిమా సనా షేక్ చివరిసారిగా ఆదిత్యరాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంతకుముందు 2023లో బాలీవుడ్ మూవీ సామ్ బహదూర్లోనూ కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని ఆరోపించింది. కష్టపడి సంపాదిస్తున్న నటులను మోసం చేసేవారని తెలిపింది. ఆడిషన్స్ పూర్తయ్యాక క్యాస్టింగ్ డైరెక్టర్ 15 శాతం కమిషన్ తీసుకున్నాకే మాకు పేమేంట్ ఇచ్చేవారని పేర్కొంది. కానీ కొందరు మాత్రం మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన కెరీర్లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.ఓ డైరెక్టర్‌తో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా? అని ఒక దర్శకుడు నన్ను అడిగారని చెప్పుకొచ్చింది. నేను కష్టపడి పని చేస్తానని.. పాత్రకు అవసరమైనది వందశాతం చేస్తానని అతనితో చెప్పాను.. కానీ అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది.అంతేకాకుండా హైదరాబాద్‌లో చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను గుర్తుచేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. మేము ఒక గదిలో ఉండగా.. కొందరు నిర్మాతలు దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారని.. మేం చెప్పినవాళ్లను మీరు కలవాలని నాతో అన్నారని పేర్కొంది. ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయేదని తెలిపింది. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా సనా షేక్ చెప్పింది. -
విడుదలకు ముందే వివాదం.. రష్మిక చిత్రాన్ని అడ్డుకుంటామంటూ వార్నింగ్!
పుష్ప భామ రష్మిక మందన్నా ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ సరసన నటించింది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఛావా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదానికి కారణమైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఛావా మూవీపై మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ఒక డ్యాన్స్ సీన్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ సీన్ తొలగించకపోతే సినిమాకు విడుదలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పే ఇలాంటి ప్రయత్నాలు అవసరమని.. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.కాగా.. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడంపై మంత్రి మండిపడ్డారు. దర్శకుడు ఆ సీన్ కట్ చేయాలని.. అంతేకాదు ఈ సినిమాను చరిత్రకారులు, మేధావులకు చూపించాలని అన్నారు. వారు ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈ సినిమా విడుదల కాదని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలు చరిత్రకారులను సంప్రదించి వివాదాస్పద కంటెంట్ ఉంటే విడుదలకు ముందే తొలగించాలని సమంత్ పిలుపునిచ్చారు. మేం సూచించిన మార్పులు చేయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మహారాజ్ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.ఆ సీన్లు తొలగిస్తాం.. డైరెక్టర్శంభాజీ మహారాజ్.. మహారాణి యేసుబాయితో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలను తొలగిస్తున్నట్లు చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెల్లడించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమేనని.. మరాఠా రాజు వారసత్వం కంటే మరేది ముఖ్యం కాదని ఉటేకర్ తెలిపారు. -
బ్లాక్ చీరలో 'అలియా భట్' స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
ప్యార్ మే పడిపోయామే...
బాలీవుడ్లో కొందరు యంగ్ హీరోలు, హీరోయిన్లు ఉల్లాసంగా,ఉత్సాహంగా ప్రేమలో పడుతున్నారు. ప్యార్ మే పడిపోయామే... అంటూ సినిమా సెట్స్‌లో లవ్ సాంగ్స్, డైలాగ్స్ చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కోసం ఈ ప్యార్ ప్రపంచంలో మునిగి తేలుతున్న ఆ జంటల గురించి తెలుసుకుందాం...ముక్కోణపు ప్రేమ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం తొలిసారి కలిసి పని చేశారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఈ సినిమా ప్రయాణంలోనే రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలోని తొలిపార్టు ‘బ్రహ్మాస్త్ర:పార్టు 1 శివ’ 2022 సెప్టెంబరులో విడుదలైంది. కానీ అంతకు ముందే... అంటే 2022 ఏప్రిల్‌లోనే రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందనున్న మూవీ ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేయనుండగా, సంజయ్ లీలా భాన్సాలీ డైరెక్షన్ చేయనున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిల మధ్య సాగే ముక్కోణపు లవ్‌స్టోరీగా ఈ మూవీ ఉంటుందని సమాచారం.ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రీ ప్రోడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టడం, హిందీ ‘రామాయణ’ మూవీతో రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ‘లవ్ అండ్ వార్’ మూవీని 2026 మార్చిలో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు.దక్షిణాది అమ్మాయి... ఉత్తరాది అబ్బాయిదక్షిణాది అమ్మాయి, ఉత్తరాది అబ్బాయి లవ్ చేసుకుంటే ఏలా ఉంటుంది? వారి కుటుంబాలను ఒప్పించడం కోసం ఈ అబ్బాయి, అమ్మాయిలు ఏ విధంగా కష్టపడ్డారు? పెళ్లి తర్వాత వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలతో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘పరమ్ సుందరి’. ఈ చిత్రో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో కనిపించే అథిరిపిల్లి వాటర్ ఫాల్స్ లోకేషన్స్లోనూ (ఇరువర్, రావన్, దిల్ సే.. వంటి సినిమాల్లో కనిపిస్తాయి) ‘పరమ్ సుందరి’ సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, దక్షిణాది అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.రెండు ప్రేమకథలుతులసీ ప్రేమ కోసం సన్నీ ఎన్నో సాహసాలు చేశాడు. ఈ సాహసాలను ఈ ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ ఖైతాన్ డైరెక్షన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ‘బవాల్ (2023)’ అనే ఓ హిందీ చిత్రంలో వరుణ్ ధావన్, జానీ ్వకపూర్ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇక ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’యే కాకుండా తన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వరుణ్ ధావన్ ఓ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో నటించనున్నారు. ఈ మూవీలోని హీరోయిన్స్‌గా మృణాళ్ ఠాకూర్, పూజా హెగ్డేల పేర్లు తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలా రెండు ప్రేమకథలతో వరుణ్ ధావన్ ఫుల్ బిజీ.ఏక్ దిన్ లవ్‌స్టోరీ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే లవ్‌స్టోరీ మూవీ చేస్తున్నారు. సునీల్‌పాండే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ‘ఏక్ దిన్’ రిలీజ్ కావొచ్చు. ఈ చిత్రంలో జునైద్ ఖాన్పోలీస్ ఆఫీసర్‌పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈపోలీస్ ఆఫీసర్‌కు ఓ రోజు ఒక అమ్మాయి పరిచయం అవు తుంది. కానీ ఆ అమ్మాయి నెక్ట్స్ డే ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోతుంది. అసలు వారిద్దరి మధ్య ఒక్క రోజులో ఏం జరిగింది? అన్నదే ‘ఏక్ దిన్’ కథాంశమని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అలాగే జునైద్ ఖాన్ హిందీలో ‘లవ్యాపా’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్ కూడా చేశారు. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా చేశారు. అద్వైత్ చందన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్, తమిళ దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’కు, హిందీ రీమేక్‌గా ‘లవ్యాపా’ రూపొందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఖుషీ కపూర్ హీరోయిన్గా చేసిన మరో లవ్‌స్టోరీ మూవీ ‘నాదానియన్’. ఇందులో ఇబ్రహాం అలీ ఖాన్ హీరోగా చేస్తున్నారు.ధడక్ సీక్వెల్లో...జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ధడక్’. ఇందులో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ఇప్పుడు ‘ధడక్’కు సీక్వెల్‌గా ‘ధడక్ 2’ రూపొందుతోంది. కానీ సీక్వెల్లో ఇషాన్, జాన్వీలు హీరోయిన్లుగా నటించడం లేదు. వీరి ప్లేస్‌లో సిద్ధాంత్ చతుర్వేది, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ నటిస్తున్నారు. షాజియా డైరెక్షన్లో జీ స్టూడియోస్, ధర్మప్రోడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే ‘దిల్ కా దర్వాజా ఖోల్నా డార్లింగ్’ అనే రొమాంటిక్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సిద్దాంత్ చతుర్వేది. వామికా గబ్బి హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో జయా బచ్చన్ ఓ లీడ్ రోల్లో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చాంద్ మేరా దిల్లక్ష్య, అనన్యాపాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాదే మొదలైందని బాలీవుడ్ సమాచారం. వివేక్ సోని దర్శకత్వంలో ఈ మూవీని కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.హీరోయిన్ ఎవరు?∙బాలీవుడ్ లవ్‌స్టోరీ ఫ్రాంచైజీలో ‘ఆషికీ’కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ‘ఆషికీ 3’ని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. అనురాగ్ బసు దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల లేదు. అయితే ‘ఆషికీ 3’ షూటింగ్ విషయంలో అన్ని సమస్యలు చక్కబడ్డాయని, ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌కు వెళ్లనుందని సమాచారం. అయితే ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ, శర్వారీ వంటి కథనాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా ‘ఆషికీ 3’ కోసం కార్తీక్ ప్రేమలో పడే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయ క తప్పదు. ⇒ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌తో హిందీలో ‘రాంఝాణా, అత్రంగి రే’ వంటి సినిమాలు చేశారు హీరో ధనుష్. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ‘తేరే ఇష్క్ మే’ అనే లవ్‌స్టోరీ మూవీ రానుంది. 2023లో ఈ సినిమాను ప్రకటించారు. కానీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ధనుష్ ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. అయితే ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని ఆనంద్ .ఎల్ రాయ్ భావిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ, త్రిప్తీ దిమ్రీ, కృతీసనన్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ధనుష్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారో చూడాలి.⇒ తెలుగు సూపర్‌హిట్ లవ్‌స్టోరీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించి, సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ‘బేబీ’ మూవీ 2023లో విడుదలై, సూపర్‌హిట్ సాధించింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని తెలుస్తోంది. తెలుగు ‘బేబీ’కి దర్శకత్వం వహించిన సాయిరాజేష్నే హిందీ ‘బేబీ’కి రీమేక్ వహించనున్నట్లుగా తెలిసింది. అయితే బేబీ సినిమా నటీనటుల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇషాన్ కట్టర్, ఆగస్త్య నంద, బాబిల్ ఖాన్ వంటి బాలీవుడ్ కుర్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరోయిన్పాత్ర కోసం ఖుషీ కపూర్, కృతీ శెట్టి వంటి తారల పేర్లు బీటౌన్‌లో వినిపిస్తున్నాయి. మరి..ఫైనల్‌గా హిందీ ‘బేబీ’లో ఎవరు యాక్ట్ నటించనున్నారో తెలియా లంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. – ముసిమి శివాంజనేయులు -
తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ 'దియా మీర్జా' ఫోటోలు
-
హీరోయిన్ వీడియో.. కావాలనే చేశారట!
సినీ తారలకు ట్రోలింగ్ మాములే. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఎలాంటి తప్పు చేయకున్నా.. ట్రోల్స్ చేస్తుంటారు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా దారుణంగా అవమానిస్తారు. తీరా అసలు విషయం తెలిశాక అయ్యో..అలా జరిగిందా అంటారు. అలాంటి ఘటన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)కు కూడా ఎదురైంది. ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. అది స్వయంగా ఊర్వశీనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. నెగెటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. ట్రోలింగ్ తట్టుకోలేక ఆ వీడియోనే డిలీట్ చేసింది. కానీ ఆమె వీడియో లీక్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. పైగా అది ఆమె ప్రైవేట్ వీడియో కాదు.. ఓ సినిమాలోని సన్నివేశం. మరి ఆ సీన్‌ని లీక్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?కావాలనే లీక్గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి నెటిజన్స్ అంతా షాకయ్యారు. ఇంత ఓపెన్‌గా బాత్రూం వీడియోను ఎలా షేర్ చేస్తారంటూ ఆమెపై మండిపడ్డారు. ఆ వీడియోను దారుణంగా ట్రోల్స్ చేయడంతో చివరకు ఊర్వశీనే అది డిలీట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వీడియో లీక్‌పై ఊర్వశీ వివరణ ఇచ్చింది. ‘అది నా ప్రైవేట్ వీడియో కాదు. ఘుస్పైథియా(Ghuspaithiya) సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్ చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆ సినిమా మేకర్స్ ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశామని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయామని బాధ పడ్డారు. బాత్రూం వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని రిక్వెస్ట్ చేశారు.అలాగే అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లు కూడా ఉంటుందని చెప్పారు. నేను ఆ ఉద్దేశంతోనే ఆ వీడియోని లీక్ చేశాను. ఇదంతా మేకర్స్ అనుమతితోనే జరిగింది. ఆ బాత్రూం సీన్ చూసి అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని అలా చేశాం. అలాగే మేకర్స్ కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారని అలా చేశాను’ అని ఊర్వశీ చెప్పుకొచ్చింది. కాగా, 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఊర్వశీతో ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి.. మంచి పనే చేశావ్లే అని ఆమెను ప్రశంసిస్తున్నారు.టాలీవుడ్లో ఫుల్ క్రేజీఊర్వశీ రౌతేలాకు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. స్పెషల్ సాంగ్స్‌కి ఫేవరేట్‌గా మారింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేసిన ఊర్వశీ..తాజాగా ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)లో బాలయ్యతో కలిసి చిందులేసింది. ‘దబిడిదిబిడి’ అంటూ సాంగే ఈ ఐటం సాంగ్స్ స్టెప్పులపై కూడా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కానీ బాలయ్యతో పాటు ఊర్వశీ కూడా ఆ ట్రోలింగ్‌ని పట్టించుకోకుండా..సక్సెస్ పార్టీలోనూ అలాంటి స్టెప్పులే వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
రామ్ చరణ్ భార్యకు ప్రియాంక చోప్రా ధన్యవాదాలు.. ఎందుకంటే?
ప్రముఖ చిలుకూరి బాలాజీ అలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. శ్రీ బాలాజీ కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. అంతే కాకుండా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. దీంతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో పని చేయనుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక చోప్రా?మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు గతంలో తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
హీరోయిన్‌తో డేటింగ్.. స్నేహితురాలితో పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అడార్ జైన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్న నాటి స్నేహితురాలు అలేఖ అద్వానీని ఆయన పెళ్లాడారు. గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు,కుటుంబ సభ్యులు సందడి చేశారు. వారం రోజు క్రితమే వీరి పెళ్లి వేడుక జరగగా.. తాజాగా నటుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. అడార్ జైన్ ప్రముఖ సీనియర్ నటుడు రాజ్ కపూర్ మనవడు. రాజ్ కపూర్ కుమార్తె రీమా కపూర్ కుమారుడు. వీరంతా బాలీవుడ్ సినీ తారలైన రణ్ బీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్లకు బంధువులే. అయితే వీళ్లెవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. కానీ గత సంవత్సరం ముంబయిలోని ఆదర్ నివాసంలో జరిగిన రోకా వేడుకలో మాత్రం పాల్గొన్నారు. రోకా వేడుకకు అలియా భట్, నీతు కపూర్ కూడా హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆదర్ జైన్- అలేఖా అద్వానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో మూడుముళ్లబంధంలోకి అడుగుపెట్టారు.తారా సుతారియాలో డేటింగ్..అంతతముందు అడార్ జైన్ కొన్నేళ్ల పాటు బాలీవుడ్ భామ తారా సుతారియాతో డేటింగ్లో ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరిద్దరు పలు ఈవెంట్లతో సందడి చేశారు. 2020లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2023లో ఈ జంట విడిపోయారు. కాగా.. 2017లో ఖైదీ బ్యాండ్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అడార్ జైన్.. చివరిసారిగా హలో చార్లీ చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Aadar Jain (@aadarjain) -
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిందితుడి అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు. పోలీసు కస్టడీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. -
'మగాడు కేవలం దానికోసమే'.. హీరోయిన్ టబు కథనాలపై స్పందించిన టీమ్!
హీరోయిన్ టబు తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు 50 ఏళ్లు దాటినా కూడా తనదైన గ్లామర్‌తో సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన భూత్ బంగ్లా చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోలేదు.తాజాగా ఆమె తన పెళ్లి గురించి మాట్లాడారని కొన్ని వార్తలొచ్చాయి. మగాడు కేవలం బెడ్ మీదకే మాత్రమే పనికొస్తాడని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సోషల్ మీడియాతో పాటు పలువురు వార్త కథనాలు రాసుకొచ్చారు. ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తుంటే.. మరికొందరు సమర్థించారంటూ ప్రచురించారు. ఈ నేపథ్యంలో టబుపై వస్తున్న వార్తలపై ఆమె టీమ్ ఘాటుగానే స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.ఖండించిన టబు టీమ్..ఇటీవల ఆన్లైన్లో వచ్చిన అసభ్యకర కథనాలను టబు టీమ్ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా అనేక వార్తా వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్లు వివాహంపై టబు తన అభిప్రాయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారని ప్రచురించాయి. ఈ కథనాలన్నీ కేవలం కల్పితమని వాటిలో ఎలాంటి నిజం లేదని టబు టీమ్ స్పష్టం చేసింది. ఆమె ఎప్పుడు ఇలా మాట్లాడలేదని.. కేవలం అభిమానులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నైతికి ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటనలో పేర్కొంది. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది టబు టీమ్.కాగా.. టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో భూత్ బంగ్లా చిత్రం కోసం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబోలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ గతంలో 'హేరా ఫేరీ', భాగమ్ భాగ్, గరం మసాలా, దే దానా దాన్, భూల్ భూలయ్యా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. అంతేకాదు దాదాపు 25 సంవత్సరాల తర్వాత అక్షయ్, టబుల కాంబో రిపీట్ కానుంది. వీరిద్దరూ చివరిసారిగా 'హేరా ఫేరి'లో కలిసి నటించారు.ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్, అ క్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 2, 2026న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. టబు చివరిసారిగా డూన్: ప్రొఫెసీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఆమె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. -
బిగ్‌బాస్ ఫినాలే ఛాన్స్ మిస్.. నమ్రతా, మహేశ్ బాబు సపోర్ట్‌పై శిల్పా రియాక్షన్
బిగ్‌బాస్ సీజన్-18 దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈనెల 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే టాప్-6 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ముఖ్యంగా ఫైనలిస్ట్‌లో కచ్చితంగా ఉంటుందని భావించిన నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన సిస్టర్ నమ్రతా, మహేశ్ బాబు గురించి మాట్లాడింది. వాళ్లు సోషల్ మీడియాలో తనకు మద్దతు ప్రకటించకపోవడంపై కూడా స్పందించింది.ఎలిమినేషన్ గురించి శిల్పా మాట్లాడుతూ..'ఈ లిటీ షోకు నేను పెద్ద అభిమానిని. మిడ్వీక్లో ఎవిక్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏ విషయంలోనూ నేను అబద్ధం చెప్పను. ఈ సీజన్లో టాప్ -3లో ఉండాలని ఆశించా. నా పేరు ప్రకటించినప్పుడు కాస్తా విచారంగా అనిపించింది. కానీ నా ఎలిమినేషన్ చాలా గౌరవంగా ఉంది. బిగ్ బాస్ నా పేరును కూడా ప్రకటించలేదు. నా లేఖను కూడా నేనే చదివా. ఈ షో అభిమానిగా హౌస్‌లో ప్రవేశించా. బిగ్ బాస్ హౌస్‌లో నా ప్రయాణంతో సంతోషంగా ఉన్నా' అని అన్నారు.అయితే శిల్పా శిరోద్కర్‌కు సోదరి నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు దంపతుల నుంచి ఆమెకు తగినంత సపోర్ట్ లభించలేదని కొందరు సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారు. ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు ఆమెకు ఓట్లు వేయాలని నమ్రతా కోరకపోవడంపై కొందరు అభిమానులు షాకయ్యారు.అయితే ఇదే విషయం శిల్పా మాట్లాడుతూ.. "ఒక కుటుంబంగా, మాకు ఒకరిపై ఒకరికి అలాంటి అంచనాలు ఉండవు. ఈ ఇంటి ద్వారా నేను అన్ని రకాల వ్యక్తులను కలిశాను. మన తెలివితేటలను బట్టే మనల్ని అంచనా వేస్తారని తెలుసుకున్నా. నమ్రతా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. అలా అని నాకు సపోర్ట్ చేయాలని నేను చెప్పను. ఇలాంటివీ మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. ఆమె నాకు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తానేంటో నాకు తెలుసు..నేనేంటో తనకు తెలుసు.' అని వెల్లడించింది. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో వివియన్ ద్సేనా, కరణ్ వీర్ మెహ్రా తనకు స్నేహితులని శిల్పా శిరోద్కర్ తెలిపింది.బిగ్‌బాస్‌లో అనుభవం గురించి మాట్లాడుతూ..' ఇక్కడ నా ఆత్మగౌరవం గురించి ప్రశ్నించారని నాకు తెలుసు. కానీ నేను ఎలాంటి అంచనాలు లేకుండా షోలోకి ప్రవేశించా. అసలు నేను ఇన్ని రోజులు హౌస్‌లోని ఉంటానునుకోలేదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారని తెలుసు. మేం చేసే ప్రతి విషయం వారికి గుర్తుంటుంది. నా కుమార్తె హౌస్‌లోకి వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడే గెలిచినంత ఆనందం వేసింది.' అని పంచుకుంది. కాగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్-18 రియాలిటీ షో ఫైనల్ జనవరి 19 ఆదివారం జరగనుంది. -
రిలీజ్‌కు సిద్ధమైన వివాదాస్పద మూవీ.. సినీ ప్రియులకు బంపరాఫర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ ఎమర్జన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ సినిమా విడుదల రోజు టికెట్లను రూ.99 లకే అందుబాటులో ఉంచనున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్టర్‌ను షేర్ చేసింది. రిలీజ్ రోజే ఈ ఆఫర్ ప్రకటించడం విశేషం. ఇటీవల సోనూ సూద్ సైతం ఫతే సినిమాకు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ విషయంలో సోనూ సూద్‌నే కంగనా రనౌత్ ఫాలో అయినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.17th jan, #emergency day 🇮🇳 pic.twitter.com/71dWpvnGGk— Kangana Ranaut (@KanganaTeam) January 16, 2025వివాదాలతో ఆలస్యం..ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు నడుస్తున్నాయి. ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ కొందరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సెన్సార్ బోర్డు చెప్పిన ఆదేశాలు పాటించడంతో ఎమర్జెన్సీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఎమర్జన్సీ వీక్షించిన నితిన్ గడ్కరీ..ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎమర్జన్సీ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ప్రత్యేక షోను ఏర్పాటు చేయగా.. కంగనా రనౌత్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ మూవీని చూశారు. -
కూతురి పేరును రివీల్ చేసిన ప్రముఖ నటి.. అర్థం అదేనట!
ప్రముఖ బాలీవుడ్ నటి మసాబా గుప్తా (Masaba Gupta) గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2024 అక్టోబర్‌లో కుమార్తెకు(daughter) స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా తన ముద్దుల కూతురి పేరును రివీల్ చేసింది. మతారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించింది మసాబా. తన చేతికి ధరించిన గాజును కూతురి పేరు కనిపించేలా డిజైనా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా ముద్దుల కూతురు మాతారకు అప్పుడే 3 నెలలు. తన పేరు 9 మంది హిందూ దేవతల స్త్రీ శక్తులను కలిగి ఉంది. తన కూతురికి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అంతేకాదు మా కళ్లకు నక్షత్రం లాంటిది." అంటూ పోస్ట్ చేసింది.2023లో పెళ్లి..కాగా.. మసాబా గుప్తా (Masaba Gupta), సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra) జనవరి 27, 2023న వివాహం చేసుకున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. అక్టోబర్ 10, 2024న కూతురికి జన్మనిచ్చింది.ఎవరీ మసాబా గుప్తా..?కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా అనే సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది.