బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పంజాబీ ముద్దుగుమ్మ సోనమ్ బజ్వా. ప్రస్తుతం ఏక్ దీవానే కి దీవానియాత్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనమ్.. బాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్‌లో తాను చాలా సినిమాలు తిరస్కరించినట్లు సోనమ్ బజ్వా తెలిపింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్, ముద్దు సన్నివేశాలకు నో చెప్పానని వెల్లడించింది. అయితే ఆ అవకాశాలు వదిలేసుకున్నందుకు తానిప్పుడు చింతిస్తున్నట్లు పేర్కొంది. తన సొంత రాష్ట్ర పంజాబ్‌లో ప్రజలు, తమ కుటుంబం ఆ సీన్స్ చూస్తే ఎలా స్పందిస్తారోనని భయపడ్డానని రివీల్ చేసింది.
సోనమ్ మాట్లాడుతూ..'బాలీవుడ్‌లో చాలా సినిమాలకు నేను నో చెప్పాను. ఎందుకంటే తన సొంత రాష్ట్రం పంజాబ్ ఇలాంటి వాటిని అంగీకరిస్తుందా భయపడ్డాను. మా కుటుంబాల మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. అందుకే అప్పట్లో సినిమాల్లో ముద్దు సన్నివేశం చేయడానికి చాలా భయపడ్డాను. నన్ను అలా చూస్తే ప్రజలు ఎలా స్పందిస్తారు? నన్ను నేనుగా మార్చిన వ్యక్తులు ఏమనుకుంటారు? ఇదంతా సినిమా కోసమేనని నా కుటుంబం అర్థం చేసుకుంటుందా?' అని నా మనసులో నేనే బాధపడ్డా' అని పంచుకుంది.
అయితే తన తల్లిదండ్రుల మద్దతు ఇచ్చారని సోనమ్ వెల్లడించింది. ఈ రెండేళ్ల క్రిత దాని గురించి మా అమ్మానాన్నలతో మాట్లాడా.. అది కేవలం సినిమా కోసం అయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అది నేను కూడా షాక్ అయ్యా.. ఈ విషయం గురించి మొదట వారితో ఎందుకు మాట్లాడలేదని బాధపడ్డా.. దీని గురించి నా తల్లిదండ్రులతో చర్చించడానికి చాలా సిగ్గుపడ్డానని తెలిపింది.
ఇక సోనమ్ కెరీర్ విషయానికొస్తే 2013లో బెస్ట్ ఆఫ్ లక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పంజాబ్ 1984 మూవీతో ఫేమ్ తెచ్చుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా నిక్కా జైల్దార్, క్యారీ ఆన్ జట్టా 2, అర్దాబ్ ముతియారన్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా బాబు బంగారం, సుశాంత్ నటించిన ఆటాడుకుందాం రా చిత్రంలో కనిపించింది. 2019లో బాలా మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత స్ట్రీట్ డాన్సర్ 3డీ, హౌస్‌ఫుల్ 5 సినిమాలు చేసింది. ప్రస్తుతం ఏక్ దీవానే కి దీవానియాత్‌తో పాటు టైగర్ ష్రాఫ్‌తో బాఘి 4లో కనిపించినుంది.


