Tollywood
-
పరువు నష్టం కేసు.. మంత్రిపై క్రిమినల్ చర్యలకు డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌ను నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ముందు చదువు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో కుంగిపోయారని న్యాయమూర్తికి విన్నవించారు.కొండాసురేఖ లాయర్ వేసిన కౌంటర్‌పై నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.ట్విటర్లో క్షమాపణలు..అయితే తన కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ను కూడా కోర్టు ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన కామెంట్స్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే మంత్రి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. 'నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ.. మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అన్యద భావించవద్దు' అంటూ కొండా సురేఖ ట్విట్ చేసింది. -
గ్లామర్ డోస్ పెంచిన..కాంతార బ్యూటీ సప్తమిగౌడ లేటెస్ట్ ఫొటోస్
-
'సారంగపాణి జాతకం'లో ఫుల్ కామెడీ (టీజర్)
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా నవ్వులు పూయించేలా టీజర్ ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ తెరకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. -
అనకాపల్లిలో రాంగోపాల్ వర్మపై మరో కేసు
-
చిరంజీవి, షారూఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెబుతూ నయనతార లేఖ
'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా తన అభిమానులను పలకరించింది. అయితే, ఈ డాక్యుమెంటరీ చిత్రకరణలో తనకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు మూడు పేజీల లేఖను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు సాయం చేసిన తెలుగు,తమిళ్,మలయాళ,హిందీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో పాటు నిర్మాణ సంస్థల పేర్లను తెలుపుతూ లేఖ రాశారు.నయనతార సౌత్ ఇండియా చిత్రసీమలో అగ్రనటి. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2022లో మామల్లపురంలో జరిగింది. ఈ సందర్భంలో నటి నయనతార వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహాన్ని కవర్ చేస్తూ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో ఆమె ఇంటర్వ్యూ, షూట్లో పాల్గొన్న దృశ్యాలు, ఆమె మేకప్‌తో సహా అనేక సన్నివేశాలు ఉన్నాయి.తన డాక్యుమెంటరీ నిర్మాణం కోసం నో హోల్డ్-బార్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నయన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇప్పటి వరకు నేను చాలా సినిమాల్లో నటించాను. అవన్నీ నాకు ప్రత్యేకమే, నా కెరీర్లో చాలా ముఖ్యమైన భాగం అయ్యాయి. ఇందులో చాలా సంతోషకరమైన క్షణాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాల జ్ఞాపకాలను నా డాక్యుమెంటరీలో పొందుపరచాలని అనుకున్నాను. అందుకోసం ఆయా చిత్రాల నిర్మాతలను సంప్రదించినప్పుడు వారు వెంటనే ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి అభ్యంతరం చేయకుండా నాకు అన్హిండెర్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. వారందరినీ ఎప్పటికీ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను.' అని తెలిపింది.నయనతారకు సహకరించిన నిర్మాణ సంస్థల పేర్లతో పాటు నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ఒక లిస్ట్ విడుదల చేసింది. బాలీవుడ్లో నటుడు షారూఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్ ఉంటే టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
#EsterNoronha : చీరకట్టులో హాట్ ఫోజులతో ఎస్తర్ నోరాన్హా.. (ఫొటోలు)
-
IFFI : ఘనంగా గోవా సినిమా పండుగ ప్రారంభం.. సందడి చేసిన నాగ్, ఇతరులు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధానం అమలవుతుంది: దిల్ రాజు
సినిమా రివ్యూల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌పై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ ఇండస్ట్రీలో వారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దానిని అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయా పడ్డారు.సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల వద్దకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, రివ్యూలు ఇచ్చేవారిని అనుమతించకూడదని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి రివ్యూస్ వల్ల ఇండస్ట్రీ చాలా ఎక్కువగానే నష్టపోతుందని వారు తెలిపారు. దీనిని అరికట్టాలంటే థియేటర్ యజమానులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. థియేటర్ ముందు రివ్యూస్ చెప్పేవారిని లోపలికి అనుమతించకూడదని నిర్ణయించారు.దిల్ రాజు నిర్మించిన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల తేదీని ప్రకటించే కార్యక్రమంలో ఇదే విషయం గురించి ఆయన మాట్లాడారు. 'కోలీవుడ్‌లో వారు తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలా అమలయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయంలో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేము. ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఇక్కడి ఎగ్జిబిటర్లు అలాంటి రివ్యూలను అరికట్టాలని సిద్ధంగా ఉన్నారట' అని దిల్ రాజు పేర్కొన్నారు. -
విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
20 ఏళ్ల తర్వాత సూర్యతో మరోసారి ఛాన్స్ కొట్టేసిన గోల్డెన్ బ్యూటీ
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ భాగం కానుంది. ఈమేరకు నెట్టింట వార్తలు భారీగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిదే. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రానున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష మళ్లీ కనిపించనున్నారు.కోలీవుడ్‌లో త్రిష,సూర్య ఇద్దరూ కలిసి 3 చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాధే (2002),యువ (2004),ఆరు (2005) వంటి చిత్రాల్లో వారు కలిసి నటించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి త్రిష స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సూర్యతో కలిసి నటించేందుకు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ రావడంతో ఆమె ఓకే చెప్పేశారట. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటికే ఆమె డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. త్రిష ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సూర్య 45' అనే వర్కింగ్ టైటిల్‌ను ప్రస్తుతానికి ప్రకటించారు. కంగువా సినిమా భారీ డిజాస్టర్ కావడంతో దర్శకుడు ఆర్జే బాలాజీపై తీవ్రమైన ఒత్తడి పెరగనుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. -
నటి కస్తూరికి బెయిల్
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయిన సినీ నటికస్తూరికి ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ పరిస్థితులలో తనకు బెయిల్మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో నిబంధనలతో కూడిన బెయిల్‌ను ఆమెకు మంజూరు చేస్తూ న్యాయమూర్తి దయాళన్ ఆదేశించారు.ఈ కారణం వల్లే అరెస్ట్నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి కామెంట్ చేయడంతో వివాదస్పదం అయింది. ఈ క్రమంలో డిఎంకే పార్టీ నేతలపై కూడా ఆమె ఫైర్ అయింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
హీరోయిన్ భానుప్రియను పెళ్లాడాలనుకున్నారా? డైరెక్టర్ ఆన్సరిదే!
సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడరు, గోపి గోపిక గోదావరి,అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి ఎన్నో విభిన్న సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించాడు డైరెక్టర్ వంశీ. హీరోయిన్ భానుప్రియను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే! చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.నా సినిమాతోనే భానుప్రియకు అలాంటి ఆఫర్లుభానుప్రియ తన కెరీర్ ఆరంభంలో ఏ సినిమా చేస్తే బాగుంటుందని నన్ను అడిగేది. సితార మూవీ తర్వాత తను బిజీ అయింది. అయితే తనకు మోడ్రన్ లుక్‌లో కనిపించే పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందేది. దీంతో నేను అన్వేషణ మూవీలో తనను గ్లామరస్‌గా చూపించాను. ఆ సినిమా బాగా ఆడింది. అప్పటినుంచి తనకు గ్లామర్ పాత్రలు వచ్చాయని తనే చెప్పింది. 35 ఏళ్లుగా చూడలేదుతనను కలిసి దాదాపు 35 ఏళ్లు అయ్యాయి అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో వంశీ.. భానుప్రియను పెళ్లి చేసుకోవాలని ఆశపడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా అందుకు వంశీ స్పందించలేదు. అది ఎప్పుడో గతానికి సంబంధించినది.. అదంతా పాత కథ. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నా భార్య కూడా చనిపోయింది. నా పెద్ద కూతురు చెన్నైలో, చిన్న కూతురు నా దగ్గరే ఉంటుందని తెలిపాడు.చదవండి: పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్ -
సంక్రాంతి బరిలో వెంకీమామ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంటకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నా.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ENTERTAINMENT LOADED 😎FUN READY TO FIRE 🔥The Blockbuster combo of Victory @VenkyMama and Hit Machine Director @AnilRavipudi is all set for a VICTORIOUS HATTRICK this Sankranthi 💥💥💥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/m0isUz0FdA— Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2024 -
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్‌తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్‌గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్‌కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. RAPO22 పేరుతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరో రామ్‌కు 22వ సినిమా ఇది.రామ్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. అయితే, రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది.'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు. -
చైనాలో 'మహారాజ' విడుదల.. ఇదే జరిగితే రూ. 500 కోట్లు..!
విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా 'మహారాజ' ఇప్పుడు చైనాలో విడుదల కానుంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో రిలీజ్‌కు రెడీ అయింది.ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ చిత్రం.. ఇప్పుడు చైనాలో ఏకంగా 40వేల స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. నవంబర్ 29న యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. ఈ మూవీలోని సెంట్మెంట్కు చైనా సినీ అభిమానులు కనెక్ట్ అయితే భారీగా కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కనీసం అక్కడ రెండు వారాలపాటు థియేటర్లో సినిమా రన్ అయితే సుమారు రూ. 500 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మహారాజా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మంచి ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్ సామినాథన్ అద్భుతంగా ప్రేక్షకులకు చూపించాడు. ఒక ఇండియన్ సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానున్నడంతో అభిమానులు హర్షిస్తున్నారు. ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ ఈ రికార్డ్ దక్కలేదు. -
రవితేజ వారసుడి మూవీ.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న మూవీ "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి వస్సాహి వస్సాహి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. యాక్టర్ శివాజీ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదని శివాజీ అన్నారు. హీరో మాధవ్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.కాగా.. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర పాడారు. 'సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా...వస్సాహి వస్సాహి' అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్. ఈ చిత్రంలో జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్, హిమజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు!
ది లయన్ కింగ్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. అయితే సూపర్ హిట్ అయిన చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024 -
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఏఆర్ రెహమాన్ విడాకులకు కారణం తెలిపిన అడ్వకేట్.. పిల్లల కామెంట్స్
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయారు. వారిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. 1995లో వారు పెళ్లి చేసుకున్నారు. సుమారు 29 ఏళ్లు కలిసి జీవించిన వారు ఇలా విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయంపై వారి పిల్లలు కూడా సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.ఎందుకు విడిపోయారంటే..ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోవడానికి ఉన్న కారణాలను వారి అడ్వకేట్ వందనా షా ఇలా చెప్పారు. 'భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగానే వారు విడిపోయారు. దంపతుల మధ్య సంబంధాల సమస్యలే ఈ నిర్ణయానికి దారితీశాయి. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట తమ మధ్య వచ్చే చిన్నచిన్న విభేదాలు, పోరాటాల విషయంలో పరిష్కరించుకోలేకపోయారు. అవి వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయ. శ్రీమతి సైరా చాలా బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ గోప్యతను, గౌరవాన్ని ప్రజలు కాపాడాలని వారిద్దరూ కోరారు.' అని న్యాయవాది తెలిపారు.విడాకులపై పిల్లల కామెంట్స్29 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ జంట తమ వివాహ బంధాన్ని ముగించుకున్నారని తెలుసుకున్న అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రెహమాన్, సైరా ఇద్దరూ కలిసే బాలీవుడ్ పార్టీలు, అవార్డులు, సెలబ్రిటీల వివాహాలకు హాజరవుతారు. ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో వారు చివరిసారిగా కలిసి కనిపించారు.విడాకుల విషయంపై వారి పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ స్పందిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. 'మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో మీరందరూ గోప్యత పాటించి గౌరవంగా వ్యవహరించారు. అందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు' అంటూ రహీమా పోస్ట్ చేయగా..ఖతీజా ఇలా తెలిపింది. ' ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరినీ వేడుకుంటున్నాం. మా బాధను అర్థం చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది. -
‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓ తల్లి ప్రతీకారం
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అటు హీరోయిన్గా ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు తాప్సీ. తాజాగా ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘గాంధారి’. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లోపాల్గొన్నారట తాప్సీ. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.కిడ్నాప్ అయిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసేపోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వెండితెరపై తాప్సీ తల్లిపాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇదే. త్వరలో ‘గాంధారి’ సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది యూనిట్. ఇదిలా ఉంటే... తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్ కథ అందించిన ‘హసీన దిల్రుబా’, ఫిర్ ఆయీ హసీన దిల్ రుబా’లకు మంచి స్పందన లభించింది. దీంతో వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. -
మీకు తెలిసినోడి కథ
‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష ఇతర కీలకపాత్రలుపోషించారు. ‘బచ్చలమల్లి’ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇది మీ కథ... లేకపోతే మీకు తెలిసినోడి కథ’ అని ఈ సినిమాను ఉద్దేశించి, ‘ఎక్స్’లో పేర్కొన్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎమ్. నాథన్. -
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్లో వివరించారు.కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు.మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' ట్రైలర్ విడుదల
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కూడా.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ ఇందులో కనిపించనున్నాడు. అయితే, ఆ సందను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. ఎక్కువ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది.