sonam bajwa
-
డబుల్ ధమాకా
పంజాబీ నటి సోనమ్ భజ్వా బాలీవుడ్లో డబుల్ ధమాకా కొట్టారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, సంజయ్‌దత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. తరుణ్ మన్సుఖాని ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సోనమ్ భజ్వా. ఈ చిత్రంలో సోనమ్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకముందే మరో బాలీవుడ్ చిత్రం ‘బాఘీ 4’లో హీరోయిన్గా నటించే చాన్స్‌ను దక్కించుకున్నారు సోనమ్ భజ్వా.టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకత్వం వహించనుండగా, సంజయ్‌దత్ ఓ లీడ్ రోల్లో నటిస్తారు. ‘బాఘీ, హౌస్‌ఫుల్’.. ఈ రెండూ బాలీవుడ్లో హిట్ ఫ్రాంచైజీలే. అలాగే ఈ రెండు సినిమాలకు నిర్మాత సాజిద్ నడియాద్ వాలాయే కావడం విశేషం. ‘‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకుండానే, ‘బాఘీ 4’లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సోనమ్ భజ్వా. -
స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి
యంగ్ హీరోయిన్ వల్ల ఓ అభిమాని పెళ్లి ఆగిపోయింది. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఈ విషయాన్ని సదరు హీరోయినే బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి చెప్పుకొచ్చింది. గతంలో ఎయిర్‌పోర్ట్‌లో తనకెదురైన అనుభవాన్ని పూసగుచ్చినట్లు రివీల్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?)'సొంతూరికి వెళ్లేందుకు బరేలీ ఎయిర్‌పోర్ట్‌లో ఓసారి ఉన్నాను. మాస్క్ పెట్టుకున్నప్పటికీ నన్ను గుర్తుపట్టిన ఓ మహిళ నా దగ్గరకొచ్చింది. నేనా కాదా అని ధ్రువీకరించుకున్న తర్వాత.. 'నీ వల్లే నా పెళ్లి ఆగిపోయింది. కానీ అలా జరిగి మంచిదే అయిందిలే. నాకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం అయింది. కానీ నేను పెళ్లి వద్దని చెప్పేశా. ఎందుకంటే అతడు నీకు బాగా వీరాభిమాని. పూర్తిగా నీ మత్తులో మునిగిపోయాడు. అందుకే అతడికి నో చెప్పేశా' అని చెప్పి షాకిచ్చింది' అని సోనమ్ బజ్వా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అయితే ఆ మహిళ పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉందని హీరోయిన్ తెలిపింది.ఉత్తర ప్రదేశ్‌కి చెందిన సోనమ్ బజ్వా.. పంజాబీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. 'బాబు బంగారం', 'ఆటాడుకుందాం రా' మూవీస్‌లో యాక్ట్ చేసింది. ఏదేమైనా హీరోయిన్ల వల్ల పెళ్లిళ్లు జరగడం చూశాం కానీ ఇలా ఈమె మోజులో పడి పెళ్లి ఆగిపోవడం మాత్రం విచిత్రంగా అనిపించింది.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) -
ప్రేమలో పడ్డ 'ఆటాడుకుందాం రా' హీరోయిన్!
సోనమ్ బజ్వా.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. సుశాంత్ సరసన 'ఆటాడుకుందాం రా' సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత తమిళంలో కప్పాల్ అనే సినిమా చేసింది. తమిళనాట బాగా ఆడిన ఈ సినిమా తెలుగులో 'పాండవుల్లో ఒకరు' చిత్రం పేరుతో డబ్ అయింది. కానీ తన మాతృభాష పంజాబీలో వరుస సినిమాలు చేయడంతో టాలీవుడ్ మీద దృష్టి సారించలేకపోయింది. తెలుగులో అవకాశాలు వచ్చినా అవేవీ తనకు పెద్దగా నచ్చకపోవడంతో దాదాపు ఇక్కడి ఇండస్ట్రీకి దూరమైపోయింది. సోనమ్, క్రికెటర్ కేఎల్ రాహుల్‌తోనూ లవ్ ట్రాక్ నడిపిందని ఆ మధ్య పుకార్లు మొదలయ్యాయి. 2018లో సోనమ్ తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సూర్యాస్తమయాన్ని చూస్తూ నీకోసం ఆలోచిస్తున్నా అని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి కేఎల్ రాహుల్.. ఒక్క ఫోన్ కొడితే అక్కడ వాలిపోతా అని కామెంట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ బలంగా నమ్మారు. కానీ తర్వాత రాహుల్.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టికి దగ్గరవడం గమనార్హం. ఇదిలావుంటే తాజాగా సోనమ్ బజ్వా ప్రేమలో పడిందట. తను మనసు పారేసుకున్న వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవాడు కాదట. అతడు కూడా ముంబైలో ఉంటున్నాడని, కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి. చదవండి: భార్య అకౌంట్ నుంచి రూ.కోటి విత్ డ్రా.. టీవీ నటుడిపై కేసు -
అఖిల్ ఆట..
‘మనం’లో తళుక్కున మెరిశాడు అఖిల్. మళ్లీ అత్తకొడుకు సుశాంత్ కోసం అతిథిగా సందడి చేయడానికి రెడీ అయ్యాడు. సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. ఇందులో అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ అతిథులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ ఏడెకరాలలో ప్రత్యేకంగా వేసిన సెట్లో హీరో హీరోయిన్లతో పాటు అఖిల్ పాల్గొనగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. రెండు రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్, సుశాంత్ మంచి డ్యాన్సర్స్. ఇద్దరూ కలసి ఏ రేంజ్లో స్టెప్పులు ఇరగదీశారో ఈ నెల 19న విడుదలవు తున్న సినిమా చూస్తే తెలుస్తుంది. -
వెంకీ ఐటెం గాళ్ ఎవరో తెలుసా?
హైదరాబాద్: మారుతి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బంగారం' సినిమాలో ఓ ముద్దుగుమ్మ ఐటెమ్ సాంగ్ చేయనుందట. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో సోనమ్ బాజ్వా , వెంకీ బాబుతో కలిసి స్టెప్స్ వేయనుంది. జిబ్రాన్ సంగీతంలో ఈ పాట చాలా సూపర్బ్ గా వచ్చిందని చిత్ర సన్నిహిత వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి. కాగా సుశాంత్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఆటాడుకుందాం రా' చిత్రంలో సోనమ్ బజ్వా హీరోయిన్ గా నటించింది. ఇపుడు ఈ అమ్మడు వెంకీకి ఐటెమ్ గాళ్ గా సరికొత్త అవతారంలో మెరవనుంది. కాగా యూత్‌కి కనెక్ట్ అయితే చాలు అని భావిస్తున్న మారుతి అందుకు తగ్గట్టుగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో 'బాబు బంగారం' సినిమాను పక్కాగా రెడీ చేస్తున్నాడు. అటు చాలా రోజుల తరువాత ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్లో , కామెడీ పోలీస్ అధికారిగా నటిస్తున్న వెంకటేష్, ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మంచి ఫాంలో డైరెక్టర్ మారుతిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్ కి జోడీగా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, ఫిష్ వెంకట్ వంటి కమెడియన్స్ కూడా ఉన్నారు. ఈ సినిమాకి సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న బాబు బంగారం జూన్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
'పాండవుల్లో ఒకడు' ఆడియో
-
'పాండవుల్లో ఒకడు' స్టిల్స్
-
ఇళయ దళపతికి గాలం
ఇళయ దళపతి విజయ్‌కి గాలం వేసే పనిలో పడింది కప్పల్ కథానాయికి సోనం బాజ్వా. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో రాణించాలని ఆకాంక్షించే ఉత్తరాది బ్యూటీస్ జాబితాలో చేరిందీ భామ. ఆమె మాట్లాడుతూ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానంది. అలా సినీ అవకాశాలు వరించినట్లు చెప్పింది. పంజాబిలో బెస్ట్ ఆఫ్ లక్, పంజాబ్ 1984 చిత్రంలో నాయికగా నటించానని పేర్కొంది. తర్వాత తమిళంలో కప్పల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిం దని తెలిపింది. ఈ చిత్రంలో చాలా ఎంజాయ్ చేస్తూ నటించానని వెల్లడించింది. చిత్ర యూనిట్ సహకారం మరువలేనిదంది. కప్పల్ చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చిందని, ఇక్కడ తొలి చిత్రమే విజయం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. కోలీవుడ్‌లో విజయ్ సరసన నటించడానికి ఆశగా ఎదురుచూస్తున్నానని అసలు విషయం చెప్పింది. కప్పల్ చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని, వాటి వివరాలు త్వరలోనే చెబుతానని తెలిపింది. -
చెంప ఛెళ్లుమనిపించింది
‘‘సోనం బాజ్వా పలుసార్లు నా చెంప పగులగొట్టింది. అయినా ఓర్చుకున్నాను’’ అంటున్నారు యువ నటుడు వైభవ్. ఈయన ప్రముఖ తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు. అయితే తెలుగు కంటే తమిళ చిత్ర పరిశ్రమే వైభవ్‌ను ఎక్కువగా ఆదరిస్తోంది. సరోజ చిత్రంతో కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన ఈయన ఆ తరువాత మంగాత్త తది తర చిత్రాల్లో నటించారు. ఆ మధ్య విడుదలైన ద్విభాష చిత్రం అనామిక నయనతారతో కలసి నటించారు. తాజాగా వైభవ్ హీరోగా నటించిన కప్పల్ చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. శంకర్ శిష్యు డు కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనం బాజ్వా హీరోయిన్గా నటించారు. ఇందులో తన అనుభవాల గురించి వైభవ్ తెలుపుతూ సాధారణం గా పరిచయాలు స్నేహంగా మారడం, అది ప్రేమకు దారితీయడం సహజమన్నారు. అలాంటి స్నేహం ప్రేమకు శత్రువుగా మారి ఎలాంటి సమస్యలను సృష్టించిందన్నదే కప్పల్ చిత్రం అని తెలిపారు. ప్రేమకు, స్నేహానికి మధ్య చిక్కి సతమతమయ్యే పాత్రలో నేను నటించానని చెప్పారు. నా స్నేహితులైన కరుణ, అర్జునన్, వెంకట్, కార్తీక్ తన ప్రేమకు ఎలా శత్రువులుగా మారారన్న విషయాలను దర్శకుడు ఆద్యంతం ఆసక్తిగా హాస్యభరితంగా తెరకెక్కించారని తెలిపారు. ఒక సన్నివేశంలో హీరోయిన్ సోనం బాజ్వా తన చెంప మీద కొట్టాల్సి వుంటుందన్నారు. ఆ సన్నివేశాన్ని పలు టేక్‌లు తీసుకవోడంతో సోనం బాజ్వా తన చెంప చెళ్లుమనిపించిందని చెప్పారు. మంగాత్త చిత్రంలోనూ ఇలాంటి సంఘటనే జరిగిందని ఆ చిత్రం విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ ఈ కప్పల్కు పనిచేస్తుందని భావిస్తున్నానన్నారు. సినిమా రంగంలోకి ప్రవేశించినపుప్డే శంకర్ దర్శకత్వంలో నటించాలని కోరుకున్నానన్నారు. అలాంటిది ఆయన విడుదల చేస్తున్న ఈ కప్పల్ చిత్రంలో తాను హీరో అవడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు విడుదల చేస్తున్నారనగానే కప్పల్ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయని అలాంటి అంచనాలను ఈ చిత్రం పూర్తి చేస్తుందని వైభవ్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.