స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి | Sonam Bajwa Reason For Broken Engagement Of Fan, Actress Revealed Shocking Reason | Sakshi
Sakshi News home page

Sonam Bajwa: షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టిన హీరోయిన్

Published Wed, Jun 12 2024 11:43 AM | Last Updated on Wed, Jun 12 2024 12:55 PM

Sonam Bajwa Reason For Broken Engagement Of Fan

యంగ్ హీరోయిన్ వల్ల ఓ అభిమాని పెళ్లి ఆగిపోయింది. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఈ విషయాన్ని సదరు హీరోయినే బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి చెప్పుకొచ్చింది. గతంలో ఎయిర్‌పోర్ట్‌లో తనకెదురైన అనుభవాన్ని పూసగుచ్చినట్లు రివీల్ చేసింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?)

'సొంతూరికి వెళ్లేందుకు బరేలీ ఎయిర్‍‌పోర్ట్‌లో ఓసారి ఉన్నాను. మాస్క్ పెట్టుకున్నప్పటికీ నన్ను గుర్తుపట్టిన ఓ మహిళ నా దగ్గరకొచ్చింది. నేనా కాదా అని ధ్రువీకరించుకున్న తర్వాత.. 'నీ వల్లే నా పెళ్లి ఆగిపోయింది. కానీ అలా జరిగి మంచిదే అయిందిలే. నాకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం అయింది. కానీ నేను పెళ్లి వద్దని చెప్పేశా. ఎందుకంటే అతడు నీకు బాగా వీరాభిమాని. పూర్తిగా నీ మత్తులో మునిగిపోయాడు. అందుకే అతడికి నో చెప్పేశా' అని చెప్పి షాకిచ్చింది' అని సోనమ్ బజ్వా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అయితే ఆ మహిళ పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉందని హీరోయిన్ తెలిపింది.

ఉత్తర ప్రదేశ్‌కి చెందిన సోనమ్ బజ్వా.. పంజాబీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. 'బాబు బంగారం', 'ఆటాడుకుందాం రా' మూవీస్‌లో యాక్ట్ చేసింది. ఏదేమైనా హీరోయిన్ల వల్ల పెళ్లిళ్లు జరగడం చూశాం కానీ ఇలా ఈమె మోజులో పడి పెళ్లి ఆగిపోవడం మాత్రం విచిత్రంగా అనిపించింది.

(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement